
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గచ్చిబౌలిలో 400 ఎకరాల వేలంపాటకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు పిలిచింది. ఈ నెల 15 వరకు బిడ్ దాఖలుకు గడువు ఇచ్చింది.
కాగా, భూముల అమ్మకానికి రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, హరీష్‌రావు ఆరోపించారు. రూ. 30 వేల కోట్ల విలువైన భూములు అమ్మేందుకు యత్నిస్తున్నారు. నాడు భూములు అమ్మొద్దని రేవంత్ సుద్దులు చెప్పారు. పీసీసీ చీఫ్‌గా ఒక మాట.. సీఎం రాగానే మరో మాట అంటూ హరీష్‌రావు దుయ్యబట్టారు.
ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందంటూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ మొసలి కన్నీరు కార్చారని హరీష్‌రావు గుర్తుచేశారు. ప్రభుత్వ భూములను అమ్మబోంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించి మూడు నెలలైనా గడవక ముందే విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారంటూ కాంగ్రెస్ సర్కార్‌ని హరీష్‌రావు నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment