Rythu Runa Mafi
-
మాట తప్పిన రేవంత్ రెడ్డి.. హరీష్ రావు ఫైర్
-
డిక్లరేషన్ కోసం ఢీ
జగిత్యాల టౌన్: జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం రైతులు వివిధ డిమాండ్లతో ఆందోళనకు దిగారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ప్రకటించిన విధంగా షరతుల్లే కుండా రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మద్దతు ధర, బోనస్, మూతపడిన చక్కర ఫ్యాక్టరీని తెరిపించాలన్న డిమా ండ్లతో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లా నలు మూలల నుంచి వేలాదిమంది రైతులు తరలిరాగా.. నిజా మాబాద్ రోడ్డులోని మార్కెట్ యార్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్, పటేల్‌చౌక్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు.దాదాపు 4 గంటల పాటు ఆందో ళన నిర్వహించారు. కథలాపూర్‌కు చెందిన ఒక రైతు సొమ్మ సిల్లి పడిపోవడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని కలె క్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించి న కలెక్టర్ సత్యప్రసాద్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.అనంతరం రైతు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రూణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్య క్రమంలో రైతు వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు మిట్టపల్లి తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి కర్నె రాజేందర్, బందెల మల్లన్న, బద్దం మహేందర్, వందలాది మంది రైతులు పాల్గొన్నారు. -
నేడు రైతుల చలో ప్రజాభవన్.. అన్నదాతలు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని ప్రతిపక్ష నేతలు చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే రుణమాఫీ అమలుకాని రైతులు సర్కార్‌పై పోరుకు సిద్ధమయ్యారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్‌తో గురువారం చలో ప్రజాభవన్ కార్యక్రమానికి సిద్ధమయ్యారు.పలు జిల్లాల నుంచి ప్రజాభవన్‌కు బయలుదేరిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసు తీరుపై రైతులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో రైతులు మాట్లాడుతూ.. మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని ప్రజాభవన్‌కు బయలుదేరాం. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు. మేము ఏమైనా దొంగలమా లేక టెర్రరిస్టులమా?. ఎలాగైనా మేము ప్రభా భవన్ వద్దకు వెళ్తాము’ అని చెప్పుకొచ్చారు.ఇక, ఎక్కడికక్కడ గ్రామాల వారీగా రుణమాఫీ కాని రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. అయితే కఠిన నిబంధనలు, షరతులతో అర్హులైన రైతుల సంఖ్యలో కోత పెట్టారు. దీంతో, రుణమాఫీ కానీ రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇది కూడా చదవండి: ఒక హైడ్రా.. ఆరు చట్టాలు! -
రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి
నిర్మల్ చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివ రకు ఎంతమందికి రు ణమాఫీ చేసిందో శ్వేత పత్రం విడుదల చే యాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వ ర్‌రెడ్డి డిమాండ్ చేశా రు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరి పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు.ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పటి వరకు సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెపుతుంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందని ఒట్లు వేస్తూ దేవుళ్లను కూడా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నెలాఖరులోపు రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.కొర్రీలొద్దు.. కోతలొద్దు: రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు, కోతలు లేకుండా తక్షణమే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ డిమాండ్ చేశారు. రైతు దీక్షలో ఆయన మాట్లాడుతూ, అందరి రుణాలు మాఫీ అయ్యేవరకు రైతుల పక్షాన పోరాడతామన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఎంతోమంది రైతులు రుణమాఫీకి దూరమయ్యా రన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్‌రావు పటేల్ పాల్గొన్నారు. -
రుణమాఫీపై ధర్నాకు బీఆర్ఎస్ పిలుపు
-
రుణమాఫీపై రచ్చ రచ్చ
-
రుణమాఫీ పేరుతో రైతులకు టోపీ
-
శ్వేతపత్రం విడుదల చేయాలి
-
రుణమాఫీ కోసం బీఆర్ఎస్ పోరుబాట
-
రుణమాఫీ పేరుతో దారుణమైన దగా చేశారు: కేటీఆర్
-
రుణమాఫీ సాధ్యమా అన్నారుగా..! విమర్శకులకు భట్టి కౌంటర్
-
రుణమాఫీపై పల్లా కామెంట్స్
-
రేపటి నుంచి రైతు రుణ మాఫీ -మంత్రి పొన్నం
-
రుణమాఫీ నిధుల సమీకరణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
-
రుణమాఫీ నిధులకోసం అన్వేషణ
-
‘సీఎం రేవంత్‌కు ఆగస్టు సంక్షోభం తప్పదు’
సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి అత్యుత్సాహంతో ఆరు గ్యారంటీల హామీ ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడపాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం కావటం ఖయమని అన్నారు. -
రేవంత్.. రైతులకు లీగల్ నోటీసులా?: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన మాటలను మర్చిపోయారని మండిపడ్డారు. రైతుల పంట రుణాలపై కాంగ్రెస్ సర్కారు మౌనం వహిస్తూ.. రైతన్నలకు లీగల్ నోటీసులను పంపుతోందని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను పచ్చి దగా, నయవంచనతో మోసం చేస్తోందన్నారు. ‘ఇవి ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు.. బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు. డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఇప్పటివరకు లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోన్లు ఇస్తరు. నేడు.. పంట రుణాలపై కాంగ్రెస్ సర్కారు మౌనం.. రైతన్నలకు లీగల్ నోటీసులు. ఇంత మోసం, పచ్చి దగా, నయవంచన’ అని ఎమ్మెల్యే కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ సర్కార్‌ను ఎండగట్టారు. ఇవి ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు.👇 ▶️బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు. ▶️డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ▶️ఇప్పటివరకు లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా… pic.twitter.com/hxKapf2DYW — KTR (@KTRBRS) March 24, 2024 -
రుణమాఫీ తో మా జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు వైఎస్సార్
-
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కెసిఆర్
-
రైతు రుణమాఫీ కోసం కలెక్టరేట్ల ఎదుట బీజేపీ ఆందోళనలు
-
నాలుగు రోజుల్లో 61,752 మంది రైతుల రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: నాలుగో రోజు రుణమాఫీ కింద 10,958 మంది రైతుల ఖాతాల్లో రూ.39.40 కోట్లు బదిలీ అయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో 61,752 మంది రైతులకు రూ.175.96 కోట్ల రుణమాఫీ అయిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలో వ్యవసాయరంగ స్వరూపం మారిందని, 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎవరూ ఊహించని పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. సమయం : ‘శ్రీశైలం’ ఘటనకు ఏడాది -
ప్యాకేజీలో రైతులకు ఒరిగిందేమిటీ?
సాక్షి,హైదరాబాద్: కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో రైతులకు ఒరిగిందేమిటో చెప్పాలని రైతుసంఘాల పోరాట సమన్వయ సమితి డిమాండ్ చేసింది. రైతాంగ సమస్యలపై నిర్లక్ష్యంతో పాటు రైతు వ్యతిరేక చర్యలకు కేంద్రం ఒడిగట్టిందని విమర్శించారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త నిరసనల్లో్ల భాగంగా బుధవారం మఖ్దూంభవన్ ఆవరణలో నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ..వ్యవసాయం, దాని అనుబంధ, మత్స్యరంగాలకు కేంద్ర బడ్జెట్లో కేటాయించిన రూ.1.63 లక్షల కోట్ల మొత్తాన్నే మళ్లీ ప్యాకేజీలో ప్రత్యేకంగా ఇచ్చినట్టుగా చెప్పి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆరోపించారు. లాక్డౌన్ పొడిగింపు కారణంగా రైతులు తమ పంటలను అమ్ముకోలేకపోయారని, మద్దతు ధరలు లభించకపోగా 30% తక్కువ ధరలకు రైతులు తమ దిగుబడులను విక్రయించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం రుణమాఫీ చేయాలి రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాలు మాఫీ చేయాలని, పాత కిసాన్ క్రెడిట్ కార్డులను రద్దుచేసి కొత్త ఖరీఫ్ కేసీపీ కార్డులివ్వాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు మద్దతు ధర వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి డిమాండ్ చేసింది. పాలు, పండ్లు, కూరగాయలు కూడా ప్రభుత్వమే కొనాలని విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహా రక మందుల ధరలను ఈ సీజన్లో 50% తగ్గించాలని సూచించాయి. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, రుణమాఫీ, పంటబీమా అమలు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ నిరసనల్లో సారంపల్లి మల్లారెడ్డి, వేములపల్లి వెంకట్రామయ్య, పశ్యపద్మ తదితరులు పాల్గొన్నారు. -
‘రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. (‘అలా అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా’) తొలిదశలో రూ.25వేలు లోపు ఉన్న రుణాలు మాఫీ. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1లక్ష లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తామన్నారు. 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు తేదీల మధ్య లోన్ తీసుకొని ఉంటేనే రుణమాఫీకి అర్హులు. రైతులకు చెక్కుల ద్వారా రుణమాఫీ మొత్తాన్ని అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఐటీ పోర్టల్ ద్వారా డేటా కలెక్షన్. -
ప్రజల కడుపు నింపట్లేదు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తియ్యటి మాటలతో ప్రజల నోరు తీపి చేస్తోందే తప్ప వారి కడుపు నింపడం లేదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మరింత ఆరోగ్యంతో మంచి పాలన అందించాలని తాను కోరుతున్నానని, ఎన్నికల హామీల అమలుపై ఆయన ఇప్పటికైనా దృష్టి పెట్టాలని కోరారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పినా ప్రజలు టీఆర్ఎస్ పార్టీని నమ్మి ఓట్లేశారని, ఏడాది గడుస్తున్నా టీఆర్ఎస్ ఇచ్చిన హామీపై స్పష్టత లేదన్నారు. -
రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతోందని, అయినా బ్యాలెన్స్ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో సంక్షేమ కార్యక్రమాలకు రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. ఇవికాకుండా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి పథకాలకు రూ.వేల కోట్లు వెచ్చించామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఇంత పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన రాష్ట్రం మరొకటి లేదని పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్ సెల్లో సంక్షేమ రంగం, సామాజిక సాధికారితపై మూడో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. సాంఘిక సంక్షేమానికి రూ.40,253 కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ.14,210 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.39,138 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.3,215 కోట్లు, కాపు కార్పొరేషన్‌కు రూ.3,004 కోట్లు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. సంక్షేమ రంగంలో తాము అమలు చేసిన కార్యక్రమాలు దేశానికే ఒక మోడల్ అని వెల్లడించారు. ధనిక రాష్ట్రాల్లోనూ ఇంత సంక్షేమం లేదు 2014 సంవత్సరానికి ముందు రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమం లేదని, తాను వచ్చాకే అన్నింటినీ గాడిన పెట్టానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలకు సంతృప్తకర స్థాయిలో నిత్యావసరాలను అందిస్తున్నామన్నారు. ఉపకార వేతనాలు, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని. ధనిక రాష్ట్రాల్లో కూడా ఇంత సంక్షేమం లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవే కాకుండా, అందులో లేనివి కూడా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా చూస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. రూ.2,000 నోట్లను రద్దు చేస్తే తప్ప ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నిలువరించలేమని స్పష్టం చేశారు. పోలవరం, రాజధాని కట్టి చూపించా.. ప్రతిపక్ష నాయకుడు అదిస్తాం, ఇదిస్తాం అని హమీలు గుప్పిస్తున్నారని, ఆయనకు ఏం అనుభవం ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో మాటలు చెప్పి ఏమీ చేయలేదని, ఆయనకు అనుభవమైనా ఉందని, రాష్ట్రంలో ప్రతిపక్ష నేతకు అది కూడా లేకుండా అన్నీ చేస్తానని చెబుతున్నాడని విమర్శించారు. అన్నీ ఇస్తామని చెప్పిన తర్వాత ఏదీ ఇవ్వలేని పరిస్థితి వస్తే ఏంచేస్తారని, సంపద సృష్టించకుండా ఎలా చేస్తారని ప్రశ్నించారు. తనను పోలవరం ప్రాజెక్టు నిర్మించలేరని, రాజధాని నిర్మించలేరని అన్నారని, ఇప్పుడు కట్టి చూపించానని పేర్కొన్నారు. ఏదో ఇచ్చేస్తారనేది ఊహ, ఇప్పుడు ఇస్తున్నది వాస్తవమని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఒడిశా రాష్ట్రానికి వెళ్లి, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఇక్కడ కాదు.. ఢిల్లీలో ధర్నా చేయాలి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాజీనామాపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసినట్లే తాడేపల్లిగూడేన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పరిశ్రమలు స్థాపించలేకపోయామని, అందుకు భూములు లేవని చెప్పారు. రాజీనామా పేరుతో బెదిరించడం సరికాదన్నారు. ధర్నా ఇక్కడ కాదు, ఢిల్లీలో చేయాలని హితవు పలికారు. పోలవరం నిధుల కోసం రాజీనామా చేయాలన్నారు. చంద్రబాబుతో ఒడిశా ఎంపీ సౌమ్యారంజన్ పట్నాయక్ భేటీ సీఎం చంద్రబాబుతో ఒడిశాకు చెందిన ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్ మంగళవారం భేటీ అయ్యారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధిగా వచ్చిన ఆయన చంద్రబాబును కలసి పలు అంశాలపై చర్చించారు. మహిళా రిజర్వేషన్లు, ఈవీఎం మిషన్లు వంటి అంశాలపై ప్రస్తావించారు.