ఓ వ్యక్తి ఖాళీగా ఉన్న స్కూల్ బస్సును దొంగలించి నానా భీభత్సం సృష్టించాడు. చివరకి సినీ ఫక్కీలో పోలీసులు అతన్ని ఛేజ్ చేసి ఈ కథకి శుభం కార్డు వేశారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక పోలీసులకి ఎక్కడ నుంచో ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే కొందరు పోలీసులు కార్లలో స్కూల్ బస్సును దొంగలించి పారిపోతున్న వ్యక్తిని పట్టుకోవడం కోసం తమ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే సడెన్‌గా సీన్‌లోకి పోలీసులను చూసేసరికి ఆ వ్యక్తికి మైండ్ బ్లాక్ అయ్యి బస్సు వేగం పెంచాడు.
అలా కొంత దూరం వెళ్లగానే రోడ్డు పై వాహనాల రద్దీ పెరిగింది. అయినా వాటిని లెక్కచేయకుండా ఆ వ్యక్తి బస్సుని మరింత వేగంగా నడుపుతూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతన్ని పోలీసులు వెంబడించడంతో రోడ్డుపై తనకి దారిలో అడ్డంగా ఉన్న కార్లను వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకు కదిలాడు. అలా సుమారు 20 కార్లకుపైగా ఈ ఘటనలో ధ్వంసంమయ్యాయి. కాకపోతే ఆ స్కూల్ బస్సులో ఎవరూ లేరు పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
అతను ఎలాగైనా పోలీసులకు చేతికి చిక్కకూడదని రోడ్డుపై కనపడినా వాటిని ఢీకోట్టుకొట్టుకుంటూ వెళ్తుండగా ఓ బస్‌స్టాప్ సమీపంలోని కాంక్రీట్ రిటైనింగ్ గోడను ఢీకొట్టడంతో బస్సు ఆగింది. వెంటనే బస్సులోంచి దిగి ఆ వ్యక్తి తప్పించుకోవాలని ముందుకు పరుగెత్తాడు. పోలీసులు ఏ మాత్రం పట్టు విడువక చివరి వరకు వెంటాడి అతడిని అరెస్టు చేసి, తర్వాత చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ బస్సును ఎందుకు దొంగలించాడని మాత్రం తెలియలేదు.
Comments
Please login to add a commentAdd a comment