క్రికెట్ మరొకరి ప్రాణం బలిగొంది. బంతితగిలి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వంశీకృష్ణ అనే బాలుడు మృతి చెందాడు. నగరంలోని వనస్థలిపురానికి చెందిన సహారా ఎస్టేట్స్లో క్రికెట్ ఆడుతూ నాలుగేళ్ల బాలుడు వంశీకృష్ణ గురువారం గాయపడ్డాడు. దీంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బంతి బలంగా తగిలి తీవ్ర గాయం అవడంతో చికిత్స పొందుతూ ఆ బాలుడు శుక్రవారం ఉదయం మృతిచెందాడు.