auction
-
వయసు 16 ఆట ఖరీదు 1.6 కోట్లు
తమిళనాడుకు చెందిన ఆ అమ్మాయి 12 ఏళ్ల వయసు వరకూ స్కేటింగ్ చేసింది. అదృష్టమో దురదృష్టమో లాక్డౌన్ వచ్చింది. బోర్ కొట్టి బ్యాట్ అందుకుంది. సరిగ్గా నాలుగేళ్లు. డబ్ల్యూపీఎల్ ఆక్షన్‌లో 10 లక్షలు పలికితే గొప్పనుకుంటే కోటీ అరవై లక్షలు పలికింది. అద్భుతమైన ప్రతిభ, కృషి ఉంటే విధిని తిరగరాయొచ్చని చెబుతుంది జి.కమలిని.మొన్నటి ఆదివారం (డిసెంబర్ 15) ఏం జరిగిందో తెలుసా? కౌలాలంపూర్‌లో మహిళల అండర్–19 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్–ఇండియాల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్‌లో పాకిస్తాన్ బ్యాటర్స్ రన్స్ కోసం బాల్‌ను బాదినప్పుడల్లా వికెట్స్ వెనుక నుంచి ఆ అమ్మాయి గట్టిగట్టిగా కేకలు వేస్తూ బాల్‌ను విసరమని ఫీల్డర్లను ఉత్సాహపరుస్తోంది. ఆ అమ్మాయి హుషారు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మధ్యాహ్నం టార్గెట్‌ను ఛేదించే బాధ్యత ఇండియన్స్‌ది. వికెట్‌కీపర్‌గా ఉన్న అమ్మాయి ఇప్పుడు బ్యాట్ పట్టుకొని క్రీజ్ మీదకు వచ్చింది. అంతవరకే గుర్తుంది... అందరికీ. ఆ తర్వాత ఆ అమ్మాయి కొడుతున్న షాట్లకి గతం భవిష్యత్తు మర్చిపోయి వర్తమానంలో మునకలేశారు. షాట్ షాట్‌కు కేరింతలే. మొత్తం 44 రన్స్ చేసిందా అమ్మాయి. లాస్ట్ బంతిని భారీ సిక్స్ కొట్టి ఆట ముగించింది.కౌలాలంపూర్‌లో ఇలా ఆట ముగుస్తున్న సమయానికి బెంగళూరులో డబ్ల్యూపీఎల్ కోసం మహిళా క్రికెటర్ల ఆక్షన్ జరుగుతోంది. ఇదే అమ్మాయి పేరును పిలిచారు. అంతవరకూ ఆమె 10 లక్షల రూపాయలకు వేలంలో దక్కుతుందని అందరూ భావించారు. కాని కౌలాలంపూర్ ఆట ప్రభావం చూపింది. ముంబై ఇండియన్స్ టీమ్, ఢిల్లీ కాపిటల్స్ టీమ్ పాట పెంచుతూ పోటీ పడ్డాయి. చివరకు కోటీ అరవై లక్షలతో ఆక్షన్ ముగిసి ఆ అమ్మాయి ముంబై ఇండియన్స్ జట్టు భాగస్వామి అయ్యింది. ఒకేరోజు ఇలా కౌలాలంపూర్‌లో ఇటు బెంగళూరులో మార్మోగిన ఆ అమ్మాయి పేరు కమలిని. వయసు 16.మదురై అమ్మాయికమలినిది మధ్యతరగతి కుటుంబం. మదురైలో ఉండేది. స్కేటింగ్ నేర్చుకుంటూ హుషారుగా ఉండే కమలిని 12 ఏళ్ల వరకు క్రికెట్ జోలికే వెళ్లలేదు. 2022లో కరోనా రావడంతో లాక్డౌన్ వచ్చి ఆమె తండ్రి గుణాలన్ కాలక్షేపానికి కొడుకుతో వీధిలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ఒకరోజు కమలినిని పిలిచి నువ్వు బౌలింగ్ చెయ్ అన్నాడాయన. కమలిని బౌలింగ్ చేస్తే దిమ్మెర పోయాడు. అలా ఆ వయసులో అలా బౌలింగ్ చేసే పిల్లలు లేరు. కమలినికి ఇది సహజసిద్ధంగా వచ్చిందని గ్రహించిన తండ్రి మరి ఆలస్యం చేయలేదు. మరుసటి సంవత్సరమే చెన్నై కాపురం మార్చి‘చైన్నె సూపర్‌కింగ్స్ అకాడెమీ’లో చేర్చాడు. అక్కడ ఆమె ప్రతిభ గమనించి వెంటనే ‘తమిళనాడు అండర్–19’లోకి తీసుకున్నారు. విమెన్స్ అండర్ 19 టి 20 కప్‌లో 8 మేచెస్లో 311 పరుగులు కొట్టింది కమలిని. అంతేకాదు సిక్సర్ల కమలినిగా పేరు ΄పొందింది. ఆమె సిక్స్‌కు బాల్ని లేపితే బౌండరీ దాటాల్సిందే.తండ్రి అంటే ప్రేమకమలినికి తండ్రంటే చాలా ప్రేమ. ఆయనకు గుండె సమస్య తలెత్తితే తల్లడిల్లిపోయింది కమలిని. ‘మా నాన్నంటే నాకు చాలా ఇష్టం’ అంటుంది. ఆ సమయంలో ఆటమీద మనసు లగ్నం చేయలేకపోయింది. అయితే తండ్రికి సర్జరీ అయ్యి ఇంకేం పర్వాలేదని డాక్టర్లు చె΄్పాక ఆ మరుసటి రోజే తమిళనాడు– ఆంధ్రల మధ్య మ్యాచ్ ఉంటే చెలరేగి సెంచరీ బాదింది కమలిని. ప్రతిభ, తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రోత్సాహం సమృద్ధిగా ఉన్న ఈ అమ్మాయి మున్ముందు మరిన్ని ఘనవిజయాలు సాధిస్తుంది. -
ముంబై ఇండియన్స్ మహిళా టీం, యువ ప్రతిభకు ప్రాధాన్యం : నీతా
మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం రిలయన్స్ఫౌండేన్ చైర్పర్సన్ నీతా అంబానీ యాజమాన్యలోని ముంబై ఇండియన్స్ పటిష్టమైన టీంను సిద్ధం చసింది. WPL 2025 ఆదివారం బెంగుళూరులో జరిగిన వేలంలో కొత్తగా నలుగురు మహిళా క్రికెటర్లను జట్టులో చేర్చుకుంది. దీనిపై నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. తమ ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో యువతకు ప్రాధాన్యత ఇచ్చి, వారిలోని ప్రతిభను గుర్తించి, తద్వారా టీం పటిష్టతకు ప్రయత్నిస్తోందని నీతా తెలిపారు.నీతా అంబానీ కొత్తగా ఎంపికైన టీంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పురుషుల జట్టులో ఆటగాళ్లు బుమ్రా, హార్తిక్, తిలక్ ప్రపంచ వేదికపై ప్రతిభతో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. అలాగే గతేడాది వేలంలో తీసుకున్న సజనకూడా అద్భుతంగా ఆడిందంటూ ప్రశంసించారు నీతా. ముంబై ఇండియన్స కుటుంబంలో భాగమైన అమ్మాయిలందరి గురించి తాను గర్వపడుతున్నానని వ్యాఖానించారు. కొత్తగా టీంలో చేరిన తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల వికెట్ కీపర్ జి. కమలిని, ఆల్ రౌండర్లు సంస్కృతి గుప్తా, అక్షితా మహేశ్వరి, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ నాడిన్ డి క్లర్క్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. “Grooming young talent, and watching them play at the global stage feels wonderful.”Mrs. Nita Ambani encourages new talent joining the 𝗙𝗔𝕄𝕀𝗟𝗬 at the #TATAWPLAuction! 💙#OneFamily #AaliRe #MumbaiIndians pic.twitter.com/VySfK4B6W6— Mumbai Indians (@mipaltan) December 15, 2024 -
మినీ వేలం: యువ క్రికెటర్‌కు కళ్లు చెదిరే ధర.. ఎవరీ కమలిని?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలం సందర్భంగా తమిళనాడుకు చెందిన ఓ యువ క్రికెటర్‌పై కనక వర్షం కురిసింది. పదహారేళ్ల జి. కమలిని కోసం ముంబై ఇండియన్స్ భారీ మొత్తం ఖర్చు చేసింది. అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ఉన్న ఈ ఆల్‌రౌండర్‌ను ఏకంగా రూ. 1.60 కోట్లకు కొనుగోలు చేసింది.19 స్థానాల కోసంభారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మినీ వేలంలో మొత్తం 120 మంద మహిళా క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఐదు జట్లలో కలిపి ఖాళీగా ఉన్న 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది, విదేశాల నుంచి 29 మంది ఆటగాళ్లు బరిలో నిలిచారు.రూ. 10 లక్షల కనీస ధరఇక బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ వేలంపాటలో జి. కమలిని రూ. 10 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఆమె కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు ముంబై ఇండియన్స్ బిడ్ వేసింది. అయితే, ఈ ఆల్‌రౌండర్‌ను ఎలాగైనా తమ జట్టులోకి చేర్చుకోవాలని పట్టుబట్టిన ముంబై యాజమాన్యం.. ఢిల్లీతో పోటీ పడి ఆమె ధరను కోటి దాటించింది.అయినప్పటికీ ఢిల్లీ వెనక్కి తగ్గకపోవడంతో మరో అరవై లక్షలు పెంచి ఏకంగా 1.60 కోట్ల రూపాయలకు ముంబై కమలిని సేవలను సొంతం చేసుకుంది. కాగా అన్క్యాప్డ్ ప్లేయర్ అయినప్పటికీ జి.కమలిని కోసం వేలంలో భారీ డిమాండ్ రావడానికి కారణం.. ఆమె నైపుణ్యాలే.భారీ సిక్సర్లతో విరుచుకుపడే లెఫ్టాండర్ఇటీవల జరిగిన అండర్-19 మహిళల టీ20 ట్రోఫీలో తమిళనాడు టైటిల్ గెలవడంలో జి. కమలినిది కీలక పాత్ర. ఈ టోర్నమెంట్లో ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి ఆమె 311 పరుగులు చేసింది. భారీ సిక్సర్లతో విరుచుకుపడే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. పార్ట్ టైమ్ స్పిన్నర్‌గానూ సేవలు అందించింది.అంతేకాదు.. ఈ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ వివిధ కేటగిరీల్లో తమిళనాడు తరఫున వికెట్ కీపర్‌గానూ బరిలోకి దిగింది. అందుకే ఈ ఆల్‌రౌండర్ కోసం ముంబై భారీ మొత్తం ఖర్చు చేసింది. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కోసంకాగా ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో నాలుగు ఖాళీలు ఉండగా.. ఒక స్థానం జి. కమలిని భర్తీ చేసింది. ఇక ఈ వేలంలో కమలిని కంటే ముందు సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నదినె డి క్లర్క్‌ను ముంబై కొనుక్కుంది. ఆమె కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.డాటిన్‌కు రూ. 1.70 కోట్లుమరోవైపు.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డియోండ్రా డాటిన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 1.70 కోట్లకు సొంతం చేసుకుంది. యూపీ వారియర్స్‌తో పోటీపడీ మరీ డాటిన్‌ను దక్కించుకుంది. అదే విధంగా సిమ్రన్ షేక్ కోసం గుజరాత్ అత్యధికంగా రూ. 1.90 కోట్లు ఖర్చు చేసింది.అయితే, తొలి రౌండ్లో పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా(కనీస ధర రూ. 30 లక్షలు) వంటి భారత ప్లేయర్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. కాగా డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ పేరిట ఐదు జట్లు పాల్గొంటున్నాయి. చదవండి: BGT: మహ్మద్ షమీకి బైబై! -
నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం
భారత స్టార్ జావెలియన్ త్రోయర్, హర్యానా అథ్లెట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) హెరిటేజ్ కలెక్షన్స్‌లో అతడి టీ షర్ట్ కొలువు తీరనుంది. వరుస ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన ఏకైక భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. టోక్యోలో స్వర్ణంతో మెరిసిన నీరజ్.. పారిస్‌లో రజతం గెలిచాడు.తన అద్భుత ఆటతీరుతో జాతి మొత్తాన్ని గర్వపడేలా చేసిన నీరజ్‌కు చెందిన టీషర్ట్ ఇప్పుడు మ్యూజియం ఆఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ (ఎమ్ఓడబ్ల్యూఏ)లో ‘షో పీస్’ కానుంది. పారిస్ మెగా ఈవెంట్లో రజత ప్రదర్శన సమయంలో వేసుకున్న టీషర్ట్‌ను డబ్ల్యూఏ మ్యూజియంకు విరాళంగా ఇచ్చాడు.కాగా పారిస్‌లో నీరజ్ చోప్రా ఈటెను 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజతం గెలుపొందాడు. మరోవైపు పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ (పాక్; 92.97 మీ.) చాంపియన్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. నీరజ్‌తో పాటు ఉక్రెయిన్‌కు చెందిన మహిళా అథ్లెట్లు యరోస్లావా మహుచిక్, థియా లాఫొడ్ల తీపిగుర్తులు కూడా ఆ హెరిటేజ్ కలెక్షన్లో ప్రముఖంగా కనిపించనున్నాయి. కొన్నేళ్ల పాటు ఈ విజేతల అపురూపాలను ప్రదర్శించాక క్రీడాభిమానులు, ఔత్సాహికులు కోసం సందర్భాన్ని బట్టి వేలం వేస్తారు. ఆ వేలంలో వచ్చిన మొత్తాన్ని సామాజిక సేవల కొరకు వెచ్చించడం తరచూ జరిగేదే! చదవండి: ‘అతడు కావాలనే ఓడిపోయాడు?’.. అంతర్జాతీయ చెస్ సమాఖ్య స్పందన ఇదే -
నేడు డబ్ల్యూపీఎల్ మినీ వేలం
బెంగళూరు: ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో ప్లేయర్లపై కనకవర్షం కురవగా... ఇప్పుడు మహిళల వంతు వచ్చిoది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఆదివారం బెంగళూరు వేదికగా డబ్ల్యూపీఎల్ మినీ వేలం జరగనుంది. ఈ మినీ వేలంలో 120 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఐదు ఫ్రాంచైజీలలో కలిపి మొత్తం 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది ప్లేయర్లు, విదేశాల నుంచి 29 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. ఇందులో అసోసియేషన్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. గుజరాత్ ఫ్రాంచైజీ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. యూపీ వారియర్స్ జట్టు ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉండగా... గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తలా నలుగురు ప్లేయర్లను కొనుగోలు చేయనున్నాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద అందరికంటే తక్కువగా రూ.2.5 కోట్లు ఉన్నాయి. విదేశీ ప్లేయర్లలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డాటిన్, ఇంగ్లండ్ కెపె్టన్ హీథర్ నైట్ రూ.50 లక్షల కనీస ధరతో వేలానికి రానున్నారు. భారత ఆటగాళ్లలో ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా రూ.30 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొననుంది. ఢిల్లీకి చెందిన లెఫ్టార్మ్ అన్షు నాగర్ 13 ఏళ్ల వయసులోనే వేలం బరిలో నిలిచింది. -
రైతు భూమి వేలానికి దండోరా
మదనాపురం: రైతు తీసుకున్న రుణాన్ని పూర్తిస్థాయిలో చెల్లించలేదని ఆత్మకూర్ డీసీసీబీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా గ్రామంలో డప్పు మోగిస్తూ.. సదరు రైతు భూమిని వేలం వేస్తామంటూ దండోరా వేశారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన రైతు లచ్చాగౌడ్ 2019లో గేదెల పెంపకం కోసం ఆత్మకూర్ డీసీసీబీలో తన రెండెకరాల పొలాన్ని కుదువపెట్టి రూ. 3.50 లక్షల అప్పు తీసుకున్నారు. దాదాపుగా రూ. 5 లక్షలకు పైగా బ్యాంక్‌కు చెల్లించినా అప్పు తీరలేదు. ఇంకా రూ.1.75 లక్షల బకాయి ఉందని.. బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైతు లచ్చాగౌడ్ భూమిని వేలం వేస్తామంటూ మంగళవారం గ్రామంలోని ప్రధాన వీధుల్లో డప్పు మోగిస్తూ.. మైక్‌లో చాటింపు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో కట్టలేదు.. నేను అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు రూ. లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. పంటలు సరిగ్గా పండక పెట్టుబడులు మీద పడి నష్టం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల రూ. 1.75 లక్షల రుణం కట్టలేదు. నాకు రుణమాఫీ కూడా వర్తించలేదు. భూమి వేలం వేస్తామంటూ గ్రామంలో దండోరా వేయడం చాలా బాధగా ఉంది. – లచ్చాగౌడ్, రైతు, మదనాపురం -
రూ. 2 కోట్ల 12 లక్షలకు...
సిడ్నీ: క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ ధరించిన ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్‌కు ఊహించినట్లుగానే వేలంలో భారీ ధర పలికింది. 1947–48లో సొంతగడ్డపై భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆయన ధరించిన ఈ క్యాప్‌పై వేలంలో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఆసక్తి కనబరిచారు. స్వదేశంలో బ్రాడ్‌మన్‌కు ఇదే చివరి సిరీస్ కాగా... ఐదు టెస్టుల ఈ పోరులో 4 సెంచరీలు సహా బ్రాడ్‌మన్ ఏకంగా 715 పరుగులు సాధించడం విశేషం. పది నిమిషాల పాటు సాగిన వేలంలో చివరకు ఒక వీరాభిమాని 2 లక్షల 50 వేల డాలర్లకు (సుమారు రూ.2.12 కోట్లు) దీనిని సొంతం చేసుకున్నాడు. ఆ వ్యక్తి వివరాలను నిర్వాహకులు వెల్లడించలేదు. దాదాపు 77 ఏళ్ల క్రితం వాడి రంగులు వెలిసిపోయి, కాస్త చినిగిపోయిన ఈ టోపీ లోపలి భాగంలో బ్రాడ్‌మన్ పేరు రాసి ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా బ్రాడ్‌మన్ విలువ ఏమిటో ఈ వేలం ధర చూపించింది. ఈ బ్యాగీ గ్రీన్ క్యాప్‌కు ఆసక్తికర నేపథ్యం ఉంది. భారత్‌తో సిరీస్ ముగిశాక బ్రాడ్‌మన్ క్యాప్‌ను భారత జట్టు మేనేజర్ పంకజ్ గుప్తాకు బహుమతిగా అందజేశారు. ఈ సిరీస్‌లో భారత జట్టు వికెట్ కీపర్, ఆ తర్వాత తన మేనకోడలిని పెళ్లాడిన ప్రబీర్ కుమార్ సేన్‌కు పంకజ్ గుప్తా ఇచ్చారు. అదే క్యాప్ ఇప్పుడు వేలానికి వచ్చింది. -
సర్కారు వారి పాట!
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్మించిన ఇళ్లలో మిగిలిపోయినవి, అసంపూర్తిగా ఉన్నవి, ఓపెన్ ప్లాట్లను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత తొమ్మిది ప్రాజెక్టులను ఎంపిక చేసింది. గతంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ తొమ్మిది ప్రాంతాల్లోని ఫ్లాట్లు, ప్లాట్లకు ధరలను ఖరారు చేసిన నేపథ్యంలో.. నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతోంది. వచ్చే నెలలోనే ఈ తొమ్మిది ప్రాంతాల్లోని ఆస్తులను వేలం వేయనున్నారు. ఇందులో ఒక బీహెచ్‌కే నుంచి 3 బీహెచ్‌కే వరకు ఉన్న 760 ఫ్లాట్లు... 200 గజాల నుంచి 2,200 గజాల వరకు ఉన్న 179 ప్లాట్లు.. అసంపూర్తిగా ఉన్న 5 నుంచి 9 అంతస్తుల 6 టవర్లు (ఇళ్ల సముదాయాలు) ఉన్నాయి. అన్నింటినీ కూడా ఉన్నవి ఉన్నట్టుగా (యథాతథ స్థితిలో) విక్రయించనున్నారు. తర్వాత మిగతా ప్రాజెక్టుల్లోని ఆస్తులను వేలం వేస్తారు. ఈ ఆస్తులు ఎక్కడెక్కడ? ⇒ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ, పోచారంలలో ఫ్లాట్లు ఉన్నాయి. వాటిల్లో కొన్ని పూర్తయినవి, కొన్ని అసంపూర్తివి ఉన్నాయి. బండ్లగూడలో 129 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సెమీ ఫినిష్డ్ స్థాయిలో ఆగిపోయినవి. ఇక ఇప్పటికిప్పుడు గృహప్రవేశం చేసుకునేలా పంతొమ్మిది 2 బీహెచ్‌కే ఫ్లాట్లు, పదకొండు 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ మోడల్ ఫ్లాట్లు కావడంతో వెల్ ఫర్నిష్డ్ కావడం విశేషం. వీటికి కనీస ధర చదరపు అడుగుకు రూ.3 వేలుగా నిర్ణయించారు. 3 బీహెచ్‌కే ఫ్లాట్ల ధర రూ.37.23 లక్షల నుంచి రూ.48.51 లక్షల వరకు పలికే అవకాశం ఉంది. ఇదే తరహాలో మిగతా కేటగిరీల ఫ్లాట్ల ధరలు కూడా ఉంటాయి. ⇒ పోచారంలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 255, 2 బీహెచ్‌కే ఫ్లాట్లు 340, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు 6 ఉన్నాయి. బండ్లగూడ కంటే వీటి ధరలు కొంత తక్కువగా ఖరారు చేశారు. ⇒ కొన్ని ఐదు అంతస్తులు, కొన్ని 9 అంతస్తులతో అసంపూర్తిగా ఉన్న 6 టవర్లను కూడా అమ్మకానికి ఉంచారు. వీటిల్లో ఫ్లాట్లను విడివిడిగా కాకుండా.. మొత్తం భవనాలను గంపగుత్తగా వేలం వేయనున్నారు. ⇒ ఇక చందానగర్‌లో మూడు భారీ టవర్లు నిర్మించేందుకు సిద్ధం చేసిన మూడు భారీ ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఇవి 2 వేల గజాల నుంచి 2,200 చదరపు గజాల వరకు విస్తీర్ణంతో ఉన్నాయి. వీటికి కనీస ధరను గజం రూ.40 వేలుగా నిర్ణయించారు. ⇒ 200 గజాల నుంచి 500 గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. నగర శివార్లలోని బహదూర్‌పల్లిలో 69, తొర్రూరులో 514, భూత్పూరు సమీపంలోని పోతులమడుగులో 111, మహబూబ్‌నగర్ పట్టణంలో 45 ప్లాట్లు అమ్మకానికి సిద్ధం చేశారు. అప్పట్లో రూ.1,940 కోట్లు.. ఈసారి రూ.850 కోట్లు! రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా 2022–23లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో స్వగృహ ఫ్లాట్లను వేలం వేసింది. అప్పట్లో ప్రభుత్వానికి రూ.1,940 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి తొలి దఫా వేలం ద్వారా రూ.850 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం బండ్లగూడ, పోచారం ప్రాజెక్టులలో మిగిలిన ఫ్లాట్లన్నింటినీ వేలంలో ఉంచారు. ఇంతకాలం ఆ ఇళ్ల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది. ఇప్పుడు అన్నీ అమ్ముడైతే ఈ భారం తగ్గుతుంది. ఇక గతంలో స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇళ్లు నిర్మించేందుకు సిద్ధం చేసిన స్థలాలనూ ఇప్పుడు వేలానికి పెడుతున్నారు. అవి అమ్ముడైతే ఆ ప్రాజెక్టులు కూడా ముగిసిపోయినట్టే. -
మహిళల ఐపీఎల్ వేలం ఎప్పుడు, ఎక్కడ అంటే..?
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు సంబంధించిన క్రికెటర్ల మినీ వేలం వచ్చే నెల 15న బెంగళూరులో నిర్వహించనున్నారు. వచ్చే సీజన్ ఫిబ్రవరి–మార్చి నెలలో జరుగుతుంది. ఐదు ఫ్రాంచైజీల మొత్తం బడ్జెట్ రూ. 15 కోట్లు. గత సీజన్ రూ. 13.5 కోట్ల కంటే కొంచెం పెరిగింది. ఒక్కో ఫ్రాంచైజీ వద్ద తక్కువ మొత్తమే ఉన్నప్పటికీ పలువురు స్టార్ క్రికెటర్లు వేలానికి రానున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ హిథెర్ నైట్, న్యూజిలాండ్ పేసర్ లీ తహుహు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డియాండ్ర డాటిన్ తదితర టాప్ స్టార్లు వేలంలో ఉన్నారు. వీరితో పాటు భారత్‌కు చెందిన స్నేహ్ రాణా, పూనమ్ యాదవ్, వేద కృష్ణమూర్తిలు కూడా వేలంలోకి వచ్చారు. గత రెండు సీజన్లు (2023, 2024)గా రన్నరప్‌తో సరిపెట్టుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ చేతిలో అందరికంటే కనిష్టంగా రూ.2.5 కోట్లు మాత్రమే ఉన్నాయి. గుజరాత్ జెయింట్స్ చేతిలో గరిష్టంగా రూ. 4.4 కోట్లు అందుబాటులో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వద్ద రూ. 3.25 కోట్లున్నాయి. వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగే బదిలీలకు సంబంధించిన గడువు ఈ నెలలో ముగియగా... ఒక్క డ్యానీ వ్యాట్ (ఇంగ్లండ్) బదిలీ జరిగింది. యూపీ వారియర్స్ నుంచి ఆర్సీబీ ఆమెను కొనుక్కుంది. -
సముద్ర గర్భ మైనింగ్ వేలం ప్రారంభం
న్యూఢిల్లీ: సముద్ర గర్భ ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాల వేలం మొదటి రౌండ్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. వీటిలో 13 మైన్స్‌ను విక్రయానికి ఉంచడం జరిగింది. ఈ మైన్స్‌లో మూడు సున్నపు మట్టి, మూడు నిర్మాణ ఇసుక, ఏడు పాలీమెటాలిక్ నాడ్యూల్స్– క్రస్ట్లు ఉన్నాయి. సముద్రగర్భ ఖనిజ వనరుల అన్వేషణ విషయంలో భారత్ పురోగతిని ఈ కేటాయింపులు సూచిస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. ఈ ఖనిజాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి, హైటెక్ తయారీ, గ్రీన్ ఎనర్జీ పరివర్తనకు కీలకం కావడం గమనార్హం. వేలానికి సిద్ధమైన ఆఫ్‌షోర్ ప్రాంతాలలో ప్రాదేశిక జలాలు, కాంటినెంటల్ షెల్ఫ్, ప్రత్యేక ఆర్థిక మండలి, దేశంలోని ఇతర సముద్ర మండలాలు ఉన్నాయి. ఖనిజ సంపద పటిష్టతను సూచిస్తోంది: మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రారంభ కార్యక్రమంలో బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఆఫ్‌షోర్ బ్లాకుల అన్వేషణ వల్ల దేశంలోని ఖనిజ సంపద మరింత పటిష్టం అవుతుందని తెలిపారు. భారతదేశంలో కీలకమైన ఖనిజాల కోసం డిమాండ్ పెరుగుతోందని వివరించారు. లిథియం డిమాండ్ ఎనిమిది రెట్లు పెరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్ త్వరలో క్రిటికల్ మినరల్స్ మిషన్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భాగస్వాములకోసం అన్వేషణ: వీఎల్ కాతా రావు ఖనిజ అన్వేషణ, అభివృద్ధి విభాగంలో భాగస్వాముల కోసం ప్రభుత్వం ప్రయతి్నస్తున్నట్లు గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ఈ సందర్భంగా తెలిపారు. ఖనిజాలపై పరిశోధన– అభివృద్ధిపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు. సముద్ర గర్భ మైనింగ్ వేలం పక్రియ ప్రారంభం నేపథ్యంలో దేశ, విదేశాల్లో రెండు మూడు రోడ్‌షోలు చేయడానికి తాము సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. గనుల అదనపు కార్యదర్శి సంజయ్ లోహియా మాట్లాడుతూ, ఆఫ్‌షోర్ మినరల్ బ్లాక్‌లను విజయవంతంగా వేలం వేయడానికి అవసరమైన అన్ని నిబంధనలను పూర్తి చేసినట్లు చెప్పారు. ఆఫ్‌షోర్ ప్రాంతాలలో మైనింగ్‌ను చేపట్టే చర్యలు తీసుకోవడమే మనకు సవాలు అని ఆయన పేర్కొంటూ, అయితే ఆయా చర్యల్లో విజయవంతం అవుతామన్న భరోసాను వ్యక్తం చేశారు. కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, పాలీమెటాలిక్ నాడ్యూల్స్ వంటి అధిక డిమాండ్ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అలాగే సప్లై చైన్‌ను స్థిరీకరించడానికి భారత్ విభిన్న ఖనిజ వనరులను అభివృద్ధి చేయాలని గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది.గ్లోబల్ లీడర్‌గా ఎదగడమే లక్ష్యం ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 2002ను పార్లమెంటు గత ఏడాది ఆగస్టులో సవరించింది. ఆఫ్‌షోర్ ప్రాంతాలలో ఖనిజ బ్లాకుల కేటాయింపు విధానంగా వేలాన్ని తప్పనిసరి చేసింది. వనరుల అన్వేషణ–వెలికితీత కోసం ఉత్పత్తి లీజులు, మిశ్రమ లైసెన్స్‌ల మంజూరును క్రమబదీ్ధకరణ వంటి చర్యలను తీసుకోడానికి ప్రభుత్వాన్ని ఈ సవరణ అనుమతిస్తుంది. భారత్ సముద్రగర్భంలో ఖనిజాల అన్వేషణలో అడుగుపెట్టినప్పుడు, దాని పారిశ్రామిక–గ్రీన్ ఎనర్జీ రంగాలను పెంపొందించడమే కాకుండా కీలకమైన ఖనిజాలలో గ్లోబల్ లీడర్‌గా తన స్థానాన్ని పొందడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. -
ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?
ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం’ ముగిసింది. వేలంలో పాల్గొన్న 10 ఫ్రాంచైజీలూ కలిపి ఆటగాళ్ల కోసం రు. 639 కోట్లకు పైగా ఖర్చుపెట్టాయి. మరోవైపు – ఆది, సోమవారాల్లో తొలిరోజు పాట జరుగుతున్నంత సేపూ.. కోటి రూపాయల ప్రశ్న ఒకటి ఇంటర్నెట్ను పల్టీలు కొట్టిస్తూనే ఉంది. ‘‘ఆమె ఎవరు? ఆమె పేరేంటి?’’ – ఇదీ ఆ ప్రశ్న. ‘‘ఆమె జాహ్నవీ మెహతా. కోల్‌కతా నైట్ రైడర్స్’’ – ఇదీ జవాబు. ‘‘జాహ్నవీ మెహతానా! సో క్యూట్’’ – ఒకరు.‘దేవుడా! ఏమిటి ఇంతందం!!’’ – ఇంకొకరు. ఆట ముగిసినా కూడా, ‘‘ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు?’’ అంటూ కొన్ని గంటల పాటు నెట్లో ఆమె కోసం వేట’ సాగుతూనే ఉంది. అందమే కాదు, అందాన్ని మించిన తెలివితేటలు ఉన్న అమ్మాయి జాహ్నవి మెహతా. డాటర్ ఆఫ్ జూహీ చావ్లా. అవునా! అక్కడేం పని ఈ అమ్మాయికి! అక్కడే మరి పని! కోల్‌కతా నైట్ రైడర్స్‌కి కో–ఓనర్ జూహి చావ్లా. టైమ్‌కి ఆమె వేలం పాటకు చేరుకోలేకపోయారు. ‘‘ఇదుగో వస్తున్నా..’’ అంటూ జెడ్డా ఫ్లయిట్ నుంచి వీడియో పంపారు. ఆమె వచ్చేలోపు పాట మొదలైందో, లేక ‘‘నువ్వేశాడు’’ అని అంతటి బాధ్యతను కూతురిపై ఉంచారో.. తల్లికి బదులుగా జాహ్నవి వేలం పాటలో పాల్గొంది. 21 మంది ఆటగాళ్లను దక్కించుకుంది. వాళ్లకు పెట్టిన ఖర్చుపోగా, ఇంకో ఐదు లక్షలు మిగిల్చింది కూడా!జాహ్నవి సోషల్ మీడియాలో కనిపించటం అరుదు. ఆమెకొక ‘పబ్లిక్ ఇన్‌స్ట్రాగామ్ పేజ్’ ఉంది కానీ, అందులో 2022 తర్వాత ఒక్క పోస్టు కూడా ఆమె పెట్టలేదు. అయితే ఆ ఏడాది ఐపీఎల్ వేలంలో మాత్రం షారుక్ ఖాన్ కూతురు సుహానా, కొడుకు ఆర్యన్లతో కలిసి తొలిసారి కనిపించింది. తల్లి తరఫున జాహ్నవి, షారుక్ తరఫున సుహానా, ఆర్యన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కె.కె.ఆర్) వేలంలో కూర్చున్నారు. (షారుఖ్ కూడా కె.కె.ఆర్కి ఒక కో ఫౌండర్). ఆ తర్వాత జాహ్నవి బాహ్య ప్రపంచానికి కనిపించటం మళ్లీ ఇప్పుడే! గత ఏడాదే ఆమె కొలంబియా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అప్పుడు కూడా ఆమె సోషల్ మీడియాలోకి రాలేదు. జూహీ చావ్లానే గ్రాడ్యుయేషన్ గౌన్‌లో ఉన్న తన కూతురి కాన్వొకేషన్ ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి, ‘కొలంబియా క్లాస్ 2023’ అని కాప్షన్ పెట్టి తన మురిపెం తీర్చుకున్నారు. జాహ్నవి స్కూల్ చదువు కూడా ఇంగ్లండ్‌లోనే అక్కడి చాటర్ హౌస్ స్కూల్లో సాగింది. అంతకుముందు ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. తల్లి పోస్ట్ చేసిన ఫొటోలో గ్రాడ్యుయేషన్ గౌన్‌లో జాహ్నవిని అప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. ఇప్పుడు మాత్రం తల్లి తరఫున ఐపీఎల్ ఆక్షన్‌లో డార్క్ బ్లూ వెల్వెట్ జాకెట్, వైట్ టీ షర్టుతో కనిపించిన జాహ్నవిని చూసి ‘‘ఎవరబ్బా ఈ అమ్మాయి?!’’ అని ఆరాలు తీశారు. ఎవరో తెలిశాక, ‘‘తల్లి పోలికలు ఎక్కడికిపోతాయి?’’ అని ఒకప్పటి మిస్ ఇండియా, బాలీవుడ్ అందాల నటి అయిన జూహీ చావ్లాను కూడా ఆరాధనగా ట్యాగ్ చేశారు. ‘అందం ఒక్కటేనా తల్లి పోలిక? ఆ తెలివి మాత్రం!’ అన్నట్లు ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ విజేత ఎవరో గుర్తుంది కదా. కోల్‌కతా నైట్ రైడర్స్. (చదవండి: -
వేలంలో భారత క్రికెటర్లకు కాసుల పంట.. తొలి రోజు ఎవరు ఎంత ధర పలికారంటే..?
-
లక్నో ‘నవాబ్’ రిషభ్ పంత్
బ్యాటింగ్‌లో దూకుడుకు మారుపేరు... వికెట్ కీపర్... కెప్టెన్ గా అనుభవం... ఎలాంటి స్థితిలోనైనా జట్టును గెలిపించగల నైపుణ్యం... అన్నీ కలిసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిషభ్ పంత్ స్థాయి ఏమిటో చూపించాయి. ఇలాంటి ఆటగాడి కోసమే ఏ జట్టయినా పోటీ పడుతుంది. అందుకే అతని పేరు వచ్చినప్పుడు వేలం వెర్రిగా సాగింది. అతనిపై కోట్లు వెదజల్లేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అలా అలా పెరుగుతూ పోయిన ఆ విలువ చివరకు రూ.27 కోట్ల వద్ద ఆగింది. లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం చెల్లించి భారత ఆటగాడు రిషభ్ పంత్‌ను సొంతం చేసుకుంది. దాంతో అంతకు కొద్ది నిమిషాల క్రితమే పంజాబ్ కింగ్స్ సంచలన రీతిలో రూ.26 కోట్ల 75 లక్షలకు శ్రేయస్ అయ్యర్‌ను సొంతం చేసుకున్న రికార్డు వెనక్కి వెళ్లిపోయింది. వీరిద్దరూ భారత జట్టులో సభ్యులుగా ఇప్పటికే తమకంటూ గుర్తింపు తెచ్చుకోగా... నాలుగు సీజన్లలో అంతంత మాత్రం ఆటనే ప్రదర్శించిన వెంకటేశ్ అయ్యర్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏకంగా రూ.23 కోట్ల 75 లక్షలు చెల్లించడం వేలంలో అతి పెద్ద సంచలనం. ఏకంగా 20 మంది ఆటగాళ్లకు రూ.10 కోట్లకంటే ఎక్కువ విలువ దక్కడం విశేషం. అనూహ్యాలకు వేదికగా నిలిచే ఐపీఎల్ వేలం ఎప్పటిలాగే తమ రివాజును కొనసాగించింది. అర్ష్ దీప్ సింగ్, బట్లర్, కేఎల్ రాహుల్, సిరాజ్, స్టార్క్, స్టొయినిస్, షమీవంటి ప్లేయర్లకు ఆశించిన మొత్తాలే దక్కగా... చహల్, జేక్ ఫ్రేజర్, ఆర్చర్, జితేశ్ శర్మ, రబాడ, నూర్, అవేశ్ ఖాన్లకు మాత్రం చాలా పెద్ద మొత్తం లభించింది. డికాక్, మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్, డేవిడ్ మిల్లర్, మార్క్రమ్ తక్కువ మొత్తాలకే సరిపెట్టుకోవాల్సి రాగా... ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడైన డేవిడ్ వార్నర్‌ను తొలిరోజు ఎవరూ తీసుకోకపోవడం అత్యంత ఆశ్చర్యకరం! జిద్దా: ఐపీఎల్–2025 వేలం ఊహించిన విధంగానే కోట్లాది రూపాయల రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. తొలి రోజు 72 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు ఎంచుకున్నాయి. వీరిలో రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) అత్యధిక ధరతో అందరికంటే టాపర్‌గా నిలిచాడు. 2024 వేలంలో మిచెల్ స్టార్క్ (కోల్‌కతా; రూ.24 కోట్ల 75 లక్షలు) నెలకొల్పిన అత్యధిక మొత్తం రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. 2024లో కెపె్టన్‌గా కోల్‌కతాను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ (రూ.26 కోట్ల 75 లక్షలు) కాస్త తేడాతో రెండో స్థానంలో నిలవగా... వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ.23 కోట్ల 75 లక్షలు చెల్లించి కోల్‌కతా వెనక్కి తీసుకుంది. భారత ఆటగాళ్లలో అర్ష్ దీప్ సింగ్ తన ప్రస్తుతం టీమ్ పంజాబ్ కింగ్స్‌కే వెళ్లగా... చహల్, కేఎల్ రాహుల్, షమీ, ఇషాన్ కిషన్ కొత్త జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు. హైదరాబాదీ పేసర్ సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ ఎంచుకోగా... కెరీర్ చివర్లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన ‘హోం’ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లడం విశేషం. సోమవారం కూడా వేలం సాగనుంది. మొత్తం 577 మంది నుంచి మిగిలిన ఆటగాళ్లతో పాటు ఆదివారం అమ్ముడుపోని ఆటగాళ్లు కూడా రెండో రోజు మళ్లీ వేలంలోకి వస్తారు. పంత్ కోసం పోటీపడ్డారిలా...తొలి రోజు ఆరో ఆటగాడిగా రూ. 2 కోట్ల కనీస విలువతో పంత్ పేరు వేలంలోకి వచ్చింది. లక్నో ముందుగా తమ ఆసక్తిని చూపించింది. వెంటనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బరిలోకి దిగింది. ఈ రెండు ఫ్రాంచైజీలు పోటీ పడుతూ మొత్తాన్ని రూ.10 కోట్ల 50 లక్షల వరకు తీసుకెళ్లాయి. ఈ దశలో ఆర్సీబీ వెనక్కి తగ్గగా... సన్‌రైజర్స్ పోటీకి సిద్ధమైంది. అలా ఇరు జట్ల మధ్య సాగిన సమరం పంత్ విలువను రూ.20 కోట్ల 75 లక్షల వరకు తీసుకెళ్లింది. ఈ దశలో పంత్ పాత జట్టు ఢిల్లీ అతడిని రైట్ టు మ్యాచ్ ద్వారా మళ్లీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే లక్నో ఏకంగా రూ.27 కోట్ల మొత్తానికి ప్యాడిల్ ఎత్తడంతో పంత్ విలువ శిఖరానికి వెళ్లింది. శ్రేయస్ అయ్యర్ ముందుగా... పంత్‌కంటే ముందు రికార్డు ధరతో శ్రేయస్ అయ్యర్ అమ్ముడుపోయాడు. 2024 ఐపీఎల్లో కోల్‌కతాను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా అతని పేరు వచ్చింది. గతంలో ఢిల్లీ టీమ్‌లో శ్రేయస్ ఆడినప్పుడు కోచ్‌గా ఉన్న పాంటింగ్ ఈసారి పంజాబ్ తరఫున ముందుగా అతనిపై ఆసక్తిని ప్రదర్శించాడు. ఆపై కోల్‌కతా, ఢిల్లీ మధ్య పోటీ సాగగా... రూ.25 కోట్ల వద్ద ఢిల్లీ సొంతమైనట్లు కనిపించింది. కానీ అనూహ్యంగా మళ్లీ ముందుకొచి్చన పంజాబ్ కింగ్స్ చివరకు బిడ్‌ను ఖాయం చేసుకుంది. వెంకటేశ్ అయ్యర్ కోసం హోరాహోరీ... ఐపీఎల్లో 2021–24 మధ్య నాలుగు సీజన్ల పాటు ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫునే ఆడిన వెంకటేశ్ అయ్యర్ 49 ఇన్నింగ్స్‌లలో 137.12 స్ట్రయిక్‌రేట్‌తో 1326 పరుగులు చేశాడు. 9 ఇన్నింగ్స్‌లలో మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. అప్పుడప్పుడు కొన్ని చెప్పుకో దగ్గ ప్రదర్శనలు ఉన్నా... ఒంటి చేత్తో మ్యాచ్‌ను మార్చగల విధ్వంసకర ఆటగాడైతే కాదు. కానీ అతని కోసం వేలం అసాధారణ రీతిలో సాగింది. కోల్‌కతా టీమ్ ముందుగా వేలం మొదలు పెట్టింది. లక్నో ముందు ఆసక్తి చూపించినా...ఆ తర్వాత ప్రధానంగా కోల్‌కతా, ఆర్సీబీ మధ్యే పోటీ సాగింది. ఇరు జట్లు కలిసి రూ. 20 కోట్లు దాటించాయి. కోల్‌కతా రూ. 23 కోట్ల 75 లక్షలకు చేర్చిన తర్వాత బెంగళూరు స్పందించలేదు. డేవిడ్ వార్నర్‌కు నిరాశ!పట్టించుకోని ఫ్రాంచైజీలుఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకడు, 184 మ్యాచ్‌లలో 6565 పరుగులతో అత్యధిక స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానం, ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించిన రికార్డుతో పాటు కెపె్టన్‌గా సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించిన ఘనత! ఇలాంటి ఘనాపాటి ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్‌ను ఎవరూ తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా... అతనేమీ ఆటకు దూరమై చాలా కాలం కాలేదు. ఇటీవల టి20 వరల్డ్‌కప్ ఆడి చురుగ్గా ఉన్న వార్నర్‌లో ఇప్పటికీ ఈ ఫార్మాట్లో చెలరేగిపోగల సత్తా ఉంది.వేలంలో కొందరు అనామక ఆటగాళ్ల కోసం సాగిన పోటీ చూస్తే వార్నర్ కనీస విలువ రూ.2 కోట్లకు కూడా తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం అనూహ్యం. గత సీజన్లో పూర్తిగా విఫలం కావడం వేలంపై ప్రభావం చూపించి ఉండవచ్చు. తొలి రోజు 12 మందిని మాత్రమే ఫ్రాంచైజీలు తిరస్కరించగా అందులో వార్నర్, బెయిర్‌స్టో ఎక్కువగా గుర్తింపు పొందిన ఆటగాళ్లు కాగా... ప్రస్తుతం భారత టెస్టు టీమ్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్‌పై పెద్దగా అంచనాలు లేవు. మిగిలిన 9 మందిలో పీయూష్ చావ్లా తప్ప ఇతర ఆటగాళ్లు అనామకులే. అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాచెన్నై సూపర్ కింగ్స్ నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు) ఆర్. అశ్విన్ (రూ. 9.75 కోట్లు) కాన్వే (రూ. 6.25 కోట్లు) ఖలీల్ అహ్మద్ (రూ. 4.80 కోట్లు) రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు) రాహుల్ త్రిపాఠి (రూ. 3.40 కోట్లు) విజయ్ శంకర్ (రూ. 1.20 కోట్లు) ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు) స్టార్క్ (రూ. 11.75 కోట్లు) నటరాజన్ (రూ. 10.75 కోట్లు) జేక్ ఫ్రేజర్ (రూ 9 కోట్లు) హ్యారీ బ్రూక్ (రూ. 6.25 కోట్లు) అశుతోష్ శర్మ (రూ. 3.80 కోట్లు) మోహిత్ శర్మ (రూ.2.20 కోట్లు) సమీర్ రిజ్వీ (రూ. 95 లక్షలు) కరుణ్ నాయర్ (రూ. 50 లక్షలు) గుజరాత్ టైటాన్స్ బట్లర్ (రూ.15.75 కోట్లు) సిరాజ్ (రూ.12.25 కోట్లు) రబాడ (రూ.10.75 కోట్లు) ప్రసిధ్ కృష్ణ (రూ.9.50 కోట్లు) లోమ్రోర్ (రూ.1.70 కోట్లు) కుమార్ కుశాగ్ర (రూ.65 లక్షలు) మానవ్ సుతార్ (రూ. 30 లక్షలు) అనూజ్ రావత్ (రూ.30 లక్షలు) నిశాంత్ సింధు (రూ. 30 లక్షలు) కోల్‌కతా నైట్‌రైడర్స్ వెంకటేశ్ (రూ.23.75 కోట్లు) ఆన్రిచ్ నోర్జే (రూ.6.50 కోట్లు) డికాక్ (రూ.3.60 కోట్లు) అంగ్కృష్ (రూ.3 కోట్లు) గుర్బాజ్ (రూ.2 కోట్లు) వైభవ్ అరోరా (రూ.1.80 కోట్లు) మర్కండే (రూ. 30 లక్షలు) లక్నో సూపర్ జెయింట్స్ రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) అవేశ్ ఖాన్ (రూ.9.75 కోట్లు) మిల్లర్ (రూ.7.50 కోట్లు) అబ్దుల్ సమద్ (రూ.4.20 కోట్లు) మిచెల్ మార్‡్ష (రూ.3.40 కోట్లు) మార్క్రమ్ (రూ.2 కోట్లు) ఆర్యన్ జుయాల్ (రూ.30 లక్షలు) ముంబై ఇండియన్స్ ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు) నమన్ ధీర్ (రూ.5.25 కోట్లు) రాబిన్ మిన్జ్ (రూ.65 లక్షలు) కరణ్ శర్మ (రూ.50 లక్షలు) పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు) అర్ష్ దీప్ సింగ్ (రూ.18 కోట్లు) చహల్ (రూ.18 కోట్లు) స్టొయినిస్ (రూ.11 కోట్లు) నేహల్ వధేరా (రూ.4.20 కోట్లు) మ్యాక్స్‌వెల్ (రూ.4.20 కోట్లు) వైశాక్ విజయ్ (రూ.1.80 కోట్లు) యశ్ ఠాకూర్ (రూ.1.60 కోట్లు) హర్‌ప్రీత్ బ్రార్ (రూ.1.50 కోట్లు) విష్ణు వినోద్ (రూ.95 లక్షలు) రాజస్తాన్ రాయల్స్ జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు) హసరంగ (రూ.5.25 కోట్లు) మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు) ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు) కార్తికేయ (రూ.30 లక్షలు) బెంగళూరు హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిక్ ధార్ (రూ.6 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు) మొహమ్మద్ షమీ (రూ.10 కోట్లు) హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు) రాహుల్ చహర్ (రూ.3.20 కోట్లు) మనోహర్ (రూ.3.20 కోట్లు) ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు) సిమర్జిత్ సింగ్ (రూ.1.50 కోట్లు) అథర్వ తైడే (రూ.30 లక్షలు) టాప్–20 (రూ.10 కోట్లు, అంతకుమించి) రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) శ్రేయస్ (రూ.26.75 కోట్లు) వెంకటేశ్ (రూ.23.75 కోట్లు) అర్ష్ దీప్ సింగ్ (రూ.18 కోట్లు) చహల్ (రూ.18 కోట్లు) బట్లర్ (రూ.15.75 కోట్లు) కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు) ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు) హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు) జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు) సిరాజ్ (రూ.12.25 కోట్లు) స్టార్క్ (రూ. 11.75 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) స్టొయినిస్ (రూ.11 కోట్లు) నటరాజన్ (రూ. 10.75 కోట్లు) రబాడ (రూ.10.75 కోట్లు) మొహమ్మద్ షమీ (రూ.10 కోట్లు) నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు) తొలి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వేలంలో దక్కించుకోగా... ఇందులో 24 మంది విదేశీయులు ఉన్నారు. వేలం కోసం మొత్తం రూ.467.95 కోట్లను జట్లు వెచ్చించాయి. -
చరిత్ర సృష్టించిన గాజు కిటికీ
దూరం నుంచి చూస్తే నల్లని వస్త్రంపై చిత్రకారుడి కలం నుంచి జాలువారిన అద్భుత చిత్రరాజం అనిపించకమానదు. కానీ దగ్గరికెళ్లి తరచిచూస్తే సప్తవర్ణశోభితమై ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఒక అద్దం కిటికీ అని వెంటనే తెలుస్తుంది. అపురూప కళాఖండంగా దశాబ్దాల క్రితమే ఘన కీర్తిని మూటగట్టుకున్న ఈ గాజు కిటీకి మళ్లీ రెండు పుష్కరాల తర్వాత కొచ్చింది. 24 ఏళ్ల క్రితం రూ.16 కోట్లకుపైబడి ధర పలికి ఔరా అనిపించిన ఈ గాజు కిటికీ తాజాగా సోమవారం ఏకంగా రూ.105 కోట్లకు అమ్ముడుపోయి తన విశిష్టతకు ఏ అద్దమూ సాటిరాదని నిరూపించుకుంది. 20వ శతాబ్దానికి చెందిన అమెరికన్ కళాకారుడు లూయిస్ కంఫర్ట్ టిఫానీ ఈ గాజు కిటికినీ తయారుచేశారు. అలంకార, సౌందర్య కళల్లో లూయిస్‌ది అందె వేసిన చేయి. స్టెయిన్ గ్లాస్‌తో ఆయన చేసిన కళాకృతులు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిపొందాయి. ఓహియో రాష్ట్రంలోని క్యాంటన్ సిటీలో తొలి బాప్టిస్ట్ చర్చి వ్యవస్థాపకుల్లో ఒకరైన జాన్ థెరిసా డ్యానర్ గౌరవార్థం లూయిస్ ఈ కిటికీని తయారుచేశారు. అందుకే దీనిని ‘డ్యానర్ మెమోరియల్ విండో’అంటారు. 16 అడుగుల కళాఖండం సోమవారం న్యూయార్క్‌లోని సోత్బే వేలంసంస్థ నిర్వహించిన వేలంలో కేవలం ఆరున్నర నిమిషాల్లో ఊహించినదానికంటే నాలుగు రెట్లు అధిక ధరకు ఇది అమ్ముడుపోవడం విశేషం. బిలియనీర్ అలెన్ గెర్రీ దీనిని విక్రయించగా ఒక గుర్తు తెలియని వ్యక్తి దీనిని కొనుగోలుచేశారని సోత్బే సంస్థ ప్రకటించింది. టిఫానీ రూపొందించిన కిటీకీల్లో ఇంతవరకు ఇంత భారీ ధరకు అమ్ముడుపోయిన తొలి గాజు కిటికీ ఇదే. వాస్తవానికి చర్చి కోసం దీనిని తయారుచేసినా చివరకు వినియోగించకుండా వదిలేశారు. గలగలపారే సెలయేరుకు ఇరువైపులా విరగగాసిన ఫలాలతో అలరారుతున్న వృక్షాలు ఊసులాడుకుంటున్నట్లు ఎంతో రమ్యంగా రంగులద్దారు. డిజైన్ ఆగ్నిస్ నార్త్రోప్ ఈయనకు సాయపడ్డారు. 1913లో దీని తయారీ పూర్తయింది. ‘‘టిఫానీ రూపొందించిన గాజు కిటికీలు ఇన్నేళ్లు గడిచినా మార్కెట్లో తమ హవా కొనసాగిస్తున్నాయనడానికి ఈ కిటికీ వేలమే నిదర్శనం’’అని సోత్బే చైర్మన్ జోడీ పొల్లాక్ అన్నారు. లూయిస్ టిఫానీ వాళ్ల నాన్నకు అమెరికాలో టిపానీ అండ్ కో. పేరిట స్టెయిన్ గ్లాస్ తయారీ కర్మాగారం ఉండేది. అందులో పనిచేస్తూనే టిఫానీ ఎన్నో కళాఖండాలను సృష్టించారు. గాజు దీపాలు, పుష్పలంకరణ వస్తువులను తయారుచేశారు. అమెరికాలోని న్యూయార్క్‌తోపాటు బ్రిటన్‌లోని లండన్, ఫ్రాన్స్‌లోని పారిస్ సొంత స్టోర్లలో ఈయన కళారూపాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. పెన్సిల్వేనియా, మసాచు సెట్స్, న్యూయార్క్‌లోని చాలా చర్చిల్లో ఈయన గాజు కిటీకీలే మనకు దర్శనమిస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా విప్లవం ముందునాటిది.. అదిరిపోయే ధర పలికింది
17వ శతాబ్దంనాటి అత్యంత అరుదైన వెండి నాణెం అది. అందులోనూ అమెరికా విప్లవానికి ముందునాటిది. మరీ ముఖ్యంగా అమెరికాలోనే తయారైంది. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు(యూఎస్ఏ)గా అమెరికా ప్రాంతం ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించకముందునాటిది. ప్రపంచంలో ఇలాంటిది ఇంకొక్కటి మాత్రమే ఉంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఆ చిన్ని నాణెం ఏకంగా రూ.21.28 కోట్ల ధర పలికిందని స్టేక్స్ బోవర్స్ గ్యాలరీస్ వేలం సంస్థ ప్రకటించింది. తయారుచేసినపుడు దీని ముఖ విలువ మూడు పెన్నీలు మాత్రమే. బోస్టన్ మింట్ ప్రారంభించిన కొద్ది వారాలకే 1652వ సంవత్సరంలో దీనిని ముద్రించారు. నాణేనికి ఒకవైపు న్యూ ఇంగ్లండ్(ఎన్ఈ) అన్న రెండు అక్షరాలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు రోమన్ అంకెల్లో మూడు అని రాసి ఉంది. న్యూ ఇంగ్లండ్ ప్రభ పెరుగుతోందని తెలియజేసేందుకు గుర్తుగా మొదట్లో కొన్నింటిని మాత్రమే ఇలా వెండితో ముద్రించారు. ప్రస్తుత మార్కెట్లో నికెల్, వెండి విలువల్లో లెక్కిస్తే దీని ధర కేవలం 1.03 అమెరికన్ డాలర్లు. కానీ అమెరికా స్వాతంత్య్రం ముందునాటిది కావడం, చారిత్రక విశేషాలుండటంతో దీనికి ఎక్కడా లేనంతటి విలువ వచ్చింది. ఎనిమిదేళ్ల క్రితం వెలుగుచూసి.. నెదర్లాండ్స్‌లో 2016లో ఒక పేస్ట్బోర్డ్ పెట్టెలో దీనిని కనుగొన్నారు. దీంతోపాటు ఒక కవర్ ఉంది. దానిపై ‘1798 డిసెంబర్లో క్విన్సీ కుటుంబానికి బోస్టన్ మింట్ నుంచి వచ్చిన సిల్వర్ టోకెన్ ఇది’అని మాత్రమే రాసి ఉంది. అయితే దీని విలువ తెలియని ఆ యజమాని దీని గురించి పట్టించుకోవడం మానేశారట. అయితే అరుదైన నాణెం వార్త అందరి నోటా పడి చివరకు దీని మూలాల గుట్టు తెల్సుకునే పని మొదలైంది. అరుదైన నాణేల ప్రమాణాలను నిర్ధారించే స్వతంత్ర ‘పీసీజీఎస్’విభాగం రంగంలోకి దిగి దీని విశిష్టతను ప్రపంచానికి తెలిసేలా చేసింది. అయితే గతంలోనూ ఇలాంటి ప్రయత్నం జరిగిందన్న విషయం పీసీజీఎస్ పరిశోధనలో వెల్లడైంది. ఇంగ్లండ్‌కు చెందిన నాణేలను సేకరించే థామస్ బ్రాండ్ అనే పెద్దాయన 1781లో నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారి జాన్ ఆడమ్స్కు ఒక లేఖ రాశారు. ఆడమ్స్ భార్య ఎబిగేల్కు ఈ నాణేనికి ఒక సంబంధం ఉండటమే ఇందుకు కారణం. ఈ నాణేన్ని ముద్రించిన స్వర్ణకారుడు జాన్ హల్కు సవతి సోదరుడి ముని మనవరాలే ఈ ఎబిగేల్. ఇలా ఈ నాణెం ఎప్పుడు ఎక్కడ ముద్రించబడిందనే వివరాలు తెలిశాయి. ఇలాంటి మరో నాణెం గతంలో ఉండేదని మసాచుసెట్స్ హిస్టారికల్ సొసైటీ పేర్కొంది. గతంలో అమెరికాలోని యేల్ కళాశాలలో ప్రదర్శనకు ఉంచగా చోరీకి గురైంది. ఇప్పుడు అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. ‘‘నాణెం వేలం మొదలెట్టిన కేవలం 12 నిమిషాల్లోనే ఊహించిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది’అని వేలంపాట నిర్వహకుడు బెన్ ఒరోజీ చెప్పారు. గతంలోనూ కొన్ని అమెరికా నాణేలు రికార్డ్ ధరలకు అమ్ముడుపోయాయి. 2013లో 1794నాటి వెండి డాలర్ నాణెం ఒక కోటి డాలర్లకు అమ్ముడుపోయింది. 1933లో ముద్రించిన డబుల్ ఈగిల్ బంగారు నాణెం మూడేళ్ల క్రితం ఒక వేలంపాటలో 1.89 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ అరటి పండు రూ. 52 కోట్లు
వీధుల్లో దొరికే పెద్ద సైజు అరటి పండు ఒకటి మహా అంటే ఐదారు రూపాయలు ఉంటుందేమో. అందులోనూ ఇంట్లో పిల్లాడు ఆడుకుంటూ ఒక అరటి పండును గోడకు ఒక గట్టి టేప్‌తో అతికించాక దాని విలువ ఎంత అంటే.. అనవసరంగా పండును పాడుచేశావని పిల్లాడిని అంతెత్తున కోప్పడతాం. అయితే అచ్చం అలాంటి అరటి పండునే, అలాగే ఒక ఫ్రేమ్‌కు గట్టి టేప్‌తో అతికిస్తే ఒక ఔత్సాహిక కళా ప్రేమికుడు ఏకంగా రూ.52 కోట్లు పెట్టి కొన్నారంటే నమ్మగలరా?. కానీ ఇది వంద శాతం వాస్తవం. అచ్చంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బుధవారం జరిగిన వేలంపాటలో ఇది 6.2 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయింది. చిత్రమైన కళాఖండాలు సృష్టించే ఇటలీ కళాకారుడు మారిజో కాటెలాన్ మనోఫలకం నుంచి జాలువారి ఫ్రేమ్‌కు అతుక్కున్న కళాఖండమిది అని అక్కడి కళాపోషకులు ఆయనను పొగడ్తల్లో ముంచెత్తడం విశేషం. పాశ్చాత్య కళాకారుల్లో చిలిపివాడిగా మారిజోకు పేరుంది. బుధవారం ప్రఖ్యాత ‘సోత్వే’ వేలం సంస్థ నిర్వహించిన వేలంపాటలో మరో ఆరుగురు బిడ్డర్లను వెనక్కినెట్టి మరీ చైనాకు చెందిన క్రిప్టోకరెన్సీ యువ వ్యాపారవేత్త జస్టిన్ సన్ ఈ కళాఖండాన్ని ఇన్ని డబ్బులు పోసిమరీ సొంతంచేసుకున్నారు. ‘‘ ఇలాంటి అపూర్వ కళాఖండాలంటే నాకెంతో ఇష్టం. ఈ అరటి పండును చూస్తుంటే తినాలనిపిస్తుంది. త్వరలో దీనిని అమాంతం ఆరగిస్తా’ అని జస్టిన్ సన్ సరదాగా వ్యాఖ్యానించారు. అమెరికాలో అత్యున్నత శ్రేణి పండ్ల దుకాణంలో దాదాపు రూ.30 ఉండే ఈ ఒక్క అరటి పండు ఇంతటి ధర పలకడం ప్రపంచవ్యాప్తంగా కళాఖండాలను కొనే వ్యాపారులనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఊహించిన ధర కంటే నాలుగు రెట్లు అధిక ధరకు అమ్ముడుపోయిందని సోత్బే సంస్థ పేర్కొంది. వేలంపాటల చరిత్రలో ఒక ఫలం ఇంతటి ధర పలకడం ఇదే తొలిసారి అని వేలంపాట వర్గాలు వెల్లడించాయి. 2019లో మియామీ బీచ్‌లోని ఆర్ట్ బాసెల్ షోలో తొలిసారిగా ‘కమేడియన్’ పేరిట ఈ పండును ప్రదర్శించారు. దానిని చూసినవారంతా ‘అసలు ఇదేం ఆర్ట్?. దీనిని కూడా ఆర్డ్ అంటారా?’ అంటూ పలువురు విమర్శించారు. అయితే ఐదేళ్ల క్రితమే ఇది 1,20,000 డాలర్ల ధర పలికి ఔరా అనిపించింది. గతంలో వచ్చిన విమర్శలపై తాజాగా జస్టిన్ సన్ స్పందించారు. ‘‘ ఈ ఘటనను కేవలం కళగానే చూడకూడదు. ఇదొక సాంస్కృతిక ధోరణుల్లో మార్పుకు సంకేతం. కళలు, మీమ్స్, క్రిప్టో కరెన్సీ వర్గాల మధ్య వారధిగా దీనిని చూడొచ్చు. పండు ఇంతటి ధర పలకడం ఏంటబ్బా ? అని మనుషుల ఆలోచనలకు, చర్చలకు ఇది వేదికగా నిలుస్తుంది. చరిత్రలోనూ స్థానం సంపాదించుకుంటుంది’ అని జస్టిన్ వ్యాఖ్యానించారు. మారుతున్న పండు !వాస్తవానికి 2019లో ప్రదర్శించిన పండు ఇది కాదు. 2019లో దీనిని ప్రదర్శించినపుడు అది పాడయ్యేలోపే అక్కడి కళాకారుడు డేవిడ్ డట్యూనా తినేశాడు. ఆకలికి ఆగలేక గుటకాయ స్వాహా చేశానని చెప్పాడు. ‘‘ప్రపంచంలో క్షుద్బాధతో ఎంతో మంది అల్లాడుతుంటే పోషకాల పండును ఇలా గోడకు అతికిస్తారా?. అయినా 20 సెంట్లు విలువచేసే పండు నుంచి కోట్లు కొల్లకొ డుతున్న ఈ కళాకారుడు నిజంగా మేధావి’’ అని డేవిడ్ వ్యాఖ్యానించాడు. 1,20,000 డాలర్లకు అమ్ముడుపోయాక దీనిని ఆయన తిన్నారు. తర్వాత మరో పండును ప్రదర్శనకు పెట్టారు. దానిని గత ఏడాది దక్షిణకొరియాలోని సియోల్ సిటీలోని ‘లీయిమ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’లో ప్రదర్శనకు ఉంచినపుడు నోహ్ హుయాన్ సో అనే విద్యార్థి తినేశాడు. ఇప్పుడు వేలంపాటలో అమ్ముడుపోయింది కొత్త పండు. అత్యంత గట్టిగా అతుక్కునే ‘డక్ట్’ టేప్‌తో ఫ్రేమ్‌కు ఈ పండును అతికించారు. ఈ కళాఖండాన్ని సృష్టించిన మారి జో కాటెలాన్ గతంలో ఇలాంటి వింత కళారూ పాలను తయారుచేశారు. 18 క్యారెట్ల పుత్తడితో నిజమైన టాయిలెట్‌ను రూపొందించారు. దానికి ‘అమెరికా’ అని పేరు పెట్టారు. దీనిని ప్రదర్శనకు పెట్టుకుంటే అప్పుగా ఇస్తానని కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఈయన గతంలో ఒక ఆఫర్ కూడా ఇచ్చాడట. కొన్న వ్యక్తిపై గతంలో ఆరోపణలుపండును కొనుగోలుచేసిన జస్టిన్ సన్ ప్రస్తుతం చైనాలో ట్రోన్ పేరిట బ్లాక్‌చైన్ నెట్వర్క్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని క్రిప్టోకరెన్సీల లావాదేవీలను పర్యవేక్షిస్తు న్నారు. ట్రోన్ క్రిప్టో టోకెన్ అయిన టీఆర్ఎస్ విలువను కృత్రిమంగా అమాంతం పెంచేసి మోసానికి పాల్పడుతున్నాడని జస్టిన్‌పై అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ కమిషన్ కేసు కూడా వేసింది. అయితే ఆ ఆరోపణలను జస్టిన్ తోసిపు చ్చారు. 2021–23లో ఈయన ప్రపంచ వాణిజ్య సంస్థలో గ్రెనడే దేశ శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ 457 మంది పేర్లు చకచకా...
ముంబై: ఐపీఎల్–2025 సీజన్ కోసం ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా లోని జిద్దా నగరంలో వేలం జరగనుంది. వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. అయితే ఇంత మంది పేర్లను ఒక్కొక్కరిగా పిలిచి వేలం ప్రక్రియ కొనసాగించడం చాలా సుదీర్ఘంగా, కష్టతరంగా మారే అవకాశం ఉంది. దాంతో బీసీసీఐ ‘యాక్సిలరేటెడ్ ఆక్షన్’ అంటూ వేలాన్ని వేగంగా ముగించేందుకు సిద్ధమైంది. వేలంలో మొదటి 116 మంది కోసం మాత్రమే ఫ్రాంచైజీలు ముందుగా పోటీ పడతాయి. వరుసగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మార్క్యూ ప్లేయర్లు, స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్‌కీపర్ బ్యాటర్లు, పేస్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు... ఇలా వేలం సాగుతుంది. ఈ వరుసలో చివరగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని అన్క్యాప్డ్ ప్లేయర్లు వస్తారు. వీరి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాంతో 117 నుంచి 574 నంబర్ వరకు ఉన్న ఆటగాళ్లను ఎంచుకునే విషయంలో ఫ్రాంచైజీలకు ముందే ఒక అవకాశం ఇస్తున్నారు. తాము కోరుకుంటున్న ఆటగాళ్ల పేర్లను తొలి రోజు వేలం ముగిసిన తర్వాత రాత్రి 10 గంటల వరకు అందించాలి. వీరి పేర్లనే వేలంలో ప్రకటిస్తారు. అనంతరం అప్పటి వరకు అమ్ముడుపోని ఆటగాళ్లలో ఇంకా ఎవరినైనా తీసుకోవాలనే ఆలోచన ఉంటే వారి పేర్లను కూడా ఈ ‘యాక్సిలరేటెడ్ ఆక్షన్’లో చెప్పాల్సి ఉంటుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.ఈ జాబితాలో 117వ ఆటగాడిగా ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్ ఉండగా... మిగిలిన వారిలో మొయిన్ అలీ, టిమ్ డేవిడ్, స్పెన్సర్ జాన్సన్, ఉమ్రాన్ మలిక్, ముస్తఫిజుర్, సాంట్నర్, నబీ, స్టీవ్ స్మిత్, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ అండర్సన్ తదితర గుర్తింపు పొందిన ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలం ప్రక్రియను ప్రముఖ ఆక్షనీర్ మల్లికా సాగర్ నిర్వహించనుంది. గత ఏడాది కూడా ఆమెనే ఆక్షనర్‌గా వ్యవహరించింది. మరోవైపు భారత్, ఆ్రస్టేలియా మధ్య జరిగే పెర్త్ టెస్టు మూడో, నాలుగో రోజుల్లో ఈ వేలం నిర్వహించడంపై కాస్త చర్చ జరిగింది. అయితే సమయం భిన్నంగా ఉండటం వల్ల ఆటగాళ్లు, అభిమానులు కూడా పూర్తి స్థాయిలో వేలం ప్రక్రియను అనుసరించవచ్చు. భారత కాలమానం ప్రకారం టెస్టు ఆట మధ్యాహ్నం గం. 2:50 నిమిషాలకు ముగుస్తుంది. వేలం మధ్యాహ్నం గం. 3:30 నిమిషాలకు ప్రారంభం కానుంది. -
Pushpa The Rule: వేలం ద్వారా 'పుష్ప 2' టికెట్.?
-
వేలం వేస్తేనే పోటీ.. ట్రాయ్‌కి జియో లేఖ
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్‌కి ఉపయోగించే స్పెక్ట్రంను వేలం వేస్తేనే విదేశీ దిగ్గజాలతో దేశీ టెల్కోలు పోటీపడేందుకు అవకాశాలు లభిస్తాయని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి రాసిన లేఖలో రిలయన్స్ జియో పేర్కొంది. దేశీయంగా మూడు టెల్కోలు అనేక సంవత్సరాలుగా నిర్మించుకున్న సామర్థ్యాల కన్నా స్టార్‌లింక్, క్విపర్ శాట్‌కామ్ బ్యాండ్‌విడ్త్ అధికమని తెలిపింది.శాట్‌కామ్ సంస్థలు కేవలం టెరెస్ట్రియల్ కవరేజీ లేని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే సేవలు అందిస్తాయి కాబట్టి వాటికి ప్రాధాన్యతనిస్తామనడం సరికాదని జియో వ్యాఖ్యానించింది. స్టార్‌లింక్, క్విపర్, ఇతరత్రా శాట్‌కామ్ దిగ్గజాలు తాము పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ సర్వీసులను కూడా అందించేందుకు పోటీపడతామని ఇప్పటికే వెల్లడించినట్లు తెలిపింది.ఇదీ చదవండి: వాట్సాప్ గ్రూప్‌లకు లైసెన్స్.. ఫీజు కూడా!ఈ నేపథ్యంలో స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించిన పక్షంలో వాటితో పోటీపడేందుకు దేశీ సంస్థలకు సమాన అవకాశాలు దొరకవని పేర్కొంది. అంతర్జాతీయ విధానాలకు తగ్గట్లుగా శాట్‌కామ్ స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుండటంతో జియో లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
విలువ తెలియక డోర్‌స్టాప్‌గా వాడేశారు.. ఆ పాలరాతి శిల్పం ఖరీదు 27 కోట్లు!
హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం ప్రభువు మహబూబ్ అలీఖాన్ గతంలో కొనుగోలుచేసి దురదృష్టంగా భావించి షూలోపల పడేసిన ప్రపంచ ప్రఖ్యాత జాకబ్ వజ్రాన్ని ఆయన కుమారుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చాన్నాళ్లు తన టేబుల్‌పై పేపర్‌వెయిట్‌గా వాడారని చరిత్ర చెబుతోంది. అది వందల కోట్ల విలువచేస్తుందని ఆయన తెలీదు. అచ్చం అలాగే కోట్లుపలికే పాలరాతి ప్రతిమను చాలా సంవత్సరాలపాటు బ్రిటన్‌లో ఒక పారిశ్రామికవాడలోని షెడ్డు తలుపు మూసుకుపోకుండా అడ్డుగా వాడారు. చివరకు అది ప్రముఖ శిల్పకారుడు ఎడ్మీ బౌచర్డన్ చెక్కిన అద్భుత ప్రతిమ అని తెల్సి ఇప్పుడు ఔత్సాహిక కుబేరుడు కోట్లు పెట్టి కొనేందుకు ముందుకొస్తున్నారు. ఒకాయన ఏకంగా రూ.27 కోట్లు చెల్లించేందుకు సుముఖత చూపడంతో ఈ శిల్పం కథాకమామిషు తెల్సుకునేందుకు అంతా గూగుల్ తల్లి వద్ద సెర్చింగ్లు మొదలుపెట్టారు. ఫ్రాన్స్‌కు చెందిన 15వ లూయిస్ రాజు వద్ద ఆస్థాన శిల్పకారుడైన ఎడ్మీ చౌడర్డన్ 18వ శతాబ్దంలో ఈ ప్రతిమను చెక్కారు. బ్రిటన్‌లో భాగమైన స్కాట్లాండ్లోని హైల్యాండ్స్ కౌన్సిల్ ప్రాంతంలో ఆనాటి భూస్వామి, రాజకీయనాయకుడు జాన్ గార్డన్.. ఎడ్మీతో తన స్వీయ ప్రతిమను చెక్కించుకున్నాడు. తర్వాతి కాలంలో ఆయన ఈ ప్రాంతంలో ఇన్వర్గార్డన్ పట్టణానికి రూపకల్పనచేశారు. తర్వాత 19వ శతాబ్దంలో ఒక కోట తగలబడిన ఘటనలోనూ ఇది చెక్కుచెదరలేదు. ఆ సంఘటన తర్వాత 1930వ సంవత్సరంలో అదే ఇన్వర్గార్డన్ పట్టణ కౌన్సిల్ కేవలం ఐదు పౌండ్లకు కొనుగోలుచేసింది. అయితే తర్వాత అది అదృశ్యమైంది. కేవలం ఐదు పౌండ్ల విలువచేసే శిల్పం ఎక్కడో శిథిలమై ఉంటుందని కౌన్సిల్ సభ్యులు భావించారు. అంతా దానిని మర్చిపోయారు.దశాబ్దాల తర్వాత అంటే 1998లో హైల్యాండ్స్ పారిశ్రామికవాడలోని కర్మాగారం గేటు వద్ద దానిని కౌన్సిల్సభ్యురాలు మాక్సిన్ స్మిత్ చూశారు. తలుపు మూసుకుపోకుండా అప్పుడు అడ్డుగా దానిని వాడుతున్నారు. మిలమిల మెరిసిపోతున్న ఈ ప్రతిమకు ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుందని భావించి దానిని హైల్యాండ్ కౌన్సిల్ స్థానిక ప్రభుత్వానికి అప్పజెప్పారు. ప్రభుత్వాధికారులు దానిని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. తర్వాత దానిని పారిస్ నగరంలోని ‘ది లారీస్’, లాస్ఏంజిల్స్లోని ‘ది గెట్టీ మ్యూజియం’లోనూ ప్రదర్శించారు. ఆనోటా ఈనోట విన్నాక అది ప్రఖ్యాత శిల్పకారుడు చెక్కిన శిల్పమని స్పష్టమైంది. అరుదైనదికావడంతో అది చాలా విలువైనదని గ్రహించి దానిని స్థానిక ప్రభుత్వం అపహరణకు గురికాకుండా లోపల భద్రపరిచింది.సహాయక నిధుల కోసం వేలానికి.. విలువైన వస్తువును దగ్గర పెట్టుకోవడం కంటే దానిని విక్రయిస్తే వచ్చే సొమ్ముతో స్థానికుల సంక్షేమ పథకాలను అమలుచేయొచ్చని స్థానిక ప్రభుత్వం భావించింది. అమ్మడానికి సిద్ధమైంది. వచ్చే నిధులను ఇన్వర్గార్డన్ కామన్‌గుడ్ ఫండ్ కింద ఖర్చుచేస్తామని చాటింపు వేయించింది. చారిత్రక వస్తువును సొంత ఆస్తిగా భావించి వేలం ఎలా వేస్తారని కొందరు కోర్టుకెక్కారు. దీనిపై హైల్యాండ్స్ టెయిన్ షరీఫ్ కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. అది వారసత్వ ఆస్తి కాదని తేల్చిచెప్పింది. చదవండి: వెదురుగొట్టం తూనీగ.. పశ్చిమ కనుమల్లో సరికొత్త జాతిఈలోపే గత ఏడాది అక్టోబర్‌లోనే దానిని రూ.27 కోట్లకు కొంటానని ఒక కుబేరుడు ఆసక్తి చూపించారు. తాజాగా కోర్టు తీర్పుతో ప్రతిమ వేలానికి రంగం సిద్ధమైంది. నవంబర్ ఏడోతేదీన తొలిసారిగా వేలానికి పెట్టారు. రోజు రోజుకూ దీనికి బిడ్డింగ్ ధర పెరుగుతోంది. విషయం తెల్సుకున్న ఆనాటి కౌన్సిల్సభ్యురాలు మాక్సిన్ స్మిత్ మీడియాతో మాట్లాడారు. ‘‘నువ్వు తొలిసారి చూసినప్పుడే దానిని మూడో కంటికి తెలీకుండా ఇంటికి పట్టుకుపోతే బాగుండేది. కోటీశ్వరురాలివి అయ్యేదానివి అని నా స్నేహితులు ఇప్పటికీ నన్ను ఆటపట్టిస్తారు’’అని ఆమె అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంబానీకి కాల్ చేస్తాను: మస్క్
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ముఖేశ్ అంబానీకి ఏదైనా అభ్యంతరం ఉందేమో అడగాలని ఇలొన్‌మస్క్ అన్నారు. దేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపుపై ముఖేశ్ అంబానీ, ఇలొన్‌మస్క్ పరస్పరం విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల వైరల్‌గా మారిన ఓ మీమ్‌కు సంబంధించి ఇలొన్‌మస్క్ స్పందించారు.ఎక్స్‌లో డోజీ డిజైనర్ అనే హ్యాండిల్ నుంచి వచ్చిన మీమ్‌కు మస్క్ రిప్లై ఇచ్చారు. బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపు విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ‘భారత్‌లో అత్యధిక ధనవంతుడిగా ఉన్న ముఖేశ్ అంబానీకి ఇలొన్‌మస్క్ అంటే ఎందుకంత భయం? మస్క్ స్టార్‌లింక్ ముఖేశ్ వ్యాపార సామ్రాజ్యానికి ప్రతిబంధకంగా మారుతుందా?’ అని మీమ్‌ను పోస్ట్ చేశారు. దీనిపై మస్క్ రిప్లై ఇస్తూ ‘భారత్‌లో ప్రజలకు ఇంటర్నెట్ సేవలందించేందుకు స్టార్‌లింక్ వల్ల ఏదైనా సమస్య ఉందేమో అంబానీకి కాల్ చేసి అడుగుతాను’ అని అన్నారు.Why is Indian billionaire Mukesh Ambani afraid of Elon Musk? Is he worried about Starlink's entry into India disrupting his telecom empire? pic.twitter.com/GJiXztmJDg— DogeDesigner (@cb_doge) October 14, 2024ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుశాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలని ముఖేశ్ అంబానీ అభిప్రాయ పడుతున్నారు. కానీ నేరుగా స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపితే సరిపోతుందని మస్క్ అన్నారు. కొంతకాలంగా దీనిపై వివిధ మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందిస్తూ వేలం ప్రక్రియ ప్రపంచంలోని వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానానికి విరుద్ధమన్నారు. దాంతో నేరుగా స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తామనే సంకేతాలు ఇచ్చారు. ఎయిర్టెల్ అధికారులు కూడా మస్క్ అభిప్రాయాలకు మద్దతు పలికారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. భారత్‌లో హై-స్పీడ్ ఇంటర్నెట్ కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను విస్తరించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ఐదు కంపెనీల ప్రాపర్టీలు వేలం
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐదు కంపెనీలకు సంబంధించి 15 ప్రాపర్టీలకు (భూములు/ భవనాలు) నవంబర్ 19న వేలం నిర్వహించనుంది. మంగళం ఆగ్రో ప్రొడక్ట్స్, సుమంగళ్ ఇండస్ట్రీస్, ఫాల్కన్ ఇండస్ట్రీస్ ఇండియా, రవికిరణ్ రియల్టీ ఇండియా, పురుషోత్తమ్ ఇన్ఫోటెక్ ఇండస్ట్రీస్ కంపెనీలకు సంబంధించిన ఆస్తులు ఇందులో ఉన్నాయి.నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి ఈ కంపెనీలు వసూలు చేసిన డబ్బులను వేలం ద్వారా రాబట్టబోతున్నట్లు సెబీ తెలిపింది. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల పరిధిలోని ఈ కంపెనీలకు సంబంధించి ప్రాపర్టీలు, ఫ్లాట్లు, భూములు, ప్లాంట్ మెషినరీ వేలం వేయనున్నారు. ఆ ప్రాపర్టీలకు సంబంధించి బిడ్లను సెబీ ఆహ్వానించింది. 15 ప్రాపర్టీల్లో ఏడు మంగళం ఆగ్రో ప్రొడక్ట్స్‌కు సంబంధించినవి ఉన్నాయి. సుమంగళ్ ఇండస్ట్రీస్, ఫాల్కన్ ఇండస్ట్రీస్‌కు సంబంధించి చెరో మూడు ప్రాపర్టీలు ఉన్నాయి.ఇదీ చదవండి: మొబైల్ తయారీ రంగంలో వేగంగా విస్తరణమంగళం ఆగ్రో ప్రొడక్ట్స్ నిబంధనలకు విరుద్ధంగా సెక్యూర్డ్ ఎన్సీడీ(నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్-కంపెనీ అప్పు చెల్లించడంలో డిఫాల్ట్ అయితే దాని ఆస్తులు అమ్ముకోవచ్చు)లను జారీ చేసి రూ.11 కోట్లు సమీకరించినట్టు సెబీ తేల్చింది. అలాగే సుమంగళ్ ఇండస్ట్రీస్ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్‌ల(వ్యక్తుల నుంచి డబ్బు తీసుకుని విభిన్న మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం) ద్వారా రూ.85 కోట్లు, ఫాల్కన్ ఇండస్ట్రీస్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల(రెడీమ్ చేసేకునేందుకు వీలుగా ఉన్న షేర్లు) జారీ ద్వారా రూ.48.58 కోట్ల చొప్పున సమీకరించడం గమనార్హం. -
HIL: విక్టర్‌కు రూ. 40 లక్షలు
ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ మొదలవుతున్న హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)కు సంబంధించి పురుషుల విభాగం వేలం కార్యక్రమం సోమవారం ముగిసింది. రెండో రోజు బెల్జియం స్టార్ మిడ్‌ఫీల్డర్ విక్టర్ వెగ్నెజ్కు అత్యధికంగా రూ. 40 లక్షలు లభించాయి. బెల్జియం జట్టులో కీలక సభ్యుడువిక్టర్ను పంజాబ్‌కు చెందిన సూర్మా హాకీ క్లబ్ కొనుగోలు చేసింది. 28 ఏళ్ల విక్టర్ బెల్జియం తరఫున ఇప్పటి వరకు 175 మ్యాచ్‌లు ఆడాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన బెల్జియం జట్టులో, 2018 ప్రపంచకప్ సాధించిన బెల్జియం జట్టులో విక్టర్ కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. మన వాళ్లకు ఎంతంటే?నెదర్లాండ్స్‌కు చెందిన థియరీ బ్రింక్‌మన్, ఆర్థుర్ వాన్ డోరెన్లను కళింగ లాన్సర్స్ జట్టు వరుసగా రూ. 38 లక్షలకు, రూ. 32 లక్షలకు సొంతం చేసుకుంది. భారత యువ ఆటగాడు మొరాంగ్థిమ్ రబిచంద్రను కళింగ లాన్సర్స్ జట్టు రూ. 32 లక్షలకు కొనుగోలు చేసింది.భారత్‌కే చెందిన అంగద్‌బీర్ సింగ్‌ను కళింగ లాన్సర్స్ జట్టు రూ. 26 లక్షలకు... హైదరాబాద్ తూఫాన్స్ జట్టు రాజిందర్‌ను రూ. 23 లక్షలకు కైవసం చేసుకుంది. -
వేలానికి 1983 నాటి యాపిల్ ప్రోటోటైప్
ప్రపంచంలో ఏ కంపెనీ అయినా ఒక వస్తువును మార్కెట్లో లాంచ్ చేయాలంటే.. ముందుగా దాని ప్రోటోటైప్ విడుదల చేస్తుంది. ఆ ప్రోటోటైప్ ద్వారానే వస్తువు పనితీరు ఎలా ఉంది అనే విషయం తెలుస్తుంది. అయితే వస్తువుల ఉత్పత్తి ప్రారంభమైన తరువాత, ప్రోటోటైప్స్ నిరుపయోగమవుతాయి. కొన్నేళ్ల తరువాత ఇలాంటి వాటిని సంస్థలు లేదా వ్యక్తులు వేలంలో విక్రయిస్తాయి. ఆసక్తికలిగిన వారు భారీ మొత్తంలో ఖర్చు చేసి వాటిని సొంతం చేసుకుంటారు. 1983 నుంచి మనుగడలో ఉన్న అలాంటి ఒక యాపిల్ ప్రోటోటైప్ 'మాకింతోష్ #ఎమ్001' (Apple Macintosh Prototype #M0001) ఇప్పుడు వేలానికి వచ్చిందియాపిల్ మాకింతోష్ #ఎమ్001 ప్రోటోటైప్ అక్టోబర్ 23 వరకు న్యూయార్క్‌లోని బోన్హామ్స్లో వేలానికి ఉంటుంది. ఇది సుమారు 120000 డాలర్లకు (రూ. 1 కోటి కంటే ఎక్కువ) అమ్ముడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే అత్యంత ఖరీదైన పురాతన యాపిల్ ఉత్పత్తులలో #ఎమ్001 ప్రోటోటైప్ కూడా ఒకటిగా మరో రికార్డ్ క్రియేట్ చేయనుంది.మాకింతోష్ #ఎమ్001 ప్రోటోటైప్ నాలుగు దశాబ్దాలుగా మనుగడలో ఉన్నప్పటికీ.. ఇది మంచి స్థితిలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. యాపిల్ ఉత్పత్తులను వేలంలో విక్రయించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో ఇలాంటి ఓ ప్రోటోటైప్‌ను 150075 డాలర్లకు విక్రయించారు.ఇదీ చదవండి: కేంద్రం శుభవార్త: ఆ ఉద్యోగులకు రూ.2,029 కోట్ల బోనస్కంప్యూటర్లు మాత్రమే కాకుండా.. స్టీవ్ జాబ్స్, జెఫ్ రాస్కిన్ సంతకం చేసిన 128కే మాకింతోష్ మదర్బోర్డ్ 2021లో 132049 డాలర్లకు అమ్ముడైంది. ఆ తరువాత స్టీవ్ జావ్స్ ఉపయోగించిన మాకింతోష్ ఎస్ఈ కంప్యూటర్ను 126375 డాలర్లకు వేలంలో విక్రయించారు. దీన్ని బట్టి చూస్తే మాకింతోష్ #ఎమ్001 ప్రోటోటైప్ కూడా భారీ ధరకే అమ్ముడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మరోసారి తెరపైకి ‘గోల్కొండ వజ్రం’
సాక్షి, హైదరాబాద్: ‘అసలు సిసలైన వజ్రం కావాలంటే గోల్కొండ గనుల్లోనే దొరకాలి’ఇది ఒకప్పుడు ప్రపంచం మాట. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తరించిన గోల్కొండ గనుల్లో లభించే వజ్రాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వజ్రం అనగానే గుర్తుకొచ్చే ‘కోహినూర్’ఇక్కడ దొరికిందే. ఇప్పుడు మరోసారి గోల్కొండ వజ్రాల అంశం తెరపైకి వచ్చింది. బ్రిటిష్ రాజకుటుంబం నగల కలెక్షన్లలో భాగంగా ఉన్న 18వ శతాబ్దం నాటి అరుదైన నెక్లెస్ నవంబర్‌లో వేలానికి వస్తోంది.వేలం నిర్వహణలో ఖ్యాతిగాంచిన సోథెబైస్ జెనీవాలో దీనిని వేలం వేస్తోంది. మూడు వరుసలతో ఉన్న ఈ నెక్లెస్‌లో దాదాపు 500 వజ్రాలున్నాయి. అవి ప్రఖ్యాత గోల్కొండ గనుల నుంచి సేకరించినవే అయ్యి ఉంటాయంటూ తాజాగా వేలం నిర్వహణ సంస్థ సోథేబైస్ ప్రకటించింది. ఈ నెక్లెస్‌కు వేలంలో 2.8 మిలియన్ డాలర్ల గరిష్ట ధర పలుకుతుందని వేలం సంస్థ అంచనా వేస్తోంది. గోల్కొండ వజ్రాల స్వచ్ఛత ఆధారంగా వాటికి వేలం పాటల్లో అధికంగా ధరలు పలుకుతాయి. దీంతో ఇప్పు డు మరోసారి గోల్కొండ వజ్రాలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గోల్కొండ వజ్రాలు ప్రజలను విపరీతంగా అకట్టుకుంటున్నాయి.కోహినూర్‌తో..గోల్కొండ వజ్రాలకు అంతగా ఖ్యాతి రావటానికి కోహినూర్ వజ్రం ప్రధాన భూమిక పోషించింది. ప్రపంచం మొత్తానికి రెండున్నర రోజుల పాటు భోజన ఏర్పాట్లు చేసినందుకు ఎంత ఖర్చవుతుందో కోహినూర్ వజ్రం విలువ అంత ఉంటుందని మొఘల్ చక్రవర్తులు వ్యాఖ్యానించారట. గత పదేళ్లలో కొల్లాపూర్, నారాయణపేటలో జీఎస్ఐకి ముడి వజ్రాలుండే కింబర్లైట్ డైక్స్ లభించాయి. ఈ ప్రాంతాల్లో వజ్రాలుంటాయనటానికి ఇది ఓ ఆధారం. మూసీ పరీవాహకంలో కూడా వజ్రాలు భూగర్భంలో ఉన్నాయని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. బ్రిటిష్ పాలన కాలంలో గుంతకల్ సమీపంలోని వజ్రకరూరులో భారీ వజ్రాల గని తవ్వారు. ఇప్పటికీ అక్కడ 90 మీటర్ల లోతుతో భారీ గుంత నీటితో నిండి ఉంటుంది. » కుతుబ్‌షాహీల కాలంలో వజ్రాల వ్యాపారం ముమ్మరంగా సాగింది. విస్తారంగా గనులు తవ్వి వజ్రాలు వెలికితీశారు. దాదాపు లక్ష మంది కార్మికులు ఈ గనుల్లో పనిచేసేవారట. » ఈ గనులు స్థానిక సుబేదారుల అధ్వర్యంలో రోజువారీగా లీజుకు తీసుకొని హైదరాబాద్‌లోని వ్యాపారులు వజ్రాలు వెలికి తీసేవారు. ఒక క్యారెట్ కంటే ఎక్కువ బరువు తూగే వజ్రం లభిస్తే రాజుకు చెందుతుంది అన్న విధానం అమలులో ఉండేది. అలా కుతుబ్‌షాహీలు చాలా విలువైన, పెద్ద సైజు వజ్రాలు సొంతం చేసుకున్నారు. » గోల్కొండ వజ్రాల్లో నైట్రోజన్, బోరాన్ ఉండదు. ఈ కారణంగా వజ్రం అధిక కాంతివంతంగా ఉంటుంది. » కోహినూర్ తర్వాత అతిపెద్ద వజ్రం నిజాం జాకబ్ వజ్రమే. ఇది 420 క్యారెట్ బరువు ఉండేది. » గోల్కొండ గనుల నుంచి 12 మిలియన్ క్యారెట్ల వజ్రాలు తవ్వారని బ్రిటిష్ కాలంలో నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికీ గోల్కొండ గనుల ప్రాంతంలో చిన్నసైజు వజ్రాలు లభిస్తూనే ఉన్నాయి. » గోల్కొండ డైమండ్స్ అన్నీ ఇప్పుడు యూరోపియన్ రాజకుటుంబాల సేకరణలో భాగంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇరాన్ ట్రెజరీలో ఉన్నాయి. ఒకటి రెండు నైజాం కలెక్షన్లలో ఉన్నాయిటైప్ టూ ఏ కేటగిరీ..» అసలైన వజ్రం స్వచ్ఛతకు మారుపేరుగా ఉంటుందని, ‘గోల్కొండ వజ్రాలు కన్నీళ్లంత స్వచ్ఛమైనవి’అని నిపుణులు చెబుతారు. వజ్రాల వ్యాపారంలో టైప్ టూ ఏ కేటగిరీని అత్యంత అరుదైన, స్వచ్ఛమైనదిగా భావిస్తారు. అందుకే గోల్కొండ వజ్రాలను ఆ కేటగిరీకి చెందినవిగా పేర్కొంటారు. కాకతీయుల కాలంలో గోల్కొండ వజ్రాలను వెలికితీయటం ప్రారంభించారు. ప్రస్తుతం కర్ణాటకలోకి రాయచూరు నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ వరకు ఉన్న ప్రాంతాన్ని గోల్కొండ గనులుగా పరిగణిస్తారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వజ్రాలు లభించేవి. ఈ వజ్రాలు అధికంగా ఉన్న ప్రాంతాలను తన పరిధిలో ఉంచుకునేందుకు నిజాం తహతహలాడేవాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని భూభాగాన్ని అప్పట్లో నిజాం ఆంగ్లేయుల పరం చేశాడు. ఆ సమయంలో ప్రస్తుతం ఆంధ్రాప్రాంతంలో ఉన్న పరిటాల ప్రాంతాన్ని నిజాం తన పరిధిలోకి వచ్చేలా చేసుకున్నాడు. అక్కడ వజ్రాలు అధికంగా లభిస్తుండటమే దీనికి కారణం. ప్రస్తుతం తెలంగాణలో భాగంగా ఉన్న మునగాలను నిజాం సర్కారు బ్రిటిష్ పరిధిలోకి మార్చింది. రాష్ట్రాల పునరి్వభజన సమయంలో భౌగోళికంగా ఈ తీరు సరిగ్గా లేకపోవటంతో పరిటాలను ఆంధ్రప్రదేశ్‌కు, మునగాలను తెలంగాణకు కేటాయించారు. ఇప్పటి వరకు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన మూడు ప్రధాన వజ్రాలు 2008: విట్టెల్స్‌బాచ్ డైమండ్ - 23.7 మిలియన్ డాలర్లు 1995: ఓర్లోవ్ డైమండ్ - 20.7 మిలియన్ డాలర్లకు 1995: జాకబ్ డైమండ్ - 13.4 మిలియన్ డాలర్లుప్రధాన గోల్కొండ వజ్రాల నమూనాలుప్రజలు సందర్శించేందుకు వీలుగా కొన్ని ప్రధాన గోల్కొండ వజ్రాలకు నమూనాలు రూపొందించారు. » లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో కోహినూర్ నకలు వజ్రం ఉంది » మాస్కోలోని క్రెమ్లిన్ ఆర్మరీలో ఓర్లోవ్ డైమండ్ నమూనా ఉంది » టెహరాన్స్ నేషనల్ మ్యూజియంలో దరియా–ఇ–నూర్ వజ్రం నమూనా ఏర్పాటు చేశారు.