న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ తరహాలోనే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత పురుషుల హాకీ జట్టు తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది. జూన్ 23 నుంచి జూలై 1 వరకు నెదర్లాండ్స్‌లోని బ్రెడా నగరంలో ఈ టోర్నమెంట్ జరగనుంది. భారత్, పాకిస్తాన్‌లతోపాటు నెదర్లాండ్స్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెల్జియం జట్లు టోర్నీలో పోటీపడుతున్నాయి. జూన్ 23న పాకిస్తాన్‌తో తొలి లీగ్ మ్యాచ్ ఆడనున్న భారత్... ఆ తర్వాత 24న అర్జెంటీనాతో... 27న ఆస్ట్రేలియాతో... 28న బెల్జియంతో... 30న నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment