hit
-
క్రైమ్ థ్రిల్లర్
నానీ(Nani) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. యునానిమస్ ప్రోడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది. కాగా ఈ నెల 24న నానీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ఈ మూవీలో అర్జున్ సర్కార్‌గా పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు నానీ.‘హిట్’ సిరీస్‌లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం గ్లింప్స్, పోస్టర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్), లైన్‌ప్రోడ్యూసర్: అభిలాష్ మాంధదపు. -
కశ్మీర్లో యాక్షన్
కశ్మీర్లో విలన్లను రఫ్ఫాడిస్తున్నారు నాని. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి కథానాయిక. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో అర్జున్ సర్కార్‌గా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు నాని. ప్రస్తుతం కశ్మీర్లో షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు టాకీ పార్ట్‌ని చిత్రీకరిస్తున్నాం. 2025 మే 1న సినిమాని విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్. -
రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి
కాసర్గోడ్: కేరళలోని కాసర్గోడ్లో హృదయ విదారక ఉదంతం చోటుచేసుకుంది. కంజనగడ్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి చెందారు. మృతులు దక్షిణ కొట్టాయం జిల్లా చింగవనం వాసులుగా పోలీసులు గుర్తించారు.వీరు ఇక్కడికి ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన బృందంలోని వారని పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లేందుకు వారు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఆ సమయంలో సూపర్‌ఫాస్ట్ రైలు ఢీకొనడంతో ఆ ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంపై విచారణ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దిగువ సియాంగ్ జిల్లాలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో 52 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా, ఒక చిన్నారికి గాయాలయ్యాయి. దిమోవ్ సమీపంలోని పాలే వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ హజారికా తెలిపారు. మృతుడిని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ సబ్ ఇన్స్పెక్టర్ రిగో రిబాగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: గుళికల ప్యాకెట్‌ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని.. -
ఆఫీసర్ అర్జున్ ఆన్ డ్యూటీ
నాని హీరోగా నటిస్తున్న ‘హిట్: ది థర్డ్ కేస్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ప్రారంభమైంది. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న మూడో చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ‘హిట్’ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని తెరకెక్కిస్తున్నారు. యునానిమస్ప్రోడక్షన్స్తో కలిసి వాల్‌పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లోప్రారంభమైంది. ఈ షూటింగ్లో ఆఫీసర్ అర్జున్‌గా డ్యూటీ ఆరంభించారు నాని. ‘‘ఈ సినిమాలో ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా ఫెరోషియస్ క్యారెక్టర్లో నాని కనిపించబోతున్నారు. ఈపాత్ర కోసం నాని కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. 2025 మే 1న ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్. -
నాని కెరీర్లో పెద్ద మల్టీస్టారర్...
-
టాలీవుడ్ సూపర్ 'హిట్' సిరీస్.. పార్ట్-3లో హీరో ఎవరంటే?
సరిపోదా శనివారం అంటూ ఇటీవలే సినీ ప్రియులను అలరించిన టాలీవుడ్ హీరో నాని. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. అంతలోనే మరో కొత్త మూవీని ప్రకటించారు. ఈ సినిమా నాని కెరీర్లో 32వ చిత్రంగా నిలవనుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేయండి.గతంలో టాలీవుడ్లో హిట్ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ రెండు సినిమాలకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. హిట్ పేరుతో వచ్చిన మూవీలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. ఆ తర్వాత హిట్-2లో లీడ్ రోల్లో అడివి శేష్ కనిపించారు. ఈ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రం హిట్-3. ఇందులో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.కాగా.. ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్లో మే 1న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతమందించనున్నారు. ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. -
వయనాడ్ సహాయక చర్యల్లో మన్యం పులి.. రియల్ ‘హీరో’ అంటూ ప్రశంసలు (ఫొటోలు)
-
రైటర్ నాని?
హీరో నాని రైటర్‌గా మారనున్నారా? అంటే అవుననే మాట ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై దర్శకుడు శైలేష్ కొలనుతో ‘హిట్, హిట్ 2’ సినిమాలను నిర్మించారు నాని. ఈ రెండు చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ‘హిట్ 2’ సినిమా చివర్లో ‘హిట్ 3’లో నాని హీరోగా పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్పాత్రలో నటించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ ఏడాదిలోనే ‘హిట్ 3’ చిత్రీకరణప్రారంభం కానుందట.‘హిట్, హిట్ 2’ సినిమాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలనే ‘హిట్ 3’ని తెరకెక్కించనున్నారు. కానీ ఈ సినిమాకు నాని కథ–స్క్రీన్‌ప్లే అందించనున్నారని భోగట్టా. మరి.. ఈ సినిమాతో నాని రైటర్‌గా మారతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఆగస్టు 29న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇంకా ‘దసరా’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని మరో సినిమా కమిటైన సంగతి తెలిసిందే. -
భార్యను రైలు ఢీకొన్నదని.. భర్త కూడా రైలుకెదురెళ్లి..
భార్యాభర్తల బంధం విడదీయరానిదని అంటారు. ఒకవేళ భాగస్వామిలో ఒకరు దూరమైతే మరొకరు తల్లడిల్లిపోతుంటారు. ఊహకందని నిర్ణయాలు కూడా తీసేసుకుంటారు. ఇంటిలోనివారికి, బంధువులకు విషాదాన్ని మిగులుస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఉదంతం రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..రాజస్థాన్‌లోని చురు జిల్లాలో రాజల్దేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ రైలు ఢీకొని మృతి చెందింది. ఈ విషయం తెలియగానే భర్త అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అతను కూడా రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. బాబులాల్ రేగర్ (50)కు తన భార్య సంతోష్ రేగర్ (43)తో ఏదో విషయమై మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారిద్దరూ కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు.రెండు రోజుల క్రితం సంతోష్ రేగర్ తన ఇంటికి సమీపంలోని రాజల్‌దేసర్‌లోని రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొని మృతి చెందింది. ఈ విషయం తెలియగానే భర్త బికనీర్-ఢిల్లీ ప్యాసింజర్ రైలుకు ఎదురెళ్లాడు. ఆ రైలు అతనిని ఢీకొనడంతో మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం భార్యాభర్తల మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
రైలు ఢీకొని పులిపిల్ల మృతి.. మరో రెండింటికి గాయాలు
మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బుధ్ని ప్రాంతంలో రైలు ఢీకొని ఒక పులి పిల్ల మృతి చెందగా, మరో రెండు పులి పిల్లలు తీవ్రంగా గాయపడ్డాయి. గాయపడిన ఈ పులి పిల్లలను చికిత్స కోసం ప్రత్యేక రైలులో భోపాల్‌లోని వనవిహార్‌కు తరలించారు. మృతి చెందిన పులి పిల్లకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం దానికి అంత్యక్రియలు చేశారు.ఈ ఉదంతం గురించి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) రాజేష్ ఖరే మాట్లాడుతూ ఉదయం వేళ పులి తన పిల్లలతో కలిసి నీరు తాగడానికి వెళ్లి ఉంటుంది. ఆ సమయంలోనే మూడు పిల్లలు రైలు ప్రమాదం బారిన పడ్డాయి. ఈ ఘటనలో ఒక పులి పిల్ల మృతి చెందగా, రెండు పులి పిల్లలు గాయపడ్డాయి. దీనిపై సమాచారం అందగానే ఘటనా స్థలానికి వెళ్లాం. గాయపడిన రెండు పులి పిల్లలను చికిత్స కోసం భోపాల్‌లోని వన విహార్‌కు తరలించామని తెలిపారు. #WATCH | Madhya Pradesh | A tiger cub died and 2 other cubs were injured after being hit by a train in the Budhni area of Sehore. Both the injured cubs were rescued and taken to Van Vihar, Bhopal by a special train for treatment. The dead cub was cremated after post-mortem.… pic.twitter.com/3WkaRDD2p2— ANI (@ANI) July 16, 2024 -
ఎమిరేట్స్ విమానం ఢీ.. 40 ఫ్లెమింగో పక్షులు మృతి
ముంబై: విమానం ఢీకొని 40 ఫ్లెమింగో పక్షులు చనిపోయిన ఘటన ముంబైలో జరిగింది. సోమవారం(మే20) దుబాయ్ నుంచి వస్తున్న ఎమిరేట్స్ విమానం తాకి వలస పక్షులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనపై పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు. నవీ ముంబైలోని చెరువుల్లో నిర్మాణాలు చేపట్టడం వల్లే ఫ్లెమింగో పక్షులు తమ దారి మార్చుకుని థానే వైపు వెళ్లాయనేది వారి వాదన. దారి మార్చుకోవాల్సి రావడం వల్లే పక్షులు విమానం ఢీకొని చనిపోయాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పక్షులు ఢీకొనడంతో దుబాయ్ తిరిగి వెళ్లాల్సిన విమానం ముంబైలోనే ఉండిపోయింది. విమానం ఫిట్‌నెస్‌పై పూర్తి పరీక్షలు నిర్వహిస్తున్నారు. విమానం మే 21 (మంగళవారం) రాత్రి 9 గంటలకు దుబాయ్ వెళ్లనుంది. -
Year End 2023: హిట్లు తక్కువ..ఫ్లాపులెక్కువ
స్ట్రయిట్ చిత్రాలు 236... డబ్బింగ్ సినిమాలు 70... మొత్తం 306 చిత్రాలను 2023 ఇచ్చింది. మరి జయాపజయాల శాతం ఎంత? అంటే... ఎప్పటిలానే విజయాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు... అపజయాలు లెక్కలేనన్ని. అయితే విజయం సాధించినవాటిలో ఎమోషనల్‌గా సాగేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా ఈ ఏడాది భావోద్వేగాలకు ప్రేక్షకులు ప్రాధాన్యం ఇచ్చారనుకోవచ్చు. ఇక ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు..’ పాటకిగాను కీరవాణి, చంద్రబోస్‌లకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు దక్కడం ఓ రికార్డ్. తెలుగు నుంచి జాతీయ తొలి ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్‌కి దక్కడం మరో ఆనందం. ఇలా కొన్ని ఆనందాలను ఇచ్చింది 2023. కె. విశ్వనాథ్, జమున, కైకాల సత్యనారాయణ, చంద్రమోహస్ వంటి వారిని దూరం చేసి, విషాదాన్ని మిగిల్చింది. ఇక... ఈ ఏడాది లెస్ హిట్.. మోర్ ఫట్‌గా సాగింది తెలుగు సినిమా. ఆ విశేషాల్లోకి... స్టార్ హీరోలు కొందరు ‘హిట్ హిట్ హుర్రే’ అంటూ మంచి విజయాలు అందుకున్నారు. వారితో పాటు కొందరు మీడియమ్ రేంజ్, చిన్న రేంజ్ హీరోలకూ 2023 విజయానందాన్నిచ్చింది. ఆ హిట్స్ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి అంటే సినిమాల పండగ. అలా ఈ ఏడాది పండగకి అన్నదమ్ముల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మంచి వసూళ్లు రాబట్టాయి. చిరంజీవి హీరోగా, రవితేజ ఓ కీలక పాత్రలో ‘వాల్తేరు వీరయ్య’కు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించగా, ‘వీరసింహారెడ్డి’ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. సంక్రాంతికి మంచి హిట్ అందుకున్న బాలకృష్ణ దసరా పండక్కి ‘భగవంత్ కేసరి’తోనూ మరో హిట్ సాధించారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఈ ఏడాది ఓ హిట్.. ఓ ఫట్ పడ్డాయి. ‘సలార్: సీజ్ఫైర్’తో ప్రభాస్‌కి సూపర్ డూపర్ హిట్ దక్కింది. స్నేహం ప్రధానాంశంగా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ ఏడాది నానీకి బాగా కలిసొచ్చింది. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని హీరోగా నటించిన మాస్, ఎమోషనల్ మూవీ ‘దసరా’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే శౌర్యువ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని హీరోగా నటించిన ఎమోషనల్ మూవీ ‘హాయ్ నాన్న’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ, సమంతల వెండితెర ప్రేమకథ ‘ఖుషీ’ కూడా ప్రేక్షకులను ఖుషీ చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపోందిన ఈ ఎమోషనల్ లవ్‌స్టోరీ మంచి వసూళ్లు రాబట్టుకుంది. తమిళ స్టార్ ధనుష్ తెలుగులో చేసిన స్ట్రయిట్ ఫిల్మ్ ‘సార్’. తెలుగు, తమిళ భాషల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపోందిన ఈ పీరియాడికల్ యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. నాలుగేళ్లుగా హీరోయిన్ గా తెలుగు వెండితెరపై కనిపించని అనుష్కా శెట్టి ఈ ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టితో కలిసి ఈ సినిమాతో రొమాంటిక్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రానికి పి. మహేశ్‌బాబు దర్శకుడు. అలాగే కుర్ర హీరోల్లో సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ హిట్‌తో జోష్‌గా ఉన్నారు. హారర్ థ్రిల్లర్‌గా కార్తీక్ దండు దర్శకత్వంలో ‘విరుపాక్ష’ రూపోందింది. గత ఏడాది హిట్ అందుకోలేకపోయిన శ్రీవిష్ణు ‘సామజవరగమన’ అంటూ ప్రేక్షకులను నవ్వించి ఈ ఏడాది సూపర్ హిట్ సాధించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆకట్టుకుంది. అలాగే కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ ‘బేబీ’తో పెద్ద హిట్ అందుకున్నారు. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మూవీకి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. హాస్య నటుడు వేణు కెరీర్ డైరెక్షన్ ఈ ఏడాది మరో మలుపు తిరిగింది. వేణు తొలిసారి దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమా సూపర్‡హిట్‌గా నిలిచింది. తెలంగాణలోని కాకిముట్టుడు సంప్రదాయం, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపోందిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ‘బలగం’ విడుదలయ్యేటప్పుడు చిన్న చిత్రమైనా వసూళ్లతో పెద్ద సినిమాగా మారింది. రెండేళ్ల క్రితం ‘మా ఊరి పోలిమేర’తో మంచి హిట్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. అయితే ఆ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా సీక్వెల్ ‘మా ఊరి పోలిమేర 2’తో ఈ ఏడాది థియేటర్స్‌లో సక్సెస్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. ఇక 2023కి ముగింపు పలుకుతూ శుక్రవారం (డిసెంబర్ 29) విడుదలైన చిత్రాల్లో కల్యాణ్‌రామ్ ‘డెవిల్’కి ప్రేక్షకాదరణ లభిస్తోంది. స్వీయదర్శకత్వంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా స్ట్రయిట్ హిట్ చిత్రాల్లో కార్తికేయ ‘బెదురులంక 2012’, ‘అల్లరి’ నరేశ్ ‘ఉగ్రం’, పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’, నవీన్ చంద్ర ‘మంత్ ఆఫ్ మధు’, సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌ల ‘మ్యాడ్’, తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ వంటివి ఉన్నాయి. అనువాద చిత్రాల్లో రజనీకాంత్ ‘జైలర్’, విజయ్ ‘వారసుడు’, ‘లియో’, మణిరత్నం ‘పోన్నియిన్ సెల్వన్ 2’, విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’, టొవినో థామస్ ‘2018’, షారుక్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’, రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ వంటివి మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని చిత్రాలతో పాటు ఏ అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాలు పరాజయాన్ని చవి చూశాయి. ఫట్ అయిన ఆ చిత్రాల గురించి.. ‘వాల్తేరు వీరయ్య’చిత్రంతో హిట్ సాధించిన చిరంజీవికి ‘భోళా శంకర్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’ రీమేక్‌గా మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ రూపోందింది. ఆల్రెడీ వేరే భాషలో హిట్టయిన సినిమా కాబట్టి ఇక్కడ కూడా ఆ ఫలితాన్ని ఆశించారు. కానీ అది నెరవేరలేదు. ఇక ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం ‘ఆది పురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో రూపోందిన ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల నేపథ్యంలో రూపోందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో పరాజయంగా నిలిచింది. రవితేజ సోలో హీరోగా నటించిన (‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కీలక పాత్ర చేశారు) ‘రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు బోల్తా కొట్టాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’, వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపోందాయి. ‘కస్టడీ’ చిత్రం రూపంలో ఈ ఏడాది నాగచైతన్యకు పరాజయం ఎదురైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ రూపోందింది. హీరో రామ్–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్కంద అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్’ కూడా నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది వరుణ్ తేజ్ వ్యక్తిగతంగా ఫుల్ హ్యాపీ. లావణ్యా త్రిపాఠీని పెళ్లి చేసుకుని, లైఫ్‌లో కొత్త చాప్టర్‌ని మొదలుపెట్టారు. అయితే కెరీర్ పరంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’ నిరాశపరిచింది. నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్లో రూపోందిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ ఆర్డినరీ సినిమా అనిపించుకుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగ మార్తాండ’ ఎమోషనల్ మూవీ అనిపించుకుంది. టాక్ బాగున్నా వసూళ్లు ఆశించిన విధంగా రాలేదు. హీరోయిన్ సమంత, నటుడు దేవ్ మోహన్ కాంబినేషన్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇవే కాదు.. గోపీచంద్ ‘రామబాణం’, కల్యాణ్ రామ్ ‘అమిగోస్’, నిఖిల్ ‘స్పై’, వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, సుధీర్ బాబు ‘హంట్, మామా మశ్చీంద్ర’ వంటి సినిమాలతో పాటు మరికొన్ని ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. -
బాక్సాఫీస్ వేటలో యానిమల్ బ్లాక్ బస్టర్
బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ వసూళ్ల వేట కొనసాగుతోంది. తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తోనే సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆ తర్వాత హిందీ పరిశ్రమ వైపు వెళ్లారు. అక్కడ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్నే ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి, మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ రెండు చిత్రాలు ఒక ఎత్తయితే సందీప్ తెరకెక్కించిన మూడో చిత్రం ‘యానిమల్’ వసూళ్ల పరంగా మరో ఎత్తు అనాలి. రణ్‌బీర్ కపూర్ కథానాయకునిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలై, సంచలన వసూళ్లతో దూసుకెళుతోంది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 116 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక తొలి వారాంతానికి రూ. 356 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా 16 రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ. 817.36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రణ్‌బీర్ కపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించే దిశగా ఈ చిత్రం దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ సాధించిన వసూళ్ల ప్రకారం ఈ ఏడాది విడుదలై, అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో ‘యానిమల్’ టాప్ ఫైవ్‌లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్ ’, ‘పఠాన్ ’ చిత్రాలు రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక ‘యానిమల్’ చిత్రం తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. తెలుగు అనువాదాన్ని ‘దిల్’ రాజు విడుదల చేశారు. రిలీజ్ అయిన తొలి రోజే రూ. 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని ‘దిల్’ రాజు పేర్కొన్నారు. తెలుగు వెర్షన్ ఇప్పటివరకూ దాదాపు రూ. 60 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఇలా ఈ ఏడాది సందీప్ రెడ్డి బాక్సాఫీస్‌ని షేక్ చేసే చిత్రం తీశారు. ఈ చిత్రానికి ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా ఓ నిర్మాత. రష్మికా మందన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రి కీలక పాత్రలు పోషించారు. ‘యానిమల్’కి రెండో భాగం ‘యానిమల్ పార్క్’ రానున్న సంగతి తెలిసిందే. -
తొలి ప్రయత్నంలోనే హిట్టవడం ఆనందం
‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పాలిమేర 2’. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌కు చెందిన వంశీ నందిపాటి ఈ నెల 3న విడుదల చేశారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా ముందుకు వెళ్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా వంశీ నందిపాటిని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అభినందించారు. వంశీ మంచి అభిరుచిగలవాడని, మొదటి ప్రయత్నంలో చిరస్మరణీమైన హిట్ అందుకోవడం తనకు ఆనందంగా ఉందని అల్లు అరవింద్ అన్నారు. ఈ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ యూనిట్ నవంబరు 10 నుంచి ఆంధ్రాలో పర్యటించనుందని కూడా ఆయన వెల్లడించారు. -
మా కష్టాన్ని మర్చిపోయే విజయం లభించింది
‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల ప్రధాన తారాగణంగా రూపోందిన హారర్ అండ్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మా ఊరి పోలిమేర 2’. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని పంపిణీదారుడు వంశీ నందిపాటి ఈ నెల 3న రిలీజ్ చేశారు.శనివారం జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్‌కు అతిథిగా హాజరైన నిర్మాత ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం వంశీ, గౌరీకృష్ణ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మా ఊరి పోలిమేర 1’ ఓటీటీలో విడుదలైనా, పార్ట్ 2 థియేటర్స్‌లో రిలీజై ఇంతటి ఘనవిజయం సాధించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ కోసం గౌరీకృష్ణ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మమ్మల్నిప్రోత్సహించిన ‘బన్నీ’ వాసు, వంశీగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్, అనిల్ విశ్వనాథ్. ‘‘ఈ సినిమా విషయంలో మూడు రోజుల నుంచి మేం చాలా కష్టపడ్డాం. ఆ కష్టాన్ని మర్చిపోయేలా మంచి విజయం దక్కడం హ్యాపీగా ఉంది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘కలెక్షన్స్ రిపోర్ట్స్ చూసి హ్యాపీగా ఉన్నాం’’ అన్నారు కామాక్షి. -
ఫిలిప్పీన్స్ నౌకలను ఢీకొట్టిన చైనా కోస్ట్‌గార్డ్ షిప్
మనీలా: దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో ఆదివారం ఫిలిప్పీన్స్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ కోస్ట్ గార్డ్ నౌక, మిలటరీ రవాణా బోటులను చైనా కోస్ట్‌గార్డ్ షిప్, దానితోపాటే వచ్చిన చైనా నౌక ఢీకొట్టాయని ఫిలిప్పీన్స్ అధికారులు తెలిపారు. ఘటనలో తమ సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని, నౌకలకు వాటిల్లిన నష్టంపై అంచనా వేస్తున్నామన్నారు. తమ నౌకలు వేగంగా ప్రయాణించకపోయుంటే చైనా నౌకల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లేదని చెప్పారు. థామస్ షోల్ వద్ద ఉన్న ఫిలిప్పీన్స్ మెరైన్ పోస్టుకు సమీపంలో ఈ నెలలో చోటుచేసుకున్న రెండో ఘటన ఇది అని చెప్పారు. ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ నిబంధలను ఉల్లంఘిస్తూ తమ నౌకల ప్రమాదాలకు కారణమవుతోందని చైనా ఆరోపించింది. -
సీక్వెల్‌కు రెడీ అయిన హిట్ సినిమాలివే!
ఒక కథ హిట్టయితే... ఆ కథని కంటిన్యూ చేస్తే బాగుంటుందని ఆ కథలోని హీరో, ఆ కథని తెరకెక్కించిన దర్శకుడు, తీసిన నిర్మాత, చూసే ప్రేక్షకులు అనుకోవడం సహజం. కానీ ఆ కథను కొనసాగించడానికి స్కోప్ ఉంటేనే ఇంకో కథ రెడీ అవుతుంది. అలా కొనసాగింపుకి ఆస్కారం ఉన్న కొన్ని కథలు రెడీ అయ్యాయి. ఇలా తమిళంలో పదికి పైగా రానున్న చిత్రాల రెండో భాగం విశేషాలు తెలుసుకుందాం. సేనాపతి తిరిగొస్తున్నాడు కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’ – 1996) బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఎప్పట్నుంచో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్న శంకర్ 2017లో ‘ఇండియన్ 2’ని ప్రకటించారు. షూటింగ్ సెట్లో జరిగిన ప్రమాదం, నిర్మాణపరంగా నెలకొన్న సమస్యలను అధిగమించుకుని, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. లైకా ప్రోడక్షన్తో కలిసి ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1920 నేపథ్యంలో సాగే ‘ఇండియన్ 2’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ పోస్టర్ మూడు సీక్వెల్స్‌లో ధనుష్ పుష్కరకాలం క్రితం విడుదలైన ‘ఆయిరత్తిల్ ఒరువన్ (‘యుగానికి ఒక్కడు’ – 2010) సంచలన విజయం సాధించింది. కార్తీ, రీమా సేన్, ఆండ్రియా, పార్తిబన్ లీడ్ రోల్స్ చేయగా, సెల్వ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ను ప్రకటించి, హీరోగా తన తమ్ముడు ధనుష్ నటిస్తారని, 2024లో ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నామని తెలిపారు సెల్వ రాఘవన్. ఇంకా ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కాలేదు. అలాగే హీరో ధనుష్–దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన ‘అసురన్’, ‘వడ చెన్నై’ చిత్రాలకు వీరి కాంబినేషన్లోనే సీక్వెల్స్‌కి ప్లాన్ జరుగుతోందని సమాచారం. రెండు సీక్వెల్స్‌లో కార్తీ ‘ఖైదీ’ (2019)గా కార్తీ సూపర్ హిట్టయ్యారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనుకుంటున్నారు. మరోవైపు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్’ కూడా హిట్ ఫిల్మ్. ‘సర్దార్ 2’ కూడా దాదాపు ఖరారైంది. కార్తీ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి కాగానే ‘సర్దార్ 2’ మొదలవుతుంది. ఈలోపు రజనీకాంత్ హీరోగా తెరకెక్కించనున్న చిత్రాన్ని పూర్తి చేసి, ‘ఖైదీ 2’ సీక్వెల్ కథ రెడీ చేస్తారట లోకేశ్. అలాగే భవిష్యత్‌లో ‘జైలర్ 2’, కమల్‌హాసన్‌తో ‘విక్రమ్ 2’, ‘బీస్ట్ 2’ చిత్రాలను తెరకెక్కించే ఆలోచన కూడా లోకేశ్ కనగరాజ్‌కి ఉందట. ‘తుప్పరివాలన్’లో విశాల్ మళ్లీ డిటెక్టివ్.. విశాల్ కెరీర్లో ఉన్న ఓ డిఫరెంట్ హిట్ ఫిల్మ్ ‘తుప్పరివాలన్’ (‘డిటెక్టివ్’ – 2017). మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్ సాధించింది. ఆ తర్వాత విశాల్, మిస్కిన్‌ల కాంబినేషన్లోనే ‘డిటెక్టివ్’కు సీక్వెల్‌గా ‘డిటెక్టివ్ 2’ను ప్రకటించారు. నిజానికి ‘డిటెక్టివ్ 2’ ఈపాటికే విడుదల కావాల్సింది. కానీ ఈ సీక్వెల్ స్క్రిప్ట్, బడ్జెట్ విషయాల్లో విశాల్‌కు, మిస్కిన్కు భేదాభిప్రాయాలు తలెత్తడంతో ‘డిటెక్టివ్ 2’ షూటింగ్ నిలిచిపోయింది. ‘డిటెక్టివ్ 2’కు తానే దర్శకత్వం వహించి, నటిస్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు విశాల్. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా విదేశాల్లో జరగనుంది. ‘తని ఒరువన్’లో నయనతార, ‘జయం’ రవి ఎనిమిదేళ్ల తర్వాత... ‘జయం’ రవి కెరీర్లో ‘తని ఒరువన్’ (ఈ సినిమా తెలుగు రీమేక్ ‘«ధృవ’లో రామ్‌చరణ్ హీరోగా నటించారు) బ్లాక్‌బస్టర్. ‘జయం’ రవి అన్నయ్య, దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించారు. 2015లో విడుదలైన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు మోహన్ రాజా. ఫైనల్‌గా ‘తని ఒరువన్’ విడుదలై, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 28న సీక్వెల్‌ను ప్రకటించారు. తొలి భాగంలో నటించిన ‘జయం’రవి, నయనతారలే మలి భాగంలోనూ నటిస్తారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ‘మాయవన్’లో సందీప్ కిషన్ మరో మాయవన్ ఐదేళ్ల క్రితం సందీప్ కిషన్ హీరోగా సీవీ కుమార్ దర్శకత్వంలో ‘మాయవన్’ అనే సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ‘మాయవన్’కు సీక్వెల్‌గా ‘మాయవన్ 2’ తీస్తున్నారు మేకర్స్. సందీప్ కిషన్, సీవీ కుమార్ కాంబినేషన్లోనే ఈ చిత్రం రూపొందుతోంది. ‘సార్పట్ట’లో ఆర్య పరంపర కొనసాగుతోంది టెడ్డీ, సార్పట్ట పరంపర.. ఆర్య కెరీర్లో ఈ రెండూ సూపర్‌హిట్ సినిమాలే. అయితే ఈ రెండు చిత్రాలూ డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల సీక్వెల్స్‌ను మాత్రం వెండితెరపైనే చూపించనున్నారు. ‘సార్పట్ట పరంపర’కు దర్శకత్వం వహించిన పా. రంజిత్‌తోనే ఇటీవల ‘సార్పట్ట పరంపర 2’ను ప్రకటించారు ఆర్య. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ఇక దర్శకుడు శక్తి సౌందర్ రాజన్తోనే ‘టెడ్డీ’ సినిమా సీక్వెల్‌ను ఆర్య ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ‘7/జి...’లో రవికృష్ణ బృందావన కాలనీ ప్రేమ దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘7/జి బృందావన కాలనీ’ (2004) యూత్‌ని బాగా ఆకట్టుకున్న విషాద ప్రేమకథ. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్. కాగా, ‘7/జి బృందావన కాలనీ’కి సీక్వెల్ ప్లాన్ చేశారు సెల్వ రాఘవన్. తొలి భాగంలో హీరోగా నటించిన రవికృష్ణ మలి భాగంలోనూ నటిస్తారు. కథానాయిక పాత్ర కోసం ఇవానా, దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ పేర్లను పరిశీలిస్తున్నారట. తొలి భాగాన్ని నిర్మించిన ఏఎమ్ రత్నం సీక్వెల్‌ని కూడా నిర్మించనున్నారు. జిగర్తాండ 2 కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2014లో విడుదలైన సినిమాల్లో హిట్‌గా నిలిచినవాటిలో ‘జిగర్తాండ’ ఒకటి. సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ తెరకెక్కింది. రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదల కానుంది. జెంటిల్‌మేన్ మారారు దర్శకుడు శంకర్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘జెంటిల్‌మేన్’ (1993). యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించారు. ఈ చిత్ర నిర్మాత కేటీ కుంజుమోన్ ఇటీవల ‘జెంటిల్ మేన్ 2’ని ్రపారంభించారు. అయితే ఈ సీక్వెల్‌కి దర్శకుడు, హీరో మారారు. ఏ. గోకుల్ కృష్ణ దర్శకత్వంలో చేతన్ శ్రీను హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీత దర్శకుడు.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్ నిధి హీరోగా రూపొందిన ‘డిమాంటీ కాలనీ’కి సీక్వెల్ వీరి కాంబినేషన్లోనే రానుంది. ఇంకా సీక్వెల్ లిస్ట్‌లో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
సైమా వేడుక.. మంచు లక్ష్మికే కోపం తెప్పించాడు..!!
టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి ప్రసన్న తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె ఇటీవలే దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. ఈ ఫంక్షన్లో పాల్గొన్న మంచు లక్ష్మికి ఓ వ్యక్తి చేసిన పనికి కోపం తెప్పించింది. తాను మాట్లాడుతుండగా ఓ వ్యక్తి కెమెరాలకు అడ్డు రావడంతో అగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా 'నీ యవ్వా' వెనక్కి వెళ్లు అంటూ గట్టిగా ఓ దెబ్బ వేసింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దక్షిణాది నటీనటులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన సైమా(SIIMA) అవార్డ్స్- 2023 ఈవెంట్ దుబాయ్‌లో నిర్వహించారు. సెప్టెంబర్ 15-16 తేదీలలో జరిగిన ఈ వేడుకల్లో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లకు సినీ ప్రముఖులందరూ పాల్గొన్నారు. అయితే ఈ వేదికపైనే మంచు లక్ష్మి మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కెమెరాలకు అతను అడ్డుకోవడంతో కోపంతో కొట్టేసింది. ఆ తర్వాత మరో వ్యక్తి అక్కడికి రావడంతో కెమెరా వెనకకు వెళ్లండి డ్యూడ్ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ సమర్థించగా.. మరికొందరేమో తప్పుపడుతున్నారు. కాగా.. మంచు లక్ష్మి టాలీవుడ్లో అనగనగా ఓ ధీరుడు సినిమాతో నటిగా రంగప్రవేశం చేసింది. అంతే కాకుండా లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్, పిట్ట కథలు, మాన్స్టర్, గుంటూరు టాకీస్ వంటి చిత్రాల్లో నటించింది. వీటితో పాటు లాస్ వెగాస్ అనే అమెరికన్ టీవీ సిరీస్‌లో కనిపించింది. ఆమె డెస్పరేట్ హౌస్‌వైవ్స్, లేట్ నైట్స్ విత్ మై లవర్, మిస్టరీ ఈఆర్ లాంటి హాలీవుడ్ సిరీస్‌ల్లో నటించింది. ఎవడ్రా మా లచ్చక్క మాట్లాడే అప్పుడు మధ్యలో అడ్డం వస్తున్నారు ని అవ్వ 😁 హాల్లో డుర్ go behind the camera dude🤣@LakshmiManchu pic.twitter.com/Ry5FBNyN3A — 𝐉𝐚𝐲𝐚𝐧𝐭𝐡 𝐆𝐨𝐮𝐝 🇸𝐈𝐍𝐆𝐋𝐄 (@jayanthgoudK) September 21, 2023 -
క్లైమాక్స్ బాగుంటే హిట్టే – శివ నిర్వాణ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొం దిన చిత్రం ‘ఖుషి’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘శాస్త్రాలు, సిద్ధాంతాలు వేరు కావొచ్చు. కానీ ఎవరు ఏది నమ్మినా నమ్మకున్నా మనం మనల్ని ప్రేమించే మనుషులతో కలిసి ఉండాలని ‘ఖుషి’లో చెప్పం. క్లైమాక్స్ బాగుందని ప్రశంసలు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. క్లైమాక్స్ బాగుంటే సినిమా హిట్టే.. ఫెయిల్ అయిన చరిత్ర లేదు’’ అన్నారు. ‘‘షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. ‘ఖుషి’ మంచి మూవీ కాబట్టి అవార్డులూ రావొచ్చు’’ అన్నారు నవీన్. ‘‘కథని నమ్మి ‘ఖుషి’ని నిర్మించాం. మా నమ్మకానికి తగ్గట్టు ఫలితాలు సానుకూలంగా వస్తున్నాయి’’ అన్నారు వై. రవిశంకర్. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్, సినిమాటోగ్రాఫర్ మురళి, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి పాల్గొన్నారు. -
అయ్యో..! కారు ప్రమాదంలో గాయపడిన పులి.. కుంటుకుంటూ..
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని అభయారణ్యంలో వేగంగా వెళుతున్న కారు ఓ పులిని ఢీకొట్టింది. ఈ ఘటనలో పులి తీవ్రంగా గాయపడిన పులి ప్రాణాలను కోల్పోయింది. గోండియా జిల్లాలోని నావగావ్- నజ్రియా కారిడార్‌లో ఈ ప్రమాదం జరిగింది. రెండేళ్ల పులి రోడ్డు దాటుతుండగా.. ముర్డోలీ అటవీ ప్రాంతంలోని కోహ్‌మారా-గోండియా రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ప్రమోద్ పంచభాయ్ తెలిపారు. ఈ ఘటనలో ప్రమాదం జరిగిన చోటే రోడ్డుపైనే గాయంతో పులి కాసేపు కూర్చుండిపోయింది. కారు అక్కడే ఆగడంతో మళ్లీ ఏం ప్రమాదం పొంచి ఉందో? అనే భయంతో నొప్పి ఉన్న కాలుతోనే పొదల్లోకి కింద పడుతూ వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన దశ్యాలను వెనుక ఉన్న వాహనదారులు వీడియో తీశారు. అటవీ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను పంచుకున్నారు. Dear friends Wildlife has first right of way in #wildlife habitats. So always travel safely & slowly. This tiger hit by vehicle at Nagzira. Via @vijaypTOI pic.twitter.com/fpx6zlKQDI — Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 11, 2023 అటవీ ప్రాంతంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని ప్రవీణ్ కాశ్వాన్ కోరారు. జంతువులకు హాని కలగకుండా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జంతు ప్రేమికులు. గాయపడిన పులి కోసం అధికారులు ఉదయం వెతికి జంతు సంరక్షణ శిబిరానికి తీసుకువచ్చే క్రమంలో బాధిత పులి మరణించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: పంజాబ్‌లో దారుణం.. ఇంట్లో చెప్పకుండా వెళ్లిందన్న కోపంలో ఓ తండ్రి ఘాతుకం -
అందుకే గాండీవధారి అర్జున చేశాను – వరుణ్ తేజ్
‘‘ప్రవీణ్ సత్తారు ‘గాండీవధారి అర్జున’ కథ చెప్పినప్పుడు బాగా నచ్చేసింది. ఓ సమస్య గురించి సినిమా తీస్తున్నప్పుడు ఓ నటుడిగా అలాంటి సినిమా చేయటం నా బాధ్యత అనిపించింది.. అందుకే ఈ మూవీ చేశాను’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాక్షీ వైద్య జంటగా నటించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. బాపినీడు .బి సమర్పణలో ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. గురువారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘గాండీవధారి అర్జున’ ట్రైలర్ చూసి యాక్షన్ మాత్రమే ఉంటుందనుకోవద్దు.. మంచి ఎమోషన్స్ ఉంటాయి. దేశానికి వచ్చే సమస్య ఏంటి? అనేది చూపించాం’’ అన్నారు. ‘‘వరుణ్ తేజ్‌తో మేం చేసిన మొదటి సినిమా ‘తొలి ప్రేమ’, సాయితేజ్‌తో చేసిన ‘విరూ పాక్ష’ హిట్ అయ్యాయి. ఇప్పడు ‘గాండీవధారి అర్జున’ కూడా సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. ‘‘భూమిపై ఉన్న వనరులను ఇష్టానుసారం వాడేస్తున్నాం. భవిష్యత్ తరాల గురించి ఆలోచించటం లేదు. పర్యావరణ పరిరక్షణ గురించి ఈ సినిమా తీశాం’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. -
కోలీవుడ్ హిట్ సినిమాలు హిందీలోనూ హిట్ ఆవుమా?
ఓ సినిమా హిట్ అయితే... ఆ సినిమాలోని కథ ఏ భాషకైనా, ప్రాంతానికైనా నప్పే విధంగా ఉంటే.. అందరి దృష్టీ ఆ సినిమా మీద పడుతుంది. అలా తమిళంలో హిట్టయిన చిత్రాల మీద హిందీ పరిశ్రమ దృష్టి పడింది. ఆ చిత్రాల రైట్స్ చేజిక్కించుకుని, రీమేక్ చేస్తున్నారు. మరి.. తమిళంలో హిట్ ఆన (అయిన) సినిమా హిందీలోనూ హిట్ ఆవుమా? (అవుతుందా?) అంటే.. వేచి చూడాల్సిందే. ఇక హిందీలో రీమేక్ అవుతున్న తమిళ చిత్రాల గురించి తెలుసుకుందాం. విమానయానం ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితంతో సుధ కొంగర దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ (‘ఆకాశం నీ హద్దురా’). సూర్య హీరోగా నటించిన ఈ చిత్రం 2020లో డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజై, మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. సుధా కొంగరే రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రీమేక్‌కు సూర్య ఓ నిర్మాతగా ఉండటం విశేషం. సామాన్యులు సైతం విమానయానం చేసేందుకు గోపీనాథ్ ఏ విధంగా కృషి చేశారు? ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? అనేది ‘సూరరై పోట్రు’ కథాంశం. అలాగే విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘కత్తి’ (2014) రీమేక్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తారని సమాచారం. హిందీ రైట్స్‌ను దర్శక–నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ దక్కించుకున్నారు. హిందీ అపరిచితుడు విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అన్నియన్’ (‘అపరిచితుడు’) ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నట్లు శంకర్ ప్రకటించారు. ఇందులో రణ్వీర్ సింగ్ హీరోగా నటించాల్సింది. కొన్ని లీగల్ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై మానసిక వేదనకు గురైన ఓ మధ్యతరగతి యువకుడు ఏం చేశాడు? అనేది ఈ చిత్రం కథాంశం. గ్యాంగ్‌స్టర్ సెంటిమెంట్ చెల్లెలి సంరక్షణ కోసం ఓ గ్యాంగ్‌స్టర్ తన జీవితాన్ని ఏ విధంగా మార్చుకున్నాడు? ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్లలకు ఎలా బుద్ధి చెప్పాడు? అనే అంశాలతో రూపొందిన తమిళ చిత్రం ‘వేదాళం’. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో 2015లో విడుదలైన ఈ సినిమా హిట్ సాధించింది. ఈ సినిమా ‘వేద’గా హిందీలో రీమేక్ అవుతోంది. జాన్ అబ్రహాం టైటిల్ రోల్ చేస్తున్నారు. నిఖిల్ అద్వానీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్స్ తమన్నా, శర్వారి లీడ్ రోల్స్ చేస్తున్నారు. జాన్ అబ్రహాం సిస్టర్‌గా శర్వారి, హీరోయిన్గా తమన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది. 16ఏళ్లు కోమాలో ఉంటే.. దాదాపు 16 సంవత్సరాలు కోమాలో ఉన్న ఓ వ్యక్తి ఆరోగ్యం హఠాత్తుగా కుదుటపడుతుంది. కోమా నుంచి బయటకు వచ్చిన అతను సమకాలీన నాగరికత, జీవన విధానం, టెక్నాజీలను చూసి ఆశ్చర్యపో తాడు. ఈ పరిస్థితులను అతడు తన జీవితానికి ఎలా అన్వయించుకున్నాడు? తన పూర్వీకులకు చెందిన ఓ విగ్రహం అతని జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది? అన్నది ‘కోమాళి’ కథనం. ‘జయం’ రవి హీరోగా ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2019లో విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను బోనీ కపూర్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా నటిస్తారని బాలీవుడ్లో ఎప్పట్నుంచో ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇటు పోలీస్.. అటు ఎన్ఆర్ఐ బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఇటీవల రీమేక్స్ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ నిర్మిస్తన్న ఓ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తమిళ దర్శకుడు కాలిస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2016లో అట్లీ దర్శకత్వంలో వచ్చిన తమిళ హిట్ ఫిల్మ్ విజయ్ ‘తేరి’కి ఇది హిందీ రీమేక్ అని బాలీవుడ్ సమాచారం. ఓ రాజకీయ నాయకుడి కుమారుడు ఓ యువతిపై అత్యాచారం చేస్తే, అతన్ని చంపేస్తాడు ఓ పో లీసాఫీసర్. అప్పడు ఆ రాజకీయ నాయకుడు ఆ పోలీసాఫీసర్‌పై ఏ విధంగా పగ తీర్చుకున్నాడు? ఆ రాజకీయ నాయకుణ్ణి ఆ పోలీసాఫీసర్ ఎలా ఢీ కొన్నాడు? అన్నదే టూకీగా ‘తేరి’ కథాంశం. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా వరుణ్ ధావన్ నటిస్తున్నారు. అలాగే మరో తమిళ హిట్ ‘మనాడు’ హిందీ రీమేక్‌లో కూడా వరుణ్ ధావన్ నటించనున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. శింబు, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మానాడు’. ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ రానా వద్ద ఉన్నాయి. ఓ ఎన్ఆర్ఐకి, పో లీసాఫీసర్కి మధ్య కొన్ని రాజకీయ అంశాల నేపథ్యంలో ఎలాంటి శత్రుత్వం ఏర్పడింది? అనే కోణంలో ఈ సినిమా సాగుతుంది. ఎన్ఆర్ఐగా శింబు నటించగా, పోలీసాఫీసర్‌గా ఎస్జే సూర్య నటించారు. ట్రెండీ లవ్‌స్టోరీ రూ. 5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొంది, బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకుపైగా కలెక్షన్స్‌ను సాధించిన తమిళ ట్రెండీ లవ్‌స్టోరీ ‘లవ్ టుడే’. ప్రదీప్ రంగనాథన్ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇవానా హీరోయిన్. గత ఏడాది నవంబరులో విడుదలైన ఈ సినిమా హిందీ రీమేక్‌ను ఫ్యాంథమ్ స్టూడియోస్, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నాయి. ఇందులో హీరో హీరోయిన్లుగా ఆమిర్ ఖాన్ పెద్ద కొడుకు జైనైద్ ఖాన్, శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్లు ఫైనల్ అయ్యారని, షూటింగ్ కూడా మొదలైందని బాలీవుడ్ సమాచారం. ప్రేమలో ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి పరస్పర అంగీకారంతో వారి మొబైల్ ఫోన్స్‌ను మార్చుకున్నప్పుడు ఏం జరిగింది? అనే అంశంతో ‘లవ్ టుడే’ చిత్రం రూపొందింది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని తమిళ సినిమాలు కూడా హిందీలో రీమేక్ కానున్నాయని తెలుస్తోంది. -
దివ్యాంగునిపై పోలీసుల దారుణం.. నీళ్లు అడిగాడని.. వీడియో వైరల్..
లక్నో: దివ్యాంగునిపై ఇద్దరు పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. నీళ్లు అడిగినందుకు అర్థరాత్రి అతనిపై విరుచుకుపడ్డారు. దివ్యాంగుడని కూడా చూడకుండా అతన్ని విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముడు చక్రాల బండిలో కూర్చున్న వ్యక్తి పేరు సచిన్ సింగ్. 2016లో రైలు ప్రమాదంలో రెండు కాళ్లు పోయాయి. స్థానికంగా సిమ్‌లు అమ్మతుంటాడు. ఓ రెస్టారెంట్లో సప్లయర్‌లా కూడా పనిచేస్తాడు. శనివారం రాత్రి పని ముగించుకుని వస్తుండగా.. అతనికి ఓ తాబేలు కనిపించింది. దాన్ని పట్టుకుని స్థానికంగా ఉన్న చెరువులో వదిలి వస్తుండగా.. పోలీసులు ఎదురైనట్లు చెప్పారు. చేతి కడుకోవడానికి నీళ్లు అడిగిన క్రమంలో పోలీసులు ఫైరనట్లు వెల్లడించారు. In UP's Deoria, a purported video of a specially-abled man on a tricycle being assaulted by two men identified as Prantiya Rakshak Dal (PRD) jawans has surfaced on social media. pic.twitter.com/grJgsp195G — Piyush Rai (@Benarasiyaa) July 30, 2023 చేతికి తాబేలు వాసన కారణంగానే తాను నీళ్లు అడినట్లు బాధితుడు పోలీసులకు తెలిపారు. విచక్షణా రహితంగా తలపై కొట్టారని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. స్థానిక ఎస్పీ సంకల్ప్ శర్మ స్పందించారు. ఆ ఇద్దరు పోలీసులను రాజేంద్ర మని, అభిషేక్ సింగ్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. వారు ప్రాంతీయ రక్షక్ దళానికి చెందినవారిగా గుర్తించారు. విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ అరెస్టు.. -
కాలేజీ విద్యార్థి హత్యలో బిగ్ ట్విస్ట్.. మూడు రోజుల ముందే స్కెచ్ వేసి..
ఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం జరిగింది. కాలేజీ విద్యార్థిని(25)ని ఓ యువకుడు ఇనుప రాడ్డుతో బాది హతమార్చాడు. దీంతో బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఢిల్లీ మాలవీయ నగర్‌లోని అరబిందో కాలేజీ వద్ద ఉన్న పార్క్‌లో జరిగింది. బాధితురాలిని కమల నెహ్రూ కాలేజీ విద్యార్థినినిగా గుర్తించారు. మూడు రోజుల ముందే పథకం ప్రకారం నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని ఇర్ఫాన్‌గా గుర్తించారు. బాధితురాలు ఇర్పాన్ ప్రేమించుకున్నారు. కానీ ఇర్ఫాన్‌కు సరైన ఉద్యోగం లేని కారణంగా వివాహానికి బాధితురాలు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి యువతి ఇర్పాన్‌తో మాట్లాడటం మానేసింది. స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేసే ఇర్ఫాన్.. తన తమ్ముడికి కూడా వివాహం కుదరడంతో అవమానానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. పక్కా పథకంతో.. బాధితురాలు మాట్లాడకపోయేసరికి ఆగ్రహానికి గురైన ఇర్ఫాన్.. ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకున్నాడు. ప్రియురాలు రోజూ స్టెనోగ్రఫీ ట్రైనింగ్‌కు వెళుతుందని ముందే తెలిసి మూడు రోజుల ముందే పథకం పన్నాడు. పార్కుకు పిలిచి ప్రేమ వ్వవహారంపై ప్రశ్నించాడు. కానీ బాధితురాలు ఒప్పుకోకపోయేసరికి విచక్షణ కోల్పోయాడు. బాధితురాలిని ఇనుప రాడ్డుతో తలపై బాది హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేసుకుని మాలవీయ నగర్లో స్టెనోగ్రఫీ కోచింగ్‌కి బయటకు వచ్చిందని పోలీసులు తెలిపారు. 'మాలవీయ నగర్‌లోని అరబిందో కాలేజీ వద్ద ఉన్న పార్క్‌లో ఓ బాలిక మృతదేహం పడి ఉందని మాకు సమాచారం వచ్చింది. బాధితురాలు తన ఫ్రెండ్‌తో కలిసి పార్కుకు వచ్చినట్లు తెలుస్తోంది. యువతి తలకు బలమైన గాయం తగిలింది. ఆమె మృతదేహం పక్కనే ఇనుప రాడ్డు పడి ఉంది.' అని ఢిల్లీ డీసీపీ చందన్ చౌధరి తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్పందించారు. నాగరికత ఉన్న దేశ రాజధానిలో ఓ అమ్మాయిని కొట్టి చంపారు. ఢిల్లీలో రక్షణ కరవైంది. ఇది ఎవరికీ పట్టింపు లేదు. కేవలం వార్తాపేపర్లలో మాత్రం అమ్మాయిల పేర్లు మారుస్తున్నారు. నేరాలు ఆగడం లేదని ట్వీట్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించనట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉరిశిక్ష ఒక్కటే సరైనది.. ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనలో నిందితునికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతకు మించి ఏదైనా తక్కువేనని బాధితురాలి తండ్రి అన్నారు. తనకు ఉన్నది ఒక్కతే కూతురని చెప్తూ విలపించారు. #WATCH | Woman murdered in Malviya Nagar | "We need death penalty for the accused, nothing less. I had only one daughter…I won’t leave him”, father of the victim breaks down pic.twitter.com/TEQkhiqRwf — ANI (@ANI) July 28, 2023 ఇదీ చదవండి: ప్రొఫెసర్ ఘాతుకం.. తోటి ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులు.. -
ఇంటర్వ్యూల కోసమే చీప్ ట్రిక్స్.. ఎందుకు కొడతానన్న స్టార్ నటుడు!
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ షూటింగ్లో భాగంగా ఎవరినైనా కొట్టేస్తాడని గతకొంతకాలంగా ఓ ప్రచారం జరుగుతోంది. సన్నివేశం బాగా రావడం కోసం సహనటులపై నిజంగానే చేయి చేసుకుంటాడని ఈ పుకారు చాటి చెప్తోంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న అనిల్ కపూర్ ఈ రూమర్‌పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'ఇది నిజం కాదు. కొందరు కావాలనే కొన్నింటిని పెద్దవి చేసి చెప్తారు. అలాగైతే ఇంకా ఎక్కువమంది ఇంటర్వ్యూలకు పిలుస్తారని కాబోలు! కావాలని నేను ఎందుకు కొడతాను?' అని చెప్పుకొచ్చాడు. (ఇది చదవండి: చనిపోయిన అభిమానుల కుటుంబాలకు అండగా సూర్య, వీడియో కాల్ చేసి..) కాగా అనిల్ కపూర్‌తో జుగ్‌జుగ్ జియోలో నటించిన మనీశ్ పౌల్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'తొలి సన్నివేశంలోనే అనిల్ చాలా చిరాకుపడ్డాడు. నన్ను చెంపదెబ్బ కొట్టబోయాడు. ఆ తర్వాత మళ్లీ మేమిద్దరం బాగానే ఉన్నామనుకోండి' అని పేర్కొన్నాడు. తొలి సన్నివేశంలోనే అంత చిరాకు పడి కొట్టేదాకా వచ్చాడంటే అనిల్ ఇప్పటివరకు ఎంతమందిని కొట్టి ఉంటాడోనని ప్రచారం నడిచింది. ఇక అనిల్ సినిమాల విషయానికి వస్తే.. అతడు ఇటీవల నటించిన ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందుతోంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యానిమల్‌లో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్ కావాల్సి ఉండగా డిసెంబర్ 1కి వాయిదా పడింది. ఇకపోతే ఫైటర్ సినిమాలోనూ అనిల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. (ఇది చదవండి: ఆ సినిమాలే ఓ పరమ చెత్త.. అందుకే ఎవరూ చూడరు: సినీ క్రిటిక్ ) -
యాక్షన్ హెబ్బులి.. ఆగస్టు 4న తెలుగులో రిలీజ్
సుదీప్, అమలా పాల్ జంటగా ఎస్. కృష్ణ దర్శకత్వంలో రూపొందిన కన్నడ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘హెబ్బులి’. ఈ సినిమాను అదే టైటిల్‌తో సి. సుబ్రహ్మణ్యం ఆగస్టు 4న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, రొమాంటిక్ సీన్స్ మిళితమై ఉన్న పక్కా కమర్షియల్ ఫిల్మ్ ‘హెబ్బులి’. కన్నడంలో రూ. 100 కోట్లు సాధించింది. తెలుగులోనూ హిట్ అవు తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ఆ డైరెక్టరా? అంటూ ఓ హీరో 'బేబీ' కథే వినలేదు: సాయి రాజేష్
‘‘బేబి’కి నా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారనే నమ్మకం ఉండేది. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందేమో? అనే భయం కూడా ఉండేది. ఫ్లాప్ అయినా సంగీతం, కెమెరా, నటీనటులు.. ఇలా అందరికీ పేరు వస్తుంది.. కానీ నా కెరీర్ నాశనం అవుతుందని తెలిసినా రిస్క్ చేసి ‘బేబి’ చేశాను. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు. (ఇదీ చదవండి: ఎవరూ నమ్మలేరు మన హీరోయిన్లు పాక్ సినిమాల్లో నటించారంటే) ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. బేబీ’కి ఆనంద్ కంటే ముందు ముగ్గురు హీరోలను అనుకున్నామని ఆయన చెప్పారు. అందులో ఓ హీరోని కలిశాక హ్యాండిల్ చేయలేనేమో అని భయపడి వెనక్కి తగ్గినట్టు తెలిపాడు. దీంతో మరో హీరోకి కథ చెప్పడం కోసం నిర్మాణ సంస్థ నుంచి ఫోన్ చేస్తే ‘సాయిరాజేశ్ దర్శకత్వం అయితే చేయనని ఓపెన్‌గానే అన్నట్లు పేర్కొన్నాడు. ‘హృదయం కాలేయం’ సినిమాతో తనపై పడిన ముద్ర అలాంటిదని చెప్పుకొచ్చాడు. ఆ క్షణమే ‘బేబి’ జాతకం మారిపోయింది. ఆ రోజంతా చాలా బాధపడ్డానని, ఆరోజు నిద్రకూడా పట్టలేదని తెలిపాడు. నిజానికి ‘బేబి’తో పోలిస్తే 'హృదయ కాలేయం'లాంటి సినిమా చేయడమే కష్టమని సాయిరాజేశ్ చెప్పాడు. -
రూ.2,000 నోటు ఉపసంహరణ ఎఫెక్ట్: ఆరేళ్ల గరిష్టానికి బ్యాంక్ డిపాజిట్లు
ముంబై: ఆర్బీఐ రూ.2,000 నోటును ఉపసంహరిస్తున్నట్టు చేసిన ప్రకటన బ్యాంక్ డిపాజిట్లు భారీగా పెరిగేందుకు దారితీసింది. బ్యాంక్ డిపాజిట్లు ఆరేళ్ల గరిష్టానికి చేరి, జూన్ 30 నాటికి 191.6 లక్షల కోట్లుగా ఉన్నాయి. వ్యవస్థలో రూ.2,000 నోటు రూపంలో మొత్తం రూ.3.62 లక్షల కోట్లు చెలామణిలో ఉండగా, ఇందులో 75 శాతానికి పైగా బ్యాంక్‌లోకి తిరిగొచ్చినట్టు ఈ నెల మొదట్లో ఆర్బీఐ ప్రకటించడం గమనార్హం. అంటే రూ.2.7 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు కేవలం రూ.2,000 నోటు రూపంలోనే వచ్చినట్టు తెలుస్తోంది. ఏడాదిలో చూసుకుంటే బ్యాంక్ డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ.191.6 లక్షల కోట్లకు చేరినట్టు కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. 2017 మార్చి తర్వాత ఇదే గరిష్ట స్థాయి అని చెప్పారు. డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరగడం, రూ.2,000 నోటు ఉపసంహరణ ఇందుకు మద్దతుగా నిలిచినట్టు తెలిపారు. డిపాజిట్లు, రుణాల మధ్య వ్యత్యాసం 3.26 శాతం మేర జూన్ 30తో ముగిసిన పక్షం రోజుల్లో తగ్గింది. మరోవైపు రుణాల్లో వృద్ధి 16.2 శాతంగా ఉంది. ఇదీ చదవండి ➤ IT Dept clarification on PAN: పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్ జూన్ 30తో ముగిసిన పక్షం రోజుల్లో రూ.143.9 లక్షల కోట్లకు రుణాలు పెరిగాయి. వ్యక్తిగత రుణాలు, ఎన్బీఎఫ్సీ, వ్యవసాయం, అనుబంధ రంగాల నుంచి ఎక్కువ డిమాండ్ కనిపించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రుణ వితరణలో వృద్ధి 14.5 శాతంగానే ఉంది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాల (పీఎల్ఐ) మద్దతుతో మూలధన వ్యయాలు పెరుగుతుండడం, ఇక ముందూ రుణాలకు డిమాండ్‌ను నడిపిస్తుందని కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. 2023–24లో 13–13.5 శాతం వృద్ధి చెందొచ్చని పేర్కొంది. -
ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..
న్యూఢిల్లీ: ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై తర్వాత, ఈ స్థాయిలో వాన దంచికొట్టడం ఇదే ప్రథమం. అయితే.. ఆయా రాష్ట్రాల్లో మరింత వర్షం సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీతోపాటు జమ్మూకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఢిల్లీతోపాటు గురుగ్రామ్ సహా పలు నగరాలు పట్టణాల్లో రహదారులపై నీరు నిలవడంతో జనం ట్రాఫిక్ కష్టాలపై వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తర రైల్వే 17 రైళ్లను రద్దు చేసింది. మరో 12 రైళ్లను దారి మళ్లించింది. హిమాచల్ అస్తవ్యస్తం హిమాచల్ ప్రదేశ్‌లోని 7 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. సిమ్లా జిల్లాలో ఇల్లు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, కులు, చంబా జిల్లాల్లో ఒక్కరు చొప్పున చనిపోయారు. గత 36 గంటల్లో 14 కొండ చరియలు విరిగి పడిన ఘటనలు, 13 ఆకస్మిక వరదల ఘటనలు నమోదయ్యాయి. వరదలతో కొట్టుకుపోయిన 700 రోడ్లను మూసివేశారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం లాహోల్ స్పిటిలోని చంద్రతాల్‌లో 200 మంది వరద నీటిలో చిక్కుకుపోయారు. బియాస్ వరదల్లో చండీగఢ్–మనాలి హైవేలోని కొంతభాగం కొట్టుకుపోయింది. మనాలి, కిన్నౌర్, చంబాల్లో వరదల్లో దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఇదీ చదవండి: Heavy Rains: హిమాచల్ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్.. ఉత్తరాఖండ్‌లో ముగ్గురు గల్లంతు ఉత్తరాఖండ్‌లో భక్తులతో వెళ్తున్న జీపు రిషికేశ్–బద్రీనాథ్ నేషనల్ హైవేపై గంగా నదిలో పడిపోయి ముగ్గురు మృతి చెందారు. జీపులో 11 మంది ఉండగా, ఐదుగురిని కాపాడామని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని యంత్రాంగం తెలిపింది. కశ్మీర్లో ఇద్దరు జవాన్ల దుర్మరణం జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఆకస్మిక వరదలకు బస్సుపై కొండచరియలు విరిగిపడి ఇద్దరు జవాన్లు కొట్టుకుపోయి దుర్మరణం పాలయ్యారు. పంజాబ్, హరియాణాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇదీ చదవండి: ఉప్పొంగిన బియాస్ నది.. జాతీయ రహదారిపై చొచ్చుకువచ్చి.. వీడియో వైరల్ -
షాకింగ్ ఘటన: కొండచిలువనే ఆయుధంగా..వ్యక్తిపై దాడి
కొందరూ తమ పెంపుడు జంతువులను, పక్షులను ప్రేమగా చూసుకుంటున్నట్లు కలరింగ్ ఇస్తారు. నిజానికి కొందరూ వారికేదో సరదా హాబీలా పెంచుతారు. తమకు ఇబ్బంది లేదా కష్టం అనుకుంటే వాటి ప్రాణాలు తీసేందుకు లేదా వాటిని ప్రమాదంలో పడేయడం వంటివి చేస్తారు. అచ్చం అలానే ఇక్కడో వ్యక్తి ఓ పెంపుడు కొండచిలువ పట్ల అలానే వ్యవహరించాడు. ఈ ఘటన కెనడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..కెనడాలోని టొరంటోలో ఓ వ్యక్తి తన పెంపుడు కొండచిలువను ఆయుధంగా ఉపయోగించుకుని దాడికి దిగుతాడు. పాపం ఆ వ్యక్తిని నడి రోడ్డుపై ఆ పెంపుడు పాముని తాడు మాదిరిగా చేసుకుని ఇష్టారీతిలో కొడుతుంటాడు. అవతల వ్యక్తి తనను తాను రక్షించుకునేందుకు యత్నించినా కూడా వదలకుండా అలా దాడి చేస్తూనే ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసు వాహానం అటుగా రావడంతో వెంటనే సదరు వ్యక్తిని ఆపి అదుపులోకి తీసుకున్నారు. ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిని టోరంటో నివాసి 45 ఏళ్ల లారేనియో అవిలాగా గుర్తించి అరెస్టు చేయడమే గాక ఒక ప్రాణిని ఇబ్బందులకు గురి చేసినందుకు పలు కేసులు నమోదు చేసి కోర్టులో హాజర్చారు కూడా. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Dude uses his pet snake as a weapon during street fight in Toronto 😳 pic.twitter.com/T2lLKaLe4E — Crazy Clips (@crazyclipsonly) May 13, 2023 (చదవండి: పదేళ్లు జైల్లో పెట్టేలా కుట్ర! అయినా తగ్గేదేలే! నాచివరి..!: ఇమ్రాన్ ఖాన్) -
టాలీవూడ్ మూవీస్ సీక్వెల్స్ దందా
-
లక్ష్యం, లౌక్యం లాంటి హిట్ కొడుతున్నాం
-
13 నెలలకే నూరేళ్లు.. చూసుకోకుండా కారును వెనక్కి తీయడంతో..
సాక్షి, కామారెడ్డి క్రైం: చూసుకోకుండా కారును వెనక్కి తీయడంతో 13 నెలల బాలుడు మృతి చెందాడు. కామారెడ్డి మండలం ఇస్రోజీవాడిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. సిద్దం స్వామి, శ్వేతలకు 13 నెలల బారు అయాన్షు ఉన్నాడు. స్వామి తనకున్న స్విఫ్ట్ డిజైర్ కారును కిరాయికి నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటి దగ్గరే పార్క్ చేసి ఉంచిన కారును కిరాయి నిమిత్తం స్వామి అన్న సాయిలు బయటకు తీయబోయాడు. అకస్మాత్తుగా ఇంట్లో నుంచి కారు వద్దకు వచ్చిన అయాన్షు కారు వెనుక భాగంలో నిల్చున్నాడు. సాయిలు గమనించకుండా కారును వెనక్కి తీసుకోవడంతో బాలుని తలపై నుంచి టైరు వెళ్లింది. బాలుడు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే గమనించి.. అతడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: పెంపుడు కుక్కతో తమాషా చేస్తూ..జనంపైకి ఉసిగొల్పిన ఓ సీఐ) -
14 నెలలు నరకం.. ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి.. ప్రముఖ నటి
బాలీవుడ్ నటి ఫ్లోరా సయానీ సంచలన ఆరోపణలు చేసింది. ప్రముఖ నిర్మాత తనను తీవ్రమైన లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపించింది. గత 14 నెలలుగా నరకం అనుభవించానని చెప్పుకొచ్చింది. ప్రముఖ నిర్మాత తనను అత్యంత దారుణంగా హింసిచాడని వాపోయింది. అంతే కాకుండా ప్రైవేట్ పార్ట్స్‌ను గాయపరిచాడని వెల్లడించింది ఫ్లోరా సయానీ. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అతని నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని పేర్కొంది. సయానీ తనకు జరిగిన దారుణాన్ని గుర్తుచేసుకుంటూ..'నేను ప్రముఖ నిర్మాతను ప్రేమించా. అంతలోనే కానీ నా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అతను నన్ను దుర్భాషలాడాడు. అతను నా ముఖం,ప్రైవేట్ భాగాలపై విచక్షణారహితంగా కొట్టాడు. అతను నా ఫోన్ లాక్కుని బలవంతం చేశాడు.నటన మానేయాలని 14 నెలలుగా చిత్రహింసలు పెట్టాడు. నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా చేశాడు. చివరికి అతని వద్ద నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చా.'అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నానని తెలిపింది. ఆ నరకం నుంచి కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టిందని చెప్పింది. నన్ను ఇష్టపడే వారి వద్దకు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నానని ఫ్లోరా పేర్కొన్నారు. ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్ద సంతోషంగా ఉన్నానని వీడియోలో వెల్లడించింది. అయితే ఆ ప్రముఖ నిర్మాత పేరు మాత్రం ఎక్కడా వెల్లడించలేదు సయానీ. ఫ్లోరా సయానీ సినీ కెరీర్ 1999లో తన నటనా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ పెద్దగా సినిమాల్లో నటించలేదు సయానీ. 2016 నుంచి మైడ్ ఇన్ ఇండియా, గాండీ బాత్, మాయనగరి: సిటీ ఆఫ్ డ్రీమ్స్, ఆర్య వంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది. ఆ తర్వాత ఫ్లోరా కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలలో కూడా నటించింది. ఇటీవల భేడియా, దో లఫ్జోన్ కి కహానీ, గుడ్డు కి గన్ బాలీవుడ్ చిత్రాలలో కనిపించింది. View this post on Instagram A post shared by Flora Saini (@florasaini) -
Viral Video : కారు ఎక్కి కూర్చున్న ఏనుగు
-
'హిట్' సిరీస్‌లో వెంకటేశ్? త్వరలోనే సెట్స్‌పైకి మూవీ
హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ హిట్ సిరీస్ థర్డ్ పార్ట్ ‘హిట్: ది థర్డ్ కేసు’ చిత్రంలో నాని హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తారు నాని. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అయితే హిట్ ఫ్రాంచైజీలో ఓ హీరోగా వెంకటేశ్ నటించనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. వెంకటేశ్‌కు శైలేష్ కొలను ఇటీవల ఓ కథ వినిపించారనే వార్తలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ కథ ‘హిట్’ సిరీస్‌లోనిదే అని సమాచారం. ‘హిట్ 2’ ఎండింగ్లో నాని వచ్చి, ‘హిట్ 3’లో హీరోగా నటిస్తున్నారు. అలా ‘హిట్ 3’ ఎండింగ్లో వచ్చి, ‘హిట్ 4’లో హీరోగా నటిస్తారట వెంకటేశ్. -
Viral Video: బుడ్డోడు.. గోల్ కొడుదాం అనుకున్నాడు.. కానీ బోర్ల పడ్డాడు..
-
ఆ తపన ఎప్పుడూ ఉంటుంది
‘‘మంచి సినిమా చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. కోవిడ్ సమయంలో ‘హిట్ 2’ చేయటానికి టీమ్ ఎంతో కష్టపడింది. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అని అడివి శేష్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘హిట్ 2’. హీరో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిరనేని నిర్మించారు. డిసెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ని గురువారం విడుదల చేశారు. అడివి శేష్ మాట్లాడుతూ– ‘‘మహేశ్‌గారు ‘మేజర్’, నాని ‘హిట్ 2’ సినిమాలు నాతో నిర్మించడం హ్యాపీ. ‘హిట్ 2’ రిలీజ్ కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ‘‘హిట్’తో హిట్ సాధించాం. ‘హిట్ 2’ని స్క్రీన్‌పై చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు ప్రశాంతి త్రిపిరనేని. ‘‘క్రైౖమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హిట్ 2’. అడివి శేష్ పర్ఫెక్ట్ జెంటిల్‌మేన్.. సెట్స్‌లో ప్రొఫెషనల్‌గా ఉండేవాడు. నేను ఇక్కడ ఉండటానికి కారణం నానీగారే.. ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు శైలేష్ కొలను. సినిమాటోగ్రాఫర్ మణికందన్ .ఎస్, ఎడిటర్ గ్యారీ బి.హెచ్, హీరోయి¯Œ కోమలీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ∙మీనాక్షీ చౌదరి, అడివి శేష్, ప్రశాంతి, శైలేష్ -
అడివిశేష్ ‘హిట్-2’ మూవీ టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
Hit 2 Teaser: అంచనాలు పెంచేస్తున్న హిట్-2 మూవీ టీజర్
విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న హీరో అడివి శేష్. మేజర్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఆయన మరో స్పై థ్రిల్లర్ తరహా కాన్సెప్ట్‌తో మన ముందుకు వస్తున్నారు. అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం హిట్-2. ది సెకండ్ కేస్ అనేది ట్యాగ్ లైన్.శైలేష్ కొలను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ను నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా మూవీ టీజర్‌ను విడుదల చేశారు. పోలీస్ ఆఫీసర్ లుక్‌లో అడివి శేష్ ఆకట్టుకుంటుంది. ఇందులో మీనాక్షి చౌదరి అడివి శేష్‌కు జోడీగా నటించింది. ఈ సినిమా డిసెంబర్2న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) What do YOU know about FEAR? You. will. find. out. The #HIT2 Teaser is Here. 🔥 HIT 2 Teaser | Adivi Sesh | Nani | Sailesh Kolanu | https://t.co/1SmX9m46EB via @YouTube ⚠️ WARNING : Not for Children #HIT2onDec2 @NameisNani @KolanuSailesh @tprashantii @Meenakshiioffl pic.twitter.com/ZPSErSbFNT — Adivi Sesh (@AdiviSesh) November 3, 2022 -
భారీ ట్రక్కుని ఢీ కొట్టిన ఖడ్గమృగం.... డ్రైవర్‌కి ఊహించని షాక్
ఒక ఖడ్గమృగం రోడ్డుపై వేగంగా వెళ్తున్న భారీ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన అస్సాంలోని కజిరంగలో హల్దీబారీ రహదారి వద్ద చోటు చేసుకుంది. వాస్తవానికి వాహనం వేగంగా వెళ్తుంటే ఖడ్గమృగం నాదారికే అడ్డుగా వస్తావా అన్నట్లుగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఆ జంతువుకు ఎలాంటి గాయాలు కాలేదు. కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. అయితే సదరు వాహనాన్ని పోలీసులు ఆపి జరిమాన విధించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోని అస్సాం ముఖ్యమంత్రి ట్విట్టర్లో షేర్ చేస్తూ...ఈ రహదారిలో ఆ జంతువులకు ఇబ్బంది కలిగిస్తే ప్రయాణించేందుకు అనుమతించం అని ట్వీట్ చేశారు. తాము ఈ కజిరంగా వద్ద జంతువులను రక్షించాలనే ఉద్దేశంతో సుమారు 32 కి.మీ ఎలివేటర్ కారిడర్ని అధికారులు చేత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ రహదారిలో వాహనాలు వేగంగా వెళ్తే చెట్లకు, జంతువులకు ఇబ్బంది కలగవచ్చని కొందరూ, మరికొందరూ నుమాలిగర్ వద్ద బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న వంతెన పూర్తి అయితే వాహనాలను అటు మళ్లించే ఏర్పాట్లు చేయడమే కాకుండా అంతవరకు ఈ రహదారిలో వాహనాలు తక్కువ వేగంతో వెళ్లేలా చూడాలంటూ సలహలిస్తూ...ట్వీట్ చేశారు. Rhinos are our special friends; we’ll not allow any infringement on their space. In this unfortunate incident at Haldibari the Rhino survived; vehicle intercepted & fined. Meanwhile in our resolve to save animals at Kaziranga we’re working on a special 32-km elevated corridor. pic.twitter.com/z2aOPKgHsx — Himanta Biswa Sarma (@himantabiswa) October 9, 2022 (చదవండి: మేక మొక్కులకు భక్తులే షాకయ్యారు.. శివయ్య వరమిస్తాడా?.. వీడియో వైరల్) -
కుక్క యవ్వారం.. రాళ్లతో కొట్టుకొని..
బనశంకరి(కర్ణాటక): కారుపై కుక్క మూత్రం పోయడంతో కారు యజమాని కుక్క యజమానిని రాయితో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాణసవాడి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గాయపడ్డ బాధితుడు, హెచ్ఏఎల్ విశ్రాంత ఉద్యోగి గేరి రోజారియా. ఇతని పెంపుడు కుక్క ఎదురింటి వద్దనున్న చాల్స్ అనే వ్యక్తి కారుపై ఆదివారం రాత్రి 11 గంటలప్పుడు మూత్రం పోసింది. దీంతో చాల్స్– గేరి కుటుంబాల మధ్య గలాటా మొదలైంది. చాల్స్ పెద్ద రాయి తీసుకుని గేరి ముఖంపై కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఫిర్యాదు మేరకు చాల్స్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో ఘటనలో.. పాలికె నోటీసులతో దడ బనశంకరి: బెంగళూరులో నిబంధనలను ఉల్లంఘించి కట్టడాలు నిర్మించిన యజమానులకు ఇటీవల బీబీఎంపీ నోటీసులు జారీచేసింది. తమ ఇళ్లు, భవంతుల ప్లానింగ్ అనుమతి పత్రాలను అందజేయాలని నోటీసులు అందుతున్నట్లు కొందరు తెలిపారు. బీ– ఖాతా స్థలాల్లో నిర్మించిన కట్టడాలను బీబీఎంపీ అక్రమ కట్టడాలుగా పరిగణిస్తుంది. ట్రినిటీ ఎస్కేప్ నివాసుల ఒక్కోట అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ గత వారం హŸరమావులో 100 కు పైగా ఇళ్లకు నోటీసులు అందాయన్నారు. మూడురోజుల్లోగా రికార్డులను చూపాలని ఉందన్నారు. మేము స్థలం కొనుగోలు చేసినప్పుడు బీ –ఖాతా స్థలాలను మార్చలేదన్నారు. రిటైరైన డబ్బులతో స్థలాలు కొని ఇళ్లు కట్టుకున్నామని, పాలికె ఆదేశాలతో నిద్ర రావడం లేదని వాపోయారు. చదవండి: Viral: అసలేం జరిగింది.. నెల రోజులుగా జీడి చెట్టుకు వేలాడుతున్న మృతదేహం ? -
ర్యాష్ డ్రైవింగ్.. అడ్డంగా ఉన్న కార్లన్ని ధ్వంసం.. అంతలో..
ఓ వ్యక్తి ఖాళీగా ఉన్న స్కూల్ బస్సును దొంగలించి నానా భీభత్సం సృష్టించాడు. చివరకి సినీ ఫక్కీలో పోలీసులు అతన్ని ఛేజ్ చేసి ఈ కథకి శుభం కార్డు వేశారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక పోలీసులకి ఎక్కడ నుంచో ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే కొందరు పోలీసులు కార్లలో స్కూల్ బస్సును దొంగలించి పారిపోతున్న వ్యక్తిని పట్టుకోవడం కోసం తమ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే సడెన్‌గా సీన్లోకి పోలీసులను చూసేసరికి ఆ వ్యక్తికి మైండ్ బ్లాక్ అయ్యి బస్సు వేగం పెంచాడు. అలా కొంత దూరం వెళ్లగానే రోడ్డు పై వాహనాల రద్దీ పెరిగింది. అయినా వాటిని లెక్కచేయకుండా ఆ వ్యక్తి బస్సుని మరింత వేగంగా నడుపుతూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతన్ని పోలీసులు వెంబడించడంతో రోడ్డుపై తనకి దారిలో అడ్డంగా ఉన్న కార్లను వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకు కదిలాడు. అలా సుమారు 20 కార్లకుపైగా ఈ ఘటనలో ధ్వంసంమయ్యాయి. కాకపోతే ఆ స్కూల్ బస్సులో ఎవరూ లేరు పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అతను ఎలాగైనా పోలీసులకు చేతికి చిక్కకూడదని రోడ్డుపై కనపడినా వాటిని ఢీకోట్టుకొట్టుకుంటూ వెళ్తుండగా ఓ బస్‌స్టాప్ సమీపంలోని కాంక్రీట్ రిటైనింగ్ గోడను ఢీకొట్టడంతో బస్సు ఆగింది. వెంటనే బస్సులోంచి దిగి ఆ వ్యక్తి తప్పించుకోవాలని ముందుకు పరుగెత్తాడు. పోలీసులు ఏ మాత్రం పట్టు విడువక చివరి వరకు వెంటాడి అతడిని అరెస్టు చేసి, తర్వాత చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ బస్సును ఎందుకు దొంగలించాడని మాత్రం తెలియలేదు. చదవండి: యాక్..ఛీ.. వాటి విసర్జలనతో టీ చేసి తాగుతారట..! -
ఐస్‌క్రీం కోసం వెళ్లి, తిరిగి వస్తుంటే..
రాయగడ( భువనేశ్వర్): జిల్లా కేంద్రంలోని కొరాపుట్ మార్గం నువాసాహి రోడ్డులో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. మృతుడు ఆర్కే నగర్ స్వీపర్ కాలనీలో నివసిస్తున్న సునీల్ సామల్ కుమారుడు సుధాంశుగా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ ఎస్కే సత్పతి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం సుధాంశు ఐస్‌క్రీం కొనుక్కునేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొంది. దీంతో చిన్నారి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగానే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కారు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని స్వీపర్ కాలనీవాసులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని, ఆందోళన చేపట్టారు. చదవండి: వంద కోసం అటెండర్ కక్కుర్తి.. పసి ప్రాణం బలైపోయింది -
రెండో హిట్ కేసు ఆరంభం
నాని ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు సొంత బ్యానర్ వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై చిత్రాలు నిర్మిస్తూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నారు. ప్రశాంతి తిపిర్నేనితో కలిసి ‘అ!’, ‘హిట్’ చిత్రాలు నిర్మించిన ఆయన తాజాగా ‘హిట్ 2’ సినిమాకు శ్రీకారం చుట్టారు. అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు. ‘హిట్’ చిత్రాన్ని తెరకెక్కించిన శైలేష్ కొలను దర్శకత్వంలోనే ‘హిట్ 2’ (ది సెకండ్ కేస్ అన్నది ట్యాగ్‌లైన్ ) సినిమా రూపొందనుంది. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించనున్న ఈ సినిమా శనివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రశాంతి కెమెరా స్విచ్చాన్ చేయగా, నాని క్లాప్ ఇచ్చి, స్క్రిప్ట్‌ను శైలేష్‌కు అందించారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ ఆఫీసర్ ఓ అమ్మాయి మిస్సింగ్ కేసుని ఎలా డీల్ చేశాడనే కాన్సెప్ట్‌తో ‘హిట్’ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆఫీసర్ కృష్ణదేవ్ అలియాస్ కె.డి ఈ ఎగ్జయిటింగ్ జర్నీని కంటిన్యూ చేయబోతున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్, సంగీతం: జాన్ స్టీవర్స్ ఎడురి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకట్ రత్నం (వెంకట్). -
పెట్రో ధరలు భగ్గు
సాక్షి, న్యూఢిల్లీ : ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దీంతో శుక్రవారం ఆకాశాన్ని తాకిన పెట్రో ధరలు దేశీయంగా సరికొత్త రికార్డును తాకాయి. వరుసగా రెండు రోజులు స్థిరంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను 25 పైసలు చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించాయి. తాజా పెంపుతో పెట్రోలు ధర రికార్డు స్థాయికి చేరింది. దీంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబైలో పెట్రో 92 రూపాయల వద్ద రికార్డు హైకి చేరింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.45 వద్ద రికార్డును సృష్టించింది. ఢిల్లీలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక రేటు. ఇక్కడ లీటరు డీజిల్ ధర రూ. 75.63గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 92.04 డీజిల్ ధర రూ. 82.40 చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 88.07 డీజిల్ ధర రూ.80.90 కోలకతాలో పెట్రోలు ధర లీటరుకు రూ. 86.87 డీజిల్ ధర రూ.79.23 అమరావతి పెట్రోలు ధర లీటరుకు రూ. 91.68, డీజిల్ ధర రూ.84.84. హైదరాబాద్‌లో పెట్రోలు ధర లీటరుకు రూ. 88.89, డీజిల్ ధర రూ.82.53 -
అది జరగదనే నమ్ముతున్నాను
‘‘పుస్తకం, సినిమా, వెబ్‌సిరీస్... ఇలా ఏదైనా సరే మంచి కథలను ప్రేక్షకులకు చెప్పాలనుకుంటాను. మా నాన్నగారికి తెలియకుండానే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశాను. నేను ‘హిట్’ సినిమా తీశాక నాన్నగారు షాక్ అయ్యారు’’ అని శైలేష్ కొలను అన్నారు. విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అన్నది ఉపశీర్షిక. హీరో నాని సమర్పణలో ప్రశాంతి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. శైలేష్ కొలను మాట్లాడుతూ – ‘‘నానీగారికి పెద్ద అభిమానిని. ఆయనకి చెప్పిన కథల్లో ‘హిట్’కి నిర్మాతగా ఓకే అన్నారు. ‘హిట్’కి వచ్చే ఏడాది సీక్వెల్ కూడా ఉంటుంది. ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా సెకండ్ మూవీ సిండ్రోమ్ (డైరెక్టర్‌గా తొలి విజయం సాధించి, రెండో సినిమా ఫ్లాప్ కావడం) సమస్య గురించి విన్నాను. నా విషయంలో అది జరగదనే నమ్మకం ఉంది. ఆ భయం నా బాధ్యతను పెంచుతుందనుకుంటున్నాను. నా పారితోషికాన్ని కూడా పెంచాలనుకుంటున్నాను’’ అన్నారు. -
హిట్ అందరికీ నచ్చుతుంది
‘‘కొత్త కాన్సెప్ట్, ప్రతిభని ప్రోత్సహించడానికే వాల్ పోస్టర్ పతాకాన్ని స్థాపించాను. మా బ్యానర్లో కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే నిర్మిస్తాం. ఇందులో స్టార్ డైరెక్టర్స్ సినిమాలు చేయరు.. నేను కూడా నా బ్యానర్లో నటించను. నాకు కథ నచ్చి, నేను చేయలేని సినిమాలను నా బ్యానర్లో నిర్మిస్తాను’’ అని నాని అన్నారు. విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అన్నది ట్యాగ్ లైన్ . హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ– ‘‘ఈరోజు మా సినిమా విడుదలవుతుండటంతో చాలా సంతోషంగా, నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకుల స్పందన కోసం ఆత్రుతగా వేచి చేస్తున్నాం.. ‘హిట్’ అందరికీ నచ్చే చిత్రం అవుతుంది. సినిమా నచ్చి.. మళ్లీ మీ స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో వెళతారనే నమ్మకం ఉంది. మా బ్యానర్లో కొత్త తరహాలో చేసిన ‘అ!’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి మరో కొత్త జానర్‌తో మీ ముందుకు వస్తున్నాం. నేను ఇప్పటి వరకు ఏడు సార్లు ‘హిట్’ సినిమా చూశాను.. ఒక్కసారి కూడా బోర్ కొట్టలేదు. ప్రశాంతిగారిలాంటి వ్యక్తులు, మంచి టీమ్ ఉండబట్టే నేను సినిమాల్లో నటిస్తూ, నిర్మించగలిగాను’’ అన్నారు. ‘‘హిట్’ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే భావిస్తున్నాం’’ అన్నారు ప్రశాంతి త్రిపిర్నేని. ‘‘ఈ రోజు మా చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్నా మా అందరి ముఖాల్లో చిరునవ్వు ఉందంటే సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నామో ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’’ అన్నారు విశ్వక్ సేన్. ‘‘నిజాయతీగా తీసిన థ్రిల్లర్ ‘హిట్’. కథకు ఏది అవసరమో దాన్ని అందించారు నానీగారు. మా అందరి కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని భావిస్తున్నాం’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మా చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు రుహానీ శర్మ. -
విశాఖలో 'హిట్' గ్రాండ్ రిలీజ్ ఈవెంట్
-
హిట్ ఇస్తున్నందుకు గర్వంగా ఉంది
‘‘అ’ సినిమాతో నాని నిర్మాతగా మారి నేర్చుకున్నాడు.. ఇప్పుడు ‘హిట్’ అంటున్నాడు. ఎంత నమ్మకం లేకుంటే ఆ పేరు పెడతాడు. చాలా సినిమాలు చేశాడు కదా.. కొన్ని ఆడతాయి, మరికొన్ని ఆడవు. ఆడని వాటిలోని తప్పులు.. ఆడిన వాటిలోని బెస్ట్‌లు తీసుకుని ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ‘హిట్’ అని పేరు పెట్టే్టశాడు. మొత్తంగా ఓ డాక్టర్ని(శైలేశ్) డైరెక్టర్ చేశాడు నాని’’ అని డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు అన్నారు. ‘ఫలక్‌నుమాదాస్’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా, రుహానీ శర్మ హీరోయిన్గా నటించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అన్నది ఉపశీర్షిక. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘హిట్’ సినిమా టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి.. యూనిట్ ప్రమోషన్ ఐడియాలు కూడా కొత్తగా ఉన్నాయి. సినిమా మంచి హిట్ అవ్వాలి. ఉపశీర్షికలో ఫస్ట్ కేస్ అని పెట్టారు.. రెండో కేస్, మూడో కేస్ అంటూ దీనికి మరిన్ని ఫ్రాంచైజీలు రావాలి. సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. అనుష్క మాట్లాడుతూ– ‘‘ఈరోజు నేను ఇక్కడికి అతిథిగా రాలేదు. నాని, ప్రశాంతి నా కుటుంబసభ్యులే. ‘అ’ చాలా మంచి సినిమా. రెండో సినిమా చాలా మంచి కథతో వస్తారనుకుని వేచి చూశా. ‘హిట్’ ట్రైలర్స్, పాటలు బాగున్నాయి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘హిట్’ సినిమా పెద్ద విజయం సాధించాలి. నాని హీరో అయినప్పటికీ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్నాడు.. అలాంటి నాని బ్యానర్‌కి సక్సెస్ కావాలి’’ అన్నారు. నాని మాట్లాడుతూ–‘‘హిట్’ సినిమాని తొలుత నేనే చేద్దామనుకున్నా.. విశ్వక్ అయితే బాగుంటుందనిపించింది. శైలేష్ చెప్పిన కథల్లో ‘హిట్’ వెంటనే తీయాలనిపించింది. డాక్టర్ ఉద్యోగం వదలొద్దని తొలుత చెప్పేవాణ్ణి.. ఈ రోజు చెబుతున్నా ఉద్యోగం వదిలేయ్.. పర్లేదు. ‘ఫలక్‌నుమాదాస్’లో విశ్వక్ ఆ పాత్రకు సరిపోయాడు.. ‘హిట్’ సినిమా చూశాక ఏ పాత్ర అయినా ఇరగదీస్తాడనే నమ్మకం ఉంది. ఈ సినిమాకి ఇద్దరు హీరోలు.. ఒక్కరు విశ్వక్ సేన్.. మరొకరు సంగీత దర్శకుడు వివేక్ సాగర్. ‘అ’ సినిమా బాగున్నా డబ్బులు రాలేదేమో? అని కొందరు రాస్తుంటారు.. నిర్మాతగా నేను చెబుతున్నా. ఆ సినిమా పక్కా కమర్షియల్ హిట్. ఈ నెల 28న ప్రేక్షకులకు ‘హిట్’ రూపంలో ఓ క్వాలిటీ, మంచి సినిమా ఇస్తున్నాం.. ఇందుకు గర్వంగా ఉంది’’ అన్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘రుహాని శర్మ మంచి నటి. ప్రశాంతిగారు సో స్వీట్. ఒకేసారి రెండు సినిమాలు చేయొద్దు.. ఒక్కొక్కటి చేస్తే ప్రశాంతంగా ఉంటుందని నాని అన్న సలహా ఇచ్చాడు.. అది ఎంతో ఉపయోగపడింది. శైలేష్గారు శాస్త్రవేత్తలాంటివాడు.. తెలివైనవాడు. ‘హిట్’ సినిమాకి నీళ్లు ఎక్కువ తాగి రాకండి.. వాష్‌రూమ్ వెళ్లే టైమ్ కూడా ఉండదు. ఇలాంటి థ్రిల్లర్ సినిమా తెలుగులో నేను చూడలేదు’’ అన్నారు. శైలేశ్ కొలను మాట్లాడుతూ– ‘‘2017లో నానీ అన్నకి కథ చెప్పా.. విన్నాక ‘నువ్వే ఎందుకు దర్శకత్వం చేయకూడదు?’ అన్నారు. ఆ తర్వాత సిడ్నీ వెళ్లిపోయి డైరెక్షన్ నేర్చుకుని వచ్చి ఈ సినిమా తీశా. నన్ను దర్శకునిగా పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్స్ అన్న. ప్రశాంతి మేడమ్‌కి థ్యాంక్స్. విక్రమ్ రుద్రరాజు అని నేను రాసుకున్న పాత్రకి రెట్టింపు నటన ఇచ్చిన విశ్వక్‌కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ చిత్రం బాగా రావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకి థ్యాంక్స్’’ అన్నారు రుహాని శర్మ. ఈ వేడుకలో నిర్మాత ప్రశాంతి, డైరెక్టర్ నందినీ రెడ్డి, హీరోలు రానా, నవదీప్, సందీప్ కిషన్, ‘అల్లరి’ నరేశ్, సునీల్, కార్తికేయ, నటి మంచు లక్ష్మి, నటులు భానుచందర్, రాహుల్ రామకృష్ణ, రవివర్మ, నిర్మాతలు రాజ్ కందుకూరి, బెక్కం వేణుగోపాల్, సంగీత దర్శకులు కీరవాణి, వివేక్ సాగర్, కాలభైరవ, కెమెరామేన్ మణికంద¯Œ , ఎడిటర్ గ్యారీ, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు. -
హిట్ లుక్
హీరోగా నాని సూపర్ సక్సెస్ఫుల్. నిర్మాతగా మారి ‘అ!’ చిత్రం తీశారు. ఆ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. తాజాగా రెండో సినిమా కూడా సిద్ధం చేస్తున్నారు. ‘ఫలక్‌నుమా దాస్’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్’. నాని సమర్పణలో ప్రశాంత్ త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్. ‘హిట్’ ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా విశ్వక్సేన్ కనిపించనున్నారు. జనవరి 1న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు కెమెరా: మణికందన్, సంగీతం: వివేక్ సాగర్. -
హిట్ షురూ
వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలను సాధించి తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు హీరో నాని. కొత్త ప్రతి¿¶ ను ప్రోత్సహించాలని ‘వాల్‌పోస్టర్ సినిమా’ అనే బ్యానర్‌ను ప్రారంభించారు. తొలి ప్రయత్నంలోనే ‘అ!’ వంటి వైవిధ్యమైన సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించి నిర్మాతగా సక్సెస్‌ను సాధించిన నాని రెండో సినిమాకి గురువారం కొబ్బరికాయ కొట్టారు. వాల్‌పోస్టర్ సినిమా ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కనున్న ‘హిట్’ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇటీవల విడుదలైన ‘ఫలక్‌నుమాదాస్’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఈ చిత్రంలో కథానాయకునిగా నటిస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా శైలేష్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: ఎస్.మణికందన్. -
బీసీ మహిళలను కారుతో ఢీకొట్టీన టీడీపీ నేతలు
-
విమానం టేకాఫ్ అవుతుండగా..
కోల్‌కతా : ఖతార్ ఎయిర్వేస్కు చెందిన కోల్‌కతా- దోహ విమానాన్ని గురువారం తెల్లవారుజామున టేకాఫ్ అవుతున్న సమయంలో వాటర్ ట్యాంకర్ ఢీకొంది. కో్ల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 100 మంది ప్రయాణీకులున్నారు. ఘటన జరిగిన వెంటనే వారందరినీ సురక్షితంగా విమానం నుంచి దించివేశారు. విమానం పాక్షికంగా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. కాగా ఉదయం 2.30 గంటలకు ప్రయాణీకులు విమానంలోకి ఎక్కుతున్న క్రమంలో వాటర్ ట్యాంకర్ విమానం ల్యాండింగ్ గేర్‌కు సమీపంలో మధ్య భాగాన్ని ఢీకొట్టిందని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగిన వెంటనే ప్రయాణీకులను దించివేసి తనిఖీలు చేపట్టారని, ప్రయాణీకులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. సమీప హోటల్లో ప్రయాణీకులందరికీ వసతి సౌకర్యం కల్పించామని, శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు విమానంలో వారిని దోహా తరలిస్తామని వెల్లడించారు. వాటర్ ట్యాంకర్ బ్రేక్ సరిగ్గా పనిచేయకపోవడంతోనే విమానాన్ని ఢీ కొట్టిందని ఏఏఐ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని ఏఏఐ అధికారులు పేర్కొన్నారు. -
జమ్మూకశ్మీర్‌లో విరిగిపడీన కోండచరియలు
-
బుల్ రన్:మరో మైలురాయిని అధిగమించిన నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతోంది. అదే తరహాలో కొత్త గరిష్టాల ట్రెండ్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నిఫ్టీ తొలిసారి 11వేల మార్క్‌ను తాకడం ఇవాల్టి విశేషం. అలాగే సెన్సెక్స్ 36వేల మార్క్‌కు చాలా దగ్గరగా వచ్చేసింది. సెన్సెక్స్ 177 పాయింట్లు ఎగిసి 35,975 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 11010 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. దాదాపు అన్ని సెక్టార్ల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా మెటల్, ఐటీ, ఫార్మా, రియల్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐవోసీ, హెచ్‌సీఎల్ టెక్, ఆర్ఐఎల్, వేదాంతా, హిందాల్కో, ఇన్ఫోసిస్, యాక్సిస్, యస్‌బ్యాంక్, ఐబీ హౌసింగ్, టాటా స్టీల్ లాభపడుతుండగా మీడియా షేర్లు నష్టపోతున్నాయి. వీటితోపాటు గెయిల్, ఏషియన్ పెయింట్స్, అంబుజా, ఐషర్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ నెగిటివ్‌గా ఉన్నాయి. -
రూ.30వేలు దాటిన బంగారం ధర..మరింత పైకేనా?
సాక్షి:న్యూఢిల్లీ: జియోపొలిటికల్ ఆందోళనలు, అమెరికా డాలర్ బలహీనత నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు వెల్లు వెత్తుతున్నాయి. కొనుగోళ్ల జోరుతో దేశీయంగా పుత్తడి రూ.30వేల కీలక స్థాయిని అధిగమించాయి. అటు వెండి ధరలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇతర మెటల్ షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మరిన్నిక్షిపణులను పరీక్షిస్తామంటున్న కిమ్ దూకుడు అటు అంతర్జాతీయంగానూ ,ఇటు దేశీయంగా బంగారానికి డిమాండ్ పెంచుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం విదేశీ మార్కెట్లో పసిడి ధర హైజంప్ చేసింది. ఔన్స్ 1322 డాలర్లకు దాటేసింది. న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(0.7 శాతం పెరిగి 1,333.28 డాలర్లకు చేరుకుంది. నవంబర్ 9 నుంచి 1,336.79 డాలర్లకు చేరుకుంది. తద్వారా 10 నెలల గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ప్రభావం దేశీయంగానూ కనిపిస్తోంది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. రూ. 360పైగా ఎగసి రూ.30,169 స్థాయికి చేరింది. ఈ పరుగు మరింత పెరిగే అవకాశమున్నట్లు విశ్లేషకుల అంచనా. గ్లోబల్ బంగారం ధరలు మరింత పురోగమిచనున్నాయని అతి త్వరలోనే 1,375 డాలర్లకు చేరుతుందని వింగ్ ఫుంగ్ ఫైనాన్షియల్ గ్రూప్ విశ్లేషకుడు చెప్పారు. 2018 మధ్యవరకు ఫెడరల్ రిజర్వ్ రేట్లుపెంపు ఉండదనీ, ఇది బంగారం ధరలకుసానుకూలమని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆగస్టులో ధరల పెరుగుదల 4.1 శాతం ఎగిసి జనవరి నాటి స్థాయిని అధిగమించిన బంగారం ఇంకా పెరగనుందని మిత్సుబిషి విశ్లేషకుడు జోనాథన్ బట్లర్ పేర్కొన్నారు. ఫెడ్ రేట్లు పుంపు, డాలర్ బలం తదితర అంచనాలను బంగారం ధరలపై ఒత్తిడిపెంచనుందని మరికొందరు భావిస్తున్నారు. మరోవైపు ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉండగా, డాలర్‌కు వ్యతిరేకంగా ఇతర ప్రపంచ కరెన్సీలు సానుకూలగా కదులుతున్నాయి. కాగా ఐక్యరాజ్యసమితి ఆంక్షలను సైతం లెక్కచేయకుండా ఇకపై మరిన్ని ప్రయోగాలు చేపడతామని స్పష్టం చేసింది. ఉత్తర కొరియా ఆరవ అణు పరీక్షను నిర్వహించడంతో పాటు ఆధునిక హైడ్రోజన్ బాంబు హెచ్చరికలనుకూడా ప్రకటించింది. దీంతోఈ వ్యవహారంపై సమీక్షించేందుకు అటు అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసరంగా ఈ రోజు సమావేశంకానున్నట్టు తెలుస్తోంది. -
ఆడియో హిట్‌తో అంచనాలు పెరిగాయి
ఆకలి పోరాటం చిత్ర నిర్మాత పీవీ రాఘవులు రాజమహేంద్రవరం కల్చరల్ : రామ్‌సాయి గోకులం క్రియేషన్స్‌పై నిర్మించిన ‘ఆకలిపోరాటం’ సినిమాలోని ఆరు పాటలు హిట్ కావడంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయని నిర్మాత పీవీ.రాఘవులు(రవి) తెలిపారు. ఈ నెల 25న రాజమహేంద్రవరంలో విడుదల చేసిన ఆకలి పోరాటం ఆడియో విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్ శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలను తెలిపారు. ఈ సందర్బంగా హీరో గంగాధర్ మాట్లాడుతూ ఎంత పెద్ద సినిమాలో అయినా ఏవో కొన్ని పాటలు హిట్ అవుతాయని, అయితే చిన్న సినిమా అయిన తాను నటించిన ఆకలి పోరాటంలో ఆరు పాటలు ప్రజాదరణ పొందడం ఆనందంగా ఉందన్నారు. ఈ విజయం తమది మాత్రమే కాదని, గోదావరి ప్రాంత సెంటిమెంట్, ఇక్కడి ప్రజల ఆదరణే ఈ విజయానికి కారణమన్నారు. చిత్ర నిర్వాహకులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ సినిమాలో ఆరు పాటలు మంచి హిట్ అయ్యాయని, ఈ విజయం గోదావరి ప్రాంత వాసులదేనన్నారు. సినిమా విడుదలకు సిద్ధమౌతున్నామని, పాటలను విజయవంతం చేసిన మాదిరిగానే సినిమాను హిట్ చేయాలని ఆక్షాంక్షించారు. కొల్లపురెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యతో తెరకెక్కిన ఈ సినిమాను అందరూ ఆదరించాలని, ప్రస్తుతం యువత పడుతున్న కష్టాలను ఆకలి పోరాటం ద్వారా చూపామన్నారు. -
కొట్టి, తిట్టి లాగి పడేశారు- స్టాలిన్
చెన్నై: డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ అసెంబ్లీ రగడపై తీవ్రంగా స్పందించారు. తమిళనాడు అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయుడికి తీరని అవమానం జరిగిందని ధ్వజమెత్తారు. స్పీకర్ సభా మర్యాదలు పాటించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. తన చిరిగిన చొక్కాను చూపిస్తూ కొట్టి, తిట్టి తమను బలవంతంగా బయటకు లాగిపడేశారని ఆరోపించారు. సభలో జరిగిన పరిణామాలు, పరిస్థితులను వివరించేందుకు గవర్నర్‌తో భేటీ కానున్నట్టు చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. రహస్య ఓటింగ్ జరగాలని మరోసారి డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామని పేర్కొన్నారు. సభలోతీవ్రం గందరగోళ పరిస్థితుల మధ్య బయటికువచ్చిన డీఎంనే నేత స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను అవమానించారని మండిపడ్డారు. సభా మర్యాదలు పాటించలేదనిని మండిపడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నడుమ ప్రారంభంనుంచీ అసెంబ్లీలో రహస్య ఓటింగ్ పై రగడ నెలకొంది. దీంతో అసెంబ్లీ నుంచి డీఎంకే నేతలపై మార్షల్స్ రంగంలోకి దిగారు. ఒక్కొక్కర్నీ చేతులపై ఎత్తిపట్టుకునే బయటకు లాగి పడేశారు. కొంతమంది ఎమ్మెల్యే చొక్కాలు చిరిగా పోయాయి. పలువురికి గాయాలయ్యాయి. ముఖ్యంగా డీఏంకు నేత స్టాలిన్ కు చొక్కా చిరిగిపోయింది. దీంతో ఆందోళన మరింత ముదిరింది. డీఎంకే ఎమ్మెల్యేల బహిష్కరణ, స్పీకర్ పోడియం వద్ద స్టాలిన్ చేపట్టిన ధర్నా లాంటి ఉద్రిక్త పరిస్థితులమధ్య మార్షల్స్‌ను ఎమ్మెల్యేలను బయటకు లాగి పడేయడం కనిపించింది. దీంతో మరింత గందరగోళం చెలరేగింది. -
శుభలేఖలిచ్చి వస్తూ.. పెళ్లికొడుకు దుర్మరణం
మార్టేరు, (పెనుమంట్ర) : శుభలేఖలిచ్చి వస్తూ.. ఓ కొత్త పెళ్లికొడుకు దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం రాత్రి మార్టేరు గ్రామ శివారున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..మార్టేరుకు చెందిన చీమకుర్తి నూక రత్నకుమారి పెద్ద కుమారుడు పూర్ణ వెంకట రామరాజు(27) పెళ్లి ఫిబ్రవరి 1న జరగనుంది. దీంతో ఆమె రామరాజుతో కలిసి శుభలేఖలు ఇచ్చేందుకు ద్విచక్రవాహనంపై ఆచంట వెళ్లి తిరిగి వస్తుండగా మార్టేరు శివారున ఎదురుగా వస్తున్న మరో మోటారు సైకిల్ బలంగా ఢీకొట్టింది. దీంతో రామరాజు అక్కడికక్కడే మరణించాడు. రత్నకుమారితోపాటు, మరో మోటార్‌సైకిల్‌పై ఉన్న కర్రి ప్రతాప్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రత్నకుమారి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో రామరాజు తమ్ముడు శివ కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నాడు. రామరాజు మోటార్‌సైకిల్ ఢీకొన్న మరో బైక్‌పై ముగ్గురు యువకులు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వీరిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరి యువకుల జాడ తెలియాల్సి ఉంది. ప్రతాప్‌ను కూడా మెరుగైన చికిత్స నిమిత్తం భీమవరం తరలించినట్టు సమాచారం. మృతుడు రాజు కొన్నాళ్లపాటు దుబాయ్‌లో ఉండి వచ్చాడు. అతని తల్లి రత్నకుమారి మార్టేరులో కిరాణాషాపు నడుపుతున్నారు. -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు..
ఆచంట: దైవ దర్శనానికి వెళ్లి మోటారు సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుం డగా రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలుకాగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోడూరుకు చెం దిన కేతా సాయిబాబు (20) అక్కడికక్కడే మృతి చెందగా అదే గ్రామానికి చెందిన చెల్లబోయిన త్రిమూర్తులు, ఇళ్ల హనుమంతుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. పోడూరు పల్లపువీధికి చెందిన పలువురు జట్టు కార్మికులు ఏటా సార్వా, దాళ్వా సీజన్ ముగిసిన తర్వాత అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీ ర్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆచంట మండలం పెదమల్లంలోని మాచేనమ్మవారి ఆలయానికి సుమారు 20 మంది బయలుదేరి వెళ్లారు. వీరిలో కొందరు ట్రాక్టరుపైన, మరికొందరు మోటారు వాహనాలపై చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకుని, అక్కడే భోజనాలు చేసి గోదావరి ఏటిగట్టున ఉల్లాసంగా గడిపారు. మృతుడు సా యిబాబుతోపాటు ఇద్దరు క్షతగాత్రు లు మోటారు సైకిల్‌పై తిరుగుపయనమయ్యారు. సాయిబాబా బైక్‌పై మధ్యలో కూర్చున్నాడు. ఆచంట–మార్టేరు రోడ్డులోని నక్కల డ్రెయిన్ వంతెన సమీపంలోకి వచ్చే సరికి వాహనం అదుపు తప్పి వంతెన సైడ్ వాల్‌ను ఢీకొట్టింది. దీంతో సాయిబాబా అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మితి మీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షతగాత్రులను 108లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు ఆచంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుమారులిద్దరూ రోడ్డు ప్రమాదాల్లోనే.. పోడూరుకు చెందిన కేతా ఏడుకొం డలు, భూలక్ష్మి వ్యవసాయ కూలీలు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె. అవివాహితులైన కుమారులు జట్టు పనులు చేస్తుండేవారు. కుమార్తెకు వివాహమైంది. ఏడుకొండలు పెద్ద కుమారుడు గరగయ్య ఎనిమిది నెలల క్రితం పోడూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఇప్పుడు చిన్న కుమారుడు సాయిబాబా రోడ్డు ప్రమాదంలోనే కన్నుమూయడంతో కుటుంబం తల్లడిల్లిపోతోంది. సాయిబాబా మృతితో పల్లపు వీధిలో విషాదఛాయలు అలముకున్నాయి. -
అక్రిడిటేషన్ ప్యానల్ రద్దు:విద్యార్థులకు షాక్!
లక్షలాది భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం షాకిచ్చింది. అక్రిడేటింగ్ కౌన్సిల్ ఫర్ కాలేజీస్ అండ్ స్కూల్స్ (ఏసీఐసీఎస్) ప్యానల్ ను రద్దు చేసి భారతీయ విద్యార్థులకు షాకిచ్చింది. అమెరికాలోని ఇండిపెండెంట్ కాలేజీలు, స్కూళ్ళకు సంబంధించిన అక్రిడిటింగ్ కౌన్సిల్ గుర్తింపును యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యాన్సిల్ చేసింది. ఈ మేరకు అక్కడి స్టూడెంట్ అండ్ ఎక్స్ చేంజ్ విజిటింగ్ ప్రోగ్రాం కు సంబంధించిన సర్టిఫైడ్ కాలీజీలు, స్కూళ్ళు సుమారు 250 సంస్థ ఓటీపీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ల గుర్తింపులను ఇప్పటికే అధికారులు నిరాకరిస్తుండటం గమనార్హం. అమెరికా ఆధారిత కన్సల్టెన్సీ గురుకుల్ ఓవర్ సీస్ సీఈవో విష్ణు వర్ధన్ రెడ్డి ఈ వివరాలను అందించారు. ఈ నిర్ణయంతో ఆయా సంస్థల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందన్నారు. వీరికి డిసెంబరు 12 నుంచి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పొడిగింపును నిరాకరిస్తున్నారు. తమ సంస్థలు అక్రి డిటేషన్ సౌకర్యాన్ని కోల్పోవడంతో ఈ విద్యార్థులు ఇతర కాలేజీలకు షిఫ్ట్ కావలసిన అవసరం ఏర్పడిందని తెలిపారు. భవిష్యత్తులో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పొడిగింపు అవకాశం కోల్పోతారన్నారు. కాగా ఎఫ్-1 వీసా హోల్డర్ల పొడిగింపు దరఖాస్తులను ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు అప్పుడే తిరస్కరించడం ప్రారంభించినట్టు తెలిపారు. దీని కోసం దరఖాస్తు చేసుకునే సంస్థలకు కూడా ముప్పు కలుగుతోందని పేర్కొన్నారు. మరోవైపు 18 నెలల తాత్కాలిక సర్టిఫికేషన్ కాలంలో ఈ సంస్థలు అమెరికాలో గుర్తింపు పొందిన ఏజెన్సీ నుంచి అక్రిడిటేషన్ పొందాలి. కానీ మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బందికొరత,ఇతర నిబంధనల కారణంగా ఆయా సంస్థలకు ఈ అనుమతి దొరకడం చాలా కష్టంగా ఉంటుందోని నిపుణులు చెబుతున్నారు. దీనిపై అక్రిడిటేషన్ ఏజెన్సీ ఏసీఐసీఎస్ స్పందించింది. ఇప్పటికే న్యాయపోరాటాన్ని ప్రారంభించిందని వైజాగ్ కు చెందిన కన్సల్టెన్సీ ప్రతినిధి ఆగంటి చంద్రశేఖర్ తెలిపారు. తమకు ఇంకా 18 నెలల సమయం ఉందని, ఈ లోపు అన్ని కాలేజీలు సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నా మన్నారు. ఇది దాదాపు 250 ఇన్సిస్టిట్యూట్స్ లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల నిమిత్తం ముందస్తు హెచ్చరిక లాంటిదని అభిప్రాయపడ్డారు. -
చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు
-
విద్యుత్ స్తంభంను ఢీకొన్న రైలు
తెగిపడిన విద్యుత్ తీగలు రైళ్ల రాకపోకలకు ఆలస్యం వెంకటాచలం : గూడ్సు రైలుపై ఉన్న యుద్ధ యంత్రం తగిలి విద్యుత్ స్తంభం వాలిపోయి తీగలు తెగిపడిన సంఘటన వెంకటాచలం రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారు జామున జరిగింది. దీంతో దిగువ మార్గం (విజయవాడ వైపు) వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడిచాయి. గూడూరు వైపు నుంచి నెల్లూరు వైపు యుద్ధ యంత్రాలతో గూడ్సు రైలు వెళ్తుంది. తెల్లవారు జామున 4.30 గంటలకు వెంకటాచలం రైల్వేస్టేషన్‌కు సమీపానికి వచ్చేసరికి యుద్ధ యంత్రం రైలు పట్టాల పక్కన ఉన్న ఓ విద్యుత్ స్తంభానికి తగలడంతో స్తంభం ఒరిగిపోయి విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్రమత్తమైన రైల్వేస్టేషన్ అధికారులు సమాచారమందించారు. దీంతో ఓహెచ్ఈ సిబ్బంది అక్కడకు చేరుకుని విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపి వేసి మరమ్మతులు చేశారు. ఉదయం 6.30 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో ఈ మార్గంలో తిరుపతి–కాకినాడ ప్యాసింజర్, యశ్వంత్‌పూర్, కేరళ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వెంకటాచలం స్టేషన్లో ఆగిపోయిన యుద్ధ యంత్రాలతో వెళ్లే గూడ్సు రైలు పనులు పూర్తిచేసిన తరువాత వెళ్లింది. -
నేపాల్‌పై పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్
-
నన్నపనేని కారు ఢీ : వ్యక్తికి తీవ్ర గాయాలు
-
కారు ఢీకొని బాలుడి మృతి
శివకోడు (రాజోలు) : శివకోడులో 216 జాతీయ రహదారిపై వేగం గా వెళ్తున్న ఒక గుర్తు తెలియని కారు ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పాసం వినయ్‌సుభాష్(10)ని ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నిలపకుండా డ్రైవర్ వేగంగా వెళ్లిపోవడాన్ని స్థానికులు గుర్తించారు. అక్కడే కారుకు చెందిన నెంబర్ ప్లేటు ఇరిగిపడిపోగా దానిలో మూడు అంకెలు ఉన్న బోర్డును స్థానికులు పోలీసులకు అప్పగించారు. వివరాల ప్రకారం స్థానిక పంచాయతీకి వెళ్లే సమీపంలో మన్నే సత్యనారాయణ ప్రథమ వర్థంతి కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా కొత్తూరుకు చెందిన పాసం నాగరాజు, వెంకటలక్ష్మి దంపతులతోపాటు వారి కుమారుడు వినయ్ సుభాష్ కూడా వచ్చాడు. భోజనాలు ముగించుకుని ఇంటికి వెళ్లిపోతున్న సమయంలో రోడ్డుకు అవతలివైపు ఉన్న వినయ్‌సుభాష్ రోడ్డు దాటేం దుకు ప్రయత్నిస్తుండగా రాజోలు నుంచి పాలకొల్లు వైపు వెళ్తున్న షిప్టుకారు వేగంగా వచ్చి బాలుడిని ఢీ కొట్టింది. కళ్ల ముందు కన్నకొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిం చారు. తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై లక్ష్మణరావు తెలిపారు. -
తల్లిని చూసేందుకు వెళుతూ...
చల్లపల్లి/ఘంటసాల : టిప్పర్‌ను ఓవర్ టేక్ చేస్తూ వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో బత్తుల వెంకటేశ్వరమ్మ (37) మృతి చెందింది. చల్లపల్లికి చెందిన బత్తుల రామకృష్ణ, వెంకటేశ్వరమ్మ దంపతులు ద్విచక్రవాహనంపై శుక్రవారం రాత్రి మొవ్వ మండలం యద్దనపూడి వెళుతున్నారు. ఘంటసాల మండలం చిట్టూ ర్పు కోళ్లఫారాల వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్‌ను ఓవర్ టేక్ చేస్తూ వచ్చిన లారీ వీరి ౖబైక్‌వైపు దూసుకువచ్చింది. ప్రమాదాన్ని గమనించి బైక్‌ను పొదల్లోకి తిప్పేశాడు. లారీ వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. వెంకటేశ్వరమ్మకు తీవ్రగాయాలు కాగా చల్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. మార్గంమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. స్థానిక ప్రైవేటు స్కూల్లో రామకృష్ణ డ్రైవర్‌గా, వెంకటేశ్వరమ్మ వంటమనిషిగా పనిచేసేవారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు బయలుదేగా ఈ ప్రమాదం జరిగింది. -
హిట్ కావాలంటున్న అక్కినేని వారసులు
-
రైలు ఢీకొని తల్లి, కూతురు మృతి
కుప్పం: పట్టాలు దాటుతున్న తల్లి, కూతురు రైలు ఢీకొని మృతి చెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం అర్బన్‌కాలనీ వద్ద చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కొత్తపల్లికి చెందిన హల్మాత్(38), ఆమె కూతురు తరానా(11) శనివారం సాయంత్రం మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో తల్లి, కూతురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ మేరకు రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జోరుగా పసిడి, హుషారుగా కరెన్సీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ కు డిమాండ్ తగ్గుతుండడంతో భారతీయ కరెన్సీ రూపాయి పుంజుకుంటోంది. సోమవారం నాటి మార్కెట్ లో డాలర్ 24 పైసల నష్టంతో ప్రారంభమైంది. దీంతో నష్టాలనుంచి తేరుకున్న రూపాయి మళ్ళీ 67రూ. మార్క్ దగ్గర స్థిరంగా ఉంది. 0.43 శాతం లాభంతో 67.05 దగ్గర కొనసాగుతోంది. దిగుమతిదారులు, బ్యాంకర్లు నుంచి డిమాండ్ తగ్గడంతో అమెరికన్ కరెన్సీ బలహీనంగా ట్రేడవుతోంది. దీనికి తోడు బలహీనమైన దేశీయ ఈక్విటీ మార్కెట్ ప్రభావంతో రూపాయి పుంజుకుంది. ఈ నేపథ్యంలో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మళ్లీ 67రూ. మార్కును తాకింది. శుక్రవారం రోజు 5 పైసల నష్టంతో 66,76 దగ్గర ముగిసిన రూపాయి విలువ క్రమేపి బలపడి స్థిరంగా కొనసాగడం శుభసూచకమని విశ్లేషకుల అంచనా . బ్యాంకులు , దిగుమతిదారులునుంచి డిమాండ్ తగ్గడం, బలహీనమైన దేశీయ ఈక్విటీ మార్కెట్ ప్రభావంతో డాలర్ నిరంతర జోరుకు బ్రేక్ పడి, రూపాయి పుంజుకుంటోంది. మరోవైపు సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు పతనం దిశగా మళ్లాయి. బీఎస్ఈ సెన్సెక్స్ , నిఫ్టీ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో 332 పాయింట్ల నష్టంతో 26,229 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 8 వేల వందకు దిగువన .. నష్టాల్లో కొనసాగుతోంది. మిగిలిన అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలహీనంగాఉండడం కూడా రూపాయి విలువ పెరగడానికికారణమని డీలర్లు చెప్పారు. అటు డాలర్ బలహీనతతో పసిడి కూడా జోరుమీద ఉంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెరగనున్నాయనే అంచనాలతో ఇటీవల వెలవెలబోయిన పసిడి తిరిగి బలపడుతోంది. ఒకవైపు డాలర్ క్షీణత, మరోవైపు ఫెడ్ వడ్డన ఉండదన్న అంచనాల నేపథ్యంలో పసిడి ధర తిరిగి పుంజుకుని..10 గ్రా. బంగారం ధర 30 వేల మార్క్ ను దాటగా..వెండి 41 వేల దగ్గర స్థిరంగా ఉంది. -
ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తున్న అధ్యయనం
వాషింగ్టన్: జమ్మూకశ్మీర్ ను పెను భూకంపం చుట్టేయనుందనీ, లక్షల కొద్దీ ప్రజలను పొట్టనపొట్టుకునే ప్రమాదం పొంచి ఉందని తాజా అధ్యయనంలో తేలింది. హిమాలయ పర్వత శ్రేణుల భూఅంతర్భాగంలతో నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు తేలాయని పరిశోధకులు చెబుతున్నారు. రాష్ట్రాన్ని భారీ భూకంపం కుదిపేసే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రిక్టర్ స్కేల్ పై ఎనిమిది కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫలితంగా లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదముందని చెబుతున్నారు. అమెరికాకు చెందిన ఓరిగాన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు అధ్యయనంలో ఈ సంచలన విషయాలు తేలాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన యాన్ గావిల్లోట్ తెలిపారు. కశ్మీర్‌లోని రియాసి ఫాల్ట్ (ఆసియా, భారత్ ఫలకాలు కలిసే చోటు)లో జరుగుతున్న పరిణామాల వల్లే భారీ ప్రకంపనలు వస్తాయని వారు అంచనావేశారు. రియాసి ఫాల్ట్ కదలికలపై సుదీర్ఘ పరిశోధన అనంతరం తాము ఈ అంచనాలకు వచ్చామని పరిశోధకులు చెబుతున్నారు .గత 4,000 ఏళ్ల నుంచీ ఇక్కడ ఎలాంటి భారీ ప్రకంపనలు రాలేదని, ఫలితంగా విపరీతమైన ఒత్తిడి ఉండే అవకాశముందని తెలిపారు. అయితే ఇతర ఫలకాలు కలిసే చోట్లతో పోలిస్తే.. రియాసి ఫాల్ట్ అంత క్రియాశీలంగాలేదని వారు వెల్లడించారు. భూకంపం సంభవించే ప్రమాదం ఉందా లేదా అనే ప్రశ్నేలేదని కానీ ఎప్పుడు వస్తుందనేదే తమ ముందున్న ప్రధాన సవాల్ అని యాన్ గావిల్లోట్ వివరించారు. రియాసీ ఫాల్ట్ కి సమీపంలో చీనాబ్ నదిపై అనేక డ్యామ్‌లు , మరోవైపు డజన్ల కొద్దీ సొరంగాలు , వంతెనల గుండా వెళ్లే ముఖ్యమైన రైలు రోడ్లు ఉండడం మరింద ప్రమాదకర పరిణామమన్నారు. దీని మూలంగా , పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సమీపంలోని బాలకోట్ బాగ్ లో 2005 సం.రంలో సంభవించిన భూకంపం కంటే ఎక్కువ తీవ్రతతో ప్రమాదం ముంచుకు రానుందని నష్టం కూడా అంతే భారీ స్థాయిలోఉంటుందని ఆయన హెచ్చరించారు. -
భయంకర ఇసుక తుఫాను!
చైనాః హాలీవుడ్ సన్నివేశాలను తలపించే భయంకర ఇసుక తుఫాను కస్గర్ నగరాన్ని వణికిస్తోంది. చైనా జిన్జియాంగ్ ఇగూర్ అటనమస్ ప్రాంతంలోని కాష్గర్ ఫ్రిఫెక్చర్ లో సంభవించిన ఇసుక తుఫానుతో అక్కడి గృహాలన్నీ కప్పడిపోయాయి. 100 మీటర్ల ఎత్తులో పైకి లేస్తున్న ఇసుక... అతి పెద్ద భవనానలను సైతం కప్పేస్తుండటంతో పరిస్థితి అతి భయానకంగా మారిపోయింది. కాష్గర్ పరిస్థితిని సమీక్షించిన స్థానిక వాతావరణ అధికారులు రెండో ప్రమాద హెచ్చరికగా అరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. వాయువ్య చైనా జిన్జియాంగ్ ఇగూర్ ప్రాంతంలో ఏర్పడ్డ తీవ్ర ఇసుక తుపానుతో.. టంగ్జంక్ నగరం, మిన్ ఫెంగ్ కౌంటీలు భారీ ఇసుక కెరటాల్లో చిక్కుకుపోయాయి. ఆ రెండు ప్రాంతాలూ ఇసుక కెరటాలతో తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో అధికారులు స్థానికులను ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళనుంచి బయటకు రావద్దని హెచ్చిరికలు జారీ చేశారు. అక్కడి పరిస్థితిపై స్థానికులు చిత్రించిన వీడియో ఇప్పడు యూట్యూబ్ వినియోగదారుల్లో ఆత్రుతను నింపుతోంది. తుఫాన్లతో నీటికి కొట్టుకుపోయే నగరాలను చూసేందుకే అలవాటు పడ్డ జనం... ఇసుక తుఫానుతో ఏకంగా నగరాలకు నగరాలనే కప్పేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు. -
నేను ప్రత్యూషను కొట్టాను...
టీవీనటి ప్రత్యూష బెనర్జీ అనుమానాస్పద మరణంపై ఆమె బాయ్‌ఫ్రెండు రాహుల్ రాజ్ సింగ్ మాజీ ప్రియురాలు సలోని శర్మ తొలిసారి మౌనం వీడారు. మీడియాతో మాట్లాడిన ఆమె కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. దీంతో ఈ ఉదంతంలో రాహుల్ ప్రమేయంపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఫిబ్రవరి 11 తాను ప్రత్యూష బెనర్జీని కొట్టినట్లు సలోని అంగీకరించారు. అయితే తాను కావాలని కొట్టలేదని, ప్రతీకారంగానే అలా చేశానని చెప్పుకొచ్చారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని, వాట్సాప్ లో ఆమె కాంటాక్ట్ ను బ్లాక్ చేశానన్నారు. రాహుల్ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ కోసం పెట్టుబడి పెట్టిన డబ్బులు అడగడానికే ఫిబ్రవరి 11న ఆమె ఫ్లాట్‌కు వెళ్లినపుడు ముగ్గురి మధ్య వివాదం జరిగిందని తెలిపింది. ఈ క్రమంలో రాహుల్, ప్రత్యూష ఇద్దరూ తనపై దాడిచేసినపుడు తాను తిరగబడ్డానని తెలిపింది. తనను తాను రక్షించుకోడానికే ఆమెను కొట్టాల్సి వచ్చిందని తెలిపింది. అప్పు తీర్చమన్నందుకు తనపై అమానుషంగా ప్రవర్తించి దాడికి పాల్పడడంతో వారిపై స్థానిక బంగర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. వాళ్లిద్దరి విజ్ఞప్తితోనే ఆ తర్వాత ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్టు తెలిపారు. ఇపుడు ప్రత్యూష ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఈ విషయాలన్నీ తెలుసని వివరించారు. శనివారం తన తండ్రితో కలిసి బంగర్ నగర్ పోలీస్ స్టేషన్లో సలోని తన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. సలోని చెప్పిన వివరాలు ఇవీ.. 2011లో మోడలింగ్, యాక్టింగ్ కెరీర్ కోసం కోల్‌కతా నుంచి ముంబైకి వచ్చినపుడు రాహుల్‌తో పరిచయం ప్రేమకు దారితీసింది. ఈక్రమంలో ఇద్దరు కలిసి ఒక కంపెనీని ప్రారంభించారు. దీనికోసం సలోని రూ. 30 లక్షల పెట్టుబడి పెట్టింది. ఇంతలో తమ కామన్ స్నేహితుల ద్వారా రాహుల్, ప్రత్యూషల మధ్య సంబంధాన్ని తెలుసుకున్న ఆమె రాహుల్ ని నిలదీసింది. అవన్నీ అబద్ధాలని, వాటిని పట్టించుకోవద్దంటూ నమ్మబలికాడు. ఈ గందరగోళం ఇలా కొనసాగుతుండగానే హఠాత్తుగా ఆగస్టు 10 న ప్రత్యూష పుట్టినరోజు సందర్భంగా టెలివిజన్‌లో వారి వివాహ ప్రకటన విని నివ్వెరపోయి మర్నాడు రాహుల్ ని నిలదీయగా, ఆమెకు సమాధానం చెప్పాల్సిన రాహుల్ దీనికి బదులుగా సలోని తండ్రికి ఫోన్ చేసి కూతుర్ని తీసుకుపొమ్మని చెప్పాడు. ఆయన వచ్చి రాహుల్ తోనూ, ప్రత్యూష తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. తన కూతురు రాహుల్‌కు లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయిందని, ఇలాంటి పరిస్థితే ప్రత్యూషకు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు తనను ఎపుడూ కలవని వారు, రాహుల్ - ప్రత్యూష తనకు మధ్య ఏం జరిగిందేంటో తెలియనివారు కూడా.. తన గురించి మాట్లాడుతున్నారని సలోని విమర్శించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన అందరిపై పరువునష్టం దావా దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రాహుల్ వ్యవహారం తనకుముందే తెలిస్తే అతనితో సన్నిహితంగా ఉండేదాన్ని కాదని వాపోయారు. ప్రస్తుతం తాను పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయానని తెలిపారు. -
మృత్యు వాహనం
♦ బస్టాప్‌లో పాలిటెక్నిక్ విద్యార్థిని ఢీ కొట్టిన స్కూల్ వ్యాన్ ♦ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి.. నల్లకుంటలో ఘటన ♦ మృతుడు కరీంనగర్ జిల్లాకు చెందిన సాయిప్రకాశ్గా గుర్తింపు హైదరాబాద్: బస్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ పాలిటెక్నిక్ విద్యార్థిని స్కూల్ వ్యాన్ రూపంలో మృత్యువు కబళిం చింది. నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం గొల్లపల్లికి చెందిన బూస సాయిప్రకాశ్(21) ఇబ్రహీం పట్నంలోని రాజమహేంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ డిప్లమా మూడో సంవత్సరం చదువుతున్నాడు. దీంతో పాటు వీఎస్టీలో అప్రెంటీస్ చేస్తున్నారు. ఓయూలో ఎంసీజే చదువుతున్న సోదరుడు సతీశ్ హాస్టల్ రూమ్‌లో నాన్బోర్డర్గా ఉంటున్నాడు. శుక్రవారం వీఎస్టీకి వెళ్లేందు కు ఉదయం 6.35 గంటలకు లక్కీ కేఫ్ చౌరస్తాలోని బస్టాప్ వద్ద బస్సు కోసం సాయిప్రకాశ్ వేచి చూస్తున్నాడు. అదే సమయంలో ఓయూ నుంచి పాఠశాల విద్యార్థులను తీసుకుని వస్తున్న మెటాడోర్(ఏపీ 10టీ3022) వ్యాన్ అదుపు తప్పి సాయిప్రకాశ్‌ను బలంగా ఢీకొంది. దీంతో సాయిప్రకాశ్ తలకు బలమైన గాయా లై అక్కడికక్కడే మృతిచెందాడు. వ్యాన్ అదే వేగంతో దూసుకెళ్లి బస్టాప్ పక్కనే ఉన్న తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాం క్ వద్ద ఫుట్‌పాత్ పైకి ఎక్కి కాంపౌండ్ వాల్‌ను ఢీకొట్టింది. పెద్దగా శబ్దం రావడంతో అక్కడి ఏటీఎం వద్దనున్న సెక్యూరిటీ గార్డు నర్సింహా పరుగెత్తుకు వచ్చి వ్యాన్‌లో భయం తో ఏడుస్తున్న విద్యార్థులను బయటకు తీశాడు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాడు. పోలీసు లు ప్రమాద స్థలానికి చేరుకుని సాయిప్రకాశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి పెదనాన్న కుమారుడు పి.నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన రామంతాపూర్ రాంరెడ్డినగర్‌కు చెందిన మెటాడోర్ డ్రైవర్ బి.లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని సాయిప్రకాశ్ కుటుంబ సభ్యులకు అప్పగించారు. వాహనం బ్రేకు లు ఫెయిలై ప్రమాదం జరిగిందా.. మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
'ఫూల్స్ డే' సినీ సందడి!
శుక్రవారాలు, పండుగలు, వేసవి సెలవులు, పబ్లిక్ హాలీడేస్ వంటి వాటినే సినిమా రిలీజ్ కు ముహూర్తాలుగా భావించే సినీ నిర్మాతలు... ఇటీవల ఫూల్స్ డేను కూడ మంచి ముహూర్తంగా ఎంచుకున్నారు. మార్చి నెలతో దాదాపుగా విద్యార్థుల పరీక్షలు పూర్తయి, ఏప్రిల్ నెల నుంచి వేసవి సెలవులు ఇస్తారు. ఈ మధ్యకాలంలో వచ్చే ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్ డే ను కూడా సినిమాల విడుదలకు వాడేసుకుంటున్నారు. ఈసారి ఫూల్స్ డే స్సెషల్ సినిమాల సందడి ఏమిటో ఓసారి చూద్దాం. వేసవి సెలవుల్లో సినీస్టార్లు, యంగ్ హీరోలు తమ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ ఫస్ట్ నాడు ఆరు తెలుగు సినిమాలు, మూడు తమిళ్ డబ్బింగ్ సినిమాలు, రెండు హిందీ, రెండు ఇంగ్లీష్ సినిమాలతో అభిమానులను అమితంగా అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నారా రోహిత్ నటించిన 'సావిత్రి', మంచు మనోజ్ 'అటాక్', '7టు4', ఆర్తీ ఆగర్వాల్ చివరి సినిమా 'ఆమె ఎవరు?', 'పిడుగు', 'రహదారి' మొదలైన ఆరు తెలుగు సినిమాలు, శర్వానంద్ నటించిన రాజాధిరాజ, నాగార్జున హిట్ టైటిల్ తో ధనుష్ హీరోగా 'మాస్', నన్ను వదిలి నీవు పోలేవు వంటి తమిళ డబ్బింగ్ సినిమాలు, కీ అండ్ కా, మా పాస్ హిందీ చిత్రాలు, కుంగ్ ఫూ పాండా 3, ది డైవర్జెంట్ సిరీస్ లోని అలెజియంట్ ఇంగ్లీష్ సినిమాలు ఫూల్స్ డే కి రిలీజ్ కాబోతున్నాయి. క్లాస్ టచ్ ఉన్న టైటిల్ సావిత్రి తోపాటు ఆకట్టుకునే పోస్టర్లు, ఆనందింపజేస్తున్న ట్రైలర్ తో దర్శకుడు పవన్ సాదినేని సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగా... రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా వస్తున్న అటాక్ కూడ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఆర్తీ అగర్వాల్ చివరి సినిమా మార్కుతో వస్తున ఆమె ఎవరు?, తమిళంలో ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న ధనుష్ సినిమా మాస్ (మారి), మాస్ ప్రేక్షకులను, పెద్దలను కూడ ఆకట్టుకునే నన్ను వదిలి నీవు పోలేవులే సినిమాలు ఏప్రిల్ ఫస్ట్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గత కొంతకాలంగా యంగ్ హీరోల సినిమాలు హిట్ కొట్టి, మంచి లాభాలు తెచ్చిపెడుతున్న నేపథ్యంలో శర్వానంద్ రాజాధిరాజా తమిళ్ వర్షన్ ను డైరెక్ట్ డీవీడీలుగా థియేటర్లలో ప్రత్యేకంగా రిలీజ్ చేసేందుకు తెలుగు పంపిణీదారులు ఉత్సుకత చూపిస్తున్నారు. ఇకపోతే మరిన్ని తెలుగు సినిమాలు ఇదే వారంలో విడుదలయ్యేందుకు సిద్ధమౌతుండగా ఇటీవల ప్రేక్షకులను మెప్పించిన నాగార్జున 'ఊపిరి'కి వీటిలో ఏదైనా పోటీ పడతాయా లేవా అన్నది మాత్రం అభిమానులు నిర్ణయించాల్సిందే. -
‘అల్లరి’ నరేశ్ వస్తే హిట్టే!
- సందీప్ కిషన్ ‘‘తమిళంలో ఏడాది కిందట ‘నేరమ్’ సినిమా చూసి తెలుగులో చేద్దామని సందీప్ కిషన్‌తో చెప్పా. నాపై నమ్మకంతో ఈ సినిమా చేయమని కోరితే తను సరే అన్నాడు. దర్శకుడు అని కన్నెగంటి ఎక్కడా సోల్ మిస్సవకుండా తెరకెక్కించాడు. ఇందులో మహత్ మంచి క్యారెక్టర్ చేశాడు. జాతీయ అవార్డు గ్రహీత అయిన నటుడు బాబీ సింహాను తెలుగులో పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆయన తెలుగువాడే. ఈ నెల 23న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత అనీల్ సుంకర చెప్పారు. సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్ జంటగా అని కన్నెగంటి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర నిర్మించిన చిత్రం ‘రన్’.సాయి కార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. పాటల సీడీని హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేసి హీరో రాజ్ తరుణ్‌కు ఇచ్చారు. నిర్మాత ఏయం రత్నం ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ‘‘గత ఏడాది గుడ్ టైమ్, బ్యాడ్ టైమ్ రెండూ చాలా హెవీగా చూశా. ఈ ఏడాది అంతా గుడ్ టైమ్ ఉంటుందనుకుంటున్నా. నా సినిమా ఫంక్షన్స్‌కి ‘అల్లరి’ నరేశ్ అన్న వచ్చినవన్నీ బాగా ఆడాయి. సెంటిమెంట్ గా ఈ చిత్రం కూడా ఆడుతుంది’’ అని సందీప్ కిషన్ అన్నారు. ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ- ‘‘ఇది నా సొంత బ్యానర్లాంటిదే. కొత్త పాత్రలు చేయాలి, కొత్త సినిమా చేయాలని కోరుకుంటాడు సందీప్. తమిళం, మలయాళంలోలానే తెలుగులో కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అని పేర్కొన్నారు. ఈ వేడుకలో దర్శకులు వీరు పోట్ల, కె.దశరథ్, జి.నాగేశ్వర రెడ్డి, నిర్మాత పి. కిరణ్, నటులు మహత్, అవసరాల శ్రీనివాస్, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
దారి కాచిన మృత్యువు
♦ దైవ దర్శనానికి వెళ్తూ ఇద్దరు మహిళల మృతి ♦ మరొకరి పరిస్థితి విషమం పదిహేను మందికి గాయాలు ♦ అందరిదీ ఒకే కుటుంబం.. న్యూ హుమ్నాపూర్ వద్ద దుర్ఘటన ♦ ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ ఇద్దరు మహిళల మృతి పుల్కల్: దైవ దర్శనానికి వెళుతున్న భక్తులకు ఓ లారీ మృత్యు రూపంలో ప్రాణాలు హరించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు చనిపోగా మరో 15 మంది గాయపడ్డారు. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో పుల్కల్ మండలం న్యూ హూమ్నపూర్ వద్ద జరిగిన ప్రమాదానికి సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి మండలం మామిడిపల్లి గ్రామ పంచాయతీ గొల్లగూడెం తండాకు చెందిన కిమ్యా తోపాటు ఆయన బంధువులు కుమార్, చందర్, మాన్సింగ్, శ్రీను మరి కొందరు ఏడపాయల దుర్గామాత జాతరకు మంగళవారం తెల్లవారుజామున ట్రాక్టర్లో బయల్దేరారు. హూమ్నపూరం వద్ద ముందు వెళుతున్న ఓవర్ టేక్ చేయబోగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో కిమ్యా భార్య కేలి (45), భూలీ బాయి(42) అక్కడికక్కడే మృతి చెందారు. అమ్మవారి కోసం తీసుకెళుతున్న మేక కూడా చనిపోయింది. మరో 13 మందికి గాయలు కావడంతో 108లో సంగారెడ్డి సమీపంలోని ఎంఎన్ఆర్ అసుపత్రికి తరలించారు. మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.ట్రాక్టర్‌ను లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఆలయానికి వెళుతున్న వారి సామగ్రి చెల్లాచెదరుగా పడ్డాయి. ఒకరి పరిస్థితి విషమం సంగారెడ్డి రూరల్: పుల్కల్ మండలం హూమ్నపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 13 మందిని సంగారెడ్డి మండలం ఎంఎన్ఆర్ ఆసుపత్రి తరలించారు. వారిలో చెంద్రి బాయి తలకు బలమైన గాయాలు తగలడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో కిమ్యా నడుము విరగగామాలీ బాయికి చేయి విరిగింది. అనీత, సంగీత,బుజ్జి, రవీందర్, వాల్యా, శివకు గాయాలయ్యాయి. చిన్నారులు చంద్ర కిషోర్ కుడికాలు విరిగింది. హారిక, కిశోర్, సాత్వీక్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు మహిళలు మృతి చెందడంతో వారి గ్రామం గొల్లాగుడెం తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువుల రోదనలతో ఆసుపత్రి ఆవరణ అంత విషాదంగా కనిపించింది. -
బెంగాల్లో కంటతడి పెట్టించిన ఏనుగు
-
ఆరు సంవత్సరాల దిగువకు పుత్తడి
ముంబై: కొంతకాలంగా స్థిరంగా ఉన్న బంగారం విలువ దిగి వస్తోంది. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లో డాలర్ డిమాండ్ పుంజుకోవడంతో బంగారం దాదాపు ఆరు సంవత్సరాల దిగువకు పడిపోయింది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఈ డిసెంబర్లో పెరగనున్నాయనే వార్తల నేపథ్యంలో 10గ్రాముల బంగారం ధర 25 వేలకు కొంచెం ఎగువన ట్రేడవుతోంది. దీంతో ఇన్వెస్టర్లలో ధరలు మరింత దిగి వస్తాయనే కొత్త ఆశలు చిగురించాయి. రాబోయే కాలంలో పసిడి ధర 25 వేలకు దిగి రావచ్చని ఆశిస్తున్నారు. పసిడితోపాటు ఇతర విలువైన మెటల్స్ రేట్లు కూడా దిగి వస్తున్నాయి. ముఖ్యంగా ప్లాటినం, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్లో గత 10, 15 సెషన్లుగా క్షీణిస్తూ వస్తున్న పసిడి ధర బుధవారం 25 వేల మార్కు దగ్గర ట్రేడవుతోంది. ఈ క్షీణత కొనసాగితే , పుత్తడి ధర ఇంకా దిగి వచ్చే అవకాశాలున్నాయని ఎనలిస్టులు సూచిస్తున్నారు. 2010 ఫిబ్రవరితో పోలిస్తే ..బంగారం విలువ బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 25,117 స్థాయిని తాకింది. మంగళవారం 450 రూపాయల పతనమైన బంగారం విలువ ఈ రోజు కూడా కొనసాగి మరింత నేలచూపులు చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రిటైల్ మార్కెట్ లో ఆర్నమెంట్ బంగారం, నగలకు డిమాండ్ తగ్గుముఖం పట్టడం కూడా ఒక కారణమని ఎనలిస్టులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులు పసిడి ధరలో క్షీణత గమనిస్తున్నప్పటికీ, ఈ పతనం కీలకమైందంటున్నారు ట్రేడ పండితులు. అటు ఫెడ్ అంచనాలు, పారిస్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. నిఫ్టీ 100, సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టపోయాయి.