sneaker shoe
-
ట్రంప్ సంతకం చేసిన షూస్.. ధర ఎంతో తెలుసా..
లగ్జరీ బజార్ సీఈఓ రోమన్ షార్ఫ్ ఇటీవల జరిగిన వేలంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన షూస్‌ను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాజాగా డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన స్నీకర్లను ప్రదర్శించారు. మాజీ అమెరికా ప్రెసిడెంట్ ఈ ఈవెంట్లో కనిపించి అలరించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వేడుకలో స్నీకర్కాన్ సంస్థ బంగారంతో తయారుచేసిన ‘నెవర్ సరెండర్ హై-టాప్స్’ షూస్‌పై ట్రంప్ ఆటోగ్రాఫ్ చేశారు. తరువాత వాటిని వేలానికి ఉంచారు. కార్యక్రమంలో పాల్గొన్న లగ్జరీ బజార్ సీఈఓ రోమన్ షార్ఫ్ వాటిని రూ.7.5లక్షలకు బిడ్ వేసి గెలుపొందినట్లు తెలిసింది. మెరిసే బంగారు హై-టాప్స్ వెనుక భాగంలో అమెరికన్ జెండా, ప్రక్కన ‘T’ (ట్రంప్ కోసం) అనే ఇంగ్లిష్ అక్షరంతో తయారుచేశారు. ఈ ప్రత్యేక ఎడిషన్ స్నీకర్లలో కేవలం 1,000 మాత్రమే తయారు చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అందులో కొన్నింటిపై డొనాల్డ్ ట్రంప్ ఆటోగ్రాఫ్ ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. Donald Trump walking out to the stage at #SneakerCon Has Joe Biden ever received a welcoming like this? Seems like Philadelphia is going to be voting for Trump.#SneakerCon #Trump2024NowMorethanEver pic.twitter.com/0Ohe6ZGkfc — Rob Coates 🇺🇸 (@LuckyHippie926) February 17, 2024 ఇదీ చదవండి: సెమీ కండక్టర్ల కొరత తీరనుందా..? కేంద్రం కీలక నిర్ణయం సోవియట్ యూనియన్‌లో జన్మించిన షార్ఫ్ ప్రస్తుతం ఫిలడెల్ఫియాలో నివసిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద గ్రే మార్కెట్ వాచ్ డీలర్లలో ఒకరిగా పేరుగాంచిన లగ్జరీ బజార్‌కు సీఈవోగా ఉన్నారు. బ్రాండ్లు తమ ఉత్పత్తులను నేరుగా లగ్జరీ బజార్ ద్వారా విక్రయించడానికి అధికారం పొందనప్పటికీ, అతని కంపెనీ మంచి అమ్మకాలను నమోదు చేస్తుంది. ఏటా సుమారు రూ.1100 కోట్లు సంపాదిస్తుంది. -
మార్కెట్లోకి యాపిల్ కంపెనీ బూట్లు.. ధర వింటే గుండెల్లో దడపుట్టాల్సిందే!
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చే ప్రాడెక్ట్స్ ఏవైనా, ఎంత ధర ఉన్నా సరే మార్కెట్లో వీటికున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల యాపిల్ నుంచి అరుదైన స్నీకర్లను అమ్మకానికి పెట్టగా అవి ఊహించని ధర పలికాయి. మీరు ఐఫోన్, ఐప్యాడ్ లేదా మ్యాక్‌బుక్‌లో ఖర్చు చేసే దానికంటే ఎక్కువ డబ్బును ఈ స్నీకర్ల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. అసలు ఆ బూట్లు ఎంత ధర పలికిందంటే.. ధర వింటే భయపడతారు దిగ్గజ సంస్థ ఆపిల్ గతంలో తన ఉద్యోగుల కోసం అత్యున్నత టెక్నాలజీతో మేలు రకమైన ఒక నమూనా స్మార్ట్ బూట్లను తయారు చేసింది. కొన్ని కారణాల వల్ల తాజాగా ఈ బూట్ల విక్రయించింది. 1990ల మధ్యకాలంలో ప్రత్యేకంగా తయారు చేసిన జత బూట్లను కంపెనీ వేలం, బ్రోకరేజీ ద్వారా వేలం పోర్టల్లలో ఒకటైన సోథెబీస్‌లో వేలం వేశారు. యుఎస్ సైజ్ 10.5లో పురుషుల కోసం తయారైన ఒక జత తెల్లటి బూట్లు ధర $50,000 సుమారు 41 లక్షల రూపాయలకు విక్రయించారు. తన ఉద్యోగుల కోసం కస్టమ్-మేడ్, ఈ అల్ట్రా-రేర్ స్నీకర్స్ 90వ దశకం మధ్యలో జరిగిన నేషనల్ సేల్స్ కాన్ఫరెన్స్‌లో ఒక సారి బహుమతిగా కూడా ఇచ్చినట్లు వేలం హౌస్ కంపెనీ సోథెబైస్ తెలిపింది. యాపిల్ వంటి వంటి దిగ్గజ టెక్ కంపెనీ స్నీకర్లను ఉత్పత్తి చేయడం అసాధారణంగా అనిపించినప్పటికీ, ఆ సంస్థ ముందుగా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు గతాన్ని పరీశిలిస్తే తెలుస్తుంది. 1986లో ఈ కంపెనీ "ది యాపిల్ కలెక్షన్"ను ప్రారంభించింది. ఇది రెయిన్బో ఆపిల్ లోగోతో అలంకరించి దుస్తులు, ఉపకరణాల శ్రేణి. ఇందులో మగ్లు, గొడుగులు, బ్యాగులు, కీరింగ్లు, సెయిల్బోర్డ్తో సహా అనేక రకాల వస్తువులు ఉన్నాయి, అన్నీ ఐకానిక్ లోగోను కలిగి ఉంటాయి. యాపిల్ ఉత్పత్తులంటే డిమాండ్ అట్లుంటది ఆసక్తికరమైన విషయమేమిటంటే, వింటేజ్ ఆపిల్ ఉత్పత్తులు కళ్లు చెదిరే రేట్లకు అమ్ముడుపోవడం ఇదేం తొలిసారి కాదు. ఇటీవల వేలంలో యాపిల్ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. గత నెలలో, ఐఫోన్ 2007 మొదటి-ఎడిషన్‌ను $190,000కి విక్రయించగా.. యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కు చెందిన ఒక జత Birkenstock చెప్పులు వేలం వేయగా అంతా అవాక్కయ్యేలా $200,000కి అమ్ముడుపోయాయి. చదవండి బర్త్ డే నాడు కొత్త బిజినెస్‌లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు! -
రణ్‌బీర్ ధరించిన షూ ఖరీదెంతో తెలుసా!
ముంబై: స్టార్స్ ఏది చేసినా ఆ హోదాలోనే ఉంటుంది. లేకుంటే వారిని లక్ష కళ్లతో కాపు కాచే మీడియా తాటాకులు కట్టేస్తుంది. వారు మంచి డ్రస్సుల్లో కనిపిస్తే ‘బెస్ట్ ఫ్యాషన్’ అంటుంది. చెత్త బట్టల్లో కనిపిస్తే వరస్ట్ ఫ్యాషన్ అని వెంటపడుతుంది. అందుకే బయటికొచ్చే ప్రతి స్టార్ లక్ష జాగ్రత్తలు తీసుకుని వస్తుంటారు. తమను చూసి మంచి వార్త రాసేలా చూసుకుంటారు. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ ఇలాంటి వార్తలోకి ఎక్కాడు. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రణ్‌బీర్ కపూర్ బ్లూజీన్స్ ధరించి, చేతిలో బ్యాగ్‌తో ఫొటోగ్రాఫర్లకు దొరికాడు. అయితే అందరి దృష్టి అతడు ధరించిన స్నీకర్స్ (స్పోర్ట్స్ షూస్) మీద పడింది. నైకి అండ్ డియోర్ లిమిటెడ్ ఎడిషన్‌గా వచ్చిన ఈ స్నీకర్స్ వెల దాదాపు ఐదున్నర లక్షల రూపాయలు అట. ఆ సంస్థ ఇలాంటి షూస్‌ని కేవలం 8000 జతలు తయారు చేసిందట. వాటిలో ఒకటి మన హీరోగారు ధరించారు. ఇక అతడు పట్టుకున్న బ్యాగ్ లక్ష రూపాయలకు తక్కువ కాదని భోగట్టా. రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ శ్రీమంతుల్లో ఒకరు. తల్లిదండ్రులు రిషికపూర్, నీతూ కపూర్ సంపాదించిందే కాక తను కూడా స్టార్ హీరోగా బోలెడంత సంపాదించాడు. రణ్‌బీర్ తన కోస్టార్ ఆలియాతో డేటింగ్లో ఉన్నాడని అందరికీ తెలుసు. వారిద్దరు ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటారని అందరూ భావించగా కరోనా వచ్చి ఆ వేడుక పోస్ట్‌పోన్ అయ్యింది. కాగా రణ్‌బీర్, ఆలియా కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ ఈ సంవత్సరం విడుదల కావాల్సి ఉంది. -
రంగులు మార్చుకునే ఈ–బూట్లు
సాక్షి, న్యూయార్క్: రకరకాల రంగుల్లో ఆకర్షణీయమైన స్నీకర్ బూట్లు ధరించడం ఎవరికైనా ఇష్టమే. కొందరు రోజువారి వాడకానికి ఓ జత, పార్టీల కోసం మరో ప్రత్యేక జత బూట్లు ఉండాలని కోరుకుంటారు. వెళ్లే పార్టీనిబట్టి రకరకాల జతల బూట్ల కోసం వెంపర్లాడే వారూ ఉంటారు. ఆర్థిక స్థోమత కలిగిన వారు ఎక్కువ జతల బూట్లు కొనుక్కోగలరుగానీ అందరికి ఆ ఆస్కారం ఉండదు. ఈ అంశాలను దష్టిలో పెట్టుకుందో, లేదోగానీ ‘షిఫ్ట్వియర్’ సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్నీకర్ బూట్లు తయారు చేస్తోంది. ఈ బూట్లపై మనకు నచ్చిన రంగులను ఎప్పటికప్పుడు డిస్ప్లే చేయడంతోపాటు, నచ్చిన రంగురంగుల వీడియోలను కూడా డిస్ప్లే చేయవచ్చు. దానివల్ల రకకలా బూట్లను ధరించిన అనుభూతిని పొందవచ్చు. సెల్‌ఫోన్‌లోని యాప్ ద్వారా బూట్లపై రంగులను, వీడియోలను డిస్ప్లే చేయవచ్చు. అందుకు వీలుగా బూటుపై హై డెఫినేషన్ కలర్ డిస్ప్లే ఈ పేపర్ ఉంటుంది. ప్రస్తుతం బూటు మడమ ప్రాంతంలో ఈ డిస్ప్లే ఈ పేపర్‌ను ఉపయోగించి ప్రోటోటైప్ బూట్ల జతను తయారు చేసి విజయవంతంగా ప్రదర్శించి చూశారు. మున్ముందు బూటుకు చుట్టూ డిస్ప్లే ఈ పేపర్‌ను అరస్తు అంతట మనం కోరుకున్న డిస్ప్లేలు వస్తాయి. ప్రజల నుంచి సేకరించిన మూకుమ్మడి విరాళాల ద్వారా షిఫ్ట్వియర్ కంపెనీ ఈ ప్రాజెక్ట్‌ను 2015లో చేపట్టింది. ఈ ఏడాది చివరి నాటికి బూట్లను తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. అత్యంత విలువైనవి, ఖరీదైనవి అవడం వల్ల ఈ బూట్లు కావాలనుకునేవారు అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవాలని, జత బూట్లకు 500 డాలర్లని ఆ వర్గాలు చెప్పాయి. డిస్ప్లే కోసం బూటుకు కావాల్సిన బ్యాటరీ చార్జింగ్ నడక ద్వారా అవుతుందని, వైఫై, బ్లూటూత్ ద్వారా కూడా సెల్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చని ఆ వర్గాలు తెలిపాయి.