
సాక్షి, హైదరాబాద్: నాలుగో రోజు రుణమాఫీ కింద 10,958 మంది రైతుల ఖాతాల్లో రూ.39.40 కోట్లు బదిలీ అయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో 61,752 మంది రైతులకు రూ.175.96 కోట్ల రుణమాఫీ అయిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలో వ్యవసాయరంగ స్వరూపం మారిందని, 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎవరూ ఊహించని పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు.
సమయం : ‘శ్రీశైలం’ ఘటనకు ఏడాది