
గచ్చిబౌలి: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీరాంనగర్ కాలనీలో స్టైలిష్ బ్యూటీ స్పా పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, గచ్చిబౌలి పోలీసులు బుధవారం దాడులు చేశారు.
నిర్వాహకుడు సత్యనారాయణ, విటులు శ్రీకాంత్, గోవిందరావు, అప్పారావులను అదుపులోకి తీసుకున్నారు. నలుగురు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వేర్వేరు కారు ప్రమాదాలు.. నలుగురికి గాయాలు
మణికొండ: బుధవారం జరిగిన వేర్వేరు కారు ప్రమాదాల్లో నలుగురు గాయపడ్డారు. నార్సింగి పోలీసులు తెలిపిన మేరకు.. రామచంద్రాపురం మండలం, తెల్లాపూర్‌కు చెందిన విజయ్‌కుమార్ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన స్నేహితురాలితో కలిసి బుధవారం తెల్లవారు జామున సుజికీ ఫ్రాంక్స్ కారులో కోకాపేట మూవీటవర్ వైపు లాంగ్ డ్రైవ్‌కు వచ్చారు. కారును వేగంగా నడపటం, ముందు లారీ వెళుతున్న విషయాన్ని గమనించకపోవటంతో వెనక నుంచి ఢీకొట్టాడు. దాంతో విజయ్‌కుమార్‌తో పాటు అతని స్నేహితురాలికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి చికిత్స కొరకు తరలించారు.
మరో సంఘటనలో వోక్స్ వ్యాగన్ కారులో వికారాబాద్ నుంచి నార్సింగికి వస్తుండగా సీబీఐటీ కళాశాల ముందుకు రాగానే అదుపు తప్పిన కారు రోడ్డు మధ్యలో డివైడర్‌పై ఉన్న హోర్డింగ్ పోల్‌ను ఢీ కొట్టింది. దాంతో కారు ముందు బాగం పూర్తిగా నుజ్జు,నుజ్జు అయ్యింది. అందులో ఉన్న కార్తీక్, అభిõÙక్‌రెడ్డిలకు స్వల్పగాయాలు కావటంతో వారు కారును అక్కడే వదిలి పారిపోయారు. రెండు కారు ప్రమాదాల కేసులను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment