steal
-
కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థలైన కియా, హ్యుందాయ్ కంపెనీల కార్లను అమెరికా దేశంలో రీకాల్ చేసేయాలని ఆ దేశ ఫెడరల్ ప్రభత్వానికి అభ్యర్థనలు వచ్చాయి. ఎందుకంటే ఆ కార్లను సులువుగా దొంగిలిస్తున్నారట. ‘అసోసియేటెడ్ ప్రెస్’ కథనం ప్రకారం.. అమెరికాలోని 17 రాష్ట్రాల అటార్నీ జనరల్‌లు మిలియన్ల కొద్దీ కియా, హ్యుందాయ్ కార్లను రీకాల్ చేయాలని ఫెడరల్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇదీ చదవండి: వాహన ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా? వీటితో భలే బెనిఫిట్స్! అమెరికా దేశంలో గత దశాబ్దంలో విక్రయించిన కొన్ని కియా, హ్యుందాయ్ కార్లలో ఇంజిన్ ఇమ్మొబిలైజర్లు లేవు. వీటిని చాలా కార్లలో ప్రామాణిక ఫీచర్‌గా పరిగణిస్తారు. కీ లేకుండా ఇంజిన్‌ను స్టార్ట్ చేయకుండా ఈ ఇంజిన్ ఇమ్మొబిలైజర్లు నిరోధిస్తాయి. కేవలం స్క్రూడ్రైవర్, యూఎస్బీ కేబుల్‌తో కియా, హ్యుందాయ్ కార్లను ఎలా కొట్టేయొచ్చో చూపించే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో, టిక్‌టాక్‌లో దర్శనమిస్తున్నాయి. లాస్ ఏంజిల్స్‌లో కేవలం హ్యుందాయ్, కియా కార్ల దొంగతనాలు 2022లో దాదాపు 85 శాతం పెరిగాయి. నగరంలో జరిగిన మొత్తం కార్ల దొంగతనాలలో హ్యుందాయ్, కియా కార్ల దొంగతనాలు 20 శాతం ఉన్నాయని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపింది. దొంగిలించిన ఈ కార్లు 14 ప్రమాదాలు, ఎనిమిది మరణాలకు కారణమయ్యాయని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంటోంది. గత అక్టోబరులో న్యూయార్క్‌లోని బఫెలోలో జరిగిన కారు ప్రమాదంలో నలుగురు టీనేజర్లు చనిపోయారు. టిక్‌టాక్ ఛాలెంజ్‌లో భాగంగా కియా కారును దొంగిలించిన ఆరుగురు యువకులు వేగంగా దూసుకెళ్లి ప్రమాదానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా, ఇతర అటార్నీ జనరల్‌లు కియా, హ్యుందాయ్ కార్ల దేశవ్యాప్త రీకాల్‌ను అభ్యర్థిస్తూ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు లేఖ పంపారు. కియా, హ్యుందాయ్ కంపెనీలు తమ అనేక వాహనాలకు ప్రామాణిక భద్రతా ఫీచర్లను కల్పించడంలో విఫలమవడం వల్ల వాహనదారులను, సామాన్య ప్రజలను ప్రమాదంలో పడేశాయని ఆరోపించారు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
ఫుల్ ట్రాఫిక్..అందరూ చూస్తుండగానే రూ.40 లక్షలు స్వాహా!
అందరూ చూస్తుండగానే ఏ మాత్రం భయం లేకుండా చోరికి యత్నించారు. అదికూడా ఒక బైకర్ని అనుసరించిన ముగ్గురు దుండగులు ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు రాగానే సొత్తు చోరీ చేసి ఉడాయించారు. ఈ ఘటన మార్చి1న సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెండు కార్లు వాటి మధ్యలో ఓ బైక్ ఆగి ఉన్నాయి. ఇంతలో ముగ్గురు దుండగులు కామ్‌గా ఆ వాహనదారుడి వద్దకు వచ్చి గమనించడం ప్రారంభించారు. ఇంతలో అతని భూజానికి తగిలించి ఉన్న బ్యాగ్‌ని నెమ్మదిగా ఓపెన్ చేసి సుమారు రూ. 40 లక్షలు కొట్టేశారు. జస్ట్ నాలుగే నాలుగు నిమిషాల్లో డబ్బుల కొట్టేసి జారుకున్నారు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. కాసేపటికి అసలు విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు రంగలోకి దిగిన పోలీసులు సమీపంలో సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించడంతో ఈ ఘటన మొత్తం బయటపడింది. దీంతో పోలీసులు ఆ నిందితుల్లో ఇద్దర్ని అదుపులోకి తీసుకుని సుమారు రూ. 38 లక్షలు రికవరీ చేశారు. నిందితులను ఆకాశ్, అబిషేక్గా గుర్తించారు. ఆ ముఠా వాహనదారులే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: ఆర్ఎస్ఎస్ ఓ రహస్య సమాజం: రాహుల్ గాంధీ) -
షాకింగ్ ఘటన: జస్ట్ 60 సెకన్లలో 7 కోట్ల కార్లు హాంఫట్
సినిమాలో చూస్తుంటాం అత్యంత ఖరీదైన లగ్జరీ కార్టు కొట్టేయడం. నిజ జీవితంలో కాస్త రిస్క్. కానీ ఈ ఘటన చూస్తే ఇంత సులభంగా కొట్టేయొచ్చా అని నోరెళ్లబెట్టడం మనవంతు అవుతుంది. ఇక్కడొక దొంగల ముఠా కేవలం 60 సెకన్లలో చకచక సుమారు రూ. 7 కోట్లు ఖరీదు చేసే కార్లను కొట్టేశారు. వివరాల్లోకెళ్తే...ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్ కౌంటీలో ఈ హైటెక్ దోపిడి ఘటన చోటు చేసుకుంది. కొంతమంది దొంగలు ఇంగ్లాండ్‌లోని థురోక్ బరో గ్రామంలో బ్రెంట్వుడ్ రోడ్ సమీపంలోని ఓ కాంపౌండ్‌లోకి చోరబడ్డారు. అక్కడ ఉన్న ఐదు లగ్జరీ కార్లను సినిమాలోని హీరోల మాదిరి ఎత్తుకెళ్లారు. ఆ దొంగల్లో ఒక వ్యక్తి గేటు తీసి సాయం చేస్తే మిగతా దొంగలు ఆ కార్లను ఎంచక్కా...డ్రైవ్ చేసుకుంటూ జస్ట్ 60 సెకన్లలో గప్‌చుప్‌గా కొట్టేశారు. సుమారు రూ. ఏడు కోట్లకు పైగా విలువ చేసే మొత్తం ఐదు లగ్జరీ కార్లను ఎత్తుకెళ్లారు. వాటిలో రెండు పోర్ష్లు, మెర్సిడెస్‌లు కాగా, ఒక మేబ్యాక్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అందుకు సంబంధించిన ఘటన మొతం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అవ్వడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. (చదవండి: వాటే ఐడియా! స్కూటర్ సాయంతో నిర్మాణ పనులు) -
కటకటాలకు కంత్రీగాళ్లు
ఆధార్ మార్ఫింగ్ చేసి.. ఫోర్జరీ సంతకాలతో భూమి కొట్టేసి.. రూ.కోట్లు కొల్లగొట్టాలనుకున్న కంత్రీగాళ్లను పోలీసులు కటకటాలకు పంపారు. కేసులో ఐదుగురు నిందితులు హనుమంతాచారి అలియాస్ హనుమంతు, వేణుగోపాల్, రమేష్ రామ్మోహన్‌రెడ్డి, వడ్డే రాముడును రుద్రంపేట వద్ద అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరిపై 420, 467, 468, 470, 471, 120 బీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఎక్సైజ్ కోర్టులో న్యాయమూర్తి ఓంకార్ ఎదుట హాజరుపరిచారు. ఆయన వారికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు వెల్లడించారు. సాక్షి అనంతపురం: అనంతపురంలోని వక్కలం వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకటసుబ్బయ్యకు వెంకటరమణ, నందకిషోర్ సంతానం. వెంకటసుబ్బయ్యకు వివిధ ప్రాంతాల్లో రూ కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అందులో భాగంగా రాచానపల్లి సర్వే నంబర్ 127లో 14.96 ఎకరాల భూమి ఉంది. రూ.45 కోట్లు విలువ చేసే ఈ భూమిపై అంపగాని శ్రీనివాసులు (పక్ష పత్రిక ప్రతినిధి)పై కన్నుపడింది. ఇతని సమీప బంధువు, వరుసకు బావ అయిన సత్యమయ్య (అంపగాని శ్రీనివాసులు బినామీ), వివిధ టీవీ చానళ్లలో పని చేసే హనుమంతాచారి అలియాస్ హనుమంతు, వేణుగోపాల్, రమేష్ రామ్మోహన్‌రెడ్డితో ముఠాగా ఏర్పడ్డారు. భూ‘మాయ’ మొదలైందిలా.. వెంకటసుబ్బయ్య స్థిరాస్తిని కాజేయడానికి అంపగాని శ్రీనివాసులు ముఠా పలు దఫాలు ప్రయత్నాలు చేసింది. మొదట వెంకట సుబ్బయ్య కుమారుడైన వెంకటరమణ ఆధార్‌ను బుక్కరాయసముద్రం చెన్నంపల్లికి చెందిన తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫొటోతో మార్చాలని చూశారు. వెంకటరమణ అడ్రస్‌కు తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫొటోతో కూడిన ఆధార్ వెళ్లడంతో వారు అప్రమత్తమై వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 21న తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. రెండో ప్రయత్నంలో ముఠా సభ్యులు ఆర్కే నగర్‌కు చెందిన బత్తల శేఖర్, అచ్చుకట్ల ఇంతియాజ్ (తహసీల్దార్ కార్యాలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి), కర్తనపర్తి సురేష్ (ఆధార్ సెంటర్ నిర్వాహకుడు) సహాయంతో వెంకటసుబ్బయ్య ఆధార్‌లోని ఫొటోకు బదులుగా హకీం అబ్దుల్ మసూద్ అనే వ్యక్తి ఫొటోను అప్డేట్ చేశారు. అప్డేట్ ఆధార్ కార్డు వెంకటసుబ్బయ్య అడ్రెస్‌కు వెళ్లడంతో ఏదో జరుగుతోందని భావించి.. కుటుంబ సభ్యులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో శేఖర్, ఇంతియాజ్‌ను ఈ నెల 21న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. మూడో ప్రయత్నంలో ముఠా సభ్యులు విజయం సాధించారు. టీచర్స్ కాలనీకి చెందిన వడ్డే రాముడు ఆధార్ కార్డులో వడ్డే రాముడు పేరు బదులుగా వెంకటసుబ్బయ్య పేరు, అతని తండ్రి పేరును నవీకరించారు. అదే విధంగా వెంకటసుబ్బయ్య ఫోన్ నంబర్‌కు బదులుగా వడ్డే రాముడు ఫోన్ నంబర్‌నే ఆధార్‌లో పొందుపర్చారు. అడ్రస్ సైతం వడ్డే రాముడిదే ఉంచారు. ఈ విధంగా వడ్డే రాముడినే వెంకటసుబ్బయ్యగా చూపుతూ ఈ నెల ఒకటో తేదీన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అంపగాని శ్రీనివాసులు బావ అయిన సత్యమయ్యకు 14.96 ఎకరాలు రిజి్రస్టేషన్ చేయించారు. అలా రిజిస్ట్రేషన్ చేయించిన భూమిని పెదవడుగూరుకు చెందిన ప్రస్తుతం నగరంలో ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి దేవేందర్‌రెడ్డికి ఎకరా రూ.కోటి చొప్పున విక్రయిస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. అందుకోసం దేవేందర్‌రెడ్డి అడ్వాన్స్ రూపంలో సదరు ముఠా సభ్యులకు కోటీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు. పరారీలో రంగనాయకులు.. మూడో ప్రయత్నం సఫలమవడానికి హనుమంతాచారి అలియాస్ హనుమంతు ద్వారా సీన్లోకి వచ్చిన రంగనాయకులు అలియాస్ కేశవ (గోల్డ్ స్మిత్) ఆధార్ మార్పులో కీలకంగా వ్యవహరించాడు. ఆధార్ మార్చడానికి, వడ్డే రాముడును తీసుకువచ్చిన రంగనాయకులుకు అంపగాని శ్రీనివాసులు, సత్యమయ్య, హనుమంతు, వేణుగోపాల్, రమేష్, రామ్మోహన్‌రెడ్డి రూ.18 లక్షలు ముట్టజెప్పినట్లు విచారణలో తేలింది. ఆధార్ మార్పునకు సహకరించిన రంగనాయకులు పరారీలో ఉన్నాడు. ఇలా వెలుగులోకి.. మార్పులతో వచ్చిన ఆధార్ కార్డులు ఇంటికి రావడంతో వెంకటసుబ్బయ్య కుటుంబీకులకు అనుమానం వచ్చింది. వెంకటసుబ్బయ్య కుమారుడైన నందకిషోర్(ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్) రిజి్రస్టేషన్ కార్యాలయానికి వెళ్లి చూడగా ఫోర్జరీ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ నెల ఏడో తేదీన డీపీఒలో జరిగిన ‘స్పందన’ కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పకు నందకిషోర్ ఫిర్యాదు చేశాడు. సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులును ఎస్పీ ఆదేశించారు. డీఎస్పీ లోతుగా విచారణ చేపట్టడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. -
ఆధార్ మార్చి.. ఆస్తులు కాజేయాలని..
సాక్షి, అనంతపురం: ఆధార్ కార్డులో ఫొటో, ఇతర వివరాలు మార్పు చేసి స్థిరాస్తులను కాజేయాలనుకున్న ఓ‘ ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ప్రింటర్, స్కానర్ తదితర 12 రకాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం అనంతపురం డీఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో త్రీటౌన్ సీఐ కత్తి శ్రీనివాసులు వెల్లడించారు. ప్రస్తుతం అరెస్టు అయిన బత్తల శేఖర్ (ఆర్కేనగర్, అనంతపురం), అచ్చుకట్ల ఇంతియాజ్ (అనంతపురం తహసీల్దార్ కార్యాలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి, కళ్యాణదుర్గం రోడ్డులో నివాసం), కర్తనపర్తి సురేష్ (ఆధార్ సెంటర్ నిర్వాహకుడు, రామకృష్ణ కాలనీ, అనంతపురం) ముఠాలో సభ్యులు. ఈ ముఠాకు సూత్రధారి నగరంలోని ఆర్కే నగర్‌కు చెందిన అంపగాని శ్రీనివాసులు. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. విలువైన భూములు, స్థలాలున్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడేవాడు. నాల్గవ పట్టణ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తికి సంబంధించిన 14 ఎకరాల స్థిరాస్తి కాజేయాలనుకున్న కేసులో ఈ నెల 12న పోలీసులు రిమాండ్‌కు పంపారు. ఇలా వెలుగులోకి.. ఈ ముఠా సభ్యులు అనంతపురంలోని సైఫుల్లా బ్రిడ్జి సమీపంలోని కామన్ సర్వీస్ పాయింట్లో ఆధార్‌లో మార్పులు చేసి అమాయకుల ఆస్తులు కొల్లగొట్టేందుకు యతి్నంచేవారు. ఇదే క్రమంలో త్రీటౌన్ పీఎస్ పరిధిలో ఉండే వృద్ధుడు వెంకటసుబ్బయ్య ఆస్తులపై కన్నుపడింది. వన్‌టౌన్, తదితర ప్రాంతాల్లో ఇతని పేరు మీద విలువైన స్థలాలు ఉన్నాయి. దీంతో శేఖర్ అనే టీ స్టాల్ నిర్వాహకుడి ద్వారా హకీం అబ్దుల్ మసూద్‌ను పావుగా వాడుకున్నారు. వెంకట సుబ్బయ్య ఆధార్ కార్డులో హకీం అబ్దుల్ మసూద్ ఫొటోను మార్చి, అదే అడ్రెస్సుతో కొత్త ఆధార్ కార్డుకు ఎన్రోల్ చేశారు. ఆధార్‌లో వెంకటసుబ్బయ్య అడ్రెస్సు ఉండడంతో అతని ఇంటికి ఆధార్ వెళ్లింది. అప్రమత్తమైన వెంకటసుబ్బయ్య విషయాన్ని త్రీటౌన్ సీఐ కత్తి శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కేసు నమోదు చేసి లోతుగా విచారణ చేపట్టగా అసలు బాగోతం వెలుగు చూసింది. ఆదివారం నాల్గవ రోడ్డు ఎక్స్‌టెన్షన్‌లోని శాంతినగర్ బోర్డు వద్ద ముఠాలోని ముగ్గురు నిందితులను సీఐ కత్తి శ్రీనివాసులు, ఎస్ఐ వలిబాషు అరెస్టు చేశారు. అనంతరం కామన్ సరీ్వసు పాయింట్లో ఉన్న 12 రకాల వస్తువులను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా రిమాండ్‌కు ఆదేశించారు. ఆధార్ కార్డులో పేరు మార్పు.. వ్యక్తికి రిమాండ్ ఆధార్ కార్డులో పేరు మార్పు చేసిన కేసులో ఓ వ్యక్తిని వన్‌టౌన్ పోలీసులు రిమాండ్‌కు పంపారు. సీఐ రవిశంకర్ రెడ్డి తెలిపిన మేరకు... బుక్కరాయ సముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎలాంటి పనులు చేయకుండా తిరిగేవాడు. ఈ క్రమంలో తన ఆధార్ కార్డును మార్చి పింఛన్ తీసుకునేందుకు కుట్ర పన్నాడు. ఆధార్‌లో తన పేరు, తండ్రి పేరు, ఇంటి అడ్రస్సుకు బదులుగా నగరంలోని పాతూరుకు చెందిన వెంకటరమణ అనే వృద్ధుడు పేరుతో ఆధార్ సెంటర్లో దాఖలు చేయించాడు. కొత్త ఆధార్ కార్డు సంబంధిత వెంకటరమణ ఇంటికి వెళ్లగా అతను వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చీటింగ్‌కు పాల్పడ్డ తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆదివారం కలెక్టరేట్ సమీపంలో అరెస్టు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు పంపారు. (చదవండి: తాత అంతిమయాత్రను అడ్డుకున్న మనవడు.. ‘లెక్క తేలేవరకు శవాన్ని ఎత్తనిచ్చేది లేదు’) -
హుండీని పెకలించి చోరీకి యత్నం
దొడ్డబళ్లాపురం: దొడ్డ పట్టణంలోని దర్జీపేటలో ఉన్న పాండురంగ విఠల దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి ఆటోలో వచ్చిన నలుగురు దొంగలు దేవాలయం ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి లోపలకు చొరబడ్డారు. పెద్ద హుండీని అతి కష్టంమీద పెకలించి బయటకు తీసుకువచ్చి ఆటోలో ఎత్తడానికి ప్రయత్నిస్తుండగా దేవాలయం ఎదురుగా ఉన్న ఇంట్లో వారు గట్టిగా కేకలు వేయడంతో హుండీ అక్కడే వదిలి ఆటోతో సహా పరారయ్యారు. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆలయాల్లో నగలు చోరీ శివమొగ్గ: బసవనగంగూరు గ్రామంలోని గుళ్లమ్మ, మాతంగమ్మ దేవాలయాల్లో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి దొంగలు చొరబడి దేవతామూర్తులకు అలంకరించిన రూ.లక్ష విలువైన బంగారు నగలు, హుండీలోని కానుకలను ఎత్తుకెళ్లారు. 14 బైక్‌లు స్వాధీనం యశవంతపుర: దేవస్థానాల వద్ద పార్కింగ్ చేసిన బైక్‌లను చోరీ చేస్తున్న మైసూరు జిల్లా శ్రీరంగపట్టణకు చెందిన శివకుమార్ అనే దొంగను చంద్రాలేఔట్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.11.35 లక్షల విలువైన 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇతను జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తూ బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: కిడ్నీకి రూ.4 కోట్లని.. అమాయకులకు ఆఫ్రికా ముఠా ఎర) -
ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!
Two Bank Staff Arrested For Stealing Jewels: బ్యాంకులు సురక్షితం అని ప్రజలు అనుకుంటారు. పైగా రుణాలు అవసరమైన ఏ విధమైన రిస్క్ ఉండదని బ్యాంకులనే విశ్వసించి ఆభరణాలు లేదా పొలాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారు. అటువంటిది ప్రజలు బాగా విశ్వసించే బ్యాంకు ఉద్యోగులే ప్రజలు తాకట్టు పెట్టిన ఆ భరణాలను దొంగలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అచ్చం అలాంటి సంఘటనే పాండిచ్చేరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో చోటు చేసుకుంది. (చదవండి: ఈ చిత్రంలో ఎన్ని గుర్రాలున్నాయో కనిపెట్టగలరా!) అసలు విషయంలోకెళ్లితే.... పోలీసుల కథనం ప్రకారం..ఒక ఖాతాదారుడు రుణం కోసం తాకట్టు పెట్టిన బంగారు నగలను విడిపించుకునేందుకు లాస్పేట్లోని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వద్దకు వచ్చారు. అయితే అతను తాకట్టు పెట్టిన ఆభరణాల స్థానంలో గోల్డ్ కవరింగ్‌తో ఉన్న నగలు ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కి గురుయ్యాడు. దీంతో ఆ ఖాతాదారుడు సదరు బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బ్యాంకు అధికారులు ఖాతాదారులు బ్యాంకు వద్ద తాకట్టు పెట్టిన ఆభరణాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడం ప్రారంభించారు. అయితే దాదాపు నాలుగు వందల సవార్ల బంగారు ఆభరణాల స్థానంలో గోల్డ్ కవరిగింగ్ బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో బ్యాంకు మేనేజర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడంతో రూ. 1.19 కోట్ల విలువైన అసలు ఆభరణాలు తిరిగి లభించాయి. అంతేకాదు ఆ బ్యాంకులో పనిచేస్తున్న గణేశన్ (క్యాషియర్), విజయకుమార్ (అసిస్టెంట్ క్యాషియర్)లు ఇద్దరు ఖాతాదారుల ఒరిజినల్ ఆభరణాలను ప్రైవేట్ పాన్ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆ ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: సైకిలింగ్ చేయండి!... రుచికరమైన జ్యూస్‌ని ఆస్వాదించండి!!) -
మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేశాడు.. రూ.18 లక్షలు కొట్టేశాడు!
Chinese Man To Unlock His Girl Friend Phone: స్మార్ట్ ఫోన్లు రావడంతో ఫోన్‌ని కొట్టేసినా లాక్ ఓపెన్ చేయడం అంత ఈజీ కాదు. పైగా చాలా మంది తమ ఫోన్‌కి లాక్‌గా ముఖాన్ని గానీ లేదా ఫింగర్ ప్రింట్‌ని గాని ఉపయోగిస్తున్నారు. దీంతో దొంగలు కూడా టెక్నాలజీకి అనుగుణంగా కొత్త తరహాలోనే దొంగతనలు చేస్తున్నారు. అచ్చం అలానే చైనాలో ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలిని మోసం చేశాడు. (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కరోనా రావడంతో కోమాలోకెళ్లింది..! అప్పటికే..) అసలు విషయంలోకెళ్లితే...చైనాలో నానింగ్కు చెందిన 28 ఏళ్ల హువాంగ్ తన మాజీ ప్రియురాలు డాంగ్ నిద్రపోతున్నప్పుడు ఆమె ఫోన్‌ని అన్‌లాక్ చేసి మరీ రూ.18 లక్షలు డబ్బులు కొట్టేశాడు. పైగా డాంగ్ ఫోన్‌ని యాక్సెస్ చేసేందుకు నిదురుపోతున్న ఆమెకు తarయకుండా ఆమె కనురెప్పలు ఎత్తి మరి ఫోన్లాక్ ఓపెన్ చేశాడు.. ఆ తర్వాత ఆమె ఫింగర్ ఫ్రింట్ల సాయంతో ఆమె ఖాతా నుంచి ఏకంగా రూ. 18 లక్షలు వరకు కొట్టేశాడు. ఆపై ఆమె ఫోన్‌కి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్‌లు రావడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీనిపై పోలీసులను ఆశ్రయించగా కొన్ని నెలలు తర్వాత హువాంగ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అయితే హువాండ్ ఈ నేరాన్ని డాంగ్ భోజనం చేసి మందులు వేసుకుని నిద్రపోతున్నప్పుడు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఆ తర్వాత కోర్టు అతనికి రూ. 2లక్షలు జరిమానా తోపాటు మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. (చదవండి: జాక్వెలిన్‌కి ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడంలో సుకేశ్ భార్యదే కీలక పాత్ర) -
ర్యాష్ డ్రైవింగ్.. అడ్డంగా ఉన్న కార్లన్ని ధ్వంసం.. అంతలో..
ఓ వ్యక్తి ఖాళీగా ఉన్న స్కూల్ బస్సును దొంగలించి నానా భీభత్సం సృష్టించాడు. చివరకి సినీ ఫక్కీలో పోలీసులు అతన్ని ఛేజ్ చేసి ఈ కథకి శుభం కార్డు వేశారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక పోలీసులకి ఎక్కడ నుంచో ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే కొందరు పోలీసులు కార్లలో స్కూల్ బస్సును దొంగలించి పారిపోతున్న వ్యక్తిని పట్టుకోవడం కోసం తమ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే సడెన్‌గా సీన్లోకి పోలీసులను చూసేసరికి ఆ వ్యక్తికి మైండ్ బ్లాక్ అయ్యి బస్సు వేగం పెంచాడు. అలా కొంత దూరం వెళ్లగానే రోడ్డు పై వాహనాల రద్దీ పెరిగింది. అయినా వాటిని లెక్కచేయకుండా ఆ వ్యక్తి బస్సుని మరింత వేగంగా నడుపుతూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతన్ని పోలీసులు వెంబడించడంతో రోడ్డుపై తనకి దారిలో అడ్డంగా ఉన్న కార్లను వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకు కదిలాడు. అలా సుమారు 20 కార్లకుపైగా ఈ ఘటనలో ధ్వంసంమయ్యాయి. కాకపోతే ఆ స్కూల్ బస్సులో ఎవరూ లేరు పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అతను ఎలాగైనా పోలీసులకు చేతికి చిక్కకూడదని రోడ్డుపై కనపడినా వాటిని ఢీకోట్టుకొట్టుకుంటూ వెళ్తుండగా ఓ బస్‌స్టాప్ సమీపంలోని కాంక్రీట్ రిటైనింగ్ గోడను ఢీకొట్టడంతో బస్సు ఆగింది. వెంటనే బస్సులోంచి దిగి ఆ వ్యక్తి తప్పించుకోవాలని ముందుకు పరుగెత్తాడు. పోలీసులు ఏ మాత్రం పట్టు విడువక చివరి వరకు వెంటాడి అతడిని అరెస్టు చేసి, తర్వాత చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ బస్సును ఎందుకు దొంగలించాడని మాత్రం తెలియలేదు. చదవండి: యాక్..ఛీ.. వాటి విసర్జలనతో టీ చేసి తాగుతారట..! -
సింపుల్‌గా చోరీ.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: అర్ధరాత్రి కుటుంబీకులంతా నిద్రిస్తున్న సమయంలో ఇంటి కిటికీలోంచి కర్రతో హ్యాండ్ బ్యాగ్‌ను తస్కరించి అందులో ఉన్న రూ.15 వేల నగదును కాజేసి ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాలు.. మియాపూర్ జేపీఎన్ నగర్‌లోని ప్లాట్ నంబర్ 242లో రవి అనే ఫొటోగ్రాఫర్ అద్దెకు ఉంటున్నాడు. (చదవండి: 20 రోజులు.. 2 సార్లు.. రూ.2.2 లక్షలు!) సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ప్లాట్లోని ఇంటి గేటు పైనుంచి దూకిన దొంగ.. ఇంటి వెనక కిటికీ వద్దకు వెళ్లాడు. అక్కడే ఉన్న కర్రను తీసుకొని చివరి భాగంలో ఇనుప వైరును కొక్కెంగా చేసి బిగించాడు. దాని సహాయంతో కిటికిలో నుంచి గోడకు తగిలించిన హ్యాండ్ బ్యాగ్‌ను తస్కరించాడు. అందులో ఉన్న రూ.15 వేలు తీసుకుని పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ వెంకటేష్, డీఐ మహేష్, ఎస్ఐ ప్రసాద్‌లు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడు రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఊరెళ్తున్నారా... ఇల్లు భద్రం) -
మా మేనిఫెస్టో నుంచి దొంగిలించండి
న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ గురించి ఓనమాలు కూడా తెలియవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో నుంచి ఆలోచనలను, ప్రణాళికలను దొంగిలించాలని అని హితవు పలికారు. ‘సాధారణంగా గ్రామీణ వినియోగం, పట్టణ వినియోగం కన్నా ఎక్కువ వేగంతో పెరుగుతుంటుంది. కానీ సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో అది రివర్స్ అయింది. గత ఏడేళ్లలోనే కనిష్ట స్థాయిలో గ్రామీణ వినియోగం ఉంది’ అంటూ వచ్చిన ఒక మీడియా రిపోర్ట్‌ను ప్రస్తావిస్తూ.. ‘గ్రామీణ భారతం సంక్షోభంలో ఉంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉంది. ఏం చేయాలో తెలీని స్థితిలో కేంద్రం ఉంది’ అని ట్వీట్ చేశారు. ప్రజల దృష్టి మరలుస్తుంటారు మహేంద్రగఢ్: దేశం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మోదీ ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారని రాహుల్ విమర్శించారు. నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్స్(గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్– జీఎస్టీ)ల కారణంగా వ్యాపార వర్గాలు భారీగా నష్టపోయాయన్నారు. కాగా, ఢిల్లీకి తిరిగి వచ్చే సమయంలో రాహుల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాతావరణం సరిగా లేకపోవడంతో ఓ గ్రౌండ్లో అత్యవసర ల్యాండింగ్ అయింది. గ్రౌండ్లో ఉన్న వారితో కలసి క్రికెట్ ఆడి అనంతరం రోడ్డు మార్గంలో ఢిల్లీ వెళ్లిపోయారు. -
ప్రియుడి కోసం సొంత ఇంటికే కన్నం
ముంబై: ప్రియుడి కోసం సొంత ఇంటికే కన్నం వేసిందో యువతి. రూ.10 లక్షల నగదుతో ఇంటి నుంచి ఉడాయించింది. వివరాలు.. మహారాష్ట్ర కందివాలి ప్రాంతానికి చెందిన రాధ గుప్తా(19) అనే యువతికి గోవండి ప్రాంతానికి చెందిన అమీర్ నౌషాద్ ఖాన్‌తో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అమీర్ ఇంకా జీవితంలో స్థిరపడకపోవడంతో.. అతనికి సాయం చేయాలని భావించింది రాధ. అందుకోసం సొంత ఇంటికే కన్నం వేసింది. తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో ఉంచిన రూ. 10 లక్షల నగదు తీసుకుని ప్రియుడితో ఉడాయించింది. దొంగతనం జరిగిందని గుర్తించిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాధ, ఆమె ప్రియుడు అమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి రాధను ప్రశ్నించగా.. అమీర్ ఇంకా జీవితంలో స్థిరపడలేదని.. డబ్బు సాయం చేస్తే వ్యాపారం ప్రారంభించి అభివృద్ధి చెందుతాడని భావించి డబ్బు తీసుకెళ్లానని చెప్పింది. -
మీ కక్కుర్తి తగలడ.. పరువు తీశారు కదా
బాలీ: ఓ హోటల్లో బస చేయడం.. అక్కడ ఉన్న వస్తువులను దొంగతనం చేయడం.. ఆఖర్లో అడ్డంగా బుక్కవ్వడం ఇదంతా చదవగానే ఓ తెలుగు సినిమా గుర్తుకొస్తుంది కదా. కానీ నిజంగానే ఇలాంటి సంఘటన ఒకటి బాలీలో చేటు చేసుకుంది. బస చేసిన హోటల్లోనే దొంగతనం చేసి.. రెడ్‌హ్యాండెడ్‌గా బుక్కయిన వారు భారతీయులు కావడం ఇక్కడ విషాదం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. వివరాలు.. పర్యటన నిమిత్తం బాలీ వెళ్లిన ఓ భారతీయ కుటంబం తాము బస చేసిన హోటల్ గదిలో దొంగతనానికి పాల్పడ్డారు. హెయిర్ డ్రయ్యర్, సోప్ బాక్స్, అద్దం, జార్ వంటి వస్తువులను తీసుకుని తమ లగేజ్‌లో ప్యాక్ చేసుకున్నారు. గది ఖాళీ చేసి హోటల్ నుంచి వెళ్లేటప్పుడు సిబ్బంది వీరి లగేజ్‌ను చెక్ చేయడంతో దొంగతనం వెలుగులోకి వచ్చింది. దాంతో ఆ దంపతులు ఒక్కసారిగా తల దించుకున్నారు. క్షమాపణలు చెప్పారు. అంతేకాక తాము తీసిన వస్తువుల ఖరీదు చెల్లిస్తామని వేడుకున్నారు. దీన్నంతా వీడియో తీసి ఇంటర్నెట్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. మీ కక్కుర్తి తగలడ.. దేశం పరువు తీశారు కదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారి పాస్‌పోర్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు This family was caught stealing hotel accessories. Such an embarrassment for India. Each of us carrying an #IndianPassport must remember that we are ambassadors of the nation and behave accordingly. India must start cancelling passports of people who erode our credibility. pic.twitter.com/unY7DqWoSr — Hemanth (@hemanthpmc) July 27, 2019 ఈ సంఘటనపై నటి మిని మాథుర్ కూడా స్పందించారు. ‘పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లి.. భారతదేశ ప్రతిష్టకు భంగం కలిగించే చెత్త పర్యాటకులకు మీరు మంచి ఉదాహరణ. మీలాంటి వారి పనులను ఖండిస్తున్నాను’ అన్నారు. -
రూ.2.25 కోట్ల ఐఫోన్లను కొట్టేసిన ఆ ఇద్దరు
న్యూఢిల్లీ : ఐఫోన్ అంటేనే అత్యంత ఖరీదు. అది కొనాలంటే చేతిలో ఎక్కువ డబ్బులుండాల్సిందే. అలాంటి ఐఫోన్లను కొట్టేసి, వేరేవాళ్లకి అమ్మేస్తే ఎంచక్కా కోట్లు సంపాదించవచ్చనుకున్నారు ఓ ఇద్దరు. గ్యాంగ్‌గా ఏర్పడి దాదాపు 2.25 కోట్లు విలువచేసే 900కు పైగా ఐఫోన్ 5ఎస్ స్మార్ట్ ఫోన్లను ఓ ట్రక్ నుంచి కొట్టేశారు. తెలివిగా ఐఫోన్లను కొట్టేసిన వీరు ఆఖరికి పోలీసుల చేతికి చిక్కేశారు. దక్షిణ ఢిల్లీలోని మహిపాల్పూర్ ప్రాంతంలో ఈ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మహిపాల్‌పూర్‌కు చెందిన మెహతాబ్ అలామ్(24), ఆర్మాన్(22)లు గ్యాంగ్‌గా ఏర్పడి, ఐఫోన్లను పట్టుకెళ్తున్న ట్రక్నుంచి సెప్టెంబర్13న ఈ దొంగతానికి పాల్పడ్డారు. 900 పైగా ఐఫోన్లతో ఈ ట్రక్ దక్షిణ ఢిల్లీలోని ఓక్లా ప్రాంతం నుంచి నైరుతి ఢిల్లీలోని ద్వారకా ప్రాంతానికి వెళ్తుంది. రాజోక్రి ఫ్లైఓవర్ దగ్గర్లో ట్రక్ డ్రైవర్‌పై దాడిచేసిన అనంతరం, ట్రక్కు నుంచి 900 ఐఫోన్లను చోరీ చేసినట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు(సౌత్) ఈశ్వర్ సింగ్ మీడియాకు తెలిపారు. ఈ కేసు విచారణలో మరో ఇద్దరు దొంగలు బోలా, ప్రదీప్‌లను గుర్తించినట్టు పోలీసు అధికారి చెప్పారు. వారిద్దరూ ఈ ట్రక్కుకు మాజీ డ్రైవర్లని, రెండు వారాల క్రితమే వీరు ఉద్యోగం మానేసినట్టు వెల్లడించారు. మొబైల్స్ తీసుకెళ్తున్న ఈ ట్రక్ మార్గాన్ని సంఘటన జరిగిన రోజు ఆ ఇద్దరు డ్రైవర్లు రహస్యంగా వెంటాడారని, అదును చూసుకుని గ్యాంగ్‌తో ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసు అధికారి తెలిపారు. బోలా, రాహుల్, జితేందర్లతో ఈ ఇద్దరు ముఠాగా ఏర్పడి దొంగతనం చేశారని, ఈ ఘటనతో మిగతా గ్యాంగ్ మెంబర్లపై పోలీసులు రైడ్స్ నిర్వహిస్తూ అరెస్టు చేస్తున్నారు. -
పాఠశాలల్లో దొంగతనం
రేగిడి : మండలంలోని నాయిరాలవలస ప్రాథమికోన్నత పాఠశాల, జాడాపేట ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడి వస్తువులు దొంగిలించుకుపోయారని ఎంఈఓ ఎంవీ ప్రసాదరావు, పాఠశాలల హెచ్ఎంలు డి.మల్లేశ్వరరావు, తిరుపతిరావు ఎంపీడీఓకు శనివారం ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో ఆటోపై వచ్చి నాయిరాలవలస యూపీ పాఠశాలకు సంబంధించి 5 బస్తాల బియ్యం, ఫ్యాను, ఒక టీవీ అపహరించుకుపోయారని తిరుపతిరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. జాడాపేట ప్రాథమిక పాఠశాలలో 152.800 కేజీల బియ్యం అపహరించుకుపోయారని హెచ్ఎం మల్లేశ్వరరావు ఎంఈవోకు తెలియజేశారు. శనివారం ఉదయాన్ని గ్రామస్తులు హెచ్ఎంలకు సమాచారం అందించారని, పాఠశాలకు వెళ్లి చూసేసరికి తాళాలు బద్దలు కొట్టి దొంగలు ప్రవేశించారని హెచ్ఎంలు తెలియజేశారు. దీంతో ఎంపీడీవో దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లడంతో స్థానిక పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేయాలని ఎంపీడీవో పేర్కొన్నారు. -
22 కోట్ల విలువైన వాచీల చోరీ
పారిస్ (ఫ్రాన్స్): పారిస్‌లో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.22 కోట్ల విలువ చేసే వాచీలను దుండగులు చోరీ చేశారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఫ్రాన్స్‌లోకి చిక్ 8వ డిస్ట్రిక్‌లో ఉన్న ఓ గిడ్డంగిలో చోటుచేసుకుంది. ఇది 'రిచర్డ్ మిల్లే'కు చెందిన అత్యంత ఖరీదైన వాచీలకు సంబంధించిన గిడ్డంగిగా పోలీసులు తెలిపారు. దుండుగులు వాచీలను ఉంచిన లాకర్లతో సహా ఎత్తుకుపోయారు. ప్రపంచంలోనే టాప్ బ్రాండ్లు, పారిస్‌లోనే ఖరీదైన ఏరియా అయిన ఇక్కడ లభిస్తాయి. -
కొండచిలువను దొంగిలించబోయి..
ఫ్లోరిడా: సాధారణంగా దొంగతనం అనగానే ఏ డబ్బులో.. నగలో.. ఇంకేదైనా వస్తువో దొంగిలించారని అనుకుంటారు. ఏ దొంగ అయినా అలాగే చేస్తాడు కూడా. ఎందుకంటే డబ్బయినా, బంగారమయినా.. ఇంకేదైనా వస్తువైనా ఉపయోగపడుతుంది కాబట్టి. కానీ, ఫ్లోరిడాలోని ఓ వ్యక్తి మాత్రం వెరైటీగా దొంగతనం చేశాడు. ఓ పెంపుడు జంతువుల అమ్మకాలు జరిపే దుకాణంలోకి వెళ్లి తొలుత ఆయా విభాగాలన్నీ కలియ తిరిగాడు. చక్కగా స్టైలిష్ గా ఉన్న ఆ వ్యక్తి వేరేవయితే ఎటయినా పోతాయనుకున్నాడో.. లేక అరుస్తాయని అనుకున్నాడో.. ఏకంగా కొండ చిలువను దొంగిలించాడు. ఓ రకంగా దాన్ని చూస్తేనే ఒళ్లంతా గగుర్పొడుస్తుంది. అలాంటిది అతడు మాత్రం ఏ భయం లేకుండా అటూఇటు చూస్తూ చటుక్కున జేబులో వేసుకున్నాడు. అది కాస్త నిఘా నేత్రం(సీసీటీవీ)లో రికార్డవుతూ కనిపించింది. దాంతో వెంటనే అతడి దగ్గరకు దుకాణం యజమాని వచ్చి ఏం తీశావని అడిగాడు. తొలుత తాను ఏం తీయలేదని తాఫీగా సమాధానం చెప్పేందుకు ప్రయత్నించడంతో ఓనర్ చేయి లేపాడు. దాంతో వెంటనే అతడు తన జేబులో నుంచి కొండ చిలువ తీసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. దొరికినంతసేపు అతడు ఆ వ్యక్తిని పిచ్చికొట్టుడుకొట్టాడు. -
శవాన్ని కూడా వదలని ఘరాన కిలాడి దొంగ
టెక్సాస్: అమెరికాలో ఓ మహిళా దొంగ మృతదేహాన్ని దోచుకుంది. అంత్యక్రియలకు తీసుకొచ్చిన ఓ 88 ఏళ్ల మహిళ మృతదేహం చేతికి ఉన్న బంగారపు ఉంగరాలను గుట్టుచప్పుడుకాకుండా దొంగిలించి కారులో పారిపోయింది. అయితే, ఆ దొంగతనం దృశ్యం మాత్రం దహన సంస్కారాలు పూర్తి చేసే భవనంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీని ప్రకారం పశ్చిమ టెక్సాస్ లోని ఒడెస్సాలో 88 ఏళ్ల మహిళ చనిపోయింది. అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని పెట్టెలో పెట్టి స్మశాన వాటికకు తీసుకొచ్చారు. ఆ కార్యక్రమాలు పూర్తి చేసే భవనంలో పెట్టి వెళ్లారు. వారికి తెలియకుండానే వెనుక వచ్చిన ఓ మహిళ ఎవరూ లేనిది చూసి ఆ పెట్టెను తెరిచి ఆ మృతదేహం చేతి వేలి ఉంగరాలను దొంగిలించుకొని పారిపోయింది. తర్వాత వచ్చి చూసి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళను గుర్తించేందుకు ఫొటోలు, వీడియో విడుదల చేశారు. ఆ మహిళను తాము ఇంతవరకు చూడలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
మేకలను మింగిన ఖాకీలు
-
హౌరా ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం
టంగుటూరు:హౌరా ఎక్స్ ప్రెస్ లో బుధవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు రైల్వే స్టేషన్ సమీపంలో దోపిడీ దొంగలు భారీ చోరీకి విఫలయత్నం చేశారు. తొలుత రైలును చైన్ లాగి ఆపిన దొంగలు దోపిడీకి యత్నించారు. ప్రయాణికులను బెదిరించి వారి వద్దనున్న నగదును, ఆభరణాలను దోచుకునేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. కాగా, పోలీసులపై ఎదురు తిరిగిన దొంగలు రాళ్లు రువ్వి పరారయ్యారు. అనంతరం మరో రెండు రైళ్లలో కూడా దొంగలు దోపిడీకి యత్నించినట్లు తెలుస్తోంది. చెన్నై ఎక్స్ ప్రెస్, తిరుమల ఎక్స్ ప్రెస్ లలో కూడా అదే తరహాలో దోపిడీకి ప్రయత్నించినట్లు సమాచారం. -
పోలీస్ స్టేషన్లో దొంగలు పడ్డారు!
చెన్నై, సాక్షి ప్రతినిధి : అవును మీరు సరిగానే చదివారు, సందేహమే లేదు. ఇళ్లు, కార్యాలయాలు, బ్యాంకులు తదితర చోట్ల దొంగలు పడితే ప్రజలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తారు. మరి పోలీస్‌స్టేషన్‌లో దొంగలు పడితే?. ఈ విచిత్రం చెన్నైలో జరిగింది. చెన్నైలో అత్యంత ప్రధానమైన మౌంట్‌రోడ్డులో తేనాంపేట పోలీస్‌స్టేషన్ ఉంది. 24 గంటలు రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ హోదాగల అధికారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలోనే ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగం కూడా ఉంది. మంగళవారం తెల్లవారుజామున విధులకు వచ్చిన పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ విభాగ కార్యాలయం తాళాలు పగలగొట్టి ఉండటాన్ని కనుగొన్నారు. లోపలికి పోయి చూడగా ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో వినియోగించే ఏడు వాకీటాకీలు చోరీకి గురైనట్లు గుర్తించారు. దొంగలుపడిన విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదండీ సంగతి. -
ఇదేం వరుస!
చూపించిన వాళ్లు బానే ఉన్నారు... చోరీ బారిన పడ్డవాళ్లూ బానే ఉన్నారు. మధ్యలో ఇదేం గోల..! చూసినవారిని బాధ్యులను చేయాలంటోంది హాలీవుడ్ మెగా స్టార్ జెనిఫర్ లారెన్స్! తమ ప్రైవేట్ నగ్న చిత్రాల హ్యాకింగ్‌తో ఉక్కిరిబిక్కిరైన హాలీవుడ్ సెలబ్రిటీలు... ఇప్పుడు వారిపై కత్తులు నూరుతున్నారు. అందులో ఓ అడుగు ముందు ఉన్న జెనిఫర్.. ‘నగ్న చిత్రాల తస్కరణ సెక్స్ క్రైమ్ కిందకు వస్తుంది. దీనికి బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం మారాలి. మన చట్టాలు మారాలి’ అంటూ గోడు వెళ్లబోసుకుందీ సెక్సీ సుందరి. -
అరణ్యం: సింహాలు దొంగతనం చేస్తాయా!
మగ సింహాలు పదడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. 150 నుండి 250 కిలోల బరువుంటాయి. ఆడ సింహాలు తొమ్మిది అడుగుల వరకూ పెరుగుతాయి. 120 నుండి 200 కిలోల బరువుంటాయి! సింహం కూనను వెల్ప్ లేక లయొనెట్ అంటారు! సింహం గాండ్రింపు 8 కిలోమీటర్ల వరకూ వినిపిస్తుంది! మగ సింహం రోజుకు 7 కిలోల మాంసం తింటే, ఆడ సింహం 5 కిలోలు తింటుంది. అందుకే ఎక్కువగా జీబ్రా, జిరాఫీల్లాంటి పెద్ద జంతువులనే వేటాడతాయివి! ఇవి రోజులో పదహారు నుంచి ఇరవై గంటల పాటు విశ్రాంతి తీసుకుంటాయి. అంతేకాదు... మగ సింహాలకు వేటాడటానిక్కూడా బద్దకమే. పైగా వాటి కంటే ఆడ సింహాలే వేటలో చురుగ్గా ఉంటాయి. అందుకే ఆహార సేకరణ బాధ్యత వాటిదే. కానీ వేటాడి తెచ్చినదాన్ని ముందు మగ సింహాలు తిన్నాకే ఆడవి తింటాయి! ఆహారం దొరకనప్పుడు ఇవేం చేస్తాయో తెలుసా? చిరుతలు, హైనాలు వేటాడిన జంతువులను దొంగిలిస్తాయి! ఆడ సింహాలకు జాలి ఎక్కువ. ఒకవేళ ఏ సింహం కూన అయినా తప్పిపోయి తమ దగ్గరకు వస్తే... వాటికి కూడా తమ పిల్లలతో పాటే పాలిచ్చి పెంచుతాయి! సింహాలు నీళ్లు తాగకుండా నాలుగైదు రోజుల పాటు ఉండగలవు! సింహాల గుంపును ప్రైడ్ అంటారు. ప్రతి గుంపులో పదిహేను నుంచి నలభై వరకూ ఉంటాయి. ఆడ సింహాలు వేటకెళ్తే, మగవి పిల్లలను చూసుకుంటూ ఉంటాయి. అయితే ప్రతి సింహం రెండేళ్ల పాటు మాత్రమే తన గుంపునకు లీడర్‌గా ఉంటుంది. ఆ తరువాత వేరేది లీడర్ అవుతుంది! అందంగా ఉందని దగ్గరకెళ్లారో... అంతే! చూడగానే నెమలిలా అనిపిస్తుంది. కాస్త పరిశీలిస్తే కోడిలాగా కనిపిస్తుంది. కానీ ఇది నె మలి కాదు. కోడి అంతకన్నా కాదు. దీని పేరు హాట్జిన్. దక్షిణ అమెరికాలోని ఉష్ణప్రాంతాల్లో కనిపించే ఒక పక్షి! హాట్జిన్ల దగ్గరకు వెళ్తే అంతే సంగతులు. ఎందుకంటే, వాటి దగ్గర విపరీతమైన బురద వాసనలాంటిది వస్తుంది. ఆ వాసనకు కారణం... జీర్ణక్రియలోని లోపమే. హాట్జిన్లకు జీర్ణశక్తి తక్కువ. అందుకే గట్టిగా ఉండేవాటిని ముట్టుకోవు. ఆకులు, పూలు తింటాయి. ఆహారం జీర్ణమయ్యే క్రమంలో వాటి శరీరంలో ఒక రసాయనం విడుదలవుతుందట. దాని కారణంగానే ఇలాంటి వాసన వస్తుందని కనిపెట్టారు పరిశోధకులు. హాట్జిన్లు పొడవడం, రక్కడం చేయవు. కారణం వీటికి కొన్ని బలహీనతలుండటమే. ఇవి సరిగ్గా ఎగరలేవు. అన్ని రంగుల్నీ గుర్తించలేవు. నీరసంగా, డల్‌గా ఉంటాయి. అందుకే వీటినెవరూ పెంచుకోవడానికి ఇష్టపడరు. బ్రెజిల్లో కొన్ని చోట్ల హాట్జిన్ల గుడ్లను తింటారు. నిజానికి అవి కూడా ఒకలాంటి వాసన వస్తాయట. కానీ రుచి బాగుంటుందట. కానీ వీటి మాంసాన్ని మాత్రం ముట్టరు!