schedule
-
Uttar Pradesh: విద్యార్థి ఆందోళనలు ఉధృతం.. బారికేడ్లను దాటుకుని..
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరుకు వ్యతిరేకంగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులు గత నాలుగు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు(గురువారం) కమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళం చెలరేగింది.పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లనను తొలగించుకుంటూ విద్యార్థులు కమిషనర్ కార్యాలయం వైపు కదిలారు. ఈ నేపధ్యంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పీసీఎస్ ప్రిలిమ్స్ 2024, ఆర్/ఏఆర్ఓ ప్రిలిమ్స్ 2023 పరీక్షలను రెండు రోజుల్లో రెండు షిఫ్టులలో నిర్వహించాలని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు సోమవారం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రయాగ్‌రాజ్‌లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట సోమవారం నుంచి వేలాది మంది విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు.ప్రయాగ్‌రాజ్‌లోని కమిషన్ కార్యాలయం వద్దనున్న మూడు రోడ్ల కూడలిలో విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు బారికేడ్లతో మూడు రహదారులను మూసివేసి భద్రతను పెంచారు. కాగా కొందరు పోలీసులు రాత్రిపూట సాధారణ దుస్తులలో వచ్చి కొంతమంది విద్యార్థులను తీసుకెళ్లారనే ఆరోపణలు వినివస్తున్నాయి. ఈరోజు(గురువారం) నిరసన స్థలానికి 200 మీటర్ల దూరంలో ఉన్న కూడలి వద్ద వేలాది మంది విద్యార్థులు గుమిగూడారు. వీరిలో కొందరు కమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.కాగా బుధవారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గేట్ నంబర్ టూ వద్ద నిరసనకు దిగిన విద్యార్థులతో మాట్లాడేందుకు జిల్లా డీఎం రవీంద్ర కుమార్, పోలీస్ కమిషనర్ తరుణ్ గబా, కమిషన్ సెక్రటరీ అశోక్ కుమార్ వచ్చారు. డిఎం రవీంద్రకుమార్ గంటపాటు విద్యార్థులతో మాట్లాడి నిరసనను విరమించేలా వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు తమ డిమాండ్లు నెరవేరేవరకూ నిరసన కొనసాగిస్తామని చెప్పారు.ఇది కూడా చదవండి: Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా? -
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ షెడ్యూల్ విడుదల
సాక్షి, విజయవాడ: ఎట్టకేలకు గ్రూప్-2 మెయిన్స్ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. జూలై నాటికే పూర్తి కావాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో గత ఏడాది డిసెంబర్లో 899 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరిలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. జూలై నాటికి గ్రూప్ -2 మెయిన్స్ పూర్తి చేసేవిధంగా నాటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ నిర్ణయించారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్చే బలవంతపు రాజీనామా చేయించారు. నాలుగు నెలలగా చైర్మన్ లేకపోవడంతో గ్రూప్-1 , గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త చైర్మన్‌గా అనూరాధ బాధ్యతలు స్వీకరించడంతో గ్రూప్-2 మెయిన్స్‌కి ఏపిపిఎస్సీ షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికే గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్షలో 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వాయిదా పడిన గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్‌పైనా నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. -
TG: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చేనెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చేనెల 17న రెండు సెషన్లలో రెండు పేపర్లకు పరీక్ష జరగనుంది. 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్లో ఫస్ట్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5:30 వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది. 18న తేదీన పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతుంది. ఇక.. నవంబర్ 10వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)మెయిన్స్ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎనీ్టఏ) సోమవారం విడుదల చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను రెండు సెషన్ల (జనవరి, ఏప్రిల్)లో జేఈఈ మెయిన్స్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 28 నుంచి నవంబర్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది.వచ్చే నెల 22వ తేదీ రాత్రి 11.50 గంటలల్లోగా ఫీజు చెల్లించేందుకు గడువుగా పేర్కొంది. జనవరి మొదటి వారంలో పరీక్ష కేంద్రాలను ప్రకటించనుంది. పరీక్ష తేదీకి మూడు రోజులు ముందుగా ఎన్టీఏ వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతామని ఎన్టీఏ తెలిపింది. జనవరి 22 నుంచి 31వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండు షిఫ్టుల్లో కంప్యూటర్‌పై పరీక్షను నిర్వహించనున్నట్టు వివరించింది. ఫిబ్రవరి 12న తుది ఫలితాలు వెల్లడించనుంది. జేఈఈ మెయిన్స్‌ను 13 ప్రాంతీయ భాషల్లో చేపట్టనుంది. -
మోగిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా... షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
మోగిన ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, హరియాణా ఎన్నికల కోలాహలం ముగిసిన కొద్దిరోజులకే మరో రెండు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలుకానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించి కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఎన్నికల వేడిని పెంచింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూలు మీడియా సమావేశంలో రెండు రాష్ట్రాల ఎన్నికలతోపాటు వయనాడ్, నాందేడ్ లోక్‌సభ స్థానాలు, 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల షెడ్యూళ్లను విడుదలచేశారు.వారాంతాల్లో పోలింగ్ నిర్వహిస్తే పట్టణప్రాంత ఓటర్లు సెలవుదినంగా దుర్వినియోగం చేస్తున్నారన్న భావనతో పోలింగ్‌ను కేవలం బుధవారాల్లోనే రెండు రాష్ట్రాల్లో చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న, జార్ఖండ్‌లో నవంబర్ 13, 20న రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ తొలి విడతలో 43 స్థానాలకు, రెండో విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.పశ్చిమబెంగాల్లోని బసిర్హాట్ ఎంపీ, ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్ ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నికలపై పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలచేయలేదు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సారథ్యలోని శివసేన పారీ్టతో బీజేపీ అధికారాన్ని పంచుకున్న విషయం తెల్సిందే. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 సీట్లకుగాను 31 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్–ఎన్సీపీ(ఎస్పీ)–శివసేన(యూబీటీ) కూటమి నుంచి అధికార మహాయుతి కూటమికి గట్టిసవాల్ ఎదురవుతోంది. జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం), కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉండగా ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. మహారాష్ట్రలో 288, జార్ఖండ్‌లో 81 మహారాష్ట్రకు సంబంధించి మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 ఎస్సీ, 25 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. రాష్ట్రంలో 9.64 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఓట ర్లలో 4.97 కోట్ల మంది పురుషులుకాగా 4.66 కోట్ల మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో 1,00,186 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేస్తున్నారు. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటిలో 9 ఎస్సీ, 28 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. రాష్ట్రంలో 2.60 కోట్ల మంది ఈసారి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల కోసం 29,562 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేస్తున్నారు. -
వారంలో ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌లో
సాక్షి, హైదరాబాద్: ప్రతీవారంలో ఇద్దరు మంత్రులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాల యమైన గాంధీ భవన్‌ను సందర్శించనున్నారు. ఈ మేరకు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ షెడ్యూల్ విడుదల చేశారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ కార్యకర్తలు, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలను గాంధీభవన్‌లో కలుస్తారన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులు, అర్జీలను ఆ రోజున తీసుకుంటారని మహేశ్‌కుమార్‌గౌడ్ ఆ షెడ్యూల్లో వివరించారు. మంత్రుల షెడ్యూల్ ఇలా...25 సెప్టెంబర్: దామోదర రాజనర్సింహ, 27 సెప్టెంబర్: శ్రీధర్‌బాబు, 2 అక్టోబర్: గాంధీ జయంతి (కార్యక్రమం లేదు), 4 అక్టోబర్ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, 9 అక్టోబర్: పొన్నం ప్రభాకర్, 11 అక్టోబర్: సీతక్క, 16 అక్టోబర్: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, 18 అక్టోబర్: కొండా సురేఖ, 23 అక్టోబర్: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, 25 అక్టోబర్: జూపల్లి కృష్ణారావు, 30 అక్టోబర్: తుమ్మల నాగేశ్వరరావు -
అక్టోబర్ 6న భారత్, పాక్ పోరు
దుబాయ్: బంగ్లాదేశ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు తరలి వెళ్లిన మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరిగే ఈ టోర్నీని యూఏఈలోని రెండు వేదికల్లో (షార్జా, దుబాయ్) నిర్వహిస్తారు. రెండు మ్యాచ్‌లు ఉంటే... భారత కాలమానం ప్రకారం తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్ రాత్రి గం. 7:30 నుంచి జరుగుతాయి. టాప్–10 దేశాలు పోటీపడుతున్న ఈ టోరీ్నలో మొత్తం 23 మ్యాచ్‌లున్నాయి. బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో... అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుంది. అనంతరం అక్టోబర్ 9న శ్రీలంకతో, అక్టోబర్ 13న ఆ్రస్టేలియాతో భారత్ ఆడుతుంది. భారత్ సెమీఫైనల్ చేరుకుంటే అక్టోబర్ 17న దుబాయ్‌లో జరిగే తొలి సెమీఫైనల్లో ఆడుతుంది. అక్టోబర్ 20న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ఆ్రస్టేలియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. సెమీఫైనల్స్, ఫైనల్‌కు ‘రిజర్వ్ డే’ కేటాయించారు. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక... గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లున్నాయి. సెపె్టంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు 10 ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో, హరియాణాలో ఒక దశలో పోలింగ్.. అక్టోబర్ 4న ఫలితాలు. ఇంకా ఇతర అప్డేట్స్
-
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్(ఈసీ) శుక్రవారం(ఆగస్టు 16) మళ్లీ ఎన్నికల నగారా మోగించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్(ఈసీ) మీడియా సమావేశంలో ప్రకటించనుంది. హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జమ్ముకు అసెంబ్లీకి తొలిసారి జరిగే ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. -
సెప్టెంబర్ 3న రాజ్యసభ ఉప ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరుగనున్నట్లు బుధవారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, దీపేందర్ హుడా వంటి సిట్టింగ్ సభ్యులు లోక్‌సభకు ఎన్నికవడంతో ఆ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కె.కేశవరావు కాంగ్రెస్‌లోకి మారడంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఒక సీటు, ఒడిశాలో మమతా మొహంతా రాజీనామాతో మరో సీటు ఖాళీ అయింది. ఈ 12 స్థానాలకు ఆగస్టు 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ పత్రాల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీగా ఈసీ ప్రకటించింది. 22న నామినేషన్ పత్రాల పరిశీలన, 26న అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర, 27న బిహార్, రాజస్తాన్, తెలంగాణ, ఒడిశాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువిచి్చంది. సెపె్టంబర్ 3వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తారని, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేస్తారని తెలిపింది. -
Olympics 2024: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్
పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు వరుసగా రెండో రోజు నిరాశ తప్పలేదు. మహిళల 5000 మీటర్ల పరుగులో పారుల్ చౌధరీ, అంకిత దయాని హీట్స్‌లోనే వెనుదిరిగారు. భారత్ నుంచి రెండు ఈవెంట్లలో విశ్వక్రీడలకు అర్హత సాధించిన పారుల్ చౌధరీ.. శుక్రవారం జరిగిన రెండో హీట్‌లో 15 నిమిషాల 10.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 14వ స్థానంతో సరిపెట్టుకుంది.తొలి హీట్‌లో పోటీపడిన భారత మరో రన్నర్ అంకిత దయాని 20వ స్థానంలో నిలిచింది. అంకిత 16 నిమిషాల 19.38 సెకన్లలో గమ్యాన్ని చేరుకుంది. ఒక్కో హీట్ నుంచి తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వాళ్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్ఆర్చరీ మహిళల వ్యక్తిగత ఎలిమినేషన్ రౌండ్: దీపికా కుమారి ్ఠ మిచెల్లి క్రాపెన్ (జర్మనీ) (మధ్యాహ్నం గం. 1:52 నుంచి), భజన్ కౌర్ ్ఠ దినంద చోరునిసా (ఇండోనేసియా) (మధ్యాహ్నం గం. 2:05 నుంచి) షూటింగ్ మహిళల స్కీట్ క్వాలిఫికేషన్ రౌండ్: రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). మహిళల 25 మీటర్ల పిస్టల్ (పతక పోరు): మనూ భాకర్ (మధ్యాహ్నం గం. 1:00 నుంచి) బాక్సింగ్ పురుషుల 71 కేజీల క్వార్టర్ ఫైనల్: నిశాంత్ మార్కో వెర్డె (మెక్సికో) (అర్ధరాత్రి గం. 12:18 నుంచి) సెయిలింగ్పురుషుల డింగీ రేసులు: విష్ణు (మధ్యాహ్నం గం. 3:45 నుంచి). మహిళల డింగీ రేసులు: నేత్ర కుమానన్ (సాయంత్రం గం. 5:55 నుంచి) -
Paris Olympics 2024: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్..
నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్..ఆర్చరీ..– పురుషుల వ్యక్తిగత (1/32 ఎలిమినేషన్ రౌండ్):ప్రవీణ్ జాధవ్ × వెన్‌చావో (చైనా) (మధ్యాహ్నం గం. 2:31 నుంచి).పురుషుల వ్యక్తిగత (1/16 ఎలిమినేషన్ రౌండ్): (మధ్యాహ్నం గం. 3:10 నుంచి).షూటింగ్..– పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (ఫైనల్):స్వప్నిల్ కుసాలే (మధ్యాహ్నం గం. 1:00 నుంచి).మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫికేషన్ రౌండ్: సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).గోల్ఫ్..– పురుషుల వ్యక్తిగత ఫైనల్స్:గగన్‌జీత్ భుల్లర్, శుభాంకర్ శర్మ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).బాక్సింగ్..– మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్:నిఖత్ జరీన్ × యూ వూ (చైనా) (మధ్యాహ్నం గం. 2:30 నుంచి).సెయిలింగ్..– పురుషుల డింగీ తొలి రెండు రేసులు:విష్ణు శరవణన్ (మధ్యాహ్నం గం. 3:45 నుంచి).– మహిళల డింగీ తొలి రెండు రేసులు:నేత్రా కుమానన్ (రాత్రి గం. 7:05 నుంచి)హాకీ..భారత్ × బెల్జియం (గ్రూప్ మ్యాచ్) (మధ్యాహ్నం గం. 1:30 నుంచి).బ్యాడ్మింటన్..– పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్స్:(మధ్యాహ్నం గం. 12:00 నుంచి).– పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్:సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి × చియా ఆరోన్–సోహ్ వూయి యిక్ (మలేసియా) (సాయంత్రం గం. 4:30 నుంచి).మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ (సాయంత్రం గం. 4:30 నుంచి). -
నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ తొలి లీగ్ మ్యాచ్: పీవీ సింధు x ఫాతిమత్ నభా (మాల్దీవులు) మధ్యాహ్నం గం. 12:50 నుంచి. పురుషుల సింగిల్స్ తొలి లీగ్ మ్యాచ్: హెచ్ఎస్ ప్రణయ్ x ఫాబియన్ రోథ్ (జర్మనీ) రాత్రి గం. 9:00 నుంచిషూటింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్: ఇలవేనిల్ వలారివన్ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి). పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్: సందీప్ సింగ్, అర్జున్ బబూతా (మధ్యాహ్నం గం. 2:45 నుంచి). మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్: మనూ భాకర్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి). రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్స్ (రెపిచేజ్ 2): బలరాజ్ పన్వర్ (మధ్యాహ్నం గం. 1:18 నుంచి).టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ (రెండో రౌండ్): ఆకుల శ్రీజ x క్రిస్టియానా క్లెబెర్గ్ (స్వీడన్) (మధ్యాహ్నం గం. 12:15 నుంచి). మహిళల సింగిల్స్ (రెండో రౌండ్): మనికా బత్రా x అన్నా హర్సే (ఇంగ్లండ్) (మధ్యాహ్నం 12:15 నుంచి). పురుషుల సింగిల్స్ (రెండో రౌండ్): శరత్ కమల్ x డేనీ కోజుల్ (స్లొవేనియా) (మధ్యాహ్నం గం. 3:00 నుంచి).స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ (హీట్–2): శ్రీహరి నటరాజ్ (మధ్యాహ్నం గం. 3:16 నుంచి). మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ (హీట్–1): ధీనిధి (మధ్యాహ్నం గం. 3.30 నుంచి).ఆర్చరీ మహిళల రికర్వ్ టీమ్ క్వార్టర్ ఫైనల్: భారత్ (దీపిక కుమారి, అంకిత భకత్, భజన్ కౌర్) ్ఠ ఫ్రాన్స్/నెదర్లాండ్స్ (సాయంత్రం గం. 5:45 నుంచి). మహిళల టీమ్ సెమీఫైనల్: (రాత్రి గం. 7:17 నుంచి). మహిళల టీమ్ ఫైనల్: (రాత్రి గం. 8:18 నుంచి). -
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్
-
తిరుమల బ్రహ్మోత్సవాలు షెడ్యూల్ 2024
-
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
-
ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్ట్ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఈనెల 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జరిగే టెస్టుల వివరాలను https://psc.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్టు సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు.⇒ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ విభాగంలో శాంపిల్ టేకర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 12న ఉదయం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయానికి రావాలని కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఇతర వివరాలకు వెబ్సైట్లో చూడాలన్నారు.⇒ ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 25న పరిశీలించనున్నారు. అభ్యర్థులు నిర్ణయించిన తేదీల్లో సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ⇒ హోమియో విభాగంలో మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 23 నుంచి 25 తేదీ వరకు పరిశీలించనున్నారు. ⇒ రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వివరాలను సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు కార్యదర్శి పేర్కొన్నారు. -
శ్రీలంక పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఇదే..!
మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటన ఈ ఏడాది జులై 27న మొదలై ఆగస్ట్ 7 వరకు సాగనున్నట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డే సిరీస్ జరుగనున్నట్లు సమాచారం. పర్యటన తాలుకా షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ పర్యటనలోని మ్యాచ్‌లన్నీ సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.శ్రీలంక పర్యటనలో భారత షెడ్యూల్ ఇలా..తొలి టీ20- జులై 27రెండో టీ20- జులై 28మూడో టీ20- జులై 30తొలి వన్డే- ఆగస్ట్ 2రెండో వన్డే- ఆగస్ట్ 4మూడో వన్డే- ఆగస్ట్ 7ఈ సిరీస్‌కు ముందు టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే విడుదల చేశారు. ఈ సిరీస్ కోసం భారత జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ టీమిండియాను ముందుండి నడిపించనున్నాడు. ఈ సిరీస్ జులై 6న మొదలై జులై 14 వరకు కొనసాగుతుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగా జరుగనున్నాయి.తొలి టీ20- జులై 6రెండో టీ20- జులై 7మూడో టీ20- జులై 10నాలుగో టీ20- జులై 13ఐదో టీ20- జులై 14జింబాబ్వే సిరీస్‌కు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్‌పాండే. -
టీమిండియా హోం సీజన్ (2024-25) షెడ్యూల్ విడుదల
2024-2025 హోం సీజన్‌కు సంబంధించి టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (జూన్ 20) ప్రకటించింది. ఈ సీజన్ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో మొదలై వచ్చే ఏడాది (2025) ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో ముగుస్తుంది. ఈ మధ్యలో భారత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది.2024-25 హోం సీజన్ షెడ్యూల్ వివరాలు..బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియాతొలి టెస్ట్ (చెన్నై): సెప్టెంబర్ 19 నుంచి 23 వరకురెండో టెస్ట్ (కాన్పూర్): సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకుతొలి టీ20 (ధర్మశాల): అక్టోబర్ 6రెండో టీ20 (ఢిల్లీ): అక్టోబర్ 9మూడో టీ20 (హైదరాబాద్): హైదరాబాద్న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియాతొలి టెస్ట్ (బెంగళూరు): అక్టోబర్ 16 నుంచి 20 వరకురెండో టెస్ట్ (పూణే): అక్టోబర్ 24 నుంచి 28 వరకుమూడో టెస్ట్ (ముంబై): నవంబర్ 1 నుంచి 5 వరకుఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియాతొలి టీ20 (చెన్నై): జనవరి 22రెండో టీ20 (కోల్‌కతా): జనవరి 25మూడో టీ20 (రాజ్‌కోట్): జనవరి 28నాలుగో టీ20 (పూణే): జనవరి 31ఐదో టీ20 (ముంబై): ఫిబ్రవరి 2తొలి వన్డే (నాగ్‌పూర్): ఫిబ్రవరి 6రెండో వన్డే (కటక్): ఫిబ్రవరి 9మూడో వన్డే (అహ్మదాబాద్): ఫిబ్రవరి 12టీ20 వరల్డ్‌కప్ 2024 తర్వాత టీమిండియా షెడ్యూల్..ఇండియా టూర్ ఆఫ్ జింబాబ్వే (5 టీ20లు)ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక (3 వన్డేలు, 3 టీ20లు)బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియా (2 టెస్ట్‌లు, 3 టీ20లు)న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా (3 టెస్ట్‌లు)ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా (5 టెస్ట్‌లు)ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా (3 వన్డేలు, 5 టీ20లు)ఛాంపియన్స్ ట్రోఫీ 2025వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ -
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు జరగనున్నాయి.మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇలా..అక్టోబర్ 21-జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫయింగ్ టెస్ట్)అక్టోబర్ 22-పేపర్ 1(జనరల్ ఎస్సే)అక్టోబర్ 23-పేపర్ 2(హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)అక్టోబర్ 24-పేపర్ 2 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్)అక్టోబర్ 25-పేపర్ 4(ఎకానమి అండ్ డెవలప్మెంట్)అక్టోబర్ 26-పేపర్ 5(సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్)అక్టోబర్ 27-పేపర్ 6(తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు) -
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ, సాక్షి; సార్వత్రిక ఎన్నికల హడావిడి ముగియగానే మరో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి తేదీలను బుధవారం విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్లో 4, హిమాచల్ ప్రదేశ్‌లో 3, ఉత్తరాఖండ్‌లో 2, బీహార్ తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ ఒక్కొ అసెంబ్లీ స్థానం.. మొత్తం 13 స్థానాల్లో ఉప ఎన్నికకు తేదీల్ని ప్రకటించింది. అంతేకాదు.. ఆ సీట్లు ఎందుకు ఖాళీ అయ్యాయనే కారణాలను కూడా వివరించింది. ఏడు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల బై పోలింగ్ జులై 10వ తేదీన పోలింగ్ జరగనుంది. అలాగే.. జులై 13వ తేదీన కౌంటింగ్.. అదే రోజు సాయంత్రం ఫలితాల్ని వెల్లడిస్తారు.ఇదీ చదవండి: మూడోసారి ప్రధానిగా మోదీ, తొలి సంతకం దేనిమీద అంటే.. -
T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
టీ20 ప్రపంచకప్ టోర్నీకి అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తోంది. వెస్టిండీస్‌తో కలిసి ఈ ఏడాది మెగా ఈవెంట్ నిర్వహణ హక్కులు దక్కించుకుంది. తద్వారా కొత్త స్టేడియాల్లో పొట్టి ఫార్మాట్లో ఐసీసీ టోర్నమెంట్ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం ప్రేక్షకులకు దక్కింది.మరి టీ20 వరల్డ్‌కప్-2024 పూర్తి షెడ్యూల్, సమయం, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ తదితర విశేషాలు తెలుసుకుందామా?!గ్రూప్ దశలో...👉జూన్ 1: అమెరికా వర్సెస్ కెనడా- టెక్సాస్(భారత కాలమానం ప్రకారం జూన్ 2 ఉదయం ఆరు గంటలకు ఆరంభం)👉జూన్ 2: వెస్టిండీస్ వర్సెస్ పపువా న్యూగినియా- గయానా(రాత్రి ఎనిమిదిన్నర గంటలకు)నమీబియా వర్సెస్ ఒమన్- బార్బడోస్(జూన్ 3 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 3: శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)అఫ్గనిస్తాన్ వర్సెస్ ఉగాండా- గయానా(జూన్ 4 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 4: ఇంగ్లండ్ వర్సెస్ స్కాట్లాండ్- బార్బడోస్(రాత్రి ఎనిమిది గంటలకు)నెదర్లాండ్స్ వర్సెస్ నేపాల్- డల్లాస్- రాత్రి తొమ్మిది గంటలకు)👉జూన్ 5: ఇండియా వర్సెస్ ఐర్లాండ్- న్యూయార్క్- (రాత్రి ఎనిమిది గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్- బార్బడోస్- (జూన్ 6 ఉదయం ఆరు గంటలకు)పపువా న్యూగినియా వర్సెస్ ఉగాండా- గయానా- (జూన్ 6 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 6- యూఎస్ఏ వర్సెస్ పాకిస్తాన్- డల్లాస్(రాత్రి తొమ్మిది గంటలకు)నమీబియా వర్సెస్ స్కాట్లాండ్- బార్బడోస్(జూన్ 7 అర్ధరాత్రి 12. 30కి ఆరంభం)👉జూన్ 7- కెనడా వర్సెస్ ఐర్లాండ్- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్- డల్లాస్(జూన్ 8 ఉదయం ఆరు గంటలకు)న్యూజిలాండ్ వర్సెస్ అఫ్గనిస్తాన్- గయానా(జూన్ 8 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 8- నెదర్లాండ్స్ వర్సెస్ సౌతాఫ్రికా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- బార్బడోస్- (రాత్రి 10 30 నిమిషాలకు)వెస్టిండీస్ వర్సెస్ ఉగాండా- గయానా(జూన్ 9 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 9- ఇండియా వర్సెస్ పాకిస్తాన్- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)ఒమన్ వర్సెస్ స్కాట్లాండ్- అంటిగ్వా(రాత్రి 10.30 నిమిషాలకు)👉జూన్ 10- సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)👉జూన్ 11- పాకిస్తాన్ వర్సెస్ కెనడా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా- అంటిగ్వా(జూన్ 12 ఉదయం ఆరు గంటలకు)శ్రీలంక వర్సెస్ నేపాల్- ఫ్లోరిడా(జూన్ 12 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 12- యూఎస్ఏ వర్సెస్ ఇండియా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్- ట్రినిడాడ్(జూన్ 13 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 13- బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్- సెయింట్ విన్సెంట్(రాత్రి ఎనిమిది గంటలకు)అఫ్గనిస్తాన్ వర్సెస్ పపువా న్యూగినియా- ట్రినిడాడ్(జూన్ 14 ఉదయం ఆరు గంటలకు)ఇంగ్లండ్ వర్సెస్ ఒమన్- అంటిగ్వా(జూన్ 14 అర్ధరాత్రి 12.30 నిమిషాలకు)👉జూన్ 14- యూఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)న్యూజిలాండ్ వర్సెస్ ఉగాండా-ట్రినిడాడ్(జూన్ 15 ఉదయం ఆరు గంటలకు)సౌతాఫ్రికా వర్సెస్ నేపాల్(జూన్ 15 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 15- ఇండియా వర్సెస్ కెనడా- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)నమీబియా వర్సెస్ ఇంగ్లండ్- అంటిగ్వా(రాత్రి 10.30కి)ఆస్ట్రేలియా వర్సెస్ స్కాట్లాండ్- సెయింట్ లూసియా(జూన్ 16 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 16- పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్- సెయింట్ లూసియా(జూన్ 17 ఉదయం ఆరు గంటలకు)బంగ్లాదేశ్ వర్సెస్ నేపాల్- సెయింట్ విన్సెంట్(జూన్ 17 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 17- న్యూజిలాండ్ వర్సెస్ పపువా న్యూగినియా- ట్రినిడాడ్ (రాత్రి ఎనిమిది గంటలకు)వెస్టిండీస్ వర్సెస్ అఫ్గనిస్తాన్- సెయింట్ లూసియా(జూన్ 18 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 19- ఏ2 వర్సెస్ డీ1 సూపర్-8 గ్రూప్-2- అంటిగ్వా(రాత్రి ఎనిమిది గంటలకు)బీ1 వర్సెస్ సీ2- సెయింట్ లూయీస్(జూన్ 20 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 20- సీ1 వర్సెస్ ఏ1- బార్బడోస్(రాత్రి ఎనిమిది గంటలకు)బీ2 వర్సెస్ డీ2- అంటిగ్వా(జూన్ 21 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 21- బీ1 వర్సెస్ డీ1- సెయింట్ లూసియా(రాత్రి ఎనిమిది గంటలకు)ఏ2 వర్సెస్ సీ2- బార్బడోస్- (జూన్ 22 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 22- ఏ1 వర్సెస్ డీ2- అంటిగ్వా(రాత్రి ఎనిమిది గంటలకు)సీ1 వర్సెస్ బీ2- సెయింట్ విన్సెంట్(జూన్ 23 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 23- ఏ2 వర్సెస్ బీ1- బార్బడోస్(రాత్రి ఎనిమిది గంటలకు)సీ2 వర్సెస్ డీ1- అంటిగ్వా(జూన్ 24 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 24- బీ2 వర్సెస్ ఏ1- సెయింట్ లూయీస్(రాత్రి ఎనిమిది గంటలకు)సీ1 వర్సెస్ డీ2- సెయింట్ విన్సెంట్(జూన్ 25 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 26- సెమీ ఫైనల్ 1- ట్రినిడాడ్(జూన్ 27 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 27- సెమీ ఫైనల్ 2- గయానా(రాత్రి ఎనిమిది గంటలకు)👉జూన్ 29- ఫైనల్- బార్బడోస్(రాత్రి ఏడున్నర గంటలకు).లైవ్ స్ట్రీమింగ్(ఇండియాలో)👉స్టార్ స్పోర్ట్స్ షోలో ప్రత్యక్ష ప్రసారం(టీవీ)👉డిస్నీ+హాట్‌స్టార్(డిజిటల్)చదవండి: T20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. పూర్తి వివరాలు -
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శుక్రవారం) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచార సభల మే 10వ తేదీ షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ గురువారం విడుదల చేశారు.శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి నియోజకవర్గంలో పుత్తూరులో కార్వేటి నగరం రోడ్ కాపు వీధి సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కడప పార్లమెంట్ పరిధిలో కడప నగరంలోని మద్రాస్ రోడ్ శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.