టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో పోలింగ్‌ 90% | Ninty Percent polling in teachers MLC election | Sakshi
Sakshi News home page

టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో పోలింగ్‌ 90%

Published Tue, Mar 14 2023 1:50 AM | Last Updated on Tue, Mar 14 2023 10:38 AM

Ninty Percent polling in teachers MLC election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/నాగర్‌కర్నూల్‌:  మహ­బూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం జరిగిన ఎన్నికలో 90.40 శాతం పోలింగ్‌ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు నెమ్మదిగా సాగిన పోలింగ్‌ ఆ తర్వాత ఊపందుకుంది.

సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ముగిసే సమయానికి 9 జిల్లాల పరిధిలో సగటున 90.40 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా గద్వాల జిల్లాలో 97.15 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాలో 82.25 శాతం పోలింగ్‌ నమోదైంది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement