Nizamabad News
-
భార్యపై కోపంతో కూతురిని మంటల్లోకి తోసేసి..
బాల్కొండ(నిజామాబాద్): భార్యపై కోపంతో కన్న కూతురిని కడతేర్చాడో తండ్రి. అల్లారు ముద్దుగా పెంచిన చేతులతోనే క్షణికావేశంతో మంటల్లోకి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్‌రావు శనివారం కేసు వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ కాలనీకి చెందిన కడమంచి కాశీరాం, పోసాని దంపతులు. వీరికి సితారి సమ్మక్క (10), సితారి సారక్క(9) అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాశీరాం కుటుంబంతో కలిసి బతుకుదెరువు కోసం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ధని గ్రామానికి కొంతకాలం క్రితం వలస వెళ్లారు. చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించే వారు మే 11న మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామానికి వచ్చారు. అదే రోజు భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో పోసాని కనిపించకుండా పోయింది. దాంతో తీవ్ర ఆగ్రహంతో కాశీరాం తన ఇద్దరు పిల్లలను చంపాలని నిర్ణయించుకున్నాడు. కట్టెలకు నిప్పు పెట్టి, ఆ మంటల్లో పిల్లల దుస్తులను, చిన్న కూతురు సారక్కను తోసేసాడు. పెద్ద కూతురు పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. చిన్నారి అరవడంతో స్థానికులు గమనించి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 10న సారక్క మృతి చెందింది. శనివారం ఉదయం పోచంపాడ్ కూడలి వద్ద నిందితుడు కాశీరాం పోలీసులకు దొరకడంతో రిమాండుకు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. చదవండి: బంజారాహిల్స్: మసాజ్ చేస్తూ గొలుసు కొట్టేశారు.. -
ఫ్యాకల్టీ లేని ‘డైట్’ కళాశాల
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: భవిష్యత్తు ఉపాధ్యాయులను తయారు చేసేందుకు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో అనేక ఏళ్ల నుంచి కొనసాగుతున్న ‘డైట్’(ప్రభుత్వ జిల్లా విద్యా, శిక్షణ సంస్థ) కళాశాలలు అధ్యాపకులు లేకుండానే కొనసాగుతున్నాయి. పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 1989 నుంచి ఏటా వందల మంది విద్యార్థులు తాము సాధించిన ర్యాంకుల ద్వారా డీఎడ్ కోర్సుల్లో చేరుతున్నారు. నల్లగొండ, ఖమ్మం కళాశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉండగా, మిగిలిన వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, వికారాబాద్ కళాశాలల్లో తెలుగు, ఆంగ్లంతో పాటు ఉర్దూ మాధ్యమం కూడా ఉంది. అయితే ఇవి గత మూడేళ్లుగా అధ్యాపకులు లేకుండానే నడుస్తున్నాయి. పది చోట్ల 290 మంది టీచింగ్ స్టాఫ్ ఉండాల్సి ఉంది. అయితే మొత్తం రాష్ట్రంలోని 10 కళాశాలల్లో కలిపి 300 మందికి గాను కేవలం 17 మంది మాత్రమే ఉన్నారు. ఉర్దూ మీడియం లేని ఖమ్మం, నల్లగొండ కళాశాలల్లో 24 మంది అధ్యాపకులు, మిగిలిన 8 కళాశాలల్లో 29 మంది చొప్పున అధ్యాపకులు ఉండాలి. అయితే ఎక్కడా కూడా సరిపడా అధ్యాపకులు లేకపోగా, ఉన్న అధ్యాపకులు, ప్రిన్సిపపాళ్లు వివిధ జిల్లాలకు ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో నామమాత్రంగా ఉన్న అధ్యాపకులు సైతం అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. అంతా అస్తవ్యస్తం.. నిజామాబాద్ డైట్ కళాశాలలో రెగ్యులర్ ప్రిన్సిపల్ ఉండగా, ఒకే ఒక్క అధ్యాపకుడు ఉన్నారు. ఆ అధ్యాపకుడు కూడా ఆసిఫాబాద్ డీఈవోగా వ్యవహరిస్తున్నారు. మెదక్ కళాశాలలో రెగ్యులర్ ప్రిన్సిపల్, ఒకే ఒక్క అధ్యాపకుడు ఉన్నారు. వరంగల్ కళాశాలలో అధ్యాపకులు ఎవరూ లేరు. కళాశాల ప్రిన్సిపల్ యాదాద్రి భువనగిరి డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కళాశాలలో అధ్యాపకులు లేరు. రెగ్యులర్ ప్రిన్సిపల్ ఉన్నారు. వికారాబాద్ కళాశాలలో ఇద్దరు అధ్యాపకులు ఉండగా, ప్రిన్సిపల్ లేరు. నల్లగొండ కళాశాలలో ఒకే ఒక్క అధ్యాపకుడు ఉండగా, ప్రిన్సిపల్ లేరు. కరీంనగర్ కళాశాలలో ప్రిన్సిపల్ లేకపోగా, ఉన్న ముగ్గురు అధ్యాపకుల్లో ఒకరు జగిత్యాల డీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ కళాశాలలో ప్రిన్సిపల్ లేకపోగా ఇద్దరు అధ్యాపకులు ఉన్నారు. వీరిలో ఒకరు నిర్మల్ డీఈవోగా ఉన్నారు. ఖమ్మం కళాశాలలో ఇద్దరు అధ్యాపకులు ఉండగా, ఒకరు భద్రాద్రి కొత్తగూడెం డీఈవోగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్ కళాశాలలో నలుగురు అధ్యాపకులు ఉండగా, అందులో ముగ్గురు వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలకు డీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీలు, రిటైర్డ్ లెక్చరర్లతో పాఠాలు బోధిస్తున్నప్పటికీ.. అంతంతమాత్రమేనని విమర్శలు ఉన్నాయి. నిజామాబాద్ కళాశాలలో పూర్వ విద్యార్థులతో తరగతులు చెప్పిస్తున్నారు చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం -
‘అవుట్సోర్సింగ్ సిబ్బంది పొట్టగొట్టారు’
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వీ సీ ప్రొఫెసర్ సాంబయ్యను అవుట్ సోర్సింగ్ సి బ్బంది అడ్డుకుని నిరసన తెలిపారు. వీసీ మూడే ళ్ల పదవీకాలం బుధవారం ముగిసింది. గురువా రం వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి వెళ్లేందుకు వీసీ సిద్ధమయ్యారు. ఇంతలోనే వీసీ రెసిడెన్స్ వ ద్దకు చేరుకున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది అక్క డే బైటాయించి ధర్నా నిర్వహించారు. జీవో నెంబరు 14 ప్రకారం వేతనాలు పెంచకుండా తమకు తీవ్ర అన్యాయం చేశాడరని ఆరోపించారు. మూడేళ్ల కాలంలో వీసీ ఒక నియంతలా వ్య వహరించారని, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీ వ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెసిడెన్స్ నుంచి బయటకు వచ్చిన వీసీ సాంబయ్యను చుట్టుముట్టిన అవుట్సోర్సింగ్ సిబ్బంది తమ పొట్టారని ఆరోపిస్తూ దుర్భాషలాడారు. సమాన పనికి సమాన వేతనం చెల్లిం చాలని జీవో ఉన్నప్పటికీ తెలంగాణ యూనివర్సిటీలో అమలు చేయకుండా సాంబయ్య తమ కు అన్యాయం చేశారని సిబ్బంది ఆగ్రహం వ్య క్తం చేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త వా తావరణం ఏర్పడింది. సమాచారం అందుకు న్న డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నవీన్‌కు మార్ క్యాంపస్ కు చేరుకుని అవుట్ సోర్సింగ్ సి బ్బందిని సముదాయించి శాంతింపజేశారు. సాంబయ్యను అక్కడి నుంచి వాహనంలో పం పించి వేశారు. నియంత అధికారి వర్సిటీని వది లి వెళుతున్నారని పేర్కొంటూ అవుట్ సోర్సింగ్ సిబ్బంది బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. -
శ్రీరామ సాగరానికి 56ఏళ్లు
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని, కల్పతరువు అయిన శ్రీరాంసాగర్ నేటితో 56ఏళ్లు పూర్తి చేసుకుంది. అభివృద్ధిలో, ఆయకట్టుకు సాగు నీరు అందించడంలో కొచెం మోదం.. కొంచెం ఖేదం మిగిలిందని చెప్పవచ్చు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరా కృషి చేస్తుంది. కాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయడం లేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి పునాది రాయి పడి 56 వసంతాలు పూర్తవుతున్న, తెలంగాణ రాష్ట్రానికి గుండె కాయాల ఉన్నప్పటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి నోచు కోవడం లేదు. ప్రాజెక్ట్‌లో నీటి కొరత ఉండకుండా పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం పునరుజ్జీవన పథకం ప్రవేశపెట్టింది. నిర్మాణం జరిగిందిలా.. ఎస్సారెస్పీని మూడు ప్రయోజనాలు ఆశించి నిర్మించారు. 18 లక్షల ఎకరాలకు సాగునీరు. 36 మెగావాట్ల విద్యుతుత్పత్తి, చేపల పెంపకం అనే ఆశయాలతో 112 టీఎంసీల నీటి సామర్థ్యంతో 1091 అడుగుల నీటిమట్టంతో 175చదరపు మైళ్ల విస్తీర్ణంతో గోదావరి జన్మస్థానానికి 326 మైళ్ల దూరంలో సముద్ర మట్టానికి ప్లస్ 980 అడుగుల ఎత్తులో, జాతీయ రహదారి 44పై ఉన్న సోన్ వంతెన ఎగువ భాగం మూడు మైళ్ల దూరంలో ఆదిలాబాద్, నిజామాబాద్ సరిహద్దు ప్రాంతంలో నిర్మించారు. వరద నీరు తాకిడిని తట్టుకునే సువిశాలమైన బండ రాయిని ఎంచుకుని 140 అడుగుల ఎత్తుతో 3,143 అడుగుల పొడువుతో రాతి కట్టడం, 125 అడుగుల ఎత్తుతో 44,750 అడుగుల మట్టి కట్టడంతో మొత్తం 47,893 అడుగుల డ్యాం నిర్మాణం చేపట్టారు. అలాగే 2,510 అడుగుల పొడువు జలదారితో 35,425 చదరపు మైళ్ల క్యాచ్మెంట్ ఏరియాతో 16లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా ప్రాజెక్ట్ డ్యాం డిజైన్ చేసి 50 అడుగుల వెడల్పు, 33 అడుగుల ఎత్తుతో మొత్తం 42 వరద గేట్లను నిర్మించారు. ప్రాజెక్ట్ నుంచి పూడిక పోయోందుకు ఆరు రివర్స్ స్లూయిస్ గేట్లు నిర్మించారు. ఇలా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రాజెక్ట్‌కు ప్రధాన సమస్యలు ఇప్పటికి పరిష్కరానికి నోచుకోవడం లేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ భద్రత గాలిలో దీపంలా ఉంది. భద్రత కోసం ఏళ్ల తరబడి ప్రతిపాదనలు పెట్టినప్పటికీ ఇప్పటికీ మోక్షం కలగడం లేదు. అంతే కాకుండా ఎస్సారెస్పీలో పదవి విరమణలే తప్ప నూతనంగా అధికారుల నియామకం లేదు. దీంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కాలువల మరమ్మత్తులకు నిధులు మంజూరు అవుతున్న పనుల్లో మాత్రం నాణ్యత తూచ్ ఉండటంతో కాలువల మరమ్మతు ఎప్పటికి సమస్యగానే మిగిలిపోతుంది. అశలన్నీ కాళేశ్వరంపైనే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వార రివర్స్ పంపంగ్ చేసి 60 టీఎంసీల నీటిని నింపుటకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి పై ఆధార పడకుండా సంవత్సరం పొడువున నిండుకుండలా ఏర్పడే అవకాశం ఏర్పడింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు కాళేశ్వరం నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ చేపట్టి ప్రాజెక్ట్‌కు తరలిస్తారు. పునరుజ్జీవన పథకం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీకి చేరుతాయని పాలకులు ప్రకటిస్తున్నారు. -
ఎన్డీఎస్ఎల్ అమ్మకానికి బ్రేక్
బోధన్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎ స్ఎల్) లిక్విడేషన్ను ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తు న్యూ ఢిల్లీ ఎన్సీఎల్ఏటీ ( నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్) బుధవారం స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులకు తీపికబురందినట్లయ్యింది. ఎన్సీఎల్టీ గత నెల 3న ఎన్డీఎస్ఎల్ మూడు యూనిట్లను లిక్విడేషన్‌కు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , స్టేట్ డైరెక్టర్ ఆఫ్ కేన్ అండ్ షుగర్ కమిషనర్ హై దరాబాద్ ఎన్సీఎల్టీ షుగర్ ఫ్యాక్టరీ లిక్విడేషన్ ఉత్తర్వులపై సవాలు చేస్తు న్యూఢిల్లీ ఎన్సీఎల్ఏటీకి ఈ నెల 12న అప్పీలు పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్సీఎల్ఏటీలో విచారణ కొనసాగగా, రాష్ట్ర ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో బుధవారం ఎన్డీఎస్ఎల్ స్థిర, చర ఆస్తుల అమ్మకం నిలుపుదల చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల మేరకు ఫ్యాక్టరీ చర, స్థిరఆస్తులను విక్రయించడానికిగాని, బదలాయింపునకు గాని అవకాశం ఉండదు. ఎన్సీఎ ల్టీ హైదరాబాద్ బెంచ్ ఎన్డీఎస్ఎల్ లిక్విడేషన్ ఉత్తర్వులతో చెరుకు రైతులు, వందలాది కార్మిక కుటుంబాల్లో ఫ్యాక్టరీ భవితవ్యంపై తీవ్ర ఉత్కంఠతకుగురయ్యారు. తాజా పరిణామాలతో చెరుకు రైతులు, కార్మికుల్లో ఒకింత హర్షం వ్యక్తం అవుతోంది. తాత్కాలికంగానైనా షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి బ్రేక్ పడటం తీపి కబురేనని వారంటున్నా రు. తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఎస్ఎల్ను స్వాధీ నం చేసుకుని ప్రభుత్వరంగంలోనే నడిపించినట్లయితే ఈప్రాంత చెరుకు రైతులు, కార్మికులకు మే లు చేకూరుతోందని అంటున్నారు. 2015 డిసెంబర్ 23న లేఆఫ్... ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం అనుహ్యాంగా 2015 డిసెంబర్ 23న లేఆఫ్ ప్రకటించి బోధన్, ము త్యంపేట (జగిత్యాల) ముంబోజిపల్లి ( మెదక్) ఫ్యాక్టరీలను మూసివేసింది. వాస్తవంగా ప్రభుత్వం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రా గానే ఎన్డీఎస్ఎల్ను స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామని హామీ ఇచ్చింది. కాని ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకోకపోగా, నడిచే ఫ్యాక్టరీ మూతపడటంతో చెరుకు రైతులు, కార్మికులు తీవ్ర నిరా శకు గురయ్యారు. కాని తెలంగాణ ప్రభుత్వం సా నుకూలమైన నిర్ణయం తీసుకుంటోందనే ఆశతో చెరుకు రైతులు, కార్మికులు నిరీక్షించారు. కాని 2017 సెప్టెంబర్‌లో అనుహ్యంగానే షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారం కోసం ఎన్సీఎల్టీ రంగప్రవే శం చేసింది. ఈ పరిణామం చెరుకు రైతులు, కా ర్మికుల్లో మరింత ఉత్కంఠతకు గురిచేసింది. ఎన్సీ ఎల్టీ హైదరాబాద్ బెంచ్ ఐపీఆర్‌గా నియామకమైన రాచర్ల రామక్రిష్ణ గుప్తా విచారణ ప్రక్రియను 2017 అక్టోబర్‌లో ప్రారంభించగా.. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన సమయంలో వివరాలను వెల్లడించారు. బ్యాంక్ అప్పులు, కార్మికుల ఆర్థికపరమైన బకాయిలు, ఇతర పన్ను బకాయిలు చె ల్లించేందుకు అంగీకరించిన వారికి ఫ్యాక్టరీని అప్పగించే ప్రక్రియ ఉంటుందని తెలిపారు. తొలి ప్రా ధాన్యతగా ప్రస్తుత ఎన్డీఎస్ఎల్ ప్రైవేట్ యాజ మాన్యం అవకాశం కల్పించడం జరుగుతోందని వివరించారు. ప్రైవేట్ యాజమాన్యం, ప్రభుత్వం బకాయిలు చెల్లించి, ఫ్యాక్టరీని నడిపేందుకు ముం దుకు రానియెడల ఇతర ప్రైవేట్ కంపెనీలకు ఆ హ్వానిస్తామని, ఈ ప్రక్రియ సాధ్యం కాకపోతే ఫ్యా క్టరీ ఆస్తులు విక్రయించి అప్పు బకాయిలు చెల్లించ డం జరుగుతోందని స్పష్టత ఇచ్చారు. దీంతో ఈ కోణంలో విచారణ కొనసాగింది. 2017 నుంచి ఎ న్సీఎల్టీ విచారణ కొనసాగించి ఆఖరుకు 2019 జూన్ 3న ఎన్డీఎస్ఎల్ లిక్విడేషన్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హఠాత్పరిణామంతో చెరుకు రైతులు, కార్మికులు హతాశులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఎస్ఎల్ అమ్మకం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నిలుపుదలకు అప్పీలేట్ ట్రి బ్యునల్‌కు అప్పీలు పిటిషన్ దాఖలు చేయడం. ఈ మేరకు సానుకూలంగా ట్రిబ్యునల్ స్టే ఉత్తర్వులు ఇవ్వడం శుభపరిణామమని కార్మిక సంఘాల నాయకులంటున్నారు. ఇదే స్ఫూర్తితో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలంటున్నారు. తాజా పరిణామంతో చెరుకు రైతులు, కార్మికుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. స్టే ఉత్తర్వులు వాస్తవమే.. ఎన్సీఎల్టీ గత నెల 3న ఎన్డీఎస్ఎల్ లిక్విడేషన్‌కు జారీ చేసిన ఉత్తర్వుల పై న్యూఢిల్లీ ఎన్సీఎల్ఏటీకి ఈ నెల 12న అప్పీలు పిటిషన్ దాఖలు చేశాం. బుధవారం లిక్విడేషన్ ఉత్తర్వులు నిలుపుదల చేస్తు ఎన్సీఎల్ఏటీ స్టే ఉత్తర్వులు జారీ చేసిన విషయం వాస్తవమే. –భద్రు మల్హోత్, రాష్ట్ర కేన్ కమిషనర్, హైదరాబాద్ -
లబ్ధిదారులతో స్పీకర్ వీడియో కాల్
బాన్సువాడ టౌన్: ఆసరా పింఛన్ లబ్ధిదారులతో బుధవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వీడియో కాల్ మాట్లాడారు. పింఛన్లు రూ.2016 ఇవ్వడం సంతోషంగా ఉందని, పిల్లలపై ఆధారపడకుండా పింఛన్లు ఇచ్చి ఇంటికి కేసీఆర్, మీరు(పోచారం శ్రీనివాస్‌రెడ్డి)లు పెద్ద కొడుకులయ్యారని లబ్ధిదారులు పేర్కొనడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మీకు ఏ సమస్య వచ్చిన నేరుగా తనకు చెప్పవచ్చునని, తమ నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, పీఏ భగవాన్‌రెడ్డి అందుబాటులో ఉంటారని స్పీకర్ చెప్పారు. -
గన్నీ బ్యాగుల సేకరణకు కొత్త మార్గం
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఖరీఫ్, రబీ సీజన్లలో వరిధాన్యం సేకరించడానికి ప్రతీ ఏడాది ఎదురవుతున్న గన్నీ బ్యాగుల కొరతను అధిగమించడానికి సివిల్ సప్లయి కార్పోరేషన్ శాఖ కొత్త మార్గాన్ని వెతుక్కుంది. కొనుగోలుకు అవుతున్న ఖర్చులో కొంత మేరకు తగ్గించుకుని నాణ్యమైన గోనే సంచులను సేకరించడానికి రేషన్ దుకాణాలను ఎంచుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాలతో పాటు మన జిల్లా సివిల్ సప్లయి అధికారులకు రాష్ట్ర శాఖ నుంచి ఆదేశాలు అందాయి. దీనికి సంబంధించిన అంశంపై వారం రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఇకపై రేషన్ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయగా ఖాళీ అయిన సంచులను సివిల్ సప్లయి కార్పొరేషన్‌కే అప్పగించాలని సూచించారు. ఒక్క గన్నీ బ్యాగుకు రూ.16 జిల్లాలో ధాన్యం సేకరణ సమయంలో 54 శాతం కొత్తవి, 46 శాతం వినియోగించిన గన్నీ బ్యాగులు వినియోగించాలని నిబంధనలున్నాయి. అయితే కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసిన గన్నీలు రైస్ మిల్లులకు చేరి, అక్కడి నుంచి బియ్యంతో అవే సంచుల్లో ఎఫ్‌సీఐకి చేరి, మళ్లీ ఎఫ్‌సీఐ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గన్నీలు కొంత మేర పాడతువుతున్నాయి. దీంతో కార్పొరేషన్ శాఖకు నష్టం వాటిల్లుతోంది. మళ్లీ కొత్తవి కొనుగోలు చేయడం భారంగా మారుతోంది. బయటి మార్కెట్లో కొత్త గన్నీలు ఒకటి రూ. 22 వరకు లభిస్తోంది. అయితే రేషన్ దుకాణాలకు బియ్యం నింపిన గన్నీలు ఖాళీ అయిన అనంతరం డీలర్లు బయట విక్రయిస్తున్నారు. రేషన్ దుకాణాలకు వచ్చిన గన్నీలు నాణ్యతగా, కొత్తగా ఉండడంతో వాటిని సివిల్ సప్లయి కార్పోరేషనే కొనుగోలు చేస్తే బాగుంటుందని, పైగా ధర కూడా తక్కువ . వెంటనే డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఒక్కో గన్నీ బ్యాగుకు రూ.16ల ధరను అధికారులు కుదుర్చుకున్నారు. డీలర్లు కూడా ఇందుకు సమ్మతం తెలుపడంతో గత కొన్ని రోజులుగా రేషన్ దుకాణాల నుంచి గన్నీల సేకరణ ప్రారంభమైంది. రేషన్ బస్తాలను సరఫరా చేసిన క్రమంలోనే అదే లారీలో ఖాళీ సంచులను పంపాలని అధికారులు డీలర్లకు సూచించారు. ప్రస్తుతం జిల్లాలో ఈ విధానంతో 75వేల గన్నీ బ్యాగులు సేకరించారు. ప్రతీ నెలా 1లక్షల వరకు గన్నీలు రేషన్ దుకాణాల నుంచి సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు సేకరిస్తున్నాం రేషన్ దుకాణాల నుంచి గన్నీ బ్యాగులు సేకరించాలని రాష్ట్ర శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆదేశాల ప్రకారంగా ఇటీవల రేషన్ డీలర్లతో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. నిర్ణయించిన ధర ప్రకారంగా ప్రతీ నెలా ఖాళీ గన్నీలను సివిల్ సప్లయి కార్పోరేషన్‌కు అందించాలని తెలిపాం. నాణ్యమైన గన్నీలతో పాటు ధాన్యం కొనుగోలు చేసే సమయంలో గన్నీల కొరత రాకుండా ఉండేందుకు రాష్ట్ర శాఖ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. – అభిషేక్, డీఎం, సివిల్ సప్లయి కార్పొరేషన్, నిజామాబాద్ -
మండలానికో డెయిరీ పార్లర్
నాగిరెడ్డిపేట: జిల్లాలోని అన్ని మండలకేంద్రాలలో విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు.. ఇందుకోసం జిల్లాలో ఇప్పటికే 18 మండలాల్లో పార్లర్ల నిర్వాహకుల ఎంపికను పూర్తి చేశారు. జిల్లాలోని సదాశివనగర్, గాంధారి, కామారెడ్డి, రాజంపేట మండలాల్లో ని ర్వాహకుల ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదు. రెండు, మూడురోజుల్లో నిర్వాహకుల ఎంపిక ప్రక్రియను ఐకేపీ అధికారులు పూర్తిచేయనున్నారు. ఈ నెలాఖరులోపు జిల్లాకేంద్రంలో విజయ డెయిరీ కార్యాలయంలో ఐకేపీ ఏపీఎంలతోపాటు పార్లర్ల నిర్వాహకులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్వాహకులకు ఆర్థిక చేయూత జిల్లాలోని ప్రతి మండలకేంద్రంలో విజయడెయిరీ పార్లర్‌ను నిర్వహించే సభ్యురాలికి ఐకేపీ అధికారులు సుమారు రూ.2 లక్షల వరకు ఆర్థిక చేయూతను అందించనున్నారు. పార్లర్ ఏర్పాటుకు అవసరమైన ఫర్నిచర్, ఫ్రిజ్, ఫ్యాన్ తదితర పరికరాల కొనుగోలుతోపాటు పెట్టుబడి కోసం స్రీ నిధి, ముద్ర లోన్ ద్వారా నిర్వాహకులకు రుణాలు ఇప్పించనున్నారు. 14 రకాల ఉత్పత్తులు.. డెయిరీ పార్లర్లలో 14 రకాల విజయ డెయిరీ ఉత్పత్తులను విక్రయించనున్నారు. విజయ డెయిరీ ఉత్పత్తి చేసే పాలు, నెయ్యి, పెరుగు, లస్సీ, దూద్పేడ, మిల్క్ షేక్, పాయసం మిక్స్డ్, పన్నీర్, వెన్న వంటి 14 రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నారు. -
నవీపేట మేకల సంతలో కోట్లల్లో క్రయవిక్రయాలు
నవీపేట(బోధన్): మండల కేంద్రంలో శనివారం జరిగిన వారాంతపు మేకల సంతలో క్రయవిక్రయాలు భారీగా జరిగాయి. రూ.కోటిన్నరకు పైగా లావాదేవీలు జరిగినట్లు సమాచారం. జిల్లాకేంద్రంలో ఆదివారం జరుగనున్న ఊర పండగ సంబరాలతో పాటు వన భోజనాల సందడితో మేకల సంతలో క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఊర పండగకు ఆనవాయితీగా అమ్మవారికి మేకలను బలిఇవ్వడంతో అమ్మవారి భక్తులు మేకల కొనుగోళ్లు జరిపారు. గ్రామాలలో వన(విందు) భోజనాలకు మాంసాహారాన్ని భుజించడంతో మేకలకు మరింత గిరాకీ పెరిగింది. నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, కామారెడ్డి సరిహద్దు జిల్లాల నుంచి వచ్చిన కొనుగోలుదారులు అధిక ధరలు చూసి వాపోయారు. మనుపటికంటే అధిక ధరలకు విక్రయించడంతో విస్తుపోయారు. అవసరం నిమిత్తం కొనుగోలు చేయక తప్పలేదు. సీజన్‌ను గమనించిన మహారాష్ట్రలోని ధర్మాబాద్, పర్బణి, ముత్ఖేడ్, జాల్నాలతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలోని వ్యాపారులు ఒకరోజు ముందుగానే నవీపేటకు వచ్చి విక్రయాలు జరిపారు. -
హైదారాబాద్ బస్సు సర్వీసులపై అభ్యంతరం
నిజాంసాగర్(జుక్కల్): సంగారెడ్డి, పటాన్ చెరు మీదుగా హైద్రాబాద్ వెళ్తున్న బాన్సువాడ ఆర్టీసీ బస్సు సర్వీసులపై నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో అధికారులు అభ్యంతరం తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట బస్టాండ్ వద్ద బాన్సువాడ నుంచి హైద్రాబాద్ వెళ్తున్న బస్సులను నారాయణఖేడ్ డిపో అధికారులు అడ్డుకున్నారు. బిచ్కుంద, పిట్లం మీదుగా హైద్రాబాద్‌కు బాన్సువాడ డిపో నుంచి ఆరు అదనపు బస్సులు నడుపుతూ నారాయఖేడ్, సంగారెడ్డి, హైద్రాబాద్ ఆర్టీసీ డిపోల ఆదాయానికి గండి కొడుతున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, మెదక్ మీదుగా వెళ్లాల్సిన బస్సు సర్వీసులను రద్దు చేసి, సంగారెడ్డి, పటాన్ చెరు మీదుగా బస్సు సర్వీసులను ప్రారంభించడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల ఆర్టీసీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాన్సువాడ నుంచి బస్సు సర్వీసులను నడపడం వల్ల తమ బస్సులకు ఆదాయం తగ్గుతోందని, నష్టాలకు గురికావాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. దీంతో బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులను నిజాంపేటలో నిలిపి, ప్రయాణికులను ఇతర డిపోల బస్సుల్లో హైద్రాబాద్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సు సర్వీసులను రద్దు చేసుకొవాలని బాన్సువాడ ఆర్టీసీ అధికారులకు వారు సూచించారు. -
ఏదీ అభయం
మోర్తాడ్(బాల్కొండ): తెలంగాణ ప్రభుత్వం ఆసరా లబ్ధిదారులకు ప్రతి నెలా పింఛన్ల కోసం నిధులు కేటాయిస్తున్నా అభయహస్తం ప థకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తోం ది. 2017 ఫిబ్రవరి వరకు అభయహస్తం పింఛన్ల కోసం నిధులు కేటాయించిన ప్రభుత్వం 20 నెలలుగా నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో లబ్ధిదారులు పింఛన్ల కోసం నిరీక్షిస్తున్నారు. మహిళల కోసం వైఎస్సార్ ప్రవేశ పెట్టిన అద్భుత పథకం... మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి 55 సంవత్సరాల వయస్సు నిండిన తరువాత ప్రతి నెలా రూ.500 మొదలుకొని ఎక్కువ మొత్తం పింఛన్ అందించే విధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన అద్భుత పథకం అభయహస్తం. అభయహస్తం పథకం కింద చేరిన మహిళలు వారి వయస్సు ప్రకారం సభ్యత్వం కింద రూ.500 నుంచి రూ. 3,600 వరకు జమ చేశారు. ఈ నిధులకు ప్ర భుత్వం కూడా కొన్ని నిధులను జమ చేసింది. జీవిత బీమా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అభయహస్తం పథకం లబ్ధిదారులకు ప్రతినెలా పింఛన్ లభించేలా అప్పటి ప్రభు త్వం చర్యలు తీసుకుంది. అభయహస్తం పథకం కింద లబ్ధిదారులు జమ చేసిన మొత్తానికి వచ్చే వడ్డీకి కొంత నిధులను ప్రభుత్వం జత చేసి విడుదల చేస్తే లబ్ధిదారులకు ప్రతి నెలా పింఛన్ అందించవచ్చు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుంచి అభయహస్తం పింఛన్ లబ్ధిదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రెంటికి చెడ్డ్డ రేవడిలా .. అభయహస్తం లబ్ధిదారుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. అభయహస్తం పథకం కింద లబ్ధిదారులుగా ఉన్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తు న్న బీడీ భృతికి కాని, ఒంటరి మహిళల పింఛన్లకు కాని అర్హత సాధించలేక పోతున్నారు. అయితే కనీసం ప్రతినెలా అభయహస్తం పింఛన్‌ను మంజూరు చేసినా సరిపోతుందని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. బకాయిలు రూ.13.50 కోట్లు... ఉమ్మడి జిల్లాలో అభయహస్తం పింఛన్ లబ్ధి దారులు 13,506 మంది ఉన్నారు. ఇందులో నిజామాబాద్ జిల్లాలో 8,879 మంది, కామారెడ్డి జిల్లాలో 4,627 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కో పింఛన్ లబ్ధిదారుకు రూ.10 వేల చొప్పున ఉమ్మడి జిల్లాలోని లబ్ధిదారులకు రూ.13 కోట్ల, 50 లక్షల, 60 వేల బకాయిని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. -
కులమే బలం !
ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే కుల సంఘాలను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీల అభ్యర్థులు, ఆశావహులు తమ ప్రయత్నాల్లో మునిగి పోయారు. ఆయా సామాజికవర్గాల్లో పలుకుబడి ఉన్న కుల పెద్దల వద్దకు వెళ్లి మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని, గెలిచాక సంఘాలకు భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలు, ఇతర నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయిస్తామని హామీలు ఇస్తున్నారు. కొందరు నజరానాలు సైతం ముట్టజెప్పుతున్నారు. తమ పార్టీకే ఓటేసేలా ఏకగ్రీవ తీర్మానాలు చేయిస్తున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల్లో కుల సం ఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సంఘాల మద్దతును కూడగట్టేందుకు అభ్యర్థులు, ఆశావహులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గంప గు త్తాగా ఓట్లు పడతాయన్న ఆశతో ఆయా సంఘాల మద్దతు కూడ గట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తూనే., మరోవైపు ఈ సంఘాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయా గ్రామాలు, డివిజన్లు, వార్డు ల్లో ప్రభావం చూపగల సామాజికవర్గాలను గు ర్తించి తమ వైపునకు తిప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఆయా కుల పెద్దలకు ప్రాధాన్యత పెరిగి పోయింది. ఆయా సామాజికవర్గాల్లో పలుకుబడి ఉన్న కుల పెద్దలకు అభ్యర్థులు గాలం వేస్తున్నారు. వారికి ఫోన్లు చేసి, సమయం తీసుకుని మరీ వారి వద్దకు వెళ్లి మాట్లాడుతున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో హామీలను గుప్పిస్తున్నారు. గెలిచాక ఆయా సంఘాలకు భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలు, ఇతర నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధులు మంజూ రు చేయిస్తామని హామీలు ఇస్తున్నారు. కొందరు నేతలకు నజరానాలు సైతం ముట్టజెప్పుతున్నారు. మందు, విందులతో మచ్చిక చేసుకుంటున్నా రు. ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతివ్వాలని కోరుతున్నారు. తమ పార్టీ కే ఓటేసేలా ఏకగ్రీవ తీర్మానాలు చేయిస్తు న్నారు. తద్వారా ఆయా సామాజికవ ర్గం ఓట్లను అధిక సంఖ్యలో తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా గెలుపును సునాయసాయం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు.. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఆయా సామాజికవర్గాలతో మమేకమవుతున్నా రు. ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో కులసంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఆయా గ్రా మాల్లోని గ్రామాభివృద్ధి కమిటీల్లో ఈ సం ఘాలు భాగస్వామ్యం అవుతున్నాయి. దీంతో ఆయా సామాజికవర్గాల మ ద్దతు కూడగట్టడం ద్వారా ఆయా గ్రామాల్లో పట్టు సాధించవచ్చని పార్టీల అభ్యర్థు లు, ఆశావహులు భావిస్తున్నారు. ఏకగ్రీవ తీర్మానానాలు.. జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో కొన్ని కుల సంఘాలు తాము ఫలానా పార్టీకే మ ద్దతిస్తామని ఏకగ్రీవ తీర్మానాలు చే Ü్తుండ టం గమనార్హం. ఇలా ఆయా కులసం ఘా ల్లో తీర్మానాలు చేయించడం ద్వారా ని యోజకవర్గంలో పట్టు సాధించడానికి వీ లవుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. ఆసోసియేషన్లు.. కుల సంఘాలకే పరిమితం కాకుండా వివిధ రకాల అసోసియేషన్ల మద్దతును కూడగట్టుకుంటున్నారు. ఆయా అసోసి యేషన్లలో ఉన్న సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాము గెలిచిన వెం టనే ఆ ఆసోయేషన్ అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని చెబుతున్నారు. కొన్ని అ సోసియేషన్ నేతలు సైతం అభ్యర్థులను కలుస్తున్నారు. మొత్తం మీద ఎన్నికలు ద గ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు, ఆశావ హులు గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది. -
కాస్త రెస్ట్
పోలింగ్‌కు యాబై రోజుల వరకు గడువు ఉండటంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారానికి కాస్త విరామం ఇస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలు చేసిన అభ్యర్థులు ఇదే జోరు కొనసాగిస్తే ఖర్చు తడిసి మోపెడవుతోందని భావిస్తున్నారు. సొంత పార్టీలోని అసంతృప్తి నేతలను బుజ్జగించడం, అసోసియేషన్లు, కుల సంఘాల మద్దతు కూడగట్టడంలో నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు కూడా ఖరారు కాలేదు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో కాస్త దూకుడు తగ్గించారు. నెమ్మదిగా కొనసాగిస్తున్నారు. ఇంటింటి ప్రచారం కంటే సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దుకునే పనులపై దృష్టి సారించారు. అసోసియేషన్లు, కుల సంఘాల మద్దతు కూడగట్టడం ద్వారా అధిక సంఖ్యలో ఓట్లు రాబట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఓటర్లను నేరుగా కలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసిన అభ్యర్థులకు ఇంటింటి ప్రచారానికి ఖర్చు కూడా తడిసి మోపెడవుతోంది. వారి అభ్యర్థిత్వాలు ఖరారై 40 రోజులు దాటింది. పోలింగ్‌కు మారో 50 రోజులకుపైగా గడువుంది. ఈ తరుణంలో ఇంటింటి ప్రచారం ఇదే స్థాయిలో కొనసాగిస్తే ఆర్థిక పరమైన భారం పడుతుందని భావిస్తున్న అభ్యర్థులు ప్రచారానికి అ ప్పుడప్పుడు కొద్దిగా విరామం ఇస్తున్నా రు. నాలుగురోజులు నియోజకవర్గంలో కలియదిరుగుతూ.. రెండు, మూడు రోజు లు హైదరాబాద్‌కు వెళుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. సెప్టెంబర్ 6న తొ మ్మిది నియోజకవర్గాలకు సిట్టింగ్ ఎమ్మె ల్యేలనే అభ్యర్థులుగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో అభ్యర్థులు ఉ త్సాహంగా ఎన్నికల ప్రచారంలోకి దిగా రు. ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని జోరుగా సాగించారు. అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలకు నిజామాబాద్ నుంచే శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 3న న గరంలో భారీ బహిరంగ సభను నిర్వహిం చారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేశారు. ఈ సభ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రాగా, పోలింగ్ డిసెంబర్ 7న నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్‌కు మరో 50 రోజులు గడువుండటంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని కాస్త తగ్గించారు. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు సైతం ఇంకా ఖరారు కాలేదు. ముఖ్యంగా కాంగ్రెస్‌కు సంబంధించి రెండు, మూడు చోట్ల మాత్రమే అభ్యర్థిత్వాలపై స్పష్టత వచ్చింది. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాలు ఓ కొలిక్కి రావడంతో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచార బరిలో దిగారు. మిగిలిన ఆరు చోట్ల అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడం, పొత్తుల్లో భాగంగా ఏ సీటు టీడీపీకి గానీ, టీజేఎస్‌కు గానీ వెళుతుందో స్పష్టత లేకపోవడంతో ఈ ఆరు చోట్ల కాంగ్రెస్ ఇంకా ప్రచారానికి శ్రీకారమే చుట్టలేదు. బీజేపీ అభ్యర్థుల విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా ఆచితూచి ప్రచారం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ప్రభావితం చూపగలిగే నాయకులను పిలిచి మాట్లాడే పనిలో ఉన్నారు. అలాగే సొంత పార్టీలోని అసంతృప్తి నేతలను బుజ్జగించడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. దసరా తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో మళ్లీ దూకుడును పెంచుతారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
టీఆర్ఎస్ కుప్పకూలిపోతుంది
సాక్షి, కామారెడ్డి: ‘‘దగుల్బాజీ, బట్టేబాజీ మాటలను తెలంగాణ ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదు. నాలుగున్నరేళ్లలో ఎంతో నష్టపోయారు. అప్రజాస్వామిక పాలనతో ప్రజలు విసిగిపోయారు. ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం దిగిపోకతప్పదు. ప్రభుత్వంతోపాటే టీఆర్ఎస్ పార్టీ కూడా కుప్పకూలిపోతుంది’’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 20న జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆయన కామారెడ్డికి వచ్చారు. అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అధ్యక్షతన ఓ హోటల్లో పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేసీఆ ర్ చెప్పేదొకటి, చేసేదొకటని విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా భరిస్తూ వచ్చిన ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధమయ్యారన్నారు. టీఆర్ఎస్కు చెందిన ఎంతో మంది నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురు, తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే ఎన్నికల్లో ప్రజలదే విజయమన్నారు. ప్రజలంటే ఈ ప్రభుత్వానికి గౌరవం లేకుండాపోయిందని, ప్రజాస్వామ్య హక్కులను కాలరా స్తూ అణచివేతకు పాల్పడిన ప్రభుత్వా న్ని గద్దెదింపడానికి ప్రజలంతా సిద్దం గా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులం తా ప్రజలతో కలిసి నడవాలని సూచించారు. ప్రజలు విసుగెత్తిపోయారు.. ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు... ఇలా అన్ని వర్గాల వారు ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతి రేక విధానాలతో విసుగెత్తిపోయారని ఉత్తమ్ పేర్కొన్నారు. దళితుడిని సీఎం చేస్తానని, దళితులు, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని, మైనారిటీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. వాటిని నెరవేర్చకుండా మోసం చేశాడన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని, డిసెంబర్ 12న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టగానే లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేస్తుందని, పింఛన్లను రూ.2 వేలకు పెంచుతుందని తెలిపారు. తెల్ల కార్డుదారులందరికీ 7 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని అందిస్తామని, అలాగే నిత్యావసరాలను కూడా రేషన్ దుకాణాల ద్వారా ఇస్తామని, ఏడాదికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీన కామారెడ్డిలో నిర్వహించే రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయా లని ప్రజలను కోరారు. సైనికుల్లా పనిచేయాలి.. కేసీఆర్‌ను గద్దెదింపడానికి కాంగ్రెస్ కార్యకర్తలంతా సైనికులుగా తయారుకావాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతియా పిలుపునిచ్చారు. రాహుల్ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీఎల్పీ మాజీ నాయకుడు జానారెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కీ, శ్రీనివాస కృష్ణన్, సలీం అహ్మద్, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నాయకులు సురేశ్‌షెట్కార్, తాహెర్‌బిన్ హందాన్, అరుణతార, జమునారాథోడ్, మృత్యుంజయం, బాల్‌రాజు, సుభాష్‌రెడ్డి, సురేందర్, ఎడ్ల రాజిరెడ్డి, వెంకట్రాంరెడ్డి, రత్నాకర్, గంగాధర్, ఎంజీ వేణు, కైలాస్ శ్రీను, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, నిమ్మ మోహన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీను పాల్గొన్నారు. -
13 కమిటీలు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికలు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను వివిధ కమిటీలకు అప్పగించింది. మొత్తం 13 కమిటీలను నియమించగా, ఒక్కో కమిటీకి ఒ క్కో జిల్లా స్థాయి అధికారికి పర్యవేక్షణ బా ధ్యతలను కలెక్టర్ రామ్మోహన్రావు అప్పగించారు. ఈ మేరకు సంబంధిత శాఖల జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలిం గ్ విధులు నిర్వర్తించనున్న అధికారులు, సిబ్బంది నియామకం బాధ్యతలను జిల్లా రెవె న్యూ అధికారి ఆర్.అంజయ్యకు అప్పగించా రు. అలాగే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు అవసరమైన సిబ్బంది కేటాయింపులు, సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) వంటి అంశాలను డీఆర్వో పర్యవేక్షించనున్నారు. ట్రాన్స్‌పోర్టు కమిటీ నోడల్ అధికారిగా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎం.వెంకటేశ్వర్‌రెడ్డిని నియమితులయ్యారు. ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలింపు వంటి బాధ్యతలను డీటీసీకి అప్పగించారు. అలాగే పోలింగ్ నిర్వహణ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలింపు వంటి అంశాలను వెంకటేశ్వర్‌రెడ్డి పర్యవేక్షించనున్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులు, అవగాహన వంటి వాటి కోసం ప్రత్యేక కమిటీని నియమించారు. బోర్గాం(పి) జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్రా రామారావుకు బాధ్యతలు అప్పగించారు. పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్‌కు అవసరమైన సామగ్రి ఏర్పాట్ల బాధ్యతలు కార్మిక శాఖ ఉప కమిషనర్ చతుర్వేదికి అప్పగించారు. ఎంతో కీలకమైన ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, అభ్యర్థుల ఖర్చులపై పర్యవేక్షించే కమిటీకి జిల్లా సహకార శాఖాధికారి సింహాచలం నోడల్ అధికారిగా నియమితులయ్యారు. అభ్యర్థుల ఖర్చుపై ఎప్పటికప్పుడు నిఘా ఉండటం వంటి విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందిని డీసీవో పర్యవేక్షించనున్నారు. ఎన్నికల తీరును పరిశీలించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ స్థాయి ఉన్నతాధికారులు ప్రత్యేక పరిశీలకులుగా జిల్లాకు రానున్నారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఈ పరిశీలకులు జిల్లాకు చేరుకుని ఎన్నికల నిర్వహణ తీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తుంటారు. వీటిని సమన్వయం చేసుకునేందుకు నోడల్ అధికారిగా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరికృష్ణను నియమించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును పర్యవేక్షించే బాధ్యతలు సీపీ కార్తికేయకు అప్పగించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కోసం ప్రత్యేకంగా మీడియా సెల్‌ను ఏర్పాటు చేశారు. పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్ ముర్తుజా నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. అదనపు పీఆర్వో రామ్మోహన్‌రావుకు కూడా ఈ బాధ్యతలు అప్పగించారు. కంప్యూటరైజేషన్ నోడల్ అధికారిగా ఎన్ఐసీ సమాచార అధికారి రాజ్‌గోపాల్‌ను నోడల్ అధికారిగా నియమించారు. స్వీప్ నోడల్ అధికారులుగా డీసీవో సింహాచలం, బాలభవన్ సూపరింటెండెంట్ ప్రభాకర్ నియమితులయ్యారు. హెల్ప్‌లైన్, ఫిర్యాదుల పరిష్కారం, ఎస్ఎంఎస్ మానిటరింగ్, కమ్యూనికేషన్ ప్లాన్ నోడల్ అధికారిగా కార్తిక్, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రత్యేక నోడల్ అధికారి ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.స్రవంతికి బాధ్యతలు అప్పగించారు. ఆయా కమిటీలకు కేటాయించిన విధులను సంబంధిత నోడల్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటర్ల జాబితా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటర్ల జాబితా అందజేసినట్లు కలెక్టర్ రామ్మోహన్రావు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్చే ఆమోదింపబడిన జాబితాను పార్టీల ప్రతినిధులకు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూం ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఎన్నికల ఫిర్యాదుల కోసం జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రామ్మోహన్రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కంట్రోల్ రూం 24 గంటల పాటు పని చేస్తుందని పేర్కొన్నారు. కంట్రోల్ రూంకు 18004256644 లేదా 08462–224001కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే, ఎన్నికల ప్రవర్తన నియమావళిపై మోడల్ కండక్ట్ కోడ్ నోడల్ అధికారి డీసీవో సింహాచలం (91001 15747)కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. -
ఇసుక రవాణాకు ‘కోడ్’ బ్రేక్
సాక్షి, మోర్తాడ్: ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చి న నేపథ్యంలో అభివృద్ధి పనులకు ఇసుకను రవాణా చేయడాన్ని నిలిపి వేస్తూ రెవెన్యూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పెద్దవాగులో గుర్తించిన పలు పాయింట్ల నుంచి బుధ, శుక్రవారాలలో అభివృద్ధి పనుల కోసం ఇసుకను తరలించే వారు. మో ర్తాడ్ మండలంలోని సుంకెట్, ధర్మోరా, వేల్పూర్ మండలంలోని కుకునూర్, కోమన్‌పల్లి, వెంకటాపూర్ పాయింట్ల నుంచి ఇసుకను తరలించే వారు. జక్రాన్‌పల్లి మండలంలోని పలు గ్రామాల నుంచి కూడా అభివృద్ధి పనుల కోసం ఇసుకను తరలించేందుకు అనుమతి ఇచ్చేవారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో గతంలో ప్రారంభించిన పనులతో పాటు, కొత్తగా చేపట్టబోయే అభివృద్ధి పను లను నిలపివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో రూ.కోట్లాది విలువ చేసే అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. అభివృద్ధి పనులను నిలిపి వేయాలని ఎన్నికల కమిషన్ ముందుగానే ఆదేశించడంతో అభివృద్ధి పనుల కోసం ఇసుక అవసరం ఉండదని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. అభివృద్ధి పను లు జరుగనప్పుడు ఇసుక రవాణాకు అను మతి ఇవ్వకూడదని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఒకవేళ అభివృద్ధి పనులకు ఇసుకను తరలించేందుకు అనుమతి ఇస్తే తరలించిన ఇసుక పక్కదారి పట్టే అవకాశం ఉందని అధికారులు సందేహిస్తున్నారు. దీంతో ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వకపోవడమే మంచిదని అధికారులు ఆలోచిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నుంచి ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వడం లేదు. ఇది ఇలా ఉండగా ప్రైవేటు భవనాల నిర్మాణం కోసం మాత్రం ఇసుక రవాణా చేసేందుకు అనుమతి ఇచ్చే అవకా శం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పనులకు ఒక ట్రిప్పునకు రూ.500 లను వసూలు చేస్తుండగా ప్రైవేటు నిర్మా ణాలకు ఇసుక కోసం రూ.900ల చొప్పున వసూలు చేస్తున్నారు. -
ప్రతిష్టాత్మకంగా రాహుల్ సభ!
సాక్షి, కామారెడ్డి: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచార సభను కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల నుంచే కాకుండా నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల నుంచి కూడా సభకు జనాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రౌండ్లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. హెలిప్యాడ్ కోసం ఇందిరాగాంధీ స్టేడియాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 20న ఆదిలాబాద్ జిల్లా పర్యటన అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు రాహుల్‌గాంధీ హెలికాప్టర్లో కామారెడ్డికి చేరుకుంటారు. స్టేడియంలో దిగిన తరువాత అక్కడ పార్టీ నేతల పరిచయ కార్యక్రమం జరుగుతుంది. అక్కడి నుంచి నేరుగా డిగ్రీ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. ఈ సభకు పెద్ద ఎత్తున జనాలను తరలించడం సభను సక్సెస్ చేయడానికి పార్టీ నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. జిల్లాలో కీలకమైన నాయకుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ నేతృత్వంలో సభ ఏర్పాట్లు మొదలయ్యాయి. కామారెడ్డికి వచ్చిన ఏఐసీసీ పరిశీలకుడు.. రాహుల్ బహిరంగ సభ ఏర్పాట్లు మొదలు, సభ పూర్తయ్యే వరకు ఎన్నికల పరిశీలకుడిగా ఏఐసీసీ కార్యదర్శి సలీం హైమద్ వ్యవహరించనున్నారు. శనివారం కామారెడ్డికి చేరుకున్న ఆయన, షబ్బీర్ అలీతో కలిసి కళాశాల గ్రౌండ్‌తో పాటు స్టేడియాన్ని పరిశీలించారు. జిల్లాలోని ఆయా నియోజక వర్గాలకు చెందిన పార్టీ నేతలను సమన్వయం చేస్తూ, సభకు భారీ జన సమీకరణ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించనున్నారు. సభకు భారీగా జనాలను తరలించే బాధ్యతను ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నేతల పైనే పెట్టారు. కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్అలీకి టికెట్ దాదాపు ఖరారైంది. నియోజక వర్గంలో జనాలను తరలించే బాధ్యత ఆయన పైనే ఉంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు ఎంత మంది జనాలను తీసుకొస్తారన్న దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. రాహుల్ పర్యటనకు ముందుగానే బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నందున జన సమీకరణకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. జిల్లాకు తొలిసారిగా రాహుల్... ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జిల్లా కేంద్రానికి తొలిసారిగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తద్వారా జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఊపు తీసుకురావాలని ఆరాటపడుతున్నారు. 30 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ కామారెడ్డిలో జరిగిన బహిరంగ స¿భలో పాల్గొన్నారు. వాళ్ల కుటుంబం నుంచి ఇప్పుడు రాహుల్ జిల్లాకు రానున్నారు. సభకు ఆరు రోజుల సమయం మాత్రమే ఉండడంతో పాటు బతుకమ్మ, దసరా పండుగలు రావడంతో ఏర్పాట్లలో నిర్లక్ష్యం చేయొద్దని నేతలు చెబుతున్నారు. ఏదేమైనా రాహుల్ పర్యటన పార్టీ నేతలకు ప్రతిష్టాత్మకంగా మారిందని భావిస్తున్నారు. -
ఒత్తిడితో బతుకులు చిత్తు
కామారెడ్డి క్రైం: విద్యార్థి దశలోనే ఎదురవుతున్న ఒత్తిళ్ళకు యువత చిత్తవుతున్నారు. ఇక్కడితో అంతా అయిపోయింది, ఇంక చేసేదేమి లేదనే నైరాశ్యంలోనికి వెళ్లిపోతున్నారు. చదువుల పేరిట అటు విద్యాలయాల్లో, ఇంట్లో పెద్దలు నిర్దేశిస్తున్న లక్ష్యాలను చేరుకుంటామో లేదోనన్న బెంగ ఎంతో మంది విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. అలాంటి బలహీనమైన క్షణాలు వారిని మృత్యువైపు అడుగులు వేయిస్తున్నాయి. ఎంత చదివినా మార్కులు తక్కువగా వస్తున్నాయనే బాధలో కొందరు, పరీక్ష బాగా రాయలేకపోయామని మరికొందరు, ఫలితాలు నిరాశపరిచాయని ఇంకొందరు ఇలా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 11 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలవరపెడుతోంది. కొన్ని సందర్భాల్లో సమస్యలు ఎదురై మనోవేదనకు గురైనా భవిష్యత్తుపై భరోసాతో ముందుకుసాగాల్సిన విషయాన్ని గుర్తించాల్సి ఉంది. పిల్లలను ఉన్నతస్థానాల్లో చూడాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అదే సమయంలో పిల్లల శక్తి సామర్థ్య్లాలను సైతం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అవసరమైన విషయాల్లో తోడ్పాటును అందించాలి. సెల్ఫోన్లు, సినిమాల ప్రభావం పిల్లలపై ఏ మాత్రం ఉందో గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టసమయాల్లో మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా వారి భుజం తట్టాల్సిన అవసరాన్ని తల్లిదండ్రుల గుర్తించాలి. వీటి విషయాల్లో నిర్లక్ష్యం చేస్తూనే పిల్లల నుంచి ఉత్తమ ఫలితాలను ఆశించడం అనర్థాలకు దారి తీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే.... పరీక్షలు బాగా రాయ లేదని, అందరితో సమనంగా చదవలేకపోతున్నాననీ, మార్కులు తక్కువగా వస్తే తల్లిదండ్రులు ఏమంటారోననే భయాందోళనలు విద్యార్థుల్లో పెరిగాయి. ఇవే కొన్ని సందర్భాల్లో అత్మహత్యలకు కారణమవుతున్నాయి. తల్లిదండ్రులు, గురువులు వారి మానసిక పరిస్థితిని సకాలంలో గుర్తించక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. వారం క్రితం రెండు రోజుల వ్యవధిలో బానుసవాడలో ఓ 8వ తరగతి చిన్నారి, కామారెడ్డిలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 12న మోర్తాడ్ మండలంలో సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరం. గత మార్చిలో తాడ్వాయికి చెందిన హారిక అనే ఇంటర్ విద్యార్థిని పరీక్షలో ఫెయిలయ్యానని ఉరేసుకుంది. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన సుప్రియ(19) అనే విద్యార్థిని టెట్ పరీక్షలు బాగా రాయలేదనే బాధలో ఉరేసుకుంది. ఉప్పల్వాయి గ్రామానికి చెందిన కుమ్మరి రజిత(25) అనే యువతి వీఆర్ఓ పరీక్ష బాగా రాయలేదని ఆత్మహత్యకు పాల్పడింది. అడ్లూర్‌కు చెందిన సుస్మిత(18) టెట్‌లో మార్కులు తక్కువగా వస్తున్నాయని మనస్థాపం చెంది రైలు కిందపడి ప్రాణం తీసుకుంది. కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని ప్రవళిక(19) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా జిల్లాలో ఈ యేడాది ఇప్పటిదాక జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నవారిలో 20 ఏళ్లలోపు వారు 20 మంది ఉన్నారు. మాధ్యమాల ప్రభావం... ఇటీవలి కాలంలో స్మార్ట్ఫోన్ల ప్రభావం యువతపై ఎంతగా పడుతోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అశ్లీలతను చూపించే వెబ్సైట్లు విద్యార్థి దశనుంచే యువతను పెడదారి పట్టిస్తున్నాయి. హైస్కూల్ స్థాయి నుంచి యువత మొబైల్ ఫోన్లను చేత పట్టుకుని నిమగ్నమవుతున్నారు. కళాశాలల్లో ఫోన్లను నిరాకరించే విషయంలో యాజమాన్యాలు దృష్టి సారించడం లేదు. ఎక్కడున్నా స్మార్ట్ఫోన్లలో కాలక్షేపం చేస్తూ సమయాన్ని వృథా చేసుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీని సరైన మార్గంలో ఉపయోగించుకోవాల్సిన యువతరం అదే టెక్నాలజీతో పెడదారి పట్టడంతో పాటు విలువైన సమయాన్ని వృథా చేసుకుంటోంది. తద్వారా చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. స్మార్ట్ఫోన్లను తమ పిల్లలను దూరంగా ఉంచాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు గుర్తించాల్సి అవసరం కనిపిస్తోంది. ఇక సినిమాల ప్రభావం ఏ విధంగా ఉన్నదో ఇటీవలి జగిత్యాలలో ఇద్దరు యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూస్తే తెలుస్తుంది. సెల్‌ఫోన్ కొనివ్వలేదనే కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. కొద్దిరోజుల క్రితం బిచ్కుందకు చెందిన పురుషోత్తం(19) అనే యువకుడు ఓ వివాహితను ఫోన్లో వేధించగా పెద్దలు పంచాయితీ పెట్టి మందలించారు. దీంతో మనస్థాపం చెందిన అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి దశలో యువతపై సెల్ఫోన్లు, సినిమాల ప్రభావం పడుతోందని ఇలాంటి సంఘటనలతో స్పష్టమవుతోంది. బాధ్యతగా వ్యవహరించాలి.. తమ పిల్లల చదువులు, వారి ప్రవర్తనల విషయంలో జరుగుతున్న సంఘటనలు తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తు చేస్తున్నాయి. ప్రశాంతమైన క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను పిల్లలకు అందించడంతో పాటు వారి శక్తి సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సాహం అందించాలని పలువురు సూచిస్తున్నారు. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసి కుటుంబాలు పెరిగాయి. నిత్యం విధులు, ఇంటి పనుల్లో బిజీగా ఉంటూ పిల్లలతో కలిసి సమయాన్ని గడపడం లేదు. వారికి ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఎందరో యువత మానసికంగా కృంగిపోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. తప్పనిసరిగా పిల్లలతో తల్లిదండ్రులు సమయాన్ని కేటాయిస్తూ వారి కష్ట, సుఖాల్లో అండగా నిలుస్తూ ఆలోచనలను పంచుకుంటే జరిగే తప్పిదాలను అరికట్టవచ్చు. వారి సమస్యలను తెలుసుకుని ప్రోత్సహించాలి. తప్పుదారిలో వెళ్తే దిశానిర్దేశం చేయాలే గానీ ఒత్తిళ్లకు గురి చేయడం సరికాదంటున్నారు విశ్లేషకులు. ఒత్తిడికి గురిచేయొద్దు.. పోటీ ప్రపంచంలో యాజమాన్యాలు, తల్లిదండ్రులు చదువు ఒక్కటే చూస్తున్నారు. పిల్లల సామర్థ్యానికి మించి ఒత్తిడికి గురి చేయొద్దు. వారి సామర్థ్యాలను సమస్యలను అర్థం చేసుకుని ప్రోత్సహించాలి. వారిలో అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. – లక్ష్మీనారాయణ, డీఎస్పీ, కామారెడ్డి -
కూటమి పీటముడి
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ దాదాపు మూడు స్థానాలకు అనధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన మరో ఆరు స్థానాల్లో మహా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, టీజేఎస్‌లకు స్థానాల కేటాయింపుపై ఉత్కంఠ నెలకొంది. సీట్ల సర్దుబాటు ఎటూ తేలకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో ముందడుగు వేయలేకపోతున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: మహాకూటమి సీట్ల సర్దుబాటుపై పీటముడి వీడటం లేదు. కూటమిలో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, టీజేఎస్‌లకు ఉమ్మడి జిల్లాలో ఏ స్థానమైనా కేటాయిస్తారా.. లేదా అనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో ఆయా పార్టీల నుం చి పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహుల్లో అయోమయం.., వారి అనుచరవర్గాల్లో గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్ ఇప్పటికే తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే కూటమి సీట్ల సర్దుబాటుపై ఎటూ తేలకపోవడంతో తొమ్మిది స్థానాల్లో ఆరుచోట్ల అయోమయం నెలకొంది. కాంగ్రెస్ దాదాపు మూడు స్థానాలకు అనధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. కామారెడ్డిలో మండలిలో కాం గ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ, బోధన్‌లో మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డిలకు టిక్కె ట్ దాదాపు ఖాయమైంది. ఆర్మూర్‌లో ఎమ్మెల్సీ ఆకుల లలితకు కూడా అభ్యర్థిత్వం ఖరారు కానుంది. ఈ మూడు చోట్ల ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. కామారెడ్డి, బోధన్‌లలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రోడ్‌షోలు, బహి రంగసభలు నిర్వహించారు. ఆర్మూర్‌లో కూడా ఆకుల లలిత గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా మిగిలిన ఆరు స్థానాల్లో కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, టీజేఎస్‌లకు సీట్ల కేటాయింపు ఎటూ తేలకపోవడంతో ఆయా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల శ్రేణులు గందరగోళంలో ఉన్నాయి. బాల్కొండ బరిలో నిలిచేదెవరూ..? కూటమి పార్టీల్లో ఒకటైన టీడీపీ జిల్లాలో నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాలపై గురిపెట్టింది. మూడింట్లో ఏదైనా ఒకటి అడగాలని పక్షం రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన టీడీపీ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. బాల్కొండలో టీడీ పీ నేత ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి పోటీ చేయాలని ని ర్ణయించుకున్నారు. సైకిల్ గుర్తుపై కాకుండా కాం గ్రెస్ గుర్తుపైనే పోటీ చేస్తే ఓట్లు పడతాయని భావిస్తున్నారు. ఇదే స్థానంపై టీజేఎస్ కూడా గురిపెట్టినట్లు సమాచారం. టీఆర్ఎస్ అసమ్మతి నేత ము త్యాల సునిల్‌రెడ్డి టీజేఎస్ నుంచి బరిలోకి దిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ లో కూడా మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ టిక్కెట్ తనకేనంటూ ధీమాతో ఉన్నారు. మొత్తం కూటమిలో సీట్ల సర్దుబాటు తేలకపోవడంతో బాల్కొండలో ఆయా పార్టీల శ్రేణులు, నేతల అనుచరులు అయోమయంలో ఉన్నారు. ‘రూరల్’లోనూ అదే పరిస్థితి.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ తన ఉనికిని చాటుకునేందుకు పావులు కదపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు తన పాత అనుచరులకు ఫోన్లు చేసి పిలిపించుకుని సమాలోచనలు జరిపారు. దీంతో ఈ స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకుని కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి వర్గం ఒకింత ఆందోళనకు గురైంది. కూటమిలో ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేసినా పూర్తి మద్దతును తెలపాలని మండవ అనుచరులకు సూచించారు. ప్రచారం చేసుకోలేకపోతున్నారు.. సీట్ల సర్దుబాటు ఎటూ తేలకపోవడంతో ఆయా స్థానాల నుంచి పోటీ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్న అభ్యర్థులు ప్రచారంలో ముందడుగు వేయలేకపోతున్నారు. ప్రచారంతో పాటు పోల్ మేనేజ్‌మెంట్‌పైనా దృష్టి సారించలేకపోతున్నారు. టీఆర్ఎస్ మాత్రం ప్రచారంలో ముందంజలో ఉంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు గ్రామగ్రామాన తిరుగుతున్నారు. కూటమి సీట్ల సర్దుబాటు తేలే వరకూ ప్రతిపక్ష పార్టీల ప్రచారం జోరందుకునే అవకాశంలేదు. -
ముంబాయి టు కామారెడ్డి
కామారెడ్డి క్రైం: మనిషిలోని బలహీనతలను సొమ్ము చేసుకునే దిశగా వ్యభిచార వృత్తి కొత్తరూపం దాల్చుతోంది. కస్టమర్లను ఆకర్షించడం, వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు రాబట్టేందుకు అందమైన యువతులను దూరప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఏకంగా ముంబాయితోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి యువతులను తెప్పిస్తున్నట్లు వెల్లడవుతోంది. కామారెడ్డిలో ఈ చీకటి వ్యాపారం చాపకిందనీరులా వ్యాపిస్తోంది. ముంబాయి, విజయవాడ ప్రాంతాల నుంచి యువతులను తెప్పించి వ్యభిచారం నడిపిస్తున్నారు. ముంబాయి నుంచి వేశ్యగా వచ్చిన ఓ యువతికి నిర్వాహకులతో డబ్బుల విషయంలో ఏర్పడిన వివాదం పోలీసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని రిమాండ్‌కు పంపారు. జిల్లా కేంద్రంలో హైటెక్ పద్ధతిలో వ్యభిచార గృహాలు నడుస్తున్నాయని చెప్పడానికి ఇదో నిదర్శనం. విచ్చలవిడిగా నిర్వహణ... బస్టాండ్, రైల్వేస్టేషన్లు, రద్దీగా ఇతర ప్రాంతాల్లో వ్యభిచార వృత్తి విచ్చలవిడిగా మారింది. పట్టణంలో ఇటీవల కాలంలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతోంది. రోడ్ల వెంబడి కొన్ని చోట్ల అడ్డాలుగా ఏర్పడి వ్యభిచారం వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. చుట్టు పక్కల ఉండే వ్యాపార సముదాయాలు, చిరు వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా ఇలాంటి వ్యవహరంలో తలదూర్చడం ఎందుకులే అనుకుని సర్దుకుపోతున్నారు. కొత్త బస్టాండ్ ఎదురుగా రోడ్ల పక్కనే బహిరంగంగా చెట్లకింద బైఠాయించి వ్యభిచారానికి సంబంధించిన వ్యవహారాలు నిర్వహిస్తుండడం ఇటీవలి కాలంలో పెరిగింది. రోడ్ల వెంబడి బేరాలు కుదుర్చుకుని సమీపంలోని లాడ్జీలను ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రాంతంలో అందరికీ తెలిసిన విషయమేనైనా ఎవరూ పట్టించుకోవడం లేదు. గతంలో రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఎక్కువగా వ్యభిచార వ్యవహారాలు జరిగేవి. అక్కడ గొడవలు కావడంతో కొంతకాలంగా అడ్డాలను కొత్తబస్టాండ్ ప్రాంతానికి మార్చారు. ఎంతో మంది అమాయకులు ఇలాంటి వారి బారిన పడి అన్ని రకాలుగా నష్టపోతున్నారు. పెరుగుతున్న అడ్డాలు... కామారెడ్డిలోని అశోక్‌నగర్, స్నేహపురి కాలనీ, ఎన్జీఓస్, పంచముఖి హనుమాన్, బతుకమ్మకుంట కాలనీల్లో వ్యభిచార గృహాలు వెలుస్తున్న ట్లు తెలుస్తోంది. స్నేహపురి కాలనీలో 3 నుంచి 4కు పైగా వ్యభిచార గృహాలు ఉన్నాయని కాలనీ వాసులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ నిర్వహించే వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. కొంతకాలం తర్వా త ఈ చీకటి వ్యాపారం మళ్లీ ప్రారంభమైంది. తా జాగా ముంబాయి నుంచి ఓ యువతిని తెచ్చి ఖరీ దైన వ్యభిచారం చేయించిన ఘటన స్నేహపురి కా లనీలో చోటు చేసుకుంది. డబ్బుల వ్యవహారంలో వివాదం తలెత్తి కేసు నమోదైంది. బాధితురాలని ఓ ఆశ్రయానికి తరలించిన పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో ఖరీదైన వ్యభిచారం గృహాలు పెరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎంతో మంది ఉన్నతస్థానంలో ఉన్నవారు, యువకులను ఆకర్షిస్తూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. లాడ్జీలపై కొరవడిన నిఘా... జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాం తాల్లో ఉన్న కొన్ని లాడ్జీలు వ్యభిచార వృత్తినే ఆధా రంగా చేసుకుని నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. కొత్తబస్టాండ్ ప్రాంతంలోని కొందరు లాడ్జీల నిర్వాహకులు వ్యభిచార కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో క్రమం తప్పకుండా లాడ్జీలపై దాడులు జరిగేవి. ఇటీవలి కాలంలో లాడ్జీల నిర్వహణపై పోలీసుశాఖ నిఘా కొరవడింది. కనీస చర్యలు కనిపించడం లేదు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఇలాంటి లాడ్జీలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళ రిమాండ్ కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఓ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ ఎస్హెచ్ఓ రామక్రిష్ణ శుక్రవారం తెలిపా రు. అనంతపురంనకు చెందిన రాధ కొంతకాలం గా కామారెడ్డిలోని అశోక్‌నగర్ కాలనీలో ఇల్లు కొని నివాసం ఉంటుంది. ఆమె ముంబాయి, కో ల్కతాల నుంచి అమ్మాయిలను తెప్పించి తన ఇంట్లో ఆశ్రయం ఇస్తుంది. డబ్బులకు ఒప్పందం చేసుకుని వచ్చిన అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తుంది. ఒప్పందం చేసుకుని డబ్బులు ఇవ్వనందుకు పీర్యా అనే ముంబాయికి చెందిన యువతి రాధతో గొడవపడి పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేసిందని ఎస్హెచ్ఓ తెలిపారు. కేసు న మోదు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను రిమాండ్‌కు తరలించామన్నారు. వ్యభిచారంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. చర్యలు తీసుకుంటాం... పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తున్నారని ఫిర్యాదు అందడంతో విచారణ జరిపి కేసు నమోదు చేశాం. ఇకపై ఎవరైనా అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేయిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. –రామకృష్ణ, ఎస్హెచ్ఓ, కామారెడ్డి. -
20న రాహుల్ గాంధీ రాక!
సాక్షి, కామారెడ్డి : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈనెల 20వ తేదీన జిల్లాకు రానున్నారు. కామారెడ్డిలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం కలెక్టర్ సత్యనారాయణను కలిసి, బహిరంగ సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. జిల్లా కేంద్రంలో సభ నిర్వహించడానికి మూడు స్థలాలను పరిశీలించాలని కోరినట్టు సమాచారం. ఇందిరాగాంధీ స్టేడియం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం, సీఎస్ఐ గ్రౌండ్లలో ఏదో ఒకదానిలో సభను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంనుంచి విజయం సాధించేందుకు శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెల 30న భిక్కనూరునుంచి కామారెడ్డి వరకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితో రోడ్‌షో నిర్వహించారు. రేవంత్ రోడ్‌షోతో క్యాడర్లో ఉత్సాహం వచ్చింది. అదే ఊపుతోని యోజకవర్గంలోని ఆయా మండలాల్లో షబ్బీర్‌అలీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇ దే సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కామారెడ్డికి రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. రాహుల్ పర్యటన ఈ నెల 20న ఉంటుందని పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన సమాచారంతో జిల్లా కాంగ్రెస్ నేతలు సభాస్థలి అనుమతి కోసం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. రాహుల్ పర్యటనతో కాంగ్రెస్ పార్టీకి మరింత జోష్ వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. -
నమ్మితే నట్టేట ముంచిండు..
నమ్మి అధికారం కట్టబెడితే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేసీఆర్ ప్రజలను నట్టేట ముంచాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. బోధన్ ప్రాంత ఆత్మగౌరవం, ప్రాణ సమానమైన షుగర్ ఫ్యాక్టరీని బొంద పెట్టిండన్నారు. పాస్‌పోర్టు, క్రికెట్ బెట్టింగ్, గల్ఫ్ ఏజెంట్ల దందాల్లో షకీల్ పేరు కనిపిస్తుందని, పోలీసు స్టేషన్లలో జేబుదొంగల ఫొటోలలో షకీల్ ఉంటారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. మంత్రి పోచారం తనయులు మంజీర ఇసుకను, కంకరలను దోచేసిండ్రు అని అన్నారు. మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే టీఆర్ఎస్ నాయకులను నిలదీయాలన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బోధన్‌లో బహిరంగ సభ, నవీపేట, రెంజల్ మండలాల్లో రోడ్ షోలలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. బోధన్ : బంగారు తెలంగాణ తెస్తానంటే నమ్మి అధికారం కట్టబెడితే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేసీఆర్ నట్టేట ముంచాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. గురువారం రాత్రి బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల సాగు భూమి, మైనారిటీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల అమలు హామీలేమయ్యాయని ప్రశ్నించారు. మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే టీఆర్ఎస్ నాయకులను నిలదీయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల ఆ సామాజిక వర్గం నిరుపేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యే అవకాశం కలిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో అనేక సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. నిజాంషుగర్స్‌ను మూసేశారు.. నిజాంషుగర్ ఫ్యాక్టరీని 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే వంద రోజుల్లో స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చి కేసీఆర్ రైతుల ఓట్లు దండుకున్నాడన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందని, ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తే షుగర్ ఫ్యాక్టరీ చరిత్ర ముగిసిన శకమని నిర్లక్ష్యంగా సమా«ధానం ఇచ్చిన కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చుంటే ఈ ప్రాంత రైతులు చూస్తూ ఊరుకోరన్నారు. బోధన్ ప్రాంత ఆత్మగౌరవం, ప్రాణ సమానమైన షుగర్ ఫ్యాక్టరీని కేసీఆర్ బొంద పెట్టిండన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ. లక్షా 70 వేల కోట్లుంటే, రూ. 400 కోట్లు ఖర్చు పెట్టి ఫ్యాక్టరీని తెరిపించలేకపోయారన్నారు. ఫ్యాక్టరీని నడపటం ప్రభుత్వంతో చేతకాదని, రైతులు నడుపుకుంటే అప్పగిస్తామని సమాధానమిచ్చాడని కేసీఆర్‌ని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. షకీల్ పాస్‌పోర్టు బ్రోకర్.. టీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పాసుపోర్టు బ్రోకర్ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాస్‌పోర్టు, క్రికెట్ బెట్టింగ్, గల్ఫ్ ఏజెంట్ల దందాల్లో షకీల్ పేరు కనిపిస్తుందని, పోలీసు స్టేషన్లలో జేబుదొంగల ఫొటోలలో షకీల్ ఉంటారని ఆరోపించారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రజా నాయకుడని ప్రశంసించారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టు శిలాఫలకాల పైన సుదర్శన్ రెడ్డి పేరుంటుందన్నారు. సుదర్శన్ రెడ్డితో షకీల్ పోలిక నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని, సుదర్శన్ రెడ్డి కాలిగోటికి కూడా షకీల్ సరిపోడన్నారు. జిల్లాలో గతంలో గొప్ప గొప్ప నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉన్నా రని, జిల్లాకు ఎంతో గౌరవంగా ఉండేదన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాసుపోర్టు, గల్ఫ్ ఏజెంట్ల దాందాలో ఉన్నారని విమర్శించారు. వీరి వ్యవహారం జిల్లా గౌరవానికి ఏమైన విలువ ఉంటుందా అన్నారు. పక్కనే బాన్సువాడలో ఉన్న అపధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక గ్రహచారమన్నారు.ఆయన తనయులు మంజీర ఇసుకను, కంకరలను దోచేసిండ్రు అని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ధర్మం, అధర్మానికి, నీతికి ,అవినీతి మధ్య పోరాటమన్నారు. సభలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ మాట్లాడారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి గడుగు గంగాధర్, బోధన్ ఎంపీపీ గంగాశంకర్, జడ్పీటీసీ అల్లె లావణ్య, పార్టీ జిల్లా కార్యదర్శి అల్లె రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుణ ప్రసాద్, నాగేశ్వర్రావు, బాన్సువాడ నియోజక వర్గ ముఖ్య నేత మల్యాద్రి రెడ్డి, నియోజక వర్గం పరిధిలోని బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట, బాన్సువాడ నియోజక వర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలు , ప్రజలు వేలాది మంది పాల్గొన్నారు. ఆరు నెలలు దుబాయ్‌లో.. నవీపేట(బోధన్) : బోధన్ తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్ ఓ చవట అని రేవంత్‌రెడ్డి అన్నారు. నవీపేట మండలంలోని అనంతగిరి, మోకన్‌పల్లి, రెడ్డి ఫారమ్, కమలాపూర్, నవీపేటలలో బుధవారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా నవీపేట చౌరస్తాలో మాట్లాడారు. మనుషుల అక్రమ రవాణాలో పాసుపోర్టు బ్రోకరు అయిన ఆయన పలు కేసులలో నిందితుడని, ఆరు నెలలు జైల్లో , ఆరునెలలు దుబాయ్‌లో ఉంటాడని ఆరోపించారు. ఇందూరు ఆడపడుచు అనో..సీఎం కేసీఆర్ కూతురనో ఎంపీగా కవితను ప్రజలు గెలిపించారని..కానీ ఆమె అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ఆమెకు చేతగాక తండ్రితో ఇందూరులో బహిరంగ సభ పెట్టించిందన్నారు. తాత ముత్తాతల నుంచి బతుకమ్మ రెంజల్(బోధన్) : రెంజల్ మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బతుకమ్మ పండగను రాష్ట్రంలో తాతముత్తాతల నుంచి ఆడుతున్నారన్నారు. కేసీఆర్ కూతురు కవితనే బతుకమ్మను సృష్టించినట్లు నమ్మిస్తున్నారని ఆరోపించారు. పత్రి సంవత్సరం బతుకమ్మకు రూ. 10 కోట్లు ఇవ్వగా, ఈ సంవత్సరం ఎందుకు ఇయ్యలేదన్నారు. నీ కూతురు ఆడితేనే నిధులిస్తువు లేకుంటే ఇయ్యవా అని కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలోనే ఆడబిడ్డలకు గౌరవం లభిస్తుందన్నారు. అమర వీరులను గుర్తించలేదు బోధన్ : తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువత ప్రాణత్యాగాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అమరవీరుల కుటుంబాలను కనీసం గుర్తించలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తొలి అసెంబ్లీ సమావేశంలో అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ,ఇంటికొకరికి ఉద్యోగం, విద్య, ఆరోగ్యం సౌకర్యం కల్పించాలని తీర్మానం చేశామన్నారు.¯ తొలిదశ ఉద్యమ అమరవీరులు 369 మంది, మలిదశ ఉద్యమంలో 1,200 మంది కలుపుకుంటే 1,569 మంది అమరవీరుల కుటుంబాలను కనీసం గుర్తించలేదన్నారు. నాలుగేళ్ల కాలంలో 500 మందిని గుర్తించిన కేసీఆర్ ,మిగిలిన వారి అడ్రస్సలు లేవని అంటున్నాడన్నారు. రాష్ట్రాన్ని కర్ఫ్యూగా మార్చి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన కేసీఆర్, సర్వే నాలుగు పేజీల్లో పందులు, కోళ్ల వివరాల సేకరించారని, కాని తెలంగాణ కోసం అమరవీరుల వివరాల సేకరణ చేపట్టలేదన్నారు. పందులు, కోళ్లకు ఇచ్చిన విలువ అమరవీరులకు ఇవ్వలేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో అమరవీరుల స్థూపం కడుతామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో 5 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని , దేశంలో రైతుల ఆత్మహత్యలలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించలేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఎన్నికల పొత్తు పెట్టుకుంటే తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ గుంటూరు మిర్చిలా మా పై ఎగిరిపడుతున్నారని ఆరోపించారు. -
అలసత్వం వద్దు..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పోలింగ్‌కు రెండు నెలల సమయం ఉందని అలసత్వం చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులెవరో తేలే వరకూ నియోజకవర్గంలో అన్ని అంశాలను అనుకూలంగా మా ర్చుకునేలా చూసుకోండి.. ఆయా గ్రామాల్లో పట్టున్న ఇతర పార్టీలకు చెందిన క్షేత్రస్థాయి నాయకులను చేర్చుకోవడం వంటి అంశాలపై దృష్టి సారించండి.. అని టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీ లో అసంతృప్తులెవరైనా ఉంటే వారితో చర్చిం చుకుని నోటిఫికేషన్ వచ్చే వరకు అనుకూల వాతావరణం ఉండేలా చూసుకోవాలని సూ చించారు. బుధవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థులతో హైదరాబాద్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అభ్యర్థుల ప్రకటన జరిగి నెలరోజులు దాటిన నేపథ్యంలో ప్రచారం ఎంత వరకు వచ్చింది.. పోలింగ్‌కు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు.. వంటి అం శాలపై సమీక్షించుకున్నారు. ప్రచార సరళి, కార్యకర్తలకు దిశా నిర్దేశం, సభల నిర్వహణ వంటి అంశాలను చర్చించారు. పోలింగ్ బూత్ స్థాయిలో అనుచరులను సమన్వయం చేసుకోవాలని, రోజూవారీగా ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వ పథకాలతో ఆ యా కుటుంబాలకు జరిగిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ హాజరైన ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్ (నిజామాబాద్ రూరల్), బిగాల గణేశ్‌గుప్తా (నిజామాబాద్ అర్బన్), ఆశన్నగారి జీవన్‌రెడ్డి (ఆర్మూర్), షకీల్ అమేర్ (బోధన్), గంపగోవర్ధన్ (కామారెడ్డి), ఏనుగు రవీందర్‌రెడ్డి (ఎల్లారెడ్డి), హన్మంత్‌షిండే (జుక్కల్)లతో పాటు నిజామాబాద్ ఎంపీ స్థానం పరిధిలో ఉన్న కోరుట్ల, జగిత్యాల అభ్యర్థులు కె.విద్యాసాగర్‌రావు, ఎం.సంజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
‘అర్బన్’లో ఆసక్తికరం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. తెరవెనుక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం గా మారుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ ప్రధాన అనుచరులు తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత టీఆర్ఎస్లో ఉన్న కార్పొరేటర్ కాపర్తి సుజాత తనకు టికెట్ కేటాయించాలని కోరుతూ టీపీసీసీ ఎన్నికల కమిటీకి దరఖాస్తు చేయడం కాంగ్రెస్‌తో పాటు, ఇటు టీఆర్ఎస్లో కూడా కలకలం రేగింది. గాంధీభవన్‌కు వెళ్లి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. డీఎస్ ప్రధాన అనుచరుల్లో ఒకరైన సుజాత కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత డీఎస్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆమె కూడా కారెక్కారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ డీఎస్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని టీఆర్ఎస్ పార్టీ తీర్మానం చేయడం విదితమే. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు రుజువు చేసి, సస్పెండ్ చేయండి లేదా.. క్షమాపణ చెప్పండని అధినేత కేసీఆర్‌కు డీఎస్ ఘాటు లేఖ రాయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరిణామాల తర్వాత టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్న డీఎస్ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో డీఎస్ ప్రధాన అనుచరుల్లో ఒకరైన కాపర్తి సుజాత ఇప్పుడు అర్బన్ స్థానానికి కాంగ్రెస్ టికెట్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్థానం టికెట్ కోసం బొమ్మ మహేష్ కుమార్‌గౌడ్, తాహెర్‌బిన్ హందాన్, నరాల రత్నాకర్, కేశవేణు, ప్రేమలతా అగర్వాల్, నరాల కళ్యాణ్ దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు కాపర్తి సుజాత దరఖాస్తు కూడా ఇప్పుడు టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలనలో ఉండటం గమనార్హం. పోటీ చేయాలని డీఎస్‌పై అనుచరుల ఒత్తిడి.. రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ త్వరలో టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి సొంత గూటికి చేరుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారని ఆయన అనుచరులు కూడా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అర్బన్‌లో డీఎస్‌తోనే పోటీ చేయించాలని ఆయన అనుచరవర్గం పట్టుబడుతోంది. నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కలిగిన మైనార్టీల్లో డీఎస్‌కు గట్టి పట్టుంది. దీనికి తోడు ఆయన సామాజికవర్గం ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. ఈ రెండు సామాజికవర్గాల ఓట్లు ఏకపక్షంగా సాధించాలంటే డీఎస్ స్వయంగా బరిలోకి దిగితేనే సాధ్యమవుతుందని డీఎస్ అనుచరవర్గం పేర్కొంటోంది. అర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయాలు రోజురోజుకూ తెరవెనుక అనూహ్య మలుపులు తిరుగుతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. -
రాజకీయ వే‘ఢీ!’
చిరకాల ప్రత్యర్థులైన తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ వర్గాల మధ్య మాట ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సీజన్ కావడంతో అది పతాక స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఎవరి ఆస్తి ఎంతో తేల్చుకోవడానికి బుధవారం బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. కానీ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున బహిరంగ చర్చలకు అనుమతి లేదని పోలీసులు పేర్కొంటున్నారు. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో గంప గోవర్ధన్, షబ్బీర్ అలీల మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో అది మరింత ముదిరింది. గత నెల 30న కామారెడ్డి పట్టణంతో పాటు భిక్కనూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌అలీలు తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను టార్గెట్ చేసి మాట్లాడారు. గంప గోవర్ధన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలు ఆస్తు లు సంపాదించాడంటూ విమర్శలు సంధించారు. దీంతో గంప గోవర్ధన్‌కు చిర్రెత్తుకొచ్చింది. తన నిజాయితీనే శంకిస్తారా అంటూ రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌అలీలపై తీవ్ర విమర్శలు చేశారు. తాను రాజకీయాల్లోకి రాకముందు ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తు లు, షబ్బీర్‌అలీ రాజకీయాల్లోకి రాకముం దు ఉన్న ఆస్తులు, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సమకూరిన ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. దమ్ముంటే బుధవారం కామారెడ్డి గాంధీ గంజ్‌లోని గాంధీ విగ్రహం వద్దకు రావాల న్నారు. దీనిపై షబ్బీర్‌అలీ అనుచరులు స్పందించారు. ఇరు పార్టీల నాయకుల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు నడిచాయి. ఎన్నికల సమయంలో వెనకడుగు వేసేది లేదని ఇరువురు నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. బుధవారం కామారెడ్డికి రావాలంటూ తమ క్యాడర్‌కు సమాచారం అందించారు. అనుమతి లేదంటున్న పోలీసులు.. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధంతో జిల్లా కేంద్రంలో రాజకీయం వేడెక్కింది. ఒకవేళ ఇరు పార్టీల నేతలు గాంధీ గంజ్‌కు చేరుకుంటే రచ్చరచ్చ అవుతుందని పోలీసు లు భావిస్తున్నారు. అందుకే అనుమతి లేదంటూ ప్రకటనలు జారీ చేశారు. జిల్లా లో ఎన్నికల కోడ్‌తోపాటు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, చర్చలు జరపడానికి వీళ్లేదని ఎస్పీ శ్వేత స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయమై ఆయా పార్టీల ముఖ్య నేతలకు కూడా సమాచారాన్ని పంపించారు. ఈ నేపథ్యంలో బుధవారం కామారెడ్డిలో ఏం జరుగుతుందన్న అంశంపై ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. -
ఆ నిబంధన అమలైతే టికెట్ కష్టమే!
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో సర్వే నివేదికలతో పాటు, కొత్త మార్గదర్శకాలు తెరపైకి వస్తుండటం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ఈ మార్గదర్శకాలు అమలైతే ఉమ్మడి జిల్లాలోని ఆ పార్టీ ముఖ్యనేతలైన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్‌అలీ, సీనియర్ నాయకులు సౌదాగర్ గంగారాం, ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్ లాంటి వారికే టికెట్ గండం పొంచి ఉంది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రత్యక్ష ఎన్నికల్లో మూడు పర్యాయాలు పరాజయం పాలైన నేతల కు టిక్కెట్ ఇవ్వకూడదని, 30 వేల ఓట్ల కంటే ఎక్కువ తేడాతో ఓడిపోయిన వారికి, 25 వేల కంటే తక్కువ ఓట్లు వచ్చినా టిక్కెట్ ఇచ్చేది లేదనే మార్గదర్శ కాలు పక్కాగా అమలు చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు టీపీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మార్గదర్శకాలతో ఉమ్మడి జిల్లాలోని ముఖ్య నేతలకే అసెంబ్లీ స్థానాలకు టికెట్ల ముప్పు పొంచిఉంది. షబ్బీర్కే..! నూతన మార్గదర్శకాలు అమలైతే కామారెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైన ఆ పార్టీ మండలి పక్ష నేత షబ్బీర్ అలీకే టిక్కెట్ ప్రశ్నార్థకం కానుంది. షబ్బీర్ ప్రత్యక్ష ఎన్నికల్లో వరుసగా మూడు పర్యాయాలు ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేతిలో పరాజయం చెందారు. 2009 ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి చవి చూశారు. ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానానికి 2010లో ఉప ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ తరపున షబ్బీర్‌అలీ పోటీ చేయగా ఏనుగు రవీందర్‌రెడ్డి చేతిలో సుమారు 37 వేల పైచిలుకు ఓట్లతో ఘోర పరాజయం పాలయ్యారు. ఇలా మూడు సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ షబ్బీర్ అలీ రాష్ట్ర అగ్రనేతల్లో ఒకరిగా ఉన్నారు. ఏకంగా మండలిలో కాంగ్రెస్ పక్ష నేతగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనికి తోడు కామారెడ్డి నియోజకవర్గంలో ఆయన ఆ పార్టీలో ఎదురులేని నేతగా కొనసాగుతున్నా రు. మూడు పర్యాయాలు ఓటమి పాలైన నేతలకు టిక్కెట్ ఇవ్వద్దనే మార్గదర్శకాలు అమలైతే షబ్బీర్‌కు టిక్కెట్ దక్కే అవకాశం లేదనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కానీ అభ్యర్థిత్వం దాదాపు ఖరారుకావడం, కేవలం అధికారికంగా ప్రకటించాల్సి ఉండటంతో షబ్బీర్‌అలీ ఇప్పటికే ఇక్కడ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సైతం రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో గెలుచుకునే స్థానాల్లో కామారెడ్డి ఒకటని ఆ పార్టీ ధీమాతో ఉంది. ఈ తరుణంలో ఈ నిబంధనను కాంగ్రెస్ అధిష్టానం అమలు చేస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. 30 వేల కంటే ఎక్కువ ఓట్లతో ఓటమి.. గత ఎన్నికల్లో 30 వేల ఓట్ల కంటే ఎక్కువ తేడాతో పరాజయం పాలైన నేతలకు కూడా ఈసారి టికెట్ కట్ చేయాలనే నిబంధన తెరపైకి వచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో గెలుపొందాలంటే కనీసం 60 వేల ఓట్లు తెచ్చుకుంటే విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటిది 30 వేల ఓట్లు ప్రత్యర్థి పార్టీ నుంచి తన వైపునకు తిప్పుకోవడం అనుకున్నంత సులభం కాదని భావిస్తున్న అధిష్టానం ఈ నిబంధనను తెరపైకి తెచ్చిందనే అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తోంది. ఈ నిబంధనలు అమలైన పక్షంలో జుక్కల్ టికెట్ రేసులో ఉన్న ఆ పార్టీ సీనియర్‌నేత సౌదాగర్ గంగారాంతో పాటు, ప్రభుత్వ మాజీ విప్, బాల్కొండ అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఈరవత్రి అనిల్‌లకు కూడా టికెట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఈ రెండు స్థానాలకు టికెట్లు ఆశిస్తున్న వారిలో ఈ ఇద్దరు నేతలు ముందు వరుసలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో బాల్కొండ బరిలో దిగిన అనిల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఏకంగా 36 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. అలాగే జుక్కల్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సౌదాగర్ గంగారాం కూడా 35 వేల పైచిలుకు ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ విజయం సాధించిన టీఆర్ఎస్ తాజామాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే చేతిలో పరాజయం పొందారు. 30 వేల ఓట్ల కంటే ఎక్కువ ఓట్లతో ఓటమి పాలైన వారికి టికెట్ ఇవ్వద్దనే నిబంధన అమలైతే గంగారాంతో పాటు, ఈరవత్రి అనిల్‌లకు అభ్యర్థిత్వాలు ప్రశ్నార్థకమే! కాగా నియోజకవర్గంలో గంగారాంకు ఇప్పటికీ గట్టి పట్టుంది. ఈసారి తనకు టికెట్ కేటాయించకపోతే.. తన అల్లుడికైనా ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించిన గంగారాం.. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా నైనా బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. అర్బన్ స్థానంలో బొటాబోటీగా.. నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి 2014 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్ పోటీ చేశారు. కేవలం 25,742 ఓట్లు సాధించిన మహేష్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఎంఐఎం అభ్యర్థి మీర్ మజాజ్అలీ రెండో స్థానం లో నిలవగా, బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారా యణగుప్త మూడో స్థానంలో ఉన్నారు. కొత్త మా ర్గదర్శకాల ప్రకారం 25 వేల ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చిన నేతల పేర్లు టిక్కెట్ పరిశీలన జాబితాలో నుంచి తొలగించాలనే నిబంధనల తెరపైకి వచ్చింది. కానీ బొటాబోటీగా 25 వేల కంటే కేవలం 742 ఓట్లు మాత్రమే ఎక్కువ పొందగలిగిన మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఈ మార్గదర్శకాలతో ముప్పులేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని అంశాలు పరిగణనలోకి.. ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే గట్టి పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిత్వాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. మహాకూటమి పొత్తులో సీట్ల పంపకాల విషయంలో గెలిచే పార్టీకే స్థానం కేటాయించాలని అన్ని భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని గెలుపుగుర్రాల వేటలో నిమగ్నమైంది. కాగా కొత్త మార్గదర్శకాలు తెరపైకి రావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ మార్గదర్శకాలతో పాటు, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ కేటాయించాలనే అంశం ఇటీవల జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చకొచ్చిందని జిల్లాలోని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. తెరపైకి వచ్చిన ఈ మార్గదర్శకాలు ఆయా స్థానాల అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఆశావహులకు చుక్కెదురవుతుందా.? లేక మార్గదర్శకాలను అసలు పరిగణనలోకి తీసుకోకుండా వదిలేస్తారా అనేది అభ్యర్థిత్వాల ప్రకటన వరకు వేచి చూడాల్సిందే. -
కొత్త రైతులకు నో చాన్స్
‘రైతు బంధు’ అమలు విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంది.ఈ పథకంలో కొత్త వారిని చేర్చకూడదని సూచనలు చేసింది. దీంతో భూ వివాదాలు పరిష్కారమై పార్ట్ ‘బి’ పరిధిలో నుంచి పార్ట్ ‘ఎ’లోకి మారిన రైతులు, పలు కారణాల వల్ల ఖరీఫ్‌లో చెక్కులు పొందలేక పోయిన దాదాపు 60 వేల మందికి పైగా రైతులకు నిరాశే ఎదురు కానుంది. మోర్తాడ్(బాల్కొండ): పంటల సాగు కోసం రైతులకు పెట్టుబడి సహాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో కొత్త వారిని చేర్చకూడదని ఎన్నికల కమిషన్ సూచించడంతో గతంలో చెక్కులు పొందిన రైతులకే ప్రయోజనం చేకూరనుంది. పార్ట్ ‘బి’ పరిధిలో నుంచి పార్ట్ ‘ఎ’ పరిధిలోకి మారిన రైతులు, వివిధ కారణాల వల్ల ఖరీఫ్‌లో చెక్కులు పొం దలేక పోయిన రైతులకు నిరాశే ఎదురుకానుంది. అయితే రబీ సీజనుకు సంబంధించి పెట్టుబడి సహాయం అందించడానికి తమకు ఇంకా మార్గదర్శకాలు అందలేదని అందువల్ల ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి ఖరీఫ్‌కు రూ.4 వేల చొప్పున, రబీ సీజనుకు మరో రూ.4 వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించిన విషయం విదితమే. ఖరీఫ్ సీజనుకు గాను మే నెలలోనే అర్హులైన రైతులకు పెట్టుబడి సహాయం చెక్కులను వ్యవసాయ శాఖ అందించింది. రబీ సీజనుకు సంబంధించి నవంబర్‌లో చెక్కులను అందించాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమలైతే పెట్టుబడి సహాయానికి బ్రేక్ పడవచ్చని భావించిన ప్రభుత్వం ఒక నెల ముందుగానే పంపిణీకి ఏర్పా ట్లు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచే అన్ని గ్రామాలలో పెట్టుబడి సహాయం చెక్కులను అందించాల్సి ఉంది. కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని పలు సూచనలు, సలహాలను అందించడంతో రైతుబంధు పథకం అమలులో ఊహించని మా ర్పులు చోటు చేసుకున్నాయి. గ్రామాలలో గ్రామసభలను నిర్వహించి చెక్కులను పంపిణీ చేయ కుండా రైతుల ఖాతాలలోకి పెట్టుబడి సహాయం నగదు రూపంలో బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. అంతేగాక గతంలో పెట్టుబడి సహాయం పొందిన రైతులకు మాత్రమే రబీ సహాయంను అందించాలని కొత్త వారిని ఇప్పట్లో చేర్చవద్దని కూడా ఎన్నికల కమిషన్ పేర్కొంది. దీంతో జిల్లాలో వివాదాస్పద భూములు పరిష్కారమై పార్ట్ ‘బి’ పరిధిలో నుంచి పార్ట్ ‘ఎ’ పరిధిలోకి మారిన రైతులు దాదాపు 30 వేల మంది పెట్టుబడి సహాయం అందుకోలేక పోతున్నారు. ఖరీఫ్ సీజనులో జిల్లాలోని 2లక్షల, 271 మంది రైతులకు పెట్టుబడి సహాయం మంజూరు అయ్యింది. రూ.204.44 కోట్ల నిధులు ఇందు కోసం కేటాయించారు. రైతులు మరణించడం, ప్రభుత్వ భూముల్లో సాగు, ఆధార్ కార్డు అందించకపోవడం వంటి కారణాలతో 36,903 మంది రైతులకు చెక్కులు పంపిణీ కాలేదు. ఈ చెక్కులు వ్యవసాయ శాఖ వద్దనే ఉండిపోయాయి. వీరు కూడా రబీలో పెట్టుబడి సహాయం పొందలేకపోతున్నారు. అయితే విదేశాల్లో ఉన్న రైతుల పేరిట మంజూరైన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎన్నికల కోడ్ అమలుకు ముందుగానే ఈ నిర్ణయం తీసుకోవడంతో విదేశాల్లో ఉన్న రైతుల చెక్కులకు కోడ్ వర్తించదని ప్రభుత్వం చెబుతోంది. ఖరీఫ్ సీజనులో ఎంత మంది రైతులకు పెట్టుబడి సహాయం మంజూరైందో అంతే మొత్తం రబీ సీజనుకు కూడా మంజూరు కానుంది. ఇదిలా ఉండగా రైతుల ఖాతా నంబర్లను మళ్లీ సేకరించడమా లేక ధరణి వెబ్సైట్ ఆధారంగా నమోదైన ఖాతాల వివరాల ప్రకారం నగదు బదిలీ చేయడమా అనేది ప్రభు త్వం తేల్చాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం నడుచుకుంటామని వ్యవసాయ శాఖ చెబుతుండగా ఇందు కోసం తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంది. మార్గదర్శకాలు జారీ అయితేనే రబీ సీజను పెట్టుబడి సహాయం ఎలా అందుతుందో స్పష్టం అవుతుంది. ఇందుకోసం కొంత సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. నగదు బదిలీపై రైతుల్లో అసంతృప్తి రబీ సీజను పెట్టుబడి సహాయాన్ని బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించడంతో రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం వల్ల బ్యాంకర్లు పాత రుణాల వసూలుకు లింకు పెట్టి పెట్టుబడి సహాయం చెల్లించకుండా నిలిపివేస్తారని రైతులు అంటున్నారు. చెక్కులు ఇవ్వడం వల్ల తమకు అవకాశం ఉన్న బ్యాంకులో నగదును విత్ డ్రా చేసుకోవడానికి వీలు ఉండేది. బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం వల్ల పాత రుణాలకు బ్యాంకర్లు లంకె పెట్టే అవకాశం ఉండటంతో రైతులు ఈ విధానంపై పెదవివిరుస్తున్నారు. కాగా బ్యాంకర్లకు పెట్టుబడి సహాయం చెల్లింపులపై ఆదేశాలు ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నారు. తప్పులు వచ్చాయని చెక్కులు ఇవ్వలేదు మేము గతంలో కొనుగోలు చేసిన వ్యవసాయ భూమికి సంబంధించి మూడు ఎకరాలకు బదులు ఎక్కువ భూమి మా రికార్డులలో నమోదు అయ్యింది. దీంతో రూ.12 వేల పెట్టుబడి సహాయానికి బదులు ఎక్కువ సొమ్ము మంజూరైంది. అయితే అధికారులు అసలు ఉన్న భూమికి కూడా చెక్కు ఇవ్వలేదు. చెక్కును వాప సు తీసుకున్నారు. ఇంత వరకు మళ్లీ చెక్కు ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు రూ.12 వేల చెక్కు ఇస్తారా ఇవ్వరా అనేది అధికారులు తేల్చడం లేదు. – బూత్‌పురం మహిపాల్, రైతు, మోర్తాడ్ బ్యాంకు ఖాతాలను సేకరించాలని ఆదేశించారు రైతుబంధు పథకాన్ని రబీ సీజనుకు అమలు చేయడానికి గాను రైతుల బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించాలని సూచించారు. గతంలో పెట్టుబడి సహాయం పొందిన రైతులకే పెట్టుబడి సహాయం అందించనున్నారు. కొన్ని కారణాల వల్ల పెట్టుబడి సహాయం అందుకోని రైతులకు ఇప్పుడు సహాయం అందిస్తారా లేదో తెలియదు. ప్రస్తుతానికి సహాయం పొందిన రైతుల ఖాతాల వివరాలు సేకరిస్తున్నాం. –పర్స లావణ్య, వ్యవసాయాధికారి, మోర్తాడ్ -
ఆచితూచి.. ప్రచారం..
కాంగ్రెస్ పార్టీ హంగూ.. ఆర్భాటం లేకుండా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తోంది. అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైన నియోజకవర్గాల్లోనే భారీ బహిరంగ సభల జోలికి వెళ్లకుండా రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారానికి పరిమితమవుతోంది. కామారెడ్డిలో ఇటీవల రోడ్‌షో నిర్వహించిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ నెల 11న బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి రానున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల ప్రచారం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. హంగూ.. ఆర్భాటం లేకుండా ప్రచారాన్ని కొనసాగిస్తోంది. టీఆర్ఎస్ మాదిరిగా భారీ బహిరంగసభల జోలికి వెళ్లకుండా ప్రస్తుతానికి రోడ్‌షో లు, ఇంటింటి ప్రచారానికి పరిమితమవుతోంది. అది కూడా పూర్తి స్థాయిలో స్పష్టత ఉన్న నియోజకవర్గాల్లోనే ఈ ప్రచారానికి తెరలేపారు. అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైన చోట్ల ఆశావహులు ప్రచారంపై దృష్టి సారించారు. కామారెడ్డిలో ఆ పార్టీ నుంచి బరిలోకి దిగనున్న షబ్బీర్‌అలీ ప్రచారాన్ని ప్రారంభించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితో ఇటీవల రోడ్‌షోలు నిర్వహించారు. భిక్కనూర్ నుంచి కామారెడ్డి వరకు కొనసాగిన ర్యాలీ రోడ్ షో ఆ పార్టీ శ్రేణుల్లో కొంత మేరకు ఉత్సాహం నిం పింది. ఇదే తరహాలో బోధన్ నియోజకవర్గంలో కూడా రేవంత్‌రెడ్డి తో ప్రచార కార్యక్రమాలను నిర్వ హించాలని నిర్ణయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి ఈ మేరకు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఈనెల 11న నియోజకవర్గానికి రానున్న రేవంత్‌రెడ్డి మొదట నవీపేట్ మండల కేంద్రం నుంచి రోడ్‌షోను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రెంజల్ మీదుగా బోధన్ పట్టణం వరకు రోడ్‌షో కొనసాగుతుందని నేతలు ప్రకటించారు. పట్టణంలోని అంబేద్కర్‌చౌరస్తాలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మరోవైపు ఆర్మూర్‌లో ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా దాదాపు 20 రోజుల క్రితం నుంచే గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మహాకూటమి పొత్తులు, టీడీపీకి కేటాయించనున్న స్థానం విషయంలో స్పష్టత లేకపోవడం, ఇంకా అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడంతో మిగిలిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రచా రం అంతగా సాగడం లేదు. కేవలం అసమ్మతి సెగలు లేని, స్పష్టత ఉన్న చోట్ల మాత్రమే ప్రచారం కొనసాగుతోంది. ఖరారు కాని టీపీసీసీ బహిరంగ సభలు.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార సభలకు శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే తొలి విడత సభల షెడ్యుల్‌లో నిజామాబాద్ జిల్లా ఖరారు కాలేదు. రెండో విడతలో ఈ సభలు జిల్లాలో నిర్వహించే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆర్థిక భారానికి జడిసి.. మరోవైపు పోలింగ్‌కు దాదాపు రెండు నెలలు గడువుంది. ఇప్పటి నుంచే ప్రచారం జోరుగా సాగిస్తే.. ఖర్చు తడిసి మోపెడవుతుందని భావిస్తున్న ఆశావహులు ప్రచారాన్ని కొద్ది కొద్దిగా జోరు పెంచాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ., కాంగ్రె స్ మాత్రం ఇంకా అభ్యర్థుల ప్రకటన ప్రక్రియను కూడా పూర్తి చేయలేదు. అభ్యర్థిత్వాలు ఖరారయ్యాక., ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు చల్లారిన తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేసే యోచనలో ఉన్నారు. -
కారు.. ప్రచార జోరు
అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ.. ప్రచారంలో దూసుకుపోతోంది. అభ్యర్థులు గ్రామాలను చుట్టివస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో కారు జోరు మరింత పెంచారు. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులను ఒడ్డుతున్నారు. చేసిన అభివృద్ధిని వివరిస్తూనే ప్రత్యర్థులను బలహీనపరచడానికి వలసలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారు. సాక్షి, కామారెడ్డి: టీఆర్ఎస్ అభ్యర్థులు జిల్లాలో ప్రచారాన్ని ఉధృతం చేశారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యేలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వారు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గత నెల 6న ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభను రద్దు చేసి, అదే రోజు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.. అప్పటినుంచి అభ్యర్థులు నియోజక వర్గాల్లో మకాం వేశారు. ప్రత్యర్థులను బలహీన పరిచేందుకు వలసలను ప్రోత్సహిస్తున్నారు. ఎదుటి పార్టీల్లో ఉన్న నేతలు, ప్రజాప్రతినిధులకు గాలం వేయడంతో పెద్ద ఎత్తున వలసలు జరిగాయి. నెల రోజులలో నాలుగు నియోజక వర్గాల్లో వేలాది మందికి గులాబీ కండువా కప్పారు. అసెంబ్లీ రద్దుకు ముందే అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతో ఊళ్లను చుట్టివచ్చిన తాజా మాజీ ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఓట్ల కోసం మరోమారు పల్లెబాట పట్టారు. కామారెడ్డిలో.. కామారెడ్డి నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో విస్తృతం గా పర్యటిస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన జి ల్లా, మండల, గ్రామ స్థాయి నేతలను తమవైపు తి ప్పుకోవడంలో సఫలమైన గంప.. అందరినీ ఏక తాటిపైకి తీసుకువచ్చి ప్రచారాన్ని మొదలుపెట్టా రు. పది రోజులుగా నియోజక వర్గంలోనే పర్యటిస్తూ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. పనిలో పనిగా విపక్ష పార్టీల నేతలపైనా విరుచుకుపడుతున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసన మండలి విపక్ష నేత షబ్బీర్అలీకి టికెట్టు దాదాపుగా ఖరారైందని భావిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో వలసలను ప్రోత్సహిస్తున్నారు. సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. పనిలోపనిగా అధికార పార్టీ నేతలపై ఆరోపణలు, విమర్శలు సంధిస్తున్నారు. ఇక్కడ బీజేపీ టికెట్టు జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డికి వచ్చే అవకాశాలున్నాయి. ఆయన వివిధ సమస్యలపై ఉద్యమాల తో జనం నోట్లో నానుతున్నారు. ముఖ్యంగా యు వతను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టారు. మహిళల సమస్యలపైనా పోరాటాలు నిర్వహించారు. బాన్సువాడలో.. బాన్సువాడ నియోజకవర్గంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం ని ర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఆయన చాలా గ్రామాలను చుట్టివచ్చారు. కుల సంఘాలను కలిసి మద్దతు కూడగడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరన్నది తేలకపోవడంతో ఆ పార్టీ ప్రచారం అంతంతమాత్రంగానే ఉంది. ఇతర పార్టీల పరిస్థితీ అంతే.. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రచారాన్ని ఉధృతం చేశారు. మొదట్లో ఇతర పార్టీల నేతలను తనవైపు తిప్పుకోవడం, అసంతృప్తితో ఉన్న సొంత పార్టీ నేతలను బుజ్జగించడం చేశారు. మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులుతో పాటు ఆయన అనుచరులను బీజేపీనుంచి టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కూడా బలంగానే ఉంది. అయితే అభ్యర్థిని ప్రకటించపోవడంతో ఆ పార్టీ ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. అయినప్పటి కీ నలుగురు అభ్యర్థులు కలిసి ప్రచారంలో పా ల్గొంటున్నారు. ఎవరికి టికెట్టిచ్చినా కలిసి ప్రచా రం చేసి, గెలిపించుకుంటామని చెబుతున్నారు. జుక్కల్‌లో.. జుక్కల్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి గెలిపించాలని కోరుతున్నారు. పక్షం రోజులుగా ఆయన నియోజకవర్గంలో మకాం వేసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు టికెట్టు ఆశిస్తున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, అరుణతారల మధ్య టికెట్టు కోసం పోటీ నెలకొంది. ఇద్దరూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయితే టికెట్టు ఎవరిని వరిస్తుందన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మిగతా పార్టీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తులోనే ఉండగా.. టీఆర్ఎస్ మాత్రం ప్రచారంలో దూసుకుపోతోంది. -
నయీమ్ డబ్బులతో టీఆర్ఎస్ ప్రచారం
నిజామాబాద్‌అర్బన్: నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం భారీగా డబ్బులతో పాటు బంగారాన్ని సీఎం కేసీఆర్ దోచుకున్నారని, ఆ డబ్బునే ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హన్మంత్‌రావు ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మహా కూటమియే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత మహేశ్‌కుమార్‌గౌడ్ తల్లి మణెమ్మ మృతి చెందడంతో ఆయనను పరామర్శించేందుకు ఆదివారం నిజామాబాద్‌కు వచ్చిన వీహెచ్ ఓ హోటల్లో విలేకరుల తో మాట్లాడారు. ముందస్తు ఎన్నికలకు కాం గ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, మహా కూటమి సీట్ల సర్దుబాటు త్వరలోనే పూర్తవుతుందన్నా రు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కేసీఆర్ విఫలమయ్యాడని, తన కుటుంబంలోని సమ స్యతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని విమర్శించారు. తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనే తపనతో ప్రతిపక్షాలపై ఆరోపణ లు చేస్తున్నారని, అభద్రతాభావంతో కేసీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని ధ్వ జమెత్తారు. ఎన్నికల కమిషన్‌పై అనుమానా లు వ్యక్తమవుతున్నాయని, సీఎం కేసీఆర్ చెప్పినట్టే డిసెంబర్లో ఎన్నికలు రావడం, ఓటర్ల జాబితా పూర్తి కాక ముందే ఎన్నికల షెడ్యూల్ రావడం వల్లే అనుమానాలు పెరిగాయన్నారు. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరూ అబద్దాలకోరులు అని, ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఎవరు ఉంటే, వారిపై ఐటీ దాడులు చేయడం పరిపాటిగా మారిందని తెలిపారు.త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ సభలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని వీహెచ్ విమర్శించారు. ఆర్టీసీ బస్సులకు కేసీఆర్, పోచారం ఫొటోలు ఉన్నాయని, బస్సులను ఆపి పోస్టర్లు చింపి వేసినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనేక పథకాలు చేపడతామన్నారు. -
వైఎస్సార్ ఆశయ సాధనే కాంగ్రెస్ ధ్యేయం
భిక్కనూరు(కామారెడ్డి జిల్లా): ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కలలు గన్న ఇందిరమ్మ రాజ్యం.. రైతు రాజుగా బతకాలనే దివంగత సీఎం వైఎస్సార్ ఆశయ సాధనే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తుందని శాసన మండలి విపక్ష నేత, కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. శనివారం భిక్కనూరులోని పాత ఎస్సీ కాలనీ, గిద్ద ఎస్సీకాలనీ, తిప్పాపూర్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిశ్శబ్ద ప్రజా సునామీ ఉందని, ఈ సునామీలో టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి తన ఇంట్లో నలుగురికి రాజకీయ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మహిళలపై కేసీఆర్‌కు ఎలాంటి గౌరవం లేదని, మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్రూంలు కట్టిస్తానని చెప్పి ఆ హామీని నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీపై తొలి సంతకం చేయడం జరుగుతుందన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ కలలు గన్న రైతు రాజ్యం సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తిప్పాపూర్‌లో ప్రచారం ప్రారంభించడం లక్కీచాంప్ తిప్పాపూర్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం తనకు లక్కీచాంప్ అని షబ్బీర్ అలీ అన్నారు. 1989, 2004లో కూడా తిప్పాపూర్ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి విజయం సాధించానని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఈ గ్రామంలో ఉన్నప్పుడే ఎన్నికల తేదీ డిసెంబర్ 7గా ఈసీ ప్రకటించిందని తెలిపారు. ఇది తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే మొదటగా తిప్పాపూర్‌కు వచ్చి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతానన్నారు. -
‘ఢీ’సెంబర్ 7
సమయం ఖరారైంది.. ఇక, సమరానికి తెర లేవనుంది.. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఇప్పటికే ప్రచార హోరుతో రాజకీయం రంజుగా మారిన నేపథ్యంలో సీఈసీ ప్రకటన మరింత వేడిని పెంచింది. ప్రధాన పార్టీలన్నీ మరింత వేగంగా కదన రంగంలో దూసుకెళ్లేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ‘ప్రత్యేక’ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై నేపథ్యంలో జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారనుంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై నిన్న మొన్నటి వరకు రకరకాల ఊహాగానాలు రావడంతో అయోమయం నెలకొంది. మరోవైపు, కోర్టు కేసుల నేపథ్యంలో ఏం జరుగుతుందని ఉత్కంఠ కొనసాగింది. అయితే, రాష్ట్రంలో డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించడంతో ఉత్కంఠకు తెర పడింది. సీఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో ప్రస్తుతం అంతటా ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలై 19 వరకు కొనసాగనుంది. 20న నామినేషన్ల పరిశీలన, 22న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అనంతరం డిసెంబంర్ 7న ఎన్నికలు జరుగనున్నాయి. 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొదలైన సన్నాహాలు.. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాల్లో ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి. ఓటర్ల జాబితాపై హైకోర్టులో విచారణ నేపథ్యంలో ఏర్పడిన అనుమానాలను పటాపంచలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా, వారు క్షేత్ర స్థాయిలో ప్రచారం ప్రారంభించారు. మిగతా పార్టీలు అభ్యర్థులను త్వరగా ప్రకటించి, ప్రచారంలో దూసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 12న విడుదల కానుండడంతో నెల రోజుల కాలంలో అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించడానికి అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రచారంలో భాగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం మరింత వేడెక్కనుంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నేతలు ‘అన్ని రకాల’ ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. వేడెక్కిన రాజకీయం.. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. కామారెడ్డి నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్‌రెడ్డి, బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జుక్కల్‌లో హన్మంత్ సింధే ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయడానికి సన్నద్ధమైన నేపథ్యంలో సీట్ల పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. దీంతో అభ్యర్థుల ఎంపికపై సందిగ్ధం నెలకొంది. కామారెడ్డిలో ప్రచార హోరు.. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ పేరు దాదాపు ఖరారైనట్లే. దీంతో ఆయన నెల రోజులుగా నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్నారు. కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ వచ్చిన షబ్బీర్‌అలీ ప్రచారాన్ని మొదలుపెట్టారు. గత నెల 30న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించడం ద్వారా క్యాడర్లో జోష్ పెంచారు. అంతటితో ఆగకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రజా సమస్యలే ఎజెండాగా జనంలోకి వెళుతున్నారు. ఇప్పటికే ఆయన పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురైదుగురు టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే, టిక్కెట్ ఎవరికి వచ్చినా కలిసే పని చేయాలని అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో ఇటీవల అందరు కలిసి నియోజక వర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. ఇక్కడ బీజేపీ ఇంకా ప్రచారాన్ని మొదలుపెట్టలేదు. అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి పేరును ఖరారు. అయితే, ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ లో టిక్కెట్ రాని వారికి గాలం వేయాలని బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. బాన్సువాడ, జుక్కల్‌లో.. బాన్సువాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురైదుగురు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థిత్వం ఖరారైన తరువాత ప్రచార వేడి పెరగనుంది. ఎస్సీ రిజర్వుడు స్థానమైన జుక్కల్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌కు పోటీ తీవ్రంగా ఉంది. మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, అరుణతార తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా నాయుడు ప్రకాశ్ పేరు దాదాపు ఖరారు కాగా, ఆయన ప్రచారం మొదలుపెట్టారు. -
మోగిన ఎన్నికల నగారా!
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదల కావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్క సారిగా వేడెక్కింది. ఆయా పార్టీల అభ్యర్థులు, ఆశావహులు ఇక తమ దూకుడు పెంచనున్నారు. వచ్చేనెల 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, డిసెంబర్ 7న ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే పోలింగ్ నిర్వహణ ఏర్పాట్ల ప్రక్రియలో నిమగ్నమైన అధికారులు మరింత వేగం పెంచనున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల షెడ్యుల్ ప్రకటనతోనే ఉమ్మడి జిల్లాలోని ఆయా పార్టీల అ భ్యర్థులు, అశావహులు అలర్ట్ అయ్యారు. ఇప్పటి కే తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ ప్రచారంలో ముందుంది. నిజామాబాద్ జిల్లా నుంచే ఉమ్మడి జిల్లాల బహిరంగసభలకు టీఆర్ఎస్ శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఇటీవల ఆ పార్టీ భారీ బహిరంగసభను నిజామాబాద్‌లో నిర్వహించింది. అభ్యర్థులు కూ డా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నా రు. అయితే కొన్ని రోజులుగా టీఆర్ఎస్ అభ్యర్థులంతా ప్రచారానికి విరామమిచ్చారు. తాజాగా ఎన్నికల నగారా మోగడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రచారానికి రంగంలోకి దిగనున్నారు. కాగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా రాజుకున్న అసమ్మతి వేడి ఎట్టకేలకు చల్లారింది. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని వేగం పెంచనున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ స్పష్టత ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రచార బరిలో ఉన్నారు. ము ఖ్యంగా బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అ లీ, ఆకుల లలితలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. కామారెడ్డిలో ఇటీవల కాంగ్రెస్ రోడ్‌షోను కూడా నిర్వహించింది. ఆ పార్టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పర్యటించారు. రెండు మూ డు రోజుల్లో బోధ న్లో కూడా ఇలాంటి రోడ్‌షో నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ మా త్రం ఇంకా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలోనే నిమగ్నమైంది. ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం జి ల్లాలోని అభ్యర్థుల ఎంపిక కోసం ఆ పార్టీ ముఖ్యనాయకత్వంతో అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియ.. ఎన్నికల షెడ్యుల్‌కు ముందే ఏర్పాట్లలో నిమగ్నౖ మెన అధికార యంత్రాంగం ఇక ఈ ఏర్పాట్ల ప్రక్రియను వేగవంతం చేయనుంది. ప్రస్తుతం ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవ ల ముసాయిదాను ప్రకటించిన అధికారులు, కొ త్తగా నమోదు చేసుకున్న ఓటర్లు, జాబితా నుంచి తొలగించే వారి పేర్లు, ఒక పోలింగ్‌బూత్ నుంచి మరో పోలింగ్‌బూత్ పరిధిలోకి తమ పేర్ల మార్పు లు ఇలా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ చేస్తు న్నారు. దీన్ని ఇకపై వేగవంతం చేయనున్నారు. మరోవైపు ఓటు హక్కు వినియోగంపై అవగాహనా కార్యక్రమాలకు కూడా అధికారులు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఎన్నికల నియమావళిపై అధికార యంత్రాంగానికి కూడా అవగాహన కల్పించే కార్యక్రమాలను కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి, టోల్‌ఫ్రీ నెంబర్లను ప్రకటించారు. అలాగే పోలింగ్ నిర్వహణకు అవసరమైన నోడల్ అధికారులను కూడా ప్రకటించారు. సుమారు 15 అంశాలకు సంబంధించి నోడల్ అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఎన్నికల నగారా మోగడంతో ఇటు అధికార యంత్రాంగంతో పాటు, రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది. -
ఖతర్‌లో కష్టాలు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్నవారి పరిస్థితులు అగమ్య గోచరంగా మారుతున్నాయి. జీతం బాగుందనే ఆశతో ఏజెంట్ల మాటలను నమ్మి వెళ్తే దేశం కాని దేశంలో నరకం అనుభవిస్తున్నారు. కొంత మందికి కనీసం తిండికయ్యే ఖర్చంత కూడా వేతనాలు ఇవ్వకుండా అక్కడి కంపెనీలు మోసం చేస్తున్నాయి. ఇదే పరిస్థితిని నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు బాధితులు ఎదుర్కొన్నారు. ఇందులో ఇద్దరు అప్పుచేసి ఖతర్ దేశం నుంచి బయటపడి ఇండియాకు తిరిగి వచ్చారు. ఏ పరిస్థితుల్లో ఖతర్‡ వెళ్లాల్సి వచ్చింది... ఏజెంటు ఏ విధంగా మోసం చేశాడు... వారు పడ్డ కష్టాలను వివరించారు. ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన చెలిమెల పవన్, నందిపేట్ మండలం నూత్పల్లి గ్రామానికి చెందిన మెరుగు శ్రీనివాస్ గౌడ్, మోపాల్ మండలం బాడ్సీ గ్రామానికి చెందిన కొట్టాల రవి. వీరు ముగ్గురితో పాటుగా జగిత్యాల్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాలకు చెందిన వారితో కలిపి మొత్తం తొమ్మిది మంది ఏజెంట్ చేతిలో మోసపోయారు. కూతురి పెళ్లి చేసేందుకు డబ్బులు కావాలని ఒకరు... ఇక్కడ ఉద్యోగాలు లేక ఖతర్‌లో ఏ పనైనా పర్వాలేదని మరొకరు... ఇల్లు కట్టుకుందామని ఇంకొకరు... ఇలా ఉన్న ఆస్తులను అమ్మేసి, బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి ఖతర్ వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఖత్తార్‌లో క్యాబ్ డ్రైవర్‌గా వెళ్తున్న వీరికి వేతనం అధిక మొత్తంలో ఉంటుందని, అక్కడి డ్రైవింగ్ లైసెన్సు కూడా కంపెనీయే భరిస్తుందని ఏజెంట్ చెప్పిన మాయ మాటలకు మోసపోయి ఒక్కొక్కరు రూ.1లక్షా 30వేలు కట్టారు. మెట్‌పల్లికి చెందిన పంజాల శ్రీనివాస్ గౌడ్ అనే ఏజెంటుతో పాటు ముంబాయికి చెందిన మరో ఏజెంటుకు ఈ డబ్బులను మొత్తం చెల్లించారు. ఈ ఏడాది మార్చిలో ఖతర్ దేశం వెళ్లారు. ఆలిజర హోలోడింగ్ లిమోసిన్ కర్వ టాక్సీ కంపెనీలో డ్రైవర్‌గా చేరారు. ఏజెంటు చెప్పిన విధంగా ఖత్తార్‌లో పని చేసే కంపెనీలో ఒకరోజు ట్యాక్సీ నడిపి 100 రియళ్లు సంపాదిస్తే 30 రియళ్లు వేతనంగా ఇవ్వాలి. కానీ అక్కడికి వెళ్లిన తరువాత అసలు విషయం తెలుసుకుని ఒక్కసారిగా కంగుతిన్నారు. రోజుకు 450 రియళ్లు సంపాదించి ఇస్తేనే 30 శాతం వేతనంగా ఇస్తామని కంపెనీ వాళ్లు టార్గెట్ పెట్టడంతో ఏం చెయ్యాలో అర్థం కాని స్థితికి చేరుకున్నారు. టార్గెట్ చేయలేని పక్షంలో ప్రతినెల 500 రియళ్లు (ఇక్కడి వేతనం రూ.8 వేలు) ఇస్తున్నారని, అప్పు చేసి ఇంత దూరం వస్తే ఇలా జరిగిందేంటని ఆందోళనకు గురయ్యారు. ఆదుకుని అన్నం పెట్టిన పాకిస్తానోళ్లు... ఇంటికి వెళ్లే పరిస్థితి లేకపోగా, వచ్చే వేతనం భోజనానికి కూడా సరిపోని పరిస్థితి. డ్రైవింగ్ లైసెన్సుకు కూడా అప్పు చేసి దాదాపు రూ.1లక్ష వరకు వెచ్చిస్తే తమ పరిస్థితి ఇలా అయిందని కంపెనీ వారితో గొడవ పడినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తిండికి డబ్బులు లేక ఒక్కో రోజు పస్తులు ఉండాల్సి వచ్చిందని, గొడవ పడినందుకు కంపెనీ వాళ్లు వేరే చోటికి పంపించారని తెలిపారు. అక్కడ తెలుగు రాష్ట్రాల వాళ్లున్నా పట్టించుకోలేదని, పాకిస్తాన్ దేశస్తులు కొందరు ఆశ్రయమిచ్చి అన్నం పెట్టి కొన్ని రోజుల పాటు ఆదుకున్నారని చెప్పారు. ఇలా కెన్యా, బంగ్లాదేశ్ వారు కూడా ఆదుకున్నారన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన చెలిమెల పవన్, నందిపేట్ మండలం నూత్పల్లి గ్రామానికి చెందిన మెరుగు శ్రీనివాస్ గౌడ్లు తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి డబ్బులు తెప్పించుకుని ఖతర్ నుంచి ఆగస్టు నెలలో స్వదేశానికి చేరుకున్నారు. మిగతా కరీంనగర్, జగిత్యాల్, కామారెడ్డి జిల్లాలకు చెందిన బాధితులు డబ్బులు లేక అక్కడే చిక్కుకుపోయారు. ప్రజాప్రతినిధులకు ట్వీట్ చేసినా స్పందించలేదు.. ఏజెంటు చేతిలో మోస పోయి ఖత్తార్‌లో అష్టకష్టాలు పడ్డ ఈ ఇద్దరు నిజామాబాద్ వాసులు రాష్ట్ర ప్రభుత్వ సాయం కోసం అక్కడి నుంచే ప్రయత్నాలు చేశారు. వచ్చే వేతనం తిండికి కూడా సరిపోవడం లేదని, తమను ఇండియాకు రప్పించి మోసం చేసిన ఏజెంటుపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులకు మెసేజ్ పెట్టినా ఫలితం లేకపోయిందన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించినా న్యాయం జరగలేదన్నారు. పరాయి దేశం పంపుతానని పరారయ్యాడు! –గల్ఫ్ ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుల వేడుకోలు డిచ్పల్లి: విదేశాలకు పంపిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.65వేలు, పాస్‌పోర్టు తీసుకొని పరారైన కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన గల్ఫ్ ఏజెంట్ నాడెం నర్సయ్యపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన బాధితులు పందెన శ్రీనివాస్, బాలయ్య, పందెన చిన్న గంగాధర్ శుక్రవారం ఎస్ఐ రాజశేఖర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితులు మాట్లాడుతూ గల్ఫ్ దేశం ఇరాక్‌కు పంపిస్తానని నమ్మబలికి ఒక్కొక్కరికి రూ.లక్షా 50వేలు ఖర్చు అవుతుందని అడ్వాన్సుగా రూ.65వేల చొప్పున తీసుకుని పరారయ్యాడన్నారు. నెల రోజులుగా వీసా వస్తుందని మాయ మాటలు చెబుతూ వచ్చాడని వాపోయారు. చివరకు గట్టిగా నిలదీసి తమ డబ్బులు, పాసుపోర్టు ఇవ్వాలని అడిగితే పరారయ్యాడని తెలిపారు. తామే కాకుండా ధర్పల్లి మండలానికి చెందిన మరికొందరిని కూడా మోసగించినట్లు తెలిపారు. సదరు ఏజెంట్‌పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఫిర్యాదు ప్రతులను చూపుతున్న బాధితులు కుటుంబాల పరిస్థితి తలచుకుంటే భయంగా ఉంది : బాధితులు చేసిన వ్యాపారాలు కలిసి రాకపోవడంతో వేరే మార్గం లేక ఖతర్ దేశానికి వెళ్లినం. దేశం వెళ్తే అయినా తమ కుటుంబాలు బాగుపడుతాయని బంగారాం, భూములు అమ్మేసి ఏ జెంటుకు కట్టినం. ఖతర్‌లో ఇచ్చే జీతం తినే తిండికి కూడా సరిపోలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో వేరే దేశస్తులు అన్నం పెట్టి ఆశ్రయమిచ్చిండ్రు. అప్పు చేసి ఇంటికి వచ్చినం. ఇప్పుడు కుటుంబాల పరిస్థితి చూస్తే భయం గా ఉంది. గల్ఫ్ ఏజెంటుపై చర్యలు తీసుకుని డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలి. -
బలోపేతంపై నజర్!
ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నా.. ఇంకా బీజేపీ క్షేత్రస్థాయి బలోపేతానికే ప్రాధాన్యత ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారితో సమావేశాలు నిర్వహించడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తోంది. కొత్త ఓటర్లైన యువతను ఆకట్టుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని, తద్వార అసెంబ్లీ ఎన్నికలతో పాటు, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీకి కలిసొస్తుందని భావిస్తోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నప్పటికీ.. భారతీయ జనతా పార్టీ మాత్రం ఇంకా సంస్థాగత నిర్మాణంపైనే దృష్టి సారిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి., ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసినప్పటికీ.. బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల ప్రకటన అటుంచితే, పార్టీ క్షేత్రస్థాయి బలోపేతానికే ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అధినాయకత్వం పార్టీ శ్రేణులను ఆదేశించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారితో సమావేశాలు నిర్వహించడం ద్వారా రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావిస్తోంది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల టికెట్లు ఆశిస్తున్న నేతలను ఆదేశించింది. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర నాయ కత్వం చేపట్టింది. హైదరాబాద్‌లోని శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్లో అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఉమ్మడి జిల్లా పరిధిలో తొమ్మిది నియోజకవర్గాల నుంచి ఎనిమిది మంది సభ్యులతో కూడిన కోర్ కమిటీ సమావేశమైంది. ఈసందర్భంగా ఆయా నియోజకవర్గాల బీజేపీ టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకు ప్రత్యేకంగా ఆదేశాలిచ్చింది. కేంద్ర ప్రభు త్వ నిధులతో అమలు చేసిన పలు పథకాలతో ఆ పార్టీకి పెద్దగా మైలేజీ రాలేదని భావిస్తున్న బీజేపీ ఇప్పుడు ఆ పథకాల లబ్ధిదారులను కలిసి వివరించే ప్రయత్నం చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఆయా పథకాల లబ్ధిదారులతో వీలైతే మం డల, నియోజకవర్గ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకం అమలు చేస్తే.. ఇదే తరహాలో కేంద్ర నిధులతో ఉజ్వల పథకం కూడా అమలైంది. నిజామాబాద్ జిల్లాలో సుమారు 11,300 మంది, కామారెడ్డి జిల్లాలో సుమారు 8000 మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఉపాధి హామీ లబ్ధిదారుల వంటి వారితో సమావేశాలు నిర్వహించ డం ద్వారా ఎన్నికల్లో ఓట్లు రాల్చుకోవచ్చనే ప్రయత్నం చేయాలని అభ్యర్థులను ఆదేశించింది. కానీ ఈ దిశగా సమావేశాలు నిర్వహించడానికి ఆ పార్టీ నేతలు మాత్రం మొగ్గు చూపడం లేదు. మిగితా పార్టీల అభ్యర్థుల్లాగే ర్యాలీల వంటి కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు. యువతపై గురి.. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారిపైనా బీజేపీ గురి పెట్టాలని భావిస్తోంది. 18 సం వత్సరాలు నిండిన వారు ఫారం–6 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ యువతను తమ పార్టీ వైపు తిప్పుకునే కార్యక్రమాలకు శ్రీకా రం చుట్టాలని నిర్ణయించింది. యువతను ఆకటు ్టకోవడం ద్వారా ఈ ఎన్నికలతో పాటు, రానున్న పార్లమెంట్ స్థానాలకు జరిగే ఎన్నికల్లో కూడా పార్టీకి కలిసొస్తుందని భావిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో సుమారు 1.10 లక్షల మంది, కామారెడ్డి జిల్లాలో సుమారు 39,000 మంది కొత్తగా ఓటరు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో యువ తే ఎక్కువగా ఉంది. గ్రామాల వారీగా యువతతో సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. మొత్తం మీద యువతను ఆకట్టుకోవడం కోసం కార్యక్రమాలు చేయాలని అభ్యర్థులను ఆదేశిం చారు. కానీ జిల్లా నాయకత్వం ఈ దిశగా కార్యచరణ చేయకపోవడం పట్ల రాష్ట్ర నాయకత్వం అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు, మూడు నియోజకవర్గాల్లో మినహా మిగితా చోట్ల కేవలం మొక్కుబడి కార్యక్రమాలకే పార్టీ నేతలు పరిమితయ్యా రు. తరచూ ప్రెస్మీట్లు మినహా పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలను చేపట్టిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తుంటే పార్టీ ఆదేశాలు ఏ మేరకు కార్యరూపం దాల్చుతుందనేది ప్రశ్నార్థకంగా తయారైందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
సభ గ్రాండ్ సక్సెస్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ముందస్తు ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలవారీగా బహిరంగసభల షెడ్యూల్‌ను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తొలిసభను బుధవా రం నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో సభ నిర్వహించారు. తొలి సభ కావడంతో మిగతా జిల్లాల్లో నిర్వహించే సభలకు ఊపునిచ్చే విధంగా ఆ పార్టీ నేతలు భారీ జనసమీకరణ చేపట్టారు. దీంతో సభాస్థలి పూర్తిగా నిండిపోయింది. సభకు తరలివచ్చిన వారితో భైపాస్రోడ్డు, ఆర్మూర్ రహదారి, నగరంలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. మైదానంలో స్థలం లేకపోవ డంతో వేలాది మంది రోడ్డుపైనే వేచి ఉన్నారు. అధినేత తొలి సభను విజయవంతం చేసేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వారం రోజులుగా ఏర్పాట్లు చేశారు. అనుకున్నదానికంటే ఎక్కువ సంఖ్యలో జనం రావడంతో నాయకుల్లో ఆనందం వ్యక్తమైంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభ విజయవంతం కావడం ఎన్నికల ప్రచారానికి మరింత ఊపునిచ్చిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సభ కోసం ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేపట్టారు. బస్సులు, డీసీఎంలు, ప్రైవేటు వాహనాల్లో ప్రజలను తరలించారు. నేల ఈనిందా అన్నట్లు సభకు జనం తరలివచ్చిందని, గతంలో ఎప్పుడు లేనివిధంగా జన ప్రభంజనం కనిపిస్తోందని కేసీఆర్ పేర్కొనడం గమనార్హం. ఉత్సాహాన్ని నింపిన అధినేత ప్రసంగం.. అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సుమారు 50 నిమిషాల పాటు సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ సుదీర్ఘ ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ప్రతిపక్ష పార్టీలపై వేసిన పంచ్ డైలాగ్‌లు ఉర్రూతలూగించాయి. కాంగ్రెస్ – టీడీపీల పొత్తుపై కేసీఆర్‌తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ నేపథ్యంలో సాగిన ప్రసంగాల మాదిరిగానే కథలతో వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. నిజామాబాద్ గులాబీ ఖిల్లా అని మరోమారు రుజువు చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ బహిరంగసభ విజయవంతం కావడం ఎన్నికల బరిలో నిలుస్తున్న ఆ పార్టీ అభ్యర్థులకు మరింత ఊపునిచ్చిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ పౌరుషానికి ప్రతీక ఇందూరు.. తెలంగాణ పౌరుషానికి నిజామాబాద్ జిల్లా ప్రతీక అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. భారీ ఎత్తున తరలివచ్చిన జనసమూహాన్ని ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగంలో కేసీఆర్ తనకు జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని ప్రకటించారు. రాష్ట్రంలోనే తొలిసారి నిజామాబాద్ జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగిరిందన్నారు. 2014 ఎన్నికల్లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, మేయర్, జెడ్పీ చైర్మన్‌ను గెలిపించుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరోమారు చాటారన్నారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లా ముందుందని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ ‘పునర్జీవనం’తో సస్యశ్యామలం జిల్లాలో ప్రతి ఎకరానికి సాగు నీరందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇది తన బాధ్యత అని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవన పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. జాకోరా వద్ద లిఫ్టులు ఏర్పాటు చేయాల్సి ఉందన్న కేసీఆర్.. మంజీర, పెద్దవాగు, గోదావరి నదుల్లోని ప్రతిబొట్టును సాగునీటి కోసం వినియోగించుకుంటామన్నారు. నిజాంసాగర్‌కు ఒక టీఎంసీ.. నిజాంసాగర్ ఆయకట్టును ఆదుకునేందుకు సింగూరు ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని నిజాంసాగర్‌కు విడుదల చేయాలని నిర్ణయించామని కేసీఆర్ ప్రకటించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా మంత్రి పోచారం పట్టుబట్టి టీఎంసీ నీటిని సాధించుకున్నారని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు పింఛన్లు.. గతంలో మోర్తాడ్‌లో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్నామని, రాష్ట్రంలోని బీడీ కార్మికుల్లో 39 శాతం జిల్లాలోనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే రూ. 10 కోట్ల బకాయిలను చెల్లించి ఎర్రజొన్న రైతులను ఆదుకున్నామన్నారు. మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. జిల్లాలో మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మరో రెండు నెలల్లో మిషన్ భగీరథ పనులు పూర్తవుతాయని, జిల్లాలో 1,690 గ్రామాలకు నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో బాన్సువాడ, బోధన్, నిజామాబాద్‌రూరల్ నియోజకవర్గాల్లో ఉన్న ఆంధ్రులు ఎప్పటి నుంచో ఇక్కడే నివాసం ఉంటున్నారన్న కేసీఆర్.. సెటిలర్లు అంతా తెలంగాణ బిడ్డలేనని పేర్కొన్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, హన్మంత్ సింధే, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, మహ్మద్ షకీల్, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్‌రావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, వైస్ చైర్మన్ గడ్డం సుమనారెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి తుల ఉమ, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారి, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్, మేయర్ ఆకుల సుజాత, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. -
మార్కులు తక్కువ వస్తాయేమోనన్న బెంగతో..
కామారెడ్డి కైం: చదువులో వెనుకబడి పోతున్నాననే ఆందోళన మార్కులు ఎక్కడ తక్కవగా వస్తాయేమోనని మనస్తాపం చెందిన ఓ పదో తరగతి విద్యార్థిని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం సాయంత్రం కామారెడ్డి సమీపంలోని పెద్ద చెరువులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కల్కీనగర్ కాలనీలో నివాసం ఉండే చందాపురం స్వామి లింగంపేటలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. స్వామి దంపతులకు సాత్విక (16), హర్షిణి, శివాణి అనే కుమార్తెలు ఉన్నారు. సాత్విక పట్టణంలోని అభ్యాస పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బుధవారం వేకువజామున 5 గంటల ప్రాంతంలో ట్యూషన్‌కని ఇంటి నుంచి బయల్దేరింది. ఇంటికి తిరిగి రాలేదు. 10 గంటల తర్వాత అనుమానం వచ్చి తల్లిదండ్రులు చాలాచోట్ల గాలించారు. కామారెడ్డి పెద్ద చెరువులో ఆమె శవమై తేలింది. కూతురు ఆత్మహత్యకు పాల్పడడంతో స్వామి దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. మార్కులు తక్కువగా వస్తున్నాయని ఎప్పుడు బాధపడుతుండేదని వారు తెలిపారు. సంఘటన స్థలాన్ని పట్టణ పోలీసులు సందర్శించి విచారణ జరిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ప్రేమజంటపై వధువు బంధువుల దాడి
నవీపేట: కులాంతర వివాహం చేసుకుని రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంటపై వధువు బంధువులు దాడి చేశారు. నవీ పేట పోలీస్ స్టేషన్లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ నవీపేట మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన బేస రాజు(ఎస్సీ), నందిపేట మండలంలోని బీసీ వర్గానికి చెందిన చిలుగూరు నిరీష రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. వివాహానికి నిరాకరించారు. దీంతో పెద్దలను ఎదిరించి, ఎమ్మార్పీఎస్ నాయకులు మానికొల్ల గంగాధర్, డల్ల సురేశ్‌ల సహకారంతో ఎడపల్లి మండలంలోని జాన్కంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం పెళ్లి చేసుకున్నారు. అనంతరం రక్షణ కల్పించాలంటూ నవీపేట పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. ఇరువురు మేజర్లే కావడంతో ఈ విషయమై ఇరువురి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఆవేశంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వధువు తల్లి నాగమణి, అన్న మారుతి, సాయి (వరుసకు అన్న)లు ప్రేమజంటపై దాడి చేశారు. కుర్చీతో కొట్టడంతో వరుడు రాజుకు గాయాలయ్యాయి. ఇద్దరిపైనా పిడి గుద్దులు గుప్పించారు. అడ్డుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్ బాబునాయక్‌పైనా దాడి చేశారు. అక్కడే ఉన్నఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి డల్ల సురేశ్‌తో పాటు మరో మహిళ యెలుమల గంగామణిని దుర్భాషలాడారు. రక్షణ కల్పిస్తాం.. ప్రేమ జంటతో పాటు కానిస్టేబుల్, మరో ఇద్దరిపై దాడి చేసిన వధువు తల్లి నాగమణి, అన్నయ్యలు మారుతి, సాయిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రేమ జంటకు రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. -
పింఛన్లు పెంచుతాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో దేశంలో ముందున్నామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. రూ. 40 వేల కోట్లతో 472 పథకాలు, కార్యక్రమాలను అమలు చేశామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం లబ్ధిదారులకు ఇచ్చే వివిధ రకాల పింఛను మొత్తాన్ని పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎంత మొత్తంలో పెంచాలనే దానిపై తమ పార్టీ మేనిఫెస్టో కమిటీ నిర్ణయిస్తుందని ప్రకటించారు. బుధవారం నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో కేసీఆర్ ప్రజలపై వరాలు జల్లు కురిపించారు. వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న పెద్దల దీవెనలు వృథా పోవన్నారు. పింఛన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అర్రాస్ (వేలం) పాట పాడినట్లు హామీలిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామన్న కేసీఆర్... భవిష్యత్తులో మరింత మంచి పెంపుదల ఉంటుందని ప్రకటించారు. చాలీచాలని వేతనాలతో జీవనం గడుపుతున్న అంగన్వాడీలు, ఆశవర్కర్లు, హోంగార్డులు, సెకండ్ ఏఎన్ఎంల వేతనాలను ఇప్పటికే పెంచామని, రానున్న రోజుల్లో మరింత పెంచే పని చేస్తామన్నారు. ప్రతి తాలూకా కేంద్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. తద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందన్నారు. రైతు సమన్వయ సమితి పాలక వర్గాలకు పారితోషికం అందిస్తామన్నారు. ప్రజలందరి హెల్త్ ఫ్రొఫైల్.. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని కేసీఆర్ వివరించారు. ఇదే తరహాలో రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికీ చెవి, ముక్కు, గొంతు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈఎన్టీ వైద్య బృందాలు గ్రామాల్లో పరీక్షలు నిర్వహిస్తాయన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ఫ్రొఫైళ్లను కంప్యూటరీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. మైనారిటీలు ఆశీర్వదించాలి... మైనారిటీల సంక్షేమం కోసం రూ. 2 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 204 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. మైనారిటీల ఆశీస్సులుంటే మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. భగవంతుడి కృప ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని కేసీఆర్ ఉర్దూలో కవిత్వాలు చెప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మిషన్ భగీరథ పరుగులు.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులను కేసీఆర్ వివరించారు. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని గతంలో ప్రకటించిన మేరకు రాష్ట్రంలో మిషన్ భగీరథ పనులు పరుగులు పెడుతున్నాయని కేసీఆర్ చెప్పారు. 1.50 లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని, 1,690 గ్రామాలకు ఇప్పటికే నీళ్లు చేరాయని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని, నిర్వీర్యమైన వ్యవసాయశాఖలో 2,630 మంది ఏఈఓ పోస్టులను భర్తీ చేశామన్నారు. నిజాం కాలం నాటి భూ రికార్డులను సరిచేసి రైతుల ఇళ్లకే పాసుపుస్తకాలు పంపామని గుర్తుచేశారు. కరువు కాటకాల నుంచి.. ఆర్థిక శక్తిగా ఎదిగాం.. తెలంగాణకు ముందు కరువు కటకాలు, కరెంట్ సంక్షోభాల నుంచి రాష్ట్రం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని కేసీఆర్ పేర్కొన్నారు. 19.19 శాతం వృద్ధి సాధించి అభివృద్ధిలో దేశంలోనే అగ్రభాగాన నిలిచామన్నారు. నిరుపేదలకు ఇచ్చే పింఛను విషయంలో కాంగ్రెస్ పార్టీ అర్రాస్ (వేలం) పాట పాడినట్లు మేం రూ. వెయ్యి ఇస్తామంటే వారు రూ. 2 వేలు ఇస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. పింఛను పెంచాలని కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కలిగినందుకు సంతోషిస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మి, విద్యార్థులకు సన్నబియ్యం, బీడీ కార్మికులకు పింఛను వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. సబ్సిడీపై ట్రాక్టర్లు, డ్రిప్, పాలీహౌస్, విత్తనాలు సరఫరా చేసి అన్నదాతలను ఆదుకుంటున్నామని చెప్పారు. వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లపై పన్నులు లేని రాష్ట్రం తెలంగాణనేనన్నారు. మార్కెట్ కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. గొల్లకుర్మలు, మత్స్యకారులు, గీత కార్మికులు, పాల ఉత్పత్తిదారులకు చేయూతనందించేందుకు వివిధ పథకాలను అమలు చేస్తున్నామని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో 5 వేల కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా మార్చామన్నారు. -
ఇందూరు గడ్డపై గర్జించిన గులాబీ బాస్
సాక్షి, నిజామాబాద్ : కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబు చేతిలో పెట్టడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆపధర్మ సీఎం, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ పోరాటయోధుల గుండెల్లో బులెట్లు దింపిన ద్రోహులు టీడీపీ, కాంగ్రెస్ నేతలని కేసీఆర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ రద్దు అనంతరం సెప్టెంబర్ 7న ప్రజా ఆశీర్వాద సభ ద్వారా కేసీఆర్ ఎన్నికల శంఖారావంను పూరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత 25 రోజులపాటు విరామం తీసుకున్న కేసీఆర్ బుధవారం నిజామాబాద్‌లోని గిరిరాజ్ కాలేజీలో రెండో విడుత ప్రచార సభను ప్రారంభించారు. గతకొంతకాలంగా ప్రతిపక్షాలపై మౌనంగా ఉన్న ఆయన ఇందూరు సభలో చెలరేగిపోయారు. ముఖ్యంగా చంద్రబాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలను టార్గెట్‌గా చేసుకుని..తన పదునైన మాటల తూటాలను సంధించారు. కొట్లాడి, అమరుల ప్రాణాలు అర్పించి సాధించుకున్న రాష్ట్రం అభివృద్ధి చెందకుండా టీడీపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలకు పాల్పడుతోందని.. ఆ పార్టీలను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘ప్రాజెక్టులు కట్టకుండా ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేస్తున్నాయి. తెలంగాణ రైతన్నలను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధం పథకం రెండో విడుత చెక్కులు పంపిణీ చేయకుండా అడ్డుకోవాలని కేసుల వేస్తున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా లేని పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. రైతుబంధు పథకం, పంటలకు 24గంటల ఉచిత కరెంట్, రైతులకు సబ్సిడీ రుణాలకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇలా దేశంలో నెంబర్ వన్‌గా నిలబెడుతుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి’ అని కేసీఆర్ మండిపడ్డారు. ‘‘2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తరువాత జరిగిన తొలిసారి ఎన్నికల్లోనే నిజామాబాద్ జిల్లా పరిషత్ గెలిచి చరిత్ర సృష్టించింది. గత ఎన్నికల్లో ఇదే ఇందూరు గడ్డ మొత్తం 9 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించి ప్రతిపక్షాలకు దిమ్మదిరిగే జవాబిచ్చింది. నిజామాబాద్ టీఆర్ఎస్ కంచుకోట. గత నాలుగేళ్లలో అనేక సక్షేమ పథకాలను అమలు చేశాం. ఇదే పాలన కొనసాగాలి అంటే గత ఫలితాలే మరళా పునరావృత్తం కావాలి. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కరెంటు లేదు, నీళ్లులేవు, ఉద్యోగాలు లేవు, రైతుల ఆత్మహత్యలు ఇవే తెలంగాణలో ఎక్కడ చూసిన కనిపించేవి. ఎన్నో సవాళ్లను స్వీకరించి దేశంలోనే నెంబర్‌వన్‌గా తెలంగాణను నిలిపాం. తెలంగాణకు అడ్డుపడ్డ వారే నేడు పొత్తులు పెట్టుకుంటున్నారు. నిజంగా కాంగ్రెస్ నేతలు సిగ్గు ఉంటే తెలంగాణ ద్రోహి అయన చంద్రబాబుతో పొత్తుపెట్టుకుంటారా.. చిల్లర రాజకీయాలకోసం దుర్మార్గుడైన ఆయనతో దోస్తీ కలుస్తారా. తెలంగాణ కార్మికులను గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబుది. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తికాకుండా, నీళ్లు రాకుండా కోర్టుల్లో కేసులు వేస్తున్నది చంద్రబాబు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్లీ అమరావతి, ఢిల్లీలో తాకట్టుపెట్టడానికి, ఢిల్లీలో గులాంగిరి చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీపై ఉంది’’ అని అన్నారు. కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణను 1956లో అన్యాయంగా ఆంధ్రాలో కలిపింది నెహ్రూ. నేడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. గతంలో వరంగల్ ఉప ఎన్నికల్లో జైపాల్ రెడ్డి ఇదే మాట అన్నారు. అప్పుడు సవాలు విసిరా..కేసీఆర్ ఉద్యమంలో లేకపోతే ఓటు కాంగ్రెస్‌కే వెయ్యండి అని. తెలంగాణ ఉద్యమాన్ని గమనించిన ప్రజలు 49000 మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్‌ను గెలిపించారు. ఇప్పుడు గులాంనబీ ఆజాద్ కూడా అదే అంటున్నాడు. ప్రతిపక్షాల సవాలు మేరకే ముందస్తు ఎన్నికలు పిలుపునిచ్చా. ప్రజల్లోకిపోలేక ప్రతిపక్షాలు గోడలుగీక్కుంటున్నాయి. ఎన్నికలను ఎదుర్కొనే దమ్ములేకనే కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ప్రతిపక్షాల అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టి ఇందూరు గడ్డపై మరోసారి గులాబీ జెండాను ఎగరేయ్యాలి’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
వ్యవసాయానికి కేరాఫ్ నిజామాబాద్!
సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిజామాబాద్ జిల్లా నుంచి పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు నిజామాబాద్‌లోని గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ సభలో మరికాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. గులాబీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతున్న ఈ సభ అప్డేట్స్ ఇవి.. ప్రసంగిస్తున్న కేసీఆర్.. తెలంగాణ అభివృద్దిన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వెస్తున్నారు. తెలంగాణకు కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టుపైనే 196 కేసులు వేశారు. ఆనాడు మహారాష్ట్రా గోదావరిపై అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే గుడ్లుఅప్పగించి చూసింది మీరు కాదా.. రైతు సమన్వయ కమిటీలకు వేతనం కూడా చెల్లిస్తాం. రాష్ట్రంలో అమలు అవుతున్న పెన్షన్లను కూడా పెంచుతున్నాం.. త్వరలోనే వెల్లడిస్తాం రైతుబంధు పథకం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని 1956లో తెలంగాణకు ఆంధ్రలో కలిపి అన్యాయం చేసింది కాంగ్రెస్ కాదా.. కార్మికులను గుర్రాలతో తొక్కించిన ఘనత తెలుగుదేశంది వ్యవసాయానికి కేరాఫ్ నిజామాబాద్! కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్‌లో టీఆర్ఎస్ నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో ఆమె ప్రసంగించారు. తెలంగాణలో వ్యవసాయానికి కేరాఫ్ అడ్రస్ నిజామాబాద్ జిల్లా అని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ కరెంటు కోతలు లేకుండా చేశారని, ఇంటింటికీ నల్లాల కోసం రూ. 4వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో లక్షా 5వేల కేసీఆర్ కిట్లు పంపిణీ చేశామని, 4లక్షల 72వేలమంది రైతులకు రైతుబంధు చెక్కులు పంపిణీ చేశామని చెప్పారు. టీఆర్ఎస్ హయాంలో నిజామాబాద్‌కు 292 పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. సభలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారుల ఆటపాటలతో ఉత్సాహం తెచ్చుకున్న ఆపద్దర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభావేదికపైకి ఎక్కి నృత్యం చేశారు. ఆయన నృత్యం గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. సభాప్రాంగణం చేరుకున్న ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్.. సభావేదిక మీద ఎమ్మెల్సీలు సుధాకర్ రెడ్డి, వీజీ గౌడ్, జడ్పి చైర్మన్లు డీ రాజు, తుల ఉమ, తాజా మాజీ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే ముందస్తుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరించనున్న కేసీఆర్ నాలుగేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలవాల్సిన ఆవశ్యకతను సీఎం కేసీఆర్ ఈ సభలో తెలపనున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ను ఆశీర్వదించాలని బహిరంగ సభ వేదికగా ప్రజలను కోరనున్నారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని పదేపదే అడ్డుకోవడం వల్లే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని ప్రజలకు వివరించనున్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పుతో టీఆర్ఎస్ను గెలిపిస్తే స్వాభిమానంతో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని, అన్ని రంగాల్లోనూ తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతుం దని హామీ ఇవ్వనున్నారు. మొత్తంగా టీఆర్ఎస్ బహిరంగ సభలతో ఎన్నికల్లో రాజకీయ వేడి మరింత రాజుకోనుంది. వరుసగా సభలు.. ఉమ్మడి జిల్లాలవారీగా సభలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. నిజామాబాద్ సభ అనంతరం ఈ నెల 4న నల్లగొండలో, 5న వనపర్తిలో, 7న వరంగల్, 8న ఖమ్మంలో ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలు నిర్వహించనుంది. బహిరంగ సభల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల మంత్రులు, పలువురు అభ్యర్థులతో ఇప్పటికే ఫోన్లలో మాట్లాడారు. బహిరంగ సభలకు జనం త్వరగా వచ్చేలా చూడాలని ఆదేశించారు. -
నేడు నిజామాబాద్‌కు కీసీఆర్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నేడు జిల్లాకు రానున్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి గులాబీ బాస్ జిల్లా నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఈ తొలి ప్రచార సభను ఆ పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నగరం లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో బహిరంగసభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ వేదికను నిర్మించారు. సభా స్థలాన్ని సర్వాం గ సుందరంగా తీర్చిదిద్దారు. మైదానాన్ని చదును చేసి బారికేడ్లను నిర్మించారు. టీఆర్ఎస్ జెండాలు, తోరణాలతో నగరమంతా గులాబీ మయంగా మారింది. అధినేత కేసీఆర్, ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలతో కూడి న భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. సీఎం బహిరంగ సభా నిర్వహణ బాధ్యతలను భూజానెత్తుకున్న ఎంపీ కవిత, పోచారం శ్రీనివాస్‌రెడ్డి వారం రోజులుగా జిల్లాలోనే ఉండి పర్యవేక్షించా రు. సభకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సభలో తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రాక.. కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుంటారు. హెలిక్యాప్టర్‌లో నేరుగా సభా స్థలానికి వస్తారు. ఇందుకోసం సభా స్థలం వద్ద హెలిప్యాడ్‌ను నిర్మించారు. వచ్చిన వెంటనే కొద్దిసేపు పార్టీ అభ్యర్థులతో సమీక్షిస్తారు. అనంతరం బహిరంగసభా వేదిక పైకి వచ్చి జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళతారు. భారీ జన సమీకరణ.. బహిరంగసభను టీఆర్ఎస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయవంతం చేసేందు కు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు తొలి ప్రచార సభ కావడంతో ఆ పార్టీ ఈ బహిరంగసభపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒక్కో నియోజకవర్గం నుంచి 25 వేల మంది చొప్పున జన సమీకరణ చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు తాజామాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ అభ్యర్థులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభకు భారీగా తరలిరావాలని గ్రామాలు, నగరంలోని వివిధ డివిజన్లలో ఇం టింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మైక్‌ల ద్వారా ప్రచారం చేశారు. నాలుగు జిల్లాల నుంచి వెయ్యి ఆర్టీసీ బస్సులు.. భారీ జన సమీకరణలో నిమగ్నమైన టీఆర్ఎస్ వర్గాలు ఆర్టీసీ బస్సులతో పాటు, ప్రైవే టు వాహనాలను వినియోగిస్తున్నారు. నిజామాబాద్‌తో పాటు, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఆర్టీసీ రీజియన్ల నుంచి సుమారు వెయ్యి బస్సులను బుక్‌చేశారు. అలాగే డీసీఎంలు, ఇతర ప్రైవేటు వాహనాలను గ్రామా ల్లో అందుబాటులో ఉంచి జన సమీకరణ చేపట్టారు. ప్రతి గ్రామానికి ఒకటీ రెండు వాహనాలను అందుబాటులో ఉంచారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. -
కేసీఆర్ సభకు వెళ్లొద్దని ప్రతిజ్ఞ
కమ్మర్పల్లి(బాల్కొండ): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం జరగ నున్న సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభకు వెళ్లవద్దని కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్ గ్రామస్తులు తీర్మానం చేశారు. మంగళవారం గ్రామ శివారులోని జగదాంబ క్షేత్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. తమ గ్రామానికి అధికారికంగా మంజూరైన చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం గేట్‌వాల్వ్ బిగించడంలో పాలకులు, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎత్తిపోతల పథకం ద్వారా నీరు విడుదల చేస్తున్నప్పటికీ, చౌట్పల్లి గ్రామంతో వివాదం కారణంగా తమ గ్రామ చెరువులోకి నీరు రావడం లేదని వాపోయారు. దీంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారికంగా మంజూరైన గేట్‌వాల్వ్‌ను ఏర్పాటు చేయకపోవడంతో రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులమంతా ఏకమై అధికార పార్టీకి మద్దతు ఇవ్వకూడదని, ప్రజాప్రతినిధులు గ్రామానికి వస్తే వారికి కూడా మద్దతుగా నిలవకూడదని నిర్ణయించుకున్నామన్నారు. బుధవారం జరిగే సీఎం సభకు గ్రామంలో ఎవరు కూడా వెళ్లకూడదని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నాటికి గేట్ వాల్వ్ బిగించకపోతే ఎన్నికలను సైతం బహిష్కరిస్తామని హెచ్చరించారు. రాస్తారోకో సందర్భంగా గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని తీర్మానించారు. అనంతరం గ్రామస్తులంతా అధికార పార్టీకి మద్దతు తెలపకూడదని, సీఎం సభకు వెళ్లకూడదని ప్రతిజ్ఞ చేశారు. -
అపోహలకు తావులేదు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రానున్న ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలు అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు పారదర్శకంగా పని చేస్తాయని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. ఈవీఎంల ప్రాథమిక పరిశీలన పూర్తయిన సందర్భంగా సోమవారం నగరం లోని వినాయక్‌నగర్‌లో గల ఈవీఎం గోదాములో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పించారు. భారత ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ ఈ ఈవీఎంలను కొత్తగా సిద్ధం చేసిందని, వీటిలో ఎటువంటి అనుమానాలకు, అపోహలకు తావు లేదన్నారు. వీటికి ఎటువంటి ఇంటర్నెట్ సౌకర్యం లేనందున, వేరే చోట నుంచి నడిపే అవకాశం లేదన్నారు. ఏ నంబరు ఈవీఎం ఎక్కడికి వెళ్తుందో, వాటి ర్యాండమైజేషన్ వరకు తెలియదని, ఏ అభ్యర్ధి పేరు ఏ క్రమ సంఖ్యలో వస్తుందో ముందస్తుగా అంచనా వేయలేమన్నారు. ట్యాంపరింగ్‌కు ఎట్టిపరిస్థితుల్లో అవకాశం లేదని వివరించారు. రాజకీయ పార్టీల ద్వారా ప్రజలకు వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈవీఎంలకు వీవీ ప్యాట్ల సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. దీనిలో ఏ అభ్యర్థికి, ఏ గుర్తుకు ఓటు వేశామో ఆ ఓటరుకు ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుందని చెప్పారు. ప్రతి బ్యాలెట్ యూనిట్లో 16 బటన్లు ఉంటాయని, ఒక బటన్ నోటా ఉంటుందన్నారు. పోటీలు ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకుంటే ఓటరు 16వ బటన్ నోటా నొక్కవచ్చన్నారు. 15 మందికంటే ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉంటే మరో బ్యాలెట్ యూనిట్ ఉపయోగిస్తారన్నారు. వీటి ప్రథమస్థాయి చెకింగ్‌లో సిబ్బంది, ఇంజనీర్లు, అధికారులు చాలా కష్టపడి కొద్ది రోజుల్లోనే పూర్తి చేసినందుకు కలెక్టర్ వారిని అభినందించారు. కార్యక్రమంలో డీఆర్ఓ అంజయ్య, రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
రేపే ప్రచార శంఖారావం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : శాసనసభ ముంద స్తు ఎన్నికల ప్రచార పర్వానికి టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్‌రావు ఇందూరు నుంచే శంఖారావం పూరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా ల వారీగా నిర్వహించతలపెట్టిన బహిరంగసభల షెడ్యుల్‌ను ఇప్పటికే ప్రకటించిన అధినేత, మిగిలిన సభలకు ఊపు తెచ్చే విధంగా నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆ పార్టీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా జన సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోనే తొలి సభ కావడంతో ఈ సభను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిర్వహణ, ఏర్పాట్ల బాధ్యతలను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలకు అప్పగించింది. వారం రోజులుగా జిల్లాలోనే ఉంటున్న ఇద్దరు నేతలు సభ నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ నిర్వహణ ఏర్పాట్లపై అధినేత కేసీఆర్ పలుమార్లు ఎంపీ కవిత, పోచారం శ్రీనివాస్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. నిర్వహణ ఏర్పాట్లపై ఆరా తీశారు. నియోజకవర్గం నుంచి .. ఒక్కో నియోజకవర్గం నుంచి 25 వేల మంది చొప్పున ఈ బహిరంగసభకు తరలించాలని పార్టీ నిర్ణయించింది. జిల్లా కేంద్రమైన నిజామాబాద్‌అర్బన్‌తో పాటు సమీపంలోని నిజామాబాద్ రూర ల్, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల నుంచి వీలై నంత ఎక్కువ మంది తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాల్కొండ, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జన సమీకరణకు ఏర్పాట్లు చేశా రు. ఆయా నియోజకవర్గాల నుంచి జనాలను తీసుకు వచ్చే బాధ్యతలను ఆ పార్టీ అభ్యర్థులకు అప్పగించారు. దీంతో తమ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో జనాలను తరలించేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సమాయత్తం చేసిన ఎంపీ.. వారం రోజులుగా జిల్లాలోనే ఉన్న ఎంపీ కవిత సభకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా అర్బన్ పరిధిలోని కార్పొరేటర్లు, నగర పార్టీ నాయకత్వంతో ఇటీవల ఓ ప్రైవేటు హోటర్‌లో సమావేశమైన ఎంపీ.. వారి పనితీరుపై క్షుణ్ణంగా సమీక్షించారు. సుమారు ఆరు గంటల పాటు అర్బన్‌పైనే ఫోకస్ చేశారు. ఆయా డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టాలని ఆదేశించారు. బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాల్లో కూడా ఆమె పాల్గొని పలు సూచనలు చేశారు. తాజాగా సోమవారం నగరంలోని ప్రధాన కుల సంఘాలతో సమావేశమయ్యారు. జిల్లాలో అత్యధిక సంఖ్య కలిగిన ఈ ప్రధాన నాలుగు కుల సంఘాల పెద్దలతో భేటీ అయ్యారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి జిల్లాలోని పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. సిద్ధమైన వేదిక, హెలీపాడ్ నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో సీఎం సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ విస్తీర్ణంలో సభా వేదిక సిద్ధమైంది. సభకు హాజరైన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మైదానాన్ని చదును చేశారు. బైపాస్‌రోడ్డుకు అవతల వైపు పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం కేసీఆర్ నేరుగా సభాస్థలానికి చేరుకునేలా అక్కడే హెలిప్యాడ్‌ను నిర్మించారు. నిర్వహణకు ప్రత్యేక కమిటీలు.. సభ నిర్వహణ ఏర్పాట్లను వివిధ కమిటీలకు అప్పగించారు. వేదిక నిర్మాణ కమిటీ, మైదానం సిద్ధం చేసేందుకు మరో కమిటీని నియమించారు. సభకు వచ్చే వారి సౌకర్యం కోసం తాగునీటి వసతి వంటి ఏర్పాట్లను చేపట్టారు. అలాగే ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు తరలివచ్చేలా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. ఇతర జిల్లాల వాహనాలు, బస్సులు.. సభకు జనాలను తరలించేందుకు సుమారు మూడు వందల బస్సులను వినియోగించే అవకాశాలున్నాయి. వీటితో పాటు, డీసీఎంలు, ఐచర్లలో జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నిర్మల్, జగిత్యాల, మెదక్, సిద్దిపేట్ డిపోల నుంచి కూడా ఆర్టీసీ బస్సులను తరలించనున్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. ఆర్మూర్, కామారెడ్డి, బాన్సువాడ, వర్ని, బోధన్ రూట్ల వైపు నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ వంటి అంశాలపై దృష్టి సారించింది. -
కాకతీయ కాలువలో మహిళ గల్లంతు
మోర్తాడ్ (నిజామాబాద్): భర్తతో గొడవ పడిన ఓ యువతి కాకతీయ కాలువలో దూకి గల్లంతైన ఘటన ఆదివారం ఏర్గట్ల పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాల్కొండకు చెందిన మారుతి, జగిత్యాల్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన రేణుకను వివాహం చేసుకున్నాడు. అయితే రెండు రోజుల కింద రేణుక తన తల్లిగారి ఇంటికి ఇబ్రహీంపట్నంకు వెళ్లింది. రేణుకను తమ ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన మారుతి బైకుపై తీసుకుని కాకతీయ కాలువ వెంబడి వస్తుండగా మార్గమధ్యంలో మూత్ర విసర్జన కోసం వాహనం ఆపాడు. అప్పుడు ఇరువురి మధ్య చిన్న వాదన జరిగింది. కాగా రేణుక అకస్మాత్తుగా కాలువలోకి దూకింది. కాలువ ప్రవాహం జోరుగా ఉండటంతో రేణుక కొట్టుకుపోయింది. దీంతో కంగారుపడిన ఆమె భర్త మారుతి ఏర్గట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా కాకతీయ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. భీమ్‌గల్ సీఐ సైదయ్య, ఏర్గట్ల ఎస్ఐ హరిప్రసాద్‌ల ఆధ్వర్యంలో రేణుక కోసం గాలిస్తున్నారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆ సన్నాసులు పోతే నష్టమేం లేదు: రేవంత్ రెడ్డి
సాక్షి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్ చెప్పారని.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు గాని, కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలొచ్చాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇంట్లో ఇద్దరు ముసలోళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ ఇస్తే.. కేసీఆర్ ఒక్కరికే ఇచ్చి ముసలోళ్లకు కయ్యం బెట్టిండని, అదే కేసీఆర్ ఇంట్ల ఐదుగురికి కలిపి నెలకు రూ. 30 లక్షల జీతాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ను సాగనంపాలని పిలుపునిచ్చారు. ఆదివారం కామా రెడ్డి జిల్లాలో రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. బస్వాపూర్, భిక్కనూరు, కామారెడ్డి పట్టణం లోని నిజాంసాగర్ చౌరస్తాలలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఎల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి దళితుల భూములు, మిషన్ కాకతీయ కమీషన్లు, ప్రాజెక్ట్ పనుల్లో, పైప్‌లైన్ కంపనీల్లో కమీషన్లు సరిపోతలేవన్నా రు. బాన్సువాడలో పోచారం కుమారులు ఇసుక కంకర పేరుతో దోచుకుంటున్నారని విమర్శించా రు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటే, గంప గోవర్ధన్ నియోజకవర్గాన్ని దోచుకున్నాడన్నారు. అడవి పందుల వలే ప్రజల సొమ్మును దోచు కున్న వీరిని ఓటు అనే కరెంట్ షాకుతో మట్టు పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటీవల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొందరికి టీఆర్ఎస్లోకి చేర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు సన్నాసులుపోతే కాంగ్రెస్‌కు నష్టం ఏమీ లేదన్నారు. ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు.. డబ్బా ఇండ్లు వద్దు.. డబుల్ బెడ్రూంలు ఇస్తా, దళితులకు మూడెరకాల భూమిస్తా, గిరిజనులకు, మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తా, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, ప్రతి మండలానికి 30 పడకల ఆసుపత్రి ఇస్తా అని ఎన్నోన్నో హమీలు ఇచ్చి గద్దెనెక్కిన కేసీఆర్.. ఏ ఒక్కటీ అమలు చేయలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణకు కొరివి ద య్యాలుగా కేసీఆర్ కుటుంబంలోని నలుగురు తయారయ్యారన్నారు. బోధన్ నిజాంషుగర్స్ తలుపులు తెరుచుకోక పోవడం కేసీఆర్ పుణ్యమే అన్నారు. వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఉద్యోగం ఊడాలన్నారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ బానిస సుమన్ అని, కాంగ్రెస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని, కార్యకర్తలే అతనికి బుద్ధి చెబుతారన్నారు. షబ్బీర్ అలీ గెలిస్తే.. షబ్బీర్ అలీని గెలిపిస్తే వచ్చే సర్కారులో ఒకటి రెండు స్థానాల్లో ఉంటారన్నారు. గతంలో కిరాయి ఇంట్లో ఉంటున్న అని గంప గోవర్ధన్ చెప్పాడని, ఇప్పుడు కామారెడ్డిలో రూ.3 కోట్లతో ఇల్లు ఎలా కట్టాడో ప్రజలు ఆలోచించాలన్నారు. కేసీఆర్ అక్రమాల గురించి ప్రజలకు వివరిస్తానని ఐటీ దాడులు చేయిస్తున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నా ఇంటి నుంచి ఐటీ అధికారులు తీసుకెళ్లిన సూటుకేసుల్లో కేసీఆర్ అక్రమాలు, అవినీతి గురించి సమాచార హక్కు చట్టం ద్వారా తాను సేకరించిన కాగితాలే ఉన్నాయన్నారు. తన జుట్టును కూడా సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్‌లు పీకలేరన్నారు. పీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్మోహన్రావు, పీసీసీ కార్యదర్శి ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హుందాన్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆరే మళ్లీ సీఎం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న కేసీఆర్‌నే మరోమారు ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఈటె ల రాజేందర్, ఎంపీ కల్వకుంట్ల కవిత, పలువురు ఎమ్మెల్సీలు, తాజామాజీ ఎమ్మెల్యేల బృందం అక్టోబర్ 3న గిరిరాజ్ కళాశాల మైదానంలో జరుగనున్న సీఎం బహిరంగ సభాస్థలాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రజాఆశీర్వాద సభను విజయవం తం చేసేందుకు భా రీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో స్పందన బాగుందని, ఉమ్మడి జిల్లా నుంచి కేసీఆర్ అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని అన్నారు. అనుకున్న దాని కంటే ఎక్కువ జనాలు స్వచ్ఛందంగా వస్తారని పేర్కొన్నారు. ప్రగతి నివేదన సభకు వచ్చినట్లుగానే ఈ ప్రజాఆశీర్వాద సభకు కూడా ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా రెండు లక్షల మంది సీఎం సభకు హాజరవుతారని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కమిటీల నియామకం చేపట్టామని తెలిపారు. సభాస్థల నిర్మాణం, అలంకరణ, బారికేడ్లు, ఇతర వసతులు అనుకున్న సమయానికి పూర్తవుతాయన్నా రు. నిబంధనల ప్రకారం ఆర్టీసీ బస్సులను జన సమీకరణకు వినియోగించుకుంటామని, జిల్లాలో ఉన్న ప్రైవేటు వాహనాలు, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వాహనాలను కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. మంత్రుల వెంట జెడ్పీ చైర్మన్ దఫెదార్ రాజు, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్‌రావు, ఫారూక్, తాజామాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, షకీల్ అమేర్, రెడ్కో రాష్ట్ర చైర్మన్ ఎస్ఏ అలీం తదితరులు ఉన్నారు. -
అర్బన్‌లో ఆరాటం.. టికెట్ కోసం పోటాపోటీ!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీకి పట్టున్న ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం టికెట్ కోసం ఆ పార్టీలో పోటాపోటీ ఉండగా, బాన్సువాడ, జుక్కల్ లాంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులను అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో కేడర్ కలిగిన అర్బన్‌లో బీజేపీ అభ్యర్థిత్వం లభిస్తే గెలుపు దిశగా అడుగులు వేయవచ్చని భావిస్తున్న నేతలు ఈ టికెట్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ స్థానంలో ముగ్గురు ముఖ్యనేతల పేర్లు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బస్వ లక్ష్మినర్సయ్య, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ ఎవరికి వారే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమకు టికెట్ ఇవ్వాలంటూ ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు తమకే టికెట్ ఖరారవుతుందని ముగ్గురు నేతలు పేర్కొంటున్నారు. సూర్యనారాయణగుప్త గత ఎ న్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎంఐఎం తర్వాత మూడో స్థానంలో నిలిచారు. సామాజిక సేవా కార్యక్రమాలను చేసిన ఆయన తిరిగి తనకే అభ్యర్థిత్వం దక్కుతుందని ఆశాభావంతో ఉన్నా రు. అలాగే ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బస్వ లక్ష్మినర్సయ్య కూడా ఇదే ధీమాను వ్యక్తం చేస్తు న్నారు. నియోజకవర్గంతోపాటు జిల్లాలో సామాజిక సమీకరణల దృష్ట్యా తనకు టికెట్ కేటాయిం చాలని ఆయన పార్టీ అధిష్టానికి విజ్ఞప్తి చేశారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన యెండల లక్ష్మినారాయణ కూడా టికెట్ రేసులో ఉన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తిరిగి పోటీ చేయాలని భావిస్తున్నారు. పలు చోట్ల భిన్నంగా పరిస్థితి.. అర్బన్‌లో టికెట్ కోసం అభ్యర్థులు పోటీపడుతుండగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆర్మూర్, బాల్కొండ, బోధన్, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థి కోసం పార్టీ అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులను ఢీకొన గల సత్తా కలిగిన నేతలు కనిపించడం లేదు. దీంతో అధి నాయకత్వం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ప్రధాన పార్టీల్లో టికెట్ ఆశించిన నేతలను కమలదళంలో చేర్చుకోవడం ద్వారా ఆయా ని యోజకవర్గాల్లో పట్టు సాధించవచ్చని భావిస్తోంది. రెండు పార్టీల్లో టికెట్ దక్కని నేతలతో బీజేపీ నాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఎంపికకు జాతీయ బృందం.. ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్య ర్థుల ఎంపిక ప్రక్రియను ఆ పార్టీ జాతీయ బృం దం చేపడుతుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బృందం త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుడుతుందని అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న నేతలెవరైనా పార్టీలో ఉంటే వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆయా నియోజకవర్గాలో సత్తా ఉన్న నేత లేనిపక్షంలో ఇతర పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడిన బలమైన నేతలకు కాషాయం కండువా కప్పి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. త్రిపురా వంటి రాష్ట్రాల్లోనే అధికారంలోకి వచ్చిన తమ పార్టీకి తెలంగాణలో పాగా వేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. -
ముంచెత్తనున్న మొక్కజొన్న
మార్కెట్ ధర కంటే సర్కారు కొనుగోలు చేస్తున్న కనీస మద్దతు ధర ఎక్కువగా ఉండటంతో రైతులు మక్కలను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ముందస్తుగా కోత కొచ్చే ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని అధికార యం త్రాంగం కొనుగోలు కేంద్రా లు ప్రారంభించింది. ఇప్పటి వరకు 8,686 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : సర్కారు కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్న ముంచెత్త నుంది. గత ఏడాది ఖరీఫ్ కొనుగోలు సీజను కంటే ఈ సారి సుమారు రెండింతలకు మించి కొనుగోళ్లు పెరిగే అవకాశాలున్నట్లు అధికార యం త్రాంగం భావిస్తోంది. మార్కెట్ ధర కంటే సర్కా రు కొనుగోలు చేస్తున్న కనీస మద్దతు ధర ఎక్కువగా ఉం డటంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కిక్కిరిసి పోతున్నాయి. ముందస్తుగా కోత కొచ్చే ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాలను దృష్టిలో ఉం చుకుని అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. క్వింటాలుకు రూ.300 ఎక్కువ ప్రభుత్వం మొక్కజొన్న కనీస మద్దతు ధర క్విం టాలుకు రూ.1,425 నుంచి రూ.1,700 పెంచింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో మాత్రం క్వింటాలుకు రూ.1,300 నుంచి రూ.1,400 మిం చి ధర పలకడం లేదు. ప్రైవేటు వ్యాపారులు ఇంతకు మించి ధర ఇచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. అలాగే ఫౌల్ట్రీ యజమానులు సైతం రూ.1,400 మించి కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు సర్కారు కేంద్రాలకే ఎక్కువగా మొక్కజొన్నను తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వరి తర్వాత మొక్కజొన్న పంటనే అధికం గా సాగు చేస్తారు. ముఖ్యంగా ఆర్మూర్, బాల్కొం డ, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బా న్సువాడ ప్రాంతాల్లో ఈ పంట అధికంగా సాగు చేస్తారు. ఈ ఖరీఫ్ సీజనులో సుమారు 1.17 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగైంది. సుమారు పది లక్షల క్వింటాళ్ల వరకు మొక్కజొన్న కేంద్రాలకు వస్తుందని అంచనా వేసిన అధికారులు ఈ మేరకు కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. మొత్తం 92 కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించిన అధికారులు, ఇప్పటికే నాలుగు కేంద్రాల్లో సేకరణ షురూ చేశారు. ఇప్పటి వరకు 8,686 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. గత ఏడాది కొనుగోళ్లు.. గత ఏడాది ఖరీఫ్ కొనుగోలు సీజనులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసి 3.59 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. నిజామాబాద్ జిల్లా పరిధిలో 1.75 లక్షల క్వింటా ళ్లు, కామారెడ్డి పరిధిలో 1.84 లక్షల క్వింటాళ్లు సేకరించారు. ఈసారి ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు పది లక్షల వరకు కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఈ కేంద్రాలను 92 వరకు పెంచాలని నిర్ణయించారు. ఈసారి కూడా కొనుగోళ్ల బాధ్యతలను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.. మొక్కజొన్న సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. రైతులకు ఇబ్బందులు రాకుండా పది లక్షల గన్నీబ్యాగులను అందుబాటులో ఉంచాము. కొనుగోలు చేసిన మొక్కజొన్నను నిల్వ చేసేందుకు 40 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను ఎంపిక చేశాము. ఈసారి ప్రైవేటు గోదాముల్లో కాకుండా, వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములనే వినియోగిస్తున్నాము. ఈ కేంద్రాల్లో మొక్కజొన్న విక్రయించిన రైతులకు వారం రోజుల్లో డబ్బులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము.– చంద్రశేఖర్‌గౌడ్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ -
‘కొడ్’ పాటించండి
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఎన్నికల నియ మావళికి సంబంధించి ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసినందున, అందుకనుగుణంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ప్రగతిభవన్‌లో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో సమీక్షి సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసన సభ రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ఎటువంటి ఒత్తిడిలకు లొంగకుండా ఖచ్చితత్వంతో, నిష్పాక్షికంగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల కాలం కాబట్టి ఎన్నికల పనులకు సంబంధించి అధికారులు ప్రతి విషయానికి వెంటనే స్పందించాలని, ప్రధాన కార్యస్థానాల్లోనే ఉండాలని, ఈ సమయం అత్యంత ముఖ్యమైనదన్నారు. అదే విధంగా ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు దరఖాస్తులు ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో తీసుకున్నవి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. చనిపోయిన వారు, పూర్తిగా అందుబాటులో లేని వారు, రెండు పేర్లున్న వారికి నోటీసులు జారీ చేసినందున ఈ నెల 30లోగా అనర్హులను జాబితా నుంచి తొలగించాలని సూచించారు. వయసు తప్పుగా నమోదైనవి ఉంటే సరి చేసి అర్హులను జాబితాలో ఉంచాలన్నారు. పేదలకు పంపిణీ చేసిన భూముల్లో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమస్యగా మారిన భూములకు సంబంధించి ఆరు శాఖల అధికారులు సంయుక్త సర్వే జరిపి నివేదికలు అందించాలని, అర్హులకు న్యాయం జరిగేలా, వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వర్తింపజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, గోపిరాం, శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ జాన్ శాంసన్, తహశీల్ధార్లు, రెవెన్యూ ,అటవీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ డెంగీ..
వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడకు చెందిన సురేశ్ (పేరు మార్చాము)కు ఇటీవల డెంగీ జ్వరం సోకింది. ప్లేట్లెట్స్ ఆరువేలకు పడిపోయి ప్రమాదకర స్థితికి చేరాడు. ఆర్మూర్‌లోని ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందగా కోలుకుంటున్నాడు. ఇలా జిల్లాలో డెంగీ జ్వర పీడితులు పెరుగుతున్నారు. జూన్, జూలైలో డెంగీ నామమాత్రంగా ఉండగా ప్రస్తుతం తీవ్రమవుతోంది. ఇదే నెలలో ఆస్పత్రుల్లో 24 కేసులు నమోదు కావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా డెంగీ ఉనికి వెలుగులోకి వస్తోంది. నిజామాబాద్‌అర్బన్ : జిల్లా వ్యాప్తంగా 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 59 డెంగీ కేసులు నమోదు అయ్యాయి. ఇదే నెలలో 24 కేసులు నమోదు కావడం దీని తీవ్రతను తెలియజేస్తోంది. డెంగీ జ్వరంతో ఆస్పత్రులకు వెళుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో 32 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 15 కేసుల వరకు బోధన్ ప్రాంతంలో ఉన్నాయి. మిగితా కేసులు ఆయా ప్రాంతాల్లో నమోదు అయ్యాయి. గురువారం నిజామాబాద్‌లోని పూలాంగ్ ప్రాంతానికి చెందిన 12 సంవత్సరాల బాలుడికి డెంగీ సోకడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలిం చారు. నవీపేట మండలం దర్యాపూర్ గ్రామానికి చెందిన రెండు సంవత్సరాల బాలిక డెంగీ సోకడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది. బోధన్ పట్టణానికి చెందిన ఒకరు డెంగీ బారినపడ్డాడు. వీరు చికిత్స పొందుతున్నారు. డెంగీ కేసుల నమోదుతో వైద్య ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. ఎక్కడైతే కేసు నమోదు అవుతుందో అక్కడ నివారణ చర్యలు చేపడుతున్నారు. చెడిపోయిన వస్తువులు, టైర్లు, కొబ్బరి చిప్పలు, ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండేచోట డెంగీ దోమ ఉత్పత్తి అవుతుంది. వాస్తవానికి జూన్‌లోనే ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామాల్లో మలేరియా శాఖ అవగాహన కల్పించి నీరు నిల్వ ఉండకుండా స్థానికులను అప్రమత్తం చేయాలి. దోమలు వృద్ధి కాకుండా నివారణ మందులు చల్లడం, ఫాగింగ్ చేయడం చేపట్టాలి. నివారణ చర్యలు చేపట్టక పోతే డెంగీ తీవ్రతకు కారణమవుతుందని అంటున్నారు. కంటి వెలుగు పథకంలో భాగంగా వైద్యసిబ్బంది శిబిరాలకు వెళ్లడంతో గ్రామాల్లో వ్యాధుల నియంత్రణ పడకేసింది. ప్రస్తుతం అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తే వ్యాధులను నియంత్రించవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందస్తు జాగ్రత్తలే మేలు.. డెంగీ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దోమలు పెరగకుండా, నీరు నిల్వ ఉండకుండా చూడాలి. డెంగీ బారిన పడితే ప్లేట్లేట్ సంఖ్య తగ్గిపోయి ప్రమాదం పొంచి ఉంటుంది. అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. డాక్టర్ తిరుపతిరావు, జనరల్ ఫిజీషియన్ నివారణ చర్యలు కొనసాగుతున్నాయి.. జిల్లాలో డెంగీ నివారణకు చర్యలు కొనసాగుతున్నాయి. అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైతే వ్యాధి వెలుగులోకి వస్తుందో అక్కడ ప్రత్యేకంగా దృష్టిసారించి సర్వే చేపడుతున్నాం. ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి డెంగీ మరణాలు సంభవించలేదు. జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి సుదర్శనం జనరల్ ఆస్పత్రిలో పెరిగిన ఓపీ నిజామాబాద్‌అర్బన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గురువారం అత్యధికంగా అవుట్ పేషెంట్లు నమోదు అయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓపీ పెరిగింది. 1491 మందికి ఆస్పత్రిలో అవుట్ పేషెంట్ సేవలు అందాయి. 158 మంది ఇన్పేషెంట్లుగా చేరారు. ఆస్పత్రిలో మొత్తం 500 పడకలు కాగా 608 పడకలతో ఇన్‌పేషెంట్ సేవలు అందుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున రోగులు రావడం మొదటిసారని ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రాములు తెలిపారు. -
పట్టాలు సరే భూములేవి!
నాగిరెడ్డిపేట(నిజామాబాద్): భూమిలేని నిరుపేదలకు ఒక్కో కుటుంబానికి మూడెకరాల భూమి ని అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న భూ పంపిణీ పథకం లక్ష్యం.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతోంది. లబ్ధిదారులకు మూడెకరాల చొ ప్పున భూమిని పంపిణీ చేయాల్సి ఉం డగా.. నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో మాత్రం పట్టాలు మాత్రమే ఇచ్చి భూముల విషయం మరిచారు. దీంతో లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. అసలేం జరిగింది... భూ పంపిణీ పథకం కింద మాల్తుమ్మెద గ్రామంలో మొదటి విడతలో షెడ్యూల్కులాలకు చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేశారు. రెండోవిడతలో మరో ఎనిమిది మందిని ఎంపికచేసిన అధికారులు.. వారికి భూమిని పంపిణీ చేయడానికి అవసరమైన భూమిని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ఇదే గ్రామానికి చెందిన 16 మంది రైతులను సంప్రదించారు. గ్రామస్తుల సమక్షంలో పలుమార్లు వారితో చర్చలు జరిపిన అనంతరం వారి భూములను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. సుమారు 23 ఎకరాల 35 గుంటల భూమిని కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తుల సమక్షంలో అప్పటి జాయింట్ కలెక్టర్ సత్తయ్య సమావేశాలు నిర్వహించారు. ఎకరాకు రూ. 4.80 లక్షల చొప్పున చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. 16 మంది పట్టాదారులలో ఇద్దరికి సంబంధించిన భూమి సాగుకు అనుకూలంగా ఉండడంతో వారికి మాత్రం ఎకరాకు రూ. 5లక్షల చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. అయితే బడ్జెట్ లేకపోవడంతో పట్టాదారులకు డబ్బుల చెల్లింపులో జాప్యం జరిగింది. మరోవైపు పట్టాదారులకు డబ్బులు చెల్లించకుండానే భూ పంపిణీ పథకానికి ఎంపికచేసిన ఎనిమిది మంది పేరిట అంబేద్కర్ జయంతి రోజున జిల్లాకేంద్రంలో కలెక్టర్ చేతులమీదుగా పట్టాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులలో ఎవరెవరికి ఏ ఏ సర్వేనంబర్లలో ఎంతెంత భూమి ఉందో పట్టా సర్టిఫికెట్లలో వివరంగా పేర్కొన్నారు. లబ్ధిదారులకు పట్టాలను మాత్రమే పంపిణీ చేసిన అధికారులు వారికి భూములను మాత్రం చూపలేదు. తమకు డబ్బులు చెల్లించేవరకు తమ భూముల్లోకి లబ్ధిదారులను రానిచ్చేదిలేదని పట్టాదారులు స్పష్టం చేశారు. భూమి కోసం లబ్ధిదారులు తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సాగుకు నోచుకోక బీళ్లుగా... లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఎంపికచేసిన మాల్తుమ్మెద గ్రామశివారులోని వ్యవసాయ భూముల్లో ఎలాంటి పంటలూ సాగు చేయడం లేదు. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉందన్న కారణంతో ఆ భూముల్లో ఎలాంటి పంటలు వేయవద్దని భూములను విక్రయించాడని ముందుకు వచ్చిన రైతులకు అధికారులు సూచించారు. దీంతో వారు పంటలు వేయడం లేదు. మరోవైపు తమకు డబ్బులు ఇచ్చేంతవరకు భూములపై హక్కు వదులుకునేది లేదని పట్టాదారులు పేర్కొంటున్నారు. దీంతో భూములు బీళ్లుగానే ఉంటున్నాయి. భూములను విక్రయించేందుకు విముఖత గతంలో తమ భూములను విక్రయించేందుకు ముందుకు వచ్చిన రైతుల్లో ఐదుగురు ప్రస్తుతం భూమిని ఇచ్చేందుకు విముఖత చూపుతున్నారు. వీరికి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. తీర్మానం చేసిన సమయంలో నిర్ణయించిన ధరకంటే ప్రస్తు తం తమ భూముల ధరలు పెరిగాయంటున్నారు. మరోవైపు మాల్తుమ్మెద గ్రామంలో భూ పంపిణీకి ఎంపికైన లబ్ధిదారులు కటిక పేదరికంలో మగ్గుతున్నారు. ఈ క్రమంలో అధికారులు మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేస్తామని చెప్పడంతో వారిలో ఆశలు రెకెత్తాయి. కానీ పట్టాలు ఇచ్చి ఐదు నెలలు గడుస్తున్నా భూములు చూపకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఊళ్లో పనిదొరక్క వలస వెళ్తున్నారు. ఐదుగురు లబ్ధిదారులు హైదరాబాద్, ఆర్మూర్ ప్రాంతానికి వలస వెళ్లారు. పట్టాలు ఇచ్చి భూములను మరిసిండ్రు మూడు ఎకరాల భూమి ఇస్తామం టే మాకు ధైర్యం వచ్చింది. బతుకు మీద భరోసా కలిగింది. కానీ ఇప్పుడు ఊట్టి కాగితాలే ఉన్నయి. మాకు ఇంకా భూములు సూపట్టలేదు. మాకు భూములను పంచుతామని చెప్పిన అధికారులు పట్టాలను ఇచ్చి భూములను మరిసినట్టుండ్రు. – నీరుడి రణీల, లబ్ధిదారు, మాల్తుమ్మెద ఊట్టి కాగితాలే ఇచ్చిండ్రు మూడెకరాల భూమి ఇస్తమని చెప్పిన సార్లు ఊట్టి కాగితాలే చేతిల పెట్టిండ్రు. మాకు ఇచ్చిన భూమి యాడున్నదో తెలుస్తలేదు. భూముల పైసలు ఇయ్యలేదని వాటి పట్టాదార్లు మమల్ని ఆ భూములళ్లకు రానిస్తలేరు. పెద్దసార్లు దయసూపి మాకు భూములు సూపెట్టాలే. – రాజిపేట లక్ష్మి, లబ్ధిదారు, మాల్తుమ్మెద కలెక్టర్‌కు నివేదిక అందించాం మాల్తుమ్మెదలో భూ పంపిణీ పథకానికి రెం డోవిడతగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు సం బంధించి ఇటీవలే కలెక్టర్‌కు నివేదికను పంపా ను. భూమిని కొనుగోలు చేయకుండా లబ్ధిదారులకు పట్టాలెలా ఇచ్చారో నాకు కూడా అర్థం కావడంలేదు. భూమిని విక్రయించేందుకు ముందుకు వచ్చిన పట్టాదారుల్లో కొంతమంది రైతులు అప్పుడు నిర్ణయించిన ధరలకు వారి భూములను అమ్మదానికి ప్రస్తుతం ముందుకు రావడంలేదు. దీంతో ముందుగా ఎంపికచేసిన లబ్ధిదారులకు భూ పంపిణీ సమస్యగా మారింది. కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. – సయ్యద్ అహ్మద్ మస్రూ, తహసీల్దార్, నాగిరెడ్డిపేట -
ప్రతిష్టాత్మకంగా ప్రజా ఆశీర్వాదం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ప్రజా ఆశీర్వాద సభను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముందస్తు ఎన్నికల ప్రచారం లో భాగంగా అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన బహిరంగసభల్లో తొలి సభ కావడంతో జనసమీకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందరి దృష్టిని ఆకర్శించే ఈ సభ ను విజయవంతం చేసేందుకు జిల్లాలోని ఆ పార్టీ ముఖ్య నాయకత్వం ఏర్పాట్లలో నిమగ్నమైంది. అక్టోబర్ 3న నిజామాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ఈ బహిరంగ సభకు కేవలం వారం రోజులే గడువుండటంతో ఆ పార్టీ నాయకులు ఇప్పటికే రం గంలోకి దిగారు. బహిరంగసభ నిర్వహణకు సమన్వయ బాధ్యతలను సీఎం కేసీఆర్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పో చారం శ్రీనివాస్‌రెడ్డిలకు అప్పగించారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతరు ముఖ్యనేతలతో కవిత, పోచారం బుధవారం నిజామాబాద్‌లోని ఎంపీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. గిరిరాజ్ కాలేజ్.. బహిరంగసభ తేదీ ఖరారైనప్పటికీ సభను ఎక్కడ నిర్వహించాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. నగరంలోని గిరిరాజ్ కాలేజ్ సమీపంలో ఉన్న మైదానంలో సభను నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జిల్లా నేతలతో కలిసి ఈ మైదానాన్ని పరిశీలించారు. వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలి.. హెలిప్యాడ్, పార్కింగ్ స్థలం వంటి వాటి విషయమై మైదానం వద్ద చర్చించారు. సభకు వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డుకు అవతలి వైపు పార్కింగ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించారు. జన సమీకరణపై దృష్టి జిల్లాల్లో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభకు భారీగా జన సమీకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి సభకు జనాలను తరలించనున్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్లతోపాటు, సమీపంలో ఉన్న ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల నుంచి వీలైనంత ఎక్కువ మందిని ఈ సభకు తరలించే యోచనలో ఉన్నారు. బాల్కొండ, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల నుంచి కూడా సభకు జనసమీకరణ చేస్తున్నారు. జిల్లాలోనే ఎంపీ కవిత.. బహిరంగసభ నిర్వహణకు సమన్వయ బాధ్యతలపై దృష్టి సారించిన ఎంపీ కవిత మూడు, నాలుగు రోజులు జిల్లాలోనే ఉండనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో తిరిగి సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని భావిస్తున్నారు. ఐదు వందల బస్సులివ్వండి : ఆర్టీసీకి ఆదేశాలు.. సభకు జనాలను తరలించేందుకు అవసరమైన వాహనాలను సమకూర్చుకునే పనిలో పడ్డారు. ఈ సభకు సుమారు ఐదు వందల బస్సులు కేటాయించాలని టీఆర్ఎస్ నాయకులు కోరినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (రీజియన్)లోని ఆరు డిపోల పరిధిలోని మొత్తం 670 బస్సులున్నాయి. ఇందులో 190 అద్దె బస్సులున్నాయి. మరోవైపు ప్రైవేటు బస్సులు, ఐచర్లు, మ్యాక్సీక్యాబ్ వాహనాలను సమీకరిస్తున్నారు. ఆర్టీసీ డీవీఎం అనిల్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వర్‌రెడ్డితో వాహనాల విషయమై మంత్రి పోచారం చర్చించారు. విజయవంతం చేయండి : మంత్రి పోచారం ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎంపీ కార్యాలయంలో కవితతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు నివ్వెరపోయే విధంగా నిజామాబాద్ బహిరంగసభను విజయవంతం చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సభకు జనసమీకరణ చేపడతామని పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రభంజనానికి మించి ఇప్పుడు తమ పార్టీ అధినేత కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఊళ్లకు ఊళ్లు టీఆర్ఎస్కు ఓటేస్తామని తీర్మానాలు చేస్తున్నాయని, ఇప్పటికే ఒక్కో నియోజకవర్గంలో 30, 40 గ్రామాలు తమ పార్టీకి అనుకూలంగా తీర్మానాలు చేశాయని వివరించారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాత, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, రెడ్ కో చైర్మన్ ఎస్ఏ అలీం, తాజా మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌షిండే, గణేశ్ గుప్తా, షకీల్ ఆమేర్, తదితరులు పాల్గొన్నారు. -
‘అ’సమ్మతి
ప్రధాన పార్టీల్లో అసమ్మతి సెగలు క్రమంగా చల్లారుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన సమయంలో భగ్గుమ న్న అసమ్మతి నేతలు.. రోజులు గడుస్తున్న కొద్దీ మెత్తబడుతున్నారు. ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి బుజ్జగించడంతో పునరాలోచనలో పడుతున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ముందస్తు ఎన్నికల నిర్వహణకు ముందుకు వచ్చి అసెంబ్లీని రద్దు చేసిన టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ని తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. అధినేత కేసీఆర్ టికెట్ ఖరారు చేసిన వెంటనే ఎల్లారెడ్డి, బాల్కొండ నియోజకవర్గాల్లో అసమ్మతి తెరపైకి వచ్చింది. మిగిలిన చోట్ల మాత్రం అంతర్గతంగా రగులుకుంటోంది. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని తిరిగి అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ అసమ్మతిరాగం ఆలపించారు. అప్రమత్తమైన రవీందర్‌రెడ్డి జనార్దన్‌గౌడ్‌ను కలిసి ఎన్నికల్లో సహకరించాలని కోరగా.. ఆశించిన స్పందన కరువైంది. దీంతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ పిలిపించుకుని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రవీందర్‌రెడ్డి గెలుపునకు పూర్తి సహకారం అందించాలని మంత్రి కేటీఆర్ చెప్పడంతో జనార్దన్‌గౌడ్ అంగీకరించినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాల్కొండలో.. బాల్కొండ నియోజకవర్గంలో తెరపైకి వచ్చిన అసమ్మతి సెగలు మాత్రం ఇంకా చల్లారలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని టీఆర్ఎస్ ఖరారు చేయడంతో ఆ నియోజకవర్గంలోని ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునిల్‌రెడ్డి అసమ్మతి గళం వినిపించారు. తన అనుచరులతో వేల్పూర్ మండలంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అనుచరుడైన సునిల్‌రెడ్డి ఈసారి బీఎస్పీ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఈ అసమ్మతి నేత బరిలో ఉంటే పరోక్షంగా ప్రశాంత్‌రెడ్డికి ప్రయోజనం చేకూరే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉండే కాస్త వ్యతిరేక ఓట్లు చీలిపోయి, పరోక్షంగా టీఆర్ఎస్కు మేలు జరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌లోనూ.. కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా అభ్యర్థిత్వాలను ఖరారు చేయలేదు. కానీ బోధన్, కామారెడ్డి నియోజకవర్గాల అభ్యర్థులుగా మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ దాదాపు ఖరారైనట్లే. ఆర్మూర్‌లో ప్రచారం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఆకుల లలితకు అధినాయకత్వం దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖరారైన ఈ మూడు స్థానాల్లో రెండుచోట్ల అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. కామారెడ్డిలో ఆ పార్టీ పీసీసీ కార్యదర్శి నల్లవెల్లి అశోక్ అసమ్మతి రాగం వినిపించారు. తన పేరును కూడా పరిశీలించాలని పీసీసీ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అసమ్మతి నేతను బుజ్జగించేందుకు షబ్బీర్‌అలీ అశోక్‌తో మాట్లాడారు. విభేదాలను పక్కన బెట్టి ఎన్నికల్లో సహకరించాలని కోరారు. ఆర్మూర్ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి బరిలో నిలుస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి కారెక్కడంతో ఇక్కడ ఎమ్మెల్సీ ఆకుల లలితకు అవకాశం కలిసొచ్చింది. టీపీసీసీ అధినాయకత్వం కూడా ఆకుల లలితకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఆకుల లలిత అభ్యర్థిత్వాన్ని ప్రకటించే అవకాశాలుండడంతో ఇక్కడ అసమ్మతి సెగలు రాజుకున్నాయి. సురేశ్‌రెడ్డి అనుచరుడిగా పనిచేసిన మార చంద్రమోహన్ అసమ్మతి రాగం అందుకున్నారు. అలాగే కాంగ్రెస్‌లో చేరిన రాజారాం యాదవ్ సైతం అసమ్మతిని తెలియజేశారు. ఆర్మూర్‌లో ఈ నాయకుల మధ్య సమన్వయం కుదిర్చే అంశంపై కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టి సారించింది. ఈ బాధ్యతలను మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డికి అప్పగించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మొత్తం మీద టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసమ్మతి నేతలను బుజ్జగించడం ఇప్పటికే ఓ కొలిక్కి వస్తుండగా, ఎన్నికల సమయం నాటికి అసమ్మతి సెగలు పూర్తిగా చల్లారుతాయని ఆయా పార్టీల వర్గాలు భావిస్తున్నాయి. -
‘పది వేలు ఇస్తేనే సంతకం పెడతా’
బిచ్కుంద(జుక్కల్): ప్రజాసేవకు నిలయమైన ఓ ప్రభుత్వ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం జరిగింది. మండల కేంద్రంలోని తహసీల్‌లో మంగళవారం ఓ కాంట్రాక్టర్ బ్లేడ్‌తో చేతులు, మెడ కోసికుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. డీటీ ప్రవీణ్ కుమార్ హజ్గుల్ జీపీ ప్రత్యేకాధికారిగా ఉన్నారు. గ్రామంలో విష్ణు మానిక్ నాయక్ సీసీ రోడ్డు పనులు చేశారు. రూ.45 వేలు బిల్లు వచ్చింది. చెక్కుపై సంతకం కోసం ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ రూ.10 వేలు లంచం ఇవ్వాలని వారం రోజుల నుంచి వేధింస్తున్నాడు. దీంతో కాంట్రాక్టర్ విష్ణు మనస్తాపం చెంది మంగళవారం తహసీల్ కార్యాలయంలో బ్లేడ్‌తో చేతులు, మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎంబీ రికార్డులో వందశాతం పనులు హజ్గుల్‌లో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రూ.2 లక్షల 40 వేలు సీసీ రోడ్డు వేశారు. వంద శాతం పనులు పూర్తయ్యాయి. పంచాయతి రాజ్ శాఖ అధికారులు ఎంబీ రికార్డు చేసి రూ. 45 వేలను పీఆర్ శాఖ జీపీ ఖాతాలో డబ్బులు జమ చేశారు. ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్(ఎఫ్‌టీవో)ను జీపీ కార్యదర్శి చూసుకొని అన్ని సక్రమంగా ఉన్నాయని క్యాష్ బుక్‌లో ఎంట్రీ చేసి రూ.45 వేల చెక్కును కాంట్రాక్టర్ విష్ణుకు రాసి ఇచ్చారు. చెక్కుపై ప్రత్యేకాధికారి, డీటీ ప్రవీణ్ కుమార్ సంతకం ఉండాలి. వారం నుంచి సంతకం కోసం తహసీల్ చుట్టూ విష్ణు తిరుగుతున్నాడు. రూ.10 వేలు లంచం ఇస్తేనే సంతకం పెడతానని డీటీ వేధిస్తున్నాడని బాధితుడు తెలిపాడు. లంచం ఇవ్వలేను. ఇది చివరి బిల్లు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నా భార్య బంగారు పుస్తే, నగలు అమ్ముకొని సీసీ వేశానని మొరపెట్టుకొని రెండు కాళ్లు పట్టుకున్నా వినడం లేదన్నాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఘటనతో తహసీల్దార్, ఎంపీడీవో డీటీపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే బాధితుడి చెక్కుపై సంతకం చేశారు. కార్యాలయం ఎదుట గిజనుల ఆందోళన బిచ్కుందకు చెందిన కాంట్రాక్టర్ విష్ణు మానిక్ నాయక్‌ను లంచం ఇవ్వాలని డీటీ వేధించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులకు తెలియడంతో భద్రాల్ తండా గిరిజనులు తహసీల్ కార్యాలయానికి చేరుకున్నారు. రక్తం కారుతున్న విష్ణును ఆస్పత్రికి తరలించారు. కార్యాలయం ఎదుట ధర్నా చేసి డీటీని నిలదీశారు. వెంటనే సస్పెండ్ చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. గాంధారిలో కూడా అక్రమాలకు పాల్పడి బదిలీపై బిచ్కుంద వచ్చి అవినీతికి పాల్పడుతున్నారని డీటీపై కలెక్టర్ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరారు. ఈ ఘటనపై తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ గోవర్ధన్, ఎంపీడీవో సాయిబాబా అన్నారు. -
‘తెలంగాణ అభివృద్ధికి అంబాసిడర్‌గా పనిచేస్తా’
సాక్షి, నిజామాబాద్ : కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షమం చూసి దశాబ్దాల బంధం ఉన్న కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేనినట్లు మాజీ స్వీకర్ సురేష్ రెడ్డి తెలిపారు. వేగంగా జరిగిన అభివృద్ధి ప్రస్తుతం జంక్షలో ఉందని, రానున్న రోజుల్లో అభివృద్ధి రథం డ్రైవర్‌ను మార్బే అవసరం ఉందా లేదా అనేది ప్రజలే నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న మొన్నటి వరకూ విభేదించిన పార్టీలు సిద్దాంతాలు పక్కన పెట్టింది అభివృద్ధిని అడ్డుకోవడానికే అని విమర్శించారు. మహా కూటమి అనేది మహాకుట్ర అని ప్రజలు గమనిస్తారని అన్నారు. తెలంగాణ అభివృద్దికి తాను అంబాసిడర్‌గా పని చేస్తానని పేర్కొన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పూర్వ వైభవం కోసం.. కేసీఆర్ చేపట్టిన పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో అందరి గెలుపుకు కోసం తాను కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. కాగా కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా వ్యవహరించిన సురేష్ రెడ్డి.. ఇటీవల అనూహ్యంగా గులాబీ గూటికి చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. -
ప్యాడీ క్లీనర్లు లేనట్లే!
‘‘కడ్తా పేరుతో తూకంలో కోతకు అడ్డుకట్ట వేసేందుకు ఖరీఫ్ కొనుగోలు సీజను నాటికి జిల్లాలో 90 అధునాతన ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేస్తాం.. సహకార సంఘా ల ద్వారా 50, మార్కెటింగ్ శాఖ ద్వారా 40 ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేస్తాం.. ముందుగా ధాన్యం వచ్చే కొనుగోలు కేంద్రాల్లో వీటిని అందుబాటులో ఉంచుతాం ’’ ఇదీ గత రబీ కొనుగోలు సీజనులో రైస్‌మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అడ్డగోలు దోపిడీని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు గత మే నెలలో తీసుకున్న నిర్ణయం. కానీ ఈ నిర్ణయం కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ ఖరీఫ్ కొనుగోలు సీజనులో కూడా మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడే పరిస్థితి కనిపించడం లేదు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: గత సీజనులో రైస్‌మి ల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ‘కోత’ పేరిట భారీగా దండుకుంటున్నారు. తాలు పేరుతో క్వింటాలుకు రెండు నుంచి ఐదు కిలోల వరకు తూకంలో కోత విధించారు. జిల్లా ఉన్నతాధికారులు మిల్లర్లకు వత్తాసు పలకడంతో కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు యథేచ్చగా కొనసాగాయి. ఈ ఖరీఫ్ సీజన్లో కూలీలు అవసరం లేని అధునాతన ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేసి ఇలాంటి అక్రమాలకు చెక్ పెడతామని అధికారులు ప్రకటించారు. కానీ వీటిని తెప్పించడంలో విఫలమయ్యారు. కొనుగోళ్లకు ఏర్పాట్లు.. అక్టోబర్ మొదటి వారం నుంచి జిల్లాలో ధాన్యం రాక ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధికారులు కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నా రు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఈసారి మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందుగా వరి కోతలు జరిగే కో టగిరి, వర్ని, బాన్సువాడ, బోధన్ తదితర ప్రాం తాల్లో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కేంద్రాలను ప్రారంభించి, కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు గన్నీ బ్యాగులు, ధాన్యం రవాణా ఏర్పాట్లను వెంట వెంటనే పూర్తి చేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. తేమ పేరుతో.. ఈసారి మాయిశ్చర్ (తేమ) పేరుతో రైతులను నిండా ముంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎఫ్ఏక్యూ (ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ) నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ 17 శాతం వరకు అనుమతి ఉంటుంది. అయితే, గత ఏడాది ఖరీఫ్ కొనుగోలు సీజనులో ఈ తేమ శాతాన్ని సాకుగా చూపి పెద్ద ఎత్తున దోపిడీకి తెర లేపారు. తూకం లో క్వింటాలుకు రెండు నుంచి ఐదు కిలోల వరకు కోత విధించి రైతులను నిండా ముంచారు. పీఏసీ ఎస్ చైర్మన్ల కనుసన్నల్లోనే ఈ కొనుగోలు కేంద్రా లు నడిచాయి. రైస్ మిల్లర్లతో కుమ్మక్కైన ఈ కేం ద్రాల నిర్వాహకులు కడ్తా పేరుతో దోపిడీకి తెర లేపారు. సీజను మొత్తానికి రూ.కోట్లలో రైతులు నష్టపోయారు. ఈసారి తేమ పేరుతో దోపిడీ జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం కట్టడి చే యాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతుల ప్రయోజనాలను గాలికొదిలేసి గత సీజన్ల మాదిరి గానే రైస్‌మిల్లర్లకు వత్తాసు పలికితే ఈసారి కూడా ధాన్యం రైతులు నిండా మునగడం ఖాయం. రబీ సీజన్ నాటికి అందుబాటులోకి తెస్తాం ఈ సీజను నాటికే ప్యాడీ క్లీనర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించినప్పటికీ.. వీటి అవసరం ఇప్పుడు అంతగా ఉండదు. వచ్చే రబీ సీజన్ నాటికి వీటిని అందుబాటులో ఉంచుతాం. వీటి అవసరం రబీ సీజన్లోనే ఎక్కువగా ఉంటుంది. – హరికృష్ణ, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం -
నిజాంషుగర్స్ చుట్టూ రాజకీయాలు
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ చుట్టూ రాజకీయాలు పెనవేసుకుంటున్నాయి. ఫ్యాక్టరీ మూసివేతను ప్రతిపక్షాలు ఆయుధంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తుండగా, అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కదులుతోంది. బకాయి వేతనాలు చెల్లించడం ద్వారా ఫ్యాక్టరీ కార్మికుల్లో ఉన్న నిరసన జ్వాలలను చల్లబర్చాలని చూస్తోంది. ఈ మేరకు ఎంపీ కవిత ఐదు రోజుల క్రితం ఫ్యాక్టరీ కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై 27 నెలల బకాయి వేతనాలు చెల్లించేందుకు హామీ ఇచ్చారు. బోధన్ (నిజామాబాద్): మూతపడిన నిజాం షుగర్స్ ఫ్యా క్టరీ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నా యి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఫ్యా క్టరీ సమస్య ప్రధాన అంశంగా మారనుంది. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు దీని ని ఆయుధంగా మరల్చుకునే ప్రయత్నం చేస్తుండగా, అధికార పార్టీ టీఆర్ఎస్కు ఇరకాట పరిస్థితి ఎదురుకానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, శివసేన పార్టీలు ఫ్యాక్టరీ సమస్యపై రోడ్డె క్కి ఆందోళనకు దిగాయి. మలి దశ తెలంగాణ ఉద్యమం, ఎన్నికల్లో సమయంలో నూ అధికారంలోకి రాగానే షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ రద్దు చేసి స్వాధీనం చేసుకు ని పూర్వవైభవం తెస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేక పోయింది. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఫ్యాక్టరీని నడిపించిన ప్రైవేటు యాజమాన్యం బోధన్ తో పాటు ముత్యంపేట (జగిత్యాల) ముంబోజిపల్లి (మెదక్) యూనిట్లను 2015 డిసెంబర్ 23న లేఆఫ్ ప్రకటించి మూసివేసింది. మూడు ఫ్యాక్టరీల పరిధిలో వందలాది మంది కార్మికులు రోడ్డున న పడ్డారు. ఆనాటి నుంచి నిజాం షుగర్స్ రక్షణ కమిటీ, కార్మిక, ప్రజా సంఘాలు, చెరుకు రైతులు, వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎంఐఎం, వైఎస్ఆర్ సీపీ, తెలంగాణ సా మాజిక పోరాట సమితి ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం అనేక రూపాల్లో ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నాయి. అయితే ఫ్యాక్టరీ పునరుద్ధర ణ, స్వాధీన అంశాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎటూ తేల్చలేకపోయింది. ప్రస్తుతం ఎన్సీఎల్టీ ( నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ), లేబర్ కోర్టుల్లో షుగర్ ఫ్యాక్టరీ సమ స్య విచారణలో ఉంది. ఫ్యాక్టరీ భవిష్యత్తు అయోమయంగా మారింది. ఫలించని అధికార పక్షం ఆలోచన షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారానికి 2015 జనవరిలో సీఎం కేసీఆర్ చెరుకు రైతులతో రాష్ట్ర సచి వాలయంలో చర్చించారు. రైతులు ముం దుకొస్తే సహకార రంగంలో నడిపిస్తామని స్పష్టత ఇచ్చారు. రైతులు తమతో అయ్యే పని కాదని తేల్చి చెప్పారు. దీంతో ఫ్యాక్టరీ సమస్య మొదటి కొచ్చింది. 2015 ఏప్రిల్ 29న ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని జీవో నంబర్ 28ను ప్రభుత్వం జారీ చేసింది. మరో ముందడుగు వేసి ఫ్యాక్టరీ స్వాధీనంలో సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు ఆరుగురు ఐఏఎస్ ఉన్న తాధికారులతో అధ్యయన కమిటీని వేసింది. ఈ కమిటీ నివేదిక బహిర్గతం చేయలేదు. సమస్య మాత్రం యథాతథంగా ఉంది. పెండింగ్‌లో బకాయిలు.. ఫ్యాక్టరీ మూతపడిన నాటి నుంచి కార్మికుల నెలసరి వేతనాలు అటు ఫ్యాక్టరీ యాజమాన్యం, ఇటు ప్రభుత్వం చెల్లించలేదు. ఇప్పటి వరకు 33 నెలల బకాయి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కార్మికులు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కార్మికులు ఆగ్రహంతో ఉన్నారనే విషయా న్ని అధికార పక్షం గుర్తించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. తాజాగా ఎంపీ కవిత ఐదు రోజుల క్రితం బోధన్ షుగర్ ఫ్యాక్టరీ వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులతో సమావేశమై కార్మికుల ఇబ్బందులపై చర్చించారు. 2015 డిసెంబర్ నుంచి 2018 మార్చి వరకు 27 నెలల బకాయి వేతనాలు చెల్లించేందుకు హామీ ఇచ్చారు. ఏది ఏమైనా షుగర్ ఫ్యాక్టరీ సమస్య ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మార నుందని స్పష్టమవుతోంది. ప్రతిపక్షాల, అధికార పార్టీ వ్యూహప్రతివ్యూహాలతో బోధన్ నియోజక వర్గం ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని అంటున్నారు. ఎంపీ కవిత ప్రత్యేక దృష్టి పెట్టారు షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారంపై ప్రభు త్వం సీరియస్‌గా దృష్టిసారించింది. ఎంపీ కవిత చొరవ తీసుకుని కార్మికుల బకాయి వేతనాలు ఇప్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. త్వర లోనే కార్మికుల బకాయి వేతనాలు చెల్లిస్తారు. బకాయిల చెల్లింపుతో కార్మికులకు న్యాయం జరుగుతుంది. వేతనాలు వస్తే ఉపశమనం పొందుతారు. ఎంఏ రజాక్, టీఆర్ఎస్ నాయకుడు, బోధన్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారంలో విఫలం షుగర్ ఫ్యాక్టరీ సమస్యను పరిష్కరించడం లో టీఆర్ఎస్ ప్రభు త్వం విఫలమైంది. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని ఎన్నికల హామీని అమలు చేయకుండా మోసగించింది. మరో వైపు ఫ్యాక్టరీ మూతపడినా పట్టించుకోలేదు, మభ్యపెట్టే మాటలతో కాలం వెళ్లదీసింది. ఫ్యాక్టరీ మూసి వేత, టీఆర్ఎస్ ఎన్నికల హామీ, మోసపూరిత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. గుణ ప్రసాద్, కాంగ్రెస్ బోధన్ అధ్యక్షుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. షుగర్ ఫ్యాక్టరీ మూసి వేత వల్ల ఈ ప్రాంత చెరుకు రైతులు, కార్మికులకు తీరని అన్యా యం జరిగింది. టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయలేక చేతులెత్తేసింది. ఫ్యాక్టరీ సమస్యపై అనేక రూపాల్లో ఆందోళనలు చేసిన టీఆర్ఎస్ ప్రభు త్వం పట్టించుకోలేదు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కాకపోవడంతో కార్మికుల కష్టాలు తీరలేదు. దుర్భర బతుకులను అనుభవిస్తున్నారు. రామరాజు, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, బోధన్ ఫ్యాక్టరీ మూసివేత బాధకరం ఘన చరిత్ర కలిగిన నిజాంషుగర్ ఫ్యాక్టరీ మూసివేత బాధకరం. ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపలేదు. ఫ్యాక్టరీ తెరిపించి రైతులు, కార్మికులను ఆదుకోవాలి.మా పార్టీ రైతులు, కార్మికుల పక్షాన పోరాడుతోంది. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభు త్వం నడిపితేనే రైతులు, కార్మికులకు మేలు జరుగుతోంది. సయ్యద్ ముక్తార్ పాషా, వైఎస్ఆర్ సీపీ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బోధన్ -
ఏ స్థానం అడుగుదాం..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : మహాకూటమి పొత్తు లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఎన్ని స్థానాలు, ఏయే స్థానాలు అడగాలనే అంశంపై జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం ప్రాథమికంగా సమాలోచనలు జరిపారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ ఈ అంశంపై ఉమ్మడి జిల్లాకు చెందిన కొద్ది మంది నాయకులతో చర్చించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఒక స్థా నం టీడీపీకి కేటాయించాలని కోరుతూ అధినేత చంద్రబాబుకు ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, బోధన్ స్థానాల్లో ఏ స్థానాన్ని అడగాలనే అనే అంశం చర్చకొచ్చినట్లు సమాచారం. పొత్తులో భాగంగా టీడీపీకి బాల్కొండ స్థానం కేటాయించే అవకాశాలున్నట్లు రాజకీయవర్గాల్లో మొదటి నుంచి చర్చ జరుగుతోంది. అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. టీడీపీ గుర్తు సైకిల్‌పై పోటీ చేస్తే కాంగ్రెస్‌కు పడే ఓట్లు తమవైపు మళ్లే అవకాశాలు లేవని భావిస్తున్న మల్లికార్జున్‌రెడ్డి.., కాంగ్రెస్ గుర్తు నుంచే పోటీ చేసేందుకే ఆసక్తి చూపుతున్నట్లు అనుచరవర్గం పేర్కొంటోంది. ఇన్నాళ్లూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మండవ ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లా నేతలతో సమాలోచనలు జరపడం గమనార్హం. కాగా ఇదంతా సాధారణ సమావేశమేనని, పొత్తుల గురించి అసలు ప్రస్తావన రాలేదని మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ ‘సాక్షి’ ప్రతినిధితో తెలిపారు. ఎలాంటి తీర్మానాలు కూడా చేయలేదని చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, జిల్లా నాయకులు అమర్‌నాథ్‌బాబు, గోపాల్‌రెడ్డి, కొడాలి రాము, రమాదేవి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
చాంతాడు
ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టిక్కెట్టును ఆశిస్తూ ఏకంగా 32 మంది అధిష్టానానికి దరఖాస్తులు చేసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలకు అనుచరులుగా ఉన్న చోటామోటా నేతలు సైతం పార్టీ టికెట్ల కోసం పోటీ పడటం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైన బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ వంటి నియోజకవర్గాలకు సైతం ద్వితీయ శ్రేణి నాయకులు దరఖాస్తులు పెట్టుకోవడం గమనార్హం. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిర్దేశించిన గడువు శుక్రవారంతో ముగిసింది. అయితే ఆ పార్టీ ఆశావహుల జాబితా చాంతాడంత తయారైంది. తొమ్మిది స్థానాలకు ఏకంగా 32 మంది తమ పేర్లను పరిశీలించాలని దరఖాస్తులు చేసుకున్నారు. ఇలా డీసీసీ ద్వారా చేసుకున్న దరఖా స్తులే కాకుండా కొందరు నేతలు నేరుగా టీపీసీసీ కి అందజేశారు. ఇందులో ద్వితీయ శ్రేణి నేతలు అధికంగా ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలకు అనుచరులుగా ఉన్న చోటామోటా నేతలు సైతం పార్టీ టికెట్ల కోసం పోటీ పడటం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో పార్టీ సాంప్రదాయం ప్రకారం ఎంపిక ప్రక్రియను చేపడతామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు మార్రెడ్డి ప్రకటించారు. ఆశావహులు ఎవరైనా తమ దరఖాస్తులను జిల్లా కాంగ్రెస్ కమిటీకి అ ప్పగించాలని, ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు స్క్రీనింగ్ కమిటీ ఉంటుందని ఆ పార్టీ ప్రక టించింది. దీంతో అన్ని నియోజకవర్గాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఆ పార్టీ అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైన బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ వంటి నియోజకవర్గాలకు సైతం ద్వితీయ శ్రేణి నాయకులు దరఖాస్తులు పెట్టుకోవడం గమనార్హం. టికెట్ల కోసం తమకు వచ్చిన దరఖాస్తులను ఇప్పటికే తొలివిడతగా పీసీసీకి అందజేశామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తాహెర్‌బిన్ హందాన్ ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు. డీసీసీకి అందిన దరఖాస్తులు ఇవే.. మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డికి ఖరారు కానున్న బోధన్ స్థానానికి.. ఉప్పు సంతో ష్ కూడా తన దరఖాస్తును పీసీసీ కార్యాలయంలో చివరి రోజు అందజేశారు. మండలిలో విపక్ష నేత షబ్బీర్అలీకి ఖారారు కానున్న కామారెడ్డికి నల్లవెల్లి అశోక్ కూడా తన పేరును పరిశీలించాలని లిఖిత పూర్వకంగా కోరారు. ఆర్మూర్ స్థానానికి అకుల లలితతో పాటు, మార చంద్రమోహన్, ఏబీ శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. నిజామాబాద్ రూరల్ నుంచి ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, అర్కల నర్సారెడ్డి, నగేష్‌రెడ్డి, భూమారెడ్డి దరఖాస్తులు డీసీసీకి అందాయి. తొమ్మిది స్థానాలకు 32 దరఖాస్తులు.. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల టికెట్ల కోసం ప్రస్తుతానికి 32 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. డీసీసీకి వచ్చిన వాటితో పాటు, కొందరు నేరుగా టీపీసీసీకి సైతం అందజేశారు. తమకు పరిచయం ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి వంటి నేతలను ఆశ్రయించి దరఖాస్తులు పెట్టుకున్నారు. ప్రస్తుతానికి తెరపైకి వచ్చిన దరఖాస్తుల సంఖ్య 32 కాగా, శనివారం ఈ సంఖ్యపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఓ అప్లికేషన్ పెడితే పోలా..! ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులకు, మాజీ ఎమ్మెల్యేలకు అనుచరులుగా పనిచేసిన నాయకులు ఇప్పుడు ఎన్నికల సమయానికి వచ్చే సరికి తమ నేతలతో సైతం పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో వార్డు సభ్యునికి కూడా పోటీ చేయని నేతలు ఒకరిద్దరు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవడం కూడా ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులు కూడా కాంగ్రెస్ టికెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. డీసీసీకి అందిన దరఖాస్తులు ఇవే.. నిజామాబాద్ అర్బన్ స్థానానికి బి.మహేష్‌కుమార్‌గౌడ్, తాహెర్‌బిన్ హందాన్, నరాల రత్నాకర్, కేశవేణులతో పాటు ఓ ఎన్ఆర్ఐ నుంచి కూడా దరఖాస్తు వచ్చింది. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే హరినారాయణ్ కుటుంబానికి చెందిన కళ్యాణ్ అనే ఎన్ఆర్ఐ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బాల్కొండలో ఈరవత్రి అనిల్ దరఖాస్తుతో పాటు, పార్టీ కిసాన్‌కేత్ వైస్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మానాల మోహన్‌రెడ్డి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. బాన్సువాడ స్థానానికి కాసుల బాల్‌రాజుతో పాటు, మల్యాద్రిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, మహిళా నేత సబితలతో పాటు, ఇటీవల టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ప్రొఫెసర్ విద్యాసాగర్‌రావు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఎల్లారెడ్డి స్థానానికి నల్లమడుగు సురేందర్, వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, జమునారాథోడ్, పైల కృష్ణారెడ్డిల దరఖాస్తులు డీసీసీకి అందాయి. జుక్కల్ (ఎస్సీ) స్థానానికి మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం, అరుణతార, గడుగు గంగాధర్, తుకారాంలు తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని దరఖాస్తు పెట్టుకున్నారు. -
కాంగ్రెస్ కమిటీల్లో జిల్లా నేతలకు చోటు
సాక్షి ప్రతినిధి నిజామాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది కమిటీలను బుధవారం ప్రకటించింది. ఈ కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలకు స్థానం లభించింది. కోర్ కమిటీలో మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీలు సభ్యులుగా నియమించారు. 53 మంది తో కూడిన కోఆర్డినేషన్ కమిటీలో షబ్బీర్‌అలీ, మధుయాష్కీలతో పాటు ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డిలకు చోటు దక్కింది. ఎలక్షన్ కమిటీలో బొమ్మమ హేశ్‌కుమార్‌గౌడ్, పి.సుదర్శన్‌రెడ్డి, మధుయా ష్కీ, షబ్బీర్‌అలీలకు స్థానం కల్పించారు. వ్యూహ ప్రణాళిక కమిటీకి మధుయాష్కీ కోచైర్మ న్గా వ్యవహరించనున్నారు. ప్రతిష్టాత్మకమైన మెనిఫె స్టో కమిటీలో బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. అలాగే డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్‌హందాన్ , మాజీ ఎంపీ సురేష్ శట్కార్‌కు చోటు లభించింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి పేరు కూ డా పలు కమిటీల్లో ప్రకటించడం గమనార్హం. మే నిఫెస్టో కమిటీ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, కోఆర్డినేష న్ కమిటీ ఈ మూడింట్లోనూ సురేశ్‌రెడ్డికి స్థా నం దక్కింది. కాని ఆయన టీఆర్ఎస్లో చేరారు. -
దూకుడు పెంచిన టీఆర్ఎస్ నేతలు
అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలోనూ ముందుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో కనీసం నాలుగు బహిరంగ సభలను నిర్వహించనుంది. తద్వార పార్టీ శ్రేణులను సమాయత్తం చేయవచ్చని భావిస్తోంది. రెండు రోజుల జిల్లా పర్యటనకు వచ్చిన ఎంపీ కవిత సభల నిర్వహణపై పార్టీ శ్రేణులతో మాట్లాడారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : అభ్యర్థులను ప్రకటించి ముందస్తు ఎన్నికలకు దూకుడుగా వెళుతు న్న టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో కూడా అదే జోరు ను కొనసాగించాలని నిర్ణయించింది. ఎన్నికల కోడ్ రాకముందే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో కనీసం నాలుగు బహిరంగ సభలను నిర్వహించాలని భావిస్తోంది. ప్రతి రెండు నియోజకవర్గాలకు కలిపి ఒకటి చొప్పున అధినేత కేసీఆర్‌తో బహిరంగసభలను ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ శ్రేణులను ఎన్నికలకు మరింత సమాయత్తం చేయవచ్చని పార్టీ భావిస్తోంది. మరోవైపు అన్ని పార్టీల కంటే ముందే టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరందుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కేసీఆర్ జిల్లాలో తొలి బహిరంగ సభను నిజామాబాద్ నగరంలో నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఎంపీ కల్వకుంట్ల కవిత సభ నిర్వహణపై పార్టీ శ్రేణులతో మాట్లాడారు. నిజామాబాద్ అర్బన్‌తో, రూరల్ నియోజకవర్గాల నుంచి సుమా రు 60 వేల మంది పార్టీ శ్రేణులు, ప్రజలను తర లించాలని భావిస్తున్నారు. స్థానిక గిరిరాజ్ కళాశాల సమీపంలో ఉన్న మైదానంలో ఈ సభ జరగనుంది. బుధవారం ఎంపీ కవిత, ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త మైదానాన్ని పరిశీలించారు. అలాగే బాజిరెడ్డితో కూడా ఎంపీ చర్చించినట్లు సమాచారం. ఈనెలాఖరులోపు సభ నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైతే.. ప్రతిపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంటే.. టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోందనే సంకేతాలను ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. కాంగ్రెస్‌కి సంబంధించి బోధన్, కామారెడ్డి నియోజకవర్గాల్లో అభ్యర్థులు మాత్రమే దాదాపు ఖరారయ్యారు. బీజేపీలో ఇంకా ఒక్క స్థానంపైన స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో తొమ్మిది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ప్రచారం జోరందుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి టీ ఆర్ఎస్ అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం ప్రా రంభించారు. ఎన్నికల షెడ్యుల్ విడుదలకు ఇంకా కొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థులు తమ రోజూవారీ ప్రచార షెడ్యూల్లో రెండు, మూ డు రోజులు విరామం ఇస్తున్నారు. ఈ సభల నిర్వహణ ద్వారా అభ్యర్థుల ప్రచారం నిర్విరామంగా కొనసాగుతుందని భావిస్తున్నారు. -
ఈ సారి భారీ దిగుబడి
ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ ధాన్యం మార్కెట్‌ను ముంచెత్తే అవకాశాలున్నాయి. ఈసారి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పెట్టి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయడం కష్టమేనని అంటున్నారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే ఎక్కువగా ఆశ్రయించే అవకాశాలున్నాయి. కాస్త ముందుగానే ధాన్యం రాక ప్రారంభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన మంత్రి పోచారం వచ్చేనెల 1 నుంచే కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు 48 గంటల్లో డబ్బులు చెల్లించాలన్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : నిజామా బాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈసారి ఖరీఫ్ లో రికార్డు స్థాయిలో ధాన్యం మార్కెట్లో కి వస్తుందని అధికార యంత్రాంగం అం చనా వేసింది. సుమారు ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కే్రందాలకు రావచ్చంటున్నారు. గతే డాది కంటే రెం డున్నర రేట్లు అధికంగా ధాన్యం మార్కెట్‌ను ముంచెత్తే అవకాశాలున్నాయి. ప్రైవేటు కొనుగోళ్లు తక్కువే.. ఈసారి కనీస మద్దతు ధర పెరగడంతో రైతులు ప్రైవేటులో విక్రయించే బదులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే ఎక్కువ గా ధాన్యం తీసుకువస్తారని భావిస్తు న్నా రు. గ్రేడ్–ఎ రకం ధాన్యానికి కనీస మద్ద తు ధర గత ఏడాది కంటే క్వింటాలుపై సుమారు రూ.180 పెరిగింది. కామన్ రకానికి కూడా క్వింటాలుకు రూ.200 పెం చారు. ఈసారి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.1,770 పెట్టి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయడం కష్టమేనని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే ఎక్కువగా ఆశ్రయించే అవకాశాలున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో.. ఎన్నికల ఏడాది కావడం.. పైగా రైతులకు సంబంధించిన అంశం కావడంతో అధికా ర యంత్రాంగం ఈసారి కొనుగోలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రతిపక్ష పార్టీలు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలుండటంతో ప్రభుత్వం ముంద స్తు ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 465 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయా లని నిర్ణయించారు. రైతుల నుంచి పెద్ద ఎ త్తున డిమాండ్ వస్తుండటంతో ఈ కేం ద్రాల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ముందస్తుగా ధాన్యం.. ఏటా నవంబర్ మాసంలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటాయి. అయితే ఈసా రి కాస్త ముందస్తుగానే ధాన్యం రాక ప్రారంభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. బోధన్, వర్ని తదితర ప్రాంతాల్లో రైతులు ముందుగా వరినాట్లు వేసుకున్నారు. దీంతో ఇక్కడ ముందుగానే వరి కోతకొచ్చే అవకాశాలున్నాయి. అక్టోబర్ రెండో వారం నుంచే ధాన్యం మార్కెట్లోకి రానుందని, ఈ మేరకు కొనుగోలు కేంద్రాలపై దృష్టి సారించారు. మంత్రి పోచారం సమీక్ష ధాన్యం కొనుగోళ్లపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమీక్షించారు. మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన మంత్రి పోచారం అక్టోబర్ 1 నుంచే కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూసుకోవాలని, ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లో డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ధాన్యంతో పాటు మొక్కజొన్న, కంది, పెసర వంటి పంటలను ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తా మని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయని, అనుమతి వచ్చిన వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. సమీక్షలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఎంఆర్ఎం రావు, సత్యనారాయణ, మార్క్‌ఫెడ్, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో 105 సీట్లు గెలుస్తాం
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 105 సీట్లకు తగ్గకుండా ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంటామని ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 సీట్లు కైవసం చేసుకుంటామన్నారు. మంగళవారం డిచ్పల్లిలోని కేఎన్ఆర్ గార్డెన్స్‌లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పోచారం ప్రసంగించారు. ఇంటలిజెన్స్ సర్వేలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థల సర్వేలు అన్నీ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని తేల్చాయన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రజా బలం ఉందని, అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. ప్రజా బలం ముందు ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయని, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతేనని, వారికి నాలుగైదు సీట్లు కూడా రావని తేల్చిచెప్పారు. దేశ చరిత్రలోనే ఒకేసారి 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారన్నారు. పార్టీ అభ్యర్థులు ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరోసారి రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అడ్డుకోవడానికి చూస్తున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల పార్టీలు చేస్తున్న కుట్రలను టీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని పోచారం పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా వ్యవసాయరంగానికి ఉచితంగా 24 గంటల నిరంతర విద్యుత్‌ను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో సైతం ఇప్పటికీ సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరా లేదని గుర్తు చేశారు. రైతుబంధు, రైతు బీమా పథకాల అమలు ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సమావేశంలో తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డిగోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, టీఆర్ఎస్ జిల్లా యువనాయకుడు బాజిరెడ్డి జగన్, ఎంపీపీ దాసరి ఇందిర, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కులాచారి దినేశ్‌కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గడీల రాములు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు గడుగు గుడ్ బై..!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి బాటలోనే జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ ముఖ్యనేత కారెక్కనున్నారా.? త్వరలో వీరు టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారా? ఇప్పుడు ఈ అంశంపై ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన ఆయన గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ టికెట్ ఆశించారు. ఈసారి కూడా జుక్కల్‌పై ఆశలు పెట్టుకున్నారు. వీలు కాని పక్షంలో అర్బన్లోనైనా తన పేరును పరిశీలించాలని పలుమా ర్లు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఆయన పార్టీ మారాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సురేశ్‌రెడ్డి మాదిరిగానే గడుగు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు న్నాయి. ఈవిషయమై ‘సాక్షి’ గడుగును సంప్రదించగా తాను పార్టీ మారే యోచన లేదని కొట్టిపారేశారు. అలాంటిదేమైనా ఉంటే చెబుతానని దాటవేశారు. సీనియర్లే లక్ష్యంగా.. అభ్యర్థులను ప్రకటించి ముందస్తు ఎన్నికలకు దూకుడుగా వెళుతున్న టీఆర్ఎస్ ప్రతిపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే అనూహ్యంగా మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డిని కారెక్కించుకుని కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. ఇప్పుడు మరో జిల్లా ము ఖ్య నేతను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. చాలా ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేసిన సీనియర్ నేతలకు గులాబీ కండు వా కప్పడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులను నిరుత్సాహానికి గురి చేయడంతో పాటు, నైతికంగా దెబ్బతీసేందుకు పైఎత్తులు వేస్తోంది. -
27న డీఎస్ కీలక నిర్ణయం
రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ ఈనెల 27న తన పుట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్ఎస్లో కొనసాగాలా.. వద్దా ? అంశంపై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన తన సన్నిహితులతో జరిపిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో కొనసాగి ప్రయోజనం లేదని ఆయన అనుచవర్గం ఒత్తిడి చేసినట్లు సమాచారం. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ మరోమారు తన అనుచరవర్గంతో సమావేశమవడం కలకలం రేపింది. సోమవారం మధ్యాహ్నం నిజామాబాద్ లోని ప్రగతినగర్‌లో తన నివాసంలో సుమారు 40 మంది సన్నిహిత అనుచరులతో మంతనాలు జరిపారు. భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో ఇంకా వేచి చూసి ప్రయోజనం లేదని అనుచరులు స్పష్టం చేశారు. త్వరలోనే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుచరగణం ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అలాగే ఈనెల 27న డీఎస్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రక్తదాన శిబిరాలు, అన్నదానాలు చేయాలని భావిస్తున్నారు. పుట్టిన రోజు సందర్భంగా డీఎస్ కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం జోరందుకుంది. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని అన్ని మండలాలతో పాటు, అర్బన్ నుంచి కూడా అనుచరులు హాజరయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరో పిస్తూ డీఎస్‌ను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయా లని జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీవం గా తీర్మానం చేశారు. రెండు నెలల పాటు వేచి చూసిన డీఎస్ ఈనెల 4న విలేకరుల సమావేశం నిర్వహించి తనపై చేసిన తీర్మానంపై లేఖాస్త్రాన్ని సంధించారు. ‘‘నేను టీఆర్ఎస్ను వీడితే ప్రజల దృష్టిలో మీరు చేసిన ఆరోపణలు నిజమని ఒప్పు కున్నట్లు అవుతుంది.. అందుకే నా అంతగా నేను పార్టీకి రాజీనామా చేయను.. దయచేసి నన్ను సస్పెండ్ చేయండి.. అది మీకు చేతకాకపోతే తీర్మానం వెనక్కి తీసుకోండి..’’ అంటూ అధినేత కేసీఆర్‌కు బహిరంగలేఖ రాశారు. ఈ విషయమై అధినేత కేసీఆర్ కూడా స్పందించారు. పార్టీలో ఉంటే ఉంటారు.. పోతే పోతారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డీఎస్ మరోమారు సన్నిహిత అనుచరవర్గంతో సమావేశం కావడం ప్రాధాన్య త సంతరించుకుంది. సమావేశానికి మీడియాను అనుమతించలేదు. ఈ విషయమై ‘సాక్షి’ డీఎస్‌ను సంప్రదించగా తాను తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని తన అనుచరులు పూర్తి విశ్వాసాన్ని తనపై ఉంచారని అన్నారు. -
ప్రత్యామ్నాయం మేమే
సాక్షి, కామారెడ్డి: ప్రజలవైపున్న వామపక్షాలే దేశంలో ప్రత్యామ్నాయ శక్తి అని సీపీఎం పొలిట్‌బ్యూరో బీవీ రాఘవులు పేర్కొన్నారు. బీఎల్‌ఎఫ్‌తో కలిసి పాలక పార్టీలను ఓడిస్తామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులే ప్రాణాలకు తెగించి పోరాడారని, తెలంగాణ విమోచన దినోత్సవం జరపడంలో బీజేపీకి ఎలాంటి హక్కు లేదని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందే అని రాఘవులు విమర్శించారు. జిల్లా కేంద్రంలోని అమృత గ్రాండ్ హోటల్ లో ఆదివారం సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ ఫెడరల్ ఫ్రంట్ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ రంకెలేశారని, ప్రస్తుతం కూనిరాగాలు తీస్తున్నారని విమర్శించారు. కుటుంబ లబ్ధి, అవినీతిని కప్పిపుచ్చుకోవడం, అధికార అవసరాల కోసమే కేసీఆర్ పాటుపడుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీ కూడా నేరవేర్చకుండా తన స్వలాభం కోసమే అసెంబ్లీని రద్దు చేశాడన్నారు. కేసీఆర్‌కు మతి భ్రమించిందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. ఇక ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే ప్రసక్తే లేదన్నారు. ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని, ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని మాయమాటలైనా చెబుతాడని పేర్కొన్నారు. బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకత నోట్ల రద్దు సమయంలో ప్రధాని ప్రకటించిన ఏ లక్ష్యం నెరవేరలేదని ఆర్బీఐ నివేదికలో వెల్లడైందని రాఘవులు పేర్కొన్నారు. జీఎస్టీ అస్తవ్యస్త అమలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. ఇప్పట్లో ఆర్థిక వ్యవస్థ కోలుకునే పరిస్థితిలో లేదన్నారు. తప్పుడు గణాంకాలతో కేంద్ర సర్కారు వృద్ధి రేటుపై తప్పుడు ప్రచారానికి పూనుకుందన్నారు. ఇటీవలి కాలంలో బీజేపీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజాగ్రహాన్ని గ్రహించే బీజేపీ మిత్రపక్షాలు ఎన్డీయేను వదిలి బయటకు వస్తున్నాయన్నారు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ దళితులు, గిరిజనులు, మహిళలకు తాయిలాలు ప్రకటించి తమవైపు తిప్పుకోవాలని ఆరాటపడుతోందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే దేశంలో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి తేడాలేదని రాఘవులు విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నా ధరలను నియంత్రించడం లేదన్నారు. యూపీఏ హయాంలో పెట్రోల్ ధరలపై నియంత్రణను ఎత్తివేశారని, బీజేపీ సర్కారు వచ్చాక రోజువారీగా ధరల పెంపునకు అవకాశం కల్పించారని ఆరోపించారు. అవినీతికి ఊతం.. కాంగ్రెస్ అవినీతిపై ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. నాలుగున్నరేళ్ల కాలంలో అవినీతిపరులను శిక్షించకపోగా, విజయ్‌మాల్యా, నీరవ్‌మోడీ, చోక్సీలాంటి ఆర్థిక నేరగాళ్లను దేశం దాటించిందని రాఘవులు విమర్శించారు. మా ల్యాను సాగనంపడంలో మోదీకి అతిదగ్గర అయిన ఓ సీబీఐ అధికారి సహకారం ఉన్నట్లు మీ డియాలో వచ్చిందన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల్లోనూ అక్రమాలు జరిగాయన్నారు. విమానాల తయారీ బాధ్యతను ఏమాత్రం అవగాహన లేని రిలయన్స్ సంస్థకు అప్పగించారని, అప్పుల్లో ఉన సంస్థను లాభాల బాటలో పట్టించడానికి ఈ పనిచేశారని అన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ కాంగ్రెస్ కుటుంబ పాలన అంతమొందించి ప్రజాస్వామ్య పాలన అందిస్తామన్న బీజేపీ అధికారంలోకి వచ్చాక పార్లమెంటరీ వ్యవస్థను నీరుగార్చిందని రాఘవులు విమర్శించారు. రాజ్యసభలో చర్చ జరుగకుండా కీలక బిల్లులను ద్రవ్య బిల్లులుగా తీసుకువచ్చారన్నారు. న్యాయ వ్యవస్థలో కొలీజియం సిఫారసులను అణచిపెట్టి న్యాయమూర్తుల నియామకంలో జాప్యం చేస్తున్నారని, రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా మార్చార ని ఆరోపించారు. మద్దతు ధర బూటకం.. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు పెద్ద బూటకమని రాఘవులు పేర్కొన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, చత్తీస్ఘడ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు ఆందోళనబాట పడుతున్నారన్నారు. స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే సామాజిక న్యాయానికి, లౌకిక వ్యవస్థకు, పౌరహక్కులకు విఘాతం కలుగుతుందని, తీవ్ర నిరంకు శ ధోరణి ప్రబలుతుందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని ఢీకొట్టే పరిస్థితి కాంగ్రెస్‌కు లేనందున బీజేపీ వ్యతిరేక ఓట్లను సమీకరించి ఆ పార్టీని ఓడించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళితే బీజేపీ వ్యతిరేక పోరాటం బలహీనమవుతుందన్నారు. కాంగ్రె స్ హిందువుల పార్టీగా ముద్ర వేసుకునేందుకు తహతహలాడుతోందని, హిందూ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు సరళీకరణ ఆర్థిక విధానాలతో ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని, ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ విధానాలతో సీపీఎం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ నిరంకుశ పాలన సాగిస్తున్నాయని రాఘవులు ఆరోపించారు. సెప్టెంబర్ 17 న విమోచన దినం ఎందుకు జరపడం లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఎం చేస్తున్న పోడు పోరాటం, కులవివక్షపై సమరం, నిర్వాసితులు, కార్మికుల హక్కులపై పోరాటాలు అభినందనీయమని, ఇదే ఒరవడిని కొనసాగించాలని సూచించారు. మూడంచెల ఎత్తుగడ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మూడంచెల ఎత్తుగడను అనుసరిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు గెలవకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, సీపీఎం భాగస్వామ్యంతో ఏర్పడ్డ బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి బలం పెంచుకుంటామని, బలం లేని ప్రాంతాల్లో బీజేపీ, టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులకు మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశాల్లో చర్చిస్తామన్నారు. రాష్ట్రాన్ని సామాజిక అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. పార్టీ కేంద్ర కమిటీ నాయకులు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, జ్యోతి, పోతునేని సుదర్శన్, సాయిబాబు, చుక్కరాములు, భాస్కర్, వెంకట్రాములు, చంద్రశేఖర్, సిద్దిరాములు, వెంకట్‌గౌడ్, మోతిరాం, రేణుక, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. నేడు ర్యాలీ, బహిరంగ సభ సీపీఎం రాష్ట్ర సమావేశాల్లో భాగంగా నేడు గాంధీ గంజ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ సుభాష్‌రోడ్, సిరిసిల్ల రోడ్, స్టేషన్‌రోడ్, నిజాంసాగర్‌చౌరస్తా మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు సాగుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ముందు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
నేతలకు తిర‘కేసు’
మోర్తాడ్(బాల్కొండ): ‘ముందస్తు’ జోష్‌లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న టీఆర్ఎస్ నేతలకు నిరసన సెగ తగలనుందా..? పల్లెలకు వచ్చే నాయకులపై రైతుల నుంచి ఒత్తిడి ఎదురుకానుం దా? అంటే తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఎస్సారెస్పీ కాకతీయ కాలువ పరివాహక ప్రాంత రైతులు ఇటీవల చేపట్టిన సాగునీటి ఉద్యమం ప్రజాప్రతినిధులకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు నీటి విడుదల కోసం ఉద్యమించిన పలువురు రైతులపై పోలీసులు అప్పట్లో కేసులు నమోదు చేశారు. అయితే, ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ కేసులు ఇరకాటంగా మారుతున్నాయి. గ్రామాలకు వస్తున్న నేతలకు నిరసన సెగలు తగులుతున్నాయి. మిషన్ భగీరథ వైస్ చైర్మన్, తాజా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి రెండ్రోజుల క్రితం మెండోరా మండలంలో పర్యటనకు వెళ్లగా, రైతులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తాజాగా ఆదివారం ఏర్గట్లలో సమావేశమైన ఆ గ్రామ రైతులు కేసుల ఎత్తివేత కోసం పలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. తాజా పరిస్థితులు గమనిస్తుంటే రానున్న రోజుల్లో ‘కాకతీయ కేసులు’ టీఆర్ఎస్కు సంకటంగా మారనున్నాయనే భావన వ్యక్తమవుతోంది. సాగునీటి కోసం ఉద్యమం.. కాకతీయ కాలువ పరివాహక ప్రాంతాలైన ఏర్గట్ల, తిమ్మాపూర్, ఉప్లూర్, తొర్తి, వెంచిర్యాల్, వెల్కటూర్, మెండోరా, బట్టాపూర్, రాజరాజేశ్వర్ నగర్ తదితర గ్రామాల రైతులు సాగు చేస్తున్న పంటలకు లీకేజీ నీరే ప్రాణాధారం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయకపోయినా జిల్లాలోని రైతాంగానికి లీకేజీల ద్వారా వచ్చే నీరు ఎంతో ఉపయోగపడేది. కాకతీయ కాలువకు ఇరువైపులా ఉన్న గ్రామాల రైతులు కాలువలో పంపుసెట్లు ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా పంటలకు నీరు అందించుకుంటున్నారు. ఈసారి వర్షాలు ఆలస్యంగా కురువడంతో రైతులు గత్యంతరం లేని పరిస్థితిలో కాకతీయ కాలువ నీటి కోసం ఉద్యమ బాట పట్టారు. అయితే, నీటి విడుదల కుదరదని ప్రభుత్వం స్పష్టతనివ్వడం, రైతులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడం, పల్లెల్లో పోలీసుల మోహరింపుతో అప్పట్లో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోచంపాడ్‌లో రాస్తారోకో సందర్భంగా చెలరేగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు పలువురిపై క్రిమినల్ కేసులను నమోదు చేశారు. 25 మంది రైతులతో పాటు వారికి మద్దతిచ్చిన ఐదుగురు నేతలపై కేసులు నమోదయ్యాయి. అనువైన సమయమని.. పోలీసులు కేసులలో నిందితులుగా ఉన్న రైతులు పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని బతికే తాము పంట పొలాలను వదలి కోర్టులు, స్టేషన్ల చుట్టూ తిరిగితే మా పనులు ఏమి కావాలని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ముందస్తు ఎన్నికలు మంచి అవకాశంగా కలిసి వచ్చాయని వారు భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తూనే ప్రచార పర్వానికి ఏకకాలంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మూడు రోజుల నుంచి నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేస్తున్నారు. అయితే, తమపై నమోదైన కేసుల ఎత్తివేతకు ఇదే అనువైన సమయమని గుర్తించిన బాధిత రైతులు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మెండోరా మండల కేంద్రంలో ప్రశాంత్‌రెడ్డి పర్యటించగా, నల్లబ్యాడ్జీలు ధరించి కేసులు ఎత్తివేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన రైతులు కూడా కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేసులు ఎత్తివేయక పోతే భవిష్యత్తులో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని రైతులు స్పష్టం చేస్తున్నారు. బేషరతుగా కేసులు ఎత్తి వేయాలి రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తి వేయాలి. ప్రభుత్వం స్పందించక పోతే మరో ఉద్యమం తప్ప దు. రైతులను హిం సించిన ఏ ప్రభుత్వం బాగు పడలేదు. రైతులు అన్నం పెట్టే వారే తప్ప మరొకరిని ఇబ్బంది పెట్టేవారు కాదు. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. కేసులను ఎత్తి వేయాలి. – అశోక్, రైతు, మెండోరా రైతులకు మద్దతిస్తే కేసులా..? రైతులు నీటి కోసం ఆందోళన చేపడితే మద్దతు ఇచ్చిన వారిపైనా పోలీసులు కేసులను నమోదు చేయడం ఎంత వరకు సమంజసం. పోలీసుల తీరు సరికాదు. ప్రభుత్వం స్పందించి కేసులను ఎత్తివేయడానికి చర్యలు తీసుకోవాలి. – శివన్నోల్ల శివకుమార్, ఏర్గట్ల నీళ్లడిగితే కేసులు పెడతారా..? మేము న్యాయబద్ధంగా నీటి కోసం ఉద్యమించాం. నీళ్లడిగిన రైతులపై కేసులా..? ఎన్నో నేరాలు చేస్తున్న వారిని వదిలి, సాగు నీటి కోసం ఉద్య మించిన రైతులపై కేసులు పెడతారా..? మహిళలు అని కూడా చూడకుండా మాపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇది ఎంత వరకు సమంజసం. రైతులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలి. – బద్దం రజిత, రైతు, ఏర్గట్ల -
భార్య కాపురానికి రావడం లేదని...
బోధన్‌రూరల్(బోధన్): మండలంలోని సాలంపాడ్ గ్రామానికి చెందిన జి.వెంకట నర్సింహ్మ రావ్(36) అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు బోధన్ రూరల్ ఎస్ఐ షేక్ యాకూబ్ తెలిపారు. సాలంపాడ్‌కు చెందిన జి.వెంకట నర్సింహ్మరావ్ రంగారెడ్డి జిల్లాలోని షేర్ లింగంపల్లి గ్రామానికి చెందిన సావిత్రి అనే మహిళను వివాహం చేసుకుని రంగారెడ్డి జిల్లాలో నివాసం ఉంటున్నాడన్నారు. 7 నెలల క్రితం భార్యతో కలహాలు రావడంతో భార్యతో గొడవ పడి సాలంపాడ్ గ్రామానికి వచ్చాడన్నారు. అప్పటి నుంచి తన భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఈనెల 9న ఒంటికు నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు యత్నించి తీవ్ర గాయాల పాల్యవడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి చికిత్సకు చేర్పించారు. శుక్రవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి అక్క కృష్ణవేణి ఫిర్యాదు మేరకు శనివారం ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఈవీఎం ఎక్చేంజ్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మ రం చేసింది. ఇప్పటికే ఓటరు జాబితాల సవరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన అధికారులు.. ఇప్పు డు ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లపైనా దృష్టి సారించారు. ప్రస్తుతం ఉన్న పాత ఈవీఎంల స్థానంలో కొత్తవాటిని తెప్పించాలని నిర్ణయించారు. ఇప్పుడున్న ఈవీఎంల టెక్నాలజీ వీవీపీఏటీ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రాయల్)కి సపోర్టు చేయదు. దీంతో వీవీపీఏటీ యూనిట్లకు సపోర్టు చేసేలా అప్డేటెడ్ ఈవీఎంలను తెప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈసీఐఎల్, బీఈఎల్‌లకు 3,400 ఈవీంలు ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల సంఘం ప్రత్యేక గోదాములు నిజామాబాద్‌లో ఉన్నాయి. గత ఎ న్నికల్లో పోలింగ్ కోసం వినియోగించిన ఈవీఎం లను ఇందులో భద్రపరిచారు. మొత్తం 20,826 ఈవీఎంలు ఉన్నాయి. వీటిలో కొన్ని హైదరాబాద్‌కు చెందిన ఈసీఐఎల్ సంస్థ తయారు చేసినవి కాగా, మరికొన్ని బెంగుళురులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలకు చెందినవి ఉన్నాయి. వీవీపీఏటీ యూనిట్లకు సపోర్టు చేయని వీటి స్థానంలో వీవీపీఏటీ యూనిట్లకు అనుసంధానించేలా అప్డేటెడ్ ఈవీఎంలను తెప్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే సుమారు 3,400 ఈవీఎంలను ఆయా సంస్థలకు పంపారు. మిగిలినవి కూడా విడతల వారీగా పంపుతున్నారు. ఈ ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాలకు వీవీపీఏటీ యూనిట్లు సపోర్టు చేయగల అప్డేటెడ్ ఈవీఎంలను తెప్పిస్తున్నారు.ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 2,142 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. వీటికి అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది. పార్టీల అభ్యంతరాల నేపథ్యంలో.. ఈవీఎంలో ఏ గుర్తు మీట నొక్కినా ఒకే అభ్యర్థికి ఓటు పడుతుందనే అపోహ.. ఈవీఎంల పనితీరుపై పలు రాజకీయ పార్టీల అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల సం ఘం ఈ ఎన్నికల్లో వీవీపీఏటీ యూనిట్లను వినియోగించాలని నిర్ణయించింది. ఓటరు ఏ గుర్తుకు ఓటు వేశారనేది ఈ వీవీపీఏటీ యూనిట్లలో నిక్షిప్తం అవుతుంది. ఓటరుకు తన ఓటు ఏ గుర్తుకు వేశామనేది ఈ యూ నిట్‌లో కనిపిస్తుంది. ఓటు వేసిన అనంతరం 7 సెకన్ల వరకు ఈ సమాచారం ఓటరు అం దుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతే పోలింగ్ అధి కారులను అడిగి కూడా తన ఓటు ఏ గుర్తుకు పడిందనేది ఈ యూనిట్ల ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఆయా వీవీపీఏటీ యూనిట్లలో పోలింగ్‌కు సంబంధించిన సమాచారం ఐదేళ్ల వరకు నిక్షిప్తంగా ఉం టుందని అధికారులు పేర్కొంటున్నారు. -
బాబ్లీ కేసులో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే
జుక్కల్ (నిజామాబాద్): మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణాని కి అడ్డుపడిన కేసులో జుక్కల్ తాజా మాజీ ఎమ్మె ల్యే హన్మంత్‌సింధే ఉన్నారు. దీంతో అరెస్టు వారెం ట్ జారీ అయ్యేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2010లో నాటి ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత బాబ్లీ ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యేల్లో హన్మంత్ సింధే ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నీటి సమస్య కావడం, ఓవైపు తెలంగాణ ఉద్య మం ఉండడం బాబ్లీ ప్రాజెక్ట్‌కు వెళ్లిన టీడీపీ బృందాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో పెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలవ్వడం, ప్రస్తుతం హన్మంత్ సింధే ఎన్నికల ప్రచారం లో బిజీగా ఉన్నారు. దీం తో చంద్రబాబు ఉచ్చు త న మెడకు బిగిస్తుందా అని హన్మంత్‌సింధే ఆం దోళన లో ఉన్నారు. ఎమ్మెల్యే నాన్ బెయిల్‌బుల్ వారెంట్ నోటీసులు అందితే చంద్రబాబుతో సహ హన్మంత్‌సింధే కూడా జైలుకు వెళ్లె పరిస్థితి ఉందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. బాబ్లీ కేసు తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా బయటపడుతారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
కప్పదాట్లు..!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నేతల వలసలతో జిల్లాలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల కప్పదాట్లతో ఆయా నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీ ముఖ్య నాయకులు పార్టీలు మారుతుండటంతో ఆయా నియోజకవర్గాల్లో సమీకరణలు మారుతున్నాయి. ఇటీవల మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పగా, తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. భూపతిరెడ్డి కాంగ్రెస్‌లోకి రాకతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఆశావహుల సంఖ్య మరింత పెరిగినట్లయింది. ఇప్పటికే ఇక్కడ నలుగురు నేతలు రూరల్ టికెట్‌ను ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా రూరల్ నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం నెలకొంటే.. రూరల్ టికెట్‌పై స్పష్టమైన హామీ ఇచ్చాకే భూపతిరెడ్డి పార్టీలో చేరినట్లు ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. మరోవైపు స్పీకర్ సురేశ్‌రెడ్డి టీఆర్ఎస్లోకి రావడంతో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో కూడా సమీకరణలు మారాయి. గత ఎన్నికల్లో సురేశ్‌రెడ్డి కాంగ్రెస్ తరపున ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయన ఆర్మూర్ నుంచి గానీ, బాల్కొండ నుంచి గానీ పోటీ చేయాలనే ఊగిసలాటలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి, కారెక్కారు. దీంతో కాంగ్రెస్‌లో ఆర్మూర్ తెరపైకి కొత్త నేతల పేర్లు వచ్చాయి. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ ఆకుల లలిత కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండుసార్లు ఆర్మూర్‌లో ఓటమి పాలైన సురేశ్‌రెడ్డి ఈసారి ఎలాగైనా బాల్కొండ నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. దీంతో ఇక్కడి స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈరవత్రి అనిల్‌తో పాటు, సురేశ్‌రెడ్డి కూడా టికెట్ రేసులో ఉంటారని భావించారు. సురేశ్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో ప్రస్తుతానికి కాంగ్రెస్ టికెట్ రేసులో అనిల్ ఒక్కరే మిగిలారు. కాగా పొత్తులో భాగంగా ఈ స్థానంపై టీడీపీ కన్నేసింది. ఇక్కడి నుంచి అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. ఇలా నేతల కప్పదాట్లు మూడు నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతోంది. -
ఎన్నికల ప్రచారంలో వేముల ప్రశాంత్‌రెడ్డికి చేదు అనుభవం
-
భూపతిరెడ్డికి అంత సీన్ లేదు
నిజామాబాద్ : టీఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి అంత సీన్ లేదని నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..తనకు ప్రజా మద్ధతు మెండుగా ఉందని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్, భూపతిరెడ్డి ఇద్దరూ ఒక్కటయ్యారని, అందులో భాగంగానే కుట్రలకు తెరలేపారని అన్నారు. భూపతిరెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని చెప్పారు. వీరి వ్యవహారాన్ని మొదట్లో కేసీఆర్ దృష్టికి ఎప్పుడూ తీసుకెళ్లలేదని, ఇద్దరూ కలిసి కుమ్మక్కై ఇప్పుడు తనను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డీఎస్ ఢిల్లీలో కూర్చుని పార్టీని బెదిరిస్తుంటారని ఎద్దేవా చేశారు. భూపతిరెడ్డి చేసే ఆరోపణలు నిరాధారమని, నిజామాబాద్ రూరల్ ఎన్నికల్లో తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
ప్రాజెక్టు పనులకు గ్రహణం !
బాల్కొండ (నిజామాబాద్): ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రయోజనం చేకూర్చే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అభివృద్ధికి దశాబ్ద కాలం తరువాత గతేడాది భారీగా నిధులు మంజూరయ్యాయి. నిధులున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. గతేడాది ఆగస్టులో సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం శంకు స్థాపన కోసం ప్రాజెక్ట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీలో పలు అభివృద్ధి పనుల కోసం రూ. 26 కోట్లు, లక్ష్మి కాలువ ఆధు నికీకరణకు రూ. 20 కోట్లు మంజూరు చేశారు. నవంబర్ వరకు టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, ఇప్పటికీ 80 శాతం పనులు ప్రారంభం కాలేదు. అధికారులేమో పనులు ప్రారంభించాలని కాం ట్రాక్టర్లకు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నా రు. పనులు సకాలంలో ప్రారంభించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. లక్ష్మి కాలువ అంతే.. శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ లక్ష్మికాలువ ఆధునికీకరణ కోసం రూ. 20 కోట్లు గతేడాది మంజూరు కాగా పనులను మేలో ప్రారంభించారు. కాలువపై అక్కడక్కడా వంతెనల నిర్మాణం, లక్ష్మి లిఫ్టు వద్ద రిటైనింగ్ వాల్ పనులను పూర్తి చేశారు. ప్రస్తుతం కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో పనులు నిలిపి వేశారు. ప్రాజెక్ట్ నుంచి నవంబర్ 15 వరకు నీటి విడుదల కొనసాగుతుంది. రబీలో నీటి సరఫరా చేసే అవకాశం ఉండటంతో వేసవి వరకు పనులు అటకెక్కినట్లే. ఆనకట్ట ప్రాటెక్షన్ వాల్.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆనకట్టకు ఇరువైపులా ప్రాటెక్షన్ వాల్ నిర్మించడానికి రూ. 8 కోట్ల 31 లక్షల 70 వేలు మంజూరు అయ్యాయి. ఇది వరకే కుడి వైపు కిలోమీటర్, ఎడమ వైపు కిలో మీటర్ మేర సెఫ్టీ వాల్ ఉంది. దానిని పూర్తిగా నిర్మించా లని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ ప్రక్రియ పూర్తయినా వరకు పనులు ప్రారంభించ లేదు. రివిట్ మెంట్.. ఎస్సారెస్పీ ఆనకట్ట రివిట్ మెంట్ మరమ్మతుల కోసం రూ. 5 కోట్ల 34 లక్షల 70 వేలు మంజూ రు అయ్యాయి. రివిట్ మెంట్ పనులను వేసవి కాలంలో ప్రారంభించి ఎట్టకేలకు చివరి దశకు తీసుకు వచ్చారు. ప్రస్తుతం ఆనకట్టపై పెరిగిన చెట్లను తొలిగించే పనులు చేపడుతున్నారు. ప్రారంభం కాని బీటీ రోడ్డు.. ప్రాజెక్ట్ ఆనకట్ట కుడి, ఎడమలు కలిపి 13.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. పూర్తిగా గుంతల మయంగా మారింది. బీటీ తొలగిపోయి మొత్తం మట్టి రోడ్డు ఏర్పడింది. బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్ల 64 లక్షల 30 వేలు మంజూరయ్యాయి. పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ప్రాజెక్ట్ ప్రధాన రోడ్డు మరమ్మతులు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జాతీయ రహదారి 44 నుంచి ప్రాజెక్ట్ వరకు గల మూడు కిలోమీటర్ల రోడ్డు తారు కొట్టుకు పోయింది. ఆ రోడ్డు మరమ్మతులకు రూ. కోటి 94 లక్షల 30 వేలు మంజూరయ్యాయి. పనులు ప్రారంభమైన రెండు రోజులకే నిలిచిపోయాయి. నోటీసులు ఇచ్చాం : ప్రాజెక్ట్ వద్ద చేపట్ట వలిసిన పనులు ప్రారంభించక పోవడంపై కాంట్రాక్టర్‌కు పలు మార్లు నోటీసులు ఇచ్చాం. పనులు ప్రారంభించ కుంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళుతాం. – శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ, ఎస్సారెస్పీ -
పోచారం ఓ రబ్బర్ స్టాంపు : విద్యాసాగర్‌రావు
‘‘బాన్సువాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి పదవి దక్కింది.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై గుత్పకట్టెలతో దాడి చేసిన వారికి మార్కెట్ కమిటీ పదవిచ్చారు.. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వొద్దని సోనియాకు లేఖ రాసిన రాజేశ్వర్‌కు ఎమ్మెల్సీ పదవి.. టీడీపీ నుంచి వచ్చిన నాయకులకు కార్పొరేషన్, జెడ్పీ చైర్మన్, నగర మేయర్ పదవులు..కానీ పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన ఏఎస్ పోశెట్టి, ఉద్యమంలో జైలు పాలైన చింతా మహేష్ లాంటి ఉద్యమ కారులకు మాత్రం ద్రోహం చేశారు..’’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి నిప్పులు చెరిగారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీ ఆర్, ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లపై తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి విరుచుకుపడ్డారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మి కళ్యాణమండపంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్య మంలో 1,200 మంది అమరులైతే ఆ కుటుంబాలను ఆదుకున్న దాఖలాల్లేవన్నారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో కనీసం అమరవీరుల స్థూపం నిర్మించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాజిరెడ్డి ట్రాక్టర్లు అమ్ముకున్నారు.. ప్రతి అభివృద్ధి పనిలోనూ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కమీషన్లు దండుకున్నారని భూపతిరెడ్డి ఆరోపించారు. రైతులకు పంపిణీ చేయాల్సిన ట్రాక్టర్లను అమ్ముకున్నారని, ఇసుక దందాకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తాను రూరల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్నారు. కవితపైనా విమర్శలు.. సిరిసిల్ల, సిద్దిపేట్, గజ్వేల్‌లలో అభివృద్ధి పనులకు రూ.వందల కోట్లు వెళుతుంటే.. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కుమార్తె, ఎంపీ కవితతో జిల్లాకు ఒరిగిందేమీలేని భూపతి రెడ్డి విమర్శించారు. కనీసం సీఎం వద్ద ఉండే రూ.ఐదు వేల కోట్లలో రూ.ఐదు వం దల కోట్లు కూడా జిల్లాకు మంజూరు చేయించలేకపోయారన్నారు. తెలంగాణ యూనివర్సిటీ సిబ్బందికి జీతాలు చెల్లించే పరిస్థితులు లేవన్నారు. ఒక్క పరిశ్రమ రాలేదని, ఒక్క డిగ్రీ కాలేజీని స్థాపించలేదన్నారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇవ్వలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఎన్ఆర్ఈజీఎస్ నిధులను కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు దక్కకుండా చేశారని విమర్శించారు. మెడికల్ కళాశాల సౌకర్యాలు మెరుగుపడలేదని, ఎన్డీఎస్ఎల్ పునరుద్ధరణకు నోచుకోలేన్నారు. అదనంగా ఒక్క గుంటకూ నీళ్లివ్వలేదు.. జిల్లా రైతాంగం హక్కైన సింగూరు జలాలను మెదక్ జిల్లాకు తరలించుకుపోతే జిల్లా నుంచి గెలుపొందిన ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే కూడా నోరు మెదపలేదని భూపతి రెడ్డి విమర్శించారు. ఎస్సారెస్పీ లీకేజీ నీటిని అడిగితే గ్రామాల్లో పోలీసు బలగాలను మోహరించి రైతులను భయ భ్రాంతులకు గురి చేశారన్నారు. కానీ ఎస్సారెస్పీనుంచి తొమ్మిది టీఎంసీల నీటిని మానేర్ డ్యాంకు తరలించుకు పోయారన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో జిల్లాలో అదనంగా ఒక్క గుంటకు కూడా సాగునీరిచ్చిన దాఖలాల్లేవన్నారు.ఏ ముఖం పెట్టుకుని టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అస్తవ్యస్తంగా టీఆర్ఎస్ : విద్యాసాగర్‌రావు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ విద్యా సాగర్‌రావు విమర్శించారు. ఎంపీ కవిత, మిషన్‌భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డిలకు అనుభవం లేక పార్టీని నడిపించలేకపోయారన్నారు. జిల్లాలో టీఆర్ఎస్కు యం త్రాంగం లేదు.. మంత్రాంగం లేదన్న విద్యాసాగర్.. మంత్రి పోచారం ఓ రబ్బరు స్టాంపుగా మారారన్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి కోసం పార్టీని తాకట్టుపెట్టారని, బాజిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఎలా అవుతుంద ని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, నాయకులు కర్కగంగారెడ్డి, కంచెట్టి గంగాధర్, షాదుల్లా, కిషన్ నాయక్, కర్స మోహన్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘అనైతిక పొత్తులకు టీడీపీ కేరాఫ్ అడ్రస్’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసమే ముందస్తుగా తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ జత కడుతోందని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. అనైతిక పొత్తులకు టీడీపీ కేరాఫ్ అడ్రస్ అని ఎద్దెవా చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలపై ఉన్న కేసులు పాతవని, వాటితో మాకు ఎలాంటి సంబంధంలేదని ఆమె తేల్చిచెప్పారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ కొడతామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ టికెట్ల విషయంలో కొన్నిప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయని.. పార్టీ నాయకత్వం వాటిని త్వరలోనే పరిష్కరిస్తుందని వెల్లడించారు. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ భూపతి రెడ్డిలు స్వార్థం కోసం మాపై విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మంగళవారం జగిత్యాల జిల్లాలో జరిగిన కొండగట్టు ప్రమాదంపై కవిత స్పందిస్తూ.. ఘటనలో పొరపాట్లు జరిగాయని అన్నారు. -
‘టీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేయను’
నిజామాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం వినిపించారు. పార్టీ అధినేత కేసీఆర్‌పై భూపతి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పని చేస్తానని కుండబద్దలు కొట్టి చెప్పారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్‌ను ఓడిస్తానని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నానని, టీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేయనని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తా..ఏ పార్టీ అనేది త్వరలో చెబుతా, ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే తాను ఇప్పుడే రాజీనామా చేస్తానని తెలిపారు. అలా చేయకపోతే రాజీనామా చేయనన్నారు. తాను తప్పు చేస్తే ఎందుకు సస్పెండ్ చేయరని ప్రశ్నించారు. క్షమాపణ ఎందుకు చెప్పరు.. పొమ్మన లేక పొగ పెడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని ముందస్తు ఎన్నికలకు పోతుందని మండిపడ్డారు. టీఆర్ఎస్ పతనం నిజామాబాద్ నుంచే మొదలవుతుందని శాపనార్థాలు పెట్టారు. కేబినేట్లో 70 శాతం మంది కేసీఆర్‌ను తిట్టిన వారే ఉన్నారని వెల్లడించారు. ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్దపీట వేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమకారులను పథకం ప్రకారం టీఆర్ఎస్ పక్కన పెడుతోందని, టీఆర్ఎస్ చెప్పిందే వినాలి..లేకపోతే ద్రోహులు అనే ముద్ర వేసే పద్ధతి అవలంబిస్తున్నారని అన్నారు. నీళ్లు, నిథులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఆ మూడూ జరగడం లేదని తెలిపారు. తెలంగాణ వ్యతిరేకులు జూన్ రెండున నివాళులు అర్పిస్తుంటే బాధ కలుగుతోందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన ఓ యువకునికి కేసీఆర్ ఇంతవరకూ నష్టపరిహారం మంజూరు చేయలేదని వెల్లడించారు. తెలంగాణ వస్తే ఏం జరుగుతుందని అమరవీరులు, విద్యార్థులు, మేథావులు, కళాకారులు, జనాలు ఆశించారో అవేమీ నెరవేరలేదని భూపతిరెడ్డి విమర్శించారు. -
పగిలిన అద్దాలు.. విరిగిన డోర్లు
బస్సు ప్రయాణం భద్రత లేకుండా పోతోంది. ప్రమాదాలతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా.. నివారణ చర్యలు చేపట్టాల్సిన ఆర్టీసీ యాజమాన్యం ఆదాయం పైనే దృష్టి పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. డ్రైవర్లకు పని ఒత్తిడి పెరగడం ప్రమాదాలకు ఒక కారణంగా చెబుతున్నారు. నిజామాబాద్‌నాగారం: ఘెరమైన బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా ఆర్టీసీ యాజమాన్యం నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. పగిలిన అద్దాలు, ఊడి పోయిన డోర్లతో శిథిలా వస్థలో కనిపించే బస్సులను నడపడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.ఏడాదిన్నర కాలంలో ఉమ్మ డి జిల్లాలో 28 ఆర్టీసీ బస్సు ప్రమాదాలు చోటు చేసుకోగా 31 మంది మరణించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ప్రమాదం నేపథ్యంలో జిల్లాలోని ఆర్టీసీ బస్సుల సామర్థ్యంపై సర్వ త్రా చర్చసాగుతోంది. నిజామాబాద్ రీజియన్‌లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో నిజామాబాద్ డిపో–1, డిపో–2, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ డిపోలు ఉన్నాయి. మొత్తం 670 బస్సుల్లో 190 అద్దె బస్సులు ఉన్నాయి. గత రెండేళ్లలో ఆర్టీసీ ప్రమాదాల శాతం 0.05 శాతం నమోదైంది. ప్రస్తుతం 1లక్ష కిలోమీటర్‌కు 0.05 శాతం ప్రమాదాల రేటు ఉంది. ఇటీవల కమ్మర్పల్లి, డిచ్పల్లి, నస్రుల్లాబాద్, నందిపేట్ రూట్లలో ప్రమాదాలు జరిగాయి. ఫలితం లేని భద్రత వారోత్సవాలు... ప్రతి సంవత్సరం ఆర్టీసీలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే డిపోలో ఈ వారోత్సవాలు నామ మాత్రంగా నిర్వహిస్తున్నారు. ఇచ్చిన వారికే ఉత్తమ డ్రైవర్లుగా మళ్లీ అవార్డులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. వారోత్సవాల సమయంలో ప్రతి డిపోలో 500 మందిపైగా కార్మికులు ఉంటే కేవలం యూనియన్ నాయకులకు, లేదంటే 10 మంది కార్మికులకు శిక్షణ పేరుతో మమ అనిపిస్తున్నారని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. డ్రైవర్లు నిత్యం ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. సెలవుల విషయంలోనూ వివక్ష చూపుతున్నారని అంటున్నారు. ఆదాయంపైనే దృష్టి... ఆర్టీసీ నష్టాల్లో ఉందని యాజమాన్యం ప్రతినిత్యం డ్రైవర్లను లాభాలు తేవాల్సిందేనని ఒత్తిడి పెంచుతోంది. కేవలం ఆదాయంపైనే అధికారులు దృష్టి పెట్టారని, డ్రైవర్లపై పెరుగుతున్న ఒత్తిడితో ప్రమాదాలకు దారితీస్తుందన్న విషయాన్ని గుర్తించాలని కార్మికులు కోరుతున్నారు. బస్సుల సామర్థ్యం నామమాత్రమే... ఆర్టీసీ నిబంధనలను అధికారులు పట్టించుకోవడం లేదు. బస్సుల సామర్థ్యం తగ్గిపోయిన విషయం తెలిసినా వాటిని దూరప్రాంతాలకు పంపిస్తున్నారు. డ్రైవర్లు నానా తిప్పలు పడుతూ బస్సులను నడిపిస్తున్నారు. ఈ బస్సులను నడపడం సాధ్యం కాదంటే ఇబ్బందులకు గురి చేసి సస్పెండ్ చేస్తారని, అందుకే ఇబ్బందులు ఎదురైనా నడిపిస్తున్నట్లు కార్మిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాజధాని (ఇంద్ర) బస్సులు సైతం చెడిపోయి రోడ్డు మ«ధ్యలో మొరాయించిన ఘటనలు ఉన్నాయి. కండిషనల్ లేని బస్సులను వరంగల్, నాందేడ్ రూట్లతో తిప్పుతున్నారు. ముఖ్యంగా నాన్‌స్టాప్ బస్సులో కేవలం 30 మంది ప్రయాణికులు మాత్రమే ఉండాలి. అయితే నందిపేట్ నుంచి నిజామాబాద్, ఆర్మూర్ నుంచి నిజామాబాద్, బోధన్ నుంచి నిజామాబాద్ నాన్‌స్టాప్ బస్సుల్లో సామర్థ్యానికి మించి సుమారు 60 మంది వరకు ప్రయాణికులను ఎక్కించి రాకపోకలు సాగిస్తున్నారు. అద్దె బస్సుల వైపు కన్నెత్తి చూడరు.. ఆర్టీసీలో అద్దె బస్సుల వైపు కన్నెత్తి చూడరు. కనీస నిబంధనలు పాటించకున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అద్దె బస్సుల డ్రైవర్లకు సరైన శిక్షణ కూడా ఉండడం లేదు. అద్దె బస్సుల ప్రమదాలు జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అద్దె బస్సుల్లో తరుచు గా డ్రైవర్‌కు, ఆర్టీసీ కండక్టర్లకు సైతం గొడవలు జరిగిన ఘనలు ఉన్నాయి. కెపాసిటీకి మించి బస్సుల రాకపోకలు సాగిస్తున్నారు. నందిపేట్ నుంచి నిజామాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్న ఒకే బస్సు ఆరు నెలల వ్యవధిలో డ్రైవర్లు అత్యంత వేగంగా నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుని ఇద్దరు ప్రయాణికులు మరణించారు. అయినా ఆ బస్సు యాథావిధిగా తిరుగుతోంది. తనిఖీలు చేపడుతున్నాం మేము ఖచ్చితంగా తనిఖీలు చేపడుతున్నాం. ఫిట్నెస్ లేని అద్దె బస్సులపై చర్యలు తీసుకుంటాము. ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఈ విషయంలో డిపో మేనేజర్లకు సైతం ఆదేశాలు ఉన్నాయి. నిబంధనలు అద్దె బస్సులు పాటించాలి. కా లం చెల్లిన బస్సులను లేకుండా చేస్తున్నాం. ప్రమాదాలు జరగకుండా సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటునే ఉన్నాము. అనిల్‌కుమార్, డీవీఎం, నిజామాబాద్ -
సైకిల్‌పై సవారీకి వెనుకంజ !
కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించే అవకాశాలున్న నియోజకవర్గంలో ఆ పార్టీ గుర్తుపై బరిలోకి దిగేందుకు ఆశావహులు వెనుకడుగు వేస్తున్నారు. బాల్కొండ స్థానం టీడీపీకి దక్కే అవకాశాలుండగా, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓటింగ్ 12 శాతమే. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ గుర్తు పై ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు టీ డీపీ ఆశావహులు సైతం ఆసక్తి చూ పడం లేదు. పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించే అవకాశాలున్న ఒక టీ రెండు నియోజకవర్గాల్లో ఆ పా ర్టీ గుర్తుపై బరిలోకి దిగేందుకు ఆశావహులు వెనుకడుగు వేస్తున్నారు. కాం గ్రెస్‌తో పొత్తులో భాగంగా జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో బాల్కొం డ స్థానం టీడీపీకి దక్కే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్థానాన్ని ఆశిస్తున్న అన్న పూర్ణమ్మ కుమారుడు డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి టీడీపీ బీఫారంపై కాకుండా, కాంగ్రెస్ గుర్తుపైనే పోటీ చేయాలని యోచనలో ఉన్నట్లు వారి అనుచరవర్గం పేర్కొంటోంది. కాంగ్రెస్ ఓటుబ్యాంకుపైనే ఆశలు.. తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా జిల్లాలో ఆ పార్టీ ఉనికి లేకుండా పోయింది. ప్రస్తుతం మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ వంటి ఇద్దరు ముగ్గురు నాయకులే మిగిలారు. జిల్లా అంతటా టీడీపీ పూర్తిగా పట్టు కోల్పోయింది. 2014 ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓట్లలో టీడీపీకి వచ్చిన ఓటింగ్ కేవలం 12 శాతమే. ఇందులో అభ్యర్థిని చూసి వేసిన ఓట్లే అధికం. 2014 ఎన్నికల తర్వాత జిల్లాలోని నాయకులంతా ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. చివరకు జిల్లా అధ్యక్షులు అర్కల నర్సారెడ్డి సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీగా పనిచేసిన వీజీ గౌడ్ వంటి నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పార్టీని వీడారు. గ్రామాల్లో కేడర్ కనుమరుగైంది. చెప్పుకోదగిన నాయకులిద్దరు, ముగ్గురు మినహా టీడీపీ పూర్తిగా తన ప్రభావాన్ని కోల్పోయింది. ఓటింగ్ శాతం కూడా నామమాత్రానికి పడిపోయింది. దీంతో టీడీపీ గుర్తుపై పోటీ చేస్తే.. కాంగ్రెస్ ఓట్లు పూర్తి స్థాయిలో తమకు మళ్లే అవకాశాలు ఉండవని భావిస్తున్న ఆశావహులు.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు పైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ పార్టీ గుర్తుపైనే బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారు. టీడీపీ గుర్తుపై పోటీ చేస్తే అసలుకే ఎసరొచ్చే అవకాశాలుండటంతో మల్లికార్జున్‌రెడ్డి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు అనుచరవర్గంలో ప్రచారం కొనసాగుతోంది. కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేస్తే టీడీపీ అధినాయకత్వం ఇందుకు అంగీకరిస్తుందా అనే అంశంపైనా చర్చ జరుగుతోంది. కాగా, ఈ స్థానాన్ని ఆశించిన మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి కారెక్కారు. దీంతో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కు లైన్ క్లియరైంది. కానీ అనూహ్యంగా టీడీపీ పొత్తు తెరపైకి రావడంతో ఈరవత్రి టిక్కెట్ కోసం తన ప్రయత్నం ముమ్మరం చేయాల్సి వస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ – టీడీపీ పొత్తు అంశంపై జిల్లా రాజకీయవర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
బాన్సువాడ (నిజామాబాద్): నిత్యం వందలాది లారీలతో రద్దీగా ఉండే జాతీయ రహదారి 161పై (సంగారెడ్డి– నాందేడ్–అకోల) ఓ లారీని హైజాక్ చేసి, దారి మళ్లించి, డ్రైవర్‌ను చెట్టుకు కట్టేసి లారీ ఎత్తుకెళ్లిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కేవలం 10 రోజుల్లోపే ముఠాను చాకచక్యంగా పట్టుకోవడం విశేషం. చోరీ వివరాలను కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత సోమవారం బాన్సువాడ రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. గత నెల 29న నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు పాడైన బ్యాటరీల లోడ్‌తో 161 జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ (ఏపీ–12యూ 4754) ని, అంతర్ రాష్ట్ర దొంగల ముఠా స్కార్పియో(ఎంహెచ్ 26/వి–5849)లో నాందేడ్ నుంచి వెంబడించింది. ఆ రోజు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో లారీని కామారెడ్డి–సంగారెడ్డి జిల్లాల సరిహద్దులో బ్రాహ్మణపల్లి హనుమాన్ మందిరం వద్ద అడ్డుకున్నారు. లారీ డ్రైవింగ్ చేస్తున్న మహ్మద్ సాబెర్ ఖాన్‌ను తీవ్రంగా చితకబాదడంతో పాటు కత్తులతో బెదిరించారు. లారీని దారి మళ్లించిన దొంగలు, జాతీయ రహదారి నుంచి నారాయణఖేడ్ రోడ్డు వైపు తీసుకెళ్లి, జహీరాబాద్ సమీపంలో రాయిపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద లారీని ఆపి డ్రైవర్‌ను నిమ్మ చెట్టుకు కట్టేసి తీవ్రంగా చితకబాదారు. అతని వద్ద ఉన్న 30వేల నగదును, రూ. 9లక్షల విలువ చేసే బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. అనంతరం లారీని బోధన్ సమీపంలోని ఓ గ్రామానికి తీసుకెళ్లి, లారీలో ఉన్న బ్యాటరీల లోడ్‌ను రహస్య గోడౌన్లో డంప్ చేసి, లారీని తీసుకెళ్లి ధర్మాబాద్‌లో వదిలేశారు. లారీ హైజాక్ కావడంతో బాధితుడు లారీ డ్రైవర్ మహ్మద్ సాబెర్ ఖాన్ నిజాంసాగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు ధర్మాబాద్ నుంచి లారీని రికవరీ చేయడంతో పాటు, సెల్‌ఫోన్ లొకేషన్ల ద్వారా దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. దొంగల ముఠాలోని ఆరుగురు సభ్యులైన నాందేడ్‌కు చెందిన ఎండీ ఇమ్రాన్ ఖురేషి, షేక్ అవేస్, షేక్ సమీర్, ఎండీ సలీమ్లు, నిజామాబాద్ నగరంలోని అహ్మద్పుర కాలనీకి చెందిన అన్వర్ ఖాన్, శేక్ రఫీఖ్‌లను నిజాంసాగర్ మండలం నర్సింగ్‌రావు పల్లి చౌరస్తా వద్ద ఈనెల 9న పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 9 లక్షల చోరీ సొమ్మును రికవరీ చేశారు. దొంగల ముఠాలో ఉన్న మరో ఇద్దరు సభ్యులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా ఈ సభ్యులపై నవీపేట, వర్ని, ముధోల్, దిలావర్పూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు చెప్పారు. కాగా కేవలం 10 రోజుల్లోపే దొంగలను పట్టుకున్న సీసీఎస్ పోలీసు బృందమైన శంకర్, ఉస్మాన్, నరేశ్, రవికృష్ణ, రాంలను ఎస్పీ శ్వేత అభినందించారు. వీరికి క్యాష్ రివార్డులను అందజేశారు. సమావేశంలో రూరల్ సీఐ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. -
ఆపరేషన్ ఆకర్ష్
ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో బలమైన నాయకులకు టీఆర్ఎస్ గాలం వేస్తోంది. పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్, బీజేపీలను దెబ్బతీసేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. బాన్సువాడలో గట్టి పట్టున్న కాంగ్రెస్ నేత మల్యాద్రిరెడ్డి, నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్న ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో టీఆర్ఎస్ టచ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే పార్టీ ఫిరాయింపులపై ఆయా నేతలు బయట పడటం లేదు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షకు మరింత పదును పెడుతోంది. ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులకు గాలం వేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులను కారెక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపే నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్, బీజేపీలను దెబ్బతీసేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఎవరూ ఊహించని విధంగా మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి టిఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ ఇప్పుడు మిగితా పార్టీల్లోని కొందరు నేతలతో టచ్‌లో ఉంటుంది. ఈ రెండు పార్టీల్లో టికెట్ విషయంలో అసంతృప్త నేతలకు గాలం వేస్తోంది. బాన్సువాడలో కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు.. బాన్సువాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్టు ఆశిస్తున్న ఆ పార్టీ నేత మల్యాద్రిరెడ్డికి టీఆర్ఎస్ గాలం వేస్తోంది. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న మల్యాద్రిరెడ్డి గత కొంతకాలంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సీనియర్ నేత మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై ఉన్న వ్యతిరేకత ఎలాగైనా అనుకూలంగా మార్చుకుని గట్టెక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా పట్టులేదు. ఇప్పటి వరకు చెప్పుకోదగిన నాయకులు తెరపైకి రాలేదు. ప్రస్తుతానికి ఒక్క కాంగ్రెస్ నుంచే పోటీ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన మల్యాద్రిరెడ్డికి గులాబీ కండువా కప్పడం ద్వారా గట్టి పోటీనిచ్చే కాంగ్రెస్‌కు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. జనగామ తాజా మాజీ ఎమ్మెల్యేతో సంప్రదింపులు.. మల్యాద్రిరెడ్డిని టీఆర్ఎస్లోకి చేర్చుకునేందుకు జనగామ జిల్లా టీఆర్ఎస్కు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ద్వారా టీఆర్ఎస్ సంప్రదింపులు జరిపింది. మల్యాద్రిరెడ్డి సతీమణి ముత్తిరెడ్డి సోదరుని కుమార్తె. దీంతో ముత్తిరెడ్డి ద్వారా టీఆర్ఎస్ పావులు కదిపింది. ఈ మేరకు మంత్రి పోచారం ముత్తిరెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు చర్చ జరుగుతోంది. అయితే చేతగాని నేతలు చేసే ప్రచారం తప్ప తాను పార్టీ మారుతాననడంలో నిజం లేదని మల్యాద్రి తేల్చిచెప్పారు. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకే తాను కాంగ్రెస్‌లోకి వచ్చానని అన్నారు. ఎవరో చెబితే తాను పార్టీ మారుతానని అనుకోవడం సరికాదని అన్నారు. అర్బన్‌లో ధన్‌పాల్‌కు.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న ధన్పాల్ సూర్యనారాయణ గుప్తతో కూడా టీఆర్ఎస్ టచ్‌లో ఉంది. ఆయనతో ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఆయన నివాసంలో చర్చించినట్లు ప్రచారం జోరందుకుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసి ధన్పాల్ మూడో స్థానంలో నిలిచారు. ఆయన్ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీజేపీ బలంగా ఉన్న అర్బన్ నియోజకవర్గంపై మరింత పట్టు సాధించవచ్చని టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇదంతా పూర్తిగా అసత్య ప్రచారమని, గిట్టనివాళ్లు చేస్తున్న పని అని ఆయన కొట్టిపారేశారు. 20 ఏళ్లుగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న తనను రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ అదే ఊపును కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
అసంతృప్తులపైనే ఆశలు
భారతీయ జనతా పార్టీ బలమైన అభ్యర్థుల కోసం గాలిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీనిచ్చే స్థాయిలో పార్టీ నాయకులు లేకపోవడంతో.. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలపై దృష్టి సారించింది. అసమ్మతి నాయకులను అక్కున చేర్చుకుని, టికెట్ ఇచ్చి ప్రత్యర్థులకు గట్టి సవాలు విసరాలని యోచిస్తోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: బలమైన నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ.. వివిధ పార్టీల టికెట్లు ఆశించి భంగపడిన నేతలపైనే ఆశలు పెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. టీఆర్ఎస్ 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి, కదన రంగంలోకి దూకేసింది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపి క, టీడీపీతో పొత్తు.. సీట్ల సర్దుబాటు.. వంటి వా టిపై తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే, కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు దాదాపు ఖరారు దశ లో ఉన్నారు. కా నీ, బీజేపీలో మాత్రం ఈ దూకుడు పెంచకపోవడంతో జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో ఇం కా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. ఆ పా ర్టీ ప్రధానంగా నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియో జక వర్గాల్లో మూడు, నాలుగు మినహా మిగిలిన చోట్ల బలమైన అభ్యర్థులే కరువయ్యారు. ఈ నేప థ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ టికెట్ల కోసం ప్రయ త్నాలు చేసి, అక్కడ అవకాశం దక్కని నేతలకు గాలం వేయాల ని కమల దళం యోచిస్తోంది. కామారెడ్డి జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి ఒక్క కామారెడ్డి అభ్యర్థిత్వంపైనే ప్రస్తుతానికి స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలోకి వచ్చిన జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గం లో ఆ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణా ల లక్ష్మారెడ్డి పేరు తెరపైకి వస్తోంది. జహీరాబాద్ ఎంపీగా బరిలోకి దిగాలని ఆయన యోచించి, కొంతకాలంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అందుబాటు ఉండలేదు. ముఖ్యంగా నాగిరెడ్డిపేట్ వంటి మండలాల వైపు తొంగి చూసి న దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డిలో ఆ పార్టీ ప్రత్యామ్నాయ నేతలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ అసమ్మతి నేత, మాజీ ఎమ్మెల్యే బి.జనార్ధన్గౌడ్ను సంప్రదించినట్లు తెలిసింది. ఆయన సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. బాన్సువాడలో ప్రస్తుతం బీజేపీకి నియోజకవర్గ స్థాయి నేత కనుచూపు మేరలో కనిపించడం లేదు. దీంతో నిజామాబాద్ అర్బన్‌కు చెంది న నేతలను బరిలోకి దించే యోచనలో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. జుక్కల్‌లోనూ దాదాపు ఇ లాంటి పరిస్థితే నెలకొంది. ఇక్కడ కూడా చెప్పుకోదగిన అభ్యర్థి కోసం ఆ పార్టీ వేట కొనసాగిస్తోంది. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓ నాయకుడి కుమారుడి పేరును పరిశీలిస్తోంది. అర్బన్‌లో మాత్రం పోటాపోటీ.. ఒక్క నిజామాబాద్ అర్బన్ స్థానానికి మాత్రం బీజేపీలో గట్టి పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ధన్పాల్ æసూర్యనారాయణ గుప్తా, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బస్వ లక్ష్మీనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేతలంతా అర్బన్‌లో పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రూరల్ నియోజకవర్గంలో గడ్డం ఆనంద్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసిన నిధులు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల సమస్య బీజేపీని వెంటాడుతోంది. ఇక్కడి సీనియర్ నేతలంతా పార్టీ కార్యక్రమాలను మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా.. బీజేపీ ఎంపీ స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేతలు ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసి, తమ బలాన్ని నిరూపించుకోవాలని పార్టీ అధినేత అమిత్ షా ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎంపీ స్థానంపై ఆశలు పెట్టుకున్న ధర్మపురి అర్వింద్ కూడా ఈసారి జిల్లాలోని ఏదైనా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్ సర్కారును లక్ష్యంగా చేసుకుని వినూత్న నిరసనలు, పాదయాత్రలు చేపట్టిన అర్వింద్‌ను ఈసారి ఏదైనా నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలనే యోచనలో ఆ పార్టీ ఉంది. అలాగే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి కూడా ఆర్మూర్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు జహీరాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్న బాణాల ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. -
టీఆర్ఎస్లోకి మాజీ స్పీకర్
కమ్మర్పల్లి(బాల్కొండ): గౌరవం లేని చోట ఉండ డం ఇష్టం లేకే పార్టీ మారాల్సి వచ్చిందని మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి తెలిపారు. పార్టీ మారే వారి కోసం టికెట్ కేటాయించడంతో బాల్కొండ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే అవకాశాలు పూర్తిగా మూసుకుపోవడం వల్లే తాను కాంగ్రెస్ నుంచి తప్పుకోవలసి వచ్చిందన్నారు. కమ్మర్పల్లి మండలం చౌట్‌పల్లిలోని తన స్వగృహంలో ఆదివారం ఆయన బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో సమావేశమయ్యారు. ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందో సురేశ్‌రెడ్డి తన అనుచరులకు వివరించారు. 2009 నుంచి పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించిన ఆయన.. తొందరపడి పార్టీ మారాలనే నిర్ణయం తీసుకోలేదన్నారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఊహించని పరిణామం ఎదురైందని, గౌరవం లే ని చోట ఉండడం ఇష్టం లేక పార్టీ మారాల్సి వ చ్చిందని చెప్పారు. మాతృ పార్టీని వీడడం బాధ గా ఉన్నప్పటికీ, కుటుంబాన్ని కాపాడుకోవలసిన బాధ్యతతో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసు కున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో, అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి, సేవలు వినియోగించుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. 30 ఏళ్ల నుంచి తనను నమ్ముకొని ఉన్న కార్యకర్తల పరిస్థితి ఏమిటని అడిగితే, వారికి కూడా సముచి త స్థానం కల్పించి అండగా ఉంటామని సీఎం హా మీ ఇచ్చారని చెప్పారు. ఆర్మూర్, బాల్కొండ ని యోజకవర్గాల అభివృద్ధిలో తన పాత్ర ఉం టుందని సీఎం స్పష్టం చేశారని వివరించారు. ఈ నెల 12న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నానని, ఆశీర్వదించాలని కోరారు. అంతకు ముందు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ.. తామంతా మీ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. -
‘వెలుగు’లో కష్టాలు
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో వైద్య సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. వైద్య శిబిరాల నిర్వహణ సమయంలో భోజన వసతి కల్పించాల్సి ఉండగా చాలా చోట్ల పట్టించుకోవడం లేదు. భోజన ఏర్పాట్లకు నిధులు కూడా మంజూరు అయ్యాయి. గతనెల 15న జిల్లా వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో కంటి వెలుగు వైద్యశిబిరాలు ప్రారంభమయ్యా యి. 35 వైద్య బృందాలను ఏర్పాటు చేశా రు. ఇందులో జనరల్ వైద్యులతో పాటు కంటి వైద్య నిపుణులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఇద్దరు, స్థానిక ఏఎన్ఎంలు ఇద్ద రు, ఆశకార్యకర్తలు , ఇద్దరు సూపర్వైజ ర్లు ఉంటారు. వీరికి మధ్యాహ్న వేళలో భోజనం, రెండు పూటల టీ , శిబిరం వద్ద టెంట్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. ఒక్కో శిబిరానికి మొదట రూ. 1500 మంజూరు చేయగా సరిపోవడంలేదని రూ. 2,500 పెంచారు. కంటి వెలుగు శిబిరం నిర్వహణకు జిల్లాకు ఒక రూ. కోటి 9 లక్షలు మంజూరు అయ్యాయి. ఇందులో నుంచి ఖర్చుకు కేటాయిస్తున్నారు. అయితే కంటి వెలుగు శిబిరాల్లో వైద్యసిబ్బందికి భోజనాలు అందించకుండా, ఇంటి నుంచే తెచ్చుకోవాలని వైద్యాధికారులు సూచించడం గమనార్హం. కనీసం రెండు పూటల టీ అందించడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని నాలుగు వైద్యశిబిరాల్లో భోజనాన్ని స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేయిస్తున్నారు. కేటాయించిన నిధులను మాత్రం ఖర్చు చేయడం లేదు. మరోవైపు వైద్యశిబిరాలను మహిళ సంఘాలు, కుల సంఘాలు, కమ్యూనిటీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. టెంట్ ఖర్చు కూడా మిగిలిపోతోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యశిబిరాలు కొనసాగుతున్నాయి. దీంతో శిబిరంలో పాల్గొనే సిబ్బంది భోజన వసతి కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పీహెచ్సీ వైద్యసిబ్బంది జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 50 రోజుల వరకు శిబిరాల నిర్వహణ సమయంలో భోజన వసతి కోసం నిధులు ముందుగానే ప్రభుత్వం మంజూరు చేసింది. స్థానికంగా మెడికల్ ఆఫీసర్లు డబ్బులు ఖర్చు చేయకపోవడంపై అధికారులు మండిపడుతున్నారు. గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కమిటీలు , ప్రజాప్రతినిధుల ద్వారా భోజన వసతి కల్పిస్తున్నారే తప్ప వైద్యాధికారులు నిధులు ఖర్చు చేయడం లేదు. ఇప్పటికే దాదాపు 70 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్యశిబిరాలకు ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడంతో వైద్యసిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిధులు మంజూరు అయ్యాయి : జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి డా సుదర్శనం కంటి వెలుగు నిర్వహణకు సంబంధించి సంబంధిత సెంటర్లకు నిధులు ముందస్తుగానే విడుదల అయ్యాయి. సిబ్బందికి భోజన, ఇతర ఖర్చులకు ఎలాంటి లోటు లేకుండా నిధులు అందుబాటులో ఉన్నాయి. ఎవరైన భోజన వసతి కల్పించకుంటే చర్యలు తీసుకుంటాం. మంజూరు అయిన నిధుల ప్రకారం తప్పకుండా కనీస సౌకర్యాలు, భోజన వసతి వైద్యాధికారులు కల్పిలంచాలి. -
అసమ్మతి సెగలు
టీఆర్ఎస్ అధిష్టానం అసెంబ్లీ స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలనే ప్రకటించడంతో ఆ పార్టీలో నిరాదరణకు గురైన నేతలు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యేలు ఇన్నాళ్లూ తమను పక్కన పెట్టారని, ఇప్పుడు కలిసి రమ్మంటే ఎలా వెళ్తామని అంటున్నారు. మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత వద్దనే తేల్చుకుంటామని చెబుతున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతోనే ఉమ్మడి జిల్లాలో అసంతృప్తి సెగలు లేస్తున్నాయి. ఆ పార్టీ లో చిచ్చు క్రమంగా రాజుకుంటోంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమను కావాలని దూరం పెట్టారని, ఎన్నికల సమయంలో ఇప్పుడు తాము గుర్తొచ్చామా అని అస మ్మతి నేతలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి కేటీఆర్, ఎంపీ కవితల వద్దే మాట్లాడుకుందామని తేల్చి చెబుతున్నారు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టిం గ్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పేరును అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఏనుగుకు మరోమారు టికెట్ ఖరారు చేయడంపై ఈ నియోజకవర్గంలో పట్టున్న మాజీ ఎమ్మెల్యే బి.జనార్దన్‌గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విషయం తెలుసుకున్న రవీందర్‌రెడ్డి గురువారం నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డిలోని జనార్దన్‌గౌడ్ నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లూ తనను అణగదొక్కే ప్రయత్నం చేసి, ఇప్పుడు కలిసి పనిచేద్దామంటే ఎలా అని జనార్దన్‌గౌడ్ ప్రశ్నించినట్లు తెలిసింది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌తో సన్నిహితుడిగాVBఉన్నందుకే తాను అలా చేయాల్సి వచ్చిందని ఎమ్మెల్యే సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన బి జనార్దన్‌గౌడ్ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో సముచిత స్థానం (ఎమ్మెల్సీ) ఇస్తామని అధినేత ప్రకటించడంతో టీఆర్ఎస్లోకి వచ్చారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఏదైనా ఉంటే మంత్రి కేటీఆర్ వద్ద చర్చించుకుందామని, ఇ ప్పు డు మాట్లాడే పరిస్థితి లేదని జనార్దన్‌గౌడ్ తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రవీందర్‌రెడ్డికి టికెట్ కేటాయించడంతో గాంధారి మండల రైతుసమన్వయ సమితి కో ఆర్డినేటర్ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. బాల్కొండలోనూ.. బాల్కొండ నియోజకవర్గ స్థానం వేముల ప్రశాంత్‌రెడ్డికి కేటాయించడంపై ఆ పార్టీ మరోనేత ముత్యాల సునీల్‌రెడ్డి వర్గం గుర్రుగా ఉంది. ఇక్క డ ఈ ఇద్దరు నేతలు మొదటి నుంచి ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. నియో జకవర్గంలో సునీల్‌రెడ్డికి తనకంటూ ఓ ప్రత్యేక కేడర్ ఉంది.ఈసారి కూడా వేములకు టికెట్ కేటాయించడంతో సునీల్‌రెడ్డి తన అనుచరులతో ఆదివారం సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మేరకు వేల్పూర్ మండలం లక్కొరలో ఓ ఫంక్షన్‌హాలులో అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నట్లు తెలిసింది. రూరల్పైనా.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కూడా అసంతృప్తి సెగలు అంతర్గతంగా రగులుతున్నా యి. మరోమారు బాజిరెడ్డికి అవకాశం ఇవ్వడం తో ఆయన వ్యతిరేకవర్గం రగిలిపోతున్నారు. ఇక్కడ బాజిరెడ్డి వర్గీయులకు, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి వర్గీయులకు ఆది నుంచి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలున్నాయి. ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తారాస్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించుకోవడం పరిపాటిగా మారింది. ఒకానొక స్థాయిలో బాహాబాహీకి దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాజిరెడ్డికి తిరిగి అభ్యర్థిత్వం ఖరారు కాగా, ఆయన వ్యతిరేకవర్గం అంతర్గతంగా రగిలిపోతోంది. ఈ విషయమై ఎంపీ కవితను కలిసి తమ అసంతృ ప్తిని వెళ్లగక్కాలని భావిస్తున్నారు. బోధన్‌లో మౌనంగా ప్రముఖ నేతలు.. బోధన్ స్థానం షకీల్‌కు కేటాయించడంపై నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కొందరు మౌనం వహిస్తున్నారు. అసంతృప్తిని బయటకు వ్యక్తం చేయకపోయినప్పటికీ, అంతర్గతంగా తమ అసంతృప్తిని ఎంపీ వద్ద విన్నవించాలనే యోచనతో ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మేడపాటి ప్రకాశ్‌రెడ్డి ఏడాది క్రితం టీఆర్ఎస్లో చేరారు. అలాగే ఇటీవల రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడు మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గిర్దావర్ గంగారెడ్డి, మైనార్టీ నేత రజాక్ వంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థిత్వం ఖరారయ్యాక తొలిసారిగా శనివారం నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా షకీల్ అమేర్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ నాయకులు గైర్హాజరవడం పార్టీలో చర్చకు దారితీసింది. ఈ అసమ్మతి.. అసంతృప్తులన్నీ పెద్ద సమస్యే కాదని, ఒక్కసారి పిలిచి మాట్లాడితే అన్నీ సమసిపోయి, కలిసికట్టుగా ప్రతిపక్షాలనును ఎదుర్కొనడం ఖాయమంటున్నారు. -
గ్యాస్ ‘ఫిల్లింగ్’.. కిల్లింగ్
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లతో తెరచాటున ‘రీ ఫిల్లింగ్’ దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. ‘లైట్ హౌస్’ల పేరుతో గోప్యంగా అక్రమ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారం జనవాసాల మధ్యే సాగడంతో జిల్లాలో ఇప్పటి వరకు చాలా ప్రమాదాలు జరిగాయి. వాటిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినా అధికారులు షరా ‘మామూలు’గానే తీసుకుంటున్నారని మంగళవారం నందిపేటలో జరిగిన సంఘటన నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కమర్షియల్ సిలిండర్లను కొనుగోలు చేసి దాంట్లో నుంచి చిన్న సిలిండర్లలో గ్యాస్‌ని నింపి విక్రయించేందుకు నిర్వాహకులు లైట్‌హౌస్‌ల పేరిట వ్యాపారం చేయాలి. ఈ వ్యాపారం కూడా జనవాసాల మధ్య చేయకూడదని అగ్నిమాపక శాఖ నిబంధనలున్నాయి. అయినా వాటిని తుంగలో తొక్కుతున్నారు. దర్జాగా జనావాసాల మధ్య, వ్యాపార సముదాయాల మధ్య బహిరంగ వ్యాపారం చేస్తున్నారు. అనుమతుల విషయంలో కూడా తమకెవరికీ సంబంధం లేదని పౌర సరఫరాలశాఖ అధికారులు అంటున్నారు. జీపీలు, మున్సిపాల్టీల వారే అనుమతులు ఇస్తారని చెప్తున్నారు. ఇంతకూ లైట్హౌస్లు ఎవరి పరిధిలోకి వస్తాయో అనేది కూడా స్పష్టత లేదు. అయితే తమకు సంబంధం లేదంటున్న సివిల్ సప్లయి, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాత్రం తరచుగా లైట్‌హౌస్‌లను తనిఖీలు చేస్తుండడం, గృహావసర సిలిండర్లతో అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తుండగా చాలా సిలిండర్లను పట్టుకుని కేసులు సైతం నమోదు చేయడం మాత్రం గమనించాల్సిన విషయమే. సమాచారం వస్తే తప్ప.. తరచుగా లైట్‌హౌస్‌లను తనిఖీ చేసిన సందర్భాలు ఒక్కటీ లేవు. దీంతో అధికారుల పనితీరు ఏంటో అద్దం పడుతోంది. ప్రమాదాలు జరుగుతున్నా పట్టింపు లేదు.. జిల్లాలో గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తుండగా సిలిండర్లు పేలి చాలా ప్రమాదాలు జరిగాయి. కేవలం చిన్న సిలిండర్లకు మరమ్మతులు చేస్తున్నామని చెప్పి సాహసం చేసి దర్జాగా దుకాణాల్లోనే గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్నారు. మంటలు చెలరేగితే వెంటనే ఆర్పేందుకు కావాల్సిన స్ప్రేలు, సౌకర్యాలు అందుబాటులో కూడా ఉండవు. దీంతో సిలిండర్లు లీకై లేదా పేలి పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. లైట్‌హౌస్ దుకాణమే కాకుండా పక్కనున్న ఇతర వ్యాపారా సముదాయాలకు మంటలు వ్యాపించి భారీ ఆస్తి నష్టం వాటిల్లుతోంది. నందిపేట మండలంలో మంగళవారం జరిగిన సలిండర్ పేలుళ్లలో కూడా ఇలాంటిదే జరిగింది. నాలుగు దుకాణాలు పూర్తిగా కాలిపోయి దాదాపు రూ.50లక్షల వరకు ఆస్తినష్టం వాటిళ్లింది. లైట్ హౌస్ జనాసాలు, వ్యాపార సముదాయాల మధ్య ఉండడంతో తీవ్ర నష్టం జరిగింది. ఆర్నెళ్ల క్రితమే డిచ్పల్లిలోని ఓ లైట్‌హౌస్‌లో గ్యాస్ రీ ఫిల్లింగ్ చే స్తుండగా సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో గ్యా స్ నింపుతున్న వ్యక్తితోపాటు మరో వ్యక్తి తీవ్ర గా యాలై చికిత్స పొందుతూ మర ణించారు. ఆర్నెళ్ల వ్యవధిలోనే రెండు పెద్ద సంఘటనలు జరిగినా అధికారుల్లో మాత్రం చల నం లేదని స్పష్టంగా కనిపిస్తోంది. సంఘటనలు జరిగితే కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం వరకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అనుమతులు మా పరిధిలో లేదు లైట్‌హౌస్‌ల అనుమతులు సివిల్ సప్లయి శాఖ పరిధిలోకి రావు. గ్రామ పంచాయతీలు, ము న్సిపాల్టీల పరిధిలోకి వస్తాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్లు దుర్వినియోగం కాకుం డా, వాటిని రీ ఫిల్లింగ్ చేయకుండా చర్యలు తీ సు కునేందుకు లైట్‌హౌస్‌లపై తనిఖీలు చేస్తాం. –కృష్ణప్రసాద్, డీఎస్ఓ -
కాంగ్రెస్‌కు షాక్ !
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేశ్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడటంతో ఆ పార్టీ ఎదురు దెబ్బతిన్నది. ఈ నెల 12న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం హైద రాబాద్‌లో సురేశ్‌రెడ్డి నివాసానికి మంత్రి కేటీఆర్, బాల్కొండ, ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. సురేశ్‌రెడ్డి పార్టీని వీడనుండటం ఉమ్మడి జిల్లా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఇప్పటికే కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ చాలామట్టుకు కారెక్కింది. ద్వితీయ శ్రేణి నాయకత్వం కాంగ్రెస్‌ను వీడింది. తాజాగా జిల్లాలో ఆ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన మాజీ స్పీకర్ పార్టీని వీడటం చర్చనీయాంశంగా మారింది. సీని యర్ నేతగా పేరున్న సురేశ్‌రెడ్డి మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1989, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలుపొందారు. తిరిగి 2004 ఎన్నిక ల్లో కూడా విజయం సాధించిన ఆయన శాసనసభా స్పీకర్‌గా పనిచేశారు. తర్వా త 2009, 2014 ఎన్నికల్లో ఆర్మూర్ ని యోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన వరుసగా రెండు పర్యాయాలు ఓటమిని చవిచూశారు. దాదాపు 35 సం వత్సరాల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన సురేశ్‌రెడ్డి గులాబీ గూటికి వెళ్లడం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా కుదుపునకు గురైంది. గులాబీ గూటికి చేరనున్న సురేశ్‌రెడ్డికి సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీనిచ్చినట్లు ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. ఆయన సేవలను జాతీయ రాజకీయాలకు వినియోగించుకోవాలని యో చిస్తున్నట్లు సమాచారం. ఇందులో భా గంగా రాజ్యసభ సీటు కేటాయిస్తామనే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించనున్నారనే ప్రచారం కూడా కొనసాగుతోంది. గురువారం హైడ్రామా.. సురేశ్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ఆరు నెలల కిత్రం ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకునే వరకూ బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడ్డారు. టీఆర్ఎస్ గూటికి వెళుతున్నట్లు ఆయన అనుచర వర్గానికి కూడా సమాచారం లేదు. సురేశ్‌రెడ్డిని పార్టీలోకి తీసుకురావడంలో ఎంపీ కవిత కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ విషయమై పలుమార్లు సురేశ్‌రెడ్డితో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు సురేశ్‌రెడ్డి పార్టీని వీడుతున్న విషయం పసిగట్టిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం రాత్రి సురేశ్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. ఏదైనా ఉంటే మాట్లాడుకుందామని, పార్టీని వీడవద్దని బుజ్జగించినట్లు సమాచారం. సురేశ్‌రెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో జిల్లా కాంగ్రెస్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. తన నియోజకవర్గం బోధన్‌లో శుక్రవారం కార్యక్రమాలను రద్దు చేసుకున్న మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ తరలివెళ్లారు. అలాగే డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బిన్ హందాన్, పీసీసీ నేత గడుగు గంగాధర్ కూడా శుక్రవారం పీసీసీ సమావేశానికి హాజరయ్యారు. -
చీరలెలా ఉన్నాయ్..
భీమ్‌గల్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ పథకం అభాసుపాలు కాకుండా ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. గత ఏడాది ఈ చీరల పంపిణీ వివాదాస్పదమైంది. నాణ్యత కొరవడిన చీరలను పంపిణీ చేసారని, చౌకబారు చీరలతో మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచారని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా నిరసనలు వెల్లువెత్తాయి. కొన్ని చోట్ల చీరలను తగుల బెట్టడం, ప్రతిపక్షాలు వీటిపై విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున దుమారం రేపిన నేపథ్యంలో ఈ ఏడు ఎటువంటి ఆరోపణలు రాకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. పైగా ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు అవకాశమివ్వకూడదని జాగ్రత్తగా పథక నిర్వహణ చేపట్టనుంది. ముందు జాగ్రత్త చర్యగా జిల్లా వ్యాప్తం గా అన్ని మండలాలలో బతుకమ్మ చీరలను ఐదు రోజుల పాటు ప్రదర్శనకు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో అన్ని మండలాలలో చీరలపై మహిళల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ప్రతి మండలంలో ఐదు చోట్ల వీటిని ఉంచి తద్వారా వాటిపై మహిళల అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. మహిళలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకుగాను ప్రతి చోట ఒక రిజిస్టర్‌ను ఏర్పాటు చేసారు. చీరలను పరిశీలించిన వారు అభిప్రాయాలను, పేరు, ఫోన్ నెంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మహిళా సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి చీరల ప్రదర్శన నిర్వహించి అభిప్రాయచాలు కోరతున్నారు. ఇందు కోసం ఈ నెల 5 నుంచి 10 వరకు గడువు నిర్ణయించింది. 10వ తేదీ అనంతరం మండలాలవారీగా మహిళలు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై రాండమ్‌గా ఫీడ్‌బ్యాక్‌ను పైఅధికారులకు పంపిస్తారు. దీని ఆధారంగా చీరల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశముంది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రేషన్ కార్డులో పేరుండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు చీరలు అందజేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. ఇవి కేవలం మహిళల అభిప్రాయం కోసం తీసుకువచ్చిన శాంపిల్ చీరలు మాత్రమే. ఇంకా బతుకమ్మ చీరలు రాలేదు. గత సంవత్సరం జిల్లాకు 5 లక్షల 13 వేల 739 చీరలు వచ్చాయి. అందులో 46 వేల చీరలు మిగలగా వాటిని తిరిగి పంపించాం. ఈ సంవత్సరం మరో రెండు శాతం పెరిగి ఉండచ్చు. – శ్రీనివాస్ డీపీఎం, ఐకేపీ కానుకలకు వెల కట్టవద్దు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ కానుకగా ఈ చీరలను అందిస్తోంది. ఇది ఆడపడుచుకు పుట్టింటి వారు ఇచ్చే కానుకగా భావించాలి. దీనికి వెల కట్టడం మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచడమే అవుతుంది. ప్రతి పక్షాలు ప్రతీది రాజకీయం చేసి ప్రజల్లో దిగజారిపోయాయి. ఈ బతుకమ్మ కానుకలు ఎంపీ కవితమ్మ కలల ప్రాజెక్టు. సగటు మహిళల ఆలోచనలకు ఆమె ప్రతిరూపం. – వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే, బాల్కొండ -
సేవలకు సత్కారం
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం విద్యా బోధనలో ఉత్తమ సేవలందిం చిన 25 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ విగంగాధర్ గౌడ్ మాట్లాడుతూ రెండేళ్లలో 574 రెసిడెన్సియల్ పాఠశాలలను ప్రారంభించామన్నారు. కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రభు త్వం పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఉపాధ్యాయ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించింది. నగరంలోని న్యూ అంబేద్కర్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో బోధించడం వల్ల డ్రాపౌట్స్ తగ్గి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. రెండేళ్లలో 574 రెసిడెన్సియల్ పాఠశాలలను ప్రారంభించామన్నారు. విదేశాల్లో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం రూ.20 లక్షల విద్యానిధి కింద అందజేస్తుందన్నారు. తల్లిదండ్రులే మొదటి దేవుళ్లని, ఆ తర్వాత స్థానం గురువుకు దక్కుతుందని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు అన్నారు. జిల్లా పదోతరగతి ఫలితాల్లో గతేడాది రాష్ట్రంలో నాలుగో స్థానం సాధించగా, అంతకు ముందు 6వ స్థానం వచ్చిందని తెలిపారు. ఈ సంవత్సరం మరింత కృషి చేసి జిల్లాను ప్రథమస్థానంలో నిలబెట్టడానికి ఉపాధ్యాయులు, ప్రధా నోపాధ్యాయులు పాటుపడాలన్నారు. జాతీయస్థాయిలో బోర్గాం పాఠశాలను తీర్చిదిద్ది అవార్డు అందుకుంటున్న హెచ్ఎం రామారావును మిగతా ప్రధానోపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పింస్తోందన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నభోజనం, దుస్తులు, పుస్తకాలు విద్యార్థులకు సమకూరుస్తున్నామని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు బోధన అందించాలని పేర్కొన్నారు. తల్లిదండ్రుల కోరికలకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మెరుగైన ఫలితాలకు ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నామన్నారు. మరోవైపు మాతృభాషను మరువకుండా విద్యార్థులకు తర్ఫీదునివ్వాలని సూచించారు. చదువుతోపాటు విద్యార్థులకు మంచి అలవాట్లు, క్రమశిక్షణ కూడా నేర్పాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి విద్యార్థి కనీససం ఆరు మొక్కలు నాటేలా చూడాలని, హరిత పాఠశాలలుగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గురువులంటే ఎంతో గౌరవమని, వారు ఎక్కడ కన్పించినా పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకుంటానని నగర మేయర్ ఆకుల సుజాత అన్నారు. కార్యక్రమంలో డీఈఓ నాంపల్లి రాజేష్, డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బీసీడీఓ శకుంతల, డీసీఈబీ కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇల్తెపు శంకర్, మోహన్‌రెడ్డి, రాజ్‌గంగారెడ్డి, సత్యానంద్, ఓ రమేష్, బీసీటీయూ వినోద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తు అభ్యర్థులు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నట్లుగానే అధికార టీఆర్ఎస్ పార్టీలోనూ అభ్యర్థిత్వాలపై ముందస్తుగా స్పష్టత వస్తోంది. ఈసారి ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ మరో సారి బరిలో ఉంటారని మంత్రి కేటీఆర్ మంగళవారం తెలంగాణ భవన్లో ప్రకటించారు. దీంతో గంప అనుచరవర్గంలో ఉత్సాహం నింపినట్లయ్యింది. మరోవైపు బాన్సువాడ నియోజకవర్గం నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించుకున్నా రు. ఈ ఎన్నికల్లో తన ముగ్గురు కుమారుల్లో ఎవరో ఒకరు పోటీ చేస్తారనే ప్రచా రానికి తెరదించుతూ తానే బరిలో ఉంటా నని స్పష్టం చేశారు. నిజామాబాద్ పార్ల మెంట్ స్థానం పరి«ధిలోకి వచ్చే జగిత్యాల నియోజకవర్గం టిక్కెట్టును కూడా ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సంజయ్‌కుమార్ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్న నేపథ్యంలో టిక్కెట్ల ప్రకటనలు ఆ పార్టీ వర్గాల్లో జోష్‌ను నింపుతున్నాయి. మరోవైపు ఆయా స్థానాల నుంచి టిక్కెట్టు ఆశిస్తున్న ఆశావహులకు నిరాశే ఎదురవుతోంది. సెప్టెంబర్‌లోనే మొదటి లిస్టు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తామని అధినేత కేసీఆర్ పలుమార్లు స్పష్టం చేస్తూ వచ్చారు. ఎమ్మెల్యేల పనితీరుపై నెలవారీగా సర్వేలు చేయించిన కేసీఆర్ ఆయా ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. కాగా మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో నాలుగు లేదా ఐదు నియో జకవర్గాలకు మొదటి జాబితాలో చోటు దక్కుతుందని అందరూ భావిస్తున్నారు. అధినేత ప్రకటించినట్లుగానే ఈ నెలలోనే జాబితాను ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే ముం దస్తుగానే అభ్యర్థుల విషయంలో స్పష్టత వస్తుండటం గమనార్హం. అధినేత కేసీఆర్ ప్రకటించే జాబితాలో పేర్లు ఉంటేనే ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్ ప్రకటించి ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఎన్నికల్లో తొలి అభ్యర్థిత్వం జిల్లా నుంచే.. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పో టీ చేసే అభ్యర్థుల ప్రకటనను సీఎం కేసీఆర్ జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలి అభ్యర్థిత్వాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌రెడ్డి పేరును ప్రకటించారు. ఆదిలాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన కేసీఆర్ ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి నివాసంలో ఆగి ఈ మేరకు ప్రకటన చేశారు. ఈసారి కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల అభ్యర్థిత్వాలు ఖరారు కావడం గమనార్హం. -
బాలికల నిష్పత్తి పెంచాలి
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): బాలికల లింగ నిష్పత్తిని పెంపొందించడం, వారిపై వివక్షను నిరోధించే బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. మంగళవారం తన చాంబర్లో బేటీ బచావో పథకం జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికల లింగ నిష్పత్తి తగ్గడానికి మహిళలకు స్వయం సాధికారత లేకపోవడం ఒక కారణమన్నారు. ఆడపిల్ల పుట్టిన తరువాత పౌష్టికాహారం, విద్యను అందించడంలో వివక్ష చూపుతున్నారని అన్నారు. సామాజిక రు గ్మతలు, లింగ నిర్ధారణ స్కానింగ్ సెంట ర్లు కూడా బాలికల నిష్పత్తి తగ్గడానికి కార ణాలు అవుతున్నాయని అన్నారు. 2011 సంవత్సరం జనాభా ప్రకారంగా వెయ్యి మంది పురుషులకు గాను 918 మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు. బాలికల నిష్పత్తిని పెంపొందించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని, అందుకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు తమవంతుగా కృషి చేయాలన్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నప్పటికీ బాలికల దశలో తక్కువగా ఉన్నారన్నారు. నిష్పత్తి సమానం కావాలంటే మహిళలు విద్య పరంగా ఎదగాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 950 నిష్పత్తి కంటే తక్కువగా ఉన్న 640 జిల్లాలను ఎంపిక చేసిందన్నారు. అందులో మన జిల్లా 945 నిష్పత్తితో ఉన్నట్లు వివరించారు. లింగ వివక్షను తగ్గించడానికి కొత్త పెళ్లి జంటలు, గర్భిణులు, తల్లులు, యువతీ యువకులు, వైద్యులు, డయాగ్నోసిస్ సెంటర్ల నిర్వహకులకు అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. అవగాహన ప్రచార సామగ్రి, విద్య, వైద్యం, ఇతర అంశాలను చేపట్టేందుకు రూ.50 లక్షలతో ప్రణాళికను టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ స్రవంతి, రవీందర్, డీఈఓ రాజేశ్, డీఎంఅడ్‌హెచ్‌ఓ సుదర్శనం, డీపీఓ కృష్ణమూర్తి, ఆయా శాఖల అధికారులు, స్వ చ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఘనంగా డోలోత్సవం మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనర్సింహుడి ఆలయంలో మంగళవారం కృష్ణాష్టమి సందర్భంగా డోలోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రభాతభేరి అనంతరం స్వామివారికి అభిషేకం చేసి డోలోత్సవ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయ కార్య నిర్వాహణాధికారి ప్రభు, అర్చకులు శ్రీనివాసచార్యులు, నర్సింహాచార్యులు, పరందామచార్యులు, సిబ్బంది సంతోష్, బాలయ్య, రమేశ్ ఉన్నారు. -
పేలిన సిలిండర్
నందిపేట్(ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రం బస్టాండు సమీపంలో మంగళవారం సాయంత్రం సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధాన రోడ్డున గల ఆరు దుకాణాలు (కోకాలు) పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ. 30 లక్షల వరకు ఆస్తినష్టం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చిన్న సిలిండర్లు విక్రయించుకునే బుక లింబాద్రి డొమెస్టిక్ సిలిండర్ నుంచి చిన్న సిలిండర్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు రేగాయి. దీంతో ఆయ న బయటకు పరుగులు తీశాడు. ఆయనను చూసి పక్క దుకాణాల యజమానులు సైతం పరుగులు పెట్టి బయటకు వచ్చారు. కొద్దిసేపట్లోనే పెద్ద శబ్ధంతో సిలిండర్‌పేలి పక్కనున్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. అదే సమయంలో గాలి వీయడం, చుట్టుపక్కల ఎలాంటి నీటి సౌకర్యం లేకపోవడంతో ఆరు దుకాణాలకు మంటలు వ్యాపించాయి. దుకా ణ యజమానులు తమ దుకాణాలలో గల సామగ్రిని కాపాడుకునేందుకు బయటకు విసి రేశారు. ఫైర్ ఇంజనుకు ఫోన్ చేసినా సమాయానికి రాలేకపోవడంతో మంటలు ఉధృతమయ్యాయి. దీంతో స్థానికులు జేసీబీ సహాయంతో మంటలు అంటుకున్న దుకాణాలను పక్కకు తొలగించారు. ఇతర దుకాణాలకు మంటలు అంటకుండా ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో సిలిండర్ దుకాణంతో పాటు చెప్పుల దుకాణం, కిరాణ షాఫు, పెస్టిసైడ్, బట్టల దుకాణం, పూల దుకాణం మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఇందులో బిల్ల నారాయణ అనే వ్యక్తికి సంబంధించిన కిరాణం, రాంబాబుకు చెందిన పెస్టిసైడ్, ఇతరుల చెప్పులు, బట్టల దాకాణాల్లో రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ. 30లక్షల విలువ చేసే సామగ్రి కాలిపోయిందని బాధితులు వాపోయారు. అగ్రి ప్రమాదం సాయత్రం 5.15 గంటలకు జరుగగా సుమారు గంట ఆలస్యంగా అగ్ని మాపక సిబ్బంది వచ్చారు. వారు సకాలంలో వచ్చి ఉంటే నష్టం అంతగా జరిగేది కాదని స్థానికులు పేర్కొన్నారు. -
ఎవరికో.. పొత్తు ముప్పు !
పొత్తులో భాగంగా జిల్లాలో టీడీపీకి కేటాయించే అవకాశాలున్న సీటుతో కాంగ్రెస్‌లో ఎవరి స్థానం గల్లంతవుతుందోననే అంశం తెరపైకి వస్తోంది. కాంగ్రెస్‌లో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. టీడీపీతో జతకట్టడం ద్వారా జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన ఆ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందే తప్ప., కాంగ్రెస్‌కు పెద్దగా ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: అధికార పార్టీ టీఆర్ఎస్ను ఢీ కొనేందుకు బీజేపేతర ప్రతిపక్ష పార్టీలు జట్టు కట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ పొత్తులో భాగం గా జిల్లాలో టీడీపీకి కేటాయించే అవకాశాలున్న సీటుతో కాంగ్రెస్‌లో ఎవరి స్థానం గల్లంతవుతుందనే అంశం తెరపైకి వస్తోంది. ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు ఆస క్తి చూపుతున్న కాంగ్రెస్‌లోని ఎవరి ఆశలు నీరుగారుతాయో అన్న చర్చకు దారితీ స్తోంది. కాంగ్రెస్‌తో జతకట్టనున్న సీపీఐ, సీపీఎంలు ఉమ్మడి జిల్లాలో ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తున్నప్పటికీ ఎన్నికల విషయానికి వస్తే గట్టి పోటీని ఇచ్చే స్థాయి లో లేవు. మరోవైపు తెలంగాణ జన సమి తి కూడా ఇంకా పుంజుకున్న దాఖలాల్లేవు. ఇస్తే టీడీపీకి ఒక సీటు కేటాయించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తు న్నాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ ఒక స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఒక్కో నియోజకవర్గంలో టిక్కెట్ కో సం ఇద్దరు, ముగ్గురు పోటీ ప డుతున్నారు. ఈ తరుణంలో తమ సీటు పొత్తులో గల్లంతైతే తమ పరిస్థితి ఏంటని ఆశావహుల్లో ఆందోళన షురువైంది. బాల్కొండ నుంచి బరిలోకి..! ప్రస్తుతం జిల్లాలో టీడీపీ కేడర్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు వంటి ఒకరిద్దరు నేతలు మాత్రమే మిగిలారు. గత కొంత కాలంగా వీరిద్దరు కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నిక ల్లో పోటీ చేసేందుకు మండవ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి మాత్రం బాల్కొండ నుంచి బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారు. గత ఎన్నిక ల్లో కూడా ఆయన ఇక్కడి నుంచే పోటీ చేశారు. పొత్తులో భాగంగా బాల్కొండ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తే.. ఈ స్థానంపై ఆశలు పెట్టుకు న్న కాం గ్రెస్ నేత ఈరవత్రి అనీల్ పరిస్థితి ఏంటనే అంశం తెరపైకి వస్తోంది. ఇప్పటికే బాల్కొండపై ఈరవత్రితో పాటు, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి కూడా కన్నేశారు. ఈసారి ఆర్మూర్ నుం చి కాకుండా, బా ల్కొండ నుంచే బరిలోకి దిగే యోచనలో ఉన్నట్లు ఆయన అనుచర వర్గం పేర్కొంటోంది. ఈ తరుణంలో బాల్కొండ స్థానం పొత్తులో గల్లంతైతే ఇక్కడి ఇద్దరు కాంగ్రెస్ ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లు కానుంది. మరోవైపు అన్నపూర్ణమ్మ తన కు మారుడితో కలిసి కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయి. ఇప్పటికే జానారెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అభ్యర్థిత్వంపై స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఇంకా వేచి చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. మల్లికార్జున్‌రెడ్డి మాత్రం టీడీపీ నుంచి పోటీ చేసేందుకు అంతగా ఆసక్తిగా లేరని అనుచరులు పే ర్కొంటున్నారు. అభ్యర్థిత్వంపై హామీ లభిస్తే కాంగ్రెస్‌లో చేరి బాల్కొండ నుంచి బరిలో ఉండే అవకాశాలున్నాయి. టీడీపీతో జతకట్ట డం ద్వారా జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన ఆ పార్టీకి ప్రయోజనం చేకూరుతుం దే తప్ప కాంగ్రెస్‌కు పెద్దగా ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల వరకు మహాకూటమి పొత్తు తో జిల్లాలో రాజకీయ సమీకరణలు భారీగా మారుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
అభివృద్ధికి నోచని ఆలయం
సదాశివనగర్(ఎల్లారెడ్డి) : అదో పురాతన ఆలయం.. 256 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రభుస్వా మి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. దగ్గి గ్రామంలో కోరిన కోర్కెలు తీర్చే స్వామి గా భక్తుల విశ్వాసం పొందిన ప్రభుస్వామి ఆలయం ఇప్పటివరకూ అభివృద్ధికి నోచలేదు. గుట్టపై కొలువదీరిన స్వామి వారిని దర్శించు కోవడానికి ఉమ్మడి జిల్లాల నుంచే కర్ణాటక, మ హారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వస్తారు. ప్రతి మాఘ అమావాస్య రోజున నిర్వహించే జాతర ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తు లు మొక్కులు చెల్లించుకుంటారు. తుక్కోజివాడి గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన దగ్గి.. ప్రస్తుతం గ్రామపంచాయతీగా ఏర్పాటైంది. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు కావడంతో ఇప్పటికైనా ఆలయం అభివృద్ధి జరుగుతుందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయానికి కనీస వసతులు లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. శివుని 101 అవతారాల్లో ప్రభుస్వామి అవతారం ఒకటని, ఏకనాథ అవతారమని.. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఆల యం ఈ ప్రాంతంలో ఎక్కడా లేదని భక్తులు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆలయ అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ముప్పై ఏళ్ల నుంచి నిత్య పూజలు.. ప్రభుస్వామి ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. భక్తుల కోర్కెలు తీర్చే భగవంతుడిగా ప్రభుస్వామి పేరొందారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. ముప్పై ఏళ్ల నాటి నుంచి ఈ గుట్ట మీదికి వచ్చి నిత్య పూజలు చేస్తున్నా. – పాపయ్య, ఆలయ అర్చకుడు -
లంబాడి భాషకు లిపి
ఇందల్వాయి : గిరిజన తెగలలో ఒకటైన లంబాడీలకు మాట్లాడటానికి భాషా ఉన్నా రాయడానికి సరైన లిపి లేదు. దీని పర్యావసనంగా లంబాడి భాషా, సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని భావించిన ఓ గిరిజన యువకుడు.. తమ భాష మీద ప్రేమ, తమ సం స్కృతిపై మమకారంతో ప్రత్యేక లిపి రూపొందించాడు. తండ్రి ప్రోత్సాహంతో ఆరు సంవత్సరాలు గా ఇతర భాషల లిపిలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అకుంఠిత దీక్షతో చివరకు ఎలాంటి లోపాలు లేని 50 అక్షరాలతో కూడిన లిపిని లంబాడి భాష కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేశాడు. అతడే ఇందల్వాయి మండలంలోని స్టేషన్ తండా గ్రామ పంచాయతీకి చెందిన జగత్ సింగ్ పవార్. డిగ్రీ వరకు చదువుకున్న జగత్సింగ్.. లిపి లేని ఎన్నో భాషలు అంతరించి పోతున్నాయని గుర్తించి, లంబాడి భాషా కూడా అలా అంతరించి పోకుండా కాపాడేందుకు పూనుకున్నాడు. తండ్రి నూర్సింగ్ పవార్, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ప్రత్యేక లిపిని తయారు చేసేందుకు సిద్ధమయ్యాడు. శోధించి.. సాధించి.. దేశంలో 10 శాతం జనాభా ఉన్న లంబాడీలకు ప్రత్యేక లిపి లేక ఇతర భాషలపై ఆధారపడాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో లంబాడి భాషకు ప్రత్యేక లిపి అవసరమని జగత్సింగ్ లిపి రూపకల్పనకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం దేవనాగరి, హిందీ తదితర ప్రాచీన భాష ప్రావీణ్య పుస్తకాల నుంచి ఆధారాలు సేకరించాడు. అలాగే, భాషా పండితుల ఆత్మకథలను చదివి, పలువురు భాషా పండితుల సూచనలు తీసుకొని అహర్నిషలు శ్రమించి చివరికి ఇతర భాషాల లిపిలతో పోలిక లేని విధగా లంబాడి భాషా లిపికి రూపకల్పన చేశాడు. 13 అచ్చులు.. 37 హల్లులు.. జగత్సింగ్ రూపొందించిన లంబాడి భాష లిపిలో 13 అచ్చులు, 37 హల్లులు ఉన్నాయి. వీటికి వొత్తు లు కూడా ఉన్నాయని, వీటి ఆధారంగా మహాభారతంలోని కొన్ని శ్లోకాలు కూడా రాశానని జగత్ సింగ్ తెలిపాడు. ఈ లిపితో లంబాడి భాషలో మాట్లాడే ఏ పదాన్నైనా సులభంగా రాయవచ్చని అతడు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ లిపిని ప్రభుత్వం గుర్తించి, లిపిలో మరింత పరిపక్వత సాధించేందుకు ప్రోత్సహించాలని కోరుతున్నాడు. లంబాడ యువత ఈ లిపిని ఆదరించాలని, ఆసక్తి ఉన్న వారికి అవగాహన, శిక్షణ ఇస్తానంటున్నాడు జగత్సింగ్. ఈ లిపితో తమ భాషా, సంస్కృతి, సంప్రదాయాలు కలకాలం ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. లిపిపై ఆసక్తి ఉన్న వారు ఫోన్ నెం.83281 72129లో సంప్రదించాలని కోరాడు. -
రాజీనామా చేయను.. మీరే సస్పెండ్ చేయండి
సాక్షి, నిజామాబాద్: తాను టీఆర్ఎస్కు రాజీనామా చేయనని, కావాలంటే సస్పెండ్ చేయాలని టీఆర్ఎస్ అధిష్టానాన్ని రాజ్యసభ ఎంపీ డీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘నేను రాజీనామా చేసి పార్టీని వదిలి వెళ్తే మీరు చేసిన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లు అవుతుంది. నన్ను సస్పెండ్ చేయడం చేతకాకపోతే తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని సూచించారు. తనను రాజకీయంగా దెబ్బ తీశారని, నా కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చారు. లేనిపోనివన్నీ కల్పించి జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి నా కుమారుడు సంజయ్‌పై కేసు పెట్టించార’ని ఆరోపించారు. హైకోర్టు 41ఏ నోటీసు ఇచ్చినా ఆ ఆర్డర్లు పట్టించుకోకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించారు. ఇందులో ప్రభుత్వం ఎంత ఆసక్తి తీసుకుందో అందరికీ అర్ధమవుతోందని, తనపై నిరాధార ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశానో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు ఎక్కడ పార్టీని బలహీన పరిచానో నిరూపించాలని కోరారు. తాను బీజేపీకి ఎలా ఉపయోగపడ్డానో, బీజేపీకి తన సహచరులను ఎవరిని పంపానో చూపించాలని పేర్కొన్నారు. తాను టీఆర్ఎస్లో ఉండటం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, ఎంపీ కవితకు ఇష్టం లేకపోతే దయచేసి తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో ఎదిగిన కుమారులు స్వతంత్రంగా జీవిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా ఇంట్లోనే కాదు అందరి ఇళ్లల్లోనూ జరిగేది కూడా అదే. నా రెండో కుమారుడు అరవింద్ బీజేపీలో చేరడం అతని స్వీయ నిర్ణయం. నా ప్రమేయం లేదు అయినా నేను ఏమీ చేయలేని పరిస్థితి. కేసీఆర్‌కి ముందే రెండుసార్లు చెప్పాను. నా కుమారుడు అరవింద్ మోడీ అభిమాని అని. గతంలోనే కాలినడకన వెళ్లి బీజేపీలో చేరే ప్రయత్నం చేశాడు. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణతో మెలిగాను. పార్టీని మోసం చేయడం నాకు తెలియదు. తెలంగాణ పట్ల నాకు ఉన్న ప్రేమ నిబద్దతను ఎవరూ ప్రశ్నించలేరు. అలాంటి నాపై లేనిపోని అభాండాలు మోపి నన్నో పార్టీ వ్యతిరేకిగా ముద్ర వేశారు. మనసులో ఏదో పెట్టుకొని నిరాధారమైన, నిజాయితీ లేని ఆరోపణలు చేస్తూ నన్ను రాజకీయంగా దెబ్బ తీయాలని చూస్తున్నా’ ని వ్యాఖ్యానించారు. నాపై చర్యల విషయంలో టీఆర్ఎస్కు డెడ్‌లైన్ ఇవ్వను కానీ సమయం, సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని.. ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నానని తెలిపారు. సస్పెండ్ చేయాలి లేదా తీర్మానం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
గ్రీన్ హైవే.. టెన్షన్
మోర్తాడ్(బాల్కొండ): గ్రీన్ హైవే నిర్మాణం ఏమో కానీ, రైతుల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఉన్న భూములు పోతే ఇక ఏం చేసుకుని బతికేదనే ఆందోళన అన్నదాతల్లో నెలకొంది. ముప్కాల్ మండలంలోని వేంపల్లి మీదుగా వెళ్లే 44వ జాతీయ రహదారి నుంచి మంచిర్యాల వరకు గ్రీన్ హైవే నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బోధన్ నుంచి జగదల్పూర్ వరకు 63వ జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా మార్చాలని కేంద్రం తొలుత యోచించింది. అయితే, పెద్ద మొత్తంలో ఇళ్లు, చెట్లు, వ్యవసాయ భూములకు నష్టం కలగనుంది. అంతేకాక మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన పైప్లైన్లకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఈ నేపథ్యంలో అన్ని కష్ట నష్టాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. సరికొత్త రహదారికి శ్రీకారం చుట్టింది. రైతులకు తీరని నష్టం.. ప్రస్తుతం ఉన్న 63వ జాతీయ రహదారిని విస్తరించడానికి బదులు మరో మార్గంలో కొత్త హైవేను నిర్మిస్తే తక్కువ నష్టంతో సరిపెట్టవచ్చని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. దీంతో వేంపల్లి నుంచి మంచిర్యాల వరకు 125 కిలోమీటర్ల పొడవున కొత్త రహదారిని నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ మేరకు సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. అయితే, కొత్తగా నిర్మించనున్న ఈ మార్గంలో చేసిన సర్వే ప్రకారం.. మన జిల్లాకు సంబంధించి వందలాది ఎకరాల భూముల్లోంచి ఈ కొత్త రోడ్డు నిర్మించనున్నారు. వేంపల్లి, రెంజర్ల, శెట్పల్లి, తొర్తి, తిమ్మాపూర్, ఏర్గట్ల గ్రామాలకు చెందిన రైతులు విలువైన పంట భూములు కోల్పోనున్నారు. త్వరలోనే నోటిఫికేషన్..! గ్రీన్ హైవే నిర్మాణంలో భాగంగా రోడ్డు నిర్మాణంలో భాగంగా నష్టపోయే చెట్ల స్థానంలో అధిక సంఖ్యలో మొక్కలను నాటడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు, హైవే నిర్మాణానికి సంబంధించిన సర్వే కూడా పూర్తికావడంతో త్వరలోనే భూ సేకరణకు నోటిఫికేషన్‌ను జారీ అయ్యే అవకాశం ఉంది. గ్రీన్ హైవే నిర్మాణానికి సేకరించే భూమికి నష్ట పరిహారం అందించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పరిశీలించనుంది. ఆందోళనలో రైతులు.. అయితే, రహదారి నిర్మాణం కోసం విలువైన భూములు కోల్పోతున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి ఆ భూములను నమ్ముకుని బతుకుతున్నామని, జీవనాధారమైన భూములు కోల్పోతే ఏం చేసుకుని బతకాలని వాపోతున్నా రు. నష్ట పరిహారం తమకు ముఖ్యం కాదని, కో ల్పోతున్న భూములకు బదులు భూములు ఇవ్వా లని రైతులు చెబుతున్నారు. తరతరాల నుంచి చేస్తున్న వ్యవసాయ భూములను కోల్పోవడం వ ల్ల భారీ మొత్తంలో నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ మార్గం చూడాలని రైతులు కోరుతున్నారు. అయి తే, రహదారి నిర్మాణాలకు సహకరించాలని నేషన ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదాల నివారణ, రవాణా సదుపాయం కోసం జాతీయ రహదారుల నిర్మా ణం, విస్తరణ కీలకమైదని వారు చెబుతున్నారు. -
కదిలింది గులాబీ దండు
నిజామాబాద్‌అర్బన్: దారులన్నీ అటు వైపే.. వాహనాలన్నీ ‘ప్రగతి’ సభ వైపే.. దీంతో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ బిజీబిజీగా కనిపించాయి. గులాబీ జెండాల రెపరెపలతో సందడిగా మారాయి. టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా కంగరకొలాన్లో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభకు ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివెళ్లారు. వందలాది వాహనాల్లో వారంతా తరలి వెళ్లడంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసి పోయాయి. 1.10 లక్షల మంది తరలింపు.. ప్రగతి నివేదన సభకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి సుమారు 1.10 లక్షల మంది తరలి వెళ్లినట్లు అంచనా. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు 53 వేల మంది సభకు వెళ్లారు. ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులతో పాటు ఇతర వాహనాల్లో ఉదయం నుంచే బయల్దేరి వెళ్లారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యలు, రాష్ట్ర నాయకులు జన సమీకరణ చేపట్టారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి 88 ఆర్టీసీ బస్సులు, 90 ప్రైవేట్ బస్సులు, 240 వరకు కార్లలో 8,700 మంది వరకు తరలివెళ్లారు. బాల్కొండ నుంచి 687 వాహనాల్లో 12,465 మంది, బోధన్ నుంచి 450 వాహనాల్లో 9,700 మంది, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో 425 వాహనాల్లో 11,400 మంది, ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో 750 వాహనాల్లో 12,500 మందిని తరలించారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి 16 వేలు, బాన్సువాడ నుంచి 12 వేలు, ఎల్లారెడ్డి నుంచి 12 వేలు, జుక్కల్ నుంచి 11 వేల మంది వరకు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులతో పాటు అద్దె వాహనాల్లో తరలి వెళ్లారు. మొత్తం కామారెడ్డి జిల్లా నుంచి 51 వేల మంది వరకు ప్రగతి నివేదన సభకు బయల్దేరి వెళ్లారు. రహదారులన్నీ గులాబీమయం.. జన సమీకరణ బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీంతో ఎమ్మెల్యేలు రెండు, మూడ్రోజులుగా తమ నియోజకవర్గాల్లోనే తిష్టవేసి జన సమీకరణకు సర్వశక్తులు ఒడ్డారు. జనాన్ని తరలించేందుకు అవసరమైన వాహనాలను సమకూర్చారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 508 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. అలాగే, ప్రైవేట్ వాహనాలు, ట్రాక్టర్లు, సుమోలు అద్దెకు తీసుకుని జనాలను తరలించారు. 44వ జాతీయ రహదారి గులాబీమయంగా మారింది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వాహనాలతో హైవే కిక్కిరిసింది. మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రధాన ప్రాంతాలతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద సీపీ కార్తికేయ ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షించారు. హైవేతో పాటు జిల్లాకు అనుసంధామున్న రాష్ట్ర రహదారులు, వివిధ మండలాల నుంచి జిల్లాకు.. అక్కడి నుంచి జాతీయ రహదారికి వెళ్లేందుకు రూట్‌మ్యాప్‌ను రూపొందించారు. ఒక్కో ప్రధాన ప్రాంతం వద్ద సీఐ స్థాయి అధికారి, ట్రాఫిక్ పోలీసులను నియమించారు. -
జ్ఞాపకాల తడి
సాక్షి, కామారెడ్డి: మహానేత మనల్ని వదిలి తొమ్మిదేళ్లు గడిచాయి. కానీ ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ అందరి హృదయాల్లో పదిలంగా ఉన్నాయి. వైఎస్సార్ అన్న పేరు వినిపిస్తే చాలు ఆయన అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఒక్కసారిగా కళ్ల ముందు కదలాడుతాయి. ప్రతిపక్ష నేతగా జిల్లాలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను కళ్లారా చూసిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపి అందరి హృదయాలను చూరగొన్నారు. అంతేకాదు ఈ ప్రాంత ప్రజల సాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రాణహిత–చేవెళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజు మొదలైన పనులు ఇప్పుడిప్పుడూ ఓ కొలిక్కి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో పనులు పూర్తయి రైతుల కష్టాలు తీరనున్నాయి. నేడు వైఎస్ వర్ధంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కామారెడ్డి జిల్లా అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది దుబాయ్ వలసలు, రైతుల ఆత్మహత్యలు. సాగునీటి కోసం బోర్లు తవ్వించి అప్పుల పాలై ఆత్మహత్యల బాట పట్టిన రైతుల కుటుంబాలను.. పాదయాత్ర సందర్భంగా పరామర్శించిన వైఎస్సార్ రైతు కుటుంబాలను చూసి చలించి పోయారు. ఆత్మహత్యలకు సాగునీటి సమస్యే కారణమని గుర్తించారు. ఆ కుటుంబాల కన్నీళ్లు తుడవాలంటే సాగునీరు అందించాలని ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సర్వేలు చేయించి ప్రాణహిత–చేవెళ్ల పథకానికి జీవం పోసిన ఆయన.. ఈ పథకానికి శంకుస్థాపన కూడా చేశారు. 22వ ప్యాకేజీలో కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ల తో పాటు మెదక్ జిల్లాలోని కొన్ని మండలాల్లో కలిపి 1.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు గాను రూ.1446 కోట్లు మంజూరు చేశారు. దీంతో అప్పట్లోనే భూంపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టారు. కాలువల తవ్వకం పనులు కూడా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ప్రాజెక్టులను రీడిజైన్ పేరుతో పనులు ఆపేశారు. దీంతో కొన్నాళ్లపాటు పనులు ఆగిపోయాయి. అన్ని రకాల పరిశీలన అనంతరం 22వ ప్యాకేజీని అలాగే కొనసాగించాలని నిర్ణయించా రు. అదనంగా 44 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం భూంపల్లి రిజర్వాయర్ పనులు చివరి దశలో ఉన్నాయి. కాలువల తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. భూంపల్లి రిజర్వాయర్ ద్వారా రైట్ కెనాల్, లెఫ్ట్‌కెనాల్, రిడ్జ్ కెనాల్స్ ద్వారా ఆయా ప్రాంతాలకు సాగునీటిని అందిస్తారు. కామారెడ్డి ప్రజల దాహార్తి తీర్చిన భగీరథుడు గుక్కెడు తాగునీటికి అనేక కష్టాలు పడ్డ కామారెడ్డి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చిన అపర భగీరథుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ప్రజలు గుర్తుకు చేసుకుంటారు. కామారెడ్డి పట్టణంతో పాటు వందకు పైగా గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని వైఎస్ మంత్రివర్గం లో పని చేసిన ప్రస్తుత శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ కోరిన వెంటనే రూ.140 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని కామారెడ్డి ప్రాంతానికి అందించేందుకు పనులు చేపట్టారు. తరువాత మరో రూ.66 కోట్లు మంజూరు చేసి పనులు నిర్వహించారు. ఈ పథకం ద్వారానే ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలో ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు. గోదావరి నీరు ఇప్పుడు ప్రతీ ఇంటికి అందుతున్నాయి. అభివృద్ధిలో ప్రత్యేక ముద్ర.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా కామారెడ్డి జిల్లాకు పలుమార్లు వచ్చారు. కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాల్లో పలుమార్లు పర్యటించారు. ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు అందించగానే పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధికి కృషి చేశారు. జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణకు భారీగా నిధులు మంజూరు చేశారు. సాగు నీటి రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అలాగే రోడ్ల అభివృద్దికి కృషి చేశారు. రాజన్నను మరువని జిల్లా ప్రజలు.. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఫించన్లు, 108 అంబులెన్సులు వంటి పథకాలను అందించిన దివంగత సీఎం వైఎస్సార్‌ను ప్రజలు మరిచిపోరు. వైఎస్సార్ అందించిన పథకాలను ఇప్పటికీ చాలా మంది నెమరువేసుకుంటున్నారు. అలాగే లబ్దిపొందిన ఎంతో మంది నిత్యం వైఎస్సార్‌ను తలచుకుంటారు. ప్రధానంగాయ ఆరోగ్యశ్రీతో ఆపరేషన్లు చేయించుకుని పునర్జన్మ పొందిన ఎంతో మంది వైఎస్సార్‌కు తమ గుండెలో గుడికట్టుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుతో తమ బిడ్డలు ఉన్నత చదువులు చదివారంటూ చాలా మంది తల్లిదండ్రులు వైఎస్సార్‌ను గుర్తు చేసుకుని ఆయన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. -
దండిగ కదిలె.. గులాబీబండ్లు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన బహిరంగసభకు భారీగా తరలివెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ వద్ద జరగనున్న ఈ సభకు పార్టీ శ్రేణులు, జనాలను తరలిస్తున్నారు. నియోజకవర్గం నుంచి 20 వేల చొప్పున జన సమీకరణ లక్ష్యంగా నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలు ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు ఒకటిన్నర లక్షల మందిని తరలించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆదివారం జరగనున్న ఈ సభకు శనివారమే ట్రాక్టర్లు బయలుదేరి వెళ్లాయి. వందలాదిగా ట్రాక్టర్లు జిల్లా నుంచి కొంగరకలాన్ వైపు దారితీశాయి. అందంగా అలంకరించుకుని 44వ జాతీయ రహదారిపై ఒకదాని వెంట, మరొకటి.. వరుసకట్టాయి. రైతులు, పార్టీ శ్రేణులు ఈ ట్రాక్టర్లలో తరలివెళ్లారు. కామారెడ్డి, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ వంటి నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన వందలాది ట్రాక్టర్లను భిక్కనూర్ వద్ద మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్‌లో ట్రాక్ట ర్ నడిపి తన నియోజకవర్గం బాల్కొండ నుంచి ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి, బోధన్ లో షకీల్ అమేర్‌లు ట్రాక్టర్ నడిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి బయలుదేరిన ట్రాక్టర్లను డిచ్పల్లి వద్ద ఎమ్మెల్యే బాజి రెడ్డిగోవర్ధన్, ఎల్లారెడ్డిలో స్థానిక ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, బిచ్కుంద నుంచి ట్రాక్టర్లను ఎమ్మెల్యే హన్మంత్‌షిండేలు ప్రారంభించారు. ట్రాక్టర్లలో వెళ్లే వారికి అవసరమైన భోజన, వసతి ఏర్పాట్లు చేసుకున్నారు. నేడు బస్సులు, ఇతర వాహనాల్లో వారం రోజులుగా ఈ జనసమీకరణ పైనే దృష్టి సారించారు. శనివారం ట్రాక్టర్లను తరలించిన ఎమ్మెల్యేలు బస్సులు, ఇతర వాహనాల్లో ఆదివారం ఉదయం బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల బస్సులను సమీకరించారు. జిల్లాలో వాహనాలు అందుబాటులో లేకపోవడం తో జుక్కల్, బాన్సువాడ, బోధన్ నేతలు మహారాష్ట్ర, కర్నాటకల్లోని వాహనాలను అద్దెకు తీసుకున్నారు. 508 ఆర్టీసీ బస్సులు.. జిల్లాలోని దాదాపు అన్ని ఆర్టీసీ బస్సులను ఈ సభకు వినియోగిస్తున్నారు. నిజామాబాద్ రీజియన్ పరిధిలోని ఆరు (ఆర్మూర్, బోధన్, నిజామాబాద్–1, –2, బాన్సువాడ, కామారెడ్డి) డిపోల పరిధిలో మొత్తం 670 బస్సులుండగా, మొత్తం 508 ఆర్టీసీ బస్సులలో సభకు జనాలను తరలించేందుకు వినియోగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. తొలిసారిగా అద్దె బస్సులను కూడా ఈ అవసరాలకు వినియోగిస్తున్నారు. సభకు బస్సులను పంపాలని జిల్లా ఆర్టీసీ అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేకంగా సర్క్యూలర్ జారీ అయింది. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు 83 బస్సుల చొప్పున బుక్ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 93 బస్సులు, కామారెడ్డికి 89 బస్సులు కేటాయించారు. ఇవన్నీ ఆదివారం ఉదయమే బయలుదేరి వెళ్తాయి. జుక్కల్, బాల్కొండ నియోజకవర్గాలకు డిపోలు లేకపోవడంతో బోధన్, బాన్సువాడ డిపోల నుంచి బస్సులను సర్దుబాటు చేస్తున్నారు. ఈ 508 ఆర్టీసీ బస్సులకు చార్జీలు సుమారు రూ.96 లక్షలను టీఆర్ఎస్ పార్టీ నాయకులు నగదు రూపంలో ఆర్టీసీకి చెల్లించారు. ఎప్పటికప్పుడు నిఘావర్గాల నివేదికలు.. కొంగరకలాన్ సభ జనసమీకరణపై రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగం ఆరా తీస్తోంది. గత రెండు రోజులుగా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపుతోంది. ముఖ్యంగా ఈ సభకు ఎమ్మెల్యేలు ఏ మేరకు జన సమీకరణ చేస్తున్నారనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. శనివారం ఎమ్మెల్యేలు ఏయే మండలాల నుంచి ట్రాక్టర్లను తరలించారు. జనాలను ఏ మేరకు తరలించాలనే అంశంపై ఆరా తీశారు. పోలీసుశాఖ రూట్‌మ్యాప్‌లు.. సభకు తరలనున్న వాహనాలకు సంబంధించి పోలీసు శాఖ రూట్‌మ్యాప్‌ను విడుదల చేసింది. వాహనాలన్నీ ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఆయా రూట్లలో వచ్చే వాహ నాలు ఏ వైపు నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లాలనే రూట్లను సూచిస్తూ మ్యాప్‌లను ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి వెళ్లే వాహనాలతో పాటు, ము«థోల్, బాసర వైపు నుంచి వచ్చే వాహనాలు, కోరుట్ల, మెట్‌పల్లిల వైపు నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక రూట్లను ప్రకటించారు. -
భార్య నోట్లో గుడ్డ పెట్టి.. తలను గోడకు బాది
బాన్సువాడ టౌన్ : పట్టణానికి చెందిన ఈరబోయిన సావిత్రి అలియాస్ అనురాధ(34) అనే వివాహితను ఆమె భర్త ఈరబోయిన రాజు హత్య చేసినట్లు బాన్సువాడ రూరల్ సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. పట్టణంలోని గూడేంగల్లికి చెందిన రాజుకు పదేళ్ల కిత్రం బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన సావిత్రితో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. తాగుడుకు బానిసైన రాజు నిత్యం భార్య సావిత్రిని వేధిస్తూ కొట్టేవాడు. గురువారం బాన్సువాడలో సంత కావడంతో భార్యభర్తలు ఇద్దరు కలిసి సంతకు వెళ్లి కురగాయలు కొనుక్కొని కల్లు తాగి ఇంటికి వచ్చారు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సావిత్రి నోట్లో గుడ్డ పెట్టి తలను గోడకు బాదాడు. తీవ్రంగా గాయాలైన సావిత్రి మెడను నొక్కడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం ఎప్పటి లాగానే లేచి తన భార్య రాత్రి పడుకుని లేవడం లేదని చుట్టుపక్కల వారిని నమ్మించాడు. మామూలుగానే చనిపోయిందని బావించిన కుటుంబికులు సావిత్రి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి బంధువులు వచ్చి చూడగా మెడపై, తలపై. వీపుపై గాయాలు కనబడడంతో పోలీసులకు సమాచారం అందించారు. సీఐ వచ్చి సావిత్రి భర్త రాజును అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపినట్లు ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. శవాన్ని పోస్టుమాస్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సావిత్రి మేనమామ లస్మయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఎరువు భారం 35 కోట్లు
మోర్తాడ్(బాల్కొండ) : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ధర పెరగడంతో రైతుల పరిస్థితి ఢమాల్ అయ్యింది. డాలర్ ధర పెరగడం వల్ల కాంప్లెక్స్ ఎరువుల ముడిసరుకు ధరకు రెక్కలు తొడిగాయి. దీంతో మూడు నెలల వ్యవధిలో మరోసారి కాంప్లెక్స్ ఎరువుల ధర పెరిగింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగులో యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను రైతులు ఎక్కువగానే వినియోగిస్తున్నారు. పంటల దిగుబడి పెరగాలంటే కాంప్లెక్స్ ఎరువులను వినియోగించాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. అయితే ధరలు పెరగడం వల్ల పెట్టుబడులు అధికం అవుతున్నాయని వాపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా తక్కువ సమయంలోనే కాంప్లెక్స్ ఎరువుల ధరలలో పెరుగుదల కనిపిస్తుండటంతో మూలిగే నక్కపై తాటికాయ పడిందనే చందంగా రైతుల పరిస్థితి తయారైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూన్‌లో కాంప్లెక్స్ ఎరువుల ధర ఒక బస్తాపై రూ.100 నుంచి రూ.173 వరకు పెరిగింది. ఇప్పుడు మాత్రం ఒక బస్తాపై రూ.50 నుంచి రూ.100 వరకు పెరిగింది. గతంలో పెరిగిన ధరల వల్ల ఉమ్మడి జిల్లా రైతులపై ఏటా దాదాపు రూ.50 కోట్ల భారం ఏర్పడగా ఇప్పుడు మళ్లీ ధర పెరగడంతో మరో రూ.35 కోట్ల ఆర్థిక భారాన్ని రైతులు మోయాల్సి వస్తోంది. కాంప్లెక్స్ ఎరువుల తయారీకి వినియోగించే ముడిసరుకును ఎరువుల ఉత్పత్తి కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. దిగుమతి సరుకుపై డాలర్ ప్రభావం పడుతుండటంతో కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఇఫ్కో ఉన్నతాధికారులు వెల్లడించారు. కాంప్లెక్స్ ఎరువుల ధర పెరగడం వల్ల ప్రతి రైతు ఒక హెక్టార్‌కు రూ.వెయ్యిని ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. నిజామాబాద్ జిల్లాలో 2.35 లక్షల హెక్టార్లలో, కామారెడ్డి జిల్లాలో 1.72 లక్షల హెక్టార్లలో పంటలను రైతులు సాగు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని రైతులు ఎక్కువగా వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ రైతులు కొంత మేర వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. వరి కంటే వాణిజ్య పంటలలోనే కాంప్లెక్స్ ఎరువులను రైతులు ఎక్కువగా వినియోగిస్తారు. డీఏపీ రకం కాంప్లెక్స్ ఎరువు ధర గతంలో రూ.1,295 ఉండగా ఇప్పుడు రూ.1,345కు చేరింది. 20:20 రకం ఎరువు ధర రూ.960 నుంచి రూ.1,025కు చేరింది. 12:32:16 రకం ఎరువు రూ.1175 నుంచి రూ.1275 కు చేరింది. రైతులు ఎక్కువగా డీఏపీతో పాటు 20:20 రకాన్ని వినియోగిస్తున్నారు. డాలర్ ధరలో మార్పు లేక పోతే కాంప్లెక్స్ ఎరువుల ధరలో తగ్గుదల కనిపించకపోవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్ ఎరువుల ధరలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. డాలర్ ధరలు పెరిగినా కాంప్లెక్స్ ఎరువుల ధరలు మాత్రం పెరగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. డాలర్ ధరలు పెరగడం వల్లనే.. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ధర పెరగడం వల్లనే కాంప్లెక్స్ ఎరువుల ధరల్లో పెరుగుదల ఏర్పడింది. ముడిసరుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అందువల్లనే కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ ఒకటి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి. – మారుతి ప్రసాద్, ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కాంప్లెక్స్ ఎరువుల ధరలను నియంత్రించాలి ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్ ఎరువుల ధరలను నియంత్రించాలి. లేకుంటే రైతులు ఇంకా భారం మోయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి కాంప్లెక్స్ ఎరువుల ధరలను అదుపులో ఉంచాలి. ధరలు పెరగడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. – ఒల్లాడపు గంగారాం, రైతు, తిమ్మాపూర్ పెట్టుబడులు అధికం అవుతున్నాయి కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం వల్ల మాకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. రైతులు ఇప్పటికే ఎన్నో కష్టాల్లో ఉన్నారు. ఎరువుల ధరలు పెరగడం వల్ల మరింత ఇబ్బంది పడుతారు. – కొప్పుల భాజన్న, రైతు, మోర్తాడ్ -
పోరాడితేనే రాజ్యాధికారం
నిజామాబాద్ నాగారం : బీసీలను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం 56 శాతం సీట్లు కేటాయించాల్సి ఉన్నా బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందన్నారు. ఆయన చేపట్టిన బీసీ రాజకీయ చైతన్య యాత్ర శుక్రవారం నిజామాబాద్ జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. బీసీలంతా ఐకమత్యంతో పోరాడితే రాజ్యాధికారం సాధ్యమని చెప్పారు. సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 60 మంది అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పారని, అందులో 30 సీట్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. -
ఇప్పుడు కూడా అడుక్కోవాలా..!
సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు రాజకీయంగా ఎదుగుదల లేకుండా చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ సిట్టింగులకే సీట్లు ఇస్తామని చెప్పి మరోసారి బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణలో ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేకపోవడం విచారకరం అన్నారు. బీసీ రాజకీయ చైతన్య బస్సు యాత్రలో భాగంగా బోధన్ చేరుకున్న శ్రీనివాస్ మీడియాతో శుక్రవారం మాట్లాడారు. 2019 ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా ఇవ్వాలని టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలను ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణలోని 112 బీసీ కులాలు జేఏసీగా ఏకమై ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగుతామని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా రాజకీయ వాటా కోసం యాచించాల్సిన పరిస్థితులు ఉండటం బాధాకరమన్నారు. శాసించే స్థాయి కోసమే బీసీ రాజకీయ చైతన్య యాత్ర చేస్తున్నామని తెలిపారు. బీసీలను అన్యాయం చేస్తే రానున్న రోజుల్లో అన్ని పార్టీ కార్యాలయాలు టులెట్ బోర్డులు పెట్టుకోవాల్సి వస్తుందని ఉద్ఘాటించారు. -
మాజీ మేయర్ సంజయ్‌కు బెయిల్
నిజామాబాద్ లీగల్(నిజామాబాద్ అర్బన్) : ఇందూరు నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. రూ. 25వేలకు సమానంగా వ్యక్తిగత బాండ్ తో పాటు అదే మొత్తంలో ఇద్దరు వ్యక్తుల జమానాత్లు సమర్పించాలని ఎస్సీ, ఎస్టీల అత్యాచారాల నిరోధక విచారణ న్యాయస్థానం ప్రత్యేక జడ్జి జీఎస్. రమేష్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జా రీ చేశారు. శాంకరీ కళాశాల విద్యార్థినులపై లైంగి క వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై సంజయ్‌ను నిజామాబాద్ నాల్గోటౌన్ పోలీసులు ఈనె ల 12న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్‌కు తరలించింది. 19 రోజుల తర్వా త సంజయ్ తరపున్యాయవాదులు ఆకుల రమేష్, కృపాకర్‌రెడ్డి రెండుసార్లు బెయిల్ పిటిషన్లు దాఖ లు చేశారు. కేసు విచారణ దశలో ఉన్నందున జడ్జి పిటిషన్లను తిరస్కరించారు. గురువారం సంజయ్ న్యాయవాదులు మరోసారి తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో 16 మంది సాక్షులను విచారించి, వాంగ్మూలాలను సేకరించారని, సీపీసీ సెక్షన్ 164 ప్రకారం మున్సిఫ్ మేజిస్ట్రేట్ ముందు బాధిత విద్యార్థినులు వాంగ్మూలాలను నమోదు చేశారని బెయిల్ ఉత్తర్వులో జడ్జీ పెర్కోన్నారు. సంజయ్ నిజామాబాద్‌లోని నాల్గోటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ప్రతి సోమ,గురువారాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరుకావాలని, ఈ కేసులో విచారణాధికారి ఏసీపీ అనుమతి లేకుండా నిజామాబాద్ విడిచి పోరాదని, విచారణలో పోలీసులకు సహకరించాలని ఉత్తర్వుల్లో జడ్జి ఆదేశించారు. సంజయ్ విడుదలకు ఆర్డర్ కాపీని జిల్లా జైలుకు పంపారు. న్యాయవాదులు ఆకుల రమేష్, కృపాకర్‌రెడ్డి మాట్లాడుతూ సంజయ్ బెయిల్ కోసం తమ వాదనలతో జడ్జి ఏకీభవించి బెయిల్ మంజూరు చేశారన్నారు. తమ క్లయింట్‌ను జైలు లోపల పెట్టి కేసు విచారణ దశలో ఉందని చెప్పటం వీల్లేదని వాదించామన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, కేసు విచారణలో ఉండగా బెయిల్ కోరటం చట్ట సమ్మతమేనన్నారు. జైలుకు చేరిన విడుదల ఆర్డర్ కాపీ.. నగర మాజీ మేయర్ సంజయ్‌కు బెయిల్ ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో ఆయన తరపున న్యాయవాదులు సాయంత్రం 6 గంటల తర్వాత విడుదల ఆర్డర్ కాపీ జైలు అధికారులకు చేరింది. దాంతో జైలు నిబంధనల ప్రకారం సంజయ్‌ను గురువారం విడుదల చేసే అవకాశం లేదని, శుక్రవారం విడుదల చేయవచ్చని తెలిసింది. -
సంజయ్ బెయిల్‌పై విడుదల
నిజామాబాద్: రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ శుక్రవారం బెయిల్‌పై విడుదల అయ్యారు. నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సంజయ్‌పై ఈ నెల 12న పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి సంజయ్ 20 రోజుల పాటు సారంగపూర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నిన్న(గురువారం) ఎస్సీ ఎస్టీ కోర్టు సంజయ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి గురువారం, శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని ఆదేశించింది. -
డీఎస్ తనయుడికి ఊరట
సాక్షి, నిజామాబాద్ : నర్సింగ్ విద్యార్థినిలపై లైంగిక వేధింపుల కేసులో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్‌కి ఊరట లభించింది. గురువారం జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 18రోజుల పాటు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన రేపు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతి గురువారం, సోమవారం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. లైంగిక వేధింపుల కేసులో సంజయ్‌ని అరెస్ట్ చేసి పోలీసు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడిని ఏపీ పోలీస్ మాన్యువల్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు పోలీసు మాన్యువల్ తయారు చేయలేదని ఆయన పేర్కొన్న సంగతి విదితమే. అయితే తర్వాత ఈ పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు. -
‘టీఆర్ఎస్ నాయకులను గ్రామాల్లోకి రానివ్వరు’
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రకటించగానే టీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వరని శాసనమండలి ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్దమేనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎలాంటి పనులు చెయ్యలేకే ముందస్తు ఎన్నికలకు వెళుతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మిషన్ భగీరథ నీరు ఒక సంవత్సరంలో ఇస్తామని చెప్పి నాలుగున్నరేళ్లుగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ. 69 వేల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రూ. లక్షా 52వేల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా రాష్ట్రంలో సునామీ వస్తుందన్నారు. తెలంగాణకు మొదట.. సీఎం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఎస్సారెస్సీ రైతులకు ఒక్క టీఎంసీ నీటిని విడుదల చెయ్యకుండా సీఎం అన్యాయం చేశారని మండిపడ్డారు. మొదటగా పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ సీటు గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. -
నిరూపిస్తే రాజకీయ సన్యాసం: కవిత
నిజామాబాద్: టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రతీ నియోజకవర్గంలో రెండు వేల కోట్ల రూపాయల నిథుల కంటే తక్కువ కేటాయించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం..లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలు తీసుకుంటారా అని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. విలేకరులతో మాట్లాడుతూ..ముందస్తు ఎన్నికలకు పోతున్నామని తనకు తెలియదని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని, లీగల్‌గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు మాకు 100 శాతం మార్కులు వేశారు..ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం సిద్ధమని వ్యాఖ్యానించారు. ఇవే ఫలితాలు వస్తాయని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏం చేసినా ప్రతిపక్షాలకు భయమే..వాళ్ల ఆలోచన ప్రజలు కాదు పవర్ అని అన్నారు. కొంగర కలాన్ సభకు ఆర్టీసీ బస్సులను అద్దెకు మాత్రమే తీసుకుంటున్నామని, ఉద్దరకు తీసుకోవడంలేదని అన్నారు. దీనిపై కూడా విపక్షాలు కోర్టుకు వెళ్తే వారికే మొట్టికాయలు పడతాయని చెప్పారు. జోనల్ వ్యవస్థతో పరిపాలనాసౌలభ్యం ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థ ఆమోదించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవడం శుభపరిణామమన్నారు. -
అంగన్వాడీలకు జీవిత బీమా
బాన్సువాడ టౌన్ నిజామబాద్ : కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు భరోసా కల్పించింది. ఎన్నో పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంచింది. కాగా ఇప్పుడు వారి ఇబ్బందులు, కష్టాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జీవిత బీమా సౌకర్యం కల్పించేందుకు పూనుకుంది. విధి నిర్వహణలో, ప్రమాదవశాత్తు, సహజ మరణం పొందినవారికి ఈ సౌకర్యం వర్తించే విధంగా రూపకల్పన చేసింది. ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకానికి సంబంధించి బీమా ప్రీమియంను కేంద్ర ప్రభుత్వం–భారతీయ జీవిత బీమా సంస్థలు సంయుక్తంగా భరించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అదేశాలు కూడా జారీ చేసింది. ప్రభుత్వం అందించే బీమా సొమ్ము బాధితుల కుటుంబాలకు ఆసరాగా నిలవనున్నది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అంగన్వాడీ ఉచిత బీమా పథకంతో జిల్లాలో 1038 మంది టీచర్లు, 155 మినీ టీచర్లు, 1083 మంది ఆయాలకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలోని కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, మద్నూర్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కలిపి 2231 మంది ఉన్నారు. 35 టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అనుబంధ సంఘాల సహకారంతో ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఏడు విడతలుగా వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీచర్‌కు రూ.10,500, ఆయాలకు రూ.6 వేల చొప్పున వేతనం అందిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి పని చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల కష్టాల గుర్తించి వారికి భరోసా కల్పించేందుకు నిర్ణయించి బీమా సౌకర్యంతో అండగా నిలిచింది. మృతిచెందిన అంగన్వాడీ కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున బీమా సొమ్ము అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రీమియం చెల్లించే బాధ్యత కూడా.. జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాల బీమా ప్రీమియంను చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం జీవిత బీమా సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పీఎంజీవై రూ.330, పీఎంఎస్‌జీవైరూ.12 ఎల్ఐసీ రూ.80 చొప్పున స్కీం కింద ప్రీమియం చెల్లించా ల్సి ఉంది. అయితే కేంద్ర మహిళ శిశు సంక్షమ శాఖ రూ.332, ఎల్ఐసీ రూ.100 చొప్పున సంయుక్తంగా భరించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2017, జూన్ ఒకటో తేదీనాటికి 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వయస్సు ఉన్న టీచర్లు, ఆయాలకు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా కింద రూ.లక్షలాదిగా చెల్లిస్తుంది. 50 నుంచి 59 ఏళ్లలోపు టీచర్లు, ఆయాలకు జీవిత బీమా సౌకర్యం రాక ప్రత్యేకంగా అంగన్వాడీ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. సంతోషంగా ఉంది.. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసే టీచర్లు, ఆయాలకు మూడు బీమా పథకాలు కల్పించడం సంతోషంగా ఉంది. అయితే తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అయితేనే తమకు ఒక గుర్తింపు వస్తుంది. లేదంటే తాము ఎన్నేళ్లు కష్టపడినా ఫలితం ఉండదు. –గౌరమ్మ, టీచర్, నస్రూల్లాబాద్. -
బీసీ కార్పొరేషన్‌కు అరకొర నిధులు
బీసీ నిరుద్యోగులకు రుణాల విషయంలో ఊరించి ఊసురుమనిపించినట్లుంది ప్రభుత్వ తీరు. బీసీ కార్పొరేషన్, వివిధ కుల వృత్తుల ఫెడరేషన్ల ద్వారా రాయితీ రుణాలు ఇస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం జిల్లాకు అరకొరగానే నిధులను కేటాయించింది. దీంతో వెనకబడిన తరగతుల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. స్వయం ఉపాధికోసం పెద్ద మొత్తంలో దరఖాస్తులు రాగా ప్రభుత్వం కేటాయించిన నిధులు కొంత మందికే సరిపోతున్నాయి. మోర్తాడ్(బాల్కొండ) : స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న బీసీ నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం నామమాత్రంగానే నిధులను కేటాయించడంతో కేవలం 13 శాతం మందికి మాత్రమే రాయితీ రుణాలు అం దుతున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను జూన్, జూలైలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాల కోసం 4,755, రూ.లక్షకు మించి రుణాల కోసం 8,830 దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.50 వేలను వంద శాతం సబ్సిడీపై అందించాలని నిర్ణయించింది. బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా నూటికి నూరుశాతం రాయి తీని ప్రకటించిన ప్రభుత్వం ఇందు కోసం జిల్లాకు రూ.8 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను రూ.50 వేల చొప్పున విభజించి 1,600 మందికి చెక్కుల రూపంలో పంపిణీ చేయాలని నిర్ణయించింది. చిన్న వ్యాపారులకే లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం సూచించడంతో చిన్న వ్యాపారాలను నిర్వహిస్తున్న వారికే రాయితీ సొమ్మును అందిస్తున్నారు. కాగా కేటగిరి 1లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే రాయితీ సొమ్మును అందిస్తున్నారు. రూ.లక్ష లోపు రుణాల కోసం దరఖా స్తు చేసుకుంటే అలాంటి వాటిని కేటగిరి 1 అని, రూ.లక్షకు మించి ఎక్కువ రుణం కోరితే అలాంటి దరఖాస్తులను కేటగిరి 2 కింద పరిగణించారు. ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన నిధులనుకేటగిరి 1 కింద ఉన్న దరఖాస్తులను పరిశీలించి అందులో 1,600 మందిని ఎంపిక చేయగా వంద శాతం రాయితీకి సంబంధించిన రూ.50 వేల చొప్పున చెక్కులను అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కేవలం 100 మందికి మాత్రమే చెక్కులను పంపిణీ చేశారు. ఇంకా 1,500 మందికి మండల స్థాయిలో సబ్సిడీ చెక్కులను పంపిణీ చేయాల్సి ఉంది. కేటగిరి 1 కింద 4,755 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 1,600 మందికి రాయితీ సొమ్ము పంపిణీ చేయనుండగా మిగిలిన 3,155 మందికి మొండి చెయ్యి చూపనున్నారు. కేటగిరి 2లో ఉన్న దరఖాస్తులకు మాత్రం రుణాల పంపిణీ జరిగే అవకాశం కనిపించడం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం రాయితీ సొమ్మును ప్రకటించకపోవడంతో బీసీల ఆశలు అడియాసలవుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ దరఖాస్తుల ఊసెత్తని ప్రభుత్వం... కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి రాయితీ రుణాలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఫెడరేషన్ల ఆధ్వర్యంలోనే దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించగా ఆయా వృత్తులకు సంబంధించిన వారు త మ కులాల ఫెడరేషన్ల ద్వారా దరఖాస్తులు అం దించారు. విశ్వబ్రహ్మణులు, క్షవరశాలల నిర్వాహకులు, రజకులు, కుమ్మరి, భట్రాజులు, దర్జీ తదితర కుల వృత్తిదారులు తమ ఫెడరేషన్ల ద్వారా దరఖాస్తులను అందించారు. ఫెడరేషన్ల ద్వారా అందిన దరఖాస్తులకు సంబంధించి రుణాల పంపిణీపై ఎలాంటి స్పష్టత లేక పోవడంతో కుల వృత్తులపై ఆధారపడిన వారు ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బీసీ కార్పొ రేషన్, ఫెడరేషన్ల ద్వారా రాయితీ రుణాలను అందించడానికి నిధులను ఎక్కువ మొత్తంలో విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. -
నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై సీరియస్
చంద్రశేఖర్‌కాలనీ నిజామబాద్ : ఇందూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో గల షాపుల్లో సోమవారం సాయంత్రం మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా దాడులు చేసి నిషేధిత ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకొని జరిమానాలు విధించారు.స్థానిక అహ్మదీబజార్, గాంధీచౌక్ ఏరియాల్లో గల మద్యం షాపులు, దుస్తుల షాపులపై దాడులు చేసి నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న వ్యాపారులకు రూ. 11 వేల 800 జరిమానా విధించామని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సాజిద్ అలీ తెలిపారు. నిషేధించిన ప్లాస్టిక్ కవర్లను వ్యాపారులు వినియోగించవద్దని ఆయన ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్‌లో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్ సునీల్, జవాన్లు రాములు, లతీఫ్, శేఖర్, నరేశ్, కిరణ్ పాల్గొన్నారు. -
ముంచేసే స్కీమ్
అక్రమ సంపాదనకు కొందరు పక్కా స్కెచ్ వేశారు.. బహుమతుల పేరిట అమాయకులను మోసం చేసే ‘స్కీం’కు తెర లేపారు.. అందమైన బ్రోచర్లు ముద్రించి బుట్టలో దింపుతున్నారు. కొద్ది మొత్తం కడితే చాలు, పెద్ద బహుమతులు సొంతం చేసుకోవచ్చని వందలాది మందికి ఆశ చూపి, మాయలో పడేస్తున్నారు. ఇలా నుంచి రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసి, ఒకరిద్దరికి బహుమతులు కట్టబెట్టి చేతులు దులుపుకుంటున్నారు. మిగతా వారికి ఏదో నామమాత్రపు వస్తువు అంటగట్టి, పెద్ద మొత్తంలో వెనుకేసుకుంటున్నారు. ప్రజలను ముంచే ఈ ‘స్కీం’ల దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా, బహిరంగంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని నియంత్రించాల్సిన పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఎంటర్ప్రైజెస్ల పేరిట అక్రమ స్కీంలు జిల్లాలో జోరుగా కొనసాగుతున్నాయి.. ప్రజలను నిండా ముంచే ఇలాంటి ‘పథకాలు’ విచ్చలవిడిగా నడుస్తున్నాయి. స్కీంలు, లక్కీ డ్రా పేరుతో ప్రజల డబ్బును కొందరు అక్రమంగా వెనుకేసుకుంటున్నారు. ‘‘నెలకు కేవలం రూ.1,100 చొప్పున పది నెలలు చెల్లించండి.. కారు గెలుచుకోండి.. ఒక్క కారే కాదు, రూ.80 వేల విలువ చేసే బైక్, బంగారం, ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మిషన్, ఫ్రిజ్ వంటి గృహోపకరణాలను కూడా పొందవచ్చు..’’ అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. అందమైన బ్రోచర్లను ముద్రించి బుట్టలో వేసుకుంటున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని నందిపేట్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని రుద్రూర్, వర్నిల కేంద్రంగా ఇలాంటి దందాలు నడుస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో కూడా ఈ అక్రమ స్కీంలు గుట్టుగా నడుస్తున్నట్లు సమాచారం. పేద, మధ్య తరగతి ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని రూ.కోట్లలో టర్నోవర్ నిర్వహిస్తున్నారు. పరిసర గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకుని వందలాది మందిని సభ్యులుగా చేర్చుకుంటున్నారు. రూ.కోట్లల్లో దందా.. స్కీంలు, లక్కీ డ్రాల పేరుతో ప్రతి నెలా రూ.కోట్లల్లో దందా కొనసాగుతోంది. ఒక్కో స్కీంలో సుమారు 500 నుంచి వెయ్యి మందిని చేర్చుకుంటున్నారు. పది నెలలు, 15 నెలలు, 20 నెలలు, 25 నెలలు.. ఇలా వివిధ కాల పరిమితితో స్కీంలు నడుపుతున్నారు. ఈ స్కీంలలో సభ్యులుగా చేరిన వారు ప్రతి నెల రూ.వెయ్యి నుంచి రూ.నాలుగు వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రూ.వెయ్యి చొప్పున వెయ్యి మంది సభ్యులు కలిగిన స్కీంలో ప్రతి నెలా రూ.10 లక్షలు పోగేస్తున్నారు. స్కీం కాల పరిమితి పది నెలల్లో రూ.కోటి వరకు టర్నోవర్ చేస్తున్నారు. ఇలా ఒక్క స్కీంలోనే రూ.కోటి టర్నోవర్ జరుగుతోందంటే.. అన్ని స్కీంలలో కలిసి ఏ స్థాయిలో అక్రమ దందా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. భారీ బహుమతులను ఆశ చూపి.. వందల సంఖ్యలో సభ్యులను చేర్చుకుంటున్న స్కీం నిర్వాహకులు.. లక్కీ డ్రా నిర్వహించి ఒకరిద్దరికి కారు, బైక్‌లు అందజేస్తున్నారు. మిగిలిన వారికి చిన్న చిన్న గృహోపకరణాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. స్కీంలో చేరిన ప్రతి సభ్యుడికి బహుమతి వస్తుందని ఆశ చూపి, కన్సోలేషన్ బహుమతుల పేరుతో నామమాత్రపు విలువ కలిగిన బహుమతులను అంటగడుతున్నారు. ఇలా సభ్యుల వద్ద వసూలు చేసిన మొత్తంలో కనీసం సగం విలువ చేసే బహుమతులను కూడా ఇవ్వడం లేదు. అదృష్టం ఉంటే కారు, బైక్, గృహోపకరణాలు గెలుచుకోవచ్చనే ఆశతో అమాయక ప్రజలు ఈ స్కీంల్లో చేరుతున్నారు. వీరి ఆశను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రూ.లక్షలు దండుకుంటున్నారు. గతంలో కేసులు నమోదు.. నిబంధనల ప్రకారం ఇలాంటి స్కీంలు నిర్వహించడానికి అనుమతులు లేవు. ఇలాంటి స్కీంల పేరుతో అమాయక ప్రజలను మభ్యపెడుతున్న వారిపై నిఘా ఉంచి సుమోటోగా కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ తమకు ఫిర్యాదులు అందలేదంటూ సంబంధిత పోలీసులు దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ఇలాగే స్కీంల పేరుతో అక్రమ దందా కొనసాగించిన వారిపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అలాగే, మోర్తాడ్, కమ్మర్పల్లి ఠాణాల పరిధిలోనూ గతంలో కొందరు స్కీం నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇలాంటి స్కీం నిర్వాహకుల వైపు చూడడమే మానేశారు. స్కీంలు చట్ట విరుద్ధం.. స్కీంలు, లక్కీ డ్రాలు నిర్వహించడం చట్ట విరుద్ధం. ఇలాంటివి నడుస్తున్నట్లు మా దృష్టిలో లేదు. స్కీముల పేరుతో అమాయక ప్రజలను మోసగిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – మంత్రి సుదర్శన్, ఏసీపీ -
23986 మందికి పరీక్షలు
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో ఈనెల 15న ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 35 వైద్య బృందాలు కంటి శిబిరాల్లో వైద్యసేవలు అందిస్తున్నాయి. ఇప్ప టి వరకు జిల్లా వ్యాప్తంగా 23,986 మం దికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందు లో 4,590 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశా రు. 7,207 మందికి వారి కళ్లకు సరిపడే అద్దాల కోసం ఆర్డర్ చేశారు. 2,566 మం దికి శస్త్ర చికిత్స అవసరమని గుర్తించారు. ఈనెల 27 నుంచి శస్త్ర చికిత్సలు ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వాసవి కంటి ఆస్పత్రి, బోధన్‌లోని లయన్స్‌కంటి ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు జరుగనున్నా యి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు వైద్యశిబిరాలు కొనసాగుతున్నా యి. మొత్తం 15, 66, 787 జిల్లా జనాభా ఉండగా దీనికి అనుగుణంగా శిబిరాల ని ర్వహణను రూపొందించారు. గ్రామాల్లో ప్రతి రోజు 360 మందికి, పట్టణ ప్రాం తా లో 460 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 32 ఆరోగ్య కేంద్రాల పరిధి లో శిబిరాలు కొనసాగుతున్నాయి. 2019 ఫిబ్రవరి వరకు కంటి వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు. మెడికల్ ఆఫీసర్లు, కం టి వైద్యులు సేవలను అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు డాటాను నమోదు చేస్తున్నారు. మరోవైపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు శిబిరాలను తనిఖీ చేస్తున్నారు. ఈ శిబిరాలకు వచ్చేవారిలో ఎక్కువగా వృద్ధులు, 40 ఏళ్లు పైబడినవారికే కంటి సమస్యలు వెలుగులోకి వస్తున్నా యని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. పకడ్బందీగా నిర్వహిస్తున్నాం : జిల్లా వైద్యాధికారి సుదర్శనం కంటివెలుగు కార్యక్రమం పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. వైద్యసిబ్బంది, వైద్యాధికారులు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో, పట్టణల్లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరల్లో అన్ని సౌకర్యలు కల్పించా ము. షెడ్యుల్ ప్రకారం వైద్యశిబిరాలు నిర్వహించి పరీక్షలు పూర్తి చేస్తాం. -
ఎమ్మెల్యేలకు ‘నివేదన’ పరీక్ష
అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ప్రగతి నివేదన సభకు జన సమీకరణ ఎమ్మెల్యేలకు ఓ పరీక్షలా మారింది. జిల్లాలోని ప్రజాప్రతినిధులు కేసీఆర్ దృష్టిని ఆకర్షించేలా జన సమీకరణ చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. వచ్చే నెలలోనే ఆయా నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటిస్తామని అధినేత ప్రకటించడంతో ఎన్నికల వేడి రాజేసి నట్లయ్యింది. సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఇస్తామని, రాని వారికి ప్రత్యామ్నాయ పదవులు కేటాయిస్తామని స్పష్టత ఇవ్వడంతో ఎమ్మెల్యేల్లో టిక్కెట్ల టెన్షన్ పెరిగింది. ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ప్రగతి నివేదన సభకు జన సమీకరణ ఎమ్మెల్యేలకు ఓ పరీక్షలా మారింది. వచ్చే నెలలోనే ఆయా నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటిస్తామని అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో.. జిల్లాలోని ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులను తరలించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని భావిస్తున్నారు. కేసీఆర్ దృష్టిని ఆకర్షించేలా జన సమీకరణ చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఎన్నికల జోన్లోకి వచ్చేశామని, రేపే ఎన్నికలు అనుకుని సమాయత్తం కావాలి.. అని అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఎన్నికల వేడిని రాజేసింది. మరోవైపు సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఇస్తామని, రాని వారికి ప్రత్యామ్నాయ పదవులు కేటాయిస్తామని కేసీఆర్ స్పష్టత ఇవ్వడంతో ఎమ్మెల్యేల్లో టిక్కెట్ల టెన్షన్ పెరిగింది. ఈ సంకేతాలు ఒక రకంగా టిక్కెట్ల రేసులో ఉన్న ఆశావహుల్లో ఆశలు రేకెత్తించినట్లయింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్పు చేయాల్సిన వారిలో జిల్లాలో ఏ నియోజకవర్గం ఉంటుంది.. అనే అంశంపై పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి రెండు లక్షల మంది.. జాతీయ రాజకీయ వర్గాల దృష్టిని సైతం ఆకర్షించేలా అధికార పార్టీ సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ శివారులో ప్రగతి నివేదన భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయిం చారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, రాష్ట్ర కార్యవర్గం నేతల సమావేశం అనంతరం జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా మంత్రి పోచారం నివాసంలో సమావేశమయ్యా రు. నియోజకవర్గానికి 20 వేల నుంచి 25 వేల మందిని తరలించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న కామారెడ్డి, ఎల్లారెడ్డి వం టి నియోజకవర్గాల నుంచి ఎక్కువ సంఖ్యలో శ్రే ణులను తీసుకెళ్లేలా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. లారీలు, అందుబాటులో ఉన్న అన్ని రకా ల వాహనాల్లో తరలివెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ట్రాక్టర్లలో తరలివెళ్లే వారు ఒక రోజు ముం దుగానే కొంగరకు చేరుకోవాలని భావిస్తున్నారు. జిల్లా సమన్వయ కర్తగా ప్రశాంత్‌రెడ్డి.. ప్రగతి నివేదన సభకు ఆయా నియోజకవర్గాల్లో జన సమీకరణకు ఇన్చార్జిగా జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. జిల్లా సమన్వయకర్తగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డిని నియమించారు. ఇద్దరు నేతల పర్యవేక్షణలో శ్రేణుల తరలింపు జరగనుంది. కాగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో శుక్రవారం నిర్వహించిన సమాయత్త సమావేశానికి జిల్లాకు చెందిన రాష్ట్ర కార్యవర్గ నేతలను ఆహ్వానించకపోవడం పట్ల సదరు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అన్ని బస్సులు ఇవ్వండి.. ప్రగతి నివేదన సభకు జనాలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను కేటాయించాలని ఆ సంస్థ అధికారులకు విజ్ఞప్తి అందింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అద్దె బస్సులతో సహా.. అన్ని బస్సులను కూడా ఈ సభకు తీసుకెళ్లాలని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో ఉన్న 520 బస్సులను తీసుకెళ్లాలని భావిస్తున్నా రు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా.. ఒ క్కో డిపోకు 50 నుంచి 60 వరకు బస్సులను కేటాయిస్తామని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. -
స్వయంకృషి
మోర్తాడ్ (నిజామాబాద్): మోర్తాడ్ మండలం పాలెంకు చెందిన రైతులు స్వయం కృషితో సాగునీటి కష్టాలను గట్టెక్కుతున్నారు. గ్రామానికి చెందిన బూరుగు చెరువు కింద దాదాపు 250 ఎకరాల వరి సాగవుతోంది. ఇటీవల భారీ వర్షాలు కురిసినా చెరువులోకి నీరు చేరలేదు. వరద కాలువ నిర్మాణం వల్ల చెరువులోకి నీరు రావడానికి ఉన్న అన్ని దారులు మూసుకు పోయాయి. పెద్దవాగులోని ఎత్తిపోతల పథకమూ పనిచేయడం లేదు. చెరువు నిండటానికి వరద కాలువ ద్వారా వచ్చే నీరు ఒక్కటే దిక్కయ్యింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చేరిన తర్వాత గోదావరి నదిలోకి నీటిని మళ్లించే పరిస్థితి వస్తేనే వరద కాలువకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం వరద కాలువకు నీటిని మళ్లించే పరిస్థితి లేదు. దీంతో వర్షాలకు వరద కాలువలో నిలువ ఉన్న నీటిని వినియోగించుకోవాలని రైతులు సంకల్పించారు. చెరువు కింద ఉన్న ఆయకట్టు భూముల రైతులు ఒక్కటై ఎకరానికి రూ.4 వేల చొప్పున జమ చేసి రూ.10 లక్షల ఖర్చుతో నీటి మళ్లింపునకు ఏర్పాట్లు చేసుకున్నారు. వరద కాలువలో పంపుసెట్లను అమర్చి వాటి ద్వారా నీటిని వరద కాలువ తూముకు, అక్కడి నుంచి బూరుగు చెరువుకు మళ్లిస్తున్నారు. చెరువులో పూర్తి స్థాయి నీరు నిండితే ఖరీఫ్, రబీ పంటలను గట్టెక్కించవచ్చని రైతులు భావిస్తున్నారు. అంతేగాక చెరువులో నీరు సమృద్ధిగా ఉంటే బోరుబావులకు భూగర్భ జలాలు అందుతాయని, బోరుబావులు ఎత్తిపోకుండా ఉంటాయని రైతులు చెబుతున్నారు. ఏది ఏమైనా వరద కాలువలోని నీటిని మళ్లించడానికి పాలెం రైతులు చేసిన కృషిని పలువురు అభినందిస్తున్నారు. పంటలకు ఇబ్బంది లేదు వరద కాలువలోని నిలువ ఉన్న నీటిని మళ్లించుకోవడం వల్ల పంటలకు ఇబ్బంది లేదు. వర్షాలు కురిసినా బూరుగు చెరువులోకి నీరు రాలేదు. కాని మా ప్రయత్నంతో మాత్రం నీరు వస్తోంది. రైతులు ఏకం కావడం వల్ల సాధ్యం కాదనుకున్నది సుసాధ్యం అయ్యింది. అందరి కృషి ఫలితమే ఇది. – జగురంపల్లి వెంకన్న, రైతు, పాలెం -
ఓటమి భయంతోనే ముందస్తు జపం
సాక్షి, కామారెడ్డి/నిజామాబాద్: ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, దీంతో ప్రజలు తనను ఓడిస్తారన్న భయంతోనే ముందస్తు జపం చేస్తున్నారని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు నెరవేర్చని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ‘బహుజనులకు రాజ్యాధికారం–రాజకీయ పార్టీల వైఖరి’ అంశంపై శుక్రవారం జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దళితుడిని సీఎం చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశాడని, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగమని చెప్పిన హామీలేమి నెరవేరలేదన్నారు. ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకునే.. ముందస్తు ఎన్నికలు అంటున్నాడని విమర్శించారు. రాజ్యాధికారం సాధించకపోవడం వల్లే దశాబ్దాలుగా బడుగు బలహీనవర్గాలు అణచివేతకు గురయ్యాయని, రాజ్యాధికారం ద్వారానే సామాజిక న్యాయం దక్కుతుందని తమ్మినేని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అనేక త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్గాలకు ఎలాంటి న్యాయం జరుగలేదన్నారు. కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అందిస్తామన్న ప్రభుత్వం ఆ మాటను మర్చిపోయి కార్పొరేట్ విద్యావ్యవస్థను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. భూమిని దున్నుకుని బతుకుతున్న రైతులకు ఎకరానికి రూ.4 వేల సాయం అందించడం లేదని, అదే వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రూ.లక్షల కొద్దీ దార పోసిందన్నారు. బీఎల్ఎఫ్ అధికారంలోకి రాగానే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని, కార్పొరేట్ విద్యను రద్దు చేసి, పూర్తిగా ఉచిత విద్య అందిస్తామన్నారు. బీఎల్ఎఫ్ ప్రభంజనం సృష్టిస్తోందని, మెజారిటీ సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి: గద్దర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడెకరల భూ పంపిణీ, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని మోసం చేసిన సీఎం కేసీఆర్‌కు ఓటు అనే ఆ యుధంతో బుద్ధి చెప్పాలని ప్రజాగాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి, రంజాన్‌కు మురిగిపోయిన బి ర్యానీ తినిపిస్తున్నాడని విమర్శించారు. రూ. వెయ్యి పింఛన్ ఇస్తానని భార్యాభర్తల మధ్య ఖ య్యం పెట్టిండన్నారు. దళితులకు భూమి లేదు. యువకులకు ఉద్యోగాలు లేవని విమర్శించారు. మహిళల మీద హింస పెరిగి పోయిందని, మంత్రివర్గంలో వారికి స్థానం లేకపోవడం సిగ్గుచేటన్నా రు. 52 శాతం ఉన్న బీసీలు, 12 శాతం ముస్లింలు, 15 శాతం దళితులు, అగ్రవర్ణాల్లోని 6 శాతం పేదలంతా ఏకమై టీఆర్ఎస్ సర్కారును కూల్చాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు భూమికి పచ్చా ని రంగేసినట్లు, సిరిమల్లె చెట్టుకింద లచ్చుమ మ్మో, దొర నీ టైం అయింది, సాల్ దొర నీ పాలన తదితర పాటలతో గద్దర్ అలరించారు. పలు తీర్మానాలు.. జుక్కల్ సభలో పలు తీర్మానాలు చేశారు. నియోజకవర్గంలోని 4 వేల మంది రైతులకు సంబంధించి 16 వేల ఎకరాల భూములకు పట్టాలు, పాసుబుక్కులతో పాటు పెట్టుబడి సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. బిజ్జల్వాడి ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే చేపట్టాలని సభలో తీర్మానించారు. మద్నూర్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, లెండి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని కౌలాస్ కాలువల మరమ్మతులు చేయాలని సభలో తీర్మానించారు. వైఎస్సార్ సీపీ నాయకులు సాయిలు, బీఎల్ఎఫ్, సీపీఎం వెంకట్రాములు, చంద్రశేఖర్, జడ్గె రవీందర్, సురేష్‌గొండ, విఠల్, బాల్‌రాజ్, మనోజ్, రాములు, భరత్ వాగ్మారే, శ్రీనివాస్, బాలు తదితరులు పాల్గొన్నారు. -
సారూ.. ఇదేం తీరు..?
మద్నూర్(జుక్కల్) : విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు బాల కార్మికులుగా మారుస్తున్నాడు. దేశ నిర్ధేశకుడిగా తీర్చిదిద్దాల్సింది పోయి తరగతి గదులను శుభ్రం చేయించిన సంఘటన మద్నూర్ మండలం మేనూర్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. మండలం లోని మేనూర్ గ్రామంలో గల ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న హెచ్ఎం అంజయ్య గురువారం విద్యార్థులతో తరగతి గదులను శుభ్రం చేయించి కడిగించాడు. పాఠశాలకు ప్రహారి లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఆరు, ఏడు తరగతుల గదుల వద్ద బురద, మట్టి వేశారు. అయితే గదుల ను నీటితో కడిగి శుభ్రం చేయాలని హెచ్ఎం అం జయ్య ఆరో తరగతికి చెందిన భజరంగ్, రోహి దాస్, మందన్‌ను ఆదేశించాడు. హెచ్ఎం చెప్పిం దే తడవుగా విద్యార్థులు నీటిని తీసుకువచ్చి చీపురుతో ఆరు, ఏడు తరగతులను కడిగేశారు. ఇది గమనించిన ‘సాక్షి’ ఫోటోలు తీయడాన్ని చూసిన విద్యార్థులు తరగతి గదిలోకి పారిపోయారు. వి ద్యార్థులతో పాచి పనులు చేయించడం ఏమిటని ప్రశ్నించగా విద్యార్థుల ఇష్టంతోనే పనులు చేస్తున్నారని సదరు హెచ్ఎం చెప్పుకొచ్చాడు. విష యం తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రయోజకులుగా తయారు చేస్తాడని అనుకుంటే పనులు చేయించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఉన్నత పాఠశాలకు హెచ్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న అంజయ్య ఉపాధ్యాయులను, విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సింది పోయి తనే క్రమశిక్షణ తప్పుతున్నాడని పలువురు అంటున్నారు. -
భారీ వర్షాలతో పంటలకు నష్టం
మద్నూర్(జుక్కల్): వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట మొగ్గలు కాస్తున్న సమయంలో భారీ వర్షాలతో పత్తి పంట నీటిలో మునిగిపోయిందని రైతులు కలత చెందుతున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో రైతులు ఎక్కువ శాతం పత్తి పంటను సాగుచేస్తున్నారు. గతేడాది గులాబీ రంగు పురుగు, గిట్టుబాటు ధర, అంతంత మాత్రమే వచ్చిన దిగుబడితో నిండా అప్పుల్లో కూరుకుపోయామని రైతులు వాపో యారు. ఈ సారైనా పంట బాగా పండితే అప్పు లు తీర్చుకుందామని రైతులు చర్చించుకుంటున్నారు. అలాగే చేతికొచ్చిన పెసర, మినుము పంటలు బారీ వర్షాలతో నీట మునిగి కుళ్లిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. -
ప్రాణం తీసిన చేప
కోటగిరి(బాన్సువాడ) : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని యాద్గార్పూర్ గ్రామానికి చెందిన కూలీ షేక్ బషీర్(45) చేపలు పట్టేందుకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు నిండాయి. ఈ నేపథ్యంలో షేక్‌బషీర్ మంగళవారం ఉద యం తన ఇంటి నుంచి కొందరు స్నేహితులతో కలిసి గ్రామ చెరువు సమీపంలోని వాగు వద్దకు వెళ్ళాడు. గ్రామ చెరువు అలుగు పారుతుండడంతో చెరువులోని చేపలు వాగులోకి కొట్టుకు రావడంతో గమనించిన షేక్‌బషీర్ కర్ర సహాయంతో చేపలను కొట్టాడు. చేప కిందపడడంతో దాన్ని పట్టుకునే ప్రయత్నంలో అదుపుతప్పి వాగులో పడిపోయాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు గమనించి గ్రామంలోకి వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ సులోచన, జెడ్పీటీసీ పుప్పాల శంకర్, తహసీల్దార్ విఠల్, ఆర్ఐ కృష్ణదత్తు, అడీషనల్ ఆర్ఐ నజీర్, ఎస్ఐ రాజ్‌భరత్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి చెరువు వద్దకు చేరుకున్నారు. హంగర్గకు చెందిన మక్కయ్య అనే యువకుడు వాగులోకి వెళ్ళి గాలించగా మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చాడు. మక్కయ్య ప్రతిభను పలువురు అభినందించారు. మృతదేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు షేక్‌బషీర్ వాగులో పడి మృతి చెందాడనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు విషాదానికి గురయ్యారు. ప్రతిరోజు అందరితో కలుపు గొలుపుగా ఉండేవాడని క్షణాల్లో కళ్ళముందర ఉన్న వ్యక్తి మృతి చెందాడనే వార్త పలువురు జీర్ణించుకోలేక పోయారు. అక్కడికి చేరిన ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ధైర్యం చెప్పారు. మృతదేహం ఒడ్డుకు చేర్చే వరకు అక్కడే ఉన్నారు. -
మొక్కుబడిగా ‘కంటి వెలుగు’
నిజాంసాగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం గ్రామాల్లో మొక్కుబడిగా సాగుతోంది. వైద్యులు సమయపాలన పాటించకపోవడం, మండల, గ్రామ స్థాయి పలు శాఖల అధికారులు శిబిరాలకు డుమ్మా కొడుతున్నారు. దాంతో క్షేత్రస్థాయిలో కంటి వెలుగు వైద్యుల ఇష్టా రాజ్యంగా మారింది. షెడ్యూల్ ప్రకారం మండలంలోని తెల్గాపూర్ గ్రామంలో మంగళవారం కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు సమయానికి శిబిరానికి చేరుకున్నారు. అయితే మండల వైద్యులు, కంటి వైద్యులు శిబిరానికి సకాలంలో హాజరుకాకపోవడంతో వైద్య సిబ్బంది, రోగులు నిరీక్షించారు. గ్రామ పంచాయతి కార్యదర్శి, వీఆర్వోతో పాటు మండల అధికారి కంటి వెలుగు శిబిరానికి దూరంగా ఉన్నారు. గ్రామ, మండలస్థాయి అధికారులు శిబిరాలకు దూరంగా ఉండటంతో వైద్యాధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంత పేదలకు ప్రపంచానికి చూపు నిచ్చేందుకు ప్రభుత్వం కంటి వెలుగుకు శ్రీకారం చుట్టినా నిర్వాహకుల పనితీరుపై స్థానికులు మండి పడుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఒకే ఒక్కడు..
‘చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నారు’.. అన్నట్లు తయారైంది ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి వ్యవహారం. ఓ ప్రజాప్రతినిధి మనిషిని అంటూ కార్యాలయానికి వచ్చేవారిని బెదిరిస్తున్నాడు. ఆ ఉద్యోగి మాట కాదన్నారంటే చాలు ఏకంగా కార్యాలయాన్నే తరలిస్తాం.. అంటూ హెచ్చరికలూ జారీ చేస్తున్నాడు! ఇదెక్కడి లేనిపోని తలనొప్పి అంటూ అక్కడికి వచ్చే కాంట్రాక్టర్లు, ఇతర ఉద్యోగులు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి చేతి తడిపి పని చేసుకుంటున్నారు. లేదంటే ఫైలు కదలదండోయ్! బాన్సువాడ టౌన్ : డివిజన్ కేంద్రంలోని పంచాయ తీ రాజ్ కార్యాలయంలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి బరితెగించాడు. బోధన్ ఎమ్మెల్యే అనుచరుడిని.. అం టూ సదరు ప్రభుత్వ ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిన పట్టించుకునేనాథుడే కరువయ్యా రు. సదరు ఎమ్మెల్యే పేరు చెప్పి బాన్సువాడలో ఉ న్న పంచాయత్ రాజ్ డివిజన్ కార్యాలయాన్ని బో ధన్‌కు తరలిస్తానని బెదిరిస్తున్నారు. నిత్యం బిల్లు ల కోసం కార్యాలయానికి వచ్చే కాంట్రాక్టర్ల నుం చి అందినంత దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాన్సువాడ పంచాయత్ రాజ్ డివిజన్ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఓ కంప్యూటర్ ఆపరేటర్ అన్ని తానై వ్యవరిస్తున్నారు. సదరు ఆపరేటర్ జుక్కల్ నియో జకర్గ బాధ్యతలు వ్యవరిస్తున్నారు. జుక్కల్ నియో జకవర్గంలో ఏ అభివృద్ధి పని జరిగినా ఆ పనికి సంబంధించిన ప్రతి బిల్లు ఈ ఆపరేటర్ కంప్యూటరీకరణ చేసి ఫైల్‌ను ఉన్నతాధికారి టేబుల్‌పైకి పం పిస్తారు. జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, మద్నూర్ మండలాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు, మెట ల్ రోడ్లుకు సంబంధించిన బిల్లులు మంజూ రు కావాలంటే సదరు కాంట్రాక్టర్లు బాన్సువాడ డివిజన్ కార్యాలయానికి రావాల్సిందే. కార్యాల యం లోకి రాగానే ముందుగానే సదరు ఆపరేటర్ ను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఆపరేటర్‌ను కలిసి బిల్లుకు సంబంధించిన పత్రాలను కంప్యూటర్లో నమోదు చేసి ఫైల్‌ను డీఈ, ఈఈ టేబుల్‌పైకి పం పించాలి. ఫైల్ కదలాలంటే సదరు ఆపరేటర్ చేయి తడపాల్సిందే. చేయి తడిపితేనే ఫైల్ ప్రాసె స్ ముందుకు కదులుతుంది. లేదంటే ఏదో ఓ సాకు చెప్పి ఫైల్ వెనక్కివెళ్తుంది. కార్యాలయానికి వచ్చే ఏ వ్యక్తితోనైన మాటలు కలుపుకుని బాన్సువాడలో ఉన్న డివిజన్ కార్యాలయంలో బోధన్‌కు తరలిస్తానని చెప్పడం అలవాటైంది. బోధన్ ఎమ్మెల్యేతో నాకు మంచి సంబంధాలు ఉ న్నాయని చెప్పడం గమనార్హం. జుక్కల్ నియోజకవర్గం కాంట్రాక్టర్లకే కాదు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అనుచరుల వద్ద కూడా ముక్కుపిండి మరి వసూలు చేసిన సంఘటలను ఉన్నా యని తెలిసింది. సదురు ఆపరేటర్ బోధన్, నిజా మాబాద్, ఆర్మూర్ ప్రాంతాలో రూ.కోట్లాది విలువ చేసే ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సమాచారం. -
సంజయ్‌కు ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్
సాక్షి, నిజామాబాద్ : నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల కేసులో నిజామాబాద్ మాజీ మేయర్ డి సంజయ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. నర్సింగ్ కాలేజీ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో సంజయ్‌ను ఈ నెల 12న అరెస్టు చేసి, జిల్లా జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తరఫు న్యాయవాదులు కృపాకర్‌రెడ్డి, ఆకుల రమేశ్.. ఈ నెల 14న ఎస్సీ, ఎస్టీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్.. సంజయ్ విచారణ ఇంకా పూర్తి కాలేదని కోర్టుకు తెలిపారు. అతని విచారణకు మరింత సమయం పడుతుందన్నారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సంజయ్‌కు 13 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. -
అన్న పెళ్లి కోసం వచ్చి అనంతలోకాలకు..
పెద్దకొడప్గల్(జుక్కల్): తన అన్న పెళ్లి కోసం వచ్చి అనంత లోకాలకు వెళ్లాడు ఓ యువకుడు. రెండు రోజుల్లో ఇంట్లో పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో కొడుకు చావు బాజా మోగించడం ఆ కుటుంబానికి తీవ్ర విషాదంలో నెట్టింది. పెద్ద కొడప్గల్కు చెందిన మాడుమారుతి(24) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పెద్దకొడప్గల్కు చెందిన కోక బాలయ్య శకుంతలకు ముగ్గురు కుమారులు. తన పెద్ద కుమారుడి పెళ్లి కుదరడంతో ఈ నెల 24న పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. పెళ్లి హడావుడిలో అన్న పెళ్లి పనుల కోసం హైదరాబాద్‌లో పనిచేస్తున్న మారుతి శుక్రవారం సొంతూరుకు వచ్చాడు. పెళ్లి పత్రికలు పంచుతూ శనివారం రాత్రి మండలంలోని బేగంపూర్‌కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో పెద్దకొడప్గల్ పిట్లం జాతీయ రహదారిపై వాహనం అదుపుతప్పి కింద పడిపోయాడు. మారుతికి ఛాతిపై తలకు తీవ్రంగా దెబ్బలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐస్సై నవీన్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం తరలించారు. కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతం రెండు రోజుల్లో పచ్చటి పందిరిలో బంధువులు, పిల్లాపాపలు, పెళ్లి బజా మోగాల్సిన ఇంట్లో మారుతి మృతితో ఆ ఇల్లు మూగ బోయింది. ఆడబిడ్డలతో సంతోషంతో ఉన్న ఇంట్లో చావు వార్త వినడంతో కుటుంబ సభ్యుల రోదన చూపరులకు కంట తడి పెట్టించింది. కొన్ని గంటల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిన కుమారుడు శవమై తిరిగి వచ్చాడని తల్లిదండ్రులు తీవ్రంగా విలపించారు. పెళ్లి చూడాల్సిన వయస్సులో చావు చూస్తున్నామని మారుతి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో మృతుడి ఇంటి వద్ద బంధువులు, గ్రామస్తులు విచార వదంలో ఉండిపోయారు. అయ్యో బిడ్డా.. వెళ్లి పోతివా.. అంటూ బాధపడ్డారు. మారుతి మృతి తో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
బీసీ హాస్టల్లో ర్యాగింగ్
నిజామాబాద్, నాగారం : జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసిన ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. నాందేవ్‌వాడలోని బీసీ హాస్టల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్లను వేధించడంతో వారిపై కేసు నమోదైంది. నగరంలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు బీసీ వసతిగృహంలో వసతి పొందుతున్నారు. అయితే, కొంద రు డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు జూనియర్లను తరచూ వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య గొడవలు కూడా జరిగాయి. గిరిరాజ్ కాలేజ్, నిశిత డిగ్రీ కాలేజ్‌లో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు వినోద్, శ్రీకాంత్, రాజు, ప్రీతమ్ కొన్నాళ్లుగా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నా రు. సెకండియర్ విద్యార్థులను పిలిచి వారిని వేధిస్తున్నారు. హాస్టల్లో ఉన్న మూత్రశాలలు, మరు గుదొడ్లు శుభ్రం చేయాలని, సీనియర్లు తిన్న ప్లేట్లను కడగాలని వేధిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్‌కు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని జూనియర్లు తెలిపారు. వేధింపులు మరీ ఎక్కువ కావడంతో చివరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విష యం తెలిసిన హాస్టల్ వార్డెన్ బాలకృష్ణ విద్యార్థులను వెంట బెట్టుకొని ఆదివారం మూడో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదు పులోకి తీసుకున్నారు. అలాగే, విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. చెప్పినా మార్పు రాలేదు.. ర్యాగింగ్ జరుగుతున్న విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. రాత్రుల్లో జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో సీనియర్ విద్యార్థులకు శుక్రవారం కౌన్సెలింగ్ ఇచ్చినా వారిలో మార్పు రాలేదు. అందుకే జూనియర్లతో కలిసి 3వ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. – బాలకృష్ణ, వార్డెన్ బెదిరించే వారు.. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు సెకండియర్ విద్యార్థులను ర్యాగిం గ్ చేస్తున్నారు. రోజూ మూత్రశాలలు కడిగించడం, మరుగుదొడ్లు కడిగించడం వంటివి చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. వేధించవద్దని ఎన్నిసార్లు కోరినా వారు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని వార్డెన్‌కు చెప్పాం. వార్డెన్ ముందే మాపై దాడి చేశారు. హాస్టల్లో ర్యాగింగ్ జరగకుండా చూడాలి. – నరేశ్, డిగ్రీ సెకండియర్ విద్యార్థి -
శ్రీరాం సాగర్‌కు జలకళ
సాక్షి, నిజామాబాద్ : భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులు, కుంటలు, చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. తెలంగాణతో పాటు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1071.9 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 32.912 టీఎంసీలు ఉంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టులోకి 14 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఆదివారం మధ్యాహ్నం వరద ఇన్ ఫ్లో 16,450 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిండుకుండలా మారడంపై ఆయకట్టు రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాం సాగర్ జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. -
బీసీ హాస్టల్లో జూనియర్లపై సీనియర్ల దాడి
నిజామాబాద్ : తమ బట్టలు ఉతకాలంటూ సెకండియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులపై దాడి చేసిన సంఘటన నిజామాబాద్ బీసీ హాస్టల్లో చోటుచేసుకుంది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక నిజామాబాద్ 3వ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సీనియర్ల వేధింపులు ఎక్కువై ఐదుగురు విద్యార్థులు కూడా హాస్టల్ వదిలి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. బీసీ హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్లనే సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. -
జల జగడం
జక్రాన్‌పల్లి (నిజామాబాద్ రూరల్): మండలం లోని పెద్దవాగులో నిర్మించిన చెక్‌డ్యాం నుంచి నీ టి విడుదల గ్రామాల మధ్య జల జగడానికి దారి తీసింది. ఇరువైపుల నుంచి ప్రజలు పెద్ద సంఖ్య లో తరలి రావడంతో శనివారం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నీరు వదలాలని ఒకరు, వదలద్దని మరొకరు పట్టుబట్టడంతో పెద్ద వాగులో వాదులాట జరిగింది. అయితే, అధికారులు వేగంగా స్పందించడంతో ప్రస్తుతానికైతే జల వివాదం సద్దుమణిగింది. జక్రాన్‌పల్లి మండలంలోని కలిగోట్, చింతలూర్ గ్రామాల మధ్య గల పెద్దవాగులో ప్రభుత్వం రూ.3.50 కోట్లతో చెక్ డ్యాం నిర్మించింది. ఈ చెక్ డ్యాంకు కుడి వైపున మాటు కాలువ ద్వారా నడ్కుడ చెరువులోకి నీరు వెళ్లేలా ఆరు అడుగులతో కూడిన ఒక గే టు(షట్టర్)ను బిగించారు. అయితే, ఇటీవలి వర్షాలకు చెక్‌డ్యాం నిండడంతో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి చెక్ డ్యాంను ప్రారంభించి, షట్టర్‌ను తెరిచి నడ్కుడ చెరువులోకి నీటిని విడుదల చేశారు. గేటు మూసేయడంతో వివాదం.. అయితే, చెక్‌డ్యాంలో నిలువ ఉన్న నీరు వెళ్లిపోతుండడంతో కలిగోట్, చింతలూర్ గ్రామస్తులు శనివారం ఉదయం చెక్ డ్యాం వద్దకు వెళ్లి షట్టర్‌ను మూసివేశారు. ఈ విషయం తెలిసి నడ్కుడ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కలిగోట్ వద్దకు తరలి వచ్చారు. అప్పటికే అక్కడ కలిగోట్, చింతలూర్ గ్రామస్తులు ఉండడంతో ఏం జరుగుతుందోన్న ఆందోళన నెలకొంది. వాగులో గుమి గూడిన ఆయా గ్రామాల ప్రజలు వాగ్వాదానికి దిగారు. సమాచారమందుకున్న నీటిపారుదల శాఖ ఈఈ రాధాకిషన్‌రావు, డీఈలు నాగేశ్వర్రావు, గోపినాథ్, జక్రాన్‌పల్లి, వేల్పూర్ తహసీల్దార్లు సతీశ్‌రెడ్డి, అర్చన, ఆర్మూర్ రూరల్, ధర్పల్లి సీఐలు పాలగొల్లు రమణారెడ్డి,« చందర్‌రాథోడ్, జక్రాన్‌పల్లి, వేల్పూర్ ఎస్సైలు సురేశ్‌కుమార్, ప్రభాకర్ అక్కడకు చేరుకుని ఇరు వర్గాల వారికి సర్దిచెప్పారు. అనంతరం ఒక్కో గ్రామం నుంచి పది మంది చొప్పున ప్రజాప్రతినిధులు, వీడీసీ సభ్యులు, మంది రైతులతో అధికారులు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. నీళ్లు వదలాలి: నడ్కుడ వాసులు.. ఇరవై ఏళ్లుగా తాగు, సాగునీటికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని, చివరకు ప్రజాప్రతినిధుల సహకారంతో చెక్ డ్యాం నిర్మించుకుంటే ఇ ప్పుడు వచ్చి నీటిని అడ్డుకోవడం సరికాదని నడ్కుడ వాసులు తెలిపారు. 250 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న చెరువులో ప్రస్తుతం ఒక్క నీటి బొట్టు లేదని, తాగునీరు కూడా దొరకడం లేదన్నారు. చె క్‌డ్యాం నిర్మాణ సమయంలోనే అడ్డు చెప్పకుండా కలిగోట్, చింతలూర్ గ్రామస్తులు ఇప్పుడు నీళ్లు వదలకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. చెక్ డ్యాంకు నిర్మించిన గేటును తెరిచి నడ్కుడ చెరువులోకి నీటిని వదలి ఆదుకోవాలని కోరారు. ఒప్పుకోబోమన్న కలిగోట్, చింతలూరు గ్రామస్తులు.. అయితే, చెక్ డ్యాంలో నిల్వ ఉన్న నీటిని తరలించుకు పోతామంటే ఒప్పుకునేది లేదని కలిగోట్, చింతలూరు ప్రజలు స్పష్టం చేశారు. చెక్ డ్యాంలో నిల్వ ఉన్న నీరు కాకుండా అదనపు నీటిని వదిలితే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. వాగు ప్రవ హించినప్పుడు, రామడుగు ప్రాజెక్టు సర్ప్లస్ వా టర్ వచ్చినపుడు మాత్రమే షట్టర్ ద్వారా నీళ్లు వదలాలని సూచించారు. వాగు పారకపోతే ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని, తాగు, సాగునీరుకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. అధికారులు పరిశీలించి ఇరు గ్రామాల రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న అధికారులు ఉన్నతాధికారులకు ఫోన్లో పరిస్థితిని వివరించారు. అయితే, ఎలాంటి నిర్ణయం వస్తుందోనని ఇరు గ్రామాల ప్రజలు రెండు గంటల పాటు వేచి చూశారు. అనంతరం ఆర్మూర్ సీఐ రమణారెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల కు విన్నవించామని, వారి ఆదేశాల మేరకు నిర్ణయం చెబుతామన్నారు. ఉన్నతాధికారుల నిర్ణయం ప్రకారం ఇరు గ్రామాల ప్రజలు నడుచుకోవాలన్నారు. ఇరు గ్రామాల ప్రజలు సంయమ నం పాటించాలని, చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా చర్యలు తప్పవని సూచించారు. ఎలాంటి నిర్ణయం వచ్చినా ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. దీంతో ఇరు గ్రామాల ప్రజలు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
టికెట్ టెన్షన్!
టీఆర్ఎస్ శాసనసభ్యుల గుండెల్లో గుబులు మొదలైంది.. సిట్టింగ్‌లకే సీట్లిస్తామన్న సీఎం కేసీఆర్.. ఒకటి, రెండు చోట్ల మార్పులు తప్పవని చేసిన ప్రకటన అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆందోళనకు గురి చేస్తోంది. ‘ఒకటి, రెండు మార్పులు’ అన్న అంశంపైనే ప్రధానంగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఎవరి సీట్లు గల్లంతవుతాయి.. ఎవరికి టికెట్లు దక్కుతాయనే అంశంపైనే ప్రధాన చర్చ నడుస్తోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఒకవైపు ఆనందం, మరోవైపు ఒకింత ఆందోళన నెలకొంది. సిట్టింగ్‌లకే సీట్లని సీఎం కేసీఆర్ ప్రకటించడం వారిలో సంతోషం నింపగా.. ఒకటి, రెండు మార్పులుంటాయని ఆయన కుండబద్దలు కొట్టడం శాసన సభ్యులను కలవరపెడుతోంది. సెప్టెంబర్‌లోనే అభ్యర్థుల తొలి జాబి తా విడుదల చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో అధికార పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే, ‘ఒకటి, రెండు మార్పులు’ అన్న అంశంపైనే ప్రధానంగా ఈ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొందరు ఎమ్మెల్యేలకు టికెట్ టెన్షన్ పట్టుకుంది. సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని పేర్కొన్న కేసీఆర్.. మరోవైపు ఒకటీ రెండు చోట్ల మార్పులుంటాయనే సంకేతాలివ్వడం తెలిసిందే. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలు అభ్యర్థిత్వంపై ఎక్కడో ఒకింత అభద్రతాభావంతో ఉన్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆ మార్పు చేయాలని భావిస్తున్న సీట్లలో ఉమ్మడి జిల్లాకు చెందిన నియోజకవర్గాలేమైనా ఉంటాయా..? అనే అంశంపై పార్టీలో విశ్లేషణ సాగుతోంది. అభ్యర్థుల ఎంపికలో కేశవరావు నేతృత్వంలోని పార్టీ ప్రధాన కార్యదర్శు లు, కార్యదర్శులతో ఎప్పటికప్పుడు తెప్పించుకు నే నివేదికలు కూడా కీలకమని కేసీఆర్ పేర్కొన్నా రు. దీంతో సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు అంటూనే ఎంపిక కమిటీని నియమించడంతో కొందరు ఎమ్మెల్యేలకు అంతర్గతంగా టెన్షన్ పట్టుకుంది. కొందరు ఎమ్మెల్యేల్లో టెన్షన్! 2014 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా గులాబీ జెండాను ఎగురవేసింది. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన సీనియర్ నేతలున్న కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఖాతా కూడా తెరువలేక పోయింది. నిజామాబాద్ అర్బన్ వంటి పలు నియోజకవర్గాల్లో కొంత పట్టున్న బీజేపీ సైతం ఉనికి చాటుకోలేక పోయింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా గత ఫలితాలనే పునరావృతం చేయాలని అధికార పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వ, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నిర్వహించుకుని వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆరు నెలల ముందుగానే అభ్యర్థుల ప్రకటన చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. మొత్తం మీద పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రకటన పార్టీ శ్రేణుల్లో ఎన్నికల ఉత్సాహాన్ని నింపగా, ఎమ్మెల్యేల్లో మాత్రం టెన్షన్ మొదలైందనే చర్చ గులాబీ దళంలో సాగుతోంది. మొదటి విడతలో ఖరారయ్యేదెవరికి..? సెప్టెంబర్‌లోనే టిక్కెట్లు ఖరారు చేయడం ద్వారా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో మరింతగా ప్రజలతో మమేకం అయ్యేందుకు అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో మొదటి విడతలో ఖరారయ్యే స్థానాలు మూడు నుంచి నాలుగు ఉండే అవకాశాలున్నాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మొదటి విడతలో ఎవరి స్థానం ఉంటుందా అని టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. సమాజిక సమీకరణాలు, ఎలాంటి వివాదాలు లేని నియోజకవర్గాలు, అలాగే టిక్కెట్ కోసం పోటీ పడే నేతలు లేని నియోజకవర్గాలకు మొదటి జాబితాలో చోటు దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు, వివాదాల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నయంగా ఇతర నేతలు తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. -
పాస్ కావాలంటే.. పైసలిస్తే చాలు
మోర్తాడ్ : పారిశ్రామిక రంగానికి సంబంధించి వివిధ కోర్సుల్లో శిక్షణనిచ్చేందుకు కమ్మర్పల్లి మండలం బషీరాబాద్‌లో నెలకొల్పిన ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. వివిధ కోర్సుల్లో శిక్షణ కోసం అడ్మిషన్ పొందిన అభ్యర్థులకు హాజరు శాతం తక్కువగా ఉంటే పరీక్షలు రాయనివ్వమనే నెపంతో కొందరు ఫ్యాకల్టీ(శిక్షకులు) అందినకాడికి దండుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెమిస్టర్ పరీక్షల్లో అభ్యర్థులు పాస్ కావాలంటే తాము వేసే మార్కులకు ఎంతో కొంత ఇచ్చుకోవాల్సిందే అని దబాయించి మరీ వసూళ్లకు పాల్పడినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీఐ కోర్సులలో శిక్షణ పొందినట్లు సర్టిఫికెట్లు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకా శం కలుగడంతో పాటు స్వయం ఉపాధికి బ్యాం కుల నుంచి రుణం పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలకు ఐటీఐ సర్టిఫికెట్లు ఉంటే వేతనాలు ఎక్కువ లభించే అవకాశం ఉంది. పైన పేర్కొన్న అంశాల ను దృష్టిలో ఉంచుకుని ఎంతో మంది అభ్యర్థులు బషీరాబాద్ ఐటీఐలో అడ్మిషన్లు తీసుకున్నారు. మూడు జిల్లాలకు చెందినవారు.. ఇక్కడ కోబా, డ్రెస్ మేకింగ్, ఫిట్టర్, డీజిల్ మెకానిజం, ఎలక్ట్రిషియన్, సివిల్, వెల్డర్ విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు చెందిన దాదాపు 300ల మంది ఈ కోర్సులలో ప్రవేశం పొంది శిక్షణ పొం దుతున్నారు. ఇటీవల సెమిస్టర్ పరీక్షలు ప్రారం భం కాగా మరి కొన్ని రోజుల వరకు సాగనున్నా యి. విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు కీలకం కావ డం అక్రమార్కులకు వరంగా మారింది. శిక్షణ సమయంలో తరగతులకు హాజరుకాని విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు అవకాశం లేదు. అయితే కొంత మంది అభ్యర్థులు అడ్మిషన్లు తీసుకున్నా తమ కుటుంబాల ఆర్థిక స్థితి బాగా లేక ఏదో ఒక పని చేసుకుంటూ పరీక్షలకు మాత్ర మే హాజరవుతున్నారు. మరి కొందరు మాత్రం తాము అడ్మిషన్ పొందిన కోర్సులకు సంబంధించి తమ గ్రామాల్లోనే పని చేసుకుంటూ పరీక్షలకు హాజరు కావాలని భావిస్తున్నారు. కోబా, డ్రెస్ మేకింగ్, సివిల్ రంగాల్లో శిక్షణ కోసం అడ్మిషన్లు తీసుకున్న వారు మాత్రం రెగ్యులర్‌గా వస్తుంటా రు. ఇది ఇలా ఉండగా కొన్ని కోర్సులకు సంబంధించి థియరీ మాత్రమే చెబుతుండగా ప్రాక్టికల్స్ కు సంబంధించి పరికరాలు లేక పోవడంతో అభ్యర్థులు తరగతులకు హాజరుకాకుండా ఉన్నారు. హాజరుశాతం వంక చూపుతూ.. అభ్యర్థుల అవసరాన్ని అవకాశంగా తీసుకున్న అక్రమార్కులు హాజరుశాతం వంక చూపుతూ పరీక్షలు రాసేందుకు అభ్యంతరం చెబుతున్నారు. దీంతో కొంత మంది అభ్యర్థులు హాజరు శాతం కోసం రూ.వెయ్యి నుంచి రూ.1,500ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. అలాగే సెమిస్టర్ పరీక్షల్లో పాస్ కావడానికి అవసరమైన మార్కులు వేయాలన్నా, మాస్ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వడానికి ఒక్కో అభ్యర్థి నుంచి అక్రమార్కులు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెమిస్టర్ పరీక్షలకే కాకుండా ప్రాక్టికల్స్ పరీక్షల్లోను ఉత్తీర్ణత చేసేందుకు కూడా వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో విద్యార్థి నుంచి రూ.3వేల వరకు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఏటా అక్రమార్కులు అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో దండుకుంటూనే ఉన్నారు. తాము అడిగినంత ఇచ్చుకోనివారిని ఇబ్బందులకు గురి చేసినట్లు పలువురు ఆరోపించారు. అక్రమార్కులను ప్రశ్నించే ధైర్యం చేస్తే తమను టార్గెట్ చేస్తారని అభ్యర్థులు వాపోతున్నారు. బషీరాబాద్ ఐటీఐలో కొన్నేళ్ల నుంచి అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో అక్రమార్కులకు అడ్డుకట్ట వేసినవారు లేరు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బషీరాబాద్ ఐటీఐలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని పలువురు కోరుతున్నారు. -
వాజ్‌పేయితో జిల్లాకు అనుబంధం
సుభాష్‌నగర్ (నిజామాబాద్‌అర్బన్)/ఆర్మూర్ : దివంగతులైన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి జిల్లాతో అనుబంధం ఉంది. మూడు పర్యాయాలు ఆయన జిల్లాకు వచ్చారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడని, జనసంఘ్, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ.. ఇలా వివిధ పార్టీలు, పదవులు, హోదాల్లో జిల్లాలో పర్యటించిన ఆయనను జిల్లా బీజేపీ నేతలు స్మరించుకుంటున్నారు. జిల్లాలో 1971లో సమితి ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు జనసంఘ్ అభ్యర్థిగా పోటీ చేసిన మురళీ మోహన్‌రెడ్డి భీంగల్ సమితి ప్రెసిడెంట్‌గా గెలుపొందారు. విషయం తెలుసుకున్న అటల్ బిహారీ వాజ్‌పేయి జిల్లా కేంద్రానికి వచ్చి పబ్లిక్‌గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. వాజ్‌పేయి అప్పటికే ఐదోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి 1980లో రెండోసారి జిల్లాకు వచ్చారు. జనతాపార్టీ తరపున ఎంపీగా గెలిచిన ఆయన మొరార్జీ దేశాయ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో జరిగిన బహిరంగ సభకు విచ్చేసి ప్రసంగించారు. ఆ సమయంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అనుకూలమైన అంశాలను సభలో వివరించారు.1993లో పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో భారత పరిక్రమణ యాత్రలో భాగంగా వాజ్‌పేయి జిల్లా పర్యటించారు. ఉదయం బాల్కొండలో బహిరంగ సభ నిర్వహించారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని హరిచరణ్ మార్వాడీ పాఠశాల గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అప్పుడు ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్ మీదుగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. వాజ్‌పేయి ఆర్మూర్‌లోని ఐబీ గెస్ట్ హౌజ్ (ప్రస్తుత పోలీస్ స్టేషన్ భవనం)లో రాత్రి బస చేసారు. రాత్రి భోజనాలతో పాటు ఈ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు లోక భూపతిరెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, పుప్పాల శివరాజ్ తదితర నాయకులతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. దేశానికి నిస్వార్థంగా సేవలందించిన వాజ్‌పేయి మరణం పార్టీకే కాదు యావత్ దేశానికే తీరని లోటని బీజేపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతికి భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి కొండెల సాయిరెడ్డి, జిల్లా అధ్యక్షులు కొండా ఆశన్న సంతాపాన్ని తెలియజేశారు. -
సంజయ్ బెయిల్ పిటిషన్ వాయిదా
నిజామాబాద్ లీగల్(నిజామాబాద్ అర్బన్): మాజీ మేయర్ డి. సంజయ్ బెయిల్ పిటిషన్ రేపటికి(గురువారం) వాయిదా వేస్తూ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక విచారణ కోర్టు ప్రత్యేక జడ్జి రమేష్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంజయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి వివరాలతో కూడిన కేసు డైరీ(సీడీ)ని మంగళవారం పీపీ శశికిరణ్‌రెడ్డికి అందించాల్సి ఉంది. కాగా పోలీసులు అందించలేదు. దాంతో పీపీ కేసు డైరీ తనకు అందలేదని, డైరీ స్వీకరించాక తదుపరి డైరీలోని అంశాలను చదివాకే తన వాదనలు వినిపిస్తానని కోర్టుకు విన్నవించారు. దాంతో జడ్జి రమేష్‌కుమార్ పీపీ శశికిరణ్‌రెడ్డి అభ్యర్థన మేరకుపై నిర్ణయం తీసుకుంటూ సంజయ్ తరపున న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సంజయ్ తరపున న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తు పత్రాలు తీసుకున్న ప్రాసిక్యూషన్ అధికారి బాధిత మహిళలు పోలీసుల విచారణలో వెల్లడించిన వివరాలు గురించి వివరిస్తూ బెయిల్ దరఖాస్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. సంజయ్ పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును తిరస్కరించాలని జడ్జికి సైతం నివేదించనున్నట్లు తెలిసింది. కేసు డైరీ సమర్పణ జాప్యం ఆంతర్యమేంటో? జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మేయర్ సంజయ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై వాదనలు గురువారానికి వాయిదా పడటం, ఆయనకు త్వరగా బెయిల్ వచ్చే అవకాశం లేకుండా చేసేందుకు పోలీసులు కేసు డైరీ(సీడీ)ని పీపీకు సమర్పించే విషయంలో పోలీసులు చేస్తున్న జాప్యం వెనుక గల కారణాలు ఏమిటోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. వాస్తవానికి సంజయ్ తరపున న్యాయవాదులు ఆకుల రమేష్, కృపాకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సోమవారం దాఖలు చేశారు. దీనిపై కోర్టులో మంగళవారం వాదనలు జరుగాల్సి ఉండగా, నాల్గోటౌన్ పోలీసులు కేసు కేసు డైరీ(సీడీ)ని పీపీకి అందకపోవడంతో, బెయిల్ పిటిషన్‌పై విచారణను జడ్జి గురువారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం పోలీసులు సంజయ్‌ను కస్టడిలోకి తీసుకునేందుకు కస్టడి పిటిషన్ వేయనున్నారు. దీని కోసం నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్ మంగళవారం మధ్యాహ్నం జిల్లా కోర్టుకు వచ్చి పీపీతో మాట్లాడి వెళ్లినట్లు తెలిసింది. గురువారం పోలీసులు వేయనున్న కస్టడి పిటిషన్‌పై న్యాయవాదులు సంజయ్‌ను ఎందుకు కస్టడీ కోరుతున్నారో జవాబు ఇవ్వాలని కౌంటర్ వేస్తారు. ఈ కౌంటర్‌పై వాదనలు మరుసటి రోజు అంటే శుక్రవారానికి పెట్టే అవకాశం లేకపోలేదు. దీనిపై న్యాయమూర్తి వాదనాలు వినే అవకాశం ఉంటే వాదనలు విని సంజయ్‌కు బెయిల్ ఇచ్చే విషయంలో అభ్యంతరం లేదంటే సంజయ్‌కు బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే వాదనలు రానున్న సోమవారం విని మంగళవారం బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. రేపు పోలీసులు కస్టడి పిటిషన్ వేయకుంటే సంజయ్‌కు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. పోలీసులు కోర్టుకు కేసు డైరీ సమర్పణలో జాప్యం చేస్తుండటంపై సంజయ్‌కు బెయిల్ త్వరగా రాకుండా పోతోందని గుసగుసలు వినబడుతున్నాయి. -
బహిష్కరణ ఎత్తివేసే వరకు ఆందోళన
నిజామాబాద్, నాగారం : పరిపూర్ణనందస్వామి బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వీహెచ్‌పీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. సోమవారం నాలుగువైపుల నుంచి కలెక్టరేట్‌కు భారీ ఎత్తున కార్యకర్తలు, హిందుత్వవాదులు, హిందువాహిణి, భజరంగ్ దళ్, ఏబీవీపీ, సాధు పరిషత్, న్యాయవాదులు, మహిళ మోర్చ, బీజేపీ నాయకులు తరలివచ్చారు. ఒక్కసారిగా కలెక్టరేట్ గేట్లను ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమై అందరిని అడ్డుకున్నారు. అయిన కొంత మంది గేటు లోపలికి చొచ్చుకొని వెళ్లిపోయారు. అక్కడే ధర్నా చేస్తూ నిరసన తెలుపుతున్న వీహెచ్‌పీ నాయకులను, బీజేపీ నాయకులను, హిందుత్వ నాయకులను అరెస్టు చేసి పోలీసుల వాహనాల్లో స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. ఎత్తివేసే వరకు ఆందోళన చేస్తాం.. హిందుసామాజాన్ని ధర్మాన్ని మార్గదర్శనం చేస్తున్న గురువులను నిర్భందించి బహిష్కరించడం సరికాదని నాయకులు అన్నారు. ఇకనైన ప్రభుత్వం పరిపూర్ణనంద స్వామి బహిష్కరణను రద్దు చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్, ధన్పాల్ సూర్యనారాయణగుప్త, బస్వాలక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, నాయకులు, ప్రతినిధులు అరెస్టు అయ్యారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు గంగకిషన్, పిట్ల స్వామి, అల్జాపూర్ శ్రీనివాస్, యెండల సుధాకర్, న్యాలం రాజు, రోషన్‌బోరా, యశ్వంత్, లక్ష్మీనారాయణ, సురేష్ పాల్గొన్నారు. స్వామిపై బహిష్కరణ ఎత్తివేయాలి కామారెడ్డి క్రైం: పరిపూర్ణనందస్వామిపై విధించిన నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందు పరిషత్, బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కలెక్టరేట్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి మాట్లాడారు. సర్వసంగ పరిత్యాగి అయిన పరిపూర్ణనందస్వామిపై నగర బహిష్కరణ విధించడం తగదన్నారు. ఆయనపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పరిపూర్ణనందస్వామిని హైదరాబాద్‌కు తిరిగి తీసుకురావాలన్నారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన బీజేపీ, వీహెచ్‌పీ నాయకులను 50 మందిని పోలీసులు అరెస్ట్ చేసి దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. నిరసనలో బీజేపీ అభివృద్ధి కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోతే క్రిష్ణాగౌడ్, మర్రి రాంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, నాయకులు నరేందర్, బాల్‌రాజ్, గంగారెడ్డి, వీహెచ్‌పీ కార్యకర్తలు పాల్గొన్నారు. కలెక్టరేట్‌ను ముట్టడించిన బీజేపీ సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): పరిపూర్ణానంద స్వామిపై ఉన్న నగర బహిష్కరణ ఎత్తేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అర్వింద్ ధర్మపురి డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్‌ను బీజేపీ ఆధ్వర్యంలో ముట్టడించారు. అర్వింద్ మా ట్లాడుతూ దేశంలో 80శాతానికిపైగా ఉన్న హిందువులపై ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్న కేసీఆర్‌ని హిందూ సమాజం బహిష్కరించే రోజుదగ్గర్లోనే ఉందన్నారు. రాజకీయపార్టీల్లో విలువలు పూర్తిగా దిగజారిపోయాయన్నారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌కు రా కుండా పాలన పాతబస్తీ నుంచే సాగుతోందన్నారు. రాజకీయ పార్టీలను మళ్లీ ఎన్నుకుం టే, ఈ రాష్ట్రం పాతబస్తీ కనుసగల మీద నడిచే పరిస్థితి వస్తుందన్నారు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు పట్టుబడ్డారని, వీళ్లను పెంచి పోషించేది టీఆర్ఎస్, కాంగ్రెస్‌లాంటి పార్టీలేనని ఆరోపించారు. హిందూ సమాజం మేల్కొని జాగ్రత్త పడాలని, అందరికీ సమన్యాయం పంచే బీజేపీ వెంటనే నడవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
బెయిల్ ఇవ్వండి..
నిజామాబాద్ లీగల్(నిజామాబాద్ అర్బన్) : లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన మాజీ మేయర్ డి.సంజయ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. జిల్లా జైలులో ఉన్న సంజయ్.. బెయిల్ ఇవ్వాలని కోరుతూ సోమవారం ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి.. ఇరు పక్షాల వాదనలు వినేందుకు వీలుగా విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సింగ్ కాలేజీ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో సంజయ్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేసి, జిల్లా జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తరఫు న్యాయవాదులు కృపాకర్‌రెడ్డి, ఆకుల రమేశ్.. సోమవారం ఎస్సీ, ఎస్టీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిరాధారమైన ఆరోపణలతో సంజయ్‌ను కేసులో ఇరికించారని, లైంగిక వేధింపులకు సంబంధం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనాలు వినేందుకు వీలుగా విచారణను వాయిదా వేస్తూ ఎస్పీ, ఎస్టీ కోర్టు స్పెషల్ జడ్జీ రమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. కస్టడీకి కోరనున్న పోలీసులు? జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న సంజయ్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. సంజయ్ ను పూర్తిగా విచారించేందుకు తమకు తగిన సమయం లేకుండా పోయిందని, రిమాండ్ లో ఉన్న అతడిని కస్టడీకి అప్పగించాలని కోరుతూ మంగళవారం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖాలు చేయనున్నట్లు సమాచారం. పోలీసులు వేసే కస్టడీ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకూ, బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉండదని న్యాయ నిపుణులు తెలిపారు. మరోవైపు, కేసు డైరీకి సంబంధించిన వివరాలను పోలీసు లు సకాలంలో పీపీకి అందించక పోతే, బెయిల్ పిటిషన్‌పై పీపీ కోర్టును తగినంత సమయం అడిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్‌పై గురువారం వరకు వాదనలు జరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే, బుధవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోర్టుకు సెలవు ఉంటుంది. దీంతో బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు సంజయ్ జిల్లా జైలులోనే ఉండాల్సి ఉంటుంది. -
పంటలకు ప్రాణం..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: చాలా రోజుల తర్వాత భారీ వర్షం జిల్లాను ముంచెత్తింది. ఎండిపోతున్న పంటలకు ప్రాణం పోసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాలువల్లో నీరు చేరి జల కళ సంతరించుకున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా శనివారం తెల్లవారు జామున నుంచి ప్రారంభమైన వాన ఆదివారం ఉదయం వరకు ఎడ తెరిపి లేకుండా కురిసింది. జిల్లా వ్యాప్తంగా 232.9 సెం.మీటర్ల వర్షపాతం రికార్డు కాగా, సగటున 8.6 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా ఆర్మూర్‌లో 13.6 సెం.మీటర్ల వర్షం కురియగా, మోర్తాడ్‌లో 11.3, ఏర్గట్ల, నిజామాబాద్ దక్షిణం, నవీపేట్, నందిపేట్ మండలాల్లో 10 సెం.మీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. పంటలకు ప్రాణం.. పక్షం రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలన్నీ వాడిపోయాయి. ముఖ్యంగా వరి పొలాలు నీళ్లు లేక బీటలు వారాయి. నాట్లు వేసుకున్న చాలా చోట్ల వాడిపోయే పరిస్థితికి చేరుకుంది. అలాగే, మొక్కజొన్న, పూత దశలో ఉన్న సోయా ఎండి పోయే దశకు చేరడంతో రైతులు ఆందోళన చెందారు. పంటలు ఎండిపోతున్న తరుణంలో కురిసిన తాజా వర్షం ప్రాణం పోసింది. దీంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎస్సారెస్పీకి స్వల్ప ఇన్‌ఫ్లో.. తాజా వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగింది. వారం రోజులుగా ఇన్‌ఫ్లో లేని ఈ జలాశయానికి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 3,224 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిస్తే మరింత వరద నీరు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఎనిమిది మండలాల్లో లోటు.. జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురిసినప్పటికీ ఇంకా ఎనిమిది మండలాలు లోటు వర్షపాతం జాబితాలో ఉన్నాయి. ఆదివారం నాటికి సగటున 7.9 సెం.మీ. లోటుంది. బాల్కొండ, మోపాల్, ఇందల్వాయి, రుద్రూర్, నిజామాబాద్ రూరల్, రెంజల్, ముప్కాల్, మెండోరాల్లో ఇప్పటికీ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. జక్రాన్‌పల్లి, మోర్తాడ్ మండలాల్లో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం రికార్డయింది. మిగిలిన మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా జూన్ 1 నుంచి ఈ నెల 12 నాటికి 1,503.8 సెం.మీ. సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా, 1,385.6 సెం.మీల వర్షం మాత్రమే కురిసింది. -
రోజంతా హైడ్రామా
నిజామాబాద్‌అర్బన్: లైంగిక వేధింపుల కేసులో రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ విచారణకు హాజరు కావడం, ఆయనను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించడంతో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. చివరకు ఫ్యామిలీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించడంతో సంజయ్‌ను జిల్లా జైలుకు తరలించారు. నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్‌పై పోలీసులు నిర్భయ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని సంజయ్ హైకోర్టును ఆశ్రయించగా, సీఆర్పీసీ 41–ఏ ప్రకారం నోటీసులు జారీ చేసి, విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పోలీసులు నోటీసులు జారీ చేయగా, సంజయ్ ఆదివారం ఉదయం 11 గంటలకు ఏసీపీ సుదర్శన్ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సంజయ్‌ని విచారించిన పోలీసులు.. అక్కడి నుంచి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గంగాస్థాన్‌లో నివాసముండే మొదటి అదనపు జడ్జి మేరి సార దానమ్మ ఎదుట ప్రవేశపెట్టారు. ఏసీపీ సుదర్శన్ రిమాండ్ రిపోర్టు సమర్పించగా, జడ్జి పలు సందేహాలను లేవనెత్తారు. రిమాండ్‌కు తరలించేందుకు నమో దు చేసిన అభియోగాలు సక్రమంగా లేకపోవడం పై ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన రెండ్రోజులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై జడ్జి ప్రశ్నించినట్లు సంజయ్ తరఫు న్యాయవాదులు తెలిపారు. దీంతో ఏసీపీ సుదర్శన్ సీపీ కార్తికేయను కలిసి మరోసారి రిమాండ్ రిపోర్టును సిద్ధం చేసుకొని సాయంత్రం 6 గంటల జడ్జికి సమర్పించారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి.. సంజయ్‌ని అదుపులో ఉంచుకొని, సోమ వారం కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. దీంతో సంతృప్తి చెందని పోలీసులు.. ప్రగతినగర్‌లో నివాసముండే అదనపు జడ్జి సూర్యచంద్రకళ ఎదుట ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి.. సంజయ్‌ని రిమాండ్ చేసేందుకు అంగీకరించలేదని అతడి తరఫు న్యాయవాదులు తెలిపారు. 14 రోజుల రిమాండ్ ఎలాగైనా సంజయ్‌ను రిమాండ్‌కు తరలించాలనుకున్న పోలీసులు చివరకు వినాయక్‌నగర్‌లో ఉండే ఫ్యామిలీ కోర్టు జడ్జి సుదర్శన్ ఎదుట సంజయ్‌ని హాజరు పరిచారు. రిమాండ్ రిపోర్టు పరిశీలించిన న్యా యమూర్తి.. రాత్రి 11 గంటల వరకు విచారణ చేపట్టారు. చివరకుఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు అర్ధరాత్రి వేళ సంజయ్‌ను జిల్లా జైలుకు తరలించారు. ఉదయం 11 నుంచి అర్ధరాత్రి దాకా.. సంజయ్ విచారణ, రిమాండ్ యత్నాల నేపథ్యం లో ఆదివారం రోజంతా హైడ్రామా నెలకొంది. పోలీసుల అదుపులో ఉన్న సంజయ్ జైలుకు వెళ్తారా.. లేక బెయిల్‌పై బయటకు వస్తారా? అన్న దానిపై జోరుగా చర్చ జరిగింది. సంజయ్‌ని అరెస్టు చేసి, జైలుకు పంపాలని పోలీసులు తీవ్రంగా యత్నించారు. అయితే,సీఆర్పీసీ 41–ఏ ప్రకారం విచారణ చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారి ప్రయత్నాలు తొలుత ఫలించలేదు. లైంగిక వేధింపుల కేసుకు సంబం దించి సీఆర్పీసీ 41 ఏ ప్రకారమే విచారణ జరపా లని హైకోర్టు స్పష్టం చేయడంతో పోలీసులు అతడ్ని రిమాండ్‌కు తరలించే అవకాశం లేదని అతని తరఫు న్యాయవాదులు తెలిపారు. మరోవైపు, లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపైనే న్యాయమూర్తులు పోలీసుల ను ప్రధానంగా ప్రశ్నించినట్లు సంజయ్ తరఫు న్యాయవాదులు తెలిపారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన తరువాత అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై న్యాయవాదులు గట్టిగానే వాదనలు వినిపించారు. పోలీసుల విచారణ తీరుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని వారు చెప్పారు. -
దేశానికే ఆదర్శం రైతుబంధు
బోధన్‌రూరల్(నిజామాబాద్): తెలంగాణ ప్రభుత్వం అమలు చే స్తున్న రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బోధన్ మండలం రాజీవ్‌నగర్ తండాలో శనివారం ఆయ న రైతులకు రైతుబీమా బాండ్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, రాష్ట్ర రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రూ.5లక్షల జీవిత బీమా పథకం తీసుకొచ్చిందని చెప్పారు. ఒక్కో రైతు తరపున రూ.2,271 ప్రీమియం చెల్లిస్తున్నామని వివరించారు. రైతులు ఏ కారణంతో మృతి చెం దినా 10 రోజుల్లో రూ.5 లక్షలు పరిహారం అందించనున్నట్లు తెలిపారు. అర్హులందరికీ డబుల్ బె డ్రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. అధికారులపై ఆగ్రహం.. గ్రామంలో భూరికార్డుల ప్రక్షాళన, పట్టాదారు పా స్ పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీపై మం త్రి ఆరా తీయగా, తమకు చెక్కులు, పాస్ బుక్కు లు రాలేదని గ్రామస్తులు వెల్లడించారు. దీంతో మంత్రి పోచారం బోధన్ తహసీల్దార్ గంగాధర్, ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధి కారి గోవింద్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రైతులు, భూముల వివరాలు కూడా చెప్పలేని వీఆర్వో రాజన్నను తీవ్రంగా మందలించారు. కలెక్టర్ రామ్మోహన్‌రావ్, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు, మున్సిపల్ చైర్మన్ ఎల్లం, రైతు సమన్వయ సమితి మండల కో–ఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ పాల్గొన్నారు. మత్స్యకారులకు అన్ని విధాలా చేయూత బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాల వారికి జీవనోపాధి కల్పిస్తోందని, ఒక్కొక్కరికి కనీసం నెలకు రూ.15 వేల జీతం లభించేలా చర్యలు చేప డుతోందని మంత్రి పోచారం పేర్కొన్నారు. శనివారం ఆయన బాన్సువాడలోని కల్కీ చెరువులో 1.70 లక్షల చేప విత్తనాలను వేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. దళా రులు మత్స్యకారులను దళారులు దోచుకొంటున్నారని, ఇకపై దళారుల ప్రమేయం లేకుండా కొనుగోళ్లు సాగాలని స్పష్టంచేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తం గా 3.08 కోట్ల చేప విత్తనాలను చెరువుల్లో వేస్తున్నట్లు తెలిపారు. దశాబ్దాల నుంచి చెరువులు ఏ సంఘాల ఆధీనంలో ఉంటే చేపలు వారే పట్టుకోవాలని, కొత్త సంప్రదాయానికి తెరతీయొద్దని సూచించారు. ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ అంజిరెడ్డి, మత్స్యశాఖ ఏడీ పూర్ణిమ పాల్గొన్నారు. నవంబర్‌లో రెండో విడత ‘సాయం’ బీర్కూర్: నవంబర్ 18 నుంచి రెండో విడత పెట్టు బడి సాయం అందజేస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బీర్కూర్‌లోని తెలం గాణ తిరుమల దేవస్థానాన్ని శనివారం దర్శించుకున్న మంత్రి.. అనంతరం తిమ్మాపూర్‌లో రైతు బీమా బాండ్లను పంపిణీ చేశారు. అనంతరం మా ట్లాడుతూ.. బీమా పరిహారం మంజూరులో పది రోజులు దాటితే వడ్డీతో సహా చెల్లించేలా బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపా రు. త్వరలోనే విచారణ పూర్తి చేయించి అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఆర్ వోఎఫ్ఆర్ పట్టాలతో పాటు పెట్టుబడి సా యం అందిస్తామన్నారు. చేపల చెరువుల విషయంలో గంగపుత్రులు, ముదిరాజ్‌లు సమన్వయంతో వ్యవహరించాలని, అనాధిగా వస్తున్న ప్రకారం ఎవరికి హక్కు ఉంటే వారికే అవకాశం ఇవ్వాలని ఫిషరిస్ ఏడీఏ రాజనర్సయ్యకు సూచించారు. తిరుమల తరహాలో.. తిరుమల దేవస్థానాన్ని సందర్శించిన అనుభూతి కలిగేలా బీర్కూర్ శ్రీవెంకటేశ్వరాలయాన్ని తీర్చిదిద్దుతామని పోచారం తెలిపారు. రూ.13 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఆలయానికి చెందిన 68ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ చేయించాలన్నారు. -
జల రాజకీయం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో జల జగడం కొనసాగుతోంది. రైతుల నీటి కష్టాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అన్నదాతలకు మద్దతుగా ఆందోళనలు చేపట్టడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నాయి. కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయాలని రైతు లు పది రోజుల క్రితం ఆందోళన చేపట్టారు. ఒక్క తడి ఇచ్చినా తమ పంటలు గట్టెక్కుతాయని, నీటి ని ఇవ్వాలని కోరుతూ పలుమార్లు ఎస్సారెస్పీ కా ర్యాలయాన్ని ముట్టడించారు. రైతులకు మద్దతు గా ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. రైతుల సాగునీటి సమస్యను ఒక అవకాశంగా భావించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. వారం రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అఖిలపక్షంగా ఏర్పడిన కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు శుక్రవారం చలో ఎస్సా రెస్పీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. కాకతీయ కాలువకు అర టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రం నుంచి ఆయకట్టు రైతుల గ్రామాలకు తరలివెళ్లాలని నిర్ణయించాయి. మరోవైపు ఆయా పార్టీల రాష్ట్ర స్థాయి నేతలు కూడా రైతుల సమస్యలపై స్పందిస్తున్నారు. శనివారం బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు మద్దతు తెలిపేందుకు జిల్లాకు వచ్చారు. బాధిత రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ కిసాన్ కేత్ రాష్ట్ర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇ లా పది రోజులుగా జిల్లాలో ప్రతిపక్ష పార్టీల నేత ల ఆందోళనలతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ప్రతిపక్ష పార్టీల ఆందోళనల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. రైతులకు సంబంధించిన అంశం కావడంతో ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. ప్రాజె క్టులో నీటి నిల్వ పరిమితంగా ఉన్న నేపథ్యంలో కాకతీయ కాలువకు నీటి విడుదల ప్రస్తుతానికి వీలు పడదని ఆయన ప్రకటించారు. నేతల అరెస్టులు ప్రతిపక్ష పార్టీ నేతల ఆందోళన నేపథ్యంలో జిల్లా లో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఎస్సా రెస్పీ పరీవాహక గ్రామాల్లో వందలాదిగా పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఆందోళనలు నిర్వహిస్తున్న నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలిస్తున్నారు. శనివారం ఎస్సారెస్పీ వెళ్తున్న కాంగ్రెస్ కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డిని డిచ్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో... కామారెడ్డి జిల్లాలోనూ సాగునీటి సమస్యపై ఆందోళన చేపట్టారు. సింగూరు జలాశయం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు నాట్లు వేసుకున్నారు. సింగూరు నుంచి జిల్లా వాటా కింద రావాల్సిన తొమ్మిది టీఎంసీల నీటిని విడుదల చేసి ఆయకట్టు రైతులకు భరోసా కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం నిజాంసాగర్‌లో సుమారు రెండున్నర టీఎంసీల నీరుంది. జిల్లా వాటా కింద రావాల్సిన నీటిని విడుదల చేయాలని రైతులు కూడా కోరుతున్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ ఒక అవకాశంగా భావించి ఆందోళన చేపట్టింది. మొత్తం మీద రెండు జిల్లాల పరిధిలో సాగునీటి అంశంపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలను కొనసాగించడంతో రాజకీయ వేడి రాజుకున్నట్లవుతోంది. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద కొనసాగుతోన్న బందోబస్తు
నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద వర్షంలోనూ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ప్రాజెక్టు వద్ద పోలీసు బలగాలు గత రెండు వారాల నుంచి పహారా కాస్తున్నాయి. పోచంపాడు గ్రామం, అలాగే ప్రాజెక్టు వైపు వెళ్లే వారిని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాల రైతులు సాగునీటి కోసం కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెల్సిందే. శ్రీరాంసాగర్‌కు వరద పెరగడంతో ఆయకట్టు రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల వర్షాలు లేకపోవడంతో ఆయకట్టు ప్రాంత పరిధిలోని పొలాలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో వెంటనే కాకతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున ఆయా గ్రామాల ప్రజలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన సంగతి తెల్సిందే. రైతులు బలవంతంగా గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో అధికారులు ప్రాజెక్టు వద్ద భద్రతను పెంచారు. అయితే వర్షాలు పడుతుండటంతో రైతులకు కాసింత ఉపశమనం లభించింది. -
కాంగ్రెస్ నాయకుల అరెస్టు
నిజామాబాద్ సిటీ(నిజామాబాద్ అర్బన్) : ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ పరివాహక ప్రాంతాల గ్రామాల రైతులను పరామర్శించేం దుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో కాకతీయ కెనాల్ పరివాహక ప్రాంతా ల గ్రామాల ప్రజలను పోలీసులు దిగ్భందించడంతో వారిని పరామర్శించేందుకు వెళ్లాలని గత బుధవారం అఖిల పక్షం సమావేశంలో తీ ర్మానించారు. ఈ మేరకు శుక్రవారం పరివా హక గ్రామాలకు వెళ్లే నాయకులను శుక్రవారం తెల్లవారు జామున వారి ఇళ్లలో నుంచి అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, పీసీసీ కార్యదర్శి భూంరెడ్డి, కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు ముప్పా గంగారెడ్డి, వామపక్షాల నాయకులు ఆకుల పాపయ్య, నూర్జహాన్‌లను అరెస్టు చేసి నాలుగో టౌన్‌కు తరలించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, టీపీసీసీ అధికార ప్రతినిధి మానాల మోహన్‌రెడ్డి, సీపీఐఎం నాయకులు రమేశ్‌బాబులను పోలీసులు అరెస్టు చేసి మూడోటౌన్కు తరలించారు. ఏఐసీసీ నాయకుల ప్రశంసలు రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న కాం గ్రెస్ నాయకులను అరెస్టు చేసిన విషయంపై ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాసన్, కుంతియా, సీఎల్పీ నేత జానారెడ్డిలు పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌కు ఫోన్ చేసి రైతుల ఆం దోళన గురించి వాకబు చేశారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంపై పార్టీ నాయకులను ప్రశంచినట్లు గడుగు తెలిపారు. రైతు ఉద్యమాలకు ఎమ్మెల్సీ ఆకుల లలిత మద్దతు పంటలకు నీళ్లు అడిగితే రైతులను ప్రభుత్వం దిగ్భందిచడం అన్యాయమని ఎమ్మెల్సీ ఆకుల లలిత తెలిపారు. రైతు ఉద్యమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. -
జక్రాన్‌పల్లిలోనే ఎయిర్‌పోర్టు ఏర్పాటు
జక్రాన్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జక్రాన్‌పల్లిలోనే ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని నిజామాబాద్ జేసీ రవీందర్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం శుక్రవారం జక్రాన్‌పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని జేసీ సందర్శించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడారు. ఎయిర్ పోర్టు ఏర్పాటు కోసం అవసరమైన భూమిని సిద్ధంగా ఉంచామన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘ధరణి’ ద్వారా పాస్బుక్లందించాలి వివిధ కారణాలతో నిలిచిన పట్టాదారు పాస్‌బుక్‌లు ధరణి వెబ్సైట్ ద్వారా తహసీల్దార్ డిజిటల్ సంతకంతో త్వరగా పూర్తి చేసి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలని జేసీ సూచించారు. జిల్లాలో ఐదు విడుతలుగా రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు అందించామన్నారు. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యల కారణంగా పాస్‌బుక్‌లు నిలిచిపోయాయన్నారు. వాటిని వెంటనే పరిశీలించి రైతులకు పాస్‌బుక్‌లు అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా కొత్త రేషన్‌కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు వారం రోజుల్లో జిల్లా కార్యాలయానికి పంపించాలన్నారు. కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులను కార్యాలయం చుట్టూ తిప్పుకోవద్దని సూచించారు. ముఖ్యంగా కల్యాణ లక్ష్మి దరఖాస్తులకు గెజిటెడ్ సంతకం కోసం దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేయవద్దని చెప్పారు. గెజిటెడ్ సంతకం లేకుండానే విచారణ చేసి దరఖాస్తులను ఉన్నతాధికారులకు పంపించాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలలో దొర్లిన తప్పొప్పులను సరి చేయాలన్నారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ సతీష్‌రెడ్డి, ఆర్ఐ అరుణ ఉన్నారు. -
వన్య ప్రాణికి కరువైన రక్షణ
ఒకప్పుడు ఎటూ చూసిన అడవులే. అంతటా పచ్చిక బయళ్లే. వాటిలో స్వేచ్ఛగా సంచరించే జంతువులు కనువిందు చేసేవి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వేటగాళ్లు సాధు జంతువులను వేటాడుతున్నారు. వల వేసి పడుతున్నారు. గ్రామాల్లోని ప్రధాన అడ్డాలైన కల్లు దుకాణాలు, అంగళ్లు, బస్టాండ్లు వంటి ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. కొందరికైతే మరీ ముందస్తు సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అటవీశాఖాధికారులు మాత్రం చీమకుట్టు కూడా చలించలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేటగాళ్ల బారి నుంచి సాదు జంతువులను కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఇక వారు ఏ మేరకు స్పందిస్తారో..! నస్రుల్లాబాద్(బాన్సువాడ): రోజు రోజుకు వన్య ప్రాణులకు రక్షణ లేకుండా పోతోంది. శాఖాహార జీవాలను వేటగాళ్లు వలలు వేసి మరీ పట్టుకుని కాల్చుకుతింటున్నారు. కాపాడాల్సిన వారు పట్టించుకోకపోవడంతో వారికి అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఇటీవలే మండలంలో వేటగాళ్లు వేసిన ఉచ్చులో ఓ చిరుత పులి చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో దానికి శస్త్ర చికిత్స చేసి రాజధాని జూకు తరలించారు. అయినా కూడా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు పెద్ద ఎత్తున వేట సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అటువైపు అధికారులు మాత్రం కన్నెత్తి చూడడంలేదు. ప్రతి నెల వచ్చే వేతనాలను తీసుకోవడంలో ఉన్న ఆతృత ఉద్యోగం చేయడంలో చూపించడంలేదని వన్య ప్రేమికులు వాపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బిచ్కుంద, గాంధారి, సిరికొండ, మాచారెడ్డి, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, నిజాంసాగర్, భీమ్‌గల్ తదితర మండలాల్లో గతంలో దట్టమైన అడవులు ఉండేవి. అయితే అవి కాస్త ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో వేటగాళ్లు అటవీ జంతువులను వేడాడి వాటి మాంసాన్ని పాళ్లుగా వేస్తున్నారు. దీంతో వారికి ‘మూడు పాళ్లు.. ఆరు వేలు’గా ఆదాయం సమకూరుతోంది. వేటగాళ్లు ప్రధానంగా గ్రామాల్లోని కల్లు దుకాణాలు, వైన్సులను అడ్డాలుగా మార్చుకుని మరీ విక్రయిస్తున్నారు. కన్నెత్తి చూడని అటవీ అధికారులు.. ‘ఒకవైపు వన్య ప్రాణులను కాపాడాలి’ అన్న నినాదంతో శాకాహార జంతువుల పెంపకం కోసం వన సంపద పెంచాలని ప్రభుత్వం హరితహారం నిర్వహించి మరీ మొక్కలను పెంచుతోంది. వేటగాళ్ల చేతులకు సాదు జీవులు బలై పోతున్నాయి. దీంతో రాబోయో రోజుల్లో సాదు జీవాలను జంతు ప్రదర్శన శాలలో మాత్రమే చూడాల్సి వస్తోంది. ఇలా ఇష్టారీతిన జంతువులను చంపుకు తింటూ ఉంటే మాత్రం రానురాను వన్య ప్రాణులు మాత్రం అంతరించి పోతున్నాయి. ఐదేళ్ల క్రితం నస్రుల్లాబాద్ మండలంలోని అటవీ ప్రాంతంలో సంచరించే అటవీ జీవుల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం 90 శాతం తగ్గిపోయింది. వర్ని–నస్రుల్లాబాద్ మధ్య ఉన్న గండిలో సాయంత్రం అయితే జన సంచారం ఉండేది కాదు. అయితే నేటి జనాలు క్రూర మృగాలుగా మారి కనుమరుగు చేస్తున్నారు. ప్రాణాలను కాపాడాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రామాల్లోని పంట పొలాలు, పచ్చిక బయల్లు వంటి ప్రాంతాల్లో వలలు, ఉర్లు వంటివి పెట్టి యథేచ్ఛగా పెడుతున్నారు. ముందస్తు సమాచారంతోనే... పచ్చిక బయల్లు, అడవి ప్రాంతాల్లో పట్టిన శాఖాహార జంతువులు కుందేళ్లు, అడవి పంది, దుప్పి, కొండ గొర్రె, అడవి పక్షులు, కంజు పిట్టలు, పావురాలు వంటి వాటిని పట్టుకు వచ్చి సమీపంలోని కల్లు దుకాణాల్లో, అంగట్లో, బస్టాండ్ ప్రాంతంలో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. దీనికితోడు కొన్ని గ్రామాల్లో ముందస్తుగానే చెప్పి మరీ వేటకు వెళుతున్నారు. పెద్ద మొత్తంలో మద్యం వ్యాపారం జరిగే గ్రామాల్లో కల్లు దుకాణాల్లో ప్రతి రోజు వివిధ రకాల వన్య ప్రాణులు లభిస్తాయని సమాచారం. ఇంతగా వన్యప్రాణులు విక్రయాలు జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని వన్య ప్రాణులను కాపాడాలని వన ప్రేమికులు కోరుతున్నారు. -
డీఎస్ కుమారుడికి నోటీసులు
సాక్షి, నిజామాబాద్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు విచారణకు హాజరుకావాలని శనివారం నిజామాబాద్ పోలీసులు ఆదేశించారు. శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతనిపై కేసు నమోదైన విషయం తెలిసింది. గత వారం రోజులుగా సంజయ్ పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనపై ఇటీవల నమోదైన లైంగిక వేధింపులు కేసుపై ప్రభుత్వం విచారిస్తే తప్పకుండా సహారికరిస్తానని ఇటీవల ప్రకటించిన మాజీ మేయర్ పోలీసులు తప్పించుకుని తిరుగుతున్నారు. తమపై లైంగిక వేధింపుల వేధింపులకు పాల్పడ్డారని పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో అతనిపై నిర్భయ కేసుతో సహా, పలు సెక్షలపై కేసు నమోదైంది. కాగా ప్రస్తుతం అతని కోసం ఆరు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. -
బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం
నందిపేట(ఆర్మూర్): మండలంలోని వన్నెల్ కే గ్రామానికి చెందిన కిడ్పాప్‌నకు గురైన ఆరేళ్ల మనీశ్వరి గురువారం తల్లిదండ్రుల వద్దకు చేరింది. మండలంలోని వన్నెల్ కే గ్రామానికి చెందిన మద్ది హారిక– రమేష్ దంపతుల కూతురు మనీ శ్వరి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటుంది. కాగా రమేష్‌తో అక్రమ సం బంధం ఉన్న ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన రజిత ఈనెల 5న పాఠశాలకు వెళ్లి చాక్లెట్టు కొనిస్తానని చెప్పి మనీశ్వరిని కిడ్నాప్ చేసింది. ఈ సంఘటనలో జిల్లాలో సంచలనం రేపగా సీపీ కార్తికేయ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దార్యప్తు చేశారు. దీనిలో భాగంగా నిందితురాలు రజిత తన కూతురుతో పాటు కిడ్నాప్ చేసిన మనీశ్వరిని కేరళకు చేరుకుంది. ఆ రాష్ట్రంలోని తిరువనంతపురంలో పోలీసులకు పట్టుబడింది. కేరళ పోలీసుల సమాచారంతో ప్రత్యేక బృందమై న సీసీఎస్ సిబ్బందితో పాటు నందిపేట పోలీసు సిబ్బంది తిరువనంతపురం వెళ్లి నిందితురాలు రజితతో పాటు మనీశ్వరిని నందిపేటకు తీసుకు వచ్చారు. గురువారం ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎస్ఐ సంతోష్‌కుమార్, స్థానిక పోలీసులు మనీశ్వరిని వన్నెల్ కే గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలు రజితను రిమాండ్ చేసి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ఆర్మూర్ ముందు హాజరుపరిచారు. కిడ్నాప్‌నకు గురైన మనీశ్వరి తల్లిదండ్రుల చెంతకు చేరింది. దీంతో వారు ఆనందంతో కన్నీళ్ల పర్యంతమై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బాలిక కిడ్నాప్ కేసులో మహిళ అరెస్టు నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): ఈనెల 2న నందిపేట మండలం వన్నెల్‌కు చెందిన మనిశ్వరిని కిడ్నాప్ చేసిన రజితను అరెస్టు చేసి బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించినట్లు గురువారం సీపీ కార్తికేయ వెల్లడించారు. మచ్చర్లకు చెందిన రజిత మనిశ్వరి చదువుతున్న గీతా కాన్వెంట్ స్కూల్ నుంచి బాలికను కిడ్నాప్ చేసింది. దీనిపై మనీశ్వరి తల్లి హరిత నందిపేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈనెల 5న కేరళలోని తిరువసంతపురంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. రజితను అక్కడి పోలీసుల సహాయంతో పట్టుకున్నారు. అనంతరం 8న నిందితురాలు రజితను నందిపేట్‌కు తెచ్చారు. రజితను ఆర్మూర్ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా, కోర్టు రజితను రిమాండ్‌కు తరలించినట్లు సీపీ కార్తికేయ తెలిపారు. -
అటు కలప.. ఇటు ఇసుక
ఇందల్వాయి : మండలంలో వాగులు, ఆడవులు పు ష్కలంగా ఉన్నా రెవెన్యూ, ఫారెస్టు అధికారుల పర్యవేక్షణ, సమన్వయ లోపం వల్ల క్రమేపీ అవి చీకటి దందా చేస్తున్న అక్రమార్కుల చేతుల్లో పడి వాటి సహజ స్వరూపాన్ని కోల్పోతున్నాయి. ఇసు క, కలప అక్రమ రవాణదారులపై నామమాత్రపు దాడులు చేస్తున్నా అధికారులు వారికి చట్టరీత్యా సరైన శిక్షలు వేయించడంలో విఫలమవుతుడటం తో వారు మళ్లి పాత దందానే కొనసాగిస్తున్నారు. అధిక దనార్జనే లక్ష్యంగా అడవుల్ని నరుకుతు, వా గుల్ని తవ్వుతూ ఇసుక, కలపను అక్రమంగా రవా ణ చేస్తూ ప్రకృతి స్వరూపాన్నే మార్చుతూ రైతు లకు, సామాన్య ప్రజలకు పరోక్షంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మా ణాలు, సీసీ రోడ్లు అని అభివృద్ధి పనుల పేరుతో అనుమతులు తీసుకొని నల్లవెల్లి, గౌరారం, మల్లా పూర్, లోలం, లింగాపూర్, సిర్నాపల్లి వాగుల్లోంచి అనధికారంగా రాత్రి వేళల్లో ఇష్టరాజ్యంగా ఇసుక ను తరలించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని, అడవుల్లోని విలువైన కలప కూడా కింది స్థాయి అటవీ శాఖ అధికారుల కనుసన్నల్లోనే రాత్రి వేళల్లో అక్రమరవాణ జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాగుల్లోకి, ఆడవుల్లోకి ట్రాక్టర్లు వెళ్లకుండా అధికారులు నామ మాత్రపు కందకాలు తవ్వుతున్నా వాటిని పూడ్చేసి మరీ అక్రమార్కులు తమ దందాను కొనసాగిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అక్రమార్కుల ధనదాహానికి అడవులు తరిగిపోయి వన్యప్రాణలు జనావాసాల్లోకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. ఈ దుండగుల వికృత చేష్టలకు సరిపడా వర్షాలు పడట్లేదని, వాగుల్లో ఇసుక లేకపోవడంవల్ల భూగర్భ జలాలు పెరగడంలేదని, అడవుల్లో ఆశ్రయం లేక వన్యప్రాణులు గ్రామాల్లోకి, పంట పొలాల్లోకి వచ్చి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రకృతిని నాశనం చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న చీకటి దందాకోరులపై రెవెన్యు,ఫారెస్టు, పోలీసు అధికారులు సమన్వయంతో మూకుమ్మడి దాడు లు చేసి వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని, విలువైన ప్రకృతి సంపదలకు రక్షణ కల్పించి ప్రకృతి సమతుల్యతను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
డబుల్‌కు జీఎస్టీ పోటు
బాన్సువాడ : డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులతో పాటు ఇళ్లు నిర్మిస్తున్న కాంట్రాక్టర్ల పరిస్థితి గందరగోళంగా మారింది. నిరుపేదలు, బిల్డర్లపై జీఎస్టీ పెనుభారం మోపింది. అసలే, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావ డం లేదు. వారిని ఎమ్మెల్యేలు ఒప్పించి పనులు చేయాలని కోరుతుండడంతో వారు పనులకు అంగీకరించి టెండర్లలో పాల్గొంటున్నారు. అయి తే, గతేడాది జూలై 31 నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకూ జీఎస్టీ విధిస్తుండడంతో నిధుల్లో కోత విధిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడగ గదుల ఇళ్లకు ఉమ్మడి జిల్లాలో జీఎస్టీ సెగ తగులుతోంది. కేంద్ర ప్రభు త్వం గతేడాది తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం వీటిపై కూడా పడడంతో కాం ట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. మొదటి విడతలో నిజామాబాద్ జిల్లాకు 9400, కామారెడ్డి జిల్లాకు 7,052 బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయి. బాన్సువాడ నియోజకవర్గంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కృషితో కాంట్రాక్టర్లు పనులను చేపట్టారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్లు ముం దుకు రావడం లేదు. మొదటి విడతలో మినహాయింపు ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5.04 లక్షలు వెచ్చించడంతో పాటు ఉచితంగా ఇసుక, రూ.230కే సిమెంట్ బస్తాలు సరఫరా చేస్తోంది. మొదటి విడత పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు మొత్తం రూ.5.04లక్షల చొప్పున పంచాయతీరాజ్ శాఖ చెల్లించింది. అయితే, రెండవ విడత నిధుల్లో జీఎస్టీ రూపంలో మొత్తం నిధుల నుంచి 12 శాతం కోత విధిస్తోంది. మొదటి విడతలో మంజూరైన ఇళ్లల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5.04 లక్షలు, మౌలిక వసతులకు మరో రూ.1.25 లక్షలు మంజూరు చేశారు. అయితే, కేంద్ర ప్రభు త్వం విధించిన జీఎస్టీ పోటుతో కాంట్రాక్టర్లు బెం బేలెత్తుతున్నారు. గతేడాది జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రాగా అప్పటి నుంచి ఇళ్ల నిర్మాణంపై 12 శాతం జీఎస్టీ విధించారు. గతంలో ఇల్లు మం జూరైతే వ్యాట్, ట్యాక్స్ కలిపి బిల్లు చేసి మినహాయించుకొనే వారు. దీంతో కాంట్రాక్టర్లంపై భారం పడేది కాదు. అలాగే, లబ్ధిదారుడికి ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం జీఎస్టీతో లబ్ధిదారుడికి మంజూరైన యూనిట్ డబ్బుల నుంచే జీఎస్టీ రూపంలో సుమారు రూ.60 వేల వరకు మినహాయించుకొంటున్నారు. ఈ లెక్కన ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు మంజూరైతే, అందులో సుమారు రూ.60 వేలు జీఎస్టీ కింద మినహాయించుకుని మిగతాది చెల్లిస్తున్నారు. దీంతో రూ.4.44 లక్షలతో ఇల్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఇంటికి అన్ని హంగులు కావాలంటే డబ్బులు సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్ విలువతో పాటు జీఎస్టీ సొమ్మును అదనంగా మంజూరు చేసిన పక్షంలో తమపై భారం పడదని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. జీఎస్టీ నుంచి మినహాయించాలి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. నిరుపేదలే ఇళ్లు నిర్మించుకొంటారని, వారిపై జీఎస్టీ భారం వేయడం వల్ల అదనంగా మరో రూ.3 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. లేకుంటే అర్ధాంతరంగా పనులను నిలిపి వేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పూర్తి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. నిధులను పెంచాలి.. ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వడం ప్రశంసనీయం. జీవితంలో ఇల్లు నిర్మించుకోలేమనుకున్న సందర్భంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కృషితో మాకు డబుల్ బెడ్రూం మంజూరైంది. అయితే, రూ.5.04 లక్షల ని«ధుల్లో జీఎస్టీ రూపంలో కోత విధిస్తుండడంతో మేము మరో రూ.60 వేలు కట్టాల్సి వస్తున్నది. డబుల్ బెడ్రూం ఇళ్లకు నిధులను పెంచాలి. -ముఖ్తార్, లబ్ధిదారుడు -
బీజేపీ నాయకుల అరెస్టు
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్) : కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయాలని కోరుతూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మంగళవారం బయల్దేరిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణను పోలీసులు ఆర్మూరులో అరెస్టు చేసి 5వ టౌన్‌కు తరలించారు. మంగళవారం ఎస్సారెస్పీ ప్రాజెక్టు వద్దకు బయల్దేరిన యెండలతో పాటు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ తుల శ్రీనివాస్‌రెడ్డిలను పోలీసులు ఆర్మూర్‌లో అరెస్టు చేశారు. పార్టీ నేతల అరెస్టు విషయం తెలుసుకున్న బీజేపీ నగర ప్రధాన కార్యదర్శి స్వామి యాదవ్, యువ మోర్చా నగర అధ్యక్షుడు రోషన్ లాల్ బోరా, నాయకులు నగోలా లక్ష్మీనారాయణ, పుట్ట వీరేందర్, చైతన్య కులకర్ణి, గోవుర్ శ్రీనివాస్, నరేష్, సంజీవ్ కార్యకర్తలు 5వ టౌన్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బీజేపీ నేతలను పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
డిచ్పల్లి నిజామాబాద్ : మండలంలోని నడిపల్లి పంచాయతీ పరిధి గాంధీనగర్ కాలనీకి చెందిన ఎండీ జైనబ్(13) అనే విద్యార్థిని చదువుకునేందుకు స్కూల్‌కు పంపించడం లేదనే మనస్థాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ నవీన్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాంధీనగర్ కాలనీలోని ఉమర్ సిద్దిఖీ కూతురు జైనబ్ గతేడాది ధర్మారం(బి) గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేసింది. ఈ విద్యాసంవత్సరంలో తల్లిదండ్రులు జైనబ్‌ను స్కూల్‌కు పంపించకుండా ఇంటి వద్దే ఉంచారు. తాను స్కూల్‌కు వెళ్లి చదువుకుంటానని ఎన్నిసార్లు అడిగినా తండ్రి పంపించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు జైనబ్‌ను కిందకు దించి ప్రాణం ఉందేమోనని పరీక్షించారు. అప్పటికే చనిపోయిందని తెలిసి డిచ్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. జైనబ్ సోదరుడు ఇటీవల మానసికంగా అనారోగ్యానికి గురికావడంతో అతడికి చికిత్స చేయిస్తున్నారు. దీంతో జైనబ్‌ను స్కూల్ మాన్పించి ఇంట్లో ఉంచారు. చదువుపై మక్కువ ఉన్న జైనబ్ మనస్తాపానికి గురై తన ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తండ్రి ఉమర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.