శవాన్ని కూడా వదలని ఘరాన కిలాడి దొంగ
టెక్సాస్: అమెరికాలో ఓ మహిళా దొంగ మృతదేహాన్ని దోచుకుంది. అంత్యక్రియలకు తీసుకొచ్చిన ఓ 88 ఏళ్ల మహిళ మృతదేహం చేతికి ఉన్న బంగారపు ఉంగరాలను గుట్టుచప్పుడుకాకుండా దొంగిలించి కారులో పారిపోయింది. అయితే, ఆ దొంగతనం దృశ్యం మాత్రం దహన సంస్కారాలు పూర్తి చేసే భవనంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీని ప్రకారం పశ్చిమ టెక్సాస్ లోని ఒడెస్సాలో 88 ఏళ్ల మహిళ చనిపోయింది.
అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని పెట్టెలో పెట్టి స్మశాన వాటికకు తీసుకొచ్చారు. ఆ కార్యక్రమాలు పూర్తి చేసే భవనంలో పెట్టి వెళ్లారు. వారికి తెలియకుండానే వెనుక వచ్చిన ఓ మహిళ ఎవరూ లేనిది చూసి ఆ పెట్టెను తెరిచి ఆ మృతదేహం చేతి వేలి ఉంగరాలను దొంగిలించుకొని పారిపోయింది. తర్వాత వచ్చి చూసి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళను గుర్తించేందుకు ఫొటోలు, వీడియో విడుదల చేశారు. ఆ మహిళను తాము ఇంతవరకు చూడలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.