
షబ్బీర్‌అలీ, సుదర్శన్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఆకుల లలిత, తాహెర్‌బిన్ హందాన్, మహేశ్‌కుమార్ గౌడ్, సురేశ్‌షెట్కార్
సాక్షి ప్రతినిధి నిజామాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది కమిటీలను బుధవారం ప్రకటించింది. ఈ కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలకు స్థానం లభించింది. కోర్ కమిటీలో మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీలు సభ్యులుగా నియమించారు. 53 మంది తో కూడిన కోఆర్డినేషన్ కమిటీలో షబ్బీర్‌అలీ, మధుయాష్కీలతో పాటు ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డిలకు చోటు దక్కింది.
ఎలక్షన్ కమిటీలో బొమ్మమ హేశ్‌కుమార్‌గౌడ్, పి.సుదర్శన్‌రెడ్డి, మధుయా ష్కీ, షబ్బీర్‌అలీలకు స్థానం కల్పించారు. వ్యూహ ప్రణాళిక కమిటీకి మధుయాష్కీ కోచైర్మ న్‌గా వ్యవహరించనున్నారు. ప్రతిష్టాత్మకమైన మెనిఫె స్టో కమిటీలో బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. అలాగే డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్‌హందాన్ , మాజీ ఎంపీ సురేష్ శట్కార్‌కు చోటు లభించింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి పేరు కూ డా పలు కమిటీల్లో ప్రకటించడం గమనార్హం. మే నిఫెస్టో కమిటీ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, కోఆర్డినేష న్ కమిటీ ఈ మూడింట్లోనూ సురేశ్‌రెడ్డికి స్థా నం దక్కింది. కాని ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment