Kavitha Kalvakuntla
-
HYD: ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత
సాక్షి,హైదరాబాద్: అనారోగ్య సమస్యతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మంగళవారం(అక్టోబర్1) చేరారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రానికి వైద్యపరీక్షలు పూర్తవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో కవిత పలుసార్లు అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కవితకు గతంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కవిత గైనిక్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలల పాటు జైలులో గడిపిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో కవిత ఇటీవలే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంటికే పరిమితమయ్యారు. ఇదీ చదవండి: కేసీఆర్ ఒకప్పుడు పులి: ఎంపీ అర్వింద్ -
తీహార్ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ములాఖత్ అయ్యారు. కవితను కలిసిన కేటీఆర్ ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి రెండు వారాల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది. ఆమెను కలిసిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. -
కవితకు బెయిల్? ఢిల్లీ హైకోర్టులో విచారణ
-
కవిత రిమాండ్ పొడిగింపు?
-
కవితకు బెయిల్‌పై 8న తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. ఈనెల 8వ తేదీ సోమవారం తీర్పు వెలువరిస్తామన్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ చేపడతామని తెలిపారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్, బెయిల్ మంజూరు చేయొద్దంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా విచారించారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింíఘ్వీ, ఈడీ తరఫున జొహెబ్ హొస్సేన్‌లు వాదనలు వినిపించారు. తల్లి పర్యవేక్షణ అవసరం: సింఘ్వీ కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, 16 ఏళ్ల కుమారుడికి తల్లి పర్యవేక్షణ, భావోద్వేగ మద్దతు ఈ సమయంలో ఎంతో అవసరమని సింఘ్వీ పేర్కొన్నారు. తల్లి అరెస్టుతో కుమారుడు ఎంతో దిగ్భ్రాంతి చెందిన పరిస్థితిని మనం చూడాలన్నారు. కవిత కుమారుడు పరీక్షలు రాసే సబ్జెక్టులు ప్రస్తావిస్తూ.. తల్లి స్థానాన్ని తండ్రి లేదా సోదరుడు భర్తీ చేయలేరని, మానసిక ప్రత్యామ్నాయం సాధ్యం కాదని చెప్పారు. తల్లి దగ్గర ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుందని తెలిపారు. కవితకు బెయిల్ ఇచ్చినా ఈడీకి వచ్చే ఇబ్బందేమీ లేదని, ఆమెను తిరిగి సుల భంగానే అదుపులోకి తీసుకోవచ్చని అన్నారు. తండ్రి ఢిల్లీలో ఉండి న్యాయపోరాటం చేస్తున్నారని కుమారుడు తెలంగాణలో ఉన్నారని సింఘ్వీ తెలిపారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయంలో ప్రధాని ఆల్ ఇండియా రేడియోలో ఉపన్యాసాలు ఇస్తున్నారని, ఆ సమయంలో విద్యార్థులపై ఒత్తిడి ఊహకు మించి ఉంటుందని వ్యాఖ్యానించారు. అన్నీ చూసి కోర్టు నిర్ణయం తీసుకోవాలి: హొస్సేన్ సెక్షన్ 45 నిబంధనలు సింఘ్వీ నొక్కి చెబుతున్నారని, అయితే ప్రజా జీవితంలో ఉండే ప్రముఖ రాజకీయ నాయకురాలికి అవి వర్తించవని ఈడీ తరఫు న్యాయవాది జొహెబ్ హొస్సేన్ అన్నారు. ఈ కేసులో లంచం ఇచ్చినట్టుగా ఆరోపణలున్న ప్రధాన వ్యక్తుల్లో ఒక మహిళను ప్రశ్నిస్తున్నామని, ప్రాక్సీల ద్వారా ఆమె లబ్ధి పొందారని వాదించారు. కేవలం ఇతర నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ విషయం చెప్పడం లేదని, సంబంధిత పత్రాలు, వాట్సాప్ చాట్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం, ఆమెకు వ్యతిరేకంగా ఉన్న అన్ని విషయాలు చూసి న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తన దగ్గర ఉన్న ఎఫ్ఎస్ఎల్ నివేదిక సాక్ష్యాలు ఎలా నాశనం చేశారో నిరూపిస్తుందన్నారు. కవిత పలు ఫోన్ల నుంచి సమాచారం డిలీట్ చేశారని, మొత్తంగా 100 కంటే ఎక్కువ ఫోన్లు నాశనం చేశారని ఆరోపించారు. ఈ కేసులో చాలా పెద్ద పురోగతి సాధించే దశలో ఉన్నామని, తాత్కాలిక ఉపశమనం కల్పిస్తే దర్యాప్తు పక్కకు వెళ్లే అవకాశం ఉందన్నారు. కవిత చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని, ప్రజలను కూడా ఆమె ప్రభావితం చేస్తారన్నారు. సాక్షుల్ని పిలిచి వారి వారి వాంగ్మూలాలు మార్చుకోవాలని బెదిరించే అవకాశం ఉందంటూ హొస్సేన్ వాదించారు. ఈ దశలో కవిత న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మరోసారి జోక్యం చేసుకొని కవిత కుమారుడికి 12 పేపర్లలో ఏడు పూర్తయ్యాయని భారతీయతలో తల్లి ఒకరే తగిన సాన్నిహిత్యాన్ని అందించగలరని తెలిపారు. ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. -
మరోసారి కస్టడీనా.. బెయిలా?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ సోమవారంతో ముగిసింది. మంగళవారం ఉదయం కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈనెల 15న కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు మరుసటి రోజు కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఆమెకు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. అనంతరం శనివారం మరోసారి కవితను కోర్టులో హాజరుపరచిన ఈడీ అధికారులు మరిన్ని రోజులు తమకు కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు. దీంతో మరో మూడు రోజుల పాటు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పదిరోజుల పాటు కవితను పలు అంశాలపై ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రారంభ దశ నుంచి ఒక్కో పాయింట్‌ను కవితను అడుగుతూ అధికారులు విచారించారు. ఈ కేసులో ఇతర నిందితులతో కవిత జరిపిన వాట్సాప్ చాటింగ్ అంశంపై తొలిరోజు ఆమెను విచారించారు. ఈ కేసులో అరెస్టు అయిన వారితో ఏరకమైన సంబంధాలు ఉన్నాయి, వారిని ఎక్కడెక్కడ కలిశారు, వారికి కవితకు మధ్య ఏవిధమైన సంభాషణ జరిగిందనే విషయాలపై విచారణ జరిగింది. వీటితో పాటు ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వాళ్లు ఇచ్చిన సమాచారాన్ని ఆమె ముందు ఉంచి ఒక్కో ప్రశ్న అడిగారు. వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చిన కవిత, మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలను దాటవేసినట్లు సమాచారం. మరికొద్ది రోజులు కస్టడీ కోరనున్న ఈడీ! కవిత నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్న ఈడీ అధికారులు మంగళవారం విచారణ సందర్భంగా మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును కోరే అవకాశం ఉన్నట్లు అధికారుల నుంచి తెలుస్తోంది. ఇదే సందర్భంలో కవిత అరెస్టు అక్రమం అంటూ ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ రెండు వాదనలను రౌజ్ అవెన్యూ కోర్టు మంగళవారం వినే అవకాశంఉంది. దీంతో కవితను కోర్టు మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తుందా లేక, జ్యుడీషియల్ కస్టడీ విధి స్తుందా? ఈ రెండూ కాక బెయిలు మంజూరు చేస్తుందా? అనే అంశాలపై నేడు స్పష్టత వస్తుందని చెపుతున్నారు. కవితను కలసిన భర్త అనిల్ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను సోమవారం రాత్రి భర్త అనిల్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్‌రావు, పీఏ శరత్‌లు కలిశారు. సుమారు గంట పాటు కవితతో మాట్లాడారు. తొలుత కవిత భర్త అనిల్ ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పినట్లు సమాచారం. అలాగే తాము అంతా అండగా ఉన్నామంటూ వద్దిరాజు రవిచంద్ర భరోసా ఇచ్చినట్లు తెలిసింది. మంగళవారం కవితను కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో.. న్యాయవాది మోహిత్‌రావు ఆమెతో పలు విషయాలను చర్చించినట్లు సమాచారం. ఈ చర్చల్లో ఆమె పీఏ శరత్ కూడా పాల్గొన్నారు -
మాజీ ఎంపీపీ కవితపై స్థానికుల దాడి
-
ఎమ్మెల్సీ కవిత సోషల్‌మీడియా అకౌంట్స్ హ్యాక్!
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్‌కు గురయ్యాయి. ఈ విషయాన్ని ఆమె తన ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘సైబర్ నేరగాళ్లు మంగళవారం నాడు రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలుసార్లు నా సోషల్ మీడయా ఖాతాల హ్యాకింగ్‌కు యత్నించారు. అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు’ అని ఆమె పేర్కొన్నారు. My social media account experienced a brief unauthorized access. The suspicious activities and contents during this time do not reflect our values. Security measures have been reinforced, and we will observe a downtime to ensure security and we appreciate your understanding as my… — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 17, 2024 అయితే వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు ‘ఎక్స్’ ద్వారా వెల్లడిస్తూ.. డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. చదవండి: Congress: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. అద్దంకి దయాకర్‌కు ఝలక్ -
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత
-
పథకాల అమలులో కాలయాపన చేసే ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హనుమకొండ: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని తెలిపారు. రాజకీయాల్లో ఎగుడుదిగుడులు ఉంటాయని.. సంయమనం పాటించి, ఓపికతో ఉండాలని చెప్పారు. మన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ప్రజల మనసును గెలుచుకోవడం ద్వారా మళ్లీ మంచి స్థానంలో సుస్థిరంగా వెనక్కి రావచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు కవిత శనివారం మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల దరఖాస్తుల విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. పథకాల అమలు విషయంలో కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. బస్సు ఫ్రీ విషయంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వారికి ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు కాబట్టి.. వచ్చే జనవరిలో కరెంటు బిల్లులు కట్టాలా? వద్దా? అనే చర్చ ప్రజల్లో జరుగుతుందని ప్రస్తావించారు. నిరుద్యోగ భృతిపై ఫామ్‌లో అడగలేదని కూడా సందేహంలో ఉన్నారని అన్నారు. చదవండి: ప్రజా పాలన.. వాళ్లు అప్లై చేయక్కర్లేదు: సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ పార్టీ స్టాండు మారదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేస్తుందని. అయితే ఎంక్వైరీ రిపోర్టు రాకముందే మంత్రులు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. లక్షలాది మంది భక్తులు దర్శించుకునే సమ్మక్క సారలమ్మ మహా జాతరకు జాతీయ పండగగా గుర్తింపు ఇవ్వాలని కవిత పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ కృషి చేయాలని తెలిపారు. కొత్త కార్ల విషయాన్నిప్రభుత్వం రహస్యంగానే ఉంచుతుందని చెప్పారు. భద్రత దృష్ట్యా సీక్రెట్‌గా ఉంచాలని ఇంటెలిజెన్స్ చెప్పిన ప్రకారం ఈ విషయాలు రహస్యంగా ఉంచుతారని అన్నారు. ఎవరూ అధికారంలో ఉన్నా అదే పద్దతి ఉంటుందన్నారు. అందులో భాగంగానే ల్యాండ్ క్రూయిజర్ కార్లు విజయవాడలో ఉంచినట్టున్నారని పేర్కొన్నారు. దీన్ని పెద్ద అంశంగా చూపి వెటకారంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. దీన్ని ఇష్యూ చేయడం వల్ల ముఖ్యమంత్రి గౌరవమే తగ్గుతుందని కవిత పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయొద్దని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుందని, అందుకే పోటీ నుంచి తప్పుకున్నట్లు కవిత తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మిక వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. అందుకే AITUC మద్దతు ఇచ్చామని చెప్పారు. సింగరేణికి అనేక పనులు చేశామన్నా ఆమె.. ఆత్మ ప్రమోధానుసారం ఓటు వేయమని కోరినట్లు తెలిపారు. -
రివేంజ్ తీర్చుకున్న కల్వకుంట్ల కవిత..ఎలా అంటే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైనా ఎమ్మెల్సీ కవితకు మాత్రం సంతోషం కలిగించే విషయం ఒకటుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తననున పట్టుబట్టి ఓడించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ చేతిలో ఓటమి పాలయ్యారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి సంజయ్ గెలుపులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ప్రముఖంగా ఉంది. ఎంపీ అర్వింద్ ఏ పార్లమెంట్ నియోజకవర్గంలోనైతే తనను ఓడించి గెలిచాడో అదే పార్లమెంట్ నియోజకవర్గంలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో అర్వింద్‌ను తన సపోర్ట్ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడించి కవిత రివేంజ్ తీర్చుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో అర్వింద్‌ను ఓడిస్తే కవిత పగ పూర్తిగా తీరుతుందని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే విషయమై కవిత ట్విట్టర్లో కూడా స్పందించారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల తరపున ఎల్లప్పుడూ పోరాడుతుందని తెలిపారు. మన మాతృభూమి కోసం చిత్తశుద్ధితో పనిచేద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. -
ప్రజలతో మాది పేగు బంధం.. కాంగ్రెస్‌ది చేదు బంధం: ఎమ్మెల్సీ కవిత
‘అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరిన క్రమంలో ప్రజల్లో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆదరణ కనిపిస్తోంది. బీఆర్ఎస్కు ప్రజలతో ఉన్నది పేగు బంధం అయితే, కాంగ్రెస్‌తో ఉన్నది చేదు బంధం. కాంగ్రెస్, బీజేపీ సోషల్ మీడియాలో సృష్టించే అయోమయం, చెప్పే అబద్ధాల నడుమ బీఆర్ఎస్ను ప్రజలు ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. బీజేపీ గత ఎన్నికల్లోనూ 105 చోట్ల డిపాజిట్ కోల్పోయింది. ఈసారి కూడా అంతకంటే గొప్పగా ఏమీ ఉండదు. కాంగ్రెస్ మాకు చాలా దూరంలో ఉన్నా ఎంతో కొంత పోటీనిస్తోంది. అందుకే కాంగ్రెస్ ఆలోచన సరళి, అహంకారం, అజ్ఞానం గురించి ప్రజలకు విడమరిచి చెప్తున్నాం’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పదేళ్ల నుంచి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్యారంటీల పేరిట కాపీ కొట్టి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుకుంటోందని ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు చేస్తున్న విమర్శల సంగతేంటి? ప్రజాదరణ ఉన్న కేసీఆర్‌ను అందుకోలేని విపక్ష నేతలు ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించేలా దిగజారి మాట్లాడుతున్నారు. కష్టపడేతత్వం లోపించిన విపక్షాలు ఏది పడితే అది మాట్లాడుతున్నాయి. తెలంగాణకు భౌగోళికంగా, రాజకీయంగా గుర్తింపు తెచ్చిన కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న తీరును ప్రజలు ఏవగించుకుంటున్నారు. మాది కుటుంబ పార్టీ అంటున్న వారు మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ప్రజల గొంతు వినిపించి రాష్ట్రాన్ని, అనేక రక్షణలు తెచ్చామనే విషయాన్ని గమనించాలి. లక్ష సవాళ్లు, విష ప్రచారాలను ఛేదించి తెలంగాణను సాధించిన కేసీఆర్‌ను గతంలో ప్రజలు దీవించారు. ఇప్పుడూ అదే జరుగుతుంది. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చింది. మీ కష్టం ఎంత మేర ఫలిస్తుంది? కేసీఆర్ పెద్ద మనసుతో తెచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతున్నా, అమలు చేసే శక్తి ఎవరికి ఉందో ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు మాకు ఆత్మబంధువులు. సంపదను సృష్టించి తెలంగాణ సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకుని పెట్టిన పథకాలు ఫలితాన్ని ఇస్తున్నాయి. రాష్ట్రంలో వచ్చే 50 ఏళ్లకు అవసరమయ్యే మౌలిక వసతులను దూరదృష్టితో అభివృద్ధి చేస్తున్నాం. సంక్షేమ పథకాలు, అభివృద్ది మాకు రెండు కళ్ల లాంటివి. మళ్లీ అధికారంలోకి వస్తే దిగువ, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. యువత విషయానికి వస్తే ఈ తరం చాలా తెలివైంది. తెలంగాణ ఉద్యమ సమయంతో పోలిస్తే కొత్త తరానికి సమాచారం అందుబాటులో ఉంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే బాగుంటుందనే విషయంలో కొత్త తరానికి స్పష్టత ఉంది. కేసీఆర్ కమిట్మెంట్ను వీరు గుర్తిస్తారు. మహిళా రిజర్వేషన్ చట్టంపై మీ తదుపరి కార్యాచరణ ఏంటి? 2024 లోక్‌సభ ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలయ్యేలా భారత జాగృతి తరఫున సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవుతాం. డిసెంబర్ 3 తర్వాత ఢిల్లీ స్థాయిలో ఉద్యమిస్తాం. జాతీయ పార్టీల అగ్రనేతల ప్రచారం మీ పార్టీపై ప్రభావం చూపిందా? విపక్షాలకు పీఎంలు, సీఎంలు ఉంటే తెలంగాణకు కేసీఆర్ ఉన్నారు. కర్ణాటకలో బీజేపీ ఫెయిల్ కావడంతోనే కాంగ్రెస్ గెలిచింది. మా సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరనేది ఢిల్లీ నేతలు చెప్పడం లేదు. సీల్డ్ కవర్ సీఎంల చేతిలో రాష్ట్ర భవిష్యత్‌ను పెట్టలేము. కాంగ్రెస్ నాయకులకు ప్రజలు, పార్టీ పట్ల కమిట్మెంట్ లేదు. వ్యక్తిగత ప్రయోజనం తప్ప, ప్రజల కోసం పనిచేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్, బీజేపీలకు లేదు. రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో కేసీఆర్‌ను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నాయి. కేసీఆర్‌ను గెలిపించడంలో తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది. రైతుబంధును నిలిపివేయాలనే కాంగ్రెస్ ఫిర్యాదుపై ఏమంటారు? రైతు కష్టాలను తీర్చేందుకు రైతుబంధు అమలు చేస్తున్నాం. కానీ కాంగ్రెస్ రైతుల నోటి ముందు ముద్దను లాక్కొంటున్నది. వీరికి రైతులు, ప్రజల విషయంలో ఎలాంటి పట్టింపు లేదు. -
కారు నడిపిన ఎమ్మెల్సీ కవిత.. కార్యకర్తల్లో న్యూ జోష్..
-
ఏది ఫ్యామిలీ పాలిటిక్స్..ప్రియాంక గాంధీకి కవిత కౌంటర్
-
గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం: ఎమ్మెల్సీ కవిత
-
కొన్నేళ్లుగా మహిళా బిల్లు కోసం పోరాడుతున్నాం: కవిత
-
పదేళ్లలో తెలంగాణ హక్కుల గురించి రాహుల్ మాట్లాడారా?
-
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరోసారి ఈడీ సమన్లు
-
ప్రధానికి లేఖ.. మహిళా బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదు?
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి 9 అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం లేకపోవడాన్ని కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు. ప్రధానికి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని సోనియా గాంధీని కవిత సూటిగా ప్రశ్నించారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశం కాదా? అని అడిగారు. మహిళా బిల్లును కాంగ్రెస్ పూర్తిగా విస్మరిస్తున్నట్టు తేటతెల్లమైందని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ముఖ్యమైన మహిళ బిల్లు పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని నిరూపితమైందని స్పష్టం చేశారు. ఈమేరకు బుధవారం రోజున ఎక్స్ (ట్విట్టర్)లో కవిత పోస్ట్ చేశారు. చదవండి: ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి వెట్ రన్ ప్రారంభించనున్న సీఎం Saddened to see that the urgency for discussing Women's Reservation Bill was completely ignored in Congress Parliamentary Party Chairperson and MP Smt. Sonia Gandhi Ji's letter to the Prime Minister. Mrs. Gandhi Ji, the nation awaits your powerful advocacy for gender equality.… https://t.co/RHlQAbLPz8 — Kavitha Kalvakuntla (@RaoKavitha) September 6, 2023 -
మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఎమ్మెల్సీ కవిత లేఖతో కదిలిన రాజకీయ పార్టీలు
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపడుతున్న ముమ్మర ప్రయత్నాలకు అనేక రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రాన్ని ఒత్తిడి చేసుకొని బిల్లును ఆమోదింపజేయాలని 47 రాజకీయ పార్టీలకు మంగళవారం రోజున ఆమె రాసిన లేఖ అపూర్వ స్పందన లభించింది. కవిత రాసిన లేఖ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల ఆవశ్యతపై దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించింది. ఆమె లేఖ రాసిన కొద్ది గంటల్లోనే అనేక పార్టీల నాయకులు స్పందించారు కవిత విజ్ఞప్తిని అంగీకరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్ధతిస్తామని ప్రకటించడమే కాకుండా కవిత చేస్తున్న కృషిని ప్రశంసించారు. కవిత లేఖపై ఎన్సీపీ, జేడీయూ, సమాజ్ వాదీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్, ఆర్జేడీ వంటి కీలక పార్టీలు తక్షణమే స్పందించాయి. జాతీయ మీడియాలో కవిత లేఖపై తీవ్ర చర్చలు జరిగాయి. ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పందిస్తూ... చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు చాలా అవసరమని, ఎంత మేర రిజర్వేషన్లు కల్పించాలన్న విషయంపై పార్లమెంటులో చర్చ జరగాలని అన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకొస్తే తాము మద్ధతిస్తామని ప్రకటించారు. కానీ బీజేపీకి మహిళా బిల్లుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా స్పందిస్తూ... మహిళా రిజర్వేషన్ బిల్లు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉందని, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల ప్రజాస్వామ్యం మరింత బలంగా మారుతుందని తమ పార్టీ విశ్వసిస్తుందని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉండాలని అన్నారు. లేదంటే మరో 25 ఏళ్ల పాటు వాటి కోసం పోరాడాల్సి వస్తుందని చెప్పారు.రిజర్వేషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహిళా బిల్లుకు తమ పార్టీ మద్ధతిస్తుందని చెప్పారు. సమాజ్ వాది పార్టీ సీనియర్ నాయకురాలు పూజా శుక్లా స్పందిస్తూ...తమ పార్టీ ఎప్పుడూ మహిళా సంక్షేమం కోసం పాటుపడుతుందని, మహిళలకు అవకాశాలు కల్పించడంలో తమ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముందుంటారని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ అనుకూలమని ప్రకటించారు. మహిళా బిల్లు కోసం కల్వకుంట్ల కవిత చేస్తున్న కృషిని అభినందించారు. తృణముల్ కాంగ్రెస్ నాయకురాలు, పశ్చిమ బెంగాల్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా మాట్లాడుతూ... తమ పార్టీ మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తోందని, అనేక సందర్భాల్లో తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఆ అంశాన్ని ప్రస్తావించారని వివరించారు. తమ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. మహిళా బిల్లు కల్వకుంట్ల కవిత లేఖ రాశారని, తప్పకుండా మద్ధతిస్తామని స్పష్టం చేశారు. -
Kavitha : కూతురు కవిత విషయంలో కేసీఆర్ వ్యూహమేంటీ?
దెబ్బ తిన్న చోటే పోరాడి గెలిచి చూపించాలన్నది సీఎం కెసిఆర్ వ్యూహాంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీటు స్థానానికి పోటీ చేసిన కవిత అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. కవిత రాజకీయ భవితవ్యంపై అప్పట్లో ఓ రకంగా సంధిగ్దత నెలకొంది. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చినా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మండలిలో అడుగు పెట్టారు కవిత. జగిత్యాల ? నిజామాబాద్ .?? గత రెండేళ్లుగా కవిత ప్రధానంగా రెండు నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఒకటి నిజామాబాద్ అర్బన్ కాగా, మరొకటి జగిత్యాల. బతుకమ్మ వేడుకల నుంచి ప్రతీ చిన్న కార్యక్రమానికి ఈ రెండు చోట్ల కవిత హాజరు కావడంతో ఈ రెండింటిలో ఏదో ఒక చోట కవిత పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సంజయ్ కూడా తనకు టికెట్ దక్కుతుందో లేదో అన్న అనుమానాల్ని నిన్నటి వరకు కూడా వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో జగిత్యాల నుంచి కవితకు టికెట్ ఖాయం అన్న ప్రచారం జరిగింది. అయితే సీఎం కెసిఆర్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి ముందడుగు వేయలేదు. తాజా జాబితాలో కవితకు చోటివ్వలేదు. Dumdaar Leader - Dhamakedaar Decision !! Our leader KCR Garu announced 115 exceptional candidates for the forthcoming Assembly elections out of 119 seats. It truly is a testament to the people's faith in CM KCR Garu's courageous leadership and the impactful governance of the… pic.twitter.com/G3czjqZeNK — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 21, 2023 మళ్లీ ఢిల్లీకే.! ఓడిన చోటే కవిత ఘనవిజయం సాధించాలన్నది కెసిఆర్ పట్టుదలగా కనిపిస్తోంది. నిజామాబాద్‌లో కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలవడం కెసిఆర్ పొలిటికల్ కెరియర్లో ఇబ్బంది పడ్డ క్షణం. ఓ రకంగా రాజకీయంగా ఉద్ధండుడైన కెసిఆర్.. తన బిడ్డను గెలిపించుకోలేకపోయాడన్న ప్రచారం జరిగింది. టార్గెట్ పార్లమెంట్ 2024 ఎండాకాలంలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం కవితను సీఎం కెసిఆర్ సిద్ధం చేస్తున్నట్టు తాజా టికెట్ల ప్రకటనతో తేలింది. నిజామాబాద్ నుంచే కవితను బరిలో దించి ఘనవిజయం సాధించేలా అడుగులు కదపాలన్నది కెసిఆర్ వ్యూహాంగా కనిపిస్తోంది. The spirit of Telangana and the celebration of “Car and KCR Sarkar”! ✊🏻 This Padyatra today reflects on the tremendous energy and enthusiasm towards BRS Government led by CM KCR Garu. Jai Telangana! Jai KCR! pic.twitter.com/5dVkm3NaSJ — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 16, 2023 -
కుల, మతాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం: ఎమ్మెల్సీ కవిత
-
కరెంటు ఉందో లేదో ఒకసారి తీగలు పట్టుకొని చూడు..
-
వీజే సన్నీ 'సౌండ్ పార్టీ'.. పోస్టర్ రిలీజ్ చేసిన ఎమ్మెల్సీ కవిత
వీజే సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్గా నటిస్తోన్న తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’. నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకత్వంలో రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...'సౌండ్ పార్టీ టైటిల్, పోస్టర్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా ఎంటర్టైన్ చేయనుందని టైటిల్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించి దర్శక నిర్మాతలకు , చిత్రబృందానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. (ఇది చదవండి:83 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు.. అప్పుడేమో డౌట్.. ఇప్పుడు ఏకంగా!) నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ..' ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్‌లో వస్తోన్న మొదటి సినిమా `సౌండ్ పార్టీ` పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత లాంఛ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన సౌండ్ పార్టీ టైటిల్‌కు రెస్పాన్స్ బాగా వచ్చింది. మా యూనిట్ అంతా ఎంతో శ్రమించి అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం.'అని అన్నారు. హీరో వీజే సన్ని మాట్లాడుతూ...' ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ అంతా పూర్తయింది. సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగొచ్చింది' అన్నారు. దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ...'సౌండ్ పార్టీ' పోస్టర్‌ను కవిత లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని' అన్నారు. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోతో డేటింగ్లో లైగర్ భామ.. స్పందించిన హీరోయిన్ తండ్రి!) -
నిజామాబాద్ అర్బన్ బరిలో ఎమ్మెల్సీ కవిత!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రానున్న శాసనసభ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ ప్రారంభించింది. తగిన ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది. ఇదిలా ఉండగా ఆయా రాజకీయ పార్టీలు, టిక్కెట్ల ఆశావహులు కా ర్యాచరణను ముమ్మరం చేశారు. జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఎంఐఎం సైతం నిర్ణయాత్మక ప్రాబల్యం కలిగి ఉన్నాయి. దీంతో పలుచోట్ల బహుముఖ పోటీ, కొన్ని చోట్ల త్రిముఖ, ద్విముఖ పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఆయా పార్టీలు ఏఏ స్థానాల్లో పోటీచేస్తే ఫలితాలు ఎలా తారుమారు అవుతాయనే విషయమై లెక్కలు వేసుకుంటున్నాయి. నిలబెట్టే అభ్యర్థులను బట్టి ఓట్ల క్రాసింగ్‌కు అవకాశాలు ఉండడంతో పార్టీల్లో గుబులు నెలకొంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎప్పటికప్పుడు వరుస సర్వేలు చేస్తూ ప్రజల నాడి తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి పక్షం రోజులకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారిపోతుండడంతో వివిధ వర్గాల ప్రజల ఆలోచన సరళి అంతుబట్టడంలేదని పార్టీల నాయకులు చెబుతు న్నారు. దీంతో అన్నిరకాలుగా బలమైన అభ్యర్థుల వేటలో కాంగ్రెస్, బీజేపీలు చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. బీఫారాలు కేటాయించే సమయంలోనూ జంపింగ్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా అభ్యర్థులు తామున్న పార్టీలో ప్రయత్నాలు చేస్తూనే ఇతర పార్టీల కీలక నేతలతో టచ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. పార్టీలు సైతం తమకు గట్టి అభ్యర్థి లభించని పక్షంలో ప్రత్యర్థి పార్టీలో టిక్కెట్టు ఆశించి భంగపడిన గట్టి అభ్యర్థిని చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఆటు పార్టీలు, అటు అభ్యర్థులు ప్లాన్ ఏ,ప్లాన్ బీ, ప్లాన్ సీ అనేలా ముందుకు వెళుతున్నారు. ► నిజామాబాద్ రూరల్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. అయితే ఆయన తన కుమారుడు, ధర్పల్లి జెడ్పీటీసీ జగన్‌ను నిలబెట్టేందుకు కేసీఆర్‌ను అడుగుతున్నారు. బీజేపీ నుంచి దినేశ్ కులాచారి అభ్యర్థిగా చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి టిక్కెట్టు ఖ రారైనట్లు సమాచారం. ఈ టిక్కెట్టును పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ రెడ్డి ఆశిస్తున్నారు. సినీ హీరో తన మేనల్లుడు నితిన్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల మళ్లీ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ అరికెల తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ► బోధన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఉండగా ఈసారి టిక్కెట్టును ఆయన సతీమణి ఆయేషా ఫాతిమాకు ఇస్తారనే చర్చ నడుస్తోంది. బీజేపీ నుంచి మేడపాటి ప్రకాష్‌రెడ్డి, వడ్డి మోహన్‌రెడ్డి ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి రేసులో ఉన్నారు. ► ఆర్మూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఉ న్నారు. బీజేపీ నుంచి పార్టీలో ఇటీవల చేరిన పైడి రాకేష్‌రెడ్డి టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఇక్కడ ప్రొద్దు టూరి వినయ్‌రెడ్డి బీజేపీ టిక్కెట్టు రేసులో ముందు న్నారు. కాంగ్రెస్ పార్టీ వినయ్‌రెడ్డిని చేర్చుకుని బరి లోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇక్కడి నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేయాలని పార్టీ శ్రేణులు, పలువురు రైతులు కోరుతుండడం గమనార్హం. ► బాల్కొండలో మంత్రి వేముల బీఆర్ఎస్ సిట్టింగ్గా ఉన్నారు. బీజేపీ నుంచి ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి తగిన ఏర్పాట్లలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి టిక్కెట్టుకు గట్టి ప్ర యత్నాలు చేస్తున్నారు. అయితే ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డిని చేర్చుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసింది. ఈ నెల 20న లేదా నెలాఖరులో సునీల్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ నిజామాబాద్ అర్బన్‌లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ కవిత ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ కూడా నడు స్తోంది. బీజేపీ నుంచి ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ టిక్కెట్టు రేసులో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహే శ్ కుమార్‌గౌడ్‌కు టిక్కెట్టు ఖరారైనట్లు పార్టీ వర్గా ల్లో చర్చసాగుతోంది. ఈ టిక్కెట్టు కోసం పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, నగర అ ధ్యక్షుడు కేశ వేణు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా సర్వేల మేరకే టిక్కెట్లు అని పీసీసీ నాయకత్వం ఇప్పటి కే ప్రకటించింది. ఈ స్థానం నుంచి ఎంఐఎం బరిలో ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంఐఎం తరుపున టిక్కెట్టు కోసం బొబ్బిలి నర్స య్య గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ ఇద్రిస్‌ఖాన్, జిల్లా అధ్యక్షుడు షకీల్‌పాషా, మాజీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ మేయర్ ఫయీమ్, మాజీ కా ర్పొరేటర్ రఫత్‌ఖాన్ రేసులో ఉన్నారు. ఆయా పార్టీలు నిలబెట్టే అభ్యర్థులను బట్టి ఓట్ల క్రాసింగ్ ఉండనుండడంతో నిజామాబాద్ అర్బన్ సీటు పై ప్రత్యేక రాజకీయ పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఆయా పార్టీల, అభ్యర్థుల పరిస్థితులను బట్టి ఫలితం తారుమారయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బహుముఖ పోటీ ఉంటే ఓట్ల చీలిక తీవ్ర ప్రభావం చూపనుంది. -
కవితకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం
-
ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది: కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: ట్విటర్ వేదికగా బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కుమార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఆడబిడ్డల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, కానీ, ఇంటి బిడ్డకు(కవితను ఉద్దేశించి..) అన్ని విధాల అండగా ఉంటావంటూ కేసీఆర్‌పై ట్వీట్లో బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. దీనికి సోషల్ మీడియా వేదికగానే కవిత కౌంటర్ ట్వీట్ చేశారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం, మహిళా రెజ్లర్ల ఉద్యమాన్ని పట్టించుకోకపోగా.. బీజేపీ ఎంపీపై బ్రిజ్‌పై చర్యలు తీసుకోకపోవడం, సిలిండర్ల ధరలు పెంచడం.. ఇలా ప్రతీ అంశాన్ని లేవనెత్తి కౌంటర్ ట్వీట్ చేశారామె. గవర్నర్ కు దక్కదు గౌరవం. ఆడబిడ్డలకు లేదు అండ. గిరిజన మహిళలపై పోలీస్ గిరీ. బతుకమ్మను అవమానపరిచినోడితో ఆలింగనం. ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతవ్ అడ్డం. అదిరింది కేసీఆర్ నీ మహిళా సంక్షేమం. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం నినాదాలకే పరిమితమైన భేటీ బచావో... భేటీ పడావో సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్ లో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి మహిళకు విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం ఆడబిడ్డ తలుచుకుంది ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది అంటూ కౌంటర్ ట్వీట్ చేశారామె. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం… https://t.co/V05XeA3vR5 — Kavitha Kalvakuntla (@RaoKavitha) June 13, 2023 -
విమర్శలు.. సవాళ్లు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఎన్నికల ఏడాది కావడంతో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శల వేడి మరింత పెరుగుతోంది. ఎన్నికలకు కౌంట్‌డౌన్ అవుతున్నకొద్దీ నువ్వా నేనా అనేవిధంగా సవాళ్లు, ప్రతిసవాళ్లతో వాతావరణం పూర్తిగా మారిపోతోంది. తాజాగా బోధన్ నియోజకవర్గ పర్యటనలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌పై విమర్శలు చేయడంతో జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రతివిమర్శలు చేశారు. సుదర్శన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సక్రమంగా పింఛన్లు ఇవ్వలేదని, చిన్న పదవి ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్ అంటూ కవిత వ్యాఖ్యలు చేయడంతో జిల్లా నాయకులు ఘాటుగా ప్రతిస్పందించారు. కష్టపడి అంచెలంచెలుగా పదవులు పొందిన వారిని చులకన చేయడమేమిటని అంటున్నారు. ఇలాంటి భావన ఉన్నందునే కవితను ఎంపీగా ఓడించడంతో తండ్రిని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్సీ తెచ్చుకున్నారన్నారు. లిక్కర్ స్కాం విషయాన్ని ప్రస్తావిస్తూ కవితకు జ్ఞాపకశక్తి పోయిందని విమర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి, నిజాం షుగర్స్ మూసివేత, భూముల వ్యవహారాన్ని కాంగ్రెస్ నాయకులు గట్టిగా ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ వర్సిటీలో గందరగోళాన్ని సరిదిద్దలేని కవిత, కేసీఆర్ ప్రభుత్వం అంటూ విమర్శలు చేస్తున్నారు. రానురాను ఈ విమర్శల జడివాన మరింత పెరుగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. జిల్లాలో రేవంత్ యాత్ర విజయవంతం కావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం అనేక రెట్లు పెరిగింది. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి రైతులతో ముఖాముఖి సదస్సు నిర్వహించారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఆతీ్మ య సమ్మేళనంలో ఇటీవల మంత్రి వేముల చేసిన వ్యాఖ్యలపై డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ఫైరయ్యారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి కంటే బీఆర్ఎస్ 8 సంవత్సరాల్లోనే ఎక్కువ చేసిందని మంత్రి వాఖ్యానించారు. దీంతో మానాల మంత్రికి సవాల్ విసిరారు. జిల్లాలో, నియోజకవర్గంలో కానీ అభివృద్ధి విషయంలో మంత్రి బహిరంగ చర్చకు రావాలని మానాల అన్నారు. తేదీ, సమయం మంత్రే నిర్ణయిస్తే ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. మంత్రి తన చెంచాగాళ్లతో స్టేట్మెంట్లు ఇప్పించకుండా నేరుగా చర్చ తేదీని ప్రకటించాలన్నారు. అభివృద్ధి విషయంలో అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన దీర్ఘకాలిక పనులతో పాటు ఇందిరమ్మ ఇళ్లలాంటి తదితర పథకాలు కాంగ్రెస్ హయాంలో అమలు చేశామన్నారు. ఎత్తిపోతల పథకాలు, కెనాల్స్, విద్య, వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ రోడ్లు తదితర అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పిన డబుల్ ఇళ్లు ఒక్క శాతం కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన తారు రోడ్ల మీద మళ్లీ తారు పోసి కమీషన్లు దండుకుంటున్నారన్నారు. ఇక మంత్రి ప్రశాంత్‌రెడ్డి హయాంలో నిర్మించిన చెక్‌డ్యాంల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. కట్టిన 30 రోజులకే చెక్‌డ్యాంలు కూలి పోవడం శోచనీయమని మానాల అన్నారు. వైఎస్సార్ హయాంలో కమ్మర్‌పల్లిలో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే దాన్ని అభివృద్ధి చేయడం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేత కావడం లేదన్నారు. ఈ సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. రేవంత్‌రెడ్డి యాత్ర, కర్ణాటక ఫలితాల తరువాత పెరిగిన కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్‌ను మరింతగా పెంచుకునేవిధంగా క్షేత్రస్థాయిలో ఇంకా ముందుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మానాల రెగ్యులర్‌గా బాల్కొండ నియోజకవర్గంలో గ్రామాల వారీగా కార్యక్రమాలు చేస్తున్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ కావడంతో పాటు తాజాగా సవాళ్లు విసురుకుంటుండడంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. -
ఆస్ట్రేలియాలో కేసీఆర్ క్రికెట్ టోర్నీ పోస్టర్ ఆవిష్కరించిన కవిత
బీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌లో కేసీఆర్ కప్ టోర్నమెంట్ నిర్వహించనున్న నేపథ్యంలో ఎంఎల్సీ కవిత పోస్టర్‌ను ఆవిష్కరించారు. 29 రాష్ట్రాల NRIలు పాల్గొంటున్న టోర్నమెంట్.. టీఆర్ఎస్నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తరువాత ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయులందరికీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం , కేసిఆర్ తెలంగాణాలో చేసిన అభివృద్ది , కేసిఆర్ భావజాల వ్యాప్తి చేయడానికి క్రికెట్ టోర్నమెంట్‌ను ఎన్నుకునామని , ఈ టోర్నమెంట్ లో భారత దేశానికి చెందిన 29 రాష్ట్రాల కు చెందిన వారు పాల్గొంటారని, తద్వారా కేసిఆర్ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే అజెండాను NRI లందరికీ చేరుతుందని అందుకే బీఆర్ఎస్ ఆస్ట్రేలియా కార్యవర్గం క్రికెట్ కప్ టోర్నమెంట్‌ను ఎంచుకుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని భారతీయులందరికీ తెలియచేసేలా , అలాగే ఉద్యమం నుండి పార్టీకి విశిష్ట కృషి చేస్తున్న బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డిని కవిత అభినందించారు . కేసిఆర్ క్రీడలను ప్రోత్సహించడానికి ప్రతీ గ్రామానికి స్టేడియం నిర్మించబోతున్నారని, దీని స్ఫూర్తి తోనే మేము క్రికెట్‌ను పార్టీ భావజాల వ్యాప్తికై ఎంచుకున్నామని నాగేందర్ రెడ్డి తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో బాబా ఫసియుద్దిన్ ,సేనాపతి రాజు, కళ్లెం హరికృష్ణ రెడ్డి, రమేష్ చారీతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. -
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు..
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. కవితకు సంబంధించిన వ్యక్తిగా స్కాంలో అరుణ్ పిళ్లై వ్యవహరించారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో కవిత పాత్రపై సమగ్ర దర్యాప్తు వివరాలను కోర్టుకు ఈడీ సమర్పించింది. నాలుగవ సప్లమెంటరీ చార్జిషీట్లో 53 సార్లు కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. 278 పేజీల భారీ చార్జిషీట్లో అరుణ్ పిళ్లై, బుచ్చి బాబు సమీర్ మహేంద్ర కీలక స్టేట్మెంట్లలో కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. ఛార్జిషీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ పాలసీ రూపకల్పనకు ముందే కవిత, ఆప్ విజయ్ నాయర్ మధ్య చర్చలు జరిగాయి. ఆ తర్వాత మద్యం పాలసీ ఖరారు చేసినట్లు పేర్కొన్న ఈడీ.. కవిత కాల్ డేటా రికార్డును సాక్ష్యంగా సమర్పించింది. ‘‘ఏప్రిల్ 8, 2022న కవిత అరుణ్ పిళ్లైలు వంద కోట్ల ముడుపుల సొమ్మును తిరిగి ఎలా రాబట్టుకోవాలనే అంశంపై విజయ్ నాయర్ దినేష్ అరోరాతో ఢిల్లీలోని ఉబెరాయ్ హోటల్లో చర్చించారు. సౌత్ గ్రూపునకు అనుకూలమైన విధానం రూపకల్పన చేసి ముడుపులు అందుకున్నారు. సౌత్ గ్రూప్ నుంచి విజయనాయర్ 100 కోట్ల ముడుపులు అందుకున్నారు. పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత కవిత, సమీర్ మహేంద్ర ఫేస్ టైం లో మాట్లాడుకుని బిజినెస్ బాగుందని అభినందనలు తెలుపుకున్నారు. ఇండో స్పిరిట్ ఎల్ వన్ దరఖాస్తు ఆలస్యం కావడంపై సమీర్ మహేంద్రతో కవిత చర్చలు జరిపింది’’ అని ఈడీ పేర్కొంది. బ్రిండ్ కో యజమాని అమన్ దల్ తమకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నారని సమీర్ వెల్లడించగా, అలాంటి సమస్యలుంటే తాను క్లియర్ చేస్తానని కవిత చెప్పినట్లు ఈడీ వెల్లడించింది. చదవండి: లిక్కర్ స్కాంలో సిసోడియాకు గట్టి దెబ్బ, ఆ వెంటనే.. ‘‘ఈ అంశంపై హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నారు. తన తరఫున అరుణ్ వ్యాపారంలో ఉంటారని అవసరమైతే ఈ వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించాలని కవిత సూచించింది. తాను కవితను రెండుసార్లు కలిశానని, ముడుపులు తిరిగి రాబట్టుకునే అంశంపై చర్చించానని విజయ్ నాయర్ స్టేట్మెంట్ ఇచ్చారు. 11.11.2022న ఈడీ ముందు అరుణ్ పిళ్ళై కీలక సాక్ష్యం ఇచ్చారు. కవితకు ఆప్‌కు మధ్య 100 కోట్ల రూపాయల డీల్ కుదిరింది అని అరుణ్ పిళ్లై స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఇండో స్పిరిరిలో ఆమెకు వాటాలు ఉన్నాయి’’ అని ఈడీ పేర్కొంది. కవిత తరపున తాను భాగస్వామిగా పనిచేశానని అరుణ్ పిళ్ళై వెల్లడించారని, పెర్నార్డ్ రికార్డు బిజినెస్‌ను ఇండస్పిరిట్‌కు ఇప్పించి, అందులో 65 శాతం వాటాలు పొందారని, ఈ వ్యాపారంలో కవితే అసలైన ఇన్వెస్టర్ అని, కవితకు ఆప్‌కు మధ్య సంపూర్ణమైన అవగాహన కుదిరింది’’ అని ఈడీ తెలిపింది. -
సుఖేష్ చంద్రశేఖర్ చాట్స్‌పై స్పందించిన కవిత
-
స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, కరీంనగర్: ఆడబిడ్డల్లో ఆత్మస్థైర్యం కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అన్ని శాఖల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. సోమవారం ఆమె తిమ్మాపురంలో మహిళా దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇస్తామని కవిత అన్నారు. గ్యాస్ ధర పెంపుతో కట్టెల పొయ్యి రోజులు వచ్చాయన్నారు. మహిళా సంఘాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా 54 లక్షల మందికి 18 వేల కోట్ల రూపాయలను స్వాలంబన కింద అందిస్తున్నామని, వడ్డీ లేని రుణాలు.. అభయహస్తం త్వరలోనే విడుదల చేస్తామని కవిత అన్నారు. ఇన్నాళ్లు ఇంటికి పరిమితమైన ఆడబిడ్డలు ఇప్పుడు ఉద్యోగం కోసం బయటకు వస్తున్నారు. ఆడబిడ్డలకు భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కవిత అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు ఇవ్వడంతో రాష్ట్రానికి కొత్తగా 20 వేల కంపెనీలు వచ్చాయి. దీంతో తెలంగాణలో 30 లక్షల కొలువులు పెరిగాయి. ప్రభుత్వం కూడా రెండున్నర లక్షల కొలువులు ఇస్తుంది. ఏది తోడున్నా లేకున్నా.. ఆడబిడ్డ తాను చదువుకున్న చదువు.. జీవిత కాలం తోడుంటుంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆడబిడ్డలు ఆర్థిక సాధికారత వైపు అడుగులు వేయాలి’’ అని కవిత పిలుపునిచ్చారు. చదవండి: కుక్కలకు కరవమని నేను చెప్పానా?.. మేయర్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్ -
నాన్న పుట్టినరోజు.. అమ్మవారికి బంగారు ఆభరణాలు
-
సినీ హీరో అర్జున్ నిర్మించిన దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత
సాక్షి, చెన్నై: నటుడు అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని ఎమ్మెల్సీ కవిత శుక్రవారం సందర్శించారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొనడానికి చెన్నైలో పర్యటిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రముఖ సినీ హీరో అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్జున్ దంపతులు కల్వకుంట్ల కవితకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపారు. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, అక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని అన్నారు. తమిళనాడు ప్రజలు తమ సంస్కృతి భాష చరిత్ర వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆ గౌరవభావం ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉందని తెలిపారు. దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు అర్జున్‌కు కవిత అభినందనలు తెలిపారు. చదవండి: దర్శకుడితో హీరోయిన్ డేటింగ్..! -
గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై కవిత ట్వీట్.. రియాక్షన్ ఎలా ఉందంటే?
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. గత ఏడాది కూడా వేడుకలను రాజ్‌భవన్‌కే పరిమితం చేశారు. కేసీఆర్, మంత్రులు ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వ పెద్దలు హాజరు కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రమే హాజరయ్యారు. గురువారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొందరికి నేను నచ్చకపోవచ్చు.. కానీ తెలంగాణ అంటే ఇష్టం. ఎంతకష్టమైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తా. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర తప్పక ఉంటుంది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం. కొందరికి ఫార్మ్‌హౌస్‌లు కాదు.. అందరికీ ఫార్మ్‌లు కావాలి. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.. తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయి’’ అంటూ ఆమె కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టిపెట్టకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువత కోసమే మా పోరాటం. ఇలాంటి ప్రత్యేకమైన రోజున సీఎం కేసీఆర్ ప్రశ్నించిన వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు’’ అంటూ కవిత ట్వీట్ చేశారు. చదవండి: కొందరికి నేను నచ్చకపోవచ్చు.. రిపబ్లిక్ డే వేడుకల్లో తమిళిసై షాకింగ్ కామెంట్స్ Choosing country’s infrastructure over central vista during pandemic, is what we demanded. Choosing farmers, labourers, unemployed youth over focusing on wealth generation for a few is exactly what we have been fighting for. Thank you for echoing the vision of CM KCR Garu. https://t.co/VCOIHKZkbT — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 26, 2023 -
హైదరాబాద్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
గని ప్రమాదంలో కళ్లు కోల్పోయిన కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 8వ గని ప్రమాదంలో గాయపడ్డ కార్మికుల్లో ఇద్దరు ఒక కంటి చూపు కోల్పోయారు. గురువారం జరిగిన ప్రమాదంలో కార్మికులు చింతల రామకృష్ణ, బండి రాజశేఖర్, శ్రీనివాస్‌లు తీవ్రగాయాలపాలవ్వడంతో హైదరాబాద్‌కు తరలించి వైద్యసేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. వారిలో రామకృష్ణ, రాజశేఖర్‌లకు ఒక్కో కన్ను పూర్తిగా దెబ్బతిన్నట్లు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులు తెలిపినట్లు సింగరేణి అధికారులు చెప్పారు. కాగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు కార్మికులను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శుక్రవారం పరామర్శించారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించి, కంటిచూపు వచ్చేలా చూడాలని వైద్యులను కోరారు. -
బాలాపూర్ వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
-
ప్రధాని అచ్ఛేదిన్ ఎప్పుడు తెస్తారు?: కవిత
సాక్షి, హైదరాబాద్: గతంలో బీజేపీ ప్రకటించిన ‘ధరల విముక్త భారత్’ ఎప్పుడు సాధ్యమవుతుందని, ప్రధాని మోదీ ప్రకటించిన ‘అచ్ఛేదిన్’ ఎప్పుడు తెస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పాలన ఎనిమిదేళ్లు పూర్తయిన నేపథ్యం లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధాని మోదీకి ఆమె 8 ప్రశ్నలు సంధించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళలకు సమాన ప్రాధాన్యం, జీడీపీలో తిరోగమనం, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఇతర నిత్యావసరాల ధరల నియంత్రణలో కేంద్రం వైఫల్యాలను ప్రశ్నించారు. పెంచిన ధరల ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రావాల్సిన రూ.7 వేల కోట్ల పెండింగ్ నిధుల విడుదల ఎప్పుడని ప్రశ్నిస్తూ, నేర నియంత్రణతో పాటు అన్ని రకాల వైఫల్యాలను కవిత లేవనెత్తారు. పీఎమ్ కేర్స్ నిధుల గురించి దేశ ప్రజలకు కేంద్రం వాస్తవ సమాచారం వెల్లడించాలని కవిత డిమాండ్ చేశారు. -
కామారెడ్డి ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కింద తక్షణ సాయంగా రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. గాయపడిన వారికి చికిత్స కోసం రూ. 50 వేలు ప్రకటించారు. కాగా జిల్లాలోని ఎల్లారెడ్డి–బాన్సువాడ రహదారిపై అన్నాసాగర్ తండా సమీపంలో జరిగిన లారీ-ఆటో ట్రాలీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 16 మంది గాయపడ్డారు. ఈ సంఘటనపై రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజామాబాద్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. -
రాహుల్ రాక నేపథ్యంలో.. ట్వీట్స్ కాక
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ మధ్య ట్వీట్ల వార్ ఊపందుకుంది. శుక్రవారం ఉదయం కీలక నేతలైన కేటీఆర్, కవిత, రేవంత్ రెడ్డి మధ్య ఈ యుద్ధం సాగడం విశేషం. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణదేనని, ఆ విషయం అర్థం చేసుకునేందుకు అయినా మీకు స్వాగతం అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి కవిత కల్వకుంట్ల ట్వీట్ చేశారు. పార్లమెంట్లో తెలంగాణ అంశాలను, అంశాలను మీరు(రాహుల్ గాంధీని ఉద్దేశించి) ఎన్నిసార్లు ప్రస్తావించారు?, టీఆర్ఎస్ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుతుంటే ఎక్కడ ఉన్నారు అంటూ నిలదీశారామె. చూసుకొని మురవాలి...చెప్పుకొని ఏడ్వాలి...@RaoKavitha pic.twitter.com/z7TFkid7FX — Revanth Reddy (@revanth_anumula) May 6, 2022 దీనికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చూసుకొని మురవాలి.. చెప్పుకొని ఏడ్వాలి అంటూ ఆమె ట్వీట్‌కు రీ ట్వీట్ చేశారు. అలాగే రైతుల పక్షపాత ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో పర్యటనకు రాహుల్ గాంధీకి స్వాగతం చెబుతామని, ఇక్కడి విధీవిధానాలు నేర్చుకుని కాంగ్రెస్ విఫలిత రాష్ట్రాల్లో అమలు చేసుకునేందుకు ఇదొక మంచి అవకాశం అంటూ ఓ కథనాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయగా.. మీ పాలన పై ఏం అధ్యయనం చేయాలి కేటీఆర్! రుణమాఫీ హామీ ఎలా ఎగగొట్టాలి? ఎరువుల ఫ్రీ హామీని ఎలా అటకెక్కించాలి? మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ రైతులకు ఉరితాళ్లు ఎలాబిగించాలి? వరి,మిర్చీ,పత్తి రైతులు ఎలా చస్తున్నారు? ఇవే కదా నిజాలు. ఆ నిజాలు మరింత గట్టిగా చెప్పాడానికే రాహుల్ వస్తున్నారు. https://t.co/dta7YoZNkY — Revanth Reddy (@revanth_anumula) May 6, 2022 మీ పాలన పై ఏం అధ్యయనం చేయాలి కేటీఆర్!.. రుణమాఫీ హామీ ఎలా ఎగగొట్టాలి? ఎరువుల ఫ్రీ హామీని ఎలా అటకెక్కించాలి? మోదీ ముందు మోకరిల్లి తెలంగాణ రైతులకు ఉరితాళ్లు ఎలా బిగించాలి? వరి,మిర్చీ,పత్తి రైతులు ఎలా చస్తున్నారు?.. ఇవే కదా నిజాలు. ఆ నిజాలు మరింత గట్టిగా చెప్పాడానికే రాహుల్ వస్తున్నారు అంటూ ట్వీట్‌తోనే బదులిచ్చారు. ఇదిలా ఉండగా.. వరంగల్‌లో నిర్వహించబోయే రాహుల్‌సభకు భారీ జన సమీకరణ చేపడుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. చదవండి: మేధావులు, క్యారెక్టర్ ఉన్న వారినే పిలుస్తారు -
మహిళా జర్నలిస్టులపై ‘టెక్ ఫాక్స్’ వేధింపులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న వేధింపులు దాడిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తమ గళం వినిపించిన మహిళా జర్నలిస్టులపై ‘టెక్ ఫాక్స్’ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది ఎవరో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. రాణా, స్వాతి లాంటి ప్రముఖ జర్నలిస్టులకు వ్యతిరేకంగా లక్షల కొద్దీ ట్వీట్స్ చేసి వేధింపులకు పాల్పడ్డారంటూ కొన్ని గణాంకాలను సభాముఖంగా చదివి వినిపించారు. ప్రశ్నించేవారిని అణచి వేసే ధోరణి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.. ఈ సందర్భంగా ముఖ్య అతిధులుగా వచ్చిన సీనియర్ జర్నలిస్టులు ధన్యా రాజేంద్రన్ (న్యూస్ మినిట్), మాలిని సుబ్రహ్మణ్యంకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టులు ‘కోర్’ విలువలు పాటించాలని . బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యూస్ రాసే జర్నలిస్టులు కోర్ (క్రెడిబిలిటీ, ఆబ్జెక్టివిటీ, రెస్పాన్సిబిలిటీ,ఎథిక్స్) విలువలను పాటించడం ద్వారానే వార్తకు సంపూర్ణత చేకూరుతుందని, సమాజంలోవారికి గౌరవం పెరుగుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మనం తక్కువోల్లం కాదు.. సానా గొప్పోల్లం ఇంతమంది జర్నలిస్టులు ఒక్క చోటికి రావడం అద్భుతం. ఏ రంగమైనా మహిళలకు ఇబ్బందులు తప్పవు. అయినా ఏ మాత్రం వెరవకుండా నిబద్ధతగా ఉండాలన్నారు. మగవారి కన్న మనం 100 శాతం ఎ క్కువ శ్రమ చేయాల్సిందే అన్నారు. మనం తక్కువోల్లం కాదు..సానా గొప్పోల్లం..ఇదే స్ఫూర్తితో పట్టుదలగా విధి నిర్వహణలో సెన్సిటివిటీగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి కొత్తగా నిర్మాణమవుతున్న సెక్రటేరియట్లో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గదిని కేటాయించేలా కృషి చేస్తానని కవిత హామీనిచ్చారు. అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌తో మాట్లాడి మీడియా సంస్థల్లో మహిళలపై వేధింపులు, వివక్షను నిరోధించే కమిటీలు వేయించేందుకు ప్రయత్నిస్తా అన్నారు. అంతేకాదు జర్నలిస్టులకు సంబంధించిన కమిటీలలో ఆడవారి ప్రాతినిధ్యం లేదని అర్థమవుతోందని, ఇకపై వారి ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తపడాలని అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణకు సూచించారు. ఏప్రిల్ 23, 24 తేదీల్లో ఈ వర్క్‌షాప్‌లో ముగింపు సమావేశంలో విద్యావేత్త, ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ జనాన్ని జాగృతం చేయగలిగే సత్తా ఒక్క జర్నలిస్టులకే ఉందని, ఆ వైపుగా మహిళా జర్నలిస్టులు చేస్తున్న కృషి సంతోషంగా ఉందని కొనియాడారు. -
కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉంది: ఎమ్మెల్సీ కవిత
-
కేటీఆర్, కవితపై డీకే అరుణ ఆగ్రహం.. ఆ మాటల వెనుక రహస్యమేంటి..?
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్‌కు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేస్తామని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా రక్షణ శాఖ అధికారులను హెచ్చరించడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఈ హెచ్చరికలు చేసినందుకు కల్వకుంట్ల కుటుంబ సభ్యులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ఆదివారం ఆమె ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అసలు రక్షణ శాఖ నియంత్రణలోని ప్రాంతంలో విద్యుత్, నీటి సరఫరా బంద్ చేయడానికి ఈ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా అని నిలదీశారు. భారత్, చైనా సరిహద్దు ప్రాంతం నుంచి దేశ సైనికులు తోక ముడుచుకొని వచ్చారని, రక్షణ శాఖను గతంలో కేసీఆర్ హేళన చేయడం, ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత కశ్మీర్.. భారత్‌లో భాగం కాదని చేసిన వ్యాఖ్యల వెనుక అసలు రహస్యం ఏమిటని ప్రశ్నించారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడుతున్న సైనికులకు మద్దతుగా నిలవడం మరచి, వారిపై అవాకులు చవాకులు మాట్లాడటం కల్వకుంట్ల కుటుంబం అహంకారానికి నిదర్శనమని డీకే అరుణ మండిపడ్డారు. అంతుకు ముందు కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆర్మీ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు వ్యవహారం నగర అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది. ఏఎస్ఐ సమీపంలోని బోర్డు ప్రాంతంలో చెక్‌డ్యాం నిర్మించారు. అక్కడ చేరుకున్న నీటితో కింద ఉన్న నదీమ్ కాలనీలోకి నీళ్లు వస్తున్నాయి. కంటోన్మెంట్ పరిధిలో రోడ్లను కూడా మూసేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సూచనలు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే కంటోన్మెంట్ పరిధిలో కరెంటు, నీటి సరఫరా బంద్ చేస్తామని అని హెచ్చరించారు. -
ఉద్యోగాల భర్తీపై సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత
-
మెగా రక్తదాన శిబిరం ప్రారంభం
నాంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీఎన్జీఓ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం.హుస్సేన్(ముజీబ్) ఆధ్వర్యంలో గురువారం నాంపల్లి, గృహకల్ప భవన సముదాయంలో 6వ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె రక్త దానం చేశారు. అనంతరం మాట్లాడుతూ టీఎన్జీఓ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. టీఎన్జీఓ ఉద్యోగులు భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా 730 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం, టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఉమాదేవి, తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం
-
స్త్రీ శక్తికి వందనం
-
కేసీఆర్‌కు కరోనా: కేటీఆర్, కవిత భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కరోనా పాజిటివ్ రావడం సంచలనం రేపింది. కేసీఆర్‌కు పాజిటివ్ రావడంతో ప్రముఖులంతా షాక్‌కు గురయ్యారు. సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడటం ఆందోళన కలిగించిం దని, ఆయన త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. సీఎం కరోనా నుంచి కోలుకోవాలంటూ పలువురు రాష్ట్ర మంత్రులతోపాటు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు సందేశాలు విడుదల చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్, కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ నాయకులు డాక్టర్ లక్ష్మణ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీతోపాటు రాజ్యసభ ఎంపీలు కే.కేశవరావు, సంతోష్, ఎమ్మెల్సీ కవిత, బాల్క సుమన్ తమ సందేశాలను ట్వీట్ చేశారు. సినీ నటులు చిరంజీవి, మహేశ్ బాబు, దర్శకుడు ఎన్.శంకర్, హీరోలు నాగశౌర్య, సుధీర్‌బాబు, సినీ ప్రముఖులు గోపిచంద్ మలినేని, ఎస్ఎస్ థమన్, శ్రీను వైట్ల, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సీఎం త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు విడుదల చేశారు. త్వరలో కోలుకుంటారు: కేటీఆర్ తన తండ్రి, సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మంత్రి కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. ‘‘ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకి స్వల్పంగా కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సీఎం ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ సందేశాలు అందుతున్నాయి. సీఎం గట్టి మనిషి, యోధుడు. మీ అందరి ప్రార్థ్ధనలతో తప్పకుండా త్వరలో కోలుకుంటారు’’ అని ట్వీట్ చేశారు. త్వరగా కోలుకోవాలి: హరీశ్ ‘తెలంగాణ ముఖ్యమంత్రి, మనందరి ప్రియతమ నేత కేసీఆర్ కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ‘సీఎం కేసీఆర్ గారికి స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.’ - కల్వకుంట్ల కవిత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కోవిడ్ పాజిటివ్ అని తెలిసి ఆందోళన కు గురవుతున్నాను. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను. — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) April 19, 2021 Hon’ble CM KCR Garu has tested positive for COVID with mild symptoms. He is currently isolated & being monitored by doctors Been receiving a lot of messages with concern for his well-being. He is a gritty man & a fighter. Am sure he will recover soon with all of your prayers 🙏 — KTR (@KTRTRS) April 19, 2021 సీఎం కేసీఆర్ గారికి స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. — Kavitha Kalvakuntla (@RaoKavitha) April 19, 2021 -
ఏ సమస్య వచ్చినా మీకు నేనున్నా: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: చైనా లోన్‌యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న మేడ్చల్‌కు చెందిన చంద్రమోహన్ కుటుంబానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. చంద్రమోహన్ భార్య సరితకు ఉద్యోగం కల్పించడంతోపాటు ముగ్గురు ఆడపిల్లలకు ఉద్యోగం వచ్చేవరకూ చదివిస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులతో ఆదివారం కవిత భేటీ అయ్యారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్ చైనా లోన్ యాప్‌ల వేధింపులు భరించలేక ఈ ఏడాది జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి యజమాని ఆత్మహత్యకు పాల్పడటంతో భార్య సరిత, ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విషయం తెలుసుకున్న కవిత ఆదివారం బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. ముగ్గురు పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించే వరకు సాయం అందిస్తానని సరితకు హామీ ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని, కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
జీహెచ్ఎం'షీ టీమ్'
-
వారణాసి పర్యటనలో కేసీఆర్ భార్య, కూతురు
వారణాసి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, ఆమె కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నాడు వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అస్సీఘాట్ నుంచి దశాశ్వేమేధ ఘాట్ వరకు పడవ ప్రయాణం చేశారు. అనంతరం తల్లీకూతుళ్లు దశాశ్వేమేధ ఘాట్‌లో గంగా నదికి హారతిచ్చారు. తరువాత ప్రాచీన సంకట్ మోచన్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కవిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. (చదవండి: ‘ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి’) pic.twitter.com/yHUh0ZdpTw — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 28, 2021 -
మహిళపై యాసిడ్ దాడి.. కవిత దిగ్భ్రాంతి
మెట్పల్లి(కోరుట్ల) : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాలో బుధవారం రాత్రి భూక్య స్వాతి(25)పై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్‌తో దాడి చేశాడు. స్వాతి భర్త కొంత కాలం కింద మృతి చెందడంతో ఇద్దరు పిల్లలతో కలసి తిమ్మాపూర్ తండాలోని తల్లి గారింట్లో ఉంటోంది. ఇంట్లో జరిగే శుభకార్యానికి అవసరమైన వస్తువులు కొనేందుకు కుటుంబసభ్యులతో కలసి మెట్‌పల్లికి వెళ్లింది. తిరిగి రాత్రి బస్సులో తండాలోని బస్‌స్టాప్ వద్ద దిగారు. అదే సమయంలో అక్కడికి బైక్‌పై హెల్మెట్ ధరించి ఉన్న ఓ వ్యక్తి వచ్చి స్వాతి ముఖంపై యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ సంఘటనలో ఆమె కుడి వైపు చెంప, మెడ, భుజం వద్ద గాయాలయ్యాయి. వెంటనే ఆమెను వాహనంలో మెట్‌పల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్పీ సింధు శర్మకు ఫోన్ చేసి ఘాతుకానికి పాల్పడ్డ నిందితున్ని పట్టుకొని కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. -
పీవీ నర్సింహారావు వ్యక్తి కాదు ఒక శక్తి..
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 16వ వర్థంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు బుధవారం ఉదయం నివాళులు అర్పించారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద అంజలి ఘటించారు. పీవీ కుమార్తె వాణి, కుమారుడు పీవీప్రభాకర్ రావు హోంమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ, పీవీ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కేశవరావు (కేకే), ఎమ్మెల్సీ కవిత తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పీవీ వ్యక్తి కాదు ఒక శక్తి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా పీవీ ఆలోచనలు సూచనలు మన వెంట ఉన్నాయి. శత జయంతి ఉత్సవాలు సీఎం కేసీఆర్, ఎంపి కేకే ఆధ్వర్యంలో గొప్పగా జరుగుతున్నాయి. దేశానికి దిక్సూచి పీవీ. ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మంచి పరిణామం. ‘దేశానికి ఒక దిక్సూచి పీవీ నర్సింహారావు. భారత దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు. శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి. పీపీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎంపీ కేకే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన చేసిన సంస్కరణలు, ఆలోచనలు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఎన్నారైలు కోరుతున్నారు. మేం కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. పీవీ పేరుతో ఒక తపాల బిళ్లను విడుదల చేయాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. -
‘కవితమ్మ.. మీ వల్లే మా కొడుకు బతికాడు’
రాయికల్ (జగిత్యాల): ‘మా కొడుకు ప్రాణాలు నిలిపిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం..’అంటూ ఓ బాలుడి తల్లిదండ్రులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలసి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్‌కు చెందిన టేక్ సాగర్ (13) పుట్టినప్పటి నుంచే కాలేయ సమస్యతో బాధపడుతుండేవాడు. దీంతో 2017లో ఎంపీగా ఉన్న కవితను సాగర్ తల్లిదండ్రులు కలసి తమ కొడుకును కాపాడాలని వేడుకోగా.. సీఎం సహాయ నిధి నుంచి రూ.26 లక్షల ఎల్వోసీని ఆమె మంజూరు చేయించారు. అలాగే ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి బాలుడి చికిత్సపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ప్రస్తుతం ఆ బాలుడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. గురువారం కవిత జగిత్యాల పర్యటనకు వచి్చన విషయాన్ని తెలుసుకున్న సాగర్ తల్లిదండ్రులు రాయికల్‌లో ఆమెను కలిశారు. తమ కొడుకుకు ప్రాణభిక్ష పెట్టింది మీరేనంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. -
నోముల అకాల మరణం : ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) అకాల మరణంపై నిజామాబాద్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వెంట నడిచిన గొప్ప నాయకులంటూ నోముల సేవలను గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నానంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె నోముల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్‌రావుకూడా నోముల మృతిపై విచారం వ్యక్తం చేశారు. (టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత) కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస తీసకున్నారు. ఈ ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో వెంటనే నోములను అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. నోముల మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని టీఆర్ఎస్ శ్రేణులు విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గారి అకాల మరణం వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వెంట నడిచిన గొప్ప నాయకులు నోముల నర్సింహయ్య గారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/y6lm4KdxJQ — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 1, 2020 నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గారి ఆకస్మిక మరణం తీవ్ర దురదృష్టకరం. జీవితాంతం ప్రజలకోసం వారి హక్కుల కోసం పోరాడారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాలకోసం నిబద్ధతగా పనిచేసిన వ్యక్తి నర్సింహయ్యగారు. వారిమృతి పట్ల తీవ్రసంతాపాన్ని తెలుపుతూ.. వారి కుటుంభసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి pic.twitter.com/67iX9HXRF7 — Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) December 1, 2020 -
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: కవిత
సాక్షి, నిజామాబాద్: సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరికీ నిజామాబాద్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియో సందేశాన్ని శనివారం రోజున విడుదల చేశారు. 'ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులలో కూడా ఆడబిడ్డలంతా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరువేసుకుంటూ, యూట్యూబ్‌లో బతుకమ్మ కొత్త పాటలు వింటూ, పెద్దఎత్తున పండుగను జరుపుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చూస్తున్నాం. (బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్) ఒకపక్క కరోనా, మరోపక్క హైదరాబాద్‌లో అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనమందరం ఒకరికొకరు అండగా నిలుస్తూ, బతుకమ్మ పండుగను పరిపూర్ణం చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. వరదల కారణంగా నష్టపోయిన వారందరినీ అందుకునేందుకు సీఎం కేసీఆర్ తక్షణ సాయంగా రూ.550 కోట్లను విడుదల చేయడం సంతోషదాయకం. హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు త్వరగా తొలగిపోవాలని, గౌరమ్మ తల్లి దయతో కరోనా కనుమరుగవ్వాలని రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీడియో సందేశాన్ని విడుదల చేశారు. -
బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పంటలు బాగా పండి వ్యవసాయం గొప్పగా వర్థిల్లాలని, ప్రతీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని అమ్మవారిని ముఖ్యమంత్రి ప్రార్థించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని కోరారు. బతుకమ్మ సందర్భంగా ట్విటర్ ద్వారా ఎమ్మెల్సీ కవిత సందేశం కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, సురక్షితంగా, సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ‘బతుకమ్మ పండుగ స్పూర్తితో మనందరం ఉమ్మడిగా కరోనాను ఎదుర్కొందాం. ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడకూడదు. కరోనా కారణంగా ఈ ఏడాది, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడం లేదు.’ అని ట్విటర్ ద్వారా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక సందేశం విడుదల చేశారు. మన తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక, ఆడబిడ్డల ఆనందాల హరివిల్లు బతుకమ్మ పండుగ సందర్భంగా.. ఆడబిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు#MyBathukammaMyPride pic.twitter.com/FUdjZNecBt — Kavitha Kalvakuntla (@RaoKavitha) October 16, 2020 -
కామారెడ్డిలో పెద్ద ఎత్తున సంబరాలు
-
విజయోత్సవాలకు సన్నద్ధం..
-
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం
-
మొన్న టీఆర్ఎస్లోకి... నేడు మళ్లీ బీజేపీలోకి
సాక్షి, నిజామాబాద్ : రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు.. ఇక ఎన్నికల వేళ అయితే చెప్పాల్సిన అవసరమే ఉండదు. తాజాగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఒక్కరోజు ముందు కూడా నాటకీయ పరిణామాలు, చేరికలతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. దీంతో మొన్న (సోమవారం) గులాబీ కండువా కప్పుకున్న బీజేపీ కార్పొరేటర్ నేడు (బుధవారం) మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. 44వ డివిజన్ కార్పొరేటర్ బైకాన్ సుధ మొన్న హైదరాబాద్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఇవాళ మళ్లీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య రాష్ట్ర నాయకుడు సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో సొంత గూటికి చేరుకున్నారు. దీంతో ఈ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో చెప్పుకోవచ్చు.(ఎమ్మెల్సీగా ఉంటారా.. మంత్రివర్గంలో చేరతారా?) ఈ నెల 9న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్లు వేసే ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్కే సింహభాగం ఉన్నారు. అయినా చేరికలకు అధికార పార్టీ అడ్డు చెప్పలేదు. భారీ మెజార్టీతో కవిత కల్వకుంట్లను గెలిపించాలని లక్ష్యంతో ముందుకు దూసుకు పోతుంది. ఇప్పటివరకూ నిజామాబాద్‌లో 8మంది బీజేపీ కార్పొరేటర్లు, ఒక జడ్పీటీసీ, మరో కాంగ్రెస్ కార్పొరేటర్ టీఆర్ఎస్లో చేరారు. నిన్న ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఆధ్వర్యంలో కామారెడ్డి మునిసిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చాట్ల రాజేశ్వర్, మరో ఇద్దరు 19 వ వార్డు కౌన్సిలర్ చింతల రవీందర్ గౌడ్, 32 వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ పంపరి లత తదితరులు ఇవాళ కారు ఎక్కారు. పోలింగ్‌కు గడువు సమీపించడంతో ఆయా మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను శనివారమే క్యాంప్‌కు తరలించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత పోటీ చేస్తుండడంతో ఆమెకు మద్దతుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను క్యాంప్‌నకు పంపించారు. (ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదే : కేటీఆర్) 9వ తేదీన పోలింగ్ నిర్వహణ సందర్భంగా పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రంలో ఉన్న కార్యాలయాలకు, సంస్థలకు, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న కార్యాలయాలకు, సంస్థలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ శరత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
డా.సౌందర్‌రాజన్‌కు సీఎం కేసీఆర్ సన్మానం
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ భర్త , ప్రముఖ నెఫ్రాలజిస్ట్ సౌందర్‌రాజన్‌కు ధన్వంతరి అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి అభినందించారు. అనంతరం శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందచేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుమార్తె కవిత కూడా ఉన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రికి గవర్నర్ ఆహ్వానం పలికారు. గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్, బెస్ట్ మెడికల్ టీచర్, డాక్టర్ సౌందరరాజన్ కు ధన్వంతరి అవార్డు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ రాజ్ భవన్ లో డాక్టర్ సౌందరరాజన్ ను కలిసి ఘనంగా సన్మానించి అభినందించారు.@DrTamilisaiGuv pic.twitter.com/FUfxAGC4AA — Telangana CMO (@TelanganaCMO) October 2, 2020 -
ప్రగతిభవన్‌లో రక్షాబంధన్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: సోదరసోదరీమణుల మధ్య బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పర్వదినాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం ప్రగతి భవన్లో ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు అక్కలు వినోదమ్మ, సకలమ్మ, లలితమ్మ, జయమ్మ, లక్ష్మీబాయి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ఈ పండుగ ప్రతీక అన్నారు. మహిళలను గౌరవించాలనే నిబద్ధతను ఈ పండుగ తెలియజేస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత, గౌరవాన్ని పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అలాగే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుకు ఆయన సోదరి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ వేడుకలో సీఎం కేసీఆర్ సతీమణి శోభారాణి, కేటీఆర్ భార్య శైలిమ పాల్గొన్నారు. పండుగ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, ఇతరులు కేటీఆర్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే గొంగిడి సునీత, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి తదితరులు కేటీఆర్‌కు రాఖీ కట్టిన వారిలో ఉన్నారు. ఆత్మీయ అనుబంధానికి ప్రతీక: హరీశ్‌రావు రాఖీ పర్వదినం సోదరసోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రక్షాబంధన్ సందర్భం గా కొండాపూర్‌లోని మంత్రి నివాసంలో పలువురు టీఆర్ఎస్ మహిళా నేతలు హరీశ్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయతను పంచుకుంటూనే కరోనా నేపథ్యంలో స్వీయ రక్షణ పాటించాలని ఈ సందర్భంగా హరీశ్‌పిలుపునిచ్చారు. -
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షల వెల్లువ
హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం! తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ రాష్ట్రపతి తెలుగులో ట్వీట్ చేశారు. (తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ నివాళి) రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడు భాషల్లో ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, సహజవనరులతోపాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న తెలంగాణ.. వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తూ.. మరింత సమృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. (కేసీఆరే స్టార్) ప్రధాని నరేంద్ర మోదీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను’ అంటూ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. కృషి మరియు పట్టుదల, ఈ సంస్కృతికి మారు పేరు. దేశ పురోభివృద్ధిలో ఈ రాష్ట్ర భూమిక ఎంతో గణనీయమైనది. ఈ రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను’అంటూ మరో ట్వీట్లో ఏపీ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజలందరికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకంక్షలు!! కేసీఆర్ గారి బాటలొ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ప్రతి తెలంగాణ బిడ్డకు వందనం!! ఉద్యమ ప్రస్థానంలో అమరులైన వీరులకు జోహార్లు !!జై తెలంగాణ !! జై జై తెలంగాణ !!’ అంటూ మాజీ ఎంపీ కవిత ట్వీట్ చేశారు. (కలలు నెరవేరుతున్న కాలం) తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం! తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. — President of India (@rashtrapatibhvn) June 2, 2020 తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను. — Narendra Modi (@narendramodi) June 2, 2020 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. కృషి మరియు పట్టుదల, ఈ సంస్కృతికి మారు పేరు. దేశ పురోభివృద్ధిలో ఈ రాష్ట్ర భూమిక ఎంతో గణనీయమైనది. ఈ రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. — Narendra Modi (@narendramodi) June 2, 2020 తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, సహజవనరులతోపాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న తెలంగాణ.. వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తూ.. మరింత సమృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. #Telangana pic.twitter.com/zsTM3HemRF — Vice President of India (@VPSecretariat) June 2, 2020 -
రోల్‌మోడల్‌గా ఎదగాలి
కవాడిగూడ: స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ కమిటీ దేశంలోనే రోల్‌మోడల్‌గా ఎదగాలని రాష్ట్ర గవర్నర్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర ప్యాట్రన్ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. దీనికిగానూ గైడ్స్‌కు తనవంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. గురువారం దోమలగూడ గగన్ మహల్‌లోని ‘భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్’తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫౌండేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన గవర్నర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, గురువులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. తాను కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థినేనని గుర్తుచేశా రు. సమాజానికి ఏ విధంగా సహాయం చేయాలి, ఇతరుల పట్ల ఎలా ఉండాలో ఇక్కడే నేర్చుకున్నానని తెలిపారు. తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు గైడ్స్ శిక్షణ తీసుకున్నానని చెప్పారు. అనంతరం తెలంగాణ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్ స్కౌట్స్ డ్రెస్‌లో రావడం సంతోషంగా ఉందన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయని, ప్రస్తుతం ఇక్కడ 590 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. గత రెండేళ్లుగా చేపడుతోన్న కార్యక్రమాలపై ఆమె నివేదిక సమర్పించారు. అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాల ప్రాంగణంలో గవర్నర్‌తో కలిసి ఆమె మొక్కలను నాటారు. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా 8 మంది విద్యార్థులకు రాజ్యపురస్కారాలను అందించారు. కాగా, పీయర్స్ కన్స్ట్రక్షన్స్ ఎండీ అస్లాం బిన్ మహ్మద్ రూ.10 లక్షల విరాళం చెక్‌ను గవర్నర్‌కు అందజేశారు. కవిత కూడా రూ.5 లక్షలు అందించా రు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, కోశాధికారి రాజగోపాల్, జాయింట్ సెక్రటరీ మంచాల వరలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
కవిత రాజకీయ భవిష్యత్తు ఏమిటి?
-
సాంస్కృతిక ఆయుధంగా బతుకమ్మ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ప్రకృతితో ముడిపడిన బతుకమ్మ పండుగను స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక ఆయుధంగా, విడదీయలేని ఉద్యమరూపంగా మార్చిన ఘనత తెలంగాణ జాగృతికే దక్కుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తి చేయడంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కృషిని కొనియాడుతూ జాగృతి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్లో బుధవారం కేటీఆర్ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మను నిషేధించిన సందర్భంలో హైకోర్టుకు వెళ్లి మరీ తెలంగాణ జాగృతి అనుమతి సాధించి వేడుకలు నిర్వహించిందని గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను దశాబ్ద కాలంగా జాగృతి ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానం అద్భుతమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. మలిదశ ఉద్యమంలో మహిళలను భాగస్వాములుగా చేసింది తెలంగాణ జాగృతేనని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మెచ్చుకున్నారు. -
తన నివాసంలో బతుకమ్మ ఆడిన కవిత
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత తన నివాసంలో బతుకమ్మ ఆడారు. తన ఇంటి ఆవరణలో బతుకమ్మకు పూజలు చేసిన ఆమె...అనంతరం ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోను ఆమె తన ట్విటర్లో షేర్ చేశారు. కాగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు 300కి పైగా ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. బతుకమ్మ సంబురాలపై నిన్న సమీక్ష నిర్వహించిన ఆమె...ముంబైతో పాటు అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, ఖతార్, ఒమాన్‌లతో పాటు 12 దేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా తెలంగాణకే ప్రత్యేకమైన పూలపండుగ వైభవంగా మొదలైంది. తొమ్మిది రోజులపాటు సాగే.. బతుకమ్మ సంబురం ఎంగిలిపూలతో శనివారం ప్రారంభమైంది. -
ఆ ప్రసంగం ఓ చరిత్ర: కవిత
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మృతిపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజకీయల్లో గొప్ప నేతను కొల్పోయామని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతి వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఆమె ప్రసంగాల ద్వారా తాను ఎంతో స్ఫూర్తిని పొందానని కవిత గుర్తుచేశారు. ఈమేరకు 1996లో లోక్‌సభలో సుష్మా స్వరాజ్ ప్రసంగ వీడియోని ఆమె ట్విటర్లో షేర్ చేశారు. చరిత్రలో ఇదొక గొప్ప ప్రసంగమంటూ ఆమె పోస్ట్ చేశారు. అప్పట్లో ఆమె ప్రసంగంపై ప్రసంసల జల్లు కురిసిన విషయం తెలిసిందే. కవిత షేర్ చేసిన వీడియోలో బీజేపీ అగ్రనేత, దివంగత మాజీ ప్రధాని కూడా వాజ్‌పేయీ ఉన్నారు. It’s hard to believe that @SushmaSwaraj Ji is no more. My heartfelt condolences to her family & huge fan base. I have always admired her for her extraordinary oratory skills.This is one of my fav speeches of hers. https://t.co/qR3zWj54kx #RIPSushmaJi — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 7, 2019 -
దేశానికి ఆదర్శంగా ఇందూరు యువత
సాక్షి, నిజామాబాద్: ఇందూరు యువత కార్యక్రమాలు దేశ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు మాజీ ఎంపీ కవిత. విలేకరులతో మాట్లాడుతూ.. ఇందూరు యువత చేస్తోన్న మంచి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. యువత చేస్తోన్న కార్యక్రమాలకు తాము అండగా నిలుస్తామన్నారు. ఎంతో మంది అనాథలను మంచి మనసుతో చేరదీస్తున్నారని ప్రశంసించారు. యువత చదువుతో పాటు సమాజ సేవలో కూడా పాల్గొనాలని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పిలుపునిచ్చారు. -
పదవి లేకున్నా ప్రజల కోసం పనిచేస్తా: కవిత
చంద్రశేఖర్‌కాలనీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు, ఓటములు సహజమని టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఓటమి చెందడంతో తట్టుకోలేక నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో ఈనెల 24న పార్టీ కార్యకర్త కిషోర్ గుండెపోటుతో మరణించాడు. సోమవారం మృతుని కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. కిషోర్ కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. అనంతరం కవిత విలేకరులతో మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి చెందినందుకు బాధపడటం లేదన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పాటుపడుతుందని అన్నారు. పదవి ఉన్నా, లేకున్నా తాను నిజామాబాద్‌ను వదిలిపెట్టిపోనని, ప్రజల సమస్యల పరిష్కారంలో, జిల్లా అభివృద్ధిలో తనవంతు కృషి చేస్తానని స్పష్టంచేశారు. పార్టీ కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘హుం దాగా ఉందాం, బంగారు తెలంగాణ కోసం పనిచేద్దాం’అని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్‌గుప్తా, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్‌కుమార్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ నగర మాజీ మేయర్ డి.సంజయ్, డి.రాజేంద్రప్రసాద్ తదితరులు ఆమె వెంట ఉన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : కార్యకర్త కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన కవిత -
కార్యకర్త కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన కవిత
-
కవిత ఓటమికి కారణమదే: జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యేల అసమర్థత, నిర్లక్ష్యమే టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత ఓటమికి కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విశ్లేషించారు. గత ఎన్నికల సమయంలో ఆమె ఇచ్చిన హామీలను విస్మరించడం కూడా ఓటమికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. నిన్న వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కవిత దారుణఓటమికి గురైన విషయం తెలిసిందే. అయితే కవిత ఓటమికి బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కే కారణమని టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై జీవన్ రెడ్డి స్పందించారు. వారి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకైతే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వచ్చిన ఓటుబ్యాంక్ ఎటుపోయిందని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల అసమర్థతే కవిత ఓటమికి కారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణి పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని ఆ పార్టీ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజా ప్రతినిధిగా కాకపోయిన.. ప్రజాసేవకురాలిగా కవితకు మంచి భవిష్యత్ ఉందని అన్నారు. నిజామబాద్ ఎంపీగా విజయం సాధించిన ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీలు దిశగా కార్యచరణ చేపట్టాలని సూచించారు. -
‘ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చే పార్టీలను నమ్మొద్దు’
సాక్షి, జగిత్యాల : ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చే పార్టీలను నమ్మకుండా ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకులను గెలిపించండని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ప్రజలను కోరారు. బుధవారం కోరుట్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కవిత.. తెలంగాణలో కేసీఆర్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని నమ్మి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏలాంటి అభివృద్ధి జరగదని పేర్కొన్నారు. కేంద్రంలో మార్పు రావాలంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలవాలని స్పష్టం చేశారు. కేసీఆర్ భోళాశంకురుడు..ఏదడిగితే అది వెంటనే అమలు చేస్తారని పేర్కొన్నారు. దేశంలో కులవృత్తులకు పెద్దపీట వేసింది తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు. సబ్బండ వర్ణాలు అభివృద్ధే కేసీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. వచ్చే రెండేళ్లలో ఇల్లు లేని ప్రతిఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత టీఆర్ఎస్దని హామీ ఇచ్చారు. -
‘కాంగ్రెస్‌కు నాపై గెలిచే సత్తా లేదు’
సాక్షి, జగిత్యాల : నామీద గెలిచే సత్తా లేకనే కాంగ్రెస్ నాయకులు రైతుల ముసుగులో నామినేషన్లు వేశారంటూ నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి ఎంపీ కవిత ఆరోపించారు. పసుపు, ఎర్రజొన్న రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ లోక్‌సభ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆరుగురు రైతులు నిజామాబాద్ కలెక్టర్‌కు నామినేషన్ పత్రాలు కూడా సమర్పించారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన కవిత తన మీద గెలిచే సత్తా లేకనే కాంగ్రెస్ నాయకులు రైతుల ముసుగులో నామినేషన్ వేశారంటూ మండిపడ్డారు. తన మీద నామినేషన్ వేస్తే రైతు సమస్యలు తీరుతాయంటే తనకు అంతకంటే సంతోషం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజల్ని అయోమయానికి గురి చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వాస్తవాలు గ్రహించి 16 మంది ఎంపీలుగా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
కవిత నామినేషన్ దాఖలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కవిత శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి కలెక్టరేట్‌కు వచ్చిన ఆమె.. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను కలెక్టర్ రామ్మోహన్‌రావుకు అందజేశారు. అంతకు ముందు నగర శివారులో ఉన్న సారంగపూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో భర్త అనిల్‌కుమార్‌తో కలసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీఆర్ఎస్ గుర్తు అయిన అంబాసిడర్ కారు (గులాబీరంగు)లో ఎమ్మెల్యేలతో కలసి ఆమె కలెక్టరేట్‌కు చేరుకున్నారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో సైనికులుగా పనిచేస్తాం: టీఆర్ఎస్ ఎంపీలు తమ ఐదేళ్ల పదవీ కాలంలో గల్లీలో ప్రజా సేవకులుగా, ఢిల్లీలో తెలంగాణ సైనికులుగా పని చేశారని కవిత వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ప్రజలు దయతో తనకు మరోసారి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. శక్తి వంచన లేకుండా పని చేశానని, జిల్లా, రాష్ట్ర, జాతీయ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరితో కలసి రాష్ట్ర, జిల్లా అభివృద్ధి కోసం కృషి చేశానని చెప్పారు. దేశంలో మారుతున్న పరిస్థితుల్లో 16 ఎంపీ సీట్లు గెలిస్తే రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. హైకోర్టు, మైనారిటీ, ఎస్టీ రిజర్వేషన్లు, ఎయిమ్స్ వంటి అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించామని గుర్తు చేశారు. ఐదేళ్ల కాలంలో ప్రజలు టీఆర్ఎస్ ఎంపీల నడవడికను గమనించారని, మరోసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశా రు. నిజామాబాద్ ఎంపీగా మొదటిసారి గెలిపించిన ప్రజలకు, మరోసారి తనను అభ్యర్థిగా ఎంపిక చేసిన పార్టీ అధినేత కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు కవిత ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, షకీల్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, ఆకుల లలిత, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి తదితరులు ఆమె వెంట ఉన్నారు. -
ఇక 19 మండలాలు..
జిల్లా ఇకనుంచి 19 మండలాలతో పరిపాలన సాగించనుంది. ఇప్పటికే 18 మండలాలతో ఉన్న జిల్లాలో కొత్తగా ఒడ్డెలింగాపూర్ చేరింది. జిల్లా ఆవిర్భావం అనంతరం.. జగిత్యాల నుంచి జగిత్యాల రూరల్, సారంగాపూర్ మండలం నుంచి బీర్పూర్, ధర్మపురి నుంచి బుగ్గారం మండలాలను ఏర్పాటు చేశారు. 32 గ్రామాలతో ఉన్న రాయికల్ మండలకేంద్రం ఇటీవల మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. ఎప్పటినుంచో రాయికల్ మండలాన్ని విభజించి.. రెండు మండలాలు చేయాలనే డిమాండ్ ఉన్నా.. నిజామాబాద్ జిల్లాకేంద్రంలో మంగళవారం టీఆర్ఎస్ చేపట్టిన ఎన్నికల ప్రచారసభలో భాగంగా ఒడ్డెలింగాపూర్‌ను కొత్త మండలం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాయికల్(జగిత్యాల): పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పటికే జిల్లాలో కొత్త మండలాలు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రాయికల్ మండలంలోని ఒడ్డెలింగాపూర్ గ్రామాన్ని మండలకేంద్రంగా ప్రకటించారు. ఎన్నోఏళ్లుగా ఒడ్డెలింగాపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్తులు ఎంపీ కల్వకుంట్ల కవిత, కలెక్టర్ శరత్‌కు వినతిపత్రాలు అందించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఒడ్డెలింగాపూర్‌ను మండలకేంద్రంగా ఏర్పాటు చేస్తామని ఎంపీ కవిత హామీ ఇవ్వగా.. ఆ మేరకు సీఎం కేసీఆర్ నిజామాబాద్ వేదికగా ప్రకటించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో రాయికల్ మండలంలో 27 గ్రామాలు ఉండేవి. ఇటీవల రాయికల్ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చారు. మరోవైపు ఆరు కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. రాయికల్ పోను ఆ సంఖ్య 32కు చేరింది. ఒడ్డెలింగాపూర్ మండలంలో 14 గ్రామాలు? రాయికల్ మండలంలో 32 గ్రామాలు ఉండగా.. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఒడ్డెలింగాపూర్లోకి 14 గ్రామాలు వెళ్లనున్నాయి. వీటిలో ఆల్యనాయక్‌తండా, బోర్నపల్లి, చింతలూరు, దావన్‌పల్లి, ధర్మాజీపేట, జగన్నాథపూర్, కైరిగూడెం, కట్కాపూర్, కొత్తపేట, మంక్త్యానాయక్తండా, ఒడ్డెరకాలనీ, తాట్లవాయి, వస్తాపూర్ గ్రామాలు ఒడ్డెలిం గాపూర్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. సీఎం, ఎంపీకి కృతజ్ఞతలు జగిత్యాల నియోజకవర్గంలోనే రాయికల్ మండలంపై ఎంపీ కవిత ప్రత్యేక శ్రద్ధ చూపడంతోపాటు రాయికల్ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చారు. కొద్దిరోజుల వ్యవధిలోనే రాయికల్ మండలంలోని ఒడ్డెలింగాపూర్ గ్రామాన్ని మండలకేంద్రంగా సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. మండల ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. ఎంపీ కవితకు, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. – సంజయ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే గిరిజనులు అభివృద్ధి చెందుతారు ఒడ్డెలింగాపూర్ గ్రామాన్ని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక మండలంగా ప్రకటించడంతో మండల పరిధిలో ఉన్న 14 గ్రామాల గిరిజనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వివిధ పనులపై సమయబావంతో పాటు అన్ని రకాల సేవలు అందుతాయి. దీనికి సహకరించిన ఎంపీ కవితకు కృతజ్ఞతలు. – పాలకుర్తి రవి, సర్పంచ్ -
రైతుల మధ్య చిచ్చు
నిజామాబాద్ అర్బన్: కాంగ్రెస్, బీజేపీ తోడేళ్లు రైతుల మధ్య చిచ్చుపెడుతున్నాయని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. కొందరు లోక్‌సభ నియోజకవర్గానికి వేల సంఖ్యలో నామినేషన్లు వేయించాలని చూస్తున్నారన్నారు. ఇది సరైంది కాదన్నారు. నిజామాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతుల పార్టీ అన్నారు. రైతుల ముసుగులో కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలో జరిగిందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, బీడీ కార్మికులకు పింఛన్లు, నిరుద్యోగులకు రూ.2,800 కోట్లతో భృతి, ప్రతి గ్రామంలో ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు నిజామాబాద్–పెద్దపల్లి రైల్వేలైన్ పడకేసిందని, తాను ఎంపీ అయ్యాక రూ.900 కోట్లతో దాన్ని పూర్తి చేయించానని కవిత పేర్కొన్నారు. కొత్త ఒరవడి సృష్టిస్తున్నాం.. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కొత్త ఒరవడిని సృష్టిస్తోందని కవిత చెప్పారు. ప్రతి గ్రామంలో పేదవారికి ఆకలి అంటే తెలియకుండా పింఛన్లు అందిస్తున్నామన్నారు. వెయ్యి రూపాయల పింఛన్‌ను రూ.2 వేలకు పెంచామన్నారు. ఏప్రిల్ నుంచి 57 ఏళ్ల వయసు వారికీ వృద్ధాప్య పింఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. సొంత ఇంటి స్థలం ఉంటే త్వరలో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. అదనంగా 2 లక్షల ఎకరాలకు నీరు.. ఎస్పారెస్పీ పునరుజ్జీవ పథకంతో అదనంగా 2 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చి మొత్తం 5 లక్షల 95 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి చర్యలు తీసు కున్నామన్నారు. 2010 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.104 కోట్లతో వివిధ పంటలు కొనుగోలు చేస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 2014 నుంచి 2018 వరకు రూ.872 కోట్లతో పంటలను కొనుగోలు చేసిందన్నారు. కోరుట్ల, బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించే ప్రయత్నం చేస్తున్నామన్నా రు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంతో కష్టపడ్డామని, 4 రాష్ట్రాల సీఎం లను ఒప్పించి ఆ పత్రాలను ప్రధానికి ఇచ్చామన్నారు. అయినా కేంద్రం మాత్రం బోర్డు ఏర్పా టు చేయలేదన్నారు. బోర్డు ఏర్పాటు చేసే వరకు ఉద్యమిస్తానని ఎంపీ కవిత వివరించారు. -
ఇందూరుకు రానున్న కేసీఆర్
సాక్షి నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభను నిర్వహించాలని నిర్ణయించిన అధికార పార్టీ టీఆర్ఎస్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన సభను రద్దు చేసుకుంది. ఏకంగా ఎన్నికల ప్రచార భారీ బహిరంగసభను ఈనెల 19న నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఈ సభలో ప్రసంగించనున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన ఆ పార్టీ సమావేశంలో ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన జిల్లాల ప్రచార సభలను కేసీఆర్ నిజామాబాద్ బహిరంగ సభతోనే శ్రీకారం చుట్టిన విషయం విదితమే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల తొలి ప్రచార సభను కరీంనగర్లో, రెండో సభను జిల్లాలో నిర్వహించనున్నారు. సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు సన్నాహాలు చేపట్టనున్నారు. సిట్టింగ్ ఎంపీ, సీఎం తనయ కవిత పోటీ చేసే స్థానం కావడంతో టీఆర్ఎస్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. సన్నాహక సభ రద్దు.. టీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సభను ఈనెల 14న నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సభలో పార్టీ శ్రేణులకు ఎన్నికలపై దిశా నిర్దేశం చేయాలని భావించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు వేల చొప్పున క్రియాశీలక కార్యకర్తలను సభకు తరలించేందుకు సన్నాహాలు చేశారు. గ్రామస్థాయి పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, మండల, జిల్లా ప్రజాప్రతినిధులు, సర్పంచులు, రైతు సమన్వయ సమితి సభ్యులు ప్రతి గ్రామంలో క్షేత్ర స్థాయి కార్యకర్తలకు ఎన్నికలకు సన్నాహాలు చేయాలని భావించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి క్రియా శీలక కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు. జగిత్యాల నియోజకవర్గం పరిధిలో అన్ని మండలాలు, గ్రామ స్థాయిలో క్యాడర్‌తో కవిత మాట్లాడారు. అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి సమావేశాన్ని ఎమ్మెల్యే బాజిరెడ్డి నివాసంలో కార్యకర్తలతో జరిపారు. మరోవైపు జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా సన్నాహక సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈలోగా ఆదివారం సాయంత్రం ఎన్నికల షెడ్యుల్ విడుదలైంది. పైగా మార్చి 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. -
ప్రతీ తల్లి బాధ్యతగా పెంచాలి..
సాక్షి, హైదరాబాద్: సమాజంలో అకృత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎంపీ కవిత సూచించారు. ప్రతీ తల్లి తన కుమారుడి తీరును గమనిస్తూ ఉండాలని, అబ్బాయిలకు ఆడవాళ్లపై గౌరవభావం కలిగేలా వారిని పెంచాలని చెప్పారు. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్బంగా ‘విమెన్స్ సేఫ్టీ వింగ్’ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు మహిళా భద్రతకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని తెలిపారు. నిధుల కేటాయింపు, విడుదల వరకు ఎక్కడా జాప్యం జరగలేదన్నారు. ఆడపిల్ల భద్రంగా ఉంటేనే ఏ నగరానికైనా మంచి పేరు వస్తుందన్నారు. తెలంగాణ పోలీసింగ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఏటా నేరాల శాతం తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనమని హోంమంత్రి చెప్పారు. మహిళల భద్రత కోసం సీఎం కేసీఆర్ షీటీమ్స్, భరోసా కేంద్రాలతోపాటు విమెన్స్ సేఫ్టీ వింగ్‌లను రాజధానితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించారన్నారు. విమెన్ సేఫ్టీ వింగ్ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తి: డీజీపీ హైదరాబాద్ మహిళలకు సురక్షితమైన నగరమని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. 2014 నుంచి పోలీసులకు సంబంధించి పరిపాలనా పరంగా అనేక మార్పులు తీసుకొచ్చినట్లు వివరించారు. ఇటీవల భరోసా కేంద్రాలను సుప్రీంకోర్టు అభినందించిందని, తప్పకుండా విమెన్ సేఫ్టీ వింగ్‌ను ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తిగా తీసుకుని అమలు చేస్తాయని చెప్పారు. రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న పలు నేరాల దర్యాప్తు, వారికి అందించే న్యాయపరమైన సేవలను ఒకే గొడుగు కిందకు ‘విమెన్ సేఫ్టీ వింగ్’ద్వారా తీసుకువచ్చామని ఆ వింగ్ చీఫ్, ఐజీ స్వాతీ లక్రా తెలిపారు. ఇకపై ఇలాంటి నేరాల విచారణ వేగంగా జరిగేలా ఇక్కడ నుంచే నిరంతర పర్యవేక్షణ జరుపుతామన్నారు. ఈ సెల్‌కు సంబంధించి వెబ్సైట్, వాట్సాప్, ఫేస్బుక్, హాక్ ఐ ద్వారా మహిళలు న్యాయసేవలు, ఫిర్యాదులు చేయొచ్చని సూచించారు. తక్కువ సమయంలోనే కార్పొరేట్ తరహాలో అధునాతన భవనాన్ని నిర్మించి అందించిన టీపీఎస్హెచ్ఎల్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎండీ మల్లారెడ్డిలకు సీఐడీ ఎస్పీ సుమతి ధన్యవాదాలు తెలిపారు. -
ఏ ఇబ్బంది వచ్చినా 100కు ఫోన్ చేయండి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీసు శాఖను గౌరవ స్థానంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. మహిళ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో కలిసి లక్డీకాపూల్‌లో ఉమెన్ సేఫ్టీ వింగ్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు పలువురు మహిళ ఐపీఎస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ పోలీసులకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. మహిళ భద్రతకి షీ టీమ్స్, క్యాబ్స్, పోలీసు స్టేషన్లు, భరోసా సెంటర్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మహిళల భద్రతపై ఎంత అప్రమత్తంగా ఉన్న ఇంకా దాడులు జరుగుతున్నాయని ఎంపీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలకు ఏ కష్టం వచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నేరం జరిగినప్పుడు నిందితులకు తగిన శిక్షపడే విధంగా ఉమెన్స్ వింగ్ ఏర్పాటు చేశామని ప్రకటించారు. విద్యార్థినులు మొబైల్స్‌లో హాక్ ఐ ఆప్లికేషన్ ఉంచుకోవాలని.. పోలీసులతో కలిసి ముందుకు నడవాలని కోరారు. ప్రతి జిల్లాలో కూడా మహిళల కోసం భరోసా సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు. మహిళలకు ఏ కష్టం వచ్చినా 100కి ఫోన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె.. మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత పోలీస్ శాఖకి పెద్ద పీట వేసినట్టు గుర్తుచేశారు. శాంతి భద్రతలను కాపాడటం కష్టం అవుతుందని అప్పటి సీఎం అన్నారని.. కానీ తెలంగాణ ఇప్పుడు శాంతి భద్రతలలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు పోలీసులంటే భయం పోయిందని తెలిపారు. మహిళ భద్రతకు అధిక ప్రాధన్యత ఇస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమెన్స్ వింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా హైదరాబాద్‌లో ఉమెన్స్ సెఫ్టీ వింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ కావాలని ప్రభుత్వం షీ టీమ్స్ ఏర్పాటు చేసిందన్నారు. షీ టీమ్స్ సారథి ఉన్న స్వాతి లక్రాను ఆయన అభినందించారు. తెలంగాణలో తొమ్మిది కమిషనరేట్లు ఏర్పాటు చేసి ప్రజల భద్రతకు పెద్ద పీట వేశామన్నారు. -
పద్మనాభుడిని దర్శించుకున్న ఎంపీ కవిత
తిరువనంతపురం : కేరళ రాష్ట్ర పర్యటనలో ఉన్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ ఉదయం అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ట్రావెన్కోర్ మహారాణి గౌరి లక్ష్మీభాయి, ప్రిన్స్ ఆదిత్యవర్మలను మర్యాదపూర్వకంగా కలిశారు. కౌడియర్ ప్యాలెస్‌కు వెళ్లిన ఎంపీ కవితను మహారాణి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పద్మనాభస్వామి ప్రతిమతో పాటు మహారాణి రాసిన అనంత పద్మనాభస్వామి ఆలయ చరిత్ర పుస్తకాన్ని కవితకు బహూకరించారు. అదేవిధంగా మహారాణికి ఎంపీ కవిత పోచంపల్లి శాలువాను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్‌సాగర్, ఎస్యూటీ మెడికల్ సైన్స్ సీఈఓ గౌరీ కామాక్షి, ప్యాలెస్ ఆడిటర్ గోపాల కృష్ణన్, కాంచీపురం శంకర్ పాల్గొన్నారు. కేరళ అసెంబ్లీలో.. డైమండ్ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ దేశంలోని వివిధ యూనివర్సిటీల విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ కవిత ప్రసంగించనున్నారు. -
బాధ్యతలు స్వీకరించిన మంత్రులు
సాక్షి, హైదరాబాద్: రోడ్లు, రవాణాశాఖ మంత్రిగా వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ డీ–బ్లాక్‌లో తన చాంబర్లో సాయంత్రం 4 గంటలకు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నుంచి అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి (టీఎంయూ), హన్మంత్ ముదిరాజ్, గోవర్ధన్ (టీజేఎంయూ), రాజిరెడ్డి, బాబు (ఈయూ) తదితరులు మంత్రిని సన్మానించారు. అధికార పార్టీ నాయకులు, అనుచరుల కోలాహలంతో ఆయన చాంబర్ సందడిగా మారింది. అనంతరం రోడ్లు–భవనాలు, ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖ నూతన మంత్రిగా నిరంజన్‌రెడ్డి గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమైఖ్య రాష్ట్రంలో వ్యవసాయం కుదేలు అయిపోయిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. దూరదృష్టితో ప్రాజెక్టులను నిర్మించిన కేసీఆర్ రైతులను రాజులుగా చూడటమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిపై ఒక్క ప్రాజెక్ట్ కూడా నిర్మించలేదని, ఇప్పుడు కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోందన్నారు. రైతుబంధు దేశంలోనే గొప్ప పథకమని, దీని వల్ల రైతులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు పలువురు ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. -
అవయవదానంతో మరొకరికి ప్రాణం!
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ పుట్టిన రోజున తెలంగాణ జాగృతి మరో బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిలో 50 వేల మందితో అవయవదాన ప్రతిజ్ఞలు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆదివారం నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో జరిగిన అవయవదాన ప్రతిజ్ఞ సదస్సులో ప్రకటించింది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తొలి సంతకాలు చేసి తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీతో నిరుపేదలకు ఉచిత వైద్యం అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇటీవలే అవయవదానాన్ని కూడా అందులో చేర్చిందని చెప్పారు. అవయవదానంలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందన్నారు. సమాజం, తోటి మనుషుల ప్రాణాలపై తెలంగాణ వాసులకుండే గౌరవం, కరుణలను మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఏడాదిలో 50 వేల అవయవదాన ప్రతిజ్ఞల కోసం తెలంగాణ జాగృతి నడుం బిగించిందని తెలిపారు. విస్తృత ప్రచారం అవసరం.. అవయవదానం గురించి ఎవరికీ అవగాహన లేని సమయంలోనే నగరంలో గ్లోబల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటి అవయవదాన మార్పిడి శస్త్ర చికిత్స చేసి నూతన ఒరవడిని సృష్టించారని కవిత చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే అవయవ దానంలో మొదటి స్థానంలో ఉండటం గర్వంగా ఉందన్నారు. అవయవదానంపై ఉన్న అపోహలను తొలగిస్తూ.. చనిపోయిన తర్వాత కూడా చిరంజీవులుగా ఎలా బతకవచ్చన్న అంశాన్ని సాధారణ జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని జాగృతి బృందాలకు కవిత సూచించింది. పేదవారిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సను ప్రోత్సహించేందుకు నిమ్స్ వంటి ఆరోగ్య సంస్థల్లో అవయవదానం, అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగిందని వివరించారు. అంతేగాకుండా అవయవ మార్పిడి తర్వాత తలెత్తే సమస్యలకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటివరకు నిమ్స్‌లో చేసిన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని, అందుకోసం కృషి చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. జీవన్‌దాన్‌తో ఒప్పందం.. అవయవదానంపై ప్రభుత్వ నిమ్స్ సంస్థ ఏర్పాటు చేసిన జీవన్‌దాన్ (అవయవదాన కేంద్రం)కు తెలంగాణ జాగృతికి మధ్య కుది రిన ఒప్పంద పత్రాలపై ఎంపీ కవిత, జీవన్‌దాన్ చైర్మన్ రమేశ్‌రెడ్డిలు సంతకం చేశారు. కార్యక్రమంలో 800 మందికిపైగా అవయవదానానికి అంగీకరిస్తూ సంతకాలు చేశారు. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ముఠా గోపాల్, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, సీనియర్ జర్నలిస్టు కట్టా శేఖర్‌రెడ్డిలతో పాటు పలు స్వచ్ఛంద, యువజన, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రతిజ్ఞను చేశారు. అంతకుముందు పుల్వామా దాడిలో మరణించిన జవాన్ల మృ తికి సంతాపసూచకంగా మౌనం పాటించారు. సమావేశం ముగింపులో స్కౌట్స్ అండ్ గైడ్స్ నిర్వహించిన బ్యాండ్ ఆకట్టుకుంది. ఇది శుభ పరిణామం.. అవయవాల పనితీరు తగ్గిపోయిన పరిస్థితుల్లో అవయవ మార్పిడియే చివరి అవకాశం. జీవన్‌దాన్ ద్వారా 2012 నుంచి ప్రారంభమైన అవయదానాలు అంచెలంచెలుగా పెరుగుతూ వస్తున్నాయి. 2015లో బ్రెయిన్‌డెడ్ ద్వారా 104 డొనేషన్లు రాగా 2017లో ఈ సంఖ్య 150కి పెరిగింది. 2018లో 164 వరకు పెరిగి అత్యధిక స్థానంలో ఉన్న తమిళనాడు కంటే ముందుకు వెళ్ళాం. రాష్ట్రవ్యాప్తంగా అవయవదానంపై అవగాహన సదస్సులు విస్తృతంగా చేపట్టడం శుభపరిణామం. డాక్టర్ మనోహర్, నిమ్స్ డైరెక్టర్ ప్రభుత్వ సాయం అందితే మరింత సక్సెస్ 1989లోనే అవయవదానం చేస్తానని సంతకం చేశాను. అవయవదానం ద్వారా 8 మందికి ప్రాణం పొసిన వాళ్ళమవుతాం. ఇప్పుడున్న నూతన సాంకేతికతతో బోన్, కార్టిలేజ్, స్కిన్ అన్నీ ఉపయోగపడుతాయి. రాష్ట్ర ప్రభుత్వం జీవన్‌దాన్ కార్యక్రమం ప్రారంభించాక అవయవదానంపై అవగాహన పెరిగింది. అవయవదానం చేసిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం అందేలా చేస్తే కార్యక్రమం మరింత విజయవంతమవుతుంది. డాక్టర్ కె.రవీంద్రనాథ్, చైర్మన్, గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ అవగాహన పెంచాల్సిన అవసరముంది.. దేశంలో అవయవదానంపై అవగాహన చాలా తక్కువ. స్పెయిన్‌లో 20 లక్షల మందికి 70 మంది అవయవదానం చేస్తే, అమెరికాలో ఆ సంఖ్య 40గా ఉంటే మనదేశంలో 20 లక్షల మందికి ఒక్కరు మాత్రమే అవయవదానం చేస్తున్నారు. అవయవదానంపై 80 శాతం మందిలో అవగాహన లేదు. మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ గురువారెడ్డి, సన్ షైన్ హాస్పిటల్స్ చైర్మన్ -
ఆ విషయం కవిత పదేపదే చెప్పారు: భట్టి
సాక్షి హైదరాబాద్: ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు గడుస్తున్నా రాష్ట్రంలోని రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని సీఎల్పీ నాయకుడు మల్లుభట్టి విక్రమార్క విమర్శించారు. పసుపు, ఎర్ర జొన్నల సమస్యలపై నిజామాబాద్ రైతుల గతకొద్దికాలంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదని మండిపడ్డారు. దేశంలో పసుపు ఉత్పత్తి 33శాతం తెలంగాణలోనే ఉందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పదేపదే ప్రస్తావిస్తారనీ, పసుపు బోర్టును మాత్రం ఏర్పాటుచేయరని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరను కల్పించిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎక్కడ అవసరం వచ్చిన కాంగ్రెస్ శాసనసభ పక్షం అక్కడికి వెళ్తుందని భట్టి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఈనెలాఖరు వరకు ప్రకటిస్తామని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులపై రాష్ట్రస్థాయి నేతలతో చర్చంచి అధిష్టానానికి పంపుతామని, వారి నిర్ణయమే ఫైనల్ అని భట్టి స్పష్టంచేశారు. -
వెల్కమ్ బ్యాక్ సర్ : ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ : క్యాన్సర్ చికిత్స నిమిత్తం న్యూయార్క్ వెళ్లిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ మేరకు ‘ఇంటికి తిరిగి రావడం సంతోషంగా ఉంది’ అని శనివారం ఆయన ట్వీట్ చేశారు. తొడ భాగంలో అరుదైన క్యాన్సర్ సోకడంతో గత నెల 13న వైద్య పరీక్షల కోసం జైట్లీ అమెరికా వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్నప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గానే ఉంటున్నారు. కాగా ఆయన స్థానంలో తాత్కాలిక ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన పీయూష్ గోయల్.. గత శుక్రవారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా జైట్లీ అనారోగ్యం పాలవడం ఇదే మొదటిసారి కాదు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జైట్లీ బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. అంతేకాదు గతేడాది మే 14న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో జైట్లీ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. ఇక జైట్లీ కోలుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ వెల్కమ్ బ్యాక్ సర్!! మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి’ అని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు. Welcome back sir !! Wish you good health !!! https://t.co/ow0jSPRZmU — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 9, 2019 -
ఎంపీ కవితకు కేరళ అసెంబ్లీ ఆహ్వానం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జాతీయ స్థాయిలోని పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కేరళ అసెంబ్లీ నిర్వహిస్తున్న సదస్సులో ప్రసంగించాల్సిందిగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ఈ మేరకు కేరళ అసెంబ్లీ స్పీకర్ పి శ్రీరామకృష్ణన్ ఎంపీ కవితకు ఆహ్వాన లేఖ పంపారు. కేరళ అసెంబ్లీ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. తొలిరోజు మధ్యాహ్నం జరిగే సదస్సులో ‘‘క్యాస్ట్స్ అండ్ ఇట్స్ డిస్కంటెట్స్..’’ అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. కేరళ సీఎంతో పాటు దేశం లోని వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు కూడా సదస్సుకు హాజరవుతారు. మాజికంగా, రాజకీయంగా క్రియాశీలకంగా ఉండే సుమారు రెండు వేల మంది విద్యార్థులు సద స్సుకు హాజరుకానున్నారు. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను గత ఏడాది ఆగస్టులో రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్ ప్రారంభించిన విష యం తెలిసిందే. ఉత్సవాల్లో భాగంగా అనేక సెమినార్లు జరుగుతున్నాయి. మొదటి సెమినార్ గత ఏడాది ఆగస్టు 6,7,8 తేదీల్లో ‘‘ఎస్సీ,ఎస్టీల సాధికారత – సవా ళ్లు..’ అంశంపై సదస్సు జరిగింది. ఇప్పుడు రెండో సెమినార్ ఈనెల 23–25 వరకు జరగనుంది. యువతలో ప్రజాస్వామిక విలు వలు, జీవన విధానం, ప్రజాస్వామిక ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యం వంటి అంశాలపై ఈ సెమినార్లో చర్చిస్తారు. కేరళ అసెంబ్లీ, ఆ రాష్ట్ర ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు సం యుక్తంగా ఎంఐటీ–వరల్డ్ పీస్ యూనివర్శిటీ, పుణె సాంకేతిక సహకారంతో ప్రజాస్వామ్యంపై ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. -
ఎంపీ కవితకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు
చంద్రశేఖర్‌కాలనీ: నిజామాబాద్ ఎంపీ కవిత ఫ్రేమ్ ఇండియా–ఏషియా పోస్ట్ మ్యాగజైన్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ ఎంపీకి అవార్డును అందజేశారు. దేశం లోని మొత్తం 545 మంది ఎంపీలకుగాను మ్యాగ జైన్ సర్వే ద్వారా 25 మందిని ఉత్తమ ఎంపీలుగా ఎంపిక చేసింది. ప్రజాదరణ, కార్యశీలత, సామాజిక సేవాదృక్పథం, లోక్‌సభకు హాజరు, లోక్‌సభ నిర్వహణలో పాత్ర, నియమనిబంధనలు పాటించడం, ప్రశ్నలగడం తదితర అంశాల ఆధారంగా ఎంపీలను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. సర్వే నిర్వహించిన అత్యధిక విభాగాల్లో ఎంపీ కవితకు 90 శాతానికిపైగా పాయింట్లువచ్చాయి. కవిత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, క్రియాశీలకంగా వ్యవహరించారని సర్వే రిపోర్టు పేర్కొన్నది. రాజనీతి, ఉద్యమకారిణి, అనవ్య ప్రతిభాశాలిగా, సామాజిక సేవాధృక్పథం, ప్రజాదరణ, కార్యశీలత తదితర అంశాల్లో ఆమెకు మంచి గుర్తింపు లభించిందని మ్యాగజైన్ పేర్కొఇంది. కళా సంస్కృతిని రక్షిచడంలో, మంచి మహిళా వక్తగా ఆమె పేరు పొందారని వివరించింది. అమెరికా నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాంస్కృతిక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజలను చైతన్యపర్చడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని సంస్థ పేర్కొంది. బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ఆమె చురుగ్గా వ్యవహరించారని, తెలంగాణ సంస్కృతిక సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారని వివరించింది. అవార్డు అందుకున్న ఎంపీ కవితకు అభిమానులు అభినందనలు తెలిపారు. అంతకుముందు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నివాసానికి వెళ్లి స్పీకర్ ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. -
ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ఫేమ్ ఇండియా–ఏషియా పోస్ట్ ప్రకటించిన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు (శ్రేష్ట్ సంసద్)ను టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత గురువారం ఢిల్లీలో అందుకున్నారు. ప్రజాదరణ, కార్యశీలత, సామాజిక సేవా దృక్పథం, లోక్‌సభకు హాజరు, చర్చల్లో చురు గ్గా పాల్గొనడం, ప్రశ్నలడగడం, పార్లమెంటు నియమ నిబంధనలను పాటించడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న సదరు సంస్థ కవితకు అవార్డు ప్రకటించింది. తెలం గాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కవిత క్రీయాశీలకంగా పనిచేస్తున్నారని సంస్థ కొనియాడింది. ఢిల్లీలో గురువారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా కవితతో పాటు మరో 25 మంది ఎంపీలు అవార్డులు అందుకున్నారు. బడ్జెట్లో రూ. 24 వేల కోట్లు ఇవ్వండి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, నీతి ఆయోగ్ ప్రతిపాదించినట్టు మిషన్ భగీరథ, కాకతీయ పథకాలకు రూ. 24 వేల కోట్లు మంజూరు చేయాలన్నారు. ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే విషయమై శుక్రవారం ఢిల్లీలో సమావేశం కానున్న ప్రతిపక్ష పార్టీల తీరును కవిత తప్పుబట్టారు. ఓటమిపాలైన ప్రతిపార్టీ ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నాయన్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన అనంతరం ఫలితాలు వెలువడక ముందు ప్రభుత్వ ఏర్పాటుకు తమకే మొదటగా అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరిన కాంగ్రెస్ నేతలు, ఓటమిపాలవ్వగానే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహా జన్ను కలసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డి, బూర నరసయ్యగౌడ్, సంతోశ్‌కుమార్, కొత్తా ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్ పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రజలే కారణం తాను ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎన్నికయ్యానంటే దానికి నిజామాబాద్ ప్రజలే కారణమని, గత ఎన్నికల్లో తన ను ఎంపీగా ఎన్నుకోవడం వల్ల సమస్యలపై పార్లమెంటులో ప్రశ్నించగలిగానని కవిత అన్నారు. గురువారం పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై కవిత స్పందిస్తూ.. కేంద్రం చేసిన చిన్నచిన్న పనులను పెద్దగా చూపే ప్రయత్నం జరిగిందని, ప్రవేశపెట్టిన పథకాల ఫలితాలను ఎక్కడా వెల్లడించలేద న్నారు. నేడు కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడితే తెలంగాణ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. -
ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం మూడో రోజు చండీయాగం
-
యువ దీప్తి.. మహాత్మ స్ఫూర్తి
-
‘నిన్న ఈవీఎంలు అన్నారు.. నేడు చంద్రబాబు అంటున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు మంగళవారం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్‌లను కలిసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి బుధవారం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 16 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమికి ప్రతిపక్షాలు కుంటి సాకులు వెతుకుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమికి తొలుత ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నారని.. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును నిందిస్తున్నారని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ తరఫున కీలక భూమిక పోషిస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా కల్పించాలని గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. తక్షణమే హైకోర్టును విభజించాలని మంత్రులకు చెప్పినట్టు తెలిపారు. తెలంగాణకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కేంద్రం జాప్యం చేస్తుందని మండిపడ్డారు. కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా ఎటువంటి నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. బీజేపీ కేవలం మాటల ప్రభుత్వం అని విమర్శించారు. కరీంనగర్ ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని అన్నారు. అసెంబ్లీ రద్దుకు తర్వాత కూటమి ఏర్పాటయిందని గుర్తుచేశారు. కూటమి కట్టకముందే కాంగ్రెస్ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. -
ఈ నెంబర్‌కు అతని వివరాలు పంపించండి: కవిత
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. సామాజిక మాధ్యమం ట్విటర్ ద్వారా సాయం కోరిన ఓ వ్యక్తికి.. పూర్తి వివరాలు పంపాల్సిందిగా సూచించారు. వివరాల్లోకి వెళ్తే.. జితేందర్ రెడ్డి అనే నెటిజన్ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణపాయ స్థితిలో ఉన్న తన స్నేహితుని గురించి ఎంపీ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ‘నా స్నేహితుడిది పేద కుటుంబం. బైక్ యాక్సిండెట్ జరగడంతో అతను ప్రస్తుతం కరీంనగర్‌లోని భద్రకాళి ఆస్పత్రిలో ప్రాణప్రాయ స్థితిలో ఉన్నారు. అక్క నా స్నేహితుకునికి మీరు సహాయం చేయగలరా’ అంటూ ట్విటర్లో కవితను ట్యాగ్ చేశారు. అతి తక్కువ సమయంలోనే జితేందర్ ట్వీట్‌పై స్పందించిన కవిత.. అతని వివరాలను ఓ ఫోన్ నెంబర్‌కు తెలియజేయాలని సూచించారు. దీనిపై సదురు నెటిజను కవితకు కృతజ్ఞతలు తెలిపారు. వివరాలను పంపిస్తున్నట్టుగా కూడా పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడానికి వెంటనే స్పందించిన ఎంపీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరో ట్వీట్లో జితేందర్ బాధితుని వివరాలు కూడా షేర్ చేశారు. జగిత్యాల జిల్లా గొల్లపెల్లి గ్రామానికి చెందిన ధర్మపురి మధు సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడిపోవడంతో తలకు బలమైన దెబ్బ తగిలి చెవుల నుంచి రక్త స్రావం జరిగడంతో ప్రస్తుతం ప్రాణప్రాయ స్థితిలో ఉన్నట్టు తెలిపారు. Send his details to 8985699999 https://t.co/FGWld5KUVL — Kavitha Kalvakuntla (@RaoKavitha) 18 December 2018 -
రామలింగేశ్వరునికి కార్తీక శోభ
మల్లాపూర్(కోరుట్ల): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఏకైక హరిహరక్షేత్రంగా శ్రీరామలింగేశ్వర ఆలయం కీర్తించబడుతుంది. మండలంలోని వాల్గొండ గ్రామంలో గోదావరి నది తీరాన ఉన్న ఆలయంలో కార్తీక మాస పంచాహ్నిక మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 19 నుంచి 23న కార్తీక పౌర్ణమి వరకు శివముష్టి, చందనోత్సవ, తులసీ వివాహా, అష్టోత్తర కళశ స్నపన, లక్ష కుంకుమార్చన, పుష్పయాగములతో పాటు..పౌర్ణమి రోజున లక్ష దీపాలంకరణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు. లక్ష దీపాలంకరణోత్సవాలకు ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ పాల్గొంటారని ఆలయ కమిటీ చైర్మన్ సాంబారి శంకర్, వైస్ చైర్మన్ చిలివేరి లక్ష్మి, ఎంపీటీసీ ఇస్లావత్ లక్ష్మీబలరాంనాయక్, మాజీ సర్పంచులు చిలివేరి రమేశ్, ఎండీ.జమాల్, మాజీ ఉపసర్పంచ్ దండిగ రాజం తెలిపారు. విచ్చేయనున్న సాధుపుంగవులు.. కార్తీక పౌర్ణమి రోజున లక్ష దీపాలంకరణోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి సాధుపుంగవులు ముఖ్య ఆథితులుగా విచ్చేయనున్నారు. మనోరబాద్ నుంచి శ్రీ శివానందభారతిస్వామి, శకణాగిరి నుంచి శ్రీకేశవనాథ్స్వామి, ఆదిలాబాద్ నుంచి శ్రీ ఆదినాథ్స్వామి, వాల్గొండ చంద్రయ్యస్వామి, వేంపేట నుంచి భవవద్గీత పారా యణ భక్తులు, కొలిప్యాక నుంచి శ్రీగంగాధర్స్వామి, కోరుట్ల నుంచి శ్రీ ఆత్మనందస్వామి, గంభీర్పూర్ నుంచి గిరిజామాతస్వామి, కోరుట్ల నుంచి శ్రీజగదీశ్వరస్వామి, కోరుట్ల నుంచి హరిప్రియమాత, పిప్రి నుంచి శ్రీయోగేశ్వరస్వామి, శ్రీ నర్సింగరెడ్డిస్వామి లక్షదీపోత్సవానికి విచ్చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. -
ఎన్ని ఎత్తులు వేసినా టీఆర్ఎస్దే గెలుపు
సాక్షి, ధర్మపురి: తెలంగాణ రాష్ట్రం సిద్ధించకుండా కుట్రలు, కుతంత్రాలు పన్నిన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ప్రస్తుతం ఇక్కడి అభివృద్ధిని సైతం అడ్డుకుంటున్నాడని..ఎన్ని ఎత్తులు వేసినా తెలంగాణ అభివృద్ధి ఆగదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత అన్నారు. బుధవారం సాయంత్రం ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం బ్రాహ్మణ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నాలుగున్నరేళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని..కోట్లాది రూపాయలతో ప్రాజెక్టుల నిర్మాణాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ల ఏర్పాటుతో తెలంగాణ సస్యశ్యామలం అవుతోందన్నారు. అభివృద్ధిని ఓర్వలేక చంద్రబాబు కాంగ్రెస్, ఇతర పార్టీలతో జతకట్టి కుట్రపన్ని మహాకూటమిగా ఏర్పడ్డారని.. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తోందని.. ముఖ్యమంత్రి కేసీఆరేనని తేల్చి చెప్పారు. ధర్మపురి నియోజకవర్గంలో అతి తక్కువ కాలంలో 11 వందల కోట్ల అభివృద్ధి జరిగిందని..మేజర్ పంచాయతీగా ఉన్న ధర్మపురిని మున్సిపాలిటీగా ఏర్పడడం ఎంతో గొప్ప విషయమని..పట్టణాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడానికి కేసీఆర్ చొరవతో ఇప్పటికే రూ.75 కోట్లు మంజూరయ్యాయని.. ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ అధికారంలో రాగానే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. గతంలో మున్సిపాలిటీల అభివృద్ధికి పన్నులు వసూలు చేసేవారని.. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు మంజూరు చేయడం జరగుతుందన్నారు. గత పాలకుల హయాంలో రోళ్లవాగు ప్రాజెక్టు నిరాధరణకు గురైందని..రాష్ట్రం ఏర్పడ్డాక ప్రాజెక్టు మరమ్మతుకు సీఎం రూ.135 కోట్లు మంజూరు చేశారన్నారు. నృసింహుని కృపతో ధర్మపురి పుణ్యక్షేత్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. సమావేశంలో ధర్మపురి, జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థులు కొప్పుల ఈశ్వర్, సంజీవ్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ బాదినేని రాజేందర్, ఆలయ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ రాజేశ్, నాయకులు సౌళ్ల భీమయ్య, ఇందారపు రామయ్య, పులిశెట్టి మల్లేశం, సంగి శేఖర్ తదితరులున్నారు. నృసింహుని సన్నిధిలో పూజలు ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని ఎంపీ కవిత దర్శించుకున్నారు. ముందుగా ఆలయం తరఫున ఆమెకు స్వాగతం పలికారు. శ్రీయోగానందాస్వామి ఆలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. -
టీఆర్ఎస్ గెలుపు తధ్యం:కవిత
-
తెలంగాణలో చక్రం తిప్పుతాననడం హాస్యాస్పదం
సాక్షి, జగిత్యాల: ఆంధ్రాలో రుణమాఫీ చేయడంలో విఫలమైన చంద్రబాబు తెలంగాణలో చక్రం తిప్పుతాననడం హాస్యాస్పదంగా ఉందని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. మెట్పల్లిలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో రెండు సంవత్సరాల్లో పూర్తిస్తాయి రుణమాఫీ చేసిన ఘనత టీఆర్ఎస్దేనని అన్నారు. టీఆర్ఎస్కు ఏ పార్టీ పోటీ కాదని, తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో 80 శాతం సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంటుందని చెప్పారు. తెలంగాణను ఆంధ్రావారి పాలన నుంచి కష్టపడి తెచ్చుకుంది తిరిగి వారికే అప్పగించడానికి కాదన్నారు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ని గెలిపించి తీరుతారని చెప్పారు. -
మోపెడ్‌పై.. ఎంపి కవిత
సాక్షి,బోధన్ (నిజామాబాద్ ): అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బోధన్ పట్టణంలో గంగపుత్ర కుల సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళన సభ విచ్చేసిన ఎంపీ కవిత టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారులకు అందించిన మోపెడ్‌ను సరదాగా నడిపారు. అనంతరం సభలో పాల్గొన్నారు. హమ్మయ్య.. టిఫిన్ కోసం సమయం దొరికింది! సాక్షి,బాన్సువాడ (నిజామాబాద్): ఎన్నికల సమయం కావడంతో తెల్లవారుజాము నుంచి రాత్రి పడుకునే వరకు అభ్యర్థులకు తీరిక ఉండదు. పార్టీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలతో బిజీబిజీగా ఉంటారు. ఇక బాన్సువాడ టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరింత బిజీగా ఉన్నారు. కేవలం నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయనపై ప్రచార బాధ్యతలు ఉండడంతో చాలా బిజీగా మారారు. శనివారం తెల్లవారుజామునే పట్టణంలోని శ్రీవేంకటేశ్వరాలయంలో భార్య సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రిని, ఆలయ కమిటీ వారు టిఫిన్ చేసి వెళ్లాలంటూ ఆత్మీయంగా ఆహ్వానించడంతో ఆయన అంగీకరించి కాస్త తీరికగా టిఫిన్ చేశారు. -
కేసీఆరే మళ్లీ సీఎం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న కేసీఆర్‌నే మరోమారు ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఈటె ల రాజేందర్, ఎంపీ కల్వకుంట్ల కవిత, పలువురు ఎమ్మెల్సీలు, తాజామాజీ ఎమ్మెల్యేల బృందం అక్టోబర్ 3న గిరిరాజ్ కళాశాల మైదానంలో జరుగనున్న సీఎం బహిరంగ సభాస్థలాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రజాఆశీర్వాద సభను విజయవం తం చేసేందుకు భా రీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో స్పందన బాగుందని, ఉమ్మడి జిల్లా నుంచి కేసీఆర్ అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని అన్నారు. అనుకున్న దాని కంటే ఎక్కువ జనాలు స్వచ్ఛందంగా వస్తారని పేర్కొన్నారు. ప్రగతి నివేదన సభకు వచ్చినట్లుగానే ఈ ప్రజాఆశీర్వాద సభకు కూడా ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా రెండు లక్షల మంది సీఎం సభకు హాజరవుతారని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కమిటీల నియామకం చేపట్టామని తెలిపారు. సభాస్థల నిర్మాణం, అలంకరణ, బారికేడ్లు, ఇతర వసతులు అనుకున్న సమయానికి పూర్తవుతాయన్నా రు. నిబంధనల ప్రకారం ఆర్టీసీ బస్సులను జన సమీకరణకు వినియోగించుకుంటామని, జిల్లాలో ఉన్న ప్రైవేటు వాహనాలు, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వాహనాలను కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. మంత్రుల వెంట జెడ్పీ చైర్మన్ దఫెదార్ రాజు, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్‌రావు, ఫారూక్, తాజామాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, షకీల్ అమేర్, రెడ్కో రాష్ట్ర చైర్మన్ ఎస్ఏ అలీం తదితరులు ఉన్నారు. -
ప్రతిష్టాత్మకంగా ప్రజా ఆశీర్వాదం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ప్రజా ఆశీర్వాద సభను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముందస్తు ఎన్నికల ప్రచారం లో భాగంగా అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన బహిరంగసభల్లో తొలి సభ కావడంతో జనసమీకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందరి దృష్టిని ఆకర్శించే ఈ సభ ను విజయవంతం చేసేందుకు జిల్లాలోని ఆ పార్టీ ముఖ్య నాయకత్వం ఏర్పాట్లలో నిమగ్నమైంది. అక్టోబర్ 3న నిజామాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ఈ బహిరంగ సభకు కేవలం వారం రోజులే గడువుండటంతో ఆ పార్టీ నాయకులు ఇప్పటికే రం గంలోకి దిగారు. బహిరంగసభ నిర్వహణకు సమన్వయ బాధ్యతలను సీఎం కేసీఆర్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పో చారం శ్రీనివాస్‌రెడ్డిలకు అప్పగించారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతరు ముఖ్యనేతలతో కవిత, పోచారం బుధవారం నిజామాబాద్‌లోని ఎంపీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. గిరిరాజ్ కాలేజ్.. బహిరంగసభ తేదీ ఖరారైనప్పటికీ సభను ఎక్కడ నిర్వహించాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. నగరంలోని గిరిరాజ్ కాలేజ్ సమీపంలో ఉన్న మైదానంలో సభను నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జిల్లా నేతలతో కలిసి ఈ మైదానాన్ని పరిశీలించారు. వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలి.. హెలిప్యాడ్, పార్కింగ్ స్థలం వంటి వాటి విషయమై మైదానం వద్ద చర్చించారు. సభకు వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డుకు అవతలి వైపు పార్కింగ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించారు. జన సమీకరణపై దృష్టి జిల్లాల్లో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభకు భారీగా జన సమీకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి సభకు జనాలను తరలించనున్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్లతోపాటు, సమీపంలో ఉన్న ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల నుంచి వీలైనంత ఎక్కువ మందిని ఈ సభకు తరలించే యోచనలో ఉన్నారు. బాల్కొండ, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల నుంచి కూడా సభకు జనసమీకరణ చేస్తున్నారు. జిల్లాలోనే ఎంపీ కవిత.. బహిరంగసభ నిర్వహణకు సమన్వయ బాధ్యతలపై దృష్టి సారించిన ఎంపీ కవిత మూడు, నాలుగు రోజులు జిల్లాలోనే ఉండనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో తిరిగి సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని భావిస్తున్నారు. ఐదు వందల బస్సులివ్వండి : ఆర్టీసీకి ఆదేశాలు.. సభకు జనాలను తరలించేందుకు అవసరమైన వాహనాలను సమకూర్చుకునే పనిలో పడ్డారు. ఈ సభకు సుమారు ఐదు వందల బస్సులు కేటాయించాలని టీఆర్ఎస్ నాయకులు కోరినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (రీజియన్)లోని ఆరు డిపోల పరిధిలోని మొత్తం 670 బస్సులున్నాయి. ఇందులో 190 అద్దె బస్సులున్నాయి. మరోవైపు ప్రైవేటు బస్సులు, ఐచర్లు, మ్యాక్సీక్యాబ్ వాహనాలను సమీకరిస్తున్నారు. ఆర్టీసీ డీవీఎం అనిల్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వర్‌రెడ్డితో వాహనాల విషయమై మంత్రి పోచారం చర్చించారు. విజయవంతం చేయండి : మంత్రి పోచారం ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎంపీ కార్యాలయంలో కవితతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు నివ్వెరపోయే విధంగా నిజామాబాద్ బహిరంగసభను విజయవంతం చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సభకు జనసమీకరణ చేపడతామని పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రభంజనానికి మించి ఇప్పుడు తమ పార్టీ అధినేత కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఊళ్లకు ఊళ్లు టీఆర్ఎస్కు ఓటేస్తామని తీర్మానాలు చేస్తున్నాయని, ఇప్పటికే ఒక్కో నియోజకవర్గంలో 30, 40 గ్రామాలు తమ పార్టీకి అనుకూలంగా తీర్మానాలు చేశాయని వివరించారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాత, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, రెడ్ కో చైర్మన్ ఎస్ఏ అలీం, తాజా మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌షిండే, గణేశ్ గుప్తా, షకీల్ ఆమేర్, తదితరులు పాల్గొన్నారు. -
‘అనైతిక పొత్తులకు టీడీపీ కేరాఫ్ అడ్రస్’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసమే ముందస్తుగా తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ జత కడుతోందని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. అనైతిక పొత్తులకు టీడీపీ కేరాఫ్ అడ్రస్ అని ఎద్దెవా చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలపై ఉన్న కేసులు పాతవని, వాటితో మాకు ఎలాంటి సంబంధంలేదని ఆమె తేల్చిచెప్పారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ కొడతామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ టికెట్ల విషయంలో కొన్నిప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయని.. పార్టీ నాయకత్వం వాటిని త్వరలోనే పరిష్కరిస్తుందని వెల్లడించారు. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ భూపతి రెడ్డిలు స్వార్థం కోసం మాపై విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మంగళవారం జగిత్యాల జిల్లాలో జరిగిన కొండగట్టు ప్రమాదంపై కవిత స్పందిస్తూ.. ఘటనలో పొరపాట్లు జరిగాయని అన్నారు. -
‘మిషన్ భగీరథే ఆ కుటుంబానికి బతుకుదెరువు’
సాక్షి, హైదరాబాద్ : ‘మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కల్వకుంట్ల కుటుంబానికి బతుకుదెరువుగా మారింది.. అందుకే రైతుల పొలాలను ఎండబెట్టి మరి ఈ ప్రాజెక్ట్‌కు నీటిని కేటాయిస్తున్నార’ని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కి విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ముప్పై సంవత్సరాలుగా కాకతీయ కెనాల్ కింద కోరుట్ల, బాల్కొండ పరిధిలోని 20కి పైగా గ్రామాల ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. ఎగువన ఎస్సారెస్పీలో 16 టీఎంసీల నీరున్నా.. రైతుల పొలాలకు నీళ్లు వదలకుండా, ప్రభుత్వం కావాలనే వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. నీళ్ల కోసం రైతులు ఆందోళన చేయకుండా ఉండేందుకు ఇప్పటికే ఎస్సారెస్పీ పరిసర గ్రామాల్లో భారీగా పోలీసుల బలగాలను మోహరించి, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు . కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలైనా గజ్వేల్, సిద్ధిపేటకు నీటిని వదలడం కోసమే ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై వ్యవసాయ మంత్రి పోచారం, కోరుట్ల స్థానిక మంత్రి కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్, ఎంపీ కవిత స్పందించాలని డిమాండ్ చేశారు. రైతులు కోరుకున్నది కేవలం అర టీఎంసీ నీరు మాత్రమే.. కానీ ప్రభుత్వం మాత్రం రైతుల గోడును పట్టించుకోకుండా ఆ నీటిని మిషన్ భగీరథకు తరలిస్తుందన్నారు. కారణం ఈ ప్రాజెక్ట్ కల్వకుంట్ల కుటుంబానికి బతుకుదెరువుగా మారిందని ఆరోపించారు. తక్షణమే రైతులకు నీటిని విడుదల చేయాలని, లేని పక్షంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
‘కేటీఆర్ ఇప్పుడెందుకు స్పందించడం లేదు’
సాక్షి, హైదరాబాద్ : ‘అన్నింటికీ స్పందించే మంత్రి కేటీఆర్, అన్నింటిని ప్రశ్నించాలనే ఎంపీ కవిత.. యాదాద్రి ఘటనపై ఎందుకు ప్రశ్నించడం లేదు.. కనీసం స్థానిక మహిళా ఎమ్మెల్యే కూడా ఈ విషయంపై స్పందించపోవడం శోచనీయం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కొల్లి మాధవి. ఈ సందర్భంగా సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత మూడ్రోజులుగా యాదాద్రిలో జరిగిన దారుణాలు ఒక్కోటిగా బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. పసిపిల్లలను దారుణంగా హింసించడమే కాక, వారిని త్వరగా ఎదిగేలా చేయడం కోసం హార్మోన్ ఇంజెక్షన్లను కూడా వాడారనే భయంకర నిజాలు బయటకొస్తున్నాయి. కానీ ఈ దారుణాల గురించి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం స్పందిచకపోవడం విచారకరమన్నారు. ప్రతి విషయాన్ని ప్రశ్నించాలనే కవిత, అన్నింటికి ట్విటర్లో స్పందించే కేటీఆర్‌లు ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదు, స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. పోలీసు స్టేషన్ పక్కనే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే అధికారులకు కనీస సమాచారం కూడా తెలియకపోవడం విచారకరమన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి పోలీస్ శాఖను, ఇంటిలిజెన్స్ శాఖలను ఇతర పార్టీ నాయకులను కొనడం కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు. శిశు సంక్షేమ శాఖ నిద్రపోతోందా.. ఇంత జరిగినా కనీసం స్థానిక మహిళా ఎమ్మెల్యే కూడా ఈ విషయం పై స్పందించకపోవడం దారుణమాన్నారు. అసలు రాష్ట్రంలో శిశు సంక్షేమశాఖ అనేది.. చిన్నారుల సంరక్షణ మీ బాధ్యతే కదా.. ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా అంటూ ప్రశ్నించారు. హైకోర్టు న్యాయమూర్తి అధ్వర్యంలో కమిటీ ఈ దారుణాలపై తక్షణమే హై కోర్టు న్యాయమూర్తి సమక్షంలో ఒక విచారణ కమిటీ వేసి అన్ని ఇళ్లలో తనిఖీలు నిర్వాహించాలని డిమాండ్ చేశారు. అంతేకాక గత నాలుగేళ్లుగా ఇంకా ఎందరు చిన్నారులు తప్పిపోయారనే విషయాలను కూడా విచారించాలని కోరారు. డ్రగ్స్ కేస్, నయీం కేస్, మియాపూర్ కేసుల్లాగా ఈ కేసును కూడా మూలకు పడేయోద్దంటూ అభ్యర్ధించారు. బంగారు తెలంగాణ కాదు బార్ల తెలంగాణ తాము అధికారంలోకి వచ్చాకే తెలంగాణ.. బంగారు తెలంగాణ అయిందంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ బార్ల తెలంగాణగా మారిందంటూ విమర్శించారు. ఇబ్బడి ముబ్బడిగా వైన్ షాపులకు లైసెన్స్‌లివ్వడం, మరో గంట అదనంగా వైన్ షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతించడమంటే.. ప్రజలను మరింత తాగండంటూ ప్రోత్సాహించడమేనని ఆరోపించారు. మీ ఈ చర్యలతో యువతకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో రజాకార్ల రాజ్యం : అల్జాపూర్ శ్రీనివాస్, బీజేపీ అధికార ప్రతినిధి ‘నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే రైతులు ట్యాంకర్లతో బతికించుకుంటున్నారు. బాల్కొండ, కొరుట్ల, కాకాతీయ కెనాల్లో నీటి కోసం రైతులు సొంత రాష్ట్రంలోనే పోరాటం చేస్తున్నార’ని బీజేపీ అధికార ప్రతినిది శ్రీనివాస్ విమర్శించారు . దాదాపు 70 వేల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారని, సర్కార్ వారిని కనీసం పంటల బీమా పథకం కింద కూడా ఆదుకోవడం లేదని ఆరోపించారు. తమ సమస్యల గురించి పోరాటం చేస్తోన్న రైతులను, వారకి మద్దతు తెలుపుతున్న బీజేపీ నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. చూడబోతే నిజామాబాద్‌లో మళ్లీ రజకార్లు రాజ్యమేలుతున్నట్లుందని ఆరోపించారు. వెంటనే రైతులకు క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేశారు. -
ఓ కమల కన్నీటి కథ
కట్టుకున్న భార్యను కన్నుల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన భర్త.. మద్యానికి బానిసై, చేసిన అప్పులు తీర్చడానికి తన భార్యను గల్ఫ్‌లోని వ్యాపారికి అమ్మేశాడు. ఆ బాధితురాలికి అక్కడి అరబ్బు షేక్‌లు నరకం చూపించారు. వారి బారి నుంచి ఎలాగో తప్పించుకుని తనను గల్ఫ్‌కు రప్పించిన ఏజెంట్ దగ్గరికి వెళ్లి గోడు వెళ్లబోసుకుంటే ఆ ఏజెంటు తన భార్యతో కలిసి ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. చీకటి గదిలో బంధించారు. బతికి బయటపడతానో లేదో అనే సందేహంతో రోజులు వెళ్లదీసిన ఆమెకు ఎట్టకేలకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, తెలంగాణ జాగృతి ప్రతినిధి నవీన్ చారీల చొరవతో విముక్తి లభించింది. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన అంగ కమల వ్యథ ఇది. భర్త చేతిలో మోసపోయి దేశం కాని దేశంలో ఆమె పడిన కష్టాలు.. ఆమె మాటల్లోనే..! ప్రేమించి పెళ్లాడాడు నా భర్త సుదర్శన్‌ది మా ఊరే. 25 ఏళ్ల కిందట నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతనికి భార్యా పిల్లలు ఉన్నారు. ప్రేమించానని వెంటపడటంతో కాదనలేకపోయాను. మాకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఇంటర్ వరకు చదివి కూలి పని చేస్తున్నాడు. చిన్న కొడుకు ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. పెళ్లయ్యాక కొన్నేళ్ల పాటు మా కాపురం సజావుగానే సాగింది. గల్ఫ్ దేశాల్లో పని చేసే సుదర్శన్ ఆరు నెలలకు, ఏడాదికి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. తర్వాత కొన్నేళ్ల నుంచి గల్ఫ్‌కు వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు. రోజూ తాగి వచ్చి కొట్టేవాడు. అడ్డు వచ్చిన పిల్లల్ని కూడా కొట్టేవాడు. భరించలేక మూడేళ్ల కింద నేను, పిల్లలు మా అమ్మ దగ్గరికి వెళ్లిపోయాం. తాను మారానని మళ్లీ వచ్చాడు సుదర్శన్. కూలీ పని చేస్తే ఎక్కువ సంపాదించుకోలేమని తాను మళ్లీ్ల గల్ఫ్‌కు వెళుతున్నాననీ, తనతో పాటు అక్కడకు వస్తే ఎక్కువ సంపాదించుకోవచ్చని చెప్పాడు. పాస్‌పోర్టు తెప్పించాడు. చాకిరి చేస్తూ చావు దెబ్బలు ఒమన్‌లో అరబ్బు షేక్‌ల ఇండ్లలో పని చేస్తే నెలకు రూ.20 వేల వరకు వేతనం ఉంటుందని, తను కూడా ఒమన్‌లోనే మంచి కంపెనీలో పని వెతుక్కున్నానని చెప్పాడు. మొదట నన్ను ఒమన్‌కు పంపిస్తున్నానని, కొన్ని రోజుల తరువాత తాను అక్కడకు వస్తానని, అంతవరకు తన స్నేహితుడు భాస్కర్ నాకు ఒమన్‌లో అండగా ఉంటాడని చెప్పాడు. ఒమన్‌లో ఇంటిపని వీసా తీయించి ఈ ఏడాది మే 18న నన్ను ఒంటరిగానే పంపించాడు. నా భర్త చెప్పినట్లు భాస్కర్, అతని భార్య మణిలు నా కోసం ఎయిర్‌పోర్టుకు వచ్చి నన్ను తీసుకెళ్లారు. నన్ను వాళ్ల ఇంట్లోనే ఉంచుకున్నారు. అక్కడ నాకు.. భాస్కర్‌కు చెందిన కార్లు కడిగి తుడిచే పని అప్పగించారు. తీవ్రమైన ఎండలో పని చేయడంతో నా చేతులకు బొబ్బలు వచ్చాయి. ఈ పని చేయలేనని, మరే పనైనా చెప్పమని ప్రాధేయపడ్డాను. దీంతో ఒక షేక్ ఇంటిలో పని చేయడానికి పంపించాడు. కోటలాంటి ఇంట్లో ఆకలి మంటలు ఆ షేక్ ఇల్లు చిన్న కోటలా ఉంది. ఆ ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దవారు కలిసి మొత్తం పది మంది ఉండేవారు. వారందరికి సేవ చేయడంతో పాటు ఇంటి పని చేసేదాన్ని. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పగలు, రాత్రి అనే తేడా లేకుండా పని చెబుతూనే ఉండేవారు. పని చేయలేకపోతుంటే కొట్టేవారు. కనీసం నేను తిన్నానా లేదా అని కూడా ఆలోచించేవారు కాదు. అరబ్బి భాష రాకపోవడంతోనే సైగలతోనే వారికి నా బాధను తెలిపాను. అయినా కనికరం చూపేవారు కాదు. తిని పారేసిన ఖర్బూజాను తిన్నాను పని భారంతో ఆకలి బాధ అంతా ఇంతా ఉండేది కాదు. కడుపు మాడుతున్నా షేక్‌లు చెప్పిన పని చేసేదాన్ని. ఆకలి అవుతుందని సైగ చేస్తే పాచి పోయిన రొట్టె ఇచ్చేవారు. కడుపు మంటను చల్లార్చుకోవడానికి తినడానికి ఇష్టం లేక పోయినా రొట్టెను తినడానికి కష్టపడ్డాను. చివరకు వారు తిని పడేసిన ఖర్బూజ ముక్కలను చెత్త బుట్ట నుంచి తీసుకుని తిని ఆకలి బాధ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాను. అలా మొదటి షేక్ ఇంట్లో పదిహేను రోజుల పాటు పని చేశాను. ఆ షేక్ ఇంట్లో చాకిరి చేస్తూ చావు దెబ్బలు తిన్న నేను ఆఫీస్‌కు పంపించాలని అడిగితే భాస్కర్ వద్దకు పంపించారు. నన్ను ఇంటికి పంపించి వేయాలని భాస్కర్‌ను అడిగితే అతని భార్య మణితో కొట్టించాడు. మరో షేక్ ఇంటికి పని కోసం పంపించాడు. రెండో షేక్ ఇంట్లో మరింత నరకం చూసాను. అక్కడ పదిహేను రోజుల పాటు పని చేసి ఆఫీస్‌కు పంపించాలని వేడుకుంటే మళ్లీ భాస్కర్ వద్దకే పంపించారు. ఇద్దరు షేక్‌ల ఇండ్లలో పని చేస్తే నయాపైసా వేతనం ఇవ్వలేదు. కొన్నవాడు చెబితే తెలిసింది! అరబ్బు షేక్‌ల ఇండ్లలో పని చేయలేనని, తనను ఎలాగైనా ఇంటికి పంపించాలని భాస్కర్‌ను కోరితే అప్పుడు చెప్పాడు.. నా భర్త నన్ను అతనికి అమ్మేశాడని. నన్ను అమ్మడం ఏమిటని ఫ్రీ వీసా ఉందంటేనే ఒమన్‌కు వచ్చానని చెప్పినా భాస్కర్ వినలేదు. నన్ను కొనడానికి సుదర్శన్‌కు డబ్బులు ఇచ్చానని భాస్కర్ చెప్పడంతో తట్టుకోలేక పోయాను. నాపై పెట్టిన పెట్టుబడి తనకు రాలేదని చెబుతూ భాస్కర్ అతని భార్య మణి కలిసి నన్ను చిత్రహింసల పాలు చేశారు. రెండే రెండు మాటలు ఈ విషయాలన్నీ ఇంటికి చేరవేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. భాస్కర్ ఇంటిలో నాతో పాటు మరికొందరు ఆడవాళ్లు బందీలుగా ఉన్నారు. వారికి నా వేదన చెప్పడంతో భాస్కర్, మణిలకు తెలియకుండా ఇంటికి ఫోన్ చేసుకునే ఏర్పాటు చేశారు. నా కొడుక్కు నేను ఫోన్ చేసి ‘ఒమన్‌లో బతకడం కష్టంగా ఉంది.. ఇంటికి రప్పించండి’ అని రెండే రెండు మాటలు చెప్పాను. దీంతో మా బంధువులు భాస్కర్‌కి ఫోన్ చేసి మాట్లాడితే రూ.70 వేలు చెల్లిస్తేనే నన్ను ఇంటికి పంపిస్తానని చెప్పాడు. భాస్కర్ చెప్పిన విధంగా పాలకొల్లులో ఉన్న భాస్కర్ వ్యాపార భాగస్వామి రాజు ఖాతాలో రూ.70వేలను మా వారు జమ చేశారు. అయినప్పటికి నన్ను భాస్కర్ ఇంటికి పంపించలేదు. అంతేకాదు, నేను ఇంటికి ఫోన్ చేశానని తెలుసుకుని చీకటి గదిలో బంధించాడు. ఎంతో కష్టం మీద మరోసారి ఇంటికి ఫోన్ చేసి నా బాధను Ðð ళ్లబోసుకున్నాను. దీంతో మా కుటుంబ సభ్యులు స్థానికంగా నా కోసం ప్రయత్నాలు చేయడంతో ఈ జూలై 26న ఇంటికి చేరుకున్నాను. గుజరాత్ వరకే టిక్కెట్ బుక్ చేశాడు నాపై కక్ష పెంచుకున్న భాస్కర్ ఇంటికి పంపించడానికి ఒమన్ నుంచి హైదరాబాద్‌కు కాకుండా గుజరాత్ వరకే టిక్కెట్ కొని ఇచ్చాడు. ఈ టిక్కెట్ కోసం మా ఇంటివారు భాస్కర్‌కు రూ.12వేలు పంపించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన నేను హైదరాబాద్‌కు రావడానికి విమానం మారాల్సి ఉంటుందని అనుకున్నాను. కానీ నాకు ఇచ్చిన టిక్కెట్ గుజరాత్ వరకే ఉండటంతో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు నన్ను బయటకు గెంటేశారు. నా అవస్థను జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన మహేష్ గుర్తించి ఎయిర్‌పోర్టు అధికారులతో మాట్లాడాడు. విమానం టిక్కెట్ ఇవ్వడంలో జరిగిన మోసాన్ని ఆయన గుర్తించి తన వద్ద ఉన్న సొమ్ముతో మరో టిక్కెట్‌ను హైదరాబాద్ వరకు కొనుగోలు చేసి ఇక్కడకు చేర్పించాడు. మహేష్ నాకు దేవుడిలా అహ్మదాబాద్‌లో కలిశాడు. అతను లేకుంటే నేను ఏమైపోయేదానినో ఊహిస్తేనే భయం వేస్తోంది. నేను రాగానే నా భర్త పరారయ్యాడు నేను ఇంటికి వస్తున్న విషయం తెలుసుకున్న నా భర్త సుదర్శన్ నేను రావడంతోనే పరార్ అయ్యాడు. ఒమన్‌లో నేను పడిన కష్టాలు అందరిని కలచివేసింది. కమ్మర్పల్లి పోలీసులకు నా భర్త మోసంపై ఫిర్యాదు చేశాం. ఇప్పుడింకా పరారీలో ఉన్నాడు. నా లాంటి కష్టం మరెవరికి రాకూడదు. నా అంత దురదృష్టవంతురాలు ఎవరు ఉండరేమో. నా పిల్లలను చూస్తానని అనుకోలేదు. నన్ను వంచించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. – ఎన్. చంద్రశేఖర్, సాక్షి, మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) -
‘మధ్యాహ్న భోజన’ కార్మికులకు వేతనాలు పెంచండి
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను టీఆర్ఎస్ ఎంపీలు, కార్మికులు కోరారు. ఈమేరకు ఎంపీలు కె.కవిత, బూర నర్సయ్యగౌడ్, బాల్కసుమన్, కార్మికులు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి విన్నవించారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర కార్మిక చట్టాలను మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వర్తింపజేసి ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కవిత మీడియాకు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి కనీస వేతనాలు అందేలా కృషి చేస్తామన్నారు. -
మిడ్డే మిల్స్ అలవెన్స్ పెంచాలని జవదేకర్‌ను కలిసిన కవిత
-
ఎడారి దేశంలో కుమిలిన ‘కమల’
కమ్మర్పల్లి (బాల్కొండ): ఉపాధి నిమిత్తం విదేశానికి వెళ్లి అష్టకష్టాల పాలైన ఓ మహిళా ఎంపీ చొరవతో స్వదేశానికి చేరుకుంది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన కమల, సుదర్శన్ దంపతులు. సుదర్శన్ తాగుడుకు బానిసవడం.. రోజురోజుకు కుటుంబ పోషణ భారమవడం.. ఈ క్రమంలో రూ.3 లక్షల దాకా అప్పులయ్యాయి. వీటిని తీర్చడానికి సుదర్శన్‌కు ప్రత్యామ్నాయ మార్గం కనిపించకపోవడంతో భార్యను ఉపాధి నిమిత్తం ఒమన్ దేశంలోని మస్కట్‌కు పంపించాడు. అక్కడ అరబ్‌షేక్ ఇంట్లో భాష సమస్య, 24 గంటల పనితో నరకయాతన అనుభవించింది. చేసిన పనులకు ఏదో వంకలు పెట్టి తీవ్రంగా హింసించేవారు. ఈ విషయాన్ని ఏజెంట్ రాజు, భర్త సుదర్శన్‌కు సమాచారం చేరవేసింది. పైసలు కావాలంటే బాగా కష్టపడాలని ఏజెంట్ ఉచిత సలహా ఇవ్వడంతో ఆమె షేక్ పెట్టిన కష్టాలను భరించి పని చేసింది. చివరకు వేధింపులకు తాళలేక తాను ఇక్కడ పని చేయనని కుటుంబ సభ్యులకు (భర్తకు కాదు) ఫోన్లో తెలిపింది. మస్కట్‌లో పడుతున్న కష్టాలను వివరించింది. ఇక్కడి నుంచి ఎలాగైన రప్పించాలని వేడుకుంది. కమల ఆవేదనను అర్థం చేసుకున్న సమీప బంధువులు స్పందించి అక్కడి, ఇక్కడి ఏజెంట్లతో మాట్లాడి రూ.70 వేలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. కానీ వారూ నమ్మించి మోసం చేశారు. దీంతో కమల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే.. కమల దీనస్థితిని ఆమె సమీప బంధువు వెంకటేశ్ ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన కవిత అక్కడి రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి కమలను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల క్రితం కమల స్వదేశం చేరుకుంది. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు భూమయ్య, లక్ష్మితో కలసి చౌట్పల్లిలోనే ఉంటోంది. కవితమ్మకు రుణపడి ఉంటా: కమల ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లిన తాను అక్కడి కష్టాలను తట్టుకొని మళ్లీ చౌట్పల్లి చూస్తాననుకోలేదు. అక్కడ పడిన కష్టం జన్మలో చూడలేదు. 6 గంటలే పని అని చెప్పి రోజంతా పని చేయించుకున్నారు. పని సరిగ్గా చేయకపోతే దెబ్బలు కొట్టారు. తినడానికి సరిగ్గా తిండి, తాగడానికి నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వలేదు. పని కారణంగా నీరసపడితే విశ్రాంతి తీసుకోనివ్వలేదు. ఆరోగ్యం బాగా లేకున్నా పని చేయించుకున్నారు. ఇక్కడే నా చావు రాసి పెట్టింది ఉం దనుకున్నా. అదృష్టం కొద్దీ ఎంపీ కవితమ్మ కృషితో ఇక్కడికి వచ్చాను. ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటా. -
అమ్మవారికి బంగారు బోనం తీసుకొచ్చిన ఎంపీ కవిత
-
హోదాపై టీఆర్ఎస్ వాదన చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో లోక్‌సభ వేదికగా టీఆర్ఎస్ ఎంపీ కవిత సమర్థిస్తే, మరో ఎంపీ వినోద్, మంత్రి హరీశ్‌రావులు వ్యతిరేకిస్తున్నారని, ఇందులో ఎవరిది టీఆర్ఎస్ అభిప్రాయమో చెప్పాలని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ముంపు గ్రామాల విలీనంపై రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన చర్చలో టీఆర్ఎస్ తరఫున కేసీఆర్, కేకేలు కూడా ఉన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ టీఆర్ఎస్ నేత లు మాట్లాడటం సమంజసం కాదన్నారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ ప్రధానిగా, కేసీఆర్ సీఎంగా వచ్చిన తర్వాతే ముంపు గ్రామాల విలీనం జరిగిందని గుర్తు చేశారు. హోదాపై కాంగ్రెస్ పార్టీ పూటకో మాట మార్చే పరిస్థితి ఉండదని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చేసిన ప్రత్యేక హోదా తీర్మానమే ఫైనల్ అని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విభజన బిల్లు పాస్ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ దోపిడీని ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. -
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కె.తారకరామారావు 42వ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించాయి. తెలంగాణభవన్‌లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, చీఫ్ విప్ పాతూరి సుధా కర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, రాములు నాయక్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, అటవీ అభి వృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి తది తరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్వీ నాయకు డు పల్లా ప్రవీణ్‌రెడ్డి నేతృత్వంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జీహెచ్ఎంసీ హరితహారానికి పిలుపునిచ్చింది. కేటీఆర్ జన్మరాశి ప్రకారం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మేయర్ రామ్మోహన్ బంజారాహిల్స్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కళాశాలలో 42 జిట్రేగు మొక్కలను నాటారు. జూబ్లీహిల్స్ స్టేట్ హోమ్‌లో టీఆర్ఎస్ సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు మొక్కలు నాటారు. వెల్లువెత్తిన అభిమానం..: మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజకీయ, అధికార, సినీ, పారిశ్రామిక తదితర రంగాల ప్రముఖులు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంతో పాటు ఏపీ, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని కేటీఆర్ అభిమానులు సైతం జన్మదిన శుభాకాం క్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిషన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, భారత్‌లోని ఇజ్రాయిల్ దౌత్య వేత్త డేనియల్ కార్మన్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఉమర్ అబ్దు ల్లా, గోవా ఐటీ మంత్రి రోహన్ ఖాంటే, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, పద్మారావు, లక్ష్మారెడ్డి, ఎంపీలు బాల్క సుమన్, బీబీ పాటిల్, విపక్ష నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మా అన్నయ్య సూపర్ హీరో: కవిత ‘హ్యాపీ బర్త్ డే అన్నయ్యా.. సూపర్ హీరోలుండరని ఎవరైనా అనుకుంటే, వారికి నీ గురించి తెలుసుకోమని చెబుతాను’అని కేటీఆర్ సోదరి, ఎంపీ కవిత ట్వీట్ చేశారు. అలాగే సినీనటులు మహేశ్‌బాబు, రామ్‌చరణ్, నాని, మంచు విష్ణు, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, బాలివుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ దర్శకులు వంశీ పైడిపల్లి, మెహెర్ రమేశ్, కోన వెంకట్, హరీశ్ శంకర్, గోపిచంద్ మలినేని సైతం ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు గోదావరిఖని: మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను వినూత్న తరహాలో నిర్వహించి వండర్ బుక్ఆఫ్ రికార్డులో టీఆర్ఎస్ రాష్ట్ర నేత కోరుకంటి చందర్ చోటు సాధించారు. కేటీఆర్ 42వ జన్మదినం సందర్భంగా గోదావరిఖని ఆర్కే గార్డెన్లో మంగళవారం 42 కిలోల కేక్‌తో 42 మంది కళాకారులు, 42 మంది తెలంగాణ ఉద్యమ కారులు, 42 మంది కేటీఆర్ వేషధారణ, 42 మహిళా సంఘాలు, 42 మొక్కలు నాటి, 42 నిమిషాలపాటు కార్యక్రమాన్ని నిర్వహించి వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించాడు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు నరేందర్‌గౌడ్, వేణుగోపాల్ కోరుకంటి చందర్‌కు రికార్డు పత్రాలను అందజేశారు. -
జ్వరంతో ప్రగతి భవన్‌లోనే కేటీఆర్!
సాక్షి, హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జ్వరం కారణంగా ప్రగతి భవన్‌కే పరిమితమైన కేటీఆర్‌కు నేతలు, కార్యకర్తలు, అభిమానులు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ట్వీట్ల ద్వారానే కేటీఆర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. పలుచోట్ల నేతలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తన అన్న రియల్ హీరో అంటూ ఎంపీ కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. గతంతో పోలిస్తే ఈసారి ఫ్లెక్సీలు కటౌట్లు ఎక్కడా కనిపించలేదు. ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయకూడదని మంత్రి కేటీఆర్ స్వయంగా ఆదేశించడంతో హైదరాబాదులో ఆ హడావిడి కనిపించలేదు. మంత్రులు, పార్టీ నేతలు వివిధ ప్రాంతాల్లో ఈ వేడుకలను నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా హరితహారం నిర్వహించి బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ సూచించిన నేపథ్యంలో నేతలంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు . కొందరు మంత్రులు మాత్రం నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రెండ్రోజులుగా జ్వరంగా ఉందని విషెస్ చెప్పడానికి ఎవరూ రావద్దని కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి హరీష్‌రావు చెప్పిన జన్మదిన శుభాకాంక్షలకు.. థాంక్యూ బావా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు ఇతర పార్టీల నేతలు, జాతీయ నేతలు కూడా కేటీఆర్‌కు ట్విటర్లోనే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు సినీ రంగ ప్రముఖులు కూడా ట్వటర్ వేదికగా కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. అన్న కేటీఆర్ గురించి ఎంపీ కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలు చెప్తూనే నిజజీవితంలో హీరోలు ఉండరని ఎవరైనా అంటే తాను ఒప్పుకోనని.. తన అన్నను చూపిస్తానని కవిత ట్వీట్ చేశారు. అభిమానులు చేసిన ట్వీట్లకు కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. -
వైఎస్సార్సీపీ నేతలకు ఎంపీ కవిత ప్రశంశలు
-
వైఎస్సార్సీపీ నేతలకు ఎంపీ కవిత ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశంసించారు. మంగళవారం కవిత సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు అనుకున్నట్లుగానే రాజీనామాలు చేసి, వాటిని ఆమోదించుకున్నారని పేర్కొన్నారు. టీడీపీ అవిశ్వాస తీర్మానంపై ఒక స్పష్టత లేదని, అది చర్చకు వస్తుందో లేదో కూడా తెలియడం లేదని అన్నారు. మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ప్రస్తుతం హడావిడి చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఈసారి పార్లమెంట్లో తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలపై పోరాటం చేస్తామని అన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై సభను అడ్డకునే ఉద్దేశంలో కాకుండా చర్చలో పాల్గొని వాటిని పరిష్కరించుకుంటామని తెలిపారు. అదేవింధంగా ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమేనని అన్నారు. డీ. శ్రీనివాస్ విషయంలో కేసీఆర్‌దే తుది నిర్ణయమని తెలిపారు. -
ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైంది
ఆర్మూర్: ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైంద ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని సాయి గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన టీఆర్ఎస్ బూత్ క మిటీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ కవిత, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి టి.ఉమతోపాటు ముఖ్య నాయకులంతా తెలంగాణ అమర వీరుల కు నివాళులర్పించారు. అనంతరం మంత్రి మా ట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లోపాలను ఎత్తి చూ పించడానికి బలమైన ప్రతిపక్షం ఉండాలని అభిప్రాయపడతారన్నారు. కానీ దేశాన్ని, రాష్ట్రాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతిని, పార్టీ ఫిరాయింపులను, చట్టాలకు తూట్లు పొడవడాన్ని నేర్పించిందని ఆరోపించారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజల్లో, రైతుల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేసిన ఏకైక పార్టీ దేశంలోనే టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే నని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులను రాజకీయ దురుద్దేశంతో అడ్డుకొనే కుట్రలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, బీజేపీతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీల నాయకులు తెలంగాణ రాష్ట్రంలో లాగ పథకాలను అమలు చేస్తామంటూ తెలంగాణ రాష్ట్రం పేరును ప్రస్తావించే స్థాయికి చేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇటీవల ఆర్మూర్‌కు వచ్చిన ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ఫరీదొద్దిన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాం లో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రూ.38కోట్లు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేయడాన్ని ప్రస్తావించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 48 వేల మంది కార్యకర్తలతోపాటు రాష్ట్రంలో 75 లక్షల మంది కార్యకర్తలు సభ్యత్వం తీసుకున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నామన్నారు. అనంతరం ఎంపీ కవిత ఆర్మూర్ పట్టణ, మండల బూత్ కమిటీ అధ్యక్షులనే పేరు పేరునా ప్రస్తావిస్తూ వారికి దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు మధుశేఖర్, రాజేశ్వర్, విఠల్‌రావు, ఎంపీపీ నర్సయ్య, జడ్పీటీసీ సభ్యుడు సాందన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, నాయకులు గంగాధర్, లింగారెడ్డి, భాస్కర్, గంగామోహన్ చక్రు పాల్గొన్నారు. -
‘ఆమె గెలిస్తే.. రాజకీయ సన్యాసమే’
సాక్షి, నిజామాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి 100 సీట్లు రావని, నిజామాబాద్ ఎంపీగా కవిత మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందన్నారు. సీఎం కేసీఆర్ సర్వేలు అంతా బూటకమంటూ మండిపడ్డారు. తనను, సంపత్‌కుమార్‌ను అన్యాయంగా ఎమ్మెల్యే సభ్యత్వాల నుంచి తొలగించే ప్రయత్నం చేశారని, అయితే చివరకు న్యాయమే గెలిచిందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మా ఇద్దరి శాసనసభ్యత్వాలు ఇంకా పునరుద్ధరించలేదని, హైకోర్టు ఉత్తర్వులను సైతం టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవించడం లేదని తెలిపారు. నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు పెరగడం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం దోపిడీకే ప్రాధాన్యం ఇస్తుందని, అందుకే అవినీతిలో తెలంగాణ అగ్రభాగాన ఉందని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడాలేని వింతగా కాళేశ్వరం ప్రాజెక్టును టీఆర్ఎస్ చూపిస్తోందని.. అయితే గతంలో తాము మొదలుపెట్టిన ప్రాజెక్టులు కడితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందన్న కారణంగా వాటిని పక్కన పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లు లేనిదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పని చేయడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీని అమ్మకాదు బొమ్మ అని మాట్లాడటం నిజంగా దురదృష్టకరం. వాళ్ల అమ్మను ఆ నేతలు అలాగే సంబోధిస్తారా. రైతు బంధు పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త నాటకం మొదలుపెట్టింది. అధికార భయంతో సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు. కేసీఆర్ చెబుతున్న సర్వేలు ఒట్టి బూటకం. శ్రీ చైతన్య కార్పొరేట్ గా లూటీ చేస్తోంది. అలాంటి యాజమాన్యాలను అడ్డుకుని కాలేజీల పర్మిషన్లు రద్దు చేయాలి. దీనిపై త్వరలోనే కోర్టులో కేసు వేస్తామని’ కోమటిరెడ్డి వెల్లడించారు. -
పోచారంను పరామర్శించిన ఎంపీ కవిత
హైదరాబాద్ : సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని నిజామాబాద్ ఎంపీ కవిత పరామర్శించారు. శనివారం ఆమె ఆస్పత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కొద్దిసేపు ఆయన కుటుంబ సభ్యులతో కవిత ముచ్చటించారు. -
కవితకు ఓటమి భయం: డి.అరవింద్
సాక్షి, హైదరాబాద్ : ఎంపీ కవితకు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్ విమర్శించారు. డి.శ్రీనివాస్ మీద కవిత, ఇతర టీఆర్ఎస్ నేతలు రాసిన లేఖలో రాజకీయ అపరిపక్వత కనిపిస్తోందన్నారు. భవిష్యత్ మీద వారి ఆందోళన చూసి జాలేస్తోందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలతో మాట్లాడారని లేఖలో వెల్లడించారని, వారి ఆరోపణలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. కొడుకు మీద కోపంతో తండ్రి మీద చర్యలు తీసుకోవడం విడ్డూరం, హాస్యాస్పదమన్నారు. డీఎస్ తనకు బీజేపీలో సాయం చేయడమేంటని.. తన పార్టీ వేరు.. ఆయన పార్టీ వేరని స్పష్టం చేశారు. డీఎస్, కవిత టీఆర్ఎస్లో ఉన్నారని.. అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయమన్నారు. ‘నా కోసం మా నాన్న (డీఎస్) ఒక్క ఫోన్ కాల్ కూడా చేసిన దాఖలాలు లేవు. నేను కవితలాగా తండ్రి చాటు బిడ్డను కాదు.. నేను బీజేపీలోకి సొంతంగా వచ్చాను. నా పార్టీని మీ రాజకీయాల్లోకి తీసుకువస్తే సహించను. నా రాజకీయ జీవితం అంతా బీజేపీలోనే’అని అరవింద్ స్పష్టం చేశారు. -
డీఎస్‌పై చర్య తీసుకోండి
సాక్షి, నిజామాబాద్, హైదరాబాద్ : మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌పై సొంత పార్టీకే చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఫిర్యాదు చేశారు. ఆయనపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముఖ్య ప్రజాప్రతినిధులు బుధవారం సీఎంకు లేఖ రాశారు. ‘‘మొదట్నుంచీ గ్రూపులు కట్టడం, పైరవీలు చేయడం, అక్రమార్జనకు పూర్తిగా అలవాటు పడిన డి.శ్రీనివాస్ టీఆర్ఎస్లో ఇమడలేకపోతున్నారు. అవినీతికి ఆస్కారం లేని మీ పరిపాలనలో తన స్వార్థ ప్రయోజనాలు నెరవేరకపోవడంతో కుట్రలకు తెరతీశారు. మెల్లగా తన నిజ స్వరూపాన్ని బయటపెడుతూ.. పార్టీ ద్రోహానికి తలపడుతున్నారు. కాంగ్రెస్ ఆయనకు కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వడానికి నిరాకరించింది. ఈ అవమాన బాధతో అలమటిస్తూ తనను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొమ్మని మిమ్మల్ని వేడుకున్నారు. దాదాపు ఆరు నెలల పాటు అభ్యర్థించడంతో మీరు దయ తలచి పార్టీలో చేర్చుకొన్నారు.. ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదా కల్పించారు. ఆయనకున్న అనుభవం రీత్యా జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రయోజనాలు నెరవేర్చడానికి ఉపయోగపడతారని భావించారు. తెలంగాణ రాష్ట్రానికి రాజ్యసభలో ఏడుగురు సభ్యులకు ప్రాతినిధ్యం పొందే అవకాశం ఉంటే అందులో ఒకటి డి.శ్రీనివాస్‌కు కేటాయించారు. మీరు విశాల దృష్టితో అత్యున్నత స్థానం కల్పించినా.. ఆయన మాత్రం వెనకటి గుణమేల మాను వినరా సుమతీ అన్న విధంగానే ప్రవర్తిస్తూ వస్తున్నారు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘డీఎస్ టీఆర్ఎస్లో కొనసాగుతూనే పచ్చి అవకాశవాదంతో తన కొడుకును బీజేపీలో ప్రవేశపెట్టారు. తన కొడుకు ఎదుగుదల కోసం టీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చడానికి ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలను ప్రేరేపిస్తున్నారు. కొడుకును ఆశీర్వదించవలసిందిగా కోరుతూ బీజేపీ పెద్దల దగ్గర మోకరిల్లుతున్నారు. తన కొడుకు జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను తీవ్ర పదజాలంతో దూషిస్తుంటే ఖండించకపోగా ఆయనే వత్తాసుగా నిలుస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడానికి ఢిల్లీ పెద్దలతో మంతనాలు ప్రారంభించారు’’అని ఆరోపించారు. ‘‘గతంలో డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ చేతిలో రెండుసార్లు ఓటమికి గురయ్యారు. మొత్తంగా మూడుసార్లు వరుసగా నిజామాబాద్ ప్రజల చేత తిరస్కరించబడిన నాయకుడు. ఆయన వల్ల టీఆర్ఎస్కు ఇసుమంత ప్రయోజనం కలగలేదు. ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకోకపోగా ద్రోహానికి పాల్పడుతున్న డి.శ్రీనివాస్ విషయంలో వేచిచూసే ధోరణిని ప్రదర్శించకుండా సత్వరమే ఆయనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాం ..’’అంటూ ఆ లేఖలో నిప్పులు చెరిగారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు: తుల ఉమ డీఎస్‌కు సీఎం సముచిత స్థానం ఇచ్చినా ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా వ్యవహారాల ఇన్చార్జి తుల ఉమ పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తుండటంతో ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తన కుమారునికి అండగా నిలవాలని కొన్ని కుల సంఘాల సమావేశంలో డీఎస్ పేర్కొన్నారన్నారు. మొన్న ఎమ్మెల్సీపై... నేడు ఎంపీపై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం నిజామాబాద్ జిల్లాలోనే రెండో ప్రజాప్రతినిధిపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు అందింది. నిజామాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీ ఆర్.భూపతిరెడ్డిపై పార్టీ నేతలు ఐదారు నెలల క్రితమే ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత నేతృత్వంలోనే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సమావేశమై భూపతిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు నియోజకవర్గంలో వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడంటూ భూపతిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. తాజాగా అదే జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు డీఎస్‌పై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారు: కవిత టీఆర్ఎస్లో ఉంటూ బీజేపీలో ఉన్న తన కుమారునికి అండగా ఉండాలని డీఎస్ చెబుతుండటంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ కవిత అన్నారు. అడుగడుగునా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. డీఎస్ వ్యవహార శైలితో ఇటు నాయకులు, కార్యకర్తలు మనస్తాపానికి గురవుతున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రతినిధులతో సమావేశం తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. ఫిర్యాదు అత్యుత్సాహం: డీఎస్ రాజకీయాల్లో క్రమశిక్షణ గురించి తనకు చెప్పాల్సిన అవసరం లేదని ఎంపీ డి.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తనపై లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందో.. విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చిందో వారే సమాధానం చెప్పాలని, అలా చేసిన వారిది అత్యుత్సాహం తప్ప ఇంకోటి కాదని అన్నారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన నివాసంలో డీఎస్ మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీకి అన్యాయం చేసే ప్రయత్నం తన జీవితంలో చేయలేదని చెప్పారు. తనకు.. పార్టీకి, సీఎంకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. ‘నేను వ్యక్తిగత పనులపై ఢిల్లీ వెళ్లా. నా నివాసానికి మరమ్మతుల గురించి వెళ్లా’అని వివరించారు. ఆజాద్‌ను కలిశారట కదా అని విలేకరులు ప్రశ్నించగా... ఢిల్లీ వెళ్తే కాంగ్రెస్ నాయకులు తప్ప ఎవరూ దొరకరని వ్యాఖ్యానించారు. అయితే తాను ఆజాద్‌ను కలిశానన్నది మాత్రం పచ్చి అబద్ధమని, అసలు టీఆర్ఎస్లో చేరిన తర్వాత రాజకీయ నాయకులను కలవడమే మానేశానని వివరించారు. తన కుమారుడి కోసం తానేదో చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. అలాంటి పనులు తానెప్పుడూ చేయనని చెప్పారు. ‘‘ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది. అందరి పిల్లలు తల్లిదండ్రుల కంట్రోల్లో ఉంటున్నారా? వాళ్ల కెరీర్ కూడా చూసుకుంటారు గదా.. చెప్పాల్సిందంతా చెప్పాం.. అయినా తను వినలేదు’’అని డీఎస్ వివరించారు. ఈ విషయాలన్నింటినీ తాను సీరియస్‌గా తీసుకోనని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది సరైంది అనుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. -
డీఎస్‌పై జిల్లా నేతల తిరుగుబాటు
-
టీఆర్ఎస్ ఆరోపణలపై డీఎస్ కామెంట్స్
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడంపై రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ స్పందించారు. తాజా పరిణామాలపై డీఎస్‌ను ప్రశ్నించిన మీడియాతో ఆయన ‘నో కామెంట్’ అని బదులిచ్చారు. జిల్లానేతలు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తనకు తెలియదని, ఆ విషయాన్ని వారినే అడగాలని చెప్పుకొచ్చారు. సీఎంకు ఫిర్యాదు చేసుకుంటే చేసుకోనివ్వండన్నారు. ‘నేతలు అన్నది ఫిర్యాదు మాత్రమే కదా.. నా గొంతు కోస్తామని చెప్పలేదు కదా’ అని డీఎస్ వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో తానిప్పుడే ఏం మాట్లాడలేనని తెలిపారు. కాగా, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల నిర్ణయంతో డీఎస్ తన కుమారుడు సంజయ్, ముఖ్య అనుచరులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్నఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కారణమిదేనా? టీఆర్ఎస్లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించిన డీఎస్ పార్టీ మారాలనుకున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇదివరకే ఓ కుమారుడు అరవింద్ బీజేపీలో చేరగా, మరో కుమారుడు సంజయ్‌కి పార్టీలో ప్రాధాన్యం ఉన్న పదవి ఇవ్వాలని పలుమార్లు పార్టీ అధిష్టానికి డీఎస్ సూచించిన విషయం తెలిసిందే. పార్టీలో తనకు, తన కుమారుడికి ప్రాధాన్యం లభించకపోవడంతో డీఎస్ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేస్తుకున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. కొద్ది రోజుల క్రితం మున్నూరు కాపు సమావేశంలో పాల్గొన్న డి. శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి స్థాయి కలిగిన నేత అయి ఉండి, టీఆర్ఎస్లో ఎందుకు చేరావని కుల సంఘం నేతలు నిలదీశారు. ‘డీఎస్‌ను మేం ఆహ్వానించలేదు.. గతిలేక మా పార్టీలో చేరారు’ అని కవిత వ్యాఖ్యానించారని కుల సంఘం నేతలు డీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాక టీఆర్ఎస్లో సరైన ప్రాధాన్యత లేదని నేతలు వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతోనే డీఎస్ పార్టీ మారే ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌తో డీఎస్ రహస్యంగా మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. సంబంధిత కథనం.. ఎంపీ కవితపై డీఎస్ కుమారుడి మండిపాటు! -
డీఎస్‌పై వేటుకు రంగం సిద్ధం!?
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ముసలం ఏర్పడింది. రాజ్యసభ సభ్యడు, సీనియర్ నేత డి.శ్రీనివాస్‌పై జిల్లా నేతతు తిరుగుబాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నేతలు భగ్గుమన్నారు. ఈ క్రమంలో నిజామాబాద్‌లో ఎంపీ కవిత నివాసంలో బుధవారం పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. డీఎస్ వ్యవహారశైలిపై చర్చించిన నేతలు ఆయనపై చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రికి సిఫార్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌కు లేఖ రాశారు. గత మూడు రోజులుగా డీఎస్ ఢిల్లీలో ఉన్నారని, అక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆయన మంతనాలు జరిపాలరని నేతలు ఆరోపించారు. ఈ భేటీకి బీబీ పాటిల్, ప్రశాంత్‌రెడ్డి, తుల ఉమ, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, జీవన్‌రెడ్డి, షకీల్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హనుమంతు షిండే హాజరయ్యారు. జిల్లా నేతల ఆగ్రహం సీనియర్ నాయకుడిగా డీఎస్‌కు గౌరవమిచ్చి పార్టీలో క్యాబినేట్ హోదా కల్పించారని, కానీ ఆయన మాత్రం మొదట నుంచి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని జిల్లా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరవీలు, అక్రమార్జనకు పాల్పడ్డారని ఆరోపించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడానికి ఢిల్లీ పెద్దలతో మంతనాలు ప్రారంభించారన్నారు. డీఎస్ వల్ల టీఆర్ఎస్కు ఎలాంటి ప్రయోజనం లేదని, ద్రోహానికి పాల్పడుతున్న ఆయనపై సత్వరమే క్షమశిక్షణా చర్యలు తీసుకోవాలని నేతలంతా కేసీఆర్‌ను కోరారు. వేటుకు రంగం సిద్దం డీఎస్ తీరుతో పార్టీ అధిష్టానం కూడా ఆయనపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా డీఎస్ పనితీరుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని, ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోనున్నారని సమాచారం. స్పందించని డీఎస్ వర్గం అయితే జిల్లాలో తాజా పరిణామాలపై డీఎస్ వర్గీయులు స్పందించడం లేదు. టీఆర్ఎస్ ముఖ్య నేతలు చేస్తున్న ఆరోపణలపై వారు నోరుమెదపడం లేదు. అధికార ప్రకటన వచ్చేంతవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయోద్దని డీఎస్ వర్గం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సంబంధిత కథనం ఎంపీ కవితపై డీఎస్ కుమారుడి మండిపాటు! -
రాజ్యసభ సభ్యుడు డీఎస్‌పై వేటుకు సిద్ధం
-
‘ఇద్దరు చంద్రులు ఎన్టీఆర్ శిష్యులే’
సాక్షి, హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇద్దరు చంద్రలు దివంగత నేత ఎన్టీఆర్ శిష్యులే అని హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ అన్నారు. కేన్సర్‌కు ఎవ్వరూ బయపడకండి.. అందరికి బసవతారం ఆస్పత్రి అండగా ఉంటుందని పేర్కొన్నారు. బసవతారం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ 18వ వారికోత్సవ వేడుకోలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంపీ కవిత, ఆసుపత్రి చైర్మన్, హీరో బాలకృష్ణ, హీరోయిన్ శ్రియ, డైరెక్టర్ బోయపాటి శ్రీనులు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు ఎంపీ కవిత, బాలయ్య బాబు పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అంతేకాక బసవతారకం హాస్పిటల్లో చికిత్స పొంది క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డ రోగులకు బాలకృష్ణ, కవితలు సన్మాసం చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. తాను ఏ పని చేయాలన్న నాన్నగారు ఆదర్శమన్నారు. ‘మా అమ్మ కేన్సర్ వ్యాధితో మరణించారు. ఆమె కోరిక మేరకు నాన్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించారు. 40 పడకలతో మొదలైన హాస్పిటల్ నేడు 500 పడకలకు ఎదిగింది. క్యాన్సర్ వ్యాధితో కంటే.. వాళ్లు భయంతోనే సగం మంది మరణిస్తున్నారు. కానీ, వైద్యులు చూపే ప్రేమకే సగం క్యాన్సర్ పోతోంది. బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎన్టీఆర్ ఒక విజన్‌తో ఆస్పత్రి స్థాపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రి ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. మహిళల కోసం హాస్పిటల్లో స్వీర్నింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. సమాజంలో క్యాన్సర్‌ని ఎదురించి గెలిచిన ప్రతి ఆడబిడ్డకు మా అమ్మ ఆశీర్వాదం ఉందని నేను అనుకుంటాను. కేన్సర్‌తో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని ఆయన అన్నారు. కేన్సర్‌ను ఎదుర్కొనడానికి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఎంపీ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. ‘బోధకాళ్ల వ్యాధులకు పెన్షన్స్, రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు ఏడున్నర లక్షలమంది క్యాన్సర్ బారిన పడటం బాధాకరం. కేన్సర్ కోసం హైదరాబాద్‌లో ఎంఎంజే ఆస్పత్రి మినహా జిల్లాలో అందుబాటులో లేవు. ప్రతి ఒక్కరు కేన్సర్‌పై పరీక్షలు చేయించుకోవాలి. కేన్సర్‌పై మెరుగైన వసతుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో అన్ని ట్రస్ట్ బోర్డులకు టాక్స్ మినహాయింపు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎన్టీఆర్ ప్రజల కోసం చిన్న ఆస్పత్రి ప్రారంభిస్తే.. బాలకృష్ణ దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. బాలకృష్ణ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా. బసవతారకం భవిష్యత్‌లో శాటిలైట్ సెంటర్స్ ప్రారంభిస్తే నిజామాబాద్‌కి రావాలని బాలకృష్ణను’ ఎంపీ కవిత కోరారు. బసవతారకం ఆస్పత్రి వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందని హీరోయిన్ శ్రియ అన్నారు. కేన్సర్ అనేది భయంకరమైన వ్యాధి. అంతేకాక ప్రతి ఒక్కరు ఆరోగ్యం గురించి రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎంతో మందికి ఈ ఆస్పత్రి పునర్జన్మ ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. భయంకరమైన వ్యాధిని ఎదుర్కొవాలంటే ఈ విధమైన ఆస్పత్రులు ఇంకా రావాలని నటి శ్రియ అన్నారు. బసతారకం ఆస్పత్రి గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే అని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. సంకల్ప బలం అద్భుతంగా ఉన్న ఒక శక్తి దివంగత నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయనకు ప్రజల పట్ల ఉన్న బాధ్యతనే ఈ బసవతారకం అని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను బాలకృష్ణ కాపాడుతున్నారని, ఆసియాలోనే నంబర్ వన్ ఆస్పత్రి బసవతారకమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. -
పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: పసుపుకు మద్దతు ధర ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని కోరారు. ‘పసుపు సాగు.. ఎగుమతులు’అనే అంశంపై సోమవారం వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రధానితో పాటు కేంద్ర వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల మంత్రులను కలిశానని, ఐదుగురు ముఖ్యమంత్రులు పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతుగా లేఖలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. రబ్బర్, సిల్క్‌కు బోర్డు ఏర్పాటు చేసిన విధంగానే పసుపుకూ ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఉడకబెట్టిన పసుపు ఎండబెట్టేందుకు యంత్రాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయో లేదో కేంద్రం అధ్యయనం చేయాలని కోరారు. మేలైన రకాల పసుపు విత్తనాలను అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరామన్నారు. అయితే బోర్డు ఏర్పాటు కుదరదని, ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారన్నారు. ఆ విధంగానే పసుపు సెల్ ఏర్పాటు చేశారని ఆమె వివరించారు. 1990లో 7 లక్షల మెట్రి క్ టన్నుల పసుపు ఉత్పత్తి కాగా నేడు 3 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు శాతమే పసుపు ఎగుమతి జరుగుతోందన్నారు. గతంలో ఎంపీలు పట్టించుకోలేదు: జీవన్‌రెడ్డి గతంలో ఎంపీలు పసుపు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కవిత ఎంపీ అయ్యాక పసుపు రైతుల గురించి అనేకసార్లు కేంద్రంతో చర్చలు జరిపారన్నారు. అనేక రాష్ట్రాలు తిరిగి పసుపుపై అధ్యయనం చేశారన్నారు. ప్రత్యేక పసుపు సెల్ ఏర్పాటుకు ఎంపీ కవితనే కారణమన్నారు. నిజామాబాద్ జిల్లా రైతాంగం ఎంపీ కవితకు రుణపడి ఉంటారన్నారు. ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ, ఎంపీ కవిత కృషి వల్ల పసుపుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారన్నారు. పసుపు బోర్డు కోసం అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశామని గుర్తు చేశారు. కాగా, ఈ వర్క్ షాప్‌లో రైతులు, ట్రేడర్లు, సైంటిస్టులు, అధికారులు ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. పలు అంశాలపై నిపుణులు సందేహ నివృత్తి చేస్తూ పసుపు ఉత్పాదకత పెంపు, సాగులో మెళకువలు, మార్కెట్ వ్యూహాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్పైసెస్ బోర్డు వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ లింగప్ప, కొచ్చి మార్కెటింగ్ డైరెక్టర్ పీఎం.సురేశ్‌కుమార్, పరిశోధన, అభివృద్ధి విభాగం డైరెక్టర్ డాక్టర్ ఏబీ రేమాశ్రీ తదితరులు పాల్గొన్నారు. కేంద్రానికి రైతుల డిమాండ్లు.. - పసుపు కుర్కుమిన్ నాణ్యతను పరీక్షించే విధానం వ్యవసాయ మార్కెట్లలో ఉండాలి. - ధర పడిపోయినప్పుడు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయాలి. - పసుపును ఆరబెట్టేందుకు సామూహిక కల్లాలను నిర్మించాలి. -
రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి భారీగా నిధులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రైల్వే శాఖ అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోందని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రాజధాని నగరం హైదరాబాద్‌తో అన్ని ప్రధాన ప్రాంతాలను అనుసంధానించేందుకు కొత్త రైల్వే మార్గాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.9,830 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. దక్షిణమధ్య రైల్వేలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ మంత్రి పద్మారావుగౌడ్, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎన్వీవీఎస్ ప్రభాకర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ రాంచందర్, దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ దక్షిణమధ్య రైల్వేలోని అన్ని చోట్ల 54 వేల ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. దీనివల్ల ఏటా రెండు మిలియన్ల విద్యుత్ ఆదా కావడమే కాకుండా ఏటా 1,800 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని చెప్పారు. అలాగే విద్యుత్‌పైన చేసే ఖర్చులో రూ.1.7 కోట్లు మిగులుతుందన్నారు. గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా 90 కోట్ల ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. దీంతో రూ.45 వేల కోట్ల విద్యుత్ బిల్లులు ఆదా అవుతున్నట్లు పేర్కొన్నారు. ఇంధన వనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకుప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు. కాచిగూడ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన 400 కిలోవాట్ల సోలార్ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ ప్లాంట్ వల్ల ఏటా మరో రూ.21.66 లక్షలు ఆదా అవుతుందన్నారు. పర్యావరణహితమైన బయో టాయిలెట్ల ఏర్పాటును ప్రశంసించారు. నాలుగో వంతెనకు శంకుస్థాపన ప్రతిరోజు సుమారు 1.8 లక్షల మంది ప్రయాణికులు, 200 రైళ్ల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి పదో నంబర్ ప్లాట్‌ఫామ్ వరకు ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు రూ.8.8 కోట్ల అంచనాలతో నిర్మించ తలపెట్టిన నాలుగో వంతెనకు మంత్రి పీయూష్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం మూడు వంతెనలు ఉన్నాయి. వీటిలో ఒకటి నిజాం కాలంలో సుమారు వందేళ్ల క్రితం కట్టించిన వంతెన. రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో వంతెన ఇరుకైపోవడం.. మిగతా రెండింటిపైనే ఎక్కువ ఒత్తిడి ఉండటంతో నాలుగో వంతెనను నిర్మించేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఈ వంతెన పూర్తయిన తరువాత పురాతన వంతెనను తొలగిస్తారు. కాచిగూడ–నిజామాబాద్ రైలు కరీంనగర్‌కు పొడిగింపు కరీంనగర్ వరకు పొడిగించిన కాచిగూడ–నిజామాబాద్ రైలును కూడా పీయూష్ గోయల్ జెండా ఊపి ప్రారంభించారు. చర్లపల్లి స్టేషన్ వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే టెర్మినల్ పనులను త్వరలో ప్రారంభించాలని దక్షిణమధ్య రైల్వే అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ స్టేషన్లో మల్టీలెవల్ కారు పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ప్లాటినం గ్రీన్ రేటింగ్ అవార్డు లభించడం పట్ల అభినందనలు తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో ఏర్పాటు చేసిన అదనపు లిఫ్టులు, ఎస్కలేటర్లను ప్రారంభించారు. కొత్త గనులకు వేగంగా అనుమతులు: పీయూష్ రాష్ట్రంలో కొత్త గనులకు సత్వరమే అనుమతులు ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సింగరేణి నూతన ప్రాజెక్ట్‌లు, వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం సింగరేణి భవన్లో ఆయన సమీక్ష నిర్వహించారు. సింగరేణి సంస్థ అభివృద్ధిపై సీఎండీ శ్రీధర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు స్పందిస్తూ జాతీయ స్థాయిలో ఆ సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. వ్యాపార విస్తరణలో భాగంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల్లో కొత్త బ్లాకులు కేటాయించవల్సిందిగా చైర్మన్ కోరగా పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి: కవిత 60 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర మంత్రిని కోరారు. రైల్వే లో దివ్యాంగుల కోటాను 3 శాతం నుంచి 4 శాతానికి పెంచిన నేపథ్యంలో ఈ సంవత్సరం నుంచే దాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోటా పెంపు వల్ల దివ్యాంగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. ఏ గ్రేడ్ రైల్వేస్టేషన్ అయిన నిజామాబాద్ స్టేషన్లో ప్రయాణికుల సదుపాయాలను పెంచాలని కోరారు. ఎంఎంటీఎస్ రెండో దశను సకాలంలో పూర్తి చేయాలని ఎంపీ బండారు దత్తాత్రేయ కోరారు. దీనికయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. -
‘లోకమాన్య’ను పొడిగించండి
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ –ముంబై మధ్య నడుస్తున్న లోక మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలును కరీంనగర్ వరకు పొడిగించాలని నిజామాబాద్ ఎంపీ కవిత దక్షిణæ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కరీంనగర్ వరకు రైలును పొడిగించడం వల్ల కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల ప్రజలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ముంబై వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కరీంనగర్ రైల్వేస్టేషన్లో అదనంగా ఫ్లాట్‌ఫారాలను నిర్మించాలని ఎంపీ కోరారు. -
మత్స్యకారులకు ద్విచక్రవాహనాల పంపిణీ
నిజామాబాద్ : జిల్లాలోని న్యూ అంబేద్కర్ భవన్లో మత్స్యకారులకు నిజామాబాద్ ఎంపీ కవిత ద్విచక్రవాహనాలను అందజేశారు. మరో కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమ్మద్ అలీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళశాలలో హాస్టల్ భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. బీహెచ్ఈఎల్ సహాకారంతో 3 కోట్ల నిధులతో ప్రభుత్వం హాస్టల్‌ను నిర్మించనుంది. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణలో ముస్లింలకు 800 ఇఫ్తార్ పార్టీలు ఏర్పాటు చేసిందని, టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే మైనార్టీల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే బిగాల గణేష్, మేయర్ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 18 నుంచి పసుపు వర్క్‌షాప్
సాక్షి, హైదరాబాద్: పసుపు రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, స్పైసెస్ బోర్డ్ సంయుక్తంగా జూన్ 18 నుంచి హైదరాబాద్‌లో వర్క్ షాప్‌ను నిర్వహించనున్నాయి. ఈ మేరకు బుధవారం స్పైస్ బోర్డ్ ప్రతినిధులు ఎంపీ కవితను కలిసి పసుపు పంట సాగులో మెళకువలు, పంట నిల్వ, మార్కెటింగ్ సౌకర్యాలు సహా ఇతర దేశాలకు ఎగుమతి వంటి అంశాలపై చర్చించారు. అదేవిధంగా బాల్కొండ నియోజక వర్గంలోని వేల్పూరు పడగల్లో ఏర్పాటు అవుతున్న స్పైస్ పార్క్‌లో ప్రత్యేక టర్మరిక్ సెల్ , పార్కులో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. వర్క్‌షాప్‌లో పసుపు పండించే రైతులు, పసుపు ఎగుమతి దారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, ఫిక్కీ ప్రతినిధులు పాల్గొంటారు. నిజామాబాద్, మహబూ బాబాద్, కేసముద్రం, మహారాష్ట్రలోని సంగ్లీ, తమిళనాడులోని ఈరోడ్, సేలం, కేరళలోని అలెప్పీ మార్కెట్ చైర్మన్లను సమావేశానికి ఆహ్వానిస్తారు. ప్రత్యేక టర్మరిక్ సెల్ ఏర్పాటు ద్వారా పసుపు రైతులకు నాణ్యమైన పసుపు వంగడాలు, ప్రాసెసింగ్‌కు అవసరమైన బాయిలర్ పరికరాలు సమకూరుతాయి. రైతులకు కావాల్సిన సలహాలు శాస్త్రవేత్తలు అందిస్తారు. -
ఎంపీ కవిత రైతుబంధు చెక్కు సరెండర్
ముస్తాబాద్(సిరిసిల్ల): నిజామాబాద్ ఎంపీ కవిత రైతుబంధు పథకం ద్వారా వచ్చిన పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వానికే అప్పగించారు. తెర్లుమద్దిలో ఎంపీ కవిత పేరిట 9.14 ఎకరాలు ఉంది. రైతుబంధు ద్వారా ఆమె కుటుంబానికి చెక్కు, పట్టాదారుపాసు పుస్తకాన్ని వీఆర్వో హరికిశోర్ అందించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఎంపీ కవిత భర్త అనిల్ తెర్లుమద్దిలో వచ్చిన రూ.37,400 విలువైన చెక్కును టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వెన్నమనేని శ్రీనివాస్‌రావు ద్వారా వీఆర్వో హరికిశోర్‌కు సోమవారం అందించారు. -
గీత కార్మికుల అభివృద్ధికి కృషి : ఎంపీ కవిత
సాక్షి, నిజామాబాద్ అర్బన్ : గీత కార్మికుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీ కవిత అన్నారు. ఆదివారం వినాయక్‌నగర్‌లో విజయలక్ష్మిగార్డెన్లో గీత కార్మికులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గౌడ కులస్తుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టిసారించారని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో కల్లు దుకాణాలను తెరిపించుకుందామని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రకటించారన్నారు. తెలంగాణ ఏర్పడగానే 767 జీవోను రద్దు చేశారని ఎంపీ పేర్కొన్నారు. ఇది సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రమాదవశాత్తు గీత కార్మికుడు చనిపోతే ఇచ్చే ఎక్స్‌గ్రేషియా రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచారని, అంతేకాకుండా 2014 నాటికి రూ.9కోట్ల ఎక్స్‌గ్రేషియా బకాయిలు కూడా చెల్లించామన్నారు. గౌడ సొసైటీల ఐదేళ్ల రెన్యూవల్‌ను 10 ఏళ్లకు పెంచడం జరిగిందన్నారు. ఈ నిర్ణయం వల్ల ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 35 లక్షల మేర గీత కార్మికులకు ప్రయోజనం చేకూరిందన్నారు. హైదరాబాద్‌లో ఐదు ఎకరాల్లో గౌడ భవనం నిర్మానానికి సీఎం కేసీఆర్ రూ.5 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందేనన్నారు. గ్రామాల్లో మూడేళ్లలో 5 కోట్ల ఈతచెట్లను నాటారన్నారు. గీతవనాల దగ్గర మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు బోర్లు, డ్రిఫ్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించారని, గౌడ కులస్తులు కోరారని ఎంపీ నిధుల కింద కేటాయిస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్‌లోని రేణుక ఎల్లమ్మ ఆలయానికి రూ.75 లక్షలు, రెండవ గౌడ సంఘం భవనంకు రూ.25 లక్షలు, గౌడ సంఘం కళ్యాణ మండప నిణ్మానికి రూ.కోటి50లక్షల ఎంపీ కవిత మంజూరు చేశారు. టీఆర్ఎస్లో చేరిన గౌడ కులస్తులు ఎంపీ సమక్షంలో గౌడ కులస్తులు టీఆర్ఎస్లో చే రారు. నిజామాబాద్ పట్టణ గౌడ సంఘం అధ్యక్షు డు జగన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయ ణగౌడ్, ఉపాధ్యక్షులు రమేశ్‌గౌడ్, గోవర్ధన్గౌడ్లు టీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్ పట్టణంలోని 24 తర్పాలు, సంఘాల కార్యవర్గలు, సభ్యులు మొత్తం టీఆర్ఎస్లో చేరారు. ఆమెకు బోనాలతో స్వాగతం పలికారు. ఎంపీ బోనం ఎత్తకుని నడిచా రు. మదర్స్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వి.జి.గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, నగర మేయర్ ఆకుల సుజాత, ఎస్ఎస్ఆర్ కళాశాల అధినేత మారయ్యగౌడ్, లక్ష్మన్‌గౌడ్, టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్‌గౌడ్, కార్పొరేటర్లు సూదం లక్ష్మి పాల్గొన్నారు. రూ.4 వేల కోట్లతో మత్స్యపరిశ్రమ అభివృద్ధి నిజామాబాద్ నాగారం: రాష్ట్రంలో రూ.4వేల కోట్ల మత్స్యపరిశ్రమ అభివృద్ధికి పనిచేస్తున్నామని ఎంపీ కవిత అన్నారు. ఆదివారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవనంలో గంగపుత్రుల నగర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాల్గొని మాట్లాడారు. గంగపుత్రుల అభివృద్ధికి ప్రభుత్వం వెన్నంటే ఉంందన్నారు. ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల అభివృద్ధి చేపట్టడం జరుగుతుందన్నారు. ఉచితంగా చేపపిల్లలను అందించడం జరిగిందని ఇది గంగపుత్రులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. చేపపిల్లల ఉçత్పత్తి కేంద్రాలు జిల్లాలో ఉన్నాయని రాష్ట్రానికే జిల్లా ఆదర్శంగా ఉందన్నారు. అంతేకాక గంగపుత్రులకు చేపలు విక్రయించేందుకు మార్కెట్లు ఏర్పాటు చేస్తామని, రూ.30, రూ.40లక్షల వరకు కేటాయించి భవనాలు నిర్మిస్తామన్నారు. చేపలు విక్రయించేందుకు ఐయిస్బాక్సులతో కూడిన వాహనాలు అందిస్తామన్నారు. మహిళ మత్స్యకార సొసైటీల్లో మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న పన్నులు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. ప్రమాద బీమాను త్వరగా అందించేవిధంగా చూస్తామన్నారు. జీవో నం.98ని ప్రక్షాళన చేసి జీవో నం.6ను రద్దు చేస్తు జీవో నం.74ను అ మలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. మహారాష్ట్ర లోని నిజామాబాద్ జిల్లాలో గంగపుత్రులు అత్యధికంగా జనాభా ఉందన్నారు. గురుకులాల్లో, క ళాశాలల్లో చేపలు పోషకారహారంగా అందించేం దుకు కృషి చేస్తామన్నారు. వరంగల్‌లో ఉన్న మ త్స్యశాఖ శిక్షణ కేంద్రం మాదిరిగానే నిజామాబాద్‌లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, మేయర్ ఆకుల సుజాత, గంగపుత్ర సం ఘం జి ల్లా ప్రతినిధులు మాడవేటి వినోద్‌కుమార్, నగర అధ్యక్షుడు అన్నయ్య, ప్రధానకార్యదర్శి రవి పాల్గొన్నారు. -
‘రైతు గురించి ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్’
సాక్షి, నిజామాబాద్: రైతుల గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరులో రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, తదితరులు చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. దేశంలో ప్రతి రైతుకు బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. ప్రతి ఎకరానికి నీరందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 17 వేల కోట్లు రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. గుత్తా సుఖేందర్ మాట్లాడుతూ.. దేశంలోనే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని వ్యాఖ్యానించారు. ఈ పథకాలు ఎన్నికల కోసమేనంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులు పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచాలనే ఉద్దేశ్యంతోనే రైతు బంధు పథకం పెట్టామని, ఖరీఫ్‌లో కూడా రైతులకు ఎకరానికి నాలుగు వేలు అందిస్తామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. -
రైతుల బంధువు కేసీఆర్
జగిత్యాలరూరల్/సారంగాపూర్/రాయికల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే ఎక్కడా లేని, ఎవరూ కనీసం ఆలోచించని గొప్ప పథకం రైతుబంధును సీఎం కేసీఆర్ ప్రారంభించారని పేర్కొన్నారు. రైతుల బంధువుగా, అన్నదాత మోములో ఆనందం చూడాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతిష్టాత్మక రైతుబంధు పథకాన్ని జగిత్యాల మండలం గుల్లపేట, సారంగాపూర్ మండలం నాగునూర్, లచ్చక్కపేట, బీర్పూర్ మండలంలోని మంగేళ, రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్‌లో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. రైతులకు పెట్టుబడి చెక్కులు, కొత్త పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎంపీ మాట్లాడారు. రైతుబిడ్డ సీఎం కేసీఆర్ అని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎకరానికి పంటకు రూ.4 వేలు ఆర్థిక సహాయం రైతులకు అందించి పెద్ద కొడుకులా నిలిచారని అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా, తెలంగాణ మాగాణాను సస్యశ్యామలం చేయలని, లక్ష ఎకరాలను సాగులోకి తేవాలని కేసీఆర్ నిరంతంరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే రూ.25 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మస్తున్నారని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నారని, పంటలు సాగుచేసేందుకు రైతులు అప్పులు చేయకుండా ఉండేందుకు పెట్టుబడి సాయం కూడా అందిస్తున్నారని చెప్పారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం ఈ పథకం ప్రవేశపెట్టలేదన్నారు. రైతు సంతోషంగా ఉండి పది మందికి పనికల్పించి వారికి అన్నం పెట్టే రోజు రావాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. రైతులు పండించిన పంటలకు రైతులే ధర నిర్ణయించాలని కేసీఆర్ రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశారని తెలిపారు. బీడీ కార్మికులకు పింఛన్లు, గొ ర్రెల పథకం, గంగపుత్రులకు చేపల పంపిణీ పథకాలు కూడా తెలంగాణలోనే ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు అందించాలన్న లక్ష్యంతో మిషన్ భగీరథ పథకం చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తరువాత 18 లక్షల మెట్రిక్‌టన్నుల గోదాముల నిర్మాణం జరిగిందన్నారు. సోషలిస్ట్ ఎజెండా, టీఆర్ఎస్ పార్టీ ఎజెండా ఒక్కటేనని ఆమె మంగేళ గ్రామంలో జరిగిన సభలో పునరుద్ఘాటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తామని స్పస్టం చేశారు. ఒడ్డెలింగాపూర్ గ్రామంలో గౌడ సంఘం, వడ్డెర సంఘం, అంబేద్కర్ సంఘ భవనానికి ప్రహరీ, మహిళ సంఘ భవనానికి రూ.5 లక్షల చొప్పున, లోక్‌నాయక్, మాంక్త్యానాయక్ తండాకు రోడ్డు సౌకర్యం నిధులు మంజూరు చేస్తామన్నారు. రాయికల్‌లో డిగ్రీ కళాశాలలో లెక్చరర్ల భర్తీ కోసం డెప్యూటీ సీఎంతో మాట్లాడి యుద్ధప్రతిపాదికన కాంట్రాక్ట్ లెక్చరర్లను తెస్తామని, జూన్‌లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తరగతులు నిర్వహిస్తామన్నారు. కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో రైతుబంధు పథకం కోసం వంద బృందాలను ఏర్పాటు చేశామన్నారు. రెండు లక్షల మంది రైతులకు రూ.167 కోట్ల చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 17 వరకు ఉదయం 7 గంటల నుంచి పంపిణీ ప్రారంభిస్తామన్నారు. అటవీ భూములకు కూడా జిల్లాలో రూ.3 కోట్ల పెట్టుబడి అందించడం జరుగుతుందన్నారు. అనంతరం జగిత్యాల మండలానికి రూ.10.30 కోట్ల చెక్కులను రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్లకు అందజేశారు. కార్యక్రమాల్లో ఆర్డీవో నరేందర్, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మీ, తహసీల్దార్లు వెంకటేశ్, వసంత, రాజేందర్, ఎంపీడీవో పుల్లయ్య, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వినర్ చీటి వెంకట్రావు, జగిత్యాల మార్కెట్ చైర్పర్సన్ శీలం ప్రియాంక, రాయికల్ మార్కెట్ కమిటీ చైర్మ న్ ఎనగందుల ఉదయశ్రీ, ఎంపీపీలు కొల్ముల శారద, పడాల పూర్ణిమ, సర్పంచులు ముదిగొండ శేఖర్, అమృత, ఎంపీటీసీలు లక్ష్మి, గంగధర విజయ, విండో చైర్మన్ ముప్పాల రాంచందర్‌రావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎంపీకి ఘన స్వాగతం.. జగిత్యాల మండలం గుల్లపేట గ్రామంలో ఎంపీ కవితకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో రాగా రైతులు ఎడ్లబండ్లతో వచ్చి ఎంపీ కవితను ఎడ్లబండిపై ఎక్కించుకుని సభా వేదిక వద్దకు తీసుకెళ్లారు. వేదికపై గీత కార్మికులు తాటిముంజలు అందజేయగా, రైతులు పండించిన ఎల్లిగడ్డలు, మామిడి కాయలతో దండచేసి అందజేశారు. వేదిక ఎక్కని జెడ్పీటీసీ.. జగిత్యాల మండలం గుల్లపేట గ్రామంలో చేపట్టిన రైతుబంధు పథకంలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరు కాగా సభ వేదిక వద్ద జెడ్పీటీసీ తమకు అధికారులు సమాచారం అందించలేదని, వేదిక ఎక్కకుండా జనంలోనే కూర్చున్నారు. కలెక్టర్ శరత్ జెడ్పీటీసీని స్టేజీపైకి రావాలని పిలిచినా వెళ్లలేదు. ఏడీఏ రాజేశ్వర్ జెడ్పీటీసీకి క్షమాపణ చెప్పినా ఆమె వేదికపైకి వెళ్లలేదు. అధికార పార్టీకి చెందిన జెడ్పీటీసీ వేదికపైకి వెళ్లకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. -
బోధన్ ఆస్పత్రికి ‘జిల్లా’ హోదా!
బోధన్ టౌన్(బోధన్) నిజామాబాద్: బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి జిల్లా ఆస్పత్రి హోదా లభించింది. బోధన్ వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. ఎంపీ కవిత, ఎమ్మెల్యే షకీల్ చొరవతో బోధన్ ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు ప్రభుత్వ వైద్యం చేరువ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం రాష్ట్రంలోని 25 ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే బోధన్‌కు ‘జిల్లా ఆస్పత్రి’ హోదా లభించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 100 పడకల సంఖ్య 250కి పెరగనుంది. నెరవేరిన కల ఉమ్మడి జిల్లాలో జిల్లా కేంద్రానికి మెడిక ల్ కళాశాల మంజూరు కాగా, బోధన్ ఏ రియా ఆస్పత్రిని జిల్లా ఆస్పతిగా మా ర్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. పదెకరాల సువిశాల స్థలం లో కొత్త భవనంతో పాటు మౌలిక వస తులు కల్పించాలని, ప్రస్తుతం ఉన్న పాత భవనాన్ని నర్సింగ్ స్కూల్‌కు కేటాయించాలని ప్రతిపాదించారు. బోధన్ ఆస్పత్రికి జిల్లా ఆస్పత్రి హోదా వస్తుంద ని నియోజకవర్గ ప్రజలతో పాటు డివిజ న్ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశారు. కానీ, ఏళ్ల తరబడి వారి కల నేరవేరలేదు. ఎంపీ కవిత చొరవతో తాజాగా ప్రభుత్వం జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్వ డివిజన్ పరిధిలో బోధన్ నియోజకవర్గంతో పాటు ప్రస్తుత కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మండలా గ్రామీణ ప్రజలు వైద్య సేవలు అందించిన చరిత్ర ఏరియా ఆస్పత్రికి ఉంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా బోధన్ డివిజన్ 12 మండలాల నుంచి 7 మండలాలకు పరిమితమైంది. ప్రస్తుతం డివిజన్ పరిధిలో బోధన్ టౌన్, రూరల్, ఎడపల్లి, రెంజ ల్, బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి, రుద్రూర్, వర్ని మం డలాల ప్రజలకు ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతున్నాయి. తాజా గా ప్రభుత్వం ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయడంతో ప్రజల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.రోగుల తరలింపునకు చెక్ బోధన్ ఏరియా ఆస్పత్రిలో రోజూ 500 మంది ఔట్ పేషెంట్స్, 100 మంది ఇన్పేషెంట్లుగా చికిత్స పొందు తుంటారు. బోధన్ పట్టణంతో పాటు బోధన్ రూరల్, ఎడపల్లి, రెంజల్, కోటగిరి, వర్నితో పాటు నవీపేట్, బీర్కూర్ మండలాలకు చెందిన ప్రజలు ఇక్కడ వైద్య సేవలు అందుకుంటున్నారు. ఏటా సుమారు నాలుగైదు లక్షల మంది ఇక్కడ చికిత్సలు పొందుతున్నారు. రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్య చికిత్సలు అందించాల్సిన వచ్చినప్పుడు ప్రథమ చికిత్సలు నిర్వహించి, రోగులను జిల్లా ఆస్పత్రికి మేరుగైన వైద్య సేవల నిమిత్తం తరలించాల్సిన పరిస్థితి ఉండేది. రోగులకు అత్యవసర చికిత్సలు అందించాలనే ప్రభుత్వ ఆలోచనలో భాగంగా ఇటీవల ఆస్పత్రిలోని ప్రసూతి వార్డును అధునాతనంగా తీర్చి దిద్దారు. దీంతో పాటు అత్యవసర చికిత్సలు అందించే సమయంలో రోగికి అవసరమైన రక్తం అందుబాటులో ఉండేందుకు ఇటీవల రక్త నిధి కేంద్రం పనులు ప్రారంభించారు. కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయడంతో ప్రస్తుతం ఉన్న వంద పడకలకు తోడు మరో 150 పడకలు అందుబాటులోకి రానున్నాయి. -
టీఆర్ఎస్ మలేషియా శాఖ ఆవిర్భావం
కౌలాంలపూర్ : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో ఎంపీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర సమితి మలేషియా శాఖ ఏర్పాటు అయింది. ప్రస్తుతానికి పది మందితో అడ్‌హక్ పార్టీ కమిటీని ఏర్పాటు చేశారు. త్వరలోనే పూర్తిస్థాయి పార్టీ కమిటీని ఏర్పాటు చేస్తామని మహేష్ బిగల తెలిపారు. ఈ శాఖ ఆవిర్భావ ఏర్పాటుకు ఆకుల శ్యామ్ బాబు (డెన్మార్క్) ఎంతగానో కృషి చేశారని మహేష్ బిగాల తెలిపారు. ప్రస్తుతానికి చిట్టి బాబు చిరుత, కుర్మ మారుతి, గుండ వెంకటేశ్వర్లు, బొడ్డు తిరుపతి, గౌరు రమేష్, బోయిని శ్రీనివాస్, తిప్పర్తి అరుణ్ కుమార్, సుంకపెల్లి సుమన్‌లతో కూడిన తాత్కాలిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. -
హామీల అమలులో విఫలం
సాక్షి, కొత్తగూడెం: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం నడుస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ సర్కార్‌కు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాచైతన్య బస్సుయాత్ర సోమవారం భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు చేరుకుంది. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉత్తమ్ మాట్లా డుతూ కేసీఆర్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రజాకంటక పాలనను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌కు అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు భూ పంపిణీ, ఏకకాలంలో రుణమాఫీ తదితర సంక్షేమ పథకాల అమ లులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఉద్యమం లో పోరాడిన నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగా లు ఖాళీగా ఉండగా, 20 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. గిరిజనుల ఆత్మగౌరవం నిలిపేం దుకు కాంగ్రెస్ హయాంలో పోడు భూములకు అటవీహక్కుల చట్టం కింద పట్టాలివ్వగా, నేటి ప్రభుత్వం హరితహారం పేరుతో లాక్కుంటోందని మండిపడ్డారు. రైతులకు మద్దతు ధర విషయంలో ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి జీవో ఇచ్చి.. మరోవైపు ఎంపీ కవిత ఆధ్వర్యంలోని జాగృతి వ్యక్తి ద్వారా కోర్టులో కేసు వేయించారని విమర్శించారు. గిరిజన, మైనార్టీ, బీసీల రిజర్వేషన్ల విషయంలోనూ మోసం చేశారన్నారు. సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి కేవలం మిషన్ భగీరథ, కాకతీయ, ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు తో వేల కోట్లు ఇచ్చి కాంట్రాక్టర్లకు మేలు చేయడంతో పాటు కేసీఆర్ కుటుంబం కమీషన్లు దండుకుంటోం దని ఆరోపించారు. ఈ డబ్బుతోనే ఇతర పార్టీల నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులను కొంటున్నారన్నా రు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే అన్నివర్గాల ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ప్రజలు టీఆర్ఎస్ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సభలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, వీహెచ్, షబ్బీర్‌అలీ, రేవంత్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బలరాంనాయక్, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, రేణుకాచౌదరి, సంభాని చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీలో ధర్నా చేయండి
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటుకు రైతులతో కలసి ఢిల్లీలో ధర్నా చేయాలని యోగా గురువు బాబా రాందేవ్ సూచించారు. మంగళవారం ఎంపీ కవిత కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పసుపు బోర్డు ఏర్పాటుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుం దని చెప్పారు. తెలంగాణ ఉద్యమ తరహాలో నిరసనలు చేస్తే కేంద్రం దిగి వస్తుందన్నారు. ఇదివరకే ఎంపీ కవిత ప్రధాన మంత్రికి , కేంద్ర మంత్రులను కలసి వినతులు సమర్పించారని అయినా కేంద్రం స్పందించడం లేదన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు తనవంతు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ యోగా ప్రస్తుత జీవనశైలికి ఎంతో ఉపయోగకరమన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. బాబా రాందేవ్ 3 రోజుల పాటు జిల్లాలో ఉచిత యోగా శిక్షణ ఇవ్వడం గర్వకారణమన్నారు. -
కాంగ్రెస్‌లో ఎప్పుడూ కుర్చీల కొట్లాటే
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ‘అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. కాంగ్రెస్‌లో కుర్చీల కొట్లాటలే తప్ప ఆ పార్టీకి ప్రజల సంక్షేమం పట్టదు’ అని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆ పార్టీ నేతలు చేపట్టిన బస్సు యాత్ర ఓ విహార యాత్ర అని ఎద్దేవా చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ, రాష్ట్ర గవర్నర్, కేంద్ర జలసంఘం చైర్మన్ వంటి వారితో పాటు దేశమంతా కాళేశ్వరం ప్రాజెక్టును మెచ్చుకుంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం నొచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కొత్తగా ఐదు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తే.. తమ మూడున్నరేళ్ల పాలనలో 20 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తొలి ఫలితం నిజామాబాద్ జిల్లాకే దక్కుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. పెట్టుబడి ఇస్తామంటే మింగుడుపడటంలేదు?: ఎంపీ కవిత దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తుంటే కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడటం లేదని నిజామాబాద్ ఎంపీ కవిత విమర్శించారు. రైతులకు సాగునీరు కూడా అందితే తమకు మనుగడ ఉండదని కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలంటూ మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి రైతులను రెచ్చగొడుతున్నారని కవిత ఆరోపించారు. నిజాంషుగర్స్ కార్మికులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
ఇంత మొండితనమా?
సాక్షి, న్యూఢిల్లీ: జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే అధికారం తెలంగాణకు ఇవ్వాలని ఇన్నిరోజులుగా అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని టీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. కేంద్రానికి అర్థమైతలేదా.. లేక మొండితనమా..? అని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల అంశంపై లోక్‌సభలో గురువారమూ టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టారు. పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, బి.వినోద్‌కుమార్, అజ్మీరా సీతారాం నాయక్, బూర నర్సయ్య గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీబీ పాటిల్, నగేశ్, పసునూరి దయాకర్ సభ వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలు స్తంభించడంతో సభాపతి సభ పలుమార్లు వాయిదా వేశారు. అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ హాల్లోనూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టామని, వివిధ పార్టీలు మద్దతు తెలిపాయని చెప్పారు. రాష్ట్రానికో తీరుండాలా?: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రిజర్వేషన్ల అంశంపై రెండు వారాలుగా సభలో నిరసన తెలుపుతున్నామని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. సెంట్రల్ హాల్లోనూ ఆందోళన చేపట్టామన్నారు. ‘తమిళనాడులో 69 శాతం, మహారాష్ట్రలో 52 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్రాలకు ఉండాలా? లేక కేంద్రానికా?.. దేశానికంతటికీ ఒకే విధానం ఉండాలా? లేక రాష్ట్రానికో తీరుండాలా?.. మేమడిగేది కేంద్రానికి అర్థమైతలేదా? లేదా మొండితనమా? కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరవాలి’అని హితవు పలికారు. తొలిసారి సెంట్రల్ హాల్లో నిరసన: ప్రభాకర్ రెడ్డి రిజర్వేషన్లపై 2 వారాలుగా ఆందోళన చేస్తున్నా కేంద్రానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. తొలిసారిగా సెంట్రల్ హాల్లో గురువారం నిరసన తెలిపామన్నారు. ‘తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రం బిల్లు ఆమోదించింది. దానిపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ బడ్జెట్‌ను అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవచ్చు. బడుగు, బలహీన వర్గాలకు తగిన విధంగా కేటాయింపులు చేశారు’ అని అన్నారు. దున్నపోతుపై వానపడ్డట్లు..: బాల్క సుమన్ దున్నపోతుపై వాన పడ్డట్లు మొండివైఖరి ప్రదర్శిస్తోందంటూ కేంద్రంపై ఎంపీ బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో మారిన జనాభా శాతాలకు అనుగుణంగా రిజర్వేషన్లు మారాల్సి ఉందన్నారు. ‘ఎస్టీ, బీసీ కోటా పెంపును కేంద్రం సహృదయంతో అర్థం చేసుకోవాలి. యూనివర్సిటీల్లో పోస్టుల రిక్రూట్మెంట్లకు రోస్టర్ పాయింట్లు పాటించడంలో ఇప్పటివరకు వర్సిటీని యూనిట్‌గా తీసుకునేవారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ను యూనిట్‌గా తీసుకుంటుండటం వల్ల అవకతవకలు జరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి గెహ్లాట్‌ను కలిశాం’ అని అన్నారు. -
దామాషా విస్మరించి తమాషా
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం తమాషా చేస్తోందంటూ టీఆర్ఎస్ ఎంపీలు విరుచుకుపడ్డారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునేందుకు రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని, లేదంటే రాష్ట్రం తెచ్చిన రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అనుగుణంగా 9వ షెడ్యూలులో చేర్చాలని డిమాండ్ చేశారు. సోమవారం తొలుత లోక్‌సభలో స్పీకర్ పోడియం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టగా సభ వెంటనే వాయిదా పడింది. దీంతో పార్లమెంటు భవనం నాలుగో నంబర్ గేటు వద్ద ధర్నా చేపట్టారు. ఎంపీలు ఎ.పి.జితేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, బి.వినోద్‌కుమార్, ఎ.సీతారాం నాయక్, నగేశ్, పసునూరి దయాకర్, సి.హెచ్.మల్లారెడ్డి, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్రాల్లో జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు ఉండాలని ఆంధ్రప్రదేశ్ విభజన నాడే కేసీఆర్ ప్రతిపాదించారు. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టి పంపాం. దీన్ని తొమ్మిదో షెడ్యూలులో చేర్చాలని కోరుతున్నాం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరున రిజర్వేషన్లపై నిర్ణయాలు ఉండరాదు. అన్ని రాష్ట్రాలకు ఒకే నీతి ఉండాలి. తమిళనాడులో 69 శాతం, మహారాష్ట్రలో 52 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. రాజస్తాన్, ఏపీలో కూడా వివిధ కులాలను చేర్చాలన్న డిమాండ్ ఉంది. కేంద్రం మొండిగా వ్యవహరించకుండా, అధికారాలను వారి వద్దే అంటిపెట్టుకోకుండా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చుకునేలా అధికారం ఇవ్వాలి’అని డిమాండ్ చేశారు. పెంచితే తప్పేంటి?: సీతారాం నాయక్ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ.. ‘కేంద్రం మా డిమాండ్‌పై స్పందించడం లేదు. మాది కొత్త రాష్ట్రం. విభజన జరిగిన నాడు తెలంగాణలో 6 శాతం ఎస్టీలు, 15 శాతం ఎస్సీలు ఉన్నారు. ఇప్పుడు జనాభా పెరిగిన మేరకు రిజర్వేషన్ పెంచాలి. రాష్ట్ర విభజన తర్వాత ఒకవేళ ఎస్సీల శాతం 5, ఎస్టీల శాతం 2 అయితే మీరు రిజర్వేషన్లు తగ్గించే వారు కాదా? ఎందుకు ఇంకా జాప్యం చేస్తున్నారు? దళిత, గిరిజన జాతులతో మీరు దోబూచులాడుతున్నారు. తమాషాగా అనిపిస్తోందా? ఎన్ని రోజులు ఇలా ఫుట్‌పాత్‌లపై పోరాడాలి. దీనికి మోదీ సమాధానం చెప్పాలి. రిజర్వేషన్లు పెంచడంతో తప్పేముంది? జాతీయ పార్టీల చేతగానితనంపై ప్రాంతీయ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. జాతీయ పార్టీలకు పనితనం లేకనే ప్రాంతీయ పార్టీలు ముందుకొస్తున్నాయి. మమ్మల్ని ఇలా రోడ్లపై పెట్టి మా జాతులతో ఇంకెన్నాళ్లు ఆడుకుంటారు? మాకు ఉద్యమాలు కొత్త కాదు. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వమే ఇక్కడికొచ్చి ఆందోళన చేపడుతుంది. ఎందుకు మీకు ఈ పెత్తనాలు. రాష్ట్రాలపై బతికేవాళ్లకు రాష్ట్రాలను అణిచివేయాలని చూడటం సరికాదు. మా ఫ్లోర్ లీడర్‌ను పిలిచి ఎందుకు మాట్లాడటం లేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై మీకు చిత్తశుద్ధి లేదు. బీజేపీ తీరుతో రిజర్వేషన్ల వ్యవస్థకు ప్రమాదం ఉంది. బీజేపీ నాటకం ప్రజలకు అర్థమవుతుంది’అని తీవ్రంగా విమర్శించారు. ఎంపీ నగేశ్ మాట్లాడుతూ ‘జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లను అన్ని కులాలకు కల్పించాలని రాజ్యాంగం నిర్ధేశించింది. రాష్ట్రం ఏర్పడిన అనంతరం గిరిజన, బీసీ కులాల జనాభా పెరిగింది. ఆ ప్రకారమే రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. పొరుగు రాష్ట్రాల్లో పెంచుకునే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండదు?’అని ప్రశ్నించారు. తమిళనాడుకో న్యాయం మాకో న్యాయమా: కవిత ఎంపీ కవిత మాట్లాడుతూ ‘వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రధాన డిమాండ్ అయిన రిజర్వేషన్ కోటా పెంపుపై పోరాటం చేస్తున్నాం. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఓపిగ్గా నిరీక్షించిన తర్వాత టీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. ఇకపైనా ఆందోళన కొనసాగిస్తాం. పెరిగిన జనాభాకు అనుగుణంగా బీసీలు, ఎస్టీల రిజర్వేషన్ల కోటా పెంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రిజర్వేషన్ల పెంపును అమలు చేస్తూ 9వ షెడ్యూలులో చేర్చాలి. లేదంటే సుప్రీంకోర్టుకైనా వెళ్లి రిజర్వేషన్లు సాధించుకుంటాం. సుప్రీంకోర్టు 50 శాతం పరిమితి చెప్పినా అక్కడే ప్రత్యామ్నాయం కూడా చూపింది. తమిళనాడులో రిజర్వేషన్లు కొనసాగుతున్న సంగతి అందరికీ తెలుసు. వారికో న్యాయం మాకో న్యాయం సరికాదు. తెలంగాణ కూడా ఈ దేశంలోని రాష్ట్రమే. కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలి’అని కోరారు. -
స్వలాభం లేదనే అడ్డుకుంటున్నారు
మోర్తాడ్(బాల్కొండ): నిజాం చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించడం ద్వారా తన కు ఎలాంటి లాభం లేదనే ఉద్దేశ్యంతోనే నిజామాబాద్ ఎంపీ కవిత రైతు ల ఆశలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఫ్యాక్టరీలను తెరిపించడానికి ప్రభు త్వం జీవో జారీ చేసినా, అమలు చేయకపోవడంపై ఎన్నో అనుమానాలున్నాయని తెలిపారు. నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలనే డిమాండ్‌తో అర్వింద్ ఆధ్వర్యంలో జగిత్యాల్ జిల్లా ముత్యంపేట్లో ప్రా రంభమైన చెరుకు రైతుల చర్నాకోల్ మహా పాదయాత్ర.. ఇబ్రహీంపట్నం, వర్షకొండ మీదుగా ఆదివారం నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. పాదయాత్రకు ఏర్గట్లలో బీజేపీ కార్యకర్తలు, రైతులు ఘన స్వాగతం పలికా రు. ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే నిజాం చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని సీఎం కేసీఆర్, ఎంపీ కవిత హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇందుకు అనుగుణంగా 2015 ఏప్రిల్ 29న జీవో నెం. 28ని జారీ చేశారని తెలిపారు. ఈ జీవో ప్రకారం గతంలో ఫ్యాక్టరీలను నిర్వహించిన యాజమాన్యానికి ప్రభుత్వం ఎంతో కొంత సొ మ్ము చెల్లించి ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. అయితే, యజమానులకు రూ.వందల కోట్లు చెల్లిస్తే తమకు ఎలాంటి ప్రయోజనం లేదనే భావనతో కవిత ప్రభుత్వానికి అడ్డం వస్తున్నారని ఆరోపించారు. ఫ్యాక్టరీలను ప్రారంభిస్తే లక్షలాది రైతులతో పాటు వేలాది కార్మికుల, కూలీలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కానీ, ఎంపీ కవిత తన స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బహుళ ప్రయోజనాలను కలిగించే ఫ్యాక్టరీలను తెరిపించడానికి అడ్డు పడుతోందని ఆరోపించారు. చక్కెర ఫ్యాక్టరీలను తెరిచే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని అర్వింద్ స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొటపాటి నర్సింహానాయుడు, నేతలు బస్వా లక్ష్మీనర్సయ్య, రాజేశ్వర్, శ్రీనివాస్, ఏలేటి నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జూన్ నాటికి ప్రాజెక్టులన్నీ పూర్తి: ఎంపీ కవిత
మంథని/మహదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ కరువు తీరనుందని ఎంపీ కవిత అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అన్నారం పంపుహౌస్, సుందిళ్ల బ్యారేజీ పనులు, మహదేవపూర్ మండలంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ పనులను మంగళవారం ఆమె సందర్శించారు. జూన్ నాటికి రాష్ట్రంలోని ప్రాజె క్టులన్నీ పూర్తవుతాయని కవిత తెలిపారు. అన్నారం బ్యారేజీ నుంచి 2 టీఎంసీల నీటిని ప్రతిరోజూ వాడుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రజలకు తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు కావాల్సిన నీరు 2050 వరకు ఎలాంటి కొరత లేకుండా కాళేశ్వరం ద్వారా అందనుందన్నారు. కవిత వెంట మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, పుట్ట మధు తదితరులు ఉన్నారు. -
కేసీఆర్ సోదరి విమలమ్మ మృతి
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రెండో సోదరి విమలమ్మ (83) కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అల్వాల్‌లోని సాయిబాబా నగర్లో ఉన్న నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు విమలమ్మకు నివాళులు అర్పించారు. అనంతరం సికింద్రాబాద్ తిరుమలగిరిలోని స్వర్గవాటికలో విమలమ్మ అంత్యక్రియలు జరిగాయి. కొడుకు విజయ భాస్కర్ దహన సంస్కారాలు నిర్వహించారు. మంత్రి హరీశ్ ఉదయం నుంచి సాయంత్రం అంత్యక్రియలు పూర్తి అయ్యేవరకు అక్కడే ఉండి పర్యవేక్షించారు. విమలమ్మకు భర్త రాజేశ్వర్‌రావు, ముగ్గురు కొడుకులు భూపాల్‌రావు, శ్రీనివాస్, విజయ్ భాస్కర్, కుమార్తె చంద్రమతి ఉన్నారు. అంత్యక్రియల్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మైనంపల్లి హన్మంతరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీఎన్ రెడ్డి, కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. కన్నీటి పర్యంతమైన కేసీఆర్ కాన్వాయ్‌లో నుంచి దిగి సోదరి పార్థివదేహం వద్దకు రాగానే కేసీఆర్ ఒక్కసారిగా ఉద్వేగానికిలోనై కన్నీటి పర్యంతమయ్యారు. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు ఆయన్ను ఓదార్చారు. కేసీఆర్‌కు ఎనిమిది మంది సోదరీమణులు, ఒక సోదరుడు కాగా వీరిలో ఓ సోదరి, అన్న మరణించారు. విమలమ్మకు కేసీఆర్ అంటే అమితమైన ప్రేమని, ఏటా రాఖీ కట్టేదని కుటుంబ సభ్యులు చెప్పారు. -
ఖాళీగానే కొత్త పుష్కరిణి !
కొండగట్టు(చొప్పదండి): భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్న కొండగట్టు అంజన్న కొండపై అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయి. రూ.1.21కోట్లతో నిర్మించిన కొత్త పుష్కరిణిలో నీళ్లు లేక పాత కోనేరులోనే భక్తులు స్నానాలు చేస్తున్నారు. మరికొందరైతే తాగునీటి నల్లా వద్ద మగ్గులతో పట్టుకొని స్నానాలు కానిచ్చేస్తున్నారు. ఇదంతా అధికారులు చూస్తున్నా కొత్త పుష్కరిణిలో నీళ్లు నింపేందుకు చర్యలు తీసుకోవడం లేదు. కోట్లు వెచ్చించి నిర్మించినా మూడేళ్లుగా నిరుపయోగంగానే పడి ఉంటుంది. నల్లాలే దిక్కు కొండగట్టులో నూతన పుష్కరిణిని ప్రారంభించకపోవడంతో భక్తులు పాత కోనేరుతోపాటు తాగునీటి నల్లాల వద్ద స్నానాలు చేస్తున్నారు. మరికొందరు సమీపంలో టెండరు స్నానాల గదుల్లోకి వెళ్తున్నారు. అంతేకాకుండా పాత కోనేరులోనైనా నీటిని ఎప్పటికప్పుడు తొలగించడం లేదు. దీంతో కొన్ని రోజులుగా అందులో నీరు మురికిగా మారింది. అయినా అధికారులు స్పందించడం లేదు. కొత్త కోనేరు ప్రముఖులకేనా? కొత్త కోనేరును వినియోగంలోకి తెచ్చేందుకు నీటి సమస్య ఉందంటున్న అధికారులు ప్రముఖులు వస్తే మాత్రం ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. భక్తులకు పాత కోనేరు..ప్రముఖులకు కొత్త కోనేరు రీతిన వ్యవహరించడంపై ఆలయ అధికారులపై విమర్శలు వస్తున్నాయి. చిన్నచూపు అంజన్న ఆలయంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. ఎంపీ కవిత ఆలయ అభివృద్ధికి చెప్పిన మాటలు నీటిమూటలుగా మారాయి. యాదాద్రి, వేములవాడ తరహాలోనే కొండగట్టును అభివృద్ధి చేయాలి. రూ.500కోట్లు కేటాయించి, ఐఏఎస్ అధికారిని నియమించాలి. – మేడిపెల్లి సత్యం, కాంగ్రెస్ నాయకుడు గత ప్రభుత్వంలోని అభివృద్ధే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధే. ప్రస్తుతం ఎలాంటి పనులు చేయలేదు. కనీసం కొత్త కోనేరులో నీరు సైతం నింపడం లేదు. ఆదాయం పెరుగుతున్నా భక్తులకు కనీస అవసరాలు తీర్చడం లేదు. ఇప్పటికైనా పాత కోనేరులో నీరు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. – గాజుల శంకర్‌గౌడ్, ఆలయ మాజీ పాలకవర్గం డైరెక్టర్ -
విభజన హామీలన్నీ నెరవేర్చాలి: ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం ఆమె బడ్జెట్‌పై జరిగిన చర్చలో మాట్లాడారు. ‘‘విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు కొద్దిరోజులుగా చేస్తున్న ఆందోళనకు మా మద్దతు పలుకుతున్నాం. ప్రభుత్వం–పాలన ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వంలో ఉన్న టీడీపీ సభలో ఆందోళన చేస్తుండడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఇది తప్పుడు సందేశాన్ని పంపుతుంది’’ అని అన్నారు. ‘‘ఈ బడ్జెట్లో రైతు గురించి చేసిందేమీ లేదు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. కానీ ఎలాంటి వ్యూహమూ లేదు. ఎలాంటి కేటాయింపులూ లేవు. గడిచిన మూడేళ్లుగా లేదు. ఇప్పుడూ లేదు. సులభతర వాణిజ్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తెచ్చారు. 140వ స్థానం నుంచి 100వ స్థానానికి ఎగబాకారు. వ్యాపారానికి సంబంధించి 31 బిల్లులు తెచ్చారు. కానీ రైతుల గురించి ఏం చేశారు. కేవలం 2 బిల్లులు తెచ్చారు. పెస్టిసైడ్స్ బిల్లు, నాబార్డు బిల్లు, విత్తనాల బిల్లు, శీతల గిడ్డంగుల బిల్లు.. ఇలా అనేకం పెండింగ్‌లో ఉన్నాయి. తొలి బడ్జెట్ నుంచే రైతుల ఆదాయం రెట్టింపునకు సంబంధించి కేటాయింపులు ఎందుకు చేయలేదు. ఎరువుల సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాలో వేస్తామన్నారు. ఎందుకు చేయలేదు. సాగునీటికి నీళ్లిస్తామన్న ప్రకటనలే తప్ప కేటాయింపులేవీ? మా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరాం. కానీ పురోగతి లేదు. కనీసం రాష్ట్రాలు చేసే ప్రాజెక్టులకైనా సాయం చేయాలి కదా.. ప్రతి రైతును యూనిట్‌గా తీసుకుని ఫసల్ బీమా యోజన చేపట్టాలి. కనీస మద్దతు ధర కేవలం 26 పంటలకే ప్రకటిస్తున్నారు. కేవలం 2 వ్యవసాయ ఉత్పత్తులనే కేంద్రం సేకరిస్తోంది. మిగిలిన అన్నింటికీ మద్దతు ధర ప్రకటించాలి’’ అని పేర్కొన్నారు. అప్పటికే తనకు కేటాయించిన సమయం పూర్తయిందని సభాపతి ప్రకటించడంతో చివరగా ‘‘విభజన హామీలు నెరవేర్చాలి.. జై ఆంధ్రా.. ’ అంటూ ప్రసంగం ముగించారు. -
ఎరువుల సబ్సిడీని రైతులకు ఎందుకివ్వడం లేదు ?
-
ఏపీ ఎంపీల ఆందోళనకు మా మద్దతు: ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ: విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆమె గురువారం లోక్‌సభలో మాట్లాడారు. ఏపీ అన్యాయంపై ఆ రాష్ట్ర ఎంపీలు చేస్తున్న ఆందోళనకు కవిత మద్దతు పలికారు. పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఎంపీల ఆందోళనలకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. అయితే, ప్రభుత్వంలో ఉండి నిరసనలు తెలుపడం సరైన పద్ధతి కాదని ఆమె పరోక్షంగా టీడీపీ ఎంపీలను ఉద్దేశించి పేర్కొన్నారు. కేంద్రం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. జీఎస్టీ, నోట్లరద్దుకు తాము మద్దతునిచ్చామని, తెలంగాణకు కేంద్రం మద్దతునివ్వాలని అభ్యర్థించారు. కేంద్రం ఎరువుల సబ్సిడీని నేరుగా రైతులకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ఫర్టిలైజర్ కంపెనీల విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పులనే బీజేపీ ఎందుకు చేస్తోందని అన్నారు. -
కేసీఆర్ వారసులు ఎవరు?.. కవిత బదులిదే!
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్కు 100 సీట్లు ఖాయమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. పార్టీలు అన్నీ ఏకమైనా 2019లో వార్ వన్ సైడేనని, కేసీఆర్‌దే విజయమని ఆమె వ్యాఖ్యానించారు. ఎంపీ కవిత మంగళవారం ఇక్కడ విలేకరులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అన్నీ పార్టీలు ఏకమై పోటీ చేసినా టీఆర్ఎస్కు వంద సీట్లు రావడం గ్యారెంటీ అని అన్నారు. కేసీఆర్ వారసులెవరో చెప్పడానికి తనకు జాతకాలు రావని, భవిష్యత్‌లో తెలుస్తుందని కవిత వ్యాఖ్యలు చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అన్నదానిపై పార్టీదే తుది నిర్ణయమన్నారు. ఇక హరీష్ రావు ఎంపీగా పోటీ చేస్తారా అన్న దానిపై తాను స్పందించనన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది టీఆర్ఎస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. విభజన హామీలపై కేంద్రం త్వరగా తేల్చాలని కవిత అన్నారు. జమిలీ ఎన్నికల ప్రస్తావన రాలేదని, వస్తే పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్తో విలీనం చేయాలన్న మోత్కుపల్లి నర్సింహులు ప్రతిపాదనను తాము స్వాగతిస్తున్నామన్నారు. సెక్షన్ 506,507 సవరణ సోషల్ మీడియాను అదుపు చేసేందుకు కాదని అన్నారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనేది విపక్షాల దుష్ప్రచారమేనని ఆమె కొట్టిపారేశారు. కోదండరామ్ రాజకీయ పార్టీ పెడితే తాము స్వాగతిస్తామని ఎంపీ కవిత పేర్కొన్నారు. -
‘అసాధ్యాన్ని కేసీఆర్ సుసాధ్యం చేశారు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ 24 గంటల విద్యుత్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ విద్యుత్‌శాఖ ఉద్యోగులు ఆదివారం టీఆర్‌వీకేఎస్‌లో చేరారు. 24 గంటల కరెంటు ఇవ్వడం ద్వారా సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని విద్యుత్ ఉద్యోగులు అన్నారు. టీఆర్ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్)లో విద్యుత్ ఉద్యోగులు చేరడాన్ని ఆ పార్టీ ఎంపీ కవిత స్వాగతించారు. విద్యుత్ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. -
సీపీఎస్ కోసం కేంద్రంతో పోరాడుదాం: ఎంపీ కవిత
నిజామాబాద్ నాగారం (నిజామాబాద్ అర్బన్): ఉద్యోగులకు సంబంధించి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానం అమలుకు కేంద్రంతో పోరాడుదామని ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో టీఎన్జీవోస్ నాన్‌గెజిటెడ్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర సాధనలో ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా ఉద్యోగులు ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. టీఎన్జీవోస్ సంఘానికి టీఆర్ఎస్కు వీడదీయరాని బంధం ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. కేంద్ర పరిధిలో ఉన్న సీపీఎస్ రద్దుకు కలసి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో చురుకైన పాత్ర పోషించాలని ఎంపీ కవిత సూచించారు.