ఆఫీసర్‌ అర్జున్‌ ఆన్‌ డ్యూటీ | Nani begins shooting for Hit: The Third Case in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆఫీసర్‌ అర్జున్‌ ఆన్‌ డ్యూటీ

Published Sat, Sep 14 2024 3:26 AM | Last Updated on Sat, Sep 14 2024 3:27 AM

Nani begins shooting for Hit: The Third Case in Hyderabad

నాని హీరోగా నటిస్తున్న ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ప్రారంభమైంది. ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’, ‘హిట్‌: ది సెకండ్‌ కేస్‌’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న మూడో చిత్రం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్‌ కొలను ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’ని తెరకెక్కిస్తున్నారు. యునానిమస్‌ప్రోడక్షన్స్‌తో కలిసి వాల్‌పోస్టర్‌ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమా నిర్మిస్తున్నారు.

 కాగా ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లోప్రారంభమైంది. ఈ షూటింగ్‌లో ఆఫీసర్‌ అర్జున్‌గా డ్యూటీ ఆరంభించారు నాని. ‘‘ఈ సినిమాలో ఆఫీసర్‌ అర్జున్‌ సర్కార్‌గా ఫెరోషియస్‌ క్యారెక్టర్‌లో నాని కనిపించబోతున్నారు. ఈపాత్ర కోసం నాని కంప్లీట్‌గా మేకోవర్‌ అయ్యారు. 2025 మే 1న ఈ  సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్‌ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement