ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చే ప్రాడెక్ట్స్ ఏవైనా, ఎంత ధర ఉన్నా సరే మార్కెట్లో వీటికున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల యాపిల్ నుంచి అరుదైన స్నీకర్లను అమ్మకానికి పెట్టగా అవి ఊహించని ధర పలికాయి. మీరు ఐఫోన్, ఐప్యాడ్ లేదా మ్యాక్‌బుక్‌లో ఖర్చు చేసే దానికంటే ఎక్కువ డబ్బును ఈ స్నీకర్ల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. అసలు ఆ బూట్లు ఎంత ధర పలికిందంటే..
ధర వింటే భయపడతారు
దిగ్గజ సంస్థ ఆపిల్ గతంలో తన ఉద్యోగుల కోసం అత్యున్నత టెక్నాలజీతో మేలు రకమైన ఒక నమూనా స్మార్ట్ బూట్లను తయారు చేసింది. కొన్ని కారణాల వల్ల తాజాగా ఈ బూట్ల విక్రయించింది. 1990ల మధ్యకాలంలో ప్రత్యేకంగా తయారు చేసిన జత బూట్లను కంపెనీ వేలం, బ్రోకరేజీ ద్వారా వేలం పోర్టల్‌లలో ఒకటైన సోథెబీస్‌లో వేలం వేశారు. యుఎస్ సైజ్ 10.5లో పురుషుల కోసం తయారైన ఒక జత తెల్లటి బూట్లు ధర $50,000 సుమారు 41 లక్షల రూపాయలకు విక్రయించారు. తన ఉద్యోగుల కోసం కస్టమ్-మేడ్, ఈ అల్ట్రా-రేర్ స్నీకర్స్ 90వ దశకం మధ్యలో జరిగిన నేషనల్ సేల్స్ కాన్ఫరెన్స్‌లో ఒక సారి బహుమతిగా కూడా ఇచ్చినట్లు వేలం హౌస్ కంపెనీ సోథెబైస్ తెలిపింది.
యాపిల్ వంటి వంటి దిగ్గజ టెక్ కంపెనీ స్నీకర్లను ఉత్పత్తి చేయడం అసాధారణంగా అనిపించినప్పటికీ, ఆ సంస్థ ముందుగా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు గతాన్ని పరీశిలిస్తే తెలుస్తుంది. 1986లో ఈ కంపెనీ "ది యాపిల్ కలెక్షన్"ను ప్రారంభించింది. ఇది రెయిన్‌బో ఆపిల్ లోగోతో అలంకరించి దుస్తులు, ఉపకరణాల శ్రేణి. ఇందులో మగ్‌లు, గొడుగులు, బ్యాగులు, కీరింగ్‌లు, సెయిల్‌బోర్డ్‌తో సహా అనేక రకాల వస్తువులు ఉన్నాయి, అన్నీ ఐకానిక్ లోగోను కలిగి ఉంటాయి.
యాపిల్ ఉత్పత్తులంటే డిమాండ్ అట్లుంటది
ఆసక్తికరమైన విషయమేమిటంటే, వింటేజ్ ఆపిల్ ఉత్పత్తులు కళ్లు చెదిరే రేట్లకు అమ్ముడుపోవడం ఇదేం తొలిసారి కాదు. ఇటీవల వేలంలో యాపిల్ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. గత నెలలో, ఐఫోన్ 2007 మొదటి-ఎడిషన్‌ను $190,000కి విక్రయించగా.. యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కు చెందిన ఒక జత Birkenstock చెప్పులు వేలం వేయగా అంతా అవాక్కయ్యేలా $200,000కి అమ్ముడుపోయాయి.
చదవండి బర్త్ డే నాడు కొత్త బిజినెస్‌లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు!
Comments
Please login to add a commentAdd a comment