'దేనికైనా సిద్ధమేనా అని అడిగాడు'.. క్యాస్టింగ్‌ కౌచ్‌పై దంగల్ నటి షాకింగ్ కామెంట్స్! | Fatima Sana Shaikh Shares Casting Couch Experiences Early Days In Her Career, Check Out For More Insights | Sakshi
Sakshi News home page

Fatima Sana Shaikh: కొందరైతే డైరెక్ట్‌గానే అడిగేవారు: దంగల్ నటి ఫాతిమా సనా షేక్

Published Mon, Jan 27 2025 8:47 PM | Last Updated on Tue, Jan 28 2025 9:12 AM

Fatima Sana Shaikh Shares casting couch experiences early days in her career

అమిర్ ఖాన్ నటించిన దంగల్‌ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్. రెజ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ దంగల్ రికార్డ్‌ పదిలంగానే ఉంది. ఫాతిమా సనా షేక్ చివరిసారిగా ఆదిత్యరాయ్ కపూర్ సరసన మెట్రో ఇన్ డైనో చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అంతకుముందు 2023లో బాలీవుడ్ మూవీ సామ్ బహదూర్‌లోనూ కనిపించింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ సినీ కెరీర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్లు కమిషన్ పేరుతో డబ్బులు దోచుకునేవారని ఆరోపించింది. కష్టపడి సంపాదిస్తున్న నటులను మోసం చేసేవారని తెలిపింది. ఆడిషన్స్‌ పూర్తయ్యాక క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ 15 శాతం కమిషన్‌ తీసుకున్నాకే మాకు పేమేంట్ ఇచ్చేవారని పేర్కొంది. కానీ కొందరు మాత్రం మంచివారు కూడా ఉండేవారని తెలిపింది. సినీ ఇండస్ట్రీకి కొత్త వచ్చిన నటులను దోచుకునే నీచమైన వ్యక్తులు కూడా ఉన్నారని వెల్లడించింది. అంతేకాకుండా తన కెరీర్‌లో తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను కూడా ఆమె గుర్తు చేసుకుంది.

ఓ డైరెక్టర్‌తో తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని ఫాతిమా సనా షేక్ తెలిపింది. మీరు ఏదైనా చేయడానికి సిద్ధమేనా? అని ఒక దర్శకుడు నన్ను అడిగారని చెప్పుకొచ్చింది. నేను కష్టపడి పని చేస్తానని.. పాత్రకు అవసరమైనది వందశాతం చేస్తానని అతనితో చెప్పాను.. కానీ అతను అంత దిగజారిపోయి మాట్లాడతారని అనుకోలేదని ఫాతిమా షాకింగ్ కామెంట్స్ చేసింది.

అంతేకాకుండా హైదరాబాద్‌లో చిన్నస్థాయి నిర్మాతలను కలుసుకున్న సంఘటనను గుర్తుచేసుకుంది. ఒకప్పుడు బాలీవుడ్‌లో మంచి పాత్రలు రావడానికి సౌత్ సినిమా మొదటి అడుగు అని తాను నమ్ముతున్నానని వెల్లడించింది. మేము ఒక గదిలో ఉండగా.. కొందరు నిర్మాతలు దాని గురించి చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారని.. మేం చెప్పినవాళ్లను మీరు కలవాలని నాతో అన్నారని పేర్కొంది. ఆ విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పకపోయినా.. వారు చెప్పినదాని అర్థం ఏమిటో స్పష్టంగా తెలిసిపోయేదని తెలిపింది. అయితే అందరూ అలా ఉండరని కూడా ఫాతిమా సనా షేక్ చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement