Teacher MLC election
-
‘మాకు అన్ని వర్గాల మద్దతు ఉంది’
భువనగిరి: రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఉపాధ్యాయులు అండగా ఉన్నారన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిందని, అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేసిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్బీఆర్ఎస్ లు నాటకాలు ఆడుతున్నాయన్న కిషన్ రెడ్డి.. ఆ రెండు పార్టీలకు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం లేదన్నారు. బీజేపీకి అన్ని వర్గాల మద్దతు ఉందని భువనగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.కాగా, వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా19 మంది చివరకు బరిలో ఉన్నారు. ఈ నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా 10వ తేదీ వరకూ ానామినేషన్ల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 27న పోలింగ్ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం ఓటింగ్ ముగిసే సమయంలో క్యూ లైన్లో ఉన్న వారికి టోకెన్ నంబర్లను ఇచ్చి, ఓటింగ్ వేసే ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ రిలీజ్
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెలాఖరులో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, అలాగే ఉత్తరాంధ్ర టీచర్స్ MLC పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఈసీ షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 27వ తేదీన పోలింగ్, మార్చి 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. -
AP: టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం
Teachers MLC Election Updates..పోలింగ్ ప్రారంభం.. ప్రారంభమైన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 2667..మొత్తం పోలింగ్ కేంద్రాలు 20..పశ్చిమ గోదావరి జిల్లాలోని 20 మండలాల్లో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుజిల్లాలో మొత్తం ఓటర్లు..3,729పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.బ్యాలెట్ పద్ధతి ద్వారా జరుగుతున్న పోలింగ్👉గోదావరి జిల్లాల్లో రసవత్తర పోరుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. శాసనమండలిలో ఖాళీ అవుతోన్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.👉ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల్లో 16,737 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 116 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. 👉ఇక, సిట్టింగ్ ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. మిగిలి ఉన్న రెండేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గంధం నారాయణరావు, పులుగు దీపిక, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి(విల్ల లక్ష్మి), బొర్రా గోపి మూర్తి బరిలో నిలిచారు. వీరంతా స్వతంత్రంగానే పోటీలో నిలిచారు. వీరిలో ప్రధాన పోటీ గంధం నారాయణరావు, బొర్రా గోపి మూర్తి మధ్యనే ఉండేలా కనిపిస్తోంది. గంధం నారాయణరావు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఒక పర్యాయం పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి పోటీ పడుతున్నారు.👉ఈ శాసనమండలి ఎన్నికలకు నవంబర్ 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. గురువారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు కసరత్తు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు నోటిఫికేషన్ జారీకానున్న నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు, పార్టీలు అప్పుడే మద్దతు కూడగట్టే పనిలో పడ్డాయి. 2025 మార్చి 29తో వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పదవీకాలం ముగియనుంది. దీంతో ఆలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 30న ఓటరు నమోదుకు నోటిఫికేషన్ జారీచేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బలం పెంచుకునేందుకు.... రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఈసారి తమ సంఘం నుంచి అభ్యర్థులను గెలిపించుకునేందుకు పీఆర్టీయూ అప్పుడే కసరత్తు ప్రారంభించింది. పెద్దఎత్తున ఓటర్లను నమోదు చేయించేందుకు చర్యలు చేపట్టింది. యూటీఎఫ్ కూడా అదే పనిపై దృష్టి సారించింది. నెల రోజుల నుంచి సంఘ సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేస్తోంది. గతంలో పోగొట్టుకున్న స్థానాన్ని ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో పీఆర్టీయూ ఉంది. సంఘంలోని నాయకుల్లో ఉన్న అభిప్రాయభేదాలను పక్కన పెట్టి అంతా కలిసి పనిచేసేలా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో సంఘాన్ని వీడిన, సంఘం నుంచి సస్పెండ్ చేసిన నేతలను కూడా మళ్లీ చేర్చుకుంటోంది. ఇందులో భాగంగా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండలో పీఆర్టీయూ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని సస్పెండ్ చేసిన సుంకరి బిక్షంగౌడ్‌తోపాటు మరికొంతమంది నాయకులను ఇటీవల మళ్లీ సంఘంలోకి చేర్చుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే వారిని తిరిగి చేర్చుకున్నారన్న చర్చ సాగుతోంది. ఇక యూటీఎఫ్, ఎస్టీయూ, టీపీటీఎఫ్ కూడా ఈనెలాఖరు వరకు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. త్వరలోనే పీఆర్టీయూ అభ్యర్థుల ఖరారు పీఆర్టీయూ ప్రస్తుతం జిల్లా కార్యవర్గాల సమావేశాలు నిర్వహిస్తోంది. వాటిని ఈనెలాఖరులోగా పూర్తి చేసి, రాష్ట్ర కార్యవర్గ సమావేశం వచ్చే నెల 7న నిర్వహించాలని నిర్ణయించింది. అందులో కొత్తగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకోనుంది. ఆ సమావేశంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ తరఫున పోటీలో ఉండే వారి పేర్లను ఖరారు చేసే అవకాశముంది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానం నుంచి గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పోటీచేయగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన పులి సరోత్తంరెడ్డి రెబెల్‌గా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం పీఆర్టీయూ నుంచి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఎమ్మెల్సీగా పోటీచేయాలని భావిస్తున్నట్టుగా సంఘంలో చర్చ సాగుతోంది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్టీయూ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెళ్లి కమలాకర్‌రావు పోటీ చేయాలని భావిస్తున్నారు. వారిలో ఎవరిని ఖరారు చేస్తారన్నది మొదటి వారంలోనే తేలనుంది. మరోవైపు టీపీటీఎఫ్, యూటీఎఫ్ కూడా అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉంది. ఈసారి పార్టీల నుంచి పోటీ.. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఈసారి కాంగ్రెస్, బీజేపీ తరఫున కూడా అభ్యర్థులను పోటీలో నిలుపుతారన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే బీజేపీ తరపున ఈసారి వరంగల్–ఖమ్మం– నల్లగొండ స్థానంలో పోటీచేయాలని పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి భావిస్తున్నారు. ఆయనతోపాటు టీపీయూఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సాయిరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలిసింది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ –కరీంనగర్ స్థానంలో బీజేపీ నుంచి నరహరి లక్ష్మారెడ్డి, సుధాకర్‌రెడ్డి పోటీచేయాలని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ రెండు స్థానాల్లో ఎక్కడి నుంచి పార్టీ పోటీ చేయమని చెబితే అక్కడి నుంచి పోటీచేసేందుకు సిద్ధమని పేర్కొంటున్నారు. -
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోలింగ్ 90%
సాక్షి, హైదరాబాద్/నాగర్‌కర్నూల్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం జరిగిన ఎన్నికలో 90.40 శాతం పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు నెమ్మదిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత ఊపందుకుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి 9 జిల్లాల పరిధిలో సగటున 90.40 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా గద్వాల జిల్లాలో 97.15 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 82.25 శాతం పోలింగ్ నమోదైంది. -
నేడు ‘మండలి’ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికల్లో పోలైన ఓట్లను మంగళవారం లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రులు/ ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపా ధ్యాయ నియోజకవర్గానికి శుక్రవారం పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 17 మంది, మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఏడుగురు, వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యా య నియోజకవర్గాల ఓట్లను కరీంనగర్ పట్టణం లోని ఇండోర్ స్టేడియంలో లెక్కించనున్నారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్లను నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని టీఎస్‌డబ్ల్యూసీ గోదాములో లెక్కించనున్నారు. పోలింగ్‌ను బ్యాలెట్ పేపర్లతో నిర్వహించడంతో ఫలితాల వెల్లడికి ఆలస్యం కానుంది. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని సీఈఓ రజత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల కోసం క్లిక్చేయండి - ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాక్ -
కాటేపల్లి జనార్ధన్ రెడ్డి జయకేతనం
-
ఎవరికీ దక్కని మెజారిటీ
తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ కావల్సిన ఓట్లు రాకపోవడంతో.. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో కాటేపల్లికి 7636, మాణిక్ రెడ్డికి 3091, ఏవీఎన్ రెడ్డికి 2966, హర్షవర్దన్ రెడ్డికి 2486 ఓట్లు వచ్చాయి. అయితే.. మొత్తం ఓట్లలో 50 శాతం ఓట్లు ఏ అభ్యర్థికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. -
కొత్త ఓటు.. తీర్పు ఎటు?
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కొత్తగా 6 వేలకుపైగా ఓట్లు మద్దతు కోసం టీచర్ల సంఘాలతో ఆశావహుల సంప్రదింపులు సిట్టింగ్ ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ యత్నాలు ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో హరీశ్ భేటీ సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాలు బిజీ అయ్యాయి. ఇప్పటికే మద్దతు ప్రకటించిన తమ అభ్యర్థులతో సభలు, సమా వేశాల నిర్వహణలో పడ్డాయి. టీఆర్ఎస్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు దృష్టి సారించింది. గతంలో కంటే ఈసారి ఓట్ల సంఖ్య 6 వేలకు పైగా పెరగడంతో ఆశావహులు తమ ప్రయత్నాల్లో ముని గారు. ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రభుత్వ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చ రర్ల ఓట్లు ఈసారి కీలకం కానున్నాయి. దీంతో నోటి ఫికేషన్ జారీ కాకముందు నుంచే ఆయా సంఘాల సమావేశాల నిర్వహణలో ఆశావహులు తల మునకల య్యారు. ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. తమ అభ్యర్థులను పోటీలో నిలుపుతామని 5 సంఘాలు ప్రకటించాయి. అభ్యర్థులు ఎందరో...? ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారికంగా 8 మంది అభ్యర్థులను పోటీలో నిలుపుతామని వివిధ ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. అందులో కొందరు నామినేషన్లు వేసినా చివరిలో ఉపసంహ రించుకునే అవకాశం ఉంది. ప్రధానంగా పోటీలో ఉండే అభ్యర్థులు సంఘాల మద్దతు కూడగట్టడంతో పాటు ఈ అంశంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తానికి ప్రధాన పోటీ ఇద్దరి మ«ధ్యే ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం కూడా ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఆయన ఇదివరకే టీఆర్ఎస్లో చేరారు. అయితే పార్టీ అధికారికంగా తమ అభ్యర్థి అని ప్రకటించకపోయినా ఆయన్ను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గంలోని మూడు జిల్లాలకు చెందిన మంత్రులను అప్రమత్తం చేసింది. ఇటీవలే మంత్రి హరీశ్‌రావు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు. శనివారం ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించారు. గతంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ ఓటమికి ప్రధాన కారణం ఉపాధ్యాయులేనన్న భావన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో గత పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెరిగిన ఓటర్లు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2011లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో 15,053 ఓట్లు ఉండగా అందులో 11,883 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈ నెల 13 వరకు కూడా ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల నుంచి అధిక సంఖ్యలో ఓటర్లు నమోదయ్యారు. ఓటర్ల సంఖ్య 21,520కి చేరింది. ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచుకునేందుకు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సభలు, సమావే శాలు నిర్వహిస్తూ తమకు పడే ఓట్లపై బేరీజు వేసుకుంటున్నారు. పాత జిల్లాల ప్రకారం మహ బూబ్‌నగర్‌లో 6,510 మంది, రంగారెడ్డి జిల్లాలో 12 వేల మంది, హైదరా బాద్ జిల్లాలో 3,010 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సంఘాల నుంచి ఎవరెవరు? 15 ఏళ్లు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్‌గా పని చేసిన ఏవీఎన్ రెడ్డిని గెలిపించుకు నేందుకు ఎస్టీయూ, టీఎస్టీయూ, మరికొన్ని ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు తీవ్రంగా ప్రయత్నిస్తు న్నాయి. వివిధ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతు కూడగట్టుకోవడంతోపాటు ప్రైవేటు స్కూళ్లు కాలేజీల నుంచి భారీ మొత్తంలో ఓటర్ల నమోదుకు చర్యలు చేపట్టారు. ఇక పీఆర్టీయూ– తెలంగాణ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు హర్షవర్ధన్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీచర్ పోస్టుకు రాజీనామా చేసి ఆయన పోటీకి సిద్ధమయ్యారు. పీఆర్టీయూ– టీఎస్పై వ్యతిరేకతే ప్రధాన అంశంగా ప్రచారం చేస్తున్నారు. టీఎస్–యూటీఎఫ్ అభ్యర్థిగా మాణిక్‌రెడ్డి, టీపీయూఎస్ అభ్యర్థి భూపతిరెడ్డి తమ ప్రచారాన్ని కొనసాగి స్తున్నారు. మరికొన్ని ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.