
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy-2025) వార్మప్ మ్యాచ్‌ల (Warm Up Matches) షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) ఇవాళ (ఫిబ్రవరి 13) ప్రకటించింది. ఫిబ్రవరి 14 నుంచి 17 తేదీల మధ్యలో ఈ వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మాత్రమే ఈ వార్మప్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. బిజీ షెడ్యూల్ దృష్ట్యా భారత్ వార్మప్ మ్యాచ్‌లు ఆడటం లేదు. ఈ వార్మప్ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్ మూడు టీమ్‌లను ప్రకటించింది.
ఫిబ్రవరి 14న జరిగే మ్యాచ్‌లో షాదాబ్ ఖాన్ నేతృత్వంలోనే పాకిస్తాన్ షహీన్స్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగనుంది. ఫిబ్రవరి 16న జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతుంది.
ఫిబ్రవరి 17న కరాచీలో జరిగే మ్యాచ్‌లో ముహమ్మద్ హురైరా నేతృత్వంలోని పాకిస్తాన్ షాహీన్స్ సౌతాఫ్రికాతో తలపడుతుంది. అదే రోజు దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో మొహమ్మద్ హరీస్ సారథ్యంలోని పాకిస్తాన్ షాహీన్స్ న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటుంది. ఈ నాలుగు వార్మప్ మ్యాచ్‌లు డే అండ్ నైట్ ఫార్మాట్‌లో జరుగుతాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ అసలు మ్యాచ్‌లు ఫిబ్రవరి 19న మొదలవుతాయి. ఈ మెగా టోర్నీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా జరుగనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లో జరుగుతాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి.
ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. భారత్‌ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి.
వార్మప్ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్ షాహీన్స్ జట్లు:
v ఆఫ్ఘనిస్తాన్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ - షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్ ఫసీ, అరాఫత్ మిన్హాస్, హుస్సేన్ తలత్, జహందాద్ ఖాన్, కాషిఫ్ అలీ, మొహ్సిన్ రియాజ్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్ ఖాన్, ముహమ్మద్ అఖ్లక్, ముహమ్మద్ ఇమ్రాన్ రంధవా, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్
v దక్షిణాఫ్రికా, నేషనల్ స్టేడియం, కరాచీ - మొహమ్మద్ హురైరా (కెప్టెన్), అమద్ బట్, ఫైసల్ అక్రమ్, హసన్ నవాజ్, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షెహజాద్, మాజ్ సదాకత్, మెహ్రాన్ ముంతాజ్, ముహమ్మద్ ఘాజీ ఘోరీ, నియాజ్ ఖాన్, ఖాసిం అక్రమ్, సాద్ ఖాన్
v బంగ్లాదేశ్, ICC అకాడమీ, దుబాయ్ - మొహమ్మద్ హారిస్ (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్ సమద్, అలీ రజా, అజాన్ అవైస్, మహ్మద్ వసీమ్ జూనియర్, ముబాసిర్ ఖాన్, మూసా ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సుఫియాన్ మొకిమ్, ఉసామా మీర్.
Comments
Please login to add a commentAdd a comment