
రాయికల్ (జగిత్యాల): ‘మా కొడుకు ప్రాణాలు నిలిపిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం..’అంటూ ఓ బాలుడి తల్లిదండ్రులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలసి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్‌కు చెందిన టేక్ సాగర్ (13) పుట్టినప్పటి నుంచే కాలేయ సమస్యతో బాధపడుతుండేవాడు. దీంతో 2017లో ఎంపీగా ఉన్న కవితను సాగర్ తల్లిదండ్రులు కలసి తమ కొడుకును కాపాడాలని వేడుకోగా.. సీఎం సహాయ నిధి నుంచి రూ.26 లక్షల ఎల్‌వోసీని ఆమె మంజూరు చేయించారు. అలాగే ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి బాలుడి చికిత్సపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ప్రస్తుతం ఆ బాలుడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. గురువారం కవిత జగిత్యాల పర్యటనకు వచి్చన విషయాన్ని తెలుసుకున్న సాగర్ తల్లిదండ్రులు రాయికల్‌లో ఆమెను కలిశారు. తమ కొడుకుకు ప్రాణభిక్ష పెట్టింది మీరేనంటూ కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment