Gachibowli
-
గచ్చిబౌలిలో ఫిన్ స్విమ్మింగ్ 2024
గచ్చిబౌలి: ఆలిండియా ఫిన్ స్విమ్మింగ్ ఫెడరేషన్ కప్–2024 పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలోని స్విమ్మింగ్‌పూల్‌లో ఈ పోటీలను బాలురు, బాలికల విభాగాల్లో వేర్వేరుగా నిర్వహించారు. ఇందులో 50 మీటర్లు, 100, 200, 400 మీటర్లు, 800 మిడ్ రిలే పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను అండర్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఇండియా ప్రధాన కార్యదర్శి మయూర్పటేల్, యూఎస్ఏఐ చీఫ్ జనరల్ సెక్రెటరీ కుల్దీప్పాటిల్, యూఎస్ఎఫ్ఏటీ అధ్యక్షురాలు జ్యోతి, ప్రధాన కార్యదర్శి దినేషరాజోరియా ప్రారంభించారు. ఈ పోటీలను మొదటిసారి నిర్వహిస్తున్నామని, దక్షిణ భారతదేశంలో నిర్వహణకు అవకాశం కల్పించడానికి ప్రభుత్వ సహకారం మరువలేనిదని జ్యోతి అన్నారు. మూడు రోజులపాటు గచి్చ»ౌలి స్టేడియంలో నిర్వహించే ఈ పోటీలు 11తో ముగుస్తాయన్నారు. 17 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని, పోటీలో ప్రతిభ చాటిన వారికి సర్టిఫికెట్లు, మెడల్స్ అందిస్తామని తెలిపారు. -
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ నేతల ఆందోళన
-
ఇటీవలే గోవాకు వెళ్లిన శోభిత, సుదీర్
గచ్చిబౌలి: కన్నడ నటి శోభిత మృతదేహానికి సోమవారం ఉస్మానియా హాస్పిటల్లో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని శ్రీరాంనగర్‌లో భర్త సు«దీర్ రెడ్డితో కలిసి నివాసం ఉంటున్న శోభిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె కుటుంబసభ్యులు గచ్చిబౌలి పీఎస్‌కు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి పోస్టు మార్టం పూర్తయిన తర్వాత శోభిత మృతదేహాన్ని బెంగళూర్‌కు తీసుకెళ్లారు. శోభిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టంలో నిర్ధారణ అయినట్లు ఉస్మానియా వైద్యులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రోజు రాత్రి 10 గంటల సమయంలో శోభిత తన సోదరితో ఫోన్లో మాట్లాడిందని, తాము సంతోషంగా ఉన్నామని, కొద్ది రోజుల్లోనే ఇద్దరం కలిసి ఊరికి వస్తామని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా ‘ఎవ్రీ థింగ్ ఫర్ఫెక్ట్, చావాలనుకుంటే డూఇట్’ అని శోభిత రూమ్‌లో నోట్ రాసి ఉందని ఇన్స్పెక్టర్ హభీబుల్లాఖాన్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కాలేదని, శోభిత బంధువులు అనుమానాలు వ్యక్త చేయలేదని ఆయన పేర్కొన్నారు. భర్త అనుమానంతో డోర్ పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా శోభిత ఉరి వేసుకుని కనిపించిందని, ఆ సమయంలోనూ గదిలో భక్తి పాటలు ప్లే అవుతున్నట్లు తెలిసింది. ఇటీవలే గోవాకు వెళ్లారు కొద్ది రోజుల క్రితమే గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌కు శోభిత, సుదీర్ వెళ్లినట్లు తెలిసింది. తిరిగి వచ్చిన తర్వాత కూడా భార్యాభర్తలు బాగానే ఉన్నారని ఇరుగు పొరుగు వారితో పాటు వారి కుటుంబ సభ్యులు పేర్కొనడం గమనార్హం. నటనకు అభ్యంతరం చెప్పలేదు: బుచ్చిరెడ్డి మ్యాట్రిమోని ద్వారా ఇరు కుటుంబాల అంగీకారంతోనే వివాహం చేశామని శోభిత మామ(భర్త తండ్రి) బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. సినిమాలు, సీరియల్స్‌లో నటించేందుకు తాము ఎప్పడు అభ్యంతరం చెప్పలేదన్నారు. ఆమె ఎప్పుడు భగవంతుని ధ్యానంలో ఉండేదని, తమ ఇంట్లో కూతురి లాగా మెలిగిందని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యురాలిని కోల్పోయామని, సుధీర్ రెడ్డి డిప్రెషన్లో ఉన్నాడన్నారు. శోభిత కుటుంబసభ్యుల కోరిక మేరకు బెంగళూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
సెల్ఫ్ డ్రైవ్ పేరిట ఘరానా మోసం
గచ్చిబౌలి: సెల్ఫ్ డ్రైవ్ పేరుతో కార్లు అద్దెకు తీసుకుని మరొకరి వద్ద కుదవపెట్టిన మహిళతో పాటు మరో ముగ్గురిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ డాక్టర్ వినీత్ వివరాలు వెల్లడించారు. గచ్చిబౌలి టెలికాంనగర్‌లో నివాసం ఉంటున్న జుపూడి ఉషా సెల్ఫ్ డ్రైవ్ కోసం కార్లు అద్దెకు ఇస్తే రోజుకు రూ.2 నుంచి రూ.5 వేల వరకు అద్దె చెల్లిస్తానని ప్రచారం చేసుకుంది. దీంతో పలువురి నుంచి కార్లు తీసుకున్న ఆమె డ్రైవర్ తుడుముల మల్లేష్‌తో కలిసి వాటిని బీదర్‌కు చెందిన సాగర్ పాటిల్, అనీల్ జమానే వద్ద తనఖా పెట్టి రూ.50 లక్షలు తీసుకుంది. ఆవే కార్లను సాగర్, అనీల్ బీదర్, బల్కీ జిల్లాల్లో ఇతర వ్యక్తుల వద్ద కుదువపెట్టి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. మూడు నెలలైనా అద్దె డబ్బులు ఇవ్వక పోవడంతో కార్ల యజమానులు ఉషాను నిలదీయగా ఇప్పుడు, అప్పుడు అంటూ కాలయాపన చేస్తుంది. అద్దె ఇవ్వక పోవడం, కార్ల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనకు గురైన బాధితులు రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జియో ట్యాగ్‌ను తొలగించి కార్లను కర్నాటకలోని బీదర్, బల్కీ జిల్లాలకు తరలించినట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెల్లడించారు.దీంతో నిదితులు ఉషా, మల్లేష్, సాగర్, అనిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు వారి నుంచి రూ.2.5 కోట్ల విలువైన 21 వాహనాలను స్వా«దీనం చేసుకున్నారు. స్వా«దీనం చేసుకున్న వాహనాల్లో 4 మహీంద్రా థార్, 10 ఎర్టిగా, ఒక ఇన్నోవా క్రిస్టా, 3 స్విఫ్ట్ కార్లు, పది ఐ–10 , ఒక ఐ–20, ఒక వెన్యూ కార్లు ఉన్నాయి. సమావేశంలో మాదాపూర్ ఏడీసీపీ జయరాం, ఏసీపీ శ్రీకాంత్, రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న, డీఐ సతీష్, తదితరులు పాల్గొన్నారు. -
బుల్లితెర నటి శోభిత పోస్టుమార్టం పూర్తి.. వైద్యులు ఏమన్నారంటే?
కన్నడ బుల్లితెర నటి శోభిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం శోభిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. ఆమె స్వస్థలం కర్ణాటక కావడంతో అక్కడికి తరలించనున్నారు. అయితే పోస్టుమార్టం నివేదికలో ఆమె మరణం ఆత్మహత్యగానే వైద్యులు నిర్ధారించారు. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు. ఇవాళ ఆమె అంత్యక్రియలు కర్ణాటకలోని స్వగ్రామంలో నిర్వహించనున్నారు. కాగా.. అంతకుముందు కన్నడ నటి శోభిత తాను నివాసముంటున్న ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. అయితే గతేడాది హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్‌రెడ్డికి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను పెళ్లాడింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుధీర్.. పెళ్లి తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సీ బ్లాక్‌లో ఆమె నివాసముంటున్నారు. అయితే శోభిత పెళ్లి తర్వాతే సినిమాలకు, సిరీయల్స్‌కు దూరమైంది. సూసైడ్ నోట్ స్వాధీనం..శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోట్‌ను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ ఆ లేఖలో ఆమె పేర్కొంది. అయితే, ఎవరిని ఉద్దేశించి శోభిత అలా రాసిందో తెలుపలేదు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిప్రెషన్ వల్లే శోభిత మృతికి కారణమై ఉంటుందా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సీరియల్స్, మూవీస్‌కి దూరంగా ఉండటమా..? తన భర్త సుధీర్ రెడ్డితో ఏమైనా గొడవలు ఉన్నాయా..? అనే వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నటి శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోటు స్వాధీనం
కన్నడ సినీ, టీవీ నటి నటి శోభిత శివన్న (32) అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో పోలీసుల విచారణ కొనసాగుతుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సీ బ్లాక్‌లో తన భర్తతో ఆమె ఉంటున్నారు. డిసెంబర్ 1న తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే, తాజాగా ఆమె రాసిన ఒక నోట్ బయట పడింది.శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోట్‌ను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ ఆ లేఖలో ఆమె పేర్కొంది. అయితే, ఎవరిని ఉద్దేశించి శోభిత అలా రాసిందో తెలుపలేదు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.డిప్రెషన్ వల్లే శోభిత మృతికి కారణమై ఉంటుందా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సీరియల్స్, మూవీస్‌కి దూరంగా ఉండటమా..? తన భర్త సుధీర్ రెడ్డితో ఏమైనా గొడవలు ఉన్నాయా..? అనే వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్‌రెడ్డికి మ్యాట్రిమోని ద్వారా శోభిత పరిచయం ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం పెద్దల అంగీకారంతో వారు పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుధీర్.. పెళ్లి తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. ఆపై పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు, సిరీయల్స్‌కు దూరమైంది. శనివారం రాత్రి భర్తతో కలిసి భోజనం చేసిన ఆమె నిద్రపోయేందుకు ఓ గదిలోకి వెళ్లింది. అయితే, సుధీర్ మరో గదిలోకి వెళ్లి డ్యూటీ(వర్క్ ఫ్రమ్ హోం) చేస్తున్నాడు. ఉదయం 10 గంటల అయినా ఆమె డోర్ తియకపోవడంతో శోభిత గది తలుపును పనిమనిషి తట్టింది. ఆమె ఎంతసేపటికీ డోర్ ఓపెన్ చేయకపోవడంతో.. సుధీర్‌రెడ్డికి విషయం చెప్పి తలుపులు విరగ్గొట్టారు. శోభిత ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది.' పోలీసులు తెలిపారు. విచారణ తర్వాత శోభిత మరణానికి కారణాలు తెలుపుతామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
గచ్చిబౌలిలో గంజాయి కలకలం
-
సిద్దిక్ నగర్ లో ఒరిగిపోయిన భవనాన్ని కూల్చేస్తున్న GHMC అధికారులు
-
5 అంతస్థుల భవనం కూల్చేందుకు హైడ్రా రెడీ..
-
ఉద్రిక్తతల నడుమే.. ఒరిగిన బిల్డింగ్ కూల్చివేత ప్రారంభం
హైదరాబాద్, సాక్షి: గచ్చిబౌలి సిద్ధిఖ్ నగర్లో గత రాత్రి ప్రమాదకర స్థాయిలో ఒరిగిపోయిన భవనాన్ని కూల్చివేత ప్రారంభమైంది. బుధవారం ఉదయమే హైడ్రాలిక్ ‘బాహుబలి’క్రేన్‌తో అక్కడికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు.. ఉద్రిక్త వాతావరణంలోనే తమ పనిని ప్రారంభించారు. సదరు భవనం ముందు కేవలం పదిఫీట్ల రోడ్డు మాత్రమే ఉండడంతో.. చుట్టుపక్కల మరే నష్టం జరగకుండా కూల్చివేస్తున్నారు.ఈ ఉదయం ఆ భవనం పక్కన ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు.. బిల్డింగ్ కుంగడానికి ప్రధాన కారణమైన పిల్లర్లను పూడ్చేశారు. డీఆర్ఎఫ్ సిబ్బంది కూల్చివేతలో పాల్గొంటున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఆంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. గుంతలు తవ్విన భవన యాజమానిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇక..ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా గుంతలు తవ్వడం వల్లే పక్కన ఉన్న భవనం కుంగిందని, అలాగే కుంగిన ఆ భవనాన్ని కూడా నిబంధనలకు లోబడి కట్టలేదని, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఒరిగిన బిల్డింగ్ యాజమాని మాత్రం తమ వెర్షన్ వినిపిస్తున్నారు. ‘‘ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తవ్వకాలు చేపట్టారు. సెల్లార్ గుంతలు తవ్వడం వల్లే మా బిల్డింగ్ కుంగిపోయింది. మాకు ఆ ఓనర్‌తో నష్టపరిహారం ఇప్పించాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు.వసుకుల లక్ష్మణ్ అనే పేరిట ఈ ప్లాట్ ఉంది. జీప్లస్ ఫోర్లో రెండు పోర్షన్ల చొప్పున నాలుగు ఫ్లోర్లు నిర్మాణం చేశారు. ఆ భవనంలో మొత్తం 48 మంది అద్దెకు ఉంటున్నారు. చుట్టుపక్కల ఐటీ కారిడార్‌లో పని చేసేవాళ్లంతా. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలోనే గోడ కూలినట్లు శబ్దం వచ్చినా.. ఎవరూ పట్టించుకోలేదు. రాత్రి 8.30 గంటల సమయంలో పెద్దగా శబ్దం వచ్చి భవనం ఒరిగిపోతోందని అరుపులు వినిపించడంతో అందరూ భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆదరాబాదరాగా కిందకు వచ్చేశారు. ఇంతలోనే మూడో అంతస్తులో ఉండే సాదిక్ హుస్సేన్ కిందికి దూకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. -
తప్పిన పెను ప్రమాదం
-
పక్కకు ఒరిగిన భవనం
గచ్చిబౌలి (హైదరాబాద్): రాజధాని నగరంలోని మాదాపూర్ ఐటీ కారిడార్‌కు చెంతనే ఉన్న సిద్దిఖీనగర్‌లో నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగిన ఘటన కలకలం రేపింది. వసుకుల లక్ష్మణ్ అనే వ్యక్తి ప్లాట్ నం. 1639లో 70 గజాల స్థలంలో జీప్లస్ ఫోర్ భవనాన్ని నిర్మిచారు. ఫ్లోర్‌కు రెండు పోర్షన్ల చొప్పున నాలుగు ఫ్లోర్లు నిర్మాణం చేశారు. ఆ భవనంలో మొత్తం 48 మంది అద్దెకు ఉంటున్నారు. వారంతా చెంతనే ఉండే ఐటీ కంపెనీల్లో హౌజ్‌కీపింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో గోడ కూలినట్లు శబ్దం వచి్చనా ఎవరూ పట్టించుకోలేదు. కానీ రాత్రి 8.30 గంటల సమయంలో పెద్దగా శబ్దం వచ్చి భవనం ఒరిగిపోతోందని అరుపులు వినిపించడంతో అందరూ భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆదరాబాదరాగా కిందకు వచ్చేశారు. ఇంతలోనే మూడో అంతస్తులో ఉండే సాదిక్ హుస్సేన్ కిందికి దూకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈలోగా అందరూ కిందకు వచ్చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే భవనం నిర్మించినట్లు తెలుస్తోంది. పక్క స్థలంలో గుంతలు తీయడంతోనేనా.. ఈ భవనం పక్కనే ఉండే 1605, 1638 ప్లాట్లను కలిపి భవనం నిర్మించేందుకు పిల్లర్లు వేయడానికి గుంతలు తవ్వారు. వీటితో భవనానికి ఇబ్బంది వస్తుందని ఈ భవన యజమాని వారిని హెచ్చరించారు. అయినా వారు వినలేదు. దీనివల్లే ఈ భవనం పరిస్థితి ఇలా మారిందని కొందరు అంటున్నారు. ఘటనా స్థలాన్ని జీహెచ్ఎంసీ వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, శేరిలింగంపల్లి టౌన్‌ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ, మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్, డీఆర్ఎఫ్ సిబ్బంది పరిశీలించారు.పక్కకు ఒరిగిన భవనం చుట్టూ ఉండే పది భవనాల్లో నివాసం ఉండేవారిని ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించి వేరేచోటికి తరలించారు. ఈ భవనం ముందు కేవలం పదిఫీట్ల రోడ్డు మాత్రమే ఉంది. భవనాన్ని ఇంజనీర్లు పరిశీలించి నాణ్యతను నిర్ణయిస్తారని, వారి నివేదిక ఆధారంగా ఒరిగిన భవనాన్ని తొలగిస్తామని ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. అలాగే ఈ భవనం వెనుక లోతైన గుంతలు తీసిన బిల్డర్పైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవనం విరిగిందని అరుపులు వినిపించడంతో వచ్చేశా.. ‘మేము మొదటి అంతస్తులో ఉంటున్నాం. రాత్రి 8.30 గంటల సమయంలో శబ్దం వచ్చింది. కొద్దిసేపటికే ఇంట్లోని సామాన్లు కిందపడిపోవడం ప్రారంభమైంది. అదే సమయంలో భవనం విరిగిందని అరుపులు వినిపించడంతో వంట చేస్తున్న స్టవ్ ఆర్పకుండానే భయంతో కిందికి వచ్చేశా’ అని జహారుల్ చెప్పారు. -
PKL 11: దుమ్ములేపిన టైటాన్స్.. ఉత్కంఠ పోరులో ఆఖరి నిమిషంలో గెలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్(PKL) పదకొండో సీజన్లో భాగంగా.. సొంతగడ్డపై తమ చివరి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు అదరగొట్టింది. టేబుల్ టాపర్, డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్‌కు ఊహించని షాకిచ్చింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క పాయింట్ తేడాతో విజయం సాధించింది. ఆట ఆఖరి నిమిషాల్లో విజయ్ మాలిక్ ప్రతిభతో పుణెరికి చెక్ పెట్టి వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసింది.కాగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 34–33 తేడాతో పుణెరిని ఓడించింది. టైటాన్స్ జట్టులో విజయ్ 13 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లతో మరో సూపర్ టెన్ సాధించాడు.ఇక పుణెరి జట్టులో పంకజ్ మోహితే 9 పాయింట్లతో సత్తా చాటగా.. అతడికి తోడుగా అజిత్ కుమార్ ఆరు,మోహిత్ గోయత్ ఐదు పాయింట్లతో రాణించారు. అయినప్పటికీ ఆఖరికి ఓటమి నుంచి పుణెరి తప్పించుకోలేకపోయింది.ఆధిపత్యం చేతులు మారగాకాగా ఆట ఆరంభంలోనే తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ వరుస రెయిడ్ పాయింట్లకు తోడు డిఫెండర్లు కూడా రాణించారు. ఇక తన మూడు రెయిడ్స్ లో పవన్ నాలుగు పాయింట్లు రాబట్టగా.. టైటాన్స్ 5–0 ఆధిక్యంతో ఆటలో ఆధిపత్యం కనబరిచింది. ఈ క్రమంలో పుణెరి జట్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగిలిపోవడంతో ఆ జట్టు ఆలౌట్ ప్రమాదం ముంగిట నిలిచింది.ఇలాంటి దశలో పంకజ్ బోనస్ పాయింట్‌తో పుణెరి ఖాతా తెరిచాడు. పవన్ మరో టచ్ పాయింట్ట రాబట్టగా.. పుణెరి కోర్టులో పంకజ్ ఒక్కడే మిగిలాడు. తీవ్ర ఒత్తిడిలో కూతకు వెళ్లిన పంకజ్ బోనస్, సూపర్ రెయిడ్‌తో మూడు పాయింట్లతో జట్టును ఆదుకున్నాడు. ఆ వెంటనే పవన్‌ను సూపర్ ట్యాకిల్ చేసిన పుణెరి 6–6తో స్కోరు సమం చేసింది.తొలి అర్ధభాగం 20–20తో సమంగా అస్లాం, పంకజ్ చెరో పాయింట్ రాబట్టగా.. కోర్టులో మిగిలిన విజయ్ను ట్యాకిల్ చేసిన పుణెరి డిఫెండర్లు తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేశారు. దాంతో పుణెరి 13–9తో ఆధిక్యంలోకి వెళ్లింది. జట్టు మొత్తం కోర్టుపైకి వచ్చిన తర్వాత టైటాన్స్ తిరిగి పుంజుకుంది. పవన్ తన జోరు కొనసాగిస్తూ సూపర్ టెన్ పూర్తి చేసుకున్నాడు.మరో రెయిడర్ విజయ్ మాలిక్ కూడా ఆకట్టుకోగా.. డిఫెన్స్ విభాగం కూడా మెరుగవ్వడంతో పుణెరిని ఆలౌట్ చేసి ప్రతీకారం తీర్చుకున్న తెలుగు జట్టు 20–18తో తిరిగి ఆధిక్యం సాధించింది. కానీ, విరామం ముంగిట పవన్ ప్రత్యర్థి డిఫెండర్లకు దొరికిపోవడంతో తొలి అర్ధభాగం 20–20తో సమంగా ముగిసింది.ఆఖరికి టైటాన్స్ పైచేయిరెండో అర్ధభాగంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు పోరాడాయి. ఇరు జట్లూ చెరో పాయింట్ నెగ్గుతూ ముందుకెళ్లడంతో ఆట సమంగా సాగింది. విరామం తర్వాత పది నిమిషాల్లో చెరో నాలుగు పాయింట్లు మాత్రమే రాబట్టాయి. అటు టైటాన్స్, ఇటు పల్టాన్ ఏ మాత్రం తప్పిదానికి తావివ్వకుండా ఆడే ప్రయత్నం చేశాయి.ఇరు జట్ల డిఫెన్స్ బలంగా ఉండటంతో ఎక్కువగా ఎమ్టీ రెయిడ్స్ వచ్చాయి. టైటాన్స్ ఒక్కో పాయింట్ ఆధిక్యంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసినా పుణెరి వెంటనే స్కోరు సమం చేయడంతో ఆట ఉత్కంఠగా సాగింది. అయితే రెండో భాగంలో పవన్ సెహ్రావత్ వేగం తగ్గింది. విజయ్ సూపర్ టెన్ పూర్తి చేసుకున్నా.. టైటాన్స్ కోర్టులో తక్కువ మంది ఉండటంతో ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఓ దశలో 31–29తో ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఆలౌట్ అయింది. దాంతో పుణెరి 33–32తో ఒక పాయింట్ ఆధిక్యంలోకి వచ్చింది. చివరి నిమిషంలో విజయ్ ఒక రెయిడ్ పాయింట్‌తో పాటు అజిత్ కుమార్‌ను ట్యాకిల్ చేయడంతో టైటాన్స్ ఒక్క పాయింట్ తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. -
ఉత్సవ్ దీక్షిత్ అరెస్టు
బంజారాహిల్స్: రోడ్డు ప్రమాదానికి కారకుడైన స్టాండప్ కమెడియన్ ఉత్సవ్ దీక్షిత్ (33)ను ఆదివారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్డునంబర్–6లో నివసించే ఉత్సవ్ దీక్షిత్ గత నెల 31వ తేదీ అర్ధరాత్రి తన భార్యతో గొడవపడి పోర్షే కారులో బయటకు వచ్చి రాత్రంతా నగరంలో చక్కర్లు కొట్టాడు. కారులో మితిమీరిన వేగంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో తిరిగాడు. 1వ తేదీ తెల్లవారుజామున 5.45 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12 నుంచి వెళ్తుండగా బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సమీపంలో కారు అదుపుతప్పి స్టీరింగ్ లాక్ కావడంతో డివైడర్‌ను ఢీకొట్టి కేబీఆర్ పార్కు ఫెన్సింగ్‌ను దాటుకుని చెట్టు పైకి వెళ్లి కిందపడింది. స్వల్ప గాయాలతో ఉత్సవ్ బయటపడి పారిపోయాడు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. నిందితుడిపై ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్‌ను సీజ్ చేసి రద్దు చేయాల్సిందిగా ఆర్డీఓకు లేఖ రాశారు. పోలీసుల విచారణలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే కారు అదుపు తప్పినట్లు తేలింది. కాగా.. ఉత్సవ్ దీక్షిత్ స్టాండప్ కమెడియన్‌గా సుపరిచితుడు. పలు కార్యక్రమాల్లో కమెడియన్‌గా గుర్తింపు పొందాడు. ప్రేమ వివాహం చేసుకున్న ఉత్సవ్ దీక్షిత్ ఇంట్లో భార్యతో గొడవ పడి ఆ కోపాన్ని కారు మీద చూపించినట్లుగా నిర్ధారణ అయింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
PKL 11: యూ ముంబా మెరుపు విజయం.. మాజీ చాంపియన్‌కు షాక్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదకొండో సీజన్లో యూ ముంబా రెండో విజయం నమోదు చేసింది. జైపూర్ పింక్ పాంథర్స్‌పై 39-37తో గెలుపొందింది. గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో గురువారం మాజీ చాంపియన్లు యు ముంబా- జైపూర్ పింక్ పాంథర్స్ తలపడ్డాయి.ఈ ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో యూ ముంబా రెయిడర్ అజిత్ చౌహాన్ (14 పాయింట్లు) సూపర్ టెన్ షోతో అదరగొట్టాడు. మరోవైపు.. పింక్ పాంథర్స్ తరఫున నీరజ్ నర్వాల్ (12 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే, ఆట తొలి పది నిమిషాల వరకు ఏ జట్టుకు స్పష్టమైన ఆధిక్యం లభించలేదు.ఫస్టాఫ్ చివర్లో యూ ముంబా ముందంజఇటు జైపూర్, అటు యూ ముంబా రెయిడర్లు, డిఫెండర్లు వరుసగా పాయింట్లు సాధించారు. ఆట మొదలైన పది నిమిషాల అనంతరం 9-9తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. అయితే, ఫస్టాఫ్ చివర్లో యూ ముంబా ముందంజ వేసింది. జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఆలౌట్ చేసి విలువైన పాయింట్లు ఖాతాలో వేసుకుంది.ప్రథమార్థం ముగిసే సరికి యూ ముంబా 19-16తో మూడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా.. రెయిడింగ్‌లో ఇరు జట్లు పదేసి పాయింట్లు సాధించగా.. ట్యాకిల్స్‌లో యూ ముంబా ఐదు, జైపూర్ ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. కానీ అదనపు పాయింట్లు యూ ముంబాను ఆధిక్యంలో నిలబెట్టాయి.ద్వితీయార్థం మరింత ఉత్కంఠఇక ఇరుజట్ల మధ్య ద్వితీయార్థం ఆట మరింత ఉత్కంఠ రేపింది. యూ ముంబా ముందంజలో కొనసాగినా.. జైపూర్ పింక్ పాంథర్స్ పట్టు వదల్లేదు. ఆఖరు వరకు యూ ముంబాను తిప్పలు పెట్టింది. మరో మూడు నిమిషాల ఆట మిగిలి ఉండగా నీరజ్ నర్వాల్ సూపర్ రెయిడ్‌తో 32-32తో జైపూర్ పింక్ పాంథర్స్.. యూ ముంబా స్కోరును సమం చేసింది.కానీ ఆ తర్వాతి రెయిడ్‌లోనే రోహిత్ రాఘవ్ సూపర్ రెయిడ్‌తో మూడు పాయింట్లు తీసుకొచ్చాడు. దీంతో యూ ముంబా మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరు వరకు ఆధిక్యం నిలుపుకున్న యూ ముంబా మెరుపు విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన జైపూర్‌కు ఇది రెండో ఓటమి.చదవండి: హర్యానా స్టీలర్స్ హ్యాట్రిక్ విజయం -
PKL 11: తమిళ్ తలైవాస్ దూకుడు.. గుజరాత్ చిత్తు
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ జెయింట్స్‌పై తమిళ్ తలైవాస్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా 44-25తో చిత్తు చేసింది. తద్వారా ఏకంగా 19 పాయింట్ల భారీ తేడాతో గుజరాత్‌పై తమిళ్ తలైవాస్ గెలుపొందింది. సీజన్లో మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి ఎగబాకింది. మరోవైపు..ఈ సీజన్లోనాలుగు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ జెయింట్స్‌కు ఇది మూడో పరాజయం.కాగా గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్.. గుజరాత్‌తో తలపడింది అదరగొట్టింది. తలైవాస్ స్టార్ రెయిడర్ నరేందర్ 20 సార్లు కూతకెళ్లి 15 పాయింట్లు సాధించగా.. సచిన్ (5 పాయింట్లు), డిఫెండర్ నితేశ్ కుమార్ (4 పాయింట్లు), ఆమీర్ ( 4 పాయింట్లు) రాణించారు. గుజరాత్ జెయింట్స్ ఆటగాళ్లలో గుమన్ సింగ్ ఏడు పాయింట్లు సాధించగా, రాకేశ్ మూడు పాయింట్లతో మెరిశాడు.ఆకట్టుకున్న తలైవాస్..మ్యాచ్ప్రథమార్థం తొలి పది నిమిషాల్లో ఆధిపత్యం కోసం ఇరు జట్లు గట్టిగా పోటీపడ్డాయి. అయితే, 11-9తో తమిళ్ తలైవాస్ పైచేయి సాధించింది. కానీ గుజరాత్ జెయింట్స్ రెట్టించిన ఉత్సాహంతో పోరాడింది. డిఫెన్స్‌లో తలైవాస్‌తో సమవుజ్జీగా నిలిచినా.. రెయిడింగ్‌లో జెయింట్స్ వెనుకంజ వేసింది. తలైవాస్ స్టార్ రెయిడర్ నరేందర్, సచిన్ మెరువగా.. గుజరాత్ జెయింట్స్ రెయిడర్లలో గుమన్ సింగ్ మాత్రమే మెప్పించాడు. దీంతో ప్రథమార్థం ఆట ముగిసేసరికి తమిళ్ తలైవాస్ 18-14తో నాలుగు పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది.తలైవాస్ దూకుడు..విరామం అనంతరం తమిళ్ తలైవాస్ దూకుడు పెంచింది. తొలి 20 నిమిషాల్లో సాధించిన ఆధిక్యాన్ని.. ద్వితీయార్థంలో తొలి పది నిమిషాల్లోనే సొంతం చేసుకుంది. ప్రథమార్థంలో ఆలౌట్ కాకుండా జాగ్రత్త పడిన గుజరాత్ జెయింట్స్ సెకండ్ హాఫ్‌లో చేతులెత్తేసింది.జెయింట్స్ కోర్టు ఖాళీ చేసిన తలైవాస్ విలువైన ఆలౌట్ పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఆఖరు నిమిషంలో గుజరాత్ జెయింట్స్‌ను మరోసారి ఆలౌట్ చేసిన తమిళ్ తలైవాస్ ఏకపక్ష ప్రదర్శన చేసింది. చివరి 20 నిమిషాల ఆటలో తమిళ్ తలైవాస్ 26 పాయింట్లు సాధించగా, గుజరాత్ జెయింట్స్ కేవలం 11 పాయింట్లే సొంతం చేసుకుంది. -
ఐటీ కారిడార్‌లో.. రెడ్ హార్ట్ ట్రాఫిక్ సిగ్నల్
గచ్చిబౌలి: గుండెను పదిలంగా ఉంచుకుంటే పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండవచ్చనే నినాదంతో ప్రధాన కూడళ్లలో రెడ్ హార్ట్ సిగ్నల్ ఏర్పాటు చేశారు. స్టార్ హాస్పిటల్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి ప్రధాన కూడళ్లలో రెడ్ సిగ్నల్‌కు బదులు రెడ్‌హార్ట్ సింబల్ ఏర్పాటు చేశారు. హృద్రోగాలపై వాహనదారులకు మరింత అవగాహన కలి్పంచేందుకు తమ వంతు ప్రయత్నంగా వీటిని ఏర్పాటు చేశారు. వయసుతో నిమిత్తం లేకుండా ఎంతో మంది గుండె సంబంధిత వ్యాధులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఐటీ కారిడార్‌లోని రెడ్ సిగ్నల్ వచి్చనప్పుడు హార్ట్ సింబల్ కనిపిస్తోంది. దీంతో వాహనదారులు గుండె ఆరోగ్యం గురించి ఆలోచించే వీలుంటుంది. గచి్చ»ౌలి ట్రాఫిక్ డివిజన్ పరిధిలోని గచి్చ»ౌలి, మాదాపూర్, రాయదుర్గం, నార్సింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన కూడళ్లలో రెడ్ సిగ్నల్‌కు బదులు హార్ట్ సింబల్ కనిపిస్తోంది. వినూత్న రీతిలో హార్ట్ సింబల్ కనిపించడంతో వాహనదారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దీంతోపాటు సిగ్నల్స్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. -
బిర్యానీలో కప్ప.. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: గచ్చిబౌలి ట్రిపుల్ఐటీలోని కదంబ మెస్‌లో విద్యార్థులకు ఇటీవల పెట్టిన బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిర్యానీలో కప్ప రావడానికి మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు మండిపడుతున్నారు. మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైన ఫొటోను విద్యార్థులు ట్విటర్లో షేర్ చేశారు. మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.Shocked and horrified! Found a frog in my friend's meal today at Kadamba Mess (IIIT Hyderabad). This is completely unacceptable and poses a serious health risk! @cfs_telangana, please take immediate action! #FoodSafety #Unhygienic #Hyderabad #IIITHyderabad pic.twitter.com/VCCKM0kuob— ram manohar (@manoharrocksss) October 17, 2024 ఇదీ చదవండి: అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత -
వస్త్రం బై సింఘానియాస్ను ప్రారంభించిన ఏపీ మిస్ యూనివర్స్ (పోటోలు)
-
యువతిపై ఆటోలో లైంగిక దాడి..
-
గచ్చిబౌలిలో దారుణం.. ప్రైవేట్ ఉద్యోగినిపై ఆటోలో లైంగికదాడి
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఉద్యోగినిపై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో ఆటోలో యువతిపై అత్యాచారం చేశారు. ఆ యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్సీపురం నుంచి గచ్చిబౌలికి ఆటోలో యువతి వెళ్తుండగా ఆ ఘటన జరిగింది.కోడలిపై అత్త, ఆడపడుచు దాడికోడలిపై అత్త, ఆడపడుచు వేడి నీళ్లు పోవడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన నజియా బేగంకు సంతోష్‌నగర్ ఓవైసీ కాలనీకి చెందిన షేక్ షబ్బీర్‌తో వివాహం జరిగింది. షేక్ షబ్బీర్ ప్రస్తుతం ఉద్యోగం నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నాడు. నజియా బేగంకు నలుగురు సంతానం.అత్త మహ్మదియా బేగంతో తరుచూ గొడవలు జరుగుతుండటంతో నజియాబేగం కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతంలో పిల్లలతో కలిసి వేరుగా నివాసముంటోంది. ఆదివారం పిల్లలు నానమ్మ ఇంటికి వెళ్లడంతో వారిని తీసుకొచ్చేందుకు నజియా బేగం అత్తగారింటికి వెళ్లింది. ఈ సందర్భంగా అత్త, ఆడపడుచుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి లోనైన అత్త మహ్మదియా బేగం, ఆమె కుమార్తె కలిసి నజియా బేగంపై వేడి నీళ్లు పోయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితురాలు నజియా బేగం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్
-
‘పింక్ పవర్ రన్’ను ప్రారంభించిన మంత్రి రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పింక్ పవర్ రన్ 2024’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు.ఆదివారం ఉదయం 5.30 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ మారథాన్‌లో సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారు. ఒకేసారి 3కే, 5కే, 10కే రన్‌ను నిర్వహించారు. పింక్ మారథాన్‌లో గెలిచిన వారికి మెడల్స్ పంపిణీ చేయనున్నారు.ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగులు పాల్గొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం సంపాదించేందుకు ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. -
HYD: శ్రుతి కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఓ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందడడం తెలిసిందే. అయితే ఈ కేసులో మిస్టరీ వీడింది. శృతిది రేప్ అండ్ మర్డర్ కాదని.. ఆమె బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తేల్చేశారు.జడ్చర్లకు చెందిన శ్రుతి (23).. మూడు రోజుల కిందట గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో ఫ్యాన్‌కు శవమై వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. గదిలో బీర్ బాటిల్స్ ఉండడం, అంతా చిందరవందరగా ఉండడంతో గొడవ జరిగి ఉంటుందని అనుమానించారు. మరోవైపు.. మృతదేహాన్ని తరలించకుండా ఆమె బంధువులు అడ్డుకున్నారు. ఆమెపై హత్యాచారం జరిగిందన్నది వాళ్ల ప్రధాన ఆరోపణ. దీంతో పోలీసులు వాళ్లకు సర్ధిజెప్పి ఉస్మానియాకు బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించారు.ఈలోపు కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ఆమెది ఆత్మహత్యగానే తేల్చారు. ‘‘శ్రుతి గత కొంతకాలంగా జీవన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అయితే పెళ్లికి ఆ యువకుడు నిరాకరించాడు. దీంతో మాట్లాడుకునేందుకు ఇద్దరూ హోటల్‌కు వెళ్లారు. అక్కడ మాటామాటా పెరిగి.. ఇద్దరూ గొడవ పడ్డారు. జీవన్ తన తన ఫ్రెండ్ గదికి వెళ్లిపోయాడు. శ్రుతి పక్కనే ఉన్న మరో గదిలోకి వెళ్లి ఉరేసుకుంది’’ అని వివరాలను తెలిపారు. ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్న పోలీసులు.. జీవన్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
HYD: నర్సింగ్ విద్యార్థినిపై హత్యాచారం?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో దారుణం చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందగా.. ఆమెపై హత్యాచారం జరిగిందని బంధువులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు.గచ్చిబౌలి రెడ్‌స్టోన్ హోటల్లోని ఓ గదిలో ఓ యువతి ఉరికొయ్యకు వేలాడుతుండడంతో పోలీసులకు సమాచారం వెళ్లింది. వెంటనే క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. గదిలో అంతా రక్తపు మరకలు ఉండగా, మరోవైపు మద్యం బాటిల్స్ పడి ఉన్నాయి. మృతిరాలిని నర్సింగ్ చదువుతున్న శృతిగా పోలీసులు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గది మొత్తం చెల్లాచెదురుగా పడి ఉండడంతో గొడవ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఘటన గురించి తెలిశాక హోటల్ వద్దకు చేరుకున్న మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. తమ బిడ్డపై అఘాయిత్యానికి ఒడిగట్టి, ఆపైనే ఉరి వేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులను అడ్డుకుని హోటల్ ముందు ధర్నాకు దిగారు. ఇదీ చదవండి: ప్రియుడి మోజుతో ఆ కూతురు చేసిన పనికి..