మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు
కామారెడ్డి కైం: చదువులో వెనుకబడి పోతున్నాననే ఆందోళన మార్కులు ఎక్కడ తక్కవగా వస్తాయేమోనని మనస్తాపం చెందిన ఓ పదో తరగతి విద్యార్థిని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం సాయంత్రం కామారెడ్డి సమీపంలోని పెద్ద చెరువులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కల్కీనగర్ కాలనీలో నివాసం ఉండే చందాపురం స్వామి లింగంపేటలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. స్వామి దంపతులకు సాత్విక (16), హర్షిణి, శివాణి అనే కుమార్తెలు ఉన్నారు.
సాత్విక పట్టణంలోని అభ్యాస పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బుధవారం వేకువజామున 5 గంటల ప్రాంతంలో ట్యూషన్‌కని ఇంటి నుంచి బయల్దేరింది. ఇంటికి తిరిగి రాలేదు. 10 గంటల తర్వాత అనుమానం వచ్చి తల్లిదండ్రులు చాలాచోట్ల గాలించారు. కామారెడ్డి పెద్ద చెరువులో ఆమె శవమై తేలింది. కూతురు ఆత్మహత్యకు పాల్పడడంతో స్వామి దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. మార్కులు తక్కువగా వస్తున్నాయని ఎప్పుడు బాధపడుతుండేదని వారు తెలిపారు. సంఘటన స్థలాన్ని పట్టణ పోలీసులు సందర్శించి విచారణ జరిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment