Fatima Sana Shaikh
-
'దేనికైనా సిద్ధమేనా అని అడిగాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై దంగల్ నటి షాకింగ్ కామెంట్స్!
అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్. రెజ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ దంగల్ రికార్డ్ పదిలంగానే ఉంది. ఫాతిమా సనా షేక్ చివరిసారిగా ఆదిత్యరాయ్ కపూర్ సరసన మెట్రో ఇన్ డైనో చిత్రంలో హీరోయిన్గా నటించింది. అంతకుముందు 2023లో బాలీవుడ్ మూవీ సామ్ బహదూర్లోనూ కనిపించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ సినీ కెరీర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్లు కమిషన్ పేరుతో డబ్బులు దోచుకునేవారని ఆరోపించింది. కష్టపడి సంపాదిస్తున్న నటులను మోసం చేసేవారని తెలిపింది. ఆడిషన్స్ పూర్తయ్యాక క్యాస్టింగ్ డైరెక్టర్ 15 శాతం కమిషన్ తీసుకున్నాకే మాకు పేమేంట్ ఇచ్చేవారని పేర్కొంది. కానీ కొందరు మాత్రం మంచివారు కూడా ఉండేవారని తెలిపింది. సినీ ఇండస్ట్రీకి కొత్త వచ్చిన నటులను దోచుకునే నీచమైన వ్యక్తులు కూడా ఉన్నారని వెల్లడించింది. అంతేకాకుండా తన కెరీర్లో తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను కూడా ఆమె గుర్తు చేసుకుంది.ఓ డైరెక్టర్‌తో తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని ఫాతిమా సనా షేక్ తెలిపింది. మీరు ఏదైనా చేయడానికి సిద్ధమేనా? అని ఒక దర్శకుడు నన్ను అడిగారని చెప్పుకొచ్చింది. నేను కష్టపడి పని చేస్తానని.. పాత్రకు అవసరమైనది వందశాతం చేస్తానని అతనితో చెప్పాను.. కానీ అతను అంత దిగజారిపోయి మాట్లాడతారని అనుకోలేదని ఫాతిమా షాకింగ్ కామెంట్స్ చేసింది.అంతేకాకుండా హైదరాబాద్‌లో చిన్నస్థాయి నిర్మాతలను కలుసుకున్న సంఘటనను గుర్తుచేసుకుంది. ఒకప్పుడు బాలీవుడ్లో మంచి పాత్రలు రావడానికి సౌత్ సినిమా మొదటి అడుగు అని తాను నమ్ముతున్నానని వెల్లడించింది. మేము ఒక గదిలో ఉండగా.. కొందరు నిర్మాతలు దాని గురించి చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారని.. మేం చెప్పినవాళ్లను మీరు కలవాలని నాతో అన్నారని పేర్కొంది. ఆ విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పకపోయినా.. వారు చెప్పినదాని అర్థం ఏమిటో స్పష్టంగా తెలిసిపోయేదని తెలిపింది. అయితే అందరూ అలా ఉండరని కూడా ఫాతిమా సనా షేక్ చెప్పింది. -
T20 World Cup 2024: తండ్రి ఆకస్మిక మరణం.. స్వదేశానికి పయనమైన పాక్ కెప్టెన్
తండ్రి ఆకస్మిక మరణంతో పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా టీ20 ప్రపంచకప్-2024 నుంచి వైదొలిగింది. 22 ఏళ్ల ఫాతిమా వరల్డ్‌కప్‌లో పాక్ తదుపరి ఆడబోయే మ్యాచ్‌కు అందుబాటులో ఉండదని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. ఫాతిమా ఇవాళే స్వదేశానికి పయనమైనట్లు పీసీబీ తెలిపింది. ఫాతిమా గైర్హాజరీలో వైస్ కెప్టెన్ మునీబా అలీ పాక్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నట్లు పీసీబీ పేర్కొంది. పాక్ రేపు (అక్టోబర్ 11) డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ప్రపంచకప్‌లో పాక్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి ఓడి (భారత్ చేతిలో), ఒక దాంట్లో (శీలంకపై) గెలిచింది. పాక్ ప్రస్తుతం గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, భారత్ టాప్-2లో ఉండగా.. న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉంది. గ్రూప్-ఏలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీలంక మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాక్ సెమీస్ రేసులో నిలవాలంటే తదుపరి ఆసీస్‌తో జరుగబోయే మ్యాచ్‌తో పాటు న్యూజిలాండ్‌తో జరుగబోయే మ్యాచ్‌లోనూ గెలవాల్సి ఉంటుంది. పాక్ అక్టోబర్ 14న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ సమయానికి రెగ్యులర్ కెప్టెన్ ఫాతిమా సనా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ఫాతిమా సనా ప్రస్తుత వరల్డ్‌కప్‌లో మంచి ఫామ్‌లో ఉంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆమె మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఫాతిమా సనా బంతితోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం -
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్
మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 25) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా ఫాస్ట్ బౌలర్ ఫాతిమా సనా ఎంపికైంది. మాజీ కెప్టెన్ నిదా దార్ స్థానంలో ఫాతిమాను ఎంపిక చేశారు పాక్ సెలెక్టర్లు. 22 ఏళ్ల సనాకు గతంలో దేశవాలీ జట్లకు సారథ్యం వహించిన అనుభవం ఉంది. సనా.. నిదా గైర్హాజరీలో అప్పుడప్పుడు పాక్ కెప్టెన్‌గానూ వ్యవహరించింది. 2023 డిసెంబర్లో జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో సనా నేతృత్వంలోని పాక్ థ్రిల్లింగ్ సూపర్ ఓవర్ విక్టరీ సాధించింది.త్వరలో జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ కోసం పాక్ సెలెక్టర్లు పెద్దగా మార్పులు చేయలేదు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లోని జట్టునే యధాతథంగా కొనసాగించారు. 2024 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన వారిలో 2023 టీ20 వరల్డ్‌కప్ సభ్యులు 10 మంది ఉండటం విశేషం. అన్క్యాప్డ్ పేసర్ తస్మియ రుబాబ్ కొత్తగా జట్టులో చోటు దక్కించుకుంది. ఈ టోర్నీ కోసం పాక్ సెలెక్టర్లు ఓ ట్రావెలింగ్ రిజర్వ్, ఇద్దరు నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లను ఎంపిక చేశారు.కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ ఇటీవలే బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ వేదికను మార్చింది. ఈ మెగా టోర్నీ యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి 30వ తేదీ వరకు జరుగనుంది.పాకిస్థాన్ జట్టు: ఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, గుల్ ఫిరోజా, ఇరామ్ జావేద్, మునీబా అలీ (వికెట్ కీపర్), నష్రా సుంధు, నిదా దార్, ఒమైమా సోహైల్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా, తస్మియా రుబాబ్, తుబా హసన్ట్రావెలింగ్ రిజర్వ్: నజిహా అల్వీ (వికెట్ కీపర్)నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: రమీన్ షమీమ్, ఉమ్-ఎ-హాని -
మంకీ డ్యాన్స్ చాలెంజ్
ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్యాన్స్‌లు వస్తూ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సందడి ఇంటర్నెట్కే పరిమితం కావడం లేదు. బయట రకరకాల ఫంక్షన్లలో నృత్యాభిమానులు ఈ ట్రెండింగ్ డ్యాన్స్‌లను ఫాలో అవుతున్నారు. ‘గాంగ్నమ్’ డ్యాన్స్ తరువాత రకరకాల డ్యాన్సులు వచ్చాయి. తాజాగా ‘మంకీ డ్యాన్స్ చాలెంజ్’ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌గా మారింది. బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమ సనా షేక్ ‘నేను సైతం’ అంటూ ఈ చాలెంజ్‌ను స్వీకరించింది. పింక్ శారీలో మెరిసిపోతూ తన బృందంతో కలిసి చేసిన మంకీ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ‘దిస్ ఈజ్ అమేజింగ్’లాంటి కామెంట్స్‌తో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. కొత్త స్టైల్లో డ్యాన్స్ ట్రై చేయాలనుకుంటున్నావారికి ఈ వీడియో బెస్ట్ ఛాయిస్. -
అటు మాజీభార్య ఇటు ప్రేయసి.. మధ్యలో ఆమిర్‌ఖాన్!
బాలీవుడ్ మిస్టర్ ఫెర్ఫెక్ట్ అనగానే అందరికీ హీరో ఆమిర్‌ఖాన్ గుర్తొస్తాడు. డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుండేవాడు. అయితే గతేడాది 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో దెబ్బ గట్టిగా తగిలింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం దారుణంగా ఫెయిలయ్యేసరికి ఆలోచనలో పడిపోయాడు. కొన్నాళ్లపాటు నటన, సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అలా అని ఖాళీగా ఏం లేడు. చేతినిండా సినిమాలతో బిజీగానే ఉన్నాడు. (ఇదీ చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) మాజీభార్యతో కలిసి ఆమిర్ ఖాన్.. తొలుత నిర్మాత రీనా దత్తాని పెళ్లి చేసుకున్నాడు. 16 ఏళ్లపాటు కాపురం చేసిన ఈ జంట.. 2002లో విడిపోయింది. 2005లో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కిరణ్ రావ్ ని పెళ్లి చేసుకున్న ఆమిర్.. ఈమెతోనూ 16 ఏళ్లు సంసారం చేసి 2021లో విడాకులు ఇచ్చేశాడు. రిలేషన్ లో విడిపోయినప్పటికీ.. ఫ్రొఫెషనల్ గా వీళ్లు కలిసే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమిర్ నిర్మాణంలో కిరణ్ ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. త్వరలో ఇది విడుదల కానుంది. రూమర్ గర్ల్‌ఫ్రెండ్‌తోనూ ప్రస్తుతం ఆమిర్ ఖాన్.. 'దంగల్' ఫేమా ఫాతిమా సనా షేక్ తో రిలేషన్ లో ఉన్నాడని, త్వరలో పెళ్లి చేసుకుంటాడని గత కొన్నాళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ విషయం పక్కనబెడితే.. ఆమిర్ ఖాన్ ప్రస్తుతం నిర్మిస్తున్న నాలుగు మూవీస్ లోని ఒక దానిలో ఫాతిమా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్ హిట్ 'జయజయజయహే' రీమేక్ గా దీన్ని తీస్తున్నారు. ఇది కూడా త్వరలో రిలీజ్ కానుంది. అటు మాజీ భార్య ఇటు ప్రేయసిని ఆమిర్ ఖాన్ భలే బ్యాలెన్స్ చేస్తున్నాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: సలార్-కేజీఎఫ్ కనెక్షన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత) -
ఆ హీరోయిన్‌తో సన్నిహితంగా అమీర్ ఖాన్.. వీడియో లీక్
-
త్వరలోనే అమీర్ ఖాన్ మూడో పెళ్లి? కూతురు వయసున్న ఆమెతో..
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు కామనే. పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. ప్రేమలో చాలాకాలం మునిగితేలి పెళ్లి చేసుకున్నాక విడిపోయిన జంటలు కూడా ఎన్నో ఉన్నాయి.తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన లాల్ సింగ్ చద్దా ఘోర పరాజయం చెందడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఆయన త్వరలోనే మూడో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దంగల్ సినిమాలో అమీర్‌కు కూతురిగా నటించిన ఫాతిమా సనాషేక్‌తో కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇద్దరూ చెట్టాపట్టేసుకొని పలుమార్లు మీడియా కంట పడ్డారు. ఇటీవల అమీర్ కూతురు ఇరాఖాన్ ఎంగేజ్మెంట్ వేడుకలోనూ ఫాతిమా సందడి చేసింది. తాజాగా ఇద్దరూ కలిసి ఉన్న ఓ వీడియో నెట్టింట లీక్ అయ్యింది. ముంబైలో వీరిద్దరూ కలిసి పికిల్ బాల్ ఆడారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో మరోసారి అమీర్ ఖాన్ పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీనికి తోడు అమీర్ ఖాన్ త్వరలోనే దంగల్ నటిని పెళ్లాడనున్నట్లు ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. కాగా 1986లో రీనా దత్తను పెళ్లి చేసుకున్న అమీర్ 2002లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కిరణ్ రావును 2005లో పెళ్లి చేసుకోగా 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. -
అరుదైన వ్యాధి.. ఈ పోరాటంలో విజయం మాదే అంటున్న అందాల తారలు
సమంతకు ‘మయోసైటిస్’.. పూనమ్ కౌర్‌కి ‘ఫైబ్రోమయాల్జియా’.. ఇది అందరికీ తెలిసిన విషయమే. మంగళవారం నాడు మమతా మోహన్‌దాస్ తాను చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘ఈ కష్టాన్నీ దాటేస్తాను’ అనే నమ్మకాన్ని వ్యక్తపరిచారామె. ఇక సమంత తన అనారోగ్యం గురించి చెప్పినప్పుడు ‘నాలానే ఎంతోమంది పోరాడుతున్నారు. మేం గెలుస్తాం’ అన్నారు. ఇదే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచిన పూనమ్, మమతా.. ఈ మధ్యకాలంలో తమ అనారోగ్యం గురించి పేర్కొన్న కొందరు తారల గురించి తెలుసుకుందాం. గత ఏడాది అక్టోబర్‌లో సమంత తాను మయోసైటిస్ వ్యాధి (ఎక్కువ పని చేయలేకపోవడం, కండరాల నొప్పి, త్వరగా అలసిపోవడం వంటివి)తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. ఆస్పత్రి బెడ్‌పై ఉండి ఆమె ‘యశోద’ సినిమాకి డబ్బింగ్ చెప్పారు కూడా. ‘‘జీవితంలో మంచి రోజులతో పాటు చెడ్డ రోజులు కూడా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో (మయోసైటిస్‌ని ఉద్దేశించి) ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపించింది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంతదూరం వచ్చానా అనిపించింది. అందుకే పోరాడతా. నాలానే చాలామంది పోరాడుతున్నారు. మేం గెలుస్తాం’’ అని పేర్కొన్నారు సమంత. ఇక సమంత తనకు మయోసైటిస్ అని ప్రకటించిన తర్వాత పియా బాజ్‌పాయ్ (‘రంగం’ సినిమా ఫేమ్) కూడా గతంలో తాను ఇదే వ్యాధితో బాధపడ్డాననే విషయాన్ని బయటపెట్టారు. అయితే ఇంట్లోవాళ్లు భయపడతారని తనకు మయోసైటిస్ అనే విషయాన్ని చెప్పలేదన్నారు పియా. కుటుంబ సభ్యులతో ఢిల్లీలో ఉంటున్న పియా వ్యాధి చికిత్స నిమిత్తం ముంబైలో ఉన్నారు. ఇంట్లోవాళ్లకు తెలియకుండా చికిత్స చేయించుకుని, కోలుకున్నాక చెప్పానని పియా పేర్కొన్నారు. ఇటీవల ‘లాస్ట్’ అనే హిందీ చిత్రంలో నటించారామె. ఇక సమంత తన అనారోగ్యం విషయం బయటపెట్టిన రెండు నెలలకు డిసెంబర్లో పూనమ్ కౌర్ తనకు ‘ఫైబ్రోమయాల్జియా’ అనే విషయాన్ని బయటపెట్టారు. కండరాల నొప్పి, అలసట, నిద్రలేమితో ఈ వ్యాధి బాధపెడుతుంటుంది. రెండేళ్లుగా ఈ వ్యాధితో తాను బాధపడుతున్నట్లు తెలిపారు పూనమ్. కేరళలో ఆయుర్వేద చికిత్స మొదలుపెట్టిన ఆమె త్వరలోనే కోలుకుంటానని ఈ వ్యాధి గురించి ప్రకటించినప్పుడు తెలిపారు. మరోవైపు గత ఏడాది నవంబర్‌లో బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ తాను ‘ఎపిలెప్సీ’ (మూర్ఛ రోగం)తో బాధపడుతున్నట్లు తెలిపారు. అయితే తన వ్యాధి విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగా ఉంచడానికి కారణం ఇతరులు తనను బలహీనురాలు అనుకోకూడదని, ఒకవేళ అందరికీ తెలిస్తే తనకు పని ఇవ్వడానికి వెనకాడతారనే భయాలే అని పేర్కొన్నారు ఫాతిమా. కానీ ఇప్పుడు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తన విషయం బయటపెట్టానని స్పష్టం చేశారు. ‘‘నేను షూటింగ్ చేస్తున్నప్పుడు మా యూనిట్లో ఒకరికి మూర్ఛ వచ్చింది. నేను ఆ వ్యక్తికి సహాయం చేశాను. నాకలా జరిగినప్పుడు ఇతరుల సహాయం కావాలి. అయితే ఇదేం తప్పు కాదు... దాచేయడానికి. అందుకే చెప్పాలనుకున్నాను. నా నిర్మాతలకు నా పరిస్థితి చెబుతుంటాను. లొకేషన్లో నాకు మూర్ఛ వచ్చిన సందర్భాలున్నాయి. ఆ టైమ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందే చెప్పడం హెల్ప్ అయింది’’ అన్నారు ఫాతిమా. ఆమిర్ ఖాన్ కూతురుగా ‘దంగల్’లో ఫాతిమా మల్ల యోధురాలుగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు ఫాతిమా. ఇక 2010లో మమతా మోహన్‌దాస్ కేన్సర్ బారిన పడ్డారు. ఆ విషయాన్ని బాహాటంగా చెప్పి, ధైర్యంగా చికిత్స చేయించుకున్నారామె. కేన్సర్‌పై అవగాహన కలిగించడానికి పలు విషయాలను పంచుకున్నారు కూడా. అయితే 2013లో మళ్లీ కేన్సర్ అని తెలిసినప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకుని, కోలుకున్నారు. ఇప్పుడు మంగళవారం (17.01.) నాడు తాను చర్మ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని పంచుకున్నారు మమతా మోహన్‌దాస్. ‘విటిలిగో’ అనే చర్మ వ్యాధి సోకిందని పేర్కొన్నారామె. చర్మంపై మచ్చలు, చర్మం రంగు మారడం ఈ వ్యాధి లక్షణాలన్నారు. ఇంకా ‘‘ప్రియమైన సూర్యుడా.. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు నిన్ను హత్తుకోవాలనుకుంటున్నాను. నా చర్మం రంగుని కోల్పోతున్నాను. నువ్వు ఉదయించక ముందే నీకోసం నేను నిద్రలేచి పొగమంచులో నీ తొలి కిరణాన్ని చూడటానికి వేచి చూస్తున్నాను. నీ వెచ్చదనాన్నంతా నాకు ఇచ్చెయ్. ఎందుకంటే నాకు అది ఎంతో మేలు చేస్తుంది. అందుకే నీకెప్పటికీ రుణపడి ఉంటాను’’ అని మమతా మోహన్‌దాస్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ‘మీరు పెద్దవే దాటి వచ్చారు. ఇది చిన్న విషయం. ఇందులోంచీ బయటపడతారు’ అని ఫ్యాన్స్ పోస్ట్ చేశారు. అనారోగ్యం అనే విషయాన్ని బయటపెట్టడానికి ధైర్యం కావాలి. దాన్ని ఎదుర్కొని, కోలుకోవడానికి ఇంకా ధైర్యం కావాలి. ఈ చాలెంజ్‌లో ‘గెలుపు ఖాయం’ అని నమ్మడంతో పాటు ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన ఈ స్టార్స్ నిజమైన ‘స్టార్స్’. -
Fatima Sana Shaikh : ఫాతీమ సనా షేక్ స్టన్నింగ్ ఫోటోస్
-
ఫాతిమా ఫొటోపై ఆమిర్ ఖాన్ కూతురు కామెంట్.. వైరల్
Fatima Sana Shaikh Viral Pics: ఫాతిమా సనా షేక్... గత కొన్నిరోజులగా ఈ బాలీవుడ్ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. స్టార్ జంట ఆమిర్ ఖాన్- కిరణ్‌రావు దంపతుల విడాకులకు ఈ భామనే కారణమంటూ కొంతమంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. దంగల్‌లో ఆమిర్ కూతురిగా నటించిన ఫాతిమా.. ఇప్పుడు అతడితో కలిసి జీవితం పంచుకోబోతుందంటూ ఎవరికి తోచినట్టు వారు కథనాలు అల్లేస్తున్నారు. అయితే, ఈ విషయాలపై ఫాతిమా ఇంతవరకు నేరుగా స్పందించడంతో.. ‘‘నిజమే కాబోలు.. అందుకే మౌనంగా ఉంది’’ అంటూ కొంతమంది కామెంట్ చేస్తుండగా.. ఆమె అభిమానులు మాత్రం.. ఫాతిమా ఇలాంటి చెత్త విషయాలపై స్పందించదు అని ఆమెను వెనకేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫాతిమా సనా షేక్ ఇటీవల వరుస ఫొటోషూట్లతో ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తోంది. క్రాప్ టాప్‌నకు జీన్స్ జతచేసి సింపుల్ డ్రెస్సింగ్‌తోనే హీట్ పెంచుతూ ఫాలోవర్లను ఫిదా చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఆమె షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లతో పాటు సెలబ్రిటీలను కూడా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, సాన్యా మల్హోత్రా.. ‘‘నిప్పు రాజేస్తున్నావ్’’ అంటూ ఫైర్ ఎమోజీలను జత చేయగా.. ఆమిర్ కూతురు ఇరా ఖాన్.. ‘‘ఎంత అందంగా ఉన్నావో నువ్వు’’ అని కామెంట్ చేసింది. ఫాతిమా ఫొటోపై ఇరా కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘‘మీ నాన్నకు, నీకూ ఇద్దరికీ నచ్చేశాక ఇంకేముంది. ఫాతిమాను కుటుంబంలోకి ఆహ్వానించినట్లేనా’’ అని ఇష్టారీతిన ట్రోల్ చేస్తున్నారు. కాగా దంగల్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఫాతిమా సనా షేక్.. నెట్‌ఫ్లిక్స్ యాంథాజలీ అజీబ్ దస్తాన్స్లో చివరిసారిగా కనిపించింది. వీటితో పాటు లేడీస్ స్పెషల్, అగ్లే జనమ్ మోహె బితియా హీ కీజో వంటి టీవీ షోలలోనూ తళుక్కుమంది. View this post on Instagram A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) -
Aamir Khan Divorce: తెరపై కూతురు.... నిజజీవితంలో భార్య!
శుభాకాంక్షలు ఆమిర్... ఫాతిమా... ఈ బంధం అయినా సుదీర్ఘంగా సాగాలి! తెరపై కూతురు.... నిజజీవితంలో భార్య!! మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంటారు కానీ.. ఏ మాత్రం పర్ఫెక్ట్ కాదు!! ‘సత్యమేవ జయతే’కి హోస్ట్ చేశాడు... కానీ ఫాతిమా కోసం కిరణ్‌ని వదిలేశాడు!! ఫస్ట్ రీనా.. సెకండ్ కిరణ్... ఫాతిమా నం. 3 !! ...గడచిన రెండు రోజులుగా సోషల్ మీడియా నిండా ఇలాంటి వ్యంగ్యాస్త్రాలే. ‘మా పదిహేనేళ్ల వివాహ బంధాన్ని ముగిస్తున్నాం.. విడిపోతున్నాం’ అని ఆమిర్ ఖాన్, కిరణ్ రావు గత శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. చాలామంది ఊహల్లో ఉన్న పేరు ‘ఫాతిమా సనా షేక్’. కిరణ్, ఆమిర్; ఫాతిమా, ఆమిర్ ‘దంగల్’ (2016)లో ఆమిర్‌కి కూతురిగా నటించింది ఫాతిమా. ఆ తర్వాత ఆమిర్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ (2018) లోనూ నటించింది. ఈ సినిమాలు పూర్తయ్యాక కూడా ఆమిర్, ఫాతిమా టచ్‌లోనే ఉంటున్నారని బాలీవుడ్ కథనం. అవార్డు వేడుకలకు, పెద్దింటి ఫంక్షన్లకు ఇద్దరూ జోడీగా వెళ్లారనే వార్తలు కూడా ఉన్నాయి. ఆమిర్ ఇంటికి ఫాతిమా రాకపోకలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యా ‘కుఛ్ కుఛ్ హో రహా హై?’ (ఏదో ఏదో జరుగుతోంది) అనే వార్తలు మొదలయ్యాయి. అప్పట్లో ఆ వార్తలను ఫాతిమా ఖండించింది కూడా. ‘‘ఇలాంటివి ఎదుర్కోవడం నాకస్సలు అలవాటు లేదు. నేను ఎప్పుడూ కలవని అపరిచితులు నా గురించి ఏదేదో రాస్తున్నారు. నిజమేంటో వాళ్లకు తెలియదు. అయితే ఆవి చదివినవాళ్లు మాత్రం నా గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా రాయాలంటే, నన్నే అడిగితే చెబుతాను కదా. నిజాలు తెలియకుండా ఏవేవో ఊహించుకోవడం బాధగా ఉంది. కానీ ఇప్పుడు ఈ వార్తలను విస్మరించడం నేర్చుకుంటున్నాను’’ అని ఫాతిమా పేర్కొన్నారు. అప్పుడు అలా స్పందించిన ఫాతిమా సనా ఇప్పుడు సోషల్ మీడియాలో ‘ఆమిర్‌కి రీల్ లైఫ్‌లో కూతురు... రియల్ లైఫ్‌లో భార్య’ అనే విమర్శలు వినిపిస్తున్నా మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. ‘మౌనంగా ఉందంటే అవుననే కదా’ అని కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. భావప్రకటన స్వేచ్ఛ అయితే ఆమిర్–ఫాతిమా మధ్య ఏం ఉందో తెలియకుండా దారుణంగా విమర్శించడం సరి కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ విమర్శిస్తున్నవారిలో కొందరు మాత్రం ‘భావప్రకటన స్వేచ్ఛ’ను తెరపైకి తెచ్చారు. దానికి ఆమిర్–కిరణ్‌లను కారణంగా చెబుతున్నారు. కొన్నేళ్ళ క్రితం ఓ కార్యక్రమంలో ఆమిర్ మాట్లాడుతూ – ‘‘దేశంలో జరుగుతున్న అల్లర్లు సహించలేనివిగా ఉన్నాయి. అభద్రతా భావం నెలకొని ఉన్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండటం పిల్లలకు క్షేమం కాదు.దేశం వదిలి వెళ్లిపోదామా అని నా భార్య కిరణ్ భయం వ్యక్తం చేసింది’’ అనడం చర్చకు దారి తీసింది. ఇప్పుడు ఆమిర్–కిరణ్ విడాకుల వ్యవహారం నేపథ్యంలో.. దేశం పట్ల ఆమిర్‌కి ఏమాత్రం గౌరవం లేదని, అప్పుడు భావప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడాడని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ‘‘మాకు కూడా భావప్రకటన స్వేచ్ఛ ఉంది. మేం కూడా మా అభిప్రాయాలను చెబుతున్నాం. ఈ విషయంలో నువ్వు.. కిరణ్.. నీ ప్రియురాలు (ఫాతిమా) మమ్మల్ని ఏమీ చేయలేరు’’ అని ఘాటుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చ ఆమిర్‌కి తెలియనిది కాదు. కానీ మౌనం వహించారు. మరి.. విమర్శలకు గురవుతున్న ఆమిర్–ఫాతిమా నోరు విప్పితేనే చాలామంది నోళ్లు మూతబడే అవకాశం ఉంది. ఆ సంగతలా ఉంచి.. 56 ఏళ్ల ఆమిర్, 29 ఏళ్ల ఫాతిమా మధ్య నిజంగానే ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే వీరిది మూడు ముడుల బంధం గా మారుతుందా? అనేది కాలమే చెప్పాలి. విఫలమైన వివాహబంధాలు హిందీ పరిశ్రమలో విఫలమైన వివాహ బంధాలు చాలానే ఉన్నాయి. ఆ వివరాలు... ► బాలీవుడ్ ప్రముఖ నటుడు ఓంపురి 1991లో సీమా కపూర్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఎనిమిది నెలలకే వీరు విడాకులు తీసుకుని వేరయ్యారు. ఆ నెక్ట్స్ ‘అన్లైక్లీ హీరో: ద స్టోరీ ఆఫ్ ఓంపురి’ అంటూ తన బయోగ్రఫీ రాసిన జర్నలిస్టు నందితా పురిని 1993లో వివాహం చేసుకున్నారు ఓంపురి. అయితే పెళ్లి చేసుకున్న పదేళ్లకు ఓంపురి, నందిత విడాకులు తీసుకున్నారు. ► నటి పూజా భట్, మనీష్ మఖీజా 2003లో పెళ్లి చేసుకున్నారు. 11 ఏళ్లకు విడాకులు తీసుకున్నారు. ఓంపురి, నందిత; సైఫ్, అమృత ► అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా 1998లో పెళ్లి చేసుకున్నారు. 2017 మే నెలలో విడాకులు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం హీరో అర్జున్ కపూర్‌తో మలైకా ప్రేమలో ఉన్నారని టాక్. వీరిద్దరు త్వరలో వివాహం చేసుకోనున్నారట. ► కరిష్మా కపూర్, అజయ్ దేవగణ్ లవర్స్ అని గతంలో బాలీవుడ్ కోడై కూసింది. తర్వాత ఇద్దరి మనసుల మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్‌తో 2002లో నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లి జరగలేదు. 2003లో వ్యాపారవేత్త సంజయ్‌ని పెళ్లాడారు కరిష్మా. 2014లో ఇద్దరూ విడిపోవాలనుకున్నారు. 2016కి విడాకులు మంజూరయ్యాయి. ► నటుడు సైఫ్ అలీఖాన్ 1993లో నటి అమృతా సింగ్‌ను పెళ్లాడారు. 2004లో ఇద్దరూ విడిపోయారు. 2012లో హీరోయిన్ కరీనా కపూర్‌తో సైఫ్ ఏడడుగులు వేశారు. ఇంకా హిందీ పరిశ్రమలో ఏడడుగులు వేసి, ఆ తర్వాత విడిపోయిన వారిలో నటుడు యాక్టర్, డైరెక్టర్ ఫర్హాన్– హెయిర్ స్టైలిస్ట్ అధునా భబానీ, రణ్వీర్ షోరే–కొంకణా సేన్ శర్మ, అనురాగ్ కశ్యప్– కల్కీ కొచ్లిన్ తదితరులు ఉన్నారు. మలైకా, అర్బాజ్; హృతిక్, సుజానె; కరిష్మా, సంజయ్ హృతిక్ రోషన్‌కి 26 ఏళ్లకే పెళ్లయింది. 2000లో సుజానే ఖాన్ని పెళ్లాడారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2013లో విడివిడిగా ఉండటం ఆరంభించిన హృతిక్–సుజానేలకు 2014లో విడాకులు మంజూరయ్యాయి. పిల్లలిద్దరూ తల్లి, తండ్రి దగ్గర ఉంటుంటారు. భార్యాభర్తలుగా తాము విడిపోయినా పిల్లల బర్త్‌డేలు కలిసి చేస్తూ, కలిసి హాలిడే ట్రిప్‌లకు వెళుతూ తల్లితండ్రులుగా పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. -
అమీర్-కిరణ్.. మధ్యలో ఆమె!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన మరుక్షణమే.. అదొక హాట్ టాపిక్‌గా మారింది. సెటైర్లు, ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లతోనే నిన్నంతా సోషల్ మీడియాలో చర్చ నడించింది. అయితే హాఠాత్తుగా ఫాతిమా సనా షేక్ పేరు తెర మీదకు వచ్చింది. రికార్డుస్థాయిలో ఆమె పేరు హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు ట్విటర్లో పోస్ట్ అయ్యాయి.. ఇంకా అవుతూనే ఉన్నాయి. అమీర్ ఖాన్‌తో యంగ్ హీరోయిన్ ఫాతిమాకు ఎఫైర్ ఉందని, అందుకే వాళ్లిద్దరూ విడిపోతున్నారనేది నెటిజన్స్ ఒపీనియన్. అందుకే వాళ్ల ఫొటోలతో, ఫాతిమాను తెర మీదకు తెచ్చి ఆడుకుంటున్నారు. 29 ఏళ్ల ఫాతిమా.. 56 ఏళ్ల అమీర్‌తో వరుసగా రెండు సినిమాలు చేసింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని బాలీవుడ్ మీడియా హౌజ్‌లలో పుకార్లు వినిపించాయి. ఆ వ్యవహారాన్ని అమీర్ లైట్ తీసుకోగా.. ఫాతిమా మాత్రం తనకు ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు తన గురించి తప్పుగా రాయడం సరికాదని వ్యాఖ్యానించింది కూడా. భావ ప్రకటన స్వేచ్ఛ.. ఇక ఫాతిమాతో అమీర్‌కు లింక్ అంటగట్టడం.. ఈ ఎఫైర్‌ను విడాకులకు ముడిపెట్టడం అంతా భావ స్వేచ్ఛ ప్రకటనలో భాగమేనని పలువురు నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో దేశం పట్ల, దేశభద్రత పట్ల, ప్రభుత్వం పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా వ్యవహరించిన అమీర్ తీరును ఈ సందర్భంగా కొందరు ప్రస్తావిస్తున్నారు. ‘అమీర్ నువ్వు ఎలాగైనా భావ స్వేచ్ఛ ప్రకటన గురించి ఆందోళన వ్యక్తం చేశావో గుర్తుందా? నీ భార్యా దేశం విడిచి వెళ్లాలని ఉందని చేసిన కామెంట్లు గుర్తున్నాయా?.. ఇప్పుడు మా భావ ప్రకటన స్వేచ్ఛను ప్రదర్శిస్తున్నాం. ఈ విషయంలో నువ్వు, నీ భార్య, నీ ప్రియురాలు(ఫాతిమా) .. ఎవరూ కూడా మమ్మల్ని అడ్డుకోలేరు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కూతురు.. ఆ వెంటనే హీరోయిన్ హైదరాబాద్‌లో పుట్టిన ఫాతిమా సనా షేక్.. బాలనటిగా పలు హిందీ చిత్రాల్లో నటించింది. నువ్వు నేను ఒకటవుదాం (2015)తో తెలుగులో నటించిన ఫాతిమా.. 2016లో అమీర్ ఖాన్ ‘దంగల్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో అమీర్ కూతురిగా నటించిన ఫాతిమా.. ఆ వెంటనే థగ్స్ ఆఫ్ హిందోస్థాన్‌లో జోడిగా నటించింది. ప్రమోషన్స్ ముగిశాక కూడా ఇద్దరూ చాలాకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ముంబైలో దిగినప్పుడల్లా ఆమె అమీర్ ఖాన్ ఇంటికి వెళ్లడంతో పుకార్లు మరింత బలపడ్డాయి. దీంతో రూమర్లు మొదలయ్యాయి. చివరికి అంబానీ ఇంట జరిగిన పార్టీకి, అవార్డుల వేడుకల దగ్గర కూడా వీళ్లు జోడిగా కనిపించడం.. అప్పటిదాకా యాక్టివ్‌గా కెమెరాలకు కనిపించిన కిరణ్‌రావ్ సైడ్ అయిపోవడంతో ఆ రూమార్లకు మరింత బలం చేకూరింది. Amir khan after every 15 years#AmirKhan #FatimaSanaShaikh pic.twitter.com/oPQzSajFsX — Iamsarcasterr_ (@iamsarcasterr) July 3, 2021 People celebrate the anniversary, these divorce are playing divorce. Aamir Khan did his second divorce#AamirKhan#KiranRao #FatimaSanaShaikh pic.twitter.com/Suvta7K2dG — ❤️ (@Agnostic_Ram) July 3, 2021 During that time #FatimaSanaShaikh didn't realize that i am gonna be next target of #amirkhan wife 😂🤣 pic.twitter.com/hSjsAaCYDp — sarcastic guy (@TheChandler007) July 3, 2021 Mere speculation of this affair by social police, #AamirKhan and #FatimaSanaShaikh aren't officially a couple. But, people started defaming both Aren't we living in morally dead society. pic.twitter.com/JcBYlrJ6j1 — Punologist™ (@Punology1) July 3, 2021 #EtimesPaps#FatimaSanaShaikh spotted in the city (Mumbai). While her memes are trending after #AamirKhanDivorce was announced, do you think it is 'cool' to put her in a spot? Tell us 👇 pic.twitter.com/kFNhJ4MDnT — ETimes (@etimes) July 3, 2021 -
ఇప్పుడు నేను నిరుద్యోగిని: 'దంగల్' నటి
కోవిడ్ వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. చిత్రపరిశ్రమకు చెందిన పలువురూ పని లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకు తాను కూడా అతీతం కానంటోంది దంగల్ నటి ఫాతిమా సనా షైఖ్. ప్రస్తుతం తను కూడా నిరుద్యోగినేనని చెప్పుకొచ్చింది. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 'కోవిడ్ వల్ల ఎంతోమంది నిరుద్యోగులుగా మారారు. కోవిడ్ పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత, అంతా తిరిగి సాధారణ స్థితికి వస్తేనే నాకు పని దొరుకుతుంది. అప్పటివరకు నేను నిరుద్యోగినే' అని పేర్కొంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన 'ఫాతిమా చాచీ 420', 'వన్ 2 కా 4', 'తహాన్' చిత్రాల్లో నటించింది. 2006లో వచ్చిన 'దంగల్' సినిమాలోని గీతా ఫొగట్ పాత్రతో ఆమెకు బ్రేక్ వచ్చింది. 'తగ్స్ ఆఫ్ హిందుస్తాన్', 'బిట్టూ బాస్' చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Rohit Saraiya (@rohitsaraiyaa.official) చదవండి: అతడి చెంప పగలకోడితే.. తిరిగి నన్ను కొట్టాడు: హీరోయిన్ మలైకా ఇంటి దగ్గర్లో బాలీవుడ్ నటుడి కొత్త విల్లా! -
అతడి చెంప పగలకోడితే.. తిరిగి నన్ను కొట్టాడు: హీరోయిన్
ఆమిర్ ఖాన్ స్టోర్స్ డ్రామా ‘దంగల్’తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు నటి ఫాతిమా సనా షేక్. తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత చెత్త అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు ఫాతిమా సన. ఓ సారి తాను ఓ ఆగంతకుడి చెంప పగలకొట్టాని.. అయితే అతడు తిరిగి తనను కొట్టాడని తెలిపారు సన. దీని గురించి సనా మాట్లాడుతూ.. ‘‘ఓ సారి జిమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఓ వ్యక్తి నా వైపు రావడం గమనించాను. అప్పటికే అతడు కాస్త తేడాగా అనిపించాడు. నేను నడుచుకుంటూ వెళ్తుండగా.. అతడు వెంటే వచ్చాడు’’ అని తెలిపారు. ‘‘నేను ఆగి ‘ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు’ అని అతడిని ప్రశ్నించాను. అందుకతడు ‘అది నా ఇష్టం’ అన్నాడు. వెంటనే నేను కోపంతో ‘తన్నులు తినాలని ఉందా ఏంటి’ అన్నాను. దానికతడు ‘కొట్టు’ అన్నాడు. అప్పటికే నా ఓపిక నశించింది. దాంతో అతడిని కొట్టాను. వెంటనే అతడు తిరిగి నన్ను కొట్టాడు. నేను మా నాన్నని పిలిచాను. ఆయన నా సోదరుడితో పాటు అతడి ఫ్రెండ్స్‌ని కూడా తీసుకుని వచ్చాడు. ఏమైంది అని అడిగాడు. నేను జరిగిన విషయం చెప్పాను. వెంటనే మా నాన్న, మిగతవారు నన్ను కొట్టిన అతడిని పట్టుకునేందుకు పరిగెత్తారు. కానీ అతడు దొరకలేదు’’ అని తెలిపారు. ఇక ఇండస్ట్రీలో తాను ఎన్నో చేదు అనుభవాలని ఎరదొర్కాన్నాని.. చాలా మంది దర్శకులు తమతో గడిపితేనే అవకాశాలు ఇస్తామన్నారని తెలిపారు ఫాతిమా సన. చాలా సార్లు తనకు వచ్చిన అవకాశాలను తిరిగి తీసుకున్నారని వెల్లడించారు. ఎవరు ఎన్ని విధాలుగా ట్రై చేసినా తను తాను నిరూపించుకున్నాను అన్నారు ఫాతిమా సన. చదవండి: ‘మా స్నేహన్ని తప్పుగా చూస్తున్నారు’ -
మూడేళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులు: నటి ఆవేదన
ఆమిర్ ఖాన్ స్పోర్ట్స్ డ్రామా దంగల్‌లో నటించిన తరువాత ఈ సినిమా పేరు నటి ఫాతిమా సనా షేక్‌కు ఇంటి పేరుగా మారింది. బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన ఈ సినిమాలో రెజ్లర్ గీతా ఫోగట్ పాత్రలో కనిపించి తన నటనతో ప్రశంసలు అందుకున్నారు ఫాతిమా. ఇక ఈ నటి తన బాల్యం నుంచే యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. కాగా దంగల్ సినిమాలోని సహనటి సన్య మల్హోత్రాతో ఫతిమా డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. అనంతరం దీనిపై స్పందించిన ఫాతిమా తాము కేవలం మంచి స్నేహితులమని, తమ స్నేహాన్ని తప్పుగా భావించవద్దని కోరారు. తాజాగా ఈ నటి తన జీవితానికి సంబంధించి ఓ భయంకరమైన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. తనకు మూడేళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపారు. చదవండి: ‘మా స్నేహన్ని తప్పుగా చూస్తున్నారు’ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ‘నేను మూడేళ్ల వయసులోనే వేధింపులకు గురయ్యాను. లైంగిక వేధింపుల సమస్య చుట్టూ ఒక కళంకం ఉంది. అందుకే మహిళలు తమ జీవితాంతం ఈ గురించి బయటకు చెప్పలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రపంచం మారుతుందని ఆశిస్తున్నాను. చదువుకోవడం వల్ల లైంగిక వేధింపుల గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రజలు ఈ అంశం గురించి భిన్నంగా ఆలోచిస్తారు. అందుకే నేను ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు’. అని చెప్పుకొచ్చారు. చదవండి: అభిమానులకు షాకిచ్చిన పున్నూ బేబీ అదే విధంగా తను కూడా కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని వెల్లడించారు. సెక్స్ చేయడం ద్వారానే నాకు ఉద్యోగం లభించే ఏకైక మార్గం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. దానికి తను ఒప్పుకోకపోవడం వల్ల చాలా ప్రాజెక్టులు తన చేయి దాటి పోయిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ఫాతిమా ప్రస్తుతం లుడో, సూరజ్ పే మంగల్ భరీ మూవీస్‌లో నటిస్తున్నారు. -
‘మా స్నేహన్ని తప్పుగా చూస్తున్నారు’
ముంబై: ‘దంగల్’ సినిమాలోని తన సహనటి సన్య మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న వదంతులపై నటి ఫాతిమా సనా షేక్ స్పందించారు. ఓ ఇంటర్యూలో ఫాతిమాను దీనిపై ప్రశ్నించగా.. ‘ఆ వార్తలు చూడగానే మాకు నవ్వొచ్చింది. మేము మంచి స్నేహితులం. కానీ అందరూ మా స్నేహాన్ని తప్పుగా భావించారు’ అని చెప్పారు. ఇక సన్యాలో తనకు నచ్చిన విషయాలు ఏంటని అడగ్గా.. ‘‘తనలో నాకు మూడు విషయాలు బాగా నచ్చాయి. తన నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. సన్య ప్రతీది శుభ్రంగా ఉంచడానికి ఇష్టపడుతుంది. పని పట్ల ఆమె అంకితభావంతో ఉంటుంది. తనలో అది నాకు బాగా నచ్చింది’’ అంటూ చెప్పుకొచ్చారు. (సుశాంత్ ఆత్మహత్య : ఫేక్ సంతాపాలు అవసరమా?) కాగా సన్య మల్హాత్రా, ఫాతిమాలు ‘దంగల్’లో అక్కాచెల్లెళ్లుగా నటించారు. తన విభిన్న మతపరమైన నేపథ్యం, పెంపకం గురించి మాట్లాడుతూ.. ‘‘ఇది లౌకిక భారతదేశానికి అనువైనది. మన దేశం ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ మనం చాలా వైవిధ్యంగా ఉంటాము. ఎవరికీ నచ్చినంటూ వారు ఉండొచ్చు. మన స్వంత మతాన్ని అనుసరిస్తూనే మనకు నచ్చిన వారిని ఎంచుకోవచ్చు’’ అన్నారు. -
సెల్యూట్‌కి సెలక్టేనా?
‘దంగల్’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఫాతిమా సనా షేక్. ఇటీవల ఆమె నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ నటిగా ఆమె కష్టాన్ని గురించారు బాలీవుడ్ దర్శకులు. ఇప్పుడు ఆ కష్టాన్నే గుర్తించి షారుక్ అండ్ టీమ్ ‘సెల్యూట్’ సినిమాలో ఫాతిమాను హీరోయిన్గా తీసుకోవాలని ఆలోచిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. మరి..ఫైనల్‌గా ఆమె హీరోయిన్ ప్లేస్‌ను కన్ఫార్మ్ చేసుకుంటారా? లేక వేరే ఎవరైనా దక్కించుకుంటారా? అనేది వేచి చూడాలి. ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ జీవితం ఆధారంగా షారుక్ ఖాన్ టైటిల్ రోల్లో ‘సెల్యూట్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని బాలీవుడ్ టాక్. -
నా గుండె పగిలింది
హిందీ చిత్రం ‘దంగల్’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్‌లతో కలసి ఆమె నటించిన తాజా చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఈ విషయం గురించి ఫాతిమా మాట్లాడుతూ– ‘‘సినిమా రిలీజైనప్పుడు నెగటివ్ రివ్యూలను చూశాను. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ప్రేక్షకులకు సినిమా నచ్చలేదని తెలిసింది. నా గుండె పగిలింది. బాగా డిస్ట్రబ్ అయ్యాను. ఈ సినిమా కోసం మేమంతా రెండేళ్లు కష్టపడ్డాం. కానీ ప్రేక్షకుల నిర్ణయాన్ని ఒప్పుకోక తప్పదు. సినిమా ఆడకపోయినా ఆమిర్, అమితాబ్, కత్రినా వంటి సీనియర్స్‌తో నటించే అవకాశం నాకు దక్కడం హ్యాపీ. ఎన్నో కష్టాలు పడి ఇంత దూరం వచ్చాను నేను. ఒక ఫెయిల్యూర్ నన్ను ఇండస్ట్రీకి దూరం చేయలేదు. ప్రతి వైఫల్యం నుంచి కొత్త పాఠాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. అనురాగ్ బసు దర్శకత్వంలో నా నెక్ట్స్ చిత్రం ఉంటుంది. అందులో రాజ్‌కుమార్ రావ్ హీరో. ఇది ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’ సినిమాకు సీక్వెల్ కాదు’’ అని చెప్పుకొచ్చారామె. -
మంచి సినిమా చేయాలనుకున్నాం.. కానీ..!
థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఫలితం చిత్రయూనిట్‌కు గట్టి షాకే ఇచ్చింది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈసినిమాకు తొలి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ల కాంబినేషన్ ఫాతిమా సనా షేక్ సాహసాలు, కత్రిన అందాలు కూడా సినిమాను కాపాడలేకపోయాయి. దీంతో చిత్రయూనిట్ కూడా సినిమా ఫ్లాప్ అన్న విషయం బహిరంగంగానే ఒప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన నటి ఫాతిమా సనా షేక్. ‘అవును.. నిజంగానే థగ్స్‌ఆఫ్ హిందుస్థాన్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సినిమా ఫలితం తెలిసి గుండె పగిలినంత పనైంది. మేమంత ఓ మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలని చాలా కష్టపడ్డాం. కానీ మా ప్రయత్నం ఫలించలేదు. ప్రేక్షకులకు మా సినిమా నచ్చలేదు’ అన్నారు. -
‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ ట్రైలర్ లాంచ్
-
అదిరిపోయేలా ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ ట్రైలర్..!
సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ ట్రైలర్ వచ్చేసింది. ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కైత్రినా కైఫ్, ఫాతిమా సనా షైక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను విజయ్‌కృష్ణ ఆచార్య తెరకెక్కించారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను.. ప్రఖ్యాత ఫిల్మ్‌మేకర్ యశ్ చోప్రా జయంతి సందర్భంగా విడుదల చేశారు. ట్రైలర్‌ను బట్టి యాక్షన్ ప్యాకెడ్ పిరియడ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. 1795లో ఈస్టిండియా కంపెనీ వ్యాపారం పేరిట భారత్‌లోకి ప్రవేశించి.. ఆ తర్వాత అధికారం చెలాయించేందుకు తెగబడుతున్న నేపథ్యంలో ఆంగ్లేయులను ఒక థగ్స్ (బందీపోటు) ముఠా ఎలా ఎదుర్కొంది? అన్నది సినిమా ఇతివృత్తంగా కనిపిస్తుండగా.. థగ్స్ ముఠా అధిపతి ఆజాద్‌గా అమితాబ్.. థగ్స్‌ను దెబ్బతీసేందుకు బ్రిటిషర్లతో చేతులు కలిపి.. నమ్మకద్రోహం చేసే ఫిరంగిగా ఒకింత కామెడీ తరహా పాత్రలో ఆమిర్ కనిపించనున్నారు. యాక్షన్ స్టంట్స్‌తో ఫాతిమా ట్రైలర్లో కనిపించగా.. కత్రినా తన అందాలతో మెరుపులు మెరిపించింది. మొత్తానికి ట్రైలర్ అదిరిపోయేలా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లోనూ ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ట్రైలర్లు ఇక్కడ చూడండి.. -
నయా లుక్
ఇక్కడున్న ఫొటో చూశారుగా.. హీరో ఆమిర్‌ఖాన్ 1980 నాటి సిగార్‌ను నోట్లో పెట్టుకుని ఎలా దర్జాగా కూర్చున్నారో. ఇది ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ సినిమా కోసమే. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ఇది. ఫిలిప్ మెడోస్ టేలర్ రాసిన ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఏ థగ్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ లుక్‌ను కత్రినా కైఫ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అలాగే ఇకనుంచి సినిమాలో కీలక తారాగణానికి సంబంధించిన లుక్స్‌ని వారానికి ఒకటి విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్‌లో విడుదల కానుంది. -
మస్త్ మార్కెటింగ్
మార్కెటింగ్ మెళకువలు బాగా తెలిసిన నటుడు ఆమిర్ ఖాన్. కేవలం మంచి స్క్రిప్ట్ ఎంచుకోవడంలోనే కాదు దాన్ని ఆడియన్స్ వరకూ తీసుకెళ్లడంలోనూ మాస్టర్ ఆయన. అందుకే కలెక్షన్స్ రాబట్టడంలో టాప్‌లో ఉంటారు. లేటెస్ట్గా విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేస్తోన్న భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’. కత్రినా కైఫ్, ఫాతిమా సనాషేక్ హీరోయిన్లు. ఈ సినిమాను 3డి, ఐమాక్స్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసింది చిత్రబృందం. అలాగే తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయనుంది. ఈ రెండు భాషల్లో మాత్రమే కాదు.. వీలైనన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేసి అన్ని మార్కెట్స్‌లో కలెక్షన్స్ కొల్లగొట్టాలనుకుంటోంది. నవంబర్ 7న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ సంస్థ నిర్మిస్తోంది. -
యాక్షన్ మీట్స్ యాక్షన్
మార్షల్ ఆర్ట్స్ అంటే జాకీ చాన్ చేస్తేనే చూడాలి. ఆయన చేసే ఫైట్స్ అంత బాగుంటాయి. సినిమా లవర్స్‌కి, యాక్షన్ లవర్స్‌కి ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. సినిమా స్టార్స్‌లోనూ ఆయన ఫ్యాన్స్ ఉంటారు. ‘దంగల్’ చిత్రంలో నటించిన ఫాతిమా సనా షేక్, సాన్య మల్హోత్రా కూడా జాకీ అభిమానులు. ఆ చిత్రంలో ఈ ఇద్దరూ మల్లయోధులుగా విజృంభించిన సీన్స్‌ని అంత సులువుగా మరచిపోలేం. ఈ యాక్షన్ స్టార్స్ ఇద్దరూ హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ని కలిశారు. చైనాలో జరిగిన జాకీ చాన్ యాక్షన్ మూవీ వీక్‌లో పాల్గొనడానికి ఫాతిమా, సాన్యా వెళ్లారు. అప్పుడు జాకీ చాన్ని కలిసి, ఫొటో దిగారు. ‘‘ఓ లెజెండ్‌ని కలిశాం. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వెరీ సింపుల్ పర్సన్’’ అని ఈ ఇద్దరూ పేర్కొన్నారు. -
అదేంటి.. ఆ నటి కనుబొమ్మపై గాటు!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌తో వరుస సినిమాలు చేస్తున్న భామ సనా ఫాతిమా షైక్. ‘దంగల్’ లో రెజ్లర్ గీతా ఫొగట్‌గా నటించి మెప్పించిన ఈ అమ్మడు తాజాగా ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ సినిమాలో నటిస్తోంది. ఆమిర్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ వంటి ప్రముఖ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సనా తాజాగా ముంబై బాంద్రాలోని ఓ రెస్టారెంట్ వద్ద దర్శనమిచ్చింది. సీరియస్‌గా పుస్తకం చదువుతూ కనిపించిన ఈ అమ్మడిని ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. అదేంటి ఆమె కనుబొమ్మ ఒకటి అలా ఉంది అని ఆరా తీస్తున్నారు. ఒక కనుబొమ్మపై గాటులాగా ఉండటంతో ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమా లుక్కు కోసం అలా అయ్ బ్రోను షేవ్ చేసుకుందా? అని కామెంట్ చేస్తున్నారు.