Gadwala
-
రాజసం... గద్వాల సంస్థానం
గద్వాల: కవులు.. కట్టడాలకు పేరుగాంచిన గద్వాల సంస్థానం వైభవం నేటికీ చెక్కుచెదరలేదు. రాజసానికి నిలువెత్తు నిదర్శనమైన గద్వాల సంస్థానం ఏర్పాటు ఆద్యంతం అత్యంత ఆసక్తికరం. నిజాం సంస్థానంతోపాటు 1948లో భారత యూనియన్‌లో విలీనమైన గద్వాల సంస్థానంపై సవివర కథనమిది. నల సోమనాద్రి ఆధ్వర్యంలో ఆవిర్భావం నల సోమనాద్రి (పెద సోమభూపాలుడు) క్రీస్తుశకం 1663లో గద్వాల మండలం పూడూరు కేంద్రంగా గద్వాల సంస్థానాన్ని ఏర్పాటు చేశారు. నాటినుంచి 1948 వరకు ఆయన వారసులు పాలన కొనసాగించారు. నలసోమనాద్రి 1663–1712 వరకు, తర్వాత కల్లా వెంకటన్న క్రీ.శ. 1712– 1716 వరకు, రమణయ్య క్రీ.శ. 1716– 1723 వరకు, తిమ్మక్క క్రీ.శ. 1723– 1725 వరకు, లింగమ్మ క్రీ.శ. 1725– 1740 వరకు, తిరుమలరావు క్రీ.శ. 1740– 1742 వరకు, మంగమ్మ క్రీ.శ. 1742– 1745 వరకు, చొక్కమ్మ క్రీ.శ. 1745– 1747 వరకు, రామరాయలు క్రీ.శ. 1747– 1761 వరకు, చినసోమభూపాలుడు– 2 క్రీ.శ. 1761– 1794 వరకు, రామభూపాలుడు–1 క్రీ.శ. 1794– 1807 వరకు, సీతారామభూపాలుడు–1 క్రీ.శ. 1807– 1810 వరకు, వెంకటలక్ష్మమ్మ క్రీ.శ. 1840– 1840 (4 నెలలు), సోమభూపాలుడు– 3 క్రీ.శ. 1840– 1844, వెంకటలక్ష్మమ్మ (మరల) క్రీ.శ. 1844–1845, రామభూపాలుడు–2 క్రీ.శ. 1845– 1901 వరకు, సీతారామభూపాలుడు– 2 క్రీ.శ. 1901–1924 వరకు, ఆ తర్వాత చివరి తరం మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ క్రీ.శ. 1924–1948 వరకు పాలన కొనసాగించారు. విద్వత్కవులకు పేరు.. గద్వాల సంస్థానం కవులకు పేరుగాంచింది. నలసోమనాద్రి, చినసోమభూపాలుడు, రామభూపాలుడు–2, సీతారామభూపాలుడు–2, మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ తదితరులు కవులకు పెద్దపీట వేసినట్లు చరిత్రకారులు చెబుతారు. వీరి పాలనలోనే గద్వాల సంస్థానం విద్వత్కవుల ప్రాంతంగా వరి్ధల్లింది. వీరి పాలనలో సంస్థాన కవులు, సంస్థాన ప్రాంత నివాస కవులు, సంస్థానేతర ఆశ్రిత కవులకు ఆశ్రయమిచ్చి గద్వాల సంస్థాన ప్రాశస్త్యాన్ని నలుమూలలా చాటినట్లు చెబుతారు. ఈ కవులు రచించిన పద్యాలలో చాటు పద్యాలు ప్రత్యేకంగా గుర్తింపు సాధించాయి.చెక్కుచెదరని నాటి కట్టడాలు నలసోమనాద్రి కాలం పాలన మొదలుకొని చివరితరం మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ కాలం వరకు నిర్మించిన వివిధ కట్టడాలు, భవనాలు, బావులు నేటికీ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. నాటి భవనాలు రాజుల అభిరుచికి, నాటి వైభవాన్ని గుర్తు చేస్తూ.. చెక్కు చెదరకపోవడం విశేషం.గద్వాల కోటలో డిగ్రీ కళాశాల, ఆలయం.. రాజులు పాలన సాగించిన ప్రధాన గద్వాల కోటలో ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చెన్నకేశవస్వామి ఆలయాలున్నాయి. కోట లోపలి భాగం చాలా వరకు శిథిలావస్థకు చేరి కూలిపోగా.. ముఖద్వారం, కోట చుట్టూ భాగాలు నేటికీ పర్యాటకులకు కనువిందు చేస్తాయి.చెక్కుచెదరని ఫిరంగిరాజులు యుద్ధ సమయంలో వినియోగించే ఫిరంగి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. దీనిని ప్రస్తుతం గద్వాల మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో లింగమ్మ (1725– 1740), (1745– 1747) బావులు గత పాలన చిహ్నాలుగా ప్రతిబింబిస్తాయి. వీటిని ప్రస్తుత పాలకులు ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. ఏటా జరిగే గద్వాల జాతర సందర్భంగా తెప్పోత్సవాలు ఈ బావుల్లోనే నిర్వహిస్తారు.మహారాజా మార్కెట్.. సంస్థానంలోని ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు మొదలుకొని.. మిగతా అన్ని రకాల వస్తువులు మహారాజా మార్కెట్లోనే లభించేవి. రైతులు పండించే పంట ఉత్పత్తులు కూడా ఇక్కడ విక్రయించేవారని చరిత్రకారులు చెబుతారు. మహారాజా మార్కెట్ చిహ్నం చాలా భాగం ధ్వంసమైనప్పటికీ.. దాని ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి.కృష్ణారెడ్డి బంగ్లా ప్రత్యేకం నలసోమనాద్రి నిర్మించిన (ప్రస్తుత ప్రభుత్వ డిగ్రీ కాలేజీ) కోటలోనే రాజవంశీయులు కలిసి జీవించేవారు. అయితే 1924లో సీతారామభూపాలుడు–2 మృతి చెందడంతో.. ఆయన భార్య మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ పాలన పగ్గాలు చేపట్టారు. సీతారామభూపాలుని సోదరుడు వెంకటకృష్ణారెడ్డికి అప్పటి పాలకులతో మనస్పర్థలు ఏర్పడి.. మాట పట్టింపుతో గద్వాల కోటను దాటి కృష్ణారెడ్డి బంగ్లాను నిర్మించుకున్నారు. ఈయన రాజవంశీయుల చివరితరం పాలనలో రెవెన్యూ, భూ పరిపాలన బాధ్యతలు నిర్వర్తించారు. ఈ భవనంలోనే చిరంజీవి హీరోగా నటించిన ‘కొండవీటిరాజా’ సినిమా షూటింగ్ చేశారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎస్ఈ కార్యాలయం, భూసేకరణ కార్యాలయం ఇక్కడే కొనసాగాయి. గద్వాల బ్లాక్ సమితి కార్యాలయం, అనంతరం ఏర్పడిన మండల రెవెన్యూ కార్యాలయం కూడా చాలాకాలం పాటు ఇక్కడే కొనసాగింది. రాజావారి బంధువులు నేటికీ ఈ భవనంలోనే జీవనం కొనసాగిస్తుండగా.. మరికొంత భాగంలో ఎంబీ హైసూ్కల్, ప్రైవేట్ ఐటీఐ కళాశాలలున్నాయి. ఎండాకాలం, చలికాలం, వానాకాలంలో కూడా ఒకేరకమైన వాతావరణం ఉండేలా ఈ భవనాన్ని నిర్మించడం విశేషం. -
మళ్లీ బీఆర్ఎస్ గూటికి..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో చేరి కనీసం నెల రోజులు తిరగకమునుపే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తిరిగి సొంత పార్టీ బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంగళవారం కృష్ణమోహన్‌రెడ్డి లాబీలోని బీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయానికి వచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయిన కృష్ణమోహన్‌రెడ్డి తాను పారీ్టలో కొనసాగాలనుకుంటున్న విషయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్యేలు పద్మారావుగౌడ్, శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి తదితరులు కృష్ణమోహన్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించారు.తాను త్వరలో పార్టీ అధినేత కేసీఆర్‌ను కలుస్తానని ఆయన వెల్లడించారు. జూలై 6న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా మంగళవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డితో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. అయితే బీఆర్ఎస్లో తిరిగి చేరే అంశంపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.‘బీఆర్ఎస్లో కొందరు అల్ప సంతోషులు ఉన్నారు. నా ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టి పార్టీ మారతారని ప్రచారం చేస్తున్నారు. అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రుల చాంబర్లలోకి వెళ్లి కలుస్తున్నారు. వారంతా పార్టీ మారేవారేనా?’ అని వెంకటరావు మీడియాతో అన్నారు. తాను టీ తాగేందుకు బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వచి్చనట్లు స్పష్టం చేశారు. అయితే, బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకే రోజు పార్టీ శాసనసభాపక్షం కార్యాలయానికి రావడంతో ఒక్కసారి గా రాజకీయ ఊహాగానాలు జోరందుకున్నాయి.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కృష్ణమోహన్‌రెడ్డి బాటలో తిరిగి సొంత గూటికి చేరుకుంటారని సమాచారం. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ను వీడిన ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్ (జగిత్యాల), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు), కాలే యాదయ్య (చేవెళ్ల) తిరిగి అదే పార్టీలో చేరతారని సమాచారం. అయితే తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని కాలే యాదయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక్కొక్కరిదీ ఒక్కో పరిస్థితి పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఓ వైపు బీఆర్ఎస్ హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అనర్హత వేటు కోసం దాఖలైన కేసులో మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా పడగా, సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పు మేరకు తమపై అనర్హత వేటు పడుతుందనే ఆందోళనలో బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన పలువురు ఎమ్మెల్యేలున్నారు.మొత్తం 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాను కనీసం 26 మంది కాంగ్రెస్‌లో చేరితేనే ఆ పార్టీ శాసనసభాపక్షం అధికార పక్షంలో విలీనమవుతుంది. అయితే ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్ శాసనసభా పక్షం విలీనానికి అవసరమైన మేజిక్ ఫిగర్ ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించకపోవడం ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కలవరం రేపుతోంది. తమపై అనర్హత వేటు పడితే జరిగే ఉప ఎన్నికలో తమ పరిస్థితి ఏంటనే ఆందోళనలో వారున్నారు.ఇదిలాఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ స్థానిక శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పారీ్టలో చేరిక సందర్భంగా ఇచి్చన హామీలు అమలు కావడం లేదని, పారీ్టలో ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరికొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డి జిల్లా/సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చే రారు. శనివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని క్యాం పు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెంది న మంత్రి జూపల్లి కృష్ణారావు, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఇలావుండగా సీఎం రేవంత్ త్వరలోనే గద్వాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభించనున్నారు. ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా అదే రోజు కృష్ణమోహన్‌రెడ్డి అనుచరులు, ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలిసింది. జెడ్పీ చైర్మన్‌కు సీఎం సముదాయింపు మరోవైపు బండ్ల చేరికను వ్యతిరేకిస్తూ జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గీయులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఆమె సీఎం రేవంత్‌తో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ఆమెను ముఖ్యమంత్రి సముదాయించినట్లు తెలిసింది. ఆ తర్వాతే బండ్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. గద్వాల, ఆలంపూర్ మినహా మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే హస్తం గూటికి చేరడంతో జిల్లాలో కాంగ్రెస్ బలం 13కు పెరిగింది.నిధులు కేటాయించండిశ్రీధర్బాబుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతిఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శనివారం జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిలు సచివాలయంలో మంత్రిని కలిశారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వారు మంత్రిని కోరారు. అయితే ఆరుగురు ఎమ్మెల్యేలు జిల్లా ఇన్చార్జి మంత్రిని కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. -
5 జిల్లాల్లో 43 డిగ్రీల పైనే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, జోగుళాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 43.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డిలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలోని 18 మండలాలకు చెందిన 20 గ్రామాల్లో 43 డిగ్రీలు దాటిపోయింది. ఈ జిల్లాలోని మాడుగులపల్లి మండల కేంద్రంతోపాటు మునుగోడు మండలం గూడాపూర్‌లో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దామరచర్ల మండల కేంద్రం, అనుముల మండలం ఇబ్రహీంపేట, కనగల్ మండల కేంద్రం, మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామాల్లో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఎండలు తీవ్రం కావడంతో వడదెబ్బ కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన గాదె జయపాల్‌రెడ్డి (55) గురువారం వడదెబ్బకు గురికాగా హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లాలో సికింద్రాబాద్ తండా గ్రామానికి చెందిన ధరావత్ మంచ్యా (55) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీకి చెందిన స్వర్ణలత (45) రెండ్రోజుల క్రితం నిజామాబాద్‌లో పెళ్లికి హాజరైంది. ఎండల తీవ్రతతో అస్వస్థతకు గురైంది. నిర్మల్‌కు వచి్చన తర్వాత గురువారం రాత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన రైతు మర్రిపల్లి ఈరయ్య (70) పొలం పనులకు వెళ్లి ఎండ దెబ్బతగలడంతో గురువారం మృతి చెందాడు. -
డోర్నకల్–గద్వాల మధ్య కొత్త రైల్వేలైన్!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు రైల్వేలైన్‌తో అను సంధానంలో లేని కీలక ప్రాంతాలను జత చేస్తూ కొత్త రైల్వే లైన్ ఖరారుకు అడుగులు పడుతున్నా యి. హైదరాబాద్–విజయవాడ, హైదరాబాద్– బెంగుళూరు రైల్వే మార్గాలను కలుపుతూ కొత్త లైన్ నిర్మించేందుకు ఫైనల్ లొకేషన్ సర్వే నిర్వహిస్తు న్నారు. హైదరాబాద్–విజయవాడ లైన్లో ఉన్న డోర్నకల్ నుంచి హైదారబాద్–బెంగుళూరు మార్గంలోని గద్వాల వరకు ఈ కొత్త లైన్ కొనసాగనుంది. దీనికి సంబంధించి గతేడాది ఫైనల్ లొకేషన్ సర్వేకు రైల్వే బోర్డు అమోదముద్ర వేసింది. దీనికి దాదాపు రూ.ఏడున్నర కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో 2647 కి.మీ. మేర సాగే కొత్త లైన్లకు సంబంధించి మంజూరు చేసిన 15 ఫైనల్ లొకేషన్ సర్వేల్లో ఇది ఒకటి. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రూ. 50848 కోట్ల వరకు ఖర్చవుతుందని రైల్వేశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వీటిల్లో డోర్నకల్– గద్వాల లైన్ చాలా కీలకమైంది. ఈలైన్ నిడివి 296 కిలోమీటర్లు కాగా, ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.5330 కోట్లుగా అంచనా. ప్రాధాన్యతా క్రమంలో దీన్నే ముందుగా చేపట్టే అవకాశం ఉంది. ఈ లైన్‌కు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే చేప ట్టడం ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సంబంధిత సర్వే సంస్థ వేగంగా సర్వే నిర్వహిస్తూ ప్రతిపాదిత మార్గంలో మార్కింగ్ చేస్తోంది. అనుసంధానం ఎలా.. వరంగల్ మీదుగా సాగే హైదరాబాద్–విజయవాడ లైన్ రైల్వేలో కీలక మార్గం. అలాగే.. మహబూబ్ నగర్ మీదుగా సాగే హైదరాబాద్–బెంగుళూరు మార్గం కూడా అలాంటిదే. కానీ ఈ రెండింటిని అనుసంధానించే మరో కీలక మార్గం అవసరమని రైల్వే భావిస్తోంది. ఇందుకోసం డోర్నకల్ నుంచి గద్వాల వరకు లైన్ నిర్మించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇది కేవలం ఆ రెండు కీలక మార్గాలను అనుసంధానించేది కావటమే కాకుండా, ఇప్పటి వరకు రైల్వే వసతి లేని కీలక పట్టణాలకు ఆ అవ కాశాన్ని కల్పించినట్టవుతుంది. డోర్నకల్‌లో మొద లయ్యే ఆ లైను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కూసు మంచి, పాలేరు, మోతె, ఉమ్మడి నల్గొండ జిల్లా లోని సూర్యాపేట, భీమారం, నాంపల్లి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, వనపర్తి,భూత్పూర్ మీదుగా గద్వాల వద్ద ముగు స్తుంది. దీంతో ఈ లైను ఇటు వరంగల్ మీదుగా సాగే హైదరాబాద్–విజయవాడ లైన్ డోర్నకల్ వద్ద, అటు హైదరాబాద్–బెంగుళూరు లైన్‌ను గద్వాల వద్ద, నడికుడి మీదుగా సాగే హైదరాబాద్–గుంటూరు లైన్‌ను నల్గొండ వద్ద అనుసంధానిస్తుంది. దీంతో ఆయా మార్గాల్లో నడిచేరైళ్లను అవసరానికి తగ్గట్టు దారి మళ్లించే విషయంలో, కొత్త రైళ్లను నడి పే విషయంలో, దక్షిణ–ఉత్తరభారత్లను వేరువేరు మార్గాల్లో జోడించే విషయంలో మరింత వెసులు బాటు కలిగినట్టవుతుంది. ఇప్పటి వరకు రైల్వే లైన్లేని ప్రాంతాలను అనుసంధానించటం వల్ల ఆయా ప్రాంతాల ఆర్థిక ముఖ చిత్రం వేగంగా మా రేందుకు వీలు కల్పిస్తుంది. పర్యాటకంగా, పారి శ్రామికంగా ఎదిగేందుకు అవకాశాలు కలుగు తాయి. ఈ ప్రాంతాల్లో బొగ్గు గనులతోపాటు సిమెంటు, విద్యుదుత్పత్తి కేంద్రాలున్నందున బొగ్గు, సిమెంటు తరలింపు తేలికవుతుంది. వ్యవ సాయ ఉత్పత్తుల తరలింపు కూడా పెరుగుతుంది. ఈ ప్రాజెక్టుపై రైల్వే ఆసక్తి! సాధారణంగా ప్రతి రైల్వే ప్రాజెక్టులో ఫైనల్ లొకేషన్ సర్వే కీలకంగా ఉంటుంది. అలాగని సర్వే జరిగిన అన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కాలని కూడా లే దు. సర్వే తర్వాత దాని సాధ్యాసాధ్యాలపై స్పష్టత వస్తుంది. ఇప్పుడు డోర్నకల్–గద్వాల లైను విష యంలో మాత్రం స్వయంగా రైల్వే శాఖనే ఆసక్తిగా ఉండటం విశేషం. ఆయా ప్రాంతాలను రైల్వేతో జోడించాలని చాలా కాలంగా ప్రజల ఆకాంక్షను రాజకీయ నేతలు రైల్వే దృష్టికి తెస్తున్నారు. ఇటు ప్రజల అవసరాలు, అటు రైల్వే శాఖకు ఉన్న ఉపయోగాల రీత్యా దీనికి ప్రాధాన్యం పెరిగింది. వెరసి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో సహా అన్ని పార్టీలు, రాజకీయాలకతీ తంగా ప్రజాప్రతినిధులు, నాయకులు రైల్వే బోర్డుపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది.ప్రాజెక్టు: డోర్నకల్–గద్వాల కొత్త రైల్వే లైన్ నిడివి: 296 కిలోమీటర్లు ప్రాథమిక అంచనా వ్యయం: రూ.5330 కోట్లు -
గుడ్‌న్యూస్! గద్వాల మీదుగా జైపూర్‌కు మరో రైలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: త్వరలోనే కర్నూలు నుంచి గద్వాల మీదుగా జైపూర్ వరకు మరో రైలు పరుగులు పెట్టనుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన మహబూబ్‌నగర్– విశాఖ రైలును కిషన్‌రెడ్డి.. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో జిల్లాకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించేలా, నిధులు వచ్చేలా కృషి చేయాలని కోరారు. రైలు ప్రారంబోత్సవం సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల పోటాపోటీ నినాదాలతో రైల్వేస్టేషన్ ప్రాంగణం, పరిసరాలు మార్మోగాయి. తెలంగాణలో పంటల బీమా పథకం ఎక్కడ?: కిషన్‌రెడ్డి తెలంగాణలో కనీసం పంటల బీమా పథకం అమలు చేయడం లేదని.. ఇక్కడ వర్షాలకు పంటలు నష్టపోతే సాయం చేయకుండా బీఆర్ఎస్ నాయకులు నాందేడ్ వెళ్లి ప్రగల్భాలు పలుకుతున్నారని అని కిషన్‌రెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా శనివారం ఆయన బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పేదోడికి ఇల్లు కట్టే సోయిలేదు గానీ.. ప్రగతి భవన్, సచివాలయాన్ని రికార్డు సమయంలో కడతారని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధుల్లో 42 శాతం వాటా రాష్ట్రాలకు వస్తోందని, రైతులకు పెరిగిన ఎరువుల ధరల భారం పడకుండా రూ.లక్ష కోట్ల సబ్సిడీని ఇస్తోందని ఆయన వివరించారు. ఒక్కో రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.18,254 సబ్సిడీ.. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6 వేల సాయం అందజేస్తోందని వివరించారు. దేశ భవిష్యత్ కోసమే రూ.2వేల నోట్ల ఉపసంహరణ ‘రూ.2 వేల నోట్ల ముద్రణ 2018 మార్చి 31 నుంచే బంద్ అయింది.. ఈ నోటు ఉపసంహరణపై ఎవరూ ఆందోళన చెందొద్దు.. సెపె్టంబర్ 30 వరకు బ్యాంకుల్లో బదలాయింపు చేసుకోవచ్చు.. దేశ భవిష్యత్ కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
జేడీ రహస్య విచారణ?
గద్వాల క్రైం: గద్వాల ఇరిగేషన్‌శాఖ విభాగం–4లో గత ఏప్రిల్ 12న సీపీఎస్ నిధుల కాజేత వ్యవహారంపై పే అండ్ అంకౌట్ అధికారి, సిబ్బంది పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విధితమే. అయితే ఈ కేసు విచారణలో మాత్రం ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర పీఓ (పెన్షన్ కార్యాలయం) జాయింట్ డైరెక్టర్ శైలజారెడ్డి గద్వాల ఇరిగేషన్‌శాఖ విభాగం– 4 కార్యాలయంలో రహస్య విచారణ చేపట్టి సిబ్బందితో మాట్లాడారు. సిబ్బంది వ్యక్తిగత యూసర్ ఐడీ, పాస్వర్డ్లు, హైదరాబాద్ కార్యాలయం యూసర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను టైపిస్టు జహంగీర్ ఎవరి ప్రమేయంతో తెలుసుకున్నాడు? సహకరించిన ఉదోగ్యి ఎవరు? ఈ శాఖలో కొలువు ఎలా వచ్చింది? కారుణ్య నియామకమా.. రాత పరీక్షల ద్వారా ఎంపిక అయ్యాడా? సర్వీసు బుక్ తదితర సమాచారంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సీపీఎస్ నిధులు, ఇతరత్రా ప్రభుత్వ బిల్లులు సైతం కాజేశాడా? పలు విషయాలపై కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రూ.16, 83,130 నిధులు ఎవరి ఖాతాలోకి మళ్లించాడు. ఆ ఖాతాదారులెవరు? కాజేసిన సీపీఎస్ నిధులతో ఏం చేశాడు? కేసు నమోదైనప్పటి నుంచి పోలీసుశాఖ గుర్తించిన విషయాలు తదితర అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. జేడీ వచ్చిన విషయాన్ని ఇక్కడి సిబ్బంది బయటికి పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. ఇదిలా ఉండగా గద్వాల ఇరిగేషన్ శాఖలో నాలుగు విభాగాల్లో సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి సీపీఎస్ నిధుల విషయమై పూర్తి నివేదికను సీఈ రఘునాథ్‌రావును అడిగినట్లు సమాచారం. దళారులతో రాజీ.. 12వ తేదీ ఫిర్యాదు అయినప్పటి నుంచి టైపిస్టు జహంగీర్ పలువురు దళారులతో రాజీకి తీవ్రంగా మంతనాలు చేస్తునట్లు తెలిసింది. ఎలాంటి కేసు లేకుండా చూడాల్సిందిగా వేడుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ మంత్రితో తనను ఈ గండం నుంచి గట్టెక్కించాలని ప్రాధేయపడినట్లు తెలిసింది. తగిన నజరానా సైతం ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడని తెలిసింది. అయితే సదరు మంత్రి సైతం కేసు వ్యవహారంపై స్థానిక ఓ నాయకుడితో మాట్లాడి సమస్యను సద్దుమణిగేలా చూడాల్సిందిగా చెప్పినట్లు తెలిసింది. ఇక కేసు విచారణ సైతం పారదర్శకంగా జరగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సిబ్బంది మాత్రం ఇక్కడి తీరు పై ఆక్రోశంగా ఉన్నారు. ఉదోగ్య సంఘాల నాయకులు స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏమి టని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు కలెక్టర్ సైతం స్పందించకపోవడం, పోలీసులు ఈ వ్యవహారంలో జాప్యం చేయడంపై పెదవి విరుస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ విభాగం–4 అధికారి శ్రీనివాసులును వివరణ కోరగా, జేడీ వచ్చిన మాట వాస్తవామే అన్నారు. పలు విషయాలపై సిబ్బందితో మాట్లాడారని, వ్యవహారం ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉందని తెలిపారు. సిబ్బందికి జరిగిన మోసంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. -
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోలింగ్ 90%
సాక్షి, హైదరాబాద్/నాగర్‌కర్నూల్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం జరిగిన ఎన్నికలో 90.40 శాతం పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు నెమ్మదిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత ఊపందుకుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి 9 జిల్లాల పరిధిలో సగటున 90.40 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా గద్వాల జిల్లాలో 97.15 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 82.25 శాతం పోలింగ్ నమోదైంది. -
గద్వాలలో కేటీఆర్ పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
-
నకిలీ విత్తనం.. మాఫియా పెత్తనం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పత్తివిత్తన మాఫియా నకిలీలలు’అన్నీఇన్నీకావు. అక్రమార్కుల మాయాజాలంలో అ మాయక రైతులు చిక్కుకుంటున్నారు. తాము కొని సాగు చేసినవి నకిలీ విత్తనాలనే విషయం కూడా రైతులకు తెలియకపోవడం గమనార్హం. నకిలీ విత్తనాలను పసిగట్టే పరిస్థితిలేక చాలామంది నష్టపోతున్నారు. ఇదీ నడిగడ్డ కేంద్రంగా వేళ్లూనుకున్న విత్తన మాఫియా మాయాజాలం. అక్రమార్కు ల కనుసన్నల్లోనే రాష్ట్రంలోని పలుచోట్ల గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత బీటీ–3 సాగు కొనసాగుతున్నట్లు తేలింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభంలో పోలీసుల దాడుల్లో వేలాది క్వింటాళ్లలో నకిలీ విత్తనాలు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే.. అంతకు ముందే జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి పలు మండలాలతోపాటు ఇతర జిల్లాల రైతులకు ఇవి చేరాయి. ఇలా బట్టబయలు.. ఈ ఏడాది జూలైలో హైదరాబాద్ నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు డీసీఎంలో నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు టన్నుల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. అవి బీటీ–3 విత్త నాలని తేలింది. ఈ క్రమంలో గద్వాల, మల్దకల్, ధరూరు, అయిజ మండలాల్లో పట్టుబడిన నకిలీ విత్తనాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లో ల్యాబ్‌కు పంపారు. వీటిలో బీటీ–3 విత్తనాలున్నాయని నిర్ధారణ అయింది. రంగంలోకి వ్యవసాయ శాఖ ఇంటెలిజెన్స్.. గద్వాల జిల్లాలో నిషేధిత బీటీ–3 విత్తనాలు వెలుగుచూడటంతో వ్యవసాయశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్రస్థాయి ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగి బీటీ–3 పంట పండిస్తున్న రైతులకు విత్తనాలు ఇచ్చిన సీడ్ ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు ఎవరు.. ఏ కంపెనీ విత్తన ప్యాకెట్లు.. బ్రాండెడ్ కంపెనీలా.. సీడ్ ఆర్గనైజర్ల సొంత బ్రాండెడ్ కంపెనీలా.. ఎప్పటి నుంచి నిషేధిత బీటీ–3 పంట సాగవుతోంది.. జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు.. అనే కోణాల్లో పూర్తిస్థాయిలో కూపీ లాగుతున్నట్లు తెలిసింది. రైతులకు తెలియకుండానే.. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రంలో పలువురు రైతుల నుంచి బీటీ–3 విత్తనాలను తక్కువ ధరకు సీడ్ ఆర్గనైజర్లు సేకరించారు. హైదరాబాద్ కేంద్రంగా గద్వాల, ధరూరు, మల్దకల్ మండలాలకు.. కర్ణాటక కేంద్రంగా అయిజ మండలానికి తరలించి రైతులకు తెలియకుండానే బీటీ–3 విత్తనాలను వారికి కట్టబెట్టినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. సీడ్ ఆర్గనైజర్లు ఏడాది కిత్రం ధరూర్, అయిజ మండలాల్లో పలువురు రైతులకు బీటీ–3 ఫౌండేషన్ సీడ్ ఇచ్చి సాగు చేయించారని.. మళ్లీ వాటిని సేకరించి ప్రధాన కంపెనీల తరహాలో ముద్రించిన సొంత బ్రాండ్ ప్యాకెట్లలో వేసి పలుచోట్ల రైతులకు విక్రయించారని విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సీడ్ ఆర్గనైజర్లతో పాటు కంపెనీల భాగస్వామ్యం ఉందా అనే కోణంలో సైతం అధికారులు విచారణ చేస్తున్నారు. అందుకే పెట్టుబడి ఇవ్వడం లేదా? రాష్ట్రస్థాయిలో ఇంటెలిజెన్స్ వర్గాలు విచారణ చేపట్టినట్లు గ్రహించిన సీడ్ ఆర్గనైజర్లు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీడ్ పత్తి మొక్కలు ఏపుగా పెరగగా.. క్రాసింగ్ దశలో కూలీలు, ఇతరత్రా ఖర్చు అధికం. దీంతో రైతులు పెట్టుబడి కోసం సీడ్ ఆర్గనైజర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే బీటీ–3 వ్యవహారం మెడకు చుట్టుకుంటుందనే భయంతో సీడ్‌ఆర్గనైజర్లు రైతులకు అప్పు ఇవ్వకుండా దాటవేస్తున్నారు. ఇప్పటికైనా సాగు నిలిపివేసి.. పంట తొలగించాలని పరోక్షంగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆర్గనైజర్లు పెట్టుబడికి డబ్బులు ఇవ్వకపోవడంతో మల్దకల్, అయిజ మండలాల్లో పలువురు రైతులు పంటలు తొలగించారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఆర్గనైజర్లు మాత్రం ‘కంపెనీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.. మేం చేతి నుంచి ఇవ్వలేని స్థితిలో ఉన్నాం.. సొంతంగా పెట్టుబడి పెడితేనే సీడ్ పత్తి సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నాం’అని చెబుతున్నారు. కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటాం జిల్లాలో ఈ ఏడాది టాస్క్‌ఫోర్స్ బృందాలు నిర్వహించిన దాడుల్లో మొత్తం 162 క్వింటాళ్ల ఫెయిలైన విత్తనాలు పట్టుబడ్డాయి. అనుమానంతో జిల్లా నుంచి మొత్తం ఆరు శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాం. అవి నిషేధిత బీటీ–3 విత్తనాలుగా నిర్ధారణ అయ్యాయి. నిందితులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటాం. పట్టుబడిన విత్తనాలతోపాటు ల్యాబ్ రిపోర్ట్‌ను త్వరలో కోర్టుకు సమర్పిస్తాం. – గోవింద్ నాయక్, జిల్లా వ్యవసాయాధికారి, జోగుళాంబ గద్వాల -
‘ర్యాలంపాడు’కి బీటలు
గద్వాల రూరల్: ‘ర్యాలంపాడు జలాశయం ప్రమాదపుటంచుల్లోకి వెళ్లింది. కట్ట తెగితే ఏకంగా 20గ్రామాలు పూర్తిగా ఊడ్చుపెట్టుకుని పోవడం ఖాయం.’ ఇదేదో స్థానికులు చెబుతున్న మాట కాదు.. సాగు నీటిపారుదల శాఖ అధికారులే ప్రభుత్వానికి పంపిన హెచ్చరికలు. ఈ క్రమంలో ఇద్దరు సీఈలతో కూడిన ఇంజనీర్ల బృందం శనివారం ర్యాలంపాడు జలాశయాన్ని సందర్శించింది. ఎక్కడ్కెడ లీకేజీలున్నాయో తెలుసుకునేందుకు డ్యాం చుట్టూ ఇంజనీర్లు కలియదిరిగారు. త్వరలో పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. ►జోగుళాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ధరూరు మండలం ర్యాలంపాడు వద్ద రూ.192 కోట్ల వ్యయంతో జలాశయాన్ని నిర్మించారు. 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం నుంచి 1.36లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేలా లక్ష్యంగా నిర్మాణం చేపట్టారు. 2014లో అందుబాటులోకి వచ్చిన ఈ జలాశయంలో మొదటి నాలుగేళ్లు రెండు టీఎంసీల కంటే తక్కువగానే నీటిని నిల్వ చేశారు. 2018, 2019, 2020లో వరుసగా జలాశయంలో పూర్తిస్థాయి 4 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. అయితే ఈ ఏడాది కూడా భారీగా వరద నీరు జూరాలకు వచ్చి చేరడంతో జూలై మొదటి వారంలోనే నీటిని ర్యాలంపాడు జలాయంలోకి ఎత్తిపోశారు. ఈ క్రమంలోనే జలాశయం ఆనకట్ట నుంచి పెద్ద ఎత్తున నీరు లీకేజీ కావడం మొదలైంది. ఈ విషయాన్ని 25 రోజుల కిందట అధికారులు గురించి.. పొంచి ఉన్న ముప్పును రాష్ట్ర ఉన్నతాధికారులకు తెలియజేశారు. 3 కిలోమీటర్ల మేర నీరు లీకేజీ.. జలాశయం చుట్టూ మూడు కిలోమీటర్ల మేర రాళ్లకట్ట నిర్మించారు. సహజంగా జలాశయాల్లో లీకేజీలు ఎర్త్స్లోపుల నుంచి విడుదలవుతాయి. కానీ ర్యాలంపాడులో మాత్రం 3 కిలోమీటర్ల మేర ఉన్న రాక్‌టోల్ నుంచి భారీగా నీరు లీకేజీ అవుతుంది. జలాశయంలో పూర్తిస్థాయిలో అంటే 4 టీఎంసీల మేర నీటిని నిల్వ చేస్తే కట్టకు గండి పడి దాని కింద ఉన్న 20 గ్రామాలు పూర్తిగా నీటిలో కొట్టుకుపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో గద్వాల పట్టణం, అయిజ, మల్దకల్‌తో పాటు ధరూరు, గద్వాల, మల్దకల్, అయిజ మండలాల్లోని 17 గ్రామాల వరకు పూర్తిగా నీటమునుగుతాయి. ప్రమాదకరమే.. ర్యాలంపాడు కట్ట చుట్టూ రాక్పోల్ ద్వారా నీరు లీకేజీ అవుతున్న విషయాన్ని 25 రోజుల క్రితం గుర్తించాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. శనివారం ప్రత్యేక బృందం జలాశయాన్ని పరిశీలించింది. ర్యాలంపాడు నుంచి వెలువడు తున్న లీకేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని, 2 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేయవద్దంటూ సూచించింది. కట్ట తెగితే దాని కింద ఉన్న గ్రామాలు ముంపునకు గురవుతాయని పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం లేదు. వానాకాలం పంటకు ఇబ్బంది లేకుండా ఆయకట్టుకు నీటిని అందిస్తాం. యాసంగికి మాత్రం కష్టం. – శ్రీనివాస్‌రావు, ఎస్ఈ, జిల్లా సాగునీటిపారుదల శాఖ -
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై డీకే అరుణ ఆగ్రహం
సాక్షి, గద్వాల: కరోనా వైరస్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. రాష్ట్రంలో కరోనా బాధితులకు బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొనడం శోచనీయం అని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉండడంతో పాటు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యామని తెలపడం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం గద్వాలలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ.. ‘క్షేత్రస్థాయిలో కరోనా బారిన పడి ప్రజలు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా బారిన పడిన ప్రజలకు నాణ్యమైన చికిత్సతో పాటు నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మీడియాలో వస్తున్న వార్తలు పరిస్థితి ఏ స్థితిలోకి జారిపోయిందో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన ఆక్సిజన్, బెడ్లు, మందుల కొరత తీర్చి ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఉంది’ అని తెలిపారు. చదవండి: ‘కేసీఆర్ బయటకు రా.. ప్రజల కష్టాలు చూడు’ చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే: సీఎస్ -
విషాదం: పండుగకు ఇంటికెళ్తూ.. అనంతలోకాలకు...
సాక్షి, ఎర్రవల్లిచౌరస్తా (అలంపూర్): ఇతర కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా ఉగాది పండుగ చేసుకుందామని కారులో స్వగ్రామానికి బయలుదేరారు. ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి డివైడర్‌ను దాటి.. అవతలి రోడ్డులో వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రపల్లకు చెందిన మురళీమోహన్‌రెడ్డి (45) కొన్నేళ్లుగా హైదరాబాద్ కూకట్‌పల్లిలో నివాసం ఉంటూ వ్యాపారం చేస్తున్నారు. ఈయనకు భార్య సుజాత (40), కుమార్తె నేహారెడ్డి (12), కుమారుడు సాయితేజారెడ్డి ఉన్నారు. ఉగాది పండుగ కోసమని ఆదివారం ఉదయం కారులో స్వగ్రామానికి నలుగురూ బయలుదేరారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం స్టేజీ సమీపంలోకి చేరుకోగానే హైవేపై ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయారు. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి పల్టీలు కొట్టి అవతలి రోడ్డులో అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బొలెరోను ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజ్జునుజ్జు కాగా వాటిలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మురళీమోహన్‌రెడ్డి మృతి చెందారు. భార్య సుజాత, కుమార్తె నేహారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం కుమారుడు సాయితేజారెడ్డితో పాటు బొలెరోలో ప్రయాణిస్తున్న సునీల్, రాజు, సత్యం చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలాన్ని కోదండాపురం ఎస్ఐ కృష్ణయ్య పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. కారు అతివేగంతో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనతో తల్లి, తండ్రి, సోదరిని కోల్పోయిన సాయితేజారెడ్డి ఏకాకిగా మారాడు. -
కూత కూయదు.. ఆశ తీరదు!
వనపర్తి టౌన్: మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌కు మోక్షం కలగలేదు. జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. కేంద్రం ఈ ఏడాది కూడా నిరాశే మిగిల్చింది. గద్వాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మాచర్ల రైల్వేలైన్ నిర్మాణం కోసం నిధులు మంజూరు అవుతాయని అందరూ భావించినా.. మరోసారి మొండిచేయి చూపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఒప్పందం చేసుకోలేకపోవడంతోనే బడ్జెట్లో ఈ లైన్‌కు నిధులు మంజూరు కాలేదని తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల నుంచి వనపర్తి, నాగర్‌కర్నూల్ మీదుగా కల్వకుర్తి, అచ్చంపేట గుండా మాచర్లకు నేరుగా వెళ్లాలనే ప్రజల దశాబ్దాల కోరిక నెరవేరేలా కనిపించడం లేదు. నిధులు విడుదలపై పెట్టుకున్న ఆశలు ఆడియాశలుగా మారాయి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో సగం వాటా భరించాల్సిన ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోకపోవడమే అసలు సమస్యగా మారిందని నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య చెబుతున్నారు. 1980లో ప్రతిపాదనలు.. నాగర్‌కర్నూల్ జిల్లా మీదుగా ప్రతిపాదించిన గద్వాల–మాచర్ల రైల్వేలైన్ వేయడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ 1980లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆ తర్వాత అది మరుగున పడిపోయింది. 2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డీటైల్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) తయారు చేసి కేంద్రానికి ఇచ్చారు. దీంతో 2015లో కేంద్రం కంటితుడుపు చర్యగా కేవలం నల్లగొండ– మాచర్ల వరకు సర్వే నిర్వహించేందుకు రూ.20కోట్లు మంజూరు చేసింది. ఇది మినహా ఇప్పటి వరకు ఈ రైల్వేలైన్‌కు సంబంధించి కేంద్రం తీసుకున్న చొరవ ఏమీ లేదు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పైనే ఈ అంశం ఆధారపడి ఉందనేది అందరి వాదన. రైల్వేలైన్ కోసం అయ్యే ఖర్చులో 50శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. భూసేకరణ, ఇతర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. మొదటి దశకు 2002లో శంకుస్థాపన ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా 2000ఏడాది నుంచి బడ్జెట్లో రైల్వే లైన్ మంజూరు అంశం రాజకీయ నాయకులంతా చర్చకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఎన్నో ఆశలు రేకెత్తించింది. ఆ తర్వాత సర్వే చేయడంలోనే తీవ్ర ఆలస్యం జరిగింది. ఎట్టకేలకు కొన్నేళ్ల కిందట సర్వే కొలిక్కి రావడం ఊరటనిచ్చింది. 2002లో కేంద్ర రైల్వే సహాయ మంత్రి హోదాలో బండారు దత్తాత్రేయ రాయచూర్ – గద్వాల రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేశారు. రెండేళ్ల క్రితం డెమో పూర్తి చేసుకొని రాకపోకలు సైతం ప్రారంభమయ్యాయి. రెండో దఫా పనులకు భారీ వ్యయం అవుతుందని తర్జనభర్జన పడిన రైల్వేశాఖ చివరకు అంగీకారం తెలపడంతో ఆశలు రెకేత్తాయి. గద్వాల–మాచర్ల మధ్య 151–154 కిలోమీటర్ల రైల్వే లైన్‌కు కోసం రూ.1,160 కోట్లు అవసరం అవుతాయని రైల్వేశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందుకు నీతి అయోగ్ సైతం ఆమోదముద్ర వేసింది. తద్వార గద్వాల నుంచి వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మీదుగా మాచర్ల చేరుకోవచ్చు. దీంతో వ్యాపార, వాణిజ్యం పెరగడంతో పాటుగా పరి«శ్రమలు తరలివస్తాయి. సగం వాటా భరిస్తే కొత్త లైన్లు వేస్తామని కేంద్రం విధించిన నిబంధన మేరకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రూ.కోట్లు ఖర్చు అవుతుందనేమో తెలియదు గానీ ఖర్చులో చెరి సగం వాటా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోవడంతోనే ఆలస్యం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ప్రభుత్వ ఉన్నతాధికారులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కలిసి ఈ ఒప్పందం చేసుకోవాలి. కానీ రెండేళ్లు గడిచినా ఆ దిశగా అడుగులు పడలేదు. దీంతో ఒప్పందం చేసుకుంటారా? లేదా అనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతోంది. ఎప్పటి నుంచో మూడు రాష్ట్రాల మార్గం జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల ప్రజలకు అన్ని విధాలుగా మేలు కలగడంతో పాటుగా రవాణా చౌకగా అందుబాటులోకి వస్తోందని, ఈ ప్రాంతాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాయని 30 ఏళ్లుగా రైలు కూత వినేందుకు తహతహలాడుతున్నారు. అప్పుడు, ఇప్పుడు అంటూ చెప్పుకొస్తున్న నేతలు మాత్రం రైల్వే లైన్ రాజకీయానికి వాడుతున్నారనే ఆరోపణలున్నాయి. మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఈ రైల్వేలైన్ మార్గం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల గుండా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలను కలిపే రైలు మార్గమైన రాయచూర్–మాచర్ల లైన్ ఏర్పాటుపై ఇక్కడి ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రవాణాపరంగా ఎంతో సౌకర్యవంతమైన ఈ రైలు మార్గంతో వ్యాపార, వాణిజ్యపరంగా ఈ ప్రాంత ప్రజలకు మేలు కలగనుంది. దీనికి తోడు మూడు రాష్ట్రాలకు రాకపోకలు మెరుగుపడతాయి. వ్యాపారుల, ప్రయాణికులకు ఇబ్బందులు తీరుతాయి. దక్షిణ మధ్య రైల్వే కర్ణాటక, ఆంధ్ర, కోస్తా ప్రాంతాలను తెలంగాణ మీదుగా కలిపేందుకు ఈ రైల్వే మార్గాన్ని ప్రతిపాదించి సర్వేను సైతం పూర్తి చేశారు. ఇందులో కర్ణాటక నుంచి తెలంగాణలోని గద్వాల వరకు రెండేళ్ల కిందట మొదటి దశ పనులు పూర్తయ్యాయి. రెండో దశ పనులపై రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు సిద్ధమైతే కేంద్రం పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే.. గద్వాల–మాచర్ల రైల్వేలైన్ కోసం ఏ ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం బాధాకరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవతీసుకుంటే మన కల ఫలించే అవకాశం ఉంది. ఈ రైల్వే లైన్‌కోసం అయ్యే ఖర్చులో 50శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. రైల్వే లైన్ వచ్చేది లేనిది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. – సుధాకర్‌రెడ్డి, రైల్వే సాధన సమితి జిల్లా చైర్మన్ , నాగర్‌కర్నూల్ తాతల కాలం నాటి డిమాండ్ గద్వాల–మాచర్ల రైల్వేలైన్ చేపట్టాలనే కోరిక తాతల కాలం నాటి డిమాండ్. ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే వస్తుందని అందరూ ఆశించాం. ఈ ఏడాదైనా రైల్వే మార్గం వచ్చేలా పాలకులు కృషి చేయాలి. రైలు మార్గం రాకతో ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. – బలరాం మూర్తి, వనపర్తి -
ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారం
సాక్షి, గద్వాల రూరల్: రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటాద్రిరెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికార ప్రేలాపనతోనే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 1983 నుంచి 2000వరకు టీడీపీ హయాంతో జెడ్పీటీసీగా నియోజకవర్గంలోని కార్యకర్తలకు, నమ్మిన వారికి అండగా ఉన్నానని, అదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. అవినీతి అక్రమ వ్యాపారాలతో సంపాదించిన డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చేందుకు కుతంత్రాలు పన్నుతున్నారన్నారు. ప్రజలు విజ్ఞులని, ఎవరికి పట్టం కట్టాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పారు. గట్టుభీముడు ఎన్నికైనప్పుడు నాలుగు సంవత్సరాల పాటు బంగ్లా కుటుంబం నియోజకవర్గానికి దూరంగా ఉందన్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో తిరిగి నా మద్దతుతోనే ఎన్నికల్లో గెలుపొందారన్నారు. ఇదే పార్టీలో తుదిశ్వాస వరకు ఉంటానని, ప్రతి కార్యకర్తకు అండగా ఉండి ఆదుకుంటానన్నారు. రానున్న కాలంలో కేంద్ర, రాష్ట్రాల్లో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమేనని, నీతివంతమైన పాలనతో పాటు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు రవికుమార్ ఎగ్బోటే, సీనియర్ నాయకులు అయ్యపురెడ్డి, కేశవరెడ్డి, శివశంకర్, తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్వత్ గద్వాలగా తీర్చిదిద్దుతా... గద్వాల అర్బన్: గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గద్వాల ప్రాంతం విద్యలో వెనుకబడిందని, బీజేపీని గెలిపిస్తే విద్వత్ గద్వాల మార్చి పూర్వవైభవం తెస్తానని బీజేపీ అభ్యర్థి వెంకటాద్రిరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గంటవీధిలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అత్తా, అల్లుళ్లను ఇంటికి సాగనప్పిన రోజే గద్వాలలో ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. రవికుమార్, శ్రీనాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, మోహన్, విజయ్‌మోహన్, అఖిల్ పాల్గొన్నారు. -
గొల్లుమన్న గుడ్డెందొడ్డి
ఓ మహిళ, ఆమె కుమారుడు–కోడలు సోమవారం ఉదయమే లేచి పొలం పనులకు వెళ్లారు.. సొంత పొలంలో సాగు చేసిన సీడ్ పత్తిలో కలుపు తొలగించారు.. మధ్యాహ్నం అక్కడే భోజనం ముగించుకుని మళ్లీ పనుల్లో నిమగ్నమయ్యారు. సాయంత్రం ఆకాశం మేఘావృతమై వర్షసూచన ఉండడంతో ఇంటిముఖం పట్టారు.. అంతలోనే వర్షం, మెరుపులు ప్రారంభమయ్యాయి.. దీంతో పక్కన ఉన్న చెట్టు కిందకు చేరగా పిడుగు పాటుకు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం గుడ్డెందొడ్డిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, పిడుగు పాటుతోనే నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం సల్కర్పేటలో రైతు మేకల వెంకటయ్య మృతి చెందాడు. ధరూరు (గద్వాల): మండల పరిధిలోని గుడ్డెం దొడ్డి గ్రామం ఘెల్లుమంది.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిడుగుపాటుకు బలికావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పొలం పనులు ముగించుకుని ఇంటికి పయనమమైన ముగ్గురు కాసేపైతే ఇంటికి చేరేవారు. అంతలోనే పిడుగు యమపాశంలా వచ్చి వారి ప్రాణాలను హరించుకుని వెళ్లిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. గుడ్డెందొడ్డి గ్రామానికి చెందిన కుర్వ జంగిలప్పకు నాలుగు ఎకరాల పొలం ఉంది. కొన్ని జీవాలు కూడా ఉండటంతో వాటిపై ఆధారపడి బతుకుతునానరు. రోజులాగే పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళదామని అనుకునేలోపే సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు రావడంతో కుర్వ జంగిలమ్మ భార్య శంకరమ్మ (50), కుమారుడు గోపాల్ (34), కోడలు మాణిక్యమ్మ (30) ఓ చెట్టుకిందకు వెళ్లి తలదాచుకున్నారు. అదే ప్రాంతంలో పెద్ద మెరుపుతో కూడిన పిడుగు పడింది. దీంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సమీపంలో ఉన్న ఇతర కూలీలు, చుట్టు పక్కల రైతులు గమనించి చెట్టువద్దకు వెళ్లేందుకు ప్రయత్నించినా దాదాపు గంట పాటు ఎడ తెరపిలేకుండా వర్షం కురిసింది. చీకటి కావడంతో ముందు వారు వెళ్లేందుకు భయపడ్డారు. అనంతరం కొందరు గ్రామ యువకులు టార్చి లైట్లతో వచ్చి పిడుగు పడిన ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే వారు విగత జీవుల్లా పడి ఉన్నారు. విషయం తెలుసుకున్న జంగిలప్ప గొర్రెల మంద నుంచి సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించాడు. ఒక్కగానొక్క కొడుకు, అతని భార్య, తన ఇల్లాలు అందరిని కోల్పోవడంతో తల్లడిల్లిపోయాడు. దిక్కు తోచని స్థితిలో చిన్నారులు పిడుగు పాటుకు గురై మృతి చెందిన గోపాల్, మాణిక్యమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్దదైన జయసుధ 9వ తరగతి, పెద్ద మల్లన్న, చిన్న మల్లన్నలు 6వ తరగతి పక్కనే ఉన్న ఉప్పేరు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఈ ముగ్గురు చిన్నారులు దిక్కులేని వారయ్యారు. తల్లిదండ్రుల మృతదేహాల వద్ద రోదిస్తున్న తీరు అందరిని కలిచి వేసింది. నాయకుల పరామర్శ విషయం తెలుసుకున్న గద్వాల మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలు వేర్వేరుగా సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. గ్రామంలోకి తీసుకు వెళ్తేందుకు తగు ఏర్పాటు చేశారు. కుటుంబానికి అన్ని విధాలా ఆదుకునేందుకు తమవంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు, పిల్లలకు ధైర్యం చెప్పారు. సల్కర్పేటలో మరో రైతు బిజినేపల్లి రూరల్: రైతన్నల పాలిట పిడుగులు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. సోమవారం మండల పరిధిలోని సల్కర్‌పేట గ్రామంలో పంట పొలంలో ఉన్న రైతుపై పిడుగు పడింది. వివరాల ప్రకారం సల్కర్‌పేట గ్రామానికి చెందిన మేకల వెంకటయ్య (40) తనకున్న మూడెకరాల పొలంలో మొక్కలు, పత్తి పంటలు వేశాడు. తెల్లవారుజామునే పంటను చూసేందుకు పొలం వద్దకు వెళ్లాడు. 6.45 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. చొప్పగూడు వద్ద తలదాచుకునేందుకు వెళ్లగా సరిగ్గా అదే ప్రాంతంలో పిడుగు పడింది. దీంతో వెంకటయ్య సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు వెంటనే వెంకటయ్యను నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పుడే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. ఆస్పత్రి ఆవరణలో భార్యాపిల్లల రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. -
పేకాట స్థావరాలపై దాడులు
గద్వాల క్రైం: వేర్వేరు ప్రాంతాల్లోని పేకాట స్థావరాలపై పోలీసులు ఆదివారం మెరుపుదాడులు చేశారు. ఆ వివరాలు... గద్వాల మండలంలోని కుర్వపల్లి, వీరాపురం గ్రామాల శివారులో కొందరు పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం అందడంతో రూరల్ పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి పేకాటస్థావరాలపై దాడులు చేశారు. కుర్వపల్లి శివారు వద్ద 16మంది పేకాట ఆడుతున్నారు. పోలీసులు వస్తున్నారని తెలియడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కుర్వ గోపాల్, కుర్వ విజయ్, కుర్వ రామకృష్ణ పోలీసులకు చిక్కారు. మిగతా వారు తప్పించుకున్నారు. రూ.8,880 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరాపురంలోని అగ్రిగోల్డ్ వెంచర్ వద్ద దాడులు చేయగా పిచ్చికుంట్ల శివ, పిచ్చికుంట్ల రాజు, కమత వెంకటరెడ్డి, పిచ్చికుంట్ల శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒకరు తప్పించుకున్నారని చెప్పారు. వీరి నుంచి రూ.17,070 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేష్ పేర్కొన్నారు. మొత్తం రూ.25,950 నగదు, ఏడుగురు పేకాటరాయుళ్లును అరెస్టు చేశామన్నారు. -
‘గద్వాల నుంచే కేసీఆర్ పతనం’
సాక్షి, హైదరాబాద్ : గద్వాల నుంచే సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఫైర్ అయ్యారు. గద్వాల సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని, మామాఅల్లుళ్లు తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నారని అరుణ విమర్శించారు. పాలమూరు ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. ఎన్నికలు వస్తున్నాయని మొక్కుల పేరిట కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పరిస్థితులు అనుకూలించి ఉంటే మంత్రి హరీష్‌రావు ఎప్పుడో కాంగ్రెస్ కండువా కప్పుకునేవారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. గట్టు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ శుక్రవారం గద్వాలలో పర్యటించిన విషయం తెలిసిందే. ‘తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. జనాలను మోసం చేసే వాళ్లు ఎవరో విజయవాడ కనకదుర్గమ్మకు బాగా తెలుసు. అమ్మవార్ల అందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న మోసాలు తెలుసు. జై తెలంగాణ అన్న వారిపై దాడి చేసిన వారికి మంత్రి పదవులిచ్చి తనకు రెండు వైపులా కూర్చోబెట్టుకుంది నీవు కాదా కేసీఆర్. తెలంగాణ వచ్చింది ప్రజలు కోసం కాదు. కేసీఆర్ కుటుంబం కోసం. మంత్రి హరీష్ రావు జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకో. పరిస్థితులు అనుకూలిస్తే కాంగ్రెస్ లోకి వచ్చేవాడివి. అలాంటి నువ్వా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది’ అంటూ డీకే అరుణ మండిపడ్డారు. -
కుర్తిరావల్‌చెర్వులో ఉద్రిక్తత
మల్దకల్(గద్వాల) : రైతుబంధు పథకంలో భాగంగా పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమ వేదిక వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారి తీశాయి. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కుర్తిరావల్‌చెర్వులో శుక్రవారం చోటు చేసుకోగా.. కాంగ్రెస్–టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ఎమ్మెల్యే రాకముందే... చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కుర్తిరావల్‌చెర్వులో ఏర్పాటుచేశారు. అయితే, ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డీ.కే.అరుణ రాకముందే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్‌రెడ్డి గ్రామానికి చేరుకుని ఇన్చార్జి జేసీతో కలిసి పలువురు రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘించి టీఆర్ఎస్ నాయకులతో ఎలా చెక్కులు పంపిణీ చేయిస్తారని డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి అధికారులతో వారించారు. దీంతో ఇరు పార్టీ నాయకుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదానికి దారితీసిన ఫ్లెక్సీలు చెక్కుల పంపిణీ కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా.. బయట రైతుల ఆత్మహత్యలు, రైతు సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ పథకానికి విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ఫ్లెక్సీని తొలగించారు. అనంతరం ఎమ్మె ల్యే డీకే.అరుణ గ్రామానికి చేరుకోగా ఆ ఫ్లెక్సీని పంపిణీ కేంద్రం ముందు మళ్లీ ఏర్పాటు చేయించారు. కార్యక్రమానికి తాను వస్తున్నారనే విషయం తెలిసి కూడా ఏ హోదా లేని వ్యక్తితో ఎలా చెక్కులు పంపిణీ చేయిస్తారని ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ గ్రామానికి వచ్చారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యే డీకే అరుణ సమక్షాన అధికారులు చూస్తుండగానే భాస్కర్ స్వయంగా ఆ ఫ్లెక్సీని చింపేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత పక్కనే ఉన్న టీఆర్ఎస్ నాయకులతో కూడిన ఫ్లెక్సీని వారు తొలగించారు. ఈ మేరకు కోపోద్రిక్తులైన టీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీని తొలగించిన కాంగ్రెస్ కార్యకర్తలపై పిడిగుద్దులు కురిపిస్తూ మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. పరిస్థితి విషమించడంతో సీఐ వెంకటేశ్వర్లు పోలీసులతో కలిసి లాఠీచార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. దీంతో సుమారు గంట పాటు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే డీఎస్పీ సురేందర్‌రావు గ్రామానికి చేరుకుని ఇరుపార్టీల నాయకులకు సర్దిచెప్పారు. దాడి జరిగిన విషయాన్ని ఎమ్మెల్యే డీకే. అరుణ సంఘటనా స్థలం నుంచి ఫోన్ ద్వారా జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరికి ఫిర్యాదు చేశారు. అనంతరం జెడ్పీ చైర్మన్ బండారి భాస్క ర్, ఎమ్మెల్యే డీకే. అరుణ వేర్వేరుగా రైతులకు చెక్కులు పంపిణీ చేసి విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఇన్చార్జి జేసీ వేణుగోపాల్, మార్కె ట్ యార్డు చైర్పర్సన్ బండ్ల లక్ష్మీదేవి, తహసీల్దార్ వీరభద్రప్ప పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధిని మరిచారు
గద్వాల రూరల్ : కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యంతో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ధరూరు మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సుమారు 400 మంది టీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగ్లా కుటుంబం గద్వాల ను నలబై ఏళ్లు పాలించిందన్నారు. వీరంతా దౌర్జన్యాలు, హత్యారాజకీయాలతో రాజ్యాధికారం సంపాదించారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జేబులు నింపుకొన్నారే తప్పా ఏనాడూ అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో గద్వాల అభివృద్ధికి రూ.28కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.26కోట్లు, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు, ప్రతి మండలానికి గురుకుల పాఠశాల ఏర్పాటు చేయించామన్నారు. కాగా టీఆర్ఎస్లో చేరిన వారిలో ధరూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాజులపాడు రఘురెడ్డి, గువ్వలదిన్నె సర్పంచ్ సిద్ధన్‌గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాసులుగౌడ్, మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, పాగుంట సింగిల్‌విండో డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు ఈర్లబండ శ్రీనివాస్‌రెడ్డి, రాజారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, కృష్ణయ్య తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీఎస్ కేశవ్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ సుభాన్, ధరూరు జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావెంకటేశ్వర్‌రెడ్డి, గట్టు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్, గద్వాల మార్కెట్ యార్డు వైస్‌చైర్మన్ నజీర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేష్‌నాయుడు, ఆయా గ్రామ సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్, ఉరుకుందు, రామకృష్ణ, దామ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
సాక్షి, గద్వాల : ఉండవెల్లి మండలం పుల్లూరు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వస్తున్న కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. డ్రైవర్ అలక్ష్యమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. -
రెండు విడతల్లో..పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు
గద్వాల రూరల్ : జిల్లాలో పోలింగ్ సిబ్బంది కొరత దృష్ట్యా ఈసారి పంచాయతీ ఎన్నికలను రెండు విడతలుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఓటర్ల జాబితా పాతవి, కొత్తవి కలిపి వార్డుల వారీగా సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా, జిల్లాలో మొత్తం 255 గ్రామపంచాయతీలు, 4,86,930మంది ఓటర్లు ఉండగా, సర్పంచ్ స్థానాలతో కలిపి వార్డుల సంఖ్య 2,645కి చేరుకుంది. ఈ ఏడాది మార్చి 25న అసెంబ్లీల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన తుది జాబితాను అనుసరించి ఫొటోలతో ఓటర్ల జాబితాను రూపొందించాలని సూచించారు. ఒక్కో జాబితాను 25 సెట్లుగా సిద్ధం చేయాలన్నారు. పంచాయతీ నోటీస్ బోర్డుపై ఒకటి, గ్రామంలో ఉండే ప్రధాన కూడళ్లలో మూడు జాబితాలను పెట్టాల్సి ఉంటుంది. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో ఒకటి, జిల్లా పంచాయతీ కార్యాలయంలో రెండు, రాజకీయ పార్టీలకు ఇచ్చేందుకుగాను 11 కాపీలు, అందుబాటులో మరో ఏడు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఇందుకు అయ్యే బడ్జెట్ అంచనాలను తమకు పంపించాలని ఎన్నికల కమిషనర్ కోరారు. ఈపాటికే నోటిఫికేషన్ జారీ ఈపాటికే ఓటర్ల జాబితాపై నోటిఫికేషన్ జారీ అయింది. వచ్చే జూలై నెలాఖరుతో ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగియనుండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తోంది. ప్రతి 500జనాభా కలిగి ఉండి అనుబంధ పంచాయతీకి కిలో మీటరున్నర ఉన్న గ్రామాలతోపాటు గిరిజన తండాలను గ్రామపంచాయతీలు, వార్డులను ఏర్పాటు చేయడంతోపాటు రిజర్వేషన్ల రొటేషన్‌లో పలు మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఐదేళ్ల రొటేషన్‌ను పదేళ్లకు పెంచింది. ఆయా గ్రామాల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీల వారీగా ఉన్న ఓటర్ల ఆధారంగా కొత్త రొటేషన్ ఖరారు చేయనున్నారు. ఇందులో మొదట అత్యధికంగా ఓటర్లు ఉన్న వారిని చేర్చనున్నారు. ఈనెల 30న గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. రాజకీయ పార్టీలతో మే 1న జిల్లాస్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి, 3న మండలస్థాయిలో ఎంపీడీఓలు సమావేశాలు నిర్వహించనున్నారు. మే 1 నుంచి 8వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 10న పరిష్కరించి, 17వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే.. గ్రామపంచాయతీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితా చాంతాడంత ఉండటంతో ఈసారి కూడా ఈవీఎంలతో సాధ్యం కాదు. దీంతో మే లేదా జూన్‌లో బ్యాలెట్ పద్ధతిలోనే ఈ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అందుకనుగుణంగా రెండు వేల పోలింగ్ బూత్‌లను సిద్ధం చేయనున్నారు. గద్వాల రెవెన్యూ డివిజన్ పరిధిలో అవసరాన్ని బట్టి ఏయే పంచాయతీల్లో అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందో చిన్న, మధ్యతరహా బ్యాలెట్ బాక్సులు అవసరమో గుర్తించి నివేదికలు తయారుచేసేందుకు సమాయత్తయ్యారు. ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకనుగుణంగా ప్రస్తుతం ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులను చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు, కొత్త పంచాయతీల ఏర్పాటు పూర్తయినందున గడువులోపే స్థానిక సంస్థల ఎన్నికలు జరగొచ్చు. దీనికోసం వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఐదు వేల మంది ఉద్యోగుల వివరాలను సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. -
తప్పెవరిది?
రహదారులు మృత్యుదారులుగా.. వాహనాలు మృత్యుశకటాలుగా మారాయి.. బయటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగి వస్తే చాలు అనుకునే పరిస్థితి నెలకొంది. మైనర్లు, అవగాహన లేని డ్రైవర్లు వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.. ఆయా ప్రమాదాల్లో మృత్యువాతపడిన వారి కుటుంబాలు, క్షతగాత్రులు కోలుకోలేని దెబ్బతింటున్నారు.. గద్వాల క్రైం: ఇతర ప్రాంతాలకు కూలి పనులకు వెళ్లిన వారు.. సొంత పనులపై బయటకు వెళ్లి వారు ప్రస్తుతం క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. మనం సరిగానే వెళ్తున్నా.. ఎదురుగా వచ్చే వారు క్షణకాలంలో చేసే చిన్నపొరపాటు నిండు జీవితాలను నాశనం చేస్తుంది. ఈ క్రమంలో ఎంతో భవిష్యత్ ఉన్న మైనర్లు, యువకులు, కుటుంబం ఆధారపడి ఉన్న యజమానులు మృత్యువాత పడుతూ.. కుటుంబాలను చీకట్లోకి నెట్టేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు, మానవపాడు, ఇటిక్యాల, అ లంపూర్ మండలాల్లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వపరంగా నివారణ చర్యలు చేపడుతున్నా.. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం.. వాహనదారుల అవగాహన లేమితో అవేమీ ప్రమాదాలను అడ్డుకోలేకపోతున్నాయి. రోడ్డు భద్రతపై ఏదీ చిత్తశుద్ధి వాహనాలు నడపడం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం మనిషి ప్రాణం అనే విషయాన్ని డ్రైవర్లు పెడచెవిన పెడుతున్నారు. అయితే ఏ రోడ్డుపై ఎంత వేగంతో వెళ్లాలి.. ఎలా ముందు వెళ్తున్న వాహనాలను దాటాలి.. తదితర విషయాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఒకింత ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ విషయంలో ఇటు రవాణా శాఖ, అటు పోలీసు అధికారులు నామమాత్రంగా తనిఖీలు జరుపుతూ చేతులు దులుపుకొంటున్నారు. మరికొందరు డ్రైవర్లు నిద్రలేమి, మద్యం మత్తులో వాహనాలను నడపడం కూడా గమనార్హం. అవగాహన లేని వారే అధికం ఒక వాహనాన్ని రోడ్డుపైకి తీసుకురావాలంటే ముందుగా ఆ దారిపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. రవాణా శాఖాధికారులు జారీ చేసే లైసెన్స్ ఉండాలి. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. రాత్రివేళలో హెడ్ ల్యాంపులు, ఇండిగేటర్లు వేస్తూ వాహనాలకు ఎలా సంకేతాలు ఇవ్వాలి.. అనే విషయాలపై ప్రస్తుత డ్రైవర్లకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండటం లేదు. ఇలాంటి వారిని కట్టడి చేస్తే కొంతమేర ప్రమాదాలను నివారించవచ్చు. ఇవిగో ఘటనలు.. జనవరి 8న ధరూరు మండలం చిన్నపాడు, యమునోనిపల్లికి చెందిన కొంతమంది గద్వాలలోని ఓ పత్తి మిల్లులో కూలికి వెళ్లేవారు. తిరిగి వచ్చే క్రమంలో బొలేరో డ్రైవర్ నిర్లక్ష్యం.. నిద్రలేమి కారణంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యారు. æ 9వ తేదీన ఉండవెల్లి మండలం మునగాలకు చెందిన మధుసూద న్ అనే విద్యార్థి ద్విచక్రవాహనంపై వస్తుండ గా ఆటో ఢీకొని అక్కడికక్కడే మృతిచెం దాడు. æ 12వ తేదీన మానవపాడు దగ్గర జాతీయ రహదారిపై తమిళనాడుకు చెందిన లారీని వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొనడంతో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. æ 14వ తేదీన బీచుపల్లి వద్ద జాతీయ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ మృతిచెందారు. నివారణ చర్యలేవీ.. గద్వాల– అయిజ, గద్వాల– ధరూరు, గద్వాల– ఎర్రవల్లి తదితర రోడ్డు మార్గంలో ప్రభుత్వం నూతనంగా రోడ్డు నిర్మాణాలు చేపట్టింది. అయితే వివిధ ప్రాంతాల్లో రోడ్డు వేస్తున్న క్రమంలో అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. రాత్రివేళలో ఎరుపు రంగు రేడియం స్టిక్కర్ సూచకలు పెట్టాలి. మూల మలుపులు, స్పీడ్ బ్రేకర్లు ఇలా ప్రతిచోట ప్రమాదాలను నివారించేలా బోర్డులు ఉంచాలి. కానీ ఈ విషయంలో సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. తూతూమంత్రంగా నిర్వహణ.. ప్రతియేటా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు జనవరి 11 నుంచి వారం రోజులపాటు నిర్వహిస్తారు. అలాగే 25వ తేదీ నుంచి ఆర్టీసీ యాజమాన్యం సైతం భద్రతా వారోత్సవాలు జరుపుతుంది. అయితే వీటిని ఆయా అధికారులు నామమాత్రంగా నిర్వహించి చేతులు దులుపుకోవడం తప్ప పెద్దగా ప్రయోజనం చేకూర్చడం లేదు. ఇందులో సంబంధిత అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కఠినంగా వ్యవహరిస్తాం.. రోడ్డు ప్రమాదాల నివారణకు మా శాఖ పరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రవాణా శాఖతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గూడ్స్ వాహనాల్లో సరుకులను మాత్రమే ట్రాన్స్‌పోర్టు చేయాలి. కొందరు ప్రజలను కూడా తీసుకెళ్తున్నారు. ఇలాంటి వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. అన్ని ప్రధాన రహదారులపై సూచిక బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – విజయ్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల జిల్లా -
బొలెరో వాహనం బోల్తా : ఐదుగురు కూలీల మృతి
గద్వాల : ధరుర్ మండలం పార్ చర్ల స్టేజీ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం బోల్తాపడి ఐదుగురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిన్నింగ్ మిల్లు కూలీలు స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. -
కలుషిత ఆహారం తిని 50 మందికి అస్వస్థత
గద్వాల: కలుషిత ఆహారం తిని 50 మంది అస్వస్థతకు గురైన సంఘటన గద్వాల జిల్లా శెట్టి ఆత్కూర్ గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సుమారు 50 మంది కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.