ఏదైనా సినిమాకు సంబంధించి క్యాస్టింగ్ ఖర్చు లెక్క రాసుకుంటే టాప్ రెమ్యునరేషన్ హీరోకు ఉంటుంది.. తరువాత హీరోయిన్.. అలా ఉంటుంది చివరి రేటు విలన్ కు ఉంటుంది. కానీ ఈ సరికొత్త రామాయణం సినిమాకు సంబంధించి హీరో అయిన రాముడి పాత్రధారి కన్నా విలన్ అయినా రావణుడి పాత్రధారికే ఎక్కువ పేమెంట్ ఇస్తున్నారు. ఎక్కువ అంటే అలాంటిలాంటి పేమెంట్ కాదండి.. ఏకంగా రెండొందల కోట్లు ఇస్తున్నారు. ఇంతకూ ఎవరా రాముడు.. ఎవరా రావణుడు అనేదేగా మీ అనుమానం..
బాలీవుడ్ నిర్మాత, నటుడు నితీష్ తివారి నిర్మిస్తున్న రామాయణం(Ramayana) సినిమాకు సంబంధించి హీరోగా అంటే శ్రీరాముడిగా రణబీర్ కపూర్ ను ఎంపిక చేయగా అందులో మరో ప్రధాన పాత్రధారి అయిన రావణుడిగా కేజీఎఫ్ సిరీస్ హీరోగా చేసి బాక్సాఫీస్ కొల్లగొట్టిన కన్నడ స్టార్ యష్(Yash) కు మాత్రం హీరోకన్నా ఎక్కువే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. నటుడిగా ఇచ్చిన పారితోషికంతోబాటు డిస్ట్రిబ్యూషన్ హక్కులు.. అన్నీకలిపి మొత్తం రూ. 200 కోట్లవరకు యష్ కు ఇచ్చేనందుకు తివారీ అంగీకరించారట. ఇది హిందీ సూపర్ స్టార్లు అయినా సల్మాన్ ఖాన్.. అమీర్ ఖాన్.. షారూక్ ఖాన్ ల హీరోల పారితోషికం కన్నా ఎక్కువని తెలుస్తోంది.
(చదవండి: తగ్గని శంకర్.. పెరిగిన బడ్జెట్)
ఇటీవల ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన కల్కి చిత్రంలో విలన్ గా నటించిన కమల్ హాసన్ కూడా రూ. 40 కోట్లలోపే తీసుకున్నారట. కానీ యష్ మాత్రం ఏకంగా రూ. 200 కోట్లు తీసుకోవడాన్ని చూసి బాలీవుడ్ సైతం షాక్ అయిందని అంటున్నారు. సల్మాన్ , షారూక్.. అమీర్ ఖాన్లు సైతం ఇంతవరకూ హీరో పారితోషికంతోబాటు డిస్ట్రిబ్యూషన్ హక్కులు సైతం తీసుకుంటారు. ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ వంటివి అన్నీ కలుపుకున్న వారికి ఇంతవరకూ.. రూ. 150 కోట్లు దాటలేదట. కానీ తన అసాధారణ నటనతో కన్నడ బాక్సాఫీస్ కొల్లగొట్టిన యష్ మాత్రం విలన్ పాత్రకోసం ఏకంగా రూ. 200 కోట్లు తీసుకుంటున్నట్లు నితీష్ తివారి అఫీస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక సూపర్ స్టార్లు కూడా ఈ మార్కును టచ్ చేయలేదంటే ఇక రణబీర్ కపూర్ పారితోషికం ఈయనతో సరికిపోల్చడం కూడా కుదరదు అంటున్నారు.
ఇక షారూక్ వంటి స్టార్లతో సమానంగా పారితోషికం తీసుకున్నది సౌత్ ఇండియాలో ముగ్గురే ఉన్నారు. రజనీకాంత్, విజయ్ తలపతి , అల్లు అర్జున్ మాత్రమే ఒక్కో సినిమాకు రూ. 200 కోట్లు తీసుకుంటున్నారట . మొత్తానికి మన సౌత్ ఇండియన్ నటుడు యష్ విలన్ పాత్రలో రెండు వందలకోట్ల పారితోషికం తీసుకుని బాలీవుడ్ హీరోలకు సవాల్ విసిరారు.
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment