
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెలాఖరులో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, అలాగే ఉత్తరాంధ్ర టీచర్స్ MLC పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఈసీ షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 27వ తేదీన పోలింగ్, మార్చి 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

Comments
Please login to add a commentAdd a comment