దుమ్మురేపుతున్న 'దంగల్' ట్రైలర్ | Dangal movie Trailer get huge Views in Youtube | Sakshi
Sakshi News home page

దుమ్మురేపుతున్న 'దంగల్' ట్రైలర్

Published Fri, Oct 21 2016 10:34 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

దుమ్మురేపుతున్న 'దంగల్' ట్రైలర్

దుమ్మురేపుతున్న 'దంగల్' ట్రైలర్

బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ తాజా సినిమా 'దంగల్' ట్రైలర్ ఆన్ లైన్ లో దుమ్మురేపుతోంది. గురువారం విడుదలైన ట్రైలర్ కు ఆన్ లైన్ లో భారీ సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్ లో ఇప్పటివరకు 89 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. రొటీన్ సినిమాకు భిన్నంగా ట్రైలర్ ఉందని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. ప్రచార చిత్రం ప్రేరణ ఇచ్చేలా ఉందంటున్నారు. ఈ సినిమా ఆమిర్ ఖాన్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ రెజ్లర్ మహావీర్ పొగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించాడు. తన ఆశయాన్ని కూతుళ్ల ద్వారా సాధించాలనుకునే తండ్రి పాత్రలో అతడు ఒదిగిపోయాడు. యువ మహావీర్ గా కూడా అతడు కనిపించనున్నాడు. అతడు పడిన కష్టం అంతా దంగల్ ట్రైలర్ గా స్పష్టంగా కనపడింది. నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 23న విడుదలకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement