నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపూరలో సోమవారం నాడు ఓ సైకో కలకలం సృష్టించారు.
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపూరలో సోమవారం నాడు ఓ సైకో కలకలం సృష్టించారు. రోడ్డు వెంబడి ఉన్న వాహనాలను గొడ్డలితో ధ్వంసం చేస్తూ, అద్దాలను పగులగొడుతూ వీరంగం చేశాడు. అడ్డుకొనేందుకు యత్నించిన వ్యక్తులపై దాడిచేశాడు. దీంతో కాలనీవాసులందరూ అత న్ని వెంబడించి అతికష్టంగా పట్టుకొన్నారు. అనంతరం స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. మతిస్థిమితం లేకనే అతను ఇలా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు.