Warm up match
-
ఛాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy-2025) వార్మప్ మ్యాచ్‌ల (Warm Up Matches) షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) ఇవాళ (ఫిబ్రవరి 13) ప్రకటించింది. ఫిబ్రవరి 14 నుంచి 17 తేదీల మధ్యలో ఈ వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మాత్రమే ఈ వార్మప్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. బిజీ షెడ్యూల్ దృష్ట్యా భారత్ వార్మప్ మ్యాచ్‌లు ఆడటం లేదు. ఈ వార్మప్ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్ మూడు టీమ్‌లను ప్రకటించింది. ఫిబ్రవరి 14న జరిగే మ్యాచ్‌లో షాదాబ్ ఖాన్ నేతృత్వంలోనే పాకిస్తాన్ షహీన్స్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగనుంది. ఫిబ్రవరి 16న జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఫిబ్రవరి 17న కరాచీలో జరిగే మ్యాచ్‌లో ముహమ్మద్ హురైరా నేతృత్వంలోని పాకిస్తాన్ షాహీన్స్ సౌతాఫ్రికాతో తలపడుతుంది. అదే రోజు దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో మొహమ్మద్ హరీస్ సారథ్యంలోని పాకిస్తాన్ షాహీన్స్ న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటుంది. ఈ నాలుగు వార్మప్ మ్యాచ్‌లు డే అండ్ నైట్ ఫార్మాట్లో జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ అసలు మ్యాచ్‌లు ఫిబ్రవరి 19న మొదలవుతాయి. ఈ మెగా టోర్నీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా జరుగనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. భారత్‌ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి.వార్మప్ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్ షాహీన్స్ జట్లు:v ఆఫ్ఘనిస్తాన్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ - షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్ ఫసీ, అరాఫత్ మిన్హాస్, హుస్సేన్ తలత్, జహందాద్ ఖాన్, కాషిఫ్ అలీ, మొహ్సిన్ రియాజ్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్ ఖాన్, ముహమ్మద్ అఖ్లక్, ముహమ్మద్ ఇమ్రాన్ రంధవా, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్v దక్షిణాఫ్రికా, నేషనల్ స్టేడియం, కరాచీ - మొహమ్మద్ హురైరా (కెప్టెన్), అమద్ బట్, ఫైసల్ అక్రమ్, హసన్ నవాజ్, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షెహజాద్, మాజ్ సదాకత్, మెహ్రాన్ ముంతాజ్, ముహమ్మద్ ఘాజీ ఘోరీ, నియాజ్ ఖాన్, ఖాసిం అక్రమ్, సాద్ ఖాన్v బంగ్లాదేశ్, ICC అకాడమీ, దుబాయ్ - మొహమ్మద్ హారిస్ (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్ సమద్, అలీ రజా, అజాన్ అవైస్, మహ్మద్ వసీమ్ జూనియర్, ముబాసిర్ ఖాన్, మూసా ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సుఫియాన్ మొకిమ్, ఉసామా మీర్. -
‘సాధన’ సరిపోయింది.. వామప్ మ్యాచ్‌లో భారత్ విజయం
న్యూయార్క్: బ్యాటింగ్‌లో రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా తమదైన శైలిలో దూకుడుగా ఆడారు...సూర్యకుమార్, రోహిత్ శర్మ కూడా కీలక పరుగులు సాధించారు. దూబే, సామ్సన్ మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు...బౌలింగ్‌లో కూడా ప్రధాన బౌలర్లంతా బరిలోకి దిగి ఆకట్టుకున్నారు...ఓవరాల్‌గా టి20 వరల్డ్ కప్‌లో ప్రధాన టోర్నీకి ముందు ఏకైక వామప్ మ్యాచ్‌లో భారత జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. దీని ద్వారా టీమ్ తుది జట్టుపై ఒక అంచనా కూడా వచ్చింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఆడలేదు. యశస్వికి మ్యాచ్ ఇవ్వకపోవడాన్ని బట్టి చూస్తే ప్రధాన జట్టులో అతను ఉండే అవకాశాలు దాదాపుగా లేకపోవడంతో పాటు రోహిత్, కోహ్లి ఓపెనర్లుగా బరిలోకి దిగవచ్చు. ఇక్కడ విఫలమైనా...టాపార్డర్‌లో సామ్సన్ పేరును టీమ్ మేనేజ్మెంట్ పరిశీలిస్తుండగా, దూబే బౌలింగ్ చేయడాన్ని బట్టి చూస్తే ఆల్‌రౌండర్‌గా జట్టుకు మంచి ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్నట్లే. మరో వైపు కొత్తగా నిర్మించిన నాసా కౌంటీ క్రికెట్ గ్రౌండ్ మాత్రం వరల్డ్ కప్ స్థాయికి తగినట్లుగా కనిపించలేదు. అవుట్‌ఫీల్డ్ బంతి పడ్డ ప్రతి చోటా దుమ్ము రేగడం చూస్తే ఈ స్టేడియంను సిద్ధం చేయడంలో ఐసీసీ తొందరపడినట్లు అనిపించింది. ఇదే వేదికపై భారత్ లీగ్ దశలో తమ తొలి మూడు మ్యాచ్‌లు ఆడనుంది. మ్యాచ్ ఫలితంతో సంతృప్తి చెందినట్లు, తాము అనుకున్న రీతిలో ప్రాక్టీస్ లభించినట్లు విజయం అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. శనివారం జరిగిన వామప్ పోరులో భారత్ 62 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (32 బంతుల్లో 53 రిటైర్డ్ అవుట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు.సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించగా, రోహిత్ శర్మ (19 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... శివమ్ దూబే (14), సంజు సామ్సన్ (1) విఫలమయ్యారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసింది. మహ్మదుల్లా (28 బంతుల్లో 40 రిటైర్డ్ అవుట్; 4 ఫోర్లు, 1 సిక్స్), షకీబ్ అల్ హసన్ (34 బంతుల్లో 28; 2 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్‡్షదీప్ సింగ్, శివమ్ దూబే చెరో 2 వికెట్లు పడగొట్టగా...అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు. -
Ind vs Ban: దుమ్ములేపిన పంత్.. దంచికొట్టిన హార్దిక్ పాండ్యా
టీమిండియా తరఫున ‘రీ ఎంట్రీ’లో రిషభ్ పంత్ దుమ్ములేపాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత బ్లూ జెర్సీ ధరించిన పంత్ పొట్టి ఫార్మాట్లో దుమ్ములేపాడు. టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 32 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 53 పరుగులు సాధించాడు. అర్ధ శతకంతో మెరిసి రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు.కాగా న్యూయార్క్ వేదికగా నసావూ కౌంటీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సంజూ శాంసన్ ఓపెనింగ్ చేశాడు.రోహిత్ 19 బంతుల్లో 23 పరుగులు చేసి నిష్క్రమించగా.. సంజూ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రిషభ్ పంత్ 53 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్లలో సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 31 పరుగులతో ఆకట్టుకున్నాడు.ఇక శివం దూబే మాత్రం 16 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులే చేసి నిరాశపరిచాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా మాత్రం 23 బంతుల్లో 40 పరుగులతో దుమ్ములేపాడు. రవీంద్ర జడేజా(4)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 20 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం, మెహదీ హసన్, మహ్మదుల్లా, తన్వీర్ ఇస్లాం ఒక్కో వికెట్ పడగొట్టారు. -
T20 WC: బంగ్లాతో మ్యాచ్.. కోహ్లి లేకుండానే! ఓపెనర్‌గా సంజూ విఫలం
టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య శనివారం నాటి వార్మప్ మ్యాచ్‌కు న్యూయార్క్ వేదికైంది. నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.విరాట్ కోహ్లి మినహా మిగిలిన పద్నాలుగు మంది ఆటగాళ్లు బంగ్లాతో వార్మప్ మ్యాచ్‌లో భాగమయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించాడు.అయితే, రెండో ఓవర్లోనే అవుటై పూర్తిగా నిరాశపరిచాడు. బంగ్లాదేశ్ పేసర్ షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న సంజూ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిష్క్రమించాడు.ఇక వన్‌డౌన్‌లో రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 33 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ 19, పంత్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.మరోవైపు బంగ్లాదేశ్ జట్టు పదమూడు మంది ఆటగాళ్లతో బరిలోకి దిగింది. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్‌కు విశ్రాంతినిచ్చినట్లు కెప్టెన్ నజ్ముల్ షాంటో వెల్లడించాడు.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్( వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్.బంగ్లాదేశ్: లిటన్ దాస్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హ్రిదోయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జకర్ అలీ(వికెట్ కీపర్), మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిద్ హసన్, తన్జీమ్ హసన్ సకీబ్, తన్వీర్ ఇస్లాం. -
Ind vs Ban: ఇలాంటి పిచ్‌లకు అలవాటు పడాలి: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచకప్-2024 ఫీవర్ తారస్థాయికి చేరింది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 1(యూఎస్ కాలమానం ప్రకారం)న మొదలుకానుంది. ఆతిథ్య అమెరికా- కెనడా మధ్య డలాస్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది.కాగా వరల్డ్‌కప్ లీగ్ దశలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ అంతర్జాతీయ స్టేడియం ఇందుకు వేదిక.అయితే, అంతకంటే ముందు ఇక్కడ రోహిత్ సేన బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘గతంలో ఎప్పుడూ ఇక్కడ ఆడలేదు కాబట్టి ముందుగా మేం పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.జూన్ 5న ఇక్కడ తొలి మ్యాచ్ ఆడే సమయానికి ఏదీ కొత్తగా అనిపించకుండా ఉండటం ముఖ్యం. డ్రాప్ ఇన్ పిచ్‌కు అలవాటు పడటం కూడా కీలకం. ఒక్కసారి లయ అందుకుంటే అంతా సజావుగా సాగిపోతుంది. కొత్త వేదిక చాలా బాగుంది. మైదానమంతా ఓపెన్‌గా ఉండటంతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.న్యూయార్క్ వాసులు ఇక్కడ తొలిసారి జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అభిమానుల తరహాలోనే మేం కూడా మ్యాచ్‌ల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. టోర్నీ బాగా జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.ఇక అసలైన పోరు మొదలుకావడానికి ముందు టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్ కోసం కూడా అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఇవీ:టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్సమయం: భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఎనిమిది గంటలకు ఆరంభంవేదిక: నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం, న్యూయార్క్ప్రత్యక్ష ప్రసారం: టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్‌ను వీక్షించవచ్చు. ఇక డిజిటల్ మీడియాలో డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంటుంది.జట్లుటీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్( వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్.బంగ్లాదేశ్: లిటన్ దాస్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హ్రిదోయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జకర్ అలీ(వికెట్ కీపర్), మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిద్ హసన్, తన్జీమ్ హసన్ సకీబ్, తన్వీర్ ఇస్లాం.చదవండి: T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలుT20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. పూర్తి వివరాలుT20 WC 2024: ఇరవై జట్లు.. ఆటగాళ్ల లిస్టు📍 New YorkBright weather ☀️, good vibes 🤗 and some foot volley ⚽️Soham Desai, Strength & Conditioning Coach gives a glimpse of #TeamIndia's light running session 👌👌#T20WorldCup pic.twitter.com/QXWldwL3qu— BCCI (@BCCI) May 29, 2024 -
పసికూనలపై ప్రతాపం.. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ సునాయాస విజయాలు
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో పెద్ద జట్లు పసికూనలపై ప్రతాపం చూపుతున్నాయి. శ్రీలంకపై నెదర్లాండ్స్ విజయం మినహా ఇప్పటివరకు జరిగిన అన్ని వార్మప్ మ్యాచ్‌ల్లో పెద్ద జట్లే విజయం సాధించాయి. తాజాగా జరిగిన మ్యాచ్‌ల్లోనూ ఇదే తంతు కొనసాగింది. ఫ్లోరిడా, ట్రినిడాడ్ వేదికలుగా నిన్న జరిగిన మ్యాచ్‌ల్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తమకంటే చిన్న జట్లైన ఐర్లాండ్, స్కాట్లాండ్లపై విజయాలు సాధించాయి.ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 41 పరుగుల తేడాతో గెలుపొందగా.. స్కాట్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.శ్రీలంక-ఐర్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్లు నమోదు కానప్పటికీ.. ప్రతి ఒక్క ఆటగాడు తలో చేయి వేశారు. ఏంజెలో మాథ్యూస్ (32 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. లంక బౌలర్ల ధాటికి 18.2 ఓవర్లలో 122 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. దసున్ షనక (3.2-0-23-4) ఐర్లాండ్ పతనాన్ని శాశించాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో కర్టిస్ క్యాంఫర్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఆఫ్ఘనిస్తాన్-స్కాట్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. గుల్బదిన్ నైబ్ (69), అజ్మతుల్లా (48) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రిస్టఫర్ సోల్ (4-0-35-3), బ్రైడన్ కార్స్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు.179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్.. ఆఫ్ఘన్ బౌలర్లు తలో చేయి వేయడంతో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 56 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఏకంగా తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించాడు. ముజీబ్, కరీం జనత్ తలో 2 వికెట్లు పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో మార్క్ వాట్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్‌తో బంగ్లాదేశ్ 'ఢీ'వార్మప్ మ్యాచ్‌ల్లో ఇవాళ (జూన్ 1) చివరి మ్యాచ్ జరుగనుంది. న్యూయార్క్‌లో ఇవాళ భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరోవైపు ఇవాల్టి నుంచే వరల్డ్‌కప్ రెగ్యులర్ మ్యాచ్‌లు కూడా ప్రారంభమవుతాయి. అయితే ఈ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రేపటి నుంచి మొదలవుతాయి. -
T20 World Cup 2024: రేపు (జూన్ 1) బంగ్లాదేశ్‌తో తలపడనున్న భారత్
టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా రేపు (జూన్ 1) తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ వార్మప్ మ్యాచే అయినప్పటికీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. న్యూయార్క్‌లో కొత్తగా నిర్మించిన స్టేడియంలో జరుగబోతున్న తొలి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఇదే మైదానంలో టీమిండియా జూన్ 9న పాకిస్తాన్‌తో తలపడనుంది. దాయాదితో ఆడబోయే మ్యాచ్ కూడా ఇదే మైదానంలో జరుగనుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది. భారతకాలమానం ప్రకారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం లేనప్పటికీ.. ఆన్లైన్లో స్కోర్ అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి. టీమిండియా తరఫున కోహ్లి మినహా మిగతా జట్టంతా అందుబాటులో ఉంది. కోహ్లి నిన్ననే ముంబై నుంచి న్యూయార్క్‌కు బయల్దేరాడు. ప్రయాణ బడలికల కారణంగా రేపటి మ్యాచ్‌కు కోహ్లి అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువ.కాగా, ప్రపంచకప్ రెగ్యులర్ మ్యాచ్‌లు సైతం రేపటి నుంచే ప్రారంభంకానున్నాయి. ఆతిథ్య యూఎస్ఏ-కెనడా మధ్య మ్యాచ్‌తో పోట్టి ప్రపంచకప్ 2024 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం జూన్ 2వ తేదీ ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. డల్లాస్‌లో కొత్తగా నిర్మించిన స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ వేదికపై ఇదివరకు పలు ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరిగాయి. యూఎస్ఏ-కెనడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. డల్లాస్‌లో జరగాల్సిన గత మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో భారత్ ప్రస్తానం జూన్ 5న ఐర్లాండ్‌తో జరుబోయే మ్యాచ్‌తో మొదలవుతుంది. జూన్ 9న టీమిండియా.. దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. గ్రూప్ దశలో భారత్.. పాక్, ఐర్లాండ్‌లతో పాటు యూఎస్ఏ, కెనడా జట్లతో తలపడుతుంది. -
పూరన్ సిక్సర్ల సునామీ.. ఆసీస్‌కు ఝలక్ ఇచ్చిన విండీస్
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు ఊహించని ఝలక్ ఇచ్చింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. పూరన్ సిక్సర్ల సునామీనికోలస్ పూరన్ ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. పూరన్ సిక్సర్ల సునామీ ధాటికి ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ మైదానం తడిసి ముద్దైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో పూరన్‌తో పాటు ప్రతి ఆటగాడు చెలరేగి ఆడారు. తలో చేయి వేశారు..హోప్ 8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 14 పరుగులు.. జాన్సన్ ఛార్లెస్ 31 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 40 పరుగులు.. రోవ్‌మన్ పావెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు.. హెట్‌మైర్ 13 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 18 పరుగులు.. రూథర్‌ఫోర్డ్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశారు. విండీస్ బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఆసీస్ బౌలర్లందరూ 10కిపైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. జంపా 2, టిమ్ డేవిడ్, ఆస్టన్ అగర్ తలో వికెట్ పడగొట్టారు.పోరాడిన ఆసీస్అనంతరం అతి భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. గెలుపు కోసం చివరి దాకా పోటీపడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లోనూ ప్రతి ఒక్కరూ చెలరేగి ఆడారు. వార్నర్ 6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 15 పరుగులు.. ఆస్టన్ అగర్ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28.. మార్ష్ 4 బంతుల్లో బౌండరీ సాయంతో 4 పరుగులు.. ఇంగ్లిస్ 30 బంతుల్లో 5 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు.. టిమ్ డేవిడ్ 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు.. వేడ్ 14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు.. నాథన్ ఇల్లిస్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39.. జంపా 16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 21.. హాజిల్‌వుడ్ 3 బంతుల్లో 3 పరుగులు చేశారు. మ్యాచ్ గెలిచేందుకు ఆసీస్‌కు ఈ మెరుపులు సరిపోలేదు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, మోటీ చెరో 2 వికెట్లు.. అకీల్ హొసేన్, షమార్ జోసఫ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో కూడా ఆసీస్ తొలి వార్మప్ మ్యాచ్‌లోలా తొమ్మిది మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. ఆసీస్ రెగ్యులర్ జట్టు సభ్యులు అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం. -
T20 World Cup 2024: పసికూనల సమరం.. గట్టెక్కిన నమీబియా
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా నిన్న (మే 30) పసికూనల మధ్య సమరం జరిగింది. ట్రినిడాడ్ వేదికగా పపువా న్యూ గినియా, నమీబియా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నమీబియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 3 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటి గినియాను కట్టడి చేశారు. ట్రంపెల్మన్, వీస్. టంగెని లుంగనమెనీ తలో 2 వికెట్లు పడగొట్టగా..బెర్నాల్డ్ స్కోల్జ్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టాడు. గినియా ఇన్నింగ్స్‌లో సెసె బౌ (29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. తొలుత గినియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో (9/3) ఇబ్బందులు ఎదుర్కొంది. ఇదే సమయంలో మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన నమీబియాకు 93 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఫ్రైలింక్ (36), జీన్ పియెర్ కొట్జీ (30) బాధ్యతాయుతంగా ఆడటంతో నమీబియా అతి కష్టం మీద 16.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సవరించిన లక్ష్యాన్ని చేరుకుంది. గినియా బౌలర్లలో అస్సద్ వలా, అలెయ్ నావ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కబువా మొరియా, నార్మన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. నిన్ననే జరగాల్సిన మరో మూడు వార్మప్ మ్యాచ్‌లు వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. -
T20 World Cup 2024: లంకేయులకు షాక్.. పసికూన చేతిలో పరాభవం
శ్రీలంక క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో వీరు చిత్తుగా ఓడారు. ఫ్లోరిడాలో జరిగిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. మైఖేల్ లెవిట్ (28 బంతుల్లో 55 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లెవిట్‌తో పాటు తేజ నిడమనూరు (27), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (12 బంతుల్లో 27 నాటౌట్) సత్తా చాటారు. శ్రీలంక బౌలర్లలో దిల్షన్ మధుషంక (4-0-39-2) రాణించగా.. నువాన్ తుషార, దునిత్ వెల్లలగే, ఏంజెలో మాథ్యూస్ తలో వికెట్ పడగొట్టారు. Excellent success 🤩 Our first T20 World Cup Warm-up Match ends with a 𝘄𝗶𝗻 🆚🇱🇰Thanks for your enthusiasm 🦁#kncbcricket #nordek #t20worldcup #cricket #srivned #outofthisworld pic.twitter.com/eFKtpiY5V6— Cricket🏏Netherlands (@KNCBcricket) May 28, 2024అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఆదిలోనే తడబడింది. ఆ జట్టు పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేసింది. ఆతర్వాత కూడా లంక బ్యాటర్లు లయను అందుకోలేకపోయారు. ఏ దశలో గెలుపు దిశగా సాగలేకపోయారు. 18.5 ఓవర్లలో 161 పరుగుల వద్ద లంక ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా నెదర్లాండ్స్ సంచలన విజయం నమోదు చేసింది. లంక ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ హసరంగ బ్యాట్ ఝులిపించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. హసరంగ 15 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు వరుస సిక్సర్లు ఉండటం విశేషం. లంక ఇన్నింగ్స్‌లో హసరంగతో పాటు ధనంజయ డిసిల్వ (31), దసున్ షనక (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆర్యన్ దత్ 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టగా.. కైల్ క్లెయిన్ 2, లొగాన్ వాన్ బీక్ ఓ వికెట్ పడగొట్టారు. నెదర్లాండ్స్ తమ రెండో వార్మప్ మ్యాచ్‌ను మే 30న ఆడనుంది. డల్లాస్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు కెనడాను ఢీకొట్టనుంది. శ్రీలంక తమ రెండో వార్మప్ మ్యాచ్‌ను మే 31న ఆడనుంది. ఫ్లోరిడాలో జరిగే ఆ మ్యాచ్‌లో లంకేయులు ఐర్లాండ్‌తో తలపడతారు. ప్రపంచకప్‌లో శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్లు గ్రూప్-డిలో పోటీపడనున్నాయి. వీటితో పాటు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నేపాల్ జట్లు గ్రూప్-డిలో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. ఈ రెండు జట్ల మధ్య సమరం జూన్ 9న న్యూయార్క్‌లో జరుగనుంది. -
T20 World Cup 2024: ఫీల్డర్‌గా మారిన ఆసీస్ చీఫ్ సెలెక్టర్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ఫీల్డర్ అవతారమెత్తాడు. నమీబియాతో జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెగ్యులర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో బెయిలీ బరిలోకి దిగాల్సి వచ్చింది. ఐపీఎల్ విధుల కారణంగా ఆరుగురు ఆసీస్ ఆటగాళ్లు (కమిన్స్, స్టార్క్, హెడ్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, స్టోయినిస్) మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రాలేకపోయారు. అతి త్వరలో వీరు జట్టుతో కలుస్తారని సమాచారం. నబీమియాతో మ్యాచ్‌లో బెయిలీతో పాటు ఆసీస్ ఫీల్డింగ్ కోచ్ ఆండ్రీ బోరోవెక్ కూడా బరిలోకి దిగాల్సి వచ్చింది. వీరిద్దరే కాక ఆసీస్ బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడ్జ్, హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కూడా కాసేపు ఫీల్డింగ్ చేశారు. మిచెల్ మార్ష్, హాజిల్‌వుడ్ విరామం తీసుకున్న సమయంలో వీరు బరిలోకి దిగారు.ఇదిలా ఉంటే, ఆటగాళ్ల కొరత ఉన్నా నమీబియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున తొలుత హాజిల్‌వుడ్.. ఆతర్వాత డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు. హాజిల్‌వుడ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్ 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్‌వుడ్ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. -
పసికూనపై ప్రతాపం.. రెచ్చిపోయిన హాజిల్‌వుడ్, వార్నర్
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా నమీబియాతో నిన్న (మే 28) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున తొలుత హాజిల్‌వుడ్.. ఆతర్వాత డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు. హాజిల్‌వుడ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్ 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్‌వుడ్ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. హాజిల్‌వుడ్‌తో పాటు ఆడమ్ జంపా (4-0-25-3), నాథన్ ఇల్లిస్ (4-0-17-1), టిమ్ డేవిడ్ (4-0-39-1) కూడా సత్తా చాటడంతో పసికూన నమీబియా విలవిలలాడిపోయింది. నమీబియా ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ జేన్ గ్రీన్ (38) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. కెప్టెన్ మార్ష్ 18, ఇంగ్లిస్ 5, టిమ్ డేవిడ్ 23, వేడ్ 12 (నాటౌట్) పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో బెర్నల్డ్ స్కోల్జ్‌కు రెండు వికెట్లు దక్కగా.. మార్ష్ రనౌటయ్యాడు. బంగ్లాదేశ్, యూఎస్ఏ మధ్య నిన్ననే జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. -
టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లు షురూ
టీ20 వరల్డ్‌కప్ 2024 మ్యాచ్‌లు నిన్నటి (మే 27) నుంచి ప్రారంభమయ్యాయి. పసికూనల మధ్య పోటీలతో మహాసంగ్రామం రిహార్సల్స్ మొదలయ్యాయి. తొలి మ్యాచ్‌లో కెనడా-నేపాల్.. రెండో మ్యాచ్‌లో పపువా న్యూ గినియా-ఒమన్.. మూడో పోటీలో ఉగాండ-నమీబియా జట్లు తలపడ్డాయి.నేపాల్‌కు షాకిచ్చిన కెనడానేపాల్తో జరిగిన మ్యాచ్‌లో కెనడా 63 పరుగుల తేడాతో గెలుపొందింది. డల్లాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నికోలస్ కిర్టన్ (52), రవీందర్‌పాల్ సింగ్ (41 నాటౌట్) రాణించారు. 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. డిల్లన్ హెలిగర్ (4/20) ధాటికి 19.3 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. నేపాల్ ఇన్నింగ్స్‌లో కుశాల్ మల్లా (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.పపువా న్యూ గినియాపై విజయం సాధించిన ఒమన్పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఒమన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గినియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. ఒమన్ మరో 5 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. జీషన్ మక్సూద్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (45) ఆడి ఒమన్‌ను గెలిపించాడు.ఉగాండను చిత్తు చేసిన నమీబియానిన్న జరిగిన మూడో వార్మప్ మ్యాచ్‌లో ఉగాండను నమీబియా 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఉగాండ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేయగా..నమీబియా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. నికోలాస్ డేవిన్ మెరుపు అర్దసెంచరీ (54) చేసి నమిబీయాను గెలిపించాడు.ఇవాళ (మే 28) జరుగబోయే వార్మప్ మ్యాచ్‌ల వివరాలు..శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్- ఫ్లోరిడా వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.బంగ్లాదేశ్ వర్సెస్ యూఎస్ఏ- డల్లాస్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది.ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా- ట్రినిడాడ్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మే 29 తెల్లవారుజామున 4:30 గంటలకు మొదలవుతుంది.టీమిండియా తమ తొలి వార్మప్ మ్యాచ్‌ను జూన్ 1న ఆడుతుంది. న్యూయార్క్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. -
జూన్ 1న బంగ్లాదేశ్‌తో భారత్ వార్మప్ మ్యాచ్
దుబాయ్: ఇప్పుడైతే భారత ఆటగాళ్లంతా ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లలో ఆడుతున్నారు. అయితే టి20 ప్రపంచకప్‌కు ముందు కలిసి కట్టుగా, భారత జట్టుగా రోహిత్ శర్మ బృందం ఏకైక వార్మప్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లలో జరిగే ప్రపంచకప్‌లో టీమిండియా లీగ్ దశ పోటీలన్నీ అమెరికాలోనే షెడ్యూల్ చేశారు. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా అక్కడే ఆడుతుంది. అయితే వేదికను ఖరారు చేయాల్సి ఉంది. పోటీపడే మొత్తం 20 జట్లలో 17 జట్లు మే 27 నుంచి జూన్ 1 వరకు వార్మప్‌లో పాల్గొంటుండగా... డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ పాకిస్తాన్, సెమీఫైనలిస్ట్ న్యూజిలాండ్‌లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకుండానే నేరుగా టోర్నీలోనే బరిలోకి దిగనున్నాయి. ఈ మూడు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల వల్లే బహుశా వార్మప్ మ్యాచ్‌లకు దూరంగా ఉండొచ్చు. ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్తాన్ నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. -
ఆసీస్‌దే విజయం.. వరుసగా రెండో మ్యాచ్‌లో పాక్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడాల్సిన వేదికపై పాకిస్తాన్ తమ రెండు ‘వామప్’ మ్యాచ్‌లనూ కోల్పోయింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో గత శుక్రవారం కివీస్ చేతిలో ఓడిన పాక్ మంగళవారం ఆసీస్ చేతిలోనూ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 14 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. అయితే ఫలితంతో సంబంధం లేకుండా ఇరు జట్లకూ మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. తొలి ‘వామప్’లాగే ఈసారీ భారీ స్కోర్లు నమోదయ్యాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (71 బంతుల్లో 77; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్ (40 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇన్‌గ్లిస్ (48), వార్నర్ (48), లబుషేన్ (40), మిచెల్ మార్ష్ (31) జట్టు భారీ స్కోరులో తలా ఓ చేయి వేశారు. అనంతరం పాకిస్తాన్ 47.4 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (59 బంతుల్లో 90 రిటైర్డ్ అవుట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇఫ్తికార్ అహ్మద్ (85 బంతుల్లో 83; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మొహమ్మద్ నవాజ్ (42 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. పాక్ ఇన్నింగ్స్ చాలా చాలా ముందుగా ముగిసేదే కానీ ఆసీస్ పార్ట్‌టైమ్ బౌలర్లకు కూడా ‘వామప్’ అవకాశం కల్పించింది. లబుషేన్, స్మిత్, వార్నర్ కలిపి 14.4 ఓవర్లు వేసి ఏకంగా 159 పరుగులిచ్చారు. పాక్ తమ తొలి మ్యాచ్‌ను హైదరాబాద్‌లోనే శుక్రవారం నెదర్లాండ్స్‌తో, ఆ్రస్టేలియా తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం భారత్‌తో చెన్నైలో ఆడుతుంది. చదవండి: Sanju Samson: ‘టీమిండియా’తో సంజూ శాంసన్.. కొంచెం బాధగా ఉంది... కానీ పర్లేదు! -
AUS vs PAK: ఉప్పల్ స్టేడియంలో ఆసీస్ , పాకిస్తాన్ మధ్య వార్మప్ మ్యాచ్ (ఫోటోలు)
-
Pak Vs Aus: మాకిది అలవాటే! పాక్‌పై ధావన్ సెటైర్లు.. వీడియో వైరల్
ICC Cricket World Cup Warm-up Matches 2023- Pakistan vs Australia: పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పాకిస్తాన్- ఫీల్డింగ్.. ఈ జంట ప్రేమకథ ఎప్పటికీ ముగిసిపోదంటూ సెటైర్లు వేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో బాబర్ ఆజం బృందం ఇప్పటికే భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లో సన్నాహక మ్యాచ్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్‌తో తొలి వార్మప్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడిన పాక్.. మంగళవారం(అక్టోబరు 3) ఆస్ట్రేలియాతో తలపడుతోంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (77), కామెరాన్ గ్రీన్(50- నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగడం సహా మిగతా బ్యాటర్లలో అలెక్స్ క్యారీ మినహా మిగతా వాళ్లంతా రాణించారు. మిస్‌ఫీల్డింగ్.. వీడియో వైరల్ ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది కంగారూ జట్టు. పాక్ బౌలర్ల, ఫీల్డర్ల తప్పిదాలను క్యాష్ చేసుకుని పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో ఆసీస్‌తో మ్యాచ్‌లో పాక్ ఫీల్డర్లు మహ్మద్ వాసిం జూనియర్, మహ్మద్ నవాజ్ సమన్వయలోపంతో ఎక్స్ట్రా పరుగులు ఇవ్వడం ఆ జట్టు అభిమానులకు చిరాకు తెప్పించింది. పాకిస్తాన్- ఫీల్డింగ్.. నెవర్ ఎండింగ్ లవ్‌స్టోరీ ఇందుకు సంబంధించిన వీడియోను హైలైట్ చేస్తూ.. ‘‘పాకిస్తాన్- ఫీల్డింగ్.. నెవర్ ఎండింగ్ లవ్‌స్టోరీ’’ అంటూ ధావన్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. గబ్బర్ కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. లైకులు, షేర్లతో దూసుకుపోతోంది. కాగా పాక్ టీమ్‌కు ఇలాంటివి కొత్తేం కాదు. మిస్‌ఫీల్డింగ్ కారణంగా ఆ జట్టు భారీ మూల్యం చెల్లించిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 భారత జట్టులో శిఖర్ ధావన్‌కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి యువకులతో పోటీలో ఈ వెటరన్ ఓపెనర్ వెనుబడిపోయాడు. ఇక అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుండగా.. టీమిండియా అక్టోబరు 8న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో చెన్నైలో పోటీ పడనుంది. ఇక అక్టోబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. చదవండి: 1987లో జన్మించిన కెప్టెన్‌దే ఈసారి వరల్డ్‌కప్ ట్రోఫీ! లిస్టులో ఎవరంటే! Pakistan & fielding never ending love story 🥰😄😄 #PakistanFielding #PakCricket pic.twitter.com/AJzT90hgNM — Shikhar Dhawan (@SDhawan25) October 3, 2023 -
పాక్ బౌలింగ్‌ను తుత్తినియలు చేసిన ఆసీస్ బ్యాటర్లు.. భారీ స్కోర్ నమోదు
వరల్డ్‌కప్‌కు ముందు ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ బౌలర్లను ప్రత్యర్ధి బ్యాటర్లు చీల్చిచెండాడారు. ప్రపంచ శ్రేణి బౌలర్లమని విర్రవీగే పాక్ బౌలింగ్‌ను ఈ రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్దులు తుత్తినియలు చేశారు. తొలి వార్మప్ మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లు పాక్ బౌలర్లను ఓ రేంజ్లో ఆటాడుకుని నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేయగా.. ఇవాళ జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి, నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు పిండుకున్నారు. ఆసీస్ బ్యాటర్లు ప్రధానంగా పాక్ పేస్ గన్ హరీస్ రౌఫ్‌ను టార్గెట్ చేసి 9 ఓవర్లలో ఏకంగా 97 పరుగులు రాబట్టారు. ఆసీస్ బ్యాటర్ల ధాటికి రౌఫ్‌తో పాటు మొహమ్మద్ వసీం జూనియర్ (8-0-63-1), షాదాబ్ ఖాన్ (10-0-69-1) బలయ్యారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (6-1-25-0), హసన్ అలీ (6-0-23-0), మొహమ్మద్ నవాజ్ (6-0-34-1) పర్వాలేదనిపించగా.. ఉసామా మిర్ 2 వికెట్లు తీసినప్పటికీ పరుగులు సమర్పించుకన్నాడు. ఇరగదీసిన ఆసీస్ బ్యాటర్లు.. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్లంతా మెరుపు ఇన్నింగ్స్‌లతో ఇరగదీశారు. ఆరంభంలో డేవిడ్ వార్నర్ (33 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), లబూషేన్ (31 బంతుల్లో 40; 5 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ (71 బంతుల్లో 77; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), కెమరూన్ గ్రీన్ (40 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), జోష్ ఇంగ్లిస్ (30 బంతుల్లో 48; 8 ఫోర్లు, సిక్స్) పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ఫలితంగా ఆసీస్ భారీ స్కోర్ చేసింది. -
World Cup 2023: టీమిండియా అభిమానులకు నిరాశ
టీమిండియా అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. వరల్డ్‌కప్‌కు ముందు భారత జట్టు ఆడాల్సిన రెండు వార్మప్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. సెప్టెంబర్ 30న గౌహతిలో ఇంగ్లండ్‌తో జరగాల్సిన వార్మప్ మ్యాచ్ టాస్ అనంతరం రద్దు కాగా.. ఇవాళ (అక్టోబర్ 3) తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ టాస్ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. మొత్తంగా తిరువనంతపురంలో జరగాల్సిన నాలుగు గేమ్స్‌లో మూడు వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసాయి. ఈ వేదికపై నిన్న జరిగిన న్యూజిలాండ్-సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఒక్కటే ఫలితం తేలింది. ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డు తగిలినప్పటికీ.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. మరోవైపు ఇవాళ జరగాల్సిన మిగతా రెండు వార్మప్ మ్యాచ్‌లు సజావుగా సాగుతున్నాయి. గౌహతి వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు ఇరగీస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న మరో మ్యాచ్‌లో పాక్‌పై ఆసీస్ బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో శ్రీలంక 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేయగా.. పాక్‌తో మ్యాచ్‌లో ఆసీస్ 37 ఓవర్ల అనంతరం 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 59 బంతుల్లోనే శతక్కొట్టిన కుశాల్.. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో లంక తాత్కాలిక కెప్టెన్ కుశాల్ మెండిస్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 59 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ అనంతరం కూడా కుశాల్ మెండిస్ తగ్గకుండా ఆడాడు. 87 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 158 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. పథుమ్ నిస్సంక (30), దిముత్ కరుణరత్నే (8) ఔట్ కాగా.. సమరవిక్రమ (32), అసలంక క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్, అబ్దుల్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టారు. బ్యాట్ ఝులిపిస్తున్న మ్యాక్సీ.. పాక్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాట్ ఝులిపిస్తున్నాడు. మ్యాక్సీ 55 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 51 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (48), లబూషేన్ (40), మిచెల్ మార్ష్ (31), స్టీవ్ స్మిత్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. అలెక్స్ క్యారీ (11) నిరాశపరిచాడు. మ్యాక్స్‌వెల్‌తో పాటు గ్రీన్ (7) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్ బౌలర్లలో ఉసామా మిర్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్.. విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన శ్రీలంక ప్లేయర్
వరల్డ్‌కప్ వార్మప్ గేమ్స్ కూడా ప్రేక్షకులకు కావాల్సినంత మజాను అందిస్తున్నాయి. తొలి వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఖంగుతిన్న శ్రీలంక.. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 3) జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్‌లో ఇరగదీస్తుంది. ఈ మ్యాచ్‌లో లంక తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు మోస్తున్న కుశాల్ మెండిస్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 59 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ అనంతరం కూడా కుశాల్ మెండిస్ ఏమాత్రం తగ్గకుండా చెలరేగిపోతుండటంతో శ్రీలంక భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 25 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 197/2గా ఉంది. పథుమ్ నిస్సంక (30), దిముత్ కరుణరత్నే (8) ఔట్ కాగా.. కుశాల్ మెండిస్ (76 బంతుల్లో 135; 18 ఫోర్లు, 7 సిక్సర్లు), సదీర సమరవిక్రమ (23 బంతుల్లో 12; ఫోర్) క్రీజ్‌లో ఉన్నారు. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, ఇవాళ ఈ మ్యాచ్‌తో పాటు మరో రెండు వార్మప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో పాకిస్తాన్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుండగా.. తిరువనంతపురంలో జరగాల్సిన భారత్-నెదార్లండ్స్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమవుతూ వస్తుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 31 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. డేవిడ్ వార్నర్ (48), లబూషేన్ (40), మిచెల్ మార్ష్ (31), స్టీవ్ స్మిత్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. అలెక్స్ క్యారీ (11) నిరాశపరిచాడు. మ్యాక్స్‌వెల్ (20), గ్రీన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఉసామా మిర్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ప్రపంచకప్‌కు ముందు అన్ని జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన న్యూజిలాండ్
వన్డే ప్రపంచకప్-2023కి ముందు న్యూజిలాండ్ టీమ్ అన్ని జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వరుసగా రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో 300 ప్లస్ స్కోర్లు చేసి తమతో జాగ్రత అనే సందేశాన్ని పంపింది. వరుసగా రెండు పర్యాయాలు దెబ్బతిన్నాం.. ఈసారి వదిలేది లేదని ప్రపంచకప్ ఆశావాధులకు హెచ్చరికలు జారీ చేసింది. పాక్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 346 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఊదేసిన కివీస్ బ్యాటర్లు ప్రత్యర్ధి జట్లకు దడ పుట్టిస్తున్నారు. ఇవాళ (అక్టోబర్ 2) సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్‌లోనూ రెచ్చిపోయిన కివీస్ బ్యాటర్లు ప్రత్యర్ధి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తూ కివీస్ 321 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లు ఇంత అలవోకగా పరుగులు చేస్తుంటే భారత్ సహా అన్ని జట్లు కలవరపడుతున్నాయి. ఈసారి కివీస్ నుంచి ముప్పుతప్పేలా లేదని నిర్ధారణకు వచ్చాయి. కివీస్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు అన్ని జట్లు అస్త్రాలను సిద్దం చేసుకునే పనిలో పడ్డాయి. కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్రలను కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నాయి. ముఖ్యంగా గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేన్ మామపై అన్ని జట్లు ప్రత్యేక నిఘా పెట్టాయి. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలో కివీస్‌కు మొదటినుంచి పటిష్టంగా ఉంది. ఆ జట్టులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అంటే అవి బ్యాటింగ్‌లోనే. ఇప్పుడు అదే బ్యాటింగ్‌లో కివీస్ ఇరగదీస్తుంటే ప్రత్యర్ధి జట్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. భీకర ఫామ్‌లో ఉన్న బౌల్ట్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్‌లతో కివీస్ పేస్ విభాగం బలంగా ఉంది. మిచెల్ సాంట్నర్, ఐష్ సోధి, రచిన్ రవీంద్రతో స్పిన్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. ఇక వీరి ఫీల్డింగ్ గురించి చెప్పనక్కర్లేదు. వరల్డ్ క్లాస్ ఫీల్డర్లంతా ఈ జట్టులోనే ఉన్నారు. అన్ని విభాగాల్లో ఇంత పటిష్టంగా ఉన్న ఈ జట్టును ప్రపంచకప్‌లో అన్ని జట్లు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి. సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. కాన్వే (78), టామ్ లాథమ్ (52) అర్ధసెంచరీలతో రాణించగా... విలియమ్సన్ (37), గ్లెన్ ఫిలిప్స్ (43), డారిల్ మిచెల్ (25), మార్క్ చాప్మన్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జన్సెన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. రీజా హెండ్రిక్స్ తొలి బంతికే బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. -
WC 2023: కేరళలో టీమిండియా.. ముంబైకి వెళ్లిపోయిన కోహ్లి! కారణమిదే!
ICC World Cup 2023- India vs Netherlands Warm Up Match: వన్డే వరల్డ్‌కప్-2023 వార్మప్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కేరళకు చేరుకుంది. నెదర్లాండ్స్‌తో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్నాహక మ్యాచ్ ఆడేందుకు తిరువనంతరపురంలో అడుగుపెట్టింది. అయితే, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం భారత జట్టుతో లేకపోవడం గమనార్హం. గువాహటిలో తొలి వార్మప్ మ్యాచ్ వర్షార్పణమైన అనంతరం అతడు ముంబైకి తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం. మిగతా ఆటగాళ్లంతా ఆదివారం సాయంత్రమే ప్రత్యేక విమానంలో కేరళకు బయల్దేరారు. పర్సనల్ ఎమర్జెన్సీ కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి ముంబైకి వెళ్లినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారి ధ్రువీకరించినట్లు క్రిక్‌బజ్ పేర్కొంది. అయితే, సోమవారం నాటికి అతడు తిరిగి జట్టుతో చేరతాడని వెల్లడించింది. భార్య అనుష్కను చూడటానికే.. విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మను కలిసేందుకే గువాహటి నుంచి నేరుగా ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా సెలబ్రిటీ జంట త్వరలోనే తమ రెండో సంతానానికి జన్మనివ్వబోతోందంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హఠాత్తుగా ఇలా కోహ్లి ఇంటికి వెళ్లడం చూస్తుంటే విరుష్క శుభవార్త చెప్పడం ఖాయమైందంటూ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్ కోహ్లి 2017లో ఆమెను పెళ్లాడాడు. డచ్ జట్టుతో మ్యాచ్ కూడానా? ఈ జంటకు 2021 , జనవరి 11న కుమార్తె వామిక జన్మించింది. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత మరోసారి అనుష్క గర్భం దాల్చిందంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టీమిండియా తొలి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైపోయింది. ఇక తిరునవంతరపురంలోనూ ఇదే పునరావృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చదవండి: CWC 2023: ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల వీరులు వీరే..! #WATCH | Thiruvananthapuram: Indian Cricket team arrive at Trivandrum Domestic Airport ahead of the World Cup scheduled to be held between October 5 to November 19. pic.twitter.com/LH1Ra5FhpW — ANI (@ANI) October 1, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
PAK vs NZ: ఉప్పల్ స్టేడియంలో పాక్, న్యూజిల్యాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ (ఫోటోలు)
-
World Cup 2023: పాక్‌తో మ్యాచ్.. రీఎంట్రీలో సత్తా చాటిన కేన్ మామ
ఐపీఎల్ 2023 సందర్భంగా గాయపడి, ఆరు నెలల తర్వాత బరిలోకి దిగిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రీఎంట్రీలో సత్తా చాటాడు. వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 29) జరుగుతున్న మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన కేన్ మామ అదిరిపోయే అర్ధసెంచరీతో ఇరగదీశాడు. ఈ మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొన్న అతను 8 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి రిటైర్డ్ అయ్యాడు. ఫలితంగా పాక్ నిర్ధేశించిన 346 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే దిశగా న్యూజిలాండ్ ముందుకు సాగుతుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రచిన్ రవీంద్ర ఎవరూ ఊహించని విధంగా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. రచిన్ 66 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్ సాయంతో 88 పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ (కాన్వే (0)) ఏమాత్రం తడబడకుండా లక్ష్యం దిశగా దూసుకెళ్తుంది. 21 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 159/1గా ఉంది. రచిన్‌కు జతగా డారిల్ మిచెల్ (9) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (94 బంతుల్లో 103 రిటైర్డ్ ఔట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. బాబర్ ఆజమ్ (84 బంతుల్లో 80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో సౌద్ షకీల్ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అఘా సల్మాన్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), షాదాబ్ ఖాన్ (11 బంతుల్లో 16; 2 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (3 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) బ్యాట్ ఝులిపించారు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. -
World Cup 2023: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. పాక్ భారీ స్కోర్
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్ వార్మప్ గేమ్‌లో పాక్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (94 బంతుల్లో 103 రిటైర్డ్ ఔట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (84 బంతుల్లో 80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో సౌద్ షకీల్ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అఘా సల్మాన్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), షాదాబ్ ఖాన్ (11 బంతుల్లో 16; 2 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (3 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) బ్యాట్ ఝులిపించడంతో పాక్ భారీ స్కోర్ చేసింది. ఆఖరి ఓవర్లో ఫెర్గూసన్ పొదుపుగా బౌల్ చేయడంతో పాక్ 345 పరుగులతో సరిపెట్టుకుంది. ఈ ఓవర్లో పాక్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఓ వికెట్ కోల్పోయింది. అంతకుముందు పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్‌కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండానే కొనసాగుతుంది. మరోవైపు ఇవాళే జరుగుతున్న మరో వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 263 పరుగులు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (68), ధనంజయ డిసిల్వ (55) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ 3, సకీబ్, షొరీఫుల్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్ తలో వికెట్ పడగొట్టారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. -
World Cup 2023: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. సెంచరీతో కదంతొక్కిన రిజ్వాన్
పాక్ స్టార్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిపోయాడు. వరల్డ్‌కప్ 2023 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రిజ్వాన్ 94 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేసి రిటైర్డ్ అయ్యాడు. రిజ్వాన్‌తో పాటు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా రాణించాడు. బాబర్ 84 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ మెరుపు ఇన్నింగ్స్‌లతో కదంతొక్కడంతో ఈ మ్యాచ్‌లో పాక్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 42 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 257/4గా ఉంది. సౌద్ షకీల్ (36), అఘా సల్మాన్ (10) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్‌కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండానే కొనసాగుతుంది. మరోవైపు ఇవాళే జరుగుతున్న మరో వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (68), ధనంజయ డిసిల్వ (55) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ 3, సకీబ్, షొరీఫుల్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్ తలో వికెట్ పడగొట్టారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. -
భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇరగదీసిన బాబర్ ఆజమ్
భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఇరగదీశాడు. వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 29) జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ చెలరేగిపోయాడు. 84 బంతులత్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బాబర్‌తో పాటు మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న మొహమ్మద్ రిజ్వాన్ సైతం భారత్‌లో ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. రిజ్వాన్ 53 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. వీరిద్దరూ అర్ధసెంచరీలతో రాణించడంతో వార్మప్ గేమ్‌లో పాక్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. 32 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. రిజ్వాన్ (62), సౌద్ షకీల్ (5) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్‌కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండా కొనసాగుతుంది. మరోవైపు ఇవాలే జరుగుతున్న మరో వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక.. 40 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 202 పరగులు చేసింది. ధనంజయ డిసిల్వ (45), కరుణరత్నే క్రీజ్‌లో ఉన్నారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. -
వరుణుడి ఖాతాలో వరల్డ్‌కప్ మ్యాచ్.. టాస్ కూడా పడకుండానే రద్దు
వన్డే ప్రపంచకప్ 2023లో వరుణుడు బోణీ కొట్టాడు. తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (సెప్టెంబర్ 29) జరగాల్సిన వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. తిరువనంతపురంలో ఇవాల్టి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో అంపైర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్‌ను రద్దు చేశారు. మైదానం చిన్న సైజు చెరువులా మారడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, వ్యక్తిగత కారణాల చేత సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా స్వదేశానికి తిరిగి వెళ్లడంతో వార్మప్ మ్యాచ్‌లకు ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. బవుమా వరల్డ్‌కప్‌లో తమ తొలి మ్యాచ్ సమయానికంతా జట్టుతో చేరతాడని సమాచారం. సౌతాఫ్రికా తమ వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో సఫారీలు శ్రీలంకను ఢీకొంటారు. దీనికి ముందు ఆ జట్టు మరో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 2న సఫారీలు ఇదే తిరువనంతపురంలో న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్‌కప్‌లో తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న ఆడనుంది. ధర్మశాలలో జరిగే ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు.. బంగ్లాదేశ్‌ను ఢీకొంటారు. దీనికి ముందు ఆఫ్ఘన్ టీమ్ మరో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 3న వీరు గౌహతిలో శ్రీలంకను ఢీకొంటారు. ఇదిలా ఉంటే, ఇవాళే మరో రెండు వార్మప్ మ్యాచ్‌లు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్.. గౌహతిలో శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ 21 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 99 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బాబర్ ఆజమ్ (41), మొహమ్మద్ రిజ్వాన్ (34) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. 28 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అసలంక (18), ధనంజయ డిసిల్వ (17) క్రీజ్‌లో ఉన్నారు. -
World Cup Warm Up Matches: బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, శ్రీలంక
భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ 2023 వార్మప్ మ్యాచ్‌లు ఇవాల్టి (సెప్టెంబర్ 29) నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇవాళ మొత్తం మూడు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్-న్యూజిలాండ్.. గౌహతి వేదికగా శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన పాకిస్తాన్, శ్రీలంక జట్లు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్-సౌతాఫ్రికా జట్ల మధ్య తివేండ్రం వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమవుతుంది. తివేండ్రంలో భారీ వర్షం పడుతుండటంతో టాస్ కూడా పడలేదు. మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు షెడ్యూల్ అయ్యాయి. తొలి వికెట్ కోల్పోయిన పాక్.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి ఇమామ్ ఉల్ హాక్ (1) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 31/1గా ఉంది. అబ్దుల్లా షఫీక్ (12), బాబర్ ఆజమ్ (16) క్రీజ్‌లో ఉన్నారు. ధాటిగా ఆడుతున్న లంక ఓపెనర్లు.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక థాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (25), కుశాల్ పెరీరా (21) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. 8 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 46/0గా ఉంది. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, ఫకర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ రిజ్వాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, మొహమ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది, ఉసామా మిర్ న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, ఐష్ సోధి, టిమ్ సౌథీ శ్రీలంక: దసున్ షనక(కెప్టెన్), కుశాల్ మెండిస్, పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీశ పతిరణ, లహిరు కుమార, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దిల్షన్ మధుశంక బంగ్లాదేశ్: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్, నజ్ముల్ హొసేన్ షాంటో, మెహిది హసన్ మీరజ్, తౌహిద్ హ్రిదోయ్,తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షొరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్, తంజిమ్ షకీబ్, తంజిద్ తమీమ్, మహ్మదుల్లా రియాద్ ఆఫ్ఘనిస్తాన్: హస్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీమ్ జద్రాన్, రియాజ్ హసన్, నజీబుల్లా జద్రాన్, రెహ్మాత్ షా, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలికిల్, అబ్దుల్ రహ్మాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హాక్ ఫారూకీ, నవీన్ ఉల్ హాక్ సౌతాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, మార్కో జన్సెన్, అండిల్ ఫెహ్లుక్వాయో, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, గెరాల్డ్ కొయెట్జీ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, లిజాడ్ విలియమ్స్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి -
ఇంగ్లండ్‌తో వార్మప్ గేమ్.. టీమిండియాతో అశ్విన్.. వరల్డ్‌కప్ జట్టులోకి వచ్చినట్లేనా..?
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచకప్ జట్టులోకి రావడంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 30న గౌహతిలో ఇంగ్లండ్‌తో జరిగే వార్మప్ మ్యాచ్‌లో ఆశ్విన్ ఆడటం ఖాయమైపోయిందని సమాచారం. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఇవాళ (సెప్టెంబర్ 28) గౌహతికి చేరగా అశ్విన్ జట్టుతో పాటు కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి అశ్విన్ వరల్డ్‌కప్ జట్టులోకి రావడం ఖాయమైపోయిందని అభిమానులు అనుకుంటున్నారు. Exclusive visuals: Team India arrives in Guwahati for first warm up match against England. Ravichandran Ashwin travels with the squad, no Axar Patel. @ThumsUpOfficial @cricketworldcup @CricSubhayan @debasissen pic.twitter.com/nkNQppcXjO — RevSportz (@RevSportz) September 28, 2023 కాగా, ప్రపంచకప్ కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో అశ్విన్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. అయితే తదనంతరం జరిగిన పరిణామాల్లో వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికైన అక్షర్ పటేల్ గాయపడటం.. ఆసీస్‌తో సిరీస్‌కు అశ్విన్ భారత జట్టులోకి రావడంతో.. వచ్చీ రావడంతోనే చెలరేగిపోవడం.. గాయం నుంచి పూర్తిగా కోలుకోని అక్షర్‌కు అశ్విన్ ప్రత్యామ్నాయంగా మారడం వంటివి చకాచకా జరిగిపోయాయి. Virat Kohli And #TeamIndia Arrived In Guwahati For The 1st Warm Up Game Against England ahead of World Cup 2023.🇮🇳💙#ViratKohli #CWC2023 @imVkohli pic.twitter.com/LdHrWWucv0— virat_kohli_18_club (@KohliSensation) September 28, 2023 తాజాగా ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు అక్షర్ జట్టుతో కనిపించకపోవడం.. అశ్విన్ జట్టుతో పాటు ప్రయాణించడం చూస్తుంటే ప్రపంచకప్ జట్టుకు అశ్విన్ ఎంపిక లాంఛనమేనని తెలుస్తుంది. మరి సెలెక్టర్లు అశ్విన్‌ను అక్షర్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేస్తారో లేక యాష్‌ను జట్టుతో పాటు అదనపు సభ్యుడిగా కొనసాగిస్తారో వేచి చూడాలి. తొలుత అక్షర్ వార్మప్ మ్యాచ్‌ల సమయానికంతా గాయం నుంచి కోలుకుంటాడని బీసీసీఐ పెద్దలు చెప్పుకొచ్చారు. అయితే అక్షర్ గాయం విషయంలో ఆశించిన పురోగమనం లేకపోవడంతో అతని ప్రత్యామ్నాయంగా అశ్విన్‌ను జట్టులోకి ఎంపిక చేసినట్లు తేటతెల్లమవుతుంది. వరల్డ్‌కప్ జట్టులో మార్పులు చేర్పులకు ఇవాళే (సెప్టెంబర్ 28) ఆఖరి తేదీ కావడంతో మరికాసేపట్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకాబోయే వరల్డ్‌కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా.. ఆసీస్‌తో తలపడుతుంది. ఆతర్వాత అక్టోబర్ 14న భారత్.. తమ చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఢీకొంటుంది. ఈ రెండు మ్యాచ్‌లకు ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. సెప్టెంబర్ 30న ఇంగ్లండ్‌తో.. అక్టోబర్ 3న నెదర్లాండ్స్‌తో రోహిత్ సేన తలపడుతుంది. భారత వరల్డ్‌కప్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ -
ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై అడుగు పెట్టిన పాక్ జట్టు
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులు రెండు వారాల పాటు హైదరాబాద్ నగరంలో అతిథులుగా ఉండబోతున్నారు. వన్డే వరల్డ్ కప్‌లో రెండు వామప్ మ్యాచ్‌లతో పాటు రెండు ప్రధాన మ్యాచ్‌లను కూడా పాకిస్తాన్ ఇక్కడి ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. మెగా టోర్నీలో పాల్గొనేందుకు బాబర్ ఆజమ్ నాయకత్వంలోని 15 మంది సభ్యుల బృందం బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయంలో హెచ్‌సీఏ ప్రతినిధులు పాక్ జట్టుకు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో జట్టుకు నగర పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పాక్ క్రికెట్ టీమ్ ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై అడుగు పెట్టడం విశేషం. 2016లో ఇక్కడే టి20 ప్రపంచకప్ ఆడిన ఆ టీమ్ మళ్లీ ఇప్పుడే మరో వరల్డ్ కప్ కోసం ఇక్కడకు వచ్చింది. టీమ్‌లోని మొహమ్మద్ నవాజ్, సల్మాన్ ఆగాలకు మాత్రమే గతంలో భారత్‌లో ఆడిన అనుభవం (జూనియర్ స్థాయిలో) ఉండగా... టీమ్ కెప్టెన్, ఇప్పటి అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన బాబర్ ఆజమ్ తొలిసారి భారత్‌లో ఆడబోతున్నాడు. భారత్ బయల్దేరే ముందు లాహోర్‌లో మీడియాతో మాట్లాడిన బాబర్ ఆజమ్ తమ జట్టు మెరుగైన ప్రదర్శన ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్‌తో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ‘గతంలో భారత్‌లో ఆడకపోయినా మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. దాదాపు ఆసియా ఖండంలోనే ఇతర దేశాల్లాగే ఉండే ఇక్కడి పరిస్థితులపై మాకు అవగాహన ఉంది. అందుకే మేం తగిన విధంగా సన్నద్ధమై వచ్చాం. హౌస్‌ఫుల్‌గా ఉండబోయే అహ్మదాబాద్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. నా సొంత రికార్డుల గురించి ఆలోచన లేదు. ఎంత స్కోరు చేసినా జట్టు విజయానికి ఉపయోగపడటం ముఖ్యం’ అని బాబర్ అన్నాడు. ఉప్పల్ స్టేడియంలో రేపు న్యూజిలాండ్‌తో, అక్టోబర్ 3న ఆ్రస్టేలియాతో పాకిస్తాన్ రెండు వామప్ మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం ప్రధాన టోర్నీలో అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో, అక్టోబర్ 10న శ్రీలంకతో ఆ జట్టు తలపడుతుంది. మరోవైపు కేన్ విలియమ్సన్ నేతృత్వంలో క్రైస్ట్‌చర్చ్ నుంచి వచ్చిన న్యూజిలాండ్ టీమ్ రెండో బృందం కూడా బుధవారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకుంది. -
Pakistan Vs. New Zealand World Cup 2023 Warm-Up : ప్రేక్షకులకు ‘నో ఎంట్రీ’
సాక్షి, హైదరాబాద్: వన్డే వరల్డ్ కప్‌కు ముందు హైదరాబాద్‌లో జరగనున్న తొలి వామప్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఈ నెల 29న ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే దానికి ఒక రోజు నగరంలో గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ కారణంగా తాము తగినంత భద్రత పోలీసులు కల్పించలేమని పోలీసులు స్పష్టం చేసేశారు. వామప్ మ్యాచ్ తేదీని మార్చుకోవాల్సిందిగా కూడా వారు సూచించారు. అయితే బీసీసీఐ–హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) దీనిపై తగిన విధంగా చర్చించాయి. ప్రధాన మ్యాచ్ కాదు కాబట్టి సమస్య లేదని, తేదీ మార్చాల్సి అవసరం లేదనే నిర్ణయానికి వచ్చాయి. అయితే నగరంలో పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించరాదని నిర్ణయించారు. -
CWC 2023: పాకిస్తాన్ మ్యాచ్.. ప్రేక్షకులకు నో ఎంట్రీ
ఈనెల 29న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో (ఉప్పల్ స్టేడియం) జరగాల్సి ఉన్న వన్డే వరల్డ్‌కప్-2023 వార్మప్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో జరుగనుంది. పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కు సెక్యూరిటీ ఇవ్వలేమని స్థానిక పోలీసులు చెప్పడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌కు ముందు రోజు (సెప్టెంబర్ 28) నగరంలో గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉండటంతో తగినంత భద్రత ఇవ్వలేమని నగర పోలీసులు హెచ్‌సీఏకు తెలిపారు. వీలైతే మ్యాచ్‌ను వాయిదా వేయాలని వారు హెచ్‌సీఏని కోరారు. అయితే, ఇదివరకే షెడ్యూల్‌ను ఓ సారి సవరించి ఉండటంతో బీసీసీఐ షెడ్యూల్ మార్పు కుదరదని హెచ్‌సీఏకు తేల్చి చెప్పింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పాక్-న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్‌ను ఖాళీ స్టేడియంలో నిర్వహించేందుకు హెచ్‌సీఏ సిద్ధమైంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఇదివరకే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా బీసీసీఐ వరల్డ్‌కప్ టికెటింగ్ పార్డ్నర్ బుక్ మై షోకు సూచించింది. కాగా, వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు మొత్తం 10 వార్మప్ మ్యాచ్‌లు జరుగనున్న విషయం తెలిసిందే. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా సెప్టెంబర్ 29న 3 మ్యాచ్‌లు, సెప్టెంబర్ 30న 2, అక్టోబర్ 2న 2, అక్టోబర్ 3న 3 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ డే అండ్ మ్యాచ్‌లుగా సాగనున్నాయి. సెప్టెంబర్ 29: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక (గౌహతి, మధ్యాహ్నం 2 గంటలకు) ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (తిరువనంతపురం) న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ (హైదరాబాద్) సెప్టెంబర్ 30: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి) ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ (తిరువనంతపురం) అక్టోబర్ 2: బంగ్లాదేశ్ వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి) న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (తిరువనంతపురం) అక్టోబర్ 3: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక (గౌహతి) ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ (తిరువనంతపురం) ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ (హైదరాబాద్) -
ప్రత్యర్థులుగా ఇంగ్లండ్, నెదర్లాండ్స్
దుబాయ్: వన్డే వరల్డ్ కప్ ప్రధాన పోరుకు ముందు సన్నాహకంగా జరిగే వామప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. మూడు వేదికలు హైదరాబాద్, తిరువనంతపురం, గువహటి నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీలో పాల్గొంటున్న 10 జట్లూ సెపె్టంబర్ 29 నుంచి అక్టోబర్ 3 మధ్య రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి. సెప్టెంబర్ 30న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో గువహటిలో తలపడే భారత్... అక్టోబర్ 3న తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌ను ఎదుర్కొంటుంది. మూడు ప్రధాన మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో రెండు వామప్ మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. సెప్టెంబర్ 29న పాకిస్తాన్, న్యూజిలాండ్...అక్టోబర్ 3న పాకిస్తాన్, ఆ్రస్టేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో వామప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. టికెటింగ్ పార్ట్నర్గా బుక్ మై షో... వరల్డ్ కప్ కోసం ‘బుక్ మై షో’ను తమ టికెటింగ్ భాగస్వామిగా బీసీసీఐ ప్రకటించింది. ప్రధాన మ్యాచ్‌లు, వామప్ మ్యాచ్‌లు కలిపి మొత్తం 58 మ్యాచ్‌ల టికెట్లను బుక్ మై షో ద్వారా కొనుగోలు చేయవచ్చు. భారత్ మినహా ఇతర జట్ల వామప్ మ్యాచ్‌లకు ఈ నెల 25 నుంచి, భారత్ ఆడే వామప్ మ్యాచ్‌లకు ఈ నెల 30 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి. అయితే బోర్డు స్పాన్సర్లలో ఒకరైన ‘మాస్టర్ కార్డ్’ వినియోగదారులకు మాత్రం ఒకరోజు ముందుగానే (నేటి సాయంత్రం 6 గంటల నుంచి, 29 సాయంత్రం 6 గంటల నుంచి) టికెట్లు లభిస్తాయి. -
ODI WC 2023: సెప్టెంబర్ 30నే ఇంగ్లండ్‌తో భారత్ ఢీ.. హైదరాబాద్‌లో పాక్‌కు మరో మ్యాచ్
వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్‌ను ఐసీసీ నిన్న (జూన్ 27) విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్.. రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. దీనికి ముందు ఓ వారం రోజుల పాటు వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ పోటీలు సెప్టెంబర్ 29న మొదలై అక్టోబర్ 3 వరకు సాగుతాయి. ఇందులో భారత్ రెండు మ్యాచ్‌లు, పాక్ ఓ మ్యాచ్ ఆడనున్నాయి. సెప్టెంబరు 30న గౌహతిలో ఇంగ్లండ్‌తో, అక్టోబర్ 3న త్రివేండ్రంలో (తిరువనంతపురం) క్వాలిఫయర్-1తో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. వార్మప్ మ్యాచ్‌ల వివరాలు.. సెప్టెంబర్ 29: పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (హైదరాబాద్) సెప్టెంబర్ 30: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి) అక్టోబర్ 3: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-1 -
T20 WC: సిక్సర్ల మోత మోగించిన రిచా.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం
India W vs Bangladesh Women- Richa Ghosh- స్టెలెన్బాస్చ్ (దక్షిణాఫ్రికా): టి20 ప్రపంచకప్‌కు ముందు ఆఖరి వార్మప్ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు జోరుగా ప్రాక్టీస్ చేశారు. రిచా ఘోష్ (56 బంతుల్లో 91 నాటౌట్; 3 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడింది. దీంతో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీస్కోరు చేసింది. రిచా, జెమీమా రోడ్రిగ్స్ (27 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్సర్) నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. ఆఖరి రెండు ఓవర్లలో అయితే రిచా, పూజ వస్త్రకర్ (13 నాటౌ ట్; 2 సిక్సర్లు) జోడీ ఏకంగా 46 పరుగులు సాధించడం విశేషం. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులే చేసింది. శుక్రవారం ప్రపంచకప్ మొదలుకానుండగా... భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం పాకిస్తాన్‌తో ఆడుతుంది. మహిళల టీ20 ప్రపంచకప్ భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్ స్కోర్లు భారత్- 183/5 (20) బంగ్లాదేశ్- 131/8 (20) చదవండి: Pat Cummins: గతం అనవసరం... మా జట్టు బలంగా ఉంది! నాగ్‌పూర్ పిచ్ ఎలా ఉందంటే.. ICC T20I Rankings: దుమ్మురేపిన శుభ్‌మన్ గిల్.. సత్తా చాటిన హార్ధిక్ పాండ్యా -
భారత పర్యటనలో ‘వార్మప్’ ఆడకపోవడం సరైందే: స్మిత్
సిడ్నీ: భారత పర్యటనలో వార్మప్‌తో కాకుండా నేరుగా టెస్టు సిరీస్‌తోనే ఆట మొదలు పెట్టడం సరైన నిర్ణయమేనని ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. భారత్‌లో తమకు సవాల్ స్పిన్‌తో ఉంటే వార్మప్ మ్యాచ్ పేస్ వికెట్‌పై ఏర్పాటు చేయడం జట్టుకు ఏమాత్రం మేలు చేయదని ఈ సీనియర్ బ్యాటర్ అభిప్రాయపడ్డాడు. నాలుగు టెస్టుల పూర్తిస్థాయి సిరీస్ ఆడేందుకు రానున్న కంగారూ జట్టు కనీసం ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడకపోవడం ఆశ్చర్యపరిచింది. దీనిపై అతను ఆ్రస్టేలియన్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గత పర్యటనలో మేం గ్రీన్‌టాప్ (పేస్ పిచ్)పై సన్నాహక మ్యాచ్ ఆడాం. కానీ మాకు సిరీస్‌లో ఎదురైంది స్పిన్ ట్రాక్‌లు. అలాంటపుడు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం దండగ! దీనికంటే స్పిన్ పిచ్‌లపై సన్నద్ధమయ్యేందుకు నెట్స్‌లో స్పిన్ బౌలింగ్‌తో ప్రాక్టీస్ చేయడమే ఉత్తమం. మా బోర్డు (క్రికెట్ ఆ్రస్టేలియా) ఈసారి వార్మప్ వద్దని మంచి పనే చేసింది’ అని అన్నాడు. భారత పర్యటనలో తమకు కఠిన సవాళ్లు తప్పవన్నాడు. ఈ నెల 9 నుంచి నాగ్‌పూర్‌లో జరిగే తొలి టెస్టుతో ద్వైపాక్షిక సిరీస్ మొదలవుతుంది. చదవండి: నెంబర్‌వన్‌కు అడుగుదూరంలో భారత క్రికెటర్ -
ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ సహా ఆ మ్యాచ్‌లన్నీ వర్షార్పణం
టీ20 వరల్డ్‌కప్-2022లో ఇవాళ (అక్టోబర్ 19) జరగాల్సిన ఆఖరి వార్మప్ మ్యాచ్‌లన్నీ వర్షం కారణంగా రద్దయ్యాయి. వీటిలో భారత్-న్యూజిలాండ్, బంగ్లాదేశ్-సౌతాఫ్రికా మ్యాచ్‌లు కనీసం టాస్ కూడా పడకుండానే రద్దవగా.. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మ్యాచ్ మాత్రం మధ్యలో ఆగిపోయింది. ఒక ఇన్నింగ్స్ పూర్తయ్యాక, రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలో వర్షం మొదలు కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ నబీ (37 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) అజేయమైన అర్ధసెంచరీతో రాణించగా.. ఇబ్రహీమ్ జద్రాన్ (35), ఉస్మాన్ ఘనీ (32 నాటౌట్) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. నవాజ్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 2.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. మహ్మద్ రిజ్వాన్ 0 పరుగులు, కెప్టెన్ బాబార్ ఆజమ్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. వార్మప్ మ్యాచ్‌లు రద్దు కావడంతో ఆయా జట్లు నిరాశకు లోనయ్యాయి. సూపర్-12 మ్యాచ్‌లను ముందు ఆడే వార్మప్ మ్యాచ్‌ల వల్ల పిచ్, వాతావరణం తదితర అంశాలపై అవగాహన వస్తుందని ఆయా జట్లు భావించాయి. అయితే ఈ మ్యాచ్‌లు వర్షార్పణం కావడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులూ నిరాశ చెందారు. మరోవైపు ఇవాళ క్వాలిఫయర్స్ గ్రూప్-బిలో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సూపర్ 12 ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరో మ్యాచ్‌లో వెస్టిండీస్.. డూ ఆర్ డై సమరంలో జింబాబ్వేను ఢీకొడుతుంది. ఇదిలా ఉంటే, సూపర్-12 దశ మ్యాచ్‌లు అక్టోబర్ 22 నుంచి ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. 23న టీమిండియా.. దాయాది పాక్‌ను ఢీకొట్టనుంది. -
సహనం కోల్పోయిన షాదాబ్ ఖాన్.. 'కెప్టెన్‌గా పనికిరావు'
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. వార్మప్ మ్యాచ్‌కు పాక్ రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజం దూరంగా ఉండడంతో షాదాబ్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. సాధారణంగా కెప్టెన్ అనేవాడు ఎంతో కూల్‌గా ఉంటూ జట్టు సభ్యులను కంట్రోల్ చేస్తూ తన ఆటను కొనసాగిస్తాడు. కానీ కెప్టెన్ సహనం కోల్పోయి తోటి ఆటగాళ్లపై ఆగ్రహం ప్రదర్శించడం మంచిది కాదు. అయితే షాదాబ్ ఖాన్ మాత్రం ఒక రనౌట్ విషయంలో తోటి ఆటగాడిపై అసహనం వ్యక్తం చేసి ట్రోల్స్ బారిన పడ్డాడు. ఒక్క రనౌట్‌కే సహనం కోల్పోతే ఎలా.. ఇలా అయితే కెప్టెన్‌గా పనికిరావు అంటూ కామెంట్ చేశారు. విషయంలోకి వెళితే.. అప్పటికే లియామ్ లివింగ్‌స్టోన్ మంచి బ్యాటింగ్ కనబరుస్తున్నాడు. షాదాబ్ ఖాన్ వేసిన బంతిని లివింగ్‌స్టోన్ ఆఫ్‌సైడ్ దిశగా ఆడాడు. లివింగ్‌స్టోన్ సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న హ్యారీ బ్రూక్‌కు కాల్ ఇచ్చినప్పటికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే బంతి దూరంగా వెళ్లడంతో అప్పుడు స్పందించిన బ్రూక్ పరిగెత్తాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న హారిస్ రౌఫ్ త్రో వేయడంలో విఫలమయ్యాడు. బంతి వికెట్లకు తగిలి ఉంటే లివింగ్‌స్టోన్ కచ్చితంగా ఔటయ్యేవాడు. అంతే కోపం కట్టలు తెంచుకున్న షాదాబ్ ఖాన్ హారిస్ రౌఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్ ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 14.4 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. హ్యారీ బ్రూక్ 45 నాటౌట్, లివింగ్‌స్టోన్ 35, సామ్ కరన్ 33 నాటౌట్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 19 ఓవర్లలో( వర్షం అంతరాయం వల్ల ఒక ఓవర్ కుదింపు) 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. షాన్ మసూద్ 39, ఇప్తికర్ అహ్మద్ 22, మహ్మద్ వసీమ్ 26 పరుగులు చేశారు. Pakistan being Pakistan! #ENGvPAK #Pakistan #England #CricketTwitter pic.twitter.com/SQsU3qzNYp — Vaishnavi Iyer (@Vaishnaviiyer14) October 17, 2022 చదవండి: న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్.. సూర్యకుమార్ దూరం! -
న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్.. సూర్యకుమార్ దూరం!
ఆస్ట్రేలియాతో తొలి వార్మప్ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు రెండో వార్మప్ మ్యాచ్‌కు సిద్దమైంది. బ్రేస్బేన్ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడు స్థానంలో ఆల్‌రౌండర్ దీపక్ హుడాకు అవకాశం ఇవ్వాలి అని జట్టు మేనేజేమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అధ్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 50 పరుగులు చేశాడు. అదే విధంగా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు కూడా రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే.. తమ తొలి వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలైంది. కేవలం 98 పరుగులకే కివీస్ ఆలౌటైంది. ఇక భారత్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌కు స్టార్ ఆటగాడు డెవాన్ కాన్వే, ఆల్‌రౌండర్ జిమ్మీ నిషమ్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అశ్విన్, చాహల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ న్యూజిలాండ్: డెవాన్ కాన్వే మార్టిన్ గప్టిల్, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నిషమ్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ చదవండి: Pat Cummins: ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్‌గా పాట్ కమిన్స్.. తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు -
వార్మప్ మ్యాచ్ ఆడి వరల్డ్‌కప్ గెలవలేము కదా.. ఆసీస్ కెప్టెన్ వ్యంగ్యం
టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 17) జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అఖరి ఓవర్ వరకు ఇరు జట్లకు విజయావకాశాలు సమానంగా ఉండాయి. అయితే, ఆఖరి ఓవర్లో షమీ మ్యాజిక్ చేసి మ్యాచ్‌ను ఆసీస్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. గెలుపుకు 11 పరుగులు కావల్సిన తరుణంలో షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్‌కు విజయాన్నందించాడు. తొలి రెండు బంతులకు 4 పరుగులిచ్చిన అతను.. ఆఖరి 4 బంతుల్లో 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధిని ఒంటిచేత్తో ఓడించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (33 బంతుల్లో 50; 6 ఫోర్లు, సిక్స్) అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఆసీస్ ఆది నుంచే చెలరేగినప్పటికీ.. ఆఖరి ఓవర్లో షమీ వారిని దారుణంగా దెబ్బకొట్టాడు. కెప్టెన్ ఫించ్ (54 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన అర్ధసెంచరీ సాధించి జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. స్మిత్, మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (35), మ్యాక్స్‌వెల్ (23) మినహా జట్టు మొత్తం విఫలమైంది. కాగా, ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న ఫించ్.. టీమిండియా గెలుపుపై స్పందిస్తూ వ్యంగ్యంగా మాట్లాడాడు. తొలుత తన ఇన్నింగ్స్ సంతృప్తినిచ్చిందని డబ్బా కొట్టుకున్న అతను.. టీమిండియా సాధించిన విజయాన్ని లైట్‌గా తీసుకున్నాడు. తాము గెలిచి ఉంటే బాగుండేది అని అంటూనే.. వార్మప్ మ్యాచ్‌లు ఆడి వరల్డ్‌కప్ గెలవలేము కదా అంటూ పరోక్షంగా భారత విజయాన్ని చులకన చేశాడు. ఈ అంశంపై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతుంది. -
చెలరేగిన నబీ, నిప్పులు చెరిగిన ఫరూఖీ.. బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన అఫ్ఘాన్
T20 WC Warm Up Matches: టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ (అక్టోబర్ 17) జరిగిన మూడో వార్మప్ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో ఆతిధ్య ఆస్ట్రేలియాను మట్టికరిపించగా.. రెండో మ్యాచ్‌లో పాక్‌పై ఇంగ్లండ్ సునాయాస విజయం సాధించింది. బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మూడో మ్యాచ్‌లో అప్ఘాన్ జట్టు అద్భుతమైన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో చెలరేగి తమకంటే మెరుగైన బంగ్లాదేశ్‌ను 62 పరుగుల భారీ తేడాతో ఓడించి శభాష్ అనిపించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఇబ్రహీమ్ జద్రాన్ (39 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మహ్మద్ నబీ (17 బంతుల్లో 41 నాటౌట్; ఫోర్, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ అహ్మద్, షకీబ్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఫజల్ హాక్ ఫారూఖీ (3/9), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (1/5), మహ్మద్ నబీ (1/11) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 98 పరుగులకు మాత్రమే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. ఆద్యంతం బంగ్లా బ్యాటింగ్ చెత్తగా సాగింది. -
Ind Vs Aus: అందుకే ఆఖరి ఓవర్ షమీతో వేయించాం: రోహిత్ శర్మ
T20 World Cup Warm Ups- Australia vs India- Rohit Sharma: టీ20 వరల్డ్ కప్-2022.. టీమిండియాతో వార్మప్ మ్యాచ్.. ఆస్ట్రేలియా గెలవాలంటే.. ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం.. అయితే అప్పటి వరకు టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీని ఆడించని.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ... అనూహ్యంగా అతడి చేతికి బంతినిచ్చాడు. సుదీర్ఘ కాలం తర్వాత వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న షమీ.. తొలుత యార్కర్ వేయడానికి ప్రయత్నించి విఫలం కాగా ఆసీస్ బ్యాటర్ ప్యాట్ కమిన్స్ రెండు పరుగులు రాబట్టాడు. మరుసటి బంతిని యార్కర్‌గా మలచడంలో షమీ సఫలమైనప్పటికీ.. కమిన్స్ ఈసారి జాగ్రత్తగా ఆడి మరో రెండు పరుగులు రాబట్టాడు. దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. చావో రేవో తేల్చుకోవాల్సి పరిస్థితిలో షమీ వరుసగా వికెట్లు పడగొట్టాడు. తొలుత కమిన్స్‌ను బౌల్డ్ చేసిన అతడు అష్టన్ అగర్‌ను రనౌట్ చేశాడు. ఆ తర్వాత వరుసగా జోష్ ఇంగ్లిస్, రిచర్డ్సన్లను పెవిలియన్‌కు పంపి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. తొలుత దూరంగానే అయితే, షమీ జట్టుతోనే ఉన్నా ఆది నుంచి ఒక్క ఓవర్ కూడా వేయించని రోహిత్ శర్మ.. ఆఖరి ఓవర్లో అదీ నరాలు తెగే ఉత్కంఠ రేపిన తరుణంలో అతడిని బౌలింగ్‌కు పంపడంపై ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్.. ‘‘చాలా రోజుల తర్వాత అతడు జట్టులోకి తిరిగి వచ్చాడు. అందుకే ఆఖర్లో పంపించాం కుదురుకునేందుకు టైం పడుతుంది. నిజానికి తనకూ ఒక ఓవర్ వేసే అవకాశం ఇవ్వాలనుకున్నాం. అది కూడా సవాలుతో కూడుకున్నదై ఉండాలని భావించాం. అందుకే ఫైనల్ ఓవర్ తనతో వేయించాం. ఇక ఆఖరి ఓవర్లో అతడు ఏం చేశారో మీరే చూశారు కదా!’’ అని షమీని చివర్లో ఎందుకు పంపాడో చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది ప్రపంచకప్ తర్వాత షమీ టీమిండియ తరఫున ఒక్క టీ20 కూడా ఆడలేదు. వరల్డ్‌కప్-2022 టోర్నీ నేపథ్యంలో స్టాండ్‌బైగా ఎంపికైన అతడు.. జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో దూరం కావడంతో ప్రధాన జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో ఒక ఓవర్ వేసిన అతడు నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. చదవండి: WI Vs SCO: మాకిది ఘోర పరాభవం.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో: విండీస్ కెప్టెన్ T20 WC Warm Up Matches: చెలరేగిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. పాక్‌పై సునాయాస విజయం T20 WC 2022: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తప్పదా? ఇంతకీ అతడికి ఏమైంది? View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC: ఇంగ్లండ్ బ్యాటర్ల వీరవిహారం.. పాక్‌పై సునాయాస విజయం
టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లు సైతం రంజుగా సాగుతున్నాయి. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (అక్టోబర్ 17) ఉదయం జరిగిన మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగగా (భారత్ విజేత).. ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. పాక్ నిర్ధేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లీష్ బ్యాటర్లు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులకు పవర్ హిట్టింగ్ మజాను అందించారు. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (1), అలెక్స్ హేల్స్ (9) తక్కువ స్కోర్లకే ఔటైనా, ఆతర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), లియామ్ లివింగ్‌స్టోన్ (16 బంతుల్లో 28; ఫోర్, 2 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (24 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సామ్ కర్రన్ (14 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తమదైన స్టయిల్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. బౌండరీలు, సిక్సర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫలితంగా ఇంగ్లండ్ 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని (163/4) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు షాన్ మసూద్ (22 బంతుల్లో 39; 7 ఫోర్లు), హైదర్ అలీ (16 బంతుల్లో 18; 3 ఫోర్లు) పాక్‌కు ఓ మోస్తరు ఆరంభాన్ని అందించగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. తాత్కాలిక కెప్టెన్ షాదాబ్ ఖాన్ (12), ఇఫ్తికార్ అహ్మద్ (22), ఖుష్దిల్ (0), ఆసిఫ్ అలీ (14), నవాజ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో మహ్మద్ వసీమ్ జూనియర్ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్) వేగంగా పరుగులు సాధించడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే 2 వికెట్లు పడగొట్టగా.. బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ సాధించారు. -
ENG VS PAK: రాణించిన షాన్ మసూద్.. ఇంగ్లండ్ టార్గెట్ 161
టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 17) ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓ మోస్తరు స్కోర్ సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి పాక్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు షాన్ మసూద్ (22 బంతుల్లో 39; 7 ఫోర్లు), హైదర్ అలీ (16 బంతుల్లో 18; 3 ఫోర్లు) ఓ మోస్తరు ఆరంభాన్ని అందించగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. తాత్కాలిక కెప్టెన్ షాదాబ్ ఖాన్ (12), ఇఫ్తికార్ అహ్మద్ (22), ఖుష్దిల్ (0), ఆసిఫ్ అలీ (14), నవాజ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో మహ్మద్ వసీమ్ జూనియర్ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్) వేగంగా పరుగులు సాధించడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే 2 వికెట్లు పడగొట్టగా.. బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లివింగ్‌స్టోన్‌లకు తలో వికెట్ దక్కింది. అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (1), అలెక్స్ హేల్స్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వన్ డౌన్లో వచ్చిన బెన్ స్టోక్స్ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కాసేపు మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. 7.2 ఓవర్లు పూర్తియ్యే సరికి ఇంగ్లండ్ స్కోర్ 63/3గా ఉంది. లివింగ్‌స్టోన్ (5), హ్యారీ బ్రూక్ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే 70 బంతుల్లో 98 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. -
కొట్టాలనే మూడ్ లేదు.. ఆసీస్‌తో మ్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ అభిమానులకు అసలుసిసలు క్రికెట్ మజాను అందిస్తుంది. టోర్నీ ప్రారంభమైన రెండు రోజుల్లో రెండు సంచలనాలు నమోదయ్యాయి. ఆరంభ మ్యాచ్‌లో పసికూన నమీబియా.. ఆసియా ఛాంపియన్ శ్రీలంకకు షాకివ్వగా.. ఇవాళ మరో పసికూన స్కాట్లాండ్.. టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించి సంచలన విజయం నమోదు చేసింది. క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల పరిస్థితి ఇలా ఉంటే.. వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించిన జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌ల పరిస్థితి మరో రేంజ్లో ఉంది. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్ 17) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో మ్యాచ్ ఆఖరి బంతి వరకు సాగింది. ఆఖరి ఓవర్లో షమీ మ్యాజిక్ చేసి 3 వికెట్లు పడగొట్టి కేవలం 4 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆసీస్ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. @surya_14kumar - Maarne ka mood hi nahi ho raha yaar Got out very next ball #AUSvIND #T20WorldCup #T20WorldCup2022 pic.twitter.com/TWBM2zSAtA — Aditya Kukalyekar (@adikukalyekar) October 17, 2022 ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (33 బంతుల్లో 50; 6 ఫోర్లు, సిక్స్) అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఆసీస్ ఆది నుంచి చెలరేగినప్పటికీ.. ఆఖరి ఓవర్లో షమీ వారి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌటైంది. ఇదిలా ఉంటే, భారత ఇన్నింగ్స్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్.. నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌తో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. సూర్యకుమార్.. అక్షర్‌తో మాట్లాడిన మాటలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. సూర్య హాఫ్ సెంచరీ పూర్తి చేయగానే అక్షర్‌తో మాట్లాడతూ.. ఇవాళ భారీ షాట్లు మూడ్ లేదని అన్నాడు. అన్న ప్రకారమే ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
T20 WC: అయ్యో కార్తిక్! ఇప్పుడంటే ఓకే! అప్పుడు కూడా ఇలాగే చేశావనుకో!
T20 World Cup Warm Ups- Australia vs India: టీ20 ప్రపంచకప్-2022లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అసలైన పోరుకు ముందు టీమిండియా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సోమవారం (అక్టోబరు 17)న బ్రిస్బేన్ వేదికగా ఆసీస్‌తో తలపడింది రోహిత్ సేన. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఓపెనర్ కేఎల్ రాహుల్(57), మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(50) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది టీమిండియా. ఫించ్ కెప్టెన్ ఇన్నింగ్స్ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు మిచెల్ మార్ష్(35), ఆరోన్ ఫించ్(76) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. స్టీవ్ స్మిత్(11) తొందరగానే అవుట్‌కాగా.. ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ క్రీజులోకి వచ్చీరాగానే చహల్ వేసిన బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాల్ బ్యాట్‌ను అంచును తాకింది. కానీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ మాక్సీ ఇచ్చిన క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. 11వ ఓవర్లో జరిగిన ఈ ఘటన తర్వాత లైఫ్ పొందిన మాక్స్వెల్.. 16 బంతుల్లోనే 23 పరుగులు సాధించాడు. అయితే, 15 ఓవర్ మూడో బంతికి భువీ మాక్సీని బోల్తా కొట్టించగా.. డీకే క్యాచ్ అందుకోవడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. అయ్యో ఏంటిది కార్తిక్? కాగా.. ఇటీవలి కాలంలో కార్తిక్ ఈజీ క్యాచ్‌లు మిస్ చేస్తుండటం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. రిషభ్ పంత్‌ను కాదని డీకేకు అవకాశాలు ఇస్తున్నారని.. దీంతో అతడి బాధ్యత మరింత పెరిగింది కాబట్టి జాగ్రత్తగా ఆడాలని సూచిస్తున్నారు. ఇది వార్మప్ మ్యాచ్ కాబట్టి సరిపోయింది. కానీ.. ప్రధాన మ్యాచ్‌లలో ముఖ్యంగా పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో గనుక ఇలాంటి తప్పిదాలు చేస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వార్మప్ మ్యాచ్‌లో ఆసీస్ టాపార్డర్ హిట్ అయినా, లోయర్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తన పదునైన బంతులతో కంగారూలను కంగారెత్తించాడు. ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. దీంతో ఆరు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. చదవండి: T20 WC 2022 Warm Ups: అక్టోబరు 17న ఆసీస్‌తో టీమిండియా! వార్మప్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు T20 WC 2022: జట్లు, పాయింట్ల కేటాయింపు విధానం, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర పూర్తి వివరాలు -
నిమిషాల వ్యవధిలో రెండు అద్భుతాలు.. దటీజ్ కోహ్లి
ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో మెరిశాడు. కోహ్లి కొట్టిన డైరెక్ట్ త్రోకు టిమ్ డేవిడ్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హర్షల్ పటేల్ వేసిన రెండో బంతిని జోష్ ఇంగ్లిస్ ఆన్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే క్విక్ సింగిల్ కోసం ఇంగ్లిస్ ప్రయత్నించడంతో టిమ్ డేవిడ్ స్పందించాడు. అయితే ఇక్కడే కోహ్లి తన ఫీల్డింగ్ మ్యాజిక్ చూపించాడు. బంతిని అందుకున్న కోహ్లి బులెట్ వేగంతో త్రో వేయగా.. టిమ్ డేవిడ్ క్రీజులోకి రాకముందే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో డేవిడ్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత కోహ్లి తీసుకున్న స్టన్నింగ్ క్యాచ్ కూడా చూసి తీరాల్సిందే. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో షమీ వేసిన లో ఫుల్‌టాస్ బంతిని లాంగాన్ దిశగా ఆడాడు. అది సిక్స్ అని అంతా భావించారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లి అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. అయితే తన కాలు బౌండరీ తాకుతుందేమోనన్న అనుమానం కలిగినప్పటికి కోహ్లి జాగ్రత్తపడ్డాడు. దీంతో కమిన్స్ ఏడు పరుగుల చేసి పెవిలియన్ చేరాల్సి వచ్చింది. దీంతో బ్యాటింగ్‌లో రాణించనప్పటికి కోహ్లి ప్రదర్శనపై అభిమానులు సంతోషంగా ఉన్నారు. ''ఫీల్డింగ్ కోసమైనా కోహ్లిని తుదిజట్టులో ఉండాల్సిందే.. నిమిషాల వ్యవధిలో రెండు అద్భుతాలు చేసి చూపెట్టాడు.. దటీజ్ కింగ్ కోహ్లి'' అంటూ కామెంట్ చేశారు. What a throw King Kohli 👑💯 pic.twitter.com/oOGuNGtrJS — Vinay (@YouKnowVK_) October 17, 2022 What a Catch 🔥 👑 #kohli ra luchaaaass pic.twitter.com/1C13jWYQbA — Virat Akhil Hari (@ViratAkhilHari8) October 17, 2022 ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆఖర్లో షమీ మ్యాజిక్‌తో టీమిండియా విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటై ఏడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మహ్మద్ షమీ ఆఖరి ఓవర్లో నాలుగు పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 76 పరుగులు చేయగా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 23 పరుగులు చేశాడు. అంతకముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌లు అర్థశతకాలతో మెరిశారు. చదవండి: చెలరేగిన సూర్యకుమార్.. తగ్గేదే లే -
చెలరేగిన సూర్యకుమార్.. తగ్గేదే లే
టి20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ తన బ్యాటింగ్ జోరును కంటిన్యూ చేస్తున్నాడు. ఎవరు విఫలమైన తాను మాత్రం తగ్గేదే లే అన్న రీతిలో బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో సూర్య కుమార్ మరోసారి ఫిప్టీతో అలరించాడు. 33 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో సరిగ్గా 50 పరుగులు చేసిన సూర్యకుమార్ కేన్ రిచర్డ్సన్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అయితే బ్యాటింగ్ చేసినంతసేపు సూర్య తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. ఈ ప్రపంచకప్‌లో సూర్యకుమార్ టీమిండియాకు కచ్చితంగా పెద్ద వెన్నముక అవడం గ్యారంటీ. ఇప్పటికే ఈ ఏడాది టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో సూర్యకుమార్ తొలి స్థానంలో నిలిచాడు. వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 59 పరుగులకే టాప్ స్కోరర్ కాగా.. సూర్యకుమార్ 50 పరుగులు చేసి ఔటైనప్పటికి తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. దినేశ్ కార్తిక్ 20 పరుగులతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కేన్ రిచర్డ్సన్ నాలుగు వికెట్లు తీయగా.. మ్యాక్స్‌వెల్, ఆస్టన్ అగర్, మిచెల్ స్టార్క్‌లు తలా ఒక వికెట్ తీశారు. Suryakumar Yadav show, this is just incredible consistency, fifty from 32 balls. pic.twitter.com/dzsQuwSrm4 — Johns. (@CricCrazyJohns) October 17, 2022 -
ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్ .. టీమిండియా గెలిచేనా!
ఆ్రస్టేలియాలోని పరిస్థితులకు అలవాటు పడేందుకు అందరికంటే ముందుగా అక్కడికి చేరుకున్న భారత జట్టు స్థానిక జట్లతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లాడింది. ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో నెగ్గిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఓటమి పాలైంది. అయితే ఈ రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కావడంతో పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కానీ అసలు మ్యాచ్‌లకు ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌లో పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. వార్మప్ మ్యాచ్ కదా అని లైట్ తీసుకుంటే అసలుకే ఎసరు వస్తుంది. ఎందుకంటే వార్మప్‌లో రాణించిన దానిని బట్టే టీమిండియా ఆటతీరుపై ఒక అంచనా వచ్చే అవకాశముంది. కాబట్టి ఇరుజట్లు ఈ మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకోనున్నాయి. ఇక టి20 ప్రపంచకప్ కోసం చాంపియన్ అయిన ఆస్ట్రేలియా ఫించ్ కెప్టెన్సీలో ఆడేందుకు సిద్ధమైంది. ఐసీసీ ఏర్పాటు చేసిన వార్మప్ మ్యాచ్‌లో ఇరుజట్లు నుంచి ప్రధాన జట్లు బరిలోకి దిగనున్నాయి. ఉదయం గం. 8: 30 నుంచి ‘స్టార్ స్పోర్ట్స్–1’లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. -
బ్రిస్బేన్‌లో ల్యాండైన టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ కౌంట్‌డౌన్ షురూ అయ్యింది. మరికొద్ది గంటల్లో మహా సంగ్రామం మొదలుకానుంది. వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఇవాళ బ్రిస్బేన్ నగరంలో ల్యాండయ్యింది. అక్టోబర్ 17, 19 తేదీల్లో రోహిత్ సేన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను ఢీకొట్టనుంది. భారత ఆటగాళ్లు ఎయిర్‌పోర్ట్‌లో హుషారుగా కనిపించిన దృశ్యాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. Touchdown Brisbane 📍#TeamIndia pic.twitter.com/HHof4Le3mP— BCCI (@BCCI) October 15, 2022 ఇందులో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు నవ్వుతూ, ఫోటోలకు ఫోజులిస్తూ, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ చాలా ఉత్సాహంగా కనిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా జట్టు మొత్తం బిస్బేన్‌కు చేరుకుంది. వరల్డ్‌కప్‌లో పాల్గొనే 16 జట్ల కెప్టెన్లతో ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యేందుకు రోహిత్ మెల్బోర్న్కు వెళ్లాడు. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు రేపటి (అక్టోబర్ 16) నుంచి ప్రారంభంకానున్నాయి. శ్రీలంక-నమీబియా మ్యాచ్‌తో గ్రూప్ దశ మ్యాచ్‌లు మొదలుకానుండగా.. సూపర్-12 మ్యాచ్‌లు ఈనెల 22 నుంచి ప్రారంభమవుతాయి. ఈనెల 23న భారత్.. తమ తొలి సమరంలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆతర్వాత 27న గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో, 30న సౌతాఫ్రికాతో, నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో, నవంబర్ 6న గ్రూప్-బిలో తొలి స్థానంలో ఉన్న జట్లతో తలపడనుంది. -
T20 WC: అక్టోబరు 17న రంగంలోకి టీమిండియా! వార్మప్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా సహా పలు జట్లు ఆసీస్‌కు చేరుకుని ప్రాక్టీసు కూడా మొదలుపెట్టేశాయి. #TeamIndia had a light training session yesterday at the WACA. Our strength and conditioning coach, Soham Desai gives us a lowdown on the preparations ahead of the @T20WorldCup pic.twitter.com/oH1vuywqKW — BCCI (@BCCI) October 8, 2022 ఇక అసలైన పోరుకు సన్నద్ధమయ్యే క్రమంలో ఆస్ట్రేలియా, ఇండియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ సహా అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, నమీబియా, ఐర్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే, యూఏఈ, పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు మీకోసం... ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లు- 2022 పూర్తి షెడ్యూల్, టైమింగ్స్(భారత కాలమానం ప్రకారం) అక్టోబరు 10, సోమవారం ►వెస్టిండీస్ వర్సెస్ యూఏఈ సమయం: ఉదయం ఐదున్నర గంటలకు ఆరంభం ►స్కాట్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ సమయం: ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఆరంభం అక్టోబరు 11, మంగళవారం ►శ్రీలంక వర్సెస్ జింబాబ్వే(ఉదయం తొమ్మిది గంటలకు ఆరంభం) ►నమీబియా వర్సెస్ ఐర్లాండ్ (మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆరంభం) అక్టోబరు 12, బుధవారం ►వెస్టిండీస్ వర్సెస్ నెదర్లాండ్స్ (మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆరంభం) అక్టోబరు 13, గురువారం ►జింబాబ్వే వర్సెస్ నమీబియా (ఉదయం ఐదున్నర గంటలకు) ►శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ (ఉదయం తొమ్మిదిన్నర గంటలకు) ►స్కాట్లాండ్ వర్సెస్ యూఏఈ (మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు) అక్టోబరు 17, సోమవారం ►ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (ఉదయం తొమ్మిదిన్నర గంటలకు) ►న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (ఉదయం తొమ్మిదిన్నర గంటలకు) ►ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ (మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు) ►అఫ్గనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు) అక్టోబరు 19, బుధవారం ►అఫ్గనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ (ఉదయం ఎనిమిదిన్నర గంటలకు) ►బంగ్లాదేశ్ వర్సెస్ సౌతాఫ్రికా (మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు) ►న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా (మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు) ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడంటే! భారత అభిమానుల కోసం ఎంపిక చేసిన కొన్ని ప్రధాన జట్ల వార్మప్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కాగా అక్టోబరు 16న ఆరంభమై.. నవంబరు 13న ఈ మెగా ఈవెంట్ ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. జట్ల వివరాలు ఇండియా రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్. స్టాండ్‌బై ప్లేయర్స్: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చహర్ శ్రీలంక దసున్ షనక (కెప్టెన్), దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, భనుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, మహీశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, లాహిరు కుమార, దిల్షాన్ మధుశంక, ప్రమోద్ మదుషన్. స్టాండ్‌బై ప్లేయర్స్: అషెన్ బండార, ప్రవీణ్ జయవిక్రమ, దినేష్ చండిమల్, బినుర ఫెర్నాండో, నువానీడు ఫెర్నాండో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సిపి రిజ్వాన్ (కెప్టెన్), వృత్త్యా అరవింద్, చిరాగ్ సూరి, ముహమ్మద్ వసీం, బాసిల్ హమీద్, ఆర్యన్ లక్రా, జవార్ ఫరీద్, కాషిఫ్ దౌద్, కార్తీక్ మెయ్యప్పన్, అహ్మద్ రజా, జహూర్ ఖాన్, జునైద్ సిద్ధిక్, సాబిర్ అలీ, అలీషాన్ షరాఫు, అయాన్ ఖాన్. స్టాండ్‌బై ప్లేయర్స్: సుల్తాన్ అహ్మద్, ఫహద్ నవాజ్, విష్ణు సుకుమారన్, ఆదిత్య శెట్టి, సంచిత్ శర్మ నమీబియా గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జెజె స్మిత్, దివాన్ లా కాక్, స్టీఫన్ బార్డ్, నికోల్ లాఫ్టీ ఈటన్, జాన్ ఫ్రైలింక్, డేవిడ్ వైస్, రూబెన్ ట్రంపెల్మాన్, జేన్ గ్రీన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, తంగేని లుంగామెని, మైఖేల్ వాన్ లింగేన్, బెన్ షికోంగో, కార్ల్ లోహన్నుక్, కార్ల్ బిర్కెన్‌స్టాక్, హెలావో యా ఫ్రాన్స్ నెదర్లాండ్స్ స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), కోలిన్ అకెర్మాన్, షరీజ్ అహ్మద్, లోగాన్ వాన్ బీక్, టామ్ కూపర్, బ్రాండన్ గ్లోవర్, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్, ఫ్రెడ్ క్లాసెన్, బాస్ డి లీడే, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, స్టీఫన్ మైబర్గ్, తేజా నిడమనూరు, మాక్స్ ఓ'డౌడ్, టిమ్ ప్రింగిల్, విక్రమ్ సింగ్. ఐర్లాండ్ ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్), మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, గరెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, స్టీఫెన్ డోహెనీ, ఫియోన్ హ్యాండ్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, కోనార్ ఓల్ఫెర్ట్, సిమి సింగ్, పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, క్రైగ్ యంగ్ స్కాట్లాండ్ రిచర్డ్ బెరింగ్టన్ (కెప్టెన్), జార్జ్ మున్సే, మైఖేల్ లీస్క్, బ్రాడ్లీ వీల్, క్రిస్ సోల్, క్రిస్ గ్రీవ్స్, సఫ్యాన్ షరీఫ్, జోష్ డేవీ, మాథ్యూ క్రాస్, కాలమ్ మాక్లియోడ్, హమ్జా తాహిర్, మార్క్ వాట్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, మైఖేల్ జోన్స్, క్రైగ్ వాలెస్. వెస్టిండీస్ నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, యానిక్ కరియా, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెకాయ్, రేమాన్ రీఫర్, ఓడియన్ స్మిత్, షమార్ బ్రూక్స్. జింబాబ్వే క్రెయిగ్ ఎర్విన్ (సి), ర్యాన్ బర్ల్, రెగిస్ చకబ్వా, టెండై చటారా, బ్రాడ్లీ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ నగరవ, సికందర్ రజా, మిల్టన్ శుంభా, సీన్ విలియమ్స్ స్టాండ్‌బై ప్లేయర్స్: తనకా చివాంగా, ఇన్నోసెంట్ కైయా, కెవిన్ కసుజా, తాడివానాషే మారుమణి, విక్టర్ న్యౌచి. అఫ్గనిస్తాన్ మహ్మద్ నబీ(కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, కైస్ అహ్మద్, ఉస్మాన్ ఘని, ముజీబ్జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సలీం సఫీ, రషీద్ ఖాన్, ఇబ్రహీం జద్రాన్, డార్విష్ రసూలీ, ఫజల్ హక్ ఫారుకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్, నవీన్ ఉల్ హక్. రిజర్వు ప్లేయర్లు: అఫ్సర్ జజాయ్, షరాఫుదీన్ అష్రఫ్, గుల్బదిన్ నాయీబ్, రహ్మత్ షా. ఆస్ట్రేలియా ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), టిమ్ డేవిడ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మూథ్యూ వేడ్ , డేవిడ్ వార్నర్, ఆడం జంపా ఇంగ్లండ్ జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ మరియు అలెక్స్ హేల్స్. స్టాండ్‌బై ప్లేయర్స్: లియామ్ డాసన్, రిచర్డ్ గ్లీసన్, టైమల్ మిల్స్ న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్ సౌతీ, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, మార్టిన్ గప్టిల్, లాచ్లాన్ ఫెర్గూసన్, డెవాన్ కాన్వే, మార్క్ చాప్మన్, మైఖేల్ బ్రేస్‌వెల్, ట్రెంట్ బౌల్ట్, ఫిన్ అలెన్. బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్(కెప్టెన్), సబ్బీర్ రెహమాన్, మెహిది హసన్ మిరాజ్, అఫీఫ్ హుస్సేన్, మొస్సాడెక్ హొస్సేన్, లిట్టన్ దాస్, యాసిర్ అలీ, నూరుల్ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్, సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, ఇబాదత్ హుస్సేన్, హసన్ మహ్మద్, నజ్ముల్ హొసేన్, నాసుమ్ అహ్మద్ స్టాండ్‌బై ప్లేయర్స్: షోరిఫుల్ ఇస్లాం, షేక్ మెహదీ హసన్, రిషద్ హొస్సేన్, సౌమ్య సర్కార్ పాకిస్తాన్ బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హారీస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, షాన్ మసూద్, ఉస్మాన్ ఖాదిర్. స్టాండ్‌బై ప్లేయర్స్: ఫఖర్ జమాన్, మహ్మద్ హరీస్, షానవాజ్ దహానీ సౌతాఫ్రికా తెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్, రీజా హెండ్రిక్స్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, కగిసో రబడ, రిల్లీ రోసౌవ్, ట్రిస్టన్ స్ట్రబ్స్ స్టాండ్‌బై ప్లేయర్స్: జార్న్ ఫోర్టుయిన్, మార్కో జాన్సెన్, ఆండిల్ ఫెహ్లుక్వయో. చదవండి: T20 WC 2022: వరల్డ్‌కప్ టోర్నీకి ముందు ఇంగ్లండ్‌కు ఒక శుభవార్త.. ఓ బ్యాడ్‌న్యూస్! T20 World Cup 2022: టీ20 క్రికెట్ చరిత్రలో.. ఆఫ్గానిస్తాన్- ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ -
క్లాసెన్ సుడిగాలి శతకం.. సౌతాఫ్రికా భారీ స్కోర్
ఇంగ్లండ్ గడ్డపై రెండు నెలల పాటు సాగే సుదీర్ఘ పర్యటనలో భాగంగా సౌతాఫ్రికా ఇవాళ (జులై 14) ఇంగ్లండ్ లయన్స్‌ను రెండో వార్మప్ మ్యాచ్‌లో ఢీకొంది. తొలి మ్యాచ్‌లో లయన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైన ప్రొటీస్.. ఈ మ్యాచ్‌లో కోలుకున్నట్లు కనిపించింది. ఈ 50 ఓవర్స్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగుల భారీ స్కోర్ చేసింది. వికెట్‌కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సుడిగాలి శతకంతో (85 బంతుల్లో 123; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడగా.. వాన్ డెర్ డస్సెన్ (61), ఫెలుక్వాయో (67) అర్ధసెంచరీలతో రాణించారు. ఇదిలా ఉంటే, జులై 19న ఇంగ్లండ్‌తో జరిగే తొలి వన్డేతో దక్షిణాఫ్రికా సిరీస్ మొదలవుతుంది. జులై 22, 24 తేదీల్లో రెండు, మూడు వన్డేలు, ఆతర్వాత 27, 28, 31 తేదీల్లో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్.. ఆగస్ట్ 17-సెప్టెంబర్ 12 వరకు 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో బరిలోకి దిగనుండటం విశేషం. టెస్ట్‌లకు డీన్ ఎల్గర్, వన్డేలకు కేశవ్ మహారాజ్, టీ20లకు డేవిడ్ మిల్లర్లు సౌతాఫ్రికా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. చదవండి: డోపింగ్‌కు పాల్పడ్డ బంగ్లాదేశ్ పేసర్‌పై వేటు -
హర్షల్ ఆల్‌రౌండ్ షో.. రెండో మ్యాచ్‌లోనూ టీమిండియాదే విజయం
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఓ పక్క టెస్ట్ మ్యాచ్‌లో చెలరేగి ఆడుతుంటే, మరో పక్క యువ భారత జట్టు టీ20ల్లో దుమ్మురేపుతోంది. డెర్బీషైర్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన యువ భారత్.. నార్తంతాంప్టన్షైర్ క్లబ్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లోనూ సత్తా చాటింది. నిన్న జరిగిన ఈ మ్యాచ్‌లో డీకే సారధ్యంలోని యంగ్ ఇండియా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. నామమాత్రపు స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. టాపార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలం కాగా.. కెప్టెన్ డీకే (26 బంతుల్లో 34; 3 ఫోర్లు, సిక్స్), హర్షల్ పటేల్ (36 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) టీమిండియాను ఆదుకున్నారు. నార్తంతాంప్టన్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 3, బక్, ఫ్రెడ్డీ హెల్డ్రిచ్ తలో 2 వికెట్లు, కాబ్ ఓ వికెట్ పడగొట్టారు. ఛేదనలో భారత బౌలర్లు విజృంభించడంతో నార్తంతాంప్టన్ 19.3 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో సైఫ్ జైబ్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, చహల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ధ్ కృష్ణ, వెంకటేశ్ అయ్యర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. హర్షల్ పటేల్ ఆల్‌రౌండర్ షోతో (54, 2/23) టీమిండియా వరుసగా రెండో టీ20లోనూ విజయం సాధించింది. చదవండి: వారెవ్వా... కెప్టెన్ బుమ్రా -
కెప్టెన్‌గా డీకే.. హుడా అర్ధ శతకం.. భారత్ ఘన విజయం
Derbyshire vs Indians, 1st T20 Warm-up Match: ఇంగ్లండ్‌తో సిరీస్ నేపథ్యంలో భారత్ డెర్బిషైర్ కౌంటీ జట్టుతో తొలి టీ20 వార్మప్ మ్యాచ్ ఆడింది. డెర్బీలోని కౌంటీ గ్రౌండ్ వేదికగా శుక్రవారం(జూలై 1) ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ ఏకంగా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ వార్మప్ మ్యాచ్‌లో వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ భారత జట్టును ముందుండి నడిపించాడు. టాస్ గెలిచి.. డెర్బిషైర్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో డెర్బిషైర్ జట్టు 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. హుడా అద్భుత ఇన్నింగ్స్! ఇక లక్ష్య ఛేదనకు దిగిన కార్తిక్ సేనకు ఓపెనర్ సంజూ శాంసన్(38 పరుగులు) శుభారంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(3 పరుగులు) పూర్తిగా విఫలమయ్యాడు. ఇక వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన దీపక్ హుడా మరోసారి సత్తా చాటాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేశాడు. హుడా అర్ధ శతకానికి సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ (36 పరుగలు నాటౌట్) తోడు కావడంతో భారత జట్టు 16.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ డీకే 7 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా జూలై 7 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ వార్మప్ మ్యాచ్‌లో విజయం సంగతి ఇలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా తమ అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపారు. ఆఖరి టెస్టు తొలి రోజు ఆట ముగిసిన తర్వాత పదకొండున్నర గంటల(భారత కాలమానం ప్రకారం) సమయంలో టీ20 తొలి వార్మప్ మ్యాచ్ ఆరంభమైంది. ఈ నేపథ్యంలో అటు టెస్టులో భారత్ మెరుగైన స్థితిలో ఉండటం.. మరోవైపు వార్మప్ మ్యాచ్‌లో విజయంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చదవండి: IND Vs ENG Test Day 1: పంత్ పరాక్రమం.. మెరుగైన స్థితిలో టీమిండియా India Vs England-Rishabh Pant: అద్భుతమైన షాట్లు.. నువ్వో సూపర్‌స్టార్: పంత్‌పై ప్రశంసల జల్లు 𝙁𝙖𝙡𝙘𝙤𝙣𝙨 𝙫 𝙄𝙣𝙙𝙞𝙖 🇮🇳@BCCI, Its been a pleasure.#ThisIsDerbyshire#Falcons #India #DERvIND pic.twitter.com/tIxSZuxRNr — Derbyshire CCC (@DerbyshireCCC) July 1, 2022 𝙒𝙄𝘾𝙆𝙀𝙏 ☝ Aitchison gets Hooda (59), caught by Hughes. IND: 134-3; Karthik joins Yadav (30*), 17 to win. Watch LIVE ⤵️ — Derbyshire CCC (@DerbyshireCCC) July 1, 2022 -
సిక్సర్‌తో పంత్ అర్థశతకం.. ఫామ్‌లోకి వచ్చినట్టేనా!
లీస్టర్‌షైర్, టీమిండియాల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ అర్థసెంచరీతో మెరిశాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌లో సూపర్ సిక్సర్ బాదిన ఆడిన పంత్ 72 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడిన పంత్ ఓవరాల్‌గా 87 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 76 పరుగులు సాధించాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్ బ్యాటర్‌గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. మరి తాజా ఇన్నింగ్స్‌తో పంత్ ఫామ్‌లోకి వచ్చినట్టేనా అని అభిమానులు కామెంట్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే లీస్టర్‌షైర్ 244 పరుగులకు ఆలౌట్ అయింది. పంత్ 76, రిషి పటేల్ 34, రోమన్ వాకర్ 34, లుయిస్ కింబర్ 31 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో షమీ, జడేజా చెరో మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, శార్దూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు తీశారు. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 246 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది. 5️⃣0️⃣ for @RishabhPant17! 👏 A top edged sweep flies for 6️⃣ and helps Pant reach a 𝐦𝐚𝐠𝐧𝐢𝐟𝐢𝐜𝐞𝐧𝐭 half-century. 🧹 🦊 LEI 204/6 𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌: https://t.co/DdQrXej7HC👈 🦊 #IndiaTourMatch | #LEIvIND | #TeamIndia pic.twitter.com/MndQrfAm1n — Leicestershire Foxes 🏏 (@leicsccc) June 24, 2022 చదవండి: 73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్.. దిగ్గజాల సరసన చోటు IND Vs LEIC: పుజారా డకౌట్.. షమీ వింత సెలబ్రేషన్ -
పుజారా డకౌట్.. షమీ వింత సెలబ్రేషన్
కౌంటీల్లో వరుస సెంచరీలో దుమ్మురేపిన చతేశ్వర్ పుజారా డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా లీస్టర్‌షైర్‌తో వార్మప్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా లీస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో సున్నాకే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. షమీ వేసిన గుడ్‌లెంగ్త్ డెలివరీకి పుజారా వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. పుజారా, షమీ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు.ఆ తర్వాత పెవిలియన్‌కు వెళ్తున్న పుజారా వైపు పరిగెత్తుకొచ్చిన షమీ వెనుక నుంచి అతన్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజును 246/8తో ముగించిన టీమిండియా.. లీస్టర్షైర్లోని మిగతా టీమిండియా ఆటగాళ్లకు ప్రాక్టీస్ అవకాశం ఇవ్వడం కోసం అదే స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. అయితే ఉదయం సెషన్లో లీస్టర్‌షైర్ రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సామ్ ఇవన్స్, పుజారాలు ఔటయ్యాకా.. మరో ఓపెనర్ లుయిస్ కింబర్(31), జోయ్ ఎవిసన్(22) ఇన్నింగ్స్‌ను కాసేపు నడిపించారు. వీరిద్దరు ఔట్ కాగా.. ప్రస్తుతం లీస్టర్‌షైర్ 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 16, రిషి పటేల్ 13 పరుగులతో ఆడుతున్నారు. ☝️ | 𝐏𝐮𝐣𝐚𝐫𝐚 𝐛 𝐒𝐡𝐚𝐦𝐢. A second wicket for Shami. He dismisses his @BCCI teammate, as Pujara drags on. Evison joins Kimber (28*). 🦊 LEI 34/2 𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌: https://t.co/APL4n65NFa 👈 🦊 #IndiaTourMatch | #LEIvIND | #TeamIndia pic.twitter.com/ANf2NfhUAy — Leicestershire Foxes 🏏 (@leicsccc) June 24, 2022 చదవండి: Virat Kohli: రూట్ మ్యాజిక్ ట్రిక్‌ను అనుకరించబోయి బొక్కబోర్లా! రోహిత్ శర్మకు ఏమైంది..? అక్కడ కూడా తీరు మారలేదు..! -
రూట్ మ్యాజిక్ ట్రిక్‌ను అనుకరించబోయి బొక్కబోర్లా!
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రస్తుతం జట్టుతో కలిసి ఇంగ్లండ్ పర్యటనలోబిజీగా ఉన్నాడు. జూలై 1న ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు నేపథ్యంలో భారత్ తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే టీమ్ సభ్యులంతా రెండుగా విడిపోయి లీస్టర్‌షైర్‌తో వార్మప్ మ్యాచ్ ఆడుతున్నారు. కాగా గురువారం మ్యాచ్‌లో టీమిండియా తరపున బరిలోకి దిగిన కోహ్లి 69 బంతుల్లో 33 పరుగులు చేశాడు. కాగా కోహ్లి చేసిన ఒక చర్య ఆసక్తికరంగా మారి కెమెరా కంటికి చిక్కింది. ఇటీవలే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్నప్పుడు కాసేపు తన బ్యాట్‌ను ఏ సపోర్టు లేకుండా నిటారుగా నిలబెట్టాడు. రూట్ మ్యాజిక్ ట్రిక్‌ను చూసిన ఫ్యాన్స్ ఇది ఎలా సాధ్యం అని తల పట్టుకున్నారు.తాజాగా ప్రాక్టీస్‌లో భాగంగా కోహ్లి.. రూట్ మ్యాజిక్ ట్రిక్‌ను అనుకరించబోయి బొక్కబోర్లా పడ్డాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో నిల్చున్న కోహ్లి రూట్ లాగే తన బ్యాట్‌ను నిటారుగా నిలబెట్టాలని ప్రయత్నించాడు. కానీ పదేపదే బ్యాట్ జారిపోవడం జరిగింది. దీంతో కోహ్లి రూట్ మ్యాజిక్ ట్రిక్‌ను అందుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. గురువారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఆంధ్ర బ్యాట్స్‌మన్ కోన శ్రీకర్ భరత్ (111 బంతుల్లో 70 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. After Joe roots magic which was seen on the pitch by balancing the bat @imVkohli trying the same 😂 pic.twitter.com/TUZpAUJSA1 — Yashwanth (@bittuyash18) June 23, 2022 చదవండి: IND vs LEI: రాణించిన శ్రీకర్ భరత్.. టీమిండియా స్కోర్: 246/8 చిన్న వయసులోనే వింత రోగం.. ఫుట్‌బాల్ ఆడొద్దన్నారు; కట్‌చేస్తే -
టాయిలెట్లో చిక్కుకుపోయిన మహిళా క్రికెటర్.. మ్యాచ్ కోసం
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ నొకోలా కేరికి వింత అనుభవం ఎదురైంది. ఆమె దాదాపు 20 నిమిషాల పాటు టాయిలెట్లో చిక్కుకుపోయారు. మ్యాచ్ మొదలయ్యే సమయానికి కేరీ అందుబాటులోకి రాకపోవడంతో జట్టును ఆందోళన కలిగించింది. ఆ తర్వాత జట్టుతో చేరిన కేరీ అసలు విషయం చెప్పడంతో నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. మహిళల వన్డే ప్రపంచకప్ మార్చి 4 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 27న ఆస్ట్రేలియా మహిళల జట్టు న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టింది. సోమవారం వెస్టిండీస్‌తో వార్మప్ మ్యాచ్‌కు సిద్ధమైంది. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి కేరీ అందుబాటులోకి రాలేదు. ఏమైందా అని జట్టు కాస్త కంగారు పడింది. అరగంట తర్వాత కేరీ మైదానంలో దర్శనం ఇచ్చింది. విషయమేంటని కేరీని ఆరా తీయగా.. ''టాయిలెట్‌కు వెళ్లాను. పని పూర్తి చేసుకొని బయటకు వద్దామంటే డోర్ లాక్ అవ్వడంతో బయటికి రాలేకపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. దాదాపు 20 నిమిషాల పాటు టాయిలెట్లోనే ఉండిపోయాడు. ఆ తర్వాత సమాచారం అందుకున్న మా మేనేజర్ మాస్టర్ కీ సాయంతో డోర్ లాక్ తీశాడు. ఒకవేళ అది లేకుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో. మ్యాచ్ ఆడేందుకు డోర్‌ను బద్దలు కొట్టైనా బయటకు వచ్చేసేదాన్ని'' అంటూ పేర్కొంది. ఇక రికార్డు స్థాయిలో ఏడో ప్రపంచకప్ టైటిల్‌పై కన్నేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు వార్మప్ మ్యాచ్‌లో జోరు కనబరిచింది. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఏంచుకోగా.. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 259 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ వుమెన్స్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి 90 పరుగులుతో ఓటమి పాలైంది. చదవండి: Kohli-BCCI: 'కోహ్లిపై కోపం తగ్గలేదా'.. బీసీసీఐని ఏకిపారేసిన క్రికెట్ ఫ్యాన్స్ Russia-Ukraine War: రష్యా అధ్యక్షుడికి వరుస షాక్‌లు.. తైక్వాండో బ్లాక్ బెల్ట్ కూడా తొలగింపు Russia-Ukraine Crisis: దేశం కోసం కీలక మ్యాచ్‌ను వదిలేసుకున్న టెన్నిస్ స్టార్ Nic Carey got stuck (literally) in a less than ideal spot during yesterday’s warm-up! Ash Gardner has the details from Christchurch 🥶🤣 pic.twitter.com/wi7XhdnHZu — Australian Women's Cricket Team 🏏 (@AusWomenCricket) February 28, 2022 -
ఫామ్‌లో లేదన్నారు... సెంచరీతో చెలరేగింది
మహిళల వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ రెండు పరుగుల తేడాతో నెగ్గింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (114 బంతుల్లో 103; 9 ఫోర్లు) సెంచరీ చేయగా, యస్తిక భాటియా (58; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించింది. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 244 పరుగులు సాధించింది. అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 242 పరుగులు చేసి ఓడిపోయింది. గత కొంత కాలంగా ఫామ్‌లో లేకపోయినా హర్మన్‌ప్రీత్ కౌర్ సెంచరీ సాధించడం జట్టుకు కలిసొచ్చే వచ్చే అంశం. ఇక ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తలకు గాయమైంది. గాయం అంత తీవ్రమైనది కానప్పటికీ ఆమె ఫీల్డ్‌ను వదిలి వెళ్లింది. ఇక ప్రపంచ కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో తలపడనుంది. చదవండి: IND Vs SL:లంక క్రికెటర్లు ప్రయాణించిన బస్సులో బుల్లెట్ల కలకలం -
క్రికెట్లో ఆడాల్సిన షాట్ టెన్నిస్‌లో ఆడితే..
Ashleigh Barty Pefect Square Leg Glance With Tennis Racquet: యాష్లే బార్టీ.. ఈ ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ ప్రస్తుతం మహిళల సింగిల్స్ టెన్నిస్‌లో ప్రపంచ నెంబర్‌వన్. అందుకు తగ్గట్టే యాష్లే బార్టీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దూసుకెళ్తుంది. గ్రాండ్‌స్లామ్‌లో ఇప్పటికే క్వార్టర్స్ చేరుకున్న బార్టీ మరో టైటిల్‌పై కన్నేసింది. ప్రి క్వార్టర్స్‌లో 6–2, 6–3తో కమీలా జార్జి (ఇటలీ)పై ఘన విజయం సాధించింది. ఈ ఏడాది బార్టీకి ఇది వరుసగా ఏడో విజయం. ఈ ఏడుసార్లు ఆమె ఒక్క సెట్ కూడా కోల్పోకుండా మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఇక క్వార్టర్ ఫైనల్లో బార్టీ.. ఒసాకాను మట్టికరిపించిన అమండా అనిసిమోవాతో తలపడనుంది. చదవండి: 'మా ఆటను చూసి భయపడ్డారు.. ఇంకేం ఫైట్ చేస్తారు' కాగా బార్టీ క్రికెట్లో ఆడాల్సిన షాట్‌ను టెన్నిస్‌లో ఆడడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అవతలి ఎండ్ నుంచి వచ్చిన బంతిని బార్టీ తన రాకెట్‌తో లెగ్స్వేర్ దిశగా కట్ చేయడం కనిపించింది. వీడియో గమనిస్తే.. అసలు మ్యాచ్‌లో అయితే అందుకు ఆస్కారం లేదు కాబట్టి వార్మప్ సందర్భంగా బార్టీ ఈ షాట్ ఆడి ఉంటుంది. అయితే ఆమె సరదాగా కొట్టినప్పటికి.. టెన్నిస్‌లో క్రికెట్ షాట్ ఆడడం చూసేవాళ్లకి మాత్రం కొత్తగా ఉంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. చదవండి: Syde Modi Tourney: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు.. Ash Barty tucking one off the hips for a single pic.twitter.com/NBX9qe5z8T — Henry Moeran (@henrymoeranBBC) January 22, 2022 -
T20 World Cup 2021: విండీస్‌కు ఝలక్ ఇచ్చిన అఫ్గానిస్తాన్
విండీస్‌కు ఝలక్ ఇచ్చిన అఫ్గానిస్తాన్..56 పరుగుల తేడాతో సంచలన విజయం అఫ్గాన్ నిర్ధేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. అఫ్గాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. విండీస్ బ్యాటర్లలో రోస్టన్ ఛేజ్(54) అజేయమైన అర్ధశతకంతో జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఇతనికి నికోలస్ పూరన్(35) సహకరించినప్పటికీ భారీ లక్ష్యం కావడంతో ఛేదన కష్టమైంది. అఫ్గాన్ స్పిన్నర్ నబీ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. 4 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నవీన్ ఉల్ హక్, కరీమ్ జనత్‌కు చెరో వికెట్ దక్కింది. విండీస్ టార్గెట్ 190.. 5 ఓవర్ల తర్వాత 21/2 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ జట్టు ఆరంభంలోనే తడబడింది. తొలి 5 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 21 పరుగులు మాత్రమే చేయగలిగింది. సిమన్స్(0), ఎవిన్ లూయిస్(3)లను మహ్మద్ నబీ పెవిలియన్‌కు పంపాడు. క్రీజ్‌లో రోస్టన్ చేజ్(9), హెట్‌మైర్(1) ఉన్నారు. చెలరేగిన ఆఫ్గాన్ ఓపెనర్లు.. విండీస్ టార్గెట్ 190 విండీస్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్(35 బంతుల్లో 56; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్ షెహజాద్(35 బంతుల్లో 54; 6 ఫోర్లు, సిక్స్) అర్ధశతకాలతో చెలరేగడంతో అఫ్గాన్ భారీ స్కోర్ సాధించగలిగింది. వీరికి రహ్మానుల్లా(26 బంతుల్లో 33), జద్రాన్(19 బంతుల్లో 23) తోడవ్వడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఆండ్రీ రసెల్ కట్టుదిట్టంగా బౌల్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. విండీస్ బౌలర్లలో మెక్కాయ్ 2 వికెట్లు పడగొట్టగా.. రామ్‌పాల్, హేడెన్ వాల్ష్, రసెల్ తలో వికెట్ దక్కించుకున్నారు. 13 ఓవర్ల తర్వాత అఫ్గాన్ స్కోర్ 122/1 తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించిన అనంతరం ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్(35 బంతుల్లో 56; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔట్ కావడంతో అఫ్గాన్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ మహ్మద్ షెహజాద్(32 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్), రహ్మానుల్లా గుర్బాజ్(13 బంతుల్లో 12) ధాటిగా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. 13 ఓవర్ల తర్వాత అఫ్గాన్ స్కోర్ 122/1. చెలరేగి ఆడుతున్న అఫ్గాన్ ఓపెనర్లు విండీస్‌తో జరుగుతున్న వార్మప్ పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్‌కు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్(35 బంతుల్లో 56; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్ షెహజాద్(20 బంతుల్లో 28; 3 ఫోర్లు, సిక్స్) శుభారంబాన్ని అందించారు. వీరిద్దరు చెలరేగి బ్యాటింగ్ చేసి తొలి వికెట్‌కు 8.5 ఓవర్లలో 90 పరుగులు జోడించారు. దుబాయ్: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లలో ఇవాళ అఫ్గానిస్తాన్-వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
T20 World Cup 2021: ఇంగ్లండ్ బౌలర్ల విజృంభణ.. 13 పరుగుల తేడాతో కివీస్‌పై విజయం
ఇంగ్లండ్ బౌలర్ల విజృంభన.. 13 పరుగుల తేడాతో కివీస్‌పై విజయం 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 150 పరుగులకే కుప్పకూలి, 13 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఇంగ్లీష్ బౌలర్లు మార్క్ వుడ్ 4 వికెట్లతో విజృంభించగా.. ఆదిల్ రషీద్ 3, వోక్స్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించారు. కివీస్ ఇన్నింగ్స్‌లో మార్టిన్ గప్తిల్(41), డేవాన్ కాన్వే(21), సౌథీ(10), సోధి(25), టాడ్ ఆస్టల్(16) రెండంకెల స్కోర్ చేశారు. అంతకుముందు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ రాణించడంతో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ధాటిగా ఆడుతున్న గప్తిల్.. 5 ఓవర్ల తర్వాత కివీస్ స్కోర్ 48//1 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్(15 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించాడు. 3వ ఓవర్లో మార్క్ వుడ్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ సీఫర్ట్(8) ఔటైనప్పటికీ.. గప్తిల్ ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేశాడు. దీంతో 5 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 48//1గా ఉంది. క్రీజ్‌లో గప్తిల్‌కు తోడుగా డెవాన్ కాన్వే(1) ఉన్నాడు. రాణించిన జోస్ బట్లర్.. న్యూజిలాండ్ టార్గెట్ 164 ఇంగ్లండ్ బ్యాటర్లు జోస్ బట్లర్(51 బంతుల్లో 73; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో(21 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సామ్ బిల్లింగ్స్(17 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. వీరు మినహా మిగతా ఇంగ్లండ్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో ఐష్ సోధి మూడు వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, సౌథీ తలో వికెట్ దక్కించుకున్నారు. సోధి మాయాజాలం.. 15 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 109/5 టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ జేసన్ రాయ్‌ను సౌథీ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం జోస్ బట్లర్(51 బంతుల్లో 73; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడడంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా పయనించింది. అయితే కివీస్ స్పిన్నర్ ఐష్ సోధి తన స్పిన్ మాయాజాలంతో 3 వరుస వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ ఆశలకు గండి పడింది. తొలుత డేవిడ్ మలాన్(11), ఆతర్వాత ఇయాన్ మోర్గాన్(10)లను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపిన సోధి.. జట్టు స్కోర్ 102 పరుగల వద్ద నుండగా బట్లర్‌ను కూడా ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లివింగ్‌స్టోన్(1)ను.. గ్లెన్ ఫిలిప్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ తమ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 15 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 109/5. క్రీజ్‌లో సామ్ బిలింగ్స్(1), జానీ బెయిర్‌స్టో(7) ఉన్నారు. అబుదాబీ: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లలో ఇవాళ న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్లు: న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, టిమ్ సీఫర్ట్, గ్లెన్ ఫిలిప్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాట్నర్, టిమ్ సౌథీ, కైల్ జేమీసన్, ఐష్ సోథీ,టాడ్ ఆస్టల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, లోకి ఫెర్గూసన్. ఇంగ్లండ్: జేసన్ రాయ్, జోస్ బట్లర్(కెప్టెన్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, ఇయాన్ మోర్గాన్, సామ్ బిలింగ్స్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, తైమాల్ మిల్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. -
IND Vs AUS: అటు హార్దిక్.. ఇటు స్టోయినిస్.. ఇద్దరి పరిస్థితి ఒకటే
Hardik Pandya Vs Marcus Stoinis.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా నేడు టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఇద్దరు ఆల్రౌండర్లకు కీలకం కానుంది. వారిలో ఒకరు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అయితే.. మరొకరు ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో హార్దిక్ బౌలింగ్ చేయలేదు. ఇక బ్యాటింగ్‌లో చివరలో వచ్చిన అతను 10 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఆసీస్‌తో మ్యాచ్ హార్దిక్‌కు తన ఫిట్నెస్ నిరూపించుకునేందుకు మంచి అవకాశం. చదవండి: T20 WC 2021: స్కాట్లాండ్ తరపున తొలి బ్యాటర్‌గా రికార్డు మరోవైపు ఆసీస్ ఆల్‌రౌండర్ స్టోయినిస్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న అతను ఈ మ్యాచ్‌లో ఎలాగైనా మంచి ప్రదర్శన చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. జట్టుకు ఆరో బౌలర్‌గా స్టోయినిస్ సేవలు అవసరమని ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఇప్పటికే స్పష్టం చేశాడు. కాగా యూఏఈ గడ్డపై బ్యాటింగ్‌లో స్టోయినిస్, హార్దిక్‌లకు మంచి రికార్డు ఉంది. హార్దిక్ 19 మ్యాచ్‌ల్లో 356 పరుగులు చేయగా.. స్టోయినిస్ 19 మ్యాచ్‌ల్లో 370 పరుగులు సాధించాడు. ఇక బౌలింగ్‌లో స్టోయినిస్ 19 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీయగా.. హార్దిక్ మాత్రం యూఏఈ గడ్డపై ఒక్కమ్యాచ్‌లోనూ బౌలింగ్ చేయలేదు. ఇక నేటి వార్మప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. చదవండి: IND vs AUS: నేడు ఆసీస్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ -
IND Vs AUS: రోహిత్ మెరుపులు.. ఆసీస్‌పై టీమిండియా ఘన విజయం
రోహిత్ మెరుపులు.. ఆసీస్‌పై టీమిండియా ఘన విజయం టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 13 బంతులు మిగిలిఉండగానే చేధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ(60 పరుగులు రిటైర్డ్‌హర్ట్) అర్థశతకంతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్ 38, కేఎల్ రాహుల్ 39 పరుగులతో రాణించారు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి మ్యాచ్‌ను తన స్టైల్లో ముగించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 57 పరుగుల క్లాస్ ఇన్నింగ్స్‌తో మెరవగా.. ఆఖర్లో స్టోయినిస్ 25 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 41 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు మ్యాక్స్‌వెల్ 37 పరుగులతో రాణించాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 2, రాహుల్ చహర్, భువనేశ్వర్ కుమార్, జడేజా తలా ఒక వికెట్ తీశారు. ఇక పాకిస్తాన్‌తో అక్టోబర్ 24న జరగనున్న తొలి మ్యాచ్‌కు టీమిండియాకు మంచి ప్రాక్టీస్ లభించినట్లయింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు అందుకున్న టీమిండియా పాక్‌తో మ్యాచ్‌కు ముందు మంచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ► హార్దిక్ పాండ్యాకు బ్యాటింగ్ అవకాశం ఇచ్చేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ 60 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 134 పరుగులు చేసింది. సూర్యకుమార్ 32, హార్దిక్ 2 పరుగులతో ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. 13 ఓవర్లలో 101/1 ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో 68 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ఆస్టన్ అగర్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. రోహిత్ 47, సూర్యకుమార్ యాదవ్ 13 పరుగులతో ఆడుతున్నారు. దాటిగా ఆడుతున్న ఓపెనర్లు.. టీమిండియా 67/0 టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు దాటిగా ఆడుతున్నారు. 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. రాహుల్ 39, రోహిత్ 27 క్రీజులో ఉన్నారు. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆసీస్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ కొనసాగిస్తుంది. టీమిండియా టార్గెట్ 153.. 6 ఓవర్లలో 42/0 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 20, కేఎల్ రాహుల్ 21 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. స్టోయినిస్ మెరుపులు.. టీమిండియా టార్గెట్ 153 టి20 ప్రపంచకప్‌లో టీమిండియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 57 పరుగుల క్లాస్ ఇన్నింగ్స్‌తో మెరవగా.. ఆఖర్లో స్టోయినిస్ 25 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 41 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు మ్యాక్స్‌వెల్ 37 పరుగులతో రాణించాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 2, రాహుల్ చహర్, భువనేశ్వర్ కుమార్, జడేజా తలా ఒక వికెట్ తీశారు. స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ.. ఆస్ట్రేలియా 118/4 ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ క్లాస్ అర్థసెంచరీతో మెరిశాడు. 41 బంతులెదుర్కొన్న స్మిత్ 6 ఫోర్ల సాయంతో 50 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. స్టోయినిస్ 18 పరుగులతో స్మిత్‌కు సహకరిస్తున్నాడు. మ్యాక్స్‌వెల్ ఔట్.. ఆస్ట్రేలియా 73/4 దాటిగా ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్(37) రాహుల్ చహర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా 72 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. 10 ఓవర్లలో ఆస్ట్రేలియా 57/3 టీమిండియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 23, స్టీవ్ స్మిత్ 22 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఆరంభంలో స్పిన్నర్ అశ్విన్ టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వరుస బంతుల్లో వార్నర్, మార్ష్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత జడేజా ఫించ్‌ను ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మ్యాక్సీ, స్మిత్‌లు కలిసి నాలుగో వికెట్‌కు 46 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆరోన్ ఫించ్(8) రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 2, మ్యాక్స్‌వెల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. అశ్విన్ దెబ్బ.. వరుస బంతుల్లో రెండు వికెట్లు ఆస్ట్రేలియాకు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన అశ్విన్ వరుస బంతుల్లో వార్నర్, మిచెల్ మార్షలను పెవిలియన్ చేర్చాడు. ముందుగా ఓవర్ ఐదో బంతికి వార్నర్(1)ను ఎల్బీగా వెనక్కి పంపిన అశ్విన్ తర్వాతి బంతికి మిచెల్ మార్ష్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 6 పరుగులు చేసింది. దుబాయ్: టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా టీమిండియా నేడు ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకోవడంతో అతని స్థానంలో రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. కోహ్లితో పాటు బుమ్రా, షమీ కూడా రెస్ట్ తీసుకోనున్నారు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ మెరుపులతో టీమిండియా సునాయాస విజయాన్ని దక్కించుకుంది. టీమిండియా: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ (వికెటకీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జాంపా, గ్లెన్ మాక్స్వెల్, పాట్ కమిన్స్ -
'ముసలివాడివయ్యావు'.. బాబర్ అజమ్ ట్రోల్
T20 WC 2021 Babar Azam Troll Shadab Khan.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా సోమవారం పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను షాహిన్ అఫ్రిది వేశాడు. ఓవర్ రెండో బంతిని లెండి సిమ్మన్స్ ఇన్సైడ్ ఎడ్జ్ ఆడాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ఆండ్రీ ఫ్లెచర్ సింగిల్‌కు కాల్ ఇయ్యడంతో సిమ్మన్స్ పరిగెత్తాడు. చదవండి: T20 WC IND vs PAK: బాబర్ అజమ్ బ్యాటింగ్.. రెప్పవాల్చని టీమిండియా అయితే రనౌట్‌కు అవకాశం ఉన్నప్పటికీ గల్లీ నుంచి వేగంగా పరిగెత్తుకు వచ్చిన షాదాబ్ ఖాన్ డైరెక్ట్ హిట్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ షాదాబ్‌ను ట్రోల్ చేస్తూ పలికిన మాటలు నవ్వులు పూయించాయి. '' నువ్వు ముసలివాడివి అయిపోయావు.. యంగ్‌గా ఉండి ఉంటే మాత్రం కచ్చితంగా రనౌట్ చేసేవాడివి'' అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వెస్టిండీస్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 130 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి 27 బంతులు మిగిలిఉండగానే విజయాన్ని అందుకుంది. బాబర్ అజమ్ (41 బంతుల్లో 50 పరుగులు; 4 ఫోర్లు, ఒక సిక్స్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫఖర్ జమాన్ (24 బంతుల్లో 46 పరుగులు; నాలుగు ఫోర్లు, 2 సిక్సర్లు)తో అతనికి సహకరించాడు. చదవండి: T20 World Cup: ఇండియా- పాక్ మ్యాచ్ రద్దు చేసే వీలు లేదు.. ఆడాల్సిందే! Babar Jani To Shadab:- 'Bhuda hogya, Bhuda hogya, "Pean dy sri Ay Jawani Ich Run Out Ni Honda" 😂#KingBabar👑 pic.twitter.com/eGNApAWtjg — || A S A D || (@Asad_Labana) October 19, 2021 -
T20 WC 2021: రాహుల్, ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్.. ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం
రాహుల్, ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్.. ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం ఇంగ్లండ్ నిర్ధేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు కేఎల్ రాహుల్(24 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్(46 బంతుల్లో 70 రిటైర్డ్ హర్ట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు)లు టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించారు. అనంతరం కోహ్లి(11), సూర్యకుమార్ యాదవ్(8) నిరాశపరచినా రిషబ్ పంత్(14 బంతుల్లో 29; ఫోర్, 3 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా(10 బంతుల్లో 12; 2 ఫోర్లు)లు జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా టీమిండియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే, మార్క్ వుడ్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. సూర్యకుమార్ యాదవ్(8) ఔట్ విల్లే వేసిన ఇన్నింగ్స్ 17.3వ ఓవర్లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్(9 బంతుల్లో 8; ఫోర్) ఔటయ్యాడు. దీంతో 168 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో రిషభ్ పంత్(23), హార్ధిక్ పాండ్యా ఉన్నారు. టీమిండియా గెలవాలంటే 15 బంతుల్లో 21 పరుగులు చేయాలికస ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కోహ్లి(11) ఔట్ కేఎల్ రాహుల్ పెను విధ్వంసం తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి(13 బంతుల్లో 11).. లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 126/2. క్రీజ్‌లో ఇషాన్ కిషన్(39 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), పంత్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..కేఎల్ రాహుల్(51) ఔట్ 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఓపెనర్లు ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్(24 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్ బౌలింగ్ లైనప్‌ను తునాతునకలు చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో పెను విధ్వంసమే సృష్టించాడు. అయితే మార్క్ వుడ్ వేసిన 8.2 ఓవర్లో మొయిన్ అలీ క్యాచ్ పట్టడంతో రాహుల్ పెవిలియన్ బాట పట్టాడు. 8.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 82/1. క్రీజ్‌లో ఇషాన్ కిషన్, కోహ్లి ఉన్నారు. ఆఖర్లో చెలరేగిన మొయిన్ అలీ..టీమిండియా టార్గెట్ 189 భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో చెలరేగి బ్యాటింగ్ చేసిన మొయిన్ అలీ(20 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు).. ఆ ఓవర్లో ఏకంగా 21 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో(36 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్సర్), లివింగ్‌స్టోన్ (20 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) సహా మలాన్(18), జేసన్ రాయ్(17), బట్లర్(18) తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ జట్టు టీమిండియాకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు.. బుమ్రా, చాహర్ తలో వికెట్ పడగొట్టారు. లివింగ్‌స్టోన్ (30) క్లీన్ బౌల్డ్.. ఇంగ్లండ్ 129/4 టీమిండియా పేసర్ మహ్మద్ షమీ చెలరేగి బౌలింగ్ చేస్తున్నాడు. ఇదివరకే బట్లర్, మలాన్‌లను పెవిలియన్‌కు పంపిన అతను.. ఇన్నింగ్స్ 14.5వ ఓవర్లో లివింగ్‌స్టోన్ (20 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 129 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో బెయిర్‌స్టో(38), మొయిన్ అలీ ఉన్నారు. మలాన్(18) క్లీన్ బౌల్డ్.. 10 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 79/3 ఇన్నింగ్స్ 9.2వ ఓవర్లో స్పిన్నర్ రాహుల్ చాహర్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్(18 బంతుల్లో 18; 3 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 79/3. క్రీజ్‌లో బెయిర్‌స్టో(21), లివింగ్‌స్టోన్(1) ఉన్నారు. షమీ ఆన్ ఫైర్.. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో బట్లర్‌ను పెవిలియన్‌కు పంపిన షమీ.. 6వ ఓవర్లో మరో వికెట్‌ను పడగొట్టాడు. ఫైన్ లెగ్‌లో బుమ్రా క్యాచ్ పట్టడంతో ఓపెనర్ జేసన్ రాయ్(13 బంతుల్లో 17; 2 ఫోర్లు) పెవిలియన్ బాట పట్టాడు. 5.3 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 47/2. క్రీజ్‌లో డేవిడ్ మలాన్(10), బెయిర్‌స్టో ఉన్నారు. బట్లర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన షమీ..ఇంగ్లండ్ తొలి వికెట్ డౌన్ టాస్ ఓడి కోహ్లి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను.. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ జోస్ బట్లర్(13 బంతుల్లో 18; 3 ఫోర్లు)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 3.4 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 36/1. క్రీజ్‌లో జేసన్ రాయ్(16), డేవిడ్ మలాన్ ఉన్నారు. దుబాయ్: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లలో ఇవాళ భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అక్టోబర్ 23 నుంచి ప్రారంభంకానున్న సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌ల నేపథ్యంలో ఇరు జట్లకు నేటి మ్యాచ్ కీలకం కానుంది. రెండు జట్టు నేటి మ్యాచ్‌లో పూర్తి స్థాయి జట్లతో బరిలోకి దిగనున్నాయి. భారత్ ఈనెల 20న ఆస్ట్రేలియాతో మరో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. సూపర్ 12 లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా 23న ఇంగ్లండ్.. విండీస్‌తో తలపడనుండగా, 24న భారత్.. దాయాది పాక్‌ను ఢీకొట్టనుంది. తుది జట్లు: టీమిండియా: ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్‌అశ్విన్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, రాహుల్ చహర్. ఇంగ్లండ్: జేసన్ రాయ్, జోస్ బట్లర్(కెప్టెన్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లే, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. అంచనా జట్లు: భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రాహుల్ చాహర్ ఇంగ్లండ్: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, జేసన్ రాయ్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, జోస్ బట్లర్, బెయిర్‌స్టో, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, తైమల్ మిల్స్, డేవిడ్ విల్లే, సామ్ బిల్లింగ్స్ -
నేడు ఇంగ్లండ్‌తో తలపడనున్న కోహ్లి సేన.. 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
T20 World Cup 2021: India Vs England Warm Up Match: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఈ నెల 24న రసవత్తర పోరు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే టీమిండియా రెండు వార్మప్(అక్టోబర్ 18న ఇంగ్లండంతో, 20న ఆస్ట్రేలియాతో) మ్యాచ్‌లు ఆడుతుంది. అందులో భాగంగా ఇవాళ ఇంగ్లండ్‌తో తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లను సైతం టోర్నీ అధికారిక ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారం చేయనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక, నేటి మ్యాచ్‌లో భారత జట్టు కూర్పు విషయానికొస్తే.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. మూడో స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ఆడతారని తెలుస్తోంది. గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా ఆడతాడా లేదా అన్నది వేచి చూడాలి. ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి, పేసర్లుగా బుమ్రా, భువనేశ్వర్ కుమార్ తుది జట్టులో ఆడటం ఖాయమని సమాచారం. కాగా, ఇప్పటికే మెగా టోర్నీ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభంకానున్నాయి. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బంగ్లా ఆల్‌రౌండర్ -
T20 World Cup 2021: వార్మప్ మ్యాచ్‌లో పెను సంచలనం
T20 World Cup 2021 BAN Vs IRE : స్వదేశంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి బలమైన జట్లను ఖంగుతినిపించిన బంగ్లాదేశ్ జట్టు.. టీ20 ప్రపంచకప్-2021 వార్మప్ మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ చేతిలో చతికిలపడింది. అబుదాబి వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్.. బంగ్లాదేశ్‌పై 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా.. ఛేదనలో బంగ్లా జట్టు కేవలం 144 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. ఐరిష్ బ్యాటర్ గారెత్ డెలాని (50 బంతుల్లో 88; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. బంగ్లా బౌలర్లు తస్కిన్ అహ్మద్ 2, నసుమ్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టుకు ఐరిష్ బౌలర్లు మార్క్ అడైర్(3/33), క్రెయిగ్ యంగ్(2/21), జోష్ లిటిల్(2/22), సిమి సింగ్(1/19), బెన్ వైట్(1/37) చుక్కలు చూపించారు. వీరి ధాటికి ఏకంగా ఏడుగురు బంగ్లా బ్యాటర్లు సింగల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో నరుల్ హసన్(24 బంతుల్లో 38; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: అందరూ ధోనిలు కాలేరు.. పంత్‌కు కాస్త సమయం ఇవ్వండి -
ఇంగ్లండ్‌తో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు..
India vs England warm up match canceled: టీ20 ప్రపంచకప్ 2021లో సూపర్ 12 రౌండ్ మ్యాచులకు ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇటీవల ప్రకటించింది. అయితే భారత జట్టు ఆడే వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్లో ఐసీసీ తాజాగా మార్పులు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఐసీసీ ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 న ఇంగ్లండ్‌తో, అక్టోబర్ 20 న ఆస్ట్రేలియాతో కోహ్లి సేన తలపడల్సి ఉంది. అయితే కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 న దుబాయ్‌లో టీమిండియా ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 20 న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. కాగా భారత్ వార్మప్ మ్యాచ్‌లు ఆడబోయే వేదికలో కూడా ఐసీసీ మార్పు చేసింది. ఈ రెండు మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయని ముందుగా ప్రకటించిన ఐసీసీ.. అయితే తాజాగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌కు మార్పు చేసింది. కాగా ఇంగ్లండ్ జట్టు అక్టోబర్ 18 న పాకిస్థాన్‌తో తమ మొదటి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబరు 17 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 24 భారత్ తన తొలి మ్యాచ్‌లో పాక్‌తో తలపడనుంది. చదవండి: Virat Kohli Crying: కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఆ వెంటే డివిలియర్స్ కూడా -
టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆ రెండు జట్లతో టీమిండియా 'ఢీ'.. షెడ్యూల్ ఇదే
T20 World Cup 2021 Warm Up Matches Schedule Announced: టీ20 ప్రపంచకప్-2021లో పాక్‌తో జరిగే మహా సంగ్రామానికి ముందు టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. మెగా టోర్నీలో భాగంగా కోహ్లి సేన అక్టోబర్ 24న దాయాది పాక్‌తో తలపడనుండగా, అంతకంటే ముందే అంటే అక్టోబర్ 18న ఇంగ్లండ్‌తో, 20వ తేదీన ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. టీమిండియా సహా ప్రపంచకప్‌లో పాల్గొనే అగ్రశ్రేణి జట్లన్నీ ఈ వార్మప్ మ్యాచ్‌ల్లో పాల్గొంటాయి. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. అక్టోబర్ 18: * అఫ్గానిస్తాన్ VS సౌతాఫ్రికా (భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30) * పాకిస్థాన్ VS వెస్టిండీస్ (3:30) * ఆస్ట్రేలియా VS న్యూజిలాండ్ (7: 30) * భారత్ VS ఇంగ్లండ్ (7:30) అక్టోబర్ 20 : * ఇంగ్లండ్ VS న్యూజిలాండ్ (3:30) * భారత్ VS ఆస్ట్రేలియా (3:30) * సౌతాఫ్రికా Vs పాకిస్థాన్ (7:30) * అఫ్గానిస్తాన్ VS వెస్టిండీస్ (7:30) ఈ మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. కాగా, యూఏఈ, ఒమన్ వేదికగా జరిగే పొట్టి ప్రపంచకప్ అక్టోబర్ 17న ప్రారంభమై.. దుబాయ్ వేదికగా నవంబర్ 14న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీలో తొలుత గ్రూప్-ఏ, గ్రూ-బిలోని క్వాలిఫయర్స్ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. ఇక, ఈ టోర్నీలో టీమిండియా లీగ్ దశలో తలపడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్ 24న పాక్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. చదవండి: టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..! -
టీమిండియాకు లక్కీ ఛాన్స్.. పాక్‌తో పోరుకు ముందు టాప్ జట్లతో మ్యాచ్‌లు..
India To Face England And Australia In Warm Up Matches: టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగే మహా సంగ్రామానికి ముందు టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. మెగా టోర్నీలో భాగంగా కోహ్లి సేన అక్టోబర్ 24న దాయాది పాక్‌తో తలపడనుండగా, అంతకంటే ముందే అంటే అక్టోబర్ 18న ఇంగ్లండ్‌తో, 20వ తేదీన ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు బీసీసీఐ వర్గాలు దృవీకరించాయి. యూఏఈ, ఒమన్ వేదికగా జరిగే పొట్టి ప్రపంచకప్ అక్టోబర్ 17న ప్రారంభమై.. దుబాయ్ వేదికగా నవంబర్ 14న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీలో తొలుత గ్రూప్-ఏ, గ్రూ-బిలోని క్వాలిఫయర్స్ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 22 వరకు జరుగనున్నాయి. అనంతరం మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్ 23న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మెగా పోరుతో ప్రారంభమవుతాయి. ఇక, ఈ టోర్నీలో టీమిండియా లీగ్ దశలో తలపడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్ 24న పాక్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. చదవండి: కోహ్లి వారసుడిగా రోహిత్‌తో పోలిస్తే అతనైతేనే బెటర్.. ఎందుకంటే..? -
రెండో ఇన్నింగ్స్‌లోనూ ఫిఫ్టి కొట్టిన జడ్డూ
రెండో ఇన్నింగ్స్‌లోనూ ఫిఫ్టి కొట్టిన జడ్డూ టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. వార్మప్ మ్యాచ్‌లో బ్యాట్‌తో దుమ్మురేపాడు. కౌంటీ ఎలెవెన్ జట్టుతో జరగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ(75) చేసిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ(51 రిటైర్డ్ ఔట్) ఫిఫ్టి కొట్టాడు. మరో ఎండ్‌లో ఉన్న హనుమ విహారి(43 నాటౌట్) సైతం రాణించాడు. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 192 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 91 పరుగుల ఆధిక్యం కలుపుకుని టీమిండియా 284 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందుంచింది. అనంతరం ఛేదన ప్రారంభించిన కౌంటీ ఎలెవెన్ జట్టు వికెట్ నష్టపోకుండా 10 పరుగులు సాధించింది. చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు కౌంటీ సెలెక్ట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్ ఆఖరి రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, పుజారాలు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించిన అనంతరం మయాంక్(47) ఔటవ్వగా.. 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పుజారా పెవిలియన్‌కు చేరాడు. 34 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. క్రీజ్‌లో విహారి(12), జడేజా(11) ఉన్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 91 పరుగుల ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతానికి టీమిండియా 205 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. That will be Lunch on Day 3 of the three-day warm-up game against County XI.#TeamIndia 311 & 113/2, lead by 204 runs. pic.twitter.com/GItTWrcN7X — BCCI (@BCCI) July 22, 2021 అంతకు ముందు రెండో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించడంతో ప్రత్యర్థి జట్టు 220 పరుగులకు ఆలౌటైంది. భారత పేసర్లు ఉమేశ్ యాదవ్ (3/22), మహమ్మద్ సిరాజ్ (2/32) పదునైన బంతులతో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగా, ఓపెనర్ హసీబ్ హమీద్ (246 బంతుల్లో 112; 13 ఫోర్లు) శతకంతో జట్టును ఆదుకున్నాడు. పాటర్సన్ వైట్(33), లిండన్ జేమ్స్(27) కాసేపు పోరాడారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, శార్ధూల్, జడేజా, అక్షర్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్(101), జడేజా(75) రాణించారు. -
వాషింగ్టన్ సుందర్‌తో గొడవకు దిగిన సిరాజ్
డర్హమ్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు కౌంటీ ఎలెవన్ జట్టుతో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ప్రారంభం అయిన ఈ మూడు రోజుల మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్(150 బంతుల్లో 101 రిటైర్డ్ ఔట్; 11 ఫోర్లు, సిక్స్), రవీంద్ర జడేజా (146 బంతుల్లో 75; 5 ఫోర్లు, సిక్స్) సెంచరీ, హాఫ్ సెంచరీలతో రాణించడంతో 311 పరుగల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. అనంతరం బుధవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కౌంటీ ఎలెవన్ ఆది నుంచి తడబడుతూ ఉంది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు భారత ఆటగాళ్లు(వాషింగ్టన్ సుందర్, ఆవేశ్ ఖాన్) ప్రత్యర్ధి జట్టు తరఫున బరిలోకి దిగారు. Mohammad Siraj exchanged a few words to Washington Sundar. pic.twitter.com/xC5EPuZeZI — Mufaddal Vohra (@mufaddal_vohra) July 21, 2021 ఈ క్రమంలో రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన వాషింగ్టన్ సుందర్(1)ను టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. అయితే అంతకు ముందు సిరాజ్.. సుందర్‌తో గొడవకు దిగాడు. వారి మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే జరిగింది. అయితే సహచరులు సర్ధి చెప్పడంతో వారు మిన్నకుండిపోయారు. ఆ వెంటనే సిరాజ్ బౌలింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ అందుకోవడంతో సుందర్ మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అంతకుముందు ఓపెనర్ లిబ్బి (12)ని ఉమేశ్ యాదవ్, వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ రాబర్ట్ యేట్స్ (1)ను బుమ్రా పెవిలియన్‌కు పంపారు. అనంతరం కెప్టెన్ విల్ రోడ్స్(11) ఆచితూచి ఆడే ప్రయత్నం చేసినప్పటికీ ఉమేశ్ యాదవ్ అతన్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో కౌంటీ ఎలెవన్ జట్టు రెండో రోజు భోజన విరామ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. క్రీజులో హసీబ్ హమీద్ (47), లిండన్ జేమ్స్(5) ఉన్నారు. టీమిండియా బౌలర్లు ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా, బుమ్రా, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సన్నాహక మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానేతో పాటు సీనియర్ బౌలర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ దూరంగా ఉన్నారు. దాంతో రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఆగష్టు 4 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. -
సూపర్ సెంచరీతో అదరగొట్టిన కేఎల్ రాహుల్
సూపర్ సెంచరీతో అదరగొట్టిన కేఎల్ రాహుల్ టపార్డర్ బ్యాట్స్మెన్లు దారుణంగా విఫలమైన వేళ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(101 రిటైర్డ్) అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. అతనికి మరో ఎండ్‌లో జడేజా(57) హాఫ్ సెంచరీతో సపోర్ట్ ఇవ్వడంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. క్రీజ్‌లో జడేజాకు తోడుగా శార్దూల్ ఠాకూర్(9) ఉన్నాడు. 77 ఓవర్ల తర్వాత టీమిండియా 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల సాధించింది. CENTURY @klrahul11 💯A brilliant innings 👏🇮🇳Live Stream ➡️ https://t.co/ZsCqJdCEX1#CountyXIvIndia @BCCI pic.twitter.com/4Ffzd5wnEP— Durham Cricket (@DurhamCricket) July 20, 2021 టీమిండియా నాలుగో వికెట్ డౌన్.. విహారి(24) ఔట్ టీమిండియా ప్లేయర్లు ఒకొక్కరుగా తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరుతున్నారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి(24) కూడా కనీసం హాఫ్‌సెంచరీ మార్క్ చేరుకోలేకపోయాడు. స్పిన్నర్ ప్యాటర్సన్ వైట్ బౌలింగ్‌లో.. క్రెయిగ్ మైల్స్‌కు క్యాచ్ అందించి వెనుదిరిగాడు. క్రీజ్‌లో కేఎల్ రాహుల్(47), రవీంద్ర జడేజా(9) ఉన్నారు. 47 ఓవర్ల తర్వాత టీమిండియా 4 వికెట్ల నష్టానికి141 పరుగులు చేసింది. Patterson-White gets Vihari! India are 107/4 Live stream ➡️ https://t.co/FfTRHD7fDr#CountyXIvIndia @TrentBridge pic.twitter.com/dNC7ERr83J — Durham Cricket (@DurhamCricket) July 20, 2021 Carson x Rew, Pujara gone. 🏴🇮🇳@SussexCCC 🤝 @SomersetCCC Live Stream ➡️ https://t.co/JeTNRWzv2g pic.twitter.com/aB1jPQLNTT — Durham Cricket (@DurhamCricket) July 20, 2021 మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. పుజారా(21) ఔట్ ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(9), మయాంక్ అగర్వాల్(28) సహా వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ పుజారా(21) కూడా తక్కువ స్కోర్‌కే చేతులెత్తేశారు. ప్రాక్టీస్ మ్యాచ్ అని సరదాగా తీసుకున్నారో ఏమో కానీ, నిర్లక్ష్యంగా షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. లంచ్ విరామ సమాయనికి 30 ఓవర్లు ఆడిన టీమిండియా బ్యాట్స్మెన్లు 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేశారు. క్రీజ్‌లో విహారి(16), కేఎల్ రాహుల్(5) ఉన్నారు. కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ బౌలర్లలో లిండన్ జేమ్స్ 2 వికెట్లు పడగొట్టగా, పుజారా వికెట్ జాక్ కార్సన్‌కు దక్కింది. కార్సన్ బౌలింగ్‌లో పుజారా క్రీజ్ వదిలి ముందుకు రావడంతో వికెట్‌కీపర్ జేమ్స్ రివ్ స్టంపింగ్ చేశాడు. చెస్టర్ లీ స్ట్రీట్: కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ జట్టుతో మంగళవారం మధ్యాహ్నం 3:30కు ప్రారంభమైన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ(33 బంతుల్లో 9; 2 ఫోర్లు) దారుణంగా విఫలం కాగా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(35 బంతుల్లో 28; 6 ఫోర్లు) కాస్త పర్వాలేదనిపించాడు. Brilliant from @TrentBridge's Lyndon James who picks up his second. Agarwal bowled for 28 👏 Live Stream ➡️ https://t.co/ZoY9QkxDQk#CountyXIvIndia @CountyChamp pic.twitter.com/PWOlck8Y5o — Durham Cricket (@DurhamCricket) July 20, 2021 ప్రత్యర్ధి బౌలర్ లిండన్ జేమ్స్‌కు ఈ రెండు వికెట్లు దక్కాయి. 14 ఓవర్ల తర్వాత భారత జట్టు స్కోర్ 46/1గా ఉంది. క్రీజ్‌లో పుజారా(8), విహారి(1) ఉన్నారు. కాగా, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ కోసం టీమిండియా ఈ మ్యాచ్‌ను పట్టుపట్టి మరీ షెడ్యూల్ చేసుకుంది. భారత జట్టు: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజారా, హనుమ విహారి, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త..
Ind Vs Eng Warm Up Match: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు బీసీసీఐ.. టీమిండియాకు శుభవార్త చెప్పింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకపోవడంతో భారత జట్టు బొక్కబోర్లా పడ్డ విషయం విధితమే. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి తప్పిదం జరగకుండా బీసీసీఐ జాగ్రత్త పడింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు కోహ్లీ సేనకు ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌ను షెడ్యూల్ చేసింది. ఈ నెల 20న డర్హమ్లోని ఎమిరేట్స్ రివర్‌సైడ్‌లో కౌంటీ ఛాంపియన్షిప్ ఎలెవన్ జట్టుతో టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ విషయాన్ని డర్హమ్ క్రికెట్ అధికారికంగా వెల్లడించింది. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత మూడు వారాల పాటు బయో బబుల్ నుంచి బయటకు వెళ్లిన ఇండియన్ క్రికెటర్లు ఇవాళ లండన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ టీమిండియాకు ఓ షాకింగ్ వార్త తెలిసింది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిందని బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతన్ని వదిలేసి మిగతా జట్టంతా మూడు రోజుల మ్యాచ్ కోసం సిద్ధం కానుందని బీసీసీఐ వెల్లడించింది. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 4 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ప్రారంభంనుంది. -
8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు
తిరువనంతపురం : టీమిండియా క్రికెటర్.. కేరళ స్పీడస్టర్ శ్రీశాంత్ 8 ఏళ్ల తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే సయ్యద్ ముస్తాక్ టోర్నీకి సంబంధించి కేరళ జట్టు ప్రాబబుల్స్‌లో శ్రీశాంత్ చోటు దక్కించుకున్నాడు. జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ టోర్నీ జరగనుంది. ఈ క్రమంలో తన ప్రాక్టీస్‌ను ఆరంభించిన శ్రీశాంత్ 8 ఏళ్ల తర్వాత అదే కోపాన్ని చూపించడం ఆసక్తికరంగా మారింది. (చదవండి : 'ఆ మ్యాచ్‌లో నన్ను గెట్ అవుట్ అన్నారు') ఆది నుంచి టీమిండియాలో అగ్రెసివ్ క్రికెటర్‌గా పేరు పొందిన శ్రీశాంత్‌కు బాధ వేసినా.. సంతోషం కలిగినా అస్సలు తట్టుకోలేడు. ఎదుటివారిని బోల్తా కొట్టించేందుకు తనదైన శైలిలో కవ్వింపు చర్యలకు పాల్పడేవాడు. శ్రీశాంత్ కెరీర్లో ఇలాంటివి చాలానే చూశాం. తాజాగా శ్రీశాంత్ సయ్యద్ ముస్తాక్ టోర్నీ సన్నాహకంగా వార్మప్ మ్యాచ్‌ల్లో ఆడుతున్నాడు. ఈ సందర్భంగా శ్రీశాంత్ వేసిన బంతిని ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ భారీ షాట్ ఆడాడు. ఆ షాట్‌ను కోపంతో చూస్తూ శ్రీశాంత్ మళ్లీ పాతరోజులకు వెళ్లిపోయాడు. పిచ్‌పై నిలబడి బ్యాట్స్‌మన్‌పై స్లెడ్జింజ్‌కు దిగాడు. కాగా శ్రీశాంత్ బౌలింగ్ వీడియోనూ కేరళ క్రికెట్ అసోసియేషన్ యూట్యూబ్‌లో షేర్ చేసింది. కాగా శ్రీశాంత్ చర్యపై నెటిజన్లు తమదైశ శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 8 ఏళ్ల తర్వాత కూడా శ్రీశాంత్ తీరులో ఏ మార్పు లేదు. శ్రీశాంత్ అంటేనే కోపానికి మారుపేరు.. అతను అలా ఉంటేనే కరెక్ట్.. అని పేర్కొన్నారు. కాగా 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో బీసీసీఐ శ్రీశాంత్‌తో పాటు అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై జీవితకాలం నిషేధం విధించింది. అయితే బీసీసీఐ శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని ఏడేళ్లకి కుదించగా.. గతేడాది సెప్టెంబరుతో అది ముగిసింది. -
బీసీసీఐకి ఐపీఎల్ ఫ్రాంచైజీల విజ్ఞప్తి
దుబాయ్: ఐపీఎల్ ప్రధాన టోర్నీకి ముందే మైదానంలో ప్రత్యర్థులతో తలపడే అవకాశం ఉంటే బాగుంటుందని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. అందు కోసం అన్ని జట్ల మధ్య వామప్ మ్యాచ్‌లు ఏర్పాట్లు చేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాయి. సాధారణంగా ప్రతీ టీమ్ తమ జట్టులోని ఆటగాళ్లనే రెండు బృందాలుగా చేసి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతూ ఉంటాయి. అయితే దీనికంటే ఇతర టీమ్‌లతో తలపడితే సరైన సాధన చేసినట్లు వారు భావిస్తున్నారు. కరోనా కారణంగా మార్చినుంచి క్రికెట్ ఆగిపోయింది. ఎవ్వరూ కూడా పోటీ క్రికెట్లో తలపడలేదు. అందుకే అసలు సమరానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లు తమకు సన్నాహకంగా పనికొస్తాయని ఒక ఫ్రాంచైజీ ప్రతినిధి అభిప్రాయ పడ్డారు. మరో రెండు, మూడు రోజుల్లో దీనిపై బోర్డునుంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. అయితే బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు దీనిపై భిన్నంగా స్పందించారు. ‘మాకు ఇప్పటికే అవసరానికి మించిన బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలు మేం ఎక్కడ పెట్టుకుంటాం. నిజంగా అలాంటి ఆలోచనే ఉంటే ఫ్రాంచైజీ యజమానులు వారిలో వారు మాట్లాడుకొని తేల్చుకుంటే మంచిది. అందరికీ ఆసక్తి ఉండి ఆడుకుంటామంటే ఎవరు వద్దంటారు’ అని ఆయన అన్నారు. సెప్టెంబర్ 19న ఐపీఎల్ ప్రారంభం కానుంది. -
సన్నాహం సమాప్తం
బౌలర్లు ప్రత్యర్థి టెయిలెండ్ను కూల్చలేకపోయారు... బ్యాటింగ్‌లో ‘ప్రారంభ’ సమస్య మరోసారి స్పష్టమైంది. మిగతా బ్యాట్స్‌మెన్ కుదురుకుంటున్న సమయంలో వర్షం అడ్డుగా నిలిచింది. మొత్తానికి మొదటి రెండు రోజులతో పోలిస్తే మూడో రోజు ‘ప్రాక్టీస్’ తక్కువే. టీమిండియా చేతిలో ఆలౌట్ కాకూడదన్న ఉద్దేశంతో ఆడిన ఎస్సెక్స్... అందుకు తగ్గట్లే ఆడి డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు రహానే, రాహుల్‌లకు కొంత ప్రాక్టీస్ లభించింది. చెమ్స్‌ఫోర్డ్: సుదీర్ఘ సిరీస్‌కు ముందు టీమిండియా ఏకైక సన్నాహం ముగిసింది. కౌంటీ జట్టు ఎస్సెక్స్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’ అయింది. శుక్రవారం వాన కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 36 నాటౌట్; 7 ఫోర్లు)తో పాటు అజింక్య రహానే (27 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు) నిలకడ చూపారు. అయితే, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (0) మరోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. డిపెండబుల్ బ్యాట్స్‌మన్ పుజారా (23) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆశ్విన్, కుల్దీప్ బౌలింగ్ చేశారు... ఓవర్‌నైట్ స్కోరు 236/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఎస్సెక్స్... పేసర్లు ఉమేశ్ యాదవ్ (4/35), ఇషాంత్ శర్మ (3/59) ధాటికి ఎదురునిలిచి 359/8 వద్ద డిక్లేర్ చేసింది. ఫోస్టర్ (42) త్వరగానే వెనుదిరిగినా వాల్టర్ (75) అర్ధ శతకం సాధించాడు. నిజ్జర్ (29 నాటౌట్), ఫిన్ ఖుషి (14 నాటౌట్) పది ఓవర్లకు పైగా వికెట్ కాపాడుకున్నారు. భారత బౌలర్లు 94 ఓవర్లు వేసినా ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయారు. గురువారం గాయంతో బౌలింగ్‌కు దిగని సీనియర్ స్పిన్నర్ అశ్విన్ శుక్రవారం బంతిని అందుకుని ఐదు ఓవర్లు వేశాడు. కుల్దీప్యాదవ్ సైతం నాలుగు ఓవర్లు వేశాడు. పరుగులు ఇవ్వకుండా వికెట్లు పడగొడుతూ ఉమేశ్‌యాదవ్ ప్రభావవంతంగా కనిపించాడు. మొహమ్మద్ షమీ మాత్రం నిరుత్సాహపర్చాడు. తలా ఒక ఓవర్ వేస్తూ తీవ్రంగా ప్రయత్నించినా ఎస్సెక్స్ను ఆలౌట్ చేయలేకపోవడం గమనార్హం. మళ్లీ శుభారంభం దక్కలేదు... భారత్‌కు రెండో ఇన్నింగ్స్‌లోను శుభారంభం దక్కలేదు. మురళీ విజయ్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ సౌకర్యంగానే ఆడినా, శిఖర్ ధావన్ మూడు బంతులే ఎదుర్కొని క్విన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. బౌండరీలతో టచ్‌లో ఉన్నట్లు కనిపించిన చతేశ్వర్ పుజారాను వాల్టర్ వెనక్కుపంపాడు. అనంతరం రాహుల్, అజింక్యా రహానే జంట ఇబ్బంది లేకుండా ఆడుతూ మూడో వికెట్‌కు 49 పరుగులు జత చేసింది. వర్షం కారణంగా చివరి రోజు ఓవరాల్‌గా 57.2 ఓవర్ల ఆట సాధ్యమైంది. గంటన్నర ముందే మ్యాచ్ ముగిసింది. ధావన్... ఇలాగైతే కష్టమే..! శిఖర్ ధావన్... భారత జట్టులో ఏకైక ఎడమచేతి వాటం స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్. మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ సభ్యుడు. కేఎల్ రాహుల్ వంటి ప్రతిభావంతుడిని కాదని మరీ అవకాశాలు దక్కించుకుంటున్న ఆటగాడు. అయితే, టి20లు, వన్డేల వరకైతే ఉపయుక్తమైన వాడే. టెస్టుల్లోకి వచ్చేసరికే అతడి ప్రదర్శన విమర్శకులకు పని కల్పిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో అసలు ధావన్ అవసరం ఉందా? అనిపిస్తోంది. తాజాగా ఎస్సెక్స్ వంటి కౌంటీ జట్టుపై సన్నాహక మ్యాచ్‌లోనే శిఖర్ ‘పెయిర్’ సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో మూడు బంతులు ఆడి డకౌట్‌గా వెనుదిరిగిన అతను... రెండో ఇన్నింగ్స్‌లో మొదటి బంతికే వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ధావన్‌ను ఆడించాలా వద్దా అని జట్టు మేనేజ్మెంట్ ఆలోచిస్తుందనడంలో సందేహం లేదు. అతనితో పోలిస్తే రాహుల్ మెరుగ్గా ఆడుతుండటం, విజయ్ విదేశీ రికార్డు మెరుగ్గా ఉండటం కూడా ధావన్‌కు స్థానంపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ప్రతాపమంతా ఉపఖండంలోనే... కెరీర్లో ఇప్పటివరకు 30 టెస్టులు ఆడిన ధావన్ సగటు 43.93. ఓ విధంగా మంచి బ్యాట్స్‌మన్ గణాంకమే. కానీ, ఇదంతా కాగితంపైన చెప్పుకొనేందుకే. ఎందుకంటే అతడి ప్రతాపమంతా ఉపఖండంలోనే. ఇక్కడ 16 టెస్టుల్లో (24 ఇన్నింగ్స్) 61 సగటుతో 1,403 పరుగులు చేసిన శిఖర్... విదేశీ పిచ్‌లపై కుదేలవుతున్నాడు. ఇప్పటివరకు విదేశాల్లో 14 టెస్టుల్లో 26 ఇన్నింగ్స్‌లలో 750 పరుగులే చేయగలి గాడు. సగటు 22 మాత్రమే. ఈ దారుణ గణాంకాల మధ్య కూడా అతడిని కాపాడుతోంది ఎడమ చేతివాటం, పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల ఫామ్ మాత్రమే. అప్పటికీ దక్షిణాఫ్రికా పర్యటనలో మొదటి టెస్టు వైఫల్యంతో పక్కనబెట్టారు. అయితే, అప్పుడు రాహుల్ కూడా రాణించకపోవడంతో మెరుగైన ప్రత్యామ్నాయంగా ధావనే మిగిలాడు. ఈ మధ్యలో సొంతగడ్డపై అఫ్గాన్‌తో టెస్టులో మెరుపు శతకం బాదడం మరిన్ని అవకాశాలిచ్చేలా చేసింది. గత పర్యటనలోనూ విఫలం... 2014 ఇంగ్లండ్ పర్యటన సమయంలో ధావన్ ఫామ్‌లో ఉన్నాడు. అయినప్పటికీ మూడు టెస్టుల్లో ఆరు ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులు 122 మాత్రమే. అత్యధికం 37. మరోవైపు వికెట్ల మధ్య తన పరుగు నిదానంగా ఉంటూ రనౌట్లకు అవకాశం ఇస్తోంది. దీనినిబట్టి చూస్తే ఈసారి అతడి కంటే రాహుల్‌ను నమ్ముకోవడమే ఉత్తమం అనిపిసోంది. -
వార్మప్‌లో విండీస్‌కు అఫ్గాన్ షాక్
హరారే: ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫయర్ వార్మప్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌కు అఫ్గానిస్తాన్ షాకిచ్చింది. పేసర్ దౌలత్ జద్రాన్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టడంతో అఫ్గాన్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 29 పరుగుల తేడాతో విండీస్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 35 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఒక దశలో అఫ్గాన్ 71 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టెయిలెండర్లు గుల్బదిన్ నయీబ్ (48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సమీవుల్లా షెన్వారి (42; 2 సిక్సర్లు) తొమ్మిదో వికెట్‌కు 91 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. అనంతరం విండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 140 పరుగులుగా నిర్దేశించారు. అయితే గేల్ (9), శామ్యూల్స్ (34; 4 ఫోర్లు)లాంటి సీనియర్లున్న విండీస్ 26.4 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైంది. ఇన్నిం గ్స్ 20వ ఓవర్ వేసిన జద్రాన్ వరుస బంతుల్లో హెట్‌మైర్ (1), పావెల్ (9), బ్రాత్‌వైట్ (0)లను ఔట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించాడు.