గిరిరాజ్ కళాశాల మైదానంలో కేసీఆర్ బహిరంగ సభ స్థలాన్నిపరిశీలిస్తున్న మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్,ఎంపీ కవిత, మాజీ ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్ తదితరులు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న కేసీఆర్‌నే మరోమారు ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఈటె ల రాజేందర్, ఎంపీ కల్వకుంట్ల కవిత, పలువురు ఎమ్మెల్సీలు, తాజామాజీ ఎమ్మెల్యేల బృందం అక్టోబర్ 3న గిరిరాజ్ కళాశాల మైదానంలో జరుగనున్న సీఎం బహిరంగ సభాస్థలాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రజాఆశీర్వాద సభను విజయవం తం చేసేందుకు భా రీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో స్పందన బాగుందని, ఉమ్మడి జిల్లా నుంచి కేసీఆర్ అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని అన్నారు. అనుకున్న దాని కంటే ఎక్కువ జనాలు స్వచ్ఛందంగా వస్తారని పేర్కొన్నారు. ప్రగతి నివేదన సభకు వచ్చినట్లుగానే ఈ ప్రజాఆశీర్వాద సభకు కూడా ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా రెండు లక్షల మంది సీఎం సభకు హాజరవుతారని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కమిటీల నియామకం చేపట్టామని తెలిపారు. సభాస్థల నిర్మాణం, అలంకరణ, బారికేడ్లు, ఇతర వసతులు అనుకున్న సమయానికి పూర్తవుతాయన్నా రు. నిబంధనల ప్రకారం ఆర్టీసీ బస్సులను జన సమీకరణకు వినియోగించుకుంటామని, జిల్లాలో ఉన్న ప్రైవేటు వాహనాలు, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వాహనాలను కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. మంత్రుల వెంట జెడ్పీ చైర్మన్ దఫెదార్ రాజు, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్‌రావు, ఫారూక్, తాజామాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, షకీల్ అమేర్, రెడ్‌కో రాష్ట్ర చైర్మన్ ఎస్‌ఏ అలీం తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment