
సామాజిక కళంకం(Social Stigma)..ను పక్కకు తోసేసి రాణిస్తున్న వాళ్లను ఎందరో!. అలా అన్ని రంగాల్లో మహిళల జోరు కూడా కనిపిస్తోంది. ఫిట్‌నెస్ మీద మక్కువ పెంచుకున్న రీనా సింగ్ వర్కవుట్ వీడియోలు ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. అందుకు ఒక ప్రత్యేక కారణ ఉంది కూడా!.
‘‘ఇది ఆరంభం మాత్రమే..’’ అంటూ గులాబీ రంగు చీరలో ఆమె వర్కవుట్స్ చేసిన వీడియో.. ఇన్‌స్టాగ్రామ్‌లో దుమ్మురేపుతోంది. చీరకట్లు వర్కవుట్స్‌కి లక్షల్లో వ్యూస్, లైకులతు రాబట్టింది ఆ వీడియో. స్వతహాగా ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన ఆమె.. అలా రకరకాల బరువులెత్తడం, ఎక్సర్‌సైజులు చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 33 మిలియన్ వ్యూస్, పది లక్షల లైకులను దాటేసి వీడియో దూసుకుపోతోంది. అయితే..
అదే సమయంలో ఆమె తీరును తప్పుబడుతున్నవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇలాంటి స్టంట్‌లు ప్రమాదరకరంతో కూడుకున్నవని ఆమెకు సూచిస్తున్నారు. ఇలా చీరకట్టులో చేయడం సాహసమేనని, స్ఫూర్తిగా తీసుకుని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రమాదకరంగా మారొచ్చని కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వీడియోలు చేయడం ఆపేయాలంటూ ఆమెను మందలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment