Liver surgery
-
ప్రభుత్వాస్పత్రుల్లో ‘రేల’ సేవలు!
సాక్షి, చెన్నై(తమిళనాడు): ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం ప్రముఖ కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ రేల తన సేవల్ని అందిస్తున్నారని ఆరోగ్యమంత్రి సుబ్రమణియన్ తెలిపారు. రేల హాస్పిటల్లో 4 ఏళ్ల బాలుడికి జరిగిన చిన్న పేగు మార్పిడి శస్త్ర చికిత్స ఏసియా బుక్ ఆఫ్‌లో చోటు దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు. బెంగళూరుకు చెందిన స్వామినాథన్ కుమారుడు గుహన్(4)కు కొన్ని నెలల క్రితం ఆరోగ్య పరంగాఎదురైన సమస్యలతో చెన్నైలోని రేల ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆ బాలుడికి చిన్న పేగు పూర్తిగా కుళ్లి పోవడంతో అవయవ మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యం అయింది. ఆ బాలుడి తండ్రి పేగులో కొంతభాగం సేకరించి శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. ఈ శస్త్ర చికిత్స ఏసియా బుక్‌లో చోటు దక్కించుకుంది. ఇందుకు తగ్గ ప్రశంసాపత్రం, పతకం ప్రదాన కార్యక్రమం మంగళవారం చెన్నై గిండిలో జరిగింది. ఈసందర్భంగా ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన జనని అనే పేద బాలిక ప్రాణాల్ని రక్షించేందుకు డాక్టర్ రేల బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ప్రైవేటు రంగంలోకి ఉన్న డాక్టర్ రేల తన సేవల్ని ప్రభుత్వ ఆస్పత్రులకు సైతం ఉచితంగా అందించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ మహ్మద్ రేల, డాక్టర్ నరేష్ షణ్ముగం బృందంతో పాటుగా ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, ఏసియా బుక్ ప్రతినిధి వివేక్ పాల్గొన్నారు. -
తల్లి కాలేయం ఇచ్చినా.. తప్పని గుండె కోత
సాక్షి, మచిలీపట్నం: బిడ్డను బతికించుకోవాలనే తపనతో తన కాలేయాన్ని ఇచ్చేందుకు సిద్ధమైన ఆ మాతృమూర్తికి గుండె కోత తప్పలేదు. పెళ్లైన పదిహేను ఏళ్ల తరువాత కలిగిన సంతానం కావడంతో ఎంతో అల్లారు ముద్దు చేసిన కుమారుడు ఇక లేడని తెలియడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. తన కాలేయాన్ని అమర్చుకొని కొడుకు కళ్ల ముందుకొస్తాడని, అదే ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ తల్లికి కన్న పేగు ఇక లేదని చెప్పే సాహసాన్ని అక్కడి వైద్యులు సైతం చేయలేని హృదయ విదారకరమైన పరిస్థితి. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం నగరం నోబుల్ కాలనీకి చెందిన గ్రేసీ, స్టీఫెన్ దంపతుల పెద్ద కుమారుడు ఇమ్మానియేల్ జాకబ్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతనికి కాలేయ సంబంధిత వ్యాధి ఉందని ఇటీవల వరకు తెలియదు. కొన్ని రోజుల క్రితం నోటి నుంచి రక్తం పడటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఇమ్మానియేల్ జాకబ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, కాలేయాన్ని వెంటనే మార్చాల్సిన అవసరం ఉందని, లేకుంటే ప్రాణాలు దక్కవని చెప్పారు. వైద్యుల సూచన మేరకు ఇమ్మానియేల్‌ను మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తండ్రి స్టీఫెన్ ప్రైవేట్ ఉపాధ్యాయుడు. ఖరీదైన వైద్యం చేయించాల్సి ఉన్నందున వారి పరిస్థితిని తెలుసుకున్న రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మానవీయ కోణంలో స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.25 లక్షలు మంజూరు చేయించారు. కుమారుడికి తన కాలేయాన్ని ఇచ్చేందుకు తల్లి గ్రేసీ సిద్ధమైంది. (చదవండి: ఘోర ప్రమాదం: 23 మంది మృతి) ఆపరేషన్ చేస్తుండగా.. కాలేయ మార్పిడికి ఆసుపత్రి వైద్యులు అంతా సిద్ధం చేసి తల్లి గ్రేసీకి ఆపరేషన్ ద్వారా కాలేయం కొద్ది భాగాన్ని తొలగించారు. దానిని ఇమ్మానియేల్‌కు అమర్చేందుకు ఆపరేషన్ చేస్తున్న క్రమంలో అతని ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం మృతిచెందాడు. తల్లి గ్రేసీని ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచారు. కుమారుడు ఇమ్మానియేల్ మృతి చెందిన విషయం ఇంకా ఆమెకు తెలియదు. 50 ఏళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం నుంచి బందరుకు వచ్చిన గ్రేసీ, స్టీఫెన్ దంపతులు అందరితోనూ కలిసిమెలిసి ఉంటారు. గిటార్ ప్లే చేయడంలో అందవేసిన చేయి అయిన ఇమ్మానియేల్ ఎవాంజెలికల్ యూత్ ఫెస్టివల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తన సంగీత ప్రతిభతో అందరి మనసును దోచుకునేవాడు. అటువంటి ఇమ్మానియేల్ ఇక లేడని తెలియడంతో నోబుల్ కాలనీలో విషాదం అలముకుంది. ఈ విషయాన్ని ఇమ్మీ స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని మచిలీపట్నానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. -
‘కవితమ్మ.. మీ వల్లే మా కొడుకు బతికాడు’
రాయికల్ (జగిత్యాల): ‘మా కొడుకు ప్రాణాలు నిలిపిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం..’అంటూ ఓ బాలుడి తల్లిదండ్రులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలసి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్‌కు చెందిన టేక్ సాగర్ (13) పుట్టినప్పటి నుంచే కాలేయ సమస్యతో బాధపడుతుండేవాడు. దీంతో 2017లో ఎంపీగా ఉన్న కవితను సాగర్ తల్లిదండ్రులు కలసి తమ కొడుకును కాపాడాలని వేడుకోగా.. సీఎం సహాయ నిధి నుంచి రూ.26 లక్షల ఎల్వోసీని ఆమె మంజూరు చేయించారు. అలాగే ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి బాలుడి చికిత్సపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ప్రస్తుతం ఆ బాలుడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. గురువారం కవిత జగిత్యాల పర్యటనకు వచి్చన విషయాన్ని తెలుసుకున్న సాగర్ తల్లిదండ్రులు రాయికల్‌లో ఆమెను కలిశారు. తమ కొడుకుకు ప్రాణభిక్ష పెట్టింది మీరేనంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. -
వైరల్ స్టోరి : తండ్రికే పునర్జన్మనిచ్చింది
కోల్‌కతా : కంటే కూతుర్నే కనాలనేది పెద్దల మాట. ఎందుకు.. తల్లిదండ్రుల కష్టాలను తనవిగా భావించి.. వారికి ఎల్లప్పుడు తోడుగా నిలుస్తుంది కాబట్టి. కానీ నేటికి మన సమాజంలో ఆడపిల్ల పుట్టిందనగానే ఏదో పాడుపిల్లను చూసినట్లు చూసే తల్లిదండ్రులు కోకొల్లలు. తను పుట్టిన దగ్గర నుంచి మరో ఇంటికి పంపే వరకూ ఓ బరువుగానే భావించే తల్లిదండ్రులు లక్షల్లో ఉన్నారు. కొడుకు కొరివిపెట్టడానికే ముందుటాడు.. కూతురు తల్లిదండ్రుల కష్టాల్లో పాలు పంచుకోవడానికి ముందుంటుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి కోల్‌కతాలో జరిగింది. పారిశ్రామిక వేత్త హర్ష్ గోయాంక కూతుళ్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘కోల్‌కతాకు చెందిన రాఖీ దత్తా అనే 19 ఏళ్ల యువతి.. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న తండ్రి కోసం తన లివర్‌లో 65 శాతాన్ని దానం చేసింది. భవిష్యత్తులో తనకు ఎదురయ్యే సమస్యల గురించి.. సర్జరీ వల్ల కలిగే నొప్పి గురించి.. ఏర్పడే గాట్ల గురించి గాని తను పట్టించుకోలేదు. కేవలం తన తండ్రి ఆరోగ్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంది. తండ్రి పట్ల కూతరు చూపే ప్రేమ ఎప్పుడు ప్రత్యేకమే. కూతుర్లను చిన్న చూపు చూసే తల్లిదండ్రులకు ఇదే కరెక్ట్ సమాధానం’ అంటూ హర్ష్ గోయాంక ట్వీట్ చేశారు. Rakhi Dutta, a 19 year donated 65% of her liver to her father who was suffering from a serious liver ailment, without even thinking of the scars, pain or any future threat. A daughter’s love for her father is always very special. An answer to all who think daughters are useless.. pic.twitter.com/BMbRaMhM88 — Harsh Goenka (@hvgoenka) April 18, 2019 దాంతో పాటు తండ్రి కూతుర్లిద్దరు తమ గాట్లను చూపిస్తూ దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ తండ్రీకూతుళ్ల కథ సోషల్ మీడియాలో తెగ వైరలవ్వడమే కాక.. రాఖీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. కూతుళ్లు మీకు జోహార్లు అంటున్నారు. -
ఖలేజా ఆపరేషన్
శస్త్రచికిత్స జరిగిన నాలుగు వారాల తర్వాత లక్ష్మయ్యతో గ్లోబల్ హాస్పిటల్ కాలేయ శస్త్రచికిత్స విభాగపు అధిపతి, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ టామ్ చెరియన్ కాలేయంలోని ఏదైనా భాగానికి క్యాన్సర్ వస్తే, ఆ వచ్చిన మేరకు తొలగిస్తే మిగతా భాగం మామూలుగానే పెరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి అదికాదు. ఇటు ఎడమవైపు తమ్మెకూ, అటు కుడివైపు నాళంమీదా క్యాన్సర్ వ్యాపించింది. మెడికల్ వండర్ ఒక రోజు లక్ష్మయ్య హాస్పిటల్‌కు వెళ్లాడు. వయసు 60 ఏళ్లు. మహబూబ్‌నగర్ జిల్లా. ఆయన కళ్లు పచ్చగా ఉన్నాయి. జ్వరం ఉంది. రెండు నెలలలో నాలుగైదు కిలోల బరువు తగ్గాడు. అంతకుమించి వేరే లక్షణాలేమీ లేవు. ఆయన పొగతాగడు. మద్యం అలవాటు లేదు. పొట్ట పలుచగా ఉంది. పై నుంచి చూస్తే అంతా మామూలే. కానీ, సీటీ స్కాన్ తీస్తే... ఆశ్చర్యం... ఆయన ‘హైలార్ కొలాంజియో కార్సినోమా’ లేదా ‘బైల్ డక్ట్ మ్యాలిగ్నెన్సీ’ వ్యాధితో బాధపడుతున్నాడు. అది తీవ్రమైనదిగా పరిగణించే క్యాన్సర్లలో ఒకటి! కాలేయానికి రెండు తమ్మెలుంటాయి. ఎడమ వైపు తమ్మె నుంచి రక్తం తీసుకుపోవడానికి ‘లెఫ్ట్ పోర్టల్ వీన్’ రక్తనాళం ఉంటుంది. కుడి తమ్మెకు రక్తం అందించేందుకు ‘రైట్ హెపాటిక్ ఆర్టరీ’ రక్తనాళం ఉంటుంది. కాలేయం చూడటానికి ఎర్రగా ఎందుకు కనిపిస్తుందో తెలుసా? అది శరీరంలోని అతి పెద్ద గ్రంథి. కీలకమైన కార్యాలు నెరవేరుస్తుంటుంది. అత్యంత ప్రాధాన్యంతో దానికి ఎక్కువమొత్తంలో రక్తసరఫరా అవుతుంటుంది. అందువల్లే ఎర్రగా కనిపిస్తుంది. అది కూడా అంతే తీవ్రంగా పనిచేస్తూ... కొన ఊపిరి దొరికే వరకూ లక్షణాలను కనిపించనివ్వదు. అందుకే తీవ్రమైన క్యాన్సర్‌కు గురైనా లక్ష్మయ్యలో లక్షణాలేవీ బయటపడలేదు. కాలేయంలోని ఏదైనా భాగానికి క్యాన్సర్ వస్తే, ఆ వచ్చిన మేరకు తొలగిస్తే మిగతా భాగం మామూలుగానే పెరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి అదికాదు. ఇటు ఎడమవైపు తమ్మెకూ, అటు కుడివైపు నాళంమీదా క్యాన్సర్ వ్యాపించింది. కొంతమేర తొలగించే అవకాశం ఇక్కడ లేదు. కానీ కాలేయం లేదంటే ప్రాణమే లేదని అర్థం. మరి పూర్తిగా తొలగించాలంటే కాలేయాన్ని ఇచ్చే దాత ఉండాలి. దాత దొరకడం, ఆయన ఇచ్చిన కాలేయం సరిపోలడం, దీనికి పెద్దమొత్తంలో అయ్యే ఖర్చు... అన్నీ సవాళ్లే! ఏం చేద్దామిప్పుడు? డాక్టర్ల బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ టామ్ చెరియన్ ఒక ప్రణాళిక రచించారు. దీని ప్రకారం, ఎడమవైపు రోగగ్రస్థమైన కాలేయపు తమ్మెను తొలగించాలి. అయితే, కుడిైవైపున రోగగ్రస్థం కాని తమ్మెను అలాగే ఉంచాలి. కానీ పాడైన రక్తనాళాలను మాత్రం తొలగించాలి. మరి ఆ భాగానికి రక్తసరఫరా కావాలి కదా! అందుకోసం ఇతర ప్రాంతాలనుంచి ఆరోగ్యకరమైన రక్తనాళాలను తెచ్చి, తొలగించినవాటి స్థానంలో అమర్చాలి. మరి రక్తనాళాలు దొరకవు కదా! అంటే, కుడివైపు తమ్మెకు పాత రక్తనాళాలతోనే మంచి రక్తం అందాలి. సంక్లిష్ట ఆపరేషన్ అనుకున్నంత సులభం కాదు. అయినా సాధ్యంచేశారు. ఎడమవైపున ఎనిమిది సెంటీమీటర్ల కాలేయపు తమ్మెను తొలగించారు. ఇటు రోగగ్రస్థమైన రక్తనాళాలనూ తొలగించారు. అటు వైపున ఆరోగ్యకరమైన రక్తనాళాలున్నాయి కదా! వాటిని తొలగించకుండా ఉంచిన ‘ఆరోగ్యకరమైన కాలేయపు తమ్మె’కు రక్తం అందేలా అనుసంధానించారు. ఇంతటి సంక్లిష్టమైన ఆపరేషన్‌కు తొమ్మిది గంటలు పట్టింది. రోగిని ఐసీయూలో ఉంచి జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారు. తొలిదశలో కొద్దిరోజులు రక్తసరఫరాను యంత్రాల సహాయంతో చేశారు. ఆ తర్వాత అతడికి అమర్చిన వైద్య పరికరాలను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ వచ్చారు. ఎట్టకేలకు కాలేయం ఇచ్చే దాత లేకుండానే, కొత్త కాలేయం అమర్చకుండానే, కొత్తదాన్ని అమర్చినంత పనిచేశారు. ఇక్కడ ఒక అంశం స్పష్టం చేయాలి. వైద్యుల నైపుణ్యం, సృజనతో కాలేయ మార్పిడి చేయకుండానే, చేసినప్పటి సాఫల్యాన్ని సాధించారన్నమాట! మనం భిన్న అర్థంలో వాడే ఖలేజా అనే మాటకు కాలేయం అని కూడా అర్థం. అలా ఇది ఖలేజా ఉన్న వైద్యుల వాస్తవగాథ! - యాసీన్