హైదరాబాద్‌: ట్రాఫిక్‌ అలర్ట్‌.. ఆ రూట్లలో వెళ్లకపోవడమే మంచిది! | Hyderabad: Ilayaraja Live Concert Traffic Diversion These Routes | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: ట్రాఫిక్‌ అలర్ట్‌.. ఆ రూట్లలో వెళ్లకపోవడమే మంచిది!

Published Sat, Feb 25 2023 11:48 AM | Last Updated on Sat, Feb 25 2023 5:03 PM

Hyderabad: Ilayaraja Live Concert Traffic Diversion These Routes - Sakshi

సాక్షి,గచ్చిబౌలి(హైదరాబాద్‌): గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ట్రాఫిక్‌ మళ్లింపు, భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ నారాయణ నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా లైవ్‌ కన్సర్ట్‌కు 17,520 మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందన్నారు.

లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వచ్చే వాహనాలను హెచ్‌సీయూ బస్‌ డిపో వద్ద ఎస్‌ఎంఆర్‌ వినయ్‌సిటీ, మసీద్‌బండ, బొటానికల్‌ గార్డెన్, గచ్చిబౌలి వైపు వెళ్లాల్సి ఉంటుంది. గచ్చిబౌలి సర్కిల్‌ నుంచి లింగంపల్లికి వెళ్లే వాహనాలు బొటానికల్‌ గార్డెన్, మసీద్‌బండ, హెచ్‌సీయూ బస్‌ డిపో వైపు వెళ్లాల్సి ఉంటుందన్నారు. రాయదుర్గం నుంచి లింగంపల్లి వైపు వచ్చే వాహనాలను ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ నుంచి గోపీచంద్‌ అకాడమీ, విప్రో సర్కిల్, క్యూసిటీ, గోపన్‌పల్లి, నల్లగండ్ల ఫ్లై ఓవర్‌ నుంచి వెళ్లాలన్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్, గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. ట్రక్కులు, లారీలు, వాటర్‌ ట్యాంకర్లు, డీసీఎంలు, ఆర్‌ఎంసీ వాహనాలపై ఆంక్షలు ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని కోరారు.

చదవండి: లవర్ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య గొడవ.. మందు తాగుదామని రూమ్‌కి పిలిచి దారుణంగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement