న్యూఢిల్లీ : ‘దంగల్ గర్ల్’ సనా ఫాతిమా షైక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ రెజ్లింగ్ యోధుడు మహావీర్‌సింగ్ ఫొగట్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్’ సినిమాలో ఆయన కూతురు గీతా ఫోగట్‌గా సనా నటన ప్రశంసలందుకుంది. ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆయన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్‌గా నిలిచిపోయింది.
‘దంగల్’ సినిమాతో పేరు తెచ్చుకున్న సనా మరోసారి ఆమిర్ ఖాన్‌తో కలిసి నటిస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కోసం సనా తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. తాజాగా ఈ భామ జిమ్‌లో డంబుల్స్ ఎత్తుతూ.. తీవ్రంగా వర్కౌట్స్ చేస్తున్న వీడియోను ఆమె అభిమాని ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సనా ఇలా వర్కౌట్స్ చేస్తుండగా.. అక్కడే తిరుగుతున్న ఆమిర్ ఖాన్.. ఆమె వెనుక ఉన్న అద్దంలో కనిపించడం ఈ వీడియోలో చూడొచ్చు. ఇలా ఆమిర్ అనుకోకుండా కనిపించడంతో ఈ వీడియోను ఆయన అభిమానులు విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment