Nitesh Tiwari
-
రెండు భాగాలుగా 'రామాయణ'.. విడుదలపై ప్రకటన
భారత ఇతిహాసాలను వెండితెరపై చూపించాలంటే పెద్ద సాహసమేనని చెప్పాలి. ఈ క్రమంలో వచ్చిన చిత్రాలు ఇప్పటకే చాలావరకు విజయాన్ని అందుకున్నాయి. బాలీవుడ్ తెరకెక్కిస్తున్న 'రామాయణ' గురించి ఒక ప్రకటన వచ్చింది. ఈ చిత్రం గురించి ఇప్పటికే కన్నడ స్టార్ యశ్ పలు విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడు పోస్టర్స్ విడుదల చేస్తూ విడుదల తేదీలను కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్‌బీర్‌కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు ప్రచారం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల చేస్తున్నట్లు పోస్టర్స్‌ను కూడా పంచుకున్నారు.ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్‌బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారు. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్‌బీర్ ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ విషయంపై ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణతో పాటు డైట్ కూడా ఫాలో అవుతున్నట్లు తెలిపారు. రాముడి పాత్రలో నటిస్తుండటం వల్ల తాను మద్యపానం మానేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి కూడా పలు విషయాలను పంచుకున్నారు. సీతమ్మ పాత్రలో నటించే అవకాశం దక్కడం తన అదృష్టమని సాయిపల్లవి పేర్కొన్నారు. ఒక నటిగా కాకుండా భక్తురాలిగా నటిస్తున్నట్లు తెలిపారు. -
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫోటోలు లీక్.. స్టార్ డైరెక్టర్ కఠిన నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ సినిమాకు తెలుగు వర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు సమాచారం. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి , రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పార్ట్-2 వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. గోరేగావ్ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరలయ్యాయి. గత రెండు రోజులుగా షూటింగ్ విజువల్స్ విస్తృతంగా బయటకొచ్చాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ ఫోటోలు నెట్టిం లీక్ అవ్వడంతో దర్శకుడు నితీష్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారని బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి షూటింగ్ సెట్స్‌లో నో ఫోన్ పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల సోషల్ మీడియాలో లీకైన చిత్రాలలో కైకేయిగా లారా దత్తా, దశరథ్‌గా అరుణ్ గోవిల్ కనిపించారు. దీంతో ఆగ్రహానికి గురైన నితీశ్.. నో-ఫోన్ విధానం అమలు చేయనున్నారు. చిత్రీకరణ సమయంలో అదనపు సిబ్బంది సెట్‌కు దూరంగా ఉండాలని ఆదేశించారు. కేవలం సన్నివేశంలో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే సెట్లోకి అనుమతించబడతారు. కాగా.. రామాయణం కోసం రూ.11 కోట్లతో సెట్‌ను నిర్మించారు. త్వరలోనే రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సెట్స్‌లో జాయిన్ కానున్నారు. యష్ జూలైలో షూటింగ్లో పాల్గొననున్నారు. Ramayana set 😻💥#RanbirKapoor #niteshtiwari pic.twitter.com/SuUzwwjyUX — Ranbir Kapoor 👑❤️ (@Khushali_rk) April 3, 2024 Shoot for The BIGGEST movie of Indian Cinema - RAMAYANA has started. 💥 Casting is already looking 🔥, I have high hopes from this one directed by very talented Nitish Tiwari 🤞#ArunGovil #LaraDutta #Ramayana #RanbirKapoor #Yash #SaiPallavi #Ramayan 🚩 pic.twitter.com/HAmguvmmFc — αbhι¹⁸ (@CricCineHub) April 4, 2024 -
రామాయణంలో రకుల్.. ఆ పాత్రకు సెట్ అయ్యేనా?
రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు టాలీవుడ్లో ఈ పేరు మారుమ్రోగింది. వరుస సినిమాల్లో నటిస్తూ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మొదలు రవితేజ లాంటి స్టార్ హీరోల వరకు అందరితో రకుల్ నటించింది. ఇక్కడ వచ్చిన ఫేమ్‌తో బాలీవుడ్‌కు చక్కెసింది. అక్కడ అనుకున్న స్థాయిలో క్లిక్ కాలేదు. ఇటీవల అయితే ఈ బ్యూటీకి అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ ఒక్క సినిమా లేదు. తాజాగా తమిళ్లో అలయాన్ సినిమాతో ఓ మోస్తరు కమర్షియల్ హిట్ అందుకుంది. అయినా కూడా ఈ బ్యూటి చేతికి పెద్ద ప్రాజెక్టులు రాలేదు. దీంతో వెస్ సిరీస్‌ల మీదనే ఎక్కువ దృష్టిపెట్టింది. ఇక వెండితెరకు రకుల్ దూరమైనట్లే అనుకుంటున్న సమయంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో రకుల్ నటించబోతుందని ఆ వార్త సారాంశం. (చదవండి: పెళ్లయి ఏడాది కూడా కాలేదు, అంతలోనే నటి విడాకులు!) బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారి రామాయణాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రొడ్యూసర్లతో కలిసి నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కాస్టింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటించబోతున్నారు. సీత పాత్రలో సాయి పల్లవి లేదా జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. హనుమంతుడిగా నటించేందుకు సన్నీ డియోల్ అంగీకారం తెలిపాడు. తాజాగా మరో కీలకమైన పాత్ర కోసం మేకర్స్ రకుల్‌ని సంప్రదించారట. రామాయణంలో కీలకమైన శూర్పణఖ పాత్రను రకుల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం మేకర్స్ ఆమెను సంప్రదించగా..వెంటనే ఓకే చెప్పిందట. త్వరలోనే లుక్ టెస్ట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రావణుడిగా యష్, విభీషణుడిగా విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
రాముడిగా రణ్‌బీర్.. కుంభకర్ణుడుగా బాబీ డియోల్!
‘యానిమల్’ సినిమాలో రణ్విజయ్ సింగ్‌గా రణ్‌బీర్ కపూర్, అబ్రార్‌గా బాబీ డియోల్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా రణ్‌బీర్, బాబీ డియోల్‌లు మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారన్నది బాలీవుడ్లో వినిపిస్తున్న తాజా కబురు. రామాయణం ఆధారంగా హిందీలో దర్శకుడు నితీష్ తివారి ‘రామాయణ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్లుగా నితీష్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నారని, ఈ పనులు తుది దశకు చేరుకున్న తరుణంలో నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారని టాక్. (చదవండి: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది) ఈ నేపథ్యంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో దేవ్ దత్తా, రావణుడి పాత్రలో యశ్ నటించనున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాలోని కుంభకర్ణుడి పాత్రలో బాబీ డియోల్, కైకేయి పాత్రలో లారా దత్తా కనిపించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. (చదవండి: జూ. ఎన్టీఆర్‌పై బాలకృష్ణ ద్వేషం.. చిచ్చు పెట్టింది ఎవరు..?) అన్నీ కుదిరి ‘రామాయణ్’ సినిమాలో రణ్‌బీర్, బాబీ డియోల్ సెట్ అయితే.. ‘యానిమల్’ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించే సినిమా ఇదే అవుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ వేసవిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందట. మధు మంతెన, నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్‌లు కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారనే వార్తలు గతంలో వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్.. ఆ పాత్రకు భారీగా డిమాండ్ చేసిన యశ్!
రామాయణం ఇతిహాసం ఆధారంగా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఈ ఏడాదిలోనే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ మరో బాలీవుడ్ డైరెక్టర్ పెద్ద సాహసానికి రెడీ అయ్యారు. రామాయణం ఆధారంగా భారీ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేశారు. (ఇది చదవండి: హీరోలను మించి రెమ్యునరేషన్.. ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే!) ఆదిపురుష్ లాంటి ఫలితం వచ్చిన తర్వాత కూడా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ రామాయణం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. అంతే కాకుండా ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో రావణుడి పాత్రకు కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో యశ్‌ను చిత్రబృందం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం యశ్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. రావణుడి పాత్రకు దాదాపు రూ.150 కోట్లు డిమాండ్ చేశారని లేటేస్ట్ టాక్. అయితే ఇందులో నిజమెంతనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. తివారీ రామాయణం ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం ద్వారానే యశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మరోవైపు కేజీఎఫ్-3 మూవీ కూడా చేయాల్సి ఉంది. (ఇది చదవండి: రన్ టైమ్ తగ్గించినా కలిసిరాలేదు.. టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?) -
రాముడిగా రణ్‌బీర్.. రావణుడిగా యశ్?
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి.. ఇంకొన్ని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామాయణం ఆధారంగా అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా ఓ సినిమాను నిర్మించనున్నట్లుగా ప్రకటన వచ్చి దాదాపు మూడేళ్లు ముగిసింది. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. దాంతో ఈ చిత్రం నిలిచి΄ోయిందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని, ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని నిర్మాతలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించాలని నిర్మాతలు అనుకుంటున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్ర దర్శకుడు నితీష్ తివారి ఈ సినిమా పనులను మరింత వేగవంతం చేశారని బాలీవుడ్లో వినిపిస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట. రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, హనుమంతుడు వంటి ప్రధాన పాత్రలకు ఆర్టిస్టులను ఎంపిక చేసి, లుక్ టెస్ట్‌ను నిర్వహించేందుకు నితీష్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా ఆలియా భట్, రావణుడి పాత్రలో యశ్‌లు నటించనున్నారని, ముందు వీరి లుక్ టెస్ట్ జరుగుతుందని టాక్. మరి.. ఈ ‘రామాయణం’లో రియల్ లైఫ్ జంట ఆలియా, రణ్‌బీర్ సీతారాములుగా కనిపిస్తారా? ‘కేజీఎఫ్’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విజృంభించిన యశ్ ఈ చిత్రంలో రావణుడిగా బీభత్సం సృష్టిస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
రావణుడిగా ప్రభాస్.. సీతగా దీపికా పదుకోన్!
‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్‌డమ్‌ను ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల వచ్చిన ప్రభాస్ ‘సాహో’ సినిమాకు నెటిగివ్ టాక్, రివ్యూలు వచ్చినా.. కలెక్షన్లు మాత్రం సూపర్బ్ అనిపించాయి. ఈ సినిమా సాధించిన వసూళ్లు బాలీవుడ్‌ను సైతం ఔరా అనిపించాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను ఓ ప్రతిష్టాత్మకమైన పురాణ పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రామాయణ కథతో ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించబోతున్న సినిమాలో ప్రభాస్ రావణుడిగా కనిపించనున్నారని బాలీవుడ్లో వినిపిస్తోంది. రూ. 600 కోట్ల బడ్జెట్‌తో మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బలమైన రావణుడి పాత్ర కోసం ప్రభాస్‌ను చిత్రబృందం సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకు ప్రభాస్ ఈ సినిమాకు ఓకే చెప్పలేదని, ఆయన టీమ్ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టేకాప్ చేయొచ్చా లేదా? అన్నది బేరిజు వేసే పనిలో ఉందని పింక్విల్లా వెబ్సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. రూ.600 కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రభాస్‌కు ఉన్న దేశవ్యాప్త స్టార్డమ్తోపాటు హైట్, పర్సనాలిటీ పరంగా రావణుడి పాత్రకు పర్ఫెక్ట్గా సూటయ్యే లక్షణాలు ఉండటంతో ఆయనను ఈ సినిమా కోసం తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ప్రభాస్ రావణుడి పాత్రను చేస్తే.. ఆ పాత్రకు న్యాయం చేయడమే కాకుండా ప్రజల్లో మరింత హైప్ వచ్చే అవకాశముంటుందని, మరోవైపు రాముడిగా హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకోణ్ నటించే అవకాశముండటంతో వారికి దీటుగా రావణుడి పాత్రలో ప్రభాస్ అలరించే అవకాశముంటుందని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో సీతారాములుగా హృతిక్, దీపిక నటించనున్నారని కథనాలు రాగా.. ఇంకా ఈ సినిమా కోసం క్యాస్టింగ్ ఫైనల్ చేయలేదని ఈ వార్తలను దర్శకుడు నితేశ్ కొట్టిపారేశారు. మరోవైపు ఈ సినిమాలో నటించే తారాగణంపై ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. -
మరో కొత్త ప్రయాణం
నితేష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన ‘దంగల్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా షేక్, జైరా వసీమ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం చైనా, జపాన్ దేశాల్లో కూడా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఇప్పుడు నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం చిత్రీకరణ ముంబైలో ఆదివారం మొదలైంది. ఈ చిత్రానికి ‘ఛిచ్చోరే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘‘ఈ రోజు నా జీవితంలో ప్రత్యేకమైనది. ఎందుకుంటే నా తాజా సినిమా షూటింగ్ మొదలైంది. కొత్త ప్రయాణం’’ అని పేర్కొన్నారు తివారీ. సాజిద్ నడియాద్వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని నితేష్ బయటపెట్టలేదు. కానీ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధాకపూర్, ప్రతీక్ బబ్బర్, వరుణ్ శర్మ పేర్లు వినిపిస్తున్నాయి. -
తెలుగు నేలపై దంగల్ డైరెక్టర్
రికార్డ్ కలెక్షన్లతో ఇండియాలోనే హయ్యస్ట్ గ్రాసర్ గా అవతరించిన దంగల్ చిత్ర దర్శకుడు నితీష్ తివారీ కోనసీమలో సందడి చేశారు. సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఓ లఘుచిత్రం కోసం నితీస్ ఆంద్రప్రదేశ్ కు వచ్చారు. తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న షార్ట్ ఫిలింను తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పరిసరప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తివారీ పచ్చదనంతో కూడిన ఇక్కడి ప్రకృతి తనకు ఎంతగానో నచ్చిందన్నారు. వ్యాపార వేత్త భాస్కర్ రెడ్డి ఈ లఘు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
విదేశాల్లోనూ ఆ మూవీకి రికార్డు కలెక్షన్లు!
హైదరాబాద్: బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించిన 'దంగల్' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్, ఆయన కూతళ్లను ఛాంపియన్లుగా మలచడాన్ని కథాంశంగా తీసుకుని తెరకెక్కించిన దంగల్ మూవీ ఆరో వారం మంచి కలెక్షన్లను వసూలుచేస్తోంది. ఈ నెల 27నాటికి ఓవర్సీస్లో 29.69 మిలియన్ డార్లు (భారత కరెన్సీలో రూ.202.21 కోట్లు) రాబట్టిందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. నిన్న (శుక్రవారం) 28 లక్షలు వసూలు చేసిన దంగల్ మూవీ భారత్‌లో రూ.384.15 కోట్లతో సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది. భారత్‌లో, విదేశాలలో చూస్తే ఓవరాల్‌గా రూ.586.36 కోట్లు వసూళ్లు రాబట్టి మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ మ్యాజిక్‌ను మరోసారి నిరూపించిన మూవీ దంగల్. భారత్‌లో కలెక్షన్లు ఇదే తీరుగా కొనసాగితే దేశంలో రూ.400 కోట్లు వసూలుచేసిన తొలి చిత్రంగానూ మరో రికార్డును చేరుకుంటుంది. -
'అంత ప్రశాంతమైన డైరెక్టర్‌ను చూడలేదు'
ముంబై: మరాఠీ నటుడు గిరీష్ కులకర్ణి.. దంగల్ దర్శకుడు నితీష్ తివారిపై పొగడ్తల వర్షం కురిపించాడు. అసలు అంత ప్రశాంతంగా పనిచేసుకుపోయే దర్శకుడిని తాను ఇంతవరకు చూడలేదని వెల్లడించాడు. అమీర్ ఖాన్ హీరోగా నటించిన దంగల్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కోచ్ పాత్రలో నటించిన కులకర్ణి శనివారం చిత్ర విశేషాలను మీడియాతో పంచుకుంటూ.. ఇంత భారీ ప్రాజెక్టును దర్శకుడు విజయవంతంగా చేపట్టడానికి స్పష్టమైన విజన్‌తో పనిచేయడమే కారణం అని పేర్కొన్నాడు. తన నటుల వద్ద నుంచి సలహాలు తీసుకోవడంలో సైతం నితీష్ ముందుంటారని వెల్లడించారు. -
దుమ్మురేపుతున్న 'దంగల్' ట్రైలర్
బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ తాజా సినిమా 'దంగల్' ట్రైలర్ ఆన్ లైన్ లో దుమ్మురేపుతోంది. గురువారం విడుదలైన ట్రైలర్ కు ఆన్ లైన్ లో భారీ సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్ లో ఇప్పటివరకు 89 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. రొటీన్ సినిమాకు భిన్నంగా ట్రైలర్ ఉందని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. ప్రచార చిత్రం ప్రేరణ ఇచ్చేలా ఉందంటున్నారు. ఈ సినిమా ఆమిర్ ఖాన్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ రెజ్లర్ మహావీర్ పొగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించాడు. తన ఆశయాన్ని కూతుళ్ల ద్వారా సాధించాలనుకునే తండ్రి పాత్రలో అతడు ఒదిగిపోయాడు. యువ మహావీర్ గా కూడా అతడు కనిపించనున్నాడు. అతడు పడిన కష్టం అంతా దంగల్ ట్రైలర్ గా స్పష్టంగా కనపడింది. నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 23న విడుదలకానుంది. -
మల్లయోధుడిగా...
ఒకపక్కన ‘పీకే’ చిత్రం రికార్డులను తిరగరాస్తుంటే, హిందీ చిత్ర సీమలో ఇప్పుడు మరో చర్చ జరుగుతోంది. ఆమిర్‌ఖాన్ నటించే తదుపరి చిత్రం ఏమై ఉంటుందన్నదే ఆ చర్చ. ప్రస్తుతం వినవస్తున్న వార్తలు గనక నిజమైతే, ఆమిర్ తన తదుపరి చిత్రంలో మల్లయోధుడిగా కనిపించనున్నారు. నితేశ్ తివారీ రూపొందిస్తున్న ‘డంగల్’ చిత్రంలో నిజజీవితంలో ప్రసిద్ధ మల్లయోధుడైన మహావీర్ ఫోగత్ పాత్రను ఆమిర్ ఖాన్ పోషించనున్నట్లు సమాచారం. ప్రసిద్ధ భారతీయ మహిళా మల్లయోధులైన గీతా, బబితా కుమారి ఫోగత్ల తండ్రి మహావీర్. కుమార్తెలిద్దరినీ మల్లయుద్ధంలో ప్రోత్సహించిన ఆ తండ్రి నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందట! ఈ పాత్ర కోసం ఆమిర్ ఖాన్ ఇప్పటికే ప్రతి రోజూ రెండేసి గంటల వంతున వ్యాయామం చేస్తున్నారట. వెండితెరపై అసలు సిసలు మల్లయోధుడి లాగా కనిపించడం కోసం ప్రత్యేకించి హాలీవుడ్ నుంచి ఒక ఫిట్నెస్ నిపుణుణ్ణి కూడా రప్పించారట. గతంలో క్రీడా నేపథ్యంలో వచ్చిన ‘చక్ దే ఇండియా’, ‘మేరీ కోమ్’, ‘భాగ్ మిల్ఖా భాగ్’ లాంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి, ఏ పాత్ర పోషించినా దానికి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేసేందుకు ప్రయత్నించే ఆమిర్ ఈసారి తెరపై మల్లయోధుడిగా కూడా అదే స్థాయి అంకితభావం చూపడం ఖాయమేననిపిస్తోంది. -
హీరోలను బట్టి కథల్ని రాయను:నితీష్ తివారీ
న్యూఢిల్లీ: తాను కథలు రాసేటప్పుడు నటుల్నిదృష్టిలో పెట్టుకోనని రచయిత నితీష్ తివారీ స్పష్టం చేశాడు. ఒక కథను అనుకున్న తరువాత తొలుత రాయడానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపాడు. కొన్ని సమయాల్లో మాత్రమే తాను సృష్టించే పాత్రకు ఎవరు తగిన న్యాయం చేస్తారని ఆలోచిస్తానని తెలిపాడు. గతంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ 'భూత్నాథ్ రిటర్న్స్' కు కథను సమకూర్చిన నితీష్.. తాజాగా అమీర్ ఖాన్ సినిమాకు కథను అందించనున్నాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. శుక్రవారం ముంబైలో జాతీయ వార్తా సంస్థతో మాట్లాడిన నితీష్.. తాను కథ బలాన్నే ప్రధానంగా నమ్ముకుంటానన్నాడు. కాకపోతే కొన్ని సమయాల్లో నటుల్ని కూడా దృష్టి పెట్టుకుని కథలు సిద్ధం చేస్తానన్నాడు. తాను ఆ రకంగా ఆహ్వానించే పాత్రలకు కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటానని నితీష్ పేర్కొన్నాడు. ఈ మధ్యనే ఓ వాణిజ్య ప్రకటనకు నితీష్ దర్శకత్వం కూడా వహించారు.