రణ్‌బీర్ ధరించిన‌ షూ ఖరీదెంతో తెలుసా! | Ranbir Kapoor Sneakers Value Is Five And Half Lakhs | Sakshi
Sakshi News home page

రణ్‌బీర్ ధరించిన ఈ‌ షూ ఖరీదెంతో తెలుసా!

Published Mon, Jan 11 2021 9:55 AM | Last Updated on Mon, Jan 11 2021 10:27 AM

Ranbir Kapoor Sneakers Value Is rs 5.5 Lakh - Sakshi

ముంబై: స్టార్స్‌ ఏది చేసినా ఆ హోదాలోనే ఉంటుంది. లేకుంటే వారిని లక్ష కళ్లతో కాపు కాచే మీడియా తాటాకులు కట్టేస్తుంది. వారు మంచి డ్రస్సుల్లో కనిపిస్తే ‘బెస్ట్‌ ఫ్యాషన్‌’ అంటుంది. చెత్త బట్టల్లో కనిపిస్తే వరస్ట్‌ ఫ్యాషన్‌ అని వెంటపడుతుంది. అందుకే బయటికొచ్చే ప్రతి స్టార్‌ లక్ష జాగ్రత్తలు తీసుకుని వస్తుంటారు. తమను చూసి మంచి వార్త రాసేలా చూసుకుంటారు. ఇప్పుడు రణ్‌బీర్‌ కపూర్‌ ఇలాంటి వార్తలోకి ఎక్కాడు. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ బ్లూజీన్స్‌ ధరించి, చేతిలో బ్యాగ్‌తో ఫొటోగ్రాఫర్లకు దొరికాడు. అయితే అందరి దృష్టి అతడు ధరించిన స్నీకర్స్‌ (స్పోర్ట్స్‌ షూస్‌) మీద పడింది. నైకి అండ్‌ డియోర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌గా వచ్చిన ఈ స్నీకర్స్‌ వెల దాదాపు ఐదున్నర లక్షల రూపాయలు అట.

ఆ సంస్థ ఇలాంటి షూస్‌ని కేవలం 8000 జతలు తయారు చేసిందట. వాటిలో ఒకటి మన హీరోగారు ధరించారు. ఇక అతడు పట్టుకున్న బ్యాగ్‌ లక్ష రూపాయలకు తక్కువ కాదని భోగట్టా. రణ్‌బీర్‌ కపూర్‌ బాలీవుడ్‌ శ్రీమంతుల్లో ఒకరు. తల్లిదండ్రులు రిషికపూర్, నీతూ కపూర్‌ సంపాదించిందే కాక తను కూడా స్టార్‌ హీరోగా బోలెడంత సంపాదించాడు. రణ్‌బీర్‌ తన కోస్టార్‌ ఆలియాతో డేటింగ్‌లో ఉన్నాడని అందరికీ తెలుసు. వారిద్దరు ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటారని అందరూ భావించగా కరోనా వచ్చి ఆ వేడుక పోస్ట్‌పోన్‌ అయ్యింది. కాగా రణ్‌బీర్, ఆలియా కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ ఈ సంవత్సరం విడుదల కావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement