gym workouts
-
వీడియో: విధిని ఎవరూ ఎదురించలేరు.. ఇదే ఉదాహరణ..
ఘజియాబాద్: ఇటీవలి కాలంలో గుండెపోటు కారణంగా ఎంతో మంది అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో వర్కవుట్ చేస్తూ సడెన్‌గా కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ కాలేజీ యువకుడు జిమ్‌లో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. గజియాబాద్‌కు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సిద్దార్థ్ కుమార్ సింగ్(19) అనే యువకుడు శనివారం జిమ్‌కు వెళ్లి వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా.. సడెన్‌గా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో, అక్కడే ఉన్న జిమ్‌లో మరో ఇద్దరు వ్యక్తులు సింగ్ దగ్గరకు వచ్చి అతడిని పైకి లేపే ప్రయత్నం చేశారు. అనంతరం, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సింగ్ పరిశీలించిన వైద్యులు.. సిద్ధార్థ్ అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. A 19 years old boy died while running on trademill in the gym at #Ghaziabad #gym #Running pic.twitter.com/jsOa0aA3C3 — Gulshan Nandaa (@Gulshann_nandaa) September 16, 2023 ఇక, జిమ్‌లో సిద్దార్థ్ మృతిచెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింగ్ మృతితో పేరెంట్స్ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక, సిద్ధార్ధ్ వారి పేరెంట్స్‌కు ఒక్కడే కుమారుడు. సిద్ధార్థ్ తన తండ్రితో ఘజియాబాద్‌లో ఉంటుండగా.. అతని తల్లి బీహార్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. సింగ్ మృతికి 10 నిమిషాల ముందే తన తల్లితో మాట్లాడాడు. ఇంతలోనే ఇలా జరగడంతో వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇది కూడా చదవండి: భిక్షమెత్తుకొని పొట్టనింపుకునేది.. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్‌గా సూపర్ క్రేజ్ -
చీరకట్టులో.. ఆమెను తెగ తిట్టిపోస్తున్నారు
సామాజిక కళంకం(Social Stigma)..ను పక్కకు తోసేసి రాణిస్తున్న వాళ్లను ఎందరో!. అలా అన్ని రంగాల్లో మహిళల జోరు కూడా కనిపిస్తోంది. ఫిట్నెస్ మీద మక్కువ పెంచుకున్న రీనా సింగ్ వర్కవుట్ వీడియోలు ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. అందుకు ఒక ప్రత్యేక కారణ ఉంది కూడా!. ‘‘ఇది ఆరంభం మాత్రమే..’’ అంటూ గులాబీ రంగు చీరలో ఆమె వర్కవుట్స్ చేసిన వీడియో.. ఇన్‌స్టాగ్రామ్‌లో దుమ్మురేపుతోంది. చీరకట్లు వర్కవుట్స్‌కి లక్షల్లో వ్యూస్, లైకులతు రాబట్టింది ఆ వీడియో. స్వతహాగా ఫిట్నెస్ ట్రైనర్ అయిన ఆమె.. అలా రకరకాల బరువులెత్తడం, ఎక్సర్సైజులు చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 33 మిలియన్ వ్యూస్, పది లక్షల లైకులను దాటేసి వీడియో దూసుకుపోతోంది. అయితే.. అదే సమయంలో ఆమె తీరును తప్పుబడుతున్నవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇలాంటి స్టంట్లు ప్రమాదరకరంతో కూడుకున్నవని ఆమెకు సూచిస్తున్నారు. ఇలా చీరకట్టులో చేయడం సాహసమేనని, స్ఫూర్తిగా తీసుకుని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రమాదకరంగా మారొచ్చని కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వీడియోలు చేయడం ఆపేయాలంటూ ఆమెను మందలిస్తున్నారు. View this post on Instagram A post shared by Reena Singh (@reenasinghfitness) View this post on Instagram A post shared by Reena Singh (@reenasinghfitness) -
అతి వ్యాయామంతో గుండెకు చేటు.. పోటు!
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు సంబంధిత మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అధిక బరువు, శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఇందుకు కారణమని చాలామంది భావిస్తున్నారు. కానీ, కారణం అది కాదంట!. మరి.. అలవాటు లేని వ్యాయామాలు లేదంటే అతి వ్యాయామం వల్ల యువత గుండెపోటు బారిన పడుతున్నారని నిపుణులు గుర్తించారు. పాతికేళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారిలో పలువురు జిమ్‌లో మృతి చెందిన సంఘటనలు ఇటీవలి కాలంలోనే బయటపడ్డాయి. కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్, గాయకుడు కేకే, కమేడియన్ రాజు శ్రీవాస్తవ వ్యాయామం చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకల్లో యువత నృత్యాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తగిన శిక్షణ లేకుండానే కఠిన వ్యాయా మాలు చేయడం లేదా అతిగా వ్యాయామం చేయడం వల్ల కరోనరీ నాళాల్లో చీలికలు ఏర్పడతాయని, అంతిమంగా గుండెపోటుకు దారితీస్తుందని మొరాదాబాద్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. అలవాటు లేని ఎక్సర్సైజ్లకు యువత దూరంగా ఉండాలని మరో వైద్యుడు వివేక్ కుమార్ సూచించారు. ఏ వ్యాయామం ఎలా చేయాలన్న దానిపై తగిన శిక్షణ తీసుకోవాలని చెప్పారు. -
గరిటె తిప్పే ఆ అమ్మ.. చీరకట్టులో బరువులెత్తుతూ...
ఆమె వయసు 56 యేళ్లు. పక్కా గృహిణి. ఓ చేత్తో వంట గదిలో గరిటె తిప్పుతుంది. అదే చేత్తో వెయిట్‌లిఫ్టింగ్ ద్వారా జిమ్‌లో చెమటలు చిందిస్తుంటుంది. చీరకట్టులో తేలికగా బరువులెత్తడమే కాదు.. హుషారుగా పుషప్స్ కొడుతుంది. ఆమె చూసి మరికొందరు వయసు పైబడిన వాళ్లు శారీరక ఆరోగ్యం కోసం జిమ్‌లకు క్యూ కడుతున్నారు. ప్రత్యేకించి.. వ్యాయామాలకు, ఫిట్‌నెస్‌కు దూరంగా ఉంటున్న ఈ తరం యువతకు ఆమె ప్రయత్నం ఒక మంచి పాఠం కూడా. అందుకేనేమో ఆమె కథ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. విపరీతమైన మోకాళ్ల నొప్పులతో తల్లడిల్లిపోతున్న తల్లిని చూసి.. ఆ కొడుకు దిగులు చెందాడు. చివరకు ఆమెకు ఉపశనమం కలిగించే చిట్కా తన దగ్గరే ఉందని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె జిమ్‌లో చేరింది. బరువులెత్తడంలో శిక్షణ తీసుకుంది. కోడలి సమక్షంలో పోటాపోటీగా వ్యాయామాలు చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రయత్నం ఆమె నొప్పులను పోగొట్టడమే కాదు, ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉండేలా చేసింది కూడా. అందుకే 56 ఏళ్ల ఆ మహిళ స్ఫూర్తిదాయక కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హ్యూమన్స్ ఆఫ్ మద్రాస్, మద్రాస్ బార్బెల్ సంయుక్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. మద్రాస్ బార్బెల్ నిర్వాహకుడి కన్నతల్లే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నకథలో అమ్మ. ఇంటి పనులకే అంకితమయ్యే ఆమె.. నాలుగేళ్ల కిందట కాళ్లు, మోకాళ్ల నొప్పులతో అల్లలాడిపోయింది. ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోయింది. దీంతో తల్లిని వెంటపెట్టుకుని ఫిజియోథెరపీల చుట్టూ తిరిగిన అతనికి.. చివరికి వ్యాయామాలు, వర్కవుట్ల ద్వారానే ఆమెకు ఉపశమనం కలుగుతుందని తెలుసుకున్నాడు. నాలుగేళ్ల కిందట.. 52 ఏళ్ల వయసు నుంచి ఆమె జిమ్‌లో వ్యాయామాలను మొదలుపెట్టింది. పక్కనే కోడలు ఉండి ఆమెను ప్రొత్సహిస్తూ వస్తోంది. అలవోకగా వెయిట్లిఫ్ట్లు ఎత్తుతూ, హుషారుగా ఎక్స్ర్సైజులు గట్రా చేస్తోంది. ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకున్న కాలనీవాళ్లు.. ఆమెను ఆదర్శంగా తీసుకున్నారు. వాకింగ్, ఎక్సర్సైజులు మొదలుపెట్టారు. తాజాగా ఫిఫ్టీ ఫ్లస్ కేటగిరీలో నిర్వహించిన వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లోనూ ఆమె విజయం సాధించినట్లు తెలుస్తోంది!. సాధించాలనే తపన ఉండాలేగానీ ఆటంకాలేవీ అడ్డుకోలేవని ధీమాగా చెప్తోంది ఆ అమ్మ. ఆరోగ్యంగా ఉండాలంటే కష్టపడాలని, అదీ ఇష్టంతోనని సూచిస్తోంది. వయస్సు అనేది కేవలం నెంబర్ మాత్రమే.. స్ఫూర్తినిచ్చే అత్తగారు.. ప్రొత్సహించే కొడుకు.. ఆమె అంకితభావానికి మద్దతుగా నిలిచిన కోడలు.. ఈ కథ ఇప్పుడు ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతోంది. View this post on Instagram A post shared by Humans Of Madras (@humansofmadrasoffl) -
విషాదం.. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ బుల్లితెర నటుడు మృతి
బాలీవుడ్లో విషాదం నెలకొంది. బుల్లితెర నటుడు,మోడల్ సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ(46) అకస్మాత్తుగా కన్నుమూశారు. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ మరణించారు. ఈ ఘటనతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. అతనికి భార్య అలెసియా రౌత్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. (చదవండి: Yashoda Movie Review: ‘యశోద’ మూవీ రివ్యూ) కసౌతి జిందగీ కే సీరియల్ ద్వారా సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ పేరు సంపాందించారు. ఇంతకుముందు అతని పేరు ఆనంద్ కాగా.. ఇటీవలే సిద్ధాంత్ సూర్యవంశీగా మార్చుకున్నారు. ఇతను పలు టీవీ షోలలో నటించారు. సుఫియానా ఇష్క్ మేరా, జిద్ది దిల్ మానే నా, వారిస్, సాత్ ఫేరే: సలోని కా సఫర్, కసౌతి జిందగీ కే సీరియల్స్‌తో పాటు టెలివిజన్ షోలలో కనిపించారు. సిద్ధాంత్ చివరిసారిగా జీ టీవీ షో 'క్యూ రిష్టన్ మే కట్టి బట్టి' లో కనిపించాడు. View this post on Instagram A post shared by Siddhaanth Vir Surryavanshi (@_siddhaanth_) View this post on Instagram A post shared by Siddhaanth Vir Surryavanshi (@_siddhaanth_) View this post on Instagram A post shared by Siddhaanth Vir Surryavanshi (@_siddhaanth_) -
Mahesh Babu: వర్కౌట్స్ స్టార్ట్ చేసిన మహేశ్‌బాబు.. ఆ సినిమా కోసమే..
జిమ్‌లో వర్కౌట్ షురూ చేశారు మహేశ్‌బాబు. సో.. త్వరలోనే ఆయన సెట్స్‌లోకి కూడా అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మలి షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణ కోసమే మహేశ్‌బాబు వర్కౌట్స్ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక ఈ సినిమా కాకుండా మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. -
‘జిమ్’లో వర్కౌట్ చేయమంటే వీళ్లేంది ఇలా చేశారు!
వ్యాయామం చేసేందుకు చాలా మంది జిమ్‌కి వెళ్తుంటారు. అక్కడ ఉండే వాటిని ఒకరి తర్వాత ఒకరు వినియోగిస్తుంటారు. ఇద్దరు ఒకేసారి కావాలనుకుంటే ఎవరైనా ఒకరు తప్పుకోక తప్పదు. ఈ క్రమంలో ఎవరైనా సహనం కోల్పోతే ఇక అంతే.. అది కొట్టుకునే వరకు దారితీస్తుంది. అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలు వెయిట్ లిఫ్ట్ పరికరాల కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ మహిళ వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండగా మరో మహిళ తన వంతు కోసం ఎదురు చూస్తోంది. ఆమె అక్కడి నుంచి వెళ్లగానే తాను ఆ వర్కౌట్ చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే మరో మహిళ వెనకాల నుంచి వచ్చి ఆమెను తోసేసి వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్ చేయబోయింది. ఈ క్రమంలో ఇరువురు ఒక్కసారిగా గొడవకు దిగారు. నువ్వెంతంటే నువ్వెంత అంటూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. వారిని చూసి అక్కడే ఉన్న ఓ యువతి భయంతో పరుగులు పెట్టింది. మరో మహిళ వచ్చి వారిని విడిపించే ప్రయత్నం చేసింది. అయితే, ఈ కొట్లాటలో ఎవరికైనా గాయాలయ్యాయా అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. జిమ్‌లో పరికరాల కోసం కొట్టుకున్న ఈ సంఘటనపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ఈ ఫైట్ ద్వారా చాలా కేలరీలు కరిగిపోయాయి అని ఓ నెటిజన్ పేర్కొనగా.. దృఢమైన జుట్టు కోసం గొప్ప వర్కౌట్ అంటూ మరొకరు రాసుకొచ్చారు. ఇలాంటిదే.. జిమ్‌లో మ్యూజిక్ విషయంలో జరిగిన గొడవలో ఓ మహిళను పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలో ఈ ఏడాది మార్చిలో జరిగింది. Kalesh Inside GYM for Smith Machine pic.twitter.com/KXy6v9UyWj — r/Bahar Ke Kalesh (@Baharkekalesh) October 9, 2022 ఇదీ చదవండి: రన్నింగ్ ట్రైన్ ఫుట్‌బోర్డుపై ఆయుధాలతో వీరంగం.. ఆకతాయిలు ఆట కట్ -
తొమ్మిది నెలల్లో 40 కేజీల బరువు తగ్గి...
అంతవరకు సన్నగా... నాజుగ్గా ఉన్న అమ్మాయిలలో చాలామంది పెళ్లి అయ్యాక శరీరంలో చోటు చేసుకునే మార్పులతో ఒక్కసారిగా బరువు పెరిగిపోతుంటారు. కొంతమంది వ్యాయామం, క్రమబద్ధమైన ఆహారం ద్వారా బరువుని నియంత్రణలో ఉంచుకుంటే, అవేమీ చేయకుండా ఆకృతి మారిన శరీరాన్ని చూసి నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు మరికొందరు. అధిక బరువుతో నిరాశకు గురైన వారు అంత త్వరగా ఆ నిరాశ నుంచి బయటకు రాలేరు. గుమ్మం దాటి బయటకొస్తే తనని చూసి అందరూ నవ్వుతారు అని భయపడిన తులికా సింగ్.. ఇంట్లో వాళ్ల ప్రోత్సాహంతో నలభై కేజీల బరువు తగ్గి, తనే ఫిట్నెస్కోచ్గా రాణిస్తోంది. వారణాసికి చెందిన తులికాసింగ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకుని 2004లో జర్నలిజం చదివేందుకు నోయిడాకు వెళ్లింది. జర్నలిజం కోర్సు పూర్తయ్యాక వెంటనే ఉద్యోగం దొరకలేదు. తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితి. పొట్టకూటికోసం కొన్నాళ్లపాటు పరాటాలు విక్రయించింది. తరువాత ఓ ప్రొడక్షన్ హౌస్‌లో పనిదొరకడంతో మూడు వేలరూపాయల జీతానికి చేరింది. ఇలా రెండేళ్లు కష్టపడ్డాక 2007లో ఓ న్యూస్ చానల్లో్ల ఉద్యోగం దొరికింది. చక్కగా పనిచేస్తూ కెరీర్లో నిలదొక్కుకుంది. కొంతకాలానికి దిగ్విజయ్ సింగ్‌ను పెళ్లిచేసుకుంది. జోకులు వినలేక... పెళ్లివరకు అనేక కష్టాలు పడినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగిన తులికాకు పెళ్లి తరువాత కొత్తరకం కష్టాలు మొదలయ్యాయి. చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉన్న ఆమె పెళ్లి, పిల్లలతో హార్మోన్లలో ఏర్పడిన అసమతుల్యత కారణంగా ఒక్కసారిగా బరువు పెరిగింది. అంత బరువున్నా, ఎప్పుడూ నీరసంగా ఉండేది. దీనికితోడు చుట్టుపక్కల వాళ్లు ఆమె శరీరం మీద రకరకాల జోకులు వేస్తూ, గేలిచేసేవారు. దీంతో తనకు తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్లింది. ఇంట్లో నాలుగు గోడల మధ్య కూర్చోని దిగులు పడుతుండేది. ముంబై నుంచి ఢిల్లీకి మారాక కూడా చానల్లో పనిచేసేది. కానీ అధిక బరువు కారణంగా ఏకాగ్రత పెట్టలేక ఆర్టికల్స్‌ను రాయలేకపోయేది. రోజురోజుకి పెరుగుతోన్న బరువుని నియంత్రించలేక, జనాల ఈసడింపు చూపులు తట్టుకోలేకపోయేది. మరోవైపు పీసీఓడీ సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. తొమ్మిది నెలల్లో నలభై కేజీలు... నాలుగో అంతస్థులో ఉండే తులికా, తాను కిందకి దిగితే చూసినవాళ్లు నవ్వుతారన్న భయంతో భర్త, కొడుకు, స్నేహితులు మోటివేట్ చేయడంతో దగ్గర్లో ఉన్న చిన్న పార్క్‌లోకి రాత్రి సమయాల్లో వెళ్లి రహస్యంగా వాకింగ్, రన్నింగ్ చేయడం మొదలు పెట్టింది. రెండు నెలలపాటు రన్నింగ్, వాకింగ్‌లతో పదమూడు కేజీలు బరువు తగ్గింది. ఈ ఉత్సాహంతో ఆహారంలో మార్పులు, జిమ్‌లో చేరి వర్క్ అవుట్లు, యోగా చేయడంతో తొమ్మిది నెలల్లోనే నలభై కేజీలు బరువు తగ్గింది. జిమ్ ట్రైనర్‌ను చూసి... ఒకపక్క డిప్రెషన్‌కు కౌన్సెలింగ్ తీసుకుంటూనే, జిమ్‌లో క్రమం తప్పని వ్యాయామంతో బరువు తగ్గిన తులికా.. తను కూడా జిమ్‌లోని ఫిట్నెస్ కోచ్ కావాలనుకుంది. దీంతో వ్యాయామాలన్ని చక్కగా నేర్చుకుని ఆన్లైన్ తరగతుల ద్వారా శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ప్రస్తుతం చక్కని ఫిట్నెస్ కోచ్‌గా రాణించడమేగాక, నేషనల్ గేమ్స్ ఆస్పిరెంట్స్‌కు శిక్షణ ఇస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో నలుగురిలో కలవలేనప్పటికీ.. మనలో ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే ఎంతటి బరువునైనా దింపేసుకుని ముందుకు సాగవచ్చనడానికి తులికా జీవితం ఉదాహరణగా నిలుస్తోంది. (క్లిక్: పుష్ప.. 66 వయసులోనూ తగ్గేదేలే..!) మనల్ని మనం ప్రేమించుకోవాలి. అప్పుడే సంతోషంగా ఉండగలుగుతాం. శరీరమే మనకు సర్వస్వం. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కెరీర్ మీద దృష్టిపెడుతూనే ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరచుకుంటే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటాము. మన రోజువారి పనుల్లో హెల్దీ లైఫ్‌స్టైల్ భాగం కావాలి. నా స్టూడెంట్స్‌కు ఇదే నేర్పిస్తున్నాను. – తులికా సింగ్ -
Viral: జిమ్‌లో వర్కౌట్ చేస్తూ తలకిందులుగా ఇరుక్కుపోయిన మహిళ
చాలామందికి ఫిట్‌గా ఉండటానికి ప్రాధాన్యతిస్తారు. దీని కోసం డైట్ ఫాలో అవడం, జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం చేస్తుంటారు. లేదా ఇంట్లోనే చిన్నసైజ్ జిమ్‌ను ఏర్పాటు చేసుకొని ప్రాక్టిస్ చేస్తుంటారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు ఎక్సర్సైజ్ చేస్తే కండరాలు పట్టుకోవడం, బ్యాలెన్స్ తప్పడంలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి ఓ షాకింగ్ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఓహియాకు చెందిన క్రిస్టిన్ ఫాల్డ్స్ అనే మహిళ తెల్లవారు జామున 3గంటలకు ఒంటరిగా ఇంట్లోని జిమ్‌లో ఇన్వర్షన్ టేబుల్ అనే ఎక్విప్‌మెంట్‌పై వర్కౌట్స్ చేస్తోంది. వెన్నెముక, నడుమునొప్పి తగ్గేందుకు దీనిని ఉపయోగించి ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఉన్నట్టుండి మహిళ ఇన్వర్షన్ టేబుల్‌పై తలకిందులైంది. కాళ్లు అందులో ఇరుక్కుపోవడంతో ఎంత ప్రయత్నించినా తిరిగి మామూలు స్థితికి రాలేకపోయింది. చదవండి: వీడియో వైరల్ చేద్దామనుకున్నాడు.. పాపం తానే వైరల్ అయ్యాడు సాయం కోసం జిమ్‌లో జాసన్ అనే మరో వ్యక్తిని పిలిచినా భారీ సౌండ్‌తో మ్యూజిక్ ప్లే అవుతుండటం వల్ల అతనికి వినిపించలేదు. పైకి లేవలేక, బయటకు రాలేక అలాగే ఇబ్బంది పడింది. కాసేపు ఏం చేయాలో తోచలేదు. వెంటనే ఆమెకు ఓ ఉపాయం తట్టింది. తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ ఉపయోగించి ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసింది. తన పరిస్థితిని వివరించి, సాయం కావాలని కోరింది. స్పందించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని తలకిందులుగా ఉన్న ఆమెను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్వయంగా ఆమెనే టిక్‌టాక్‌లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'This is so embarrassing' — A woman went viral after getting stuck upside down on an exercise machine and calling 911 for help 😅 pic.twitter.com/8nod8P6oQl — NowThis (@nowthisnews) September 5, 2022 -
హాంకాంగ్‌తో మ్యాచ్.. జిమ్‌లో కష్టపడుతున్న కోహ్లి
పాకిస్తాన్‌పై విజయంతో టీమిండియా ఆసియాకప్‌ను ఘనంగా ప్రారంభించింది. ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా చివరి వరకు నిలబడి మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా ఇదే మ్యాచ్ కోహ్లికి వందో టి20 అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కోహ్లి తన వందో మ్యాచ్‌లో 34 బంతుల్లో 35 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫిప్టీ చేయడంలో విఫలమైనప్పటికి విజయంలో తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడు. ఇక బుధవారం హాంకాంగ్‌తో మ్యాచ్ నేపథ్యంలో కోహ్లి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జిమ్‌లో గంటపాటు కసరత్తులు చేసిన కోహ్లి.. దానికి సంబంధించిన ఫోటోలను స్వయంగా ట్విటర్లో షేర్ చేశాడు. ''హాంకాంగ్‌తో మ్యాచ్‌కు సిద్ధం''.. అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక అంతకముందు పాకిస్తాన్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం పాక్ పేసర్ హారిస్ రౌఫ్‌కు తన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ చర్యతో కోహ్లి అభిమానుల మనసులు కూడా గెలుచుకున్నాడు. 🏋️♂️🫶 pic.twitter.com/g7u7GvDIae — Virat Kohli (@imVkohli) August 30, 2022 చదవండి: US Open 2022: యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. 87 ఏళ్ల రికార్డు బద్దలు Asia Cup 2022: కృష్ణమాచారి తెచ్చిన తంట.. మాజీ క్రికెటర్ బదానికి తీవ్ర గాయం! -
'తలకిందులైంది.. లైగర్ రిజల్ట్ చూసి విజయ్ ఏం చేశాడో తెలుసా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లైగర్. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన లైగర్ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అనుకున్నంత స్థాయిలో అందుకోలేకపోయింది. లైగర్ రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగినప్పటికీ విడుదల తర్వాత సీన్ మారిపోయింది. నెగిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. దీంతో రౌడీ హీరో ఆశలు అడియాసలయ్యాయి. అయితే సినిమా ఫలితం పక్కనపెడితే విజయ్ దేవరకొండ యాక్టింగ్‌కి మాత్రం ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అతడి కష్టమంతా సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా లైగర్ రిలీజ్ అయిన ఒకరోజు తర్వాత విజయ్ దేవరకొండ మళ్లీ యాక్షన్‌లోకి దిగాడు. సినిమా రిజల్ట్‌ని పట్టించుకోకుండా తన పనుల్లో నిమగ్నమయ్యాడు. జిమ్‌లో ఉత్సాహంగా కసరత్తులు చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. వందశాతం మనం ప్రయత్నం చేసినా ఫలితం మన చేతుల్లో ఉండదని విజయ్‌కి సపోర్ట్ చేస్తూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Just a day after #Liger’s release, #VijayDeverakonda is back in action again. @TheDeverakonda sweating it out with his fitness regime. This man never stops.🔥 pic.twitter.com/qeh902naNb — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 26, 2022 -
ప్రధాని మోదీకి జిమ్ కోచ్‌గా మంచిర్యాల జిల్లా వాసి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మోదీకి జిమ్ కోచ్‌గా మంచిర్యాల జిల్లా వాసిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో మోదీ పర్యటించే రోజుల్లో ట్రెడ్మిల్, జిమ్ సైకిల్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉండేందుకు జిల్లా కేంద్రానికి చెందిన గడప రాజేశ్‌ను నియమిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజేశ్ ప్రస్తుతం జింఖానా గ్రౌండ్స్‌లో అథ్లెటిక్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. చదవండి: (కిషన్‌రెడ్డి చేతగాని దద్దమ్మలా మిగిలిపోయారు: బాల్కసుమన్) -
జిమ్ మారో జిమ్.. షార్ట్‌కట్స్ ఉండవ్.. చెమటలు కక్కాల్సిందే!
భారత స్టార్ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ ఈ ఏడాది జులైలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ పూర్తి దృష్టి బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలపైనే ఉంది. దీని కోసం ఆమె చెమటలు కక్కుతోంది తన కసరత్తుల వీడియో ను మేరీ కోమ్ సోషల్ మీడియా యాప్ కూ లో షేర్ చేసింది, విజయానికి కృషి మాత్రమే అవసరమని రాసింది. షార్ట్‌కట్ పద్ధతిలో ప్రయత్నించినా ఫలితం ఉండదని కష్టపడి పనిచేయాల్సిందే అంటోంది. బాక్సింగ్ ప్రాక్టీస్ తర్వాత, మేరీ కోమ్ మధ్యాహ్నం జిమ్‌కి వెళుతుంది. పుష్-అప్స్ సిట్-అప్లు, అలాగే హెవీ వెయిట్ లిఫ్టింగ్ వంటి బాడీ వెయిట్ వ్యాయామాలతో కండరాలను బలంగా ఉంచుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగిస్తుంది. Koo App Do or do not. There is no try. There is no shortcuts. Only HARD WORK. View attached media content - M C Mary Kom (@mcmarykom) 10 May 2022 -
జిమ్ మరణం.. ఆమెది గుండెపోటు కాదు!
బెంగళూరు: జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కుప్పకూలి మృతి చెందిన మహిళ వీడియో ఒకటి సుమారు పదిరోజుల కిందట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతోనే మృతి చెంది ఉంటారని పోలీసులు, అంతా ప్రాథమికంగా భావించారు. అయితే ఆమెది గుండెపోటు మరణం కాదని వైద్యులు ఇప్పుడు ధృవీకరించారు. ఈమధ్యకాలంలో ఉన్నపళంగా కుప్పకూలి చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వాటిలో చాలావరకు ఫిట్‌నెస్‌కు ముడిపడి ఉండడంతో.. జిమ్లంటేనే వణికిపోతున్నారు చాలామంది. ఈ తరుణంలో కర్ణాటక మహిళ హఠాన్మరణం సైతం ఆ ప్రచారానికి ఆజ్యం పోసింది. అయితే.. 44 ఏళ్ల వినయకుమారి విట్టల్ మరణం వెనుక గుండె పోటు కారణం కాదని వైద్యులు ధృవీకరించారు. ఆమె మరణానికి కారణం బ్రెయిన్ ఎటాక్ అని శవపరీక్షలో వైద్యులు గుర్తించారు. మెదడులోని రక్తనాళం పగిలి ఆమె మరణించారట. ఇందుకు సంబంధించిన ఆటాప్సీ రిపోర్ట్ కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. మెదడులో ఉబ్బిన రక్తనాళము పగిలి పోవడం వల్ల రక్తస్రావం జరిగి.. కోమా వెనువెంటనే మరణం సంభవించింది అని ఉంది ఆ నివేదికలో. కాబట్టి, జిమ్‌లకు వెళ్తున్న వాళ్లు.. ఒక్కసారిగా భారీ బరువులు ఎత్తడం లాంటివి చేయడం వల్ల.. రక్తపోటు స్థాయిలు పెరగడంతో పాటు మరణానికి దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఘటన వివరాలు.. మంగళూరు మల్లేశ్వపాళ్యంలో నివాసం ఉండే వినయకుమారి (44).. సీవీ రామ్‌నగర్ జీఎం పాల్యాలోని ఓ జిమ్ సెంటర్లో మార్చి 26న ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో జిమ్ చేస్తూ కుప్పకూలిపోయారు. వెంటనే పక్కనున్నవారు ఆమెను రక్షించాలని ప్రయత్నించినా.. క్షణాల వ్యవధిలోనే ఆమె కన్నుమూసింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వినయకుమారి ఓ ప్రైవేట్సంస్థలో పని చేస్తోంది. ఆమె అవివాహితురాలు. జిమ్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
జిమ్ ఫొటో షేర్ చేసిన హీరో.. భార్య రియాక్షన్ ఏంటో తెలుసా ?
Rajkummar Rao Shared His Back Wife Patralekhaa Impressed: బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు ఇటీవల 'బదాయి దో' చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. హర్షవర్ధన్ కులకర్ణి దర్శకత్వంలో భూమి పెడ్నేకర్‌తో తొసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు రాజ్ కుమార్. ఈ మూవీ జాతియ అవార్డు గెలుచుకున్న కామెడీ డ్రామా చిత్రం 'బదాయి హో'కి సీక్వెల్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ రావు సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. రాజ్ కుమార్ రావుకు ఇన్‌స్టాగ్రామ్‌లో 6.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, సినిమా అప్డేట్ వంటి విషయాలతో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటాడు. తాజాగా తను జిమ్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు రాజ్ కుమార్. చదవండి: బాలీవుడ్ కొత్త జంట ఎంగేజ్మెంట్.. డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ ఈ పోస్ట్ చూసిన రాజ్ కుమార్ రావు అభిమానులు అమెజింగ్, అద్భుతం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ పోస్ట్ రాజ్ కుమార్ రావు సతీమణి, నటి పత్రలేఖ దృష్టిని ఆకర్షించింది. ఈ జిమ్ ఫొటోకు తను స్పందిస్తూ 'హాయ్' అని రాస్తూ రెండు ఫైర్ ఎమోజీస్ను రిప్లైగా ఇచ్చింది. ఈ ఫొటోలో రెసిస్టాన్స్ బ్యాండ్‌తో రాజ్ కుమార్ చేస్తున్న వర్క్ అవుట్‌కు అతని బ్యాక్ కర్వ్ తిరిగి ఉండటం మనం చూడొచ్చు. కాగా బదాయి దో చిత్రంలో రాజ్ కుమార్ రావు బాడీ బిల్డర్‌గా మారాలనే పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటించాడు. అలాగే తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫొటోలను కొల్లేజ్ రూపంలో పోస్ట్ చేశాడు రాజ్ కుమార్. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) చదవండి: రాజ్ కుమార్ రావు, పత్రలేఖ వివాహం.. వెడ్డింగ్ కార్డ్ వైరల్ -
మేకపాటి గౌతమ్ రెడ్డి జిమ్ వర్క్ అవుట్స్ వీడియో
-
సమంత లేటెస్ట్ వీడియో.. వావ్ అనిపించేలా
-
సమంత లేటెస్ట్ వీడియో.. వావ్ అనిపించేలా
స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమా ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. కొంచెం ఖాళీ సమయం దొరికితే స్నేహితులతో కలిసి టూర్లు ప్లాన్ చేస్తూ అస్సలు టైం వేస్ట్ చేయదు. సినిమాలు, టూర్లు కాకుండా తన ఫిట్‌నెస్‌కు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త కొత్త ఫిట్నెస్ వర్కవుట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్న తన వ్యాయామ దినచర్యను మాత్రం ఎప్పుడూ వాయిదా వేసుకోదు. అందుకే ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా కనిపిస్తుంది సామ్. తాజాగా తాను చేసిన కొత్త వర్కవుట్ వీడియోను శుక్రవారం ఇన్‌స్టా స్టోరీ ద్వారా షేర్ చేసింది. ఇదీ చదవండి: అందుకే విడిపోయాం.. విడాకులపై చై ఆసక్తికర వ్యాఖ్యలు సామ్ మొదటగా 75 కిలోల బరువును ఎత్తుతున్న వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోపై 'హలో 75.. నేను నిన్ను మిస్ చేశాను' అని రాసుకొచ్చింది. దాని తర్వాత సమంత 78 కిలోలు, అనంతరం 80 కిలోల బరువులను ఎత్తుతున్న వీడియోలను షేర్ చేసింది. 78 కిలోల బరువు ఎత్తుతున్న వీడియోకు 'హాహాహా.. నేను రోజూ త్వరగానే మేల్కొంటాను. నిన్ను నిరాశపరచాలని నాకు లేదు' అని క్యాప్షన్ రాసి నవ్వుతున్న ఎమోజీస్ను యాడ్ చేసింది సమంత. ఈ క్యాప్షన్‌ను తన జిమ్ కోచ్ అయిన 'జునాయిడ్ షేక్' గురించి రాస్తూ అతన్ని ట్యాగ్ చేసింది. ఇదిలా ఉంటే సామ్ త్వరలో డైరెక్టర్ ఫిలిప్ జాన్‌తో కలిసి 'అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే సినిమా చేయనుంది. ఇందులో సామ్ తన సొంత డిటెక్టివ్ ఏజెన్సీని నడిపే ద్విలింగ సంపర్కురాలి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: నాగ చైతన్య, సమంత విడాకులు.. డైరెక్టర్‌కు తెచ్చిన కష్టాలు -
జిమ్‌లో బుట్టబొమ్మ కసరత్తులు.. 'ప్రేరణ' పొందేలా
సినిమా అనే రంగుల ప్రపంచంలో అందమైన హీరోయిన్లు ఆకాశంలో మెరిసే నక్షత్రాల్లాంటి వాళ్లు. అందుకే తమ అందానికి, ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. సినిమాల్లో అందం, అభినయంతో ఆకట్టుకునేందుకు అనేక కసరత్తులు చేస్తుంటారు. కథానాయికలకు చక్కటి రూపుతో పాటు ఆకర్షించే శరీరాకృతి కూడా ముఖ్యమే. ఇది తెలిసిన హీరోయిన్లు విజయంతో దూసుకెళ్తుంటే దీన్ని వంటపట్టిచ్చుకోని ముద్దుగుమ్మలు అవకాశాలు లేక కనుమరుగైపోతున్నారు. ఇక ఇదంతా పోతే ఫిట్‌నెస్‌కు అధిక ప్రాముఖ్యత ఇచ్చే హీరోయిన్లలో బుట్ట బొమ్మ పూజా హెగ్డె ఒకరు. ఆమె ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పడానికి ఆమె చక్కటి ఫిజిక్యే నిదర్శనం. (చదవండి: ఆ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్ చేశా: పూజా హెగ్డె) తాజాగా పూజా హెగ్డె జిమ్‌లో చెమట చిందించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల ఆమె చేసిన ఎక్సర్సైజ్ వీడియోను తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసుకుంది. నెమ్మదిగా, నియంత్రిత కదలికలు. తర్వాత ప్రయత్నించండి అని క్యాప్షన్ రాసుకొచ్చింది ఈ భామ. ఈ వీడియోలో రెడ్ కలర్ మ్యాచింగ్ స్పోర్ట్స్ డ్రెస్‌తో వర్క్అవుట్ చేస్తుంటే తన ట్రైనర్ ఎలా చేయాలో నేర్పించడం చూడొచ్చు. తన వర్క్అవుట్ వీడియోలతో అందంతోపాటు ఫిట్నెస్ కూడా ముఖ్యమే అని తన అభిమానులకు, తదితర హీరోయిన్లకు 'ప్రేరణ' కలిగిస్తోంది ఈ 'రాధేశ్యామ్' బ్యూటీ. -
Viral Video: ప్రాణం తీస్తున్న కసరత్తులు.. అధిక బరువులెత్తితే జాగ్రత్త!
-
Viral: బరువులెత్తుతూ కుప్పకూలిన దృశ్యాలు!
ప్రముఖ బాలీవుడ్ టీవీ నటుడు సిద్ధార్ద్ శుక్లా సెప్టెంబర్ 2న గుండెపోటు కారణంగా మృతిచెందిన విడిచిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల వయసులో సిద్థార్థ్ గుండె పోటుతో మరణించడం అందరనీ కలవరపెట్టింది. సాధారణంగా శారీరక శ్రమ లేకపోతే గుండెపోటు సమస్య తలెత్తుందని వైద్యులు చెబుతున్నారు. అతిగా వ్యాయాయం చేయడం వల్లనే సిద్ధార్థ్ గుండెపోటు బారిన పడ్డాడని వైద్యులు అభిప్రాయపడ్డారు. సాధారణంగా ప్రతి మనిషికి 30-45 నిమిషాల వ్యాయామం చాలు. కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్న వారు గంటల తరబడి జిమ్‌కే పరిమితం అవుతారు. సిద్ధార్థ్ కూడా రోజు 3 గంటల పాటు వ్యాయామాలు చేసేవాడు. ఇంత అతి వ్యాయామం వద్దని డాక్టర్లు గతంలోనే సిద్ధార్థ్‌కు సూచించినప్పటికి అతడు వైద్యుల మాట వినలేదు. దీంతో ఆయన చివరకు ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండుపోటుతో మృతి చెందారు. అయితే ఆయన కూడా గంటల తరబడి జిమ్‌లో వ్యాయామాలు చేయడం వల్లనే మృతి చెందాడని కొంతమంది వైద్యులు అభిప్రాయపడ్డారు. అయితే సెలబ్రిటీలు, యువత తమ దేహాన్ని అందంగా, ఆకర్షణీయంగా మలుచుకోవటం కోసం గంటల కొద్ది సమయాన్ని జిమ్‌లో గడుపుతారు. ఆరు పలకలదేహం కోసం అన్ని రకాల కసరత్తులు చేస్తారు. కొన్నిసార్లు తమకు సాధ్యంకాని బరువులను ఎత్తుతారు. ఈ క్రమంలో జిమ్ ట్రైనర్లు హెచ్చరించనప్పటకీ తాము ఫిట్‌గా ఉండాలనే కోరికతో ఇతరులతో పోటీమరీ జిమ్‌లో వర్కవుట్లు చేస్తుంటారు. అయితే మితిమీరిన జిమ్ వర్కవుట్లు ప్రామాదకరమని ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న ఘటనలు తెలుతున్నాయి. తాజాగా మితిమీరిన బరువులెత్తడం ప్రాణాంతమని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పలువురు అధిక బరువులు ఎత్తే ప్రయత్నం చేసి.. అక్కడికక్కడే కుప్పకూలిపోతారు. ఈ వీడియోలో ఉన్నవారు శారీకంగా దృఢంగా ఉన్నప్పటికీ అధిక బరువులు ఎత్తే క్రమంలో పడిపోవటం చూసిన నెటిజన్లు జిమ్‌లో అధిక బరువులు ఎత్తటం, గంటల తరబడి వర్కవుట్లు చేయటం ప్రమాదకరమని కామెంట్లు చేస్తున్నారు. -
Puneeth Rajkumar: చివరి క్షణాల్లో ఏం జరిగింది? వైద్యులు ఏం చెప్పారు?
Puneeth Rajkumar Death Reason: కన్నడ చిత్రపరిశ్రమలో పెను విషాదం చోటు చేసుకుంది. 46 ఏళ్ల పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సదాశివనగరలోని తన నివాసంలో జిమ్‌లో పునీత్ యథావిధిగా వర్కవుట్లు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు పునీత్‌ను సమీపంలోని రమణశ్రీ క్లినిక్‌కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలోని విక్రమ్ ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో ఉంచి, వైద్యం ప్రారంభించారు. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునీత్ మరణాన్ని బసవరాజ బొమ్మై అధికారికంగా ప్రకటించారు. ఆస్పత్రికి వచ్చేటప్పటికే... పునీత్ కుటుంబ వైద్యులు ఈసీజీ తీయగా, గుండెపోటు అని నిర్ధారణ అయ్యాకే తమ ఆస్పత్రికి వచ్చినట్లు విక్రమ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. పునీత్‌ను ఆస్పత్రికి తీసుకు వచ్చినప్పుడే ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారని, హృదయ స్పందన లేదని వైద్యులు పేర్కొన్నారు. అయినప్పటికీ మూడు గంటల పాటు తీవ్రంగా ప్రయత్నించామన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు చనిపోయినట్లుగా తాము నిర్ధారించినట్లు ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. స్టేడియానికి భౌతికకాయం... శుక్రవారం సాయంత్రం పునీత్ భౌతికకాయాన్ని సదాశివనగరలోని ఇంటికి తరలించారు. అక్కడ కొన్ని పూజలు చేశాక కంఠీరవ స్టేడియానికి తరలించారు. సాయంత్రం 7 గంటల తర్వాత నుంచి అభిమానుల అంతిమ దర్శనానికి అవకాశం కల్పించారు. పునీత్ పెద్ద కుమార్తె అమెరికాలో చదువుతోంది. శనివారం సాయంత్రానికి ఆమె బెంగళూరు చేరుకుంటుంది. అనంతరం పునీత్ అంత్యక్రియలను ఆదివారం కంఠీరవ స్టూడియోలో ఆయన తల్లిదండ్రుల సమాధి చెంతన నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. -
ఫిట్‌గా ఉన్నా..జిమ్ చేస్తున్నా.. గుండెపోటు ఎందుకు?
ప్రముఖ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉంటారు. అందునా ఆయన వయసు కేవలం 46 ఏళ్లు మాత్రమే. ఇలాంటి వయసులో, ఇంత ఫిట్‌గా ఉన్నవారికి గుండెపోటు రావడం కొంత విస్మయం, మరికొంత ఆందోళన కలిగించే అంశమే. అంత ఫిట్‌గా ఉన్నవారికే వస్తే మరి ఎలాంటి జాగ్రత్తలూ పాటించనివారి పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక్క పునీత్ ఘటనే కాదు.. ఇలాంటివి మరికొన్ని ఇటీవల చోటుచేసుకున్నాయి. సిద్ధార్థ శుక్లా (హిందీ బిగ్‌బాస్ ఫేమ్), మరొకవ్యక్తి గుండెనొప్పితో బాధపడుతూ జిమ్ మెట్ల మీద కూర్చుని అక్కడే కుప్పకూలిపోయారు. చాలామంది యువత ఎస్ఐ పరీక్షకు శిక్షణ పొందే క్రమంలో రన్నింగ్ చేస్తూ గుండెపోటుకు గురికావడం చూస్తూనే ఉన్నాం. మరిలాంటి గుండెపోట్లకు కారణాలేమిటి? నివారించడమెలా? గడ్డలు, అడ్డంకులు లేకపోయినా.. పునీత్ రాజ్‌కుమార్, సిద్ధార్థ శుక్లా లాంటి పూర్తి ఫిట్నెస్తో ఉన్న యువకులకు యాంజియోగ్రామ్ వంటి పరీక్షలు నిర్వహిస్తే... వారి రక్తనాళాల్లో ఎలాంటి రక్తపు గడ్డలు (క్లాట్), మరెలాంటి అడ్డంకులు (బ్లాక్స్) కనిపించకపోవచ్చు. అంతా నార్మల్‌గా ఉంటుంది. అయినా అలాంటివారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు ఇదమిత్థంగా ఇదే కారణమని చెప్పలేకపోయినా.. ఇలాంటివారిలో ఆ సమస్య వచ్చేందుకు దోహదం చేసే అంశాలను తెలుసుకుంటే ఫిట్నెస్, ఆరోగ్యం కోసం కఠిన వ్యాయామం చేసే వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోడానికి వీలవుతుంది. కఠిన వ్యాయామం చేస్తున్నారా? గుండె రక్తనాళపు గోడల్లో చీలిక ఏర్పడితే అది గుండెపోటు లాంటి ప్రమాదానికి దారితీయవచ్చు. దీన్నే డిఫెక్షన్ అంటారు. గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో చెప్పుకోదగ్గ బ్లాక్స్ లేకపోయినా.. కొవ్వుకణాలతో ఏర్పడిన ‘ప్లాక్’పైన పగుళ్లు ఏర్పడటం వల్ల రక్తం గడ్డకట్టి, అది రక్తప్రవాహానికి అడ్డంకిగా మారి గుండెపోటుకు కారణం కావచ్చు. పునీత్ లాంటి బాగా ఎక్సర్సైజ్ చేసే వారి రక్తనాళాల్లో ఎలాంటి ప్లాక్స్ / బ్లాక్ లేకపోయినా అక్కడ అకస్మాత్తుగా రక్తపు గడ్డలు ఏర్పడటం వల్ల కూడా గుండెపోటు రావచ్చు. ∙కొంతమందిలో సహజంగా రక్తంలో గడ్డలు (క్లాట్స్) ఏర్పడే తత్వం ఉంటుంది. ఉదాహరణకు ప్రొటీన్–సి, ప్రొటీన్–ఎస్, యాంటీ థ్రాంబిన్– 3 డెఫీషియెన్సీల వంటి లోపాలున్నవారిలో ఈ తత్వం ఉంటుంది. అలాగే హోమోసిస్టిన్ అనే జీవరసాయనం రక్తంలో ఎక్కువగా ఉన్నవారిలోనూ ఈ క్లాట్ ఏర్పడే గుణం ఎక్కువ. ఇలా రక్తం త్వరగా గడ్డ కట్టడానికి అవకాశం ఉన్న ధోరణిని ‘బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ’ (హైపర్కోయాగులబుల్ స్టేట్స్)గా చెబుతారు. ఇది ఉన్నవారిలో రక్తంలో క్లాట్ త్వరగా ఏర్పడి అది రక్తప్రవాహానికి అడ్డంకిగా మారి గుండెపోటును తెచ్చిపెట్టవచ్చు. ఇవిగాక జన్యుపరమైన కారణాలతో ఓ వ్యక్తి ఎంత ఫిట్‌గా ఉన్నప్పటికీ ఒక్కోసారి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. కుటుంబంలో (ఫ్యామిలీ హిస్టరీలో) గతంలో ఎవరికైనా గుండెపోటు వచ్చిన దాఖాలాలు ఉంటే.. అలాంటి కుటుంబాల్లోని కొందరికి ఎంత ఫిట్‌గా ఉన్నా ఒక్కోసారి అకస్మాత్తుగా గుండెపోటు రావచ్చు. కోవిడ్ వచ్చిన వారిలో.. కోవిడ్ వచ్చి తగ్గిన కొందరిలో క్లాట్స్ ఏర్పడే తత్వం పెరిగిపోయింది. కొందరికి తమకు కోవిడ్ వచ్చి తగ్గిన సంగతే తెలియకపోవచ్చు. కానీ అనంతర పరిణామంగా రక్తపుగడ్డలు (క్లాట్స్) ఏర్పడటం వల్ల హఠాత్తుగా గుండెపోటు వచ్చి అది ఆకస్మిక మరణానికి దారితీయవచ్చు. మరికొన్ని సాధారణ కారణాలు ► సాధారణంగా చాలా మృదువుగా, సాగే గుణంతో (ఫ్లెక్సిబుల్‌గా) ఉండే రక్తనాళాలు వయసు పెరుగుతున్న కొద్దీ గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్కిల్రోసిస్ అని అంటారు. కొందరిలో అథెరో స్కిల్రోసిస్ మొదలైన ఏడాదిలోనే గుండెపోటు రావచ్చు. గతంలో 50 ఏళ్లకు పైబడ్డాక ఈ పరిణామం సంభవించేది. ఇటీవల చాలా చిన్నవయసులోనే అంటే 21 – 40 ఏళ్ల వారిలోనూ రక్తనాళాలు గట్టిబారడం కనిపిస్తోంది. దీనికి ఇదీ కారణం అని చెప్పలేకపోయినా.. కొందరిలో కొలెస్ట్రాల్ నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరడం వల్ల, ప్లాక్స్గా పిలిచేవి క్లాట్స్ (అడ్డంకులు)గా మారడం వల్ల ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా గుండెపోటు రావచ్చు. ► అథెరోస్కిల్రోసిస్కూ తద్వారా గుండెపోటుకు పొగాకును ఓ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ► ఇక జెండర్ అంశం కూడా గుండెపోటుకు ఒక ప్రధాన కారణం. మహిళలతో పోలిస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు పురుషుల్లో ఎక్కువ. రుతుస్రావం ఆగిపోయే వరకు మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్ హార్మోన్ వారికి గుండెపోటు నుంచి రక్షణ కల్పిస్తుంది. పురుషులు, మహిళలైన యువ రోగుల్లో గుండెపోటు (మయోకార్డియల్ ఇన్పార్క్షన్) నిష్పత్తిని పరిశీలిస్తే అది 20 : 1 గా ఉంటుంది. కానీ రుతుక్రమం ఆగిపోయాక మహిళలతో పాటు ఏ జెండర్‌కు చెందినవారికైనా గుండెపోటు అవకాశాలు సమానం. ► జంక్‌ఫుడ్ తీసుకోవడం వల్ల గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) తగ్గడం, హాని చేకూర్చే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్), చెడు కొవ్వులైన ట్రైగ్లిసరైడ్స్ పెరగడం కూడా యువతలో గుండెపోటు పెరగడానికి దోహదం చేసే అంశాల్లో ప్రధానమైనదే. ► పొట్ట దగ్గర కొవ్వు విపరీతంగా చేరడంతో వచ్చే సెంట్రల్ ఒబెసిటీ, తీవ్రమైన మానసిక ఒత్తిడి (స్ట్రెస్)తో కూడిన ఆధునిక జీవనశైలి కూడా హఠాత్తుగా గుండెపోటును తెచ్చేవే. ► అధిక రక్తపోటు (హైబీపీ) కూడా గుండెపోటుకు దోహద పడుతుంది. గుండెపోటు లేకుండానే ఆగిపోవచ్చు కొంతమందికి గుండెపోటు రాకుండానే ఆకస్మికంగా గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. వీటిల్లో బ్రుగాడా సిండ్రోమ్, లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి వంటి కారణాలతో గుండెపోటు లేకుండానే అకస్మాత్తుగా ‘కార్డియాక్ అరెస్ట్’ అయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. ఇలా జాగ్రత్త పడాలి ► కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బులు ఉన్న మెడికల్ హిస్టరీ ఉన్నట్టైతే చిన్నవయసులోనే పరీక్షలు చేయిస్తుండాలి. 40 ఏళ్లు దాటిన ప్రతివారూ తరచూ హైబీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజెస్ కోసం సాధారణ పరీక్షలు చేయించుకోవాలి. అవసరాన్ని బట్టి ఆ పరిస్థితిని నియంత్రించుకోవడం / సరిదిద్దుకోవడం కోసం తగిన మందులు వాడుతూ ఉండాలి. ► వ్యాయామం చాలా మంచిదే. అయితే గుండెమీద భారం పడుతున్నట్లుగా గానీ లేదా తీవ్రమైన ఆయాసానికి గురి చేస్తున్నట్లుగా అనిపించగానే ఆపేయాలి. ► అన్నిటికంటే ముఖ్యంగా వ్యాయామ ప్రక్రియ ఏదైనా అది తీవ్రమైన శ్రమ కలిగించనిదిగా ఉండాలి. అందుకే వ్యాయామ ప్రక్రియలన్నింటి కంటే నడక మంచి వ్యాయామం. ► వైద్య, పారామెడికల్ సిబ్బందితో పాటు పోలీసులు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలకు ఏఈడీ (ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్) పరికరాన్ని ఉపయోగించే శిక్షణ ఇప్పించడంతో పాటుగా ‘బేసిక్ లైఫ్ సపోర్ట్’ శిక్షణ ఇప్పించి, వాటి సహాయంతో హాస్పిటల్‌కు వెళ్లేలోపే రోగిని స్థిమితపరిస్తే... వారిని మరణం బారినుంచి రక్షించే అవకాశాలుంటాయి. ఇలాంటి ఉపకరణాలను ‘పబ్లిక్ ప్రదేశాల్లో’ అందుబాటులో ఉంచితే హఠాన్మరణాలను నివారించవచ్చు. -
Puneeth Rajkumar: గుండె పగిలిపోయింది.. ప్లీజ్ కం బ్యాక్ అప్పూ..
RIP Puneeth Rajkumar: శాండల్‌వుడ్ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ 46 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. జిమ్ చేస్తుండగా శుక్రవారం ఉదయం 9.45 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని రమణశ్రీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విక్రమ్ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి పునీత్ తుదిశ్వాస విడిచారు. చదవండి: శోక సంద్రంలో పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు... వారి భయమే నిజమైంది ఎంతో భవిష్యత్తు ఉండి, చిన్న వయసులోనే పునీత్ గుండెపోటుతో మరణించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణంతో శాండల్‌వుడ్‌తో పాటు భారత సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన హఠాన్మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా పునీత్‌కు ఫిజికల్ ఫిట్‌నెస్‌పై మక్కువ ఎక్కువ. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా నిత్యం వ్యాయామం చేశేవారు. దీనికి సంబంధించిన వీడియోలను సైతం ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునేవారు. ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా కనిపించే పునీత్ తీవ్ర గుండెపోటుతో చనిపోవడాన్ని అభిమానులు నమ్మలేకపోతున్నారు. ఈ వార్త విని తమ గుండె పగిలిపోయిందని, ప్లీజ్ కం బ్యాక్ అప్పూ అంటూ ఫ్యాన్స్ భావేద్వేగంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చదవండి: కర్ణాటకలో హైఅలర్ట్.. థియేటర్లు మూసివేయాలని ఆదేశం Puneeth Rajkumar Death: పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత.. శోకసంద్రంలో అభిమానులు View this post on Instagram A post shared by Puneeth Rajkumar (@puneethrajkumar.official) View this post on Instagram A post shared by Puneeth Rajkumar (@puneethrajkumar.official) View this post on Instagram A post shared by Puneeth Rajkumar (@puneethrajkumar.official) -
ఎగిరెగిరి తన్నిన రష్మిక.. కోపం వస్తే ఇలా చేస్తుందా?
ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫిట్ నెస్ కోసం టైమ్ కేటాయిస్తుంది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా. తన శరీరాన్ని సరైన ఆకృతిలో ఉంచడం కోసం వారానికి కనీసం 4,5 సార్లు జిమ్ లో గడుపుతుందట. ఒకవేళ జిమ్ కు వెళ్లలేకపోతే.. యోగా అయినా చేస్తుంది. ఖాళీగా ఉంటే రోజులో ఎక్కువ భాగం జిమ్‌లోనే కాలం గడిపేస్తూ ఉంటుంది. ఆ వర్కవుట్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంది. అవి వైరల్ అవుతూంటాయి. తాజాగా ఆమె జిమ్ సెంటర్ వర్కౌట్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో రష్మిక తన ఫిట్నెస్ ట్రైనర్ పట్టుకున్న స్ట్రైకింగ్ ప్యాడ్‌ను పదేపదే తన్నుతున్నట్లు చూడొచ్చు. ఆమె ఎగిరెగిరి తన్నుతుంటే..మరింత గట్టిగా తన్ను అంటూ రష్మికను ప్రోత్సహిస్తున్నాడు ట్రైనర్. ఈ వీడియోని రష్మిక ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. చాలా కోపంగా ఉన్నప్పుడు నేను ఏమి చేస్తాను’అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రష్మిక వీడియోకి నటుడు, దర్శకుడు తనదైన శైలీలో స్పందిచాడు. ‘ఈ వీడియో చూశాక ఏ దర్శకుడైనా నిన్ను రీటేక్ కోసం అడుగుతాడా? టేక్ ఓకే’ అంటూ కామెంట్ చేశాడు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
మరోసారి ఫిదా చేస్తున్న సోనూ సూద్
సాక్షి, ముంబై: రియల్ హీరో సోనూసూద్ మరోసారి ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ, తీవ్రమైన వర్కౌట్స్ చేస్తూ.. కండలు తిరిగిన చక్కటి బాడీతో ఆకట్టుకోవడం ఆయనకు అలవాటు. తాజాగా మరో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వావ్.. అంటూ ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు. లక్షా 90వేలకు పైగా లైక్స్‌తో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సోనూ సూద్‌కు ఇష్టమైన ప్రదేశం జిమ్. జిమ్‌లో వర్కవుట్ చేసిన తరువాతే మరే పనైనా అన్నట్టు కసరత్తుకు ప్రాధాన్యత ఇస్తారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్‌మీడియాలో తరచూ షేర్ చేస్తూ ఉంటారు. ఆరోగ్యం ఫిట్నెస్ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వీడియోలు, కుమారుడు ఇషాన్ సూద్‌తో కలిసి చేసిన కసరత్తు తెగ హల్చల్ చేసిన సంగతితెలిసిందే. పుల్-అప్ అయినా, లెగ్ రైజ్ అయినా అలా అలవోకగా చేసి పారేయ్యగల శారీరక ధారుడ్యం అతనిది. (Manike Mage Hithe: యొహానీకి బాలీవుడ్ బంపర్ ఆఫర్) తాజాగా తన జిమ్ డైరీల నుండి మరొక స్నిప్పెట్‌ను అభిమానులతో పంచుకున్నారు. "డైలీ గ్రైండ్" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ చేసిన వీడియో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. రాడ్‌కు వేలాడుతూ పుల్ అప్ చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు. తను ఎక్కడ ఉన్నా ఆ ప్రదేశాన్ని వర్కవుట్ స్పేస్‌గా మార్చేయగల సత్తా సోనూ సూద్ సొంతం. గతంలో ఆయన షేర్ చేసిన ఎస్కలేటర్ వీడియోనే ఇందుకు సాక్ష్యం. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
దేహం తేలికైంది.. జీవితం బరువైంది
మిల్లీ సాన్‌సోయీ రచయిత్రి. యూకేలో మీడియారంగంలో కెరీర్‌ని నిర్మించుకుంటోంది. ఇరవై ఏడేళ్ల మిల్లీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. మృత్యువు అంచుల వరకూ వెళ్లి వచ్చింది. ఒక రకంగా ముంచుకు వస్తున్న మృత్యువు బారిన పడకుండా ఉండడానికి పెద్ద పోరాటమే చేసింది. పదహారేళ్ల వయసులో 33 కిలోల బరువుతో జీవితాన్ని బరువుగా లాక్కు వచ్చింది మిల్లీ. ఇదంతా చూస్తుంటే ఏ ప్రాణాంతక వ్యాధి వచ్చి తగ్గిందో అనుకుంటాం. కానీ ‘‘అంతా నేను చేతులారా చేసుకున్నదే’’ అంటుంది మిల్లీ. ‘‘అదృష్టవశాత్తూ నేను మృత్యువు ఒడిలోకి జారిపోవాల్సిన సమయానికి రెండు వారాల ముందు డాక్టర్ రక్షణలోకి వెళ్లగలిగాను కాబట్టి వ్యాధి బారి నుంచి బయటపడ్డాను. ఆరోగ్యాన్ని పొందడం కోసం నేను చేసిన పోరాటాన్ని మీతో పంచుకుంటాను. ఎందరో అమ్మాయిలు నా అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు’’ అంటోంది మిల్లీ సాన్‌సోయీ. కేలరీల దహనమే ధ్యేయం ‘‘చిన్నప్పటి నుంచి బొద్దుగా ఆరోగ్యంగా ఉండేదాన్ని. పద్నాలుగేళ్ల వయసులో ఎదురైన ఒక వెక్కిరింత... నా మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఎలాగైనా సరే బరువు తగ్గాలి, నన్ను ఎగతాళి చేసిన అమ్మాయికంటే స్లిమ్‌గా మారాలనే పట్టుదల కలిగింది. ఆహారంలో మార్పులు చేసుకుని, జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ ఆరోగ్యకరంగా బరువు తగ్గాను. డ్రెస్ సైజ్ కూడా మారింది. ఆ మార్పును గుర్తిస్తారని ఆశించాను. కానీ అలా జరగలేదు. దాంతో ఇంకా మొండితనం వచ్చేసింది. తీవ్రంగా బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నాను. అంతలో ఒక యాక్సిడెంట్. మోకాలికి గాయమైంది. జిమ్‌లో వర్కవుట్ సాధ్యం కాదు. మరెలా? ఆహారం పరిమాణం బాగా తగ్గించేశాను. కేలరీలు కొలత చూసుకోవడం, దేహంలోకి వెళ్లిన కేలరీలను దహింప చేయడానికి విపరీతంగా నడవడం దినచర్యగా మారింది. రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారు జామున రెండు వరకు నడుస్తూనే ఉండేదాన్ని. క్రమంగా పీలగా మారిపోయాను. అయినా సరే... ఎగతాళి చేసిన అమ్మాయి కంటే సన్నగా అయ్యాను. కానీ ఆమె నన్ను ఏడిపించడం మానలేదు. ‘మిల్లీ ఇప్పుడు నీ కంటే సన్నగా ఉంది కదా? ఇంకా ఎందుకు ఏడిపిస్తావ్’ అని నా ఫ్రెండ్ నిలదీసింది. అప్పుడా అమ్మాయి ‘మిల్లీ అప్పట్లో లావుగా ఉండేది, ఇప్పుడు పేషెంట్లా ఉంది’ అని వెక్కిరించింది. నాకప్పుడు ఏమీ అర్థం కాలేదు. అసలు నేను ఎలా ఉండాలి? అనే సందేహం. నేను మరీ సన్నబడడంతో ఇంట్లో వాళ్లు నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఇక... రెండు వారాలే! పద్నాలుగేళ్ల వయసులో పడిన ఒక విషబీజం పదహారేళ్లు వచ్చేసరికి ఊడలుగా విస్తరించి ఆరోగ్యాన్ని కబళించింది. ‘దేహంలో అంతర్గత అవయవాల పనితీరు క్షీణించింది. మరో రెండు వారాలకంటే బతకడం కష్టం’ అని చెప్పారు డాక్టర్. నా ఆరోగ్యం కోసం అమ్మ పడుతున్న తపనను చూసి అమ్మకోసం అనొరెక్సియా, ఈటింగ్ డిజార్డర్ సమస్యల నుంచి బయటపడడానికి పెద్ద పోరాటమే చేశాను. ఒక వేసవి మొత్తం హాస్పిటల్లోనే ఉన్నాను. బరువు 33 కిలోల నుంచి 51 కిలోలకు పెరిగిన తర్వాత బయటకు వచ్చాను. ఆ తర్వాత చేసిన మొదటి పని స్కూలు మారడం. ఇదొక పాఠం నా అనారోగ్యం గురించి తెలిసిన తర్వాత మా అమ్మమ్మ నన్ను చూడడానికి వచ్చింది. అప్పుడామె అన్న మాటను నేను మర్చిపోలేను. ‘అందరి దృష్టి నీ మీద ఉండాలని నువ్వు కోరుకుంటే నువ్వు ఏదైనా సాధించు. అంతే కానీ అనారోగ్యంతో కాదు. పని చేసుకునే వాళ్లను చూడు, వాళ్లకు దేహాకృతి గురించిన పట్టింపు ఉండదు. తమ పనితోనే గుర్తింపు తెచ్చుకుంటారు’ అని చెప్పింది. స్కూల్ చదువు పూర్తి చేసి కాలేజ్‌లో చేరాను. చదువు పూర్తయ్యేటప్పటికి జీవితం చాలా చిన్నదనే వాస్తవం తెలిసింది. అనొరెక్సియా, ఈటింగ్ డిజార్టర్ల వెనుక అసలైన జీవితం ఉందని కూడా తెలిసింది. ఇప్పుడిలా సంతోషంగా ఉన్నాను. నా అనుభవం ఎందరికో పాఠంగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను’’ అని చెప్పింది మిల్లీ సాన్‌సోయీ. మీడియా కూడా ‘సన్నబడడానికి సులువైన మార్గాలు’ అనే కథనాలకు బదులు ఆరోగ్యంగా జీవించడానికి అనువైన మార్గాలను సూచించాలని మిల్లీ కోరుతోంది. అంతేకాదు... తనకు ఎదురైన చేదు అనుభవం నుంచి బాడీ షేమింగ్‌కు పాల్పడే ఆలోచనను పిల్లల్లో మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఉందని కూడా సమాజం తెలుసుకోవాలి. -
68 లో 20 అంటూ సీఎం స్టాలిన్ జిమ్ వర్కౌట్స్
-
యూత్‌కి సవాల్ విసురుతున్న సీఎం, మీరూ ఔరా అంటారు!!
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ మరోసారి సోషల్ మీడియా స్టార్‌గా అవతరించారు. 68 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల కుర్రాడిలా చాలా చురుగ్గా ఉండే స్టాలిన్ ఫిట్నెస్ మంత్రాతో అందర్నీమెస్మరైజ్ చేస్తున్నారు. తాజాగా ఆయన కసరత్తుల వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. తలైవర్ ఫిట్నెస్ వర్కౌట్స్ చూసి అంతా ఫిదా అవుతున్నారు. మరోవైపు టీఐ సైకిల్స్ సంస్థ స్టాలిన్ ఒక కొత్త సైకిల్‌ను కూడా ప్రెజెంట్ చేయడం విశేషం. ఎంత బిజీగా ఉన్నా శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ ప్రముఖుల్లో సీఎం స్టాలిన్ ఒకరు. త్వరగా నిద్ర లేవడం, నడక, సైక్లింగ్, యోగా తన దినచర్యలో ఒక భాగమనీ ఇదివరకే డీఎంకే నేత స్టాలిన్ ప్రకటించారు. ఏ పనిలోఉన్న పది రోజులకోకసారి సైకిల్ తొక్కుతానని, కర్ణాటక సంగీతం వినడం కూడా తనకు చాలా ఇష్టమని ఆయన చెప్పారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం మామల్లాపురం రోడ్డుపై ఉదయాన్నే సైక్లింగ్ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారితో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా ఏప్రిల్-మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోఅద్భుత విజయంతో స్టాలిన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. వెంటనే కుటుంబాలకు ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాల ధర తగ్గింపు, కరోనా ఆర్ధిక సహాయం లాంటి కీలక పథకాలపై సంతకం చేశారు. అలాగే ఇటీవల లీటరు పెట్రోలుపై రూ.3 తగ్గింపు, అర్చకత్వంలో అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జిమ్‌లో ‘దెయ్యం’.. కాలు పట్టుకుని మరీ లాక్కెళ్లింది
దెయ్యాలు ఉన్నాయా.. లేవా.. అనే విషయం మీద ఎప్పటికి చర్చలు నడుస్తూనే ఉంటాయి. చాలా మంది దెయ్యాలున్నాయని విశ్వసిస్తే.. కొందరు మాత్రం అదంతా ఉట్టిదే అని కొట్టిపారేస్తారు. ఇక ఇంటర్నెట్లో దెయ్యాలకు సంబంధించిన వీడియోలు కోకొల్లలు. అయితే వీటిలో చాలా మటుకు ఫేక్ వీడియోలే అని మనం గుర్తించగలం. కానీ కొన్ని వీడియోలుంటాయి.. ఎంతటి ధైర్యవంతులైనా సరే.. వాటిని చూస్తే.. దడుసుకోవాల్సిందే. ఈ తరహాకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎక్సర్సైజ్ చేసుకుందామని జిమ్‌కు వచ్చిన వ్యక్తిని ‘దెయ్యం’ పరుగులు పెట్టించింది. కాలు పట్లుకుమని లాక్కెళ్లింది. ఆ వివరాలు.. టిక్‌టాక్ యూజర్ @carlosruizoficial పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 12 మిలియన్లకు పైగా వ్యూస్‌తో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిలో జిమ్‌కు వెళ్లిన ఓ వ్యక్తిని అదృశ్య శక్తి ఫ్లోర్ అంతటా లాగుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఎక్సర్సైజ్ కోసం ఓ వ్యక్తి జిమ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో జిమ్‌లో అతనొక్కడే ఉన్నాడు. ఇక అతడు వామప్ చేసుకుంటూ ఉండగా.. అతడి వెనక ఉన్న కొన్ని జిమ్ పరికరాలు వాటంతట అవే కదులుంతుంటాయి. మొదట ఆ వ్యక్తి దాన్ని పెద్దగా పట్టించుకోడు. ఆ తర్వాత మరి కొన్ని పరికరాలు అలానే అసాధారణ రీతిలో కదలడం మొదలవుతుంది. వీటన్నింటిని గమనించిన సదరు వ్యక్తి అక్కడ ఏదో అదృశ్య శక్తి ఉందని భావించి... బయటకు వెళ్లాలని అనుకుంటాడు. ఇక తనతో పాటు తీసుకువచ్చిన వస్తువులు తీసుకుని బయటకు వెళ్తుండగా.. సడెన్‌గా కిందపడతాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి అతడి కాలు గాల్లోకి లేస్తుంది. ఆ తర్వాత ఎవరో అతడి కాలు పట్టి జిమ్ ఫ్లోర్ మీద కొంత దూరం ఈడ్చుకెళ్లినట్లు కనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరు కనిపించరు. వదిలేయగానే.. ఆ వ్యక్తి కాలుకు పని చెప్పి.. అక్కడ నుంచి బయటకు పరిగెత్తాడు. ఈ వీడియోపై నెటిజనులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కావాలనే ఇలాంటి స్టంట్లు చేశారు.. అక్కడ దెయ్యం లేదు పాడు లేదు అంటుండగా.. మరి కొందరు దెయ్యం కూడా జిమ్ చేద్దామని వచ్చి ఉంటుంది.. అతడు అక్కడే ఉండటం దానికి నచ్చలేదేమో.. అందుకు ఇలా బయటకు గెంటేసింది అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
జిమ్‌లో సల్మాన్ కసరత్తులు.. వీడియో వైరల్
షూటింగ్ లొకేషన్లో నటుడిగా విజృంభించడానికి టైగర్ రెడీ అయ్యాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్. ఇందులో ఇమ్రాన్ హష్మి, రణ్వీర్ శౌరే కీలక పాత్రధారులు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 23న ముంబైలోని ఓ స్టూడియోలో ప్రారంభం కానుంది. యాక్షన్ సీక్వెన్సెస్‌ను ప్లాన్ చేశారు మనీష్. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం సల్మాన్ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సల్మాన్ మ్యాచో లుక్‌ని చూసి, అభిమానులు ఆనందపడుతున్నారు. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan) -
షర్ట్ విప్పి కండలు చూపిస్తున్న అల్లు శిరీష్.. ఫోటోలు వైరల్
తండ్రి బడా నిర్మాత, అన్న స్టార్ హీరో అయినప్పటీకీ సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు అల్లు శిరీష్. ఫలితాల విషయం పక్కన పెడితే, వైవిధ్యమైన కథలు కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. అవార్డు ఫంక్షన్లకు తనదైన శైలీలో హోస్టింగ్ చేసి లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఒక నటుడిగా ప్రేక్షకులకు వినోదం అందించడానికి ఎన్ని విధాలుగా ప్రయోగాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు. ఇక కరోనా లాక్‌డౌన్‌తో షూటింగ్లకి బ్రేక్ పడడంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు ఈ అల్లు హీరో. ఈ యంగ్ హీరో ఇటీవల తన బరువును తగ్గించి, స్లిమ్, ఫిట్ లుక్ లో అద్భుతంగా కనిపించాడు. అల్లు శిరీష్ జిమ్ లో వర్కౌట్స్ చేసిన అనంతరం తీసుకున్న మిర్రర్ సెల్ఫీలో సిక్స్ ప్యాక్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు.అల్లు శిరీష్ షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరగా 2019లో ABCD అనే ఒక సినిమాతో వచ్చిన శిరీష్ గత ఏడాది ఖాళీగానే ఉన్నాడు. ఆ మధ్య బాలీవుడ్లో ‘విలయాటి షరాబి’మ్యూజిక్ ఆల్భమ్‌లో నటించాడు. ప్రస్తుతం కొత్త కథలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. లాక్ డౌన్ అనంతరం వాటిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
మోహన్ లాల్ ఓ జిమ్‌లో కసరత్తులు....
-
మోహన్ లాల్ కసరత్తులు.. నెటిజన్లు ఫిదా
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తాజాగా నటించిన చిత్రం దృశ్యం2 ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఆయన మరోసారి తన మార్క్ నటనతో ప్రేక్షకులు, విమర్శకుల మన్ననలు పొందారు. ఆయన ఎటువంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి సినిమాను మరో స్థాయికి తీసుకువెళతారు. 60 ఏళ్ల వయసులో ఉన్న ఆయన ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా ఆయన ఓ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘ఎక్సర్సైజ్ చేస్తే శరీరంతో పాటు మానసికంగా చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాం’ అని కాప్షన్ జతచేశారు. ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ వయసులో కూడా మీరు జిమ్‌లో కఠినమైన కసరత్తులు చేస్తూ మాకు స్పూర్తిగా నిలుస్తున్నారు, సూపర్ సార్, మీరు నిజమైన సూపర్ స్టార్’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆయన ఇటీవల బెంగళూరులోని అమృత ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. అంతేకాదు ఎలాంటి సందేహం లేకుండా అర్హులైన వారంతా టీకా తీసుకోవాలని కోరారు. ఈ సందర్బంగా కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో భాగమైన కంపెనీలకు, భారత ప్రభుత్వానికి, వైద్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. సినిమాల విషయానికి వస్తే.. బరోజ్ సినిమాతో మోహన్‌లాల్ డైరక్టర్‌గా అవతారమెత్తారు. ప్రస్తుతం ఆయన బరోజ్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్కానున్నట్లు తెలుస్తోంది. చదవండి: మోహన్‌లాల్ కూతురిని ఆశీర్వదించిన బిగ్ బీ -
జిమ్‌లో.. వీళ్లు దూరంగా ఉంటే బెటర్!
కరోనా బూచి క్రమంగా కనుమరుగైతోంది. గతేడాది కరోనా కారణంగా లాక్డౌన్ అనంతరం ఆంక్షలతో సామూహికంగా వ్యాయామం చేసే జిమ్స్ మూసేయడం జరిగింది. కరోనా పుణ్యమాని వ్యాయామశాలల మూసివేతతో సరైన చోటు, కసరత్తులకు కావల్సిన సామగ్రి లేక చాలామంది రోజువారీ వర్కౌట్స్‌కు దూరమయ్యారు. బద్దకించని కొందరు ఇంట్లోనే చేతనైన వ్యాయామాలు చేసుకున్నారు. కొందరు ఇంట్లోనే చాలీచాలని ప్రదేశాల్లో కసరత్తులు చేయాల్సి వచ్చింది. అయితే ప్రభుత్వం క్రమంగా ఆంక్షలు సడలించుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో జిమ్స్‌లో మరలా సందడి మొదలైంది. టీకా వచ్చినా కరోనా మహమ్మారి వైరస్ ముప్పు ఇంకా తొలగనందున, సామూహిక కసరత్తులకు వేదిక అయిన జిమ్‌లు ఎంతవరకు సురక్షితం? ప్రస్తుత పరిస్థితుల్లో జిమ్‌లో వ్యాయామం చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రత్యామ్నాయాలేంటి? అనే అంశాల గురించి నిపుణులేమంటున్నారో చూద్దాం... కరోనానే కాదు, ఏ విధమైన సూక్ష్మజీవి కారక అంటురోగాలు సోకకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. భౌతిక దూరం, చేతుల పరిశుభ్రత, కాసేపు వ్యాయామం.. మనల్ని రోగాల నుంచి దూరంగా ఉంచుతాయి. సాధారణ జలుబు వైరస్ నుంచి కోవిడ్ వైరస్ వరకు గుంపులుగా జనాలు ఉండే చోట, ఇరుకైన ప్రదేశాల్లో తొందరగా వ్యాప్తి చెందుతాయనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతున్న మాట. దీని ప్రకారం తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మంది కసరత్తులు చేసే జిమ్‌లు ప్రమాదకరమేనని భావించవచ్చు. జిమ్‌లలో తేమ, వేడి గాలి అధికంగా ఉంటుంది. అలాగే కసరత్తులు చేసేటపుడు ఊపిరి ఎక్కువగా పీల్చడం, వదలడం, చేతులు, కాళ్లూ వేగంగా కదిలించడం వంటివి జరుగుతుంటాయి. వీటి కారణంగా ఇక్కడ గాలి స్థిరంగా కాకుండా కొంచెం కల్లోల స్థితిలో ఉంటుంది. వీటన్నింటిని వల్ల సామూహిక కసరత్తులు జరిగేటపుడు ఎవరైనా కోవిడ్ పాజిటివ్ వ్యక్తి శ్వాస బలంగా వదిలితే అందులో నుంచి వైరస్ తుంపరలు అత్యంత వేగంగా వ్యాపిస్తాయి. ఫలితంగా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుంది. ఒకవేళ జిమ్ వెలుపల పరీక్షలు చేసి లక్షణాలు ఉన్నవారిని అనుమతించకపోతే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే ఎలాంటి వ్యాధి లక్షణాలూ (అసింప్టమాటిక్) లేకున్నా కొందరిలో వైరస్ అంతర్లీనంగా ఉంటోందని, వారి ద్వారా ఇతరులకూ వ్యాపిస్తున్న విషయం తెలిసిందే! ఇటీవల దక్షిణకొరియాలోని ‘ఎమర్జింగ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్’అనే జర్నల్‌లో కోవిడ్‌పై ఓ నివేదిక వెలువడింది. ఇందులో జిమ్‌లు, ఫిట్నెస్ కేంద్రాలు, డ్యాన్స్ క్లాసుల గురించి పేర్కొన్నారు. తొలుత ఇక్కడి ఫిట్నెస్ కేంద్రంలో వైద్యనిపుణులు పాజిటివ్ కేసును గుర్తించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ఫిట్నెస్ కేంద్రాలను పరిశీలించగా అధిక శాతం మంది కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం జిమ్‌లు, ఫిట్నెస్ కేంద్రాల్లో కసరత్తులు చేయడంపై తమ పౌరులను హెచ్చరించింది. అమెరికా వైద్యులూ ఇదే విషయం చెబుతున్నారు. ‘పాజిటివ్ వ్యక్తి నుంచి వెలువడిన వైరస్ బిందువులు గాలిలో సుమారు 3 గంటల సేపు ఉంటాయి. జనసమూహం ఉన్న, చిన్న చిన్న ప్రదేశాల్లో ఈ బిందువులు వేగంగా విస్తరించి ఇతరులకు వ్యాధి సోకుతుంది. జిమ్‌లు ఇలాంటివే’ అని న్యూయార్క్‌లోని లెనాక్స్ హిల్ హాస్పిటల్ వైద్యడు డాక్టర్ గ్లట్టర్ వెల్లడించారు. ఇవి గమనించండి.. మీ ఆరోగ్యం, వయస్సును బట్టి.. సమూహం ఉండే, ఇరుకైన జిమ్‌లు మీకు సురక్షితమా కాదా అని అంచనా వేసుకోవాలి. వీలైతే జిమ్‌కు మీ సొంత వ్యాయామ సామగ్రి తీసుకెళ్లండి. చేతులను తరచూ శానిటైజ్ చేసుకోండి. ఇతరులు ఉపయోగించిన సామగ్రిని వాడేటపుడు కచ్చితంగా వాటిని రసాయనాలతో క్రిమిరహితం చేయండి. మీరున్న ప్రాంతంలో వైరస్ సమూహవ్యాప్తి దశకు చేరుకొని ఉంటే ఎక్కువ ప్రమాదమని గ్రహించాలి. భౌతిక దూరం మరవద్దు. కుదిరితే ఆరడుగుల దూరం పాటించండి. వ్యాక్సిన్ తీసుకునేంతవరకు ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. ఇవన్నీ కష్టం అంటారా? అయితే జనసమర్థం లేని ఆరుబయట ప్రాంతాల్లో వర్కౌట్స్ చేయడం ఉత్తమం. ఎందుకంటే ఇరుకుగా ఉండే జిమ్‌లతో పోలిస్తే ఆరుబయట వైరస్లు వేగంగా చలించలేవు. ఒకవేళ కొంతమంది బృందంగా వ్యాయామానికి వచ్చినా ఆరుబయట విశాల స్థలంలో ఆరడుగుల భౌతిక దూరం పాటించడం కూడా సులభమే. అయితే, ఆరుబయట వ్యాయామం చేయడం వల్ల వైరస్ సోకదు అని కచ్చితంగా చెప్పలేం. కాకపోతే అవకాశాలు చాలా తక్కువ. జిమ్లోనైనా, బయటైనా ఫిజిషియన్ సలహమేరకే వర్కౌట్స్ చేయడం మంచిది. శరీరంలో వ్యాధినిరోధకత పెరగడానికి వ్యాయామం ప్రధానపాత్ర వహిస్తుంది. అయితే ఎవరికి వారు ఇష్టారాజ్యంగా పద్దతి, పాడు లేకుండా వ్యాయామాలు చేస్తే అనవసర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే వ్యాయామం మొదలు పెట్టే ముందు జనరల్ ఫిజిషియన్‌ను సంప్రదించి, మన శరీరంలో ఏదైన వ్యాధులు ఉన్నాయా అని పరీక్షించుకొవాలి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ప్రకారం..వయస్సు ఎక్కువగా ఉన్నవారిలో వ్యాయమం మొదలు పెట్టే ముందు పలు సమస్యలు తలెత్తుతాయి. వీళ్లు దూరంగా ఉంటే బెటర్! 1. హృదయ సంబంధ వ్యాధుల నుంచి కోలుకుంటున్న వారు , దానికి సంబంధించిన మందులను వాడుతున్నవారు. 2. సిగరెట్ తాగేవారు, సిగరెట్ మానేసి కనీసం ఆరునెలలు కూడా గడవని వారు.. పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు. 3. రక్తపోటు(బీపీ)కి సంబంధించిన మందులు ఉపయోగిస్తున్నవారు. 4. శరీరంలో కొలెస్ట్రాల్(కొవ్వు) అధికంగా ఉన్నవారు. అలాగని వీరు పూర్తిగా వ్యాయామానికి దూరం కాకుండా వాకింగ్ లాంటి తేలికపాటి వ్యాయామాలు చేస్తూ, పౌష్టికాహారం తీసుకుంటూ ముందుగా శరీరాన్ని బలోపేతం చేసుకోవాలి. తర్వాత కావాలంటే జిమ్‌లో చేరవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. -
ఫ్యాట్ తగ్గించుకోవడానికి తమన్నా తిప్పలు.. వీడియో వైరల్
‘ఐయామ్ బ్యాక్’ అంటు న్నారు తమన్నా. ఆ మధ్య తమన్నా కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో కాస్త బరువు పెరిగారామె. కోవిడ్ ముందు ఎంత బరువున్నానో ఆ బరువుకి వచ్చేశానోచ్ అంటున్నారామె. రెగ్యులర్ వర్కౌట్స్ వల్లే ఇది సాధ్యమైంది అన్నారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను పంచుకుని ఇలా అన్నారు తమన్నా. ‘‘ఏదైనా సరే అతిగా చేయక్కర్లేదు. చేసే పనిలో స్థిరత్వం ఉంటే ఏదైనా సాధించొచ్చు. రెండు నెలల పాటు ఎంతో క్రమశిక్షణతో వర్కౌట్స్ చేశాను. కోవిడ్ రాకముందు ఎలా ఉన్నానో అలా మారిపోయాను. వర్కౌట్స్ చేయకపోవడానికి వంకలు వెతక్కండి. ప్రతిరోజూ వ్యాయామం చేయండి’’ అన్నారు తమన్నా. ప్రస్తుతం ‘ఎఫ్ 3’, ‘అంధా ధున్’ తెలుగు రీమేక్, గుర్తుందా శీతాకాలం’ సినిమాలు చేస్తున్నారామె. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
ఫైటర్ కోసం ఫిట్‌గా..
సాక్షి, హైదరాబాద్: సినీ హీరో విజయ్ దేవరకొండ జూబ్లీహిల్స్‌లోని 360 డిగ్రీ ఫిట్నెస్ కార్యక్రమంలో 30 రోజుల్లో బరువు తగ్గే చాలెంజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలుగా జిమ్‌కు వస్తున్నట్లు చెప్పారు. మరో ప్రాజెక్ట్ ఫైటర్ సినిమా కోసం బెస్ట్ బాడీ షేప్‌ని తయారు చేసుకున్నానని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మంచి డైట్ ప్లాన్‌తో ఫిట్‌నెస్‌పై జాగ్రత్తలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫిట్నెస్ ట్రైనర్ కులదీప్ సేతి, 360 డిగ్రీ ఫిట్నెస్ ఎండీ సునితారెడ్డి పాల్గొన్నారు. -
‘ఔట్‌డోర్ జిమ్’పైనే ఆసక్తి
సాక్షి, శేరిలింగంపల్లి(హైదరాబాద్): శారీరక మానసికోల్లాసానికి వృద్ధులు.. చక్కటి ఆరోగ్యానికి మహిళలు.. శారీరక దృఢత్వానికి యువకులు వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తుంటారు. ప్రస్తుత సమాజంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఉరుకులు, పరుగుల కారణంగా శరీరానికి వ్యాయామం లేక రోగాల బారిన పడుతున్నారు. యువత మాత్రం వేలకు వేలు చెల్లించి జిమ్‌లలో నిమిషాలు లెక్కపెడుతూ కుస్తీలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓపెన్ జిమ్ (అవుట్ డోర్ జిమ్)లకు శ్రీకారం చుట్టింది. వాటిలో భాగంగా శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని ఆలిండ్ కాలనీ పార్కులో ఏర్పాటు చేశారు. దీంతో కాలనీ వాసులు అధిక సంఖ్యలో ఉదయం, సాయంత్రం ఉత్సాహంతో వ్యాయామాలు చేస్తున్నారు. ⇔ ఆలిండ్కాలనీ పార్కులో ఏర్పాటు చేసిన ఔట్‌డోర్ జిమ్‌లో అత్యాధునిక వ్యాయామ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ⇔ ఎయిర్ వాకర్, పుష్చైర్, ఎయిర్ స్వింగ్, షోల్డర్ వీల్, లెగ్ప్రెస్, పుల్చైర్, స్టాండింగ్ ట్విస్టర్, డబుల్ క్రాస్ వాకర్, ఎల్లిప్టికర్ ఎక్సర్సైజ్. లెగ్లిప్ట్, సిట్టింగ్ ట్విస్టర్ ఏర్పాటు చేశారు. ⇔ ఈ ఓపెన్ జిమ్పట్ల యువత, చిన్నారులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ⇔ సీనియర్ సిటిజన్లు, మహిళలు కూడా క్రమం తప్పకుండా వ్యామామాలు చేస్తున్నారు. ⇔ కరోనా సమయంలో ఏసీ హాల్ జిమ్‌ల కన్నా ఓపెన్ జిమ్ ఎంతో మేలంటున్నారు. ఉత్సాహంగా చేస్తున్నాం.. ఓపెన్జిమ్తో ఎంతో ఉత్సాహంగా ఉంది. ఉదయం కాసేపు వ్యాయామాలు చేయడంతో రోజంతా పనిచేసినా హుషారుగా ఉంటున్నా. ప్రైవేట్ జిమ్‌లకు వేలకు వేలు చెల్లించాల్సి అవసరం లేదు. జిమ్ ఏర్పాటుతో కాలనీవాసులకు, ముఖ్యంగా యువతకు ఎంతో సౌకర్యంగా ఉంది. సీనియర్ సిటిజన్లు, మహిళలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. – కృష్ణతేజ, ప్రైవేట్ ఉద్యోగి -
రిమ్ జిమ్.. జిమ్..
హీరోయిన్లు మెరుపుతీగలు. ఎప్పుడూ నాజూకుగానే ఉండాలి. స్క్రీన్ మీద స్లిమ్‌గా కనిపించాలి. జీరో సైజ్‌తో సందడి చేయాలి. హీరోయిన్లు అంటే ఇలానే ఉండాలని ప్రేక్షకులు ఏర్పరుచుకున్న అభిప్రాయాలు. వాటిని నిలబెట్టుకోవడానికి హీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇష్టమైన వాటికి నో చెప్పాల్సి ఉంటుంది. నోరు కట్టేసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి జిమ్‌లో బరువులు ఎత్తాల్సి ఉంటుంది. అయితే ఇవేం కష్టం కాదంటున్నారు కొందరు హీరోయిన్లు. ఫిట్నెస్ మీద శ్రద్ధ చూపిస్తున్నారు. రిమ్ జిమ్ అంటూ ఉల్లాసంగా జిమ్‌లో కసరత్తులలో మునిగిపోయిన హీరోయిన్ల వివరాలు చూద్దాం. ‘మన శరీరాన్ని సరైన షేప్‌లో ఉంచేది మన కష్టం కాదు.. మన మెదడు. దాన్ని శ్రద్ధగా, ఫోకస్‌గా ఉంచితే ఏదైనా చేయొచ్చు. ఫోకస్ ఎక్కడుంటుందో ఎనర్జీ కూడా అక్కడే ఉంటుంది’ అంటారు రాశీ ఖన్నా. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను, ఫోటోలను కూడా షేర్ చేశారామె. ప్రస్తుతం వెయిట్‌ను కంట్రోల్లో పెట్టే పనిలో పడ్డారు పాయల్ రాజ్‌పుత్. 63 కేజీల నుంచి 58 కేజీల వరకూ వచ్చారట ఆమె. ‘ఈ ప్రయాణం ఎంత వరకూ సాగుతుందో చూద్దాం. మెల్లిగా అయినా నేను అనుకున్న గోల్ చేరతాను’ అంటూ కొత్త లుక్ ఫోటోలను షేర్ చేశారు పాయల్ రాజ్‌పుత్. ‘మన బలం, బలహీనత రెండూ మన మెదడే. దాన్ని సరిగ్గా ట్రైన్ చేస్తే చాలు. ఫిజికల్ ట్రైనింగ్ ఈజీగా చేసేయొచ్చు’ అంటారు సమంత. ఆమె ఇన్స్టాగ్రామ్ చూస్తే చాలు సమంత వర్కౌట్స్ అస్సలు మిస్ కారని అర్థం చేసుకోవచ్చు. ‘మనకు 24 గంటలున్నాయి. అందులో ఒక్క గంట అయినా శరీరం మీద దృష్టి పెట్టడానికి ఉపయోగించాలి’ అంటారు రష్మికా మందన్నా. ‘శరీరాన్ని తరచూ కదిలిస్తే మనం చెప్పిన మాట వింటుంది’ అంటారు రకుల్ ప్రీత్ సింగ్. ‘ఫిట్‌నెస్‌లో కావాల్సింది స్పీడ్ కాదు.. శ్రద్ధ. రోజూ ఎంత శ్రద్ధగా చేస్తున్నాం అనేది ముఖ్యం’ అంటారు లావణ్యా త్రిపాఠి. వీళ్లందరూ షేర్ చేసిన ఫోటోలను పక్కన చూడొచ్చు. -
అలలు.. ఇసుక... భలే మంచి అనుభూతి
వ్యాయామం ఎక్కడైనా చేయొచ్చు. ఇంట్లో లేక జిమ్‌లో. వీలున్న చోట చెమటోడుస్తుంటారు. ఇల్లు, జిమ్ కాకుండా రష్మికా మందన్నా వర్కౌట్ చేయడానికి కొత్త చోటుని వెతుక్కున్నారు. కొన్ని రోజులుగా బీచ్‌లో వర్కౌట్స్ చేస్తున్నారు. ఈ కొత్త అలవాటు గురించి రష్మికా మందన్నా మాట్లాడుతూ –‘‘బీచ్‌లో వ్యాయామం చేయడం ఇదే తొలిసారి. ఇదో సరికొత్త అనుభూతి. కొన్ని రోజుల్లోనే బీచ్‌లో వర్కౌట్స్ చేయడం వ్యసనం అయిపోయింది. అలల చప్పుళ్లు, సముద్రపు గాలి, సువాసన, సూర్యాస్తమయం చూడటం, కాళ్ల కింద ఇసుక తగలడం... భలే చక్కటి అనుభూతి. ఇక నుంచి కొత్త ప్రదేశాల్లో ఎక్కడ వర్కౌట్ చేసినా ఓ వీడియో పంచుకోవాలనిపిస్తోంది’’ అన్నారు. బీచ్‌లో వ్యాయామం చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారామె. -
మిస్టర్ సీ.. జిమ్‌కి వచ్చేసీ... మరి మీరూ?
కోవిడ్ బ్రేక్ వల్ల జిమ్‌కి సెలవు పెట్టారట రామ్‌చరణ్. గురువారం జిమ్‌లోకి ఎంటరై, మళ్లీ వర్కవుట్లు మొదలుపెట్టారు చరణŠ.. ఈ విషయాన్ని ఆయన సతీమణి ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘మిస్టర్ సీ (చరణ్‌ను ఆమె అలానే పిలుస్తారు) మళ్లీ జిమ్‌లోకి వచ్చారు. మరి మీరు?’ అని ఓ ఫోటోను షేర్ చేశారామె. రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మరో హీరో. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు. ఇందుకోసం తన శరీరాకృతిని కొత్తగా తయారు చేశారు. ఆ మధ్య విడుదల చేసిన ట్రైలర్లో తన కండలు తిరిగిన దేహాన్ని చూపించారు. అక్టోబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుందట! -
ఇలా చెమటోడ్చి ఎన్ని రోజులైందో...
హైదరాబాద్: నాలుగు నెలల తర్వాత జిమ్‌లో శ్రమించడం పట్ల ప్రపంచ చాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సంతోషం వ్యక్తం చేసింది. అన్‌లాక్– 3 మార్గదర్శకాల్లో భాగంగా ఆగస్టు 5 నుంచి వ్యాయామశాలలు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో... సింధు బుధవారం జిమ్‌లో చెమటోడ్చింది. పూర్తిస్థాయి జిమ్ సెషన్లో పాల్గొన్న ఆమె ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేసింది. చాలా కాలం తర్వాత ఇలా కసరత్తులు చేయడం ఆనందంగా ఉందని పేర్కొంది. ట్రైనర్ సహాయంతో బరువులు ఎత్తడం, స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలు చేసింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆటలకు అంతరాయం ఏర్ప డిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సెప్టెంబర్‌లో జరగాల్సిన నాలుగు టోర్నీలను రద్దు చేసింది. -
లాక్డౌన్ ఎఫెక్ట్.. శరీరం సహకరించడం లేదు
లాక్డౌన్ కారణంగా జనాలు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు అందరి జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆఫీస్‌కు వెళ్లే పని లేదు.. షూటింగ్‌లు లేవు. దాంతో ఫిట్నెస్ ప్రేమికులు కూడా కొన్ని రోజుల పాటు శరీరానికి రెస్ట్ ఇచ్చారు. పాపం రామ్ చరణ్ కూడా అలానే చేశారంట. ఇన్ని రోజులు గ్యాప్ రావడంతో ప్రస్తుతం జిమ్ చేయాలంటే శరీరం సహకరించడం లేదు. బద్దకం ఎక్కువయ్యింది అంటున్నారు చెర్రి. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు రామ్ చరణ్. ‘బుర్ర జిమ్ చేయమంటోంది.. మనసు మాత్రం వద్దంటోంది’ అంటూ చెర్రి షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం తన భార్య ఉపసనా, మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి క్వారంటైన్లో ఉన్నారు. ఈ లాక్డౌన్ సమయంలో వంట చేయడంతో పాటు ఇతర ఇంటి పనులను చేస్తూ తనను తాను బిజీగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు చెర్రి. (ఒకేసారి ఆ మార్క్‌ను అందుకున్న చిరు, చరణ్) Head say gym💪 & Heart says 🤔hmmmm... pic.twitter.com/zoNNHz6Sxt — Ram Charan (@AlwaysRamCharan) July 10, 2020 ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను వచ్చే యేడాది సమ్మర్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో చెర్రి కీల పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
స్నేహలోని కొత్త కోణం
చిరునవ్వులకు చిరునామా నటి స్నేహ అనడం అతిశయోక్తి కాదు. తన నవ్వులతో దక్షణాది సినీ ప్రేక్షకులను వశపరచుకున్న నటి ఈ బ్యూటీ. కుటుంబ కథా చిత్రాల నటిగా పేరు తెచ్చుకోవడం స్నేహ ప్రత్యేకత. అలా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కథానాయకిగా రాణించింది. ఆ విధంగా నటిగా క్రేజ్ లో వుండగానే నటుడు ప్రసన్నను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నటనకు కొంత గ్యాప్ ఇచ్చిన నటి స్నేహ మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు కథానాయిక కాకుండా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. చదవండి: వయసు 87 ఇమేజ్.. సినిమాస్టార్ కాగా నటి స్నేహ, ప్రసన్నలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తీవ్ర కసరత్తులు చేస్తూ బాడీని ఫిట్ గా తయారు చేసుకుంటున్నారు. సాధారణంగా ఇలాంటి కసరత్తులు హీరోలు చేస్తుంటారు. అలాంటిది ఇద్దరు పిల్లల తల్లి అయిన నటి స్నేహ చేస్తుండడం విశేషం. దీంతో ఆమె నేటి యువ హీరోలకు సవాల్ విసురుతున్నరా లేక ఆమె సహా నటీమణులకు తన సత్తాను చాటుతున్నారాఅన్న ప్రశ్న సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తం మీద నటి బాడీ బిల్డ్ దృశ్యాలు ఇప్పుడు సామాద్యక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: హ్యాపీ గార్డెనింగ్ -
తాతా–మనవడు
తాతకు మనవడు దగ్గులు నేర్పించకూడదు కానీ జిమ్‌లో వర్కవుట్ ఎలా చేయాలో నేర్పించవచ్చు. ఇక్కడ ఫొటోలో ఉన్నది అదే. 77 ఏళ్ల అమితాబ్ బచ్చన్ ఈ వయసులో కూడా ఆరోగ్యానికి ముఖ్య ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇంట్లో ఉన్న జిమ్‌లో వ్యాయామాలు తప్పక చేస్తారు. లాక్డౌన్ వేళ అందరూ బద్దకంగా ఉండకుండా వ్యాయామాలు చేయమని పిలుపు ఇచ్చారాయన. ఇప్పుడు తన మనవడు అగస్త్య నందాతో వ్యాయామం చేస్తూ అద్దంలో తామిద్దరి ప్రతిబింబాన్ని చూస్తూ సెల్ఫీ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు ‘ఫిట్నెస్ కోసం ఫైట్ చేద్దాం... ఫైట్ చేసి ఫిట్నెస్ సాధిద్దాం’ అని క్యాప్షన్ రాశారు. తాత స్లీవ్‌లెస్ టీ షర్ట్ ధరించి ఉంటే మనవడు తన టీ షర్ట్‌ను తాతకు సమానంగా భుజాల దగ్గర మడిచాడు. శ్వేతాబచ్చన్ నందా– నిఖిల్ నందాల కుమారుడు అగస్త్య. శేతా బచ్చన్‌కు నవ్య అనే కుమార్తె కూడా ఉంది. ఇక కొడుకు అభిషేక్– కోడలు ఐశ్వర్యల ద్వారా అమితాబ్‌కు మనవరాలు ఆరాధ్య ఉన్న సంగతి తెలిసిందే. -
కరోనా: నిబంధనలు ఉల్లంఘించిన హీరో!
ముంబై: చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. రోజురోజుకీ దీని ప్రభావం మరింతగా ప్రబలుతోంది. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ప్రజలకు సూచనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను ఆయన ఉల్లంఘించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, జిమ్‌లను మూసి వేయాలని నిబంధనలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే షాహిద్ కపూర్ ఆ నిబంధనలకు విరుద్ధంగా బాంద్రాలోని యాంటీ గ్రావిట్ క్లబ్లో మూసి ఉన్న జిమ్‌ను తెరిచి మరీ వ్యాయామం చేశారు. ఆ సమయంలో భార్య మీరా కూడా ఆయనతో పాటు ఆ జిమ్‌లో ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మూసివేసిన జిమ్‌ను సాయంత్ర సమయంలో తెరిచి ఈ హీరో వ్యాయామం చేసినట్లు పేర్కొంది. కాగా ఈ విషయం మీడియాకు తెలియడంతో జిమ్ వెనకవైపు ఉన్న డోర్ నుంచి వారు వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ విషయం గురించి జిమ్ యజమాని జయసింగ్ మాట్లాడుతూ.. షాహిద్ కపూర్ తనకు మంచి స్నేహితుడని.. జిమ్ దగ్గరకి షాహిద్ వర్క్ చేయానికి రాలేదని అన్నారు. షాహిద్ తనతో మాట్లాడటానికే జిమ్‌కు వచ్చాడని జయసింగ్ తెలిపాడు. -
బామ్మ ఫిట్‌నెస్‌కు నెటిజన్ల ఫిదా..
టొరంటో : 73 ఏళ్ల మహిళ అంటే శక్తి ఉడిగిన స్ధితిలో మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారనుకునే వారిని ఈ బామ్మ షాక్‌కు గురిచేస్తుందనే చెప్పాలి. కెనడాలోని ఒంటెరియాకు చెందిన 73 ఏళ్ల వృద్ధురాలు జాన్ మెక్‌డొనాల్డ్ కండలు తీరిన దేహంతో ఔరా అనిపిస్తున్నారు. గతంలో అధిక బరువున్న జాన్ హైబీపీ, కొలెస్ర్టాల్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకునేవారు. 198 పౌండ్ల బరువుండే జాన్ మెక్‌డొనాల్డ్ నిత్యం కసరత్తులు, వ్యాయామాలతో ఏకంగా 50 పౌండ్లు తగ్గి కండలు తిరిగిన దేహాన్ని సొంతం చేసుకున్నారు. View this post on Instagram 3 years ago I began this long, slow journey and now I realize that there really isn’t any end to it. Each day I move in a direction based on my choices. Each month is a new milestone. Each year I seem to have changed so completely I think I can’t change any more and yet I do.💕💕 At this point, I truly realize that we are limitless. At any moment we can make a decision to change. No matter how difficult or challenging life is, we must remain steadfast in our aim and keep inching forward. When I got started I never imagined I’d be where I am today. I just wanted to get my health back and get off my medication. Each door we step through leads to another door and then another. I hope you all keep choosing to grow! To learn to love yourself, take the best care of yourself, and dare to dream and love with your whole heart again.🙏🙏 . Pink outfit by @womensbest . . #transformation #hope #justdoit. A post shared by Joan MacDonald (@trainwithjoan) on Feb 8, 2020 at 1:10pm PST బరువులు ఎత్తడంతో పాటు తాను జిమ్ చేస్తున్న ఫోటోలతో ఆమె ఫిట్‌నెస్‌పై ఏకంగా ఇన్స్టాగ్రాం పేజ్‌ను నిర్వహిస్తున్నారు. తాను సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు అమినో యాసిడ్స్, ప్రొటీన్ షేక్స్ వంటి సప్లిమెంట్స్‌ను తీసుకుంటానని ఆమె చెబుతున్నారు. ఈ బామ్మ ఇన్‌స్టా పేజీకి ఇప్పుడు 5,00,000 మంది ఫాలోయర్లు ఉండటంతో ఈ సీనియర్ బాడీబిల్డర్ సోషల్ మీడియా సెలబ్రిటీ అయ్యారు. View this post on Instagram Transformation isn’t just about losing weight. Transformation can be about so much more! Certainly this has been my long, slow journey.💕💕 On the left I was visiting my own mother in a nursing home and seeing her health rapidly deteriorating. It absolutely broke my heart, and yet it was also frustrating to see her just accept her fate and refuse to fight to make things better. When my own daughter reached out to me and offered to help, it was like coming full circle. I was at a real cross roads. Do I follow in the footsteps of my mother, or do I try to break free of the cycle and create a different outcome for myself. I know so many of you want to know about the diet and the training, but what I can’t stress enough to you, is the importance of developing your mind. Throughout the past 3 years I have been deeply challenged, many times in tears 😭,and feeling like I was so slow to learn, BUT I did not give up. 👵🏼👵🏼. Since I started this journey 3 years ago I’ve learned to use an I-phone, I’ve learned to use apps (though they still seem complicated to me!) I’m even learning a new language (Spanish!). I’ve learned to be more confident in front of a camera and trust myself at interviews, and I’ve just gained so much more confidence and optimism about making my life better in general. Even my relationship with my husband has improved because I’m just a happier person. 🥰 That’s a pretty wonderful place to be this late in the game. 🙏 So, for those of you think more about losing weight, I am telling you, sometimes the weight we need to lose is more than the pounds on the scale. Sometimes we need to lose our negative self-talk, our feelings of failure, our lack of confidence in ourselves and in the world. Sometimes it’s the internal transformation that is its own best reward. I hope you learn to choose to be happy! With love Joan 💕 A post shared by Joan MacDonald (@trainwithjoan) on Feb 16, 2020 at 6:25am PST చదవండి : వందేళ్ల వృద్ధురాలి బర్త్‌డే విష్ తెలిస్తే షాక్! -
కండలపై ఇష్టం... కిడ్నీకి కష్టం!
సలీం (పేరు మార్చాం) 24 ఏళ్ల ఈ యువకుడు హైదరాబాద్‌లోని ఒక జిమ్‌లో కోచ్‌గా పనిచేస్తున్నాడు. అథ్లెటిక్ లుక్ కోసం అతను నోటి నుంచి తీసుకునే సహజ సిద్ధమైన ఆహారాన్ని పూర్తిగా మానేశాడు. గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్లు, మల్టీ విటమిన్లు కలిగిన అధిక ప్రోటీన్ తీసుకున్నాడు. మూడు నెలలు గడిచాక అతను పూర్తిగా నీరసించిపోయాడు. పరీక్షలు చేయించగా, కిడ్నీలు ఫెయిల్ అయినట్లు నిర్ధారించారు. శ్రీనివాస్... ఇతనో సాఫ్ట్వేర్ ఇంజనీర్... వయస్సు 50 ఏళ్లు. బరువు తగ్గడం, కండరాలు పెంచడం కోసం ఇతను విచక్షణారహితంగా స్టెరాయిడ్స్ సప్లిమెంట్లు వాడాడు. రెండు నెలల తర్వాత అతను బరువు తగ్గినా, కిడ్నీలు దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు. సాక్షి, హైదరాబాద్: సిక్స్ ప్యాక్, బాడీ బిల్డింగ్, బరువు తగ్గడం... ఇలాంటి లక్ష్యాలతో అనేకమంది యువకులు జిమ్‌లలో చేరుతుంటారు. లక్ష్యం మంచిదే, వాటికోసం ఎక్కువ నెలల సమయం తీసుకోవాలి. కానీ రాత్రికి రాత్రే సిక్స్ ప్యాక్ సాధించాలని, కండలు పెంచాలని, కేజీల కొద్దీ బరువు తగ్గాలని కోరుకుంటున్నారు. దీనికోసం జిమ్‌లలో వ్యాయామాలు చేస్తూ, వైద్యులను సంప్రదించకుండానే ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్స్ వాడడం, ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకోవడంతో రోగులుగా మారుతున్నారు. కొందరైతే కిడ్నీలు ఫెయిలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొన్ని జిమ్ సెంటర్లు స్వల్ప సమయంలోనే బరువు తగ్గిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. మూడు నాలుగు నెలల్లో సిక్స్ ప్యాక్ సాధించేలా శిక్షణ ఇస్తామని చెబుతున్నాయి. దీనికోసం కొన్ని జిమ్ సెంటర్లు ప్రోటీన్ పౌడర్లను, స్టెరాయిడ్స్‌ను అనధికారికంగా అలవాటు చేస్తున్నాయి. 10 మందిలో ఒకరు స్టెరాయిడ్స్ వినియోగం రాష్ట్రంలో జిమ్‌లకు వెళుతున్న ప్రతీ పది మంది లో ఒకరు స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్లు, ప్రొటీన్లు వాడుతున్నారని నెఫ్రాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక వెయిట్ లిఫ్టర్లు, బాడీ బిల్డర్లలో 40 శాతం మంది వీటిని విచ్చలవిడిగా వాడుతున్నారని తేలింది. సహజ సిద్ధంగా చికెన్, మటన్, గుడ్లు వంటి వాటి ద్వారా ప్రొటీన్లు పొందవచ్చు. కానీ చాలామంది అలా చేయడం లేదు. తక్కువ సమయంలో శరీర సౌష్టవాన్ని సాధించాలన్న దురాశతో మోతాదుకు మించి ప్రొటీన్ పౌడర్లు, స్టెరాయిడ్లు వంటి వాటిని వాడుతుండటం వల్లే సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు ఎక్కువసేపు జిమ్‌లో గడిపి శక్తికి మించి బరువులెత్తడం, ఆ తర్వాత ఒళ్లు నొప్పులంటూ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు అంటున్నారు. అనాబాలిక్–ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్‌ను తరచుగా బాడీబిల్డర్లు, వెయిట్‌లిఫ్టర్లు ఆహార పదార్ధాలుగా ఉపయోగిస్తున్నారని ‘బీఎంసీ నెఫ్రాలజీ’అనే బ్రిటిష్ జర్నల్ తాజాగా ప్రచురించింది. హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) లెక్కల ప్రకారం ప్రతి మనిషి రోజుకు 2,400 కేలరీల ఆహారం తీసుకోవాలి. జిమ్‌లకు వెళ్లే వారు ప్రొటీన్ పౌడర్ల ద్వారా రోజుకు 80 నుంచి 100 గ్రాములకు మించి ప్రోటీన్లు తీసుకుంటున్నారు. ఫలితంగా కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయని ఎన్ఐఎన్ వర్గాలు చెబుతున్నాయి. అత్యాశ వల్లే సమస్యలు సిక్స్ ప్యాక్, బాడీ బిల్డింగ్ కోసం అనేక మంది యువకులు జిమ్‌లకు వెళుతున్నారు. వాటిని సాధించాలంటే రెండు మూడేళ్ల సమయం తీసుకోవాలి. క్రమశిక్షణతో ఒక ప్రణాళిక ప్రకారం చేయాలి. కానీ మూడు నెలల్లోనే సాధించాలన్న భావనతో అనేక మంది యువకులు ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నారు. స్టెరాయిడ్స్, ప్రొటీన్లు, పెయిన్ కిల్లర్స్‌ను మోతాదుకు మించి అవగాహనా రాహిత్యంతో వాడుతున్నారు. సాధారణంగా ప్రోటీన్లు చికెన్, మటన్ ద్వారా పొందవచ్చు. కానీ అవసరానికిమించి ప్రొటీన్ పౌడర్లు వా డుతుండటంతో కిడ్నీలపై భారం పడుతుంది. – డాక్టర్ టి.గంగాధర్, నెఫ్రాలజిస్టు, నిమ్స్ న్యూట్రా విజిలెన్స్ లేనేలేదు మార్కెట్లోకి ప్రొటీన్ ప్రొడక్టులు విపరీతంగా వస్తున్నాయి. స్పోర్ట్స్, బాడీ బిల్డింగ్ ఇలా అవసరానికి తగ్గట్లు ఉత్పత్తులు వస్తున్నాయి. వాటిమీద నియంత్రణ లేనేలేదు. పైగా క్లినికల్ టెస్టెడ్ అంటూ వాటిపై ముద్రించుకుంటున్నాయి. అంతేకాదు ఎన్ఐఎన్ రికమండెడ్ అని కూడా కొన్ని వస్తున్నాయి. ఎన్ఐఎన్ ఏ సంస్థకూ రికమండ్ చేయలేదనే విషయం స్పష్టం చేస్తున్నాను. వీటిని వాడడం వల్ల కిడ్నీలు పాడవుతున్నాయి. ప్రోటీన్ ఉత్పత్తులను నియంత్రించేందుకు ‘న్యూట్రా విజిలెన్స్’ అవసరముంది. – డాక్టర్ బి.దినేశ్‌కుమార్, శాస్త్రవేత్త, ఎన్ఐఎన్, హైదరాబాద్ -
ఓ మై గాడ్ అంటున్న సమంత..
యంగ్ హీరో నాగశౌర్య.. జిమ్‌లో భారీగానే కసరత్తులు చేస్తున్నాడు. సినిమాలో లుక్కు సంబంధించి.. బాడీని అనువుగా మార్చుకునేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన లుక్‌ను ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘డాడీ నన్ను ఈ పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయమన్నారు. నేను క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేసేలోపు నన్ను తిట్టి.. ఏ క్యాప్షన్ లేకుండా పోస్ట్ చేపించారు’ అని నాగశౌర్య పేర్కొన్నారు. అయితే ఈ ఫొటోపై ప్రముఖ హీరోయిన్ సమంత స్పందించారు. ఓ మై గాడ్.. వాట్ ఈస్ దిస్ క్రేజీనెస్ అంటూ నాగశౌర్య పోస్టుపై కామెంట్ చేశారు. ప్రస్తుతం నాగశౌర్య షాకింగ్ లుక్ ఫొటో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఏడాది నాగశౌర్య, సమంత జంటగా నటించిన ‘ఓ బేబీ’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తన సొంత బ్యానర్లో.. రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అశ్వథామ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. -
బోసు బాల్.. వర్కవుట్ వెల్
సాక్షి, సిటీబ్యూరో: విభిన్న రకాల వ్యాయామాలు చేయడానికి వన్‌స్టాప్ ఎక్విప్‌మెంట్‌లా ఉపకరిస్తుంది ఈ బోసుబాల్.పాశ్చాత్య దేశాల్లో విరివిగా వినియోగిస్తున్న ఈ బాల్నిఇటీవల నగరంలోని జిమ్స్‌లోనూ బాగానేఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘బోసుబాల్’ గురించి కొన్ని విశేషాలు.. దీనినే ‘స్టెబిలిటీ బాల్’ అని కూడా అంటారు. దీనికి ప్లాస్టిక్ బేస్ ఉంటుంది. ఒకవైపు ఫ్లాట్‌గా మరోవైపు ఉబ్బుగా ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే బాల్ని మధ్యలో కోసినట్టు అన్నమాట. వర్కవుట్ సమయంలో రెండువైపులా దీనిని ఉపయోగించవచ్చు. దీని ఖరీదు బ్రాండ్‌ని బట్టి రూ.15 వేల నుంచి రూ.40వేల వరకూ ఉంది. దీన్ని ప్రారంభించిన తొలినాళ్లలో బ్యాలెన్సింగ్ కోసం ప్లాట్ గా ఉండేవైపున తొలుత సాధన చేయాలి. లాభాలు ఎన్నో.. ♦ సాధారణ వ్యాయామాలను కూడా మరింత చాలెంజింగ్‌గా, ఇంకాస్త కఠినంగా మారుస్తుందీ బాల్. ♦ దీని రౌండెడ్ టాప్ వల్ల అబ్డామినల్,బ్యాక్ స్ట్రెచెస్కు మంచి సపోర్ట్ ఇస్తుంది. ♦ ఫ్లాట్‌గా ఉన్న వైపు కాకుండా రెండోవైపు చేయడం ద్వారా బ్యాలెన్స్ ట్రైనింగ్‌కి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ♦ జిమ్‌లో కొన్ని వ్యాయామాల వల్ల అయిన గాయాల నుంచి కోలుకోవడానికి బ్యాక్ పెయిన్ సమస్యకు కూడా ఉపకరిస్తుంది. ♦ మజిల్ మీద మన నియంత్రణ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఉదాహరణకు ఒక స్నేహితుడి భుజం మీద మన చేయి సుతారంగా వేయడం కాకుండా ఆ భుజం మీద పూర్తిగా దాన్ని పడేయడం లాంటివి చేయనీయకుండా ఇది మజిల్ కాంట్రాక్షన్స్ను ఇంప్రూవ్ చేసుకునేలా చేస్తుంది. ♦ మిగిలిన జిమ్ పరికరాల్లా కాకుండా విభిన్న రకాల వ్యాయామాలు చేయవచ్చు. ♦ బాల్కి ఉన్న అడుగు భాగంలోని ఇన్ బ్యాలెన్స్ కారణంగా మనకే తెలియని మన దేహంలోని చిన్న చిన్న కండరాలను కూడా బలోపేతం చేస్తుంది. ♦ శరీరంలో ఫ్లెక్సిబులిటీని పెంచి కోర్ మజిల్స్‌ని నిర్మిస్తుంది. ♦ దీనితో కాళ్ల నుంచి చేతుల దాకా అన్ని రకాల వ్యాయామాలు చేయవచ్చు. బాదంతోముడతలు మాయం! సాక్షి,సిటీబ్యూరో: విభిన్న రకాల ఆహారపు అలవాట్లు మన చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్టు ఓ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా స్నాక్స్‌గా తీసుకునే చిరుతిళ్లు చర్మంపై ముడతల వృద్ధికి కారణమవుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తేల్చారు. ఈ సర్వే ఫలితాలను ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా విడుదల చేసింది. విభిన్న చర్మపు తత్వాలు కలిగిన మధ్య వయసు మహిళలను ఎంచుకుని పలు రకాల ఆహార పదార్థాలు వారికి అందించి మొత్తం 16 వారాల పాటు ఈ పరిశోధన నిర్వహించారు. దీనిలో భాగంగా హై రిజల్యూషన్ కెమెరాలతో ముడతల పరిమాణాల్ని పరిశీలించారు. తగినంత గింజధాన్యాలు, ముఖ్యంగా బాదం పప్పులు వంటివి ఆహారంలో భాగం చేసిన మహిళల చర్మంపై ముడతల వృద్ధి ఆగిపోవడమే కాక వాటిలో 9 శాతం వరకూ తగ్గుదల కనిపించిందని పరిశోధకులు వెల్లడించారు. -
ఆన్లైన్లోనే రిమ్‘జిమ్’
‘‘ఫిట్నెస్ సెంటర్ల ఏర్పాటు సమయంలో అందరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక్కో జిమ్‌కు దాదాపు 20 రకాలఉపకరణాలు తీసుకున్నారు. త్రెడ్మిల్, డెంబెల్స్తో పాటు ఆధునిక సైక్లింగ్, ప్లేట్‌స్టాండ్, ట్రైస్టర్, ట్విస్టర్స్, ఫోర్‌స్టేషన్ మల్టీ జిమ్, ఇంక్లైన్, డిక్లైన్ బెంచ్ వంటివి వీటిలో ఉన్నాయి. మహిళలకుప్రత్యేకంగా కొన్ని సెంటర్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలు కూడా చేసినప్పటికీ అవి అందుబాటులోకి రాలేదు. అన్ని జిమ్‌లలో ఉచిత వైఫై, సీసీకెమెరాలు కూడా సమకూర్చాలనుకున్నా అమలుకు నోచుకోలేదు.’’ సాక్షి,సిటీబ్యూరో: ప్రైవేట్ జిమ్‌లకు వెళ్లే స్తోమత లేనివారి కోసం.. ముఖ్యంగా బస్తీల్లోని యువత సైతం ఫిట్నెస్ పెంచుకునేందుకు, వివిధ క్రీడాంశాలకు అవసరమైన దేహదారుఢ్యానికి ఉపయోగపడతాయనే తలంపుతో జీహెచ్ఎంసీ గ్రేటర్‌లోని వివిధ సర్కిళ్లలో 135 ఆధునిక జిమ్ కేంద్రాలు (ఫిట్నెస్ సెంటర్లు) ఏర్పాటు చేసింది. పరికారాలకు రూ.3.52 లక్షలు, సదుపాలకు ఇంకొంత వెరసి ఒక్కో సెంటర్‌కు దాదాపు రూ.7 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇలా అన్ని సెంటర్లకు దాదాపు రూ.10 కోట్ల వరకు వెచ్చించారు. వీటి నిర్వహణ బాధ్యతలు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, యూత్ అసోసియేషన్లు చూడాలని నిర్దేశించారు. కానీ చాలా ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల అనుయాయుల చేతిలోనే ఇవి ఉన్నాయి. నిర్వహణను గురించి పెద్దగా పట్టించుకుంటున్న వారు లేరు. అనేక ప్రాంతాల్లో విలువైన క్రీడాపరికరాలు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. స్వల్ప మరమ్మతులు సైతం చేసేవారు లేక నిరుపయోగంగా మారాయి. దీంతో బల్దియా ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. కొన్ని పరికరాలు ఎక్కడకు తరలాయో తెలియని పరిస్థితి. మార్గదర్శకాల మేరకు నిర్వహణ బాధ్యతలు స్వీకరించే అసోసియేషన్ జీహెచ్ఎంసీతో ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు రూ.25 వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. సభ్యత్వానికి నెలకు ఒక్కొక్కరి నుంచి రూ.200 రుసుం వసూలు చేయాలి. సభ్యత్వాల ద్వారా వసూలయ్యే మొత్తం ఫీజులో 10 శాతం జీహెచ్ఎంసీకి చెల్లించాలి. కానీ.. 135 అధునాతన జిమ్‌లలో కేవలం గాంధీనగర్ వార్డులోని జిమ్‌కు మాత్రం అక్కడి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఒప్పందం మేరకు జీహెచ్ఎంసీకి చెల్లింపులు చేస్తోంది. ఆ ఒక్కటి మినహా ఎక్కడా నిర్వహణ సరిగా లేదు. ఈ నేపథ్యంలో నిర్వహణను జీహెచ్ఎంసీయే చేపట్టాలని భావించింది. అంతేకాకుండా సభ్యత్వ ఫీజుల వివరాలు కచ్చితంగా తెలిసేందుకు.. ఎంతమంది వినియోగించుకుంటున్నదీ తెలిసేందుకు సభ్యత్వ నమోదు, ఫీజు వసూలు కూడా ఆన్లైన్ ద్వారా చేయాలని భావించింది. గతేడాది నుంచి జీహెచ్ఎంసీ క్రీడామైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్‌పూల్స్ వినియోగానికి సభ్యత్వ రుసుం, బుకింగ్‌ల కోసం ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆధునిక జిమ్‌ల సభ్యత్వం, ఫీజులకు కూడా ఇదే విధానం మేలైనదిగా భావించి ఈమేరకు ప్రతిపాదనలను స్టాండింగ్ కమిటీ ముందుంచగా, అందుకు ఆమోదం తెలిపింది. త్వరలో ఈ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. నిర్వహణ బాధ్యతలు, తదితరమైనవి సంబంధిత సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. -
ఫిట్ ఫంక్షన్
సిటీ ‘రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్’ అనిపాడేస్తోంది. పెరుగుతున్న ఫిట్నెస్ క్రేజ్‌కి తగ్గట్టుగా వందల సంఖ్యలో వెలుస్తున్న ఫిట్నెస్ స్టూడియోలు జిమ్ కల్చర్‌ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. దీనిలో భాగంగానే నగరవాసులను ఉర్రూతలూగిస్తోంది‘ఫంక్షనల్ ట్రైనింగ్’. సాక్షి,సిటీబ్యూరో: జిమ్ అంటే ట్రెడ్ మిల్, క్రాస్ ట్రైనర్ వంటివాటితో చేసే కార్డియో వాస్క్యులర్ వ్యాయామాలు, వెయిట్స్తో చేసే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కవుట్స్ వంటివే ఉంటాయి. దీనికోసం ఎన్ని మెషిన్లు ఉంటే అంత గొప్ప జిమ్‌గా చెబుతుంటారు. కానీ గత నాలుగైదేళ్లుగా పెరిగిన ఆరోగ్య స్పృహ, మారుతున్న సిటీజనుల ఆసక్తులు వీటికి తోడు అందుబాటులోకి వచ్చిన అంతర్జాతీయ శైలి వర్కవుట్స్ సిటీలో వ్యాయామ సరళి రోజు రోజుకూ మారిపోతోంది. జిమ్స్‌లో కొత్త కొత్త వర్కవుట్స్ పరిచయం చేయడానికి తోడు ప్రత్యేకమైన వ్యాయామ శైలుల కోసమే ఫిట్నెస్ స్టూడియోలు ఏర్పాటవుతున్నాయి. అలాంటి కోవలోనే ఇప్పుడు ‘ఫంక్షనల్ ట్రైనింగ్’ వచ్చి చేరింది. రొటీన్ వర్క్.. నాట్ అవుట్ తమ రోజువారీ పనులను మరింత శక్తివంతంగా, సామర్థ్యంతో చేయాలని, అలసట రాకూడదని సిటీజనులు కోరుకుంటున్నారు. ఇదే ఫంక్షనల్ ట్రైనింగ్‌కి ఊపునిస్తోంది. దీనికోసం డిజైన్ చేసిన వ్యాయామాలు మన రోజువారీ కార్యకలాపాలు మరింత సులభతరం చేసేలా ఉంటాయి. యాక్టివిటీ బియాండ్ వర్కవుట్ అంటే వర్కవుట్‌కి అవతల చేసే యాక్టివిటీ అని ఫంక్షనల్ ట్రైనింగ్‌ని నిర్వచించవచ్చు. బైసప్ వర్కవుట్ అంటే నడుము దగ్గర్నుంచి చేతులతో బరువులు ఎత్తుతాం. అయితే రోజువారీ పనుల్లో అది మనకు ఏ రకంగానూ ఉపకరించదు. అదే నేల మీద పడి ఉన్నవి తీయడం, వంగుని షూ లేస్ కట్టడం, ఒక డోర్‌ని బలంగా తోసి ఓపెన్ చేయడం.. ఇవన్నీ మనకు రోజువారీ పనుల్లో భాగంగా ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ శిక్షణ డిజైన్ చేశారు. ఈ సాధనలో బరువులు ఎత్తడం మీద తక్కువ.. కదలికలపై ఎక్కువగా దృష్టి పెడతారు. దీనిలో భాగంగా మనం రోజూ చేసే వాకింగ్ లాంటివి కూడా మరింత వేగంగా విభిన్నంగా చేయిస్తారు. కాస్త బరువైన వస్తువును లేపుతూ స్క్వాటింగ్ చేయడం, ఒక కుర్చీలోకి ఎక్కి దిగడం, ఒక డోర్‌ను బలంగా తోయడం సైతం ఇందులో సాధన చేయిస్తారు. ఖర్చు లెస్.. లాభం ప్లస్ ఒక క్రీడకు సన్నద్ధం అవడంఎలాగుంటుందో అలాంటి వ్యాయామాలు ఈఫంక్షనల్ ట్రైనింగ్‌లో ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఈ శిక్షణ ఇచ్చే ఫిట్నెస్ స్టూడియోలకు వ్యయం కూడా తక్కువగా ఉంటోంది. దీంతో సభ్యత్వ రుసుం కూడా తక్కువగానే వసూలు చేస్తున్నారు. సిటీలో ఎఫ్ 45, ఫిట్టింగ్ రూమ్ (హై ఇంటెన్సిటీ వర్కవుట్స్),కల్ట్ వంటి ఫిట్నెస్ సెంటర్స్ ఫంక్షనల్ ట్రైనింగ్‌కి చిరునామాగా పేరొందాయి. మల్టీ బెని‘ఫిట్స్’ ఈ ఫంక్షనల్ వర్కవుట్‌లో స్క్వాట్స్, లంజెస్, డెడ్ లిఫ్టŠస్ పుషప్స్, ప్లంక్స్.. వంటివి కలగలసి ఉంటాయి. మల్టీ జాయింట్స్ కదిలేలా అత్యధిక ఫంక్షనల్ ట్రైనింగ్ కదలికలు ఉంటాయి. శరీరం ముందుకీ, వెనక్కీ ఇరు పక్కలకీ కిందకీ పైకీ.. ఇలా విభిన్న రకాల కదలికలు మరింత వేగంగా సులువుగా చేయగలిగేలా ఈ శిక్షణ ఉంటుంది. ఫ్రీ వెయిట్స్తో పాటు కొన్ని ప్రత్యేకమైన పరికరాలు వినియోగిస్తారు తప్ప ఎటువంటి మెషీన్లూ ఉండవు. ‘మెషీన్ల ద్వారా చేసే వ్యాయామాల్లో ఒక రిథమ్ ఉంటుంది. అవి ఒకటి రెండు ప్రత్యేక శరీర భాగాలను మాత్రమే కదలిస్తాయి. ఉదాహరణకు లెగ్ ఎక్సటెన్షన్ మెషిన్ని తీసుకుంటే అది తొడలోని ముందు కండరాలను మాత్రమే కదుపుతుంది. నిజానికి దాన్ని మనం రోజువారీ పనుల్లో ఎక్కువగా వినియోగించం. కోర్ మజిల్స్‌ని బాగా వినియోగిస్తాం. కానీ ఈ మెషీన్ల ద్వారా కోర్ మజిల్‌కి వర్కవుట్ అందదు’ అని ఫిట్నెస్ ట్రైనర్ గంధం విజయ్ చెప్పారు. వ్యాయామం.. జర భద్రం సాక్షి, సిటీబ్యూరో: భుజాలు జారిపోవడం, మోకాళ్లు అరిగిపోవడం, వెన్నుపూస వంగిపోవడం.. వంటి కీళ్ల సమస్యలు ఇప్పుడు నగర వాసుల్లో సాధారణంగా మారిపోయాయంటున్నారు జూబ్లీహిల్స్‌లోని రీజెన్ ఆర్థో స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మొవ్వా వెంకటేష్. ఆధునిక జీవనశైలి తెచ్చిపెడుతున్న సమస్యలు, తాజాగా అందుబాటులోకి వచ్చిన స్టెంసెల్ చికిత్స గురించి ఆయన చెబుతున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. స్లో వర్క్.. స్పీడ్ వర్కవుట్ కీళ్ల సమస్యలు బాగా శారీరక శ్రమకు గురయ్యే వారికి.. ముఖ్యంగా క్రీడాకారులకే వచ్చేవి. అందుకే ‘స్పోర్ట్స్ ఆర్థో’ పేరుతో ప్రత్యేక వైద్యసేవలూ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు క్రీడాకారుల తరహాలోనే నగరంలో ప్రతి ఒక్కరిలోనూ ఆర్థో సమస్యలు సాధారణమయ్యాయి. ఏసీ గదుల్లో దీర్ఘకాలం కూర్చోవడం, శారీరక శ్రమ లేని జీవనశైలితో ఆస్టియో ఆర్థరైటిస్ విజృంభించింది. ఇప్పుడు పెరిగిన ఆరోగ్య స్పృహ సమస్యలకు కారణమవుతోంది. జిమ్‌లో ట్రైనర్ చెప్పాడని ఎలా పడితే అలా వ్యాయామాలు చేయడంతో సంసిద్ధంగా లేని శరీరం ఎదురు తిరుగుతోంది. భుజాలు పట్టు తప్పడం, వెన్నుపూస డిస్క్ అరిగిపోవడం, కీలు అరిగిపోవడం వంటివి వస్తున్నాయి. నివారణకు శరీర పనితీరుతో పాటు చికిత్సలపైనా అవగాహన అవసరం. 29న హాఫ్ మారథాన్ హృద్రోగ సంబంధ వ్యాధులపై నగరవాసుల్లో అవగాహన పెంచేందుకు ఓ ఆంగ్ల దినపత్రిక ఆధ్వర్యంలో ‘హాఫ్ మారథాన్’ తలపెట్టారు. ఈ నెల 29న సంజీవయ్య పార్కులో ఇది జరుగనుంది. తెల్లవారుజామున 4 నుంచి 10 గంటల వరకూ 3 కి.మీ, 5 కి.మీ, 10 కి.మీ, 21 కి.మీ విభాగాల్లో రన్ ఉంటుంది. 28న హెల్త్ అండ్ ఫిట్నెస్ రిట్రీట్ నగరానికి చెందిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ దినాజ్ వర్వత్వాలా ఆధ్వర్యంలో హెల్త్ అండ్ ఫిట్నెస్ రిట్రీట్ బై దినాజ్ ఫిట్నెస్ పేరిట ఈవెంట్ నిర్వహిస్తున్నారు. నగరంలోని ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్స్‌లో ఈ కార్యక్రమం ఉంటుంది. రేపు బూట్ క్యాంప్ నగరంలోని 360 డిగ్రీ జిమ్ ఆధ్వర్యంలో బూట్ క్యాంప్ ఫిట్నెస్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఫ్యాట్ లాస్కి, మెటబాలిజం పెంచడానికి, సామర్థ్యం సానబెట్టడానికి ప్రత్యేక వ్యాయామ శైలులు సాధన చేయించే ఈ క్యాంప్‌ను ఈ నెలాఖరు వరకూ సోమ, బుధ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు. ‘స్టెమ్‌సెల్’థెరపీఉత్తమం గతంలో కీళ్ల సమస్య అంటే ప్రాధమిక స్థాయిలో నొప్పి నివారణ మందులు, ముదిరిన తర్వాత సర్జరీ ఏకైక పరిష్కారం. ఇప్పుడు స్టెమ్‌సెల్ (మూల కణాల) థెరపీ రాకతో సర్జరీ అవసరం తప్పుతోంది. గాయాలను శరీరంలో సహజంగానే ఉత్పత్తి అయ్యే స్టెమ్‌సెల్ మాన్పుతుంది. ఈ థెరపీలో తొలుత శరీరంలోని ఏదేని భాగం నుంచి మూల కణాలను సేకరించి ల్యాబ్‌లో పరీక్షించాక రోగి శరీరంలో గాయపడిన/లేదా సమస్యకు గురైన ప్రాంతంలోకి ఎక్కిస్తారు. తద్వారా సహజంగానే సదరు కీళ్ల అరుగుదల తగ్గుతుంది. కీళ్ల సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అవసరం. -
లిక్విడ్స్‌తో వర్కవుట్స్
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా వ్యాయామాలు చేసేవారు.. పరగడుపున ఎలాంటి ఆహారం తీసుకోకుండా పరుగులు పెట్టి, తరువాత కఠిన వ్యాయామాలతో దేహదారుఢ్యానికి సానబెడతారు. కానీ, దీని వల్ల త్వరగా లక్ష్యాన్ని చేరలేరంటున్నారు జిమ్ ఎక్స్పర్టులు. ఖాళీకడుపుతో జిమ్ చేయడం కంటే.. వర్కవుట్ల మధ్యలో లిక్విడ్లు తీసుకుంటూ జిమ్ చేసే నయా ట్రెండ్‌ను నగర యువత ఎంజాయ్ చేస్తున్నారు. కాసేపు వర్కవుట్.. కొంచెం ఎనర్జీ లిక్విడ్ తీసుకున్నాక తిరిగి వ్యాయామంపై దృష్టి సారిస్తున్నారు. ఇది వినేందుకే కాదు, చేసేందుకు కూడా కొత్తగా ఉండటంతో పలువురు యువత ఇలాంటి వర్కవుట్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రొటీన్లు దండిగా ఉండే ఈ లిక్విడ్ల వల్ల శరీరానికి ఎలాంటి అలసట రాకపోగా, మంచి శరీరాకృతి మీ సొంతమవుతుందంటున్నారు నిపుణులు. ఈ లిక్విడ్లు ఎందుకు? సాధారణంగా వ్యాయామం చేసేటపుడు శరీరం చాలా శక్తిని కోల్పోతుంది. ఫలితంగా బీపీ, జీవక్రియలు అనూహ్యంగా పెరుగుతా యి. పెరిగిన శరీర ఉష్ణోగ్రతను చల్లబరిచేందు కు శరీరంలోని నీటిని దేహం చెమట రూపం లో విడుదల చేస్తుంది. ఫలితంగా దేహంలోని ఎలక్ట్రోలైట్స్, సోడియం, మెగ్నీషియం, పొటాషియం చెమటతోపాటు బయటికి వచ్చేస్తాయి. ఇది ఎక్కువైతే డీ హైడ్రేషన్గురయ్యే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. అందుకే, అలాంటి ప్రమాదాలు జరక్కుండా శరీరంలో కోల్పోయిన ప్రొటీన్లు, శక్తి, నీటిని భర్తీ చేసేందుకు ఈ ఎనర్జీ డ్రింకులు ఉపయోగపడతాయ ని పలువురు బాడీ బిల్డర్లు చెబుతున్నారు. ఎన్ని రకాలుగా ఉంటాయి..? వర్కవుట్ల మధ్యలో ఎనర్జీ కోల్పోకుండా ఉండాలంటే.. బీసీఏఏ (బ్రాడ్ చెయిన్ అమైనో ఆసిడ్స్) తీసుకోవచ్చని సూచిస్తున్నారు. 20 నిమిషాలపాటు వర్కవుట్లు చేసిన తరువాత 4 నుంచి 6 ఔన్సుల ఎనర్జీ డ్రింకును కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు. లేదా కోకోనట్ వాటర్ లేదా గ్లూకోన్–డి, రెడ్‌బుల్ డ్రింకులను వర్కవుట్ల మధ్యలో తాగొచ్చని సూచిస్తున్నారు. కండరాల పునరుత్తేజం, బలహీనమైన కండరకణాలకు శక్తిని చేకూరుస్తాయి. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి వ్యాయామం మధ్యలో తీసుకునే లిక్విడ్లను ఇంట్రా లిక్విడ్లు అంటారు. ఇవి తీసుకోవడం వల్ల శరీరం త్వరగా అలసిపోదు. పైగా కోల్పోయిన ప్రొటీన్లు ఈ డ్రింకులతో భర్తీ చేయవచ్చు. ఫలితంగా డీ హైడ్రేషన్‌ను నివారించవచ్చు. డీ హైడ్రేషన్ అంటే అంతా వేసవిలోనే జరుగుతుందనుకుంటారు. కానీ, అన్ని కాలాల్లోనూ శరీరం డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలున్నాయి. అందుకే, ఈ ఇంట్రా లిక్విడ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అమైనో ఆసిడ్స్, ప్రొటీన్లు శరీరానికి వేగంగా అందుతాయి. ఎక్కువ మోతాదులో కాకుండా 4 నుంచి 6 ఔన్సులు మాత్రమే ఉండాలి. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే వాంతులవుతాయి. నిపుణుల సమక్షంలో చేస్తే మరీ మంచిది. – జయసింహ, ఫిట్నెస్ ట్రెయినర్ -
ప్రాణాలు తీసిన ఎక్సర్సైజ్
సాక్షి, హైదరాబాద్ : జిమ్‌లో అధిక సమయం ఎక్సర్సైజ్లు చేయడం వల్ల ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పట్టణంలోని ఎస్ ఆర్ నగర్లో చోటు చేసుకుంది. వివరాలు.. పంజాబ్‌కు చెందిన ఆదిత్య నగరంలో డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలం క్రితం ఆదిత్య ఎస్ ఆర్ నగర్‌లోని గోల్డెన్ జిమ్‌లో చేరాడు. రోజులానే సోమవారం ఉదయం జిమ్‌లో చాలాసేపు ఎక్సర్సైజ్ చేస్తూ గడిపాడు. దాంతో ఒక్కసారిగా నీరసించి ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన జిమ్ నిర్వాహకులు ఆదిత్యకు టాబ్లేట్ ఇచ్చారు. టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆదిత్య పరిస్థితి మరింత విషమంగా మారింది. చాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆదిత్యని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లు నిర్థారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదిత్య మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. జిమ్‌లో అధిక సమయం ఎక్సర్సైజ్ చేయించడం వల్లే ఆదిత్య చనిపోయాడని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు. అంతేకాక గోల్డెన్ జిమ్‌పై ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఊహించని విరామం
‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్లాన్ కాస్త మారింది. ఎందుకంటే హీరో రామ్‌చరణ్ జిమ్‌లో గాయపడ్డారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్). డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌కి జోడీగా విదేశీ నటి డైసీ ఎడ్గర్ జోన్స్, రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ పూణెలో జరగాల్సి ఉంది. రామ్‌చరణ్ గాయపడటం వల్ల వాయిదా పడింది. ‘‘మంగళవారం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో రామ్‌చరణ్ (చీలమండ) గాయపడ్డారని తెలియజేయడానికి బాధపడుతున్నాం. ప్రస్తుతానికి ఫుణె షెడ్యూల్ లేదు. మూడు వారాల తర్వాత యాక్షన్ తిరిగి ప్రారంభం అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని 2020 జూలై 30న విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఐస్‌క్రీమ్ కోసం జిమ్
ఐస్‌క్రీమ్‌ని ఇష్టపడని వారుండరు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఎవరికైనా సరే ఐస్‌క్రీమ్‌ని చూడగానే నోరూరాల్సిందే. నేనూ దానికి మినహాయింపేం కాదు అంటున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఐస్‌క్రీమ్ మీద తనకున్న ప్రేమను కాజల్ పంచుకుంటూ – ‘‘సాధారణంగా షూటింగ్స్ కోసం చాలా ప్రదేశాలు తిరుగుతుంటాను. ఎన్ని చోట్లు తిరిగినా కూడా నాతో పాటు ఎప్పుడూ ఉండేది మాత్రం ఐస్‌క్రీమే. నా రూమ్ ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేస్తే ఫస్ట్ కనపడేవి ఐస్‌క్రీమ్స్. కొన్ని విషయాలు ఫ్యామిలీ పరంగా వస్తాయి అంటుంటారు కదా.. ఈ ఐస్‌క్రీమ్ అబ్సెషన్ కూడా అలాంటిదేనేమో. మా ఇంట్లో అందరూ ఐస్‌క్రీమ్‌ను బాగా ఇష్టంగా తింటాం. ఫిట్‌గా ఉండాలంటే ఎక్కువ ఐస్‌క్రీమ్‌లు తినకూడదని అంటుంటారు. కానీ నేను మాత్రం ఐస్‌క్రీమ్ కోసం ఇంకొంచెం సేపు జిమ్‌లో ఎక్కువ కష్టపడతాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా, ‘క్వీన్’ తమిళ రీమేక్‌లో నటిస్తున్నారీ బ్యూటీ. -
ప్యాకప్ కే బాద్
రామ్ చరణ్ ఏదైనా జోక్ చెప్పారా? లేక వర్కౌట్స్ సెషన్స్‌లో ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా? ఇలాగే డౌట్స్ వస్తాయి కదూ... పక్కనున్న ఫొటోలో బాగా నవ్వుతున్న హీరోయిన్ కియారా అద్వానీని చూస్తే. ఇంతకీ చరణ్, కియారా వర్కౌట్స్ చేస్తోంది ఎక్కడో తెలుసా? థాయిలాండ్‌లో. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. షూటింగ్ ప్యాకప్ కే బాద్ వర్కౌట్స్ చేయడానికి జిమ్‌కి వెళ్తున్నారట రామ్ చరణ్ అండ్ కియారా. ‘‘షూటింగ్ ప్యాకప్... నెక్ట్స్ కో–స్టార్‌తో కలిసి వర్కౌట్స్ చేస్తున్నా’’ అని రామ్ చరణ్‌తో కలిసి వర్కౌట్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కియారా. -
భయం వేస్తోంది బ్రదరూ
విలన్ని చూసి హీరో భయపడతాడా? సై అంటే సై అంటాడు. కానీ బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ మాత్రం విలన్ సోనూ సూద్‌ని చూసి భయపడుతున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా రూపొందనున్న చిత్రం ‘సింబా’. ఇందులో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కథానాయిక. ఈ సినిమాలో విలన్‌గా నటించనున్న సోనూ సూద్ జిమ్‌లో వర్కౌట్స్ స్టార్ట్ చేశారు. ‘‘సింబా’ కోసం వర్కౌట్స్ చేస్తున్నా’’ అని జిమ్‌లో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోను రణ్వీర్ ట్యాగ్ చేస్తూ.. ‘భయం వేస్తోంది బ్రదరూ’ అని కామెంట్ చేశారు. దీనికి సోనూ స్పందిస్తూ... ‘‘న్యూ ఫిట్నెస్ గోల్స్‌ను సెట్ చేస్తున్నా. ఇద్దరం కలిసి అందర్నీ భయపెడదాం’’ అన్నారు నవ్వుతూ. ఈ సినిమా కోసం రణ్‌వీర్‌కు లాయిడ్ స్టీవెన్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా. అదేనండీ.. ఎన్టీఆర్‌కు ఇతనే ఫిజికల్ ట్రైనర్. ‘టెంపర్’కి రీమేక్‌గా రూపొందుతోన్న ‘సింబా’ను ఈ డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
రాజ మార్తాండ!
రామ్‌చరణ్ కొత్త డైట్‌ను ఫాలో అవుతున్నారు. కొత్త సినిమాలోని లుక్ కోసం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నారు. మరి రామ్‌చరణ్ డైట్ సీక్రెట్స్ అండ్ వర్కౌట్స్ డిటైల్స్ ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా? ఆయన సతీమణి ఉపాసన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతానికి ఆమె రామ్‌చరణ్ వర్కౌట్స్‌కి చెందిన ఓ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘స్ట్రిక్ట్ ట్రైనింగ్ కోసం ట్రైనర్ రాకేశ్ ఆర్. వడియార్‌తో మిస్టర్ సి (రామ్‌చరణ్) మళ్లీ కలిశారు. రాకేశ్‌ని సల్మాన్ బాయ్ స్పెషల్‌గా రామ్‌చరణ్ కోసం సజెస్ట్ చేశారు?’’ అని ఉపాసన పేర్కొన్నారు. ‘ధృవ’ సినిమాలో రామ్‌చరణ్ ఫిజిక్ చాలా బాగుంటుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న తాజా సినిమా కోసం మళ్లీ అలాంటి ఫిజిక్‌ని ట్రై చేస్తున్నారు చరణ్. ఈ సినిమాకు ‘రాజ మార్తాండ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. ఈ సినిమా బీహర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని సమాచారం. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. బాలీవుడ్ హీరో వివేక్ ఒబ్రాయ్ విలన్‌గా నటిస్తున్నారు. ఆల్రెడీ విలన్ ఎంట్రీని షూట్ చేశారు చిత్రబృందం. ప్రస్తుతం రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. -
ఎన్టీఆర్.. అది ఫేక్ అని తేల్చేశాడు
సాక్షి, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సంబంధించి తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జిమ్‌లో షర్ట్‌లెస్‌గా వర్కువుట్లు చేస్తున్న ఫోటో అది. అది అభిమానులు వావ్ అంటూ కామెంట్లు చేశారు. అయితే అది ఫేక్ అని తేల్చేశాడు తారక్ పర్సనల్ ట్రైనర్ ల్లాయిడ్ స్టీవెన్స్. ‘అది ఫేక్ ఫోటో.. ఎవరు క్రియేట్ చేశారోగానీ వారికి హ్యాట్సాఫ్’ అంటూ ల్లాయిడ్ ట్వీట్ చేశాడు. కాగా, కొన్నిరోజుల క్రితం తారక్ వర్కవుట్లతో కష్టపడుతున్న ఫోటో ఒకదానిని ల్లాయిడ్ పోస్ట్ చేసింది తెలిసిందే. ప్రస్తుతం రామారావు.. త్రివిక్రమ్ సినిమా కోసం షూటింగ్‌కు సిద్ధమవుతుండగా.. మరోవైపు రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్ ప్రకటన వెలువడింది తెలిసిందే. Please kindly note this is a “FAKE” picture which someone has created ... hats off to their creativity though 😄 pic.twitter.com/KkYUKOjlvG — Lloyd Stevens (@lloydstevenspt) 23 March 2018 -
ఆమె జిమ్ వీడియోలో టాప్ హీరో..
-
ఆమె జిమ్ వీడియోలో టాప్ హీరో.. వైరల్!
న్యూఢిల్లీ : ‘దంగల్ గర్ల్’ సనా ఫాతిమా షైక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ రెజ్లింగ్ యోధుడు మహావీర్‌సింగ్ ఫొగట్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్’ సినిమాలో ఆయన కూతురు గీతా ఫోగట్‌గా సనా నటన ప్రశంసలందుకుంది. ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆయన కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్గా నిలిచిపోయింది. ‘దంగల్’ సినిమాతో పేరు తెచ్చుకున్న సనా మరోసారి ఆమిర్ ఖాన్‌తో కలిసి నటిస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కోసం సనా తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. తాజాగా ఈ భామ జిమ్‌లో డంబుల్స్ ఎత్తుతూ.. తీవ్రంగా వర్కౌట్స్ చేస్తున్న వీడియోను ఆమె అభిమాని ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సనా ఇలా వర్కౌట్స్ చేస్తుండగా.. అక్కడే తిరుగుతున్న ఆమిర్ ఖాన్.. ఆమె వెనుక ఉన్న అద్దంలో కనిపించడం ఈ వీడియోలో చూడొచ్చు. ఇలా ఆమిర్ అనుకోకుండా కనిపించడంతో ఈ వీడియోను ఆయన అభిమానులు విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. -
నో పెయిన్... నో గెయిన్!
ఫస్ట్ వామప్..నెక్ట్స్ స్మాల్ రన్. ఆ నెక్ట్స్ స్మాల్ స్మాల్ ఎక్స్‌రసైజ్‌లు.. జనరల్‌గా వర్కౌట్స్ నుంచి లాంగ్ బ్రేక్ వచ్చిన తర్వాత ఇలానే ఫాలో అవుతారు రీ–స్టార్ట్ చేయడానికి. కానీ..హీరోయిన్ కృతీసనన్ మాత్రం చాలా డిఫరెంట్‌గా వర్కౌట్స్ స్టార్ట్ చేశారు. ఏకంగా 120 కేజీల బరువును లెగ్స్‌తో హ్యాండిల్ చేసే వర్కౌట్‌ను స్టార్ట్ చేశారామె. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ వర్కౌట్స్ చేయడంలో లాంగ్ గ్యాప్ వచ్చింది. కానీ.. ఫిట్నెస్ ట్రైనర్ అస్టిన్ డైరెక్ట్‌గా 120 కేజీల వెయిట్ ఉన్న లెగ్ ప్రెస్ వర్కౌట్‌ను స్టార్ట్ చేయమన్నారు. చాలా కష్టపడుతున్నాను’’ అని పేర్కొన్నారు కృతీసనన్. పక్కనున్న ఫొటో చూసి... నో పెయిన్.. నో గెయిన్ అంటున్నారు ఆమె అభిమానులు. ఇంకా లైఫ్ గురించి ఆమె మాట్లాడుతూ –‘‘ఆర్డినరీ లైఫ్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ది బెస్ట్ లైఫ్‌ని కోరుకుంటాం. నిజానికి ఆర్డినరీగా ఉండే మన డెయిలీ లైఫ్‌లో జరిగే ఇన్సిడెంట్స్ మనల్ని ఎంతో హ్యాపీగా ఉంచుతాయి. చిన్నప్పుడు సూర్యోదయం, చిన్నపిల్లల నవ్వు, రేడియోలో పాత పాటలు వినడం, పాత స్నేహితులతో సరదాగా టైమ్ స్పెండ్ చేయడం... ఇలాంటి మూమెంట్స్ ఎంతో సంతోషాన్నిస్తాయి. ఇలా లైఫ్‌లో సంతోషాన్నిచ్చే ప్రతి మూమెంట్‌ను ఆస్వాదించి ఆనందంగా ఉండండి’’ అన్నారు. -
జిమ్ ట్రైనర్‌గా మారిన హాట్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కొత్త పని మొదలు పెట్టింది. ఫిట్నెస్ విషయంలో పక్కాగా ఉండే ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అలియా భట్‌తో కసరత్తులు చేయిస్తోంది. జిమ్ ట్రైనర్ రాని సమయంలో అలియా భట్ కు సూచనలిస్తున్న ఓ వీడియోను కత్రినా తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. ఇద్దరు అందాలభామలు కసరత్తులు చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కత్రినా ప్రస్తుతం సల్మాన్ సరసన టైగర్ జిందాహై, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాల్లో నటిస్తుండగా అలియా భట్ ‘రాజీ’ షూటింగ్ లో బిజీగా ఉంది. సినిమాలతో పాటు ర్యాంప్ వాక్లతోనూ అలరించే ఈ ముద్దుగుమ్ములు ఫిట్ నెస్విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అందుకే ట్రైనర్ రాకపోయినా తానే స్వయంగా ట్రైనర్ గా మారి అలియాతో కసరత్తులు చేయించింది కత్రినా. -
జిమ్ ట్రైనర్‌గా మారిన హాట్ బ్యూటీ
-
కండలతో తాతయ్య హల్ చల్
మనసుంటే చాలు.. వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఆ చైనా తాత. ఆరు పదులు దాటిన వయసులో కూడా జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. కండలు తిరిగిన గండరగండడిలా హల్చల్ చేస్తున్నాడు. లియాంగ్ షియాంగ్ (61) అనే ఈ తాతకు ఓ మనవడు కూడా ఉన్నాడు. అయినా ఇప్పటికీ తప్పనిసరిగా జిమ్‌కు వెళ్లి వర్కవుట్లు చేసి అందరికీ తన కండలు ప్రదర్శిస్తున్నాడు. అయితే కేవలం కండలను అందరికీ చూపించాలని మాత్రమే కాక.. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన డకార్ ర్యాలీ ఆఫ్ రోడ్ కారు రేసులో పాల్గొనేందుకు కూడా ఈయన ఈ కసరత్తులు చేస్తున్నారట. కొన్నాళ్ల పాటు రబ్బర్ ఫ్యాక్టరీలో పనిచేసిన లియాంగ్ ఆ తర్వాత సొంతంగా లైటింగ్ వ్యాపారం చేసుకున్నాడు. అందులో తగిన లాభాలు పొందిన తర్వాత విదేశాలకు సుదీర్ఘ యాత్రలు చేయడం మొదలుపెట్టాడు. కానీ వయసు కారణంగా తాను ముందు ఉన్నంత ఫిట్‌గా లేకపోతున్నానని ఆయన గుర్తించాడు. దాంతో.. స్నేహితుల సలహా తీసుకుని, వర్కవుట్లు మొదలుపెట్టాడు. ఇంటికి దగ్గర్లో ఉన్న జిమ్‌కు క్రమం తప్పకుండా వెళ్తూ బాడీ షేప్ మార్చుకున్నాడు. ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుని మంచి కండలు రప్పించుకున్నాడు. రోజుకు ఏడుసార్లు భోజనం చేస్తూ.. తనకు ఎంతో ఇష్టమైన మాంసం తినడం మానేశాడు. ఇంతకుముందు 2012లో ఒకసారి డకర్ ర్యాలీలో లియాంగ్, అతడి కొడుకు కలిసి పాల్గొన్నారు. ఈసారి పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించడంతో మళ్లీ పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. రేసు ముగిసిన తర్వాత తాను హెల్మెట్ తీయగానే మనవడు వచ్చి తనను కౌగలించుకోవాలని, ఆ క్షణాలను ఆస్వాదించాలని లియాంగ్ ఆశపడుతున్నాడు. ఆయన కండలు చూసి సోషల్ మీడియాలో పలువురు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఆయన పేరుమీద వైబోలో హ్యాష్‌ట్యాగ్ పెడితే 8 లక్షల వ్యూలు వచ్చాయి.