Pocharam Srinivas reddy
-
పద..పదమంటూ ‘పోచారం’
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆయన డెబ్బై ఆరేళ్ల వయస్సులో కూడా నవ యువకుడిగా తిరుగుతూనే ఉంటారు. అడవి అయినా, గుట్ట, పుట్ట ఎక్కడికైనా సరే చలో అంటారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాదు... పనులు పూర్తయ్యే దాకా కాంట్రాక్టర్ల వెంట పడతారు. తనే స్వయంగా ఆ పనులను పర్యవేక్షిస్తుంటాడు. ఆయనే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి. మంత్రిగా స్పీకర్‌గా మూడు దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు ఒకే రకమైన టెంపో కొనసాగిస్తున్నారు. అభివృద్ధి పనులకు నిధులు సాధించి వాటిని పూర్తి చేసేదాకా వెంటపడతారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల కాలంలో రూ.10 వేల కోట్లు తీసుకొచ్చాడని చెబుతారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాన్సువాడ నియోజకవర్గంలో 10 వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించడంలో ఆయన కృషి ఎంతో ఉందంటారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న తీరును ఆయన ఎన్నోసార్లు పర్యవేక్షించారు. రోడ్లు, ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, స్కూల్ భవనాలు... ఇలా ఏ పని అయినా సరే తను వెళ్లాల్సిందే. నియోజకవర్గ పరిధిలోని సిద్దాపూర్ అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఇప్పటి దాకా ఆయన ప్రతి నెలలో ఒకటి రెండుసార్లు పరిశీలించారు. ఎంతదూరమైనా సరే, ఎంత లోపలకు ఉన్నా సరే వెళతారు. ఒకవేళ రోడ్డు మార్గం సరిగ్గా లేదని కార్లు వెళ్లే పరిస్థితి లేదంటే బైక్ మీద కూడా వెళ్లి వస్తారు. బాన్సువాడ పట్టణంలో జరిగే పనులను రెగ్యులర్‌గా పరిశీలిస్తారు. జోరువర్షం కురుస్తుందని అందరూ ఇళ్లలో ఉంటే తను మాత్రం బ్యాటరీ వాహనంలో ఊరంతా చుట్టేస్తారు. నీరు నిలిచిపోకుండా నాలాలను శుభ్రం చేయించమని ఆదేశిస్తారు. కాంట్రాక్టర్లు పనులు ఆపితే కారణాలు తెలుసుకొని బిల్లుల సమస్య అయితే ఉన్నతాధికారులతో మాట్లాడి బిల్లులు ఇప్పించి వారికి సహకరిస్తుంటారు. దీంతో అందరూ పోచారం స్టైలే వేరబ్బా అంటుంటారు. పెద్దాయనతో పోటీపడలేమని ఇతర ప్రజాప్రతినిధులు చెబుతుంటారు. -
రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టానికి తూట్లు.. జీవన్ రెడ్డి ఆగ్రహం..
-
మంత్రివర్గంలోకి పోచారం?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గంలోకి మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిని తీసుకొనేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోచారానికి ఉన్న అపార అనుభవం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయనకున్న పట్టును దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవి ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డిని తన కారులో ఎక్కించుకొని స్వయంగా ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన సీఎం... ఆయన్ను పార్టీ పెద్దలకు పరిచయం చేశారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా, స్పీకర్‌గా ఆయన అనుభవాన్ని వారికి వివరించారు. జిల్లాలో ఉన్న ఆయన పలుకుబడి పార్టీ ఉన్నతికి ఉపయోగపడుతుందని వారి దృష్టికి తెచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరూ మంత్రివర్గంలో లేని దృష్ట్యా ఆయనకు అవకాశం ఇస్తే పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని వివరించారు. దీనిపై హైకమాండ్ పెద్దలు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. మరోవైపు జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అంశంతోపాటు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి పార్టీ పెద్దలకు వివరించారు. పీసీసీ రేసులోకి బలరాం, షెట్కార్ పార్టీ పెద్దలతో పీసీసీ అధ్యక్ష ఎంపిక వ్యవహారం సైతం చర్చ కు వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే సామాజికవర్గాల వారీగా పలువురి పేర్లు ప్రచారంలో ఉండగా కొత్తగా ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెటా్కర్ల పేర్లు రేసులోకి వచ్చాయి. పీసీసీ పదవి కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ సీనియర్ నేతలు మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీగౌడ్ పోటీ పడుతుండగా మరో మంత్రి సీతక్క పేరు సైతం ప్రచారంలో ఉంది.అయితే సోమవారం నాటి భేటీలో మాత్రం మహేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు ఎస్టీ కోటాలో బలరాం నాయక్, బీసీ కోటాలో షెటా్కర్ పేర్లు ప్రస్తావనకు వచి్చనట్లు తెలిసింది. అయితే ఇంకా ఎవరి పేరును ఖరారు చేయలేదని తెలుస్తోంది. రాష్ట్ర సీనియర్లతో చర్చించి ఫైనల్ చేయనున్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశంపైనా రేవంత్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. -
నేను కాంగ్రెస్ లో చేరటానికి ప్రధాన కారణం ఇదే
-
పోచారం ఇంట్లోకి దూసుకెళ్లిన బీఆర్ఎస్ నేతలు.. 12 మందిపై కేసు
సాక్షి, హైదరాబాద్: మాజీ స్పీకర్ పోచారం ఇంటికెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదైంది. 12 మంది నేతలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లోకి బీఆర్ఎస్ నాయకులు దూసుకెళ్లడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు పలువురు హంగామా సృష్టించారు.తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. మరోవైపు.. మాజీ స్పీకర్ పోచారం ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోచారం శ్రీనివాస్‌కు నివాసం వద్దకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ శ్రేణులు చేరుకున్నారు.పోచారం కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో వారంతా ధర్నాను దిగారు. ఇక, అంతకుముందు సీఎం రేవంత్ కాన్వాయ్‌ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
పోచారం ఇంటి వద్ద ఉద్రిక్తత.. బాల్క సుమన్‌పై చర్యలు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో, అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ నేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలోనే వారిద్దరూ హస్తం గూటికి చేరారు. ఇక, పోచారం ఇంట్లోనే సీఎం రేవంత్ ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోచారం శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు.ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోలీసుల కళ్లు గప్పి సీక్రెట్‌గా పోచారం ఇంట్లోకి వెళ్లారు. దీంతో, అక్కడ హైటెన్షన్ చోటుచేసుకుంది. కాగా, పోచారం ఇంటి వద్ద సెక్యూరిటీ వైఫల్యంపై సీఎంఓ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ ఉండగానే బీఆర్ఎస్ నేతలు చొచ్చుకురావడంపై సీఎం సెక్యూరిటీ ఆరా తీసింది. భద్రతా లోపంపై నివేదిక ఇవ్వాలని ఏసీపీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్.. పోచారం ఇంటి వద్దకు వెళ్లారు. పోచారం ఇంట్లోకి బాల్క సుమన్ చొరబడిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్క సుమన్‌తో పాటు బీఆర్ఎస్ నేతలపై చర్యలు ఉంటాయన్నారు.కాగా, ఆ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సీఎం రేవంత్ కాన్వాయ్‌ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో రాజకీయంగా రసవత్తరంగా మారింది. -
బీఆర్ఎస్ కి మరో దెబ్బ కాంగ్రెస్ లోకి పోచారం
-
కాంగ్రెస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ: దానం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ విధానాలే బీఆ ఎస్‌ను ముంచాయని మండిపడ్డారు. ఈ మేరకు గాంధీభవన్ వద్ద ఆయన మాట్లాడుతూ.. పోచారం శ్రీనివాస్ రెడ్డే కాదు.. చాలామంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పారు. కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ చేరిక కూడాఉంటుందని తెలిపారు.మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు దానం నాగేందర్. చేరికలపై రెండు మూడు రోజులుగా సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు చర్చించారని పేర్కొన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి , ప్రశాంత్ రెడ్డి , హరీష్ రావు, కేటీఆర్‌లు తప్పా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖాళీ అవుతారని జోస్యం చెప్పారు. అయితే హరీష్ రావుతో కొందరు బీజేపీకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారని, అందుకే బీఆర్ఎస్ పార్టీ అయోమయంలో పడిందని విమర్శించారు.కాగా మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు విషయం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లడమే కారణం. పోచారం ఇంటికి వెళ్లిన సీఎం.. ఆయన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. -
సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి పోచారం.. ఇంటి వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం, ఆయన కాంగ్రెస్ పార్టీ చేరారు.కాగా, తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పోచారం ఇంటికి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ వెళ్లారు. ఈ క్రమంలో తాజా రాజకీయాలపై చర్చించారు. అనంతరం, రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడంతో పోచారం ఓకే చెప్పారు. ఆ తర్వాత పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రైతులకు పోచారం అండగా నిలిచారు. పోచారం సలహాతో రైతులకు మేలు జరుగుతుందని ఆయనను కలిశాను. మాను అండగా నిలవాలని కోరాము. పార్టీలో శ్రీనివాస రెడ్డికి తగిన గౌరవం ఇస్తాం. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని కామెంట్స్ చేశారు.మాజీ స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ‘రైతుల కష్టాల తీరాలని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. కొత్త ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు రైతులకు మద్దతుగా ఉన్నాయి. ఎన్ని సమస్యలు వచ్చినా రేవంత్ రెడ్డి ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నాను. నేను ఆశించే పదవులు ఏమీ లేవు. ఆరు నెలలుగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పాలన కొనసాగిస్తోంది. నా రాజకీయ జీవితం కాంగ్రెస్‌లోనే ప్రారంభమైంది. రాష్ట్ర ప్రగతి, రైతుల కోసం పనిచేస్తాను’ అని అన్నారు. మరోవైపు.. మాజీ స్పీకర్ పోచారం ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోచారం శ్రీనివాస్‌కు నివాసం వద్దకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ శ్రేణులు చేరుకున్నారు. పోచారం కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో వారంతా ధర్నాను దిగారు. ఇక, అంతకుముందు సీఎం రేవంత్ కాన్వాయ్‌ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి
-
కేసీఆర్‌ను దూషించడం పద్ధతి కాదు..
నిజామాబాద్: ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి హుందాతనం ఉండాలని, మాజీ సీఎం కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి దూషించడం పద్ధతి కాదని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడ సమీపంలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో బుధవారం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో 1.8 శాతం తక్కువ ఓట్ల తేడాతో అధికారం కోల్పోయమన్నారు. 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే సరిపోయేదన్నారు. 2028లో ప్రజలు బ్రహ్మండమైన మెజారిటీతో బీఆర్ఎస్ను గెలిపిస్తారని అన్నారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకుడు సిగ్గులేకుండా బాన్సువాడ నియోజకవర్గంలో తిరుగుతున్నారని, ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉండి సొంత ఊరిలో పేదలకు ఒక్క ఇల్లు కట్టించలేదన్నారు. ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయాలన్నారు. చేయకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతు బంధు రూ.15 వేలు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గెలుపును బాన్సువాడ నియోజకవర్గమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. నిజాంసాగర్ నీటి విడుదల విడతల వారీగా జరుగుతుందని, ఎకరం కూడా ఎండిపోకుండా చూస్తానన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీకి సిద్ధం.. పార్టీ ఆదేశిస్తే జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో కీలకమైన నియోజకవర్గం బాన్సువాడ అన్నారు. ప్రతి కార్యకర్తకు తమ కుటుంబం అండగా ఉంటుందన్నారు. నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, మోహన్‌నాయక్, అంజిరెడ్డి, బద్యా నాయక్, నీరజావెంకట్‌రాంరెడ్డి, శ్యామల ఉన్నారు. ఇవి చదవండి: గ్రామపాలనపై.. ప్రత్యేకాధికారులకు సవాల్! -
ముగ్గురూ ముగ్గురే! ఎమ్మెల్యేలుగా తొలిసారి ఎన్నిక..
కామారెడ్డి: జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఒక్క బాన్సువాడలోనే సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మూడు దశాబ్దాల కాలంలో ఒక్కసారి తప్ప ప్రతి ఎన్నికలో విజయం సాధించారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గానూ పనిచేశారు. అన్ని వ్యవస్థల మీద ఆయనకు అవగాహన ఉంది. కామారెడ్డి నుంచి తొలిసారి విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఎల్లారెడ్డి నుంచి గెలిచిన కె.మదన్‌మోహన్‌రావుకు ప్రజాప్రతినిధిగా ఇది తొలి అనుభవం. ఆయన గతంలో రెండు పర్యాయాలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఉన్నత విద్యావంతుడైన మదన్మోహన్రావు అమెరికాలో సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో రాణించారు. పదేళ్లుగా ఇక్కడే ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వివిధ అంశాలపై 20 నిమిషాలపాటు మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలనూ కేస్ స్టడీస్‌గా చూపుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. జుక్కల్‌లో తోట లక్ష్మీకాంతారావు కూడా తొలిసారి విజయం సాధించారు. ఉన్నత విద్యావంతుడైన లక్ష్మీకాంతారావు గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. అలాగే వ్యాపార, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అధికారులతో సమీక్షలు.. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు తొలిసారి విజయం సాధించినప్పటికీ వ్యవస్థల మీద ఉన్న అవగాహనతో ముందుకు సాగుతున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవినీతి రహిత నియోజకవర్గంగా కామారెడ్డిని తీర్చిదిద్దడానికి సహకరించాలని అధికారులను కోరారు. ప్రభుత్వాలు అందించే సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా, అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. మున్సిపల్ సమావేశానికి హాజరై పట్టణాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని కోరారు. అక్రమాలకు తావులేకుండా ముందుకు సాగాలని సూచించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు నియోజకవర్గ కేంద్రంలో అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో పాటు జిల్లా అధికారులందరూ హాజరయ్యారు. నియోజకవర్గం అభివృద్ధిలో ముందు స్థానంలో నిలిచేలా కృషి చేయాలని కోరారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సైతం ఇటీవల కలెక్టరేట్లో అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ.. అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో తప్ప మిగతా రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలోనూ పాల్గొంటున్నారు. అలాగే ఎమ్మెల్యే హోదాలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతూ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇవి చదవండి: జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ‘పొంగులేటి’! -
పోచారం రికార్డు బ్రేక్ విక్టరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పీకర్, బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చరిత్రను తిరగరాశారు. పోచారం తన సమీప అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డిపై విజయం సాధించారు. అయితే తెలుగు రాష్ట్రాల ఎన్నికల చరిత్రలో గౌరవప్రదమైన అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసి అనంతరం సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధించారనే సెంటిమెంట్ ఉండేది. ఆ సెంటిమెంట్‌ను పోచారం విజయం సాధించి తొలిసారి తిరగరాశారు. దీంతో చాలా ఏళ్లుగా ఉన్న స్పీకర్‌గా పని చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవుతారన్న అనవాయితీని గెలిచి బ్రేక్ చేశారు. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు అనంతరం.. సిరికొండ మధుసూధనాచారి 2014 అసెంబ్లీ ఎన్నికలలో భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2014 నుంచి 2018 వరకు తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్‌గా పని చేశారు. ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. 1991 నుంచి పోటీ చేసిన స్పీకర్లలో ఒక్కరు కూడా గెలవలేదు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం స్పీకర్‌గా చేసిన అనంతర ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్
-
చేతకాని దద్దమ్మలు కత్తిపోట్లకు పాల్పడుతున్నారు: కేసీఆర్ ఫైర్
సాక్షి, కామారెడ్డి: అతికష్టం మీద తెలంగాణను సాధించుకున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉప్పెనలా ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చిందని, 15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. మెదడు కరిగించి తెలంగాణను అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. బాన్సువాడలో సోమవారం బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బాన్సువాడలో అన్ని నియోజకవర్గాలకంటే ఎక్కువ అభివృద్ధి జరిగిందన్నారు. పోచారం సారథ్యంలో బాన్సువాడ బంగారువాడలా మారిందని ప్రశంసించారు. బాన్సువాడలో 11 వేల డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించామని తెలిపారు. పెద్ద పెద్ద రాష్ట్రాల్లో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్‌లో ఉందని తెలిపారు. అభివృద్ధికి ఏకైక కొలమానం తలసరి ఆదాయమని చెప్పారు. పదేళ్లు నీతి, నిబద్ధతో పనిచేస్తేనే అది సాధ్యమైందని పేర్కొన్నారు. చేతకాని దద్దమ్మలు కత్తిపోట్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మొండి కత్తి మాకూ దొరకదా అనిప్రశ్నించారు. ప్రజా సేవ చేస్తే దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డి మీద జరిగిన దాడి కాదని.. కేసీఆర్ మీద జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. చదవండి: మెదక్ ఎంపీపై దాడి ఘటనపై గవర్నర్ సీరియస్, డీజీపీకి ఆదేశాలు -
లక్ష్మీపుత్రుడి లక్కెలా ఉందో?
అసెంబ్లీలో స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించినవారు ఓటమి పాలవుతారన్న సెంటిమెంట్ బలంగా ఉంది. దీనిని బలపరుస్తూ గతంలో పనిచేసిన స్పీకర్లు ఓడిన ఉదంతాలున్నాయి. 1999 నుంచి స్పీకర్లుగా పనిచేసిన వారిలో ఇప్పటివరకు ఎవరూ గెలుపును సొంతం చేసుకోలేకపోయారు. అయితే ఈసారి ఆ సెంటిమెంట్‌ను తిరగరాస్తానన్న ధీమాలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. వయసు పైబడుతుండటంతో ఈసారి పోటీ నుంచి తప్పుకొని కుమారుడిని వారసునిగా నిలబెట్టాలని అనుకున్నా సీఎం మాత్రం తాను ఉన్నన్ని రోజులు శీనన్న ఉంటారని పేర్కొనడంతో ఎన్నికల బరిలో ఆయన నిలిచారు. సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని సీఎం కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అని సంబోధిస్తుంటారు. అసెంబ్లీలోనే కాదు బహిరంగ సభల్లోనూ ఆయనను అలాగే గౌరవిస్తారు. పోచారం వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రైతుబంధు పథకం ప్రారంభించారు. రూ. వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, అందుకే శీనన్న లక్ష్మీపుత్రుడు అంటూ సీఎం కేసీఆర్ పలు సందర్భాలలో పేర్కొన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ...: కామారెడ్డి జిల్లా బాన్సువాడ సెగ్మెంట్ నుంచి 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం... 2004 మినహా 1999, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018 ఎన్నికల్లో విజయాలు సొంతం చేసుకున్నారు. 76 ఏళ్ల వయసులోనూ ఆయన నిత్యం జనం మధ్యే తిరుగుతుంటారు. వేకువజామునే లేచి బ్యాటరీ వాహనంలో ఊరంతా కలియ తిరుగుతారు. మున్సిపల్ సిబ్బంది మురికికాలువలు శుభ్రం చేస్తుంటే నిలబడి వారికి సూచనలు ఇస్తారు. ఇంటికి చేరగానే ఊళ్ల నుంచి వచ్చే ప్రజలు, పార్టీ నేతలతో మాట్లాడతారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.10 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని లెక్కలతో సహా చెబుతారు. ఏ నియోజకవర్గంలో లేనివిధంగా బాన్సువాడలో 11 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి లబ్ది దారులకు అందించారు. విద్య, వైద్య రంగంలోనూ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపారు. బాన్సువాడలోని మాతాశిశు ఆస్పత్రి సేవల్లో దేశంలోనే ప్రథమ స్థానం దక్కించుకుంది. సెంటిమెంట్ ఏం చేస్తుందో? స్పీకర్ పదవిలో ఉన్న వారు తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతూ రావడం ఆనవాయితీగా మారింది. కానీ ఈ సెంటిమెంట్‌ను పోచారం అధిగమిస్తారని ఆయన అనుచరులు నమ్ముతున్నారు. నిత్యం జనం మధ్యే ఉంటూ, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న పోచారం చరిత్రను తిరగరాస్తారంటున్నారు. నియోజకవర్గంలో ప్రత్యర్థులు బలంగా లేకపోవడం కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా లేక సెంటిమెంటే పునరావృతం అవుతుందా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. -
ప్రజాధనం లూటీ చేస్తే క్షమించి వదిలేయాలా?
సాక్షి, అమరావతి: ప్రజా ధనం లూటీ చేసిన మాజీ సీఎం చంద్రబాబునాయుడిని క్షమించి వదిలేయాలా అంటూ తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసింది చిన్న తప్పు కాదని తెలిపారు. మంత్రి బొత్స శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అధికారం ఉందని తప్పులు చేస్తే క్షమించరాని నేరమవుతుంది. ఇలాంటి తప్పులు చేసిన వారిని క్షమించి వదిలేయాలని తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పడం విచిత్రంగా ఉంది’ అని బొత్స మండిపడ్డారు. ‘గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వ చర్యలు, న్యాయస్థానం తీర్పు ప్రజలకు తెలిసిన విషయమే. చంద్రబాబు ఒప్పందం రద్దు చేసుకున్న సీమెన్స్ కంపెనీ పేరుతో ఎలాంటి బిల్లులు లేకుండా రూ.371 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. సీమెన్స్‌తో ఎప్పుడు ఒప్పందం చేసుకున్నారో, ఏయే తేదీల్లో డబ్బులు ఆ కంపెనీకి చెల్లించారో చంద్రబాబు చెప్పడంలేదు. ఇంత మొత్తం డబ్బును ఏ కంపెనీలకు చెల్లించారో కూడా వెల్లడించడంలేదు. ఇలాంటి అవినీతిపరుడికి తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం వత్తాసు పలకడం శోచనీయం. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఉద్దేశపూర్వంగా అక్రమాలు చేస్తే చూసీ చూడనట్టు వదిలేయాలనడం దారుణం. ఇలాంటి తప్పు తెలంగాణలో జరిగితే అక్కడి సీఎం కేసీఆర్ చూసీచూడనట్టు వదిలేస్తారా’ అని మంత్రి బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి కేసులో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, ఆధారాలతో సహా నిరూపిస్తామని అన్నారు. చంద్రబాబు ఇలాంటి తప్పులు ఎన్నో చేశారని చెప్పారు. ఆ పత్రికలు సొంత భాష్యం చెబుతున్నాయి ప్రభుత్వంలో ప్రతి ఫైల్‌కు, ప్రతి సంతకానికి ఎంతో విలువ ఉంటుందని, కానీ చంద్రబాబు మాత్రం ప్రభుత్వ ప్రొసీడింగ్స్‌కు, రూల్స్‌కు విరుద్ధంగా సంతకాలు చేసి ప్రజాధనం దారిమళ్లించారని చెప్పారు. సాక్ష్యాత్తు ఈడీ, ఇన్‌కంట్యాక్స్ విభాగాలు దీనిని తేల్చి చెప్పాయన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసినా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అసత్యాలు రాస్తున్నాయన్నారు. చంద్రబాబు ఫైళ్లపై చేసిన సంతకాలు, కంపెనీ పేర్లు లేకుండా నిధులు విడుదల చేసిన ఆదేశాలు స్పష్టంగా కనిపిస్తున్నా ఓ వర్గం మీడియా మాత్రం బాబును భుజానకెత్తుకుని చట్టాలకు, రూల్స్‌కు అతీతంగా సొంత భాష్యం చెప్పడం విచారకరమన్నారు. నిధుల మళ్లింపు రూల్స్ విరుద్ధంగా చేశారా లేదా అని చంద్రబాబునే అడిగితే సమాధానం వస్తుందన్నారు. రూల్స్ పాటించే చేశానని చెప్పే ధైర్యం ఆయన చేయరని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు గత ప్రభుత్వంలో ఎలా పనిచేశాయి, ప్రస్తుతం ఎలా పనిచేస్తున్నాయో స్వయంగా పరిశీలించి చెప్పాలని ఆయన అన్నారు. అక్రమార్కుడు చంద్రబాబుకు తెలంగాణ స్పీకర్ మద్దతెలా ఇస్తారు? ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పెంటపాడు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మద్దతివ్వడంపై ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన శనివారం పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడులో విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తెలంగాణ స్పీకర్ శ్రీనివాసరెడ్డి అక్రమాలకు పాల్పడిన చంద్రబాబుకు మద్దతివ్వడం శోచనీయమన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మాట్లాడవచ్చు కానీ, వ్యవస్థలను తాకట్టు పెట్టేలా వ్యవహరించకూడదని తెలిపారు. స్కిల్ కుంభకోణంలో పాత్ర ఉన్న వారందరినీ నిందితులుగా చేర్చే విషయం సీఐడీ చూసుకుంటుందన్నారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబు పాత్ర లేదని ఎలా చెబుతారని ప్రశి్నంచారు. -
స్పీకర్ డ్రమ్స్..లంబాడి సోదరుల డ్యాన్స్
-
బిల్లులు వెనక్కి పంపుతారా?
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను పునఃపరిశీలన కోసం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం రాత్రి సభలో అనుమతించారు. ఈ సందర్భంగా గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ బిల్లులు ఆపడంలో రాజకీయ కోణం దాగి ఉందని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేయగా.. గవర్నర్ బిల్లులు పెండింగ్‌లో పెట్టడం, తిప్పి పంపడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ముఖ్యం: హరీశ్‌రావు ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్దీకరణ)బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీల్లో సిబ్బంది కొరత రాకుండా, ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల వయోపరిమితి 65 ఏళ్లకు పెంచుతూ గతంలోనే చట్టాన్ని తెచ్చాం. ఇందులో టెక్నికల్ అంశాలను పరిగణనలోకి తీసుకుని సవరణ తెస్తూ బిల్లు తెచ్చాం. అయితే, రిటైర్ అయి న వాళ్లను తీసుకోవడంతో ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడుతున్నట్టుగా గవర్నర్ భావించినట్టు తెలిసింది. వాస్తవానికి అలాంటి అంశాలకు తావులేదు.. అదనంగా ప్రభుత్వంపై భారం లేద’న్నారు. రాజకీయ కోణం తప్ప అభ్యంతరాలకు తావులేదు..: మంత్రి కేటీఆర్ పురపాలక శాసనాల చట్టం (సవరణ) బిల్లును ప్రవేశపెడుతూ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యం పెంచేలా కో–ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంచాం. ఇందుకు గవర్నర్ అభ్యంతరాలను ప్రస్తావించారు. కో–ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంచినప్పుడు దామాషా ప్రకారం మైనార్టీల సంఖ్య పెరుగుతుంది. ఇందులో మైనార్టీల కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. కేవలం అవి అపోహలే. రాజకీయ కోణం తప్ప గవర్నర్ లేవనెత్తిన అంశాల్లో ఏమీ అభ్యంతరాలు లేనందున తిరిగి బిల్లును పాస్ చేయాలని కోరుతున్నాను’అని అన్నారు. -
గవర్నర్ తిరస్కరించిన బిల్లులు మళ్లీ పాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ రెండో రోజు సమావేశాల్లో కీలకమైన 4 బిల్లులకు తిరిగి ఆమోదం లభించింది. అసెంబ్లీ గతంలోనే పురపాలక శాసనాల చట్టం (సవరణ) బిల్లు, ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ)బిల్లు, రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాల (స్థాపన, క్రమబద్దీకరణ) సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట (సవరణ) బిల్లులను పాస్ చేసింది. ప్రభుత్వం వాటిని గవర్నర్ తమిళిసైకి పంపించినా ఆమోదముద్ర వేయలేదు. ఆయా బిల్లుల్లోని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పిపంపేశారు. ఈ క్రమంలో ఆ నాలుగు బిల్లులను పునః పరిశీలించాలంటూ సంబంధిత మంత్రులు శుక్రవారం రాత్రి శాసనసభలో ప్రతిపాదించగా ఆమోదం లభించింది. శాసనసభ రెండోసారి పాస్ చేసి పంపుతున్న నేపథ్యంలో ఈ బిల్లులను గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం నుంచి ప్రశ్నోత్తరాలు, లఘు చర్చలతో శుక్రవారం ఉదయం 10 గంటలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన శాసనసభ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సాంకేతిక సేవల సంస్థ, ఉద్యాన అభివృద్ధి సంస్థ, విద్యుత్ సరఫరా సంస్థ, ఉపాధ్యాయుల బదిలీ ల నియమావళి, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ, అటవీ అభివృద్ధి సంస్థల నివేదికలను సంబంధిత మంత్రులు సభకు సమర్పించారు. తర్వాత ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఎజెండాలో పది ప్రశ్నలు ఉన్నప్పటికీ సమయాభావం కారణంగా.. ఐటీ ఎగుమతులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలు, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, ఆరోగ్య లక్ష్మి పథకం తదితర అంశాలపైనే మంత్రులు సమాధానాలిచ్చారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు కె.విజయరామారావు (ఖైరతాబాద్), కొమిరెడ్డి రాములు (మెట్పల్లి), కొత్తకోట దయాకర్‌రెడ్డి (మక్తల్), సోలిపేట రామచంద్రారెడ్డి, (దొమ్మాట), చిల్కూరి రామచంద్రారెడ్డి (ఆదిలాబాద్) మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ఇటీవల సంభవించిన వరదలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు ఇచ్చిన వాయిదా తీ ర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. జీరో అవర్ తర్వాత మధ్యాహ్నం 12.05కి స్పీకర్ టీబ్రేక్ విరా మం ఇవ్వగా.. సభ తిరిగి 12.50కి సమావేశమైంది. వరదలు, విద్య, వైద్యారోగ్యంపై లఘు చర్చ రెండో రోజు సమావేశం ఎజెండాలో భాగంగా రెండు అంశాలపై లఘు చర్చ జరిగింది. భారీ వర్షాలు, వరదల నష్టం, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై జరిగిన చర్చకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే తాము లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం స్పందించలేదంటూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తర్వాత రాష్ట్రంలో విద్య, వైద్యారోగ్య రంగాలపై చర్చను ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ప్రా రంభించారు. దీనిపై రాత్రి 8 వరకు సభ్యుల ప్రసంగాలు కొనసాగాయి. తర్వాత మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్‌రావు ఆయా అంశాలపై సమాధానాలిచ్చారు. రాత్రి 10.20 వరకు సమావేశం కొనసాగగా.. కీలక బిల్లులను ఆమోదించాక శనివారం ఉదయం 10 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. గవర్నర్ తిరస్కరించడంతో.. అసెంబ్లీ సమావేశాల్లో ఎనిమిది బిల్లులను ప్రవేశపెడతామని బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తెలిపింది. అందులో గవర్నర్ తిప్పిపంపిన నాలుగు బిల్లులను శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. పురపాలక బిల్లును మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ) బిల్లును మంత్రి హరీశ్‌రావు, ప్రైవేటు వర్సిటీల బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ బిల్లును ఎర్రబెల్లి దయాకర్‌రావు సభకు సమర్పించారు. వాటిని పునః పరిశీలించి ఆమోదించాలని కోరారు. ఈ బిల్లులను తిరస్కరిస్తూ గతంలో గవర్నర్ కార్యాలయం నుంచి మూడు సందేశాలు అందాయని ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. వీటిపై సభ్యుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాక.. బిల్లులను సభ ఆమోదించినట్టు ప్రకటించారు. ఇక శనివారం సభలో ‘తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ బిల్లు, ఫ్యాక్టరీల చట్టం సవరణ బిల్లు, రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ (సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. సభ్యులు సభలో ఉండాలి: కేటీఆర్ శాసనసభ సమావేశాలను 30 రోజులు జరపాలని బీజేపీ, 20 రోజులు జరపాలని కాంగ్రెస్ కోరాయని.. కానీ చర్చల సమయంలో ఆ పారీ్టల సభ్యులు సభలో ఉండటం లేదని మంత్రి కేటీఆర్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సభలోకి రాగా.. ‘‘శ్రీధర్ బాబుగారికి వెల్కమ్. శాసన సభ్యులు కచ్చితంగా సభలో ఉండేలా చూడాలి. సభలో ఉండి సమాధానాలు వినాలి. బయటికి వెళ్లి అటూ ఇటూ తిరగడం, మీడియాతో మాట్లాడడం సరికాదు’’అని కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ.. తనతోపాటు రఘునందన్‌రావు బీజేపీ తరఫున ఉన్నారని పేర్కొన్నారు. దీంతో బీజేపీ నుంచి సస్పెండైన మీరు ఆ పార్టీ ఎమ్మెల్యే కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక జీరో అవర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేవనెత్తిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మీరు సంగారెడ్డి వరకు మెట్రో కోరితే.. మేం ఇస్నాపూర్ వరకు మంజూరు చేసినా అభినందించడం లేదు. సంగారెడ్డి, ములుగు, పెద్దపల్లిలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసినా.. ప్రభుత్వాన్ని అభినందించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబులకు మనసు రావడం లేదు..’’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశంలో ముందుగా కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు. సుమారు నాలుగురోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశముంది. బీఏసీ భేటీలో విపక్షాల నుంచి వచ్చే సూచనలు, ప్రతిపాదనల ఆధారంగా అవసరమైతే సమావేశాల తేదీలను పొడిగించొచ్చు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగే మండలి సమావేశాల్లో తొలిరోజు రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో మండలి నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు. చివరి సమావేశాలని... తెలంగాణ రెండో శాసనసభకు ఇవి చివరి సమావేశాలుగా భావిస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు అసెంబ్లీ వేదికగా తమ ఎజెండా వినిపించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఉచితవిద్యుత్, ధరణి వంటి అంశాలపై స్వల్పకాలిక చర్చ ద్వారా విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని అధికార బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రశ్నోత్తరాలతో పాటు ఇతర చర్చల సందర్భంగా ప్రస్తావించేలా అధికార పక్షం కసరత్తు చేస్తోంది. మరోవైపు విపక్ష పార్టీలు కూడా డబుల్ బెడ్రూమ్లు, ధరణి లోపాలు, ఇటీవల వరదల మూలంగా సంభవించిన నష్టం తదితరాలపై చర్చకు పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచి్చన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. 4 కీలక బిల్లులు ప్రస్తుత సమావేశంలో 4 కీలక బిల్లులు ఉభయ సభల ముందుకు రానున్నాయి. ఇందులో గతంలో అసెంబ్లీ ఆమోదించినా, గవర్నర్ తిరస్కరించిన మూడు బిల్లులు కూడా ఉన్నాయి. వీటిని ఉభయసభలు మరోమారు చర్చించి ఆమోదిస్తాయి. 1. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బిల్లు రూపంలో సభలో చర్చించి ఆమోదిస్తారు. 2. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (రెగ్యు లేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్‌అన్యూయేషన్) చట్టసవరణ బిల్లు–2022 3. తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టసవరణ బిల్లు–2022 4. తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు–2022 -
ప్రతీ అంశంపై సమగ్ర చర్చ జరగాలి: స్పీకర్ పోచారం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో సభ హుందాతనం, ఔన్నత్యం కాపాడుకుంటూ ప్రతీఅంశంపై సమగ్రంగా చర్చ జరగాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మండలి చీఫ్‌విప్ భానుప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని పోచారం అన్నారు. సమావేశాలు జరిగే రోజుల్లో అధికారులు అందుబాటులో ఉండటంతో పాటు ప్రతీశాఖ తరపున ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రొటోకాల్ వివాదాలు : మండలి చైర్మన్ గుత్తా జిల్లాల్లో ప్రొటోకాల్ అంశంలో ఇబ్బందులు వస్తున్నాయని, వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. ఉభయసభలు సజావుగా నడిచేందుకు అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. గతంలో అసెంబ్లీ సగటున రోజుకు రెండుగంటల చొప్పున జరగ్గా, ప్రస్తుతం ఎనిమిదిగంటలపాటు జరుగుతోందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నోడల్అధికారి శాఖల వారీగా సమాచారం కోసం సమన్వయం చేసుకునేందుకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని సూచించారు. స్పీకర్, మండలి చైర్మన్ సూచనలు పాటిస్తూ కొత్త ప్రొటోకాల్ బుక్ డ్రాఫ్ట్ తయారు చేయాల్సిందిగా అసెంబ్లీ కార్యదర్శికి సూచించారు. శాసనసభ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు లిఫ్ట్‌లను పోచారం శ్రీనివాసరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు ప్రారంభించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఆర్థిక, మున్సిపల్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, అరి్వంద్‌కుమార్, డీజీపీ అంజనీకుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ తదితరులు పాల్గొన్నారు. అక్బరుద్దీన్‌తో మంత్రి వేముల భేటీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలోని ఎంఐఎం కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీతో భేటీ అయ్యారు. గంటన్నరపాటు ఇద్దరి మధ్య సమావేశం కొనసాగింది. ప్రస్తుతం అసెంబ్లీలో ఎంఐఎం ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. -
చంద్రబాబు హయాంలో నీళ్లకోసం భిక్షమెత్తుకోవాల్సి వచ్చేది
బాల్కొండ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పాలనలో తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రం శివారులో వరద కాలువ జీరో పాయింట్ వద్ద ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నీటిని శ్రీరాంసాగర్‌లోకి విడుదల చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం మాట్లాడుతూ, నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నిజామాబాద్ జిల్లాకు నీటి విడుదల చేపట్టాలంటే చంద్రబాబు ఇంటి వద్ద భిక్ష మెత్తుకునే పరిస్థితి ఉండేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ నాయకత్వంలో సాగు నీటి కష్టాలు తీరాయన్నారు. పునరుజ్జీవన పథకంతో ఆయకట్టు కింద అదనంగా 50 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతోందన్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నీళ్లను శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి తరలించడం అపూర్వ ఘట్టమ న్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంతో భూములను కోల్పోయిన రైతులకు, పునరావాస గ్రామాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీళ్లు అంది ప్రతిఫలం దక్కుతోందన్నారు. రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, రేఖా నాయక్, విఠల్‌రెడ్డి, మహిళా సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత, జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీలోకి కాళేశ్వరం నీళ్లు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా ఎదురెక్కాయి. శుక్రవారం శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మూడవ పంపు వద్ద బటన్ నొక్కి మోటార్లను ప్రారంభించారు. నాలుగు మోటార్ల ద్వారా నీరు ఎస్సారెస్పీలోకి ఉరకలేసింది. అనంతరం కాళేశ్వరం నీళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాజెక్ట్ నీటితో కాళేశ్వరం నీళ్లు కలుస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. -
సోదమ్మ చెప్పిన మాటలకు అవాకైనా పోచారం శ్రీనివాస్
-
బిల్లులు రాక ఇల్లు తాకట్టుకు సిద్ధమయ్యా: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, కామారెడ్డి (బాన్సువాడ/నస్రూల్లాబాద్): డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు రావడం కొంత ఆలస్యం కావడంతో.. ఒకానొక సందర్భంలో సొంతింటిని తాకట్టు పెట్టి బిల్లులు చెల్లించాలనుకున్నానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కానీ కొందరు తనపై విశ్వాసంతో వారించడంతో ఆ నిర్ణయం ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్ మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ సంబరాలను నిర్వహించారు. పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో సొంత స్థలాలున్న వారికి 7 వేల ఇళ్లు, ప్రభుత్వపరంగా 4 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. కాగా, ఓ లబ్ధిదారుడు కలలో కూడా ఇంతమంచి ఇంట్లో ఉంటానని ఊహించలేదని.. స్పీకర్ సార్ తనకు దేవుడితో సమానమని కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో స్పీకర్ కూడా కంటతడి పెట్టారు. చదవండి: బీజేపీ మాస్టర్ ప్లాన్.. ప్రచార ‘సారథి’ ఈటెల!.. ప్రకటన ఎప్పుడంటే? -
ఈసారికి మార్పులేదు.. పోచారంకు గట్టిగా చేప్పేసిన కేసీఆర్
-
పోచారంకు సీఎం కేసీఆర్ గట్టిగా చెప్పారా? అందుకే నిర్ణయం మార్చుకున్నారా?
స్పీకర్ గా పని చేసిన వారు ఓడిపోతారనే సాంప్రదాయానికి ప్రస్తుత సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా చెక్ పెట్టాలని చూస్తున్నారు సీఎం కేసీఆర్. ఇద్దరు తనయులలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఇప్పుడు తన పంథాను మార్చుకున్నారా అంటే ఔననే చెప్పాలి. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. జోరుగా రిటైర్మెంట్పై చర్చ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయరని రిటైర్మెంట్ ప్రకటిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఒకవేళ కచ్చితంగా పోటీ చేయాల్సి వస్తే జహీరాబాద్ పార్లమెంట్ కు పోటీ చేస్తారని, తనయులకు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తారని చర్చ జోరుగా సాగింది. ఆ ఊహాగానాలకు తెర దించుతూ రాబోయే ఎన్నికల్లో ఆరో సారి పోటీ చేయడం ఖాయమని తాజాగా ఆయన చేసిన ప్రకటన పుకార్లకు ఫుల్ స్టాఫ్ పెట్టినట్లయింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో ఈ దఫా స్పీకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయరనే ప్రచారం జోరుగా సాగింది. అందుకు అనుగుణంగా కామారెడ్డి జిల్లాలోని పాత రెండు మండలాల బాధ్యతలను ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డికి, నిజామాబాద్ జిల్లాలోని పాత రెండు మండలాలను తనయుడు సురేందర్ రెడ్డికి అప్పగించారు. రెండు జిల్లాల్లో విస్తరించిన నియోజకవర్గ బాధ్యతలను వారే చూసుకునేవారు. చదవండి:వరంగల్: చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు! ఈ నియోజక వర్గంలో సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గిరిజన లంబాడా తండాలు కూడా బాగా ఉంటాయి. రెండు జిల్లాల పరిధిలో నియోజక వర్గం ఉంటుంది. అయితే సీనియర్ ఎమ్మెల్యే గా మంత్రిగా స్పీకర్ గా బాధ్యతలు చేపట్టి ఎదురులేని లీడర్ గా ఎదిగారు పోచారం. సభాపతిగా హైదరాబాద్ కు పరిమితమవడం, వయస్సు మీద పడడంతో కొంత ఇబ్బంది పడి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని చర్చ జరిగింది. 2018లోనే తనకు టికెట్ వద్దని కోరినప్పటికీ కేసీఆర్ వినకుండా పోచారానికే టికెట్ ఇవ్వడంతో తప్పనిసరిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం ఆ తర్వాత ఆయనకు సభాపతి బాధ్యతలను అప్పగించారు. సభాపతి కావడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నా.. పోచారం ఇటీవల కాలంలో మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో, ఆత్మీయ సమ్మేళనాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సర్వేల్లో ఏం తేలింది? సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో చేసిన సర్వేల్లో నాలుగు నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని సర్వే రిపోర్టులు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే క్యాండేట్ మారితే ఓడిపోయే నియోజకవర్గాల్లో బాన్సువాడ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఈసారి కూడా పోచారంనే పోటీ చేయాలని కోరినట్లు తెలిసింది. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనయుల భవిష్యత్తు గురించి బాధ్యత తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి పోటీకి సిద్దమయ్యారు. సై అనక తప్పలేదా? బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ క్యాండిడెట్ గా ప్రకటించిన మల్యాద్రి రెడ్డికి సెటిలర్ల మద్దతు దొరికిందని తెలుస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ పోచారంతోనే పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారనే వాదనలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేసినా వారి పోటీ వల్ల బీఆర్ఎస్ కే బలం చేకూరుతుందనే వాదనలు లేకపోలేవు. బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండటం పోచారం కు ప్లస్ పాయింట్. పైగా సమస్యలను ఓపిగ్గా విని పరిష్కరిస్తారని, నియోజకవర్గంలో పనులు కూడా చేస్తారని పోచారానికి మంచి పేరుంది. కానీ, ఈసారి కుమారులు పోటీ చేస్తే జనాల నుంచి మద్దతు పూర్తి స్థాయిలో దొరకదనే విషయం సర్వేలో తేలినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ దఫా గెలిచి తరవాత వారసత్వానికి బాధ్యతలు అప్పగించే ఆలోచనతో పోటీకి సై అనాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. చదవండి:కేసీఆర్ సర్కార్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం -
స్పీకర్ పక్కనుండగానే నిద్ర పోతున్నాడు ఈ ఆఫీసర్
-
కాళేశ్వరంతో సస్యశ్యామలం...
సాక్షి, కామారెడ్డి: ‘ఉమ్మడి రాష్ట్రంలో నిజాంసాగర్ ఆయకట్టు కోసం సింగూరు జలాలు వదలాలంటూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఎన్నో ఆందోళనలు జరిగేవి. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు రోజుల తరబడి దీక్షలు చేస్తేగానీ నీళ్లు వదిలే పరిస్థితి ఉండేది కాదు. ఆ దీక్షలు చూశా. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సింగూరు సమస్య కూడా ఒక కారణమే. కానీ ఇప్పుడు ఏడాది పొడవునా నిజాంసాగర్ నిండు కుండనే. నిరంతరం నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇది సాధ్యమైంది. రాష్ట్రం సాధించుకున్నాక కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్‌కు నీటిని తెచ్చుకుంటున్నాం..’అని సీఎం చంద్రశేఖర్‌రావు చెప్పారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ (తిమ్మాపూర్)లోని తెలంగాణ తిరుమల దేవస్థానం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన కల్యాణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సీఎం తన సతీమణి శోభతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలు, భక్తులు అందించిన రెండు కిలోల స్వర్ణకిరీటాన్ని స్వామివారికి ముఖ్యమంత్రి దంపతులు సమర్పించారు. అనంతరం స్పీకర్ అధ్యక్షతన అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. నాడు పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు.. ‘తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నపుడు మంజీర నదిపై దేవునూరు వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించాలని తలపెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక దాని సామర్థ్యాన్ని 30 టీఎంసీలకు కుదించి సింగూరు ప్రాజెక్టును కట్టారు. నాడు మెదక్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న సింగూరు ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి ఈ ప్రాజెక్టుతో తమకే ఎక్కువ లాభం జరుగుతుందనే ఉద్దేశంతో నిజామాబాద్ ప్రజలు ఎక్కువగా తరలివచ్చారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు సింగూరు నుంచి హైదరాబాద్‌కు మంచినీళ్లు అందించే పేరుతో నిజామాబాద్‌లో పంటలు ఎండుతున్నా సాగునీరు అందించలేదు. సింగూరు నీటి కోసం ఎమ్మెల్యేలు యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. పంటలను కాపాడుకునేందుకు రోజుల తరబడి దీక్షలు చేసేవారు. సింగూరు మీదనే ఆధారపడిన ఘనపూర్ ఆనకట్ట ఆయకట్టుకు కూడా నీళ్లివ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇలాంటి సమస్యలను చూసి చాలామంది పెద్దలతో చర్చించినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ముఖ్యమంత్రులతో మాట్లాడినా పట్టించుకోలేదు. పైగా తృణీకార భావంతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేపట్టడానికి నన్ను ప్రేరేపించిన ప్రధాన అంశాల్లో సింగూరు సమస్య ఒకటి..’అని సీఎం చెప్పారు. శ్రీనివాస్‌రెడ్డి ఎన్నో దీక్షలు చేశారు.. ‘సింగూరు నీళ్ల కోసం పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నోసార్లు దీక్షలు చేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అప్పట్లో బోధన్ సబ్ కలెక్టర్‌గా ఉన్నారు. ఆయన బాన్సువాడ మీదుగా వెళ్తుంటే బతికున్నపుడు మంచినీళ్లు ఇచ్చి, గంజి పోసైనా సరే బతకనియ్యండి గానీ, చచ్చిపోయాక బిర్యానీ పెట్టినా లాభం లేదు అని పోచారం చెప్పారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నాతో కలిసి ఉద్యమంలోకి వచ్చాక, ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళుతుంటే రోడ్డు మీద కలిసిన లంబాడా బిడ్డలు పోచారం సార్ గెలుస్తాడని ముందే చెప్పారు. పోచారం అంటే ఈ ప్రాంత ప్రజలకు అంత అభిమానం. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు ఇక్కడి మంచి చెడులు తెలిసిన వ్యక్తిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి నియోజక వర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఈ వయసులో హోదాను సైతం పక్కనబెట్టి నియోజకవర్గంలో చిన్న పిల్లవాడిలా తిరుగుతూ ప్రజల కష్ట సుఖాల్లో భాగమవుతున్నారు. బాన్సువాడ మెటర్నిటీ ఆస్పత్రికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందంటే దానిపై పోచారం పర్యవేక్షణ ఎంత ఉందో అర్థమవుతోంది..’అని కేసీఆర్ అన్నారు. ఈ ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుకున్నా.. బాన్సువాడ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందంటూ.. తన ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి నియోజకవర్గానికి రూ.50 కోట్లు, ఆలయానికి రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన మిత్రులతో కలిసి ఈ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేశారంటూ అభినందించారు. స్వామి కరుణ, దయ యావత్ తెలంగాణ ప్రజల మీద ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. పచ్చని పంటలతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా వర్ధిల్లాలని వేడుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, సురేశ్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేను కూడా ముసలోణ్ణి అవుతున్నా.. ‘నేను కూడా ముసలోణ్ణి అవుతున్నా. 69 ఏళ్లు వచ్చినయి. నా కన్నా వయస్సులో పెద్దవాడైనా నేనున్నన్ని రోజులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ ప్రజలకు సేవ చేస్తాడు. ఆయన మాటే బ్రహ్మాస్త్రం. శ్రీనివాస్‌రెడ్డి ఫోన్ చేస్తే చీఫ్ సెక్రెటరీ అయినా, సీఎం అయినా మాట్లాడతారు. ఏ పని అయినా అవుతది..’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. బడ్జెట్‌పై చర్చ
అప్డేట్స్ మూడు లక్షల కోట్ల బడ్జెట్లో రూ. 3 వేలు మెస్ చార్జీలు ఇవ్వలేమా? ►తెలంగాణ వ్యాప్తంగా యూనివర్శిటిలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు కనీసం మూడు వేల మెస్ బిల్లు ఇవ్వలేమా అని ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మూడు లక్షల కోట్ల బడ్జెట్లో మూడు వేలు విద్యార్థుల మెస్ చార్జీల కింద ఇవ్వలేకపోవడం దురదృష్టకరమన్నారు. ►బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ భారీగా ఉందని, అయితే ఈ బడ్జెట్లో తనకు పలు సందేహాలు ఉన్నాయన్నారు. ఆదాయ అంచనాలు వాస్తవ దూరంగా ఉన్నాయని భట్టి పేర్కొన్నారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయ లెక్కలను పరిశీలిస్తే, గతేడాది కన్న ఈ ఏడాది రూ. 40 వేల కోట్లు ఎక్కువగా చూపించామన్నారు. ►ఈ రోజు సెషన్స్‌లో భాగంగా అసెంబ్లీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసెంబ్లీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా కంటి వెలుగు టెస్టులను స్పీకర్ పోచారంతో పాటు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరు చేయించుకున్నారు. ►బుధవారం నాటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. -
బడ్జెట్ సమావేశాలు: ఈసారి 20 అంశాలతో నిలదీసేందుకు కాంగ్రెస్ సమాయత్తం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో 20 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈనెల 6న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం జరిగే చర్చలో భాగంగా ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న అంశాలను ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. రైతులకు రుణమాఫీ అమలుతోపాటు ఉద్యోగులకు సంబంధించిన 317 జీవో, ప్రభుత్వాసుపత్రుల్లో బాలింతల మరణాలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్, ధరణి పోర్టల్ కారణంగా రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలను లేవనెత్తాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. పార్టీ పక్షాన 20 అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ ఇవ్వకుండా చులకన చేస్తున్నారని ఈ సందర్భంగా భట్టి ప్రస్తావించినట్టు సమాచారం. దీనిపై అధికారులకు తగిన ఆదేశాలివ్వాలని స్పీకర్‌ను కోరినట్టు సీఎల్పీ వర్గాలు చెప్పాయి. కాంగ్రెస్ నిర్ణయించిన 20 అంశాలివే: ►317 జీవో రద్దు రైతు రుణమాఫీ.. బ్యాంకురుణాలు, పంటలకు మద్దతు ధర ►రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు ►మలక్‌పేట ప్రభుత్వాసుపత్రిలో బాలింతల మరణాలు ►రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్ దందా, కిడ్నాప్‌లు ►ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల్లోని అవకతవకలు, ఫీజు రీయింబర్స్మెంట్ ►గ్యాస్, పెట్రోల్, డీజిల్‌పై పన్నుల తగ్గింపు u పోడు భూములపై గిరిజనులకు హక్కులు u సర్పంచ్ల సమస్యలు, గ్రామపంచాయతీల నిధుల దారి మళ్లింపు ►కృష్ణా, గోదావరి నదుల్లో నీటి వాటా, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు u విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ విషయంలో ప్రొటోకాల్ పాటించకపోవడం u రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు, ఇతర రాష్ట్రాల కేడర్ అధికారులు తెలంగాణలో పనిచేయడం u డబుల్ బెడ్రూం ఇళ్లు u గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ►పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు u రాష్ట్ర అప్పులు u కంట్రిబ్యూటరీ పింఛన్ విధానం రద్దు, పాత పింఛన్ అమలు, పీఆర్సీ ప్రకటన u బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ►వైన్‌షాపులు, బెల్టుషాప్‌లు, బార్లు, పబ్బులతో సమస్యలు u ధరణి కారణంగా రైతుల ఆత్మహత్యలు -
Telangana: గవర్నర్‌కు సాదర స్వాగతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు వచ్చిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు శుక్రవారం సాదర స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉదయం 11.55 గంటలకు అసెంబ్లీకి చేరుకున్నారు. తర్వాత 12.05 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. తర్వాత శాసనసభ హాల్ వరకు గవర్నర్‌ను సీఎం, స్పీకర్, చైర్మన్ స్వయంగా తోడ్కొని వచ్చారు. జాతీయ గీతాలాపన అనంతరం 12.12 గంటలకు ప్రారంభమైన గవర్నర్ ప్రసంగం.. 12.44 గంటల వరకు 32 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సమయంలో మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ప్రసంగం ముగిశాక గవర్నర్ సభ్యుల స్థానాల వద్దకు వచ్చి అభివాదం చేశారు. అనంతరం గవర్నర్‌కు శాసనసభ ప్రధాన ద్వారం వద్ద సీఎం, మండలి చైర్మన్, స్పీకర్ తదితరులు వీడ్కోలు పలికారు. యధాతథంగా.. ప్రభుత్వం, గవర్నర్ మధ్య కొంతకాలంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అని ప్రజాకవి కాళోజీ కవితా పంక్తులతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్.. ‘కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసిపాపల నిదుర కనులతో ముసిరిన భవితవ్యం ఎంతో..’అని స్వాతంత్య్ర సమరయోధుడు, కవి దాశరథి కృష్ణమాచార్య పంక్తులతో ముగింపునకు వచ్చారు. చివరిలో ‘జయ జయహే తెలంగాణ.. జై తెలంగాణ.. జై హింద్’ నినాదాలతో ముగించారు. ప్రసంగంలో వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరిస్తూ, ‘తెలంగాణ మోడల్’కు పెద్దపీట వేశారు. మొత్తంగా ప్రభుత్వం నుంచి అందిన ప్రసంగ పాఠాన్ని చదివి ఎక్కడా వివాదానికి తావులేకుండా ముగించారు. ఎక్కడా విమర్శలు లేకుండా.. గవర్నర్ ప్రసంగ పాఠంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శ లేకపోవడం గమనార్హం. గవర్నర్ ప్రసంగాన్ని రాజకీయ విమర్శలకు వేదికలా కాకుండా కేవలం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాలకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు కనిపించింది. ప్రసంగంలో అనేక మార్లు గవర్నర్ ‘మై గవర్నమెంట్ (నా ప్రభుత్వం)’అనే పదాన్ని వాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలు, పథకాల ఫలితాలను వివరించారు. ఇటీవల ప్రభుత్వ పనితీరుపై రాజ్‌భవన్ వేదికగా విమర్శలు సంధించిన గవర్నర్ నోట ప్రభుత్వ పనితీరును సానుకూలంగా ఆవిష్కరించే రీతిలో ప్రసంగ పాఠం సాగడం గమనార్హం. సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే గవర్నర్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. -
బాన్సువాడలో ‘డబుల్’ ధమాకా !
సాక్షి, కామారెడ్డి: బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చొరవతో నిరుపేదల సొంతింటి కల నెరవేరింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ పరిధిలోని తాడ్కోల్‌లో నిర్మించిన 504 డబుల్ బెడ్రూం ఇళ్లను శనివారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చిన తరువాత స్పీకర్ పోచారం నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఏ నియోజక వర్గంలో లేని విధంగా బాన్సువాడకు 11 వేల ఇళ్లను మంజూరు చేయించారు. ఇప్పటివరకు ఏడు వేల పైచిలుకు ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాగా పట్టణ పరిధిలోని తాడ్కోల్ శివారులో మొదట ఐదు వందల ఇళ్లు నిర్మించారు. వాటిని ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదే కాంపౌండ్‌లో నిర్మించిన 504 ఇళ్లను శనివారం లబ్ధిదారులకు అందించారు. కేసీఆర్ నగర్‌గా ఈ కాంపౌండ్‌కు నామకరణం చేశారు. అక్కడే రూ.90 లక్షలతో కల్యాణ వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాలనీలో షాపింగ్ కోసం కాంప్లెక్సు నిర్మించారు. కాలనీలోని ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు పోచారం పేర్కొన్నారు. కాగా తమకూ ఇళ్లు కావాలంటూ మరికొందరు అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. -
చావనైనా చస్తాం... కేసీఆర్‌ను వదిలివెళ్లం...
సాక్షి, హైదరాబాద్: చావనైనా చస్తాం, కానీ సీఎం కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్లబోమని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పార్టీ మారే శాసనసభ్యుల నియోజకవర్గాలు అంటూ బాన్సువాడ పేరు మీడియాలో వచ్చిందని, కానీ బాన్సువాడ శాసనసభ్యుడిగానే తన వైఖరిని స్పష్టం చేస్తున్నానని అన్నారు. మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 66వ వర్థంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి స్పీకర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ శాసనసభ్యులు ఎవరు కూడా డబ్బులకు అమ్మడుపోయేవారు కాదు. అది ఊహాజనితం మాత్రమే, ఎవరైనా ఆశపడితే చేతులు కాల్చుకుని భంగపడతారు’ అని వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బలపరచడంతోపాటు సీఎంగా ఆయన తీసుకునే నిర్ణయాలను అమలు చేస్తాం. ప్రభుత్వాలను కూల్చడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలి’అని అన్నారు. అంబేడ్కర్ ఆశయాలను నూరు శాతం అమలు చేయడంలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని స్పీకర్ పేర్కొన్నారు. ఆరోపణలు చేసేవారు కాకుండా ఆలోచించేవారే పారిపాలన చేయగలరని పేర్కొన్నారు. పాదయాత్రల పేరిట విమర్శలు, అసత్యాలు ప్రచారం చేయకుండా ప్రజలకు ఏం చేస్తారో నాయకులు చెప్పాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఎంఎస్ ప్రభాకర్‌రావు, దండె విఠల్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు పాల్గొన్నారు. -
కరీంనగర్ జిల్లాలో ఘనంగా కళోత్సవాలు (ఫొటోలు)
-
బాన్సువాడ బరిలో స్పీకర్ తనయుడు!.. పోచారం కీలక వ్యాఖ్యలు
సాక్షి, కామారెడ్డి: వచ్చే ఎన్నికలలో బాన్సువాడ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారన్న ప్రచారానికి తెరపడింది. మళ్లీ తానే బరిలో నిలుస్తానని స్వయంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. సీఎం ఆదేశం, పార్టీ నాయకులు, కార్యకర్తల కోరిక మేరకు తానీ నిర్ణయం తీసుకున్నానన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్ హోదాలో ఉండడంతో పార్టీ కార్యక్రమాలన్నీ ఆయన తనయుడు డీసీసీబీ చైర్మన్ అయిన పోచారం భాస్కర్‌రెడ్డి చూస్తున్నారు. నియోజకవర్గ నేతలు, అధికారులను సమన్వయం చేస్తూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో భాస్కర్‌రెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. స్పీకర్ వయసు పైబడుతుండడంతో ఆయనకు బదులు కొడుకులు పోటీ దిగుతారని పార్టీ శ్రేణుల్లోనూ చర్చ జరిగింది. అయితే సీఎం కేసీఆర్ ఆదేశాలు, పార్టీ నేతల అభిప్రాయాల మేరకు తానే పోటీ చేస్తానని స్పీకర్ ప్రకటించడంతో ప్రచారానికి తెరపడినట్టయ్యింది. జనం మధ్యలో.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లోనే ఎక్కువ సమయం గడుపుతు న్నారు. కొత్త పింఛన్ కార్డులు, సీఎం సహాయ నిధి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తూ జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ఊరిలో గంటల కొద్దీ సమయం కేటాయిస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రారం¿ోత్సవాల్లో పాల్గొంటున్నారు. వీధులన్నీ తిరుగుతున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. పనిలోపనిగా ఎవరైనా అనారోగ్యానికి గురైనా, మరణించినా వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా.... ఇటీవలి కాలంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చేస్తున్న హడావుడిని చూస్తుంటే ఎన్నికలు వచ్చాయా అనిపిస్తోంది. ఓ రకంగా ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా అందరినీ కలుస్తున్నారు. ప్రజలు తమ గల్లీకి రావాలని కోరగానే అటు పరుగులు తీస్తున్నారు. అక్కడికక్కడే కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చాయా అన్న రీతిలో వారి పర్యటనలు సాగుతున్నాయి. జనంతో మమేకమవుతూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి మళ్లీ తానే ఎన్నికల బరి ఉంటానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం బాన్సువాడ సరస్వతి ఆలయ కల్యాణ మండపంలో బీర్కూర్ మండలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎల్లప్పుడు సమీక్ష అవసరమన్నారు. అప్పుడే లోటుపాట్లు బయటకి వస్తాయన్నారు. ఎవరు తప్పు చేసినా అది ప్రజలలో వ్యతిరేకతకు దారి తీస్తుందన్నారు. మంచి పనులు చేస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారని, తప్పులు చేస్తే తరిమికొడతారని పేర్కొన్నారు. ఎవరైనా అనవసర విమర్శలు చేస్తే సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో మంచి పేరుందని, దానిని నిలబెట్టుకుందామని పేర్కొన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ రఘు, పార్టీ మండల అధ్యక్షుడు వీరేశం, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, నాయకులు శశికాంత్, నారాయణ, గంగారాం, సాయిలు తదితరులు పాల్గొన్నారు. సిట్టింగ్‌లకే టికెట్లన్న సీఎం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, సర్వేల ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఇటీవల జరిగిన సమావేశంలో సిట్టింగులకే టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్‌లకే అవకాశం ఇస్తామని, ఎవరి నియోజకవర్గంలో వారు కష్టపడాలని ఆదేశించారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే పోటీ చేస్తారని భావిస్తున్నారు. బాన్సువాడనుంచి వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవ ర్గం నుంచి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్, జుక్కల్‌లో హన్మంత్సింధేలకే అవకాశాలు దక్కనున్నాయి. -
ప్రివిలేజెస్ కమిటీకి షర్మిల వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం మంత్రులు నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కాలే యాదయ్య స్పీకర్ చాంబర్లో పోచారంను కలిసి ఫిర్యాదును అందజేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల హక్కులు, గౌరవానికి భంగం కలిగించడంతో పాటు నిరాధారంగా జుగుప్సాకర ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్ షర్మిల వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ ప్రివిలేజెస్ కమిటీకి సిఫారసు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాగా షర్మిల వ్యాఖ్యలపై డీజీపీ మహేందర్‌రెడ్డికి కూడా ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
తెలంగాణ అసెంబ్లీ: సెషన్ మొత్తం ఈటల సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల మధ్య జరుగుతున్న వాడీవేడి వాగ్వాదాలు.. తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. తాజాగా మూడో రోజు సమావేశాల్లో.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈటలపై స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్షమాపణ చెప్పకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఈ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ వర్తిస్తుందని స్పీకర్ ప్రకటించారు. ఆ సమయంలో ‘‘నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా?.. బెదిరిస్తారా?’’ అంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అయితే స్పీకర్ మాత్రం సభ నుంచి బయటకు వెళ్లాలని ఈటలకు సూచించారు. ఇదిలా ఉంటే.. ‘స్పీకర్‌పై ఈటల అమర్యాదపూర్వకంగా మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలపై ఈటల క్షమాపణ చెప్పలేదని.. సభ గౌరవాన్ని కాపాడేందుకు ఈటలపై చర్యలని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈటల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ కోరారు. ‘స్పీకర్ మరమనిషిలా పని చేస్తున్నారు. సభా సంప్రదాయాలను మర్చిపోతున్నారు. దీన్ని కాలరాసే అధికారం సీఎంకు లేదు. ఐదు నిమిషాలు సభ నడిపి ప్రజా సమస్యల నుంచి తప్పించుకున్నా ప్రజాక్షేత్రంలో తప్పించుకోబోరని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 80, 90 రోజులపాటు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 20 రోజులపాటు, వర్షాకాల సమావేశాలు నుంచి 20 రోజుల పాటు జరిగేవని, అలాంటప్పుడు కేవలం ఐదు నిమిషాలు, మూడు రోజుల పాటు జరగడం ఏంటని ఈటల, స్పీకర్ పోచారంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: కేంద్రానిది కక్ష సాధింపే: జగదీశ్‌రెడ్డి -
ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం నోటీసులు పంపింది: కేసీఆర్ ఫైర్
Updates.. ► తెలంగాణ శాసనమండలి రేపటికి వాయిదా ► తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా ► కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపాలి. ఉత్సవాలు గర్వపడేలా ఉండాలి.. గాయపడేలా ఉండకూడదు. వరద నష్టంపై సభలో చర్చ జరపాలి. అవసరమైతే మరో రెండు రోజులు సభ కొనసాగించాలి. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి. దీని కోసం సభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. 11: 40 AM ► కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తలసరి విద్యుత్ వినియోగం ప్రగతి సూచికగా ఉంటుంది. కేంద్రం తెలంగాణకు భయంకరమైన అన్యాయం చేసింది. విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. సీలేరు పవర్ ప్రాజెక్ట్ సహా 7 మండలాలను లాగేసుకున్నారు. కేంద్ర కేబినెట్ తొలి భేటీలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ గొంతు నులిమింది. మోదీకి ఎన్నిసార్లు చెప్పినా కర్కశంగా వ్యవహరించారు. మోదీ ఫాసిస్టు ప్రధాని అని ఆనాడే చెప్పాను. విద్యుత్ అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. ప్రజాస్వామ్యంలో అధికారం అంటే బాధ్యత. కేంద్రం ఇచ్చిన గెజిట్‌లో మోటర్లకు మీటర్లు పెట్టాలని ఉంది. మీటర్లు లేకుండా ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వొదని బిల్లులో చెప్పారు. విద్యుత్ సంస్కరణల ముసుగుతో రైతులను దోచుకునే ప్రయత్నం జరుగుతోంది. కేంద్రం తెస్తున్న విద్యుత్ సంస్కరణ అందరికీ తెలియాలి. విద్యుత్ బిల్లును బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎలా సమర్ధిస్తున్నారో ఆలోచించుకోవాలి. రఘునందన్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులపై మూక దాడులు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ.. రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. ఆర్టీసీని అమ్మేయాలని నాకు కేంద్రం నుంచి నోటీసులు వస్తున్నాయి. కేంద్రం లెటర్ల మీద లెటర్లను నాకు పంపిస్తోంది. ఆర్టీసీని అమ్మేస్తే వెయ్యికోట్లు బహుమతి ఇస్తామంటున్నారు. కేంద్రం అన్నీ అమ్మేస్తోంది. దీనికి సంస్కరణలు అని అందమైన పేరు పెట్టారు. విద్యుత్, వ్యవసాయ రంగాన్ని షావుకార్లకు అప్పగించాలని మోదీ సర్కార్ చూస్తోంది. మమ్మల్ని కూలగొడతామని చెబుతున్నారు. అంటే మీకు పోయే కాలం వచ్చింది. అందరూ కలిస్తే మీరు ఉంటారా?. షిండేలు, బొండేలు అని ఎవరిని బెదిరిస్తున్నారు. హిట్లర్ వంటి వారే కాలగర్బంలో కలిసిపోయారు. వీళ్లను దేవుడు కూడా కాపాడలేడు. భారతమాత గుండెకు గాయమవుతోంది. జాతీయ జెండానే మార్చేస్తామని చెబుతున్నారు. ఏక పార్టీనే ఉంటుందని చెప్తున్నారు. కేంద్రం తీరుతో ఆహార భద్రత ప్రమాదంలో పడింది. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. 10:25 AM ► కేంద్రం విద్యుత్ సంస్కరణల చట్టంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ► కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పోచారం తీరస్కరించారు. ► శాసనసభలో 7 బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం. బిల్లులపై రేపు(మంగళవారం) చర్చ చేపడతామని స్పీకర్ పోచారం తెలిపారు. సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6న సమావేశమై వాయిదా పడిన తెలంగాణ శాసనసభ, శాసన మండలి వానాకాలం సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభను ప్రారంభించారు. -
ఈటలపై సస్పెన్షన్ వేటు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమా వేశాల సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావే శానికి బీజేపీకి ఆహ్వానం లేకపోవడం క్రమంగా రాజకీయ వేడిని పెంచుతోంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పీకర్ మరమ నిషి అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలను ఖండించడంతో పాటు ఈటల బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన విష యం తెలిసిందే. ఈటల క్షమాపణ చెప్పకుంటే నిబంధనల మేరకు వ్యవహరిస్తామని వేముల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈట లను అసెంబ్లీ నిబంధనలను అనుసరించి సస్పెండ్ చేసేందుకు ఉన్న అవకాశాల పరిశీ లన జరుగుతున్నట్లు తెలిసింది. మంగళవా రం వాయిదా పడిన వానాకాల సమావేశాలు తిరిగి వచ్చే సోమవారం ప్రారంభం కానుండగా, ఈటల చేసిన వ్యాఖ్యలు ఆరోజు సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ఈటలపై చర్యలకు డిమాండ్ చేసే చాన్స్ ‘కేసీఆర్ చెప్తే చేసే మర మనిషిలా కాకుండా గతంలో ఉన్న సభా సంప్రదాయాలను స్పీకర్ కొనసాగించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే బుధవారం మీడియాతో మాట్లాడిన ఈటల.. స్పీకర్ తమ హక్కులు కాపాడాలని కోరారు. మరమనిషి అనే పదం నిషిద్ధమైనది ఏమీ కాదని ఎమ్మెల్యే రఘునందన్‌రావు, స్పీకర్ పదవికి కళంకం తెస్తున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై చర్యలు తీసుకోవా లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ వేర్వేరు చోట్ల వ్యాఖ్యానించారు. బీజేపీ వైఖరి నేప థ్యంలో ఈటలపై అసెంబ్లీ వేదికగా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసే అవ కాశముంది. సభ, సభా కమిటీలు, సభ్యుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించకుండా అనుసరించాల్సిన సభా సంప్రదాయాలను టీఆర్ఎస్ ఉటంకిస్తోంది. సభ గౌరవం కాపా డేందుకు పలు కమిటీలు, నియమాలు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల వ్యాఖ్యల ఎపిసోడ్‌ను స్పీకర్ ద్వారా అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ముందుకు తీసుకువెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది. తీర్మానం ద్వారా ఎథిక్స్ కమిటీకి.. నిబంధనల ప్రకారం.. మంత్రులు సహా శాససనసభ్యులు ఎవరైనా సభ బయట అనైతికంగా ప్రవర్తించినా, మాట్లాడినా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు ఫిర్యాదును స్పీకర్ ఒక తీర్మా నం ద్వారా ఎథిక్స్ కమిటీ (నైతిక విలు వల కమిటీ)కి అప్పగించి విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరతారు. ప్రస్తు తం ఈ నిబంధన మేరకు స్పీకర్ విషయమై ఈటల చేసిన వ్యాఖ్యలను సభ దృష్టికి టీఆర్ఎస్ తీసుకెళ్లే అవకాశం ఉంది. నిబంధనల మేరకు ఈటలను అవస రమైతే సభ నుంచి సస్పెండ్ చేసే అవకా శముంటుందని టీఆర్ఎస్ శాసనసభా పక్షం వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్‌లను సమావేశాలు ముగిసేంత వరకు సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఈటల రాజేందర్‌కు నోటీసులు? -
స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తీరుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తారా అంటూ స్పీకర్‌పై మండిపడ్డారు. సభలో చర్చ జరగాలని, స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీని చూస్తేనే కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీ నిర్వహించాలంటే భయపడుతున్నాడని దుయ్యబట్టారు. పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా ఇంఛార్జ్‌లతో బండి సంజయ్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజా సమస్యలపై చర్చించకుండా కుట్ర చేస్తున్నారు. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం. హిందూ పండుగలకు ప్రాధాన్యత లేకుండా కేసీఆర్ మహా కుట్ర చేస్తున్నాడు. షరతుల పేరుతో కన్ఫ్యూజ్ చేయడం అందులో భాగమే. హిందూ సమాజమంతా సంఘటితం కావాల్సిందే’ నని బండి సంజయ్ పిలుపునిచ్చారు. చదవండి: స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్ -
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఈటల రాజేందర్‌కు నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలంగాణ శాసనసభ స్మీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మర మనిషిగా పేర్కొంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా సీఎం చెప్తే చేసే మరమనిషిలా కాకుండా స్పీకర్ గతంలో ఉన్న సంప్రదాయాలను కొనసాగించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంగళవారం అన్నారు. బీఏసీ భేటీకి బీజేపీ సభ్యులను పిలవకపోవడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు ఉంటారు పోతారు.. అసెంబ్లీ మాత్రం శాశ్వతంగా ఉంటుందన్న విషయం మరిచిపోవద్దని హితవు పలికారు. ‘స్పీకర్ మరమనిషిలా పని చేస్తున్నారు. సభా సంప్రదాయాలను మర్చిపోతున్నారు. దీన్ని కాలరాసే అధికారం సీఎంకు లేదు’ అని వ్యాఖ్యా నించారు. ఐదు నిమిషాలు సభ నడిపి ప్రజా సమస్యల నుంచి తప్పించుకున్నా ప్రజాక్షేత్రంలో తప్పించుకోబోరని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 80, 90 రోజులపాటు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 20 రోజులపాటు, వర్షాకాల సమావేశాలు నుంచి 20 రోజుల పాటు జరిగేవని, అలాంటప్పుడు కేవలం ఐదు నిమిషాలు, మూడు రోజుల పాటు జరగడం ఏంటని ప్రశ్నించారు. రఘునందన్‌రావు మాట్లాడుతూ ముగ్గురం ఎమ్మెల్యేలుగా ఉన్న మమ్మల్ని బీఏసీ సమావేశానికి పిలవకపోవడం ఏంటని నిలదీశారు. శాసనసభలో ఏమైనా కొత్త రూల్స్ ప్రవేశపెట్టారా? అని అడిగారు. చదవండి: రాజాసింగ్ బెయిల్‌పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు -
అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. మంగళవారం నుంచి ఉభయ సభల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాల పనితీరు దేశానికే ఆదర్శంగా ఉందని, దాన్ని కాపాడుకోవాలని పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శాసన సభలో సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, గత సమావేశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న జవాబులను వెంటనే పంపించాలని అధికారులను ఆదేశించారు. సమాచారా న్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అందించాలని.. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందు బాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి శాఖ తరఫున ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుందని, స్థానిక శాసనసభ్యుడికి ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రోటోకాల్ ఉల్లంఘించకుండా ఉన్నతాధికారులు జిల్లాలకు ఆదేశాలు పంపాలని సూచించారు. లోపల సభ ప్రశాంతంగా జరగాలంటే.. బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఈసారి కూడా అదే విధంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని అభినందించారు. చదవండి: కర్ణాటకలో ‘చక్రం’ తిప్పాలని ప్లాన్! -
స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఎంఐఎం లేఖ
-
స్పీకర్‌కు ఎంఐఎం లేఖ.. రాజాసింగ్‌పై సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఎంఐఎం లేఖ రాసింది. రాజాసింగ్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని పేర్కొంది. సెక్షన్ 41 సీఆర్పీసీ కింద నోటిస్ ఇవ్వలేదనే కారణంతోనే రాజాసింగ్‌కు బెయిల్ ఇచ్చారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. చట్టప్రకారం మరోసారి రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: Telangana: హీటెక్కిన స్టేట్..! హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఉద్దేశంతోనే రాజాసింగ్ వీడియో విడుదల చేశారని అసదుద్దీన్ మండిపడ్డారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి వీడియో శాంపిల్ తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన దుమారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా.. రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ. మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలపై పాతబస్తీలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. నాటకీయ పరిణామాల తర్వాత మంగళవారం రాత్రి రాజాసింగ్‌కు బెయిల్ దక్కిన నేపథ్యంలో.. భారీగా యువత ఓల్డ్‌సిటీలో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ప్రిన్సిపల్ కాళ్లు మొక్కుతానన్న స్పీకర్ సాబ్
-
‘అంబేడ్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారు’
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశంలో సమానత్వం పెంపొందించి, ప్రజల అభ్యున్నతికి అంబేడ్కర్ కృషి చేశారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేవిధంగా, అంబేడ్కర్ ఆశయాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పని చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎం.ఎస్.ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వీజీ గౌడ్, గరపు దయానంద్, జనార్ధన్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ డా.నరసింహాచార్యులు, టిఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
17న రాజ్యాంగ పరిరక్షణ దీక్ష
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నుంచి తమ సస్పెన్షన్, సభలోకి అనుమతించే అంశాలపై పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను స్పీకర్ పట్టించుకోకపోవడా న్ని నిరసిస్తూ ఈనెల 17న ఇందిరాపార్క్ వద్ద రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నట్టు బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు తెలిపారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో వీరు మీడియాతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. స్పీకర్ హోదాకు విలువనిస్తూ కోర్టు గౌరవ సూచన చేసినా, ఆ స్ఫూర్తిని తుంగలోతొక్కి దురదృష్టకర సంప్రదాయాన్ని లేవనెత్తారని ఈటల విమర్శించారు. స్పీకర్ తన గౌర వాన్ని నిలుపుకోలేకపోవ డం దురదృష్టకరమన్నారు. ఆస్ట్రియా బృందం ఈ రోజు అసెంబ్లీ వ్యవహారాలు పరిశీలి స్తున్న సందర్భం లో తమ సస్పెన్షన్ ఒక దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు. ఈ విధానాలు చూస్తుంటే ఉత్తర కొరి యా గుర్తు వస్తుందని, అక్కడ రాజు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో చప్పట్లు కొట్టలేదు అని ఒక సభ్యున్ని కాల్చి చంపారని ఈటల పేర్కొన్నారు. ఇకపై ఇక్కడా చప్పట్లు కొట్టలేదని కూడా సస్పెండ్ చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. తాను కూడా ఒక ఉద్యమ నాయకుడినేనని గతంలో ఉద్యమాన్ని తూలనాడిన వారితోనే తమను సస్పెండ్ చేయించడం అవమానకరమన్నారు. ‘హైకోర్టు ఉత్తర్వులు, మీ పిటిషన్‌ను పూర్తిగా పరిశీలించిన తర్వాతే మీ అభ్యర్థన తిరస్కరిస్తున్నా’అని స్పీకర్ చెప్పారని రఘునందన్ రావు తెలిపారు. తమ అభ్యర్థనను సభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరినా స్పీకర్ వినలేదన్నారు. ‘ప్రజాస్వామ్య చరిత్రలో ఇది బ్లాక్‌డే. స్పీకర్ తనకు వచ్చిన డైరెక్షన్ మేరకే పని చేస్తున్నారు’అని రఘునందన్ విమర్శించారు. -
బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థన తిరస్కృతి
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు బీజేపీ శాసనసభ్యులు తమపై విధించిన బహిష్కరణను ఎత్తివేయాలంటూ మంగళవారం శాసన సభాపతి చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. అయితే సస్పెన్షన్ నిర్ణయం శాసనసభ ఏకగ్రీవ నిర్ణయమని పోచారం స్పష్టం చేయడంతో అసెంబ్లీ నుంచి వెనుదిరిగారు. ఈ నెల 9న శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ సభ తీర్మానించడం తెలిసిందే. దీన్ని సవాల్‌చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం వారిని సభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలని స్పీకర్‌కు సూచించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 గంటలకే బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో సుమారు 45 నిమిషాలపాటు స్పీకర్‌ను కలిసేందుకు వేచిచూశారు. చివరకు స్పీకర్ చాంబర్లో కలిసేందుకు వారికి పిలుపు రావడంతో పోచారాన్ని కలిసి కోర్టు ఉత్తర్వులతోపాటు సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వినతిపత్రం సమర్పించారు. సభ జరుగుతున్న సమయంలో తమ స్థానం నుంచి కదలలేదని, సభను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని రఘునం దన్‌రావు, ఈటల రాజేందర్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. తమను బహిష్కరించడం అన్యాయమని, పార్టీలను పక్కనపెట్టి పక్షపాతరహితంగా నిర్ణయం తీసుకోవాలని బీజేపీ సభ్యులు కోరారు. పోడియంలోకి వచ్చినట్లు భావిస్తే తాను సస్పెన్షన్‌కు అర్హుడనని, మిగ తా ఇద్దరు సభ్యులను సభకు అనుమతించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పీకర్‌కు విన్నవించారు. ‘సస్పెన్షన్ నిర్ణయం శాసనసభ ఏకగ్రీవంగా తీసుకుందని’స్పీకర్ వ్యాఖ్యానించగా తమ వినతిని సభతోపాటు సభానాయకుడి ముందు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరినట్లు తెలిసింది. ఈలోగా శాసనసభ సమావేశం ప్రారంభమైనట్లు గంట మోగడంతో స్పీకర్ సభలోకి వెళ్లగా బీజేపీ ఎమ్మెల్యేలు తిరుగుముఖం పట్టారు. ‘మీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నా’అని స్పీకర్ ప్రకటించారని సభ నుంచి వెలుపలకు వచ్చిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో ప్రకటించారు. -
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. బుధవారం అసెంబ్లీ సమావేశాలు జరిగిన అనంతరం అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు. ఏడు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 4 బిల్లులు ఆమోదం పొందాయి. 54 గంటల 47 నిమిషాలు పని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. -
తెలంగాణ అసెంబ్లీ.. ఐదవరోజు సమావేశాలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సెషన్ 2022-23లో భాగంగా.. శనివారం ఉదయం ఐదవ రోజు సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. చేపల పెంపకానికి ప్రోత్సాహం, హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, జీహెచ్ఎంసీ, ఇతర జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల సౌకర్యం, రాష్ట్రంలో నేత కార్మికుల సంక్షేమం, ఓఆర్ఆర్ వెలుపల ఆవాసాలకు తాగునీరు, జర్నలిస్టుల సంక్షేమంతో పాటు అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. అనంతరం సభలో రెండు బిల్స్ తో పాటు 6 పద్దులు చర్చకు రానున్నాయి. సాంకేతిక విద్య ,పర్యాటకం , మెడికల్ అండ్ హెల్త్ , మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ,లేబర్ ఎంప్లాయిమెంట్ , అడవుల అభివృద్ధి పై సభలో చర్చ జరగనుంది. సభలో ప్రశ్నలే అడగాలని, ప్రసంగాలు వద్దంటూ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సూచించడం విశేషం. -
అసెంబ్లీలో గాంధీ వర్ధంతి
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహా చార్యులు పాల్గొన్నారు. -
మరోసారి కోవిడ్ బారినపడ్డ స్పీకర్ పోచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మరోసారి కరోనా వైరస్ సోకింది. శనివారం స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో స్పీకర్ పోచారం జాయిన్ అయ్యారు. చదవండి: తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు, ఎప్పటివరకు అంటే.. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో ఆయన మొదటిసారి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీ స్పీకర్‌కు కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచా రం శ్రీనివాస్‌రెడ్డి కరోనా లక్షణాలతో హైదరా బాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొం దుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. రెగ్యులర్ మెడికల్ టెస్టుల్లో భాగంగా బుధవారం రాత్రి చేసిన వైద్య పరీక్షలో స్పీకర్‌కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ, వైద్యుల సూచ నల మేరకు గచ్చిబౌలి ఏఐసీ ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 21న హైదరాబాద్‌లో స్పీకర్ మనవరాలి వివాహం జరగగా, ఏపీ, తెలం గాణ ముఖ్యమంత్రులతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. సీటీ స్కాన్‌లో వైరస్ ఆనవాళ్లు కనిపించలేదని.. ఆయనకు మరిన్ని వైద్య పరీక్షలు చేసి డిశ్చార్జి చేసే అవకాశం ఉందని తెలిసింది. -
పోచారం మనవరాలి పెళ్లికి హాజరైన ఇరు రాష్ట్రాల సీఎంలు
-
ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలు స్నిగ్దా రెడ్డి వివాహం.. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డితో వీఎన్ఆర్ ఫామ్స్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఒకరినొకరు పలకరించుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదిక మీద.. పక్కపక్కన కూర్చుని కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం వేదిక మీదకు వెళ్లి వధువరూలను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు వైఎస్ విజయమ్మతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలానే ఏపీ స్పీకర్ తమ్మినేని కూడా హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన బీజీపీ నేత ఈటల రాజేందర్ బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈటల చేత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీలో హక్కులు ఉండేవని అన్నారు. చదవండి: ‘దళితుడిగా బీజేపీ చర్యలను ఖండిస్తున్నా’ ఇప్పుడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు గౌరవం లేదని తెలిపారు. తనను అకారణంగా మంత్రి వర్గం నుంచి తొలగించారని మండిపడ్డారు. ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత.. మీడియా పాయింట్లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ రూ. 600 కోట్టు ఖర్చు పెట్టిందని అన్నారు. -
స్పీకర్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఒకరి మృతి
మనోహరాబాద్ (తూప్రాన్): శాసనసభ స్పీక ర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టిన సంఘటన లో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లక ల్ గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. స్పీ కర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం కాన్వా య్‌తో హైదరాబాద్ నుంచి బాన్సువాడకు వెళుతున్నారు. అదే సమయంలో కాళ్లకల్ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిని దాటుతు న్న దొంతిరెడ్డి నరసింహారెడ్డి (62)ని కాన్వాయ్ లోని వెనుక వాహనం ఢీ కొట్టింది. దీంతో నరసింహారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం అక్కడే నిలిచిపోగా, స్పీకర్ మిగతా కాన్వాయ్ ముందుకు వెళ్లిపోయింది. మృతుడు దినసరి కూలీగా పని చేస్తున్నాడు. ప్రమాద సమాచారాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్టు స్థానిక ఎస్ఐ రాజాగౌడ్ చెప్పారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని స్పీకర్ ఫోన్లో చెప్పారని ఎస్ఐ వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. -
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి
సాక్షి, మెదక్: తెలంగాణ శాసనసభ స్వీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. మనోహరబాద్ మండలం కాళ్ళకల్ వద్ద స్పీకర్ పోచారం కాన్వాయి వెళ్తుంది. కాన్వాయ్ వస్తున్న విషయాన్ని గమనించకుండా అదే సమమంలో ఓ వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. దీంతో కాన్వాయ్‌లోని ఓ వాహనం వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. చదవండి: బద్వేల్, హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడిని నర్సింహ్మ రెడ్డిగా (50) పోలీసులు గుర్తించారు. ఇతను కొన్ని సంవత్సరాలుగా వలస వచ్చి కాళ్లకల్ గ్రామంలో నివాసముంటున్నాడు. పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రమాదంపై అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. చదవండి: ‘పది’లో ఇక 6 పేపర్లే.. టీఎస్ సర్కార్ కీలక ఉత్తర్వులు -
‘పోడు’పై వాయిదా తీర్మానం తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, దీనిపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ మంగళవారం సభలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ఆయన చాంబర్లో కలసి పోడు సమస్యలపై సభలో చర్చ జరపాలని కోరారు. అయినా ఫలితం లేకపోవడం మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీ జరుగుతున్న సమయంలో గన్‌పార్కు వద్దకు వచ్చి నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ.. అడవుల్లో నివసించే వారికి తమ హయాంలో భూములపై హక్కులు కల్పించామని, తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ ప్రభుత్వంలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. పోడు వ్యవసాయం చేసే అడవిబిడ్డలను పోలీసులు కొట్టి అరెస్టు చేయడం నిత్యకృత్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించాలని తాము అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చినా తిరస్కరించారని, దీనిపై స్పీకర్‌ను కలిసి నిరసన తెలిపామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికైనా నిరంకుశ విధానాలను మానుకోవాలని, లేదంటే ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య మాట్లాడుతూ గిరిజన పోడు భూములపై ఇచ్చిన మాటలను ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. రాస్తారోకో చేస్తున్న అఖిలపక్ష నేతలను అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. అనంతరం మంథని ఎమ్మెల్యే డి. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పోడు భూములపై ప్రభుత్వ వైఖరి సరిగా లేదని, గిరిజనుల భవిష్యత్తు తో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. -
గాంధీ ఆశయాలకు అనుగుణంగా పాలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగుతోందని, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం మనమందరం పునరంకితం కావాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వీజీ గౌడ్, తేరా చిన్నపరెడ్డి, కుర్మయ్యగారి నవీన్‌కుమార్, దయానంద్, శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని గుర్తు చేశారు. గాంధీ ఆశయాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, గత ఏడేళ్ళలో రాష్ట్రం పరిపాలన పరంగా దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. -
రేపటి నుంచి తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేపటి నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ఏర్పాట్లపై గురువారం ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభలోని కమిటీ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి ప్రోటెం చైర్మన్ వెన్న భూపాల్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనాను సమర్ధవంతంగా అరికట్టడంలో కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. కరోనా సంక్షోభం తలెత్తినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేశంలోనే మెరుగ్గా, ఆదర్శంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ , మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, నీతిఆయోగ్ చైర్మన్ మెచ్చుకున్నారని గుర్తుచేశారు. రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ, 8వ సెషన్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి గత సమావేశాల మాదిరే ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సభ్యులు అడిగిన సమాచారం సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆదేశించారు. ఆయా శాఖల తరఫున ప్రత్యేకంగా నోడల్ అధికారులను సభలోని బాక్స్‌లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. గత సమావేశాలకు సంబంధించిన పెండింగులో ఉన్న ప్రశ్నలకు జవాబులు వెంటనే పంపించాలని తెలిపారు. సమావేశాల సమయంలో కరోనా నిబంధనలను అమలు చేయడంతో పాటుగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. సభ ప్రశాంతంగా జరగాలంటే బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలని గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల శాసనసభలతో పోల్చుకుంటే మన శాసనసభ సమావేశాలు సమర్ధవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని చెప్పారు. సమావేశానికి శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎంఏ &యూడీ) అరవింద రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ (జీఏడీ) వికాస్ రాజ్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, హోం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, డీజీ (ఎస్పీఎఫ్) ఉమేశ్ షరాఫ్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, డీజీ (లా & ఆర్డర్) జితేందర్, అడిషనల్ సీపీ (క్రైం) షీకా గోయల్, జాయింట్ సీపీ (సెంట్రల్ జోన్) విశ్వ ప్రసాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అడిషనల్ సీపీ (రాచకొండ) సుధీర్, డీఐజీ (ఇంటలిజెన్స్) శివకుమార్, ఇన్చార్జి డీఐజీ (ఐఎస్‌డబ్ల్యూ) తప్సిన్ ఇక్బాల్, డీసీపీ (ట్రాఫిక్) భాస్కర్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్ కర్ణాకర్ తదితరులు హాజరయ్యారు. -
ఈటల రాజీనామా ఆమోదం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం మధ్యాహ్నం ఆమోదించారు. రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్లోనే ఉండడంతో ఆమోదానికి ఎలాంటి అడ్డంకులు కలగలేదు. కాగా ఇవాళ ఉదయమే స్పీకర్ ఫార్మాట్లో ఉన్న రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు. అనంతరం గన్‌పార్క్ సందర్శించిన ఈటల తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. కాగా ఈటెల రాజేందర్ జూన్ 14న బీజేపీలో చేరికకు సంబంధించి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో కలసి ఈటల రాజేందర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. అదేరోజు సాయంత్రం బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, తరుణ్ ఛుగ్ తదితరుల సమక్షంలో ఈటల రాజేందర్ ఆ పార్టీలో చేరుతారు. ఇటీవల రెండు రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఈటల.. వర్షాల కారణంగా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల షెడ్యూలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఖాళీ అవ్వటంతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఆ స్థానానికి సంబంధించి శనివారం మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేశారు. చదవండి: హుజూరాబాద్‌లో జరిగే ఎన్నికలు కురుక్షేత్రమే: ఈటల -
తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ దుకాణం బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ పేరు కనుమరుగైంది. ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరాడు. దీంతో టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో టీడీపీ విలీనం అయ్యింది. ఈ సందర్భంగా బుధవారం మెచ్చా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి టీడీపీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు లేఖ ఇచ్చారు. దీనిపై త్వరలోనే అధికారిక బులిటెన్ వెలువడనుంది. 2018 ఎన్నికల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి మెచ్చా నాగేశ్వరరావు గెలిచారు. ఆయన టీఆర్ఎస్లో చేరుతారని ఎప్పటి నుంచో సాగుతున్న ప్రచారానికి నేటితో తెరపడింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మెచ్చా సమావేశమయ్యారు. తాజాగా టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు మెచ్చా ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి లేఖ అందించారు. అనంతరం శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కూడా సమావేశమయ్యారు. ఇప్పటికే టీఆర్ఎస్తో కలిసి ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర తాజాగా అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కూడా తీసుకొచ్చారు. స్పీకర్‌ను కలిసిన సమయంలో ఎమ్మెల్యేల మెడలో గులాబీ కండువా ఉండడం విశేషం. వారిద్దరి రాకతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం కరువైంది. చదవండి: 9 నుంచి 19 వరకు మొత్తం బంద్ -
వ్యాక్సిన్ వేయించుకున్న స్పీకర్, శాసన మండలి చైర్మన్!
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉందని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.బుధవారం నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్‌ను వేయించుకున్నారు. ఆయనతో పాటు సభాపతి సతీమణి పుష్ప, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన సతీమణి అరుంధతిలు కూడా టీకా వేయించుకున్నారు. వీరంతా మార్చి 3న కోవిడ్ టీకా మొదటి డోస్ వేయించుకున్నారు. కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ కె.మనోహర్, నిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ... కరోనా వ్యాక్సిన్ విషయంలో అపోహలు వద్దని..టీకా వేసుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరమని చెప్పారు. ఇప్పుడు రెండో డోస్‌గా కొవాగ్జిన్‌ను తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా 45 ఏళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అయితే కరోనా వైరస్ మళ్లీ ప్రబలుతున్న తరుణంలో ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్కు లేకుండా ఎవరు కూడా బయటకు రాకూడదన్నారు. మాస్క్ ధరించకపోతే రూ.1,000 జరిమానా, 2 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తారన్నారు. ఈ కఠిన నిబంధనలు ప్రజల మేలు కోసమేనని, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలన్నారు. కరోనాను కట్టడి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. దేశ సగటు కంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలు అతి తక్కువ శాతంలో ఉన్నాయని చెప్పారు. -
నిధులివ్వనప్పుడు సమావేశాలెందుకు?
సాక్షి, హైదరాబాద్: ‘బడ్జెట్లో పెట్టిన నిధులు ఇవ్వరు, బడ్జెట్‌తో సంబంధం లేని పనులను హడావుడిగా చేపడుతూ నిధులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ సభ ఎందుకు, సమావేశాలు ఎందుకు?’అంటూ కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు గురువారం అసెంబ్లీలో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి పేర్కొనగా, పవిత్ర సభను అవమానించేలా ఎలా మాట్లాడతారని, అలా చేస్తే మాట్లాడేందుకే అనుమతి ఇవ్వనని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ మీద గౌరవం లేనప్పుడు సభలో మాట్లాడటమెందుకని ప్రశ్నించారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సభలో ఆవేశంగా మాట్లాడారు. తొలుత ఆయన పేరును కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా స్పీకర్ పిలవగా, తన పేరు రాజగోపాలరెడ్డి అంటూ ఆయన పేర్కొనటంతో స్పీకర్ సారీ చెప్పారు. ఆ తర్వాత రాజగోపాల్‌రెడ్డి మాట్లా డుతూ తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట ఎక్కువగా నడిచింది నిరుద్యోగులేనని, రాష్ట్రం సిద్ధిస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని, ఉపాధికి ఢోకా లేదని కేసీఆర్ చెప్పారని, కానీ ఇప్పుడు అది అమలు కాకపోయేసరికి నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకొన్నాయని అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదు.. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు రావటం లేదని, ప్రైవేటులో 50 శాతం ఉద్యోగాలు స్థానికు లకే ఇచ్చేలా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్‌లో 100 ఫార్మా కంపెనీలుంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించనప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగ మేంటని ప్రశ్నించారు. పథకాలు రూపొందించినా అమలుకు నిధులు ఇవ్వక పనుల కోసం సర్పంచులపై ఒత్తిడి పడుతోందని పేర్కొన్నారు. కొన్ని నియోజకవర్గాలకు వేల కోట్ల నిధులు పోతు న్నాయని, మరి తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వట్లేదని, ప్రతిపక్ష సభ్యులను గెలిపించుకోవటం మా నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పాపమా అంటూ ప్రశ్నించారు. శివన్నగూడెం ప్రజలు ప్రాజెక్టుకు భూములిచ్చి త్యాగం చేస్తే పరిహారం విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు. -
స్పీకర్ పోచారం కంటతడి
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఓ కార్యక్రమంలో కంటతడి పెట్టారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘అపురూపమైనదమ్మ ఆడజన్మ..’ పాటను ప్లే చేయగా, తన తల్లి దివంగత పరిగె పాపమ్మను గుర్తు చేసుకుని ఒక్కసారిగా పోచారం ఉద్వేగానికి గురయ్యారు. 102 ఏళ్ల వయసులో తన తల్లి మరణించారని, ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ప్రజాసేవకు అంకితమయ్యానని తెలిపారు. తన విజయాల్లో భార్య పుష్పమ్మ పాత్ర కూడా ఎంతో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. – బాన్సువాడ చదవండి: అదుపులోనే భైంసా -
రాష్ట్రంలో ధోకేబాజి, బట్టేబాజి పాలన: బండి సంజయ్
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో లాఠీలు, జైళ్ల కోసం నిధులు కేటాయించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసులుపెట్టి లాఠీలు ఝళిపిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని, తూటాలకు భయపడబోమని, ఎంతమందిని అరెస్టుచేసి జైళ్లకు పంపినా భయపడే ప్రసక్తే లేదన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గురువారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో బండి సంజయ్ మాట్లాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం బీజేపీ కార్యకర్తలు ప్రాణాలివ్వడానికీ వెనుకాడరని, ఇందుకు కామారెడ్డి జిల్లాలో రేవూరి సురేందర్ నిదర్శనమన్నారు. నక్సలైట్లు సురేందర్‌ను పొట్టన పెట్టుకున్నా బీజేపీ కార్యకర్తలు ఏనాడూ భయపడలేదన్నారు. రాష్ట్రంలో రాక్షస, అవినీతి పాలన నడుస్తోందన్నారు. తెలంగాణను దోచుకుంటున్న దొంగలను కూడా అరెస్టుచేసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. రాష్ట్రంలో ధోకేబాజి, బట్టేబాజి పాలన నడుస్తోందని సంజయ్ దుయ్యబట్టారు. గిరిజనులు సాగు చేసుకొంటున్న పోడు భూముల సమస్యను వారంలో పరిష్కరిస్తానన్న ముఖ్యమంత్రి.. గుర్రంపోడు తండాలో గిరిజనుల భూములను టీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని సంజయ్ ధ్వజమెత్తారు. బాన్సువాడ ఛత్రునాయక్ తండాలో రైతుల పంటలను అటవీ అధికారులతో దున్నించారని, గిరిజనులకు ఈ ప్రభుత్వం చేస్తున్న మేలు ఏపాటిదో ఇది రుజువు చేస్తుందన్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఉద్దేశించి.. టీడీపీ, టీఆర్ఎస్ హయాంలలో ఆయన మంత్రి పదవి పోవడానికి కారణాలేంటో రాష్ట్ర ప్రజానీకం అందరికీ తెలుసని సంజయ్ అన్నారు. పోచారం కుమారులు బాన్సువాడలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలకడం సరికాదన్నారు. తాము నిజామాబాద్ నుంచి సభకు వస్తుంటే పోలీసులు రక్షణ కల్పించలేదని, అదే పోచారం కుమారుల వెంట కాన్వాయ్‌లు నడుపుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ బాన్సువాడకు పట్టిన గబ్బిలాలను పారదోలే అవకాశం వచ్చిందన్నారు. సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీలో చేరగా, వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, అరుణతార, యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బండి సంజయ్‌కు సవాల్ విసిరిన మంత్రి
కామారెడ్డి : బాన్సువాడలో రూ. 15.98 కోట్లతో నూతనంగా నిర్మించనున్న చెక్ డ్యాంకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మరోసారి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ డబ్బుల్లో కేంద్రం ప్రభుత్వ వాటా 200 రూపాయల కంటే మించితే తాను రాజీనామాకు సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు. తన సవాలు స్వీకరించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అంటే భారతీయ ఝటా పార్టీ అని, తెలంగాణకు నిధులు తేవడంలో బీజేపీ నేతలు విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి ఇస్తే ఇక్కడి బీజేపీ నేతలు ఎందుకు స్పందించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఉద్రిక్తత: మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ) -
దివ్యాంగుడికి స్పీకర్ చేయూత
సాక్షి, హైదరాబాద్: అనారోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఓ దివ్యాంగుడిని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదుకున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా కు చెందిన నరేశ్ 90 శాతం వికలాంగత్వంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తండ్రి చనిపోవడంతో హైదరాబాద్ పాతబస్తీలోని కుమ్మరిగూడలో తల్లితో పాటు అద్దెకుంటున్నారు. తల్లి రోజువారీ కూలి. నరేశ్ తన గోడును పోచారం శ్రీని వాసరెడ్డికి ఫోన్‌చేసి వెళ్లబోసుకున్నాడు. దీంతో ఆయన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో మాట్లాడి ప్రభుత్వం నిర్మిస్తోన్న డబుల్ బెడ్రూం ఇళ్లలో ఒక ఇంటిని కేటాయించాలని సూచించారు. వికలాంగుల హక్కుల వేదిక జాతీయ నాయకులు కొల్లి నాగేశ్వరరావుతో మాట్లాడి బ్యాటరీ ట్రై సైకిల్ ను అందించాలని కోరారు. స్పీకర్ సూచనతో మం గళవారం హైదరాబాద్ జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 శాతం సబ్సిడీపై సమకూర్చిన బ్యాటరీ ట్రై సైకిల్‌ను నరేశ్‌కు అందించారు. -
మంత్రులపై స్పీకర్ పోచారం ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం కరోనా నిబంధనలు పాటించని మంత్రులపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మంత్రులు ఈటెల రాజేందర్, జగదీష్‌రెడ్డిలు కరోనా రూల్స్ పాటించకుండా పక్కపక్క సీట్లలో కూర్చున్నారు. నో సీటింగ్ అని రాసి ఉన్నా అది పట్టించుకోకుండా జగదీష్‌రెడ్డి ఈటల పక్కనే కూర్చొని మాట్లాడారు. దీన్ని గమనించిన పోచారం నో సీటింగ్ అని రాసి ఉన్న దానిలో ఎలా కూర్చుంటారంటూ.. నిబంధనలు పాటించాలంటూ మంత్రి జగదీష్‌నుద్దేశించి హెచ్చరించారు. స్పీకర్ హెచ్చరిచకలతో జగదీష్‌రెడ్డి వెంటనే ఈటెల దగ్గర్నుంచి లేచి తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. సభలో సభ్యులంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ పోచారం మరోసారి తెలిపారు. కాగా సభా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటచుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి ఎక్కువ సమయం తీసకుంటున్నాడని ఈటెల, ఎర్రబెల్లి ఆయన స్పీచ్‌కు అడ్డుపడ్డారు. ఒక్క ప్రశ్నకు నిరంజన్‌రెడ్డి ఎంత సమయం తీసుకుంటారని ఈటెల, ఎర్రబెల్లిలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారిద్దరు స్పీకర్‌కు సమయాన్ని గుర్తుచేశారు. ఇది గమనించిన స్పీకర్ పోచారం నిరంజన్‌రెడ్డిను ఉద్దేశించి తొందరగా ముగించాలని కోరారు. దీంతో నిరంజన్‌రెడ్డి ఒక్క నిమిషంలో తన స్పీచ్‌ను ముగించారు. -
హడావుడి లేకుండా అసెంబ్లీ సమావేశాలు షురూ..!
సాక్షి, హైదరాబాద్: సోమవారం ప్రారంభమైన శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో విభిన్న వాతావరణం కనిపించింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులు, మీడియా, సందర్శకులతో సందడిగా కనిపించే అసెంబ్లీ ప్రాంగణంలో ఈసారి కరోనా నేపథ్యంలో పెద్దగా హడావుడి కనిపించలేదు. మీడియా పాయింట్ ఎత్తివేయడం, లాబీలు, గ్యాలరీలోకి సందర్శకులకు అనుమతి ఇవ్వక పోవడంతో అసెంబ్లీ పరిసరాలు బోసిపోయాయి. మంత్రులు మినహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వ్యక్తిగత సిబ్బందిని కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించలేదు. సీఎం, స్పీకర్, మంత్రులు సహా అందరూ మాస్క్‌లతో సభకు హాజరు కాగా, సభలో భౌతిక దూరం పాటిస్తూ సమావేశాల్లో పాల్గొన్నారు. సభ లోపల, బయటా కరచాలనాలు, గుమి కూడటం వంటివి లేకుండా సమావేశం వాయిదా పడిన వెంటనే ఎవరికి వారుగా తిరుగుముఖం పట్టారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే వారికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అసెంబ్లీ ప్రాంగణంలో డయాగ్నస్టిక్ కేంద్రం ఏర్పాటు చేసి, అందరికీ పరీక్షలు నిర్వహించారు. మాస్క్ పెట్టుకోండి.. దూరం పాటించండి : స్పీకర్ పోచారం సూచనలు సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాలకు హాజరయ్యే సభ్యులంతా కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. సోమవారం సభ ప్రారంభం కాగానే జాతీయ గీతాలాపన అనంతరం ఆయన సభ్యులకు పలు సూచనలు చేశారు. సభ్యులం తా సభకు హాజరయ్యే ముందు జ్వరాన్ని తనిఖీ చేసుకోవాలని.. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే అది తగ్గేవరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. గాలి, వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్ పెట్టు కోవాలని, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, అనవసరంగా వేటినీ తాకరాదని స్పష్టంచేశారు. రోగనిరోధక శక్తి పెంచుకునేలా పౌష్టి కాహారం తీసుకోవాలని, అనారోగ్యం ఉన్నవారితో కలవరాదని చెప్పారు. నీటి సీసాలు పంచుకోరాదని, లిఫ్టు వాడొద్దని పోచారం సూచించారు. చర్చలు సజావుగా జరిగేందుకు సహకరించాలి : మంత్రి వేముల సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై శాసనసభ, మండలిలో అర్థవంతమైన చర్చలు జరిగేందుకు ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లు కీలక పాత్ర పోషించాలని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. పలు అంశాలకు సంబంధించి స్వల్పకాలిక, లఘు చర్చలపై విప్‌లు అంశాల వారీగా సన్నద్ధం కావాలని తెలిపారు. సభ్యుల హాజరును పర్యవేక్షించాలని చెప్పారు. శాసనసభ, మండలిలో చీఫ్ విప్‌లు, విప్‌లతో సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి సమావేశమై చర్చించారు. సభను ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు సీఎం సుముఖంగా ఉండడంతో అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో చీఫ్ విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు, దాస్యం వెంకటేశ్వర్లు, విప్‌లు భానుప్రసాద్‌రావు, ఎంఎస్ ప్రభాకర్, శాసనసభ విప్‌లు గంప గోవర్ధన్, గొంగిడి సునీత, బాల్క సుమన్, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
కరోనా టెస్టులు చేసుకుంటేనే అసెంబ్లీకి..!
సాక్షి, హైదరాబాద్: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 7 నుంచి ప్రారంభమవుతున్న శాసనసభ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి హాజరయ్యే సభ్యులు, అధికారులు, పోలీసు, మీడియా, ఇతర సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శాసనసభ, మండలి సమావేశాల ఏర్పాట్లపై శుక్రవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలసి పోచారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఆరు కేటగిరీలకు చెందిన వారు ఈ నెల 6 సాయంత్రంలోగా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసులు, మార్షల్స్, మీడియా, మంత్రుల పీఎస్‌లు కరోనా పరీక్షలు చేయించుకున్నట్లుగా రిపోర్టులు చూపిస్తేనే సమావేశాలకు అనుమతిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. జ్వరముంటే నో ఎంట్రీ.. తమ నియోజకవర్గాలు, జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అక్కడి వైద్యులతో కరోనా పరీక్షలు చేయించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు స్పీకర్ పోచారం చెప్పారు. మంత్రుల పీఎస్‌లు, పీఏలకు మాత్రమే సభలోకి అనుమతి ఉందని.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పీఏలు, ఇతర వ్యక్తిగత సిబ్బందిని అనుమతించబోమని వెల్లడించారు. అసెంబ్లీ అన్ని ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ యంత్రాలు అందుబాటులో పెడతామన్నారు. జ్వరం ఉన్న వారిని అసెంబ్లీలోకి అనుమతించబోమని.. జలుబు, దగ్గు వంటి ఇతర లక్షణాలున్న వారు కూడా అసెంబ్లీకి రాకూడదని స్పీకర్ స్పష్టంచేశారు. మాస్కులు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిస్తామని, అసెంబ్లీ ప్రవేశ ద్వారాల వద్ద మాస్కులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పరిమిత సంఖ్యలో మీడియా పాస్‌లు పార్లమెంటు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు అనుసరిస్తున్న నిబంధనలకు అనుగుణంగానే శాసనసభ సమావేశాలు జరుగుతాయని, అయితే ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మీడియాకు పరిమిత సంఖ్యలో పాస్‌లు జారీ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం తెలిపారు. సందర్శకులకు అనుమతి లేదని, మీడియా పాయింట్, లాబీపాస్లు జారీ చేయడం లేదన్నారు. మీడియా సంస్థలకు రెండు చొప్పున పాస్‌లు ఇస్తున్నట్లు వెల్లడిస్తూ, విజిటర్స్ గ్యాలరీని కూడా మీడియాకు కేటాయిస్తున్నామని చెప్పారు. చర్చల సమయంలో సభ్యులు తమకు కేటాయించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోచారం పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఆవరణలో మహమూద్ అలీకి కరోనా పరీక్షలు చేస్తున్న వైద్యులు పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.. కరోనా లక్షణాలున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు దూరంగా ఉండాలని మండలి చైర్మన్ గుత్తా సూచించారు. సమావేశాల సం దర్భంగా ధర్నాలు, నిరసనలు, చలో అసెంబ్లీ కార్యక్రమాలను నిర్వహించకుండా పోలీసు లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సభలో చర్చకు వచ్చే అంశాలపై అధికారులు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉం డాలని సూచించారు. సమావేశాల నిర్వహణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అన్ని శాఖలను సమన్వయం చేయడంతో పాటు, పార్లమెంటు మార్గదర్శకాలను పాటి స్తున్నట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల తెలిపారు. ఉభయ సభల్లో భౌతిక దూరం పాటిస్తూ 6 అడుగుల దూరం లో శాసనసభలో అదనంగా 40, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ప్రభుత్వ చీఫ్ విప్‌లు వినయ్ భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా కిట్లు ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆక్సీమీటర్, శానిటరీ బాటిల్, మాస్క్‌తో కూడిన కిట్లను అందజేస్తామని స్పీకర్ పోచారం వెల్లడించారు. మున్సిపల్, పబ్లిక్ హెల్త్, జీహెచ్ఎంసీ ద్వారా అసెంబ్లీ సమావేశ మందిరాలతో పాటు పరిసరాలను రోజుకు రెండు సార్లు శానిటైజ్ చేస్తామని, సభ్యుల కోసం అసెంబ్లీ ఆవరణలో 2 డయాగ్నస్టిక్ కేంద్రాలు, అంబులెన్సులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని వివరించారు. సమావేశాలు.. 20 రోజులు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 20 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ ఖరారు చేసింది. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాల నిర్వహణ తీరు, ఏర్పాట్లపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో సమావేశాల నిర్వహణ, ఏర్పాట్లపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం జరగ్గా... సభలో చర్చకు వచ్చే అంశాల సమగ్ర సమాచారం సిద్ధం చేసుకోవాల్సిందిగా వారిని స్పీకర్, చైర్మన్ ఆదేశించారు. గతంలో మాదిరిగా అధికారులను గుంపులుగా కాకుండా, శాఖల వారీ ముఖ్యమైన వారిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. సాయంత్రం పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో భద్రతపరమైన అంశాలు, బందోబస్తుపై చర్చించారు.ఎస్పీఎఫ్ డీజీతో పాటు ఇతర ఉన్నతాధికారులు, అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్ పాల్గొన్నారు. -
మాస్కు తప్పనిసరి.. లేకుంటే నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ,మండలి సమావేశాలు ఈ నెల 7న ప్రారంభమవుతాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ కమిటీ హాల్లో మీడియాతో మాట్లాడుతూ శాసనసభకు వచ్చే సభ్యులందరూ జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. కరోనాను ప్రభుత్వం కట్టడి చేయడం వల్లన మరణాల సంఖ్య తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ హాజరయ్యే సభ్యులు, సిబ్బంది, మీడియా, పోలీసులు తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకుని సభకు హాజరుకావాలన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో కోవిడ్ టెస్టులు ప్రారంభించామని తెలిపారు. జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేల వద్దకు వైద్య సిబ్బంది వచ్చి టెస్టులు నిర్వహిస్తారని వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేల పీఏలు కూడా టెస్టులు చేయించుకోవాలని శ్రీనివాసరెడ్డి తెలిపారు. (చదవండి: ‘టిఫిన్’ తినేదెట్లా?) అసెంబ్లీ లాబీ హాల్లోకి ఎమ్మెల్యేల పీఏలకు అనుమతిలేదని పేర్కొన్నారు. అసెంబ్లీకి వచ్చే ప్రతిఒక్కరికి మాస్కులు తప్పనిసరి అని, లేకుంటే అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులకు కరోనా కిట్లు అందజేస్తున్నామని తెలిపారు. ఆక్సీమీటర్లో 90 కంటే తక్కువగా ఉంటే జాగ్రత్త వహించాలని సూచించారు. లాబీ పాస్‌లు రద్దు చేశామని తెలిపారు. ఈ శాసనసభ సమావేశాలకు మీడియా పాయింట్ ఉండదన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీనియర్ వైద్య బృందం, అసెంబ్లీ- మండలిలో ఒక్కో అంబులెన్స్ అందుబాటులో ఉంచుతామన్నారు. సభా సమయం వృధా కాకుండా సమావేశాలు జరుపుకోవడానికి సభ్యులందరూ సహకరించాలని కోరారు. పార్లమెంట్ తరహాలో, కోవిడ్ నిబంధనలకు లోబడి సమావేశాలు జరుపుతామని స్పీకర్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. (చదవండి: రోజు పది మందే చనిపోతున్నారా?: హైకోర్టు) -
ఒకటో తేదీకల్లా అసెంబ్లీ రెడీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఏడో తేదీ నుంచి మొదలుకానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల కోసం ఒకటో తేదీ కల్లా సభ్యుల సీటింగ్, ఇతర ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేయనుంది. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యుల బృందం గురువారం అసెంబ్లీ, మండ లి సమావేశ మందిరాలను పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించింది. భౌతికదూరం, సీటింగ్‌పై పలు సూచనలు చేసింది. 119 మంది సభ్యులు గల అసెంబ్లీలో 151 స్థానాలు ఉన్నాయి. భౌతికదూరం నిబంధన నేపథ్యంలో అదనంగా మరో 42 సీట్లు తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే అంచనాకు అధికారులు వచ్చారు. గతంలో ఒక్కో సీటుకు ఇద్దరు సభ్యులు కూర్చోగా ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక్కో సీటును ఒక్కో సభ్యుడికి కేటాయిస్తా రు. 40 మంది సభ్యులున్న మండలిలో ప్రస్తుతం 36 మంది ఉన్నారు. ఇందులో 80 సీట్లు ఉండటంతో ఏర్పాట్లకు ఇబ్బంది లేదని అసెంబ్లీ వర్గాలు వెల్లడించా యి. విజిటర్స్, ప్రెస్ గ్యాలరీని మీడియాకు కేటాయించే అవకాశం ఉంది. సీట్ల ఏర్పాటుపై స్పష్టత వచ్చాక ఎందరిని అనుమతించాలనే విషయంపై మీడియా అడ్వైజరీ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. -
ధీశాలి.. సంస్కరణశీలి
సాక్షి, హైదరాబాద్ : ‘మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన 360 డిగ్రీల కోణంలోనూ అద్భుత వ్యక్తిత్వంగల వ్యక్తి. ఆయన వ్యక్తిత్వ పటిమ, ఆయనకు ఆయనే సృష్టించుకున్న గరిమను వర్ణించడానికి మాటలు చాలవు. గొప్ప సంస్కరణశీలి. విమర్శలు వస్తాయని ఏదైనా చేయడానికి కొందరు భయపడతారు. కానీ భయపడకుండా సంస్కరణలను అమలు చేసిన ధీశాలి పీవీ. ఏ రంగంలో కాలుపెడితే ఆ రంగంలో సంస్కరణలు తెచ్చారు’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొనియాడారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, పీవీ కుటుంబ సభ్యులను ప్రధాని వద్దకు తీసుకెళ్లి స్వయంగా విజ్ఞప్తి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే శాసనసభలో పీవీ చిత్రపటం ఏర్పాటు చేస్తామన్నారు. పార్లమెంటులోనూ ఆయన చిత్రపటం ఏర్పాటు చేయాలని పోరాడుతామన్నారు. పీవీ నరసింహారావు 99వ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన సమాధికి సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించి శతజయంతి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు... అన్ని రకాల తెలంగాణ ప్రభలు, ప్రతిభలు మసకబారాయి. వాటన్నింటినీ బయటకు తీసి భావితరాలకు అందించాలి. వ్యక్తిత్వ పటిమను పెంపొందించడానికి పీవీ చరిత్ర ఆదర్శంగా నిలుస్తుంది. నవభారత నిర్మాతల్లో ఆద్యుడు నెహ్రూ అయితే ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ. నెహ్రూకు సమాంతర వ్యక్తి పీవీ అని వంద శాతం ఢంకా బజాయించి చెప్పాలి. ఈ రోజు 51 దేశాల్లో పీవీ జయంతిని తెలంగాణ బిడ్డలు నిర్వహిస్తున్నారు. ఇందుకు రూ. 10 కోట్లు విడుదల చేశాం. హర్పల్ మౌలా (ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలే ప్రజ్ఞగలగే వ్యక్తి) అని పీవీని పాకిస్తానీయులు సైతం పొగిడారు. పీవీ శత జయంతి ఉత్సవాల ముగింపు సభ లక్ష మందితో నిర్వహించే పరిస్థితి రావాలి. జ్ఞాన భూమిలో భారీ మెమోరియల్ తెలుగు అకాడమీకి పీవీ పేరు పెడతాం. కాకతీయ యూనివర్శిటీలో ఆధునిక ఆర్థిక విధానాలపై పీవీ పేరుతో అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తాం. రామేశ్వరంలో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్‌ను మించి పీవీ మెమోరియల్‌ను జ్ఞాన భూమిలో వచ్చే ఏడాది జూన్ 28లోగా ఆవిష్కరిస్తాం. ఇంకొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం పీవీ పేరు పెడతాం. పోస్టల్ స్టాంపు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరతాం. ఎంపీ కేశవరావు సూచన మేరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేంద్రానికి లేఖ రాస్తా. అముద్రితమైన పీవీ రచనలను తెలుగు అకాడమీ ద్వారా ముద్రించి వర్సిటీలకు పంపిస్తాం. ఏ బాధ్యతలు చేపట్టినా సంస్కరణలు ఉమ్మడి ఏపీలో పీవీకి విద్యా మంత్రి పదవి ఇస్తే సర్వేల్లో నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి సహా ఎందరో ఐఏఎస్, ఐపీఎస్, దౌత్యవేత్తలు వాటిల్లో రూపుదిద్దుకున్నారు. కేంద్ర విద్యాశాఖ పదవి ఇస్తే శాఖ పేరును హెచ్ఆర్డీగా మార్చారు. మళ్లీ దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలను ప్రారంభించారు. ఆయనకు జైళ్ల శాఖను అప్పగిస్తే ఓపెన్ జైల్ కాంసెప్ట్ తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు భూ సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన 1,000/1,200 ఎకరాల ఆసామి. ఆయన 200 ఎకరాల భూమిని కుటుంబానికి ఇచ్చుకొని మిగిలిన 800 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. అందుకే పీవీ తెలంగాణ ఠీవీ. విమర్శలొచ్చినా వెనకాడని నిశ్చలమైన వ్యక్తి. భూస్వామ్య వ్యవస్థ పోయి నేడు రాష్ట్రంలో 93% చిన్న, మధ్య రైతులు ఉండటానికి కారణం ఆయనే. ఆర్థిక స్వేచ్ఛకు కారణభూతుడు.. పీవీ ప్రధాని అయ్యే నాటికి దేశం ఉన్న బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టి పరువు నిలబెట్టుకుంటున్న పరిస్థితి ఉండేది. అలాంటి సంక్షోభ సమయంలో ప్రధాని పదవి ఆయన్ను వరించింది. అప్పటివరకు రాజకీయాల్లో లేని, ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన మన్మోహన్సింగ్ను కేంద్ర ఆర్థిక మంత్రిని చేసి ఆయన ద్వారా ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక పరిణతికి కారణభూతుడు పీవీ. తగిన గౌరవం లభించలేదు రాష్ట్రానికి, దేశానికి, భూగోళానికి విజ్ఞాన సముపార్జన చేసిన పీవీ లాంటి గొప్ప వ్యక్తికి లభించాల్సిన గౌరవం లభించకపోవడం బాధాకరం. చేయవలసిన వారు చేయకపోయినప్పటికీ మన బిడ్డ పీవీకి గొప్ప పేరు ప్రఖ్యాతి వచ్చేలా ముందు తరాలకు తెలిసేలా శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిద్దాం. కుల, ధన బలం లేకున్నా ప్రధాని అయ్యారు. నిరంతర అధ్యయనశీలి... పీవీ నోట సరస్వతి నాట్యం చేసినట్లు ఉంటది. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నందుకు నిజాం రాజు పీవీని ఓయూ నుంచి రస్టికేట్ చేసి తెలంగాణ రాజ్యంలో ఎక్కడా సీటు ఇవ్వొద్దంటే మహారాష్ట్రలో సీటు సంపాదించారు. మరాఠీ భాషను నేర్చుకోవడమే కాకుండా ఆ భాషలోని నవలను తెలుగులోకి తర్జుమా చేశారు. వయసుతో నిమిత్తం లేని గొప్ప విద్యార్థి పీవీ. అందుకే ఆయనకు 17 భాషలు వచ్చాయి. నిరంతర అధ్యయనశీలి పీవీ. పీవీ ఆశయం కోసమే 900 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి పదవికి వన్నె తెచ్చారు: కేకే ప్రతి పదవికి వన్నె తెచ్చిన మహానీయుడు పీవీ అని పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు అన్నారు. . భారత ఆర్థిక, సామాజిక, రాజకీయ సుస్థిరతకు పీవీ అందించిన సేవలు సదా స్మరణీయమన్నారు. నాడే చెప్పిన పీవీ: పోచారం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వల్లే సాధ్యమని, ఆయనే తొలి సీఎం అవుతారని ముందే పీవీ చెప్పారని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శ్రమను ఎక్కడా చెప్పుకోలేదు పీవీలో ఎన్నో పార్శా్వలు ఉన్నాయి. బహుభాషా కోవిదుడు, రాజనీతిజు›్ఞడు, సాహితీవేత్తగా మాత్రమే పీవీ ప్రజలకు తెలుసు. కానీ ఆయన శాస్త్ర పరిజ్ఞానాన్ని, ఖగోళ శాస్త్రాన్ని, సంగీతాన్ని బాగా ఇష్టపడేవారు. మంచి దౌత్యవేత్త కూడా. చేసే పనిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇష్టపడేవారు. తన శ్రమను ఎప్పుడూ చెప్పుకోలేదు. పక్క వారిని కూడా చెప్పనిచ్చే వారు కాదు. పీవీ శత జయంతి ఉత్సవాలు ఆయన గురించి ప్రజలకు తెలియజేయడానికి మంచి వేదిక. వచ్చే ఏడాది నాటికి పూర్తిగా భిన్నమైన పీవీని ఈ ఉత్సవాలు ప్రపంచానికి పరిచయం చేస్తాయని ఆశిస్తున్నా. – పీవీ ప్రభాకర్‌రావు, పీవీ కుమారుడు హెచ్సీయూకు పీవీ పేరు పెట్టాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. 1975లో జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా, 6 పాయింట్స్ ఫార్మూలా అమలులో భాగంగా ఈ వర్సిటీ ఏర్పాటైందని ప్రధానికి కేసీఆర్ గుర్తుచేశారు. దేశ ఆర్థిక, విద్యా, సాహిత్య రంగాల వృద్ధికి ఎంతో కృషి చేసిన పీవీ పేరును ఈ వర్సిటీకి పెట్టాలని తెలంగాణ సమాజం కోరుకుంటోందని ప్రధానికి తెలియజేశారు. కేసీఆర్‌కు కృతజ్ఞతలు భాషకు అందని వ్యక్తిత్వం మా బాపుది. మాకు బాపు గురించి అన్నీ తెలుసనుకున్నాం. కానీ మాకు తెలియని విషయాలు రోజూ తెలుస్తూనే ఉన్నాయి. పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. – వాణీ దయాకర్‌రావు, పీవీ కుమార్తె శ్రమను ఎక్కడా చెప్పుకోలేదు పీవీలో ఎన్నో పార్శా్వలు ఉన్నాయి. బహుభాషా కోవిదుడు, రాజనీతిజు›్ఞడు, సాహితీవేత్తగా మాత్రమే పీవీ ప్రజలకు తెలుసు. కానీ ఆయన శాస్త్ర పరిజ్ఞానాన్ని, ఖగోళ శాస్త్రాన్ని, సంగీతాన్ని బాగా ఇష్టపడేవారు. మంచి దౌత్యవేత్త కూడా. చేసే పనిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇష్టపడేవారు. తన శ్రమను ఎప్పుడూ చెప్పుకోలేదు. పక్క వారిని కూడా చెప్పనిచ్చే వారు కాదు. పీవీ శత జయంతి ఉత్సవాలు ఆయన గురించి ప్రజలకు తెలియజేయడానికి మంచి వేదిక. వచ్చే ఏడాది నాటికి పూర్తిగా భిన్నమైన పీవీని ఈ ఉత్సవాలు ప్రపంచానికి పరిచయం చేస్తాయని ఆశిస్తున్నా. – పీవీ ప్రభాకర్‌రావు, పీవీ కుమారుడు -
సంక్షోభంలోనూ సంక్షేమం
సాక్షి, సిరిసిల్ల: తమ ప్రభుత్వం సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తోందని మునిసిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌లో అర్బన్ ఫారెస్ట్ పార్క్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. మొక్కలు నాటిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో ఆసరా పింఛ న్లు, రేషన్ బియ్యం, కేసీఆర్ కిట్లు కొనసాగిస్తూనే.. రైతుబంధు, రుణమాఫీ అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. కరోనా వచ్చిన ప్రస్తుత సంక్షోభ సమయంలో రాష్ట్రంలోని 54.22 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పు న రూ.6,889 కోట్ల రైతుబంధు సాయాన్ని అందించామని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ.. రాష్ట్రంలోని 5.60 లక్షల మంది రైతులకు రూ.1,200 కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 46 వేల చెరువులను నింపే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. పాడి పంటలతో రాష్ట్రం ఆర్థికంగా బలపడాలని కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. హరితహారం దేశానికే ఆదర్శం: పోచారం రాష్ట్రంలో ఓ యజ్ఞంలా హరితహారం నిర్వహిస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ మానేరు వాగులో శుక్రవారం చేపట్టిన మెగా ప్లాంటేషన్‌లో మంత్రి కేటీఆర్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ పవిత్ర హృదయం, చిత్తశుద్ధితో యజ్ఞాన్ని చేసినట్లుగా రాష్ట్రంలో మొక్కలు నాటి సంరక్షించే యజ్ఞా న్ని సీఎం చేపట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 230 కోట్ల మొక్కల్ని నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మనిషి మనుగడ చెట్లు, కట్టెతో ముడిపడి ఉందన్నారు. ఎంత అభివృద్ధి చేసినా, ఎన్ని సం క్షేమ పథకాలు అమలు చేసినా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే ప్రజలు జబ్బుల బారిన పడతారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 శాతం మాత్రమే వన సంపద ఉందన్నారు. పచ్చదనం ఉంటేనే భవిష్యత్ ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున సాగుతున్నాయని తెలిపారు. మంత్రి కేటీఆర్ అద్భుతంగా పనిచేస్తూ రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నారని కితాబిచ్చారు. హరిత విప్లవం రావాలి రాష్ట్రంలో హరిత విప్లవం రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. మొక్కలు నాటడం ద్వారా రాజకీయంగా లాభమేమీ కాదని, కానీ, భవిష్యత్ తరాల కోసమే ఈ ప్రయత్నం అని పేర్కొన్నారు. హరితహారాన్ని ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈసారి ప్రజల సెంటిమెంట్లను గౌరవించి పండ్లు, పూల మొక్కల్ని, రాశీ వనాలు, నక్షత్ర వనాలను పెంచుతున్నామని ఆయన వివరించారు. తెలంగాణలో చేపట్టిన హరితహారం దేశానికే ఆదర్శమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా 95 బ్లాక్‌లను గుర్తించామని, సిరిసిల్లలోనూ అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో గాలి కొనుక్కోకుండా ఉండాలంటే పాడైన అడవులను బాగు చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. -
కంటతడి పెట్టిన స్పీకర్ పోచారం
వర్ని: డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం హంగర్గా గ్రామంలో 30 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నష్టం వస్తుందన్న కారణంతో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావ డం లేదన్నారు. ఈ దశలో తన తనయుడితోపాటు మం డల ప్రజాప్రతినిధులను బ్రతిమా లి ఇళ్ల నిర్మాణం ముందుకు సాగేలా చూస్తున్నామన్నారు. వేరే నియో జకవర్గాల్లో తొలి విడత ఇళ్ల నిర్మా ణం కూడా పూర్తి కాలేదని, ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే కొందరు అర్థం చేసుకోకుండా విమర్శలు చేస్తుండడం బాధ కలిగిస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే వెంటనే సర్దుకున్నారు. -
స్పీకర్‌ను కలిసిన కవిత
సాక్షి, హైదరాబాద్ : మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత బుధవారం ఉదయం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. కవితతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, బాజీరెడ్డి గోవర్థన్ తదితరులు స్పీకర్‌ను కలిశారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో... పోచారంను కలిసిన అనంతరం కవిత అక్కడ నుంచి నేరుగా నిజామాబాద్ బయల్దేరారు. (మండలి ‘స్థానిక’ అభ్యర్థిగా కవిత) కాగా శాసనమండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత బుధవారం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. టీఆర్ఎస్ నుంచి పలువురు ఆశావహులు టికెట్ ఆశించినా పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం కవిత అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారు. -
4 రోజులు ముందుగానే...
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6న ప్రారంభమైన అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు సోమవారం ముగియనున్నాయి. కోవిడ్‌పై ప్రభుత్వ కఠిన నిర్ణయాల నేపథ్యంలో ఈ నెల 20 వరకు జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల ముందుగానే ముగుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల కుదింపునకు సం బంధించి ఆదివారం సాయంత్రం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చాంబర్లో శాసనసభ ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, హరీశ్‌రావు, ఎంఐఎం, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. కోవిడ్‌పై ప్రభుత్వ నిర్ణయాల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో శాసనసభ, మండలి రెండూ సోమవారం ఉదయం 11 గంటలకు వేర్వేరుగా సమావేశమవుతాయి. చివరి రోజు సమావేశంలో అత్యంత కీలకమైన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) బిల్లును ప్రవేశపెడతారు. దీనిపై చర్చించిన తర్వాత తీర్మానం చేస్తారు. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెడతారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇతర బిల్లులతో పాటు, సీఏఏ వ్యతిరేక తీర్మానం, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తరువాత శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తారు. అనంతరం మండలి కూడా సీఏఏ వ్యతిరేక తీర్మానం, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత వాయిదా పడనుంది. పద్దులపై చర్చ... అసెంబ్లీ సమావేశ తేదీల కుదిం పు నేపథ్యంలో ఆదివారం బడ్జె ట్ పద్దులపై చర్చ జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబం ధించిన 25 పద్దులపై పలు పార్టీ లకు చెందిన 23 మంది సభ్యులు ప్రసంగించారు. ఆదివారం ఉదయం 11గంటలకు పద్దులపై మొదలైన చర్చ రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రుల సమాధానాలు చెప్పారు.