ముఖ్యమంత్రి సమక్షంలో చేరిన కృష్ణమోహన్‌రెడ్డి
సరితను సముదాయించి బండ్లకు పార్టీ కండువా కప్పిన సీఎం
మంత్రి శ్రీధర్‌బాబుతో ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల భేటీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డి జిల్లా/సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గద్వాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చే రారు. శనివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని క్యాం పు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెంది న మంత్రి జూపల్లి కృష్ణారావు, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇలావుండగా సీఎం రేవంత్ త్వరలోనే గద్వాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభించనున్నారు. ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా అదే రోజు కృష్ణమోహన్‌రెడ్డి అనుచరులు, ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలిసింది.
జెడ్పీ చైర్మన్‌కు సీఎం సముదాయింపు
మరోవైపు బండ్ల చేరికను వ్యతిరేకిస్తూ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత వర్గీయులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఆమె సీఎం రేవంత్‌తో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ఆమెను ముఖ్యమంత్రి సముదాయించినట్లు తెలిసింది. ఆ తర్వాతే బండ్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. గద్వాల, ఆలంపూర్ మినహా మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే హస్తం గూటికి చేరడంతో జిల్లాలో కాంగ్రెస్ బలం 13కు పెరిగింది.
నిధులు కేటాయించండి
శ్రీధర్‌బాబుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వినతి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శనివారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీ, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిలు సచివాలయంలో మంత్రిని కలిశారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వారు మంత్రిని కోరారు. అయితే ఆరుగురు ఎమ్మెల్యేలు జిల్లా ఇన్‌చార్జి మంత్రిని కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment