
సాక్షి,మెదక్ జిల్లా : దేవుళ్లను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయడం ఓ లెక్క’ అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు.
మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినా మొదటి రోజే రూ 2లక్షలు చేస్తామని చేతులెత్తేశారు. దేవుళ్లను మోసం చేసిన రేవంత్‌కు రైతులను మోసం చేయడం ఓ లెక్క.
రైతులతో మిత్తిలు కట్టించి రుణాలు ఇవ్వలేదు. మొదటి ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ సర్కార్ మోసం చేసింది. అన్ని వర్గాలను ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. అసెంబ్లీలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేసిందది.
రూ 2లక్షల రుణమాఫీ మీద రైతులు కాంగ్రెస్ నేతలను నిలదీయండి. రైతుబందు ఎగ్గొట్టింది. కరోనా కష్ట కాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు అందించారు. కాంగ్రెస్ మాటలే తప్ప చేతలు లేవు. ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం లేదు. సర్పంచులకు, చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదు. సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా రైతుల పక్షాన నిలదీస్తాం’ అని హరీష్ రావు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment