ball
-
బోసు బాల్‌తో నటి కొత్త కసరత్తులు వైరల్ : అసలేంటీ బోసు బాల్ ఎక్స్‌ర్‌సైజ్?
బరువు తగ్గడానికి శరీరాన్ని దృఢంగా ఆ మార్చుకోవడానికి వ్యాయామం ఒక్కటే మార్గం. అయితే ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనేది వారి వారి వ్యక్తిగత అవసరాలు, ఇష్టా ఇష్టాలమీద ఆధారపడి ఉంటుంది. యోగా, వాకింగ్, జాకింగ్ లాంటి వాటితో ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నది బోస్ బాల్ వ్యాయామం. బోసు బాల్ (BOSU Ball) వ్యాయామం మొత్తం శరీరాన్ని పటిష్టంగా మారుస్తుంది. శరీరంతోపాటు, జీవిత సమన్వయ సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. తాజాగా బోసు బాల్ వ్యాయామాన్ని అలవోకగా చేస్తోంది నటి శిల్పా శెట్టి (Shilpa Shetty Kundra).యోగాసనాలు, జిమ్‌లో కసరత్తులతో అభిమానుల ఆకట్టుకునే శిల్పా బోసు బాల్ మీద చాలా బ్యాలెన్సింగ్ వ్యాయామాలుచేస్తున్న వీడియోను మండేమోటివేషన్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.బోసు బాల్ వ్యాయామం శరీరంలోని అన్ని కండరాలను బలోపేతం చేస్తుందని శిల్పా చెప్పుకొచ్చింది. సమతుల్యతను, బ్యాలెన్సింగ్ మెరుగుపరుస్తుందని తెలిపింది. క్రియాత్మక ఫిట్నెస్ను పెంచుతుందని, అలాగే పట్టు తప్పి పడిపోవడం, గాయాల ప్రమాదాలను తగ్గిస్తుందని తెలిపింది.ఎలా చేస్తారు?ఒక ప్లాస్టిక్ బేస్‌మీద రబ్బరు బంతిని అమరుస్తారు. దీనిమీద స్క్వాట్స్, పుష్ అప్ప్, జంపింగ్, ప్లాంక్స్, హాప్స్, షోల్డర్ టాప్స్, మౌంటైన్ క్లైంబర్స్ఇలాచాలా రకాల వ్యాయామాలను చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. బరువు కూడా తొందరగా తగ్గుతారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) బౌన్స్ అవుతున్న బంతిమీద వ్యాయామం అంటే అన్ని కండరాలను యాక్టివేట్ చేస్తుంది. శరీరాన్ని ఎలా నియంత్రించుకోవాలో అలవడుతుంది. బోసు బాల్ వ్యాయామాలు గుండె ఆరోగ్యానికి మంచిది. సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పుష్-అప్స్, జంప్స్ చేయడంలో వల్ల టోన్ల్ బాడీ సొంతం చేసుకోవచ్చు. వివిధ రకాల కండరాల సమూహాలను లక్ష్యంగా 15 నిమిషాల పాటు చేస్తే చేయాలి.45-60 నిమిషాలు మంచి ఫలితం ఉంటుంది. మెదడికి, శరీరానికి మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. మానసిక బలం చేకూరుతుంది. బోసు బాల్ వ్యాయామాలు, ప్రయోజనాలుబోసు బాల్ వ్యాయామంతో అనేక రకాల(health benefits) ప్రయోజనాలున్నాయి. నిజానికి ఈ వ్యాయామం శారీరక బలానికి ఒక పరీక్ష లాంటిది. ఇది ఒక్కసారి అలవాటైతే చక్కని శరీర సౌష్టవంతోపాటు దేహ దారుఢ్యంగా కూడా పెరుగుతుంది, బ్రహ్మాండమైన ఫిట్నెస్ మన సొంతమవుతుంది. గుర్తుంచుకోవాల్సిన అంశాలుఆరంభంలో సరియైన నిపుణుడు, లేదా శిక్షకుడి ఆధ్వర్యంలో వీటిని చేయాల్సి ఉంటుంది. బోసు బంతితో వ్యాయామం చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ప్రధాన విషయం ఏమిటంటే ఈ బాల్‌పై ఎలాంటి ఎక్స్‌ర్‌సైజ్ చేసినా, తొందర పడకుండా, నిదానంగా బ్యాలెన్సింగ్‌ను అలవర్చుకోవాలి. భుజాలు వెనుకకు, తల తటస్థంగా ఉండేలా సరియైన భంగిమలో ఉండాలి. బంతిపై నిలబడి ఉన్నప్పుడు మోకాళ్లను వదులుగా ఉంచుకోవాలి. ఇది బాల్ పై కదలికల సమయంలో, లేదా కొంచెం వంగినపుడు పడిపోకుండా సహాయపడుతుంది ఇవీ చదవండి: 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయంపెళ్లై పాతికేళ్లు : ఆంటీ కోసం అంకుల్ రొమాంటిక్ డ్యాన్స్! వైరల్వీడియో -
బంతి ఆకారంలో ఉండే బ్రేక్‌ఫాస్ట్.. ఏ దేశం వంటకం అంటే..
ప్రతి దేశం ఒక్కో రకమైన వంటకంలో ఫేమస్ అవుతుంది. ఆ వంటకం పేరు వినగానే వెంటనే ఆ దేశం లేదా ప్రాంతం పేరు మనకు ఠక్కున గుర్తొస్తుంది. అంతలా కొన్ని రకాల వంటకాలు మన మనసులో స్థానం దక్కించుకుంటాయి. అలానే ఇక్కడొక వంటకం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వంటకం మన భారతీయ వంటకానికి దగ్గర పోలిక ఉన్న రెసిపీలానే ఉంటుంది. కానీ వాళ్లు తయారీ చేసిన విధానం మాత్రం వావ్ అనాల్సిందే. ఇంతకీ ఏంటా వంటకం, ఏ దేశానికి సంబంధించింది అంటే..జపాన్ పాకశాస్త్ర నిపుణులు బంతి ఆకారంలో ఉండే బ్రేక్‌ఫాస్ట్‌ని తయారు చేశారు. అది ఎక్కడ వంకర లేకుండా..గుండ్రటి బంతి ఆకారంలో ఉంది. పైగా ప్లేటంతా ఆక్రమించేసింది. దీన్ని ఎలా చేస్తారంటే..మైదాపిండికి కొద్ది మోతాదు బొంబాయిరవ్వను కలిపి పులియబెట్టేలా కొద్దిగా ఈస్ట్ జోడించి చపాతి పిండి మాదిరిగా నీళ్లతో కలిపి ఒక పక్కన ఉంచాలి. తర్వాత చిన్నసైజు ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలిన. కానీ వేయించేటప్పుడూ బంతి షేపులోకి పొంగేలా జాగ్రత్తగా వేయించాలి. అంతేగాదు ఈ పిండిని ఎంత ఎక్కువ సేపు నానిస్తే అంతలా అవి డీప్ ఫ్రై చేసేటప్పుడూ కచ్చితమైన చందామామ లాంటి ఆకృతికి వస్తాయి. మన ఇండియన వంటకమైన భాతురా రెసిపీకి దగ్గరగా ఉంటుంది ఈ వంటకం. ఇది పంజాబీ వంటకం. ఇది కూడా ఒక విధమైన పులియబెట్టిన బన్ లేదా పూరీ మాదిరిగా ఉండే వంటకం. మనం ఎలా అయితే పూరీలను సెనగలు ఆలు కర్రీ లేదా కుర్మాతో తింటామో అలానే ఈ జపాన్ రెసీపీని కూడా ఇంచుమించుగా అదే మాదిరి స్పైసీ కర్రీతో తింటారట అక్కడ ప్రజలు. దీన్ని వాళ్లు "జెయింట్ సెసేమ్ బాల్" అని పిలుస్తారట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు ఈ రెసిపీని కాస్మిక్ భాతురా, బంతి ఆకారపు పూరీ అని రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by むにぐるめ(唯一無二の絶品グルメ) (@muni_gurume_japan) (చదవండి: బీచ్‌లో సరదాగా జంట ఎంజాయ్ చేస్తుండగా..అంతలోనే..) -
టీమ్ ఇండియా రబ్బరు బంతులతో ప్రాక్టీస్... ఎందుకంటే?
-
తస్సాదియ్యా.. ఈ యువతి విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే!
-
Viral Video: బుడ్డోడు.. గోల్ కొడుదాం అనుకున్నాడు.. కానీ బోర్ల పడ్డాడు..
-
బంతి సాయంతో సముద్రంలో 18 గంటల పోరాటం
అథెన్స్: నడి సముద్రంలో పడిపోతే బయటకు రావటమన్నది దాదాపుగా అసాధ్యం. కానీ, సముద్రంలో పడిపోయిన ఓ వ్యక్తికి చిన్నారులు పడేసిన చిన్న బంతి వరంలా మారింది. బొమ్మ బంతి సాయంతో 18 గంటలు పోరాటం చేశాడు. ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సంఘటన గ్రీస్‌లోని కస్సాండ్రాలో జరిగింది. యూరప్‌లోని ఉత్తర మెసిడోనియాకు చెందిన ఇవాన్ అనే వ్యక్తి, అతడి సహచరుడు.. మైటీ బీచ్‌లో సేదతీరుతుండగా బలమైన అలలు వారిని సముద్రంలోకి లాక్కెళ్లినట్లు ఫాక్స్ 5 న్యూయార్క్ పేర్కొంది. కస్సాండ్రా మైటీ బీచ్ నుంచి 130 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయిన ఇవాన్.. ఓ చిన్న బంతి సాయంతో బయటపడినట్లు ఫాక్స్ 5 న్యూయార్క్ తెలిపింది. ఆ బంతిని ఇద్దరు బాలురు 10 రోజుల క్రితం సముద్రంలో పడేసుకున్నట్లు పేర్కొంది. 30 ఏళ్ల ఇవాన్ అలల్లో కొట్టుకుపోయిన క్రమంలో అతడి సహచరులు గ్రీక్ కోస్ట్‌గార్డ్స్‌కు సమాచారం అందించారు. దీంతో వారు హెలికాప్టర్ సాయంతో సుమారు 18 గంటల తర్వాత కాపాడారు. ఆ తర్వాత గ్రీక్ మీడియాతో మాట్లాడారు ఇవాన్. తన వైపు వచ్చిన ఓ చిన్న బంతి సాయంతో ఊపిరి తీసుకుంటూ బలమైన అలలను తట్టుకుంటూ బయటపడే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. మరోవైపు.. ఇవాన్ స్నేహితుడు మార్టిన్ జోవనోవ్స్కీ ఆచూకీ ఇంకా లభించలేదని ఫాక్స్ 5 న్యూయార్క్ తెలిపింది. ఇవాన్ బయటపడిన క్రమంలో ఓ మహిళ బంతి కోసం వచ్చారని, తన కుమారులు బీచ్‌లో పడేసుకున్నారని పేర్కొన్నట్లు తెలిపింది. ఈ సంఘటన అనంతరం స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఇవాన్.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు స్పష్టం చేసింది. ఇదీ చదవండి: నడిరోడ్డులో వ్యక్తిపై బాలుడి కాల్పులు.. లైవ్ వీడియో -
అరుదైన వింత సంఘటన... తోకతో పుట్టిన బాలుడు
బ్రైజిల్: మానవుడు కోతి నుంచి పుట్టాడని కొందరూ, చింపాజీ నుంచి అని మరికొందరూ చెబుతారు. ఏదిఏమైనా మొదట్లో మానవునికి తోకలు ఉండేవని ఆ తర్వాత క్రమక్రమంగా తోకలు లేవని చెబుతుంటారు. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు గానీ బ్రెజిల్‌లోని ఒక బాలుడు మాత్రం తోకతో జన్మించాడు. (చదవండి: అసాధ్యురాలు.. ఏకంగా సింహం తోకపట్టుకుని) పైగా ఆ తోక 12 సెం.మీ పొడవుతో చివర ఒక బంతి ఆకారం ఉంటుంది. నిజానికి మానవుని జనన సమయంలో నాలుగు నుంచి ఎనిమిది వారాల గర్భధారణలో మొదట పిండం తోకల రూపంలోనే పెరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా నెలలు నిండే కొద్ది అవయావలు ఏర్పడి పూర్తి మానవ శరీర రూపంలోకి మారిపోతుంది. కానీ అనూహ్యంగా ఇది పిండంతోపాటుగా ఈ తోక కూడా పెరిగింది. అయితే ఫోర్టలేజాలోని ఆల్బర్ట్ సబిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో శిశువు జన్మించిన సమయంలో 'తోక' 12 సెం.మీ వరకు పెరిగి 4 సెం.మీ వ్యాసం కలిగిన బంతిని కలిగి ఉన్నట్లు మెడికల్ జర్నల్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు డాక్టర్లు శస్త్ర చికిత్స ద్వారా ఆ శిశువుకు తోకను తొలగించినట్లు తెలిపారు. ఇలాంటి అరుదైన కేసులు సుమారు 40 వరకు చూశామని చెప్పారు. ఈ అరుదైన మానవ తోకల గురించి సమగ్రంగా రేడియోలాజికల్ పద్ధతుల ద్వారా అధ్యయనం చేయల్సిన అవసరం ఉందని అన్నారు. (చదవండి: వింత ఇల్లు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!) -
వరుడిని అక్కడ కొట్టిన వధువు .. పట్టించుకోకుండా పరిగెత్తింది..చివర్లో వచ్చి..
పెళ్లయిన తరువాత వధూవరుల మధ్య చనువు పెంచటానికి వారితో ఆటలు ఆడించటం మామూలే. ఆటలంటే మనకి తెలిసి.. బిందెలో ఉంగరం వేసి తీయడం.. పూల బంతితో ఆట లాంటి నాజూకువి ఉంటాయి. అయితే బయట దేశాల్లో అలా కాదు మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వెళ్తుంటారు. అలా ఓ కొత్త జంట ఆడిన ఆట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఆ జంట ఏ ఆట ఆడారంటే... కొద్ది రోజుల క్రితం ఇంగ్లాండ్‌లోని కార్లియాన్ బే హోటల్ గార్డెన్లో వధూవరులు రౌండర్స్ బాల్ ఆడారు. మొదటగా పెళ్లి కుమారుడు మ్యాట్ చెస్టర్‌ఫీల్డ్ బాల్ వేయగా, పెళ్లి కుమార్తె సారా చెస్టర్‌ఫీల్డ్ దాన్ని బ్యాట్‌తో కాస్త గట్టిగానే కొట్టింది. అది నేరుగా వెళ్లి వరుడి ప్రైవేటు భాగంలో తగిలింది. అంతే మనోడు కుప్పకూలి కిందపడి గిలగిల్లాడసాగాడు. ఈ సీన్ చూస అక్కడి వాళ్లు పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. పాపం మ్యాట్‌కు దెబ్బ తగలిందన్న విషయం వధువుకి తెలియక.. నవ్వుకుంటూ, గెలుపుకోసం చుట్టూ పరిగెత్తింది. కార్నిష్ వీడియోగ్రాఫర్ గ్రాంట్ అలెగ్జాండర్ ఈ సీన్‌ని తన కెమారాలో బంధించగా, వధువు సోదరి హేలీ మెక్‌డొనాల్డ్ వీడియోను టిక్‌టాక్‌కు షేర్ చేసింది. పక్కనున్న వాళ్లు అతడి దగ్గరకి వచ్చి ఓదార్చారు. ఆ కొద్దిసేపటి తర్వాత వధువు కూడా వరుడి దగ్గరకు వచ్చి.. ఆర్ యూ ఓకే బేబీ అంటూ ఓదార్చింది. కానీ అప్పటికే అతడి ముఖం బాధతో ఎర్రగా మారిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. చదవండి: వైరల్: వీడెవడ్రా బాబు.. నాకే పోటీగా వచ్చేలా ఉన్నాడు.. -
ఇది భలే బంతి ‘బల్లీ’
-
ఇది భలే బంతి ‘బల్లీ’
లాస్ ఏంజెలిస్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న వినియోగదారుల ప్రదర్శనలో శ్యామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బంతి రూపంలో ఉన్న ఓ చిన్న రోబోను మంగళవారం ఆవిష్కరించింది. బల్లీగా నామకరణం చేసిన ఈరోబో వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది దానికున్న చిన్న చక్రాల ద్వారా ఇల్లంతా తిరుగుతూ అందులో అమర్చిన కెమెరా ఇంటికి కాపలా కాస్తుంది. ఇంటికి వచ్చే , పోయే వారి గురించి యజమానిని హెచ్చరిస్తుంది. పెద్ద వాళ్లు ఇంట్లో నడిచేందుకు తోడ్పడుతుంది. అది మన ముందంటే ముందు, మన వెనకంటే వెనక నడుస్తూ కదలికలను రికార్డు చేస్తుంది. రమ్మంటే వస్తుంది. దూరంగా పొమ్మంటే పోతుంది. సెల్‌ఫోన్ ద్వారానే కాకుండా వాయిస్ కాల్‌తో కూడా ఈ బంతి లాంటి రోబో స్పందిస్తుంది. హలో అంటే హలో చెబుతుంది. పెద్ద వాళ్ల చేతుల్లో రిమోట్ కంట్రోల్లా కూడా పనిచేయడం ఇందులో ఉన్న ఇంకో విశేషం. ఈ రోబో టీవీ, టేప్ రికార్డర్, రేడియో లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ ఆన్ చేయమంటే ఆన్ చేస్తుందీ, ఆఫ్ చేస్తుంది. మనం ఇంట్లో లేనప్పుడు ఇంట్లో ఉండే పెంపుడు కుక్కలకు కంపెనీ ఇవ్వడం ఇందులోని మరో విశేషం. శ్యామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సీఈవో హెచ్ఎస్ కిమ్ దీన్ని ప్రదర్శించి చూపారు. -
బోసు బాల్.. వర్కవుట్ వెల్
సాక్షి, సిటీబ్యూరో: విభిన్న రకాల వ్యాయామాలు చేయడానికి వన్‌స్టాప్ ఎక్విప్‌మెంట్‌లా ఉపకరిస్తుంది ఈ బోసుబాల్.పాశ్చాత్య దేశాల్లో విరివిగా వినియోగిస్తున్న ఈ బాల్నిఇటీవల నగరంలోని జిమ్స్‌లోనూ బాగానేఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘బోసుబాల్’ గురించి కొన్ని విశేషాలు.. దీనినే ‘స్టెబిలిటీ బాల్’ అని కూడా అంటారు. దీనికి ప్లాస్టిక్ బేస్ ఉంటుంది. ఒకవైపు ఫ్లాట్‌గా మరోవైపు ఉబ్బుగా ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే బాల్ని మధ్యలో కోసినట్టు అన్నమాట. వర్కవుట్ సమయంలో రెండువైపులా దీనిని ఉపయోగించవచ్చు. దీని ఖరీదు బ్రాండ్‌ని బట్టి రూ.15 వేల నుంచి రూ.40వేల వరకూ ఉంది. దీన్ని ప్రారంభించిన తొలినాళ్లలో బ్యాలెన్సింగ్ కోసం ప్లాట్ గా ఉండేవైపున తొలుత సాధన చేయాలి. లాభాలు ఎన్నో.. ♦ సాధారణ వ్యాయామాలను కూడా మరింత చాలెంజింగ్‌గా, ఇంకాస్త కఠినంగా మారుస్తుందీ బాల్. ♦ దీని రౌండెడ్ టాప్ వల్ల అబ్డామినల్,బ్యాక్ స్ట్రెచెస్కు మంచి సపోర్ట్ ఇస్తుంది. ♦ ఫ్లాట్‌గా ఉన్న వైపు కాకుండా రెండోవైపు చేయడం ద్వారా బ్యాలెన్స్ ట్రైనింగ్‌కి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ♦ జిమ్‌లో కొన్ని వ్యాయామాల వల్ల అయిన గాయాల నుంచి కోలుకోవడానికి బ్యాక్ పెయిన్ సమస్యకు కూడా ఉపకరిస్తుంది. ♦ మజిల్ మీద మన నియంత్రణ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఉదాహరణకు ఒక స్నేహితుడి భుజం మీద మన చేయి సుతారంగా వేయడం కాకుండా ఆ భుజం మీద పూర్తిగా దాన్ని పడేయడం లాంటివి చేయనీయకుండా ఇది మజిల్ కాంట్రాక్షన్స్ను ఇంప్రూవ్ చేసుకునేలా చేస్తుంది. ♦ మిగిలిన జిమ్ పరికరాల్లా కాకుండా విభిన్న రకాల వ్యాయామాలు చేయవచ్చు. ♦ బాల్కి ఉన్న అడుగు భాగంలోని ఇన్ బ్యాలెన్స్ కారణంగా మనకే తెలియని మన దేహంలోని చిన్న చిన్న కండరాలను కూడా బలోపేతం చేస్తుంది. ♦ శరీరంలో ఫ్లెక్సిబులిటీని పెంచి కోర్ మజిల్స్‌ని నిర్మిస్తుంది. ♦ దీనితో కాళ్ల నుంచి చేతుల దాకా అన్ని రకాల వ్యాయామాలు చేయవచ్చు. బాదంతోముడతలు మాయం! సాక్షి,సిటీబ్యూరో: విభిన్న రకాల ఆహారపు అలవాట్లు మన చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్టు ఓ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా స్నాక్స్‌గా తీసుకునే చిరుతిళ్లు చర్మంపై ముడతల వృద్ధికి కారణమవుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తేల్చారు. ఈ సర్వే ఫలితాలను ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా విడుదల చేసింది. విభిన్న చర్మపు తత్వాలు కలిగిన మధ్య వయసు మహిళలను ఎంచుకుని పలు రకాల ఆహార పదార్థాలు వారికి అందించి మొత్తం 16 వారాల పాటు ఈ పరిశోధన నిర్వహించారు. దీనిలో భాగంగా హై రిజల్యూషన్ కెమెరాలతో ముడతల పరిమాణాల్ని పరిశీలించారు. తగినంత గింజధాన్యాలు, ముఖ్యంగా బాదం పప్పులు వంటివి ఆహారంలో భాగం చేసిన మహిళల చర్మంపై ముడతల వృద్ధి ఆగిపోవడమే కాక వాటిలో 9 శాతం వరకూ తగ్గుదల కనిపించిందని పరిశోధకులు వెల్లడించారు. -
ఆ బంతి ఎందుకు తీసుకున్నానంటే...
కొన్నాళ్ల క్రితం ఇంగ్లండ్ చేతిలో మూడో వన్డేలో పరాజయం అనంతరం అంపైర్ల నుంచి తాను బంతి తీసుకున్న సంఘటనపై మొదటిసారి ధోని నోరు విప్పాడు. ‘మన బౌలర్లు ఎందుకు తగినంత రివర్స్ స్వింగ్ రాబట్టలేకపోతున్నారో చూసేందుకు ఆ బంతిని తీసుకున్నాను. ఎందుకంటే వచ్చే ఏడాది మనం ఇంగ్లండ్‌లోనే ప్రపంచ కప్ ఆడబోతున్నాం. మనం కచ్చితంగా రివర్స్ స్వింగ్ రాబట్టే స్థితిలో ఉండాలి. ఇది అక్కడ ఎంతో కీలకం. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటికే ఎంతో సాధించాడని... అతను దిగ్గజం అనిపించుకునేందుకు మరింత చేరువయ్యాడని’ ధోని వ్యాఖ్యానించాడు. -
నాకౌట్ ‘బాల్’ మారింది...
సాకర్ ప్రపంచకప్‌లో బంతి మారుతోంది. లీగ్ మ్యాచ్‌ల్లో ఉపయోగించిన బంతి స్థానంలో కొత్తగా ఎరుపు–తెలుపు బంతి రానుంది. ఇప్పటికైతే అడిడాస్ తయారు చేసిన ‘టెల్‌స్టార్ 18’ అనే బంతితో లీగ్ మ్యాచ్‌లు నిర్వహించారు. నాకౌట్ దశ నుంచి ఈ బంతికి బదులు ‘టెల్‌స్టార్ మెక్టా’ అనే బాల్‌ను వినియోగించనున్నారు. నాకౌట్‌కు చేరిన దేశాల జెండా రంగులు అందులో ప్రతిబింబించేలా టెల్‌స్టార్ మెక్టాను రూపొందించారు. మెక్టా అంటే ‘కల’ అని అర్థం. శనివారం నుంచి ఈ కల మన కళ్లముందు ఆడనుంది. -
జాతీయ వాలీబాల్ విజేత పోస్టల్ కర్ణాటక- జేపీఆర్ చెన్నై
బహుమతులు అందజేసిన రాష్ట్ర మంత్రులు ముగిసిన క్రీడా సంబరం అమలాపురం/ఉప్పలగుప్తం (అమలాపురం) : జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో పురుషుల విభాగం పోస్టల్ (కర్ణాటక), మహిళ విభాగంలో జేపీఆర్ (చెన్నై) జట్లు విజేతగా నిలిచాయి. లీగ్ పద్ధతిలో జరిగిన పోటీల్లో పాయింట్ల ఆధారంగా విజేతలను నిర్ణయించారు. ముందుగా అనుకున్నట్టుగానే ఈ రెండు జట్లు ప్రథమ స్థానంలో నిలిచి ట్రోఫీని కైవసం చేసుకున్నాయి. పురుషుల విభాగంలో ద్వితీయస్థానంలో సీఆర్పీఎఫ్ (ఢిల్లీ), తృతీయ స్థానంలో వెస్ట్రన్ రైల్వే (ముంబై) నిలవగా, నాలుగో స్థానంలో ఆంధ్రా స్పైకర్ నిలిచాయి. ఐదు, ఆరు స్థానాల్లో ఇన్‌కంటాక్స్ చెన్నై, సాయి గుజరాత్ జట్లు నిలిచాయి. మహిళా విభాగంలో జెపీఆర్ చెన్నై జట్టు విన్నర్స్‌గాను, రన్నర్స్‌గా మైసూర్ హాస్టల్ కర్ణాటక జట్టు, మూడో స్థానంలో ఎస్సీ రైల్వే సికింద్రాబాద్, నాలుగో స్థానంలో సాయి గుజరాత్ జట్లు నిలిచాయి. ప్రథమ స్థానంలో నిలిచిన జట్లు రూ.60 వేలతోపాటు ట్రోఫీనందుకున్నాయి. ముగిసిన పోటీలు జాతీయ వాలీబాల్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. విజేతలకు ఉప ముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పంచాయతీరాజ్ శాఖామంత్రి చింతకాలయ అయ్యన్న పాత్రుడు, వ్యవసాయశాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఎమ్మెల్సీలు బోడ్డు భాస్కరరామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆదిరెడ్డి అప్పారావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, జ్యోతుల నెహ్రూ, దాట్ల బుచ్చిరాజు, నిమ్మల రామానాయుడు, పులపర్తి నారాయణమూర్తి, వేగుళ్ల జోగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, చెల్లి వివేకానంద, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామానుజయ, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, ఏరియా ఆసుపత్రి చైర్మన్ మెట్ల రమణబాబుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
నేటితో క్రీడాసంబరం పరిసమాప్తం
పాయింట్ల ఆధారంగా విజేతల నిర్ణయం అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్‌కు సత్కారం అమలాపురం / ఉప్పలగుప్తం (అమలాపురం) : నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్ నేషనల్ ఇన్విటేషన్ మెన్ అండ్ ఉమెన్ వాలీబాల్ పోటీలు ముగింపు దశకు చేరాయి. ఐదు సెట్లలో నిర్వహించిన ఈ పోటీల్లో మూడు సెట్లు గెలిచినవారు విజయం సాధిస్తారు. కాని మూడొంతుల మ్యాచ్‌లు ఐదు సెట్లు, నాలుగు సెట్లలోకాని ఫలితం తేలలేదు. దీంతో అర్ధరాత్రి రెండు గంటల వరకు పోటీలు నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన పోటీలను పరిశీలిస్తే పురుషుల విభాగంలో సీఆర్పీఎఫ్ (ఢిల్లీ), వెస్ట్రన్ రైల్వే (ముంబై), పోస్టల్ (కర్ణాటక), మహిళా విభాగంలో ఎస్సీ రైల్వే (సికింద్రాబాద్), పోస్టల్ (కర్ణాటక) జట్లు విజేతగా నిలిచే అవకాశముంది. సోమవారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో సాయి (గుజరాత్)పై ఇన్‌కంట్యాక్స్ (చెన్నై) జట్టు 25–18, 27–17, 25–18 తేడాతో ఏకపక్షంగా సాగిన పోరులో విజేతగా నిలిచింది. రెండో మ్యాచ్ మహిళా విభాగంలో ఎస్సీ రైల్వే (సికింద్రాబాద్), సాయి (గుజరాత్) జట్ల మధ్య జరగగా, ఎస్సీ రైల్వే 23–25, 25–16, 25–22, 25–22 తేడాతో విజయం సాధించింది. పోస్టల్ (కర్ణాటక) జట్టుపై వెస్ట్రన్ రైల్వే (ముంబై) జట్టు 25–16, 23–25, 27–25, 28–18 తేడాతో గెలిచింది. ఆదివారం అర్ధరాత్రి పురుషుల విభాగంలో జరిగిన పోరులో సీఆర్పీఎఫ్(ఢిల్లీ) జట్టు సాయి (గుజరాత్)పై 23–25, 25–1, 25–22, 25–22 తేడాతో గెలుపొందాయి. నేటితో ముగింపు ఐదు రోజుల పాటు జరగనున్న ఎన్వీఆర్ వాలీబాల్ పోటీలు మంగళవారం రాత్రితో ముగియనున్నాయి. పాయింట్ల ఆధారంగా విజేతలను నిర్ణయించనున్నారు. మొదటి స్థానాల్లో నిలిచినవారితోపాటు అన్ని జట్లకు కలిపి రూ.ఐదు లక్షల నగదు బహుమతితోపాటు ట్రోఫీని అందించనున్నారు. సాత్విక్‌కు ఘన సత్కారం అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్‌కు ఎన్వీఆర్ వాలీబాల్ అసోసియేషన్ సోమవారం రాత్రి ఘనంగా సత్కరించింది. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, టోర్నమెంట్ అధ్యక్షుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడులు సాత్విక్‌ను సత్కరించారు. అమలాపురం జోన్ వ్యాయామోపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఉండ్రు ముసలయ్య, టోర్నీ కార్యదర్శి మద్దింశెట్టి సురేష్, కోశాధికారి అరిగెల నానాజీ, సాంకేతిక కమిటీ సభ్యుడు ఉండ్రు రాజబాబులు ఉన్నారు. -
హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
అమలాపురం / ఉప్పలగుప్తం (అమలాపురం) :గొల్లవిల్లిలో జరుగుతున్న నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. రెండోరోజు శనివారం సాయంత్రం ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో పోస్టల్ కర్నాటక జట్టుపై సీఆర్పీఎఫ్ ఢిల్లీ జట్టు 25–22, 22–25, 19–25, 25–19, 15–8 పాయింట్లతో గెలుపొందింది. మొత్తం ఐదు సెట్లలో జరిగిన ఈ పోరు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది. మహిళా విభాగంలో కర్ణాటక జట్టు సౌత్ సెంట్రల్ రైల్వేపై 27–25, 25–20, 17–25, 25–19 తేడాతో విజయం సాధించింది. ముందు రోజు శుక్రవారం రాత్రి రెండు గంటల వరకూ పోటీలు జరిగిన పోటీల్లో ఆంధ్రా స్పైకర్స్ (ఏపీటీం) జట్టు సాయి గుజరాత్‌పై 25–22, 25–16, 25–21 స్కోర్‌తో గెలుపొందింది. మహిళా విభాగంలో జరిగిన పోరులో పోస్టల్ కర్నాటక జట్టు సీఆర్పీఎఫ్ ఢిల్లీ జట్టుపై 25–19, 25–23, 21–25, 25–18 స్కోర్‌తో గెలుపొందింది. ఒక్కో మ్యాచ్ ఫలితం కోసం నాలుగు, ఐదు సెట్లు ఆడాల్సి రావడంతో పోటీలు ఆలస్యమవుతున్నాయి. సుమారు ఐదువేల మంది సామర్థ్యం ఉన్న గ్యాలరీ నిండిపోవడంతో చాలా మంది బయటే ఉండిపోతున్నారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, అయితాబత్తుల ఆనందరావులు రెండో రోజు పోటీలను తిలకించారు. వారికి టోర్నమెంట్ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మద్దింశెట్టి సురేష్ స్వాగతం పలికారు. -
క్రీడలు జీవితంలో భాగం కావాలి
-క్రీడాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు -గొల్లవిల్లిలో జాతీయస్థాయి వాలీబాల్ టోర్నీ ప్రారంభం అమలాపురం/ ఉప్పలగుప్తం : క్రీడలు జీవితంలో భాగం కావాలని, అప్పుడే మనిషి పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉంటాడ రాష్ట్ర కార్మిక, క్రీడాశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో నిమ్మకాయల వెంకటరంగయ్య మెమోరియల్ జాతీయ వాలీబాల్ ఇన్విటేషన్ మెన్, ఉమెన్ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. క్రికెట్‌కే కాక ఇటీవల కబడ్డీ, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు ఆదరణ పెరుగుతోందన్నారు. విశాఖలో ఏటా బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. పి.వి.సింధు సాధించిన విజయంతో ఒలింపిక్ క్రీడలకు ఆదరణ పెరిగిందన్నారు. రాష్ట్రంలో మైదానాల అభివృద్ధి, క్రీడా పరికరాల పంపిణీకి ఎమ్మెల్యే, మంత్రులు కోరిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. గొల్లవిల్లిలో రూ.కోటితో స్టేడియం గొల్లవిల్లిలో రూ.కోటితో స్టేడియం నిర్మిస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ జిల్లాలో మరిన్ని గ్రామీణ క్రీడలను నిర్వహిస్తామని, రాష్ట్రంలో తూర్పుగోదావరిని క్రీడల్లో అగ్రస్థానంలో నిలుపుతామని చెప్పారు. కోనసీమస్థాయిలో ఆరంభమైన టోర్నమెంట్‌ను ఇప్పుడు జాతీయస్థాయిలో నిర్వహిస్తున్నామంటే అందుకు గొల్లవిల్లి వాసులే కారణమన్నారు. స్టేడియంల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, చెల్లి వివేకానంద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, అమలాపురం మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, ఎంపీపీ శిరంగు సత్తిరాజు, జెడ్పీటీసీ సభ్యుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, టోర్నమెంట్ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మద్దింశెట్టి సురేష్, ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మెట్ల రమణబాబు, వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.నారాయణరావు, జిల్లా అసోసియేషన్ సెక్రటరీ వై.బంగార్రాజు, ఆర్‌ఐపీఈ టి.వి.ఎస్.రంగారావు, పాల్గొన్నారు. ఆకట్టుకున్న క్రీడాజ్యోతి ప్రజ్వలన పోటీల ప్రారంభం సందర్భంగా క్రీడాజ్యోతిని వెలిగించిన తీరు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఓ జ్యోతిని రిమోట్ కారులో ఉంచి మైదానమంతా తిప్పారు. ఆ జ్యోతిని క్రీడలమంత్రి అచ్చెన్నాయుడు వెలిగించి దానితోపాటు నడుచుకుంటూ ప్రధాన క్రీడాజ్యోతి వద్దకు వెళ్లి, వందలాది మంది క్రీడాభిమానుల కరతాళధ్వనుల మధ్య దాన్ని వెలిగించారు. క్రీడాప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రులు రాజప్ప, అచ్చెన్నాయుడు కొద్దిసేపు వాలీబాల్ ఆడారు. వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (వీఎఫ్ఐ) నిబంధనలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన కోర్టును చూసి క్రీడాకారులు సైతం మంత్రముగ్ధులయ్యారు. -
చేతులే ట్రిగర్లు..బంతులే బుల్లెట్లు
-నేటి నుంచి గొల్లవిల్లిలో జాతీయస్థాయి వాలీబాల్ టోర్నీ -ఫ్లడ్ లైట్ల కాంతిలో అయిదురోజుల పాటు నిర్వహణ -అధునాతన ప్రమాణాలతో సిద్ధమైన కోర్టు అమలాపురం / ఉప్పలగుప్తం : ఆటగాళ్లే తుపాకులవుతారు. గురినెరిగిన వాళ్ల చేతులే ట్రిగ్గర్లవుతాయి. తిన్నగా, వాలుగా, మూలగా దూసుకుపోయే బంతులే బుల్లెట్లవుతాయి. అయిదురోజుల పాటు చూసేవారికి కనువిందు చేసే క్రీడా సమరానికి సాధారణ గ్రామమైన గొల్లవిల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణం వేదిక కానుంది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిమ్మకాయల వెంకటరంగయ్య మెమోరియల్ వాలీబాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న జాతీయస్థాయి, వాలీబాల్ శుక్రవారం ప్రారంభం కానున్నాయి. జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలను ఫ్లడ్ లైట్ల కాంతిలో రేయింబవళ్లు ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు నిర్వాహక కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణం, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా అధునాతన కోర్టు, 15 వేల మంది వరకూ పోటీలు వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పురుషుల, మహిళల విభాగాల్లో జరిగే పోటీలకు తిలకించేందుకు మíßహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పురుషుల, మహిళ జట్లు తలపడనున్నాయి. లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించి మెరుగైన పాయింట్లు సాధించిన రెండు జట్ల మధ్య ఫైనల్ పోటీలను ఈనెల 28న నిర్వహిస్తారు. పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు జిల్లాల నుంచి క్రీడాభిమానులు తరలివస్తారు. రోజుకు 20 వేల నుంచి 30 వేలమంది తరలి రావచ్చని అంచనా. పోటీలు జరిగే ప్రాంగణంతో బయట కూడా క్రీడాభిమానులు పోటీలు వీక్షించేలా నిర్వాహక కమిటీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తోంది. క్రీడాభిమానులతో ఈ ఐదురోజులూ గొల్లవిల్లిలో రేయింబవళ్లు పండుగ వాతావరణం నెలకొననుంది. పది జట్లు.. పాటవం గల ఆటగాళ్లు పోటీల్లో పురుషులు, మహిళల విభాగంలో మొత్తం పది జట్లు తలపడనున్నాయి. పురుషుల విభాగంలో వెస్ట్రన్ రైల్వేస్ (ముంబాయి), ఆంధ్రా స్పైకర్స్ (ఏపీ) సాయి అకాడమీ (గుజరాత్), ఇన్కమ్ ట్యాక్స్ (చెన్నై), పోస్టల్ (కర్ణాటక), సీఆర్పీఎఫ్ (ఢిల్లీ) జట్లు, మహిళా విభాగంలో జేపీఆర్ యూనివర్సిటీ (చెన్నై), ఎస్సీ రైల్వేస్ (సికింద్రాబాద్), సాయి అకాడమీ(గుజరాత్), కర్నాటక స్టేట్ జట్లు తలపడనున్నాయి. ఇంటర్ నేషనల్స్‌లో 10 సార్లు పాల్గొన్న ప్రదీప్ చెన్నై ఇన్‌కంట్యాక్స్ నుంచి టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియా జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ రాష్ట్రాల జాతీయ క్రీడాకారులు నరేష్, కృష్ణంరాజు, సుబ్బారావు, ప్రభు, కార్తీక్, ఇండియా మహిళా జట్టు క్రీడాకారిణి హేమ పోటీల్లో తమ ప్రతిభ చూపనున్నారు. 1988లో కోనసీమస్థాయితో శ్రీకారం.. గొల్లవిల్లిలో తొలిసారిగా ఉండ్రు సాంబశివరావు మెమోరియల్ పేరిట 1988లో కోనసీమస్థాయి వాలీబాల్ పోటీలు జరిగాయి. రెండేళ్లు కోనసీమస్థాయిలో జరిగిన పోటీలు 1990లో జిల్లా స్థాయికి, 1994 నాటికి రాష్ట్రస్థాయికి చేరాయి. 2002 వరకూ రాష్ట్రస్థాయిలో జరిగాయి. తరువాత కొంత విరామం ఏర్పడ్డా 2013, 2014లలో దక్షిణభారతస్థాయిలో సలాది పల్లంరాజు మెమోరియల్ పోటీలు నిర్వహించారు. 2015 నుంచి నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్ పేరిట జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరిగిన పోటీల్లో పాల్గొన్న ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రాణిస్తున్నారు.వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (వీఎఫ్ఐ) నిబంధనలకు అనుగుణంగా పోటీల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. క్రీడాకారులకు మెరుగైన వసతి, భోజనాలకు నిర్వాహక కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ పోటీలతో మాకు స్ఫూర్తి గొల్లవిల్లిలో మూడు దశాబ్దాలుగా పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడి పోటీలు క్రీడాస్ఫూర్తిని పెంపొందించి, ఎంతో మందిని చక్కటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దాయంటే అతిశయోక్తి కాదు. జాతీయ క్రీడాకారుల ఆటతీరును అవగతం చేసుకుని మెళకువలు తెలుసుకుంటాం. ఇదే కోర్టులో మేం రోజూ ప్రాక్టీసు చేస్తాం. -అరిగెల నరసింహారావు, యువ వాలీబాల్ క్రీడాకారుడు, గొల్లవిల్లి గ్రామానికి గర్వకారణం జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలతో గ్రామం కీర్తి దేశం నలుమూలలకూ విస్తరించడం గర్వంగా ఉంది. శివరాత్రితో పాటు జరిగే క్రీడాపోటీలకు బంధువులు రావడం ఆనవాయితీ అయింది. మా గ్రామంలో ఇదో పెద్ద పండుగ. వాలీబాల్ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు పోటీపడటం మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. - చీకట్ల ఏసుబాబు, వ్యాపారి, గొల్లవిల్లి -
చేతులే ట్రిగర్లు..బంతులే బుల్లెట్లు
-నేటి నుంచి గొల్లవిల్లిలో జాతీయస్థాయి వాలీబాల్ టోర్నీ -ఫ్లడ్ లైట్ల కాంతిలో అయిదురోజుల పాటు నిర్వహణ -అధునాతన ప్రమాణాలతో సిద్ధమైన కోర్టు అమలాపురం / ఉప్పలగుప్తం : ఆటగాళ్లే తుపాకులవుతారు. గురినెరిగిన వాళ్ల చేతులే ట్రిగ్గర్లవుతాయి. తిన్నగా, వాలుగా, మూలగా దూసుకుపోయే బంతులే బుల్లెట్లవుతాయి. అయిదురోజుల పాటు చూసేవారికి కనువిందు చేసే క్రీడా సమరానికి సాధారణ గ్రామమైన గొల్లవిల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణం వేదిక కానుంది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిమ్మకాయల వెంకటరంగయ్య మెమోరియల్ వాలీబాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న జాతీయస్థాయి, వాలీబాల్ శుక్రవారం ప్రారంభం కానున్నాయి. జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలను ఫ్లడ్ లైట్ల కాంతిలో రేయింబవళ్లు ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు నిర్వాహక కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణం, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా అధునాతన కోర్టు, 15 వేల మంది వరకూ పోటీలు వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పురుషుల, మహిళల విభాగాల్లో జరిగే పోటీలకు తిలకించేందుకు మíßహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పురుషుల, మహిళ జట్లు తలపడనున్నాయి. లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించి మెరుగైన పాయింట్లు సాధించిన రెండు జట్ల మధ్య ఫైనల్ పోటీలను ఈనెల 28న నిర్వహిస్తారు. పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు జిల్లాల నుంచి క్రీడాభిమానులు తరలివస్తారు. రోజుకు 20 వేల నుంచి 30 వేలమంది తరలి రావచ్చని అంచనా. పోటీలు జరిగే ప్రాంగణంతో బయట కూడా క్రీడాభిమానులు పోటీలు వీక్షించేలా నిర్వాహక కమిటీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తోంది. క్రీడాభిమానులతో ఈ ఐదురోజులూ గొల్లవిల్లిలో రేయింబవళ్లు పండుగ వాతావరణం నెలకొననుంది. పది జట్లు.. పాటవం గల ఆటగాళ్లు పోటీల్లో పురుషులు, మహిళల విభాగంలో మొత్తం పది జట్లు తలపడనున్నాయి. పురుషుల విభాగంలో వెస్ట్రన్ రైల్వేస్ (ముంబాయి), ఆంధ్రా స్పైకర్స్ (ఏపీ) సాయి అకాడమీ (గుజరాత్), ఇన్కమ్ ట్యాక్స్ (చెన్నై), పోస్టల్ (కర్ణాటక), సీఆర్పీఎఫ్ (ఢిల్లీ) జట్లు, మహిళా విభాగంలో జేపీఆర్ యూనివర్సిటీ (చెన్నై), ఎస్సీ రైల్వేస్ (సికింద్రాబాద్), సాయి అకాడమీ(గుజరాత్), కర్నాటక స్టేట్ జట్లు తలపడనున్నాయి. ఇంటర్ నేషనల్స్‌లో 10 సార్లు పాల్గొన్న ప్రదీప్ చెన్నై ఇన్‌కంట్యాక్స్ నుంచి టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియా జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ రాష్ట్రాల జాతీయ క్రీడాకారులు నరేష్, కృష్ణంరాజు, సుబ్బారావు, ప్రభు, కార్తీక్, ఇండియా మహిళా జట్టు క్రీడాకారిణి హేమ పోటీల్లో తమ ప్రతిభ చూపనున్నారు. 1988లో కోనసీమస్థాయితో శ్రీకారం.. గొల్లవిల్లిలో తొలిసారిగా ఉండ్రు సాంబశివరావు మెమోరియల్ పేరిట 1988లో కోనసీమస్థాయి వాలీబాల్ పోటీలు జరిగాయి. రెండేళ్లు కోనసీమస్థాయిలో జరిగిన పోటీలు 1990లో జిల్లా స్థాయికి, 1994 నాటికి రాష్ట్రస్థాయికి చేరాయి. 2002 వరకూ రాష్ట్రస్థాయిలో జరిగాయి. తరువాత కొంత విరామం ఏర్పడ్డా 2013, 2014లలో దక్షిణభారతస్థాయిలో సలాది పల్లంరాజు మెమోరియల్ పోటీలు నిర్వహించారు. 2015 నుంచి నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్ పేరిట జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరిగిన పోటీల్లో పాల్గొన్న ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రాణిస్తున్నారు.వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (వీఎఫ్ఐ) నిబంధనలకు అనుగుణంగా పోటీల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. క్రీడాకారులకు మెరుగైన వసతి, భోజనాలకు నిర్వాహక కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ పోటీలతో మాకు స్ఫూర్తి గొల్లవిల్లిలో మూడు దశాబ్దాలుగా పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడి పోటీలు క్రీడాస్ఫూర్తిని పెంపొందించి, ఎంతో మందిని చక్కటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దాయంటే అతిశయోక్తి కాదు. జాతీయ క్రీడాకారుల ఆటతీరును అవగతం చేసుకుని మెళకువలు తెలుసుకుంటాం. ఇదే కోర్టులో మేం రోజూ ప్రాక్టీసు చేస్తాం. -అరిగెల నరసింహారావు, యువ వాలీబాల్ క్రీడాకారుడు, గొల్లవిల్లి గ్రామానికి గర్వకారణం జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలతో గ్రామం కీర్తి దేశం నలుమూలలకూ విస్తరించడం గర్వంగా ఉంది. శివరాత్రితో పాటు జరిగే క్రీడాపోటీలకు బంధువులు రావడం ఆనవాయితీ అయింది. మా గ్రామంలో ఇదో పెద్ద పండుగ. వాలీబాల్ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు పోటీపడటం మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. - చీకట్ల ఏసుబాబు, వ్యాపారి, గొల్లవిల్లి -
24 నుంచి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు
ఉప్పలగుప్తం : మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24 నుంచి 28 వరకూ నిమ్మకాయల వెంకటరంగయ్య జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెంకటరంగయ్య వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జగ్గయ్యనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రూపొందించిన వార్షిక క్యాలెండర్‌ను జగ్గయ్యనాయుడు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు. గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించే ఈ పోటీలలో... పురుష విభాగంలో ఆంధ్రా స్పైకర్స్ (ఏపీ టీం), వెస్ట్రన్రైల్వేస్–ముంబాయి, నార్త్ ఈస్ట్రన్రైల్వేస్– గోరఖ్‌పూర్, ఇన్కమ్ టాక్స్–చెన్నై, సాయి అకాడమి–గుజరాత్, ఐసీఎఫ్ క్లబ్–చెన్నై జట్లు, మహిళా విభాగంలో జెపీఆర్ యూనివర్సీటీ–చెన్నై, ఎస్సీ రైల్వేస్– సికింద్రాబాద్, సాయి అకాడమి–గుజరాత్, కేరళ జట్లు పాల్గొంటున్నాయి.అంతర్జాతీయ ప్రమాణాలతో వాలీబాల్ కోర్టు సిద్ధం చేశామని, క్రీడలను వీక్షించేందుకు గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టోర్నీ వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్వీఆర్ గొలవిల్లి.కామ్ వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. టోర్నీ కార్యదర్శి మద్దింశెట్టి సుబ్బరాజు, కార్యనిర్వాహక కార్యదర్శి గొలకోటి ఫణీంద్ర కుమార్, కోశాధికారి అధ్యక్షులు అరిగెల వెంకటముసలయ్య, ఉపాధ్యక్షులు గొలకోటి సత్తిరాజు, ఉండ్రు సుబ్బారావు(రాజబాబు), గుర్రాల ప్రసాద్, సలాది సత్తిబాబు, ఉండ్రు ముసలయ్య, ఎంఎస్ఆర్ స్వామి, గుత్తాల సుభాష్ చంద్రబోస్, జన్నూరి వెంకటేశ్వరరావు, గనిశెట్టి తాతాజీ, సుందరనీడి సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
24 నుంచి జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు
బ్రోచర్, ఆహ్వాన పత్రిక విడుదల ఉప్పలగుప్తం (అమలాపురం) : మహాశివరాత్రి, కోనసీమ ఉత్సవ శోభ ఉత్సవాలను పురస్కరించుకుని గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఈ నెల 24 నుంచి ఐదు రోజుల పాటు నిమ్మకాయల వెంకటరంగయ్య జాతీయస్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీల బ్రోచర్, ఆహ్వాన పత్రికలను బుధవారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విడుదల చేశారు. గొల్లవిల్లిలోని చినరాజప్ప కల్యాణ మంటపంలో టోర్నీ అధ్యక్షుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు అధ్యక్షతన టోర్నీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కొన్నేళ్లుగా అందరి సహకారంతో పోటీలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఎన్వీఆర్ వాలీబాల్ అసోసియేషన్ ద్వారా ఈ పోటీలకు పలు రాష్ట్రాల నుంచి జాతీయ క్రీడాకారులు హజరవుతారని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. టోర్నీ కోశాధికారి, సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు అరిగెల వెంకటముసలయ్య. కార్యదర్శి మద్ధింశెట్టి సుబ్బరాజు (సురేష్) మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడా ప్రమాణాలతో వాలీబాల్ కోర్టు, గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్వీఆర్ వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గొలకోటి సత్తిరాజు, సాంకేతిక పర్యవేక్షకులు ఉండ్రు రాజబాబు, సభ్యులు షేక్ చినవలీ, సలాది సత్తిబాబు, గుర్రాల దుర్గాప్రసాద్, నిర్వాహక కార్యదర్శి గొలకోటి ఫణీంద్రకుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు నిమ్మకాయల సూర్యనారాయణమూర్తి, అమలాపురం జోన్ పీఈటీల సంఘ అధ్యక్షుడు ఉండ్రు ముసలయ్య, ఎస్సై డి.రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్జీఎస్ అండర్–19 బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం
రామచంద్రపురం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 బాల బాలికల 62వ అంతర్ జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీలు స్థానిక కృత్తి వెంటి పేర్రాజు పంతులు జాతీయ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభమయ్యాయి. కృత్తివెంటి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల ఎం సూర్యమోహన్ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ ఎస్జీఎస్ పతాకాన్ని ఆవిష్కరించి పోటీలు ప్రారంభించారు. జిల్లా వృత్తి విద్యాధికారిణి కె హెప్సీరాణి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎస్జీఎఫ్–19 జిల్లా కార్యదర్శి వై.తాతబ్బాయి మాట్లాడుతూ ఈ పోటీలకు 12 జిల్లాల నుంచి బాలురు, 10 జిల్లాల నుంచి బాలికలు పాల్గొంటున్నారన్నారు. ఈనెల 30వరకు ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఎస్జీఎఫ్ ఏపీ ప్రతినిధి, అబ్జర్వర్ వి సీతాపతిరావు మాట్లాడుతూ జనవరి 9 నుంచి జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు కృష్ణాజిల్లా నూజివీడులో జరుగుతున్నాయన్నారు. ఈ పోటీలో పాల్గొనే రాష్ట్ర జట్టు ఎంపిక రామచంద్రపురంలో జరుగుతుందన్నారు. రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి, బాస్కెట్‌బాల్ సీనియర్ క్రీడాకారులు బాలకృష్ణారెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల ముత్యాల సత్యనారాయణ, హెచ్ఎం జీ రాంప్రసాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకాల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపిక
రాష్ట్ర టీమ్‌లో జిల్లా నుంచి 'ఫణీంద్ర' ప్రాతినిధ్యం వచ్చె నెల చత్తీస్‌ఘడ్‌లో పోటీలు కొత్తపేట : జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ అండర్ –17 పోటీలకు కొత్తపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి పాటి ఫణీంద్రసాయి ఎంపికయ్యాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 13,14,15 తేదీల్లో చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో జిల్లా జట్టులో పాల్గొన్న ఫణీంద్రసాయి అత్యుత్తమ ప్రతిభ కనపరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు పాఠశాల హెచ్ఎం జి.సూర్యప్రకాశరావు సోమవారం తెలిపారు. చత్తీస్ఘడ్ రాష్ట్రం రాజనందిగామ్లో జనవరిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ స్టేట్ టీమ్ 12 మందిలో (6వ) స్థానానికి ఎంపికైనట్టు తెలిపారు. జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చూపుతానని ఫణీంద్రసాయి ఈ సందర్భంగా తెలిపారు. పాఠశాల పీడీ, పీఈటీ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాని వివరించారు. ఫణీంద్రసాయిని హెచ్ఎం జి.సూర్యప్రకాశరావు, ఎన్సీసీ ఆఫీసర్ ఉప్పలపాటి మాచిరాజు, పీడీ భమిడిపాటి అప్పాజీ, పీఈటీ పి.జ్యోతి అభినందించారు. -
బాస్కెట్‌బాల్ చాంపియన్ ఎస్వీకేపీ
భానుగుడి (కాకినాడ): ఆదికవి నన్నయ వర్సిటీ మహిళా బాస్కెట్‌బాల్ జట్టు చాంపియన్‌గా పెనుగొండకు చెందిన ఎస్వీకేపీ కళాశాల నిలిచింది. పలు కళాశాల జట్లతో పోటీపడి నాకౌట్లో ఆడిన అన్ని మ్యాచ్‌లను గెలిచి విజేతగా నిలిచింది. అంతర్ వర్సిటీ బాస్కెట్‌బాల్ పోటీలలో పాల్గొనే నన్నయవర్సిటీ జట్టు ఎంపికకు గాను ఈ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. మంగళవారం నిర్వహించిన ముగింపు వేడుకలకు అధ్యక్షత వహించిన అంతర కళాశాలల బాస్కెట్ బాల్ కన్వీనర్ బీఈవీఎల్ నాయుడు మాట్లాడుతూ వర్సిటీ తరఫున ఎంపికయిన మహిళా బాస్కెట్ బాల్జట్టు సౌత్‌జోన్ చాంపియన్ లుగా నిలవాలని కాంక్షించారు. కేరళలోని కాలికట్ వర్సిటీలో జరిగే సౌత్‌జోన్ పోటీల్లో ప్రస్తుతం ఎంపికయిన బృందం ఆడుతుందని నన్నయ వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్, స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ఎ.సత్యనారాయణ తెలిపారు. ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్ .శేషారెడ్డి, డైరెక్టర్ ఎన్ .సుగుణారెడ్డి, రంగరాయ మెడికల్ కళాశాల పీడీ స్పర్జన్ రాజు పాల్గొన్నారు. విజేతలు వీరే : నన్నయ వర్సిటీ పరిధిలోని అంతర కళాశాలల మహిళా బాస్కెట్‌బాల్ చాంపియ¯ŒSషిప్ పోటీలలో పెనుగొండ ఎస్‌కేవీపీ కళాశాల ప్రథమ స్థానం సాధించగా, ఏలూరుకు చెందిన సెయింట్ థెరిసా కళాశాల ద్వితీయ స్థానం, తణుకుకు చెందిన ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల తృతీయస్థానం సాధించాయి. కాకినాడ ఆదిత్య డిగ్రీకళాశాల జట్టు నాలుగోస్థానంలో నిలిచింది. సౌత్ జోన్ జట్టు సభ్యులు వీరే 2016–17 విద్యాసంవత్సరంలో నన్నయ వర్సిటీ తరఫున సౌత్‌జోన్ అంతర్ వర్సిటీ బాస్కెట్‌బాల్ టోర్నీకి 12మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేశారు. ఇందులో బి.పూర్ణసాయిజ్యోతి, ఎస్కే హాఫిజున్నీషా, ఎస్కే అనిషా, సీహెచ్.కారుణ్య, కే.నాగశిరీష, సీహెచ్.శ్రావణి, ఎం.సాయికుమారి, కే శ్యామల, ఎన్ .సాయిభవానీ, జి.లలిత, జి.బేబీ సరోజినీ, ఎస్కే.షహనాజ్‌లు ఎంపికయ్యారు. ఎన్ .తేజసాయి సత్య, టి.పావని, సీహెచ్ వల్లివైష్ణవి, పి.రాణి, డి.వాణి, సత్యలక్ష్మి, కేవీఆర్రాజ్యలక్ష్మి స్టాండ్‌బైగా ఎంపికయ్యారు. విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణను నిలిపివేయాలి -
బంతి కోసం వెళ్లి.. బావిలో పడ్డాడు
భువనగిరి అర్బన్(నల్లగొండ): క్రికెట్ బంతి కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడిన బాలుడిని పోలీసులు రక్షించారు. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం ప్రగతికాలనీలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన బద్దునాయక్, మీర దంపతుల కుమారుడు రజినీకాంత్(16) మంగళవారం సాయంత్రం కాలనీలోని ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడుకుంటున్నాడు. తోటి ఆటగాడు కొట్టిన బంతిని తీసుకువచ్చేందుకు పక్కనే ఉన్న పాడుబావి వద్దకు పరుగు తీసిన రజినీకాంత్ బావిపై వేసిన రేకులపై కాలుపెట్టటంతో అవి విరిగి అందులో పడిపోయాడు. దాదాపు 35 అడుగుల లోతు ఉన్న బావిలో నీరులేదు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్నారు. క్రేన్‌ను తెప్పించి బాలుడిని బయటకు సురక్షితంగా తీశారు. రజినీకాంత్ కాళ్లు, చేతులకు స్వల్పంగా గాయాలయ్యాయి. అతడు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.