champion trophy
-
ఐసీసీ సెల్ఫీ డే స్పెషల్
జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం మాత్రమే కాదు, సెల్ఫీ ప్రేమికులు ఈ రోజును సెల్ఫీ డేగా (2014 నుంచి) జరుపుకుంటున్నారు. సెల్ఫీ డే సందర్బంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొన్ని ఫోటోలను ట్విటర్లో షేర్ చేసింది. ‘మీ అభిమాన క్రికెట్లర్ల సెల్ఫీ ఫోటోలు చూడండి’ అంటూ ఐసీసీ ఆ షేర్లో పేర్కొంది. గత ఏడాది కాలంగా ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న జట్లతో పాటు, మాజీ దిగ్గజ క్రికెట్లర్లు దిగిన సెల్ఫీ ఫోటోలు ఉన్నాయి. ఐసీసీ షేర్ చేసిన ఫోటోల్లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత బృందం ఉంది. 2017 మహిళల ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్ మహిళా జట్టు సెల్ఫీ ఫోటో, 2018లో చాంపియన్ ట్రోఫీ నెగ్గిన పాకిస్తాన్ జట్టు ఫోటో, ఆసీస్ దిగ్గజ క్రికెటర్లు దిగ్గిన సెల్ఫీ ఫోటోలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. To celebrate World #SelfieDay, let's see some of your favourite cricket-related selfies! 😁🤳 pic.twitter.com/d4RbB5Rols — ICC (@ICC) 21 June 2018 -
టీ20ఫార్మాట్లో చాంపియన్స్‌ట్రోఫీ!
సాక్షి, స్కూల్‌ఎడిషన్: భారతగడ్డపై 2021లో జరిగే చాంపియన్స్‌ట్రోఫీని పొట్టిఫార్మాట్లో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) యోచిస్తోంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న వన్డే ఫార్మాట్ కన్నా టీ20 మ్యాచ్‌లుగా టోర్నీని జరిపితే మరింత లాభదాయకంగా ఉంటుందని ఐసీసీ ఆలోచనగా ఉంది. మరోవైపు కేంద్రప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపులు రాకపోతే ఈ టోర్నీని 2021లో భారతగడ్డపై నిర్వహించడం సందేహంగా మారనుంది. ప్రపంచశ్రేణి టోర్నీ అయిన చాంపియన్స్‌ట్రోఫీని భారత్‌లో నిర్వహించడం ద్వారా పలు పన్ను మినహాయింపుల్ని ఐసీసీ కోరుతుంది. అయితే ఈ విషయంపై కేంద్రంతో బీసీసీఐ చర్చించి సానుకూల నిర్ణయం వచ్చేలా చూడాలని ఐసీసీ కోరుకుంటోంది. ఒకవేళ భారత ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే వచ్చే ఎడిషన్‌ను ఇతర దేశాల్లో నిర్వహించే అంశంపై ఐసీసీ కసరత్తు చేస్తోంది. భారత్‌కు చెందిన టైమ్జోన్లోనే ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంకలలో చాంపియన్స్‌ట్రోఫీని నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆదాయ పంపిణీపై ఐసీసీపై గుర్రుగా ఉన్న బీసీసీఐకి తాజా పరిణామాలు మరింత ఆజ్యం పొస్తాయనడంలో సందేహంలేదు. పన్ను మినహాయింపులకు నో.. మరోవైపు భారతగడ్డపై ఐసీసీ నిర్వహించే టోర్నీలకు కేంద్ర ప్రభుత్వం పన్నుమినహాయింపులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 2011 వన్డే ప్రపంచకప్‌నకు పన్ను మినహాయింపు ఇచ్చిన కేంద్రం.. 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌నకు మాత్రం పన్ను మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించింది. ఈక్రమంలో మినహాయింపులపై ఐసీసీ, టోర్నీ ప్రసారదారు స్టార్ నెట్వర్క్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం తిరస్కరించింది. దీంతో మీడియా హక్కుల ద్వారా వచ్చిన ఆదాయంలో పదిశాతం టీడీఎస్‌గా కేంద్రానికి స్టార్ నెట్వర్క్ చెల్లించింది. మరోవైపు ఐసీసీకి ఇవ్వాల్సిన మొత్తంలో ఈ మేరకు కోత విధించింది. అనంతరం టోర్నీకి సంబంధించిన రిటర్న్‌లను దాఖలు చేయాలని ఐసీసీకి భారత ఆదాయపన్నుశాఖ తెలిపింది. అయితే ఇప్పటివరకు దీనిపై ఐసీసీ స్పందన లేదని బోర్డు వర్గాలు తెలిపాయి. మరోవైపు గతేడాది భారత్‌లో నిర్వహించిన ఫిపా అండర్–17 ప్రపంచకప్‌నకు పన్ను మినహాయింపులిచ్చి తమకు ఇవ్వకపోవడంపై ఐసీసీ నిరాశ చెందినట్లు తెలుస్తోంది. దీంతో చాంపియన్స్ట్రోఫీతోపాటు భవిష్యత్తులో ప్రపంచకప్‌లు భారతగడ్డపై నిర్వహించడ సందిగ్ధంలో పడినట్లయ్యింది. దాల్మియాకు గుర్తుగా.. మరోవైపు ఈ టోర్నీ ఫార్మాట్‌ను మార్చడం బీసీసీఐకి సుతారమూ ఇష్టం లేదు. దివంగత బోర్డు ఆధ్యక్షుడు జగ్మోహన్దాల్మియా విజన్‌కు గుర్తుగా రూపొందించిన ఈ టోర్నీలో మార్పులకు బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈక్రమంలో ఐసీసీ ప్రతిపాదనకు మెగ్గు చూపేదీ లేదని బోర్డు వర్గాలు ఈ సందర్భంగా పట్టుదలగా ఉన్నాయి. మరోవైపు బోర్డుకు దాల్మియా చేసిన సేవలకుగాను వచ్చే ఎడిషన్ ఫైనల్‌ను దాల్మియ సొంతగడ్డ కోల్‌కతాలో నిర్వహించాలని బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. -
పాక్‌తో భారత్ తొలి పోరు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ తరహాలోనే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత పురుషుల హాకీ జట్టు తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది. జూన్ 23 నుంచి జూలై 1 వరకు నెదర్లాండ్స్‌లోని బ్రెడా నగరంలో ఈ టోర్నమెంట్ జరగనుంది. భారత్, పాకిస్తాన్‌లతోపాటు నెదర్లాండ్స్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెల్జియం జట్లు టోర్నీలో పోటీపడుతున్నాయి. జూన్ 23న పాకిస్తాన్‌తో తొలి లీగ్ మ్యాచ్ ఆడనున్న భారత్... ఆ తర్వాత 24న అర్జెంటీనాతో... 27న ఆస్ట్రేలియాతో... 28న బెల్జియంతో... 30న నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. -
అతను మ్యాచ్ ఫినిషర్: కోహ్లీ
లండన్: చాంపియన్ ట్రోఫీలో వరుసగా విఫలమౌతున్న భారత్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్ విరాట్ కోహ్లీ వెనుకేసుకొచ్చాడు. హార్ధిక్ అమూల్యమైన ఆటగాడని కితాబిచ్చాడు. ఎటువంటి సందర్భంలోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సత్తా ఉన్నవాడని పొగిడాడు. పాండ్య అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. అటు బంతితో ఇటు బ్యాట్‌తో రాణించగల సత్తా ఉన్నవాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో 5బంతుల్లో9 పరుగులు, పాకిస్తాన్ మ్యాచ్‌లో 6బంతుల్లో 20పరుగులు చేశాడు. అయితే బౌలింగ్‌లో మాత్రం నాలుగు మ్యాచ్‌ల్లో 3 వికెట్లు మాత్రమే తీశాడని కెప్టెన్ తెలిపాడు. టీంలో సీనియర్ ఆటగాళ్లు, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సమీలను తీసుకోవాలని చాలా మంది ప్రశ్నించారని విరాట్ తెలిపాడు. తాను మాత్రం మొండిగా పాండ్యాకే ఓటు వేసినట్లు చెప్పాడు. పాండ్యాకు మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని భావించినట్లు కోహ్లీ తెలిపాడు. కీలక సమయంలో మ్యాచ్ ఫినిషర్‌గా ఉపయోగపడుతున్నాడని పేర్కొన్నాడు. లక్ష్య ఛేదన చేయాల్సి వచ్చినప్పుడు ఎనిమిదో స్థానం వరకూ బ్యాటింగ్ సామర్థ్యం ఉండాలన్నాడు. ఆ సమయంలో హార్ధిక్ జట్టును విజయతీరాలకు చేర్చగల సత్తా ఉన్నవాడు. ఫీల్డింగ్ విషయంలోను విశేషంగా రాణిస్తున్నాడని విరాట్ పొగిడాడు. చాంపియన్ ట్రోఫీలో తన ప్రదర్శన బాగానే ఉందన్నాడు, కీలక సమయంలో వికెట్లు తీసి రాణిస్తున్నాడంటూ వెనుకేసుకొచ్చాడు. చివరి యుద్ధంలో జట్టును మార్చే యోచన లేదని కోహ్లీ తెలిపాడు. -
పాక్ అభిమానుల దురాగతం
లండన్: ఒక జట్టు గెలిచినప్పుడు అభిమానులకు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. కానీ అది కాస్తా హెచ్చుమీరతే విపరీతాలు జరుగుతాయి. అలాగే పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు హద్దు మీరి రెచ్చిపోయారు. పాక్ ఫైనల్లో ప్రవేశించిన అత్యుత్సాహంలో భారత్ మాజీ కెప్టెన్, సౌరవ్‌గంగూలీపై దాడులకు పాల్పడ్డారు. పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించిన తరువాత ఈ దాడులకు పాల్పడ్డారు. ఈసంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సౌరవ్ గంగూలీ తన కారులో ప్రయాణిస్తుండగా అడ్డుపడిన పాక్ అభిమానులు, కారుపై ఎక్కడంతోపాటు దాడి చేయడం ప్రారంభించారు. పాకిస్తాన్ జిందాబాద్ ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. పాక్ జెండా పట్టుకుని కారు దాదా కారు కదలకుండా నలువైపులా నిర్భందించారు. అయితే కారు లోపలి నుంచి గంగూలీ చిరునవ్వు నవ్వి కొద్ది సేపటి తర్వాత వెళ్లిపోయారు. ఈనెల 15న జరిగిన చాంపియన్ ట్రోఫీ రెండో సెమీస్ మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌పై గెలిచి ఫైనల్ చేరింది. ఈనెల 18న ఆదివారం భారత్ చిరకాల ప్రత్యర్థి పాక్‌తో భారత్ కప్పుకోసం తలపడనుంది. జూన్ నాలుగున భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాక్ ఓడిపోయిన విషయం తెలిసిందే. -
అచ్చం ధోనీలా హెలికాఫ్టర్ షాట్!
ఓవల్: చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో టీమిండియా సత్తాచాటింది. అయితే నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 240 పరుగులతో టీమిండియా ఘన విజయం సాధించగా.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ధనా ధన్ ఇన్నింగ్స్‌కు అందరూ దాసోహమయ్యారు. కేవలం 54 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 80 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తన ఎంపిక సరైనదేనని నిరూపించాడు. అయితే పాండ్యా సిక్సర్లు కొట్టిన తీరు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని గుర్తుకు తెప్పించిందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. భారత్ ఇన్నింగ్స్ చివరి బంతిని హార్దిక్ అద్బుతమైన సిక్సర్‌గా మలిచాడు. రుబెల్ హుస్సేన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ధోనీ తరహాలో హెలికాఫ్టర్ షాట్ ఆడాడని పాండ్యాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ.. మాపై ఏ ఒత్తిడి లేదు. అత్యుత్తమ క్రికెట్‌ను ఆడతామని ధీమా వ్యక్తం చేశాడు. భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 23.5 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలడంతో 240 పరుగుల భారీ విజయం దక్కింది. భువనేశ్వర్ (3/13), ఉమేశ్ (3/16) లతో పాటు బ్యాటింగ్‌లో దినేశ్ కార్తీక్ (94 రిటైర్డ్ అవుట్), శిఖర్ ధావన్ (60) రాణించారు. -
స్పెల్‌బీ అమోఘం
‘సాక్షి’ ప్రయత్నం అభినందనీయం.. స్పెల్‌బీ కార్యక్రమాన్ని కొనియాడిన స్కూల్ యాజమాన్యాలు సిటీబ్యూరో: పిల్లల్లో ఆంగ్లభాషలో పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించిన ‘స్పెల్‌బి-2014’ కార్యక్రమం అభినందనీయమని పలు పాఠశాలల యాజమాన్యాలు అభిప్రాయపడ్డాయి. బంజారాహిల్స్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆత్యధిక పతకాలు సాధించిన స్కూళ్లకు చాంపియన్ ట్రోఫీలను సాక్షి గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్ డెరైక్టర్ రాణిరెడ్డి, సాక్షి ఫైనాన్స్ డెరైక ్టర్ ైవె ఈపీ రెడ్డి అందజేశారు. హైదరాబాద్‌లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ హెడ్ విద్య, ఏపీలోని రాజమండ్రికి చెందిన ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ డీన్ హర్షిణిదేవి, చిత్తూరుకు చెందిన కమ్ఫార్డ్ స్కూల్ కరస్పాండెంట్ సీఆర్ మహేష్ చాంపియన్‌షిప్ ట్రోఫీలను అందుకున్నారు. పిల్లల మేథోశక్తిని పెంచే ందుకు సాక్షి చేపట్టిన కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని వారు అభిప్రాయపడ్డారు. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని వారు ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా నాలుగు కేటగిరిలలో నిర్వహించిన పోటీల్లో దాదాపు 160 మంది ఫైనల్స్‌కు ఎంపిక కాగా ఒక్కో కేటగిరి నుంచి ముగ్గురు చొప్పున 25 మంది పతకాలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ పోటీలలో చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ 5 పతకాలు, ప్యూచర్ కిడ్స్ 2, కమ్ఫార్డ్ 2 పతకాలను కైవసం చేసుకున్న విషయం విదితమే. -
జర్మనీ జయకేతనం
చాంపియన్స్ ట్రోఫీ కైవసం ఫైనల్లో పాక్‌పై గెలుపు భువనేశ్వర్: టోర్నీ మొత్తం నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్న ఒలింపిక్ చాంపియన్ జర్మనీ జట్టు... చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఆదివారం కలింగ మైదానంలో జరిగిన ఫైనల్లో 2-1తో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. 2007 తర్వాత మరోసారి టైటిల్‌ను సాధించిన జర్మనీకి ఓవరాల్‌గా ఇది పదో ట్రోఫీ. వెస్లీ (18వ ని.), ఫ్లోరియన్ ఫుచ్స్ (57వ ని.) జర్మనీకి గోల్స్ అం దించారు. తొలి నిమిషంలోనే పెనాల్టీని సాధిం చిన జర్మనీ మ్యాచ్ మొత్తం దూకుడును ప్రదర్శించింది. ప్రథమార్ధం ముగిసేసరికి 1-0 ఆధిక్యాన్ని సాధించింది. అయితే రెండో అర్ధభాగంలో పాక్ కాస్త పోరాడినా గోల్స్ చేయలేకపోయింది. భారత్‌కు నాలుగో స్థానం 32 ఏళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో పతకం గెలుచుకునే మంచి అవకాశాన్ని భారత హాకీ జట్టు జారవిడుచుకుంది. ఆదివారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 1-2తో ఆస్ట్రేలియా చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 1982లో కాంస్యం సాధించిన భారత్... కనీసం ఈసారి కూడా దాన్ని పునరావృతం చేస్తే బాగుంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. లలిత్ ఉపాధ్యాయ (42వ ని.) భారత్‌కు ఏకైక గోల్ అందిస్తే... ఎడి ఒకెన్డెన్ (18వ ని.), మాట్ గోడెస్ (52వ ని.)లు ఆసీస్ తరఫున చెరో ఫీల్డ్ గోల్ సాధించారు. నెదర్లాండ్స్, అర్జెంటీనా, ఇంగ్లండ్, బెల్జియం వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. ఇద్దరు పాక్ ఆటగాళ్లపై వేటు సెమీస్‌లో భారత్‌పై గెలిచాక ప్రేక్షకులకు అసభ్య కరంగా సంజ్ఞలు చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లపై అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఒక మ్యాచ్ నిషేధం విధించింది. ఆ ఘటనలో దోషులుగా తేలిన అంజద్ అలీ, మొహమ్మద్ తౌసీఖ్లను జర్మనీతో ఫైనల్ ఆడకుండా నిషేధించింది. తొలుత వీరిని హెచ్చరించి వదిలేసినా... వాళ్లపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో భారత్‌లో అం తర్జాతీయ టోర్నీలు నిర్వహించబోమని హాకీ ఇండియా హెచ్చరించింది. దీంతో ఎఫ్ఐహెచ్ చర్యలు తీసుకుంది. సెమీస్ తమ ప్రవర్తన పట్ల ఫైనల్ అనంతరం పాక్ కోచ్, కెప్టెన్ గులాబీలు ప్రదర్శిస్తూ క్షమాపణలు కోరారు. -
రాణించిన ధోని, బ్రావో!
హైదరాబాద్: కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, బ్రావోలు రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఛాంపియన్స్ లీగ్ ట్వెంటీ20 ట్రోఫిలో భాగంగా హైదరాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ధోని సేన బ్యాటింగ్ కు దిగింది. స్మిత్ 20, మెక్కాలమ్ 22, రైనా 28 పరుగులు చేసి చేశారు. చివర్లో 20 బంతుల్లో ధోని 2 సిక్సర్లు, 3 ఫోర్లు, బ్రావో 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు సాధించడంతో 158 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా ముందు చెన్నై ఉంచింది. కోల్ కతా బౌలర్లలో చావ్లా 2, నరైన్, పఠాన్ చెరో వికెట్ పడగొట్టారు. కడపటి వార్తలు అందేసరికి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 9 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. డస్కోటే 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. సూర్య కుమార్ యాదవ్ 19 చేసి అవుటయ్యాడు -
ఇలాగేనా ఆడేది?
న్యూఢిల్లీ: భారత ఆటగాళ్ల ఆటతీరుపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విరుచుకుపడ్డారు. ఆట పట్ల వారికి ఏమాత్రం అంకితభావం ఉన్నట్టు కనిపించడం లేదన్నారు. ఆసియాకప్‌లో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు పరాజయాలతో దాదాపు టోర్నీ నుంచి నిష్ర్కమించే పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ‘ఆటపై భారత ఆటగాళ్లకున్న చిత్తశుద్ధి దారుణంగా ఉంది. అదే జట్టుకు పరాజయాలను అందిస్తోంది. అసలు ఏమాత్రం ప్రాక్టీస్ చేయడం లేదు. ఇక వీరికి ఆప్షనల్ ప్రాక్టీస్ కూడా ఉంటోంది. ఇది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. దాన్ని కిటికీ నుంచి బయటికి విసిరేయాలి. ఈ పద్ధతి ఇక్కడే కాకుండా వారు ఆడే మిగతా టోర్నీల్లో కూడా ఉంటోంది. హోటల్ గదుల్లో ఉండడానికో, షాపింగ్ చేయడానికో వారు రాలేదు. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఈ విషయంలో నిర్లిప్తంగా ఉండడం శోచనీయం. అందుకే చాంపియన్స్ ట్రోఫీ అనంతరం జట్టు వరుసగా ఓడిపోతూనే ఉంది’ అని గవాస్కర్ ధ్వజమెత్తారు. మేజర్ టోర్నీలో తొలిసారిగా కోహ్లి జట్టు బాధ్యతలు బాగానే నిర్వర్తిస్తున్నాడని అన్నారు.