'తెలంగాణలో ఉన్నది బాబు నామినేట్ ప్రభుత్వం కాదు'
హైదరాబాద్ : హస్తిన పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రమంత్రులు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.
తెలంగాణలో ఉన్నది చంద్రబాబు నామినేట్ చేసిన ప్రభుత్వం కాదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న చందంగా చంద్రబాబు వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.