Bansuvada
-
ధైర్యంగా ఉండండి
బాన్సువాడ: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. పోచారం తల్లి పాపమ్మ (107) ఈనెల 5వ తేదీన కన్నుమూసిన విషయం విదితమే. పోచారంను పరామర్శించడానికి ముఖ్యమంత్రి ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడకు వచ్చారు. అక్కడి నుంచి వాహనంలో పోచారం గ్రామానికి వెళ్లి పాపమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అరగంటపాటు ఆయన నివాసంలో ఉన్నారు. సీఎం వెంట ఎంపీ కవిత, మాజీ స్పీకర్ మ«ధుసూదనాచారి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చారు. ప్రముఖుల పరామర్శ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు పోచారంను పరామర్శించారు. -
ఆన్లైన్లో సబ్సిడీ విత్తనాలు
బాన్సువాడ: సబ్సిడీ విత్తనాలను అక్రమార్కులు సరిహద్దులు దాటించి పక్క రాష్ట్రాలకు విక్రయించే విధానానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. సబ్సిడీ విత్తనాలు అసలైన రైతులకే లభించేలా ఆన్లైన్ విధానాన్ని సర్కారు ప్రవేశపెట్టింది. గతేడాది వానాకాలం సీజన్లోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా, సత్ఫలితాలొచ్చాయి. దీంతో ప్రస్తుత ఖరీఫ్‌లోనూ ఆన్లైన్లోనే విత్తనాలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొన్న తర్వాతే రైతులకు సబ్సిడీ విత్తనాలను అందిస్తారు. రాయితీ విత్తనాలు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అక్రమాలకు తెర పడనుంది. రాయితీ విత్తనాల్లో అక్రమాలు ప్రతి ఏడాది రాయితీ విత్తనాల పంపిణీలో అక్ర మాలు జరిగేవి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న బాన్సువాడ, బీర్కూర్, కోటగిరి, మద్నూర్, జుక్కల్, పిట్లం మండలాలకు చెందిన కొందరు వ్యక్తులు సబ్సిడీ విత్తనాలను మహారాష్ట్ర, కర్ణాటకకు తరలించి, అక్కడ విక్రయించే వారు. శనగ విత్తనాలు క్వింటాళ్ల కొద్దీ తరలిపోయేవి. ఏ రైతు ఎన్ని విత్తనాలు తీసుకొంటున్నారనే సమాచారం ఉండేది కాదు. గతంలో కొన్ని విత్తనాలు కేంద్రాల కు రాకముందే నేరుగా తరలించి విక్రయించుకున్నారు. అందుబాటులో విత్తనాలు ఎన్ని ఉన్నా యో తెలియని పరిస్థితి ఉండేది. ఎన్ని రోజులు ఇస్తారో తెలిసేది కాదు. దీంతో రైతులు విత్తన కొనుగోలు కేంద్రాల్లో బారులు తీరి, విత్తనాలు ల భించక ఆందోళనలు చేసే వారు. కొందరు రైతుల పేరును ఉపయోగించుకొని సబ్సిడీ విత్తనాలు తీసుకొని మార్కెట్లో అమ్ముకొనేవారు. అధికారు లు ఇష్టం వచ్చిన వారికి కూపన్లు జారీ చేసే వారు. మార్కెట్లో సంబంధిత విత్తనాల ధరలు ఎక్కువ ఉండడం, రాయితీ విత్తనాలు తక్కువ ధరకు లభించడంతో వేల క్వింటాళ్ల విత్తనాలు పక్కదారి పట్టేవి. గతంలో విత్తనాలు పొందాలంటే మండల కేంద్రానికి వెళ్లి కూపన్లు పొందాల్సి వచ్చేది. కొన్ని గ్రామాల రైతులకు దూర భారం కావడంతో పాటు వెళ్లిన సమయంలో వ్యవసాయాధికారి లేని పక్షంలో కూపన్లు తీసుకోవడానికి గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. అక్రమాలకు చెక్ ఈ నేపథ్యంలో సబ్సిడీ విత్తనాల సరఫరాలో జరుగుతున్న అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. గతేడాది జీలుగ, జనుము విత్తనాలను ఆన్లైన్లో సరఫరా చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ప్రస్తుత వానాకాలంలో వీటితో పాటు వరి, సోయా విత్తనాలను కూడా ఆన్లైన్లోనే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్లో రాయితీ విత్తనాలు పొందేందుకు వీలుగా క్లస్టర్ స్థాయిలో కూపన్లు పొందేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో ఈ ఖరీఫ్‌లో పంటలు సాగు చేస్తారని అంచనా. ఈ మేరకు రాయితీపై విత్తనాలను పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఇతర పంటల సాగు విస్తీర్ణం మేరకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేయనున్నారు. రైతు బంధు చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తి కాగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సీజన్ నుంచి మండల వ్యవసాయాధికారి ద్వారా క్లస్టర్ స్థాయిలోనే కూపన్లు జారీ చేయనున్నారు. ఆన్లైన్ ఇలా.. రాయితీ విత్తనాలు అవసరమైన రైతులు వ్యవసాయాధికారి వద్దకు వెళ్లి తమ పట్టాదారు పాస్‌పుస్తకం ఖాతా సంఖ్య నమోదు చేయించాలి. ఆ రైతుకు సంబంధించిన భూమి వివరాలు, సర్వే నంబర్, గతేడాది వేసిన పంట తదితర వివరాలు వెల్లడవుతాయి. రైతుకు ఉన్న భూమికి తగ్గట్టుగా అవసరమైన విత్తన సంచులకు సంబంధించిన కూపన్ నంబర్ రైతు సెల్ నంబర్‌కు చేరుతుంది. ఆ సంఖ్యను విత్తన కేంద్రంలో చూపించి రాయితీ పోనూ మిగతా డబ్బులు చెల్లిస్తే విత్తనాలు ఇస్తారు. అయితే, ఏ రోజు కూపన్ తీసుకొంటారో అదే రోజు రైతులు విత్తనాలను తీసుకోవాలి. మరుసటి రోజు ఆ కూపన్ చెల్లదు. మళ్లీ విత్తనాలు పొందాలంటే కూపన్లు పొందాల్సి ఉంటుంది. ఏ రోజు ఎంత మంది విత్తనాలు పొందారు? ఇంకా ఎంత నిల్వ ఉందనే వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వ్యవసాయ అధికారికి సమాచారం అందుతుంది. విత్తన కేంద్రాల్లో ఎన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయనే సమాచారం అధికారుల వద్ద ఉంటుంది. రైతులు రెండు, మూడు సార్లు విత్తనాలు కొనుగోలు చేయడానికి వీలుండదు. -
బోధన్ ఇరిగేషన్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి
సాక్షి, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ ఇరిగేషన్ డిఈ శ్రావణ్ కుమార్ రెడ్డి ఇంటిపై ఏసీబి దాడులు చేసింది. బాన్సువాడ లోని ఆయన నివాసంలో రూ.40లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఖదీదైన కారును సీజ్ చేశారు. ఆర్మూర్‌లో ఉన్న ఆయన ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు జరిపింది. ఇక్కడా విలువైన అస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటికి సంబంధించిన పత్రాలను సీజ్ చేశారు. -
పిచ్చికుక్కల స్వైరవిహారం
నెమ్లి(బీర్కూర్): మండలంలోని నెమ్లి గ్రామంలో పిచ్చికుక్కలు సోమవారం స్వైర విహారం చేశాయి. గ్రామానికి చెందిన పోశబోయి, సాయబోయితో పాటు దత్తు, అంజి అనే విద్యార్థులపై దాడి చేసి గాయపర్చాయి. వీరిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కలను స్థానికులు గ్రామం నుంచి తరిమికొట్టారు. -
బాన్సువాడలో 25 బైక్‌లు స్వాధీనం
బాన్సువాడ(నిజామాబాద్ జిల్లా): బాన్సువాడ మండలం రాజారామ్దుబ్బ, ఎర్రమనుగుట్ట కాలనీల్లో సోమవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు 25 దొంగిలించిన బైక్‌లను స్వాధీనంచేసుకున్నారు. ఈ తనిఖీల్లో బాన్సువాడ డీఎస్పీ వెంకటేశ్వర్లుతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
బాన్సువాడలో సైకో కలకలం
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపూరలో సోమవారం నాడు ఓ సైకో కలకలం సృష్టించారు. రోడ్డు వెంబడి ఉన్న వాహనాలను గొడ్డలితో ధ్వంసం చేస్తూ, అద్దాలను పగులగొడుతూ వీరంగం చేశాడు. అడ్డుకొనేందుకు యత్నించిన వ్యక్తులపై దాడిచేశాడు. దీంతో కాలనీవాసులందరూ అత న్ని వెంబడించి అతికష్టంగా పట్టుకొన్నారు. అనంతరం స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. మతిస్థిమితం లేకనే అతను ఇలా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్లకు మోక్షం!
బాన్సువాడ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ పడిపోయిన బిల్లులను ఇక చెల్లించనున్నారు. పది నెలలుగా బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో చాలావరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. కొంతమంది అప్పు చేసి ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగించారు. కాగా ఇటీవల గృహ నిర్మాణ శాఖ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించి ఆన్లైన్ చెల్లింపులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నిధులను సైతం విడుదల చేయడంతో గృహ నిర్మాణదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇందిరమ్మ పథకం కింది జిల్లాలో సుమా రు 1.57లక్షల మంది లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వివిధ దశల్లో నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాకు మూడు విడతల్లో 2,41,992 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 1,57,824 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే 84,168 ఇళ్లు ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు. మరో 6,956 ఇళ్లు ప్రాథమిక స్థాయిలో ఉండగా, 15,390 ఇళ్లు బేస్మిట్ లేవల్లో, 1,689 ఇళ్లు లెంటల్ లెవల్లో , రూఫ్ లెవల్లో 5,398 ఇళ్లు ఉన్నాయి. మరో 29,433 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకొన్నాయి. జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 1,28,391 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ లెక్కన జిల్లాలో 53 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం బిల్లుల చెల్లింపు పున:ప్రారంభమవడంతో గృహ నిర్మాణ అధికారులు ఇంటి నిర్మాణాన్ని బట్టి లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. లే అవుట్ ఉంటేనే .. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించబోయే ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపికలో అనేక నిబంధనలు వర్తించేవిధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో విచ్చలవిడిగా అవినీతి జరగడం, ఒకే ఇంటికి ఐదు నుంచి 10 ఇళ్ల రుణాలు పొందడం లాంటి అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అలాంటి అవకతవకలకు తావులేకుండా, లేఅవుట్ ప్లాట్లు ఉన్న వారికే ఇళ్ల రుణాలు మంజూరు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. నిరుపేదలకు ఇళ్లను ఇకపై ప్రత్యేకంగా లేఅవుట్లు ఉన్న చోటనే నిర్మించాలని నిర్ణయించారు. లేఅవుట్ స్థలం ఉన్న నిరుపేదలను ఎంపిక చేసి వారికి రూ. 3.50 లక్షలతో ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో రెండంతస్తుల భవనాల వారూ ఇందిరమ్మ పథకం ద్వారా నిధులు పొందగా, ప్రస్తుతం వాటిని గుర్తించడం కష్టంగా మారింది. ఇప్పుడలా జరగకుండా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా, అర్హులను గుర్తించనున్నారు. లేఅవుట్ కాలనీల్లో ఇళ్లను నిర్మిస్తే అక్కడ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలు కల్పించ వచ్చని, దీంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్రూం, హాలు, కిచెన్‌కు రూ.3.50 లక్షలు సరి పోవని, రూ.4.60 లక్షల వరకు వ్యయం అవుతుందని గృహనిర్మాణ సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే లబ్ధిదారుడు నేరుగా ఇల్లు నిర్మించుకుంటే రూ.3.50 లక్షలు ఇవ్వవచ్చని వారు అంటున్నారు. ప్రభుత్వం తరపున నిర్మిస్తే 14 శాతం కాంట్రాక్టర్ లాభం, 5 శాతం వ్యాట్, 2 శాతం ఆదాయపు పన్ను, మైనిం గ్ పన్ను 5 శాతం, కార్మిక సెస్ 5 శాతం, పర్యవేక్షణ చార్జీలు 7 శాతం కలిపి సుమారు 30 శాతం వ్యయం అదనంగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుడు నేరుగా నిర్మించుకొంటే ఈ అదనపు భారం తప్పుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి రూ.3.5 లక్షల చొప్పున బిల్లులు చెల్లిస్తామని ప్రకటించడంతో లబ్ధిదారులు గంపెడాశతో ఉన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకొన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేస్తారా? లేదా గత మార్చిలో దరఖాస్తు చేసుకొన్న వారికి సైతం వర్తిం పజేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఈ పథకంలోని విధి విధానాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నిలిచిన ఇళ్ల నిర్మాణాలు పదినెలలుగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోవడంతో సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, సామిల్స్ వ్యాపారులపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఒకవైపు నిర్మాణ దారులు బిల్లులు లేక పనులను ఆపేస్తుండగా, మరోవైపు సంబంధింత వ్యాపారులు అప్పులు చెల్లించలేక విలవిల్లాడుతున్నారు.ఈసారి ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల సాగు విస్తీర్ణం తగ్గడంతో కూలీలకు చేతినిండా పని లేకపోయింది. ఇంటి నిర్మాణాల్లో కూలీ పనులు చేసుకోవాలనుకున్నా, ఇక్కడా వారికి పని దొకరడం లేదు. వెరసి కూలీలు వలస వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఇసుక తిప్పలు
బాన్సువాడ: ఇసుక క్వారీలకు అనుమతి లేదంటూ పలువురు కాంట్రాక్టర్లు కృత్రిమ కొరతను సృ ష్టించి ఇసుక ధరలను పెంచేశారు. దొడ్డిదారిన , అక్రమంగా రోజూ వందలాది లారీల ఇసుకను మంజీరా నుంచి తోడుతున్నా, ఇసుక కొరత ఉందంటూ వీరు నిర్మాణదారులను దోచుకొంటున్నారు. మంజీరా తీర ప్రాంతంలోని బిచ్కుంద మండలం హస్గుల్, షెట్లూర్, వాజిద్నగర్, పిట్లం మండలంలోని మద్దెల్‌చెరు, బాన్సువాడ మండలం చింతల్ నాగారం, బీర్కూర్ మండలం కిష్టాపూర్, దామరంచ, బీర్కూర్, బరంగేడ్గి, కోటగిరి మండలం హంగర్గ, పోతంగల్ తదితర ప్రాంతాల నుంచి రోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీలలో ఇసుక తరలి వెళ్తోంది. ఇసుక రవాణాకు అనుమతి లేకున్నా పలువురు కాంట్రాక్టర్లు ఇందిరమ్మ ఇండ్లకు, ప్రభుత్వ పనుల కోసమంటూ నకిలీ అనుమతులు తీసుకొని యథేచ్ఛగా ఇసుకను రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రిపూటే ఈ దందా నిరాటంకంగా కొనసాగుతున్నా పట్టించుకున్నవారు మాత్రం లేరు. ఇసుకను నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, హైదరాబాద్‌కు సై తం రవాణా చేస్తున్నారు. బాన్సువాడలోని పలు ప్రాంతాలలో ఇసుక డంపులు ఉన్నాయి. కనీసం 50 నుంచి 100 లారీల ఇసుకను నిలువ చేసి, అక్కడి నుంచి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా నిర్మాణదారులకు సరఫరా చేస్తున్నారు. అనధికారికమే ఇసుక క్వారీలు, పట్టాదారులు ఇసుకను తరలించకుండా నాలుగు నెలల క్రితం ప్రభుత్వం అనుమతులను నిలిపివేసింది. అయినా, రెవెన్యూ అధికారులు, పోలీసుల తో మిలాఖాత్ అయిన కాంట్రాక్టర్లు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాలలో వీరు దళారులను ఏర్పాటు చేసుకొని అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తున్నారు. నిర్మాణదారులు ప్రశ్నిస్తే ఇసుక క్వారీలకు ప్రభుత్వ అనుమతి లేదని, అందుకే ధరలు పెంచాల్సి వస్తోందని అంటున్నారు. మరో వైపు మంజీరా నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభమైనందున ధరలు తగ్గుతాయని ఇటు అధికారులు, అటు నిర్మాణదారులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. నిలిచిన నిర్మాణాలు ఇసుక లేకపోవడంతో నాలుగు నెలలుగా అనేక నిర్మాణాలు నిలిచిపోయాయి. గతంలో పట్టణ పా్రంతాలలో ట్రాక్టర్ ఇసుక సీనరేజి, రవాణాతో కలిపి రూ.1,350కి వచ్చేది. చిన్న చిన్న పాయింట్ల నుంచి తీసుకువచ్చే ఇసుక రూ. 800 నుంచి 1200 వరకు లభించేది. నాటి ధరలు ప్రస్తుతం ఎక్కడా కనిపించడంలేదు. ప్రస్తుతం క్వారీల లో ట్రాక్టర్ ఇసుకను రూ. రెండు వేల నుంచి రూ. మూడు వేల వరకు విక్రయిస్తున్నారు. పనులు నిలిపివేసిన యజమానులు చేసేదేమీ లేక అదే ధరకు కొనుగోలు చేస్తున్నారు. అధికారులు కల్పించుకొంటే ధర తగ్గుతుందని మరికొందరు ఆశతో ఎదురు చూస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల ఉదాసీనత కూడా వ్యాపారులకు కలి సొచ్చింది. కాంట్రాక్టర్లే ధరను పెంచారని బ్రోకర్లు చెబుతుండగా, కాదు బ్రోకర్లే పెంచారని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. ఏది నిజమో తెలియని నిర్మాణదారులు గంద రగోళానికి గురవుతున్నారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో ఇండ్ల నిర్మాణాలకు ఇబ్బందులు తప్పవని యజమానులు ఆందోళన చెందుతున్నారు. నిజాంసా గర్ ప్రధాన కాలువ ఆధునికీకరణ నిమిత్తం ఇసుక తరలింపునకు ప్రభుత్వం అనుమతినివ్వగా, కాంట్రాక్టర్లు దీన్ని ఆసరాగా చేసుకొని ఇసుకను విక్రయిస్తున్నట్లు ఆరోప ణలు వస్తున్నాయి. పెరుగుతున్న సమస్యలు ఇసుక తరలింపుతో గ్రామాలలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మంజీరా తీర ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వంద అడుగుల వరకు బోరుబావులు తవ్వినా నీళ్లు పడడం లేదని రైతులు వాపోతున్నారు. మంజీరా నుంచి ఇసుక తరలిపోతే చాలా బోర్లు ఎండిపోతాయి. పొలాలు బీడులుగా మిగిలి పోతాయి. డీఫ్లోరైడ్ పథకాలు వట్టి పోతాయి. పరిమితికి మించి 40 టన్నుల లోడ్‌తో లారీలు వెళ్తే కోట్లాది రూపాయలతో నిర్మించిన బీటి రోడ్లు, సీసీ రోడ్లు శిథిలమైపో తాయని పలువురు ఆందోళన చెందుతున్నారు.