బోసు బాల్‌.. వర్కవుట్‌ వెల్‌ | Bose Ball Workouts For Good Health | Sakshi
Sakshi News home page

బోసు బాల్‌.. వర్కవుట్‌ వెల్‌

Published Mon, Oct 14 2019 10:11 AM | Last Updated on Mon, Oct 14 2019 10:11 AM

Bose Ball Workouts For Good Health - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: విభిన్న రకాల వ్యాయామాలు చేయడానికి వన్‌స్టాప్‌ ఎక్విప్‌మెంట్‌లా ఉపకరిస్తుంది ఈ బోసుబాల్‌.పాశ్చాత్య దేశాల్లో విరివిగా వినియోగిస్తున్న ఈ బాల్‌నిఇటీవల నగరంలోని జిమ్స్‌లోనూ బాగానేఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘బోసుబాల్‌’ గురించి కొన్ని విశేషాలు..

దీనినే ‘స్టెబిలిటీ బాల్‌’ అని కూడా అంటారు. దీనికి ప్లాస్టిక్‌ బేస్‌ ఉంటుంది. ఒకవైపు ఫ్లాట్‌గా మరోవైపు ఉబ్బుగా ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే బాల్‌ని మధ్యలో కోసినట్టు అన్నమాట. వర్కవుట్‌ సమయంలో రెండువైపులా దీనిని ఉపయోగించవచ్చు. దీని ఖరీదు బ్రాండ్‌ని బట్టి రూ.15 వేల నుంచి రూ.40వేల వరకూ ఉంది. దీన్ని ప్రారంభించిన తొలినాళ్లలో బ్యాలెన్సింగ్‌ కోసం ప్లాట్‌ గా ఉండేవైపున తొలుత సాధన చేయాలి.

లాభాలు ఎన్నో..
సాధారణ వ్యాయామాలను కూడా మరింత చాలెంజింగ్‌గా, ఇంకాస్త కఠినంగా మారుస్తుందీ బాల్‌.   
దీని రౌండెడ్‌ టాప్‌ వల్ల అబ్డామినల్,బ్యాక్‌ స్ట్రెచెస్‌కు మంచి సపోర్ట్‌ ఇస్తుంది.  
ఫ్లాట్‌గా ఉన్న వైపు కాకుండా రెండోవైపు చేయడం ద్వారా బ్యాలెన్స్‌ ట్రైనింగ్‌కి కూడా దీన్ని ఉపయోగించవచ్చు.  
జిమ్‌లో కొన్ని వ్యాయామాల వల్ల అయిన గాయాల నుంచి కోలుకోవడానికి బ్యాక్‌ పెయిన్‌ సమస్యకు కూడా ఉపకరిస్తుంది.  
మజిల్‌ మీద మన నియంత్రణ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఉదాహరణకు ఒక స్నేహితుడి భుజం మీద మన చేయి సుతారంగా వేయడం కాకుండా ఆ భుజం మీద పూర్తిగా దాన్ని పడేయడం లాంటివి చేయనీయకుండా ఇది మజిల్‌ కాంట్రాక్షన్స్‌ను ఇంప్రూవ్‌ చేసుకునేలా చేస్తుంది.
మిగిలిన జిమ్‌ పరికరాల్లా కాకుండా విభిన్న రకాల వ్యాయామాలు చేయవచ్చు. 
బాల్‌కి ఉన్న అడుగు భాగంలోని ఇన్‌ బ్యాలెన్స్‌ కారణంగా మనకే తెలియని మన దేహంలోని చిన్న చిన్న కండరాలను కూడా బలోపేతం చేస్తుంది.  
శరీరంలో ఫ్లెక్సిబులిటీని పెంచి కోర్‌ మజిల్స్‌ని నిర్మిస్తుంది.  
దీనితో కాళ్ల నుంచి చేతుల దాకా అన్ని రకాల వ్యాయామాలు చేయవచ్చు.  

బాదంతోముడతలు మాయం!
సాక్షి,సిటీబ్యూరో: విభిన్న రకాల ఆహారపు అలవాట్లు మన చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్టు ఓ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా స్నాక్స్‌గా తీసుకునే చిరుతిళ్లు చర్మంపై ముడతల వృద్ధికి కారణమవుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు తేల్చారు. ఈ సర్వే ఫలితాలను ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా విడుదల చేసింది. విభిన్న చర్మపు తత్వాలు కలిగిన మధ్య వయసు మహిళలను ఎంచుకుని పలు రకాల ఆహార పదార్థాలు వారికి అందించి మొత్తం 16 వారాల పాటు ఈ పరిశోధన నిర్వహించారు. దీనిలో భాగంగా హై రిజల్యూషన్‌ కెమెరాలతో ముడతల పరిమాణాల్ని పరిశీలించారు. తగినంత గింజధాన్యాలు, ముఖ్యంగా బాదం పప్పులు వంటివి ఆహారంలో భాగం చేసిన మహిళల చర్మంపై ముడతల వృద్ధి ఆగిపోవడమే కాక వాటిలో 9 శాతం వరకూ తగ్గుదల కనిపించిందని పరిశోధకులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement