telangana agriculture minister
-
నాలుగు రోజుల్లో 61,752 మంది రైతుల రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: నాలుగో రోజు రుణమాఫీ కింద 10,958 మంది రైతుల ఖాతాల్లో రూ.39.40 కోట్లు బదిలీ అయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో 61,752 మంది రైతులకు రూ.175.96 కోట్ల రుణమాఫీ అయిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలో వ్యవసాయరంగ స్వరూపం మారిందని, 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎవరూ ఊహించని పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. సమయం : ‘శ్రీశైలం’ ఘటనకు ఏడాది -
చంద్రబాబుపై పోచారం ఫైర్
నిజామాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకుంటామనడం దారణమని ఆయన వ్యాఖ్యానించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. కృష్ణా, గోదావరి జలాలను సాధించుకుని తీరుతామని పోచారం స్పష్టం చేశారు. -
'తెలంగాణలో ఉన్నది బాబు నామినేట్ ప్రభుత్వం కాదు'
హైదరాబాద్ : హస్తిన పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రమంత్రులు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఉన్నది చంద్రబాబు నామినేట్ చేసిన ప్రభుత్వం కాదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న చందంగా చంద్రబాబు వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. -
ఏం తమాషాలు చేస్తున్నారా ?
హైదరాబాద్: ఏం తమాషాలు చేస్తున్నారా ? అంటూ అధికారులపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం అంబర్‌పేటలోని కాద్రిబాగ్లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం పాల్గొన్నారు. స్థానిక కాలనీలో వసతులను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. విద్యుత్, నీటి సరఫరాపై స్థానికుల నుంచి పోచారంకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో ఆయన ఉన్నతాధికారులను ఏం తమాషాలు చేస్తున్నారా ? అంటూ నిలదీశారు. విద్యుత్ కోతలు లేకుండా చూడాలిని.... అలాగే నీటి సరఫరా జరిగిలే చర్యలు తీసుకోవాలని పోచారం ఉన్నతాధికారులను ఆదేశించారు.