
బాన్సువాడ: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. పోచారం తల్లి పాపమ్మ (107) ఈనెల 5వ తేదీన కన్నుమూసిన విషయం విదితమే. పోచారంను పరామర్శించడానికి ముఖ్యమంత్రి ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో కామారెడ్డి జిల్లా బాన్సువాడకు వచ్చారు. అక్కడి నుంచి వాహనంలో పోచారం గ్రామానికి వెళ్లి పాపమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అరగంటపాటు ఆయన నివాసంలో ఉన్నారు. సీఎం వెంట ఎంపీ కవిత, మాజీ స్పీకర్ మ«ధుసూదనాచారి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వచ్చారు.
ప్రముఖుల పరామర్శ
శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు పోచారంను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment